Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

Vol 5 సంచిక 2
March/April 2014
ముద్రింప తగిన వార్తాలేఖ


పూర్తి వార్తాలేఖ యొక్క కాగితం ప్రతి కావలెనన్నఈ పుటను ముద్రించండి

డా.జిత్. కే అగ్గర్వాల్ యొక్క మాటల్లో

ప్రియమైన అభ్యాసకులారా,

మీతో పంచుకొనదగిన విషయములు నావద్ద ఈసారి అధికముగా వున్నవి.

సమావేశమునకు కృతజ్ణతలు

మొట్టమొదటి అంతర్జాతీయ సాయి విబ్రియోనిక్స్ సమావేశంగురించి వ్రాసిన మా గతవార్తాలేఖపై వచ్చిన, మీ ప్రతిస్పందనలతో నామనస్సు ఎంతో అద్బుతమైన ఆనందంతో నిండిపోయిందని మీకు తెలియచేస్తున్నాను. చాలామంది అభ్యాసకులు, ఈ సమావేశం ఘనవిజయాన్ని సాధించినట్లు, తమ అభిప్రాయమని వ్రాసినారు. మీలో కొందరు ఈ సమావేశం, సాయి విబ్రియోనిక్స్ గురించి తమ జ్ఞానాన్ని పురోభివృద్ధి చేసి, తోటి అభ్యాసకులతో తమ ఆలోచనలు, అనుభవాలను పంచుకునే అవకాశాన్ని యిచ్చిందని వ్యాఖ్యానించేరు. కొందరు ఈ సమావేశం విబ్రియోనిక్స్ సేవకి సమర్పితభావంతో పనిచేసేందుకు స్ఫూర్తినిచ్చినట్లుగా చెప్పారు. హాజరైనవారు తాము ఆశించినదాన్నిమించి పొందినట్లు, ఆనందించినట్లు తెలియజేస్తూ, తరువాత సమావేశం గురించిన వివరాలు అప్పుడే అడుగుతున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను.

ఇదంతా శ్రీ సాయిబాబావారి కృపవల్లనే సాధ్యమైనది

మీలో చాలామంది ఈవిధంగా చేయడానికి చాలా ముఖ్యమైన మార్గాల్లో సహాయపడ్డారు, కానీ నేను ఈ వ్యక్తులకు / సమూహాలకు కృతజ్ఞతలు ప్రత్యేకంగా చెప్పాలనుకుంటున్నాను:

  • పాల్గొన్నవారందరూ;
  • మా సంపుటములకు వ్యాసాలు, ప్రసంగాలు మరియు కేసు చరిత్రలను అందించినవారందరికీ; వాటినన్నిటిని జాగ్రత్తగా సమీక్షించి, అవసరమైన సవరింపులను చేసిన ముఖ్యబృందమునకు;
  • ఈ సమావేశము జరిగిన సమయంలో వేళప్రకారం, అన్నివేళల్లో భోజనాలు, యితర ఫలహారములను సమకూర్చిన మహారాష్ట్రకు చెందిన బృందమునకు,  మరియు యీ సమావేశమునకు చక్కని గుర్తింపు చిహ్నాలను అందించిన ఒక అభ్యాసకునికి;
  • నమోదు ఫోల్డర్లను మరియు సమావేశపు పతాకాలను అందించిన కేరళ బృందమునకు;
  • ప్రతినిధులకోసం వసతి యేర్పాట్ల నిర్వహణ, మరియు ఆదాయవ్యయముల పట్టిక సంపుటముల పంపిణీ మరియు ఇతర విషయముల నిర్వహించడానికి పూర్తి బాధ్యతను తీసుకున్న యునైటెడ్ కింగ్ డం బృందానికి;
  • పాత దేవాలయమును, తమ అందమైన అలంకరణలతో మా సమావేశపు వేదికగా మలచిన ఇటాలియన్ బృందానికి;
  • స్థలముయొక్క రిజిస్ట్రేషన్ నిర్వహించి, గుర్తుచిహ్నాలను జారీ చేసిన అమెరికా, యుకె, భారతదేశముల నుండి మిశ్రమ బృందానికి;
  • సమావేశములోని అన్ని ఆడియో / దృశ్యమాన అవసరాల బాధ్యతయేగాక, విబ్రియోనిక్స్ వీడియో (క్రింద చూడండి) ను తయారుచేసిన పోలిష్ యాజమాన్యునికి;
  • ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి ఘనంగా నిర్వహించిన, ‘చైతన్యజ్యోతి’ మ్యూజియం ముఖ్యనాయకునికి;
  • పలువురు ప్రతినిధులు తమ ఇళ్ళలో ప్రేమతో తయారుచేసిన ప్రసాదమును అందరికీ అందజేసిన గ్రీకు అభ్యాసకునికి;

పైన వుదహరించినవారు మాత్రమే కాకుండా అమెరికాలోని డాక్టర్ మైఖేల్ రాకోఫ్ యొక్క నాయకత్వంలో, సమావేశానికి ముందు 3రోజులలో, అన్నిఏర్పాట్లుచేసి, ఆ ఏర్పాట్లను శ్రద్ధగా పర్యవేక్షించేందుకు చాలా కష్టపడిన మిగిలిన వ్యక్తులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొత్తం దాదాపు 45 వాలంటీర్లు సహాయపడ్డారు. మీ సహాయాలకు మేము సర్వదా కృతజ్ణులము.

సాయి విబ్రియోనిక్స్ క్రొత్త యూట్యూబ్ ఛానల్

ఇప్పుడు కొత్త పురోభివృద్ధి వైపు పయనిస్తూ, విబ్రియోనిక్స్ ఆధికారికంగా యూట్యూబ్.కామ్ (youtube.com)లో మన స్వంత ఛానల్ ‘సాయి విబ్రియోనిక్స్ హీలింగ్’ ఆరంభించబడినదని తెలుపుటకు నేను సంతోషిస్తున్నాను. మీరు దానిని యిక్కడ క్లిక్ చేసి చూడగలరు-https://www.youtube.com/channel/UCdmKv4O1lLswMEe7TfTVvJQ.

రెండు విబ్రియోనిక్స్ వీడియోలు పెట్టబడినవి, సమావేశంలో చూపబడినవి. మొదటిదివిబ్రియోనిక్స్, సాయిరామ్ హీలింగ్ వైబ్రేషన్స్(https://www.youtube.com/watch?v=roXS0_WcU28), ప్రశ్నలు-జవాబులు, ‘విబ్రియోనిక్స్ అనగానేమి?’. రెండవది ‘బ్లెస్సింగ్ ఆఫ్ విబ్రియోనిక్స్ Blessing of Vibrionics(https://www.youtube.com/ watch?v=fB8DDtQiOoo),

2008-2010 సం. గురుపూర్ణిమ సందర్భంలో  సాయి బాబా వారి ఆశీర్వాదములతో మొదలైన  విబ్రియోనిక్స్ యొక్క ఒక స్లయిడ్ షో.

మీరు విబ్రియోనిక్స్, సాయిరామ్ హీలింగ్ వైబ్రేషన్స్వీడియో మా వెబ్ సైట్(http://www.vibrionics.org) లోని హోమ్ పేజ్ లో లింక్స్ ద్వారా “What is Sai Vibrionics” పేజ్ లో చూడగలరు.

వీడియోలు ఇంగ్లీష్ లో ఉన్నవి. అవి వివిధ భాషలలోకి అనువదించబడ్డాయి. మా (YouTube) యూట్యూబ్ఛానెల్ మరియు మా వెబ్ సైట్ లో, అందుబాటులోకి వచ్చినప్పుడు పోస్ట్ చేయబడతాయి. పోలిష్ బాషలో ఇప్పటికే లోడ్ చేయబడింది.

విబ్రియోనిక్స్ విస్తరణకు కేరళ యొక్క అసాధారణ ప్రణాళిక

నేను కేరళలో ఒక ముఖ్యమైన అభివృద్ధిని పంచుకొనుటకు ఆనందిస్తున్నాను.

