Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

Vol 9 సంచిక 5
September/October 2018
ముద్రింప తగిన వార్తాలేఖ


పూర్తి వార్తాలేఖ యొక్క కాగితం ప్రతి కావలెనన్నఈ పుటను ముద్రించండి

డా.జిత్ కే అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి

ప్రియమైన వైబ్రో అభ్యాసకులారా,

అత్యంత ఆనంద దాయకమైన గణేశ్ చతుర్ధీ సందర్భంగా మీతో ఇలా నా భావాలు పంచుకుంటున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా మన యూదు సోదరులు రోష్ హషణా గారికి శుభాకాంక్షలు తెలియ జేస్తున్నాను. సర్వమత సామరస్యం చూపిస్తూ వైషమ్యాలను రూపుమాపి దైవిక ప్రేమను ప్రసారం చేస్తూ అన్నీ మతాల పండుగలను సమైక్య భావనతో జరుపుకొనే యూనివర్సల్ మిషనరీ ఆఫ్ లవ్ లో భాగమై ఉన్నందుకు ఆనందంగా ఉంది. ఇది వాస్తవంగా విభిన్నమైనది మరియు ప్రత్యేకమైనది. 

 అనూహ్యంగా వచ్చిన వరదల కారణంగా అనేక అవస్థలకు గురైనప్పటికీ ఎంతో బాధ ననుభవిస్తూ ఉన్న కేరళ సోదర సోదరీ మణులకు మా హృదయ పూర్వక ప్రార్ధనలను చేరాలని ఆశిస్తూ ఉన్నాము. అలాగే అమెరికాలోని దక్షణ కెరొలినా మరియు ఉత్తర కెరొలినా ప్రాంతాలను అతలాకుతలం చేయనున్న మరొక హరికేన్ సమాచారాన్ని మేము గమనిస్తూనే ఉన్నాము. గత వార్తాలేఖ లో చెప్పినట్లు భూమాత అనుభవిస్తున్న ఇట్టి క్లేశాల నివారణకు అమెరికాలో బ్రాడ్కాస్టింగ్ ద్వారా హీలింగ్ వైబ్రేషణ్ పంపించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించాము. ఈ ప్రక్రియ భారతదేశంలో కూడా ప్రాక్టీషనర్ 11573…ఇండియా చొరవతో కొందరు సీనియర్ ప్రాక్టీషనర్ల ప్రోద్బలంతో ప్రారంభించడం జరిగింది. ఈ విధంగా ప్రతీ ఒక్కరి నుండి  హృదయ పూర్వక ప్రార్ధన ద్వారా వచ్చిన శక్తి అల్పమైనప్పటికీ అనంత ఫలితాన్ని ఇస్తుంది.

ప్రశాంతి నిలయంలో పురుష సేవాదళం వారి భవనంలో ప్రతీ నెలలో పదిహేను రోజులపాటు, స్త్రీ సేవాదళం భవనంలో అప్పుడప్పుడు వైబ్రో క్లినిక్కులు నడుపుతూ ఉన్నాము. మరో విషయం ఏమిటంటే ఈ సంవత్సరం గురుపూర్ణిమ ఆనంతరం ఇద్దరు ప్రాక్టీషనర్లు   టీచర్ 11422…ఇండియా ఆధ్వర్యంలో వారానికి మూడు సార్లు క్రమం తప్పకుండా ఈ సేవ నిర్వహిస్తూ ఉన్నారు. సేవాదళ్ భవనాలలో మన వైబ్రో సేవలకు చాలా డిమాండ్ ఉంది కనుక  మిగతా రోజులలో కూడా ఈ సేవను అందించడానికి నిబద్ధత కలిగిన ప్రాక్టీషనర్ల కోసం చూస్తున్నాము. ఎవరైనా ప్రాక్టీషనర్ ప్రశాంతినిలయంలో వారం రోజులు గడపడానికి వస్తున్నట్లయితే ఈ సేవలో పాల్గొనడం కోసం   [email protected] కు రాసి మీ పేరు నమోదు చేసుకోన్నట్లయితే  మీకు సేవ చేయడానికి అవకాశం కల్పిస్తాము.

 మన ప్రాక్టీషనర్ వెబ్సైట్ ను తమ అంకిత భావము మరియు దీక్షతో తీర్చిదిద్దిన ప్రాక్టీషనర్  03560…యుఎస్ఎ   మరియు వారి బృందాన్ని హృదయ పూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ వెబ్సైట్ ఇప్పుడు పూర్తి స్థాయిలో పనిచేస్తోంది. ఏదైనా కొత్తది విడుదల చేసిన సందర్భంలో కొన్ని చిన్న చిన్న సమస్యలు సహజంగా ఏర్పడుతూ ఉంటాయని మేము గుర్తించాము. ఐతే ఇటువంటివి ప్రతీ రోజు సాధ్యమైనంత వరకూ పరిష్కరిస్తూనే ఉంటాము. ఈ చిన్న చిన్న సమస్యలు ఈ కొత్త వెబ్సైట్ ను ఉపయోగించకుండా మిమ్మల్ని నిరోధిస్తాయని నేను అనుకోవడం లేదు. ఇప్పుడు మీరు మీ ప్రొఫైల్ ఫోటో మార్చడానికి, మీ వ్యక్తిగత వివరాలు మార్చుకోవడానికి, నెలవారీ రిపోర్టులు పంపడానికి  IASVP సభ్యత్వం కోసం దరఖాస్తు చేయడానికి (ఇది VP లందరికీ ఇప్పుడు తప్పనిసరి) ఇలా ఎన్నో సేవలు పొందడానికి అనుకూలంగా ఉన్నది. ఒకవేళ ఇప్పటికీ మీ నెలవారీ రిపోర్టులు నమోదు చేయడంలో వెబ్సైట్ లాగిన్ చేయడంలో ఏమైయినా సమస్యలు ఎదురవుతూ ఉంటే వెంటనే  సహాయం కోసం  [email protected] కు రాయండి.

ఈ సందర్భంగా గణేష్ చతుర్థిని పురస్కరించుకుని నిస్వార్ధ  సేవ యొక్క ప్రాముఖ్యత గురించి స్వామి చెప్పిన ఒక చిన్న కథను చెప్పి ముగిస్తాను. –  ఢిల్లీ కి చెందిన ఒక యువకుడు ప్రతీరోజు స్వామి బోధలు వింటూ ఉండేవాడు. ఒకరోజు  తను కాలేజీకి  ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న ఒక పరీక్షకు హాజరు కావాలని వెళుతున్నాడు. మార్గమధ్యంలో ఒక భిక్షగాడు అనారోగ్యంతో నడవలేని నిస్సహాయ స్థితిలో రోడ్డు పైన పడి ఉండడం గమనించాడు. ఈ యువకుడు అతడికి నిలబడడానికి సహాయం చేసి హాస్పిటల్ కి తీసుకువెళ్ళి అడ్మిట్ చేసాడు. అప్పటికి సమయం 10 గంటలు అయ్యింది. పరీక్షకు చాలా ఆలశ్యమయ్యింది. ఇక ఆ యువకుడు ఇది తన ప్రవర్తనకు స్వామి పెట్టిన పరీక్షగా భావించాడు. పరీక్ష వ్రాయలేనందుకు ఏమాత్రం విచారించ లేదు. పైగా ఒక నిస్సహాయునికి సేవ చేయగలిగినందుకు ఆనందించాడు కూడా. అతడు నాదగ్గరికి (స్వామి వద్దకు) వచ్చి ‘’స్వామీ ఒక పరీక్ష పోయింది. ఈ సంవత్సరం నేను ఉత్తీర్ణుడను కాలేను. కానీ నాకు విచారము లేదు కావాలంటే మరుసటి సంవత్సరం పరీక్ష వ్రాస్తాను. కానీ మీ పరీక్షలో ఉత్తీర్ణుడనైనందుకు ఆనందంగా ఉంది” అన్నాడు. అప్పడు నేను చెప్పాను ‘’నాయనా నీవు నా పరీక్ష లోనే కాదు నీ పరీక్షలో కూడా ఉత్తీర్ణుడవైనావు ‘’ అన్నాను. ఆ మరుసటి నెలలో ఫలితాలు వెలువడినప్పుడు ఈ యువకుడు ప్రధమ శ్రేణి లో ఉత్తీర్ణుడయ్యాడు.

ఈ యువకుడు తన పరీక్ష గురించి విచారించ లేదు ఎందుకంటే ఒక నిస్సహాయునికి సహాయం చేయడం ద్వారా దేవుని పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. ఇటువంటి ధృక్పధం ఉన్న విద్యార్ధులు ఎందరో ఉన్నారు. ఇట్టి ఉత్తమ శీల సంపత్తి ఉన్నవారు ఎప్పుడూ ఓడిపోవడం జరగదు. నీవు ఏది చేసినా హృదయపూర్వకంగా చెయ్యి. ఈ విధంగా చేస్తే నీవు దివ్యత్వాన్ని అనుభవించవచ్చు.”– , వినాయక చవితి దివ్యవాణి, 1-09-2000, ప్రశాంతినిలయం

ప్రేమతో స్వామి సేవలో

జిత్.కె.అగ్గర్వాల్

గవదబిళ్ళలు 11520...भारत

55 సంవత్సరాల వ్యక్తికి మెడ వాపు మరియు నొప్పి (చెవి క్రింద మరియు వెనుక భాగాన) కలగడంతో పాటు మూడు రోజులుగా జ్వరం కూడా వస్తోంది. డాక్టర్ దీనిని గవదబిళ్ళలు గా గుర్తించి మందులు ఇచ్చారు. పేషంటు అలోపతి మందులు వాడారు కానీ పెద్దగా ప్రయోజనం ఏమీ కలుగలేదు.

2015 ఏప్రిల్ 2న ప్రాక్టీషనర్ క్రింది రెమిడి ఇచ్చారు:
CC9.2 Infections acute + CC9.4 Children’s diseases + CC15.1 Mental & emotional tonic…TDS

కేవలం రెండు రోజుల్లోనే పేషంటుకు మెడ వాపు మరియు నొప్పి విషయంలో 90% ఉపశమనం కలిగింది మరియి జ్వరం కూడా పూర్తిగా పోయింది. వారం తరవాత అనగా 9 ఏప్రిల్ 2015, నాటికి నొప్పి, వాపు పూర్తిగా తగ్గిపోయాయి. పేషంటుకు డోస్ తగ్గించి మరికొన్ని రోజులు వాడవలసిందిగా ప్రాక్టీషనర్ సూచించారు కానీ పేషంటు తనకు పూర్తిగా నయమైంది కనుక రెమిడి తీసుకోవడం మానివెయ్యాలని భావించారు.

సంపాదకుని వ్యాఖ్య:
గవద బిళ్ళల విషయంలో CC13.1 Kidney tonic ను కూడా ఇవ్వడం మంచిది.

కిడ్నీలో రాళ్లు, జుట్టు రాలిపోవడం 03522...Mauritius

27 సంవత్సరాల వ్యక్తి 27 మే 2015, న ప్రాక్టీషనర్ ను కలిసారు. గత రెండు సంవత్సరాలుగా వీరు వెన్ను నొప్పితో బాధ పడుతూ ఉన్నారు. గత 6 నెలలుగా ఈ నొప్పి మరీ తీవ్రంగా ఉండటo వల్ల తన రోజు వారి పనుల మీద ప్రబావం చూపింది. స్కానింగ్ ఫలితాలు ఇతనికి మూత్ర పిండాలలో రాళ్లు ఉన్నట్లు తెలిపాయి కనుక వీరిని లితోట్రిప్సీ (కిడ్నీ లో రాళ్ళను పగలగొట్టడానికి వాడే అల్ట్రాసౌండ్ విధానము) కోసం వెయిటింగ్ లిస్టు లో ఉంచారు. వీరు నొప్పి నివారణలను తప్ప మరే ఇతర మందులు వాడలేదు. ఈ పేషంటు గత రెండు సంవత్సరాలుగా అజీర్ణం, అసిడిటీ తో బాధ పడుతూ ఉన్నారు. ఇంకా వీరికి గత 5 నెలలుగా చుండ్రు మరియు జుట్టు రాలిపోయే సమస్య కూడా ఉన్నది. తల పైన బట్టతల మాదిరిగా అక్కడక్కడా ఏర్పడడం చూసి వీరికి మరింత ఆందోళన పెరిగింది. దీనికోసం చుండ్రు నివారించే షాంపులను, ఆయుర్వేదం నూనెలు మరియు విటమిన్ సప్లిమెంటులను కూడా ప్రయత్నించారు కానీ ఏవీ ఉపయోగ పడలేదు. వీరికి ప్రాక్టీషనర్ క్రింది రెమెడి ఇచ్చారు:

కిడ్నీలో రాళ్లు, అజీర్ణము మరియు అసిడిటీ కొరకు:
#1CC4.10 Indigestion + CC13.5 Kidney stones + CC15.1 Mental & Emotional tonic…TDS

జుట్టు రాలిపోవడం మరియు చుండ్రు సమస్యలకు:
#2. CC11.2 Hair tonic + CC15.1 Mental & Emotional tonic + CC21.2 Skin infections …TDS

నెల రోజుల తరవాత వెన్ను నొప్పి విషయంలో 50%, అసిడిటీ, అజీర్ణ సమస్యల విషయంలో 80% ఉపశమనం లభించింది కానీ జుట్టు రాలిపోయే విషయంలో ఏమాత్రం ఫలితం కనబడలేదు. రెండు నెలల తరవాత జుట్టు రాలిపోవడం, చుండ్రు విషయంలో 40% ఉపశమనం లభించింది. 

