Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

Vol 9 సంచిక 4
July/August 2018
ముద్రింప తగిన వార్తాలేఖ


పూర్తి వార్తాలేఖ యొక్క కాగితం ప్రతి కావలెనన్నఈ పుటను ముద్రించండి

డా.జిత్ కే అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి

ప్రియమైన చికిత్సా నిపుణులకు,

పరమ పావనమైన గురుపూర్ణిమ సమీపించబోతోంది. ఈ పవిత్ర పర్వదినము గురించి స్వామి ఏమన్నారో ఒకసారి మననం చేసుకుందాము. ‘‘ఈ గురుపూర్ణిమ నుండి మీరు సేవకు అంకితం కావాలి. సేవ ద్వారా ప్రజలకు అందించవలసింది ఎంతో ఉంది. సేవ ద్వారానే జీవితానికి అర్ధం, పరమార్ధం చేకూరుతుంది. ఈనాడు దేశం ఒక నిరాశావహమైన పరిస్థితిలో ఉంది. ఎందుకంటే సేవ అంటే అర్ధం కూడా తెలియనివారు పరిపాలకులుగా ఉన్నారు. సేవ ద్వారానే నాయకత్వం వహించే అర్హత వస్తుంది.”- శ్రీ సత్యసాయిబాబా గురుపూర్ణిమ సందేశం 18 జూలై, 1989

కనుక ఈ రోజు నుండి మనం, మన ప్రభువు ఆజ్ఞను హృదయ పూర్వకంగా అనుసరిద్దాము. మన మాటలద్వారా చేతల ద్వారా ఆలోచనల ద్వారా బేదరహితమైన ప్రేమ వాహినిని ప్రసరింప జేద్దాం. ఈ దిశలో వైబ్రియోనిక్స్ ఒక సమగ్రమైన వైద్యవిధానముగా విశ్వవ్యాప్తమవుతూ ప్రాక్టీషనర్ లకు ఒక వరంగా రూపుదాల్చింది.  

108 మిశ్రమాల యొక్క  పనితీరు గురించి  చికిత్సా నిపుణుల నుండి మాకు  అందుతున్న స్పందన మాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. గత 7 సంవత్సరాలుగా 108CC పుస్తకానికి అనేక అనుబంధాలను చేరుస్తూ రావడం జరిగింది. ముఖ్యంగా గ్లాసరీ (పదకోశము) మరియు ఇండెక్స్( విషయ సూచిక) లను తగువిధంగా మార్పుచేయడం జరిగింది. ఇవి సులువుగా తెలుసుకోవడానికి  వీలుగా ‘’అదనంగా (ఇన్ ఎడిషన్)” అనే విభాగంలో  పుస్తకంలో మార్పులు చేర్పుల గురించి వివరణ ఇవ్వబడింది. మీ అందరికీ నా విన్నపం ఏమిటంటే మీ 108CC బాక్సు ను సాధ్యమైనంత త్వరగా రీచార్జి చేసుకోండి. ఇందుకోసం మీరు పుట్టపర్తి లోని మాస్టర్ బాక్సు నుండి కానీ లేదా మీ కోఆర్డినేటర్ ఏర్పాటు చేసిన విధానము ద్వారా కానీ రీచార్జి చేసుకోవచ్చు. ఈ రెండు సాధ్యం కానీ పక్షంలో [email protected] కు ఈమెయిల్ పంపితే మేము తగిన ఏర్పాటు చేస్తాము. సాధారణంగా కొంబో బాక్సు ను ప్రతీ రెండు సంవత్సరాలకు ఒకసారి రీఛార్జ్ చెయ్యాలి. ఇది కుదరని పక్షంలో తాత్కాలిక ఏర్పాటు కోసం కొంబో బాక్సు లోని ప్రతీ బాటిల్ ను పైకి తీసి ఒక చేతితో బాటిల్ ను పట్టుకొని బాటిల్ క్రింది భాగాన్ని రెండవ చేయి అరచేతిలో ఉంచి 9 సార్లు తట్టడం ద్వారా సీసాలో నిద్రాణముగా ఉన్న శక్తి తిరిగి పుంజు కుంటుంది.

విదేశీ యానము కోసమో మరి ఏదైనా ఇతర కారణాల నిమిత్తమో తాము ఉంటున్న స్థానం నుండి దూరం వెళ్ళే ప్రాక్టీషనర్ లకు మేము చేయబోయే విజ్ఞప్తి ఏమిటంటే వారు తమ ప్రయాణానికి రెండు వారాల ముందు నుంచే పేషంట్ల కు తమ వద్దకు వచ్చి రెమిడి లను రీఫిల్ చేసుకోవలసిందిగా సూచించాలి. అలాగే తమకు దగ్గరలో ఉన్న మరొక ప్రాక్టీషనర్ కు ఈ విషయం తెలుపుతూ పేషంట్లకు కూడా ఆ  ప్రాక్టీషనర్ యొక్క సమాచారాన్ని అందించాలి. దీనివలన ఆటంకం లేకుండా రోగులు తమ చికిత్సని ఆ ప్రాక్టీషనర్ ను సంప్రదించడం ద్వారా కొనసాగించగలుగుతారు. ఇది కూడా కష్టం అనుకొంటే అత్యవసర పరిస్థితిలో పోస్టు ద్వారా రెమిడిలను పంపించే ( భారత దేశములో మాత్రమే) పద్దతి, అలాగే దూరంగా ఉన్నవారికి బ్రాడ్కాస్టింగ్ విధానము ద్వారా చికిత్స చేసే విధానము కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. ఈ సేవల వివరాల కోసం గానీ ఇతర చికిత్సా నిపుణుల వివరాల కోసం గానీ మీ కోఆర్డినేటర్ ను సంప్రదించండి.

మీరు భగవంతుడికి ఇచ్చిన వాగ్దానము మేరకు మీ నిత్య సేవకు అంతరాయం కలగకుండా  ఉండడానికి వీలుగా 9 రెమిడిలు ఉండే వెల్నెస్ కిట్ ను ఎప్పుడూ మీ వెంట ఉంచుకోండి (  2 of 108 CC -2011 పుస్తకంలో 2 వ పేజీ చూడండి). అలాగే రెండు వారాలకు దాటి మీరు ఏదైనా ఊరు వెళుతున్నప్పుడు మీ సేవకు ఆటంకం కలగకుండా ఉండడానికి మీ 108CC బాక్సు ను కూడా వెంట తీసుకొని వెళ్ళండి.

మీ అందరికీ తెలుసు ఆరోగ్యకరమైన జీవనవిధానము పేషంట్లకు చికిత్స నందించే విషయంలో ప్రధానమైన పాత్రను పోషిస్తుంది. కనుక జీవన శైలికి ఆలోచనా విధానానికి అనుగుణంగా తగిన విధంగా సర్దుబాటు చేసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ప్రాక్టీషనర్లు రోగులకు చికిత్స చేసేటప్పుడు వారు తమ జీవనవిధానము మార్చుకునేందుకు తమ ఆరోగ్యం తమ చేతుల్లోనే ఉంది అని తెలుసుకునేందుకు ప్రేమతోను ప్రభావవంతంగాను బోధించవలసి ఉంటుంది.

ప్రస్తుతం మనం అప్రతిహతంగా మార్పులకు గురి అవుతున్న యుగంలో జీవిస్తున్నాము. దురదృష్టవశాత్తూ ప్రపంచ వ్యాప్తంగా నిరంకుశ మరియు అత్యాశతో కూడిన రాజకీయ నాయకుల అరాచకము కారణంగా ప్రతికూల పరిస్థితులు ఏర్పడి ఉన్నాయి. వీటి పర్యవసానాల కారణంగా అందరూ మానసిక అనారోగ్యకర స్థితిలోనో, హిస్టీరియా లోనో లేదా విపరీతమైన భయంలోనో కాలం వెళ్లబుచ్చుతున్న పరిస్థితి నెలకొంది. కనుక ఇట్టి ప్రతికూల పరిస్థితులలో జీవిస్తున్న బాధితులకు సేవ చేయడానికి మనకు అపూర్వమైన అవకాశం లభించింది. వైబ్రియోనిక్స్ ద్వారా అందే దివ్యత్వం తో కూడిన వైబ్రేషన్స్ ఇట్టి బాధితుల జీవితాల్లో మహత్తరమైన మార్పు తేగలదని నా ప్రగాఢ విశ్వాసము. ఈ గురుపూర్ణిమ పర్వదిన సందర్భంగా మన గురువు, దైవమైన భగవాన్ బాబా తమ అనంత ప్రేమానురాగాలను మనపై ప్రసరింప జేస్తూ అంతర్గత శక్తిని, సేవచేసే నిబద్దతను అందిచాలని, ఈ గురుపూర్ణిమ ఆధ్యాత్మికానుభూతిని, ఆనంద దీప్తిలను అందించాలని ఆశిస్తూ...  

ప్రేమతో సాయిసేవలో

జిత్ కె.అగ్గర్వాల్

దీర్ఘకాలిక సైనుసైటిస్ వ్యాధి 11590...India

45 సంవత్సరాల వ్యక్తి  ఒక సంవత్సరం నుండి సైనుసైటిస్ వ్యాధితో బాధపడుతూ ఉన్నారు.  వీరికి పదేపదే ముక్కు కారుతూ ఉండడం, వారము రోజులు వదలకుండా దుర్వాసనతో కూడిన ద్రవం కారడం, ఇలా ప్రతీనెలా  పునరావృతమవుతూ ఉండేది, ముఖ్యంగా శీతాకాలంలో ఇది మరీ ఎక్కువగా ఉండేది. గత సంవత్సరం 8 సార్లు ఈ విధంగా ఇబ్బంది పడ్డారు. వీరికి  మరొక సమస్య కూడా ఉంది. వాతావరణం చల్లగా ఉన్నా, శీతల పానీయములు వంటివి త్రాగినా సైనస్ తలపోటు భరించలేని విధంగా వస్తూ ఉంటుంది. వీరు అలోపతి మందులు ఎప్పుడూ వాడలేదు కానీ హొమియోపతీ మందులు రెండునెలలు వాడడంతో 20 శాతం మెరుగుదల కనిపించింది. ఐతే వీరు దానిని ఎక్కువ ఖరీదు దృష్ట్యా కొనసాగించలేక పోయారు. దీని బదులుగా వీరు వైబ్రో రెమిడిలు తీసుకో దలచి 27నవంబర్ 2017 తేదీన వైబ్రో ప్రాక్టీషనర్ ను సంప్రదించగా వీరికి క్రింది రెమిడి ఇవ్వడం జరిగింది:

CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC19.2 Respiratory allergies + CC19.5 Sinusitis…TDS

పేషంటుకు చల్లని పదార్ధాలు, శీతల పానీయములు, ఐస్క్రీం వంటి వాటికి దూరంగా ఉండమని సలహా ఇవ్వబడింది. నెల రోజుల తరువాత పేషంటుకు తలపోటు, ముక్కు కారడం  విషయంలో 50% ఉపశమనం కలుగగా ముక్కునుండి వచ్చే దుర్వాసనతో కూడిన ద్రవం కారడం 100% తగ్గిపోయింది. జనవరి 2018, నాటికి వ్యాధి లక్షణాలన్నింటి నుండి 100% ఉపశమనం కలిగింది.  నిజం చెప్పాలంటే అదే నెలలో పేషంటు 3°C, ఉష్ణోగ్రత ఉండే ఒక కొండ ప్రాంతానికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చినా ఇతనికి  సైనస్  వంటి సమస్య లేమి లేకుండా సౌకర్యవంతంగా ఉంది.  ఫిబ్రవరి 2018, నాటికి ఇతనికి ఒక్కసారి మాత్రమే ముక్కుకారడం, తలపోటు సమస్య ఏర్పడ్డాయి, అవికూడా రెండు రోజులు ఉండి తగ్గిపోయాయి. ఐతే రానున్న శీతాకాలంలో రిస్కు లేకుండా ఉండడానికి రెమిడి ని  TDS గా కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం జూన్ 2018 వరకూ ఈ నాలుగు నెలలలో ఈ సమస్య పునరావృతం కాకుండా పేషంటు ఆనందంగా ఉన్నారు.

క్రుంగుబాటు (డిప్రెషన్) 11590...India

22  సంవత్సరముల ఒక విద్యార్ధి తన యొక్క ప్రేమను ఇతని క్లాస్మేట్ గా ఉన్న ఒక అమ్మాయి తిరస్కరించడం తో ఆ బాధ తట్టుకోలేక  ఆత్మనూన్యతకు గురి అయ్యాడు. అల్పాహారం మానివేయడం, భోజనం మానేయడం తో పాటు తరగతులకు కూడా వెళ్ళకుండా ఎక్కువ సమయం లైబ్రరీలోనే గడపసాగాడు. గత మూడు సంవత్సరాలుగా ఇతని కోపం బాగా పెరిగిపోయి ఒకసారి కాలేజిలో టెక్నికల్ విభాగములోని ఒక ఉద్యోగిని కొట్టడం కూడా జరిగింది. ఇతనికి నిద్రకూడా సరిగా పట్టడం లేదు. రోజురోజుకు ఇతనిలో డిప్రెషన్ పెరిగిపోయి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా వస్తున్నాయి. ఈ యువకుడు యాన్టి డిప్రెషన్ మందులు తీసుకున్నా అవి ఏమాత్రం ఫలితం ఇవ్వలేదు. ఇటువంటి పరిస్థితిలో ఇతడికి 17 జనవరి 2018న ప్రాక్టీషనర్ క్రింది రెమిడి ఇచ్చారు:
#1. CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.2 Psychiatric disorders + SM1 Removal of entities + SM2 Divine protection + SM5 Love & Peace alignment…TDS
#2. CC15.6 Sleep disorders…OD
 నిద్రించే సమయంలో

ఈ రెమిడి తీసుకున్న తరువాత పేషంటు రెండవ రోజు నుండే చక్కగా నిద్రపోవడం ప్రారంభించారు.  #1 రెమిడి వేసుకున్న రెండు రోజుల తర్వాత పేషంటుకు కాళ్ళు చేతుల మీద దద్దుర్లు వచ్చాయి. ఇవి భరించలేనంతగా ఉండడంతో డోసేజ్ ODకి తగ్గించబడింది. మరుసటి మూడు రోజులలో దద్దుర్లు తగ్గిపోవడంతో క్రమంగా డోసేజ్ ని వారానికల్లా తిరిగి TDS కి పెంచడం తో  పేషంటుకు సౌకర్యవంతంగా ఉంది.

