Vol 5 సంచిక 15
February 2014
ముద్రింప తగిన వార్తాలేఖ
పూర్తి వార్తాలేఖ యొక్క కాగితం ప్రతి కావలెనన్నఈ పుటను ముద్రించండి
డా.జిత్. కే అగ్గర్వాల్ యొక్క మాటల్లో
సాయి వైబ్రియానిక్స్ మొదటి అంతర్జాతీయ సదస్సు పుట్టపర్తి, 2014 , జనవరి 25-27
పర్యావలోకనము
ప్రశాంతి నిలయంలో జరిగిన మొదటి అంతర్జాతీయ సాయి వైబ్రియానిక్స్ సదస్సు మరియు ప్రదర్శనకు ప్రతినిధులు జనవరి 25న రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు.
జనవరి 26న ప్రారంభం కానున్న కార్యక్రమంకోసం పాల్గొనేవారు స్వామివారి పాత మందిరములో తమ స్థానాలలో ఆసీనులైన సందర్భంలో డయాస్ పైన పూలతో అందంగా అలంకరించిన స్వామి యొక్క పెద్ద చిత్ర పటం రెండు చేతులతో ఆశీర్వదిస్తూ ఆదరంగా పలకరిస్తున్న అనుభూతి కలిగించింది(చిత్రాన్ని చూడండి). అలాగే ఈ డయాస్ పైన గ్రీకు ఔషధ దేవుడు ఆస్క్లేపియస్ మరియు హిపొక్రటిస్ విగ్రహాలు కూడా ఉంచడం జరిగింది. భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారిని ఈ సదస్సుకు విశిష్ట అతిథిగా గుర్తించే అధికారిక రిజస్ట్రేషన్ బ్యాడ్జీ పూలదండలు మధ్యలో మనం చూడవచ్చు. హాలులో స్వామి యొక్క సన్నిధిని ఆద్యంతం అనుభవింపజేస్తూ అక్కడ స్వామి లేరనే సందేహమే ఎవరికీ కలుగని దివ్య వాతావరణం అక్కడ నెలకొంది. మందిరం యొక్క పవిత్ర వాతావరణంలో పాల్గొనే వారిని చుట్టుముట్టిన ప్రేమ తరంగాలతోనూ మరియు రోగులను ప్రేమించి వారి సంరక్షణకు బాధ్యత వహించే హృదయపూర్వక నిబద్ధత యొక్క ప్రదర్శన ఒకదాని తర్వాత ఒకటి జాలువారింది. చివరిగా భారతదేశం మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభ్యాసకులు అందించిన నివేదికల వెల్లువలో సాయి వైబ్రియానిక్స్ ద్వారా స్వామిసంకల్పం అసాధారణమైన నివారణ యొక్క అద్భుతమైన సాక్ష్యంగా సభికులకు తెలియపరచ మైనది.
గౌరవనీయ అతిథులు
స్వామి ఈ సదస్సు యొక్క కార్యకలాపాలను మరొక రూపంలో కూడా ఆశీర్వదించారు. ప్రప్రథమంగా ఈ పవిత్ర వేదికలో సమావేశమైన ఈ సమావేశానికి ప్రారంభ వక్తులు విశిష్ట అతిథి శ్రీ ఆర్జె రత్నాకర్ మరియు ముఖ్య అతిథి శ్రీ జస్టిస్ ఎ. పి. మిశ్రా శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టు సభ్యు లైన వీరిద్దరు సమావేశం యొక్క ఆరంభాన్ని చాలా ఉన్నత ఆధ్యాత్మిక స్థాయికి తీసుకువెళ్లారు. ఇతర గౌరవ అతిధులు సత్యసాయి సెంట్రల్ ట్రస్టు సభ్యుడు మరియు సేవా సంస్థ అఖిలభారత అధ్యక్షుడు శ్రీ వి. శ్రీనివాసన్ గారు, సత్యసాయి సెంట్రల్ ట్రస్టు సభ్యుడు శ్రీ టి. కె. కె. భగవత్ గారు, మరియు సత్యసాయి సేవా సంస్థ SSSIHMS కి మేనేజ్మెంట్ కన్సల్టెంట్ డాక్టర్ మైఖేల్ రాకాఫ్ MD గారు కూడా వేదికనలంకరించిన వారిలో ఉన్నారు. అదనంగా దక్షిణాఫ్రికా లోని సోహం ఫౌండేషనుకు చెందిన స్వామి ఆనంద (చిత్రాన్ని చూడండి) ప్రత్యేక అతిథిగా పాల్గొని రెండుసార్లు మాట్లాడడం ద్వారా సభను ఆహ్లాద పరిచారు. మరుసటి రోజు కార్యక్రమంలో సత్యసాయి సెంట్రల్ ట్రస్టు సభ్యుడు శ్రీ కె చక్రవర్తి ప్రత్యేక అతిథిగా సమావేశపు విందులో పాల్గొని సదస్సును గౌరవించటానికి అంగీకరించారు. అయితే దురదృష్టవశాత్తు అదే సమయంలో సెంట్రల్ ట్రస్ట్ సమావేశం ఉండటంవల్ల హాజరు కాలేకపోయారు.
ప్రాక్టీషనర్ల అనుభవాలు
ఈ కార్యక్రమం కోసం పుట్టపర్తిలో సమావేశమైన అనేకమంది అభ్యాసకులతో పాత మందిరము పూర్తిగా నిండి పోయింది. 18 దేశాల నుండి మొత్తం 342మంది అభ్యర్థులు హాజరయ్యారు. భారతీయ రాష్ట్రాల నుండి 278 మరియు ఇతర దేశాల నుండి 64 మంది ఈ సమావేశం కోసము హాజరయ్యారు. హాజరైన వారందరిలో విభేదాలను రూపుమాపుతూ స్వామి ఈ అభ్యాసకుల హృదయాలను బంధుత్వం మరియు ప్రేమ బంధం మరియు సేవను ప్రేమించ గలిగే నిబద్ధతతో ఈసమావేశంలో ఐక్యమయ్యేలా చేసారు. తత్ఫలితంగా ఈ కార్యక్రమం ఒక అధికారిక సమావేశంలా కాకుండా కుటుంబ పనితీరు సమీక్ష చేసుకునే భావనను సంతరించుకున్నది. ఊహించని ఆశీర్వాదం ఈ సందర్భాన్ని మరింత ఆనందపరిచింది.
ఈ కార్యక్రమంలో 15మంది అభ్యాసకులు ప్రదర్శనలు ఇచ్చారు. సాధ్యమైనంతవరకు వారు చెప్పేది గ్రహించాలని కృతనిశ్చయంతో తోటి అభ్యాసకులు అంతా ఆ విషయాలను జాగ్రత్తగా వింటూ ప్రశ్న మరియు జవాబులను తక్కువ సమయానికి పరిమితం చేశారు. అధికారిక కార్యకలాపాల అనంతరం అభ్యాసకులు అనధికారికంగా ఒకరితో ఒకరు సంభాషించు కొనడానికి దూరప్రాంత కుటుంబంలోని ఇతర సభ్యులను తెలుసుకోవడంలో వారు తమ విలువైన సమయాన్ని జారవిడుచు కోలేదు. ఈ అవకాశాన్ని ఉపయోగించు కోవడానికి ఇంతకుముందు కలుసుకొనని అభ్యాసకులు వేరు వేరు ప్రాంతాల నుండి వచ్చిన వారు వారి ఆలోచనలు మరియు వ్యక్తిగత అనుభవాలను పరస్పరం పంచుకున్నారు. వైద్య చిట్కాలను కూడా తెలుసుకున్నారు. మర్యాదలు పక్కన పెట్టి చికిత్సా సమస్యలు మరియు నిర్దిష్ట ప్రభావాల గురించి ఒకరినొకరు అడిగి తెలుసుకున్నారు. ఇటువంటి పరస్పర చర్యలతో ఇది 24 గంటలు పూర్తి సమయం సమావేశంగా మారింది!
స్వామి లీల
సదస్సు నిర్వహింపబడుతున్న పాత మందిరంలో కార్యక్రమాల ముగింపు దశలో 108 సిసి బాక్స్ రీఛార్జింగ్ సమయములో స్వామి ఈకార్యక్రమాన్ని మరింత ఆశీర్వదించారు అనడానికి నిదర్శనముగా ఒక సంఘటన జరిగింది. భారతదేశానికి చెందిన ఒక అభ్యాసకురాలు ఆమె యొక్క 108సిసి బాక్స్ చూస్తున్నప్పుడు చివరిలైనులలో కొన్ని వరుసలలోని సీసాలపై విభూతి ఏర్పడిందని గమనించారు(చిత్రాన్ని చూడండి). చాలామంది అభ్యాసకులు ఈ దైవలీలను చూసారు. పుట్టపర్తిలో అంతర్జాతీయ సమావేశం ఉంటుంది అని స్వామి 2007లో ప్రకటించి తమ వాక్యాన్ని నెరవేర్చడమేకాక ఈ ప్రారంభ సమావేశానికి తమ ఆమోదం ఆశీర్వాదము తెలపడానికి ఈ విధమైన ఇన్విటేషన్ విడిచిపెట్టారు మరియు సాయి వైబ్రియానిక్స్ ను “దివ్య వైబ్రేషన్” గా ఆయన నిరంతరం ఆశీర్వదిస్తూనే ఉన్నారు.
ప్రొసీడింగ్స్ మరియు వీడియో
ఈ సమావేశం యొక్క కార్యక్రమసరళి ప్రచురింపబడింది. సాయి వైబ్రియానిక్స్ వ్యవస్థాపకుడు డాక్టర్ జిత్.కె. అగర్వాల్ సంకలనం చేసి సవరించిన సాయి వైబ్రియానిక్స్ యొక్క 1వ అంతర్జాతీయ సదస్సు యొక్క కార్యక్రమాల వివరాలు విస్తృతమైన సంచికగా ఈ కార్యక్రమంలో స్వామికి సమర్పించడమే కాక పాల్గొన్న వారికి అందుబాటులో ఉంచబడింది. ఈ పుస్తకంలో భారతదేశం మరియు 16 ఇతర దేశాల నుండి పెద్దసంఖ్యలో సమర్పింపబడిన వాటిలో ఎంపిక చేసుకొనిన 85 మంది అభ్యాసకుల వ్యాసాలు ఉన్నాయి. ఈ సమావేశానికి హాజరు కాగలిగిన లేదా కార్యక్రమంలో ప్రదర్శనలు ఇవ్వగలిగిన వారుకాక మిగిలిపోయిన ఎంతో మంది అభ్యాసకుల కృషికి ఇవి ప్రాప్తిని అందిస్తాయి. 20సంవత్సరాల సాయి వైబ్రియానిక్స్ ఎదుగుదలకు అభ్యాసకులు చేసిన కృషి మరియు వారి అనుభవ ఫలాలను పెద్ద ఎత్తున పంచుకోవడానికి ఒక అపూర్వమైన ప్రయత్నాన్ని ఈ పుస్తకం సూచిస్తుంది. ఈ వ్యాసాలు ఈ రంగంలో ఉన్న అభ్యాసకులకు సమాచార సంపదను మరియు ప్రత్యక్ష ఉపయోగాన్ని అందిస్తాయి. అభ్యాసకులు ఏ స్థాయిలో ఉన్నా వారి రోగులకు ఉత్తమమైన సంరక్షణను అందించే సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం మరియు ప్రపంచవ్యాప్తంగా వైబ్రియానిక్స్ సాధనలో ఎంచుకున్న పరిణామాల గురించి సభ్యులకు తెలియజేయడం దీనిలక్ష్యం. అదనంగా, ఈపుస్తకం ఆరోగ్య సంరక్షణ నిపుణులు మరియు ఇతరులకు సాయి వైబ్రియానిక్స్, దానిఆవిర్భావం, పరిణామం మరియు ప్రస్తుత పద్ధతులపై లోతైన అవగాహన కోరుకునే వారికిఒక గొప్ప వనరుగా ఉపయోగపడుతుంది. ప్రస్తుత సంచికలో చేర్చబడిన వ్యాసాలతో పాటు అనేక ఇతర విలువైన సమర్పణలు మాకు అందినప్పటికీ ఆలస్యంగా వచ్చిన కారణంగా ఈపుస్తకంలో చేర్చలేకపోయాము. సమీప భవిష్యత్తులో అవి కూడా వ్యవస్థీకృతం చేయబడి ప్రచురింప బడతాయని గమనించాలి.