కేరళరాష్ట్ర సమన్వయకర్త, మార్చి12న త్రిస్సూర్, మార్చి23న ఎర్నాకులం వద్ద అవగాహన కార్యక్రమాలను నిర్వహించిరి. (ఫోటోలు చూడండి). విబ్రియోనిక్స్ విస్తరణకై, 2 జిల్లాలలోనూ కమిటీలు నిర్వహించిరి. ప్రజలలో విబ్రోగూర్చి అవగాహన కల్పించడం, చికిత్సా శిబిరాలు నిర్వహించడం, అర్హులైనవారిని గుర్తించి, తగిన శిక్షణనిచ్చి అభ్యాసకులను తయారుచేయటంవంటి కార్యక్రమాలకు సహాయపడడమే వారిధ్యేయం. ఈకమిటీలలో సాధారణ ప్రజానీకం, మరియు విబ్రో చికిత్సవల్ల లబ్ధి పొందిన శ్రేయోభిలాషులు వుంటారు. కేరళ ఇప్పుడు ఇతర జిల్లాలకు ఈ ప్రయత్నాన్ని విస్తరింపచేయాలని యోచిస్తోంది.            దీని ప్రకారం, జిల్లా సమన్వయకర్తలు మరియు తదితర అభ్యాసకులు తమ ప్రాంతాలలో ఈ కార్యక్రమాలు నిర్వహించేందుకు దృఢంగా సంకల్పించినారు. అవగాహన కార్యక్రమం మరియు సహాయక కమిటీల కార్యక్రమాల ద్వారా, కనీసం 90 కొత్త విబ్రో అభ్యాసకులకు శిక్షణనిచ్చి, నవంబర్ 23, 2015 న భగవాన్ యొక్క 90 వ జన్మదినానికి ముందే, ప్రస్తుత సంఖ్యకు కనీసం రెట్టింపు రోగులకు చికిత్సలను అందించాలని, విబ్రియోనిక్స్ సేవకు అంకితభావంతో పనిచేస్తున్న కేరళ వారు ప్రశంసనీయులు.

శ్రీ సాయికి ప్రేమపూర్వక సేవలో,

జిత్ అగర్వాల్.

 

మధుమేహం, అధికరక్తపోటు & మానసికంగా నిరాశ 10001...India

మే 2008 లో, ప్రాక్టీషనర్ యొక్క దూరపు బంధువైన, 52 సం.ల. ఒక స్త్రీ రోగి, మధుమేహం మరియు అధిక రక్తపోటుకోసం చికిత్స కోరింది. ఆమెకు 10 ఏళ్ల క్రితమే మధుమేహం వున్నట్లు కనుగొనిరి. ఆమె ఇప్పుడు ఇన్సులిన్ మీద ఆధారపడుతోంది. ఆమె ప్రతి రోజు, రెండు పూటలా భోజనం ముందు 15 యూనిట్లు ఇన్సులిన్ తీసుకుంటున్నది. దీనివల్ల ఆమె (రాండమ్) రక్తoలోచక్కెర 150 లో వున్నది. అంతేకాక, ఆమె 3 సం.లుగా అధిక రక్తపోటు కోసం అలోపతిమందు, బలహీనతకోసం మరొక మందు తీసుకుంటున్నది. రోగి చాలా నిరాశతో (ఆందోళనగా, బద్దకంగా, ఆత్మవిశ్వాసం కోల్పోయి) వున్నను, కొన్నినెలలుగా ఈ లక్షణాలకోసం చికిత్స తీసుకోలేదు. ఆమెకు క్రింది నివారణలు ఇవ్వబడ్డాయి:

#1.CC6.3 Diabetes…OD half an hour after lunch

#2. CC3.3 High Blood Pressure + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic ...TDS

వైబ్రియోనిక్స్ తో, రోగి మధుమేహంలో స్థిరమైన మెరుగుదల కలిగింది. ఆమె సగటున ప్రతి 15 రోజులకు 2 యూనిట్లు చొప్పున ఇన్సులిన్ మోతాదు తగ్గించగలిగింది. ఒక సంవత్సరం తర్వాత, ఆమె డాక్టర్ ఇన్సులిన్ ను నిలిపివేసి, నోటితో తీసుకొనే మందులను వాడమని సూచించారు. వీటితో కూడా ఆమె రక్తపు చక్కెర శాతం సాధారణ స్తాయిలోనే ఉండసాగింది.

అలాగే విబ్రియోనిక్స్ వాడిన నెల తర్వాత, ఆమె రక్తపోటు సాధారణ స్తాయికి చేరుకొన్నది, కనుక డాక్టర్ క్రమంగా ఆమె మందులను తగ్గించసాగేరు, ఆమెలో నిరాశ, నిస్పృహ తగ్గినట్లు, ఆమె నివేదించింది. ఆమె బలంగా, నూతనోత్సాహంతో తయారైంది. అయినప్పటికి విబ్రియోనిక్స్ ప్రారంభించిన కొన్నాళ్లలోనే, ఆమెకు వెన్ను నొప్పి మొదలైంది. చాలాకాలం క్రితం ఆమె వెన్ను నొప్పితో బాధపడ్డది. మళ్ళీ యిప్పుడీ చికిత్స సమయంలో తిరిగి వచ్చింది. ఆమెకు క్రింది పరిహారం ఇచ్చిరి:

#3. CC20.1 SMJ tonic + CC20.2 SMJ pain + CC20.5 Spine...TDS

రోగి ఒకనెల తర్వాత వెన్ను నొప్పి పూర్తిగా తగ్గినట్లు చెప్పుటచే,  మోతాదు BD కి తగ్గించబడింది. ఒక సం.రం తరువాత, రోగి కింది పరిహారములను తీసుకుంటున్నది:

 #1. పైన చెప్పిన ప్రకారం మరియు,

 #4. CC3.3 High Blood Pressure + 12.1 Adult tonic...TDS

ఆమె మందులు ఆపేముందు, 2వ సంవత్సరం చికిత్స తీసుకున్నది. మొత్తం మీద, ఆమె మధుమేహం కోసం తీసుకునే అలోపతి మందులను 80% తగ్గించి, ఆమె రక్తపోటుమందులను నిలిపివేసింది. ఆమె మానసిక నిరాశ, వెన్నునొప్పి పూర్తిగా తగ్గినవి. ఆమె డాక్టర్, రోగి ఆరోగ్యమునకు కేవలం విబ్రియోనిక్స్ మందులు మాత్రమే కారణమని అంగీకరించిరి.

 

చేతులమీద కాలిన గాయాలు 11520...India

డిసెంబరు 2013 లో 53 ఏళ్ల వ్యక్తి రెండుచేతుల్లో కరిగిన ప్లాస్టిక్ కర్ర వలన, కలిగిన రెండో డిగ్రీ కాలిన గాయాలతో అభ్యాసకుని వద్దకు వచ్చేడు. అతనికి చాలా నొప్పిగా వున్నది. అరచేతులు ఎర్రగా, బొబ్బలెక్కి ఉన్నవి. వాపు వలన అతను అరచేతులను, వేళ్ళను కదల్చలేక, తన రోజువారీ పనిని చేసుకోలేక,  తన దుస్తులను మార్చుకోలేక బాధపడుతున్నాడు. రోగి చాలా పేదవాడు కనుక అల్లోపతి చికిత్స పొందలేడు. చన్నీళ్ళలో తనచేతులు ఉంచడం మాత్రమే అతనికి సాధ్యమైన పరిహారం. అతనికి క్రింది రెమెడీ ఇవ్వబడింది:

CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC14.1 Male tonic + CC15.1 Mental & Emotional tonic + CC18.5 Neuralgia + CC20.1 SMJ tonic + CC21.1 Skin tonic + CC21.4 Stings & Bites + CC21.11 Wounds & Abrasions…6TD

8రోజుల్లో రోగిలక్షణాలు 50% వరకు మెరుగైనవి. అరచేతుల వాపు పోయింది. అతను నొప్పితగ్గి, నెమ్మదిగా తనవేళ్లు కదలిస్తున్నాడు. అప్పుడు మోతాదు 6TDనుండి TDS వరకు తగ్గించిరి. 7రోజుల తర్వాత 100% మెరుగైంది. అరచేతులపై చర్మం మునుపటి వలె ఆరోగ్యంగా తయారైపోయింది. రోగి తన దైనందిన కార్యక్రమాలను, పనులను తిరిగి ప్రారంభించాడు. కాలిన గాయాలన్నీ మొత్తం 15 రోజుల్లో పూర్తిగా నయం చేయబడ్డాయి.

పిరుదులమీద కురుపులు 11210...India

ఒక 50ఏళ్ల వ్యక్తి తన పిరుదులపై వచ్చిన కురుపులవల్ల, తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నాడు. కురుపులు ఒక్కొక్కటిగా వస్తూ, వాచి, చీముపట్టి, చితికిపోతున్నవి. కాని కొత్తవి వస్తూనే వున్నవి. కొన్ని శస్త్రచికిత్స ద్వారా 2సార్లు తొలగించిరి. రోగికి మొదటగా క్రింది రెమెడీ ఇవ్వబడింది:

#1.  CC12.1 Adult tonic + CC21.2 Skin infections...TDS

1వ నెలలో 20% మెరుగైంది. కురుపుల సంఖ్య తగ్గింది, కాని మిగిలినవి తీవ్రంగా సలుపుతున్నవి. ఈ కాంబో మార్చబడింది:

#2 CC15.1 Mental & Emotional tonic + CC21.1 Skin tonic + CC21.11 Wounds & Abrasions.

