Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

Vol 9 సంచిక 6
November/December 2018
ముద్రింప తగిన వార్తాలేఖ


పూర్తి వార్తాలేఖ యొక్క కాగితం ప్రతి కావలెనన్నఈ పుటను ముద్రించండి

డా.జిత్ కె. అగ్గర్వాల్ డెస్క్ నుండి

ప్రియమైనచికిత్సానిపుణులకు,

ప్రశాంతి నిలయంలో మన ప్రియభగవానుని 93వజన్మదినోత్సవ  సందర్భంగా మీతో ఈ విధంగా నా భావాలను పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉన్నది. ప్రశాంతి నిలయం అంతటా ఒక విధమైన పాజిటివ్ వైబ్రేషన్ తోనూ రంగురంగుల అలంకరణలతో భక్తుల కోలాహలంతోను ఎంతో సందడిగా ఉన్నది. ఇప్పుడు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర పండుగలు పురస్కరించుకొని ప్రపంచమంతటా సాయి కుటుంబ సభ్యులలోనూ ఇతరుల లోనూ  ఆనంద కరమైన వాతావరణం నెలకొని ఉన్నది. ముఖ్యంగా ఈ ఏడాది పొడుగునా మనమంతా నిస్వార్థ సేవ లో పాల్గొనడం అటువంటి అవకాశాన్ని స్వామి మనకు కల్పించినందుకు స్వామికి కృతజ్ఞతా భావాన్ని తెలియచేసుకుందాం. బాబా మాటల్లో చెప్పాలంటే‘’సేవలో ఉన్న గొప్పతనం ఏ ఇతర ఆధ్యాత్మిక సాధనా మార్గం  లోనూ ఉండదు. ఇట్టి  సేవను  ప్రాథమిక లక్ష్యంగా కలిగి ఉండి అనంతరం భక్తి యొక్క వివిధ  మార్గాలను అనగా భగవంతుని లీలలు వినడం, దైవ నామాన్ని ధ్యానం చేయడం, వారి   పాదాలకు ప్రణమిల్లడం, భగవంతుని సేవకునిగా సేవలు అందించడం,  స్నేహితుడిగా ప్రేమను చూపించడం, విచారణా మార్గము ఇవన్నీ కూడా అనుసరించడం ద్వారా చేసే సేవ అహంకారమును నిర్మూలిస్తుంది. అహంకారానికి ఉన్న మరొక రూపము పశుప్రవృత్తి. సేవ దీనిని నిర్మూలనం చేసి మనిషిని మృదువుగా చేసి భగవంతునికి దగ్గర చేస్తుంది”...   స్వామి ఉపన్యాసం మూడవ సేవాదళ్ కాన్ఫరెన్స్ 15 నవంబర్ 1975.

ఇప్పుడు శరదృతువు అంతమై శీతాకాలం ఆరంభమవుతున్న సంధికాలం. ఉత్తరార్ధ గోళంలో నివశిస్తున్న వారికి ఇది చాలా కఠినమైనది.  ఐతే సూక్ష్మ దృష్టితో చూసినట్లైతే  ఇది అంతర్దృష్టి పెంపొందించడానికి, నిలకడకు మారుపేరు. అలాగే ఈ కాలం మనం రోగులకు సేవలందించడానికి కూడా అనుకూల సమయం. ఆయుర్వేదం ప్రకారం ఈ చల్లని వాతావరణం మనిషిలో ‘’వాత’’ గుణంలో అసమతౌల్యాన్ని (https://en.wikipedia.org/wiki/Dosha) పెంపొందించి ప్రతీ ఒక్కరిలోనూ జలుబు, ఫ్లూ వంటి అనారోగ్య సమస్యలను కలిగిస్తూ శరీరానికి హాని చేస్తుంది. కనుక మీ పెషంట్లకు వారి కుటుంబ సభ్యులకు ఇటువంటి వ్యాధి లక్షణాలు కనబడిన వెంటనే మిమ్మల్ని సంప్రదించ వలసిందిగా సూచించండి. ఎందుకంటే రోగ లక్షణాలు బయటపడ్డ వెంటనే సంప్రదించడం ద్వారా మన వైబ్రో నివారణలు ఇన్ఫెక్షన్ లను తగ్గించడం లేదా పూర్తిగా నయం చేయడం వంటి సత్ఫలితాలు ఇస్తాయి.

వైబ్రియానిక్స్ విషయానికొస్తే అభ్యాసకులకు ఆన్లైన్ ద్వారా తమ పేషంట్ ల మరియు సేవా గంటల వివరాలు వెబ్ సైట్ https://practitioners.vibrionics.org  లో  అప్లోడ్ చేయడం చాలా సులువుగా ఉండడంతో మన వెబ్ సైట్ చక్కటి విజయాన్ని సాధించింది. ఇట్టి  వెబ్సైట్  యొక్క రూప కల్పనలో లో పాల్గొన్న వారి ప్రయత్నాలు మరువలేనివి. ఈ వెబ్ సైట్ ద్వారా రిపోర్టింగ్ ప్రక్రియ మరింత సమర్థవంతంగా వేగవంతంగా జరుపుటకు మార్గం సుగమం అవడమే కాదు ముందుముందు మనం  మన ప్రణాళికల అమలు, సంస్థ అభివృద్ధికి  ఇది ఒక బంగారు గని వంటిదిగా రూపు దిద్దుకుంది.   ఆన్లైన్లో తమ నివేదికలను అప్లోడ్ చేయలేక పోయిన వారి  కోసం  స్థానిక సమన్వయకర్తలు ద్వారా తమ వివరాలను పంపించడానికి ఏర్పాటు చేశాము.ఈ విధంగా  కొంత అదనపు సమయం (అంటే వారానికి కొన్ని నిమిషాలు మాత్రమే) కేటాయిందలచిన వారు [email protected] ద్వారా మాకు తెలియజేయండి. ఇది మన కోఆర్డినేటర్లకు వెసులుబాటును కల్పించి వారి సమయాన్ని మరిన్ని ఉత్తమ సేవలకు  అనగా శిక్షణా మరియు సేవా శిబిరాలను ఏర్పాటు చేయడానికి ఉపకరిస్తుంది.  

బెంగుళూరు లో వైట్ ఫీల్డ్ లో ఉన్న సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ మెడికల్ సైన్సెస్ సెంటర్ వద్ద మంగళవారం, గురువారం, మరియు  శనివారాలలో 2 గంటల నుంచి 4 గంటల వరకు వారానికి మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న మన క్లినిక్ ఎంతో గణనీయమైన సేవచేస్తున్నట్లుగా రిపోర్టులు అందుతున్నాయి.  ప్రాక్టీషనర్12051…ఇండీయా   నేతృత్వంలో గత 11 నెలలలో  750 మంది రోగులకు చికిత్స చేసాము.  మీఅందరికీ తెలిసిన విషయమే.  ఈ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న చాలామంది రోగులు భారత దేశపు సుదూర ప్రాంతాలనుండి , వెనుకబడిన ప్రాంతాలనుండి వీరిలో కొందరు దీర్ఘకాల ప్రయాణాలు (మూడు రోజుల రైలు ప్రయాణం) చేసి గుండె, మెదడు వంటి వాటికి సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధుల నిమిత్తం ఇక్కడికి  వస్తూ ఉంటారు. అయితేపేషంట్ల జాబితా పొడవుగా ఉండి  వీరికి తగిన సహాయం చేయలేకపోతున్న సందర్భాల్లో రద్దీని తట్టుకోవడం కోసం ఆసుపత్రి వర్గాలు వారిని మనవద్దకు పంపుతూ ఉండడం జరుగుతోంది. ప్రాధమిక విచారణ అనంతరం  రోగి యొక్క పురోగతి గురించి ఈమెయిల్ లేదా ఫోన్ ద్వారా సంప్రదిస్తూ అవసరమైతే ఆ రోగికి నివారణలను కూడా పోస్టు ద్వారా ఉచితంగా పంపుతున్నాము.

మన యొక్క 2016 వైబ్రియానిక్స్ పుస్తకానికి అవసరమైన అనువర్తనాలను జోడించి బాబా వారి  జన్మదినోత్సవం నాటికి ఆవిష్కరించాలని ఆశిస్తున్నాము. ఈ జన్మ దినోత్సవ సందర్భంగా మనమంతా ఆనందాన్ని అనుభవిస్తూ ప్రేమతో స్వామిని  అర్చిస్తూ మరింత శక్తివంతంగా మరింత భక్తి భావంతో మన సేవకు పునరంకితం కావాలని ఆశిస్తున్నాను.

ప్రేమతో మీ

జిత్ కె అగర్వాల్

ఆనెలు, పగుళ్లు 02696...India

55-సంవత్సరాల మహిళకు గత 20 సంవత్సరాలుగా కుడిపాదము అడుగుభాగంలో చర్మము కఠినముగా రాయి వలె ఉంటోంది. డాక్టర్లు దీనిని దీర్ఘకాలిక  ఆనె అని నిర్ధారించారు. ఇంతకాలంగా బాధ ఎంత తీవ్రంగా ఉందంటే కుడికాలు పూర్తిగా క్రింద మోపడం, ముఖ్యంగా చెప్పుల్లేకుండా నడవడం దుర్లభంగా ఉంది. కనుక కాలును పక్కకి వంచి మెల్లగా నడవవలసి వచ్చేది.  2018 ఆగస్టు  5 వ తేదీన ప్రాక్టీషనర్ ఆమెకు క్రింది రెమిడీ ఇచ్చారు:
#1.  SR299 Lycopodium CM…1 dose every 2 weeks, total 4 doses

#2.  SR342 Antim Crud 200C…3TW for 4 weeks

#3.  SR318 Thuja 30C…TDS for 5 days అనంతరం SR318 Thuja 200C… 1 రెండు వారాలకు ఒకసారి ఒక డోసు మొత్తం 2 డోసులు మాత్రమే.

పై నివారణాలన్నీ ఒకే రోజు ఒక్కొక్క దానికి 10 నిమిషాలు విరామంతో వేసుకోవడం ప్రారంభించారు.  15 రోజుల తరువాత పేషంటు ఎంతో ఆనందంతో నొప్పి లేకుండానే తన కుడికాలు క్రింద పెట్టగలుగుతున్నానని చెప్పారు. మందులు అలానే కొనసాగించడంతో 15 రోజుల తరువాత ఆనె 80 శాతం తగ్గగా నొప్పి మాత్రం పూర్తిగా తగ్గిపోయింది.

పేషంటుకు క్రింది రెమిడీ ఇవ్వడం జరిగింది:
 #4. CC21.5 Dry Sores…TDS ఇలామూడు నెలలు తీసుకోవలసిందిగా సూచింప బడింది.

పేషంటు నెలకు ఒకసారి రిపోర్టు చేస్తూ తన పనిని తను చక్కగా చేసుకో గలుగుతున్నానని చెప్పారు. #4 ను TDS గా కొనసాగిస్తూ ఉన్నారు. ఆనె 100 శాతం తగ్గిపోగానే మోతాదు OD గా తగ్గించబడుతుందని ప్రాక్టీషనర్ తెలిపారు.

ప్రాక్టీషనర్ సూచనలు: పైన సూచించిన నివారణులు 2015 లో చికిత్సా నిపుణుడు తనపైననే ఉపయోగించుకొని విజయం పొంది ఉన్నారు. గత 15 సంవత్సరాలుగా ఆనెలతో ఇబ్బంది పడుతూ ప్రతీ సంవత్సరము నొప్పి పెరగసాగడంతో చాలా ఇబ్బంది పడుతూ ఉండేవారు.  పైన సూచించిన మోతాదులు  #1 నుండి  #3 వరకూ వాడడంతో సమస్య పూర్తిగా మాయమై పోయింది. ఇప్పటి వరకూ సమస్య పునరావృతం  కాలేదు. సమస్య ఉన్న జాడ కూడా లేదు.

సంపాదకుని సూచన:  108CCబాక్సు ఉపయోగిస్తున్నట్లయితే  CC21.5 Dry Sores ఇవ్వడం మంచిది. ఎందుకంటే దీనిలో అవసరమైన ఇతర నివారణులు అన్నీ ఉన్నాయి. ఇటువంటి ఇతర సమస్యలకు  ఈ రెమిడీ ని  QDS మోతాదులో పూర్తి నివారణ చేకూరే వరకూ వాడడం మంచిది.

బహుళ సమస్యలు 02696...India

75-సంవత్సరాల మహిళ 400 కిలోమీటర్ల దూరం ప్రయాణించి 2018 ఫిబ్రవరి 11 వ తేదీన ప్రాక్టీషనర్ ను కలిసి  తనను ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బంది పెడుతున్న బహుళ సమస్యలు గురించి చెప్పారు. ఆమెకు తల తిరగడం సమస్య తో పాటు కొన్నిసార్లు మూర్ఛ పోవడం సమస్య కూడా ఉంది. అంటే కాక కాళ్ళకు విపరీతమైన తిమ్మిరి వీటివలన ఒక్కొక్కసారి రాత్రంతా మేలుకొని ఉండాల్సి వస్తోంది. ఈమెకు కీళ్ల నొప్పులు, తరుచుగా వచ్చే తిమ్మిరులతో పాటు  వళ్లంతా విపరీతమైన దురదలు ఉన్నాయి. వీటితో పాటు గ్యాస్ట్రిక్ అనగా అసిడిటీ, మలబద్దకం, గ్యాస్ సమస్యలు కూడా ఉన్నాయి. ఇన్ని సమస్యలు ఉన్నా వీరు ఆ బాధనంతా దిగమింగి చిరునవ్వు నవ్వుతూ ఉండడడం విశేషం. ప్రాక్టీషనర్ ఈమెకు క్రింది రెమిడీ లు ఇచ్చారు.

తల తిరగడం సమస్యకు:
#1. CC18.7 Vertigo…TDS

గ్యాస్ట్రిక్ సమస్యలకు:
#2. CC4.4 Constipation + CC4.10 Indigestion…TDS

దురదకు:
#3. CC21.3 Skin allergies…TDS

తిమ్మిరులు, మంట, కీళ్ల నొప్పులకు మరియు వెన్ను నొప్పికి:
#4. CC3.7 Circulation + CC20.3 Arthritis…TDS మరియు
#5. CC20.4 Muscles & Supportive tissue + CC20.5 Spine…TDS. పేషంటు చాలా దూరంలో ఉన్న కారణాన ఆమెకు 50 శాతం మెరుగయ్యాక ఈ రెమిడీ వాడవలసిందిగా సూచించడమైనది.

ప్రాక్టీషనర్ ప్రతీ సమస్యకూ పర్యవేక్షణ చేయడానికి వీలుగా ఉండే విధంగా వేరువేరు బాటిళ్ళ లో రెమిడీ ఇవ్వడం జరిగింది. పేషంటు ఎంతో భక్తితో ఈ రెమిడీలను స్వామిని ప్రార్ధిస్తూ తీసుకున్నట్లు తెలుసుకున్నారు.

