Vol 0 సంచిక 3
కోవిడ్ -19 నవీకరణ 9 జూన్, 2021
ముద్రింప తగిన వార్తాలేఖ
పూర్తి వార్తాలేఖ యొక్క కాగితం ప్రతి కావలెనన్నఈ పుటను ముద్రించండి
కోవిడ్ -19 నవీకరణ 9 జూన్, 2021
కోవిడ్-19 పై నవీనీకరణలు (ప్రాధమికంగా వార్తాలేఖ సంచిక 11 సంపుటి 2 లో ఇది ప్రచురింప బడింది. ఇటీవలే నూతన నవీనీకరణ సంచిక 12 సంపుటి 2 -2021 మార్చి ఏప్రిల్ లో చోటుచేసుకుంది)
భారత దేశము మరియు ఇతర దేశాలు కోవిడ్ యొక్క రెండవ తరంగము (సెకెండ్ వేవ్) నుండి ఇప్పుడిప్పుడే కోలుకోవడం, లేదా మరొక వేవ్ బారిన పడడానికి సిద్ధమవుతూ కూడా ఉన్నాయి. ప్రస్తుత వైరస్ గతంలో ఉన్నదానికంటే అతి తీవ్రమైనది. కోవిడ్-19 యొక్క కొత్త లక్షణాలు గురించి తెలుసు కోవడం, వాటిని గుర్తించడం, సకాలంలో సమస్యను నివారించడం, ఎంతో ప్రధానమైన విషయాలు. ఈ ఇన్ఫెక్షన్ యొక్క సాధారణ లక్షణాలు జ్వరము, పొడిదగ్గు, అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కండరాల నొప్పి, రుచి మరియు వాసన కోల్పోవడం, మరియు కొన్ని సందర్భాలలో కడుపు నొప్పి కూడా ఉంటుంది.
కోవిడ్ రెండవ వేవ్ సంక్రమణలో గమనించిన లక్షణాలు
1. శ్వాసలో అవరోధం లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది (డిస్నియా): ఈ ఇన్ఫెక్షన్ ఊపిరి తిత్తులు దెబ్బతినడానికి కారణ మవడం వలన ఆక్సిజన్ స్థాయిలు (SpO2) తగ్గిపోతాయి. ఇది చాలా ప్రధాన లక్షణము.
2. జీర్ణశయాంతర మార్గ సంక్రమణ: ఆకలి లేకపోవడం, వాంతులు, కడుపు నొప్పి మరియు విరోచనాలు ఉంటాయి. చాలా మంది రోగులు 1 నుండి 14 రోజుల వరకు సగటు 5 రోజులు వ్యవధితో నిరంతర అతిసారం గురించి ఫిర్యాదు చేస్తూ ఉంటారు.
3. వినిపించకపోవడం: ఇది ఆకస్మికంగా ఉండవచ్చు, తేలికపాటిది గానూ, మితమైనదిగా లేదా తీవ్రంగానూ ఉండవచ్చు మరియు చెవిలో హోరు కూడా ఉండవచ్చు.
4. విపరీతమైన బద్దకం మరియు బలహీనత: సెకండ్ వేవ్ సమయంలో ఇది చాలా ప్రబలంగా ఉంటుంది.
5. పింక్ ఐ లేదా కండ్లకలక: సాధారణంగా కనులలో దురద, ఎరుపుదనం, మరియు కంటిపొరను కోస్తున్నట్లు బాధ ఉంటాయి, ఫలితంగా ఉబ్బిన లేదా నీటితో నిండిన కళ్ళు ఏర్పడతాయి. కొన్నిసార్లు కంటిలో ఏదో చిక్కుకున్నట్లు చికాకు మరియు కాంతిని చూడలేకపోవడం కూడా ఉంటాయి. ఇది సాధారణ కండ్లకలక భిన్నంగా అనగా రెండు కళ్లను ప్రభావితం చేయకుండా ఒక కంటిలోనే ప్రధానంగా ఉంటుంది.