2 నెలల్లో 50% మెరుగుదల ఉంది. పైన చెప్పిన పరిహారం, 6 నెలలకు అనగా క్రమంగా రోగి కురుపులన్నీ పూర్తిగా తగ్గి, కూర్చొని సుఖంగా పని చేసుకోగలిగేవరకు ఇవ్వబడింది. అప్పుడు మోతాదు ODకు తగ్గించబడింది. తరువాత మరల కురుపులు తిరిగిరాకుండా నివారించడానికి, మోతాదు 2TWకు మరింత తగ్గించబడింది.

సంపాదకుని వ్యాఖ్యానం:
కురుపులు శరీరంలో చేరిన విషపరిస్థితికి సంకేతం, అందువల్ల CC17.2 శుభ్రపరచుటకు యిచ్చి, అట్లే రోగి తీసుకొను ఆహారం సక్రమంగా వుండేలా చూచుట, మరియు రోగి చుట్టూవుండే వాతావరణంలో వుండే విషవాయువు అతను శ్వాసతో పీల్చటం వంటి కారణాలు కూడా ఉన్నాయా లేవా అని గమనించి జాగ్రత్త తీసుకోవాలి.

 

ఎడమకన్నురెప్పమీద చిన్నగడ్డ 10604...India

ఒక 28 ఏళ్ల స్త్రీ, తన ఎడమ కనురెప్పపై వచ్చిన చిన్నగడ్డ చికిత్సకై వచ్చింది. ఆమె డాక్టర్ ఆ గడ్డ తీయటానికి, ఒక వారంలో శస్త్రచికిత్స చేయాలని సూచించారు. ఆమెకు క్రింది రెమెడీ ఇవ్వబడింది:

CC2.3 Tumours & Growths + CC10.1 Emergencies + CC15.1 Mental & Emotional tonic...QDS

ఒక వారంలో, గడ్డ మెత్తబడుటచే, శస్త్రచికిత్స మరొక వారానికి వాయిదా వేయబడి, వైబ్రియోనిక్స్ చికిత్స కొనసాగింది. ఒక వారం తర్వాత, గడ్డ అదృశ్యమయ్యింది.

క్లిష్టమైనగర్భధారణ 11476...India

అక్టోబర్ 2012 లో 33 ఏళ్ల స్త్రీ అభ్యాసకుని వద్దకు చికిత్సకై వచ్చినది. ఆమె బిడ్డకోసం గత 7–8 ఏళ్లుగా ఆలోపతి చికిత్స పొందుతున్నను ఫలితం కలగలేదు. ఆమె తన హైపోథైరాయిడిజం (Hypothyroidism) కోసం (Thyronam25μg OD) అల్లోపతిమందు 2008 సం. నుండి మరియు మధుమేహం కొరకు 2005 సం. నుండి(CentapinXR tablet OD) తీసుకుంటోంది. ఆమెకు క్రింది రెమెడీ ఇవ్వబడింది:

#1. CC6.2 Hypothyroid + CC6.3 Diabetes + CC8.1 Female tonic + CC8.4 Ovaries & Uterus...TDS

పై పరిహారం తీసుకున్న 10 రోజులలో ఆమె గర్భవతి అయ్యింది. ఆమె తన మధుమేహం, థైరాయిడ్ కారణంగా, ఆమె శిశువు యొక్క భద్రత గురించి ఆందోళన చెందుతున్నది, కనుక అభ్యాసకుడు తన పరిహారంను క్రింది విధంగా మార్చాడు:

#2.  CC6.2 Hypothyroid + CC6.3 Diabetes + CC8.2 Pregnancy tonic + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic...TDS

రోగి యొక్క ఆందోళనవల్ల, అభ్యాసకులు ఆమె గర్భవతిగా వున్నన్నాళ్లు, ఆమెను పర్యవేక్షిస్తూనే వున్నారు. ఈ సమయంలో రోగి జాగ్రత్తగా తన చక్కెర మరియు థైరాయిడ్ స్థాయిలు పరిశీలించిరి. గర్భం దాల్చిన 5వనెలనుండి, రోగి మధుమేహం కోసం ఇన్సులిన్ పంపు నుండి ఇన్సులిన్ ఇంజక్షన్లు తీసుకుంటూ, తన హైపోథైరాయిడ్ మందులను 50μg ODకు పెంచిరి. రోగి గర్భవతిగా వున్నన్నాళ్లే కాక, ప్రసవమైన నెలవరకు కూడా తన విబ్రియోనిక్స్ చికిత్సను కొనసాగించిరి.

2012 జూలై 17 న, ఆమెకు 2.4 కేజీ ల బరువుతో ఆరోగ్యమైన కుమార్తె,  సి-సెక్షన్ ఆపరేషన్ చేయగా కలిగింది. తల్లిపాలే బిడ్డ త్రాగినది. బిడ్డ పుట్టిన తరువాత, ఆమె మధుమేహం పూర్తిగా తగ్గింది మరియు ఆమె థైరాయిడ్ స్థాయి, తైరోనార్మ్ 25 μg వద్ద మునుపటి వలె సాదారణ స్తాయిలో ఉండసాగింది.

 

నొప్పిలేని మెత్తటి కణితి 11278...India

జనవరి 23, 2013 న, 62 ఏళ్ల పురుషుడు, వీపుమీద కుడిభుజంక్రింద గల నొప్పిలేని మెత్తటి కణితి (1 cm x 1 cm) చికిత్సకై వచ్చిరి. అతనికి 10 సం.లుగా ఈ కణితి వున్నను, డాక్టర్ శస్త్రచికిత్సద్వారా కణితి తొలగించినా, మరలా రావచ్చని చెప్పుటచేత, కణితి నొప్పిలేనందువలన, రోగి శస్త్రచికిత్స చేయించుకోలేదు. అతనికి క్రింది పరిహారం ఇవ్వబడింది:
#1. CC2.3 Tumours & Growths + CC12.1 Adult tonic…TDS

2 వారాలలో (ఫిబ్రవరి 2), కణితి ఎర్రగామారి, మృదువుగా వున్నను, కాస్తా నొప్పి వేయడం ప్రారంభించింది. మార్చి 21 న, నొక్కుతున్నప్పుడు, దుర్గంధంతో, తెల్లనిపదార్థం బయటకు రాసాగినది. ఏప్రిల్ 9 నాటికి, దాదాపు 60% ద్రవం బయటపడి, కణితి మీద చర్మం నల్లగా మారిపోయింది. అప్పుడు పరిహారం మార్చబడింది:
#2. CC2.3 Tumours & Growths + CC12.1 Adult tonic + CC21.2 Skin infections…TDS

జూన్ 18 నాటికి, కణితి నున్నగా అయినది; చర్మం యింకా నల్లగానే ఉంది. జూలై 24 నాటికి, కణితి దాదాపు పోయింది. మోతాదు OD గా తగ్గించి, నెల తర్వాత నిలిపివేయబడింది. ప్రస్తుతం కణితి పోయింది; చర్మంపై నల్లమచ్చ గుర్తుగా మిగిలింది.

పంటలకు చికిత్స: కందిచేను, బత్తాయి, ప్రత్తితోటలు 11279...India

అభ్యాసకుడు ఇలా వ్రాస్తున్నారు:జూన్ 2012 లో, నా మొదటి ప్రయోగం మా భజన మండలిలో, హర్మోనియం మాస్టారునాటిన 100 చదరపు అడుగుల కందిచేనుపైన (లక్ష్మీ నివారణగింజ) జరిగినది. ఈ చేనులో, పుష్పించే కందిమొక్కలను పురుగులు తింటున్నట్లు నేను గమనించేను. నేను ఇటీవల విబ్రియోనిక్స్లో కోర్సు చేశానని, పురుగుల నివారణలు ఉన్నాయని చెప్పాను. స్థానిక ప్రజలు ఇప్పటికే మనుషులపట్ల విజయవంతమైన వైబ్రియోనిక్స్ వైద్యం శక్తిని చూస్తున్నారు కానీ మొక్కలు కోసం అన్నది కొత్తవిషయం. హర్మోనియం మాస్టారు తన కందిచేనుపై విబ్రోని ప్రయత్నించటానికి నన్ను అనుమతించారు. దీని ప్రకారం నేను సిద్ధపడ్డాను:

CC1.2 Plant tonic + CC21.7 Fungus, లీటర్ నీటిలో ఈ మందు 4చుక్కలు కలపాలి.