పుస్తకంతో పాటు, 14 నిమిషాల సాయి వైబ్రియానిక్స్ అంటే ఏమిటి అనే వీడియో స్వామికి సమర్పింపబడి సమావేశంలో ప్రదర్శింపబడింది. అంతేకాక పాల్గొన్నవారికి డివిడి రూపంలో కూడా అందుబాటులోఉంచబడింది. సీనియర్ అభ్యాసకులు శ్రీ డైరజ్ హెబిజ్(పోలాండ్) నిర్మాణము చేయగా సునీల్ అగర్వాల్(యు.కె.) దీనిని ఆంగ్లంలో వివరించారు. ఈ చిత్రం వైబ్రియానిక్స్ యొక్క అభివృద్ధి కథను మరియు SRHVP పరికరం ఎలా పనిచేస్తుందో వివరిస్తుంది. ఈ చిత్రం రోగులకు మరియు సాధారణ ప్రేక్షకులకు సాయి వైబ్రియానిక్స్ గురించి వివరించాలని కోరుకునే అభ్యాసకులకు తక్షణ ప్రయోజనాన్ని అందిస్తుంది .
ప్రదర్శన
సదస్సుతో పాటు నిర్వహించిన “ప్రపంచ వ్యాప్తంగా సాయి వైబ్రియానిక్స్“ అనే ప్రదర్శన ఏర్పాటు చేయడానికి కల్నల్ సమీర్ బోస్ చిత్రపటాలను చార్టులను భౌగోళిక పటాలను ఉపయోగించుకుంటూ సాయి వైబ్రియానిక్స్ అంటే ఏమిటి, అది ఎక్కడి నుండి వచ్చింది, దాని పరిణామ క్రమము ఇందులో ప్రదర్శింపబడ్డాయి. ఈప్రదర్శనలో భారతదేశం మరియు అనేక ఇతర దేశాల్లో అభ్యాసకుల శిక్షణ మరియు వైద్య శిబిరాలతో సహా సాయి వైబ్రియానిక్స్ కార్యకలాపాలపై నివేదికలు ఉన్నాయి.
ఒక మైలురాయి వంటి సంఘటన
మొత్తం మీద సాయి వైబ్రియానిక్స్ యొక్క మొదటి అంతర్జాతీయ సమావేశం ఒక మైలురాయి వంటిదని చెప్పవచ్చును. ఈ సమావేశం వైబ్రియానిక్స్ తదుపరి దశకు ఒక స్ప్రింగ్ బోర్డును అందిస్తుందని అభ్యాసకుల సహకారాన్ని పెంచడానికి మార్గం సుగమం చేస్తుందని ఉత్తమ పద్ధతులలో మరింత అభివృద్ధిని ప్రేరేపించడానికి మరియు ప్రపంచ వ్యాప్తంగా సాయి వైబ్రియానిక్స్ గురించి తెలిపే విద్యకు తోడ్పడుతుందని భావిస్తున్నారు. ఈరోజు వరకు 4,500 మంది అభ్యాసకులు శిక్షణ పొందారు మరియు 1.8 మిలియన్ల మంది రోగులు చికిత్స చేయబడ్డారు. ఇంకా మిలియన్ల కొద్దీ రోగులు చికిత్స కోసం వేచి ఉన్నారు. ఆ విధంగా స్వామి ఆశీర్వాదంతో అభ్యాసకులు తమ సేవాక్షేత్రం కోసం ఉత్సాహం మరియు విశ్వాసం నింపుకొని సమావేశం నుండి బయలు దేరారు. కృషి మరియు నిస్వార్థ సేవ ద్వారా స్వామి వారిపై ఉంచిన ప్రేమ లక్ష్యాన్ని నిర్వర్తించడానికి కృత నిశ్చయులయ్యారు.
సదస్సు యొక్క కార్యక్రమ సరళి ఆదివారం 26 జనవరి 2014
ఉదయమే, పుట్టపర్తిలోని శ్రీ పెద్దవెంకమరాజు కళ్యాణమండపం (స్వామి యొక్క పాత మందిరం) లో అందరూ హాజరయ్యారు. ఇద్దరు అభ్యాసకులు అందమైన పువ్వులు మరియు పచ్చదనంతో సభా మండపాన్ని అందంగా తీర్చిదిద్దారు. సమావేశం ఉదయం 8 గంటలకు మూడుసార్లు ఓంకారం మరియు ఆరుగురు అభ్యాసకులు చేసిన ఆరునిమిషాల వేదపఠనంతో ప్రారంభమైంది.
జ్యోతి ప్రజ్వలన చేయటానికి మరియు సదస్సును ప్రారంభించ డానికి విశిష్ట అతిథులు శ్రీ ఆర్ జె రత్నాకర్, ముఖ్యఅతిధి శ్రీ ఏ పి మిశ్రా, శ్రీ విశ్రీనివాసన్, శ్రీ జస్టిస్ భగవత్, స్వామి ఆనంద మరియు డాక్టర్ మైఖేల్ రాకాఫ్ వేదిక మీదకు ఆహ్వానించబడ్డారు. శ్రీ జస్టిస్ మిశ్రా కాన్ఫరెన్స్ యొక్క కార్యక్రమ వివరాల మొదటి కాపీని విడుదల చేయడానికి రిబ్బను కత్తిరించారు. పోలాండ్ కు చెందిన సీనియర్ అభ్యాసకులు ట్రైనర్ & కోఆర్డినేటర్ అయిన శ్రీ డేరియాజ్ హెబీజ్ తన వీడియో “సాయి వైబ్రియానిక్స్ అంటే ఏమిటి” స్వామికి సమర్పించడానికి ఆహ్వానించబడ్డారు. ఈకొత్త వీడియో సంకల కరతాళధ్వనులతో ప్రదర్శింపబడి అభినందింపబడింది. ఇది మన అధికారిక వెబ్సైట్లో ఉంచబడుతుంది.
మొదటి సెషన్
స్వాగతోపన్యాసం: డాక్టర్ జిత్ కె అగర్వాల్
వేడుకలకు ప్రతిరూపం అని చెప్పదగ్గ కుమారి శుసాన్ సల్లివాన్-రాఖాఫ్ అమెరికాకు చెందిన సాయి వైబ్రియానిక్స్ ట్రైనర్ మరియు కోఆర్డినేటర్ మరియు సాయి వైబ్రియానిక్స్ వార్తాలేఖ సంపాదకురాలు, సాయి వైబ్రియానిక్స్ వ్యవస్థాపకులు డైరెక్టర్ అయిన డాక్టర్ జిత్ కె అగర్వాల్ గారిని తమ స్వాగతోపన్యాసం చేయటానికి వేదికపైకి ఆహ్వానించారు. అందరికీ ఆహ్వానాన్ని అందిస్తూ సభపై స్వామి యొక్క ఆశీర్వాదం కోరుకుంటూ డాక్టర్ అగర్వాల్ ప్రారంభించారు. “సాయి లీడ్స్ - వైబ్రియానిక్స్ టేక్స్ షేప్” (స్వామి ప్రేరణతో రూపుదిద్దుకున్న వైబ్రియానిక్స్) అనే తన ప్రసంగంలో డాక్టర్ అగర్వాల్ 2007 ఏప్రియల్లో స్వామి ఒక ఇంటర్వ్యూలో పుట్టపర్తిలో అంతర్జాతీయ వైబ్రియానిక్స్ సమావేశం జరుగుతుందని చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ అది ఈరూపంగా సాకారం అయినందుకు తమ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. స్వామి వాక్కు అనివార్యం దాని రూపమే ఈ సదస్సు. దీనికి అభ్యాసకుల స్పందన కూడా అద్భుతంగా ఉంది అన్నారు. అనేక మంది సహాయ సహకారాలతోనూ అవిరళ కృషితోనూ ఇది సాధ్యమయింది అని చెపుతూ డాక్టర్ అగర్వాల్ వైబ్రియానిక్స్ అభివృద్ధిలో స్వామి పాత్రను తనవ్యక్తిగత అనుభవాలలో కొన్ని ముఖ్యాంశాలను వివరిస్తూ స్వామి ఈపనిని ఎలా నిర్దేశించారో, ఎలా మార్గదర్శకత్వం వహించారో సభికులకు తెలిపారు. కొన్ని ఉదాహరణలు ఇస్తూ స్వామి అనేక ఇంటర్వ్యూ లలో SRHVP మిషనుపై ఎంతో ఆసక్తిని కనబరిచారు. 1994లో డాక్టర్ అగర్వాల్ రూపొందించిన అసలు నమూనాను ఆశీర్వదించారు. 1996లో మెరుగైన మిషనును ప్రశంసించారు. 1998లో ఈమిషను తన దివ్యప్రకంపనలు మాత్రమే కలిగి ఉంటుందని స్వామి ప్రకటించారు; స్వామి పదేపదే వైబ్రియానిక్స్ గురించి బోధించమని డాక్టర్ అగర్వాల్ గారికి సూచించడమే కాక ఆశ్రమానికి వెలుపల మరియు ఇతర దేశాల్లో కూడా పర్యటించాలని నిర్దేశించారు; 2008లో స్వామి 108cc బాక్సును ఆశీర్వదించారు. మార్చి 2011లో స్వామి ఆసుపత్రికి వెళ్లడానికి కొన్ని రోజుల ముందు సాయి వైబ్రియానిక్స్ సాయి సంస్థలో కొనసాగాలని స్వామి ధృవీకరించారు. ఒకరి నుండి ఒకరు నేర్చుకోవడానికి ఈసమావేశం అందించిన సువర్ణావకాశాన్ని వినియోగించుకోవాలని డాక్టర్ అగర్వాల్ అభ్యాసకులను ప్రోత్సహించారు. హృదయ పూర్వకంగా సేవ చేయాలనుకునే వారికి స్వామి అభయ హస్తం ద్వారా మార్గనిర్దేశం, వారి అనుగ్రహం ఇలాగే కొనసాగాలని ప్రార్థిస్తూ ముగించారు.