నెల తరువాత పేషంటు తనకున్న అన్నీ సమస్యల విషయంలో 50% మెరుగుదల కనిపించిందని తెలిపారు. పేషంటు యొక్క కుమార్తె ఈ విషయం చెపుతూ తమ కిదంతా చాలా ఆశ్చర్యంగా ఉందని తెలిపారు. పేషంటు #5 ను కూడా తీసుకోవడం ప్రారంభించారు.  

నెల తరువాత తల తిరగడం, గ్యాస్త్రిక్ సమస్యలు పూర్తిగా తగ్గిపోయాయి. వంటి దురద, మంట విషయంలో చెప్పుకోదగిన మెరుగుదల కూడా కనిపించింది.  మూడు నెలల తరువాత మోకాలు నొప్పి, నడుం నొప్పి మినహా మిగతా అన్నీ సమస్యలు పూర్తిగా మాయమయ్యాయి.  కనుక  #1 నుండి  #3 వరకూ గల రెమిడీ లను OD కి తగ్గించి #4 మరియు  #5లను …TDS గా కొనసాగించారు.  పేషంటు కుమార్తె ప్రతీ నెలా రీఫిల్ కోసం ప్రాక్టీషనర్ ను సంప్రదిస్తూ స్వస్తత నెమ్మదిగా నిలకడగా ఉందని కానీ పూర్తిగా తగ్గిపోతుందనే నమ్మకం  కూడా ఏర్పడిందని చెప్పారు.

సంపాదకుని వ్యాఖ్య:  సాధారణంగా పేషంటుకు ఒకసారి 3 బాటిళ్ళ కన్నా ఎక్కువ ఇవ్వము.  కానీ ఈ కేసు విషయంలో పేషంటు ఎంతో ప్రేరణ పొంది క్రమశిక్షణ తో ఉన్నారు కనుక సడలించడం అనివార్యం అయ్యింది.

జువినైల్ అర్తెరైటీస్ 10355...India

2017 నవంబర్ 12 వ తేదీన 14 సంవత్సరాల అబ్బాయిని అతని తండ్రి ప్రాక్టీషనర్ వద్దకు తీసుకొని వచ్చారు. ఈ అబ్బాయికి వ్రేళ్ళమధ్య  పెద్ద పరిమాణంలో(10 మి.మీ) ఉన్న 7 బొబ్బలు ఉన్నాయి.  మరియు బొటన వ్రేలి కీళ్ల మధ్య 2 బొబ్బలు ఉన్నాయి. ఇవి మొదటిసారి  నెల క్రితం కనబడినప్పుడు చిన్నగా ఎరుపు రంగులో ఉన్నాయి. వీటి వలన అబ్బాయికి  మంట మరియు దురద కూడా ఉంది కానీ ఇది భరించ దగినదిగానే ఉంది.  బొబ్బల వలన కొంచం నొప్పి ఉంది కానీ వాటిని నొక్కితే నొప్పి భరించరానిది గా ఉంది.  అతను వ్రాయడానికి పెన్ను పట్టుకోలేడు, మరియు  బొటన వ్రేలు, వ్రేళ్లను కదపలేడు కనుక స్కూలుకు కూడా వెళ్ళడం లేదు. పేదరికం వలన తండ్రి అబ్బాయిని హాస్పిటల్ లో చూపించ లేకపోయాడు. ఐ‌తే ప్రాక్టీషనర్ తన కుటుంబ డాక్టర్ ని సంప్రదించి ఈ వ్యాధి జువినైల్ అర్తెరైటీస్ అని నిర్ధారించారు

ఈ అబ్బాయికి రెండు సంవత్సరాల క్రితమే ఇటువంటి బొబ్బలు వచ్చాయని అవి చాలా చిన్నగా ఉండి ఏమాత్రం ఇబ్బంది పెట్టలేదని తండ్రి చెప్పాడు. అంతేకాక ఒక వారం తరువాత అవి మాయమవడంతో తండ్రి వాటిని గురించి పట్టించుకోలేదు.

ప్రాక్టీ షనర్ క్రింది రెమిడీ ఇచ్చారు.
CC10.1 Emergencies + CC12.4 Autoimmune diseases + CC15.1 Mental & Emotional tonic + CC20.3 Arthritis…6TD

కేవలం నెల రోజుల లోనే అబ్బాయికి 60 శాతం మెరుగుదల కనిపించింది. నొప్పి మంట బొబ్బలు కొంచం చిన్నగా అయ్యాయి. దురద కూడా కొంచం తగ్గి వ్రేళ్లను కదప గలుగు తున్నాడు.రెండు నెలల లో పూర్తిగా తగ్గిపోయి సైకిలు మీద స్కూలుకు వెళ్ళడం కూడా  ప్రారంభిoచాడు. ఇతే ప్రాక్టీషనర్ మోతాదును తగ్గించడం కుదరలేదు ఎందుకంటే అబ్బాయి తనకు పూర్తిగా తగ్గిపోవడంతో మరలా రాలేదు. అంతేకాదు అబ్బాయి ప్రతీ రోజు ఆనందంగా సైకిలు తొక్కుకుంటూ స్కూలుకు  వెళ్ళడం చూస్తూ ప్రాక్టీషనర్ సంతృప్తి చెందుతున్నారు. ఈ విధంగా సంవత్సరం గడిచిపోయినా అబ్బాయికి సమస్యలేవీ పునరావృతం కాలేదు.

ప్రోస్టేట్ క్యాన్సర్ మరియు భయాలు 02799...UK

54 సంవత్సరాల వ్యక్తి 2017 మార్చి 23 వ తేదీన ప్రోస్టేట్ క్యాన్సర్ గురింఛి  చికిత్సా నిపుణుడిని కలిసారు.  గత మూడు నెలలు గా వీరు రాత్రులందు అధిక మూత్ర వ్యాధి (నోక్టూరియా)తో బాధ పడుతున్నారు. 2017 ఫిబ్రవరి 16 వ తేదీన వీరి పి.ఎస్.ఏ (ప్రోస్టేట్ స్పెసిఫిక్ అంటిజెన్) 37 ng/mL ఉంది.  ఇతను గత 25 సంవత్సరాలుగా చీకటి అంటే భయపడే ఫోబియా తో బాధపడుతున్నారు. చీకటి పడితే బయటకు కూడా పోరు. ఇది ఇలా ఉండగా ఇటీవలే ఇతనికి క్యాన్సర్ అని రిపోర్టులు తెలపడంతో గత రెండు వారాలుగా అతనిలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు ఎక్కువవుతూ వచ్చాయి. MRI స్కానింగ్ తీయించుకోవాలన్నా భయంగా ఉంది. రోగి ఈ సమస్యల నిమిత్తం ఏ ఇతర మందులు వాడడం లేదు. ఇతనికి క్రింది రెమిడీ ఇవ్వబడింది.

ప్రోస్టేట్ మరియు నోక్టూరియా వ్యాధికి:
#1. CC2.1 Cancers - all + CC2.3 Tumours & Growths + CC4.2 Liver & Gallbladder tonic + CC10.1 Emergencies + CC13.1 Kidney & Bladder tonic + CC14.1 Male tonic + CC14.2 Prostate…QDS

భయాలు మరియు ఆత్మ హత్యా ధోరణులకు:  
#2. CC4.2 Liver & Gallbladder tonic + CC10.1 Emergencies + CC13.1 Kidney & Bladder tonic + CC15.1 Mental & Emotional tonic + CC15.2 Psychiatric disorders + CC17.3 Brain & Memory tonic + CC18.1 Brain disabilities…QDS

2017 ఏప్రిల్ 10 వ తేదీన  పేషంటు తన మానసిక స్థితి 30 శాతం మెరుగయ్యిందని ఐతే రాత్రిపూట మూత్ర విసర్జనలో ఏమాత్రం మెరుగుదల లేదని తెలిపారు. 2017 జూన్ 18 వ తేదీన నిర్వహించిన రక్త పరీక్షలో  PSA లో తగ్గుదల అనగా 18 ng/mL గా ఉన్నట్లు నోక్టూరియా సమస్య విషయంలో 40 శాతం మెరుగుదల కనిపించిందని తెలిపారు.  అతనికి మానసిక రుగ్మతల విషయంలో 75 శాతం మెరుగుదల కనిపించి చీకటి అంటే భయం పోయి ప్రశాంతంగా ఉండగలుగుతున్నానని తెలిపారు.   #1 & #2 లు కొనసాగించ బడ్డాయి.

2017 అక్టోబర్ 3 వ తేదీన నిర్వహించిన రక్త పరీక్షలో ఇతని  PSA 8.5 ng/mL, చేరుకున్నట్లు తెలిసింది. నోక్టూరియా విషయంలో 60 శాతం మానసిక భయాల విషయంలో 60% మెరుగుదల కనిపించింది. ఇప్పుడు అతనికి ఆత్మహత్య చేసుకుందామనే ఆలోచనలు రావడం లేదు. కనుక #1 & #2 డోసెజ్ నిTDS కి తగ్గించారు. పేషంటు ఇప్పుడు ప్రశాంతంగా ఉండగలగడంతో 2018 జనవరి 14 వ తేదీన MRI స్కానింగ్ తీయించుకొనగా ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నట్లు తెలిసింది. ఆపరేషన్ గానీ రేడియో తెరపీ గానీ చేయించుకోవాల్సిందిగా  సూచించారు. మార్చి 18 న అతనికి ఆపరేషన్ చేశారు. జూన్ 22 న ఇతని  PSA  1.2 ng/mL కు చేరుకుంది.  నోక్టూరియా పూర్తిగా తగ్గిపోయింది.  ఆగస్టు 24 నాటికి ఇతని మానసిక భయాలు ఆందోళనలు 100 శాతం తగ్గిపోయాయి. చీకటి అంటే భయం పోయి రాత్రిళ్ళు ఎక్కడికయినా వెళ్లవలసి వస్తే భయం లేకుండా వెళ్లగలుగుతున్నారు. #1 ని OD కి  #2 ను BD స్థాయికి తగ్గించారు. 2018 అక్టోబర్ 28న PSA స్థాయి 0 కి చేరుకుంది. అంతేకాక ఇతని క్యాన్సర్ పూర్తిగా తగ్గిపోయింది. పేషంటు ను పై రెండు రెమిడీలు ముందస్తు జాగ్రత్త కోసం కొనసాగించ వలసిందిగా సూచించడమైనది. 

రీసెర్చ్ టీం వారు సూచించిన ప్రకారం సంపాదకుని వ్యాఖ్య:  తీవ్రమైన వ్యాధి విషయంలో అభ్యాసకుని యొక్క మరొక విజయముగా దీనిని చెప్పుకోవచ్చు. స్వామి పట్ల ఆమెకు ఉన్న ప్రేమ, రోగి యొక్క నమ్మకం  చికిత్సను వేగవంతం చేశాయి. ఐతే కొంబోలు ఎంచుకునేటప్పుడు ఏది అవసరమో  అదే తీసుకోవాలి కానీ అదనముగా కొంబోలు చేర్చడం వలన చికిత్స నెమ్మదిస్తుంది. ఈ పేషంటు యొక్క కోంబోల విషయంలో  చూసినట్లయితే  #1 లో  CC4.2 Liver & Gallbladder tonic, CC10.1 Emergencies మరియు  CC14.1 Male tonic (ఇది CC14.2లో ఉంది ) ఇవ్వకుండా ఉండవలసింది. అలాగే  #2,లో  CC4.2 Liver & Gallbladder tonic, CC10.1 Emergencies, CC13.1 Kidney & Bladder tonic (ఇది  #1లో ఉంది ) మరియు CC17.3 Brain & Memory tonic అవసరంలేదు. అంతేకాకుండా CC15.1 మరియు  CC18.1 రెండూ CC15.2లో చేర్చబడి ఉన్నాయి.

ఇన్ఫ్లమేటరీ గ్లూకోమా 02799...UK

62 సంవత్సరాల మహిళ 2017 జూన్ నుండి కుడి కంటిలో వత్తిడి మరియు అస్పష్టమైన దృష్టితో బాధపడుతూ చికిత్స కోసం ప్రాక్టీషనర్ ను కలిసారు. రెండునెలల క్రితం ఇన్ఫ్లమేటరీ గ్లూకోమా గా ఈ వ్యాధిని నిర్ధారించారు. దీని కోసం కంటిలో వేసే చుక్కలు, స్టెరాయిడ్లు (ఇవి కంటి నరాల పైన వత్తిడి కల్పించే అవకాశం ఉన్నప్పటికీ, దీనిని వాడడం తప్పనిసరి) వాడారు. అలాగే 2017 అక్టోబర్ 22 తేదీన శస్త్రచికిత్స కూడా చేయించుకున్నారు. దీని ఫలితంగా కంటి దృష్టి మెరుగు పడింది. కానీ దురదృష్టవశాత్తూ వారం రోజులలోనే ఈమె ఎడమ కంటికి ఇదే సమస్య వచ్చింది. దీనిని గ్లూకోమా గా నిర్ధారించారు. దీని అనంతరం వాపు కూడా ఏర్పడింది.  డాక్టర్లు యధావిధిగా  కంటిలో చుక్కలు స్టెరాయిడ్లు  ఇచ్చారు. వాపు నివారణ కోసం శస్త్ర చికిత్స తప్పనిసరి అని చెప్పారు. పేషంటు కంటిలో చుక్కలు తీసుకున్నారు కానీ స్టెరాయిడ్లు తీసుకోలేదు అలాగే ఆపరేషన్ చేయించుకోవడం కూడా ఈమెకు ఇష్టం లేదు. ఈ కంటి చుక్కలు తప్ప వేరే ఇతర ఆలోపతి మందులేవీ వాడడం లేదు. ఈమెకు 2017 డిసెంబర్ 22 న క్రింది రెమిడీ ఇవ్వబడింది

గ్లూకోమా నిమిత్తము :                                                                                 
#1. CC4.2 Liver & Gallbladder tonic + CC7.1 Eye tonic + CC7.3 Eye infections + CC7.4 Eye defects + CC7.5 Glaucoma + CC10.1 Emergencies + CC13.1 Kidney & Bladder + CC15.1 Mental & Emotional…QDS

వాపు నిమిత్తము :
#2. Prednisolone nosode…QDS

రెండు వారాల తరువాత ఆమెకు వత్తిడి మరియు  దృష్టిలో 50%మెరుగనిపించింది. రెండు నెలల తరువాత అనగా 2018 మార్చి 3 వ తేదీన హాస్పిటల్ లో చూపించగా ఆమె ఎడమ కంటిలో వత్తిడి సాదారణ స్థాయిలోనే ఉందని నిర్ధారణ అయ్యింది. కనుక ఆమెకు శస్త్ర చికిత్స అవసరం లేదని ఐతే సంవత్సరానికి ఒకసారి పరీక్ష చేయించుకుంటే చాలు అని చెప్పారు. పేషంటు ఈ విషయం చెప్పి తనకు నూరు శాతం తగ్గిపోయిందని చెప్పడంతో  #1 మరియు  #2 లను TDSకు తగ్గించడం జరిగింది. 2018 సెప్టెంబర్ 8 వ తేదీన పేషంటు కలిసినప్పుడు  ఆమె చాలా ఆరోగ్యంగా కంటి దృష్టి మెరుగ్గా కనిపించడంతో  #1 మరియు #2 లను BDకి తగ్గించడం జరిగింది. సమస్య పునరావృతం కాకుండా ఉండడానికి రెమిడీ లను దీర్ఘకాలము కొనసాగించాలని పేషంటు నిర్ణయించుకున్నారు.