పైవిధంగా కలిపిన నీటిని, ఒక ప్లాస్టిక్ బాల్చీలో 15 లీటర్ల నీటితో కలిపి, 15 ఆగష్టున,నేను స్వయంగా సాయి రామ్, సాయి రామ్ అని జపిస్తూ, ప్లాస్టిక్ చేతి పంపుతో విబ్రోనీటిని పిచికారీ చేసితిని. ఆ రాత్రితోనే పురుగులు పోయినవి. తరువాత, మేము చీమలు కూడా ఈ మొక్కల పైకి పోవటంలేదని కనుగొన్నాము. అత్యధికమైన పంట పండినది.

నా 2వ ప్రయోగం నా స్వంత 2ఎకరాల, 550 బత్తాయి చెట్లుగల తోటమీద చేసితిని. ఇది 4 వ సం.రం (2011) నా తోట మీది ఫలసాయం. నెలకొకసారి చొప్పున(జూన్ 11, జూలై 11, ఆగస్టు 11) మొక్కలు పుష్పించిన కాలంలో మూడు సార్లు మొక్కలు పైన అదే మిశ్రమాన్ని బాగా పిచికారీ చేసితిని. బాగా ఖరీదగుటవల్ల, నేను యితర పురుగుమందులను ఉపయోగించలేదు. ఆ ఏడు, నాకు రూ. 3.5 లక్షలు బత్తాయిలపై వచ్చింది. తదుపరి 2012 లో కూడా నేను నెల వ్యవధిలో, పుష్పించే సీజన్లో 3సార్లు పైన చెప్పిన అదేమిశ్రమాన్ని పిచికారీ చేసితిని. బత్తాయిలపై రూ. 3 లక్షలు వచ్చింది. గత సంవత్సరం (2013) లో  నేను బత్తాయిలను రూ. 3.75 లక్షలకు అమ్మితిని.

నేను చెప్పబోయే విషయం యేమిటంటే, మందు జల్లుతున్నప్పుడు (పిచికారీచేస్తున్నప్పుడు) నేను మాట్లాడకుండా,‘సాయిరాం, సాయిరాం”అని నిశ్శబ్దంగా ప్రార్థించాను. నేను విబ్రో ప్రయోగం విజయవంతమగుటకు ఇదే చాలా ముఖ్యంగా భావిస్తున్నాను.

పైన చెప్పిన కాంబో పరిహారం ఉపయోగించిన 3వ కేసుతో ముగిస్తాను. నేను 2012 లో 1ఎకరంలో,26 క్వింటాల్ (1 క్వింటాల్=100 కేజీ) బ్రహ్మపత్తి మొక్కలను పెంచేను. జూన్ 1-2 న నేను పత్తిగింజలను నాటి, పైని చెప్పిన కాంబో పరిహారం వారానికొకసారి చొప్పున జల్లుచు, జూలైలో 5 సార్లు పిచికారీ చేసేను. కేవలం విబ్రో మందు తప్ప, ఏ యితర పురుగుమందులు ఉపయోగించలేదు. నా పరిసరాల పొలాలలో ఒక ఎకరానికి 5-6 క్వింటాల్ మాత్రమే ఉత్పత్తి అయ్యింది. అందువల్ల నా పొరుగువ్యక్తి తన పొలాలలో విబ్రోని పిచికారీ చేయమని అడిగాడు. నేను వెంటనే అంగీకరించాను మరియు అతని పంట కూడా బాగా దిగుబడి పెరిగింది.

అభ్యాసకుని సంక్షిప్త పరిచయం

నా పేరు నాందేవ్ రౌత్. నా స్వగ్రామం మహారాష్ట్రలోని నాగపూర్ నుండి దాదాపు 50 కి. మీ దూరంలోనున్న ఒక చిన్నగ్రామం ధవళపూర్. నేను 1954 లో పశువులశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ చేసాను, కొంతకాలం ప్రభుత్వ పనిని నిర్వహించి, విడిచిపెట్టి, నేను గ్రామంలోనే వుండి, మా సొంతవ్యవసాయాన్ని అభివృద్ధిచేయాలనే నాతండ్రి ప్రగాఢ కోరికపై, నేను రైతు అయ్యాను. మహారాష్ట్రలోని విదర్భప్రాంతంలో రైతుల దుస్థితి గూర్చి మీకు తెలుసు. ఇది జాలిగొలిపే విధంగా ఉంటుంది. తమ రుణాలను చెల్లించలేని కారణంగా అనేకమంది ఆత్మహత్య చేసుకున్నారు. విద్యావంతుడగుటచే, నేను శాస్త్రీయ వ్యవసాయం వైపు మొగ్గుచూపాను కాని పురుగుమందులు, శిలీంధ్రాలు, ఎరువులు ఉపయోగించుట చాలా ఖరీదైన పద్దతి. ఇంతవరకు పంట పూర్తిగా ప్రకృతిపై ఆధారపడింది.

2009 లో, నాగపూర్ లోని సత్యసాయి మెడికేర్ ప్రాజెక్ట్ వారు, మా గ్రామంలో వారి ఉచిత మెడికేర్ కార్యక్రమాన్ని ప్రారంభించిరి. అల్లోపతి, విబ్రోమందులు రెండూ ఉచితంగా ఇవ్వబడ్డాయి. మాకు అలోపతి మందుల ప్రయోజనాలు తెలుసు కానీ ఈ కొత్త విబ్రియోనిక్స్, ముఖ్యంగా వుబ్బసం, కీళ్ళనొప్పులు, చర్మవ్యాధులతో బాధపడుతున్న రోగులకు అద్భుతమైన చికిత్స చేస్తున్నది.

ఆంబులెన్స్తో వచ్చిన విబ్రో వైద్యులు ఈ విబ్రోనివారణలు మొక్కలపై, జంతువులపై కూడా ఉపయోగించవచ్చని నాకు చెప్పారు. స్థానిక కోఆర్డినేటర్ ప్రోత్సాహం, మద్దతుతో నేను నాగపూర్ లో, డాక్టర్ నాంద్, శ్రీమతికమలేష్ అగర్వాల్ వద్ద విబ్రియోనిక్స్ శిక్షణ కోర్సు చేసేను. నా నెలవారీ విబ్రోనివేదికలలో, మొక్కలకు, పంటపొలాలకు విబ్రోనిక్స్ మందులు వాడిన కేసులు వున్నవి. నేను ప్రతినెల 4-5 జంతువులకు చికిత్స చేస్తాను. [ఎడిటర్ యొక్క గమనిక: మేము తరువాత అదనపు నివేదికలను ప్రచురించనున్నాము] భగవాన్ శ్రీ సత్య సాయిబాబా దయవల్ల, ధవల్పూర్ లో సేంద్రీయ వ్యవసాయంలో విజయం సాధించి, విబ్రోనిక్స్ ఉపయోగంతో, అధిక దిగుబడి లభించినందున ప్రజల అభిమానాన్ని చూరగొనే అవకాశం నాకు లభించినది. జై సాయి రామ్.

ప్రశ్నలు సమాధానాలు

1. ప్రశ్న: మూలవ్యాధితో బాధపడుతున్న రోగి విషయంలో, CC4.4 మలబద్దకం మందు సరిపోతుందా లేదా మరికొన్ని అదనపు పరిష్కారాలు అవసరమా?

సమాధానం: CC15.1 మెంటల్ &ఎమోషనల్ టానిక్ యివ్వటం మంచిదే.అదేకాక కాలేయం బలపడుటకు CC4.2 కాలేయం&పిత్తాశయం టానిక్ కూడా యిస్తే మంచిది. అంతేకాక, రోగిని ప్రతిరోజూ యెక్కువగా నీటిని త్రాగమనిమరియు తాజా పళ్ళు మరియు కూరగాయలను పుష్కలంగా కలిగి ఉన్న ఆరోగ్యకరమైన ఆహారం తినమనిసలహా ఇవ్వండి.

_____________________________________

2. ప్రశ్న: మీ జేబులోనున్న మొబైల్ మ్రోగినప్పుడు, మీ నోటిలో విబ్రో మాత్ర వుంటే, అది పనిచేయక వృధా అవుతుందా?

సమాధానం: వృధాకాదు, ఒకసారి నోట్లో వేసుకోగానే, మాత్రలో చలనం మొదలై, శరీరంలో చేరవలసిన  అవయవానికి చేరుకుంటుంది.