మూడు నెలల తర్వాత  వెన్ను నొప్పి, అసిడిటీ, అజీర్ణం, పూర్తిగా మాయమయ్యాయి. అంతేకాక 30 ఆగస్టు 2015 తేదీన తీయించుకున్న ఎకోగ్రఫీ లో కిడ్నీ లో రాళ్లు పూర్తిగా మాయమయినట్లు రిపోర్టు వచ్చింది. పేషంటుకు 100% ఉపశమనం లభించడంతో ప్రాక్టీషనర్  #1 ను  OD కి తగ్గించడం జరిగింది. ఈ విధంగా నెల రోజులు వాడి 1 అక్టోబర్  2015 రెమిడి పూర్తిగా మానివేశారు. ఐతే  #2 ను మాత్రం మరో  3 నెలలు కొనసాగించారు.

30 డిసెంబర్  2015 తేదీన అనగా చికిత్స మొదలుపెట్టిన  ఏడు నెలల తరువాత ప్రాక్టీషనర్ పేషంటును కలుసుకొన్నప్పుడు గుర్తుపట్టడానికి కూడా కష్టంగా ఉండేలా పేషంటు లో మార్పు వచ్చింది, వీరి జుట్టు నమ్మశక్యంగా పెరగడమే కాక చుండ్రు సమస్య పూర్తిగా మాయమయ్యింది. కనుక  #2 ను మరొక నెల రోజులు OD గా కొనసాగించి అనంతరం మానివేశారు.

వెన్ను నొప్పి, సక్రమంగా రాని ఋతుక్రమము 11595...India

2018, ఫిబ్రవరి 28 వ తేదీన 35 సంవత్సరాల మహిళ గత ఆరు సంవత్సరాలుగా వెన్ను నొప్పి తో బాధపడుతూ ప్రాక్టీషనర్ ను కలిసారు. ఈ నొప్పి వెనుక నుండి ముందుకు వ్యాపిస్తూ ఎడమ మోకాలు వరకూ సూదితో గుచ్చినట్లు ఉంటోంది. ఈ నొప్పి సాయంత్రానికి మరీ ఎక్కువవుతుంది. పేషంటు ఈ నొప్పికి కారణం మోటార్ సైకిల్ మీద ప్రతీ రోజు తను ఎక్కువదూరం ప్రయాణం చేస్తున్నందుకు కలిగిందేమో అని భావించారు. ఈమెకు మరొక సమస్య ఏమిటంటే యుక్తవయసులో ఋతుక్రమం మొదలైనప్పటినుండి  అది సక్రమంగా రాని చరిత్ర కూడా ఉన్నది. మరీ ఆలస్యమైన సందర్భంలో అలోపతి మందులు వేసుకొనేవారు. ఇటీవలే పేషంటుకు మెడవాపు తో పాటు గర్భాశయం లో కణుతులు ఉన్నట్లు రిపోర్టు ద్వారా తెలిసింది. పేషంటు అలోపతి మందుల ద్వారా ఫలితం కలగక పోవడంతో వాటిని ఆపి వైబ్రో మందులు స్వీకరించారు.

వీరికి క్రింది రెమిడి ఇవ్వబడింది:
CC8.1 Female tonic + CC8.4 Ovaries & Uterus + CC8.8 Menses irregular + CC15.1 Mental & emotional tonic + CC20.1 SMJ tonic + CC20.5 Spine + CC20.7 Fractures...TDS నీటితో

వారం తర్వాత పేషంటుకు వెన్నునొప్పి విషయంలో స్వల్పంగా నొప్పి పెరిగింది (బహుశా పుల్లౌట్ కావచ్చు). ఐతే రెండువారాల తర్వాత ఈ వెన్నునొప్పి విషయంలో 80% మెరుగుదల కనిపించింది. అంతేకాకుండా ఋతుక్రమం కూడా సక్రమంగా రావడం ప్రారంభమయ్యింది. మూడు వారాల తరవాత అనగా 20 మార్చి 2018, తేదీన వెన్ను నొప్పి పూర్తిగా తగ్గిపోయినట్లు ఆమె తెలిపారు. కనుక డోసేజ్ ను BD కి తగ్గించడం జరిగింది. మరో రెండు వారాల తర్వాత ఈ డోసేజ్ OD కి తగ్గించడం జరిగింది. 

 2018 ఆగస్టు నాటికి పేషంటు, రెమిడి ని OD మెయింట్ నెన్స్ డోసేజ్ గా తీసుకుంటూ ఉన్నారు. పేషంటుకు వ్యాధి లక్షణాలేవీ పునరావృతం కాలేదు. గత 6 నెలలుగా వీరికి ఋతుక్రమం కూడా సక్రమంగా వస్తోంది.

ప్రాక్టీషనర్ వ్యాఖ్య:
CC20.7 Fractures అనే రెమిడి పేషంటు బైక్ మీద వెళ్ళేటప్పుడు సుమారు గంట ప్రయాణం చేయవలసి ఉంటుంది కనుక కుదుపులు ద్వారా నడుమునొప్పి పెరగకుండా ఉండడానికి ఇవ్వబడింది.

కాలి బొటన వ్రేళ్ళ మధ్య నొప్పి 11591...India

29 సంవత్సరాల మహిళకు గత 6 నెలలుగా ఎడమపాదం బొటనవ్రేలికి మరియు దాని ప్రక్క వ్రేలికి మధ్య భాగంలో నొప్పి వస్తోంది. ఈమె బైక్ నడిపిన ప్రతీసారీ లేదా కనీసం కొంచం దూరం నడిచినా వాపు వచ్చి బాధ ఎక్కువ ఆవుతోంది. అందుచేత ఇంట్లో అక్కడక్కడా తిరిగినా కూడా ఇబ్బందే వస్తోంది. కనుక పూర్తిగా విశ్రాంతి తీసుకోవడమే నొప్పి నుండి నివారణ ఇస్తోంది.

పేషంటు యొక్క కాలి x-రే రిపోర్టులు ద్వారా కూడా సమస్య ఏమిటన్నది తెలియడం లేదు. ఈమె భర్త విదేశాలలో ఉండడం, అనారోగ్యంతో ఉన్న ఆమె తండ్రి ఈమె వద్దే ఉండడం సంసార బరువు ఇవన్నీ ఆమెలో మానసికంగా ఎంతో వత్తిడి కలుగజేస్తున్నాయి. వీరు తన సమస్యల నిమిత్తం అలోపతి మందులేవి వాడకుండా పూర్తిగా వైబ్రో మందుల పైనే ఆధార పడ్డారు.

2 డిసెంబర్ 2017 న ఆమెకు క్రింది రెమిడి ఇవ్వబడింది:
CC20.4 Muscles & Supportive tissue…TDS నీటిలో లేక విభూతిలో నొప్పి ఉన్న ప్రదేశంలో రాయాలి.

రెమిడి ఉపయోగించిన మరునాటికే పేషంటుకు నొప్పి విషయంలో 100% ఉపశమనం కలిగింది కానీ మరునాటికి అది పునరావృత మయ్యింది. కనుక రెమిడి అలాగే కొనసాగించవలసిందిగా సిఫారసు చేయబడింది.19 రోజుల తరువాత ఆమెకు నొప్పి పూర్తిగా అదృశ్యమయ్యింది. వాపు, మంట కూడా 100% తగ్గిపోయాయి.

సంపాదకుని వ్యాఖ్య:
రెమిడిని పైపూతగా వాడడంతో పాటు లోపలికి కూడా తీసుకున్నట్లయితే ఇంకా త్వరగా తగ్గిపోయి ఉండేది.

నయం కాని మూర్చ 11591...India

18 సంవత్సరాల యువకుడు గత రెండు సంవత్సరాలుగా మూర్చ ను అనుభవిస్తూ సహయము కోసం 17 డిసెంబర్  2017న ప్రాక్టీ షనర్ ను సంప్రదించారు. ఈ మూర్చ వచ్చినపుడు అతడు ఏ స్థితిలో ఉన్నా క్రిందపడిపోతాడు. కొన్ని సెకన్ల కాలం కొనసాగే ఈ మూర్చ రోజుకు 4-5 సార్లు అనుభవించవలసి వస్తోంది. ఆ తరువాత దీని గురించి ఏమీ గుర్తుండదు. ఇలా ప్రతీ రోజూ ఏ సమయంలో నైనా ఎక్కడైనా ఈ మూర్చ సంభవించవచ్చు. డాక్టర్లు దీనిని రిఫ్రాక్టరి (ఔషధ నిరోధక) మూర్చ గా నిర్ధారించి  మెదడుకు శస్త్రచికిత్స చేయాలని సూచించారు. యితడు అలోపతి మందులు తీసుకుంటున్నా చెప్పుకోదగిన విధంగా ఫలితం కలుగలేదు.

ప్రాక్టీషనర్ అలోపతి మందులు కొనసాగిస్తూనే క్రింది రెమిడి తీసుకోవాల్సిందిగా సూచించారు:
CC10.1 Emergency + CC15.1 Mental & Emotional tonic + CC18.3 Epilepsy...TDS

రెమిడి తీసుకున్న మొదటి మూడు రోజుల వరకూ రోగికి విపరీతమైన దాహం అనిపించింది. ఐదవ రోజునుండి మూర్చలు తగ్గడం ప్రారంభించాయి. 10 వ రోజునాటికి  మూర్చల సంఖ్య గణనీయంగా తగ్గి రోజుకు ఒకటికి చేరుకుంది. 15 వ రోజు నాటికి  తన రెండు సంవత్సరాల బాధకు విమోచనంగా ఇవి పూర్తిగా తగ్గిపోయాయి.

 20 వ రోజు నాటికి పేషంటు యొక్క అలోపతి మందుల మార్పు కారణంగా యితడు నిలబడలేక, కూర్చోలేక క్రిందపడిపోసాగాడు. ఇటువంటి పరిస్థితి లో ఇతనిని హాస్పటల్లో చేర్చగా చికిత్స చేసి మందును కూడా మార్చి మరునాడు పంపించి వేసారు.

25వ రోజు నుండి మూర్చలు పూర్తిగా ఆగిపోయి కొన్ని నెలల వరకూ రాలేదు. ఆ తరువాత 2-3 వారాల పాటు రోజుకు ఒకసారి మూర్చ కలిగేది. ఇతడు అలోపతి మరియు వైబ్రో మందులు కొనసాగిస్తూ ఉండగా ఆగస్టు చివరినాటికి అనగా రెండు నెలల కాలంలో ఒక్కసారి కూడా మూర్చ రాలేదు.

నెర్వస్ నెస్/భయము 11271...India

43-సంవత్సరాల పాఠశాల ఉపాధ్యాయుడు గత 10 సంవత్సరాలుగా ఆత్మవిశ్వాసం కోల్పోయి ప్రతీ విషయంలోనూ భయానికి గురవుతూ ఉండేవారు. దీనివలన వీరు నల్లబల్ల  పైన కూడా కుదురుగా వ్రాయలేకపోయేవారు. ఇది వారి కెరీర్ ను ప్రభావితం చేయసాగింది. ఎవరయినా చూస్తూ ఉంటే రిజిస్టర్ లో సంతకం పెట్టడానికి కూడా భయపడేవారు చేతులు వణుకు తూ చేతి వ్రాత ఆస్పష్టంగా మారిపోయేది. డాక్టర్లు దీనిని నాడీ సంబంధ మైన వ్యాధిగా గుర్తించారు. వీరు అనేక రకాల మందులు తీసుకున్నప్పటికీ ఫలితం మాత్రం అంతంతమాత్రమే. కనుక వైబ్రో మందులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.