సంపాదకుని వ్యాఖ్య: ప్రాక్టీషనర్ అవసరమైన దానికంటే అధికంగా రెమిడీ లను ఉపయోగించారు. ఉదాహరణకు #1 లో, CC4.2, CC7.4, CC10.1 మరియు CC13.1 అవసరం లేదు. ఈ చికిత్స వలన వ్యాధి తగ్గడానికి రెండు నెలలు పట్టింది. గతంలో   ఇటువంటి వ్యాధికి (వార్తా లేఖ  2018  మార్చి ఏప్రిల్  సంపుటి 9 సంచిక 2) ఒక నెలలోనే పూర్తి నివారణ చేకూరింది. త్వరగా నివారణ చేకూరడానికి అవసరమైన నివారణులను మాత్రమే ఉపయోగించాలి అనేదానికి ఇది చక్కని ఉదాహరణ.

సూర్య తాపము వలన ఏర్పడిన చర్మవ్యాధి 03567...USA

57 సంవత్సరాల మహిళ గత 35 సంవత్సరాలుగా సూర్య తాపం వలన కలిగిన చర్మ వ్యాధితో బాధపడుతున్నారు. ఆమె చర్మము ఎంత సున్నితంగా ఉండేదంటే కొంచెంసేపు ఎండ లో ఉన్నా చర్మం కమిలిపోయినట్లుగా అయ్యేది.  ఇలా ఎండలో తిరిగినప్పుడు   ఆమె చర్మం పై దద్దుర్లు ఏర్పడి రసిలాంటిది కారటం ప్రారంభమవుతుంది. దాంతోపాటు గుండె దడ కూడా ఏర్పడుతూ ఉండేది. ఆమె వ్యాధి ప్రారంభం అయినప్పటి నుండి కార్టికోస్టెరాయిడ్ క్రీములు  డాక్టర్ సూచించిన విధంగా వాడుతూ ఉండేది. దానివలనకొన్నిరోజులకు దద్దుర్లు కొంచెం తగ్గినట్లు అనిపించేది. కానీ కొంచెంసేపు ఎండలో తిరగగానే తిరిగి ఏర్పడేవి.

అందుచేత ఆమె ఎండలోకి వెళ్లే ముందు డాక్టరు ఇచ్చిన క్రీం రాసుకొనివెళ్ళేది. దీనివలన ప్రారంభంలో ఉపశమనం కలిగేది కానీ రాను రాను పరిస్థితిమరింత అధోగతికి దిగజారింది. డాక్టర్లు ఇచ్చే మందుల వలన శాశ్వత పరిష్కారం ఏమీ లభించలేదు.

ఈ సమస్యను ఎదుర్కోవడానికి ఆమె ఉదయంపూట నడవడం మానేసింది. అలాగే బయటకు వెళ్లవలసి వచ్చినప్పుడు గొడుగు, చేతులను పూర్తిగా కప్పి ఉంచే జాకెట్, కాళ్ళకు ప్యాంటు వంటివి  తీసుకుని వెళ్ళడంతో పాటు తను ప్రయాణించే కారుకు సన్ రైజర్స్ కూడా ఏర్పాటు చేసుకుంది. ఇలా తన జీవన విధానంలో ఎన్నో మార్పులు చేసుకుంది. అయినప్పటికీ ఫలితం లేకపోయేసరికి తాను అమితంగా ప్రేమించే తన ఉద్యోగాన్ని కూడా వదిలివేయాలని అనుకుంది. ఎందుకంటే ఆమె ఒక సంస్థలో  ప్రత్యామ్నాయ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూ ఉన్నందువలన మధ్యాహ్నం ఎండలో పిల్లలను ఆట స్థలానికి తీసుకు వెళ్ళవలసిన పరిస్థితి ఉండేది కనుక ఉద్యోగాన్ని వదులుకోక తప్పలేదు. తప్పనిసరి పరిస్థితిలో ఎండలో వెళ్ళవలసి వస్తే  ఆమె వెడల్పైన టోపీ, పైన తెలిపిన ఆచ్ఛాదనలతో తన శరీరంపై ఏ మాత్రం సూర్యరశ్మి పడకుండా జాగ్రత్త పడుతూ బయటకు వెళ్ళేది. కానీ ఈ విధంగా వెళ్ళడం  ఆమెకు ఎంతో అసౌకర్యాన్ని చిరాకును కలిగించేవి. ఆమెకు డాక్టర్లు యాంటీ డిప్రెసెంట్స్ కూడా ఇచ్చారు. కానీ వాటిని ఆమె  వాడలేదు. తను ప్రాక్టీషనర్ అయిన వెంటనే తనకు తానే వైద్యం చేసుకొని ఉపశమనం పొందారు.

27 జూన్ 2018 తేదీన ఆమె క్రింది రెమిడీ తనకోసం తయారు చేసుకున్నారు.

CC8.1 Female tonic + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC21.1 Skin tonic + CC21.3 Skin allergies + CC21.10 Psoriasis…QDS  ఇదే రెమిడీని నీటిలో కలుపుకొని వ్యాధికి ప్రభావితమైన చర్మంపై కూడా రాసుకునేవారు. ప్రస్తుతం ఆమె డాక్టర్లు సూచించిన స్టెరాయిడ్ క్రీమ్ మాత్రమే వాడుతూ ఉన్నారు.

వారం రోజులు తరువాత ఎండకు  ప్రభావితమైన చర్మంలో 10 శాతం ఉపశమనం కనిపించింది. అయితే ఆమెకు తీవ్రమైన పుల్లౌట్  ఏర్పడి ఆమె చేతులను మంటలో వేసినంత బాధ కలిగింది. అయితే ఒక టవల్లో ఐస్ క్యూబ్స్ వేసుకొని మంట ఏర్పడిన చర్మంపై మెల్లిగా రాస్తూ ఇంత బాధలో కూడా రెమిడీని QDS గా కొనసాగించారు. ఈ పుల్లౌట్ పది రోజులు ఇబ్బంది పెట్టి ఆ తర్వాత మెల్లిగా తగ్గడం ప్రారంభించింది. అప్పటినుండి తన చర్మం వ్యాధినుంచి త్వరగా కోలుకోవడం ప్రారంభమైంది. చర్మంపై ఉన్న అసౌకర్యము దురద తొలగిపోయాయి. అలాగే దీంతో పాటుగా వచ్చే గుండెదడ కూడా మందులేవి వాడకుండానే తగ్గిపో నారంభించింది. ఒక అద్భుతం జరిగిన రీతిగా జూలై నెలలో ఆమె ఊహకు అందనంత వేగంగా వ్యాధి నయం అవ్వడమే కాకుండా ఆమె చర్మము సాధారణ స్థాయికి చేరుకుంది.  జులై 30 నాటికి ఆమెకి 98 శాతం ఉపశమనం కలుగుగా మోతాదు BD కి తగ్గిం చడం జరిగింది. మరికొద్ది రోజుల్లోనే ఆమెకు 100 శాతం ఉపశమనం కలగడంతో మోతాదును ఆగష్టు రెండవ పక్షం నాటికి OD కి తగ్గించడం జరిగింది. సెప్టెంబర్ నాటికి ఆమె నిత్యకృత్యముల కోసం బయటకు రావడం ప్రారంభించారు.. ఆవిధంగా కొన్నినిమిషాలు బయట ఎండలో ఉన్నాకూడా ఆమెచ ర్మము ప్రభావితం కాకపోవడం గమనించారు. అయితే ఎక్కువ సమయం ఎండలో గడపవలసి వచ్చినప్పుడు ముందు జాగ్రత్తకోసం సన్ స్క్రీన్ ఉపయోగించడం, పొడుగుచేతుల జాకెట్, ప్యాంటు, గొడుగువంటివి తీసుకు వెళ్ళ డం మానలేదు. అలాగే స్టెరాయిడ్స్ వాడడం  పూర్తిగా మానేసారు. అక్టోబర్ 2018 నాటికి ఈ రెమిడీని వాసన లేని క్రిముకు కలుపుకొని బాహ్యచర్మము పైన రాయడానికి OD గాకొనసాగించ సాగారు.

పేషంటువ్యాఖ్య :
37 సంవత్సరాలుగా డాక్టర్లు నయం చేయలేని వ్యాధిని స్వామి దయతో వైబ్రియానిక్స్ నయం చేసినందుకు కృతజ్ఞురాలిని. 

పిల్లి కంటిలో హెర్పీస్ 03567...USA

ఒక జంతు సంరక్షణ కేంద్రం యొక్క నిర్వాహకుడు తనవద్ద మధ్యవయస్సులోఉన్న ఒక మగపిల్లికి వచ్చిన జబ్బు నిమిత్తము చికిత్సా నిపుణుడి యొక్క సహాయం అర్థించాడు. ఈ పిల్లికి ఎడమ కంటి నుండి నీరు కారుతుంది. కుడి కంటిలో ఒక పుండులాంటిది ఏర్పడింది (ఫోటోచూడండి). ఈ రుగ్మత కారణంగా పిల్లి ఒక మూలన కూర్చుని ఏమీ తినకుండా  పగలు రాత్రి నిశ్శబ్దంగా దిగులుగా ఉంటోంది. పిల్లికి అనారోగ్యం కలిగిన వెంటనే వారు దగ్గరలో ఉన్న పశువుల డాక్టర్ కి చూపించారు కానీ ఏమి ప్రయోజనం కనిపించలేదు. డాక్టర్ దీనిని పిల్లి జాతికి చెందిన హెర్పీస్ గా గుర్తించారు. ఇది తగ్గటానికి కంటి చుక్కలను ఇచ్చారు. కానీ రెండునెలల పాటువాడినా ఏమి ప్రయోజనం కనిపించలేదు. సంస్థ వారికి ధన వనరులు లేక  మెరుగైన వైద్యం చేయించలేకపోయారు అందుచేత వైబ్రియానిక్స్ మందులు ప్రయత్నించాలని యోచించారు. 

15 జులై 2018 న చికిత్సా నిపుణుడు క్రింది రెమిడీ ఇవ్వడం జరిగింది:
CC1.1 Animal tonic + CC7.3 Eye infections + CC10.1 Emergencies + CC15.1 Mental & Emotional tonic + CC21.8 Herpes…3 గోళీలు  పిల్లి తాగే గిన్నెలో నీటిని పోసి ఈ గోళీలు వేసి పిల్లి చేత ప్రతిరోజు తాగించడం. ఈ విధంగా ప్రతి రోజు నీళ్ళు  మారుస్తూ పిల్లికి  ఎంతవరకు ఉపశమనం కలిగిందో పర్యవేక్షించడం. 

జులై 24వ తేదీన అనగా రెమిడి ఇచ్చిన తొమ్మిది రోజుల తర్వాత నిర్వాహకుడు  చికిత్స నిపుణుడిని పిలిపించి పిల్లి కి నూటికి నూరు శాతం తగ్గి పోయిందని ఇప్పుడు పిల్లికి ఏ మాత్రం వ్యాధి లక్షణాలు లేకుండా చాలా చక్కగా ఉందని చెప్పాడు (ఫోటో చూడండి).  పిల్లి ఇప్పుడు తన యొక్క బోనులో చక్కగా కూర్చో గలుగుతోందని చక్కగా తిరుగుతోందని హుషారుగా ఉండగలుగు తోందని  చెప్పాడు. ఐతే చికిత్సా నిపుణుడు ముందు జాగ్రత్త కోసం  రెమెడీని మరొక 7 రోజులు కొనసాగించవలసిందిగా సూచించారు.

హైపోథైరాయిడ్ 11600...India

43 సంవత్సరాల మహిళకు ఏడు సంవత్సరాల క్రితం హైపో థైరాయిడ్ ఏర్పడినట్లుగా నిర్ధారణ చేయబడింది. ఆమెకు థైరాక్సిన్ రోజుకు 100 mg సూచించబడింది.  ఒక సంవత్సరం తర్వాత ఆమెకు దురద, చర్మం పొడిబారటం, తలపోటు ఏర్పడ్డాయి. మామూలుగా డాక్టర్ కి చూపించుకోవడంలో భాగంగా మార్చ్ 2018 పరీక్ష చేయించగా టి ఎస్ హెచ్ విలువ 7.82 ఉన్నది (మామూలుగా ఇది 0. 13 నుండి  6.33 వరకు ఉండాలి). పేషంటు ప్రాక్టీషనర్ వద్దకు 2018 ఆగస్టు 3వ తేదీన వచ్చి క్రింది రెమిడి తీసుకొన్నారు.

CC6.2 Hypothyroid + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic…TDS

పది రోజుల తర్వాత పేషెంట్  తనకు  దురద, చర్మం పొడిబారటం, తలపోటు విషయంలో 20 శాతం మెరుగుదల కనిపించిందని చెప్పారు.  నెల రోజుల తర్వాత వ్యాధి లక్షణాల విషయంలో 50 శాతం మెరుగుదల మాత్రమేకనిపించినప్పటికీ టి ఎస్ హెచ్ విలువ మాత్రం 1.24 కు అనగా సాధారణ స్థాయికి చేరింది. దీంతో పేషెంట్ ఎంతో సంతృప్తి చెంది స్వయం నిర్ణయంతో తను  తీసుకుంటున్న థైరాక్సిన్ 100μg నుండి 50μg కి తగ్గించారు. అదే సమయంలో చికిత్స నిపుణుడు మోతాదును BD కి ఆ తర్వాత అక్టోబర్ 1 నుండి అనగా డాక్టర్ థైరాక్జిన్  తీసుకోవడం ఆపమని చెప్పిన నాటినుండి మోతాదును OD కి తగ్గించడం జరిగింది. అక్టోబర్ 28 తేదీన టి ఎస్ హెచ్ తిరిగి 5.04 చేరింది. దీంతో చికిత్స నిపుణుడు బహుశా అవసరమైన దానికంటే ముందే మోతాదు తగ్గించడం వలన ఈ  సమస్య ఏర్పడిందేమో అని అని భావించి మోతాదును తిరిగి  కొంత కాలంTDSకు పునరుద్ధరించడం జరిగింది.