_____________________________________

3. ప్రశ్న: రోగి విబ్రోచికిత్సలో కాల్షియం సప్లిమెంట్ యివ్వమంటే ఏ పరిహారం యివ్వాలి?

సమాధానం: CC12.1 అడల్ట్ టానిక్ &CC20.1 SMJ టానిక్, యీ రెండిటిలో కాల్షియం వైబ్రేషన్స్ ఉంటాయి. కాబట్టి, వీటిలో ఏదైనా గాని, లేక యీ రెండు సాధారణ కాంబోస్ కాని యివ్వవచ్చు.

_____________________________________

4. ప్రశ్న: రాళ్లలో వైబ్రేషన్స్ యొక్కశక్తిని నింపి, మనం చార్జ్ చేయగలమా? ఎన్నాళ్లలో సాధ్యమవుతుంది?

సమాధానం: క్వార్ట్జ్ స్పటికంలో (Quartzcrystal) లో శక్తిని నింపుటకు, రెమెడీ వెల్ లో దానిని 24 గంటలు వదిలివేయాలి.

_____________________________________

5. ప్రశ్న: ఒక పరిహారం మరొకదానిలోమిశ్రితమైన–ఉదాహరణకు:CC20.3లోCC20.2,CC20.2లో CC20.1 కలిసి వున్నవి –మనం ఆ మూడింటిని కలిపి ఒకే సీసాలో ఇవ్వవచ్చునా? లేక CC20.3ఒక్కటే ఇచ్చిన చాలునా?

సమాధానం: సాధారణంగామేము CC20.1కానిCC20.2కానిCC20.3లో కలపము. ఎందుకంటే CC20.3 లో మిగతా రెండు కలిసివుంటాయి. అయినను CC20.3 వేగంగా పనిచేయకపోతే, అప్పుడు ఆ రెండింటిలో ఒకటికని, రెండు కాని కలిపితే మరింత శక్తివంతమౌతుందని కనుగొన్నాము. 

_____________________________________

6. ప్రశ్న: ఒకే రోగికి ఒకదానికన్న ఎక్కువ రోగలక్షణాలకి చికిత్స చేయాలంటే, వేర్వేరు రెమెడీలను ఒకే సీసాలో కలిపి ఇవ్వవచ్చునా?

సమాధానం: క్రొత్తగా మొదలెట్టిన అభ్యాసకులను, ఒకసారి ఒక దీర్ఘకాలిక రోగమునకు (దానితో సంబంధించిన మిగతవాటికి)మాత్రమే మందునిమ్మని మా సలహా. మొదటి రోగము బాగా తగ్గిన తర్వాత రెండవ దీర్ఘకాలిక రోగసమస్యకు చికిత్స చేయాలి. మనం 2 లేక 3 దీర్ఘకాలిక రోగముల చికిత్సకై, అన్ని రెమెడీలను ఒకే సీసాలో యిచ్చి, రోగికి మందు వికటించినచో, ఏ పరిహారంవల్ల అది జరిగినదో మనకి నిశ్చయంగా తెలీదు. బాగా అనుభవం గడించిన అభ్యాసకుడు ఒకటికన్నా ఎక్కువ రోగలక్షణములను, మందుల మిశ్రమాన్ని ఒకే సీసాలోనిచ్చి చికిత్స చేయగలడు. సాధారణంగా రోగులు వీలైనంత తక్కువ మందుల సీసాలు వాడాలని కోరుకుంటారు.

_____________________________________

7. ప్రశ్న: హెర్నియాకు శస్త్రచికిత్స తప్ప అలోపతిలో మందులు లేవు. విబ్రియోనిక్స్ మందు వుబ్బిన భాగం తగ్గించి, బాధ తగ్గించగలదా?

సమాధానం: CC4.9 Hernia (హెర్నియా) తప్పక బాధను తగ్గిస్తుంది. కనుక మా సలహా ప్రకారం ఏమిటంటే, విబ్రియోనిక్స్ రెమెడీలను కనీసం 2 నెలలు తీసుకొని, అప్పుడు శస్త్రచికిత్స చేయించుకోవాలా లేదా అనేది నిర్ణయించుకోండి.

_____________________________________

 

వైద్యులకే వైద్యుడి యొక్క దివ్య వాక్కు

క్యాన్సర్వచ్చుటకు ప్రధాన కారణం శుద్ధపరచిన చక్కెర, ఏమనగా చక్కెరను శుద్ధి చేసేటప్పుడు చాలా రసాయనాలు చేర్చెదరు. వానిలో  బోన్ చార్(కాలిన బొగ్గువంటి ఎముక) కూడా వొకటి. మీరు తినేటప్పుడు, శరీరంలో యిది ఏ భాగంలోనైనా యిరుక్కోవచ్చు, సమస్యలను సృష్టించవచ్చు. చక్కెరవాడుక మానేస్తే, మీరు క్యాన్సర్ ను నిర్మూలించవచ్చు. చక్కెర కాల్షియం నష్టాలను పెంపొందించి, మూత్రమార్గంలో కాల్షియం ఆక్సాలెట్ (calcium oxalate) రాళ్ల ప్రమాదాన్ని పెంచుతుంది. చక్కెర బదులుగా బెల్లం వాడుట ఆరోగ్యరీత్యా మంచిది.

....సత్య సాయిబాబా ప్రసంగం, జనవరి 3, 1994

 

ప్రార్థన మతంయొక్క శ్వాస; ఏలనన మనిషిని, దైవానికి దగ్గరగా చేర్చి, ఒకరితో నొకరిని దగ్గరగా ఉంచుతుంది. ధ్యానం అనగా కృష్ణుని వేణువువంటి ఆధ్యాత్మికమైన గీతాన్ని, మానసికమైన చెవులతో విని, ఆ శ్రావ్యతను ఆస్వాదించేందుకు తోడ్పడే ప్రక్రియ. ప్రతిరోజు మీరు వ్యాయామం చేయుట, బలవర్ధకమైన టానిక్స్ తీసుకొనుట, ఆహారంలోని కేలరీలు, విటమిన్లు లెక్కించుట, ఆహారపు పోషక విలువను దృష్టిలో ఉంచుకొని భుజించుట ఎంత ముఖ్యమైనదో - మనస్సులో చెలరేగే భావాలను గమనించి, వ్యతిరేకభావాలను అనగా  దురాశ, అసూయ, ద్వేషం, అహంకారం, గర్వం, మాలిన్యం వంటివి వెంటనే నిర్మూలించుట కూడా అంతే ముఖ్యం.

దైవిక ఆలోచనలతో, సేవకు సంబంధించిన మంచిపనులనే భోజనం చేస్తూ, ప్రేమరసం  త్రాగాలి, తద్వారా మనసు ప్రక్షాళనమై, దైవస్వభావం  బాగా జీర్ణం కావచ్చు. అప్పుడు, మీరు మానసిక ఆరోగ్యం, ఆనందం మరియు పరిపూర్ణతతో ప్రకాశిస్తారు.

సత్య సాయిబాబా ప్రసంగం, అక్టోబర్ 6, 1970

ప్రకటనలు

  1. ఇండియా ఢిల్లీ- ఎన్ సి ఆర్:ఏవిపి వర్క్ షాప్12-13 ఏప్రిల్ 2014, సంగీతను సంప్రదించండి -[email protected]
  2. యు.కె లండన్:రిఫ్రెషర్ వర్క్ షాప్ మే14, జెరామ్ ను సంప్రదించండి -[email protected]
  3. ఇండియా పుట్టపర్తి:ఏ వి పి & ఎస్ వి పి వర్క్ షాప్స్ 18-22 ఏప్రిల్ 14,హెమ్ ను సంప్రదించండి-[email protected]
  4. ఇటలీ స్పినియావెనిస్ వద్ద:ఏవిపి వర్క్ షాప్17-18 మే 14, మనోలిస్ నుసంప్రదించండి -[email protected]

శిక్షణగోరువారందరికిమీరు వర్క్ షాప్ లో పాల్గొనదలచిన, వివరాలు పంపవలసిన చోటు: [email protected]

అదనపు సమాచారం

సాయి విబ్రియోనిక్స్ విద్యా ప్రయోజనాలకోసం ఆరోగ్య సమాచారం మరియు వ్యాసాలను అందిస్తుంది; ఈ సమాచారం వైద్య సలహా కాదు. మీ రోగులకు వారి నిర్దిష్ట రోగలక్షణాల గురించి వారి వైద్యుని చూడమని సలహా ఇవ్వండి.

రోజుకొక ఉల్లిపాయ వాడి డాక్టరును దూరంగా ఉంచండి (భాగం 2)

మా జనవరి 2014 వార్తాలేఖలో మేము ఉల్లిపాయ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు, 1 వ భాగంలో ప్రస్తావించిన సంగతి గమనించండి.