6. నోరు ఎండిపోవడం: ఇది ఒక సాధారణ ప్రారంభ లక్షణం. నోరు వైరస్కు ఎక్కువగా గురయ్యే ప్రవేశ స్థానం కనుక ఈ వైరస్ నోటి కుహరంలో కణజాలం మరియు శ్లేష్మ పొరపై (మ్యూకస్ లెయెర్) దాడి చేస్తుంది, ఫలితంగా లాలాజల ఉత్పత్తి తగ్గుతుంది, తద్వారా నోరు పొడిబారుతుంది. అలాగే నాలుక కూడా పొడి బారడం, నాలుక యొక్క రంగు మరియు ఆకృతిలో మార్పు లేదా బొబ్బలు లేదా పుండ్లు ఏర్పడి తినడంలో ఇబ్బంది కూడా కలగవచ్చు.
7. తలపోటు: చాలా కాలం పాటు కొనసాగే మరియు నొప్పి నివారణ మందులతో కూడా తగ్గని సాధారణ తలనొప్పి సెకండ్ వేవ్ సమయంలో కొత్త లక్షణంగా కనిపిస్తున్నది.
8. చర్మపై దద్దుర్లు: ప్రధానంగా చేతులు మరియు కాళ్ళపై ఆక్రాల్ రాష్ గా పిలవబడే దద్దుర్లు ఏర్పడతాయి.
9. బరువు తగ్గిపోవడం: ఇది ఇటీవలే గుర్తించిన మరో లక్షణం.
పైన పేర్కొన్న ఏవైనా లక్షణాలు మీలో అభివృద్ధి ఐతే భయపడవద్దు. మీ వైద్యుడిని సంప్రదించి ఆ తర్వాత ఇతర కుటుంబ సభ్యుల నుండి మిమ్మల్ని వేరు చేసుకొని వైద్యుడి సలహా తో మీకై మీరే కోవిడ్ టెస్ట్ చేయించుకోవడం మంచిది. ఒకవేళ మీకు ఛాతీలో బరువు, శరీరం పాలిపోవడం, లేదా నీలి రంగుకు మారడం, మాట్లాడే శక్తి అకస్మాత్తుగా కోల్పోవడం, లేదా శారీరక కదలికలు కోల్పోవడం, గందరగోళమునకు గురికావడం ఏర్పడితే వెంటనే వైద్యసహాయం తీసుకోవాల్సి ఉంటుంది.
కోవిడ్ సంబంధిత సమస్యలు
a. మ్యూకోర్ మైకోసిస్ లేదా బ్లాక్ ఫంగస్ : కోవిడ్ సంక్రమణ నుండి కోలుకున్న రోగులు అత్యంత ప్రమాదకరమైన బ్లాక్ ఫంగస్ కు గురి అవుతున్నారు. భారతదేశంలో ఇది అంటువ్యాధి స్థాయికి చేరుకుంది. ఇది ప్రధానంగా పర్యావరణ వ్యాధికారకములతో పోరాడగలిగే శక్తిని తగ్గించే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న రోగులను ప్రభావితం చేస్తుంది. ప్రధానంగా నయం కాని మధుమేహముతో బాధ పడుతున్న వారు, సహసంబంధ వ్యాధులు (కొమర్బిడిటీస్) ఉన్నవారు, అవయవ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకొన్నవారు, స్టెరాయిడ్ల ద్వారా రోగ నిరోధక మందులు తీసుకుంటున్నవారు, లేదా ఎక్కువ కాలం ఐసీయూలో ఉన్న వారిని ఇది ఎక్కువగా ప్రభావితం చేస్తున్నది. హెచ్చరిక సంకేతా లైనటువంటి కనుల చుట్టూ లేదా ముక్కు వద్ద నొప్పి/ ఎరుపుదనం, తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, నెత్తురు తో కూడిన వాంతులు, మానసిక స్థితిలో మార్పులు, జ్వరం మరియు దగ్గు, వంటి లక్షణాల పట్ల అలసత్వం వహించవద్దు. పోస్ట్ కోవిడ్ డయాబెటిక్ రోగులు వారి రక్తంలో చక్కెరను పర్యవేక్షించడం మరియు నియంత్రించడం, అలాగే ఆక్సిజన్ చికిత్స సమయంలో తేమను అందించే మిషన్లలో (హ్యూమిడి ఫయర్స్) డిస్టిల్డ్ వాటర్ మాత్రమే ఉపయోగించాలి. స్టెరాయిడ్లు, యాంటీ ఫంగల్ మందులు మరియు యాంటీబయాటిక్స్ విషయంలో స్వంతంగా ఔష ధాలను తీసుకోకూడదు. వాటిని తగిన కౌశలం గల నిపుణుల సలహా ద్వారానే వాడాలి.