శ్రీ ఆర్జె రత్నాకర్ గారి ప్రారంభ ఉపన్యాసం
డాక్టర్ అగర్వాల్ శ్రీ ఆర్ జె రత్నాకర్ గారిని సదస్సు ప్రారంభోత్సవ ఉపన్యాసానికి ఆహ్వానించారు. అంతర్జాతీయ సమావేశం ఉంటుందని 2007లో స్వామి చేసిన ప్రకటనను ప్రస్తావించడం ద్వారా శ్రీ రత్నాకర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. స్వామి ఏది చెప్పినా వారి మాటలకు అధిక ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ ఉంటుందని అది వాస్తవమై తీరుతుందనే విషయం మనలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని స్వామి కోరుకుంటున్నారని ఆయన నొక్కి చెప్పారు. ఈ సమావేశం ఎలా ఉంటుందో తనకు పెద్దగా తెలియదని శ్రీ రత్నాకర్ అంగీకరించారు. ఇది ఒక తరగతి వ్యవహారం అని మాత్రమే భావించాను, కానీ ఇంత శక్తివంతంగా ఉంటుందని అనుకోలేదని తెలిపారు. వైబ్రియానిక్స్ కి సంబంధించినంత వరకు రెండు విషయాలను ఈ వక్త స్పష్టం చేసారు: వైబ్రియో సాధనకు మంచి హృదయం ఉండాలని, నిజానికి ప్రపంచంలో ఏది సాధించాలన్నా మంచి హృదయం ఉండాలని సూచించారు. మంచి హృదయం నుండి ప్రయోజన ఐక్యత సిద్ధిస్తుంది. అట్టి ఐక్యతతోనే మీరు ఖచ్చితంగా లక్ష్యాన్ని చేరుకుంటారు . రెండవది వ్యాధిని నయం చేసే వారు స్వామీయే అనే విశ్వాసం కలిగి ఉండాలి. అట్లు కాక మరొక విధంగా ఆలోచించడం లక్ష్యానికి దూరం చేసి మాయలో పడవేస్తుందని తెలిపారు.
శ్రీ రత్నాకర్ కొన్ని సంవత్సరాల క్రితం రోగిగా తనవ్యక్తిగత అనుభవాలను వివరించారు. తీవ్రమైన ప్రమాదం ఫలితంగా శ్రీరత్నాకర్ నాలుగు వారాలపాటు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఐసియులో ఉన్నారు. భగవాన్ అక్కడ ఆయనను చూసారు. రత్నాకర్ గారి కాలికి తీవ్రంగా దెబ్బ తగలడంతో సహా ఎముకలోపలు పగుళ్ళు ఏర్పడినప్పటికీ ఎప్పుడూ అతనికి నొప్పి అనిపించలేదు. ప్రమాదం జరిగిన రోజు నుండి ఎముక విరిగినప్పటకి స్వామి “నీవు ఎప్పుడు నడుస్తావు”? అని అడుగుతూ అతనికి భరోసా ఇచ్చేవారు. కేవలము స్వామి అనుగ్రహం వలననే ఈ రోజు తాను నడవగలుగు తున్నానని గత సంవత్సరం తన కుమారులతో విహారయాత్రలో గోల్కొండ కోటకు వెళ్ళినప్పుడు దాదాపు 600 మెట్లు ఎక్కి పైకి చేరుకున్న తర్వాత తను చేసిన మొదటి పని స్వామికి కృతజ్ఞతా పూర్వక ప్రార్థన చేయడం అనీ వినయపూర్వకంగా చెప్పారు.
దివ్యత్వం యొక్క స్వభావం గురించి చెబుతూ ఒకసారి దివ్యత్వం మనలో ప్రవేశించినప్పుడు అది ఎప్పటికీ మారదు లేదా తగ్గదు ఎప్పుడూ ఉంటుంది. స్వామి తన శక్తిని విశ్వంలోని ప్రతీ వస్తువులో ప్రసరింపజేసి విశ్వమంతా తన ప్రేమతో నింపిన రీతిగానే మనలో ప్రతి ఒక్కరికీ తన ప్రేమని మరియు వైబ్రేషన్ను అందించారు. దర్శన సందర్భంగా తను చూసిన ఒక సంఘటనను శ్రీ రత్నాకర్ గుర్తు చేసుకుంటూ తొమ్మిది సంవత్సరాలు వీల్ చైర్ లో ఉన్న మలేషియాకు చెందిన వ్యక్తి వద్దకు స్వామి వచ్చినప్పుడు స్వామి అతనితో “నీవు మళ్లీ నడుస్తావు” అని చెప్పారు. ఆ వ్యక్తి లేచి అందరి ముందు నడిచాడు. స్వామి మాటలలో ఉన్న వైబ్రేషన్ శక్తి వారి స్పర్శ అంత గొప్పది కనుకనే ఆ వ్యక్తికి స్వస్థత చేకూర్చారు. ఇదే కాక స్వామి ప్రదర్శించిన అనేక లీలలకు తను ప్రత్యక్ష సాక్షిని అంటూ అనేక ఇతర అంశాలను ప్రస్తావించారు.
ముగింపులో శ్రీరత్నాకర్ వైబ్రియానిక్స్ అభ్యాసకుల కోసం ఒక సందేశాన్ని ఇచ్చారు. స్వామిని తెలుసుకోవ డానికి ప్రయత్నించాలని చెపుతూ స్వామికి ఎవరు ముఖ్యమైనవారో తెలుసు కనుక వారు ఇంతమంది ప్రజల నుండి మిమ్మల్ని ఎంపిక చేసుకున్నారు. ఈ కారణంగానే స్వామి డాక్టర్ అగర్వాల్ ని ఎంపిక చేసుకొని వారిని పదేపదే ఆశీర్వదిస్తూ మార్గనిర్దేశం చేశారు. సమావేశమైన అభ్యాసకులను నేరుగా ఉద్దేశించి మాట్లాడుతూ శ్రీ రత్నాకర్: స్వామి ఇప్పటికీ ఈ అద్భుతమైన వైద్య పద్ధతిని మరియు వైబ్రియానిక్స్ సాధన కోసం వచ్చిన మీ అందరిని ఆశీర్వదిస్తూనే ఉన్నారు, మీరు స్వయంగా బాబా చేత ఎన్నుకొనబడినవారు. బాహ్య ప్రపంచంలో లక్షలాది మంది బాధపడుతున్నారు. మంచి ఆరోగ్యము, మద్దతు, ప్రేమ, సేవ, మరియు సంరక్షణ వారికి అవసరం, సాయి భక్తులుగా మరియు సాయి పేరుతో అనుసంధానింపబడిన ఈ అద్భుతమైన కార్యం నిర్వహించడానికి స్వచ్ఛమైన హృదయంతో సేవ చేయడం మనకు పవిత్రమైన కర్తవ్యం. వారింకా ఇలా కొనసాగించారు, సంపూర్ణ ఆరోగ్యాన్ని భూమిపై ఉన్న ప్రతీ ఒక్కరికి అందించడానికి దేవుని ప్రేమ రాజ్యాన్ని స్థాపించడానికి మీఅందరిలో స్వామి దివ్య వైబ్రేషన్ ను నింపాలని స్వామిని ప్రార్ధిస్తున్నాను. 6-7 సంవత్సరాల క్రితమే ఈసమావేశం ఉంటుందని స్వామి నిర్ణయించినప్పుడు, ఎవరు పాల్గొనబోతున్నారో కూడా ఆయన నిర్ణయించుకున్నారు అని మీరు నమ్మలేరా? అంటూ అభ్యాసకులను ప్రశ్నిస్తూ మీరు మీ స్వస్థలాలకు తిరిగి వెళ్లి నప్పుడు ఇక్కడ నేర్చుకున్న వాటిని అవసరమైన వారికి విస్థరించండి అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.
జ్ఞాన వాక్కు: జస్టిస్ ఎ పి మిశ్రా గారు
అనంతరం శ్రీ జస్టిస్ ఎ పి మిశ్రా గారు తమ వర్డ్స్ ఆఫ్ విస్డం (జ్ఞాన వాక్కును) వినిపించడానికి వేదికపైకి ఆహ్వానింపబడ్డారు. మొట్టమొదట ఒక దైవిక ప్రయోజనాన్ని ఆశించి దైవిక విలువల కోసం అసంఖ్యాకంగా వచ్చిన అభ్యాసకుల సదస్సును ఉద్దేశించి ప్రసంగించడానికి తనకు అవకాశం ఇచ్చిన డాక్టర్ మరియు శ్రీమతి అగర్వాల్ గార్లకు కృతజ్ఞతలు తెలియజేచేయడం ద్వారా ప్రసంగాన్ని ప్రారంభించారు. భగవంతుడు ఆశీర్వదించిన కారణంగా అభ్యాసకుల జీవితాలకు ఒక ప్రయోజనం చేకూరిందని జస్టిస్ మిశ్రా వ్యాఖ్యానించారు. పూర్వం యాంటీబయాటిక్స్ వాడుకలోకి వచ్చి ఆస్పత్రులు ఏర్పడినప్పుడు ప్రతి ఒక్కరూ తమ వ్యాధులకు చక్కని పరిష్కారం దొరికినట్లుగా భావించారు, కానీ ఏవేవో పదార్థాలు శరీరానికి చేర్చడం వల్ల మరిన్ని ఎక్కువ సమస్యలు వస్తాయని ఎవరూ ఊహించలేదు. ఈ సమావేశం జరుగుతుందని ముందే ఊహించి చెప్పినందుకు స్వామికి వారు కృతజ్ఞతలు తెలియజేస్తూ సదస్సుకు వేదిక అయిన స్వామి పాత మందిరం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ వేదిక స్వామి జన్మ స్థలానికి దగ్గరగా ఉన్నందున ఆ దివ్య ప్రకంపనలతో ఇది వైబ్రేట్ అవుతోందని వారు ప్రేక్షకులకు గుర్తు చేసారు. స్వామి యొక్క అవతార కార్యక్రమం కూడా వీరి మొదటి మందిరం ఐన ఇక్కడే ప్రారంభమైంది. అటువంటి అద్భుతమైన అవతారము ప్రారంభమైన ప్రదేశంలో ఈ సమావేశం ప్రారంభము కావడం వైబ్రియానిక్స్ ఎంతో కాలం పాటు విజయవంతం అవుతుందనే క్రమాన్ని సూచిస్తుందని చెపుతూ వైబ్రేషన్లకు నిజమైన నివారణ శక్తి ఉందని తమ ప్రగాఢ విశ్వాసాన్ని శ్రీ మిశ్రా వ్యక్తం చేసారు.