పేషంటు తనకు తానే యాంటి డిప్రెషన్ మందులు క్రమంగా తగ్గించుకుంటూ 28 ఫిబ్రవరి 2018, నాటికి పూర్తిగా మానివేసాడు. ఇతనికి ఇప్పుడు నిద్ర బాగా పట్టడంతో పాటు తన ప్రవర్తనలో ఎంతో మార్పుకూడా వచ్చినట్లు మునపటి మాదిరిగా కోపం రావడంలేదని అర్ధమయ్యింది. ఇతడి టీచర్లు కూడా తనలో వచ్చిన మార్పుకు సంతోషించి తనని ప్రోత్సహించసాగారు. ఆహారం కూడా క్రమం తప్పకుండా తీసుకోవడంతో శక్తి పుంజుకోవడం జరిగింది. ఈ విధమైన మార్పుతో ఇతని ఆత్మవిశ్వాసం రెట్టింపై  క్యాంపస్ సెలెక్షన్ ద్వారా ఉద్యోగం కూడా సంపాదించుకొన్నాడు.  

ఈ విధంగా డోసేజ్  #1…ని TDS గా 4 నెలలు తీసుకున్న తరువాత  21 మే 2018, నుండి  డోసేజ్ ని  BDకి  తగ్గించి  ప్రస్తుతం అనగా జూన్ 2018 నాటికి ఇదే కొనసాగిస్తున్నారు. పేషంటు పూర్తిగా కోలుకున్నప్పటికీ  #2…OD గా కొనసాగిస్తూనే ఉన్నారు ఎందుకంటే దీనివలన ఇతనికి ప్రశాంతముగా నిద్ర పడుతోందట.

సంపాదకుని వ్యాఖ్య;   108CC బాక్సు  ఉపయోగిస్తున్నట్లయితే : #1. గా  CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC15.2 Psychiatric disordersఇస్తే మంచి ఫలితం ఉంటుంది.

రోగనిరోధకశక్తి తక్కువగా ఉండడం 11590...India

3-సంవత్సరాల బాలునికి  పునరావృతమవుతున్న శ్వాసకొస ఇన్ఫెషన్ తో పాటు ముక్కు కారుతున్న సమస్య ఏర్పడింది. దీనితో పాటు కఫం తో కూడిన దగ్గు, గొంతు నొప్పి గత రెండు సంవత్సరాలుగా బాధిస్తున్నాయి. ఈ లక్షణాలు ఇంచుమించు ప్రతీ నెలలో సంభవిస్తూ ఒకవారం పాటు కొనసాగుతాయి. ఈ విధంగా సంవత్సరానికి 8/9 సార్లు కలుగుతూ ఉంటుంది. ఈ బాలునికి ఆస్తమా లేదు కానీ డస్ట్ ఎలెర్జీ ఉంది. ఈ బాబుకు జ్వరం అధికంగా ఉన్నప్పుడు మాత్రమే డాక్టరు యాంటి బయాటిక్స్ సూచిస్తారు. ఒకసారి బాబుకు బ్రాంఖో న్యుమోనియా  రావడంతో హాస్పిటల్లో ఎడ్మిట్ చేసి ఐ.వి. యాంటి బయాటిక్స్ ఇవ్వడం జరిగింది. ఆ సమయంలో  పదే పదే యాంటి బయాటిక్స్ ఇవ్వడం కారణంగా బాబుకు రోగనిరోధకశక్తి లోపించిందని వైద్యులు చెప్పారు.

28 నవంబర్  2017 తేదీన బాబును ప్రాక్టీషనర్ వద్దకు తీసుకురాగా క్రింది రెమిడీ ని వారు సూచించారు:
CC12.2 Child tonic + CC19.2 Respiratory allergies…TDS

నెల తర్వాత  బాబు తల్లి తన బిడ్డకు 50%, ఉపశమనం కలిగిందని జ్వరం కూడా తక్కువ స్థాయిలో (<100F) ఒక్కసారి మాత్రమే  వచ్చిందని ఆ విధంగా 4 రోజులు ఉందని తెలిపారు. మరో రెండు నెలల తర్వాత ఫిబ్రవరి  2018లో బాబుకు జ్వరం వచ్చి మూడు రోజులు ఉంది. బాబుకు యాంటి బయాటిక్స్ గానీ మరే ఇతర అలోపతిక్ మందులు వేయవలసిన అవసరం రాలేదు. 3 ఏప్రిల్ 2018 తేదీన డోసేజ్, OD కి తగ్గించబడింది. ఏప్రిల్ చివరన బాబు వాటర్ స్పోర్ట్స్ లో పాల్గొన్నందుకు కేవలం తుమ్ములు తప్ప ఏ సమస్యా రాలేదు.  జూన్ 2018, నాటికి  బాబుకు మెయింటనెన్స్ డోసేజ్ OD కొనసాగుతూనే ఉంది. బాబుకు ఏ సమస్యా పునరావృతం కాలేదు. ఈ విధంగా బాబుకు పూర్తిగా తగ్గిపోయినందుకు తల్లి తమ ఆనందాన్ని వ్యక్తం చేసారు.

 

తలనొప్పి, ప్రవర్తనా సమస్యలు 11271...India

2016, జూన్ 4 వ తేదీన  దీర్ఘకాలంగా తలనొప్పితో బాధ పడుతున్న 11 సంవత్సరాల అమ్మాయిని ఆమె తల్లి ప్రాక్టీషనర్ వద్దకు తీసుకోని వచ్చారు. గత  3 సంవత్సరాలుగా ఈ పాపకు  వారానికి రెండు సార్లు  తలనొప్పిరావడం వచ్చినప్పుడల్లా కనీసం  2-3 గంటలు ఉండడం జరుగుతోంది. పాపకు మూడవ సంవత్సరంలో మెదడులో కణితి ఉండడంతో దానిని శస్త్రచికిత్స తో తొలగించారు. దాని నిమిత్తం పాప ఇప్పటికీ అలోపతి మందులు వాడుతూ ఉన్నది. పాపకు 8 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆమె థైరాయిడ్ గ్రంధి తొలగించబడింది. ఇది పాపలో కొన్ని ప్రతికూలమైన ఫలితాలు కలిగించి అప్పటినుండి చికాకు పడడం, తరుచుగా కోపం తెచ్చుకోవడం, గడి బిగించుకొని గదిలో ఒక్కతే ఉండడం, ఒంటరిగా కూర్చోవడం, ఎవరితో కలవకపోవడం ఇటువంటి వన్నీ చేస్తోంది.  

పేషంటు తలపోటు మరియు ప్రవర్తనా సమస్యలకు కేవలం వైబ్రో రెమిడిల పైనే ఆధార పడ్డారు. ఈమెకు క్రిది రెమిడి ఇవ్వబడింది:
#1. CC11.3 Headaches + CC15.2 Psychiatric disorders…6TD 4 వారాల వరకూ అనంతరం QDS 

పేషంటు మెదడులో కణితి నిమిత్తము అలోపతి మందులు వాడుతున్నప్పటికీ ప్రాక్టీషనర్ క్రింది రెమిడి ఇచ్చారు:
#2. CC2.3 Tumours & Growths + CC18.1 Brain disabilities…TDS

రెమిడి వాడిన నాలుగు వారాలకు తలపోటు విషయంలో ఎంతో ఉపశమనం కలిగింది. 20 ఆగస్టు 2016న గడచిన 7 వారాలలో ఒక్కసారి కూడా తలపోటు రాలేదని  పేషంటు చెప్పారు. కానీ  భావోద్వేగాల విషయంలో 20% మాత్రమే ఉపశమనం కలిగిందని ఐతే  22 అక్టోబర్ 2016 నాటికి 80% ఉపశమనం కలిగిందని తెలిపారు. ప్రస్తుతం తన అమ్మాయి మానసిక స్థితి చాల వరకూ మెరుగ్గా ఉందని మునుపటి వలె ఒంటరిగా కూర్చోవడం లేదని పేషంటు తల్లి తెలిపారు. అనంతరం పాపకు ఋతుక్రమం సరిగా లేదని పాప చదువు మీద శ్రద్ధ పెట్టడం లేదని వాళ్ళ టీచర్ ఫిర్యాదు చేసిన మీదట ప్రాక్టీషనర్ పాపకు క్రింది రెమిడి కూడా కలిపి ఇవ్వడం జరిగింది :
#3. CC8.1 Female tonic + #1…TDS
#4. CC17.3 Brain & memory tonic + #2…TDS 

24 డిసెంబర్ 2016న పాపకు ప్రస్తుతం ఋతుక్రమం సక్రమంగా వస్తోందని గత రెండు నెలలుగా పాప మానసికంగా ప్రశాంతంగానే ఉండగలుగుతోందని చెప్పారు. అలాగే వాళ్ళ టీచర్ కూడా పాప ప్రవర్తన విషయంలోనూ, చదువు విషయంలోనూ ఎంతో మార్పు కలిగినందుకు సంతృప్తి వ్యక్తంచేశారు. 2018, ఏప్రిల్ నెలలో ప్రాక్టీషనర్ యొక్క చివరి పరిశీలనలో పాపకు వ్యాధి లక్షణాలు ఏమీ పునరావృతం కాకుండా ప్రశాంతంగా ఉండగలుగుతోందని ఐతే ముందు జాగ్రత్త కోసం  #3 & #4 రెమిడి లను  OD. గా కొనసాగిస్తూ ఉందని తెలిపారు..

సంపాదకుని వ్యాఖ్య: పాప మెదడు లో కణితి కి వాడే టాబ్లెట్ ల యొక్క దుష్ప్రభావాలు పోవడానికి ప్రాక్టీషనర్ పోటేన్ టైజ్ చేసి ఇస్తే బాగుండేది. ఈ అమ్మాయికి సక్రమంగా రాని ఋతుక్రమం కోసం CC8.8 Menses irregular కొంబో ఇచ్చి ఉంటే సరిగ్గా సరిపోయేది.

గాయపడిన కాలు, హెపటైటిస్ - B 11271...India

నవంబర్  2016, 19 తేదీన 46-సంవత్సరాల వ్యక్తి కాలికి తగిలిన గాయం తాలూకు నొప్పి, తిమ్మిరి, మంట గురించి ప్రాక్టీషనర్ ను సంప్రదించారు. వీరికి 2015 జనవరిలో జరిగిన ప్రమాదంలో తలకు, కాలికి గాయాలయ్యాయి. ఈ సందర్భంగా హాస్పిటల్లో వీరికి కాలికి స్టీల్ రాడ్ వేసారు. కాలినొప్పి గురించి డాక్టర్లను సంప్రదించగా కాలిలో ఉన్న సర్జికల్ వలన నొప్పి వస్తోందని వెంటనే హాస్పిటల్లో దానిని తొలగించుకోవలసిందిగా సూచించారు. ఐతే సర్జెరీ కి ముందు నవంబర్ 9 తేదీన స్కానింగ్ తీయించగా పేషంటుకు హెపటైటిస్–B (HBV), ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. అందుచేత డాక్టర్లు శస్త్రచికిత్సను వాయిదా వేసారు. అంతేకాకుండా టెన్విర్ (Tenvir)-300 మందును ను  HBV, కోసం జీవితాంతం వాడాలని సూచించారు. అంతేకాక ఈ వ్యాధి తీవ్రమైన అంటువ్యాధి కనుక పేషంటు యొక్క భార్య కూడా వాడాలని సూచించారు. కనుక ప్రాక్టీషనర్ వీరిద్దరికీ వైబ్రో రెమిడి ఇచ్చారు. దీనితో పాటు కాలి నొప్పి కోసం ఈ క్రింది రెమిడి కూడా ఇచ్చారు:

కాలినొప్పికి, తిమ్మిరికి, మంటకు:
#1. CC3.7 Circulation + CC10.1 Emergencies + CC18.5 Neuralgia + CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue + CC20.5 Spine…6TD in water

హెపటైటిస్ Bకి:
# 2. CC4.2 Liver & Gallbladder tonic + CC4.11 Liver & Spleen + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic…QDS in water

పేషంటు కాలినొప్పికి మరే విధమైన అలోపతి మందులు వాడలేదు. 24 డిసెంబర్  2016 నాటికి పేషంటుకు వ్యాధి లక్షణాలు అన్నింటికి సంబంధించి 20% మాత్రమే మెరుగుదల కనిపించింది. అందుచేత  #1 క్రింది విధంగా మార్చబడింది :
#3. CC20.7 Fractures + #1…6TD in water

2017, ఫిబ్రవరి నాటికి అనగా #3 తీసుకున్న రెండు నెలల తర్వాత నొప్పి, తిమ్మిరి, మంట పూర్తిగా పోయాయి. కనుక డోసేజ్ ని QDS కి తగ్గించడం జరిగింది. తన కాలిలో సర్జికల్ రాడ్డు అలాగే ఉంది కనుక #3 ను QDS గా కొనసాగించడం తనకు సౌకర్యవంతంగా ఉందని పేషంటు అంటున్నారు. 2018 జూన్ నాటికి  పేషంటుకు వ్యాధి లక్షణాలేమి పునరావృతం కాలేదు కనుక వీరు రెండు నెలల కొకసారి రెమిడి రీఫిల్ కోసం వస్తున్నారు. 