b. పిల్లలలో మల్టీ సిస్టం ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ (MIS-C): కోవిడ్-19 నుండి కోలుకున్న 2 నుండి 6 వారాల తర్వాత అరుదైన సందర్భాల్లో ఎం ఐ ఎస్- సి సంభవించవచ్చు. దీనికి వెంటనే ఆసుపత్రిలో చేర్పించడం అవసరం. దీని వ్యాధి లక్షణాలు లేదా సంకేతాలు: జ్వరము, వాంతులు మరియు విరేచనాలు, కడుపులో నొప్పి, చర్మపు దద్దుర్లు, వేగంగా శ్వాస తీసుకోవడం, ఎర్రటి కళ్ళు, పెదవులు మరియు నాలుక వాపు, అధికంగా ఏడుపు, మగత మరియు అధిక నిద్ర ఉంటాయి.
c. పేగుకు సంబంధించిన గ్యాంగ్రీన్ (రాచపుండు): ఇటీవల కోవిడ్ కేసులలో పేగులో గడ్డకట్టడం ద్వారా అది గ్యాంగ్రీన్ గా పరిణమిస్తోంది. దీన్ని 24 గంటల్లో చికిత్స చేయకుండా వదిలేస్తే మనుగడకు అవకాశాలు 50% కి తగ్గిపోతాయి.
ఈ వైరస్ ప్రబలమైన అంటువ్యాధిగా ఉన్నందున దీని నివారణ మరియు చికిత్సకు సంబంధించి మరియు ఈ సంక్రమణ వలన ఏర్పడే పరిస్థితులకు సంబంధించి వారి స్థానిక ఆరోగ్య అధికారులు ఇచ్చిన మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలని ప్రాక్టీషనర్లు రోగులకు ముందుగానే తగిన విధంగా నొక్కి చెప్పాలి. కోవిడ్ లక్షణాలు అనుభవించే వ్యక్తులకు టెలి కన్సల్టేషన్ ఇస్తున్నప్పుడు కోవిడ్-19 విషయంలో సరైన దృక్పధంతో అనగా మాస్క్ ధరించడం, చేతుల శుభ్రత, సామాజిక దూరం పాటించడంతో పాటు ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారాన్ని తీసుకోవలసిందిగా సలహా ఇవ్వాలి. ఇట్టి రోగుల విషయంలో వారి కుటుంబ సభ్యులు రోగులతొ ఫోన్ మరియు వీడియో కాల్స్ ద్వారా కనెక్ట్ అయి ఉంటూ సానుకూలమైన ధృక్పధం కలిగిస్తూ ధైర్యంగా ఉండాలని సూచించాలి.
పరివర్తన చెందుతున్న వైరస్ మరియు కోవిడ్ అనంతర రోగులలో సంభవించే తీవ్రమైన పరిస్థితుల దృష్ట్యా మేము వైబ్రో రెమిడీలు మరియు సూచించిన మోతాదులో గణనీయమైన మార్పులు చేసాము. పరిశోధనా బృందం ప్రస్తుతం పైన పేర్కొన్న లక్షణాలు పరిగణనలోకి తీసుకుంది మరియు భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆయుష్ ఇచ్చిన హోమియోపతి వివరణ లపై మార్గదర్శకత్వం కూడా తీసుకుంది.