11 అక్టోబర్ 2014 న వీరికి క్రింది రెమిడి ఇవ్వబడింది:
#1. CC18.1 Brain & Memory tonic + CC18.4 Paralysis + CC20.5 Spine…TDS                      

4 వారాల తరువాత  వీరి చేతి వ్రాత లో మార్పు వచ్చింది కానీ భయం మాత్రం అలాగే కొనసాగుతూ ఉండడంతో ప్రాక్టీ షనర్ 8 నవంబర్  2014 న క్రింది రెమిడి ఇచ్చారు:
#2. CC15.2 Psychiatric disorders + CC18.4 Paralysis + CC20.5 Spine…TDS

చికిత్స ప్రారంభించిన రెండు నెలల తరువాత పేషంటుకు ఆత్మవిశ్వాసం, ఆందోళన విషయంలో 50% మెరుగుదల కనిపించింది. ఇప్పుడు వీరు ధైర్యంగా బోర్డు మీద వ్రాయగలుగు తున్నారు. మరో రెండు నెలల తరువాత వీరి పరిస్థితి లో 75% మెరుగుదల కనిపించింది. 9 మే 2015 నాటికి వీరికి  90% మెరుగుదల కనిపించింది. 2015 జూలై నాటికి  వీరికి పూర్తిగా ఉపశమనం కలగడంతో డోసేజ్ ను OD గా తీసుకోవలసిందిగా ప్రాక్టీషనర్ సూచించారు. కానీ పేషంటు దీనికి నిరాకరించి TDS గానే కొనసాగించాలని భావించారు. కనుక వీరికి 100% ఉపశమనం కలిగినా 2018 ఆగస్టు నాటికి ఏ ఇబ్బంది లేకుండా TDS గానే మోతాదు కొనసాగిస్తూ ఉన్నారు.

ఎడిటర్ వ్యాఖ్య :
ప్రాక్టీషనర్ CC20.5 వేసే అవసరం లేదని తెలుసుకున్నప్పటికీ ఈ కొంబో ఉపశమనం కలిగిస్తోంది కావున దీనిని అలాగే కొనసాగించారు.

నిద్రపట్టని వ్యాధి 03564...Australia

69-ఏళ్ల మహిళ తను గత పది సంవత్సరాలుగా బాధపడుతున్న నిద్రలేమి వ్యాధి నిమిత్తం అ భ్యాసకుని వద్దకు వెళ్లారు. ఆమె సాధారణంగా రాత్రి పది గంటలకు  నిద్రకు ఉపక్రమిస్తే తిరిగి ఒక గంటకే మెలుకువ వచ్చేస్తుంది. ఆ ఆతర్వాత ఆమె ఆలోపతి నిద్రమాత్ర తీసుకుంటే తప్ప నిద్ర రాదు. ఐతే అలోపతి యొక్క దుష్ఫలితాలను గుర్తించి 18 ఫిబ్రవరి 2018 న ఆమె వైబ్రియో రెమిడి తీసుకోవడం ప్రారంభించక ముందే నిద్రమాత్రలు తీసుకోవడం నిలిపివేశారు.

ఈమెకు క్రింది రెమిడి ఇవ్వబడింది:
#1. CC15.6 Sleep disorders...నిద్రపోయే ఒకగంట ముందు ఒక మాత్ర. అప్పటికీ నిద్ర రాకపోతే నిద్ర పట్టేంతవరకూ ప్రతీ పది నిమిషాలకు ఒక గోళీ వేసుకోవాలి. 

చికిత్స ప్రారంభించిన రెండు రోజుల తర్వాత పేషంటుకు 90% ఉపశమనం లభించింది. ఎందుకంటే ఆమెకు మొదటి మాత్రకే చక్కగా నిద్ర పట్టడమే కాక మరలా గంట తర్వాత మెలుకువ రావడం లేదు. ఐతే అర్ధరాత్రి మరొక గోళీ వేసుకోవాల్సిన అవసరం ఏర్పడేది ఈ విధంగా మూడునెలలు గడిచిన తర్వాత అర్ధరాత్రి వేసుకునే గోళీ అప్పడప్పుడు వేసుకునే అవసరం మాత్రమే కలిగేది. 

ఈ విధంగా మరొక నెల గడిచిన తర్వాత జూన్ 2018, నాటికి ఆమెకు పూర్తి ఉపశమనం కలిగి అరగంట తర్వాత రెండవ డోస్ తీసుకునే అవసరం అప్పడప్పుడు మాత్రమే కలిగేది. ఇక అర్ధరాత్రివేళ గోళీ తీసుకోవలసిన అవసరం చాలా అరుదుగా సంభవించేది. ఒకవేళ అటువంటి అవసరం వచ్చినా వెంటనే నిద్రపట్టేది.

ప్రాక్టీషనర్ వ్యాఖ్య:
పేషంటు తనకు కలిగిన ఉపశమనానికి ముగ్దురాలై తన స్నేహితులకు కూడా వైబ్రో చికిత్సను సిఫారసు చేసారు.

ఋతు శూల /నొప్పి 11542...India

16-ఏళ్ల అమ్మాయి గత రెండు సంవత్సరాలుగా ఋతు నొప్పితో బాధపడుతూ ఉన్నది. నొప్పి చాలా తీవ్రంగా ఉండడంతో రుతుక్రమము మూడు రోజులూ ఆమె తరగతులకు వెళ్ళడం మానేసేది. ఈ రెండు సంవత్సరాలుగా అలోపతి మాత్రలు తీసుకుంటూ ఉన్నా ఆమెకు ఏమాత్రం ఉపశమనం కలిగేది కాదు. 2018 మే నెలలో డేట్ వచ్చిన మొదటి రోజు తీవ్రమైన నొప్పితో ఈమె ప్రాక్టీషనర్ ను సంప్రదించారు.

ఈమెకు క్రింది రెమిడి ఇవ్వబడింది:
CC8.7 Menses frequent + CC8.8 Menses irregular…TDS 

మొదటి గోళీ తీసుకున్న గంటకే పేషంటుకు 100% ఉపశమనం కలిగింది. అంత త్వరగా నొప్పి నివారణ  ఐనందుకు ఆమెకు ఎంతో ఆశ్చర్యము అనిపించింది. అంతేగాక ఆ మూడు రోజులూ కూడా ఆమెకు మరలా నొప్పి రాకపోవడంతో ఆమె తన తరగతులకు కూడా హాజరయ్యింది. ఈ విధంగా సూచించిన మేరకు ఆమె డోసేజ్ తీసుకునేది.

మరుసటి నెలలో ఆమెకు రుతుక్రమ మొదటిరోజు కొంచం నొప్పి అనిపించినా పట్టించుకోకుండా కాలేజీకి వెళ్ళింది. కానీ తరువాత రెండు రోజులు ఆమాత్రం నొప్పి రాలేదు. ఆ తరువాత డోసేజ్ OD కి తగ్గించబడింది. 2018 ఆగస్టు నాటికి వ్యాధి లక్షణాలు తిరిగి తలెత్తక పోవడంతో ఆమె ఇదే డోసేజ్ కొనసాగిస్తోంది.

స్పాన్డిలైటిస్ 11542...India

 గత 6 నెలలుగా మెడ నొప్పితో బాధపడుతున్న 62-ఏళ్ల వ్యక్తి ప్రాక్టీషనర్ ను చికిత్స కోసం సంప్రదించారు. పేషంటు డాక్టర్ సూచన మేరకు నెక్ కాలర్ ను ధరించి ఉన్నారు.

వీరికి క్రింది రెమిడి ఇవ్వబడింది:
CC20.1 SMJ tonic + CC20.3 Arthritis + CC20.5 Spine…6TD

చికిత్స ప్రారంభించిన 24గంటల లోనే రోగికి 25% ఉపశమనం, మూడురోజుల తరువాత 50% ఉపశమనం కలిగింది. పది రోజుల తరువాత పూర్తి అనగా 100% ఉపశమనం కలిగింది. కనుక పేషంటు నెక్ కాలర్ ఉపయోగించడం మానేసారు. డోసేజ్ OD చొప్పున ఒక నెల తీసుకొని అనంతరం ఆపివేశారు.

కాళ్ళలోనొప్పి 11542...भारत

గత మూడు/నాలుగు సంవత్సరాలుగా రెండు కాళ్ళలోనూ నొప్పితో బాధపడుతున్న 70-సంవత్సరాల వ్యక్తి  2018 మే నెలలో ప్రాక్టీషనర్ ను సంప్రదించారు.

వీరికి క్రింది రెమిడి ఇవ్వబడింది:
CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC20.3 Arthritis + CC20.4 Muscle & Supportive tissue + CC20.5 Spine…6TD

 రెమిడి తీసుకున్న 24 గంటల అనంతరం రోగికి 100% ఉపశమనం కలిగింది. పేషంటు కు డోసేజ్ QDS గా ఒక నెల వరకూ తీసుకోవాల్సిందిగానూ, అనంతరం క్రమంగా తగ్గించుకుంటూ వచ్చి పూర్తిగా ఆపివేయవలసిందిగా సూచించ బడింది.

సంపాదకుని వ్యాఖ్య : ఈ ప్రాక్టీషనర్ పైన సూచించిన చికిత్స మాదిరిగా ఎముకలకు సంబంధించిన ఎన్నో కేసులకు విజవంతంగా చికిత్స నందించారు.

ఎలుకల బాధ 11573...भारत

ప్రతీ సంవత్సరం వర్షాకాలంలో (జూలై –సెప్టెంబర్) ఈ అభ్యాసకుడి కుటుంబం ఎలకల నుండి స్తిరమైన ముప్పును ఎదుర్కొంటోంది. ప్రతీ సంవత్సరం వీరు ఎలకల బోను ఉపయోగిస్తున్నారు. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకమైనది. ఒక హైపర్ ఆక్టివ్ ఎలుక  వస్తువులను కొరుకుతూ పాడుచేస్తూ వీరికి నిద్రలేకుండా చేస్తోంది. ఈ పందికొక్కు ఎంతపెద్దగా ఉందంటే ఏ బోను కానీ ఎర కానీ దానికి సరిపోవడం లేదు. వారు మరొకవిధంగా అనగా మందు పెట్టి చంపడం వంటివి చేసి దానికి హాని తలపెట్టాలని అనుకోలేదు. ఇటువంటి నిస్సహాయ స్థితిలో ప్రాక్టీ షనర్ వైబ్రియానిక్స్ ఉపయోగించాలని భావించారు.

26 జూలై 2018 న ప్రాక్టీషనర్ 150 మి.లీ నీటిని తీసుకొని క్రింది రెమిడిలు ఒక్కొక్క చుక్కను వేసారు:
CC10.1 Emergencies + CC15.2 Psychiatric disorders + CC17.2 Cleansing + CC17.3 Brain & Memory tonic + CC18.5 Neuralgia

ఈ రెమిడి నీటిలో 1/3 వ భాగం తీసుకొని గోధుమ పిండి కలిపి 5 ఉండలుగా చేసి వ్యూహాత్మకంగా కిచెన్ లోని వివిధ ప్రదేశాల్లో ఆ రాత్రి ఉంచారు. ఉదయానికల్లా ఆ ఉండలు లేవూ ఎలకా లేదు. మరుసటి రాత్రి చాలా సంవత్సరాలుగా ఎదుర్కొంటున్నశబ్దాల బెడద నుండి విమోచనం పొంది వారికి హాయిగా నిద్ర పట్టింది. నెల తరువాత కూడా వీరికి ఈ బెడద కలుగలేదు. మరలా ఆ ఎలుక గానీ మరే ఇతర ఎలుకలు గానీ వీరికి కనపడలేదు. వాస్తవంగా ప్రాక్టీషనర్ ఈ ఎలకల డోసేజ్ ను 3TW గా ఉపయోగించలనుకొన్నా మరలా ఆ అవసరం రాలేదు !