టెన్నిస్ఎల్బో 03511...UK

58 సంవత్సరాల వ్యక్తికి 6 నెలల క్రితం కుడి ముంజేతికి టెన్నిస్ ఎల్బో ఏర్పడింది. ఇతను ఒక టెన్నిస్ ప్లేయర్ క్రమం తప్పకుండా ఆట ఆడే వాడు కానీ ఇతనికి ఏర్పడిన రుగ్మత కారణంగా ఆటను మాని వేయవలసి వచ్చింది. ఇతను చిన్న చిన్న వస్తువులను కూడా పైకి లేప లేక పోయేవాడు. ఫిజియోథెరపీ మరియు ఇంజక్షన్ అతని యొక్క బాధను నివారణ చేయలేకపోయాయి. ఫిజియోథెరపీ చేసే వ్యక్తి ఇతని యొక్క  భుజం జాయింట్ దగ్గర ఉండే స్నాయువులు (టెండాన్స్) చాలా పాడైపోయాయని అందుచేత అతనికి శస్త్ర చికిత్స అవసరం అని చెప్పాడు. అంతేకాక  నాప్రాక్సోన్ టాబ్లెట్ వాడ వలసిందిగా సూచించాడు. అయినప్పటికీ పేషెంటుకు  ఏమాత్రం ఉపశమనం కలుగలేదు. కనుక  పేషెంట్ ఈ మందులు వేసుకోవడం మానేసాడు. శస్త్ర చికిత్స చేయించుకోవడం కూడా ఇష్టం లేక 2018 జూలై 7వ తేదీన చికిత్సా నిపుణుడిని కలిసి క్రింది రెమిడీ వాడటం ప్రారంభించాడు:
CC20.1 SMJ tonic + CC20.4 Muscles & Supportive tissue...TDS

రెండు వారాల తర్వాత నొప్పి 90% తగ్గిపోయింది. కానీ చెయ్యి చిన్న వస్తువులు లేపడానికి సహకరించడం లేదు. అయితే చికిత్సా  నిపుణుడు మోతాదును BD తగ్గించడం జరిగింది. మరో రెండు వారాల తర్వాత అనగా ఆగస్టు 5వ తేదీ నాటికి పేషంటు తనకు నొప్పి పూర్తిగా తగ్గిపోయిందని తన చేతిని అన్నివైపులా చాపగలుగుతున్నానని వస్తువులు పైకి లేపుతున్నా నొప్పి రావడం లేదని తెలిపాడు. నిపుణుడు మోతాదును మరో రెండు వారాలు వాడవలసిందిగా సూచించాడు. అక్టోబర్ 13వ తేదీన చికిత్సా నిపుణుడు పేషెంటును చివరి సారి చూసినప్పుడు నొప్పి ఏమాత్రం పునరావృతం కాకుండా ఆరోగ్యంగా ఉన్నట్టు మునుపటి వలే వారానికి రెండుసార్లు టెన్నిస్ కూడా ఆడగలుగుతున్నట్టు పేషంటు తెలిపారు.

ఫ్రోజెన్ షోల్డర్ (బిగిసుకుపోయిన భుజము) 02802...UK

54 సంవత్సరాల వైబ్రో చికిత్సా నిపుణురాలు మరియు ఫిజిషియన్  2018 మే 6 వ తేదీ నుండి భుజంలో నొప్పి తో బాధ పడుతూ ఉన్నారు. మొదట  నొప్పి తీవ్రంగా లేకపోవడంతో బహుశా ఎక్కువగా పని చేయడం వల్ల కలిగిందేమో అని ఆవిడ భావించి పట్టించు కోలేదు. తరువాత రెండు రోజుల్లో లో నొప్పి ఎంత తీవ్రమయ్యిందంటే తనకు రాత్రంతా నిద్ర పట్టలేదు.  అందు చేత ఆమె 2018 మే 8వ తేదీన తన దగ్గర ఎప్పుడూ ఉండే మూవ్ వెల్ రెమిడీ తీసుకున్నారు.

#1. CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue + CC20.5 Spine…6TD 

ఈ రెమిడి ఆమెకు ఏ మాత్రం ఉపయోగపడలేదు అంతేకాక నొప్పి అంతకంతకు మరింత ఎక్కువ కాసాగింది. మే 10 నాటికి భుజాన్ని కదపటం కూడా చాలా కష్టమయింది.  అందుచేత ఇది ఫ్రోజెన్ షోల్డర్గా ఆమె గుర్తించారు. డ్రైవింగ్ చేయడం డ్రెస్ వేసుకోవడం బ్రష్ చేసుకోవడం  దువ్వెన తో తల దువ్వుకోవడం ఆఖరికి స్పూన్ నోట్లో పెట్టుకోవడం కూడా  కష్టమైపోయింది. అటువంటి స్థితిలో ఆమె క్రింది రెమిడీ తయారుచేసుకుని వాడటం ప్రారంభించారు.

#2. CC20.4 Muscles & Supportive tissue + CC20.7 Fractures…ప్రతి పది నిమిషాలకు ఒక డోస్ చొప్పున 30 నిమిషాల వరకు ఆ తర్వాత 6TD

ఈ రెమిడీ ఎంత అద్భుతంగా పని చేసింది అంటే మరుసటి ఉదయానికి 50 శాతం రెండవ రోజు కి 90 శాతం మూడవ రోజు  నూరు శాతం బాధ నివారణ అయ్యింది. దీనితో ఈ చికిత్సా నిపుణురాలు మోతాదును TDS గా 3 రోజులు, OD గా మరొక 3 రోజులు వాడి వారం లోపుగా మానివేశారు. ఇలా చేసి ఇప్పటికి 5 నెలలైనా నొప్పి పునరావృతం కాలేదు.  

కర్ణిక కంపనము (ఏట్రియల్ ఫిబ్రిలేషన్) 02802...UK

70 సంవత్సరాల వ్యక్తి 2017 మార్చి 8వ తేదీన మొదటిసారి చికిత్సా నిపుణుడు వద్దకు వచ్చి తనకు రోజుకు అనేక సార్లు గుండె దడ ఏర్పడుతోందని చెప్పాడు. 2014 లో అతనికి ఏట్రియల్ ఫిబ్రిలేషన్ (ఇది గుండె పై గదులలో ఏర్పడి కొన్ని నిమిషాల పాటు కొనసాగుతుంది) అనే సమస్య ఉన్నట్లు గుర్తించారు.  దీని కారణంగా అతనికి చాలా చికాకుగా అసౌకర్యంగా ఇబ్బందిగా ఉంటుంది కానీ  కారణం ఏమిటో తెలియరాలేదు. అతను మాట్లాడేటప్పుడు కూడా నెర్వస్ గా  ఫీల్ అవుతూ ఉంటారు. ఇతనికి రక్తపోటు కూడా ఉంది. దానికి మందులు కూడా వాడుతున్నారు.

చికిత్స నిపుణుడు క్రింది రెమిడీ ని 2017 మార్చి 7 వ తేదీన  పేషెంటుకు ఇచ్చారు: 

CC3.1 Heart Tonic + CC3.3 High BP + CC3.5 Arteriosclerosis + CC3.6Pulse irregular + CC3.7 Circulation + CC15.1 Mental and Emotional tonic + CC18.1 Brain disabilities…TDS

పేషెంటుకు మరునాటికల్లా తేలికగా ఉన్నట్లు అనిపించి ఆ తర్వాత రెండు వారాల వరకు అతనికి గుండె దడ రాలేదు. ఇతను తన యొక్క ఏట్రియల్ ఫిబ్రిలేషన్ విషయంలో నూరు శాతం ఉపశమనం పొందారు అయినప్పటికీ తనమోతాదును TDS గా  కొనసాగించారు. చికిత్సా నిపుణుడు జూన్ 5 వ తేదీన పేషంటును చూసినప్పుడు మోతాదు OD  కి తగ్గించారు. అనంతరం దీన్ని 2017 నవంబర్ 22 నుండి OW గా మార్చారు. 2018 నవంబర్ నాటికి పేషెంటు ఇదే మెయింటినెన్స్ డోస్ కొనసాగిస్తున్నారు.

2018 జూన్ 27న పేషెంట్ ఇచ్చిన వాంగ్మూలం:  దాదాపు 5 సంవత్సరాల క్రితం  నా ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణించడం ప్రారంభించింది. రాను రానూ  పరిస్థితి మరింత దిగజారి నడవడం కూడా కష్టంగా మారిపోయింది. ఊపిరితిత్తుల్లో నీరు చేరినట్టుగా చెప్పారు. నాకు యాంటీబయాటిక్స్ మరియు నీరు తగ్గడానికి టాబ్లెట్ లు ఇచ్చారు. ఫ్లూ తగ్గి పోయినప్పటికీ నాకు గుండె దడ ఏర్పడి నా హృదయస్పందన సాధారణ స్థాయి కంటే ఎక్కువగా పెరిగిపోయింది. గత నాలుగైదు నెలలుగా ఈసీజీ మరియు ఎఖో కార్డియో గ్రామ్ వంటి పరీక్షలు కూడా నిర్వహించారు.  అనంతరం హృద్రోగ నిపుణులు నాకు ఏట్రియల్ ఫిబ్రిలేషన్ ఉన్నట్లు  చెప్పారు. ఇక దీంతో జీవితకాలం బాధపడాలి అని కూడా చెప్పారు. ఆ తర్వాత నాకు తెలిసిన విషయం ఏమిటంటే ఇది వైరల్ ఇన్ఫెక్షన్ వలన ఏర్పడినట్లుగా నిర్ధారణ అయ్యింది. ఇటువంటి పరిస్థితుల్లో సాయి వైబ్రియానిక్స్ గోళీలు  నాపై అద్భుత ప్రభావం చూపికేవలం కొద్దివారాలలోనే అనారోగ్యాన్ని పూర్తిగా తొలగించి సాధారణ స్థాయిని కలిగించాయి.

నిద్రలేమి 03562...UK

60సంవత్సరాల మహిళ  తన యొక్క నిద్రలేమి వ్యాధికి చికిత్స కోసం చికిత్సా నిపుణుడిని సంప్రదించింది. గత పది సంవత్సరాలుగా ఈ వ్యాధితో బాధపడుతూ ఇన్ని సంవత్సరాలుగా ఆమె అల్లోపతి చికిత్స తీసుకుంటూనే ఉన్నారు. పేషెంటు తనకు ఇంటివద్ద మరియు ఆఫీస్ లోను ఉన్నటువంటి ఒత్తిడి వలన ఈ నిద్రలేమి వచ్చినట్లుగా భావించారు. ఆమె ప్రతిరోజు రాత్రి 9 నుండి 10 గంటల వరకు నిద్రకు ఉపక్రమింఛేది. నిద్ర మాత్రలు వేసుకున్నా కూడా ఈమెకు రెండు మూడు గంటలే నిద్ర వస్తోంది. చాలా అరుదుగా నాలుగు గంటలు నిద్ర పోగలుగుతుంది. ఈ విధంగా అలోపతి మాత్రలు ఆమెకు ఏమాత్రం సహాయపడేవి కావు.

2018 జూన్ 26వ తేదీన ఆమెకు క్రింది రెమిడీ ఇవ్వబడింది:

CC15.6 Sleep disorders... నిద్రించేందుకు అరగంట ముందు ఒక డోస్ ఆపైన అవసరాన్ని బట్టి ప్రతి అరగంటకు ఒక డోసు చొప్పున నాలుగు డోసులు వరకు తీసుకోవాలి.

ఈమె వైబ్రో గోళీలతో పాటు  అలోపతి మందులు కూడా కొనసాగించారు.  మూడు రోజుల తర్వాత తనకు  కేవలము ఒక సింగిల్ డోస్ తోనే నూరు శాతం అద్భుతమైన నిద్ర పట్టినట్టుగా తెలిపారు. ఆ విధంగా ఏడు గంటల సేపు హాయిగా నిద్రించి ఉదయమే తన పనులకు ఉపక్రమించసాగారు.  ఈ విధంగా నెలరోజులు వాడిన తర్వాత తన స్వయం నిర్ణయంతో అలోపతీ  మందులు తీసుకోవడం మానివేశారు. అయినప్పటికీ ఆమె గాఢంగా నిద్ర పోగలుగుతున్నారు.  ఆమె యొక్క శక్తి స్థాయిలు కూడా పెరిగినట్లుగా అనిపించసాగింది. ఈ విధంగా పునర్బలం పొందిన తర్వాత ఆమె అంతకుముందు తను చేయలేక నిర్లక్ష్యంగా వదిలివేసిన పనులను కూడా పూర్తి చేసుకోగలిగారు. సెప్టెంబర్ లో ఆమె రీఫిల్ కోసం వచ్చారు. అలాగే నవంబర్ 2018 నాటికి ఆమె మోతాదును OD  కొనసాగిస్తూ ప్రశాంతంగా నిద్ర పోగలుగుతున్నారు.

గొంతు ఇన్ఫెక్షన్ 11406...India

88-సంవత్సరముల వయస్సు గల వ్యక్తి గత మూడు వారాలుగా గొంతు నొప్పి మరియు దగ్గుతో బాధపడుతూ డాక్టర్ను సంప్రదించారు. డాక్టర్ అతనికి యాంటీబయాటిక్స్ ఇచ్చారు. వారం రోజులు కోర్సు పూర్తి చేసినప్పటికీ ఏ మాత్రం మెరుగుదల కనిపించలేదు. దీనితో రోగి వైబ్రియానిక్స్ చికిత్స తీసుకోవాలని చికిత్సానిపుణుడిని సంప్రదించారు.

15 జూన్ 2018 తేదీన అతనికి క్రింది కొంబోఇవ్వబడింది:
#1. CC12.1 Adult tonic + CC19.6 Cough chronic...6TD 

నాలుగు రోజులు వాడిన తర్వాత పేషెంటు తనకు గొంతు నొప్పి మరియు గొంతు బొంగురు పూర్తిగా నయం అయ్యాయని దగ్గు కూడా గణనీయంగా తగ్గింది అని చెప్పారు. కానీ ఉదయం పూట అతనికి  గొంతు అసౌకర్యం గానూ  గొంతులో ఏదో వున్నట్లుగానూ బాధపడుతున్నారు. కొన్నిసార్లు తెల్లని చిక్కని కఫం బయటకు వస్తూ ఉండేది. అందుచేత పేషెంటును  #1వ రెమెడీని TDS గా కొనసాగించమని సూచించడం జరిగింది.   