వైబ్రేషన్స్ యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ ఈ విశ్వం మొత్తం దివ్య ప్రకంపనల తో నిండి ఉందని వివరించారు ఈ ప్రకంపనలు మానవత్వం యొక్క మంచి కోసం చేయగలిగే వాటిలో వైబ్రియానిక్స్ పరిమితమైన భాగం మాత్రమే అన్నారు. విశ్వం యొక్క స్థితిగతులను గురించి అనర్గళంగా మాట్లాడుతూ ఈ విశ్వమంతా స్థిరమైన వేగంతో కదులుతోంది, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది, సూర్యుడు పాలపుంత లో కదులుతూ ఉన్నాడు, పాలపుంత కూడా స్వయంగా ప్రయాణిస్తూ ఉంది. ఇలా ఖగోళ వస్తువులన్నీ విపరీతమైన వేగంతో ఎంతో దూరం ప్రయాణిస్తూ ఉన్నాయి విశ్వం యొక్క శక్తి అనంతం అని తెలిపారు. స్వామి అవతారం దాల్చిమన మధ్య నిలిచి ఈ శక్తులు మనలో ప్రతి ఒక్కరిలో ఉన్నాయని చూపించారు, కనుక ఆ దివ్య ప్రకంపనల శక్తి ప్రతీ భక్తుని లోనూ ఉందని తెలిపారు.
అందువలన వైబ్రియానిక్స్ సాధన చేస్తూ ఉన్న అభ్యాసకులు తాము ఇతరులకు సహాయం చేయడం లేదని తమను తామే మెరుగుపరుచుకుంటున్నామని గ్రహించాలి. వారు మానవాళికి సేవ చేయడం లేదు తమకు తామే సేవ చేసుకుంటున్నారు. అనంతరం వారు ప్రేమతో చేసే సేవ యొక్క ప్రభావాలకు కొన్ని ఉదాహరణలు ఇచ్చారు. కారుణ్య కార్య కలాపాలలో నిమగ్నమై ఉన్న మదర్ థెరీసా విద్యార్థులపై రక్త పరీక్షలు నిర్వహించినప్పుడు వారిలో రోగ నిరోధక కారకం ఉన్నట్లు కనుగొనబడి దానివలన వారి ఆరోగ్యం బలపడిందని నిరూపించింది. భక్తితో, ప్రేమతో, అంకితభావంతో సేవ చేసే వారికి ఇటువంటి స్థితి కలుగుతుంది. జస్టిస్ మిశ్రా అభ్యాసకులను ప్రేమ, కరుణ మరియు స్వచ్ఛత యొక్క రూపాలుగా మారాలని సూచించారు. స్వర్ణయుగం రాబోతోందని వారు చెబుతూ, ఈరోజు మనం కంపనాలను సీసాల్లో ఉంచుతున్నాము, అలా వైబ్రియానిక్స్ ప్రపంచంలోని అన్ని వ్యాధులను ఈ విధంగా నయం చేసే రోజు వస్తుంది. ప్రపంచాన్ని అంతా తన క్రిందకు తెచ్చుకుంటుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు అన్నారు. ముగింపులో, సదస్సుకు హాజరైనందుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే అభ్యాసకులు ఇందులో పాల్గొనడం కూడా వారి భాగ్యమనీ, స్వామి దీనిని విజయవంతం చేస్తారని, అందులో భాగమై ఉండడమే గొప్ప విశేషమని తెలుపుతూ, అభ్యాసకులు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
జస్టిస్ మిశ్రా ప్రసంగం తర్వాత రిబ్బన్ కటింగ్ వేడుక కోసం ప్రత్యేక అతిథులు ఎగ్జిబిషన్ ప్రాంతానికి ఆహ్వానింపబడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా సాయి వైబ్రియానిక్స్ అనే ప్రదర్శన ప్రారంభమైనట్లు బహిరంగంగా ప్రకటించారు.
కళ్యాణ మండపం బయట ప్రదర్శన ప్రారంభోత్సవానికి రిబ్బన్ కటింగ్ కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు కల్యాణ మండపంలో ఆసీనులైన సభ్యులు శ్రీ డేరియజ్ హెబిజ్ ప్రదర్శించిన బ్లెస్సింగ్స్ ఆఫ్ వైబ్రియానిక్స్ వీడియోలో 2008-2010 మధ్య ప్రతీ గురు పూర్ణిమకు స్వామి వైబ్రియానిక్స్ టీం వారు సమర్పించిన కేకును ఆశీర్వదించిన క్రమాన్ని చూస్తూ ఆనందించారు. ఈ మూడు సందర్భాల్లోనూ మన ప్రియమైన స్వామి క్యాండిల్ వెలిగించి కేకును కోసి మందిరంలో ఉన్న భక్తులందరికీ ప్రసాదాన్నిపంపిణీ చేయించారు. వైబ్రియానిక్స్ బృందానికి ఇది స్వామి బహిరంగ ఆశీర్వాదము మరియు స్వామి మార్గదర్శకత్వములో సేవలు అందిస్తున్న అభ్యాసకులందరికీ ఇది గొప్ప ప్రోత్సాహము.
ప్రాక్టీషనర్ల సమర్పణలు
ప్రధాన వక్త కుమారి పాట్ హంట్ 00002 యూ కె, సాయి వైబ్రియానిక్స్ పరిశోధన విభాగపు అధికారి, శిక్షకురాలు, మరియు సీనియర్ వైబ్రియానిక్స్ అభ్యాసకురాలు ఐన ఈమె సాయి వైబ్రియానిక్స్ వైపు నా ప్రయాణం - అగోచర జ్ఞాపకాలు అనే విషయం గురించి మాట్లాడారు. స్వామి ఆమెను హోమియో పతి వైపు ఎలా లాగుకున్నారు స్వామి నారాయణి మరియు స్వామి ఆనంద ల పుస్తకం హ్యాండ్ బుక్ ఆన్ హీలింగ్ గురించి ఆ తర్వాత అగర్వాల్ గారి గురించి తెలుసుకోవడం వంటి విషయాలు ఆమె వివరించి చెప్పారు. ఆ తర్వాత స్వామి యొక్క నిరంతర మార్గదర్శకత్వంలో వైబ్రియానిక్స్ అభివృద్ధి సాధనలో వారు నడుస్తున్నారు. వైబ్రియానిక్స్ విస్తరిస్తున్నకొద్దీ వైద్య శిబిరాలు మరియు క్లినిక్ లలో క్రమం తప్పకుండా చికిత్స పొందుతున్న రోగుల యొక్క అనేక లక్షణాలు మరియు వ్యాధులను కవర్ చేయడానికి ప్రామాణిక కోంబోల అవసరం ఏర్పడింది. కుమారి పాట్ హంట్ కు వివిధ మిశ్రమాలు మరియు నివారణాలను పరిశోధించి 108 సాధారణ మిశ్రమాలలో పొందుపరిచే ప్రక్రియ ఒప్పగించ బడింది. అనేక నెలలు కొనసాగిన ఈ ప్రక్రియలో ఆమె స్వామి వారి నిరంతర ఉనికిని మరియు మార్గదర్శకత్వమును అనుభవించారు. ఆమె మదర్ టింక్చర్లు ఐన ఆర్నికా, క్యాలెన్ డులా (బంతి) మరియు హైపరికం (సెయింట్ జాన్స్ ఓర్ట్) ల అనుభవాలను పంచుకున్నారు అలాగే క్షయ వ్యాధి మియాజమ్ ను ఎలా చికిత్స చేయాలో దానిపై కొత్త అవగాహనను అందించారు.
కార్యక్రమ నిర్వాహకురాలు కుమారి సుసాన్ సలీమాన్-రాకాఫ్ 01339 యుఎస్ఎ, డిప్రెషన్ ప్రభావము వైబ్రియానిక్స్ చికిత్స యొక్క పాత్ర అనే అంశంపై ప్రసంగించారు. నిరాశ దాని యొక్క కారణాలు మరియు ప్రభావాల గురించి, మనస్సు శరీరం మధ్య ఉన్న సంబంధం గురించి చెప్పడం మరియు వైబ్రియానిక్స్ చికిత్స అటువంటి సందర్భాల్లో ఎలా ప్రభావవంతంగా పని చేస్తుందో వివరించారు. రోగులను వారి సాధన పెంచడానికి ప్రోత్సహించడం మరియు రోగులతో హృదయపూర్వక అనుసంధానం రెండూ ముఖ్యమైనవే అని చెప్పారు. కాన్ఫరెన్సు పుస్తకంలో ప్రచురింపబడిన రోగ చరిత్రలలో దీర్ఘకాలిక డిప్రెషన్ కు చికిత్స, ధూమపానము, ద్విద్రువ సమస్య మరియు తినడంలో రుగ్మతలు, మోకాలి గాయం, రేడియేషన్ థెరపీ ద్వారా క్షీణించిన దవడ ఎముకను విజయవంతంగా నయం చేయడం గురించి ఉన్నాయి.
కుమారి ఆకాశా వుడ్ 00135 యుఎస్ఎ, సీనియర్ చికిత్సానిపుణురాలు ప్రోబింగ్ ద ఫిఫ్త్ ఎలిమెంట్ పంచభూతాలలో అయిదవది అయిన ఆకాశము వైబ్రియానిక్స్ విషయంలో దాని పాత్ర , SRHVP మిషను పుట్టుక మరియు పనిచేయు విధానము రేడియోనిక్స్ నుండి ఇది అభివృద్ధి చేయబడిన విధానము గురించి ఆమె వివరణతో కూడిన ప్రసంగము చేసారు. నీటిపై మానవ ఆలోచనలు మరియు భావోద్వేగాలు యొక్క ప్రభావం గురించి ఎమిటో చేసిన ప్రయోగం గురించి కూడా వివరించారు. కాన్ఫరెన్స్ పుస్తకంలో ఈమె పక్షవాతపు రోగికి చేసిన చికిత్స, కండ్లకలక, రక్తస్రావం, పగిలిన పాదాలు, పిల్లలలో పీడకలలు, నిద్రలేమి, ఆందోళన, తేలికపాటి ఆస్పర్జర్(సామాజిక నైపుణ్యాల లోపము)కారణంగా ఏర్పడిన ఆందోళన, హెమరాయిడ్స్, మలబద్ధకం, గురించి రోగచరిత్రలు సమర్పించారు.
రెండవ సభా విశేషాలు
శ్రీమతి కమలేష్ అగర్వాల్ 02817 ఇండియా, సీనియర్ అభ్యాసకురాలు మరియు శిక్షకురాలు తన జర్నీ ఆఫ్ ఎ పేషెంట్ టు ఎ ప్రాక్టీషనర్ అనే ప్రసంగంలో దాదాపు అంగవికలురాలిగా మార్చిన కీళ్లవాత పేషెంటు స్థాయి నుండి ముంబై టీచర్ మరియు ప్రాక్టీషనర్ గా ఎలా రూపాంతరం చెందారో వివరించారు. కాన్ఫరెన్స్ పుస్తకములోని ఆమె వ్యాసంలో 5 రకాల వ్యాధులు దీర్ఘకాలిక ఆర్థరైటిస్, కంటి సమస్యలు(అలర్జీ మరియు యు కనురెప్ప యొక్క కంటి కురుపు), సైనస్ మరియు డస్ట్ ఎలర్జీ వంటివి ఉన్నాయి. శ్రీమతి కమలేష్ స్వామికి తమ కృతజ్ఞతలు తెలియజేస్తూ తనను మహా సమాధికి ముందు తన మొదటి మరియు చివరి దర్శనం కోసం పర్తికి తీసుకువచ్చినందుకు స్వామికి కృతజ్ఞతలు తెలియజేసారు.