సంపాదకుని వ్యాఖ్య:
పెస్ట్ కంట్రోల్ కోసం రసాయనాలను ఉపయోగించకుండా ఉండడానికి ఇది సులువైన ప్రత్యామ్నాయం. ఐతే పైన పేర్కొన్నరెమిడి లో  CC1.1 Animal tonic లేకపోవడం చాలా ఆశ్చర్యకరం. ఒక UK చికిత్సా నిపుణుడు కందిరీగల నివారణకు ఈ టానిక్కు మాత్రమే ఉపయోగించారు. 2014 కాన్ఫెరెన్స్ పుస్తకం పేజీ 68 లో యిది ప్రచురింపబడింది. ఐతే ఈ కేసు విషయంలో చికిత్సా నిపుణుడు యానిమల్ టానిక్ ఉపయోగించకపోవడం యాదృచ్చికమే కానీ కావాలని చేసింది కాదు. ఆ తరువాత రెమిడి లో యానిమల్ టానిక్ కూడా కలిపి ఉపయోగించాలని ప్రాక్టీషనర్ తలిచారు కానీ ఆ అవసరం రాలేదు. బహుశా ఈ ఎలుక నరాలకు సంబంధించిన ఏదో నొప్పితో బాధ పడుతూ దాని ఉపశమనానికి అన్నింటినీ కొరుకుతూ ఉందేమో అని భావించి దాని నివారణకు పైరెమిడి ఇవ్వాలని భావించారు. 

గ్రోయింగ్ పెయిన్స్ 11594...भारत

10-సంవత్సరముల అమ్మాయి గత 5 సంవత్సరములుగా  రెండు కాళ్ళు చేతుల యొక్క కండరాల నొప్పితో బాధ పడుతూ ఉన్నది. ఈ నొప్పులు మధ్యాహ్నము మరియు రాత్రి సమయంలో ఇలా వారానికి మూడుసార్లు కలగడమేకాక ఆటల్లో పాల్గొంటే ఇవి మరింత ఎక్కువయ్యేవి. నొప్పుల గురించి పాప అర్ధరాత్రి వేళ మెలుకువగా ఉండడం ఇబ్బందిగా ఉందని ఆమె తండ్రి తెలియజేసారు. పాపను ఎందరో డాక్టర్లకు చూపించగా వారు ఈ వ్యాధిని గ్రోయింగ్ పెయిన్స్ గా నిర్ధారించి మందులు ఇచ్చారు కానీ వాటివలన తాత్కాలిక ఉపశమనం మాత్రమే కలిగింది. ప్రాక్టీషనర్ ఈమెను కలిసే నాటికి రెండు రోజుల ముందు నుండి పాప తీవ్రమైన నొప్పితో బాధ పడుతూ ఉంది. పాప చదువుకునే పాఠశాల నుండి టీచర్  ఫోన్ చేసి పాప నొప్పితో బాధ పడుతూ ఉందని కంటిన్యూ గా ఏడుస్తూ ఉందని చెప్పడంతో తల్లిదండ్రులు చాలా విచారానికి గురి అయ్యారు. ప్రాక్టీషనర్ పాపను కలిసేనాటికి ఆమె సన్నగా ఆకలి తక్కువగా ఉన్నట్లు కనపడింది. వైబ్రియోనిక్స్ తీసుకునేనాటికి ఆమె ఎటువంటి అలోపతి లేదా ఇతర మందులు తీసుకొనడం లేదు.

 2018 మార్చి 9 వ తేదీన ఆమెకు క్రింది రెమిడి ఇవ్వబడింది:
#1. CC4.1 Digestion tonic + CC12.2 Child tonic + CC15.1 Mental and Emotional tonic + CC17.3 Brain and Memory tonic + CC20.2 SMJ pain + CC20.4 Muscles and Supportive tissue…one dose every 10 minutes అలా 2 రెండు గంటల పాటు తరువాత రోజు నుండి 6TD.

10 రోజుల తర్వాత పేషంటు కు 90% ఉపశమనం కలిగింది ఐనప్పటికీ పాప తల్లిదండ్రులు 6TD. గా కొనసాగించాలని అభ్యర్ధించారు. మరొక వారం తర్వాత అనగా 26 మార్చి 2018,తేదీనాటికి బాధ పూర్తిగా అదృశ్యమయింది. అందుచేత డోసేజ్ TDS. కు తగ్గించబడింది. నెల తరువాత నొప్పి పునరావృతం కాకపోయే సరికి డోసేజ్ OD. కి తగ్గించబడింది. మరో మూడు నెలలు వాడిన తరువాత ఆగస్టు 1 వ తేదీనుండి  వారు రెమిడి ఆపుదామని నిర్ణయించుకున్నారు. సెప్టెంబర్ 7 నాటికి పాప ఏ వ్యాధి లక్షణాలు లేకుండా ఆనందంగా ఉంది. అంతేకాక తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో ఎంతో అనందం పొందారు. ప్రస్తుతం పాప తల్లి తన యొక్క కీళ్ళ నొప్పులు మరియు కణితి కి వైబ్రో మందులు వాడుతున్నారు.

క్రోన్స్ వ్యాధి 11594...भारत

62-సంవత్సరాల ఆస్త్రేలియన్ మహిళ గత 7 సంవత్సరాలుగా క్రోన్స్ వ్యాధితో బాధ పడుతున్నారు. ఈ వ్యాధి వలన ఈమెకు  తీవ్ర మైన కడుపునొప్పి, కడుపు ఉబ్బరం, మలబద్దకం మరియు అతిసారం, మధ్య ప్రేగు కదలికలు, క్రమంగా బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం వంటి  లక్షణాలు కలిగి ఉన్నారు. రోగికి 2013 లో హెమికొలేక్టమి (పెద్దప్రేగు యొక్క ఒకభాగం శస్త్రచికిత్స ద్వారా తొలగించడం) చేసారు కానీ పెద్దగా ప్రయోజనం చేకూరలేదు. పేషంటు యొక్క డాక్టరు ఈ క్రోన్స్ వ్యాధికి సరియయిన నివారణ ఏదీ లేదని చెప్పడంతో ఈమె తన జీవనవిధానము మార్చుకొని యోగా, ధ్యానము, ఆహారములో నియంత్రణ పాటించసాగారు. ఐనప్పటికీ వ్యాధి లక్షణాలు కొనసాగుతూ ఉండడంతో ఈమె నిస్సహాయ స్థితిలో ఉన్నారు.  పేషంటు తన స్నేహితురాలిని కలవడానికి ఇండియా వచ్చినప్పుడు ఈమె ఆహారం కొన్ని పుచ్చకాయ ముక్కలు మరియి ఒక ఆమ్లెట్ మాత్రమే.

ఇటువంటి  పరిస్థితిలో 10ఏప్రిల్ 2018 న ఈమెకు క్రింది రెమిడి ఇవ్వబడింది:
#1. CC4.1 Digestion tonic + CC4.4 Constipation + CC4.6 Diarrhoea + CC10.1 Emergencies + CC12.1 Adult tonic+ CC15.1 Mental and emotional tonic…రెండు గంటల పాటు ప్రతీ పదినిమిషాలకు ఒకడోస్ మరుసటి రోజునుండి  6TD 

మరుసటి రోజుకు పేషంటుకు 60%ఉపశమనం కలిగింది కానీ కడుపులో అసౌకర్యం అలానే ఉంది. 10 రోజుల తరువాత ఈమె రోగలక్షణాలన్నీ అదృశ్యమయ్యాయి. దీనితో డోసేజ్ TDS.కు తగ్గించబడింది. ఐతే పేషంటు తిరిగి ఆస్ట్రేలియా వెళ్ళవలసి ఉండి కనుక ఆరు నెలలకు సరిపడా మందులు ఇచ్చి మోతాదును తగ్గించే విధానము రోగికి ప్రాక్టీషనర్ వివరంగా తెలియజేసారు. నెల తరువాత పేషంటు డోసేజ్ ని OD.కి తగ్గించారు. 7 జూన్ 2018 తేదీన పేషంటు చివరిసారి పంపిన ఈమెయిలు బట్టి ఆమెకు రోగ లక్షణాలేమీ పునరావృతం కాకుండా అనందంగా ఉన్నారు. అంతేకాక తన నయంకాని వ్యాధి వైబ్రో మందులతో నివారణ ఐన విషయం తన స్నేహితిలందరికీ తెలియజేసారు.

 

చికిత్సా నిపుణుల వివరాలు 11520...भारत

ప్రాక్టీషనర్ 11520...ఇండియా  క్లినికల్ సైకాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాలలో ఉత్తీర్ణత సాధించిన ఈ ప్రాక్టీషనర్ కార్పోరేట్ రంగంలో కన్సల్టెంట్ గా ఉన్నారు. వీరు ఎక్కువ సమయం తమ ఇంటి నుండే తన కెరీర్ కు చెందిన పనులు చేస్తూనే గృహ బాధ్యతలను కూడా నిర్వహిస్తూ సమతుల్యం చేసుకుంటూ ఉన్నారు. ఒక ఆసక్తికరమైన పరిణామం 2012 లో వీరిని సాయివైబ్రియోనిక్స్ ద్వారా స్వామి ఫోల్డ్ లోనికి వచ్చేలా చేసింది. 2008 లో వీరి భర్తకు ప్రమాదంలో హిప్ జాయింట్ విరిగి దాదాపు వికలాంగు డిని చేసింది. వీరి భర్త అలోపతి, హొమియోపతీ, ఆయుర్వేదం ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఎన్నో వైద్య విధానాలు ప్రయత్నిoచారు కానీ ఏమాత్రం ఫలితం లేకుండా పోయింది. ఇట్టి స్థితిలో ఈమె  ప్రాక్టీషనర్02860,ద్వారా  2011లో సాయి వైబ్రియోనిక్స్ మందులను ప్రయత్నం చేసారు. 6 నెలలలోనే వీరి భర్త వాకర్ సహాయంతో తనంత తాను నడవగలిగే స్థితికి చేరుకున్నారు. సంవత్సరంలోనే  వాకర్ సహాయం కూడా లేకుండా సమతల ప్రదేశంలో నడవడం ప్రారంభించారు. ఈ అద్భుత పరిణామం వీరిలో స్వామి పట్ల కృతజ్ఞతను పెంచి తన జీవితాంతం వైబ్రియోనిక్స్ ద్వారా స్వామి సేవ చెయ్యాలనే నిర్ణయానికి వచ్చేలా చేసింది. 

వీరు 2012 డిసెంబర్ లో AVP గానూ, 2013 ఫిబ్రవరి లో VP గానూ, 2015  ఫిబ్రవరి లో SVP  గానూ శిక్షణ పూర్తి చేసుకున్నారు. వీరి భర్తకు మరొకసారి చీల మండల వద్ద ప్రమాదం జరిగి ఎడమవైపు కాలిలో లిగ్మెంటు పాడవడం, వాపు రావడం జరిగింది. ప్రాక్టీషనర్ కేవలం వైబ్రో మందుల మీదనే ఆధారపడి తానే స్వయంగా భర్తకు చికిత్స చేసారు. దీనితో కేవలం 25 రోజులలో వీరి భర్తకు స్వస్థత చేకూరింది. ఈ సంఘటన వైబ్రియోనిక్స్ పట్ల మరియు స్వామి పట్ల వీరి విశ్వాసాన్ని మరింత పెంచాయి.

ఈ ప్రాక్టీషనర్ 2012 డిసెంబర్ నుండి 3300 మంది పేషంట్లకు విజయవంతంగా చికిత్స నందించారు. ముఖ్యంగా వెరికోజ్ వీన్స్ , UTI, కండరాల వాపు, భుజాలు బిగదీసుకు పోవడం, ఎముకలు విరగడం, కిడ్నీలో రాళ్లు, చర్మ వ్యాధులు, శ్వాస సంబంధమైన సమస్యలు, క్రుంగుబాటు, ఇంకా జలుబు, దగ్గు, జ్వరం మొదలగు వ్యాధులతో బాధపడే పేదవారు, నిర్భాగ్యులకు వీరు ఎంతో సేవ చేసారు. వీరి అనుభవం ప్రకారం తన అంతః చేతన (స్వామి ప్రేరణ) ద్వారా ఏదో ఒక రెమిడి బాటిల్ కానీ, కార్డు కానీ  తీసి రెమిడి ఇచ్చినప్పుడు అది చాలా వేగంగా పనిచేస్తున్నట్లు తెలుసుకున్నారు.  వీరు తరుచుగా విజయవంతమైన రోగచరిత్రలను వార్తాలేఖలకు పంపిస్తూ ఉంటారు. అలాగే ఎప్పటికప్పుడు వార్తాలేఖలను చదవడం ద్వారా కొత్త విషయాలను తెలుసుకుంటూ ఉంటారు. 