మూడు వారాలు వాడిన తర్వాత కూడా  స్థిరమైన మెరుగుదల కనిపించలేదు అందుచేత చికిత్సా నిపుణుడు తన యొక్క సీనియర్ వైద్య నిపుణులతో సంప్రదించి పేషెంటు నిర్మాణపు  రంగంలో లో పని చేస్తున్నాడా అని అడగడం జరిగింది అతను అవునని చెప్పడంతో 13 జూలై 2018 న  #1 ను  మాన్పించి క్రింది రెమిడి ఇవ్వడం జరిగింది.

 #2. CC17.2 Cleansing + CC19.3 Chest infections chronic...TDS

ఈ రెమిడీ వలన వారం రోజుల్లోనే అతనికి 95 శాతం పెరుగుదల కనిపించింది. జులై 27 నాటికి నూరు శాతం ఉపశమనం కలిగింది. అందుచేత మోతాదును BD  కి అనంతరం OD కి మార్చడం జరిగింది. ఆ తర్వాత  2018 ఆగస్టు 17 నాటికి తన వ్యాధి లక్షణాలు ఏమాత్రం పునరావృతం కాకపోవడం చేత ఆ రోజు నుండి రెమిడీ తీసుకోవడం మాని వేయడం జరిగింది. అక్టోబర్ 2018 నాటికి పెషంటు ఎంతో విశ్వాసంతో  పూర్వ ఇబ్బంది ఏమీ లేకుండా ఉత్సాహంగా ఉంటున్నారు.   

సాధకుని వివరములు

ప్రాక్టీషనర్ 02696...ఇండియా కంప్యూటర్ మరియు ఇంజినీరింగ్ రంగాలలో పోస్ట్ డాక్టరేట్ చేసి ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ యూనివర్సిటీ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు నోడల్ ఆఫీసరుగా వీరు పనిచేస్తున్నారు. అధ్యాత్మిక  కుటుంబ నేపధ్యము కలిగిన వీరికి చిన్నప్పటినుండి సేవ చేయాలనే ధృక్పధం ఉండేది.  వీరు స్వచ్ఛందంగా ప్రజల అవసరాల మేరకు ముఖ్యంగా వృద్ధులు, పిల్లల కోసం అనేక రకాల సహాయము అందించేవారు. 1999 లో వీరు ఒక దేవాలయమునకు వెళ్ళినపుడు అక్కడ సత్యసాయి సంస్థ లోని సేవాదళ్ వీరి చెప్పులను తీసుకొని భద్రపరచడం వీరి హృదయాన్ని కదిలించి ఆ ప్రేమలోని మాధుర్యం, గొప్పతనం వీరి కనులు తెరుచుకునేలా చేసింది. అదే సంవత్సరం వీరికి లభించిన భగవాన్ బాబా వారి దర్శనం వీరిని మంత్ర ముగ్ధులను చేసి వీరి ధృక్పధాన్ని పూర్తిగా మార్చివేసింది. ఆ తరువాత నుండి వీరు సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనడం ప్రారంభించారు. కొంతకాలం పాటు వీరి హృదయంలో ప్రజలతో మమేకం కావాలని వారికి సేవ చేయాలని తపన లోతుగా ఉండేది. కాలేజీ చదివే రోజులలో వీరియొక్క అన్నవాహికలోని పుండును హోమియోపతీ మందులు నయం చేయడం ఎంతగానో కదిలించింది. 2005 లో వీరు పాల్గొన్న సేవా కార్యక్రమంలో వైబ్రియానిక్స్ గురించి విని వైబ్రియానిక్స్ కు ఆకర్షితు లయ్యారు.

వీరు 2005 సంవత్సరంలోనే పేరు నమోదు చేసుకొని రెండువారాల శిక్షణ అనంతరం SRHVP మిషన్ తీసుకున్నారు. ఎందుకంటే ఆ రోజులలో 108CCబాక్సు ఇంకా రూపు దిద్దుకోలేదు. మొదట తన చుట్టాలకు, స్నేహితులకు మందులు ఇవ్వడం ద్వారా తన వైబ్రియానిక్స్ ప్రస్థానం ప్రారంభించారు. స్వామి యొక్క కృప వలన మెల్లగా పేషంట్లు పెరగ నారంభించారు. తన పైనా, వైబ్రియానిక్స్ పైనా స్వామి చూపించిన అనుగ్రహానికి కొలమానం వంటి ఒక లీలను ఈ సందర్భంగా వీరు గుర్తు చేసుకుంటున్నారు. ఒకసారి వైబ్రియానిక్స్ అంటే నమ్మకం లేని ఒక సాయి సభ్యునికి దీనిని గురించి వివరించారు. ఐతే అతడికి నమ్మకం బలపడలేదు. ఈ మందులు నిజంగా రోగాన్ని తగ్గిస్తాయా అనే అపనమ్మకంతోనే ఉన్నాడు. ఆరోజు రాత్రి స్వామి అతడికి కలలో కనబడి వైబ్రియానిక్స్ గురించి వివరించి ప్రాక్టీషనర్ కు సహాయ పడుతూ ఉండమని చెప్పారట. ఈ సంఘటన వీరిద్దరినీ ఎంతో కదిలించింది.

ఈ అభ్యాసకుడు అనేక  కేసులకు విజయవంతంగా చికిత్సలు అందించారు. అవి ఆస్తిగ్మాటిజం, దీర్ఘకాలిక కడుపు నొప్పి, మోకాలి నొప్పి, సైనసైటీస్, ఛాతీ ఇన్ఫెక్షన్, స్పాండిలైటిస్, చర్మ సమస్యలు, థైరాయిడ్, బి.పి. ఋతు సమస్యలు, వత్తిడి, నిద్ర రుగ్మతలు, మానసిక రుగ్మతలు మొదలగునవి.  మానసిక సమస్యలు,భావోద్వేగాల పరంగా బాధితులు, హైపర్ యాక్టివ్ పిల్లలు, మరియు ముసలి వారి సమస్యల విషయంలో వీరి అనుభవం అభిలషనీయమైనది.   ఇటువంటి కేసుల విషయంలో ఆలోపతి మందులు రోగాన్ని అణిచి వేస్తే వైబ్రో రెమెడీలు రోగాన్ని మూలంతో సహా నిర్మూలనం చేస్తాయని వీరి అభిప్రాయము.  వీరు ప్రాక్టీస్ మొదలు పెట్టిన తొలి నాళ్ళలో 2 సంవత్సరాల  హైపర్ యాక్టివ్ అమ్మాయిని వీరి వద్దకు తీసుకొని వచ్చారు. ఈమె అర్ధరాత్రి నిద్రలేచి టి.వి. ఆన్ చెయ్యమని చెప్పి కుటుంబసభ్యులందరినీ తనతో పాటు టి.వి. చూడమని చెప్పేది. ఆమె మాట వినక పోతే తలను గోడకు కొట్టుకునేది  NM6 Calming + SR422 Cherry Plum…OD అద్భుతాలు సృస్టించి వారం లోనే ఆమె అర్ధరాత్రి నిద్ర లేవడం మానేసింది!

వీరు బాచ్ ఫ్లవర్ నివారణలతో అద్భుత ఫలితాలను పొందారు.  ఆధిపత్యం చలాయించే మనస్తత్వం ఉన్న ఒక 49 సంవత్సరాల వ్యక్తి ఆఫీసు నుండి రాగానే నిశ్శబ్దంగా తన గదిలోనికి వెళ్ళిపోతాడు. తన కుటుంబ సభ్యులతో మాట్లాడడం కానీ వారితో కలిసి భోజనం చేయడం గానీ ఏమీ చేయడు. ఇలా 10 సంవత్సరాల నుండి కొనసాగుతోంది. ఇతడికి SR419 Beech + SR446 Vine. ఇవ్వబడింది. వారం తరువాత కుటుంబ సభ్యులు చెప్పిన దాని ప్రకారము ఈ వ్యక్తి  పది సంవత్సరాల తరువాత  మొదటిసారి కుటుంబ సభ్యులతో కలసి భోజనం చేశాడని చెప్పి చాలా సంతోష పడ్డారు. 

11-సంవత్సరాల హైపర్ యాక్టివ్ పిల్లవాడు తన 5 వ ఏటనుండీ హింసాత్మక ప్రవర్తన కలిగి ఉన్నాడు. ఇతడి తల్లి అనేక రకములైన చికిత్సలు చేయించి ఫలితం లేక నిరాశగా ఉన్నారు. చివరికి ఆ బాలుడిని మానసిక వికలాంగుల పాఠశాలలో వేద్దామని కూడా నిర్ణయించుకుంది. వీరు స్వామిని ప్రార్ధించి ఈ బాలునికి  NM4 Brain-2 + NM5 Brain Tissue Salts (TS) + NM6 Calming ఇచ్చారు. రెండు వారాల లోనే ఈ బాలుడు తన తల్లిని కొట్టడం మానేసి కాస్త స్థిమితంగా ఉండడం ప్రారంభించాడు. నెల రోజుల తరువాత అబ్బాయి పూర్తిగా కోలుకొని ప్రస్తుతం మందులు తీసుకోవడం కొనసాగిస్తున్నాడు. 

ప్రారంభంలో అభ్యాసకునికి మిషన్ తో మందులు తయారు చేయడం చాలా కాలయాపన గా ఉండేది. స్వామి దయతో 108CC బాక్సు వచ్చిన తరువాత మందులు ఇవ్వడం, మెడికల్ క్యాంపులకు వెళ్ళి రోగులను చూడడం సులభం అయ్యింది. 60 సంవత్సరాల వృద్దవనిత గత 15 సంవత్సరాలుగా కడుపు నొప్పితో బాధపడుతూ ఉన్నది. ఆమె ఎన్నో రకాల చికిత్సా విధానాలు ప్రయత్నించి విసిగి పోయి ఉన్నారు. చికిత్సా నిపుణుడు ఇచ్చిన  CC4.3 Appendicitis + CC4.10 Indigestion. నివారణి  అద్బుతంగా పని చేయడంతో ఆమెకు ఈ చికిత్సా విధానము పట్ల విశ్వాసము పెరిగింది. ఆమె క్రమం తప్పకుండా రీఫిల్ కోసం రావడం, తన వంతు వచ్చే వరకు వేచి ఉండడం మందులు వేసుకునే టప్పుడు ఆమె పెదవులపై నామస్మరణ సాగుతూ ఎంతో భక్తి విశ్వాసాలతో వాటిని స్వీయకరించడం చూసి వీరు '' స్వామీ మీరే ఆమెకు నయం చేస్తున్నా గుర్తింపు మాత్రం నాకు ఇస్తున్నారన్న మాట'' అని ప్రార్ధించేవారు.

వీరు పని వత్తిడి వలన ఆశించినంత సేవ చేయలేక పోయినా 2014 జనవరి 26 న పుట్టపర్తిలో జరిగిన మొదటి అంతర్జాతీయ వైబ్రియానిక్స్ కాన్ఫరెన్స్ లో అంకిత భావంతో వాలంటీర్ గా పనిచేసే అవకాశం లభించింది.  ఆఫీసుకు సంబంధించిన పనివత్తిడి కొంత తగ్గగానే 2017 నుండీ వైబ్రియానిక్స్ కు మరింత సమయం కేటాయించడం వీరు ప్రారంభించారు. ప్రతీ ఆదివారము అనంతపురం సాయి మందిరం లో జరిగే సాయివైబ్రియానిక్స్ వైద్య శిబిరములో వీరు భాగం పంచుకోసాగారు.  ఆదివారం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడడం వీరికి ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. అలాగే నెలకు ఒకసారి గ్రామంలో జరిగే క్యాంపులో కూడా ఇతర వాలంటీర్ లతో పాటు పాల్గొంటున్నారు. ఈ సేవల కారణంగా గత రెండు సంవత్సరాలుగా 1600 మంది పేషంట్లకు చికిత్స చేసే అవకాశం కలిగింది.   

ప్రతీ అభ్యాసకుడు ఆరోగ్య వంతమైన జీవన శైలిని అనుసరిస్తూ తన పేషంట్లకు ఆదర్శప్రాయంగా ఉండాలనే విషయాన్ని వీరు నొక్కి వక్కాణిస్తున్నారు. తను ఆచరిస్తేనే ఇతరులకు  చెప్పగల అర్హత వస్తుంది. కేవలం రెమిడీలు ఇవ్వడంతోనే అభ్యాసకుని బాధ్యత పూర్తయినట్టు కాదు. పేషంటుకు ఆరోగ్యవంతమైన జీవన శైలి  స్వామి చెప్పిన ఆరోగ్య సూత్రాలు చెప్పి పంపించాలి. చికిత్సా నిపుణుడి వద్దనుండి బయటకు వచ్చిన రోగికి ఎంతో స్వాంతన చేకూరి అది పెదవుల పైన చిరునవ్వుగా వ్యక్తంకావాలి. ముఖ్యంగా వృద్ధులు తమను అంతా వదిలివేశారనే భావంతో ఉంటారు కనుక వారిని జాగ్రత్తగా చూసి పంపాలి.

ఈ చికిత్సా నిపుణుడి ఉద్దేశంలో వైబ్రియానిక్స్ ప్రత్యామ్నాయ చికిత్సా విధానము కాదు ప్రధాన చికిత్సా విధానము. ఎవరైనా సరే రోగం రాగానే డాక్టర్ వద్దకు పరిగెత్తే విధానము మార్చుకోవాలి. భగవంతుడు ప్రతీ ఒక్కరిలోనూ వ్యాధి నయం  చేసుకునే శక్తి ఇచ్చాడు. కనుకనే వీరు ‘’ఆలోపతి మందులతో ఏల నీకు చింత వైబ్రియానిక్స్ ఉండగా నీ చెంత’’ అని చెపుతూ ఈ రెమిడీ లతో వ్యాధినిరోధక శక్తిని పెంచుకుని రోగాలకు దూరంగా ఉందాం అని పిలుపు నిస్తున్నారు.  

పంచుకున్న కేసుల వివరాలు:

·       ఆనెలు పగుళ్లు

·       బహుళ సమస్యలు

 

సాధకురాలి వివరములు

ప్రాక్టీషనర్  10355…ఇండియా కామర్స్ పట్టభద్రు రాలైన ఈ చికిత్సా నిపుణురాలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో కరెన్సీ పరిశీలకురాలిగా కొన్ని  సంవత్సరాలు పనిచేశారు. 1984 లో పెళ్లైన తరువాత వీరు ఉద్యోగం మానేసి కుటుంబ విషయాలే చూసుకునేవారు.  1989 నుండి స్వామి గురించి తెలుసుకొని ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు భజనలకు హాజరవుతూ ఉండేవారు. 1998 లో పుట్టపర్తి దర్శించిన తరువాత సేవా కార్యక్రమాలలో పాల్గొనడం ప్రారంభించారు. వీరు బాలవికాస్ కు చెందిన సాయి  వాఙ్మయాన్ని ఆంగ్లము నుండి మరాఠీ కి ఆ తరువాత 2002 నుండి సనాతన సారధి పత్రికకు మరియు  ఇటీవలే విద్యావాహిని కి సంబంధించిన వ్యాసాలను  వీరు ఆంగ్లము నుండి మరాఠీ కి తర్జుమా చేయడం ప్రారంభించి ప్రస్తుతం వాటిని కొనసాగిస్తూ ఉన్నారు.  