 

ఉల్లిపాయ, కేన్సర్ వ్యాధి

వెల్లుల్లిలో కనిపించే అనేక గంధకం సమ్మేళనాలను కలిగి ఉన్ననూ, ఉల్లిపాయలలోగల అధిక ఫ్లావోనోయిడ్స్(flavonoids) మీకు మరిన్ని ప్రయోజనాలను అందిస్తాయి, ప్రత్యేకంగా క్వెర్సెటిన్ (Quercetin). ఇది ఒక యాంటిహిస్టామైన్ (antihistamine) మరియు యాంటి ఇన్ఫ్లమేటరీ (anti-inflammatory) వలె పనిచేయును. క్వెర్సేటిన్ మరియు క్యాన్సర్ ఒకదానికొకటి సరిపడవు. క్యాన్సర్ కణాల పెరుగుదలను తగ్గించే శక్తి, సామర్థ్యాలు క్వెర్సేటిన్లో వున్నట్లు, క్యాన్సర్ కణాలను శరీరంలోని ఇతర భాగాలకు (మెటాస్టాసిస్) వ్యాపించకుండా ఆపి, క్యాన్సర్ కణాలను బలవంతంగా వివిధమార్గాల్లో నిర్మూలించి, క్యాన్సర్-జన్యువులను చంపగల శక్తి క్వెర్సేటిన్ లో వున్నదని పరిశోధనలలో వెల్లడయింది.

కార్నెల్ విశ్వవిద్యాలయ పరిశోధకుడు, Dr.Rui Hai Liu, MD, Ph D, ఆహారశాస్త్రములో అసోసియేట్ ప్రొఫెసర్, ఉల్లిపాయలలోగల వేర్వేరు రకాలు పదివరకు పరీక్షించారు. ఉల్లిపాయల రకాలలో, చాలాఘాటైన, గాఢమైన వాసన గలవి, కాలేయ మరియు పెద్దప్రేగు కాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించగల ఉత్తమ రకాలని పేర్కొన్నారు.

తొక్కలు వొలిచిన ఉల్లిపాయ బల్బుల నుంచి తీసిన సారంతో, తాజా, పచ్చి ఉల్లిపాయ రకాలను ఉపయోగించారు, ఈ అధ్యయనంలో చాలావరకు ఆసియన్, మెక్సికన్, ఫ్రెంచ్, మధ్యధరా, వంటలలో ప్రధానమైన చిన్న, ఎర్ర వుల్లిపాయలు, షాల్లట్ (Shallot), పరీక్షించిన మిగిలిన 11 రకాల వుల్లిపాయలకన్నా, అత్యధిక అనామ్లజనిక (antioxidant) చర్యను కలిగి ఉన్నవి. మిగతా రకాలకన్నా తక్కువ స్థాయిలోని, తేలిక వాసన, రుచి గల ‘విడాలియా’ (Vidalia) వుల్లిపాయలకన్నా,షాల్లట్ ఆరు రెట్లు ఎక్కువ యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు కలిగి ఉన్నది. షాల్లట్ కాలేయ క్యాన్సర్ కణ పెరుగుదల అరికట్టగల గొప్ప ప్రభావం కలిగివున్నది.

వేలమంది వ్యక్తుల ఆహారం మరియు ఆరోగ్య వివరాలను పరీక్షించి, విశ్లేషించిన పిమ్మట పరిశోధకులు ఈ విధంగా వెల్లడించిరి –

తక్కువ ఉల్లిపాయలు తినేవారితో పోలిస్తే, ఉల్లిపాయలు అధికంగా తినేవారికి, పెద్దప్రేగు కాన్సర్ 56%, రొమ్ము కాన్సర్ 25%, ప్రోస్టేట్ క్యాన్సర్ 71%, జీర్ణకోశ కాన్సర్ 82%, అండకోశ కాన్సర్ 73%, నోటి కాన్సర్ 84%, మూత్రపిండాల కాన్సర్ 38%, క్లోమం కాన్సర్ 54%రాగల అవకాశాలు, వచ్చే ప్రమాదం తక్కువ.

వారానికి 2 లేక అంతకంటే ఎక్కువ 80 గ్రాముల (2.82 ఔన్స్) ఉల్లిపాయలు, ఆహారంలోతినే స్త్రీలకు గర్భాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం  60% తగ్గుతుందని పరిశోధకులు గుర్తించారు. చైనాలో వారానికి ఒకసారి కాని అంతకన్నా ఏక్కువగా కాని ఉల్లిపాయలు తిన్నవారికి కడుపులో కాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువని నిర్ధారించేరు. ఈ అధ్యయనంలో పరిశోధకులు, ఉల్లిపాయ అధికంగా తీసుకోవడం వలన కడుపు క్యాన్సర్తో సంబంధంగల, వ్రణోత్పత్తికి కారణమైన మైక్రో ఆర్గానిజం, హెలికోబాక్టర్ పిలోరి, అరికట్టబడుతవి. ఆరోగ్యకరమైన బాక్టీరియా పెరుగుదలను వృద్ధిచేసి, పెద్దప్రేగులో హానికరమైన బ్యాక్టీరియా పెరుగుదలను అణచివేయగల Fructo-oligosaccharides-సమ్మేళనాలు ఉల్లిపాయలో ఉన్నాయి. ఇది పెద్దప్రేగు కాన్సర్ నివారించడంలో ఉల్లిపాయ పాత్రను వివరిస్తుంది. ఉల్లిపాయ సారం పరీక్షనాళికలలో కణిత కణాలను చంపగలదని కనుగొనబడింది.

ఉల్లిపాయ, మధుమేహం

మధుమేహంగల రోగుల రక్తచక్కెరను ఉల్లిపాయలు తగ్గిస్తాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇన్సులిన్ కాని 100g పచ్చి, ఎర్ర, ఉల్లిపాయలను కాని, 1వ రకం, 2వ రకం మధుమేహరోగులకు యిచ్చి, వాటిప్రభావాలను ఒక అధ్యయనం పోలిస్తే. ఫలితాల ప్రకారం రక్త గ్లూకోజ్ స్థాయి ఇన్సులిన్ సాధించినమేరకు తగ్గించలేకపోయినా, ఉల్లిపాయలు రక్త చక్కెర స్థాయిలను ఖచ్చితంగా తగ్గించాయి. అలాగే, ఉల్లిపాయ తిన్న తర్వాత మొదటి గంటలో రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. ఇది ఉల్లిపాయ యొక్క గ్లైకోజెనిక్ ప్రభావo. అందువలన, ఇన్సులిన్ వంటి పలు మధుమేహం ఔషధాలు కలుగచేసే హైపోగ్లైకేమియా (రక్తంలో చక్కెర శాతం బాగా తగ్గడం) అనే దుష్ప్రభావాన్ని ఇది నివారిస్తుంది.

ఉల్లిపాయల్లో రక్తంలో చక్కెరను తగ్గించగల  ప్రధాన క్రియాశీల పదార్థం - Allyl propyl disulphide (APDS) అనబడు గంధక సమ్మేళనం. ఇది ఇన్సులిన్ యొక్క విచ్ఛినాన్ని అరికట్టి, శరీరంలో ఇన్సులిన్ అధిక స్థాయిలో ఉండేటట్లు తోడ్పడుతుంది. ఉల్లిపాయలలో క్రోమియం అనే మినరల్ కూడా వున్నది. అది ఇన్సులిన్కణాలను స్పందించడం ద్వారా రక్తంలో చక్కెర నియంత్రణకు సహాయపడుతుంది.

చర్మపు పరిస్థితులు

ఉల్లిపాయరసాన్ని క్రిమికీటకాల కాట్లు, మొటిమలు, వాపు, మంట, చర్మంలో రక్త ప్రసరణ తక్కువగుటచే వచ్చే దురదలకు చికిత్సకై ఉపయోగిస్తారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో జర్నల్ ఆఫ్ కాస్మెటిక్ డెర్మటాలజీలో ప్రచురించినట్లు, శస్త్రచికిత్స గాయాలపై, ఉల్లిపాయరసం పూయటంవల్ల, మెత్తగా, ఎర్రదనం తగ్గి, మృదువుగా చూచుటకు బాగున్నట్లు కనుగొన్నారు. సోడియం, కొవ్వు, కొలెస్ట్రాల్ లేని ఆహారంగా మాత్రమే కాక, ఉల్లిపాయలలోని ‘విటమిన్ సి’ రోగనిరోధకశక్తి పెంచుతుంది. ఒక కప్పు వుల్లిరసం, ‘విటమిన్ సి’ డైలీ విలువలో 20% అందిస్తుంది. అంతేకాకుండా, ఉల్లిపాయలలో ఎంజైమ్ శక్తివంతం చేయగల మాంగనీస్ మరియు మాలిబ్డినం, అలాగే గుండెను ఆరోగ్యపరిచే విటమిన్ B6, ఫైబర్, ఫోలేట్, పొటాషియం వున్నవి. మనకు నిత్య అవసరమైన పోషకపదార్ధాలు- ఒక కప్పు పచ్చివుల్లిరసంలో 11% ఫైబర్, 11% మాలిబ్డినం, 10.5% మాంగనీస్, 10% విటమిన్ B6, 8% ఫోలేట్, 7% పొటాషియం, మరియు 6 % ట్రిప్టోఫాన్ వున్నవి.