శ్రీ మకాటో ఇషీ PhD02779 జపాన్, యాన్ ఎడ్యుకేషనల్ పెర్స్పెక్టివ్ ఇన్ వైబ్రియానిక్స్ (వైబ్రియానిక్స్ లో విద్యా దృక్పథం) అనే తన వ్యాసంలో సాయి సంస్థకు చెందిన ఎడ్యుకేర్ తోపాటు వైబ్రియానిక్స్ కి కూడా సేవలందిస్తున్నవీరు ఈ రెండింటి మధ్య ఉన్న సామీప్యత గురించి తన ధృక్పధాన్ని పంచుకున్నారు. కొన్నిసార్లు ఇబ్బందికరమైన పరిస్థితులలో గాయపడిన లోపలి పిల్లవాడికి(అంతరంగం) ఎలా చికిత్స చేయాలనే దాని గురించి మాట్లాడారు. “లిటిల్ మీ”, అనేది స్వామి చెప్పిన మన అంతరంగం యొక్క మరొక కోణం. కాన్ఫరెన్స్ పుస్తకంలో వారి వ్యాసంలో సర్కోయిడోసిస్, కణుతులు, వ్యసనలు, బృహద్ధమని సంబంధ విభజన, ఫైబ్రో మైయాల్జియా, మినియర్స్ వ్యాధి, గుండె ఆగిపోవడం మరియు ఊపిరితిత్తుల క్యాన్సర్ చికిత్స గురించి వివరాలు ఉన్నాయి.
డాక్టర్ దీపా మోడీ MD 02802 యుకె, తన యొక్క వన్ డాక్టర్ మెనీ డిసిప్లిన్స్ వ్యాసం ద్వారా ఆమె ఉగాండాలో స్వామిని ఒక యువతిగా కలుసుకొనడం, తర్వాత ఇంగ్లాండ్లో ఎండీగా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అలోపతిలో ఔషధాలు యొక్క లోపాలను తెలుసుకొనడం అలాగే రోగి బాధలను తగ్గించడానికి మార్గాల అన్వేషణలో ప్రత్యామ్నాయ ఔషధం ప్రపంచం వైపు ఎలా ప్రయాణించారు వంటి విషయాలన్నీ విపులంగా వివరించారు. ఆమె శోధన క్రమంగా వైబ్రియానిక్స్ వైపు వారిని నడిపించింది. కాన్ఫరెన్స్ పుస్తకంలో ఆమెవ్యాసంలో తేనెటీగ గాట్లు, గోయిటర్, దీర్ఘకాలికమలబద్ధకం, హార్మోన్ల అసమతుల్యత వలన నీరు చేరుకోవడం, చెవి నొప్పి, మూత్రపిండాల్లో పునరావృత మవుతున్నరాళ్ళు వంటి కేసులు ఉన్నాయి.
కుమారి సరస్వతి కొంజార్ 01228 స్లొవేనియా, సీనియర్ అభ్యాసకురాలైన ఈమె తన డైరీ ఆఫ్ ఏ వైబ్రియానిక్స్ ప్రాక్టీషనర్ అనే శీర్షిక గల ప్రసంగం చేసారు. వైబ్రియానిక్స్ రెమిడీల ద్వారా తనకు స్వస్థత లభించినట్టి అనుభవవము అనంతరం వైబ్రియానిక్స్ ను ప్రజల వద్దకు తీసుకు రావడానికి ఆమె తనను తాను అంకితం చేసుకున్నారు. కొడైకెనాల్, మరియు ఆంధ్రప్రదేశ్ లోని గ్రామాల్లో మరియు స్లొవేనియా లోనూ వైద్య శిబిరాల్లో ఆమె యొక్క అద్భుతమైన చికిత్సా అనుభవాలను వివరించారు. ఆమె సమర్పించిన వాటిలో గుండెపోటువల్ల ఏర్పడిన పక్షవాతము నుండి కోలుకోవడం, నిరాశతో క్రుంగిపోయిన దశ నుండి పునరుజ్జీవనం వంటి అనేక అద్భుతమైన కేసులను ఆమె పంచుకున్నారు. కాన్ఫరెన్సు పుస్తకంలో ఆమె వ్యాసంలో బొబ్బలకు చికిత్స, నిద్రలేమి మరియు దృష్టి లోపం అనే రెండు కేసులకు బ్రాడ్కాస్టింగ్ ద్వారా చికిత్స కూడా ఉన్నాయి.
శ్రీ జూలియస్ టాన్ 02717మలేషియా, వైబ్రియానిక్స్ మరియు త్రిగుణాల పై వీరు ప్రసంగించారు 2007 నుండి వైబ్రో సాధన చేస్తున్న వీరు త్రిగుణాలపై తన జ్ఞానాన్ని తన వైబ్రియానిక్స్ పనిలో విలీనం చేసిన విధానము తన చికిత్సలను రోగుల ప్రత్యేక స్వభావానికి అనుగుణంగా మార్చుకున్న విధానాన్ని వివరించారు. మరుసటి రోజు వీరు వైబ్రియానిక్స్ చికిత్సల ద్వారా తన అనుభవాల నివేదికను జోడించారు. వంధత్వము నకు చికిత్స, వైబ్రియో చికిత్సతో పుట్టిన పిల్లలు ఒక అనూహ్య బహుమతిగా నిరూపించబడ్డాయి.
కుమారి అన్నా చినెలాటో 02554 ఇటలీ, సీనియర్ అభ్యాసకురాలు మరియు శిక్షకురాలు అయిన ఈమె విశ్వాసం పర్వతాలనైనా కదిలిస్తుంది అనే తన ప్రసంగంలో దర్శన సమయంలో స్వామి ఆమెకు వైబ్రియానిక్స్ అధ్యయనం చేయబోతున్నట్లు నాటకీయమైన నిస్సందేహమైన ధ్రువీకరణ ఇచ్చిన కథనాన్ని పంచుకున్నారు. ఆమె అభ్యాసంలో స్ఫూర్తిదాయకమైన కేసులు ఉన్నాయి వీటిలో 14 ఏళ్ల బాలుడు దీర్ఘకాలిక మూర్ఛ వ్యాధి మరియు మనోవైకల్యంతో ఆసుపత్రి పాలైనప్పుడు ప్రేమపూర్వక స్వాంతన మరియు వైబ్రో గోళీలతో అతని ప్రవర్తన పూర్తిగా మారిపోయింది.
మందిరం యొక్క డైనింగ్ హాల్ లో మహారాష్ట్ర ప్రతినిధి బృందం రుచికరమైన భోజనం అందించారు(ఫోటో చూడండి). శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్టు మీడియా కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఎ. అనంత రామన్ ఈ విందులో పరిశీలకుడిగా మరియు అతిథిగా పాల్గొన్నారు.
మూడవ సభా విశేషములు
డాక్టర్ జిత్ కె అగర్వాల్ అభ్యాసకుల కోసం ప్రశ్నోత్తరాల సమావేశాన్ని నిర్వహించడం ద్వారా మధ్యాహ్న కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సోహం ఫౌండేషనుకు చెందిన స్వామి ఆనందను వేదికమీదకు ఆహ్వానించారు. దివంగత స్వామి నారాయణితో స్వామి ఆనంద హోమియోపతి సంకలనాలను కనుగొన్నారు. తర్వాత వాటిని సాయి వైబ్రియానిక్స్ లో చేర్చారు. స్వామినారాయణి డాక్టర్ అగర్వాల్ తో జరిగిన సమావేశంలో మొట్టమొదట ఈ వైద్య విధానానికి వైబ్రియానిక్స్ అనే పేరు పెట్టారు. సోహం స్రవంతిలో పుస్తకాలు ఈరోజు సీనియర్ వైబ్రియానిక్స్ అభ్యాసకులందరికీ ఉపయోగపడుతున్నాయి.
స్వామి ఆనంద ప్రధమ భాషణము
స్వామి ఆనంద తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ తన నుండి అద్భుతాలను ఆశించే ప్రేక్షకులకు నిరాశ కలిగించ బోతున్నానని ఎందుకంటే తను వైద్యుడు కావడములో గల మజిలీలను శ్రోతలకు అందించబోతున్నానని తెలిపారు. తన జీవితంలో స్వామి వెంకటేశానంద, స్వామినారాయణిలు ఎలా ప్రవేశించారో వివరించారు. వివిధ అంశాలపై వరుస ఉపన్యాసములు ఇవ్వడానికి దక్షిణాఫ్రికా సందర్శిస్తున్న స్వామి వెంకటేశానంద ఉపన్యాసాలు వినడానికి ఒక స్నేహితుడు తనని ఆహ్వానించాడు. స్వామి ఆనంద వెళ్లారు కానీ అతని ప్రారంభ వైఖరి అహంభావంతో గర్వం తో కూడి ఉండేది. ఆ జనసందోహంలో ఆ శబ్దాలమధ్య వారు చేస్తున్న పని వీరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ మొదటి అనుభవం తర్వాత స్వామి వెంకటేశానంద స్వరం చాలా మృదువుగా ఉన్నందున ఉపన్యాసాలు అతనికి అర్థం చేసుకోవడం కష్టమైనప్పటికీ ప్రతి తదుపరి ఉపన్యాసానికి హాజరయ్యారు. అప్పుడు మరొక స్నేహితుడు మాతాజీని(స్వామి నారాయణి) చూడటానికి అపాయింట్మెంట్ ఇచ్చారు. స్వామి ఆనంద ప్రతిఘటించినప్పటికీ మాతాజీని కలవడానికి అయిష్టంగానే అంగీకరించారు. ఆమె అతని చిరునవ్వుతో పలుకరించారు. గదిలో మాతాజీ గురువైన స్వామి వెంకటేశానంద చిత్రాన్నిచూసారు. తెల్లవారుఝాము ఒంటిగంట వరకు మాట్లాడుకున్నారు. ఆ సమయానికి అతని జీవితం పూర్తిగా మారిపోయింది!