A. రోగ నిరోధకత మరియు ముందస్తు చికిత్స కోసం ఇమ్యూనిటీ బూస్టర్ (IB):
108CC బాక్సుఉన్నవారికి: CC3.2 Bleeding disorders + CC4.1 Digestion tonic + CC4.6 Diarrhoea + CC5.1 Ear infections + CC7.2 Partial Vision + CC9.4 Children’s diseases + CC10.1 Emergencies + CC11.5 Mouth infections + CC12.2 Child tonic + CC15.1 Mental & Emotional tonic + CC19.3 Chest infections chronic + CC19.5 Sinusitis + CC19.6 Cough chronic + CC19.7 Throat chronic + CC21.11 Wounds and Abrasions
108CC బాక్సు లేకుండా SRHVP మిషను ఉన్నవారికి: NM6 Calming + NM25 Shock + NM80 Gastro + BR4 Fear + SM18 Digestion + SM20 Eyes + SM26 Immunity + SM27 Infection + SM31 Lung & Chest + SM35 Sinus + SM39 Tension + SM40 Throat + SM268 Anacardium 30C + SR272 Arsen Alb 30C + SR278 Cactus 30C + SR279 Cadmium Sulph 30C + SR291 Gelsemium 30C + SR298 Lachesis 30C + SR301 Mercurius 30C + SR304 Oxygen 200C + SR318 Thuja 200C + SR383 Cuprem Met 30C + SR408 Secale Corn 6X + SR566 Fungi-Pathogenic.
మోతాదు: నివారణ లేదా ముందస్తు రోగనిరోధకత కోసం: నిద్ర లేవడానికి ముందు మరియు నిద్రపోయేముందు BD. కొవిడ్-19 టీకాలు తీసుకున్నవారు, లేదా కోవిడ్ నుండి కోలుకున్న వారికి, లేదా కోవిడ్ లేని దేశంలో నివసిస్తున్న వారికి ఉదయం మేలుకొనగానే OD ఇవ్వాలి.
చికిత్సకు కోసం: ప్రతీ గంటకు ఒక మోతాదు చొప్పున 6 సార్లు అనంతరం 6TD, రోగ స్వస్తత లేదా మెరుగుదల అనంతరం QDS - TDS - BD - OD ఈ విధంగా తగ్గించాలి. ఫంగల్ ఇన్ఫెక్షన్ లేదా రక్త నాళాలలో క్లాట్స్ / గడ్డలు వంటి కోవిడ్ అనంతర సమస్యలు ఉన్నవారికి కూడా అదే మోతాదును అనుసరించండి.
కోవిడ్-19 లక్షణాలు ఉన్నప్పటికీ టెస్ట్ లో నెగిటివ్ వచ్చినవారు లేదా టెస్ట్ చేయించని వారికి: 6TD తో ప్రారంభించి పైన పేర్కొన్న విధంగా తగ్గించుకుంటూ రావాలి.
చ్చరిక: ఏదైనా అల్లోపతి చికిత్సలో ఉన్నవారిని కొనసాగించమనాలి, వారిని ఆపమని ఎప్పుడూ నిరుత్సాహ పరచకూడదు.