హెపటైటిస్-B ని (HBV,) నిర్ధారించే క్వాంటిటేటివ్ రియల్ టైం  PCR  విలువ ప్రారంభంలో అనగా, 9 నవంబర్ 2016 నాటికి 10 మిలియన్ల కంటే ఎక్కువ ఉంది. 4 మార్చి 2017, నాటికి దీని విలువ 5467 కి వచ్చింది. చివరికి అనగా 19 అక్టోబర్ 2017 నాటికి  TND (target not detected)  స్థాయికి చేరుకుంది. పేషంటు #2 తో పాటు అలోపతి మందులు కూడా తీసుకుంటూ ఉన్నారు. ఉభయ చికిత్స కారణంగా పేషంటుకు అద్భుతంగా స్వస్థత చేకూరింది. .

టమాటా ముక్కల నుండి టమాటాల ఉత్పత్తి 11520...India

ఒక తాజా టమాటా పండు నుండి కోసిన రెండు ముక్కలనుండి ( ప్రక్కన ఉన్న బొమ్మ చూడండి) టొమాటో మొక్కలను పెంచే ప్రయోగము నిర్వహింప బడింది.

చక్రాల మాదిరిగా కోసిన రెండు టమాటా ముక్కలను రెండు ఖాళీ గిన్నెలలో ఉంచాలి. ఒక గిన్నెలో సాధారణ నీటిని చల్లాలి. రెండవ దానిలో  CC1.2 Plant tonic…TDS. తో చార్జ్ చేయబడిన  నీటిని చల్లాలి. 5 రోజుల తర్వాత  ఈ ముక్కలను  CC1.2 Plant tonic + 15.1 Mental & Emotional tonic + 18.1 Brain disabilities.తో చార్జ్ చేయబడిన మట్టి కుండలలోనికి మార్చబడినవి. రెమిడి నీటిని చల్లడం OD కి తగ్గించి ప్రయోగం పూర్తయ్యే వరకూ కొనసాగింప బడింది.   

 35 రోజుల తర్వాత ఈ కుండీలలో చిన్న చిన్న ఆకులు కనిపించాయి. ఇప్పుడు కుండీలను బయట నేరుగా సూర్యకాంతి పడకుండా  ఉండటానికి నీడకు ఉంచడం జరిగింది. ఆ తరువాత రెండు నెలలోనే మొక్క  వేగంగా పెరిగి  95 వ రోజుకల్లా ప్రాక్టీషనర్ కుటుంబమంతా పండిన టమాటాలు కోసుకునే స్థాయికి ఎదిగింది. క్రింద ఇచ్చిన ఫోటోలు టమాటా మొక్క  క్రమంగా ఎదిగిన తీరును వివరిస్తాయి.

55 రోజుల తర్వతా చక్కగా ఎదిగిన ఆరోగ్యకరమైన మొక్కను పై ఫోటోలో చూడవచ్చు. 75 రోజుల తర్వాత టమాటా పిందెలు, 80 రోజులకు పచ్చని టమాటాలు, రావడం చూడవచ్చు.  85 ఆ రోజు నుండి టమాటాలు బాగా పండి రంగు వచ్చాయి. ప్రస్తుతం ఈ టమాటాలు  ఎన్నో పక్షులను ఆకర్షించ సాగాయి.

రెండవ కుండీలో ఉంచిన టమాటా ముక్క 39 రోజుల తర్వాత కూడా ఏ మార్పు లేకుండా పాడయిపోవడంతో పారవేయడం జరిగింది.

ఈ ప్రాక్టీషనర్ గతంలో నిమ్మవిత్తనం నుండి మొక్కను పెంచిన అనుభవం ఉన్నప్పటికీ ప్రస్తుతం ఆమె చేసిన ఈ ప్రయోగం ఆమెకు ఎంతో సంతృప్తిని ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది. ఈ ప్రయోగం ఇచ్చిన స్పూర్తితో వీరు నిత్యం ఉపయోగించే కూరగాయల వంటివి  అనగా ఉల్లి, వెల్లుల్లి, అల్లం, ఆలూ, నిమ్మ, గుమ్మడి, చిక్కుడు, ఓక్రా వంటివి విత్తనాలు కొనవలసిన అవసరం లేకుండానే తన పెరడులో ఉత్పత్తి చేయసాగారు.

వాడిపోయే మొక్కలు 03564...Australia

25 నవంబర్ 2017న పుట్టపర్తిలో AVP గా శిక్షణ పూర్తిచేసుకొని ఆస్ట్రేలియాకి తిరిగి వచ్చిన వెంటనే ఈ ప్రాక్టీషనర్ తన ఇంట్లో వాడిపోతూ ఉన్న తులసి మొక్కకు చికిత్స చేయడం ప్రారంభించారు. (ఫోటోను చూడండి). నెలలోపులోనే మొక్క తాను అనుకున్న దానికంటే మెరుగ్గా ఎదగడం ఆనందాన్నిచ్చింది. ఈ స్పూర్తితో తన తోటలో ఉన్న టమాటా మరియు కొత్తిమీర మొక్కలకు చికిత్స చేయడం ప్రారంభించారు. ఎందుకంటే వీటిని తన తోటలో పెంచడం సాధ్యం కావడం లేదు. అనేక సందర్భాల్లో మట్టిని మార్చడం, రకరకాల ఎరువులను ప్రయత్నించడం ఇలా ఎన్ని చేసినా ఈ మొక్కలు సన్నగా వడిలి పోయినట్లు ఉండి తరువాత చనిపోతున్నాయి.  

1 జనవరి 2018 న ప్రాక్టీషనర్  ఒక చుక్క CC1.2 Plant tonic తో చక్కెర గోళీలు తయారుచేసి మూడు గోళీలు వేడిచేసి చల్లార్చిన 100 ml నీటిలో వేసారు. ఈ నీటిని 1 లీటరు నీరు ఉన్న బాటిల్ లో వేసారు. ఒక కప్పు నీటిని తులసి, కొత్తిమీర, టమాటా మొక్కలకు వారానికి మూడు సార్లు ఇచ్చారు. 5 రోజుల తర్వాత మొక్కలు చాలా వేగంగా పెరుగుతున్నట్లు గమనించారు. వేసవిలో బాగా వేడి ఉన్నప్పటికీ మొక్కలకి ప్రతీ రోజూ నీళ్ళు పోసేవారు.  

2018 ఫిబ్రవరి నెలలో మొక్కలన్నీ ఆరోగ్యంగా ఉన్నట్లు గమనించారు (చికిత్సకు ముందు, వెనుక ఉన్న ఫోటోలు చూడండి). టమాటా మొక్కలు పూలు పూసి పిందెలు వేయడం ప్రారంభమయ్యింది. కొత్తిమీర తులసి కూడా  చాలా చక్కగా పెరుగు తున్నాయి. ఈ ఫలితాలను చూసి ఎంతో ఆనందించి పూల మొక్కలు, కూరగాయల మొక్కలూ కూడా పెంచడం ప్రారంభించారు. 

క్రోన్స్ వ్యాధి 03564...Australia

17డిసెంబర్ 2017, తేదీన 57-సంవత్సరముల వ్యక్తి తాను గత 4 సంవత్సరములుగా అనుభవిస్తున్న క్రోన్స్ వ్యాధికి చికిత్స కోసం ప్రాక్టీషనర్ ను సంప్రదించారు. ఈ వ్యాధి వలన కడుపునొప్పి, రోజుకు కనీసం 6 సార్లు విరోచనాలు అవుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా ప్రతీ రోజూ వీరికి మలవిసర్జన సమయంలో రక్తస్రావం అవుతోంది. వీరు పాలఉత్పత్తులను పూర్తిగా తీసుకోవడం మానివేశారు ఎందుకంటే  వాటివలన కడుపునొప్పి ఎక్కువై పోతోంది. అనేక సంవత్సరాలుగా వీరు అలోపతి మందు  పైరాలిన్ (Pyralin EN) 500mg రోజుకు రెండు సార్లు వేసుకుంటున్నారు కానీ ఫలితం ఉండడం లేదు. ఐనప్పటికీ వైబ్రో రెమిడితో పాటు దానిని కొనసాగించారు. వీరికి క్రింది రెమిడి ఇవ్వబడింది:
CC4.2 Liver & Gallbladder + CC4.5 Ulcers + CC4.6 Diarrhoea + CC4.10 Indigestion + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC12.4 Autoimmune diseases + CC15.1 Mental & Emotional tonic + CC21.11 Wounds & Abrasions…QDS

12 రోజులపాటు వైబ్రో మందులు తీసుకున్న తరువాత పేషంటుకు కడుపునొప్పి, విరోచనాలు, మలంలో రక్తస్రావం తగ్గిపోయాయి, కానీ ఈ మెరుగుదల అనేది 70%వరకూ ఉంటుందని అంచనా వేసారు. ఎందుకంటే పాలపదార్ధాలు తీసుకున్నప్పుడు ఎలా ఉంటుందనేది వీరికి ఇంకా నిర్ధారణ కాలేదు. ఐనప్పటికీ డోసేజ్ ను TDS.కు తగ్గించారు.   

మరో రెండు నెలలు రెమిడి వాడిన తరువాత అనగా 2018 మార్చి9వ తేదీన పేషంటు తనకు 90% మెరుగుదల చేకూరిందని చెప్పారు. ఐనప్పటికీ పాల ఉత్పత్తుల పట్ల వీరి భయం అలాగే ఉంది. ప్రాక్టీషనర్ పేషంటుకు ఇచ్చే కొంబోకు అదనంగా దుష్ప్రభావ నిర్మూలన కోసం CC17.2 Cleansing ను కలిపారు. 

ఆ తరువాత వ్యాధిలక్షణాలు కనిపించకపోవడంతో 27 ఏప్రిల్ 2018 న డోసేజ్ ను మూడునెలల వరకూ BD గానూ ఆ తరువాత మెయింటనెన్స్ డోస్ ODగా తీసుకోవలసిందిగా సూచించడం జరిగింది. పేషంటు తనకు పూర్తిగా నయమవడం వలన  23 మే 2018 నుండి పైరలిన్ (Pyralin EN) 500mg తీసుకోవడం మానేశారు. జూన్  2018 నుండి పేషంటు పాల ఉత్పత్తులు కూడా తీసుకోవడం ప్రారంభించారు. ప్రస్తుతం వ్యాధి లక్షణాలు ఏవీ పునరావృతం కానందున ఆనందంగా ఉన్నారు.

 

ప్రోస్టేట్ వాపు 11589...India

63 సంవత్సరాల వ్యక్తికి గత రెండు సంవత్సరాలుగా ఎక్కువసార్లు మూత్రం జారీ అవడమే కాక ఇది కష్టంగానూ నొప్పితో కూడి ఉంటోంది. దీనితో పాటు గత నాలుగు నెలలుగా వీరి పాదాలకు వాపు కూడా వస్తోంది. ప్రతీ రాత్రి 4 నుండి 5 సార్లు మూత్రం కోసం లేవవలసి వస్తోంది. ఇలా లేచిన ప్రతీ సారి మూత్ర విసర్జన కోసం15 నిముషాలు పడుతోంది ఎందుకంటే మూత్రా శయంలో ఇంకా మూత్రం ఉందనే భావన వీరికి ఉంటోంది. వీరికి ప్రోస్టేట్ వాపు ఉంది కనుక ఆపరేషన్ చెయ్యాలని డాక్టర్లు నిర్ణయించారు.

దీనిని తప్పించుకొనే నిమిత్తం పేషంటు 21 జూలై 2017, తేదీన వైబ్రో ప్రాక్టీషనర్ దగ్గరికి వెళ్లారు వీరికి క్రింది రెమిడి ఇవ్వబడింది:
#1. CC13.1 Kidney & Bladder tonic + CC13.2 Kidney & Bladder infections + CC14.2 Prostate + CC20.4 Muscle & Supportive tissue…TDS నీటిలో

4 రోజులు మందులు వేసుకున్న తరువాత పేషంటుకు మూత్ర విసర్జన సమయంలో నొప్పి తక్కువగా ఉన్నట్లు తెలిసింది. 2నెలలు వాడిన తరువాత రాత్రిపూట మూత్ర విసర్జన ఒక్కసారి మాత్రమే వెళ్ళసాగారు. నొప్పి కూడా చాలా వరకూ తగ్గింది. కనుక ప్రోస్టేట్ ఆపరేషను వాయిదా వేశారు. #1 ను ఇప్పుడు ODకి తగ్గించడం జరిగింది.

మరొక నెల తరువాత పేషంటు మూత్రజారీ సమయము తక్కువ కావడమే కాక మూత్ర విసర్జన లో నొప్పికూడా తగ్గడంతో ప్రాక్టీషనర్ కొంబో ను క్రింది విధంగా మార్చడం జరిగింది:
#2. CC13.1 Kidney & Bladder tonic + CC14.2 Prostate…3TW

తరువాత ఐదు నెలలలో డోసేజ్ క్రమంగా 2TW కు చివరగా OW కు తగ్గించడం జరిగింది. ఐనప్పటికీ పేషంటు మంచినీరు ఎక్కువ త్రాగితే ఇతని కాళ్ళల్లో కొంచెం వాపు వస్తోంది. జూలై 2018, నాటికి పేషంటుకు వ్యాధి లక్షణాలు ఏవీ పునరావృతం కాకుండా ఆనందంగా ఉన్నారు.

సంపాదకుని వ్యాఖ్య: వాపు వచ్చినప్పుడు CC3.1 Heart tonic ను వేస్తే ఇది రక్తప్రసరణ ను పెంచి వాపును తగ్గిస్తుంది.