స్వామి ఆనంద అనంతరం హాజరైన అభ్యాసకులకు హృదయపూర్వక సందేశం ఇచ్చారు. మనము ఎక్కడి నుండి వచ్చామో ఎక్కడికి వెళుతున్నామో మనకు తెలియదు. అయితే ఇక్కడ ఉన్న అభ్యాసకులు కేవలం బాబా వారి పిలుపు మేరకు ఇక్కడికి వచ్చారనీ ఇప్పుడు ఇక్కడ స్వామి సమీప్యాన్ని అనుభవిస్తూ ఉన్నారనీ తెలిపారు. అనేక తిరుగుళ్ళ తరువాత చక్కని రహదారిని కనుగొన్న తర్వాత వీరంతా ఇప్పుడు దానిని అనుసరిస్తున్నారు. జీవితం దాని స్వంత మార్గాన్ని అది ఎన్నుకుంటుంది. మన జీవితాలను పూర్తిగా మనమే నిర్వహించుకోగలుగుతున్నాం అనుకోవడం భ్రమ. మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే మన అహంకారాన్ని దాని మూలం ఎక్కడ ఉందో తెలుసుకొని దాన్ని తొలగించుకోవాలి. భగవంతుడికి శరణాగతి చేయడం నేర్చుకోవాలి. ఈరోజు ఇక్కడ నిలబడతానని నేను ఎప్పుడూ ఊహించలేదు అని స్వామి ఆనంద అన్నారు. 70 సంవత్సరాల వయసులో కర్ర పట్టుకొని నడుస్తూ ఉంటానని ఊహించారు. జరుగుతున్న ప్రతీ ఒక్క విషయానికి తాను కృతజ్ఞతతో ఉంటానని చెపుతూ అభ్యాసకులగా మీకు జరిగిన ఒక గొప్ప విషయానికి మీరు కృతజ్ఞత చూపగలిగితే మీరు మరింత కృతజ్ఞతా పూర్వకంగా మారగలుగుతారు. అప్పుడు మరిన్ని అవకాశాలకు తలుపులు తెరుచుకుంటాయి. స్వామి ఆనంద శరణాగతి ప్రాముఖ్యత గురించి చెపుతూ మీరు శరణాగతి చేయడం ద్వారా భగవంతుడు మీ బాధ్యతలు స్వీకరిస్తాడు, మరియు అసంఖ్యాకమైన విజయాలను అందిస్తాడు. బాబా వారి అనుగ్రహం వలన డాక్టర్ అగ్గర్వాల్ గొప్ప సేవ చేస్తున్నారనీ చెపుతూ అభ్యాసకులను ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని తమకు చాలా విషయాలు తెలియదనే విషయం తెలుసుకోవాలని కోరారు. చివరిగా స్వామి ఆనంద అభ్యాసకులను ప్రేమతో సేవించమని మరియు వారు తమ రోగులకు సహాయం చేస్తున్నామని ఎప్పుడూ భావించవద్దనీ, బదులుగా, అభ్యాసకులు తమ రోగులకు సేవ చేయడానికి భగవంతుడు ఇచ్చిన అవకాశంగా భావించాలని అప్పుడు అది భగవంతుడుకి సమర్పణ అవుతుందని చెప్పారు.
ప్రాక్టీషనర్ల ప్రసంగముల కొనసాగింపు
శ్రీ బైజెక్ స్లావిక్ తనను తాను పరిచయం చేసుకుంటూ తాను మరియు వారి శ్రీమతి అలిజా స్లోవిక్03040 పోలండ్ సీనియర్ అభ్యాసకురాలు వైబ్రియానిక్స్ రెమిడీలతో విజయవంతమైన పిల్లల జననము తరువాత వారు వైబ్రియానిక్స్ కుటుంబముగా ఎలా మారారో వివరించారు. పసివాళ్ళైన ఈ దంపతుల కుమారులు కూడా తమకోసం అంతర్దృష్టితో సరైన రెమిడీల ఎంపిక చేసుకుంటారు. వారు వైబ్రియానిక్స్ ను తమ సమాజంలోకి విస్తరించారు. శ్రీ స్లోవిక్ సూడితో ఉన్న ఆవు మరియు వాచి ఎర్రబడిన దాని పొదుగు వైబ్రో తో ఎలా స్వస్థత పొందాయో ఇంకా అనేక దీర్ఘకాలిక అనారోగ్యములతో ఉన్న కుక్క కు విజయవంతంగా చికిత్స చేయడం గురించి తదితర సంబంధిత ఆసక్తికరమైన కేసులను వీరు పంచుకున్నారు.
ప్రొఫెసర్ సంగీత శ్రీవాత్సవ PhD02859 ఇండియా, ఢిల్లీ కోఆర్డినేటర్ మరియు శిక్షకురాలు వైబ్రియానిక్స్ పై తాను చేసిన ప్రయోగాల గురించి ప్రోత్సాహకరమైన నివేదికలను, మొక్కలతో వైబ్రియానిక్స్ ద్వారా తాను చేసిన ప్రయోగాలను ఎ స్పెక్టాక్యులర్ రెస్పాన్స్ ఆఫ్ ప్లాంట్స్ టు వైబ్రియానిక్స్ (వైబ్రియానిక్స్ కు మొక్కల అద్భుత స్పందన) అనే ప్రసంగము లో వివరించారు. ఒక ప్రయోగం ప్రకారము CC1.2 Plant tonic మరియు మనం చూపించే ప్రేమ ద్వారా మొక్కలు అద్భుతంగా పెరిగాయని తెలిపారు. పరిశోధకులు సర్ జగదీష్ చంద్ర బోస్, గ్రోవర్ క్లీవ్లాండ్ బ్యాక్ స్టెర్, స్టీఫానో మంకుసో మరియు డాక్టర్ కాన్స్టాంటిన్ కోరోత్కోవ్ కనుగొన్న విషయాలపై కూడా ఆమె నివేదించారు. స్వామి చెప్పిన బోధ ‘అందరినీ ప్రేమించు అందరినీ సేవించు’ మొక్కలకు కూడా వర్తిస్తుందని ప్రొఫెసర్ శ్రీవాస్తవ సభ్యులకు గుర్తు చేశారు. ఈ పద్ధతిలో వ్యవసాయ ఉత్పత్తులను కూడా మెరుగుపరిచే అవకాశం ఉందని తెలిపారు.
ప్రొఫెసర్ సుసాన్ వీ PhD 02793 యుఎస్ఎ, సీనియర్ అభ్యాసకులు ఎవరు ఎవరికీ చికిత్స చేస్తున్నారు? (హూ ఈజ్ ట్రీటింగ్ హూం) అనే తన ప్రసంగంలో లోతయిన స్థాయిలో విచారణ చేస్తూ రోగి మరియు అభ్యాసకుడు పాత్రలు పరస్పరం మార్చుకోగలిగేవి అని వివరించారు. ఆమె తన యొక్క వైబ్రో సాధన ప్రకారం ఎముకలు విరగడం, ఆర్థరైటిస్, పక్షవాతం, మానసిక వేధింపు, క్యాన్సర్ చికిత్స, వంటి ఉదాహరణల ద్వారా ఈ అభ్యాసకురాలు వైబ్రియానిక్స్ స్వామి యొక్క బోధనలను ఎట్లా అనుసరిస్తుందో దాని గురించి మాట్లాడారు. మమకారం అనే గాయం, మనం అనుకున్నట్లుగా మనము వేరు కాదు స్వామిలో ఒక భాగమే. ప్రేమ అనేది గాయపడ్డ మనసును బాగు చేస్తుంది. మనము ఈ ప్రేమతోనే మన వద్దకు వచ్చే రోగులలో భగవంతుని చూడవచ్చు. వైబ్రియానిక్స్ మనం అందరిలోనూ భగవంతుని చూసేలా శిక్షణ ఇస్తుంది. స్వామియే నిజమైన వైద్యుడు అనే భావనను కలిగిస్తుంది.
కుమారీ మరీనాకోవాకా02295 గ్రీస్, సీనియర్ అభ్యాసకురాలు మరియు గ్రీక్ కోఆర్డినేటర్ తన తోటి అభ్యాసకులకు ‘డోంట్ టేక్ ఆన్ పేషెంట్స్ స్ట్రెస్’ (రోగి యొక్క ఒత్తిడిని తీసుకోకండి) అనే అంశం మీద ప్రసంగించారు. ఆమె తన యొక్క విలువైన అనుభవాలను పంచుకుంటూ తన రోగుల సమస్యలన్నింటినీ పరిష్కరించగల సామర్ధ్యం గురించి ఆందోళన చెందుతున్నానని అయితే దేవుడే నిజమైన వైద్యుడు అనే జ్ఞానం కలిగే వరకు చికిత్స చేసే వాడు భగవంతుడు అని గ్రహింపు ఏర్పడే వరకూ అహంభావ ఆందోళనను విడువ లేమని వివరించారు 108 cc బాక్స్ వాడకంలో ఆమె కొత్తగా కనుగొన్న అద్భుతమైన నివారణ గురించి వివరించారు. ఒకసారి కోంబోలు కలిసిపోవడం కారణంగా పార్శ్వపు నొప్పి చికిత్సకు CC11.4 Migraines బదులుగా CC13.3 Bladder remedy ఇచ్చారు. స్వామి తప్పును చక్కగా సరిచేసి మందు చక్కగా పని చేసేలా చేసారు.
నాలుగవ సభా విశేషములు
శ్రీమతి పవలం గుణపతి 02799 యుకె, సీనియర్ అభ్యాసకురాలు మరియు శిక్షకురాలు తన యొక్క వైబ్రియానిక్స్ అనుభవాలను ఏ రివర్ ఆఫ్ కంఫాషన్ (ప్రేమ ప్రవాహము) అనేఅంశముపై ప్రసంగించారు. కేవలం రెండున్నర సంవత్సరాల ప్రాక్టీస్తోనే ఆమె 2500 మంది రోగులకు దాదాపు నూరు శాతం విజయవంతమైన చికిత్స అందించడం జరిగింది. ఆమె చాలా చురుకైన టీచర్ అంతేకాక సియెరా లియోన్ మరియు యు.కె. లలో వర్క్ షాప్ లను, చికిత్సా శిబిరాలను నిర్వహిస్తూ ఉంటారు. ఆమె గుండెపోటు, దీర్ఘకాలిక ఆస్తమా, దీర్ఘకాలిక జలుబు, మూత్రాశయ ఇన్ఫెక్షన్, బోన్ కేన్సర్ ఇలాంటి ఎన్నో వ్యాధులకు విజయవంతంగా చికిత్స చేసినట్లు తెలిపారు. అసంఖ్యాకమైన రోగులు ఆమె నుండి ప్రేమామృతమైన చికిత్సా సలహాలు కూడా అందుకున్నారు. ఆమె తన రోగుల యొక్క సమస్యల గురించి మాట్లాడుతూ దాని కోసం తన సమయాన్ని వినియోగిస్తూ రోగ కారణం ఏమిటో కనుగొనడానికి ప్రయత్నిస్తారు. సాధారణంగా బాహ్య లక్షణాలకు ఎక్కువగా మానసిక భావోద్వేగం కారణంగా ఉంటుందని కనుగొన్నారు.
కుమారీ వనితా లోగనాధన్ 02894 యుకె, తన తీవ్రమైన స్తంభింపజేసిన భుజం యొక్క రుగ్మత కోసం శ్రీ కనగ రాజన్ షణ్ముగం 02820 యుకె, ద్వారా వైబ్రియానిక్స్ చికిత్స పొందిన అనుభవాన్ని సభ్యులతో పంచుకున్నారు. గతంలో అల్లోపతీ వైద్యంతో ఆమెకు మెరుగు కాలేదు. ఇటీవలే వైబ్రియానిక్స్ ప్రాక్టీషనరుగా మారిన ఆమె అనుభవాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. మరుసటి రోజు లోకనాథం తన ఇంటిలో లీలలను గురించి ఒక నివేదిక రూపొందించి తన ప్రసంగానికి జోడించారు. వాటిలో ఒకటి ఆమె ఈసమావేశానికి హాజరుకావాలని ఆలోచిస్తున్నప్పుడు తన 108CC బాక్సు, స్వామి ఫోటో మరియు ఆమె సొంత పాస్పోర్ట్ ఫోటో పై విభూతి ఏర్పడింది.