ఈ ప్రాక్టీషనర్ తన ఇంట్లోనే పెరుగుతున్న మొక్కలకు వైబ్రియానిక్స్ రెమిడిలు ఉపయోగించడం అంటే చాల ఇష్టపడతారు. ముఖ్యంగా  CC1.2 Plant tonic + CC15.1 Mental & Emotional tonic. ఉపయోగించడం ద్వారా ఈ మొక్కలన్నీ తమ చుట్టూ పక్కల ఇళ్ళలో ఉన్నవాటికంటే పచ్చగా ఆరోగ్యంగా ఉన్నట్లు గ్రహించారు. వేసవిలో ఉష్ణోగ్రత 48°C ఉన్నప్పుడు కూడా పైన సూచించిన రెమిడి వలననే ఈ మొక్కలు ఆరోగ్యంగా ఉన్నట్లు వీరు తెలుసుకున్నారు. పైన పేర్కొన్న రెమిడి తో పాటు CC18.1 Brain disabilities ను కలిపి మొక్కలను తరలించడానికి లేదా కొత్త మొక్కలు నాటడానికి ముందు మొక్కల పైన, భూమి పైన స్ప్రే చేయడం ద్వారా తొలగిస్తారు. మొక్కలతో పాటు పక్షులు  జంతువులకు కూడా తన గార్డెన్ లో ఆహారము మరియు నీరు  అందించడం ద్వారా తన ప్రేమను వీరు చాటుకుంటున్నారు. వీటికోసం కుండలలో మట్టి పాత్రలలో ప్రతీరోజు నీరు నింపి ఆ నీటిలో తను AVP, ఐనప్పటి నుండీ CC1.1 Animal tonic + CC15.1 Mental & Emotional tonic వేయడం మొదలు పెట్టారు. ఆశ్చర్యకరంగా ఈ పక్షులు జంతువుల సంఖ్య రోజురోజుకూ పెరగ సాగింది. (ఫోటోలు చూడండి).

భగవంతుని చేతిలో ఒక పనిముట్టుగా వైబ్రో సేవను నిర్వర్తించడం తనకు అమితమైన ఆనందాన్ని అందిస్తోందని ప్రాక్టీషనర్ చెపుతున్నారు. ఈ విధానము ద్వారా తన ఆత్మవిశ్వాసము పెరగడమే కాక భగవంతుని పట్ల భక్తి కూడా పెరిగిందని వీరు భావిస్తున్నారు. భగవంతుని పట్ల విశ్వాసము, భక్తి, పవిత్రమైన హృదయము తో సేవ చేస్తే రోగికి నయం కాకపోవడం అంటూ ఉండదని వీరి అనుభవం ద్వారా తెలుసుకున్నారు. " ప్రతీ కుటుంబము సాయి వైబ్రియానిక్స్ యొక్క ఫలాలు అందుకొని ఆనందంగా ఉండాలి!” అని స్వామికి వీరు నమ్రతతో నివేదిస్తున్నారు.

పంచుకున్న కేసులు:

 

చికిత్సా నిపుణుల వివరాలు 03522...मॉरीशस

ప్రాక్టీషనర్  03522…మారిషస్  వీరు గత పదహారు సంవత్సరాలుగా మారిషస్ కు చెందిన ఒక ఏవియేషన్ సంస్థ లో నిపుణుడిగా పనిచేస్తున్నారు. వీరు చిన్నప్పటినుండి సాయి భక్తులు కావడంతో సాయి సంస్థకు చెందిన అనేక సేవా కార్యక్రమాలలలో పాల్గొంటూ ఉండేవారు. డాక్టర్ అగర్వాల్ మరియు శ్రీమతి హేమ శీర్షికతో కూడిన సోల్ జర్న్స్ వీడియోలు చూసిన తరువాత సాయి వైబ్రియోనిక్స్ చికిత్స యొక్క గొప్పతనం వీరు తెలుసుకున్నారు. ఈ స్పూర్తితో వెంటనే వైబ్రియోనిక్స్ వెబ్సైట్ కు శిక్షణ కోసం అప్లై చేసి ఇ కోర్సు అనంతరం శిక్షణ కూడా పూర్తిచేసారు.  2015 లో AVP గానూ మరియు  2016 జూన్ లో VP గానూ అయ్యారు.

సాక్షాత్తు భగవంతుని చేత ఆశీర్వదించబడిన ఈ వైద్యవిధానం లో ప్రాక్టీషనర్ కావడం తన అదృష్టంగా భావిస్తున్నారు. ఆపదలో ఉన్నవారికి నిస్సహాయులకు సాయి సభ్యుడిగా సహాయం చేయగలిగే  భాగ్యం కలగడంతో తన చిరకాల వాంఛ నెరవేరిందని తెలుపుతున్నారు. అద్భుతమైన 108CC బాక్సు ద్వారా ఒక ప్రాక్టీషనర్ గా రోగులకు నిస్వార్ధ సేవ చేయడం చాలా పెద్ద భాద్యత అని వీరి భావన. గొంతు మంట నిమిత్తం ఆంటీబయోటిక్ తీసుకుంటున్న 37 సంవత్సరాల వ్యక్తికి వచ్చిన నీళ్ళ విరోచనాల సమస్య సరియైన రెమిడి ద్వారా 24 గంటలలో నివారణ కావడం వైబ్రియానిక్స్ పైన తనకున్న విశ్వాసాన్ని పెంచిందని వీరు తెలుపుతున్నారు.

ఎక్కువమంది పేషంట్లు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపకుండా తమ అనారోగ్య సమస్యలకు వేగవంతమైన పరిష్కారాలకోసం ఎదురుచూస్తారు తప్ప తమ జీవన విధానము మార్చుకొనుటకు, రోగాలకు మూలకారణం గా ఉన్న అనారోగ్యకరమైన అలవాట్లను దూరం చేసుకొనుటకు ఆసక్తి చూపరు. కనుక రోగులకు తమ జీవన శైలిని మార్చుకొనడానికి తమ సంక్షేమం కొరకు వారిలో మార్పు తీసుకురావడానికి హితవు చెప్పడం అభ్యాసకుడికి చాలా పెద్ద బాధ్యత. అలాగే వారిలో నమ్మకాన్ని పెంపొందించి సక్రమంగా వైబ్రో నివారణులను వాడేలా చేయడం కూడా అభ్యాసకుడికి ఒక గురుతరమైన బాధ్యత. మరొక మాటలో చెప్పాలంటే ఇది ఒక గొప్ప సాధన కూడా.

మనలో ఉన్న దివ్యత్వమే అన్ని జీవరాసులలోనూ ఉందని భావించి సర్వులయందు భగవంతుని చూడగలిగితే మన ప్రేమ విశాలమవుతుందని వీరి భావన. ప్రేమకు ఎంతో శక్తి ఉందని అది రోగుల భావోద్వేగాల పైన ఎంతో ప్రభావం చూపి సత్వర రోగనివారణ కల్పిస్తుందని భావిస్తున్నారు. వీరు తన పేషంట్లకు మిగతా రెమిడిలతో పాటు CC15.1 Mental & Emotional tonic కూడా ఇస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ  రెమిడి సత్వర ఉపశమనానికి రోగానివరణకు సహకరిస్తుందని వీరు అనుభవంలో తెలుసుకున్నారు.

పేషంట్లను చూడడంతో పాటు వీరు మన మిషన్లో పనిచేస్తూ మొదటి అంతర్జాతీయ వైబ్రో కాన్ఫెరెన్స్ పుస్తకాన్ని ఫ్రెంచ్ భాష లోనికి అనువదించారు. ఈ వైబ్రో విధానము తనకు హృదయంతో పనిచేయడం నేర్పడం తో పాటు ఆధ్యాత్మిక బాటలో పురోగమించడానికి ఎంతో సహకరించిందని ప్రాక్టీషనర్ భావిస్తున్నారు.  ఈ సాధనలో ‘’మనం ఎంతమంది పేషంట్లను చూసాము అనే దానికన్నా ఎలా చూసాము అనేదే కొలమానం’’ అని వీరు భావిస్తున్నారు.

పంచుకున్న కేసులు :

ప్రశ్న-జవాబులు

1. ప్రశ్న : ఒకరోగి  తన ప్రతికూలమైన ఆలోచనలను అపలేని నిస్సహాయ స్థితి లో కూడా వైబ్రో రెమిడి లు అతని వ్యాధి మరియు అతని ప్రతికూల ఆలోచనల నివారణకు తోడ్పడతాయా  ?

    జవాబు  : ఔను వైబ్రో నివారణలు పేషంటు యొక్క ప్రతికూల ఆలోచనలను వ్యాధిని కూడా  నివారిస్తాయి. సానుకూలమైన ఆలోచనలను కలిగిన వారికి చాలా త్వరగా నయమవుతుంది. కనుక పేషంట్లు  ఎప్పుడూ సానుకూలమైన ద్రుక్ఫధాన్ని  కలిగి ఉండి మంచిగా ఆలోచించేలా ప్రాక్టీషనర్ లు ప్రోత్సహిస్తూ ఉండాలి. అలాగే వైబ్రో నివారణులు రోగుల సమస్యలను నయం చేయడంలో అద్భుతంగా సహాయపడతాయని చికిత్సా నిపుణునికి పూర్తి విశ్వాసం ఉండాలి. రెండవ విషయానికి వస్తే  పేషంటు లో నెగిటివ్ ఆలోచనలకు మూలం ఏమిటో గుర్తించాలి. సాధారణముగా భయము, తిరస్కారము, షాక్, కోపము, విచారము ఇవి భావోద్వేగాల రూపంలో అణిచివేయబడి ఉంటాయి. కనుక ప్రాక్టీషనర్ వీటికి గల అంతర్గత కారణాన్ని తెలుసుకొనడానికి హృదయపూర్వకంగా ప్రయత్నించి 15, 17 లేక 18 వర్గాలలో సూచించిన విధంగా తగిన రెమిడి ని పేషంటుకు ఇవ్వాలి. ఒకవేళ పేషంటు కు ఈ రెమిడి వలన పెద్దగా ప్రయోజనం చేకూరకపోతే మరలా కౌన్సిలింగ్ చేసి సరియయిన కారణం రాబట్టాలి. ఒకవేళ ఇవన్నీ చేసినప్పటికీ పేషంటు అసంతృప్తిగా ఉంటే ప్రాక్టీషనర్ తన ఆత్మవిశ్వాసాన్ని వైబ్రో మందుల పైన విశ్వాసాన్ని కోల్పోకూడదు. కొన్ని సందర్భాలలో మన ప్రయత్నం కంటే పేషంటు యొక్క సంస్కారాలు అనగా గత జన్మ యొక్క కర్మలు, వాటి తాలూకు వాసనలు బలంగా ఉంటాయి. ఐతే దివ్య వైద్యుడయిన భగవంతుడు సాధకుని యొక్క అంతర్గత ప్రయాణాన్ని పరిగణన లోనికి తీసుకోని చివరిలో అతని బాధలకు ముగింపు నిస్తాడు. ఐతే సాధకుడు భగవంతుని పట్ల పూర్తి విశ్వాసం ఉంచి బాధను భారంగా కాక సాధనగా స్వీకరించే స్థితిని కలిగి ఉండాలి. ఉదాహరణకు దాక్టర్ జాన్ హిస్లోప్ తను ఈ దేహాన్ని కాదు ఆత్మను అన్న సత్యాన్ని గుర్తించి భగవంతుడు తన కర్మలన్నింటినీ ప్రక్షాళన చేస్తున్నారని భావించి కేన్సర్ తో ఉన్న తన శరీరాన్ని ఆనందంగా వదిలివేశారు. ఐతే కొన్నిసార్లు రోగి దుర్బలతను బట్టి, పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని  బట్టి, పరిసరాలలో ఉన్న సమస్యలు అనగా పిల్లలు ప్రేమ రాహిత్య వాతావరణం లో పెంచబడడం, పర్యావరణం బట్టి కూడా నివారణ ఆలస్యం కావచ్చు. ఎవరికయినా జీవితం మీద ఆశ లేకపోతే వారి జీవితంలో అనందానుభూతి, మనసు, దేహాలకు ఆరోగ్యాన్ని అందించడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. అన్నింటికన్నా ముఖ్యమైనది ఏమిటంటే  అభ్యాసకుడు పేషంటు కు ప్రేమతో చికిత్స చేస్తూ వారిలో విశ్వాసాన్ని, ఆశను వాస్తవిక ధృక్పదాన్ని కల్పించడం ప్రధానం. . 

________________________________________

2. ప్రశ్న: గైనేకొమాస్టియా(పురుషులలో వక్షోజ పెరుగుదల) నివారణకు  CC14.3 కాకుండా వేరే ఏదయినా రెమిడి ఉందా ?