Sources:

http://health.tipsdiscover.com/onion-strong-cancer/

http://www.news.cornell.edu/stories/2004/10/some-onions-have-excellent-anti-cancer-benefits

http://www.sciencedaily.com/releases/2004/10/041022105413.htm

http://www.foods-healing-power.com/health-benefits-of-onions.html

http://www.ncbi.nlm.nih.gov/pubmed/16236005

http://www.offthegridnews.com/2011/06/09/onions-and-their-healing-properties/

http://jarretmorrow.com/2010/11/24/onion-blood-sugar-levels-diabetics/

http://www.thediabetescenter.org/natural-diabetes-cure-onion-for-diabetes-treatment.html#more-105

http://www.botanical-online.com/medicinalsalliumcepaangles.htm

 

మీ యొక్క జుట్టు రాలి పోవుచున్నదా?

మీ తలపై సుమారు 100,000 నుండి 150,000 కేశములుండగా, 50-100 కేశములు ప్రతిరోజూ కోల్పోవుట సహజం. అయితే, మీకు బట్టతల మచ్చలు లేదా బాగా జుట్టు వూడటం జరుగుతుంటే మీరు ఆలోపెషియా (alopecia) అనే సమస్యకు గురై ఉండవచ్చు. జుట్టు రాలడానికి కారణాలు చాలా ఉన్నాయి. జుట్టు రాలటం హఠాత్తుగా ప్రారంభమైనప్పుడు, అనారోగ్యం (ప్రధాన శస్త్రచికిత్స, అధిక జ్వరం, తీవ్ర సంక్రమణ లేదా ఫ్లూ), పౌష్టికాహారలోపం, ఆహారంలో తగినంత ప్రోటీన్ మరియు ఇనుములోపం, లేదా 15 పౌన్లు లేక ఇంకా బరువు తగ్గడానికి దారితీసే ఆహారం, ప్రత్యేక మందులు (ఇది ఆర్థరైటిస్, నిరాశ, గౌట్, గుండె సమస్యలు, అధిక రక్తపోటు, గ్లుకోమా, పూతలు, పార్కిన్సన్ వ్యాధి, లేదా విటమిన్ ఎ యొక్క అధిక మోతాదుల చికిత్స)  హార్మోన్ల మార్పులు, గర్భధారణ, ప్రసవం వలన కలిగే మార్పులు, కుటుంబ నియంత్రణ మాత్రలు నిలిపివేయడం లేదా రుతుక్రమ ప్రారంభం వంటి అసమానతలు అనేక కారణాలలో కొన్ని కావచ్చును.

జుట్టు నెమ్మదిగా వూడిపోతూ, ప్రతి సంవత్సరం మరింత గుర్తించదగ్గదిగా ఉంటే, ఆవ్యక్తికి వారసత్వంగా జుట్టు నష్టం లేదా బట్టతల(androgenetic alopecia) ఆండ్రోజేనిటిక్ అరోమతా ఉండవచ్చు. ఈ విధమైన జుట్టురాలిపోవడాన్ని, పురుషులలో/ స్త్రీలలో బట్టతల అని కూడా పిలుస్తారు. ఏదైనా వ్యాధి మొదటి లక్షణం జుట్టు రాలిపోవటమై ఉంటుంది. థైరాయిడ్ వ్యాధి (thyroid disease), పాలీసిస్టిక్ అండాశయ సిండ్రోమ్ (Polycystic ovary syndrome), రక్తహీనత (anaemia), నడినెత్తిన వచ్చే చర్మవ్యాధి (ringworm of the scalp), పద్దతిలేని ఆహారపు అలవాట్లు వంటివి సుమారు 30 వ్యాధులు కారణమై వుండవచ్చు. ప్రత్యేకమైన వ్యాధిని గుర్తించి, తగినచికిత్స చేసి, జుట్టు నష్టం నిలపవచ్చు, తిరిగి కొత్త జుట్టు తెప్పించవచ్చు. జుట్టు నష్టానికి ఇతర కారణాలు క్యాన్సర్ చికిత్సలయిన రేడియేషన్ మరియు కీమోథెరపీ, ఒత్తిడి (ఉదా: ప్రియమైన వారి మరణం లేక భార్యాభర్తల విడాకులువంటి బాధాకర సంఘటనవల్ల), మరియు తగినంత నిద్ర లేకపోవడంవంటివి కావచ్చు.

క్రింద వుదాహరించిన జుట్టు సంరక్షణ పద్ధతులవల్ల కూడా జుట్టు  పొడిగా అయి, తెగిపోయి జుట్టు రాలిపోవచ్చు:

  • బ్లీచింగ్, శాశ్వత పదార్థాలు, జుట్టు రంగులు, రిలాక్డర్స్, జెల్స్ హెయిర్ స్ప్రేస్ వంటి కృత్రిమ, కఠిన రసాయన పదార్ధాలతో తరచూ లేదా క్రమ పద్దతి లేని ఉపయోగం. (వీటిని నివారించడానికి ప్రయత్నించండి);
  • ప్రతిరోజూ షాంపూ మరియు కండిషనింగ్ (దీనిబదులు, 2-3 రోజులకొకసారి తల స్నానం చేస్తే, సహజమైన నూనెలు సరైన పద్ధతిలో ప్రసరిస్తాయి);
  • రింగుల జుట్టుకోసం కర్లింగ్ ఐరన్, జుట్టు ఆరబెట్టుటకు బ్లోడ్రైయర్, రింగుల జుట్టుని తిన్నగా చేసే ఫ్లేట్ ఐరన్, వంటి ఆధునిక విద్యుత్ పరికరాల వాడకం మానేసి, గాలితో మీ జుట్టు ఆరబెట్టండి. మీకు సమయంలేకపోతే, బ్లో డ్రైయర్ ను కనీసపు వేడితో ఉపయోగించండి;
  • రబ్బరుబ్యాండ్లతో గట్టిగా కట్టే పోనీ టైల్ వంటి కేశశైలులు;
  • రోజులో చాలాఎక్కువసార్లు, ఎక్కువసేపు దువ్వటం, బ్రష్ చేయడం (ఉదా: 100 సార్లు రోజు మొత్తం మీద దువ్వటం)
  • జుట్టును గట్టిగా కట్టడానికి రకరకాల పిన్నులు, క్లిప్పులు, రబ్బరు బ్యాండ్లను వాడటం(బదులుగా, వదులుగా వుండే, మృదువైన చివర గుండ్రంగా వుండే కేశాలపిన్నులు మరియు గుడ్డబ్యాండ్లు మంచివి);
  • తడిజుట్టు మామూలు జుట్టుకన్న 2 రెట్లు బలహీనంగా ఉంటుంది కనుక యెక్కువ వూడే అవకాశం ఉంటుంది, కాబట్టి తడిజుట్టును దువ్వటం కానీ బ్రష్ చేయటం కూడదు. బదులుగా పొడి తువ్వాలుతో జుట్టుతడి ఆరబెట్టి, తరువాత మీ జుట్టును ఒక వెడల్పు పళ్లుగల దువ్వెనతో చిక్కులుపడ్డ జుట్టు విడదీసి, తర్వాత పొడిజుట్టును 1 లేక 2 సార్లు ఉదయం, రాత్రి బ్రష్ చేయాలి. మీ నెత్తిమీద చర్మంలో మంచి చలనం కలుగుతుంది.
  • వేడినీటి తలస్నానం మీజుట్టునుండి రక్షణనూనెలను తొలగిస్తుంది కనుక మీ శరీర ఉష్ణోగ్రతకంటే కాస్త వెచ్చనినీరు వాడండి.