B. కోలుకోవడం: రోగి కోలుకొని కోవిడ్ పరీక్షలో నెగిటివ్ వచ్చినప్పటికీ శక్తి హీనత కలిగి ఉన్నప్పుడు, శారీరకంగా మరియు మానసికంగా అలసిపోయినట్లు ఉన్నప్పుడు, లేదా ఏదైనా సమస్య అభివృద్ధి ఐనప్పుడు క్రింది వాటిని ఇవ్వండి:
108CC బాక్సుఉన్నవారికి: CC3.1 Heart tonic + CC3.7 Circulation + CC4.1 Digestion tonic + CC11.3 Headaches + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC19.3 Chest infections chronic + CC19.4 Asthma + CC19.6 Cough chronic + CC19.7 Throat chronic + CC20.1 SMJ tonic + CC21.11 Wounds and Abrasions
108CC బాక్సు లేకుండా SRHVP మిషను ఉన్నవారికి: NM2 Blood + NM6 Calming + NM7 CB7 + BR3 Depression + SM18 Digestion + SM26 Immunity + SM31 Lung & Chest + SR269 Antim Tart 30C + SR272 Arsen Alb 30C + SR298 Lachesis 30C + SR318 Thuja 200C + SR351 Kali Carb 30C + SR389 Kali Bic 6X + SR408 Secale Corn 6X + SR566 Fungi-Pathogenic
మోతాదు: TDS, మెరుగుదలపై మోతాదు తగ్గుతుంది, IB మాత్రం ఉదయం మేలుకొనగానే OD గా కొనసాగించాలి కానీ రెండింటి మధ్య కనీసం 20 నిమిషాల వ్యవధి ఉండాలి.
C. టీకా యొక్క దుష్ప్రభావాల నివారణకు:
SRHVP మిషను ఉన్నవారికి: SR318 Thuja 30C.
108CC బాక్సు మాత్రమే ఉన్నవారికి: CC9.4 Children’s diseases
మోతాదు: టీకా వేయడానికి రెండు రోజులు ముందుగానూ అలాగే టీకా వేసాక 10 రోజుల వరకూ రాత్రి నిద్రించే ముందు OD. ఈ కాలంలో IB ని ఉదయం లేవగానే OD గా కొనసాగిస్తూనే ఉండాలి.
పేషెంటులో ఏమైనా దుష్ప్రభావాలు అభివుద్ధి ఐతే (చేతులలో విపరీతంగా పుండ్లు పడడం, అలసట, తలపోటు, నొప్పులు మరియు బాధలు, వికారము, వాంతులు వంటి లక్షణాలు) సాధారణంగా టీకా వేయించుకున్నాక ఒకటి లేదా రెండు రోజుల తరువాత ఇలా ఏర్పడితే వారికి పైన సూచించిన రీకూపరేషన్ మోతాదు అదనంగా ఇవ్వండి.
D. ఆక్సిజన్ సంతృప్త స్థాయిని పెంచుకొనడానికి, కానీ తమ ఇతర చికిత్సలు అన్నీ అనుసరిస్తూనే ఉండాలి:
SRHVP మిషను ఉన్నవారికి: SR304 Oxygen 200C నీటిలో
108CC బాక్సు మాత్రమే ఉన్నవారికి: CC19.1 Chest tonic నీటిలో
మోతాదు: ప్రతీ 10 నిమిషాలకు ఒక మోతాదు చొప్పున ఆక్సిజన్ స్థాయి 90కి చేరే వరకు, ఆ తరువాత అవసరం మేరకు ప్రతీ గంటకు ఇవ్వాలి.
ప్రధాన సూచన : పై నవీనీకరణ మన న్యూస్ సైట్ (https://news.vibrionics.org) లో వార్తాలేఖ సంచిక 0 సంపుటి 3 గా అప్లోడ్ అయినది. దీనిని చూడడానికి “మునుపటి వార్త”లు పై క్లిక్ చేసి సంచిక 0 సంపుటి 3 సెలెక్ట్ చేయడం ద్వారా యాక్సెస్ చేయవచ్చు. రాష్ట్ర సమన్వయకర్తలు అందరూ తమకు రిపోర్ట్ చేసే ప్రాక్టీషనర్లు అందరూ ఈ విషయం గురించి తెలుసుకున్నారని నిర్ధారించుకోవాలి, అలాగే ఈ-మెయిల్ id లేనివారు న్యూస్ సైట్లోని ఈ వార్తా లేఖను చదవ వలసిందిగా ప్రోత్సహించాలి.