వీరు 2006 లో వైబ్రియానిక్స్ గురించి ఒక వాలంటీర్ ద్వారా విని ఈ కోర్సులో చేరాలని భావించారు. 2008 లో AVP శిక్షణ పూర్తి చేసుకొని అప్పట్లో ఉన్న నియమం ప్రకారం 54 CC బాక్సును తీసుకున్నారు. అనంతరం 2015లో  అవసర మైన పరీక్ష వ్రాసి 108 CC బాక్సు ను తీసుకున్నారు. ఇంత ఎక్కువ విరామం రావడానికి కారణం 2000 సంవత్సరం లో మయాస్తేనియా గ్రావిస్ అనే  నరాల, కండరాల వ్యాధి సోకినట్లు నిర్ధారణ చేయబడడం ఇంకా ఇతర కుటుంబ సమస్యలు. ప్రాక్టీషనర్ ఐన తరువాత రెండు సంవత్సరాలు తన ఇంట్లోనే  రోగులకు వైద్యం చేసేవారు. ఐతే అనారోగ్య కారణంగా కొంతకాలము పేషంట్లను చూడడం నిలిపి వేశారు. ఆ తరువాత  తనకు అనుకూల మైన సమయంలో రోగులకు జలుబు, దగ్గు,జ్వరము,జీర్ణ సమస్యలు, ఎముకల నొప్పులు వంటి రుగ్మతలకు తయారుచేసి  మెడికల్ క్యాంపులలో  సహచర చికిత్సా నిపుణులకు ఇస్తూ ఉండేవారు. ఐతే తనకు ఏర్పడిన రుగ్మత నిమిత్తము ఆలోపతి మందులనే వాడేవారు కానీ వాటివల్ల ఏర్పడే ప్రతికూల ఫలితాల నివారణకు వైబ్రియానిక్స్ రెమిడీలనే ఆశ్రయించేవారు.  

వీరు తోటి సేవాదళ్ సభ్యుల సహాయంతో గత 15 సంవత్సరాలుగా భవన నిర్మాణపు పనివాళ్ళ పసిపిల్లలకు, పిల్లలకు సాయి ప్రోటీన్ పంపిణీ చేస్తున్నారు. ఒక సీనియర్ వైబ్రియానిక్స్ అభ్యాసకుని సూచన మేరకు రోగులకు తను ఇచ్చే నివారణుల తోడుగా  CC12.2 Child tonic + CC17.3 Brain & Memory tonic + CC20.6 Osteoporosis కూడా ఇవ్వడం ప్రారంభించారు. వీటిలో ప్రతీ ఒక్క కొంబోను 27 చుక్కలను ఒక కేజీ వేయించిన వేరుశెనగ పప్పు పౌడర్ తో కలిపేవారు. దీనిని 27 కేజీల సాయి ప్రోటీన్ మరియు 7.5 కేజీల పంచదార పొడితో కలిపేవారు. ప్రతీ రోజూ రెండు స్పూన్ల పౌడర్ ను నీటిలో గానీ, పాలలో గాని కలిపి పిల్లలకు ఇచ్చేవారు. పిల్లలు ఈ పౌడర్ యొక్క రుచిని ఆస్వాదించేవారు. ఈ పౌడర్ యొక్క ఫలితం గురించి అధ్యయనాలేవీ నిర్వహింప బడలేదు కానీ ఈ చికిత్సా నిపుణురాలు ఇది పిల్లల యొక్క రోగనిరోధక శక్తి,ఆరోగ్యము,జ్ఞాపకశక్తి ఏమేరకు పెంచుతాయో అధ్యయనం చేస్తున్నారు. 

ఈ ప్రాక్టీషనర్ చికిత్స చేసిన కొన్ని విజయవంతమైన కేసుల వివరాలు ఈవిధంగా తెలియచేస్తున్నారు. 2015 అక్టోబర్ నెలలో  75 సంవత్సరాల  మహిళ వీరి వద్దకు వచ్చారు. ఈ పేషంటు గత సంవత్సర కాలంగా మలబద్దకం,కడుపులో మంట, మలద్వారము పైన దురద తో బాధ పడుతూ ఉన్నారు.  ఈమెకు CC4.4 Constipation + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic ఇచ్చిమషాలాలు ఎక్కువ వాడొద్దని సలహా  ఇచ్చారు.  10 నెలలు వాడిన తరువాత ఆమెకు పూర్తిగా తగ్గిపోవడంతో మోతాదును తగ్గించి వాడుతూ 12 వ నెలలో పూర్తిగా మానేసారు. ఇప్పుడామె మషాలా తో కూడిన ఆహారము కూడా తినగలుగుతున్నారు.  2016ఏప్రిల్ లో ఈ పేషంటు వీపు క్రింది భాగంలో నొప్పి నిమిత్తం  ప్రాక్టీషనర్ ను సంప్రదించారు. గత నాలుగు సంవత్సరాలుగా ఆమెను ఆస్టియో పోరోసిస్ గా నిర్ధారించబడిన ఈ నొప్పి బాధిస్తోంది. ఈమెకు ఆలోపతి నొప్పి నివారణలు కొనసాగించడం ఇష్టం లేదు.  ప్రాక్టీషనర్ ఆమెకు CC20.4 Muscles & Supportive tissue + CC20.6 Osteoporosis + CC20.7 Fractures. ఇచ్చారు. మూడు నెలలలో ఆమెకు 90 శాతము మెరుగయ్యింది. దీనితో ఆమె ఈ నివారణలు తన జబ్బును పూర్తిగా తగ్గిస్తాయనే విశ్వాసం తో  మందులు కొనసాగిస్తూ ఉన్నారు.

ఈ ప్రాక్టీషనర్ ఇప్పటివరకూ 1500 పేషంట్లకు చికిత్స చేశారు. చికిత్స తో పాటు SVP10001 తో కలసి AVPమాన్యువల్ ను ఆంగ్లము నుండి మరాఠీ కి అనువాదం చేశారు. ఇది ముద్రిoచ బడింది. 108CC పుస్తకమును కూడా మరాఠీ లోనికి అనువాదం చేశారు ఇది ఇంకా ముద్రించ బడవలసి ఉన్నది. ఈ రెండు పుస్తకాలు మహారాష్ట్ర లోని గ్రామీణ ప్రాంతాల వారికి వారి మాతృ భాషలో AVP కోర్సు నేర్చుకొనడానికి ఎంతో అనువుగా ఉంటాయి. ఈ ప్రాక్టీషనర్  వైబ్రియానిక్స్ అనేది ప్రజలకు నిస్వార్ధంగా ఎల్లలెరుగని సేవ చేయడానికి భగవంతుడు తనకిచ్చిన వరంగా  భావిస్తున్నారు. ఈ సేవ తనను అనారోగ్యం నుండి దూరం చేసి  భౌతికంగా, మానసికంగా,భావోద్వేగ పరంగా  ధృడంగా చేశాయని వీరు భావిస్తున్నారు. అంతేకాక వైబ్రియానిక్స్ తనలో ఇతరుల పట్ల ఫ్రేమ, దయా పెంపొందించుకునేలా చేశాయని తెలుపుతున్నారు. 

పంచుకున్న కేసులు:

  • జువెనైల్ అర్థ్రైటీస్

ప్రశ్న జవాబులు

ప్రశ్న 1: పరిశుద్ధమైన ఇథనాల్  108 సిసి బాక్స్ లోని రెమిడీ లకు కలిపి షేక్ చెయ్యడం ద్వారా  ఎంతకాలం వీటి యొక్క లైఫ్ స్పాన్  పెంచవచ్చు?

జవాబు: మీరు చెప్పిన విధానం లో   సీసీ బాటిల్ యొక్క లైఫ్ 2-3 సంవత్సరాలు పెంచ గలిగినప్పటికీ  ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి 108 బాక్స్ రీఛార్జి చేసుకోవాల్సిందిగా మా సూచన. కారణం ఏమిటంటే మా పరిశోధనా బృందం ఎప్పటికప్పుడు సీసీ బాక్స్ ని అప్డేట్ చేస్తూ ఉన్నారు కనుక క్రమం తప్పకుండా సీసీ బాక్స్ రీచార్జ్ చేసుకోవడం తప్పనిసరి.

________________________________________

ప్రశ్న 2: 108 సిసి బాక్స్ ను విమానంలో తరలించే టప్పుడు ఎత్తయిన ప్రదేశంలో లో రేడియేషన్ నుండి  పాడవకుండా చూడటానికి మరియు  ఎయిర్ పోర్ట్ లో చెక్ చేసే X రే మిషన్ లను నుండి  రక్షించడానికి ఈ బాక్స్ ను అల్యూమినియం రేపర్ తో తీసుకు వెళ్లడం అవసరమా ?

జవాబు: అవసరం లేదు గతంలో అల్యూమినియం ఫోయిల్  చుట్టడం ద్వారా రెమిడీ లను రేడియేషన్ నుండి కాపాడవచ్చు అని మేము భావించాము. కానీ  ఇది పేషెంట్లలో ఒక తప్పుడు అభిప్రాయాన్ని పెంచుతుంది ఏమంటే వారు తమ రెమెడీలను ఈ రేపర్ తో రేడియేషన్ దగ్గరగా తీసుకురావడం ద్వారా అవి పనిచేయకుండా పోతున్నాయి. కారణం ఏమిటి అంటే పదేపదే అల్యూమినియం ఫోయిల్ ను తెరవడం ద్వారా, మరియు ఈ అల్యూమినియం పొరకు ఏర్పడే కంటికి కనపడని సూక్ష్మ రంధ్రాల ద్వారా రేడియేషన్ లోపలికి చొరబడి రెమిడీలకు హాని కలిగించవచ్చు లేదా వాటి యొక్క శక్తిని తగ్గించవచ్చు.

________________________________________

ప్రశ్న 3: విటమిన్ సప్లిమెంట్ గా లేదా మల్టీ విటమిన్ సప్లిమెంట్ గా ఇవ్వటానికి మన 108 సి సి బాక్సులో లో ఏదైనా రెమీడీ ఉన్నదా ? మధ్య ప్రాచ్య ప్రాంతాల్లో ముఖ్యంగా గా విటమిన్ డి 3 యొక్క అవసరం బాగా ఉన్న వారికి ఏమి సూచించ వచ్చు?  

జవాబు: CC12.1 Adult tonic or CC12.2 Child tonic ఈ రెండు కూడా అ మీకు విటమిన్ సప్లిమెంట్ గా ఉపయోగపడతాయి. 2017 లో సీసీ బాక్స్ లో ఉండే రెమెడీలను రివైజ్ చేసి మీరు చెప్పిన  పద్ధతి కి అనుగుణంగా ఉండే విధంగా చేయడం జరిగింది అయితే గుర్తుంచుకోవాల్సిన  అంశం ఏమిటంటే ఈ రెమిడీలు వైబ్రేషన్స్ మాత్రమే ఇవి విటమిన్లకు ప్రత్యామ్నాయం కావు.  ఇవి మనం ఆహారం ద్వారా తీసుకునే విటమిన్లను పూర్తిగా సద్వినియోగం లేదా ఎక్కువగా శరీరానికి  ఉపయోగ పడే విధముగా  చేస్తాయి  తప్ప విటమిన్లకు ప్రత్యామ్నాయంగా ఉండలేవు.

________________________________________

ప్రశ్న:  నేను తరచుగా నా నెలవారీ రిపోర్టును ఆన్లైన్ చేయడం మర్చిపోతున్నాను. మరి నేను ను మా కోఆర్డినేటర్ కు పంపించడం లేదా మంత్లీ రిపోర్ట్ ఈ మెయిల్ సైటుకు  నా రిపోర్ట్ లను  పంపించవచ్చా ?

జవాబు: మంత్లీ  రిపోర్ట్ ఆన్లైన్ చేయడానికి కావలసిన వెబ్సైట్  తయారుచేయడానికి ఎంతో సమయము ప్రయత్నము వెచ్చించ వలసి వచ్చింది. ఈ సైట్ రూపొందించడంలో ప్రధాన ఉద్దేశ్యము చికిత్సా నిపుణులు ఎప్పటికప్పుడు తమ  సేవా గంటలను పేషెంట్ల వివరాలను అప్ టు డేట్ గా ఉంచుకొనే వెసులుబాటు కల్పించడం. గతంలో మాదిరిగా ఐదు రకాల నంబర్లను ఫీడ్ చేసే బదులు ఇప్పుడు కేవలం రెండు రకాల నెంబర్లను అనగా సేవా గంటలు పేషెంట్ల సంఖ్య ఇంత వరకు మాత్రమే ఫీడ్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు మీరు మీ సెల్ ఫోన్, ట్యాబ్లెట్,  లాప్టాప్ దేని నుండైనా నెలవారి వివరాలు నమోదు చెయ్యవచ్చు. మీరు చెయ్యవలసిందల్లా ఇంటర్నెట్ ద్వారా https://practitioners.vibrionics.org, సైట్ కు వెళ్ళి సైన్ చేసి వివరాలు నమోదు చెయ్యడమే. మీ సమాచారము అప్డేట్ చేసుకునే సదుపాయం కూడా ఉంది. మీ ఫోన్ లో క్యాలెండర్ ఉంటే ఒకటో తారీకుకు మీకు మీరే అపాయింట్మెంట్ సెట్ చేసుకొని ఆ సైట్ లో వివరాలు నమోదు చేయవచ్చు. అందుచేత సాధ్యమైనంత వరకూ ఈ మెయిల్ ద్వారా మాత్రం రిపోర్టులు పంపకండి.  

________________________________________

ప్రశ్న 5: అనివార్య కారణాలవలన నేను  నెలలో 1 వ తేదీన నా మంత్లీ  రిపోర్టును అప్డేట్ చేయలేకపోతే ఆ తర్వాత సైట్ బంద్  అయిపోయినట్టుగా భావించి తర్వాత నెల వరకు ఏమీ చేయకుండా ఉండాలా ?  

జవాబు: లేదు మీరు ఏ సమయంలో నైనా  సైట్ కు వెళ్లి మీ మంత్లీ రిపోర్టును అప్లోడ్ చేసుకోవచ్చు. ఒక వినయపూర్వక విన్నపం ఏమిటి అంటే మీరు   ప్రాక్టీషనర్ ఓత్ తీసుకున్నప్పుడు ప్రతి నెల 1 వ తేదీన రిపోర్టు సబ్మిట్ చేస్తానని భగవంతుడికి ప్రామిస్ చేసి ఉన్నారు ఒకవేళ మీకు ఆ నెలలో పేషెంట్ల సంఖ్య సున్నాగా ఉన్నట్లయితే సున్నా అనే అప్డేట్ చేయండి. ఒక శుభవార్త ఏమిటంటే ఈ విధంగా చేయడం వలన మా హీలర్ ఇన్ఫో టీం మీకు కొత్త పేషంట్లను  సూచిస్తుంది.