చికిత్సా నిపుణుల వివరాలు 11590...India

 ప్రాక్టీషనర్  11590...ఇండియా బయో కెమిస్ట్రీ లో పట్టభద్రురాలు ఐనట్టి ఈ ప్రాక్టీషనర్ ప్రస్తుతం ఒక మెడికల్ కాలేజిలో అసిస్టెంట్ ప్రొఫెసరు గా పనిచేయుచున్నారు. వీరు 2014 లో స్వామి భక్తులుగా మారిన ఒక డాక్టర్ల కుటుంబ నేపధ్యం నుంచి వచ్చారు.  స్థానిక సత్యసాయి కేంద్రాలలోనూ మరియు ప్రశాంతి నిలయము లోనూ వీరి తండ్రి చేసే వైద్య సేవలు చూసి స్పూర్తి పొంది తనకు ఎంతో ఇష్టమైన బోధనా వృత్తితో పాటు వైద్య సేవలు కూడా చేయాలనే అభిలాష వీరిలో మొలకెత్తింది. 2017 లో వీరి బంధువైన ఒక వైబ్రో ప్రాక్టీషనర్ ద్వారా వీరి తల్లికి ఎన్నో సంవత్సరాలుగా వేధిస్తున్న అత్యంత బాధాకరమైన రుమటాయిడ్ అర్తెరైటీస్ కీళ్ళనొప్పుల సమస్య, వైబ్రో రెమిడి ల ద్వారా 6 నెలల లో తగ్గిపోవడం చూసి తన అభిలాష తీరే మార్గం సుగమం అయ్యింది. వైబ్రో రెమిడి ల ప్రభావం చూసాక  పేషంట్లకు సేవ చేయాలనే తపనతో వైబ్రో శిక్షణకు పేరు నమోదు చేయించుకొని 2017 లో AVP గా శిక్షణ పూర్తి చేసుకొని 2018 ఏప్రిల్ లో అవసరమైన మెంటర్ షిప్ ద్వారా VP  గా కూడా సర్టిఫికేట్ పొందారు. 

వీరు శిక్షణ పొందిన వెంటనే వైబ్రో రెమిడిల ప్రభావం ఏమిటో తన స్వీయ అనుభవం ద్వారా తెలుసుకోగలిగారు. శిక్షణ పూర్తి చేసుకున్న 10 రోజులకు తన కుటుంబ సభ్యులతో తీర్ధ యాత్రలు చేస్తూ ఉండగా ఎక్కువ టెంపరేచర్ తో జ్వరం ప్రారంభమయ్యింది.   3 రోజుల తర్వాత రక్త పరీక్ష చేయించుకోగా డెంగ్యు ఫీవర్ గా నిర్ధారణ అయ్యింది. కానీ ప్లేట్లేట్ కౌంట్ మాత్రం 150,000 ఉంది. ఐతే ఆ సమయంలో తనంతట తాను గానీ తన మెంటర్ ద్వారా గానీ వైబ్రో రెమిడి లు వేసుకునే పరిస్థితి లేదు. ఇంట్లోనే సెలైన్ లు అలోపతి మందుల ద్వారా చికిత్స తీసుకుంటూ ఉన్నారు. నాల్గవ రోజు వీరి ప్లేట్లేట్ కౌంటు 7000 కు పడిపోవడంతో అట్టి క్లిష్టమైన స్థితిలో వెంటనే హాస్పిటల్ లో చేర్చారు. వీరి చర్మపు రంగు కూడా నల్లగా మారిపోయింది. డాక్టర్లు ఆమెను దగ్గకుండా ఉండాలని ఎందుకంటే దానివలన రక్తస్రావము ప్రారంభమయ్యే ప్రమాదమే కాక ఆమె ప్లేట్లెట్లు కూడా మరింతగా పడిపోయే ప్రమాదము ఉందని తెలిపారు. వీరిని హాస్పిటల్ లో చేర్చిన రోజే వీరి మెంటరు హాస్పిటల్ కి వచ్చి స్వామిని ప్రార్ధిస్తూ క్రింది రెమిడిని ఇచ్చారు: NM2 Blood + NM12 Combination-12 + NM91 Paramedic Rescue + SM1 Removal of Entities + SM2 Divine Protection + SM5 Peace & Love Alignment + SM27 Infection + SM41 Uplift…ఈ విధంగా మొదటి రోజు ప్రతీ పది నిమిషాలకు ఒకసారి, రెండవ రోజు ప్రతీ గంటకు ఒకసారి, మూడవ రోజునుండి రోజుకు 6 సార్లు రెమిడి తీసుకోవలసిందిగా సూచించడం జరిగింది. ఈ మందుల వలన అద్భుతంగా కోలుకోగా ( వైబ్రో రెమిడిల కారణంగానే ఇది సాధ్యం అని ప్రాక్టీషనర్ విశ్వసిస్తున్నారు) మూడవ రోజు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేయడం జరిగింది. అలోపతి మందులు తీసుకోవడం మానివేసి వైబ్రో రెమిడి లను కొనసాగిస్తూ మూడు వారాల వ్యవధిలో క్రమంగా తగ్గించుకుంటూ వచ్చారు. అనంతరం CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic ని వ్యాధి నిరోధక శక్తి పెంపుదల కోసం తీసుకోవడం ప్రారంభించారు. మరో వారం గడిచే సరికి వీరి ప్లేట్లెట్ కౌంటు 190,000 కి చేరుకొంది. ఈ విధంగా తనకు మరో జన్మ ప్రసాదించి నందుకు స్వామికి వైబ్రియోనిక్స్ కు వీరు తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.   

మరొక ఆశ్చర్యకరమైన సంఘటనలో కటిభాగములో డిస్కుజారిపోవడం కారణంగా శస్త్ర చికిత్స చేయించుకున్న 22 ఏళ్ల మహిళ, ఈ ప్రాక్టీషనర్ ను సంప్రదించడం జరిగింది. డాక్టర్లు విశ్రాంతి కోసం సూచించిన రెండు నెలల విరామం పూర్తికాకముందే ఈమెకు వివాహం జరిగింది. అంతేకాకుండా కనీసం సంవత్సరం వరకూ గర్భం దాల్చవద్దని చేసిన సూచన కూడా పెడచెవిన పెట్టి ఈ పేషంటు గర్భవతి అయ్యారు. ఇటువంటి పరిస్థితిలో ప్రాక్టీషనర్ ఆమె వెన్ను నొప్పి కోసం CC10.1 Emergencies + CC20.5 Spine రెమిడిని మరియు ఆరోగ్యవంతమైన సంతానం కోసం CC8.2 Pregnancy tonic + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic రెమిడిని ఇచ్చారు. రెండు వారాల తరవాత పేషంటు యొక్క పరిస్థితిని ఆధారం చేసుకొని CC8.9 Morning sickness ను కూడా కలపడం జరిగింది. మరుసటి నెలలో చెకప్ కోసం ఈ పేషంటు వచ్చినప్పుడు గైనకాలజిస్ట్ సూచన ప్రకారము ఈమెకు గర్భాశయ సమస్య (సర్విక్క్స్ సరిగా మూత బడకుండా ఉండటం cervical incompetence) కారణంగా 14 వారాల గర్భధారణ సమయం పూర్తయిన తరువాత గర్భాశయ సమస్యను సరి చేయడానికి శస్త్రచికిత్సకు తేదీ నిర్ణయింపబడింది. అప్పటి వరకూ పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవలసిందిగా సూచించబడినది. ఈ కొత్తగా ఏర్పడిన సమస్య నిమిత్తం ప్రాక్టీషనర్ CC8.5 Vagina & Cervix ను కూడా కలిపి ఇవ్వడం ప్రారంభించారు. తదుపరి నెలలో గైనకాలజిస్ట్ ను కలిసినపుడు ఈమె గర్భాశయాన్ని పరీక్షించి ఈమె సర్విక్స్ మూసి ఉండబడటం చూసి ఆపరేషన్ అవసరం లేదని చెప్పారు! ఈ సంఘటనతో పేషంటు కుటుంబ సభ్యులంతా ఎంతో సంతోషించి స్వామి భక్తులయ్యారు. పేషంటు రెమిడిలను కొనసాగిస్తూ ఆగస్టులో డెలివరీ కోసం రెట్టించిన విశ్వాసంతో ఎదురు చూస్తూ ఉన్నారు.

ఈ పేషంటు యొక్క అనుభవం నుండి ప్రాక్టీషనర్  ఏం నేర్చుకున్నారంటే ‘’ కొంబో విషయంలో ఎంత ఖచ్చితంగా ఉంటే ఫలితం అంత  త్వరగానూ  ఉత్తమం గాను ఉంటుంది ‘’ అని తెలుసుకున్నారు. ఐతే మెడికల్ క్యాంపు నిర్వహించే సందర్భంలో సమయం తక్కువ ఉంటుంది, ఎక్కువ మంది పేషంట్ లు కీళ్ళనొప్పులతో వస్తూ ఉంటారు కనుక వీరందిరికీ  లబ్ది చేకూర్చడానికి  CC3.7 Circulation + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC18.5 Neuralgia + CC20.3 Arthritis + CC20.5 Spine + CC20.6 Osteoporosis + CC20.7 Fractures ఇస్తూ అద్భుత ఫలితాలు పొందుతున్నారు.  108 CC పుస్తకంలో ఉన్న మూవ్ వెల్ రెమిడి ని కొద్దిగా మార్పు చేసి దీనికి మూవ్ వెల్ 2 అని పేరు పెట్టారు.  తరుచుగా దీనిని ఉపయోగిస్తూ అద్భుత ఫలితాలు పొందుతున్నారు. అలాగే ప్రతీ వ్యాధికీ మనసే ప్రధాన కారణం కనుక CC15.1 Mental & Emotional tonic ను ఇవ్వడం ద్వారా వ్యాధి త్వరగా నయమయ్యే అవకాశం ఉంటుందని వీరు అనుభవం ద్వారా తెలుసుకున్నారు. అంతేకాక మొక్కల విషయంలో కూడా CC1.2 Plant tonic ఒక్కటి మాత్రమే ఇచ్చేకన్నా పైన పేర్కొన్న రెమిడితో కలిపి ఇవ్వడం వలన ఫలితం అద్భుతంగా ఉంటుందని వీరు తెలుసుకున్నారు.

ఈ ప్రాక్టీషనర్ జలుబు, జ్వరము, సైనుసైటిస్, మలబద్దకము, దీర్ఘకాలిక వంటి నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, సోరియాసిస్, లిచెన్ ప్లానస్, గర్భం దాల్చడంలో ఇబ్బందులు, టినిటస్ (చెవిలోహోరు), దీర్ఘకాలిక కుంగుబాటు, కాళ్ళ వాపులు, డయాబెటిస్, ఎడిహెచ్ డి(ADHD), స్వాధీనములో లేని మూత్రవిసర్జన, సెర్వికల్ స్పాన్డి లైటిస్, అమియో ట్రోపిక్ లేటరల్ స్లీరోసిస్ (ALS), మొదలగు వ్యాధులను విజయవంతంగా నయం చేశారు. మెంటరింగ్ విధానము కొత్త చికిత్సా నిపుణులకు ఒక గొప్ప వరమని మెంటరింగ్ విధానము ద్వారా తనకు లభించిన సహాయము అమూల్యమైనదని దీని ద్వారా పేషంట్ లతో ప్రవిర్తించే తీరు, సరియైన రెమిడిని ఎంపిక చేసే విధానము తెలుసుకున్నానని భావిస్తున్నారు. పవిత్రమైన ఆలోచనలు, హృదయ పూర్వక ప్రార్ధనలు చేయడం ద్వారా త్వరగా స్వస్తత కలుగుతుందని వీరు రోగులకు సలహా ఇస్తున్నారు. రెమిడిలను నీటితో తీసుకుంటేనే బాగా పనిచేస్తున్నప్పటికీ కొందరకి తాము పనిచేస్తున్న కార్యాలయాలకు తీసుకువెళ్ళడం, ప్రయాణాల్లో తీసుకు వెళ్ళడం అసౌకర్యముగా ఉండడంతో అటువంటి వారిని డోస్ మిస్ కాకుండా ఉండుటకు పిల్స్ రూపంలోనే రెమెడీ వేసుకోమని ప్రోత్సహిస్తున్నారు.

తన ఇంట్లో పేషంట్లకు చికిత్స చేయడంతో పాటు తన మెంటర్ తో కలసి స్థానిక సాయి సెంటర్ లలో మెడికల్ క్యాంపులలో కూడా వీరు పాల్గొంటున్నారు. వీరి ఉద్దేశంలో ఇతర ప్రాక్టీషనర్ లతో చికిత్సా అనుభవాలను పంచుకోవడం వృత్తిలో మరింత ఎదగడానికి సహాయపడుతుందని భావిస్తున్నారు. ఇటీవలే శిక్షణ పూర్తిచేసుకున్న మరొక ప్రాక్టీషనర్ వీరితో కలవడంతో ఈ ముగ్గురు ఒక బృందంగా ఏర్పడి సేవా కార్యక్రమాల్లో పరస్పర సహకారం అందించు కోవడంతో పాటు చికిత్సా వివరాలు, వార్తాలేఖల వివరాలు చర్చించుకుంటూ చక్కని అవగాహనతో ముందుకు సాగుతున్నారు.   

ఈ ప్రాక్టీషనర్ వైబ్రియో రెమిడి ని స్వీయ ప్రక్షాళణ నిమిత్తము అలాగే తన పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ప్రతీరోజు ఉపయోగిస్తారు. వైబ్రియానిక్స్ చికిత్సా నిపుణురాలిగా ఉండడం స్వీయ పరివర్తనకు దారి తీసే ఒక గొప్ప ఆధ్యాత్మిక సాధన అని ఇదే భావo తన పేషంట్ల మీద కూడా ప్రభావం చూపుతోoదని వీరి అభిప్రాయము. ఇంతకు ముందుకంటే ఇప్పుడు మరింత సమతుల్యతతో ప్రశాంతంగా ఉండగలుగుతున్నానని చెపుతూ వీరు ఇలా అంటున్నారు. ‘’ ఇతరులపై నా అవగాహన మరియు నా గురించి ఇతరులకున్న అవగాహన లో ఎంతో మంచి మార్పు వచ్చింది. ‘’  ఇంతటి మహత్తర అవకాశాన్ని కల్పించినందుకు స్వామికి  ప్రేమ విశ్వాసాలతో వీరు  కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు.