    జవాబు: మీ వద్ద 108CC బాక్స్ మాత్రమే ఉండి సీనియర్ ప్రాక్టీషనర్ ను సంప్రదించడానికి అవకాశం లేకపోతే CC14.3 చాలా ఉత్తమమైన మిశ్రమం. ఐతే SRHVP ఉన్నవారు SR262 Nat Phos 6X…OD ని SR381 Conium 1M…OW. తో పాటుగా ఇవ్వవచ్చు. గమనించ వలసినది ఏమిటంటే ఈ సమస్య పురుషులలో అధికబరువు ఉన్నవారికి వస్తూ ఉంటుంది కనుక వారి ఆహారంలో కూడా నియంత్రణ పాటించడం మంచిది. 

________________________________________

3. ప్రశ్న:  SRHVP చక్ర కార్డులను విడిగానే ఉపయోగించాలా లేక వాటిని మిళితం చేసే ఒకే రెమిడి గా ఉపయోగించ       వచ్చా?

    జవాబు: రెండు చక్ర కార్డులను కలిపి ఒక మిశ్రమం గా చేయవచ్చు. ఐతే ఒకసారికి ఒక కార్డును  మాత్రమే ఉపయోగిస్తే ఫలితాలు బాగుంటాయి. దీనికి పోటెన్సీ CM మరియు డోసేజ్ OD (నిద్రపోవడానికి ముందు) సాధారణంగా ఒక చక్రా ను బ్యాలన్స్ చేయడానికి ఈ రెమిడి రెండు రోజులు తీసుకుంటుంది. చక్రా చికిత్సా సమయంలో ఇతర వైబ్రో రెమిడి లను ఉపయోగించరాదు. ఒకవేళ పేషంటు అప్పటికే ఇతర రెమిడి తీసుకుంటూ ఉన్నట్లయితే  చక్రా రెమిడి ఇవ్వడానికి మూడు రోజుల ముందు దానిని నిలిపి వెయ్యాలి. చక్రా బ్యాలెన్సు ఐన తర్వాత తిరిగి ఆ రెమిడి ని పునః ప్రారంభించాలి.

________________________________________

4. ప్రశ్న :ఒక రెమిడి ని రోజుకు ఎన్నిసార్లు పేషంటుకు ఇవ్వవచ్చు. కొందరు గోళీలను TDS గా తీసుకోవడం ఇబ్బంది అంటున్నారు. మరికొందరు త్వరగా కోలుకునేందుకు గానూ  6TD కన్నాఎక్కువ సార్లు తీసుకోవాలని భావిస్తూ ఉంటారు. మరికొందరు పేషంట్లు ప్రతీ రోజు రెమిడి ని తీసుకొనడానికి బద్దకిస్తూ ఉంటారు కానీ మందులు పనిచేయడం లేదని నిందను వైబ్రో రెమిడి ల మీదికి తోస్తూ ఉంటారు. ఇటువంటి పేషంట్ల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

    జవాబుఅధికశాతం ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా వ్యాధులు అనుభవిస్తూ కూడా నివారణ మాత్రం త్వరగా కావాలని కోరుకుంటారు. అటువంటి వారి విషయంలో వ్యాధి నయం కావడానికి సమయం పడుతుంది. ముఖ్యంగా భౌతిక శరీరంలో అభివ్యక్తమయ్యే ముందు శరీరం చుట్టూ ఉన్న శక్తి రంగంలో కంపనాలు బలంగా రూపుదిద్దుకోవాలి. ఈ విషయంలో పేషంటు యొక్క అంచనాలకు అనుగుణంగా ఉండడం ముఖ్యమే ఐనప్పటికీ అంతకంటే ముందు భగవంతుడికి ఇచ్చిన వాగ్దానము దృష్టిలో పెట్టుకొని నిబద్దతతో పనిచేస్తూ పేషంటు ను మన సూచనలు అంగీకరింపచేయదానికి కృషి చెయ్యాలి. రెమిడి ని ఇచ్చిన మోతాదు ప్రకారం క్రమం తప్పకుండా తీసుకోవడం వలన నివారణ వేగవంతం అవుతుంది. అంతేకాకుండా అసలు తీసుకోకపోవడం కంటే తక్కువసార్లు మోతాదును తీసుకోవడం వలన కూడా నివారణ సాధ్యమే. సాధారణంగా ఒక రెమిడిని గరిష్ట స్థాయిలో రోజుకు 6TD గా తీసుకోవడం జరుగుతుంది. ఐతే వ్యాధి  తీవ్రత బట్టి ప్రతీ పదినిమిషాలకు ఒక డోస్ చొప్పున రెండు గంటల వరకూ కూడా తీసుకోవచ్చు. ఐతే 6TD కన్నాఎక్కువసార్లు మందు తీసుకున్న దాఖలాలు మన ప్రచురణ కేసులలో లేవు. 

________________________________________

5. ప్రశ్న నాకు పేను ముట్టడి తో బాధపడే ముగ్గురు పేషంట్లు ఉన్నారు. వీరికి వైబ్రో రెమిడి ఇవ్వడానికి సరియయిన పద్దతి ఏమిటి?

    జవాబుఈ సమస్య తో ఉన్నవారికి  CC11.2 Hair problems…TDS  లేదా SR315 Staphysagria…OD ని పై పూతగా నెల రోజులపాటు ఇవ్వవచ్చు. పేల నివారణకు వాడే షాంపు ను మేము సిఫారసు చేయము ఎందుకంటే వీటిలో అధిక మోతాదులో రసాయనాలు ఉంటాయి. ఉత్తమమైన పద్దతి ఏమిటంటే నీటితో నివారణని తయారుచేసి BD. గా తలపైన రాయడం ఉత్తమ మైన పద్దతి.

దివ్య వైద్యుని దివ్య వాణి

"ఈ రోజుల్లో ప్రజలంతా పొద్దస్తమానం ఏదో ఒకటి తింటూనే ఉంటారు. ఇంక పానీయాలు, స్నాక్స్ విషయం చెప్పనే అక్కరలేదు. ఏమాత్రం అవకాశం చిక్కినా మధ్య మధ్య వాటిని కూడా కడుపులో వేసేస్తూ ఉంటారు. ఇలా చేస్తే అజీర్ణము ఇంకా ఇతర వ్యాధులు రాకుండా ఎలా ఉంటాయి. మనిషికి నిమిషానికి ఒక కేలరీ శక్తిని ఇచ్చే ఆహారము సరిపోతుంది. యుక్తవయసులో ఉన్నవారికి రోజుకు  2,000 కేలరీల ఆహారము సరిపోతుంది. ఆరోగ్యకరమైన జీవితానికి మనిషికి రోజుకు  1,500 కేలరీలనిచ్చే ఆహారము చాలు. కానీ ఈ రోజుల్లో మనిషి సగటున  5,000 కేలరీల శక్తి నిచ్చే ఆహారం తీసుకుంటున్నాడు. దీనిఫలితముగా అజీర్ణము నిద్రలేమి ఏర్పడుతున్నాయి. నిద్ర లేకపోవడం ఎన్నో అనర్ధాలకు కారణ మవుతుంది. నిద్ర గురించి చింతించకూడదు. ఏమాత్రం ఆందోళన చింత లేకుండా పడుకుంటే హాయిగా నిద్ర పట్టేస్తుంది"                                                                  

-సత్యసాయిబాబా, “నడిచే దేవాలయం వేసవి వెన్నెల 1990 అధ్యాయం3
http://sssbpt.info/summershowers/ss1990/ss1990.pdf

 

 

"ఎవరయితే నిస్సహాయులైన తమ సోదర సోదరీమణులకు సేవ చేస్తారో వారు ఇప్పుడు నేను చెపుతున్న మాటలకు సాక్ష్యంగా నిలుస్తారు. అహంకారం రూపుమాపడానికి, హృదయాన్ని ఆనందంతో నింపుకొనడానికి సేవకు మించిన సాధన మరొకటిలేదు. సేవను అర్ధంలేనిది గానూ, చిన్నతనంగానూ చూసేవారు దీని యొక్క మహత్తర ఫలితాలు పొందలేరు. సేవ యొక్క ఉత్తుంగ తరంగం ఈ ప్రపంచమును ప్రభావితం చేసే ద్వేషం, అసూయ, స్వార్ధం వంటి అవలక్షణాల నన్నింటిని దూరం చేయగలదు."

-సత్యసాయిబాబా , “ఏనుగులు మరియు సింహము ”10సెప్టెంబర్ 1969నాటి దివ్యవాణి1969
http://www.sssbpt.info/ssspeaks/volume09/sss09-18.pdf

 

 

ప్రకటనలు

నిర్వహింప బోయే శిబిరాలు

  • ఇండియా ఢిల్లీ -NCR: రిఫ్రెషర్ సెమినార్ : AVP/VP - 22 సెప్టెంబర్ , SVP - 23 సెప్టెంబర్  2018, సంప్రదించ వలసినవారు సంగీతా శ్రీవాత్సవ వెబ్సైట్  [email protected] లేక ఫోన్ నంబరు  9811-298-552 

  • ఇండియా పుట్టపర్తి: AVP వర్క్ షాప్ 18-22 నవంబర్  2018, సంప్రదించ వలసినవారు లలిత వెబ్సైట్  [email protected] లేక ఫోన్ నంబరు  8500-676-092

  • ఇండియా పుట్టపర్తి: SVP వర్క్ షాప్ 24-28 నవంబర్ 2018, సంప్రదించ వలసినవారు హేమ వెబ్సైట్ [email protected]

  • ఇండియా పుట్టపర్తి: VP వర్క్ షాప్ కేరళ వారికోసం AVP లకు 30 నవంబర్ & 1 డిసెంబర్ 2018, సంప్రదించ వలసినవారు పద్మ వెబ్సైట్ [email protected]

  • ఇండియా రాజస్తాన్ : AVP రిఫ్రెషర్ సెమినార్ పిబ్రవరి 2019, సంప్రదించ వలసినవారు హేమ వెబ్సైట్ [email protected]

  • ఇండియా పుట్టపర్తి: AVP వర్క్ షాప్  6-10 మార్చి 2019, సంప్రదించ వలసినవారు లలిత వెబ్సైట్ [email protected] లేక ఫోన్ నంబరు 8500-676 092

  • ఇండియా పుట్టపర్తి: SVP రిఫ్రెషర్ సెమినార్ 11-12 మార్చి 2019, సంప్రదించ వలసినవారు హేమ వెబ్సైట్  [email protected]

  • ఇండియా పుట్టపర్తి: AVP వర్క్ షాప్ 17-21 జూలై 2019, సంప్రదించ వలసినవారు లలిత వెబ్సైట్ [email protected] లేక ఫోన్ నంబరు 8500-676 092

  • ఇండియా పుట్టపర్తి: AVP వర్క్ షాప్ 18-22 నవంబర్ 2019, సంప్రదించ వలసినవారు లలిత వెబ్సైట్ [email protected] లేక ఫోన్ నంబరు 8500-676-092

  • ఇండియా పుట్టపర్తి: SVP వర్క్ షాప్ 24-28 నవంబర్ 2019, సంప్రదించ వలసినవారు హేమ వెబ్సైట్  [email protected]

అదనంగా

1. ఆరోగ్య వ్యాసము

మంచి ఆరోగ్యానికి మొలకలు

ఒక విత్తనం భూమిలో నాటినప్పుడు అది మొక్కగా ఎదుగుతుంది. కానీ అదే విత్తనాన్ని వంటలో ఉపయోగించినప్పుడు అది నాశన మవుతుంది. కనుక ఆహారాన్ని దాని సహజ సిద్ధమైన రూపంలో తీసుకొన్నప్పుడు ఆయుష్ష్ ను పెంచుతుంది. వండకుండా తీసుకునే ఆహారంలో ప్రోటీన్లు అధిక మొత్తంలో ఉంటాయి. ఉదాహరణకు పెసలు, సోయా బీన్స్ లలో చాల ఎక్కువ మొత్తంలో ప్రోటీన్లు ఉంటాయి. అలాగే బఠానీ, బీన్సు లేదా కాయ ధాన్యాలను నీటిలో నానబెట్టి మొలకలు వచ్చిన తరువాత తింటే ఎంతో శక్తిదాయకముగా ఉంటాయి…” సత్యసాయిబాబా 1

1. విత్తనమే మూలము

విత్తనం నుండి ఉద్భవించే మన చుట్టూ ఉన్న ప్రతీ మొక్కకూ అవసర మైనంత మేధస్సు, మద్దతు భూమి నుండి లభిస్తూ ఉన్నాయి. ఒక పరిశీలకునికి ఆకర్షణీయంగా తోచే మొక్కగా రూపొందడానికి అవసరమైన ప్రాణం ఆ చిన్న బీజంలో ఎలా ఏర్పడుతున్నాయో అర్ధం కాక దీనిపైన  శాస్త్రవేత్తలు ఇంకా పరిశోధనలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఒక విత్తనం మొలకెత్తినపుడు దాని లో నిక్షిప్తమై ఉన్న నిర్దిష జీవసంబంధమైన విధానాలు నిల్వచేయబడిన నిద్రాణంగా ఉన్న శక్తిని, పోషకాలను ఒక ఆరోగ్యకరమైన శక్తివంతమైన మొక్కగా అభివృద్ధి చెందేందుకు వీలుగా పరిణామం చెందుతాయి. విత్తనంలో నిద్రాణంగా ఉన్న ఇట్టి జీవ శక్తే మానవులు ఆహారంగా తీసుకోవడానికి వీలుగా ఇంట్లోనే ఒక సరళమైన విధానము ద్వారా మార్పు చేయబడుతుంది.1,2  

2. మొలకలంటే ఏమిటి ?          