వీడ్కోలు ప్రసంగము: డాక్టర్ మైఖేల్ రాకాఫ్, MD
వీడ్కోలు ప్రసంగము, ప్రత్యామ్నాయ ఔషధము- శరీరానికి,మనసుకు మరియు ఆత్మకు గల సంబంధము అనే అంశము గూర్చి శ్రీ మైఖేల్ రాకాఫ్MD యు.ఎస్.ఎ తెలియ జేసారు. డాక్టర్ రాకాఫ్ తన భార్య సుసాన్ యొక్క వైబ్రియానిక్స్ ప్రాక్టీస్ గురించి మరియు అమెరికాలో మరియు భారతదేశంలో శిశు వైద్య మరియు ఆరోగ్య సంరక్షణ సలహాదారుగా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు తన స్వంత అనుభవాలు మరియు మనస్సు శరీరం సంబంధాల పరిశీలనల గురించి మాట్లాడారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అమెరికా వారు చేస్తున్న మనసు, శరీరము, ఔషధము పరిశోధనా అభివృద్ధి గురించి కూడా ఆయన మాట్లాడారు. అనంతరం స్వామి నుండి నేర్చుకున్న6 అంశాల సంగ్రహణాన్ని ఇలా తెలియజేసారు. మనస్సు మరియు ఆత్మకు చికిత్స చేయండి, రోగికి చికిత్స చేయండి, వ్యాధికి కాదు, రోగిపై ప్రేమను మరియు కరుణను ప్రసరింప జేయండి, మనమందరమూ ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి ప్రసరింపబడే దివ్య ప్రకంపనాలతో చుట్టబడి ఉన్నాము, విశ్వాసం కలిగి ఉండండి- ఏదైనా సాధించవచ్చు, ప్రేమతో నిండి ఉండండి మీ చిరునవ్వు రోగులకు భరోసా ఇస్తుంది.
20 ఏళ్లకు పైగా అవిశ్రాంతమైన అంకితభావంతో భగవాన్ సత్యసాయి బాబా వారికి చేసిన సేవకు, ఉచిత వైబ్రియానిక్స్ వైద్య విధానము అభివృద్ధి చేసి చికిత్సా నివారణల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న రోగులకు సేవలు అందించినందుకు, ప్రతి చోటకూ వెళ్ళి అభ్యాసకులకు శిక్షణ మరియు మద్దతు అందించినందుకు సదస్సు ప్రతినిధులంతా నిలిచి డాక్టర్ మరియు శ్రీమతి అగర్వాల్ గారిని సత్కరించడంతో ఆరోజు కార్యక్రమం ముగిసింది.
స్వామి ఆనంద మరియు కుమారి పాట్ హంట్ ఇద్దరి చేత స్వామికి హారతి ఇవ్వబడడంతో ఆరోజు కాన్ఫరెన్స్ ముగిసింది.
సాయంత్రం 8 గంటలకు నార్త్ ఇండియన్ క్యాంటీన్ వద్ద రుచికరమైన విందు భోజనం ప్రతినిధులకు అతిథులకు అందించబడింది.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
2014, జనవరి 27, సోమవారం
మధ్యాహ్నం వరకు నిర్వహించనున్న ఈ కార్యక్రమం స్వామి వారి పాత మందిరంలో ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషములకు ప్రారంభమైంది డాక్టర్ అగర్వాల్ మునుపటి రోజు కార్యక్రమములను సమీక్షించి అదనపు ప్రశ్న- జవాబు కార్యక్రమం నిర్వహించారు.
స్వామి ఆనంద ద్వితీయ భాషణం
స్వామి ఆనంద తనకు ఈ ప్రాంగణంలో ఉండటం చాలా వినయ పూర్వకమైన అనుభవం అని చెపుతూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. నిన్నటి రోజు వారు శరణాగతి తత్వం గురించి మాట్లాడినట్లు గుర్తుచేసుకున్నారు. ఈనాటి ప్రసంగంలో స్వామి ఆనంద కొన్ని ఉత్తేజకరమైన అనుభవాలను పంచుకోవడం ద్వారా శరణాగతి గురించి వివరించారు:
మాతాజీకి శరణాగతి చేసే సామర్థ్యం ఉంది. ఆమె అన్ని నివారణలను కొనుగోలు చేయడం ద్వారా గొప్ప సేవ చేయగలిగేవారు. ఒకసారి ఆమె దక్షిణాఫ్రికాకు వస్తున్నా స్నేహితుడి ద్వారా లండన్ నుండి కార్డులు మరియు నివారణ లతో ఒక యంత్రాన్ని పొందే అవకాశం వచ్చింది కానీ ఖర్చు 100 పౌండ్లు. అంత డబ్బు ఆమె వద్ద లేదు. మాతాజీ ప్రార్థన గదిలోకి వెళ్లి దేవునికి సమర్పణ భావంతో దీని ద్వారా మీరు ప్రపంచానికి హితము చేయాలనుకుంటే దయచేసి నాకు సహాయం చేయండి అని ప్రార్థించి రోగులను చూడటానికి తిరిగి వెళ్ళింది. ఉదయం 10 గంటలకు స్టాంపులతో అతికించబడిన పెద్ద కవరుతో పోస్ట్ మాన్ వచ్చాడు. లోపల100 పౌండ్ల చెక్కు దానితో పాటు “గెట్ ఆఫ్ మై బ్యాక్ (నా వెనుక తప్పుకో)” అనే వింతైన సూచన ఆమెకు అర్ధం కాకుండా వ్రాసి ఉంది. కొంతకాలం క్రితం ఒక స్నేహితురాలు లండన్ నుండి స్పెయిన్ వెళ్లింది. ఆమె తన హోటల్ లో బాల్కనీలో ఎదురుగా ఉన్న సముద్రాన్ని చూస్తూ కాఫీ తాగుతూ ఉండగా ‘మాతాజీకి 100 పౌండ్లు పంపించు’ అని ఒక గొంతు ఆమెలో వినిపించింది. అదే మాట పునరావృతం అయ్యింది. మూడవసారి ‘ఇప్పుడే పంపు’ అని పెద్ద గొంతుతో వినిపించింది. ఆమె వెంటనే చెక్కు మరియు ఒక ఉత్తరం కూడా వ్రాసి కవరులో పెట్టి స్టాంపులు అంటించి మెయిల్ చేసింది. ఈ మహిళ దక్షిణాఫ్రికా వచ్చి మాతాజీని కలుసుకున్నప్పుడు వారు తమ అనుభవాలను ఒకరికొకరు పంచుకోవడం ద్వారా చెక్కు మరియు ఉత్తరము ఆమెవే అనే విషయం తెలిసింది. స్వామి ఆనంద ఇంకా ఇలా వివరించారు. మనం హృదయపూర్వకంగా శరణాగతి చేస్తే మన ఊహకు అందని శక్తి మనకోసం మనకు తెలియకుండానే పనిచేస్తూ ఉంటుంది. ఐతే అట్టి శరణాగతి కోసం మనం ప్రయత్నిస్తూనే ఉండాలి అట్టి అవగాహనకూడా కలిగి ఉండాలి. మనకు తెలియక పోతే పట్టింపు లేదు కానీ కనీసం మనకు తెలియదు అనే దానిని తెలుసుకోవాలి.
స్వామి ఆనందకు సంబంధించినంతవరకు తదుపరి అనుభవం ఏమిటంటే మాతాజీ క్లినిక్ కు ఒక రోగి డాక్టర్ ద్వారా ప్రాణాంతకమైనదని నిర్ధారణ చేయబడిన గడ్డ తో వచ్చారు. మాతాజీ దానిని తన వేలితో తాకి ఆమెకు కొంత ఔషధము ఇచ్చారు. ఆ మహిళ ఇంటికి వెళ్లి అద్దంలో చూస్తే ఆ మొటిమ పోయింది ఆమె ఏమి చేశారని ఆమె ఆడటానికి మాతాజీని కలవగా తను ఏమీ చేయలేదని తను భగవంతునికి శరణాగతి చేశానని బదులిచ్చారు. ఇది మాతాజీ వ్యక్తిగతమైనది కాదు, ఇది కేవలం ఆ ప్రభువు యొక్క దయ.
స్వామి ఆనంద అభ్యాసకులను ఇలా ఆదేశించారు. మీరు రోగికి నయం చేస్తున్నామని ఎప్పుడూ భావించకూడదు. మనం ఎప్పుడూ నయం చేయలేము. కనీసం (బాబా దయ లేనిదే) ఔషధాన్ని కూడా పంపిణీ చేయలేము. కనుక చికిత్స ఎలా జరుగుతుందో మనకు తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అదంతా బాబా దయ అనే విషయం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని మనం గుర్తుంచుకోవాలిi
స్వామి మరి కొన్ని అనుభవాలను వివరించారు ఒక మహిళ తీవ్రమైన వెన్నునొప్పి కారణంగా ఒక సూపర్ స్పెషలిస్టుకు సూచించబడ్డారు. అయితే ఆమె మాతాజీకి సంబంధించిన క్లినిక్ ద్వారా ఎంతో చక్కగా స్వస్థత పొందారు. ఆమెకి ఏమి మందులు ఇస్తున్నారో తెలుసుకోవడానికి ఆమె డాక్టర్ మాతాజీ ఆశ్రమానికి వచ్చారు. అతను మాతాజీ ఇచ్చిన కాంబినేషన్ అర్థం చేసుకోలేకపోయారు కానీ రోగితో అవే మందులు కొనసాగించమని చెప్పారు. ఎందుకంటే రోగి యొక్క ఎక్సరే రిపోర్టు ప్రకారం శస్త్ర చికిత్స లేకుండా ఆమె ఆ స్థితిలో తిరుగుతూ ఉండటం అసంభవం. అయినప్పటికీ రోగి తిరుగుతూ ఉండడం దేవుని కృపా విశేషం. మరొక సంఘటనను వివరిస్తూ 1987లో ప్రారంభించిన వీరి క్లినిక్ 1992- 93 లో భారీ అప్పుల్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి వారికి చాలా పెద్ద రుణం ఇవ్వడానికి ముందుకు వచ్చారు. అయితే కేవలం రెండు సంవత్సరాల వ్యవధిలో అ మొత్తాన్ని టిరిగి చెల్లించగలగడం భగవంతుని లీల మాత్రమే. కనుక భగవంతుడు మన చింతలన్నిటినీ చూసుకుంటారు అంటూ ఇది తెలుసుకోండి, తెలుసుకోండి, తెలుసుకోండి అని చెప్పారు.