పంచుకున్న కేసులు:

  • దీర్ఘకాలిక సైనుసైటిస్  
  • క్రుంగుబాటు
  • రక్త హీనత

 

చికిత్సా నిపుణుల వివరాలు 11271...India

ప్రాక్టీషనర్  11271…ఇండియా  వృత్తిరీత్యా ఒక ఎలక్ట్రానిక్ ఇంజనీర్ గా ఉన్న ఈ ప్రాక్టీషనర్ ప్రధమ సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు తన భార్య సాయి వైబ్రయోనిక్స్ ద్వారా పొందిన ఒక అద్భుత అనుభవం ద్వారా 2007 లో స్వామి పరిధిలోకి రావడం జరిగింది. ఈ సంఘటన మూలాల లోనికి వెళితే ...వీరి భార్యకు నిర్ధారిత ప్రసవపు తేదీ దాటిపోయినా కూడా నొప్పులు రావడం లేదు. డాక్టర్లు నొప్పులకోసం మందులు ఇచ్చినా పనిచేయలేదు. ఇక లాభం లేదు శస్త్రచికిత్స చేయవలసిందే అని డాక్టర్లు తేదీ నిర్ణయించారు. మరుసటి దినం 'సిజేరియన్' డెలివరీ జరగవలసి ఉండగా వైబ్రో ప్రాక్టీషనర్ 02090 గా ఉన్న ఆమె తండ్రి ఆమెకు వైబ్రియో రెమిడీని నిర్ణీతమైన వ్యవధిలో ఇవ్వడం ప్రారంభించాడు, దాని ఫలితంగా తరువాతి రోజు చాలా తక్కువ మోస్తరు నొప్పులతో సాధారణ డెలివరీ జరిగింది. ఈ అద్భుతానికి ఎంతో ఆనందించి  స్వామికి తన కృతజ్ఞతా భావాన్ని వ్యక్తపరచడానికి ఆయన తన కుటుంబంతో మొదటిసారి పుట్టపర్తి సందర్శించి స్వామిని మొదటిసారి దర్శించారు. ఈ సంఘటన అనంతరం ఈ ప్రాక్టీషనర్ తను ఉద్యోగం చేసే సీషేల్స్ అనే ద్వీప దేశానికి తిరిగి వెళ్లారు.

2008లో వీరి భార్య తిరిగి గర్భం ధరించారు. వీరు ఉంటున్న సీషేల్స్ ద్వీపంలో వైద్య సదుపాయాలు తక్కువగా ఉన్నందున తన భార్యను కేరళ లో వదిలిపెట్టి రావలసి వచ్చింది. ఈ సారి కూడా వైబ్రియానిక్స్ సహాయంతో 2009 లో వీరి శ్రీమతి సిజేరియన్ అవసరం లేకుండానే రెండవ బిడ్డకు జన్మ నిచ్చారు. వెంటనే రెండవసారి స్వామి దర్శనం చేసుకోవడానికి పుట్టపర్తి వచ్చారు. ఐతే మనసు ప్రశాంతంగా లేదు, కారణం ఏమిటంటే వీరికి ఇండియా లోనే ఉద్యోగం చెయ్యాలని ఉంది. తన విశ్వాసం బలపడడానికి స్వామి ఒక్కసారి ప్రసన్నంగా చూస్తే చాలు అని కోరుకున్నారు. అదృష్ట వశాత్తూ వీరికి మొదటి లైను లో కూర్చునే అవకాశం వచ్చింది. వీరి జీవితంలో అత్యంత ఆనందదాయక మైన మధురక్షణం రానే వచ్చింది. స్వామి దర్శనం ఇస్తూ వీరిదగ్గరకు  వచ్చి  కళ్ళలో కళ్ళు పెట్టి చూడడం దానివెనుకనే అదృష్ట లక్ష్మి వీరిని వరించడం కూడా జరిగిపోయింది. వీరు ప్రశాంతి నిలయంలో ఉండగానే కేరళలో వీరి సొంతూరు లోనే ఒక పేరున్న టెలికం కంపెనీలో ఉద్యోగం వచ్చినట్లు అపాయింట్మెంట్ లెటరు వచ్చింది. హృదయపు లోతులనుండి కృతజ్ఞతా భావం పొంగిపొరలగా స్వామిని సేవించాలనే బలమైన కోరిక వీరిలో ఉదయించింది.  కేరళ లో మొదటి వైబ్రియానిక్స్ వర్క్ షాప్ జరిగినప్పుడు ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని 2010 నవంబరులో AVP గా శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత  మే  2011లో VP గానూ, మే 2013 లో SVP గానూ, వెంటనే వైబ్రియోనిక్స్ టీచర్ గా కూడా పురోగతి సాధించారు.

వైబ్రో చికిత్స ప్రారంభించిన తొలిరోజులలో వీరు తన మామగారికి సహాయకునిగా ఉండేవారు. నెలకొకసారి నిర్వహించే వైబ్రో క్యాంపు నిమిత్తము వీరు తమ గ్రామము నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊరికి వెళ్ళివస్తూ ఉండేవారు. రోగులకు రెమిడిలు ఇచ్చే సందర్భంలో వీరు చాలా సందర్భాలలో 108 CC పుస్తకాన్ని చూసి రెమిడి లు ఇచ్చేవారు. ఒకసారి ఈ పుస్తకాన్ని తీసుకు వెళ్ళడం మరిచిపోయారు. కానీ స్వామిని ప్రార్ధించి ఆరోజు వచ్చిన 30 మంది పేషంట్లకు చికిత్సా నివారణులను ఇచ్చి పంపించారు. ఇంటికి వచ్చిన తర్వాత తన ఉత్సుకత కోసం పుస్తకాన్ని తీసి చూడగా పేషంట్ల వ్యాధులకు తను ఇచ్చిన రెమిడిలకు సంబంధమే లేదు. తిరిగి మరుసటి నెలలో క్యాంపుకు వెళ్ళినపుడు అత్యంత ఆశ్చర్యకరముగా 90 శాతం మందికి ఆ నెల రోజుల వ్యవధిలోనే వ్యాధి దాదాపుగా నయమవ్వడం చూసి ఆశ్చర్యపోయారు. దీనిని బట్టి కేవలం స్వామి అనుగ్రహం తోనే వ్యాధి నయమవుతోందని మన జ్ఞానము, ప్రయత్నమూ వలన కాదని వీరు గ్రహించారు. అంతేకాక ఇకముందు అజాగ్రత్తగా ఉండకుండా 108 CC పుస్తకం, సోహం సిరిస్ లోని పుస్తకాలూ, మాన్యువల్, వార్తాలేఖలు చదువుతూ ఉండాలని గ్రహించారు. ఇప్పటికీ పూర్తి అంకితభావంతో మెడికల్ క్యాంపులలో పాల్గొంటున్నారు.

ఈ ప్రాక్టీషనర్ మైగ్రేన్/ పార్శ్వపు నొప్పి .విషయంలో  CC11.3 Headaches + CC11.4 Migraines + CC15.1 Mental & Emotional tonic + CC18.5 Neuralgia; అద్భుతంగా పనిచేస్తోందని తమ అనుభవం ద్వారా తెలుసుకున్నారు. అలాగే  మెనియెర్స్ వ్యాధి మరియు లాబీరింతైటిస్ ( చెవి లోపల ఇన్ఫెక్షన్ ) వంటి సమస్యలకు మరియు తల తిరిగినట్టు ఉండటం (వెర్టిగో) కేసుల విషయంలో: CC3.1 Heart tonic + CC5.3 Meniere’s disease + CC18.7 Vertigo చాలా అద్భుతంగా పనిచేస్తున్నట్లు తెలుసుకున్నారు. వీరు నిర్వహించిన మెడికల్ క్యాంపులలో కొందరు పేషంట్లు వ్యాధి నయమయ్యాక చెకప్ కి రాలేకపోయినా, వీరి దృష్టికి వచ్చిన కొన్ని ఆసక్తికరమైన కేసుల గురించి వివరిస్తున్నారు.

65 సంవత్సరాల వయస్సు గల స్త్రీ అధిక బరువుతో పాటు వళ్ళంతా నొప్పులు కీళ్ళవాపు మరియు తిమ్మిరి వంటి అనేక దీర్ఘకాలిక సమస్యలతో సతమత మవుతూ ప్రాక్టీషనర్ ను కలిసారు. గత 6 నెలలుగా ఈమె కడుపు నొప్పి మరియు రాత్రిపూట సుమారు 2 గంటల సమయంలో 2/3 సార్లు విరోచనానికి వెళ్ళవలసిన సమస్యతో బాధ పడుతూ ఉన్నారు. ఇతర రకాల మందులు ప్రయత్నించారు కానీ ఫలితం కలగలేదు. ప్రాక్టీషనర్ ఈమెకు: CC4.2 Liver & Gallbladder tonic + CC4.6 Diarrhoea + CC4.8 Gastroenteritis + CC4.10 Indigestion ఇవ్వడంతో నెల రోజుల లోనే కడుపు నొప్పి విరోచనాలు పూర్తిగా తగ్గిపోయాయి. అలాగే  CC13.1 Kidney & Bladder tonic + CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue + CC20.5 Spine తీసుకున్న రెండు నెలలలోనే వొళ్ళు నొప్పులు కీళ్ళనొప్పులు తిమ్మిరులు తగ్గిపోయాయి. ఆ విధంగా రెమిడి మరో మూడు నెలలు కొనసాగించి మూడు కేజీలు బరువు కూడా తగ్గారు.

మరొక కేసు విషయంలో 27 సంవత్సరాల వయసు గల పేదకుటుంబానికి చెందిన కవల పిల్లలైన ఇద్దరు యువకులు అసమతౌల్యముగా ఉండే క్రియాటిన్ ఫాస్పోకినేజ్ -CPK స్థాయిల కారణంగా ఏర్పడిన కండరాల బలహీనత తో బాధ పడుతూ ఉన్నారు. 13 సంవత్సరాలుగా శరీరంలో పరిమితమైన కదలికలతో ఇబ్బంది పడుతూ వ్యాధి నయమవ్వడం కోసం అనేక చికిత్సా విధానాలు ప్రయత్నించారు కానీ ఏమాత్రం ప్రయోజనం కలుగలేదు. ఒక ప్రాణిక్ చికిత్సా నిపుణుని ద్వారా సాయి వైబ్రియోనిక్స్ గురించి ఈ యువకులు తెలుసుకున్నారు. ఐతే ప్రాక్టీషనర్ నుండి ఆ మందులు తీసుకోవాలంటే వారి శరీరము సహకరించని క్లిష్ట పరిస్థితిలో ఎంతో దూరం ప్రయాణం చేయవలసి ఉంటుంది. వీరి ప్రయాణానికి కొద్ది రోజులు ముందు ఈ ఇద్దరు సోదరులలో ఒకరికి కల వచ్చింది. దీనిలో భగవాన్ బాబావారు ఒక హొమియోపతీ వంటి మందు గల సీసా అతని మీదకు విసిరివేసినట్లు కల వచ్చింది. ఆ తరువాత సరిగ్గా అలాంటిదే వారు ప్రాక్టీషనర్ నుండి తీసుకోవడం జరిగింది. ఇది ప్రాక్టీషనర్ తయారు చేసిన ఒక బ్లడ్ నోసోడ్. దీనిని వారు అత్యంత విశ్వాసంతో 6 నెలలు సేవించిన తరువాత ఈ యువకుల CPK క్రియాటిన్ ఫాస్పోకినేజ్ స్థాయిలు గణనీయంగా తగ్గిపోవడంతో పాటు ఇంతకుముందు కంటే మెరుగ్గా తమ శరీర భాగాలను కదిలించ గలుగుతున్నారు. ఈ సంఘటన తో వైద్య చికిత్సకు అసాధ్యమైన ఇటువంటి కేసులలో కూడా వైబ్రియానిక్స్ అద్భుతాలు చేస్తుందనే విశ్వాసం ప్రాక్టీషనర్ లో బలపడింది. ఐతే దురదృష్టవశాత్తూ ఆ యువకులు మెడికల్ క్యాంపుకు రావడం మానేయడంతో వీరి నుండి పూర్తి సమాచారం అందలేదు. 

మరొక కేసు విషయంలో 43 సంవత్సరాల వయసు గల ఉపాధ్యాయుడు గత పది సంవత్సరాలుగా నరాల సంబంధమైన సమస్యతో బాధపడుతూ ఉన్నారు. వీరికి బ్లాక్ బోర్డు పైన రాయడం కష్టమవడంతో పాటు రాను రానూ అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకం చేయడం కూడా అసాధ్యమైపోయింది. ఇది క్రమంగా ఈ ఉపాధ్యాయునిలో ఆత్మవిశ్వాసం కోల్పోయేలా చేసింది. ప్రాక్టీషనర్ ఇచ్చిన రెమిడి CC15.2 Psychiatric disorders + CC18.4 Paralysis + CC20.5 Spine (చివరి కొంబో ప్రాక్టీషనర్ అంతర్ దృష్టితో ఇవ్వడం జరిగింది) 7 నెలలు తీసుకున్న తరువాత ఈ ఉపాధ్యాయునికి పూర్తిగా తగ్గిపోయింది. ఐతే ముందు జాగ్రత్త కోసం వీరు దానిని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు.