కొన్ని గంటలపాటు నీటిలో నానబెట్టి మొలకెత్తడానికి అనువైనపరిస్థితులు కల్పించినపుడు ఉద్భవించే చిన్న చిన్న రెమ్మల లాగా  సిద్దమైన పోషకాహారమే మొలకలు అని పిలవబడతాయి.2

3. ఏమేమి మొలకెత్తుతాయి ?

తృణ ధాన్యాలు, చిక్కుళ్ళు, బీన్సు, పప్పులు, కాయధాన్యాలు, బఠానీలు తో సహా అన్ని తినదగిన విత్తనాలన్నీ మొలకెత్తుతాయి. వివిధ దేశాలలో వాడుకలో ఉన్న కొన్ని ప్రసిద్ధమైన మొలకెత్తే విత్తనాలు పెసలు, చిక్కీసు, గోధుమలు, అల్ఫాల్ఫా, పొద్దుతిరుగుడు, ఫెనుగ్రీక్, వేరుశెనగ, ముల్లంగి మరియు బ్రోకలీ. ఐతే ఇవి సేంద్రియ సంబంధమై ఉండి ఆరోగ్యకరమైనవి గానూ, తాజాగా  రసాయనాలు కలపకుండా ఉండినవి అయ్యుండాలి. ఇంకా ఉడకబెట్టినవి, మాడినవి, విడిపోయినవి తీసుకోకూడదు.1,3,4

4.ఎలా మొలకెత్తించాలి ?     

ఇంట్లో మొలకలు తయారుచేసుకోవడం ఒక సరళమైన, వేగవంతమైన, ఖర్చులేని విధానము. ఐతే ప్రారంభంలో తక్కువమొత్తంతో మొదలుపెట్టాలి. ఆరోగ్యకరమైన పరిస్థితులలో మొలకలు పెరగాలి. 1,3,4

  • మొదట విత్తనాలను శుభ్రంగా కడిగి శుభ్రమైన పాత్రలో ఉంచాలి.
  • ఒక  భాగం విత్తనాలకి మూడుభాగాలు చొప్పున నీటిని కలిపి మూత పెట్టి ఉంచాలి.
  • గింజలు పూర్తిగా నానడానికి వీలుగా గది ఉష్ణోగ్రత వద్ద ఉంచాలి. ఐతే నానే సమయం విత్తనం బట్టి మారుతూ ఉంటుంది. కొన్ని రకాల విత్తనాలు నానడానికి 30 నిమిషాల సమయం పడితే మరికొన్నింటికి రాత్రంతా అనగా 6-8 గంటల సమయం పడుతుంది. ఈ నానబెట్టే విధానము సరిగా ఉంటేనే విత్తనాలలో జీవక్రియ ప్రారంభం కావడానికి సహాయపడుతుంది. మరీ ఎక్కువసేపు నానబెట్టడం వలన విత్తనాలు కుళ్ళిపోవడానికి, పులియబెట్టిన విధంగా మారిపోవడానికి ఆస్కారం ఉంది. ఎక్కువసేపు నానబెట్టవలసిన పరిస్థితిలో 6-8 గంటల తర్వాత నీటిని మార్చడం మంచిది.
  • తగినంత సమయం నానబెట్టిన తరువాత ఆ నీటిని తీసివెయ్యాలి ఎందుకంటే నీటిలో మొలకలు రావు. తీసివేసిన నీటిని పెరడులో ఉన్న మొక్కలకు ఉపయోగించవచ్చు. 
  • నానబెట్టిన విత్తనాలను శుభ్రంగా కడిగి పరిశుభ్రమైన పాత్రలో ఉంచాలి. ఐతే దానిపైన మూతను మాత్రం పూర్తిగా కప్పిఉంచరాదు. గాలి పోవడానికి వీలుగా ఉండాలి. ఏదయినా జాలీ వంటి మూతను వేయడం ఇంకా మంచిది.
  • నేరుగా వెలుతురు రాని ప్రదేశంలో గదిలో ఒక ప్రక్కగా వీటిని ఉంచండి. చీకటిగా లేదా వెలుతురు తక్కువగా ఉన్న ప్రదేశం  యోగ్యమైనది. మొలకెత్తిన తర్వాత ఈ మొలకలలో క్లోరోఫిల్ ఇంకా ఇతర ఉత్పత్తులు ఏర్పడడానికి వీలుగా కొంచం సేపు ఎండలో ఉంచవచ్చు.
  • రోజులో వీటిని రెండు మూడు సార్లు వీటిని శుభ్రంగా కడిగి తడిగా ఉండేటట్లు చూడండి.
  • మొలకలు సిద్ధంగా ఉన్నప్పుడు శుభ్రంగా కడిగి నీటిని పారబోయాలి.  
  • మొలకలు వెంటనే తినకపోతే వాటి పోషకాలు పోకుండా ఉండడానికి ఫ్రిజ్ లో ఉంచండి. ఫ్రిజ్ లో కొన్ని రోజుల వరకూ ఇవి తాజాగా ఉంటాయి.1,3,4

మొలకెత్తే సమయం విత్తనాలను బట్టీ, తరుచుగా కడిగే విధానము బట్టీ, కడగడానికి ఉపయోగించే నీటి ఉష్ణోగ్రత బట్టీ పరిసరాల ఉష్ణోగ్రత బట్టీ మారుతూ ఉంటుంది. చిన్నగా ఉండే విత్తనాలు (ఉదాహరణకు పెసలు) మొలకెత్తడానికి 10-12 గంటల సమయం పడుతుంది. పెద్దగా ఉండే విత్తనాలు మొలకెత్తడానికి 3 నుండి 4 రోజులు కూడా పట్టవచ్చు.1,3,4

5.మొలకెత్తించడం ఎందుకు

అన్ని రకాల ముడి విత్తనాలలోనూ అంతర్లీనంగా శరీరానికి అవసరమైన పోషక పదార్ధాలను  గ్రహించడానికి, శోశించుకోవడానికి ప్రతికూలంగా పనిచేసే యాన్టి న్యుట్రిన్ట్స్ లేదా ఎంజైమ్ ఇన్హిబిటర్స్ ఉంటాయి. పరిశోధనలు ద్వారా తెలిసిన అంశం ఏమిటంటే మొలకలుగా విత్తనాలను రూపొందించినపుడు ఈ అలెర్జెన్స్ ను తగ్గించడమే కాక ఇన్హబిటర్స్ యొక్క ప్రభావము తగ్గిస్తుందని సూచిస్తున్నాయి. ఇవి పోషక విలువలను ముఖ్యంగా ఖనిజ లవణాలు, విటమిన్ లు,అవసరమైన క్రొవ్వు పదార్ధాలు, పీచు పదార్ధాలూ, యాంటి ఆక్సిడెంట్లు, మరియు ఎంజైములు ముదలగు వాటిని పెంచుతాయి. అంతేకాకుండా కడుపులో వాయువు ఊత్పత్తికి కారణమయ్యే స్టార్చ్ ను కూడా తొలగిస్తాయి.3,4,6,9

ఒక అధ్యయనం 5  ప్రకారము మొలకలు కాల్షియం మరియు విటమిన్ సి లను కూడా గణనీయంగా పెంచుతాయని సూచిస్తున్నాయి. అలాగే యాంటి న్యుట్రింట్స్ స్థాయిని తగ్గించి  ప్రోటీన్లు త్వరగా జీర్ణం కావడాన్ని గణనీయంగా పెంచాయి. మరొక అధ్యయనం 7 ప్రకారము పరిమిత కాలము ధాన్యాలను మొలకెత్తించడం ద్వారా హైడ్రోలైటిక్ ఎంజైమ్ ల చర్యలను పెంచడమే కాక కొన్ని ప్రత్యేకమైన శరీరానికి అవసరమైన అమినో ఆమ్లాలను, చెక్కర పదార్ధలను, B- గ్రూపు విటమిన్ లను అందించడమే కాక పొడి పదార్ధాలను, పిండి పదార్ధాలను, యాంటి న్యుట్రిన్ట్ లను  తగ్గిస్తాయని తెలుపుతున్నాయి. మొలకెత్తించి నపుడు వాటి పాక్షిక జల విశ్లేషణ కారణంగా నిల్వ ఉండే ప్రోటీన్ లు మరియు స్టార్చ్ యొక్క జీర్ణశక్తి మెరుగుపడింది. ఐతే  పోషక విలువల పరిణామం తృణ ధాన్యాల రకాలు, నాణ్యత మరియు మొలకెత్తింప జేసే పరిస్తితుల పైన ఆధారపడి ఉంటాయి. పొడిగింజలలో అరుదుగా కనబడే విటమిన్లు 7 రోజులు వాటిని మొలకెత్తింప జేసిన తరువాత  అనూహ్య మైన స్థాయికి చేరుకున్నాయి.8

6. మొలకల వలన ప్రయోజనాలు  

మొలకలు మానవులకు లభించే అన్నికూరగాయల కన్నా తాజాగా మరిన్ని పోషక విలువలు కలిగిన పదార్ధాలుగా మొదటి ర్యాంక్ ను పొందడమే గాక మనకు ఉహించని విధంగా అనేక ప్రయోజనాలను అందిస్తున్నాయి 1,3,4,6,9-11. అవి ఏమిటంటే : 

  • తక్షణ శక్తిని అందించడం, జీవం ఉoడటo వల్ల త్వరగా జీర్ణం కావడం, శక్తి స్థాయిలను సమ స్థాయిలో ఉంచడం
  • వ్యర్ధాలను తొలగించి రక్తాన్ని దుష్ప్రభావిత మలినాల నుంచి దూరంగా ఉంచుతాయి.
  • రోగనిరోధక శక్తిని పెంచడానికి రాడికల్ మార్పుల వలన జీవకణాలు క్షయం కాకుండా ఉంచుతాయి. 
  • శరీరంలో యాసిడ్ ఆల్కలిన్ బ్యాలెన్స్ చేయడమే కాక జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తాయి.
  • స్థూలకాయం తగ్గించడం, కేలరీలు తక్కువ స్థాయిలో ఉంచడం, కండరాలనూ, కణజాలాన్నిబలోపేతం చేయడం.
  • రక్తపోటును నియంత్రించి హృదయ సంబంధ సమస్యలను పెరగకుండా చూస్తాయి.
  • రక్తంలో చెక్కర స్థాయిని బ్యాలెన్సు చేస్తూ కీళ్ళ వాతవ నొప్పులనుండి ఉపశమనం కలిగిస్తాయి.
  • అనేక దీర్ఘకాలిక వయో సంబంధ మైన వ్యాధులకు వ్యతిరేకంగా రక్షణ ఇస్తాయి.
  • ఋతుస్రావ సమస్యలు, ఋతు విరతి లక్షణాల నుండి ఉపశమనం ఇస్తాయి.
  • చర్మ సంరక్షణకు, కాలేయము వంటి ప్రధాన అవయవాల పనితీరు మెరుగుకు ఉపకరిస్తాయి.
  • వీటిలో ఉన్న అనామ్ల జనకాల కారణంగా క్యాన్సర్ వంటి వ్యాధులకు ఔషధంగా పనిచేస్తాయి.