 

దివ్య వైద్యుని దివ్య వాణి

‘’వ్యాధిఏర్పడిన తర్వాత  నివారించలేని పరిస్థితి  తెచ్చుకోవడం కంటే వ్యాధి రాకుండా  ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం తెలివయిన పని. మనిషి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా పరిస్థితులను అలాగే కొనసాగించడం ద్వారా వ్యాధి ముదిరిపోయే స్థితి తెచ్చుకుంటాడు. దీనికి తోడు భయము అనిశ్చితి ఆందోళన వ్యాధి మరింత బలపడేందుకు కారణమవుతాయి. పూర్వకాలంలో ఒక సామెత ఉండేది. ఒక పూట భోజనం చేసేవాడు యోగి రెండు పూటలు భోజనం చేసేవాడు భోగి మూడు పూటల భోజనం చేసేవాడు రోగి. యోగి సంతృప్తికరంగా జీవిస్తూ భగవంతుడే  లక్ష్యంగా ఏర్పరుచుకొని ఉన్నవాడు. భోగి ఇంద్రియ సంబంధమైన సుఖాలకు దాసుడు అయినవాడు. రోగి అనారోగ్యానికి గురి అయి బాధలు పడుతున్న వాడుశరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ తీసుకోవడం ధనవంతులలో సామాన్యం అయిపోయింది అధికంగా తినడం ఫ్యాషన్ గా మారిపోయింది        

... శ్రీ సత్యసాయి బాబా, “సీ వర్తీ బోట్  » దివ్యవాణి 12 అక్టోబర్ 1968 http://www.sssbpt.info/ssspeaks/volume09/sss09-21.pdf

 

 

 

"భగవంతుడు మానవ జన్మను ప్రసాదించింది తినడం తాగడం నిద్రించడం ఆనందించడం కోసం కాదు ఇతరులకు సహాయం చేయడం కోసం.  భగవంతుని ప్రేమించే అత్యుత్తమ మార్గం అందర్నీ ప్రేమించడం అందరి సేవించడం. మానవుని యొక్క ప్రధాన కర్తవ్యం తన తోటి వ్యక్తులను ప్రేమించడం వారికి చేతనైంది  సహాయం చేయడం వారిని ఆనందంగా ఉంచడం. సమాజానికి సేవ చేసినప్పుడే వ్యక్తి యొక్క జీవితం సార్ధకం అవుతుంది. అత్యుత్తమ ఆధ్యాత్మిక సాధన ప్రేమను సేవ గా మార్చుకోవడం. ఈ సేవ భగవత్ ప్రేమను ప్రాప్తించే భక్తిని ఇస్తుంది. "

... శ్రీ సత్యసాయి బాబా, “డ్వెల్ ఇన్ గాడ్ కాన్షియస్ నెస్ దివ్యవాణి 27ఏప్రిల్ 1999 http://www.sssbpt.info/ssspeaks/volume32/sss32p1-12.pdf

ప్రకటనలు

ప్రకటనలు

నిర్వహింపబోయే శిక్షణాశిబిరాలు

  • ఇండియా  పుట్టపర్తి:  SVP వర్క్ షాప్ 24-28 నవంబర్  2018, సంప్రదించ వలసిన వారు హేమ వెబ్సైట్  [email protected]
  • ఇండియా  పుట్టపర్తి : కేరళ AVP లకోసం VP వర్క్ షాప్ 30 నవంబర్ & 1 డిసెంబర్ 2018, సంప్రదించ వలసిన వారు. పద్మ వెబ్సైట్  [email protected]g
  • ఇండియా  పుట్టపర్తి: AVP వర్క్ షాప్ 6-10 మార్చ్ 2019, సంప్రదించ వలసిన వారు లలిత వెబ్సైట్ [email protected] లేదా టెలిఫోన్ నంబర్  8500-676 092
  • ఫ్రాన్స్  డోర్దాగ్నే: SVP వర్క్ షాప్ & రిఫ్రెషర్ సెమినార్  16-20 మార్చ్ 2019, సంప్రదించ వలసిన వారు డేనియల్, వెబ్సైట్   [email protected]
  • యూఎస్ ఏ  మణికన్ సాబట్ వి.ఏ: AVP వర్క్ షాప్ 5-7 ఏప్రిల్  2019, సంప్రదించ వలసిన వారు సుశాన్  వెబ్సైట్  [email protected]
  • ఇండియా  పుట్టపర్తి: AVP వర్క్ షాప్ 22-26 జూలై 2019, సంప్రదించ వలసిన వారు లలిత వెబ్సైట్  [email protected]   లేదా టెలిఫోన్ నంబర్   8500-676 092
  • ఇండియా  పుట్టపర్తి: AVP వర్క్ షాప్ 18-22 నవంబర్ 2018, సంప్రదించ వలసిన వారు లలిత వెబ్సైట్ [email protected] లేదా టెలిఫోన్ నంబర్  8500-676-092

 

అదనముగా

1. ఆరోగ్యవ్యాసము

సామాన్య లుబును నివారించడం

వ్యాధి వచ్చిన తర్వాత దానిని నివారణచేయలేని స్థితికి చేరుకునేవరకూ పట్టించుకోక అనంతరం ఔషధాలను సేవిస్తూ ఉండేకన్నావ్యాధి రాకుండా నివారణ చర్యలు చేపట్టడం ఉత్తమము.. మనిషి ముందస్తు చర్యలకు పూనుకోక విషయాలను మరింత జఠిలమయ్యే టట్లుగా చేసుకుంటూ ఉంటాడు ఆపైన భయము అనిశ్ఛితిమరియు ఆందోళనలతో వ్యాధి తీవ్రతరం అవుతుంది 1” శ్రీ సత్య సాయి బాబా

 1. సామాన్య జలుబు అంటేఏమిటి? 

 సామాన్య జలుబు అనేదిఎగువ శ్వాస వ్యవస్థ ను(అనగాముక్కు, సైనస్, ఫ్యారింక్స్ మరియు స్వర పేటిక)ప్రభావితం చేసే ఒక తీవ్రమైన  వ్యాధి. సాధారణ జలుబుకు కారణమయ్యే దాదాపు 200 కంటే ఎక్కువ సంఖ్యలో వైరస్ లు ఉన్నాయి మన శరీరము ఈ వైరస్ లన్నింటిని ఎదుర్కొనే శక్తి కలిగి లేదు కనుక జలుబు అనేది సామాన్యమైనది అని గుర్తించాలి.2-5

2. సాధారణ జలుబు యొక్క లక్షణములు

గొంతుపొడిగా అవడం లేదా గొంతు మంట అనేది సాధారణ జలుబు యొక్క ప్రాథమిక లక్షణం దీంతోపాటు తుమ్ములు, ముక్కు కారటం, నాసికా రంధ్రాలు నిరోధింప పడటం ఇవి కూడా సాధారణ జలుబు యొక్క లక్షణాలు.వీటితో పాటు అదనంగా చలి, జ్వరం వచ్చినట్లుగా ఉండడం లేదాస్వల్పంగా జ్వరం తగలడం, శక్తి తగ్గిపోయినట్లు గా ఉండడం, గొంతు బొంగురు పోవడం, దగ్గు వంటివి కూడా ఉంటాయి. కొన్ని అరుదైన లక్షణాలు వణుకు, కండరాల నొప్పులు, గులాబీ కన్ను, కండ్లకలక, తీవ్రమైన అలసట లేదా ఆకలి మందగింపు. ఇది ఒక్కక్క సారి చెవి మరియు సైనస్ లను ప్రభావితం చేసే ద్వితీయ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తో కలిసి కూడా  ఏర్పడవచ్చు2,4,6

త్వరగా అలసిపోవడం, శ్వాసక్రియ లేదా  హృదయ స్పందన అధికం కావడం, మగత, తలపోటు, మూత్రం పసుపు రంగులోకి మారడం అనేవి శరీరములో డీహైడ్రేషన్ తద్వారా సాధారణ జలుబు వస్తుంది అనడానికి లక్షణాలుగా చెప్పవచ్చు.7

జలుబు ఫ్లూ అనే వ్యాధికి భిన్నమైనదిజలుబు మరియు ఫ్లూ లేదా ఇన్ఫ్లూయెంజా ఈ రెండు కూడా వేర్వేరు వైరస్ ల వలన కలిగే శ్వాస సంబంధిత అంటువ్యాధులు ఇవి దాదాపు ఒకే లక్షణాలను కలిగి ఉంటాయి. జలుబు యొక్క లక్షణాలు తక్కువ స్థాయిలో ఏర్పడి తరువాత తీవ్రమవుతాయి. ఫ్లూ లక్షణాలు మంద్రస్థాయిలో ఏర్పడవచ్చు లేదా ఒకేసారి హఠాత్తుగా తీవ్ర లక్షణాలతో ఏర్పడవచ్చు. జలుబు నుండి ఫ్లూ గాని లేదా ఫ్లూ నుండి జలుబు గాని ఏర్పడే అవకాశాలు లేవు. ఫ్లూతో ఉన్న వ్యక్తికి కి కండరాల నొప్పులు మరియు తీవ్రమైన దగ్గు ఉంటుంది. ఫ్లూ కారణంగా తీవ్రమైన అనారోగ్య సమస్యలు అనగా న్యూమోనియా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, వంటివి ఏర్పడి ఆసుపత్రిలో అడ్మిట్ చేసే పరిస్థితి రావచ్చు.2,4,5,6

3. సాధారణ జలుబు లక్షణాలు.

 సూక్ష్మ జీవులు: సాధారణ జలుబు అందరూ అనుకుంటున్నట్లు చలి వాతావరణానికి గురికావడం వలన ఏర్పడదు శరీరంలోనికి సూక్ష్మ జీవులు ప్రవేశించడం వలన జలుబు కు గురి అవుతారు.5 జలుబు ఫ్లూ రెండూ కూడా మానవుని యొక్క కళ్ళు ముక్కు గొంతులో ఉండే శ్లేష పొరల ద్వారా సూక్ష్మ జీవులు లోపలికి ప్రవేశించినప్పుడు ఇవి ఏర్పడుతూ ఉంటాయి. 8

బలహీన రోగనిరోధక వ్యవస్థ. ఇది ఇది జలుబును కలిగించే సూక్ష్మ జీవులు శరీరంలోనికి ప్రవేశించి బలపడటానికి కారణం అవుతుంది. సాధారణంగా శరీరంలో మొదటి శ్రేణి రక్షణ వ్యవస్థ ముక్కుకు ఉన్న శ్లేష్మ పొరలు. ఇవి జలుబును కలిగించే దుమ్ము వైరస్లు, బ్యాక్టీరియా వంటివి లోపలికి ప్రవేశించకుండా నిరోధిస్తాయి. కానీ  వైరస్ ఈ శ్లేష్మ పొర ను దాటి కణం లోనికి చొచ్చుకొనిపోయి అక్కడినుండి ఇతర   జీవ కణాలకు వ్యాపిస్తాయి. ఈ విధంగా గా రోగనిరోధక వ్యవస్థపై పట్టు సాధించి శరీరంలో స్థిరపడి వ్యాధిని తీవ్రతరం చేస్తాయి.2,9

నిర్జలీకరణం. ఇది మనిషిలో లో తీవ్ర అనారోగ్య స్థితిని కలిగిస్తుంది.  దీని కారణంగా ముక్కు  మరియు గొంతు యొక్క శ్లేష్మ పొరలు పొడిగా మారినప్పుడు సూక్ష్మ జీవులు సులభంగా లోపలికి ప్రవేశిస్తాయి శీతాకాలంలో ఎవరైనా నిర్జలీకరణ స్థితిలో ఉన్నదాహం అనిపించదు కానీ వాతావరణం వేడిగా లేదా పొడి గా ఉన్నప్పుడు సహజంగానే శరీరము నిర్జలీకరణం చెంది దాహం అనే ప్రతిస్పందన కనబరుస్తుంది. 7,8

జలుబువ్యాప్తి ఈ వ్యాధి స్థిరపడటానికి 1 - 2 రోజుల ముందు నుండే అంటువ్యాధిగా వ్యాపిస్తుంది. దగ్గు మరియు తుమ్ములు వలన బయటికి వ్యాపించిన కలుషితమైన తుంపర్ల ద్వారా ఇది వ్యాపిస్తుంది. అలాగే జలుబుకు గురైన ప్రాంతాలు అనగా ముక్కు గోడలు వంటివి తాకడం వలన ఆ వ్రేళ్ళను శుభ్రపరచుకొననట్లయితే వాటి ద్వారా మరొకరికి వ్యాధి సంక్రమించే అవకాశం ఉన్నది. ముక్కు మరియు దాని జీవకణాలకు రవాణా చేయబడే వరకు జలుబును కలిగించే వైరస్ పర్యావరణ ఉపరితలాలపై వ్యాప్తి కాదు. ఈ వైరస్ యొక్క చిన్న మోతాదు అనగా ఒకటి నుండి 30 కణాలు ఇంత మాత్రం కూడా జలుబు వంటి అంటువ్యాధుల వ్యాప్తి చెందటానికి కారణం అవుతుంది. ముఖ్యంగా పిల్లలకు పిల్లల యొక్క ముక్కు జలుబును కలిగించే వైరస్ కు ప్రధానమైన వనరుగా పరిగణింపబడుతుంది.4

ఒక అధ్యయనం ప్రకారం 80 శాతం ఇన్ఫెక్షన్లు నేరుగా రోగగ్రస్తుడైన వ్యక్తిని తాకడం ద్వారా అనగా ముద్దు పెట్టుకోవడం లేదా కరచాలనం చేయడం ద్వారా వ్యాపిస్తాయి. అలాగే రోగి తాకిన తలుపు యొక్క పిడిని తాకడం ద్వారాను లేదా రోగి తాకిన  ఫోన్  ఉపయోగించడం ద్వారా ఇలా వివిధ రకాలుగా కూడా ఈ వైరస్ వ్యాప్తి అయ్యే అవకాశం ఉన్నది.8

జలుబుకు గురికావడం బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ ఉన్న వారు వయసు పైబడినవారు చంటి పిల్లలు లేదా 6 సంవత్సరాల కన్నా తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఆస్తమా లేదా శ్వాస సంబంధిత దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారు ధూమపానం వంటి చెడు అలవాట్లకు గురి అయిన వారు జలుబుకు గురి అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉన్నది. మారుతున్న వాతావరణం లేదా చల్లని వాతావరణ పరిస్థితులలో ముక్కు రంధ్రాలు పొడిబారి ఉన్నప్పుడు జలుబు మరియు ఫ్లూ కలిగించే వైరస్ చాలా త్వరగా వ్యాప్తి చెందుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం సరి అయిన నిద్ర  లేకపోవడంతో ఒత్తిడికి లోనైన వ్యక్తులు చాలా త్వరగా జలుబుకు లోనవుతారు.2,3,5,8

నివారణ చేయలేని స్థితి. జలుబును నివారించడానికి మందులు గానీ టీకా వంటివి గాని లేవు. హ్యూమన్ రినో వైరస్ అనేది జలుబుని కలిగించే ప్రధాన కారకంగా భావిస్తున్నారు. ఈ జలుబు నివారణ నిమిత్తం సరైన మందు రూపకల్పనకు పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. 10,11

4. ముందస్తుజాగ్రత్త లు

ఒకసారి వ్యాధి లక్షణాలు శరీరంలో ఏర్పడిన తర్వాత జలుబు అరికట్టడం సాధ్యం కాదు ఇది దాని కోర్సును అమలు చేస్తూనే ఉంటుంది అయితే ఉపశమనం పొందడానికి సమర్ధవంతమైన చర్యలు చేపట్టవచ్చు.