చికిత్సా నిపుణుడిగా వివిధరకాల వ్యాధులకు వైద్యం అందించడంతో పాటు వీరు వైబ్రియానిక్స్ కు సంబంధించిన అనేక రకాల పాలనా పరమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. కేరళలో ప్రాక్టీషనర్ లనుండి మాస నివేదికలు సేకరించడంతో పాటు వీరు ప్రాక్టీషనర్ లకు అవగాహనా మరియు రిఫ్రెషర్ సదస్సులు నిర్వహిస్తూ కొత్త ప్రాక్టీషనర్లకు మార్గదర్శకత్వం వహిస్తూ ఉంటారు. వీరు చేసే మరొక అత్యంత ప్రాధాన్యత కలిగిన మరియు కష్టతరమైన సేవ 108 CC బాక్సులకు తుది రూపాన్ని ఇవ్వడం. ఇంకా IASVP మెంబెర్షిప్ కార్డుల ప్రింటింగ్ మరియు పోస్టింగ్ బాధ్యత కూడా వీరే వహిస్తున్నారు.  26 జనవరి 2014లో మొదటి అంతర్జాతీయ వైబ్రియానిక్స్ సదస్సు జరిగినప్పుడు వీరు ఎంతో అంకితభావంతో సేవ చేసారు.

మూడు సంవత్సరాల క్రితం ఈ ప్రాక్టీషనర్ కు వీరు ఉంటున్న నివాసస్థలం  నుండి 3,000 కిలోమీటర్ల దురాన ఉన్న ఢిల్లీ కి బదిలీ అయ్యింది. స్వామిని హృదయపూర్వకంగా ప్రార్ధించడం తో ఆ ప్రార్ధన ఫలించి చెన్నై (కేవలం 700 కి.మీ. వీరికి ఒక రాత్రి ప్రయాణం) కి బదిలీ అయ్యింది. దీనితో వీరు తను చేస్తున్న సేవలు కొనసాగించడం, నెలవారీ సేవలు కొనసాగించడం తో పాటు ఇప్పుడు చెన్నై లో కూడా నెలవారీ వైబ్రో క్యాంపులలో పాల్గొనేందుకు అవకాశం లభించింది. వ్యాధులు నయం చేసే ధన్వంతరి భగవంతుడే ఐనప్పటికీ మన అంకితభావము, నిబద్ధతే భగవంతుని చేతిలో ఉన్నతమైన సాధనా పనిముట్లుగా మారడానికి అవకాశం కల్పిస్తాయి. అందుకే వీరు ఎల్లప్పుడూ  వైబ్రియానిక్స్ మిషన్ లో  మరిన్ని సేవా అవకాశాలు అందించి  స్వామి దివ్య హస్తంలో ఉన్నతమైన సాధనా పనిముట్టుగా చేసుకోవలసిందిగా స్వామిని ప్రార్ధిస్తూ ఉంటారు.

పంచుకున్న కేసులు  :

  • తలపోటు, ప్రవర్తనా సమస్యలు  
  • గాయపడిన కాలు, హెపటైటిస్-B

 

ప్రశ్నజవాబులు

1.ప్రశ్న: అంతర్జాతీయ సాయి వైబ్రియోనిక్స్ సంస్థ (IASVP)లో నేను ఎలా చేరగలను?

జవాబు: సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ నెలవారీ రిపోర్టులు క్రమం తప్పకుండా పంపించే సాయి వైబ్రియోనిక్స్ ప్రాక్టీషనర్లందరూ (AVP లు తప్ప) IASVP లో సభ్యత్వం పొందవచ్చు. మీ ఐదు అంకెల రిజిస్త్రేషన్ నంబరు మీ లాగిన్ ఐడి గా మీ పాత పాస్ వర్డ్ ను ఉపయోగించి https://practitioners.vibrionics.org సైట్ లో లాగిన్ అవ్వండి. ఒకవేళ మీకు పాస్వర్డ్ లేకపోతే ‘‘ఫర్గెట్ పాస్వర్డ్ “ ను క్లిక్ చేయడం ద్వారా  మీ పాస్వర్డ్ ను పొందవచ్చు. ఆలా లాగిన్ అయ్యిన తర్వాత మీ వ్యక్తిగత వివరాలు అప్డేట్ చేసుకోండి. దానిలో ఉన్న వివరాలను విపులంగా చదివిన తర్వాత ఇటీవలే తీయించుకున్న (భుజాలవరకు ఉన్న) ఫోటోతో పాటు ఆన్లైన్ అప్లికేషన్ సమర్పించండి. ఫోటో 50kB నుండి 300Kb వరకూ ఉన్నది మాత్రమే అంగీకరించబడుతుంది. అనంతరం  IASVP సెక్రటరీ నుండి మీరు ఐడి కార్డు ఎలా పొందగలరో సూచిస్తూ ఇమెయిల్ వస్తుంది. AVP లు మాత్రం సరళంగా ఉండే ఒక చిన్న ఆన్లైన్ పరీక్ష లో ఉత్తీర్నత పొందిన తర్వాత  మాత్రమే VP అవుతారు. మరిన్ని సూచనల కోసం  [email protected] కు ఇమెయిల్ పంపండి.

________________________________________

2. ప్రశ్నతాచ్ యాన్ చికిత్స తీసుకుంటున్న ఒక పేషంటుకు వైబ్రో చికిత్స చేయవచ్చా?  

జవాబు: మా సూచన ప్రకారం కనీసం అరగంట తేడాతో (గంట విరామం ఉంటే ఇంకా మంచిది) ఈ రెండింటిని వాడవచ్చు. ఇలాంటి ఇతర శక్తి ప్రాధాన్యత చికిత్సల విషయంలో కూడా ఇదే సూచన వర్తిస్తుంది.

________________________________________

3. ప్రశ్న: వైబ్రియోనిక్స్ రెమిడి లను బ్రాడ్కాస్టింగ్ చేస్తున్నప్పుడు పూర్తి నిడివితో ఉన్న కలర్ ఫోటో మాత్రమే ఉపయోగించాలా లేక నలుపు తెలుపు లో ఉన్న పాస్ పోర్ట్ సైజు ఫోటో కూడా అంతే ప్రభావవంతంగా పనిచేస్తుందా

జవాబు: పూర్తి నిడివితో ఉన్న కలర్ ఫోటో ఉపయోగించ వలసిన అవసరం లేదు. ఐతే మా ఉద్దేశంలో పూర్తి నిడివితో ఉన్న ఫోటో పేషంటుకు సంబంధించిన ఎక్కువ సమాచారాన్ని అందిస్తుంది కనుక కలర్ ఫోటో వాడవలసినదిగా సూచిస్తాము. ఈ విషయంలో ప్రాక్టీషనర్ లు ఈ రెండు రకాల ఫోటోలను ఉపయోగించి పొందిన అనుభవాలకు చెందిన సమాచారాన్ని మాకు అందిస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని సూచన.

________________________________________

4. ప్రశ్నవ్యాధి మరియు చికిత్స విషయంలో శరణాగతి యొక్క ప్రాధాన్యత ఏమిటి  ?

జవాబు: ఎవరయినా ఒక వ్యక్తి తీవ్రమైన జబ్బుతో ఉన్నప్పుడు శరణాగతి చేయడంలో అర్ధం అతను ఈ జన్మలో గానీ గత జన్మలో గానీ చేసిన తప్పులకు, చెడు ప్రవర్తనకు కర్మ సిద్ధాంతం ప్రకారము సంక్రమించిన ఫలితంగా భావించగలగడమే.  కనుక తెలిసి గానీ తెలియక గానీ చేసిన తప్పులకు క్షమార్పణ అడగడం ద్వారా మీకు సంక్రమించిన వ్యాధిని ఒక పాఠం నేర్పే అనుభవంగా మార్చుకోవడము మరియు  ఇదే భగవద్ సంకల్పము గా భావించి ప్రశాంతముగా ఉండడమే శరణాగతి.  

“శరణాగతి అనగా: మన ఆలోచనలను మనం అనుభవించే బాధలనుండి, కష్టాలనుండి మళ్లించడమే శరణాగతి.  ప్రతీ ఒక్కటి దేవుని సంకల్పము గానే భావించి ఆ ప్రేమ మూర్తి చేతిలో అంతా ఉంచి ఇలా ప్రార్ధించాలి. ‘’భగవంతుడా సర్వమూ మీ చేతిలో ఉంచాను నాకేది మంచిదో అదే ప్రసాదించండి."

________________________________________

5. ప్రశ్ననేను ఇటీవలే  AVP గా శిక్షణ పొంది యున్నాను. వైబ్రియోనిక్స్ గురించి అందరికీ తెలియజెప్పాలని ఎంతో ఉత్సాహంతో ఉన్నాను. దీనికోసం నేను ఎలా ముందుకు సాగగలను? భగవాన్ బాబానే స్వయంగా ఈ చికిత్సా పద్దతిని ఆశీర్వదించినప్పటికీ సత్యసాయి సేవా సంస్థ వారు వైబ్రో చికిత్సా విధానానికి ఎందుకు దూరంగా ఉంటున్నారు?

జవాబు: వైబ్రో చికిత్సా విధానము గురించి ప్రచారము చేయమని మేము సిఫారసు చెయ్యము. ఐతే దీని గురించి ముఖతః వెల్లడించదానికి అభ్యంతరం లేదు. సాయి భక్తులకు, ఆధ్యాత్మిక పిపాసులైనవారికి  చికిత్స చేయడం మీకు సానుకూలంగా ఉంటుంది. ఆసక్తి ఉన్న వారికి ఫోన్ ద్వారా, స్కైప్ ద్వారా, ఈమెయిలు ద్వారా వైబ్రియానిక్స్ గురించి తెలియజేయవచ్చు.అలాగే వారికి మన వార్తాలేఖలను మెయిల్ చేయడం కూడా మీకు ఉపయోగపడుతుంది.  

సత్యసాయిబాబావారు వైబ్రియానిక్స్ చికిత్సా విధానాన్ని పరిపూర్ణంగా ఆశీర్వదించారన్నది నూటికి నూరుపాళ్ళు సత్యము. అలాగే  స్వామి ఆశీర్వాదాలు ఇప్పటికీ మనం అందుకుంటూనే ఉన్నాము. ఐతే సాయి సెంటర్ లలో లేదా వారి సమావేశాలలో మన క్యాంపులను అనుమతించనప్పటికీ  సత్యసాయి సేవా సంస్థల జాతీయ అధ్యక్షులు మన కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ భారత దేశంలోని సాయి సెంటర్ లలో వర్క్ షాప్ నిర్వహించుటకు అనుమతి నిచ్చారన్న విషయం డాక్టర్ అగ్గర్వాల్ గారు ఎంతో ఆనందంతో మనకు తెలియజేస్తున్నారు. వారు పంపిన లెటరు యొక్క కాపీని [email protected] కు రాయడం ద్వారా పొందవచ్చు

________________________________________

6. ప్రశ్నCC17.2 క్లెన్సింగ్ కొంబో ద్వారా చికాకు, కోపము, భయము, ఆందోళన వంటి వాటికి మనం చికిత్స చేయవచ్చా ?         

జవాబు: ఇటువంటి వ్యతిరేక భావోద్వేగాలకు అత్యంత ఫలప్రదమైన కొంబో CC15.1 Mental & Emotional tonic. ఇటీవల కాలంలో ఈ వ్యతిరేక భావనల బారిన పడి జీర్ణ సమస్యలతోను, అనిశ్చిత ఆహార అలవాట్ల తోనూ బాధపడుతూ ఉన్నారు. చాలామందికి ఆకలి లేకపోవడమో లేక శక్తి కోసం ఫాస్ట్ ఫుడ్ కు అలవాటు పడడమో జరుగుతోంది. ఐతే ఈ రెండూ ఆరోగ్యానికి మంచివి కావు. కనుక వారికి వారి భావోద్వేగాలు స్థిమిత మయ్యేవరకు CC4.10 Indigestion + CC15.1 Mental & Emotional tonic ఇచ్చి అనంతరం CC17.2 Cleansing ను ఒక నెలరోజుల పాటు ఇవ్వవలసి ఉంటుంది. ఒకవేళ వారికి నిద్రలేమి సమస్య ఉంటే  CC15.6 Sleep disorders. తో చికిత్స చేయడం మంచిది.

దివ్య వైద్యుని దివ్యవాణి

“ మానవుడు  తను జన్మ ఎత్తినది సేవను ఒక పవిత్రమైన కార్యముగా భావించి సమాజానికి సేవ చేయడానికి అని విశ్వసించాలి. ఫలాపేక్ష లేకుండా సక్రమమైన మార్గంలో ఏ కొంచం సేవ చేసినా అది ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. సేవ ఎలా చేసాము ఎంతచేసాము అన్నది ప్రధానం కాదు హృదయపూర్వకంగా చేసామా లేదా అన్నది ప్రధానము. ఏ విధంగా ఐతే ఆవు ఎట్టి ఆహారాన్ని తిన్నప్పటికీ అమృతతుల్యమైన పాలను ఇస్తుందో పవిత్రమైన హృదయంతో చేసిన ఏ చిన్న సేవయినా అనంత ఫలితాన్ని ఇస్తుంది. సేవ చేస్తున్నప్పుడు ఫలితం పైన దృష్టి ఉండకూడదు. "ఇది నా బాధ్యత నేను పుట్టింది సేవ చేయడానికే అనే భావంతో చెయ్యాలి."

... సత్యసాయిబాబా, “పుట్టింది సేవ చేయడానికే (Born to Serve)దివ్యవాణి 19 నవంబర్ 1987 http://www.sssbpt.info/ssspeaks/volume20/sss20-26.pdf

 

 

"ఆహారంలో మితాన్ని పాటించడం, కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండడం ద్వారా మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. సాత్వికమైన ఆహారము మానసిక ప్రశాంతతను శారీరక ఆనందాన్ని ఇస్తుంది. ఆహారములో మితాన్ని ఎల్లప్పుడూ పాటించాలి. చాలామంది అవసరం లేకపోయినా ఖరీదైన ఆహారం తీసుకుంటూ ఉంటారు. అటువంటి వారు మితాన్ని హితాన్ని పాటించడం వారికే శ్రేయస్కరం. ధూమపానం చేయకుండా ఉండడం ద్వారా ఎన్నో సమస్యల నుండి మానసిక ఉద్వేగాలనుండి (రాజసిక మైనవి) దూరంగా ఉండవచ్చు. సహజ సిద్ధంగా ఉన్న సమతౌల్యాన్నిఇటువంటి  మాదకద్రవ్యాలు, మత్తుపానీయాలు దెబ్బతిస్తాయి. ఆహారములో మితము, భాషణలో మితము, కోరికల పై అదుపు, జీవితంలో మనకు ఏదైతే లభించిందో దానితో సంతృప్తి పడడం, ఇతరులకు సేవ చేయడం ద్వారా ఆనందింప చేయడంలోనే మన ఆనందం దాగిఉందని గ్రహించడం. ఇవే ఆరోగ్యాన్ని సమకూర్చే అత్యుత్తమ టానిక్స్ కంటే శక్తివంతమైన ఔషదాలు. మన సనాతన ధర్మం బోధించింది కూడా ఇదే."