మొత్తం మీద వండని మొలకలు అత్యుత్తమ నాణ్యమైన పోషకాలను అందిస్తాయి కనుక మన ఆహారంలో వీటిని భాగం చేయడం చాలా ప్రధానం. వీటిని రుచికరంగా చేయడానికి కొంత నిమ్మరసాన్ని కూడా కలపవచ్చు. సలాడ్ లతో కలిపి కూడా సేవించవచ్చు. వీటిని భోజనంతో పాటు గానీ దానికన్నా ముందు గానీ లేదా మధ్యలో ఆరోగ్యకరమైన స్నాక్స్ వలే కూడా సేవించవచ్చు.

వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులు, ఎంపికలు, సౌకర్యాలు, విత్తనాలు మొలకెత్తించడానికి అనుకూలంగా లేకపోతే కనీసం నానబెట్టిన గింజలు తిన్నా ఎంతో ప్రయోజన కారిగా ఉంటాయి. తృణ ధాన్యాలు, బీన్సు, పప్పుధాన్యాలు, రాత్రిపూట నానబెట్టిన తరువాత వండుకొని తింటే ఎంతో ప్రయోజనకారి గా ఉంటాయి. గింజలను నానబెట్టాలి తప్ప మొలకెత్తించ కూడదు.4 రాత్రిళ్ళు బాదంగింజలు నానబెట్టి ఉదయం కడిగి పొట్టు తీసి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. 12

7. జాగ్రత్తలు  

  • బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ గలవారు, పిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు పచ్చి మొలకలు తినకుండా ఉంటేనే మంచిది. కొంచం సేపు ఉడికించిన వాటిని తినడం శ్రేయస్కరం.13-14
  • కిడ్నీ బీన్ వంటి కొన్ని మొలకలు విషపూరితం కనుక వాటిని ఉడికించినవే తినాలి.13
  • విత్తనాలు మొలకెత్తేటందుకు ఉండే వెచ్చని తేమ గలిగిన ప్రదేశాలు బ్యాక్టీరియా పెరుగుదలకు కూడా అనువుగా ఉంటాయి.  న్యూట్రిషనిస్టుల 6 ప్రకారం సాల్మొనెల్లా, మరియు ఈ కోలి వంటి ప్రమాదకర బ్యాక్టీరియా అభివృద్ధికి ఈ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి కనుక ఆరోగ్య సూత్రాలు పాటిస్తూనే ఈ మొలకలను ఫ్రిజ్లో ఉంచి 3 లేదా 4 రోజుల తరువాత తినడం మంచిది.13-14

సూచనలు మరియు వెబ్సైటు లింకులు :

  1. https://www.slideshare.net/jannap/teachings-ofsathyasaibaba The teachings of Sathya Sai Baba on health by Srikanth Sola MD page 10. Also Appendix B.
  2. https://wonderpolis.org/wonder/how-do-seeds-sprout
  3. https://articles.mercola.com/sites/articles/archive/2015/02/09/sprouts-nutrition.aspx
  4. https://draxe.com/sprout
  5. https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC4573095
  6. https://food.ndtv.com/food-drinks/6-benefits-of-sprouting-and-the-right-way-to-do-it-1691887
  7. https://www.ncbi.nlm.nih.gov/pubmed/2692609
  8. https://www.ncbi.nlm.nih.gov/pubmed/23088738
  9. https://foodfacts.mercola.com/sprouts.html
  10. www.thefitindian.com/benefits-of-eating-sprouts-in-our-daily-diet
  11. http://www.sproutnet.com/Resources-Research-on-the-Role-of-Sprouts-in-Wellness-and-Disease-Prevention
  12. http://www.saibaba.ws/articles/medicaladvices.htm
  13. https://www.precisionnutrition.com/all-about-sprouting Caution
  14. http://www.foodsafety.gov/keep/types/fruits/sprouts.html Caution

 

2. 108CC పుస్తకంలో సూచిక కు అనుబంధము

2011 లో విడుదల చేసిన 108CC పుస్తకం లో గత 7 సంవత్సరాలుగా అనేక మార్పులు అదనంగా కొన్ని చేర్పులు చోటుచేసుకొన్న నేపథ్యంలో  అందరి సౌలభ్యం కోసం ఇక్కడ ఇవ్వబడ్డాయి. గత సంచికలో ఈ పట్టిక తొలగించినందుకు చింతిస్తున్నాము.

Addison's disease                                     6.1          Adhesions                                             21.1

Adrenal Gland Deficiency                         6.1          Alopecia                                       11.2+12.4

ASD                                        3.6+15.5+18.1          Asperger’s                                             15.5

Autism spectrum disorder       3.6+15.5+18.1          Baldness                                      11.2+12.4

Blepharitis                                                 7.3          Cholera                                   4.6+4.10+9.3

Concentration weak                       17.3+18.1          Condyloma                             8.5/14.2+21.1

Death approaching                                 15.1          Dengue                                            9.3+3.1

Down’s syndrome                            3.6+18.2          Epithelioma                             2.1+2.3+21.1

Extremities painful, circulation                  3.7          Eye lashes in-turning                              7.1

Eye stye                                                    7.3          Genital cyst/wart, female               8.5+21.1

Genital cyst/wart, male                  14.2+21.1          Genital herpes female                    8.5+21.8

Genital herpes male                      14.2+21.8          Head Injury                          10.1+18.1+20.7

Hysteria                                                   15.1          Involuntary semen                                14.3

Irritable bladder                                       13.3          Leucoderma                       21.2+21.3+12.4

Lung cancer                    2.1+2.3+19.3+19.6          Mycoplasma pneumonia              19.6+19.7

Multiple sclerosis (MS)                18.4 + 12.4          Nose bleed                                            10.1

Oral Candida                                           11.5          Plantar fasciitis                            20.1+20.4

Polymyalgia Rheum.(PMR)  20.2+20.4+20.5          Prog. Syst. Sclerosis 12.4+15.1+21.2+21.3

Prostate – enlarged                       13.1+14.2          Prostatitis                                     14.2+13.1

PSP Syndrome              7.1+15.1+18.4+18.6          Pulmonary hypertension         3.1+3.6+19.3

Retinitis pigmentosa                          7.1+7.2          Salmonella                                       4.6+4.8

Scars internal                                          21.1          Sinusitis due to allergy                 19.2+4.10

Skin dry                                                   21.1          Spinal Injury                                 10.1+20.5

Spine – degeneration                              20.5          Teething                                                11.5

Typhoid-recovery stage                   9.1+4.11          Vitiligo                                  12.4+21.2+21.3

Walking pneumonia                       19.6+19.7          Zika virus                                          3.1+9.3

 

3. AVP వర్క్ షాప్ పుట్టపర్తి ఇండియా 22-26 జూలై 2018

9 మంది అభ్యర్ధులు (పుట్టపర్తి కి చెందిన ఇద్దరితో సహా భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఏడుగురు థాయిలాండ్ నుండి ఒకరు, గాబన్ నుండి ఒకరు) ఈ 5 రోజుల శిక్షణా శిబిరంలో  AVP లుగా అర్హత పొందారు. మరో ఇద్దరు పూర్వ అభ్యాసకులు కూడా తమ జ్ఞానాన్ని పునర్బలనం చేసుకొనడానికి ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు. సుశిక్షితులైన ఇద్దరు టీచర్లు  10375 & 11422,   ఇంగ్లాండ్ నుండి అగ్గర్వాల్ గారి స్కైప్ కాల్ ఆధ్వర్యంలో శిక్షణ ప్రోత్సాహకరంగా పరస్పర భావ వ్యక్తీకరణకు అనువుగా ఉన్నది. మరొక విశేషం ఏమిటంటే పవిత్ర గురుపూర్ణిమ నాడు హేమ మేడం వీరందరి చేత స్వామి వారి పటం ముందు ప్రతిజ్ఞ చేయించారు. శిక్షణ లో పాల్గొన్న వారిలో ఒకరు ప్రస్తుతం ప్రాక్టిస్ చేస్తున్న అలోపతి డాక్టర్ కాగా మరొకరు ఎన్నో ఏళ్లుగా అలోపతి డాక్టర్ గానూ వైబ్రో ప్రాక్టీషనర్ గానూ ఉన్న ఒక అభ్యాసకుని కుమార్తె కూడా ఈ శిక్షణలో పాల్గొన్నారు. శిక్షణ పూర్తిచేసుకున్న వీరంతా సేవాదళ్ భవనంలో తమ సేవను ప్రారంభించారు.

 

4.  8-10 సెప్టెంబర్ 2018 తేదిలలో ఫ్రాన్సులో AVP వర్క్ షాప్ మరియు రిఫ్రెషర్ శిబిరము. 

ఫ్రెంచ్ కోఆర్డినేటర్ మరియు శిక్షకురాలు  01620 ఆధ్వర్యంలో 3 రోజుల శిక్షణా శిబిరము వారి యొక్క కాబోయే అభ్యాసకుని ఇంట్లో నిర్వహింప బడింది. వెస్ట్ ఆఫ్రికా లోని గబాన్ నుండి స్కైప్ లో పాల్గొన్న కొత్త ప్రాక్టీషనర్  03572 తో సహా ఇద్దరు కొత్తవారు మరియు ఐదుగురు పాతవారు మొత్తం ఎనిమిదిమంది ఈ శిబిరంలో పాల్గొన్నారు. పనివత్తిడి అధికంగా ఉన్నా అదే సమయంలో వాతావరణం వెచ్చగా స్నేహపూర్వకముగా ఉంది. కొత్త వారు ఇరువురూ కూడా శ్రద్ధగా పాల్గొంటూ వెంటనే ప్రతిస్పందించే స్వభావము కలవారు. వర్క్ షాప్ చివరి రోజు తమ 108CC బాక్సులు అందుకుంటూ ఇరువురూ ఎంతో భావోద్వేగానికి  గురి అయ్యారు. వీరి అభినివేశము ఎంత గొప్పదంటే డాక్టర్ అగ్గర్వాల్ స్కైప్ కాల్ చేస్తున్న సమయంలోనే పక్క ఇళ్ళలో ఉన్న ఇద్దరు పేషంట్లు తలపు తట్టడం వారికి  ఆనందంగా మందులు ఇచ్చి పంపడం కూడా జరిగింది. శిబిరంలో పాల్గొన్న ప్రస్తుత అభ్యాసకులకు ఈ శిక్షణ ఆలోచనలు పంచుకునేదిగాను, అనుభవాన్ని అందించేదిగాను ఎంతో స్పూర్తిదాయకముగా కూడా ఉందని తెలిపారు.


5. తెలంగాణా రాష్ట్రంలో సాయి వైబ్రియోనిక్స్9 సెప్టెంబర్ 2018

తెలంగాణా రాష్ట్రంలోని రెండు జిల్లాల సంయుక్త సమావేశములో సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షులు మరియు దాదాపు ముఖ్య పదాదికారులు, రెండు జిల్లాల అధ్యక్షులు, సమితి కన్వీనర్లు, సమితి పదాదికారులంతా పాల్గొన్న ఈ సమావేశంలోచికిత్సానిపుణుడు 11585 కు 25 నిముషాలు సాయివైబ్రియోనిక్స్ గురించి ప్రసంగించే అవకాశం లభించింది. ఈ చికిత్సా విధానము భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక స్థాయిల్లో పనిచేసే విధానము, ఏమాత్రం ప్రతికూల ప్రభావాలు లేకపోవడం గురించి, వివరిస్తూ దీనియొక్క యొక్క అద్భుత ఫలితాలను సభికులకు వివరించారు. జిల్లాలో క్రమంతప్పకుండా జరుగుతున్న వైబ్రో వైద్య శిబిరాల గురించి చెబుతూ ఈ చికిత్స విధానము ద్వారా కోరుకున్న చోట అత్యంత సులభంగా వైద్యశిబిరము నిర్వహించవచ్చని తెలిపారు. అంతేకాకుండా చికిత్సానిపుణుడు11592తో కలసి పాల్వంచ సత్యసాయి మందిరంలో ప్రతీ గురువారము వీరు నిర్వహిస్తున్న వైద్య శిబిరము పేషంట్లకు రోగనివారణ విషయంలో అద్భుత విజయాలను అందిస్తోందని తెలిపారు. ఈ ఉపన్యాసము ఉన్నతాధికారులలో ఎంతో ఆసక్తిని రేకెత్తించింది. సమావేశము అనంతరం ప్రాక్టీషనర్లు ఇద్దరూ 27 మంది పేషంట్లకు కొందరు ఉన్నత శ్రేణి పదాధికారులకు వైద్యసేవలు అందించారు. రాష్ట్రంలో వైబ్రియోనిక్స్ వ్యాప్తికి ఇటువంటి సమావేశాలు ఎంతో దోహదపడతాయి.

 

ఓం శ్రీసాయిరామ్