జలుబు రాకుండా ను లేదా దాని తీవ్రతను తగ్గించడానికి ముందు జాగ్రత్తలు తీసుకోవచ్చు:

  • జలుబు ప్రారంభానికి ముందు శరీరం ఇచ్చే సూక్ష్మ సంకేతాలను అర్థం చేసుకోవడం దాని నివారణ చేపట్టడం .9
  • చేతులు శుభ్రంగా కడుక్కోవడం గా ఎవరైనా తాకినప్పుడు చేతిలో కనీసం 15 సెకన్ల పాటుసబ్బుతోనూ, శుభ్రమైననీటితోనూ కడుగుకొని పరి శుభ్రమైన బట్టతో తుడిచి ఉపయోగించడం 8,13
  • ఆరోగ్య వంతమైన ఆహార విధానాలు, యోగా, ప్రాణాయామము, శరీరంలో ఉన్న రోగనిరోధక శక్తి పెంపుదలకు తగినంత నీటిని తీసుకొనడం.2,8
  • 1-2 కప్పుల లేత కొబ్బరి నీళ్ళు రోజుకు రెండు సార్లు త్రాగడం వలన; పుచ్చకాయ లేదా యాష్ గార్డ్ జూస్ 1-2 కప్పులు తేనెతో లేదా మిరియాల పొడితో కలిపి రోజుకు రెండుసార్లు త్రాగడం వలన లేదా 3-5 చుక్కల తాజా నిమ్మరసం ఒక గ్లాసు నీటిలో కలుపుకొని రోజుకు మూడుసార్లు త్రాగడం వలన.7,8

సరియైన ఆరోగ్య సూత్రాలు పాటించడం ద్వారా జలుబు వ్యాప్తిని అరికట్టండి. తుమ్ములేదా దగ్గు వచ్చినప్పుడు రుమాలు లేదా టిస్యు పేపర్ అడ్డుపెట్టుకోవాలి. తర్వాత చేతులు శుభ్రంగా కడుగు కోవాలి. రుమాలు తిరిగి ఉపయోగించవలసి వస్తే శుభ్రంగా ఉతకాలి.2

సాయి వైబ్రియానిక్స్: సాయిబాబా వారు అనుగ్రహించిన సాయి వైబ్రియానిక్స్ నివారణలతో జలుబును నివారించండి. CC9.2 Infections acute, CC12.1 Adult tonic, CC17.2 Cleansing, CC19.2 Respiratory allergies లేదా 108 CC బాక్సు నుండి కావలసిన రెమిడీ లను ఎంపిక చేసుకొనవచ్చు. లేదా SRHP మిషన్ నుండి NM11 Cold, NM18 General fever, NM30 Throat, NM36 War, NM63 Back-Up (Booster), NM72 Cleansing, NM79 Flu Pack, NM86 Immunity, లేదా మరే ఇతర అనువైన ఎంపిక ద్వారా జలుబు నుండీ నివారణ పొందవచ్చు.

5. శీఘ్ర ఉపశమనానికి గృహ చిట్కాలు

  • వంటిలో తేమ పోకుండా ఉండటానికి లేదా డీ హైడ్రేట్ అవకుండా ఉండడానికి  స్వచ్ఛమైన గోరువెచ్చని నీరు, లేదా ఆరెంజ్ రసం, లేదా వెచ్చని ఆపిల్ రసం తీసుకుంటూ ఉండాలి. కూరగాయలతో చేసిన రసం లేదా వెచ్చని తేనెతో కలిపిన నిమ్మరసం వంటికి మంచివి. మద్యము, కాఫీ మరియు కెఫీన్ తో కూడిన సోడా వంటివాటిని విసర్జించండి.12,14
  • ముక్కు రంధ్రాలు మూసుకుపోయి నట్లైతే వేడి ఆవిరిని ముక్కుతో పీల్చవలసి ఉంటుంది. మరింత సమర్ధవంతంగా పని చేయుటకు ఈ వేడి నీటిలో అల్లం, రోజ్మేరి, యూకలిప్టస్ నూనె ను కూడా వేయవచ్చు. ఐతే వేడి నీటి పాత్రకు ముఖానికి 30 సెంటీమీటర్ల దూరం ఉండాలి.8
  • గొంతు ఉపశమనానికి, నాసికా రంధ్రాలలో గాలి యొక్క సౌకర్య వంతమైన రాకపోకలకు వేడినీటిని తీసుకోవలసి ఉంటుంది.14
  • శరీరానికి విశ్రాంతి నివ్వడం ద్వారా రోగనిరోధక శక్తి పెంపొంది ఇన్ఫెక్షన్ కు వ్యతిరేకంగా పోరాడే శక్తి పెరుగుతుంది.14

అనేక మూలికలు లేదా మాషాలా దినుసులు కూడా జలుబు విషయంలో సమర్ధవంతంగా పనిచేస్తాయి. ఇక్కడ కొన్ని నిరూపితమైన నివారణలు పొందుపరచ బడ్డాయి:

  • పసుపు, తేనె, దంచిన మిరియాల పొడి ఒక్కొక్క చెంచా తీసుకొని ఒక గ్లాసు వేడినీటిలో వేసి రోజుకు రెండు మూడు సార్లు తీసుకుంటే ముక్కు కారడం తగ్గిపోతుంది. 8
  • 20 ఆవగింజలను పొడిచేసి 1 స్పూన్ తేనెతో కలిపి ఉదయం పరగడుపున ఖాళీ కడుపుతో 48 రోజులు సేవిస్తే జలుబు తో పాటు చికాకు పెట్టే గొంతు సమస్యలు, దగ్గు కూడా నివారింపబడతాయి. 8
  • గుప్పెడు తులసి ఆకులను గానీ లేదా 7 స్ప్యానిష్ థైమ్ ఆకులను 10 మిరియాలతో కలిపి నూరి రోజుకు మూడు సార్లు తీసుకుంటే జలుబు తగ్గుతుంది. 16
  • 4 చెంచాల తేనె, అల్లం రసంతో 2 చెంచాల నిమ్మరసం ముప్పావు వంతు నీరున్న కప్పులో వేసి తాగితే  చక్కటి ఉపశమనం కల్గుతుంది. 16
  • తాజా వెల్లుల్లి మరియు వాటి ఉత్పత్తులు జలుబు నివారణకు అద్భుతంగా పనిచేస్తాయి.17-20

రిఫెరెన్స్ కోసం కావలసిన వెబ్సైట్ ఎడ్రస్ లు:

  1. Sri Sathya Sai Baba, Divine Discourse 29, Sathya Sai Speaks, Vol 9, 12.10.1969
  2. https://www.medicalnewstoday.com/articles/166606.php
  3. https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC3928210/
  4. https://www.commoncold.org/understand.htm
  5. https://www.verywellhealth.com/over-200-viruses-cause-the-common-cold-770388
  6. https://www.cdc.gov/flu/about/qa/coldflu.htm
  7. http://www.ishafoundation.org/us/blog/natural-remedy-dehydration/
  8. http://www.ishafoundation.org/us/blog/natural-remedies-prevent-soothe-winter-colds-flu/
  9. https://www.webmd.com/cold-and-flu/features/stop-a-cold#1
  10. https://metro.co.uk/2017/08/02/we-may-finally-have-found-a-cure-for-the-common-cold-6824299/
  11. https://www.nature.com/articles/d41586-018-05181-2
  12. https://www.pushdoctor.co.uk/blog/5-early-signs-of-a-cold-and-what-you-can-do-about-it
  13. https://www.cdc.gov/handwashing/when-how-handwashing.html
  14. https://www.mayoclinic.org/diseases-conditions/common-cold/in-depth/cold-remedies/art-20046403
  15. https://www.rd.com/health/beauty/natural-remedies-for-cold-and-flu/
  16. https://isha.sadhguru.org/in/en/wisdom/article/home-remedies-for-the-common-cold
  17. https://www.ncbi.nlm.nih.gov/pubmed/11697022
  18. https://www.ncbi.nlm.nih.gov/pubmed/22280901
  19. https://timesofindia.indiatimes.com/life-style/health-fitness/health-news/15-home-remedies-for-common-cold-and-cough/articleshow/21952311.cms
  20. https://stylesatlife.com/articles/home-remedies-for-cough-and-cold/

 

2. న్యూ ఢిల్లీ లో రిఫ్రెషర్ వర్క్ షాప్ 22-సెప్టెంబర్ 2018

AVP లు మరియు VP లకు న్యూ ఢిల్లీ లోని సాయి ఇంటెర్నేషనల్ సెంటర్ లో2018 సెప్టెంబర్ 22 వ తేదీన టీచర్లు  11422 & 02059.  ఆధ్వర్యంలో రిఫ్రెషర్ వర్క్ షాప్ నిర్వహించ బడింది. మొత్తం 19 మంది ప్రాక్టీషనర్ లు (ముగ్గురు SVPలు) డిల్లీ NCR నుండీ, పంజాబ్ అమృతసర్ నుండీ ఒక్కొక్కరు హాజరయ్యారు. సాయి గాయత్రి ని 108 సార్లు పఠించి వాతావరణాన్ని పవిత్ర పరిచి ఈ వర్క షాప్ ను ప్రారంభించారు.

రెమిడీ లు తయారీ లోనూ ఇవ్వడంలోనూ పాటించవలసిన నియమాలను మరొక్కసారి మననం చేసుకున్నారు: 

*ఆదర్శ వంతమైన నివారణి  ఉత్తమ మైన ప్రభావము కోసం కనీస సంఖ్యలో మిశ్రమలను ఉపయోగించాలి.

*కొందరు ప్రాక్టీషనర్లు చేస్తున్నట్లు CC10.1 Emergencies, CC12.1 Adult tonic, CC15.1 Mental & Emotional tonic, మరియు CC18.1 Brain disabilities లను అవసరమైతే తప్ప అన్ని నివారణల లోనూ కలపకూడదు.

*ప్రార్ధనతో రెమిడీ లను తీసుకోవాలని, గోళీలు గానీ మిశ్రమం కలిపిన నీటిని గానీ నోటిలోనికి తీసుకునే ప్రతీసారి విధిగా షేక్ చెయ్యడం వలన మరింత ప్రభావ వంతంగా పనిచేస్తుందని  పేషంట్లకు చెప్పాలి.

*మిగిలి పోయిన నివారణి ఏదైన ఉంటే మొక్కలకు ఉపయోగించాలి.

*వెల్నెస్ కిట్టును లేదా కనీసం ఎమెర్జెన్సీ రెమిడీని ఎక్కడికి వెళ్ళినా ఎల్లవేళలా దగ్గర ఉంచుకోవాలి. 

రోగికి దీర్ఘకాలిక మరియు తీవ్రమైన వ్యాధుల విషయంలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి అనే విషయంలో ప్రశ్నోత్తర కార్యక్రమం నిర్వహించబడింది. డాక్టర్ అగ్గర్వాల్ గారు తన స్కైప్ కాల్ లో దీనికి సమాధానం ఇస్తూ మనమిచ్చే నివారణులు తామంతట తాము రోగాన్ని నయం చేయలేవని అవి శరీరములో రోగనిరోధానికి కావలసిన ప్రక్రియను వేగవంతం చేసి తనకు తానే నయం చేసుకునే పరిస్థితి కల్పిస్తాయని చెప్పారు. కనుక దీర్ఘకాలిక, మరియు తీవ్రమైన వ్యాధులకు లేదా ఒకేసారి అనేక దీర్ఘకాలిక వ్యాధులు నయం చేయడానికి ప్రయత్నిస్తే  అంతర్లీనంగా ఉన్న శక్తి రెండు మూడు విభాగాలుగా విడగొట్టబడి ఈ నివారణ ప్రక్రియ వేగాన్ని తగ్గిస్తాయి. కనుక రోగికి ఒకటి కంటే ఎక్కువ వ్యాధులు ఉన్నప్పుడు బాగా ఇబ్బందికరమైన రోగ లక్షణాలన్నింటికి మొదట ప్రాధాన్యత ఇచ్చి చికిత్స చెయ్యాలి లేదా పురాతన మైన దీర్ఘకాలిక వ్యాధికి చికిత్స ప్రారంభించాలి. అలాగే దీర్ఘకాలిక చర్మ రోగ విషయంలో పుల్లౌట్ తీవ్రంగా ఉంటుందని కనుక OD తో ప్రారంభించి పేషంటుయొక్క పరిస్థితిని బట్టి మోతాదు పెంచుకోవాలని స్పష్టం చేయబడింది.

ఈ వర్క్ షాప్ లో పాల్గొన్న ప్రతీ ఒక్కరూ తమలో రోగనిరోధక శక్తి పెంపుదలకు, తమ మానసిక శారీరక శుభ్రతకు, రోగాలు రాకుండా నివారణకు రెమిడీలను తీసుకోవాలని నిర్ణయించారు. ఎంపిక విషయంలో కొన్ని ఉత్తమమైన నివారణలు గతంలోని గాయాల నివారణకు CC10.1 Emergencies మానసిక భావోద్వేగాలు గాయాల నివారణకు 15.1 Mental & Emotional tonic, శక్తి కోసం CC12.1 Adult tonic మరియు ప్రక్షాళన కోసం  CC17.2 Cleansing, చివరి రెండూ  ఒక దాని తరువాత ఒకటి ప్రత్యామ్నాయ రెమిడీ లుగా వాడాలి. అవసరమైతే పేషంట్లకుకూడా వీటిని ఉపయోగించ వచ్చు.

ఓంశ్రీసాయిరామ్