... సత్యసాయిబాబా, “ఉత్తమమైన టానిక్దివ్యవాణి, 21 సెప్టెంబర్ 1960 http://www.sssbpt.info/ssspeaks/volume01/sss01-28.pdf

 

ప్రకటనలు

ప్రకటనలు

రాబోయే కాలంలో నిర్వహించనున్న వర్క్ షాపులు

  • ఇండియా పుట్టపర్తి:  AVP వర్క్ షాప్ 22-26 జూలై  2018, సంప్రదించవలసిన వారు లలిత వెబ్సైట్   [email protected] లేక ఫోన్ నంబర్ 8500-676-092
  • ఫ్రాన్సు పెర్పిగ్నా: AVP వర్క్ షాప్ మరియు అవగాహనా సదస్సు 8-10 సెప్టెంబర్ 2018, సంప్రదించ వలసిన వారు డానియెల్ వెబ్సైట్ [email protected]
  • యుకె లండన్: జాతీయ అవగాహనా సదస్సు 23 సెప్టెంబర్ 2018, సంప్రదించవలసిన వారు జెరం వెబ్సైట్   [email protected] లేక ఫోన్ నంబర్ 020-8551 3979 
  • ఇండియా ఢిల్లీ NCR: రిఫ్రెషర్ సదస్సు: AVP/VP - 22 సెప్టెంబర్ 2018 మరియు SVP - 23 సెప్టెంబర్ 2018, సంప్రదించవలసిన వారు డాక్టర్ సంగీతా శ్రీవాత్సవ. ఇమెయిల్  [email protected] లేక ఫోన్ నంబర్ 9811-298-552
  • ఇండియా పుట్టపర్తి: AVP వర్క్ షాప్ 18-22 నవంబర్  2018, సంప్రదించవలసిన వారు లలిత వెబ్సైట్  [email protected] లేక ఫోన్ నంబర్ 8500-676-092
  • ఇండియా పుట్టపర్తి: SVP వర్క్ షాప్ 24-28 నవంబర్ 2018, సంప్రదించవలసిన వారు హేమ వెబ్సైట్    [email protected]

అదనముగా

1.     ఆరోగ్య వ్యాసము

రక్తహీనత

అనారోగ్యము శారీరక పోషకాహార లోపం కన్నా మానసిక పోషకాహార లోపము వల్లనే కలుగుతుంది. వైద్యులు విటమిన్ల లోపము గురించి చెపుతూ ఉంటారు. కానీ నేను దీనిని విటమిన్ G లోపము అని అంటాను. ఈ లోప సవరణకు దేవుని నామమును స్మరించడం, దేవుని మహిమను కీర్తించడం చేయవలసిందిగా సిఫారసు చేస్తాను. ఆ విటమిన్ లోపానికి ఇదే పరమ ఔషదం. దీనితో పాటు నియంత్రిత జీవన విధానము, మంచి అలవాట్లు కూడా రెండింట మూడొంతులు జీవితాన్ని ప్రభావితం చేస్తే ఔషదం కేవలం ఒకవంతు మాత్రమే ప్రభావితం చేస్తుంది.“…శ్రీ సత్యసాయిబాబా .

1. రక్తహీనత అనగా ఏమిటి?2-11

మానవ శరీరము యొక్క ఎముక మజ్జ మూడు రకాలైన రక్త కణాలను ఉత్పత్తి చేస్తుంది. అవి ఇన్ఫెక్షన్ ల నుండి శరీరాన్ని రక్షించే తెల్లరక్త కణాలు (WBC), రక్తం గడ్డకట్టడానికి దోహదం చేసే ప్లేట్లెట్ లు, శరీరమంతా ప్రాణవాయువును సరఫరా చేసే ఎర్రరక్త కణాలు (RBC) హిమోగ్లోబిన్ (Hb), అనేది ఎర్రరక్త కణాల్లో ఉండే ఒక సంక్లిష్టమైన ఇనుప ధాతువు కలిగి ఉండే ప్రోటీన్. ఇది రక్తానికి ఎరుపు రంగు నివ్వడమే కాక ఆక్సిజెన్ ను జీవకణాలన్నింటికి సరఫరా చేస్తుంది.2

రక్త హీనత అనేది మన శరీరములో చాలినంత ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాలు లేకపోవడం లేదా హిమోగ్లోబిన్ తక్కువగా ఉండడం మూలంగా ఏర్పడుతుంది.3,4,5 ఎర్ర రక్తకణాల యొక్క సాధారణ జీవితకాలం120 రోజులు. లివరు మరియు స్ప్లీన్ ద్వారా తొలగించబడే జీవితకాలం ముగిసిన ఎర్రరక్తకణాల లోటును పూడ్చడానికి శరీరము ప్రతీ రోజూ ఎర్ర రక్తకణాలను ఉత్పత్తి చేస్తూనే ఉంటుంది.6  సాధారణముగా రక్తంలో ఎర్ర రక్త కణాలు ఒక మైక్రో లీటరుకు మగవారిలో 4.7 నుండి 6.1 మిలియన్లు, ఆడవారిలో 4.2 నుండి 5.4 మిలియన్ల వరకూ ఉంటాయి.7  అలాగే సూచించబడిన హిమోగ్లోబిన్ స్థాయి మగవారికి 14 నుండి 18 g/dL ఆడవారికి 12 నుండి 16 g/dL ఉంటాయి.8 ఒక చిన్న సాధారణ రక్త పరీక్ష ద్వారా వీటి స్థాయిలు ఎలా ఉన్నాయో తెలుసు కోవచ్చు.

2. రక్త హీనత యొక్క లక్షణాలు 2-5,8,10-19,21               

రక్తహీనత యొక్క లక్షణాలు ఏమీ లేని స్థాయి నుండి ప్రాణంతకమైన స్థాయి వరకూ ఉంటాయి. రక్త పరీక్ష చేయించుకోనంత వరకూ సాధారణ నుండి ఒక మోస్తరు స్థాయి లో ఉండే రక్తహీనత గురించి తెలుసుకోవడం కూడా కష్టమే. రక్తహీనత యొక్క కొన్ని ముఖ్య లక్షణాలు ఇప్పుడు తెలుసుకుందాం.

  • పాలిపోయినట్లు ఉండడం, ముఖ్యంగా పాలిపోయినట్లుండె కంటి పొరలు, నాలుక, అరచేతులు, గోర్లు దీనినే పాలర్ అని పిలుస్తారు, అలాగే పెళుసుగా చెంచా ఆకారంలో ఉండే గోర్లు ఇవి రక్తహీనత కు కొన్ని చిహ్నాలు. ఆసుపత్రి ఆధారిత చికిత్సా అధ్యయనం ప్రకారము పాలర్ అనేది పిల్లల్లో రక్తహినతకు ఒక నమ్మదగిన సంకేతమని, ఇది లేకపోవడం వారిలో తీవ్రస్థాయిలో ఈ సమస్య లేనట్లు భావించడానికి కూడా ఆస్కారం ఉందని నిరూపించింది.
  • అలసట, మగత, మెదడు మొద్దుబారినట్లు ఉండడం, దడ గుండె వివిధ అవయవాలకు ఆక్సిజెన్ పంపడంలో వత్తిడికి లోనుకావడం, అసాధారణ హృదయ స్పందన, శ్వాస లేకపోవడం, ఛాతిలో నొప్పి వంటివి ఉంటాయి.
  • నిర్లక్ష్యం చేయకూడని కొన్ని ఇతర సూచికలు: సాధారణ కార్యకలాపాలు చేసుకోవడానికి కూడా శక్తి లేకపోవడం, బరువు తగ్గడం, మతిమరుపు, ముభావంగా ఉండడం, తలనొప్పి, లో బి.పి, తిమ్మిరి, అరచేతులు అరికాళ్ళలో చల్లగా ఉండడం, సాధారణ స్థాయి కన్నా ఉష్ణోగ్రత తక్కువగా ఉండడం, రుచి లేకపోవడం, నాలుకలో వాపు లేదా నొప్పి, నోటి మూలల్లో పగుళ్ళు, చెవిలో హోరు, మలము యొక్క రంగు మారడం, జుట్టు రాలిపోవడం, అనారోగ్యంతో ఉన్నట్లు అనుభూతి వంటివి కూడా కొన్ని సూచికలు గా గుర్తించవచ్చు.   
  • వింత కోరికలు : ఎవరికైనా పోషకాహారములు కానట్టి పదార్ధాలు అనగా ధూళి, మట్టి, పేపర్లు, పెయింట్, రబ్బరు బ్యాండు మైనము, మంచు, పిండి వంటివి తినే అలవాటు ఉంటే (దీనినే పైకా ప్రవర్తన అంటారు) వీరు ఐరన్ లోపము కలిగి ఉన్నట్లు భావించాలి. చాలామంది చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, పెరుగుదలలో లోపము ఉన్నవారు ఈ అలవాట్లను కలిగి ఉంటారు.3,10,12,14,16-18
  •  B12 విటమిన్ లోపము ఉన్నవారి లక్షణాలు: ఈ లోపం ఉన్నవారికి కాళ్ళల్లోనూ, చేతులలోనూ సూదులు గుచ్చుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. స్పర్శజ్ఞానం ఎక్కువ ఉండదు, నడవడం కష్టంగా ఉంటుంది, కాళ్ళు చేతులలో పటుత్వం ఉండదు. ఎప్పుడూ అస్థిమితంగా డిప్రెషన్ తోనూ, ఆకలి లేకుండాను, నిరాశతోనూ ఉంటారు.12,19

3.  రక్తహీనత కు కారణాలు  2-5,8-10-14,20,21-24

  • ఐరన్ మరియు విటమిన్ల లోపము: ప్రపంచ వ్యాప్తంగా రక్త హీనతకు కారణం ఇనుము లోపము అని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇనుము, విటమిన్ B9 (ఫోలేట్) మరియు విటమిన్ B12 ఇవే ప్రధాన కారణాలు.
  • రక్తాన్ని కోల్పోవడం కారణంగా లోపం ఏర్పడడం : స్త్రీలు ఋతుక్రమంలో ఎక్కువ రక్తాన్ని కోల్పోవడం, గాయాల కారణంగానూ, శస్త్రచికిత్సల కారణంగాను, అల్సర్, కేన్సర్ కారణంగానూ, తరుచుగా రక్తదానం చేయడం కారణంగాను రక్త హీనత ఏర్పడుతూ ఉంటుంది.
  • పోషక పదార్ధాలు జీర్ణం చేసుకోవడంలో శారీరక అసమర్ధతకొన్ని ప్రత్యేక ఆహార పదార్ధాలు, పానీయాలు, ధూమపానం, మద్యపానం, దీర్ఘకాలిక వ్యాధులు, ఇన్ఫెక్షన్లు, ముఖ్యంగా పరాన్నజీవులకు సంబంధించిన మరియు రోగనిరోధక లోపానికి చెందిన వ్యాధులు, కొన్ని రకాల మందులు, వైద్యము, శస్త్ర చికిత్సలు, వంటివి పోషక పదార్ధాలలో ఉన్న ఐరన్ ను విటమిన్ లను తీసుకోవడంలో శరీరానికి ప్రతిబంధకంగా ఉంటాయి.
  •  RBC (ఎర్రరక్త కణాలు) సరిపడినంతగా లేకపోవడంఅధిక మొత్తం లో రేడియేషన్ కు గురికావడం, కొన్ని రకాల రసాయన పదార్ధాలకు గురికావడం, వైరస్ లు, రోగ నిరోధక శక్తి లోపానికి చెందిన వ్యాధులు, పోషకాహార లోపము, హార్మోన్ల అసమతౌల్యత, గర్భ ధారణ, దీర్ఘకాలిక వ్యాధులు  ఎర్ర రక్త కణాల ఉత్పత్తి వేగాన్ని తగ్గిస్తాయి. వారసత్వ జన్యుపరమైన లోపము కూడా దీనికి కారణం కావచ్చు. పరిశోధన20 మన శరీరంలో ఎర్ర రక్తకణాలను ఉత్పత్తి చేసే యంత్రాంగము ఇనుము లోపం కారణముగా ఎంత ప్రతికూలమైన పరిస్థితిని ఎదుర్కొంటుందో పరిశోధనలు నిరూపించాయి.
  • RBC ఎర్ర రక్తకణాలు నాశనమవడం: కొన్ని ప్రత్యేక ఆరోగ్య కారణాలు వారసత్వ సమస్యల కారణంగా ఎముకల మజ్జలో ఎర్ర రక్తకణాల ఉత్పతి కంటే నాశనమవడమే హెచ్చుస్థాయిలో ఉంటోంది. ఉదాహరణకు స్ప్లీన్ వ్యాకోచం, తలసేమియా, కొన్ని రకాల  ఎంజైముల లోపం కారణంగా ఈ సమస్య తలెత్తుతోంది. 4
  • భారత దేశంలో స్త్రీలు, పిల్లలు ఎదుర్కొనే అదనపు సమస్యలుభారత ప్రభుత్వపు ఆరోగ్యము మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 23, రక్తహీనత కు పైన పేర్కొన్న కారణాలే కాకుండా పరాన్నజీవుల కారణంగా ఐరన్ లోపము, పరిసరాలలో పారిశుధ్య లోపము, సురక్షితము కాని మంచినీరు, పిల్లలు, స్త్రీలలో వ్యక్తిగత పారిశుధ్య లోపము కూడా కొన్ని కారణాలుగా పేర్కొంది.
  • ప్రధానమైన కారణముఆయుర్వేదము ప్రకారము 24, పోషకాహార లోపము అనేది చాలినంత పౌష్టికాహారం తీసుకోకపోయినందుకు కాదు శరీరంలో అగ్నితత్వం (వికృత పిత్త) లో అసమతుల్యం కారణంగా ఏర్పడుతోంది అని పేర్కొంటోంది. దీనికి కారణం పుల్లని మరియు అధిక ఉప్పు గల పదార్ధాలు తినడం, అధిక శారీరక శ్రమగా పేర్కొంటున్నది.  