చివరిగా స్వామి ఆనంద హోమియోపతి క్యాంపు చేయడానికి ఒక పర్యటనలో స్వామి వెంకటేషానందను తీసుకెళ్తున్న తన కారులో బ్రేకులు ఎలా విఫలమయ్యాయో ఆ కథను తెలియజేశారు. తమ కారు ఒక ఒక లోయ వైపు కిందికి వెళ్తున్నప్పటికీ డ్రైవింగ్ కొనసాగించమని స్వామి వెంకటేషానంద సూచించారు 52 మైళ్ళ తర్వాత వారు తమ గమ్యస్థానం చేరుకున్నప్పుడు స్వామి ఆనంద బ్రేకులు సక్రమంగా పని చేస్తున్నాయని తెలుసుకొని సంభ్రమంతో కారును ఆపారు. అప్పుడు స్వామి వెంకటేశానంద ‘ఎంతో స్వల్పమైన ప్రేమ ఒక కారునే చక్కదిద్ద గలిగితే, ఆ ప్రేమ మానవ హృదయాన్ని ఎందుకు సరి చెయ్యదు’? అన్నారు. స్వామి ఆనంద కొనసాగిస్తూ మనం ఎప్పటికప్పుడు గుర్తుంచుకోవడానికి ప్రయత్నించాలి. మనం ప్రేమించ గలుగుతూ ఉన్నప్పుడు దేవుడు మన ప్రపంచంలోకి (హృదయంలోనికి) వచ్చి చురుకుగా ఉంటారు. ఇది తెలుసుకోండి, తెలుసుకోండి, తెలుసుకోండి. అలాగే మనం ఏదైనా చెప్పినప్పుడు, మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మనలో ఉన్న ప్రేమ మాట్లాడుతోందా? లేక అహం మాట్లాడుతోందా? ప్రేమతో అయితే ఎంతో అద్భుతాలు జరుగుతాయి అంటూ ముగించారు.
డాక్టర్ అనంత్ గైటోండే ప్రసంగం
డాక్టర్ అనంత్ గైటోండే ఎండోక్రినాలజీ మరియు బ్యాక్టీరియాలజీ రెండింటికీ డాక్టర్ మరియు ప్రొఫెసరుగా తన విలువైన అనుభవం నుండి అల్లోపతీపై సంక్షిప్త అవగాహనలను అందించారు. ఒకటి మరియు ఒకటి రెండుకు సమానము ఇది మనకు పాఠశాలలో నేర్పబడుతుంది, కానీ అలోపతి ప్రాధాన్యత ఇచ్చే ఫార్మకాలజీ ఆధునిక వైద్య విధానం ఒకటి మరియు ఒకటి సున్నాకు సమానం అనే మాయలో ఉన్నట్లు కనిపిస్తోంది -- వ్యాధి ప్లస్ ఔషధం వ్యాధిలేమి అని పేర్కొంటోంది. కానీ వాస్తవానికి వ్యాధులు, వాటిని తొలగించడానికి ఇచ్చే ఔషధాల ద్వారా మరిన్ని రోగాలు ప్రబలుతున్నాయి. క్యాన్సర్ రోగులు వ్యాధి వలన కాకుండా సాంప్రదాయిక క్యాన్సర్ చికిత్స ద్వారా మరణిస్తున్నారు. ఎందుకంటే ఇది వారి రోగ నిరోధక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేసి వారిని ఇతర ప్రాణాంతక వ్యాధులకు గురి చేస్తోంది.
సాయి వైబ్రియానిక్స్ ఆవిర్భవించడం లో స్వామి యొక్క ఆశీర్వాదపూర్వక హస్తాన్ని వివరిస్తూ స్వామి బోధన ప్రకారం మన చేతి 5 వ్రేళ్ళు పంచభూతాలను(భూమి, గాలి, అగ్ని, నీరు, మరియు ఈథర్ లేదా ఆకాశము)ను సూచిస్తాయి. భారతీయ శైలిలో ఆహారాన్ని చేతితో కలుపుకొని తిన్నప్పుడు ఆ పంచభూతల శక్తివంతమైన కంపనాలు ఆహారం ద్వారా లోపలికి ప్రవేశిస్తాయి. స్వామి తన బోధన “అందర్నీ ప్రేమించండి అందరికీ సేవ చేయండి” తో వైబ్రేషన్ లేదా ప్రకంపనలపట్ల వారికున్న లోతైన అవగాహన వివరించారు. ఏసు కూడా “నీ పొరుగు వారిని నీ వలనే ప్రేమించు” అని చెప్పారు. వీరిద్దరూ ప్రేమలో అపరిమితమైన సర్వవ్యాపక శక్తి ఉందనీ అది మీ హృదయంలోనే ఉందనీ బోధించారు. ఈ ప్రేమతో సర్వమూ సానుకూలమవుతుందని బోధించారు.
వివిధ శారీరక అవయవాల మధ్య ప్రేమపూర్వక సంబంధాన్ని అర్థం చేసుకునే చైనీస్ ఔషధం వ్యాధులను గుర్తించడం మరియు చికిత్స చేయడంలో అభ్యాసకులకు సహాయకరంగా ఉంటుందని వారు సూచించారు. డాక్టర్ అనంత్ యొక్క అంతర్దృష్టి వైబ్రియానిక్స్ వైద్య విధానంలో సరికొత్త రంగాల అధ్యయనానికి అవకాశాలను తెరిచింది.
డాక్టర్ సారా పవన్ సందేశము
విశ్రాంత మత్తు డాక్టర్ ఐన డాక్టర్ సారాపవన్ రోజువారీ ఆరోగ్య చిట్కాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆలోచన ప్రేరేపించే చక్కని ప్రసంగం చేశారు. సమగ్ర, సంపూర్ణ, ఆరోగ్య సంరక్షణ కోసం ఆరోగ్యాన్ని పరిరక్షించడంతో పాటు వ్యాధి నిరోధము మరియు నివారణ పై సమానంగా దృష్టి సారించాలని వారు అభిప్రాయపడ్డారు. హోమియోపతి, అల్లోపతి, నేచురోపతి (ప్రకృతి వైద్యం) ఈ అన్నింటిలో “పతి” పశుపతి ఐన మన స్వామియే ఈ అన్ని విభాగాలలో ఉండి నయం చేస్తున్నారని మనం గుర్తించాలని చెప్పారు. స్వామి నుండి అనుజ్ఞ తీసుకొని డాక్టర్ పవన్ శరీరాన్ని ఒక ‘ఆటో మొబైల్’ తో పోలుస్తూ దృష్టాంతాలతో వివరించారు. వారు ఆరోగ్యం HEALTH అనే పదాన్ని విస్తృత పరుస్తూ క్రింది సమర్పణ చేసారు.
H హరి (దేవుడు); అన్నింటికీ మూలము
E ఎక్సర్సైజ్ (అభ్యాసము), ఎఫెక్ట్ (ప్రయత్నం) & డైట్ (ఆహారము మనసుకు మరియు శరీరానికి)
A అవేర్నెస్ (తెలుసుకోవడం) & యాక్సెప్టెన్స్ (అంగీకరించడం)
L లవ్ ఫర్ లైఫ్ (జీవితాన్ని ప్రేమించడం); లెవెల్ హెడెడ్నెస్ (స్థాయీ నేతృత్వము)
T థాట్స్ (ఆలోచనలు); ప్రతికూల ఆలోచనలను విస్మరించండి
H హార్మనీ, హ్యాపీనెస్ & హ్యూమర్ (సామరస్యము, సంతోషము, హాస్యము)
డాక్టర్ పవన్ ఈ సందర్భంలో తన చేతులు పూర్తిగా స్వాధీనము లేక పట్టు తప్పిపోయినప్పుడు స్వామి వారి ద్వారా అద్భుత పునరుద్ధరణ జరిగిన కధను తెలిపారు. సుదీర్ఘమైన మరియు సంతోషకరమైన జీవితానికి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో మానవ విలువలు మరియు సమానత్వం యొక్క పాత్రను తెలుపుతూ , “తేలికగా (ease) జీవించండి, లేకపోతే వ్యాధి (dis-ease) పాలవుతారు” అనే సందేశంతో ముగించారు. కార్యక్రమ ముగింపులో అభ్యాసకులు అందరూ ఉత్సాహంగా లేచి నిలబడి సాయి వైబ్రియానిక్స్ కూ మరియు ప్రపంచవ్యాప్తంగా అవసరమైనవారికి వారు చేసిన కృషికి కృతజ్ఞతలు తెలుపుతూ డాక్టర్ మరియు శ్రీమతి అగర్వాల్ కు దండలు వేసి గౌరవించడం జరిగింది. అనంతరం 108CC బాక్సులను రీఛార్జింగ్ చేసే కార్యక్రమం బాబా వారి అద్భుత లీలతో పూర్తయ్యింది (పైన అవలోకనం చూడండి).
మూడు సార్లు ఓంకారము, సమస్త లోకా సుఖినోభవంతు అని ప్రార్థిస్తూ ఈ అద్భుత కార్యక్రమాన్ని జరిపించినందుకు స్వామికి కృతజ్ఞత పూర్వక వందనములు తెలియజేస్తూ కార్యక్రమం ముగిసింది.
దివ్య వైద్యుని దివ్య వాణి
“ఆత్మవిశ్వాసం పెంపొందించుకొని దేవునిపై దృఢమైన విశ్వాసం కలిగి ఉండండి. అచంచలమైన విశ్వాసంతో మీ తోటి మనిషి సేవకు మిమ్మల్ని మీరు అంకితం చేసుకొని ఆదర్శప్రాయమైన జీవితాలను గడపండి.”
...శ్రీ సత్య సాయి బాబా
“సేవ అంటే ఏమిటి? ప్రజలు సేవ అంటే “మంచి పని” అని చెబుతారు. సేవను “మంచి పని” గా భావించకండి. నేను ఇతరులకు మంచి చేస్తున్నాను అనే వైఖరి కూడా సానుకూలమైనది కాదు. సరైన వైఖరి ఏమిటంటే దీనిని “దేవుని పని” గా చూడటం. మీ చర్యలు అన్నింటిని దేవుని పని గా పరిగణించడంమే నిజమైన సేవ ”.
… శ్రీ సత్య సాయి బాబా అందరినీ ప్రేమించండి అందరికీ సేవ చేయండి, ఎల్లప్పుడు సహాయం చేయండి ఎవరినీ భాధించకండి, 2005 లో, బాబా వారి 80వ జన్మదినోత్సవం సందర్భంగా వారి జ్ఞాపకార్థం ముద్రించిన పుస్తకం నుండి
ప్రకటనలు
నిర్వహింపబోయే శిక్షణా శిబిరాలు
- ఇండియా ఢిల్లీ -NCR: అభ్యాసకులందరికి పునశ్చరణ సదస్సు 2014 మార్చి 23, SVP వర్క్ షాప్ 2014 మార్చి 20-24 మరియు AVP వర్క్ షాప్ 2014 ఏప్రిల్ 12-13 సంప్రదించ వలసినవారు సంగీత వెబ్సైట్ [email protected]
- యు.కె. లండన్ : AVP వర్క్ షాప్ 22-23 మార్చి 14, సంప్రదించ వలసినవారు జెరమ్ వెబ్సైట్ [email protected]
- ఇండియా పుట్టపర్తి : AVP & SVP శిక్షణ సదస్సులు 18-22 ఏప్రిల్ 14, సంప్రదించ వలసిన వారు హేమ వెబ్సైట్ [email protected]
శిక్షకులందరికి సూచన : మీరు ఏదైనా శిక్షణా సదస్సుకు ప్రణాళిక సిద్దం చేసుకుంటే వివరాలు: [email protected] కు పంపండి
In addition
Sai Vibrionics was blessed to have an article with pictures about the Conference released by Radio Sai on January 27, 2014 www.radiosai.org. If you like the article, write on their website and let Radio Sai know. Tell your Patients, Family and Friends to write too.
For practitioners, friends and patients on Facebook, Radio Sai also released the article. Be sure to ‘Friend’ Radio Sai then go down to the January 27 article and “Like” the article.