 

కొబ్బరి, ఆలివ్, బాదం, వుసిరిక వంటి మూలికా తలనూనెలు, జుట్టుయొక్కసాగే బలాన్ని పెంచుతాయి, చిక్కు పడటం, వెంట్రుకలు తెగటం తగ్గిస్తుంది. జుట్టుకి నూనె రాయటంవల్ల, ఒక రక్షితపొర నేర్పర్చి, జుట్టును చక్కగా పద్దతిగా పెరిగేలా చేస్తుంది. నూనెలు తేమను కలిగించి (తేమను కోల్పోకుండా మొదళ్ళనుండి చిగుళ్ళ వరకు నూనె పూయండి), అమీనో ఆమ్లాలు, కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు మరియు ఖనిజాలతో చర్మం పోషించును. ఈ ప్రధాన నూనెలకు దేవదారుచెక్క, వాము, లావెండర్, రోజ్ మేరీ వంటి ముఖ్యమైన నూనెలను కలిపినచో, మాడులో రక్తప్రసరణ బాగా జరిగి, జుట్టు మరింతగా పెరుగుతుంది. కానీ ఈ నూనెలను నేరుగా తలకు రాయకుండా, కొబ్బరివంటి ప్రధాననూనెలకు కొన్ని చుక్కలను జోడించిన తర్వాత జుట్టును మర్దించవలెను.

ఒక పరిశోధనలో, దేవదారుచెక్క, వాము, లావెండర్, రోజ్ మేరీవంటి ప్రధాన నూనెలతో, ఇప్ప, ద్రాక్షగింజల నూనెలను కొద్దిగా కలిపి తలకు మర్ధనచేసిన కొందరికి, కేవలం ప్రధాన నూనెలనే మర్ధనా చేసిన మిగిలినవారికన్నా, 7 నెలల్లో మరింతగా జుట్టుపెరిగింది. జపాన్ లోని ‘జర్నల్ ఆఫ్ డెర్మాటోలజీ’లో ప్రచురించిన మరో పరిశోధనలో, ఉల్లిపాయరసం రోజుకు2 సార్లు తలకు వ్రాయగా, 23 మందిలో 20 మందికి 6 వారాలలో జుట్టు బాగా పెరిగింది.

ప్రత్యామ్నాయ & కాంప్లిమెంటరీ మెడిసిన్, అమెరికాజర్నల్ లో జరిపిన అధ్యయనంలో, ‘సా పల్మెటో’ అను మూలికాసారం ప్రతిరోజూ తీసుకున్న పురుషులకు జుట్టు పెరుగుదల మెరుగుపడినట్లు తెల్పిరి. కొన్ని అధ్యయనాలు ఈ మూలికాసారం, ఫినరస్టైడ్(Finasteride) అను విక్రయ ఔషధం అంత సమర్థవంతమైన మందని, దానికున్న దుష్ప్రభావాలు లేకుండా, జుట్టువూడటం తగ్గిస్తున్నట్లు చెప్పిరి. స్త్రీ పురుషుల బట్టతలలు, మగ హార్మోన్ టెస్టోస్టెరోన్ (Testosterone), డీహెచ్ టి(Dihydrotestosterone) డైహైడ్రోటెస్టోస్టోరోన్ గా మార్చడానికి ముడిపడి ఉంది; సా పల్మెటో(Saw Palmetto)DHT ఏర్పడటానికి దెబ్బతీస్తుంది. Methylsulfonylmethane (సహజంగా ఆవు పాలు, ఆకుకూరలలో వుంటుంది) వుపయోగించిన 100 శాతం మంది ప్రజలలో కేరాటిన్ (keratin-జుట్టులో ప్రోటీన్) ఉత్పత్తికి సహాయపడునని మరొక పరిశోధనలో చెప్పిరి. ఇది 6వారాలలో జుట్టు రాలకుండాచేసి, జుట్టు పెరుగుదలని చూపించింది.

ఆరోగ్యకరంగా జుట్టు పెంచే చిట్కాలు:

  • ఒత్తిడి నిర్వహణ తరగతులు, యోగా తరగతులు తీసుకోవటం, ప్రియమైనవారితో ఎక్కువ సమయం గడపడం, డ్యాన్స్ చేయడం, శ్రావ్యమైన సంగీతం, ముఖ్యంగా, తగినంత నిద్ర పొందడం ద్వారా ఒత్తిడిని నియంత్రణలో వుంచండి.
  • పండ్లు, కూరగాయలు, మాంసకృత్తులు (శరీరానికి తగినంత ప్రోటీన్ లభించనిచో, జుట్టు పెరుగుదలకు ప్రోటీన్ చాలదు), ఇనుము, ఒమేగా -3 &6 కొవ్వు ఆమ్లాలు, విటమిన్స్ ముఖ్యంగా విటమిన్ ఎ, విటమిన్ సి (జుట్టుయొక్క ఆరోగ్యకరమైన అభివృద్ధికి), విటమిన్ ఇ (రాలిన జుట్టును పెంచుటకు), B- కాంప్లెక్స్ విటమిన్లు, ఖనిజాలు (మినరల్స్) కూడిన సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి.
  1. జుట్టుపెరుగుదలకు ముఖ్యమైన కొన్ని పదార్ధాలు: ఒమేగా -3 ఎక్కువగావున్న వాల్నట్స్, ఒమేగా -6 కొవ్వు ఆమ్లాలు, బోయోటిన్ (Omega-6 fatty acids, biotin), E, B విటమిన్స్, కాపర్ లో అధికంగా ఉంటాయి;
  2. చిలగడ దుంపలు &క్యారట్లు (విటమిన్ ఎ);
  3. ఇనుము, బీటా కెరోటిన్, ఫోలేట్ మరియు విటమిన్ సి ( Iron, Beta carotene, Folate and Vitamin C అధికంగా గల పాలకూర, బ్రోకలీ, తోటకూర, చుక్కకూర, బచ్చలికూర వంటి ఆకుకూరలు;
  4. ప్రోటీన్, ఇనుము, జింక్, బయోటిన్ సమృద్ధిగా గల పప్పుధాన్యాలు
  5. గ్రీక్ పెరుగు జుట్టుకు దోహదం చేసే ప్రోటీన్, విటమిన్ B5 పాంతోతేనిక్ ఆమ్లం (pantothenic acid) మరియు పాలవిరుగుడు ప్రోటీన్ మరియు కాల్షియం యొక్క గొప్ప వనరులు, జుట్టు పెరుగుదలకు ముఖ్యమైన ఖనిజాలు గల విటమిన్ D లేదా తక్కువ కొవ్వు పెరుగు లేదా పాలు;
  6. విటమిన్ సి సమృద్ధిగా గల బ్లూబెర్రీస్, కివీస్ మరియు స్ట్రాబెర్రీలు
  7. ఆకుపచ్చ బఠాణీలలో ఇనుము, జింక్ మరియు B- గ్రూప్ విటమిన్లు హెచ్చుగా వుంటాయి.

Sources:

http://www.aad.org/dermatology-a-to-z/diseases-and-treatments/e---h/hair-loss/who-gets-causes.

http://www.vogue.in/content/oiling-really-good-your-hair.

http://juanaaman.hubpages.com/hub/What-Makes-Herbal-Oils-the-Best-Hair-Loss-Cure-Treatment

http://www.advancednaturalmedicine.com/hair-renewal/treatments-for-hair-loss.html

http://www.dermatol.or.jp/Journal/JD/full/029060343e.pdf

http://umm.edu/health/medical/altmed/herb/saw-palmetto

http://www.hairsentinel.com/saw-palmetto-for-hair-loss.html

http://www.care2.com/greenliving/12-natural-remedies-that-boost-hair-growth.html?page=1

http://hair.allwomenstalk.com/natural-remedies-to-make-your-hair-grow-faster

http://www.onegoodthingbyjillee.com/2013/10/13-natural-remedies-to-reduce-hair-loss.html

http://www.webmd.com/beauty/hair-styling/top-10-foods-for-healthy-hair?page=1

***అభ్యాసకులకు గమనిక***

  1. మా వెబ్ సైట్ www.vibrionics.org. మీ రెజిస్ట్రేషన్ నంబర్ తో, అభ్యాసకుల పోర్టల్ లో లాగిన్ చేయండి.మీ ఇ-మెయిల్ అడ్రసు మారినచో, వీలైనంత త్వరగా[email protected]తెలియచేయండి.
  2. మీరు ఈ వార్తాలేఖలను మీ తల్లిదండ్రులతో పంచుకోవచ్చును. వారి ప్రశ్నలు మీకు, సమాధానలకొరకు, పరిశోధనలకొరకు పంపబడును. మీ సహకారమునకు మా కృతజ్ణతలు.

                                      

   ఓం సాయి రామ్!