4. ప్రమాదాలు మరియు జాగ్రత్తలు 2,3,5,10-14,17,22-29

రక్తహీనత అనేది వ్యాధి కాదు ఇది ఏ సమస్యలు లేకుండా నివారించదగినట్టిది. దీనిని నిర్లక్ష్యం చేయడం వలననే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. పిల్లలు, యువజనులు, మహిళలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు కలవారు దీనికి లోనవుతూ ఉంటారు. దీర్ఘకాలిక రక్తహీనత విషయంలో రక్తంలో ప్రాణవాయువు శాతం తీవ్రస్థాయిలో పడిపోతేనే తప్ప ఆక్సిజెన్ స్థాయి తక్కువ ఉన్నా శరీరము దానికి అనుగుణంగా సర్దుబాటు చేసుకుంటుంది. 22 అటువంటి సందర్భాలలో రక్తము ఎక్కించడం, ఎముకల మజ్జ మార్పిడి వంటివి అవసరమవుతాయి. రక్తంలో దీర్ఘకాలిక ప్రాణవాయువు లోపము గుండె, మెదడు, ఇంకా ఇతర ముఖ్యమైన అవయవాలను దెబ్బతీయడమే కాక దీనివలన మరణము కూడా సంభవించవచ్చు. రక్తహీనత జంతువులకు కూడా ప్రమాదకరమైనదే.

రక్తహీనత కు కారణం గుర్తించకుండా వైద్యపరంగా చికిత్స చేయరాదు.17 ఐరన్ ట్యాబ్లెట్లు తీసుకొనేవారు తప్పనిసరిగా డాక్టర్ సలహా సూచన మేరకే వాటిని తీసుకోవాలి. ఐరన్ ఎక్కువగా తీసుకుంటే అది శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో నిలవ ఉంచబడి            గుండె, కాలేయము, పాంక్రియాస్ వంటి ముఖ్యమైన అవయవాలను ప్రభావితం చేస్తుంది. తగు జాగ్రత్తలతో రక్తదానం చేయడం దీనిని నిరోధిస్తుంది.3,11,17,24-29

5. రక్తహీనతకు నివారణ మరియు చికిత్స 2,3,5,13,14,23,24,30-54

సంపూర్ణ ఆహారము స్వీకరించడం ప్రారంభించండి: రోజుకు సుమారు 500 గ్రాముల పండ్లు, కూరగాయలు, మొలకెత్తిన ధాన్యాలు, ఉడికించిన తృణధాన్యాలు, సులువుగా జీర్ణమై మన శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. 30 మన శరీరం ఏమి కోరుతుందో దాని ప్రకారము ఎట్టి ఆహారము అందిస్తే దేహము చురుకుగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటుందో అట్టి ఆహారాన్ని  అందించాలి. నోటిలోకి తక్కువ లేదా సరిపడినంత ఆహారము తీసుకోని బాగా నమలడం వలన త్వరగా జీర్ణము అవుతుంది. అవగాహనతోను కృతజ్ఞతా భావనతోను తినడం మంచిది.

ఇనుము మరియు B9, B12 మరియు  C విటమిన్ల మూలాలు మరియు కొన్ని గృహ చిట్కాలు క్రింద ఇవ్వబడ్డాయి:

1. ఇనుము 2,3,5,13,14,23,24,32-39ఇనుము లభించే అత్యత్తమ వనరులు

(a) పండ్లు  ఆపిల్, దానిమ్మ, అరటిపళ్ళు, పీచ్ మరియు పుచ్చకాయ.

(b) డ్రై ఫ్రూట్స్  ఖర్జూరం, ఆఫ్రికాట్లు, అత్తిపండ్లు, మరియు ఎండు గింజలు ;  పిస్తాలు, హాజల్ గింజలు, బాదాం మరియు జీడిపప్పు. విత్తనాలు గుమ్మడికాయ/స్క్వాష్, నువ్వులు, జనపనార గింజలు, అవిశ గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, చియా మరియు ఫెనుగ్రీక్. 

(c) ఆకుకూరలు  పాలకూర, కాలే, మెంతుకూర, ఆవాలు, ఫెనుగ్రీక్ ఆకులు, ఆవాలు, చేమగడ్డ, ముల్లంగి, పుదినా, మునగ కాయలు, మరియు కర్రీ ట్రీ ఆకులూ, బ్రోకాలి (పచ్చిది లేదా ఉడకబెట్టింది), బ్రసెల్స్ మొలకెత్తిన విత్తనాలు, కాలిఫ్లవర్, మరియు గుమ్మడికాయ, బీట్ రూట్, పచ్చి అరటి(కూర అరటి) తొక్క వలవని ఉడక బెట్టిన బంగాళా దుంప, మరియు సూర్యకాంతిలో ఎండబెట్టిన టమాటాలు నుండి కూడా లభిస్తుంది.

(e) తృణ ధాన్యాలు క్వినోవా, బ్రౌన్ రైస్, ఓట్స్, అమరాంత్, సోయాచిక్కుడు మరియు వాటి ఉత్పత్తులు, చిక్కుడు రకాలు, బటానీలు, కాయధాన్యాలు, చిక్ పీస్ వీటిలో ఇది సమృద్ధిగా ఉంటుంది. ముఖ్యంగా ఫింగర్ మిల్లెట్, పెర్ల్ మిల్లెట్ (చిరుధాన్యాలు) మనం తినే బియ్యము, గోధుమ కన్నా ఉత్తమ మైనవి.

ఐరన్ ను తగు జాగ్రత్తతో  తీసుకోవాలి 3,5,23: ఐరన్ ను B మరియు C విటమిన్లు సమృద్ధిగా ఉన్న పదార్ధాలతో అనగా చిరుధాన్యాలు/ఉడికించిన గింజలు/పులియ బెట్టిన పదార్ధాలు/మొలకెత్తిన విత్తనాలు వంటి వాటితో తీసుకున్నట్లయితే సులువుగా జీర్ణమవుతాయి. పైన చెప్పబడ్డ అనేక పదార్ధాలలో B & C విటమిన్లు సమృద్ధిగా ఉన్నాయి. కనుక తగు జాగ్రత్తతోనూ విజ్ఞతతోనూ ఈ ఆహార పదార్ధాలను తీసుకోవాలి. పాలఉత్పత్తులను, కాల్షియం ఉత్పత్తులను, యాంటాసిడ్లను, కాఫీ, టీ, పంచదార, చాకొలేట్, సోడా, తవుడు, గుడ్లు వంటివి ఐరన్ జీర్ణము కావడానికి నిరోధకంగా పనిచేస్తాయి కనుక వీటిని ఐరన్ కాంబినేషన్ తో తీసుకోక పోవడం మంచిది.

2. ఫోలేట్  (విటమిన్ B9) 2,3,43-46: సహజంగా ఈ విటమిన్ పండ్ల లోనూ కూరగాయలలోను, తృణ ధాన్యాలలోను, గింజలు, విత్తనాలలోనూ లభిస్తుంది. ఈ విటమిన్ శరీరంలో నిలవ ఉంచబడదు కానీ ప్రతీ రోజూ అవసరం మేరకు శరీరానికి తగినంత చేర్చబడుతూ ఉంటుంది. అధికంగా ఉన్నది సహజ సిద్ధంగా బయటకు పంపివేయబడుతుంది. ఫోలేట్ ఎర్రరక్తకణాలను పెంపొందింపజేయడమే కాక రోగ నిరోధక శక్తిని, మెదడుకు బలాన్ని పెంపొందిస్తుంది. ఇంకా B12, విటమిన్ జీర్ణము కావడానికి, ఆరోగ్యకరమైన గర్భధారణకు కూడా ఉపయోగకరమైనది. ఈ విటమిన్ ను తీసుకోవడానికి ఉదయమే సరియైన సమయం ఎందుకంటే అప్పుడే శక్తి విడుదల అధికంగా ఉంటుంది.46

ఫోలేట్ సమృద్ధిగా ఉండే పదార్ధాలు: ‘‘ఐరన్ మూల పదార్ధాలు” అని చెప్పబడ్డ పదార్ధాలు ఫోలేట్ ను కూడా సమృద్ధిగా కలిగి ఉంటాయి. ఫోలేట్ సమృద్ధిగా ఉండే మరికొన్నిపదార్ధాలు అవకడో, అస్పరేగాస్, ప్రునె, మొక్కజొన్న, ఆకుకూరలు, ఓక్రా, మరియు క్యారెట్లు. ఫోలేట్ అనేది ఫోలిక్ యాసిడ్ రూపంలో రొట్టెలలోను, పాస్తా లోనూ, చిరుధాన్యాల లోనూ లభిస్తుంది.2,3,43,44

3. విటమిన్ B12 2,3,47:  సాధారణంగా ఈ విటమిన్ సహజసిద్ధమైన స్థితిలో జంతు సంబంధమైన పదార్ధలలోనే లభిస్తుంది. అలాగే పాలు పాల ఉత్పత్తులయిన పెరుగు, వెన్నలలోనూ, పులియబెట్టిన సోయా ఉత్పత్తులలో కూడా లభిస్తుంది. విటమిన్ B12, సమృద్దిగా గ్రహించడానికి. శరీరంలో నిలువ చేసుకోవడానికి దీనిని  విటమిన్ B6  ఉండే పదార్దాలైన పాలకూర, అక్రోటు, అవకడో, పోలిష్ చెయ్యని బియ్యం, మరియు అల్లం వంటి వాటితో కలిపి తీసుకోవాలి.

వండిన అన్నాన్ని తగినంత నీటిలో రాత్రంతా ఉంచి తాజా పెరుగులో కలిపి రుచికోసం కొంత ఉప్పుతో చేర్చి తిన్నట్లయితే దీనిలో పుష్కలంగా విటమిన్ B1248  లభిస్తుంది.

భారత దేశంలో పులియబెట్టిన పధార్థాలైన50 ఇడ్లీ లు (ఉడికించిన బియ్యపు పిండి, మినుప పిండి తో చేయబడినవి) మరియు దోక్లా  (చిక్ పీ పిండి నుండి తాయారు చేసినవి ) వీటి పైన కొంత సందిగ్ధం ఉన్నప్పటికీ వీటిలో  B12, సమృద్ధిగా ఉంటుందని విశ్వసిస్తారు. ఇడ్లీ ల పైన నిర్వహించిన అధ్యయనంలో మినప పిండి పులియబెట్టినపుడు దీనిలో విటమిన్  B12 చేరుతుందని తెలిసింది.

4. విటమిన్ ఈ విటమిన్ ఎక్కువగా ఉండే ఆహారపదార్ధాలు 5,40-42: ఉసిరికాయ, జామకాయ, బత్తాయి, నిమ్మ వంటి పుల్లని పళ్ళు, కివి లాంటి బెర్రీ పళ్ళు, ఎండుద్రాక్ష, ద్రాక్షా, బొప్పాయి, అరటిపళ్ళు, పుచ్చకాయ, ఎరుపు ఆకుపచ్చని మిరియాలు, క్యాబేజీ, కొత్తిమీర, పండ్లు, ఆకుపచ్చ కూరగాయాలు, తృణ ధాన్యాలు ఇవన్నీ ఉపయోగపడతాయి. ఇంకా  పైన్ఆపిల్  మామిడి, పార్స్లీ, ఆలుగడ్డ, చిలకడ దుంప, మరియు ఇతర దుంపలు, టమాటాలు ( గింజలు తీసివేయాలి కారణం ఏమిటంటే అవి త్వరగా జీర్ణం కాక జీర్ణ వాహికలో రాళ్ళుగా మారతాయి.31). రోజూ కొన్ని తులసి ఆకులు తినడం కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.24

విటమిన్ C ను తగు జాగ్రత్తతో తీసుకోవాలి.42: మానవ శరీరము స్వతహాగా C విటమిన్ ను తయారుచేసుకోవడం గానీ  నిలువ ఉంచుకోవడం గానీ చేయలేదు కనుక  తాజా పండ్లను కూరగాయలను తీసుకునే టప్పుడు ఈ విటమిన్ ఎక్కువ తీసుకున్నా మేమో అని బెంగపడవలసిన అవసరం లేదు. ఐతే ఎవరైనా C విటమిన్ ను సప్లిమెంట్ రూపంలో తీసుకుంటూ ఉంటే  రోజుకు  2 గ్రాములకు మించి తీసుకోకుండా ఉండడం మంచిది. ఎందుకంటే దానివలన  కడుపులో వికారం కలిగే అవకాశం ఉంది. ఆహార పదార్ధాలను వండడం ద్వారా, నిలువ చేయడం ద్వారా, మైక్రోఓవెన్ ఉపయోగించడం, ఉడికించడం ద్వారా కొంత C విటమిన్ నష్టమయ్యే అవకాశం ఉంది. కానీ ఉసిరికాయ లో మాత్రం వంటకు ఉపయోగించినప్పటికీ దానిలో C విటమిన్ ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది.

6. గృహ చిట్కాలు 24,32,52

*గోరువెచ్చని నీటిలో తేనె కలిపి ప్రతిరోజూ సేవిస్తే అది ఎర్ర రక్త కణాలను పెంచడమే కాక Hbస్థాయిలను కూడా పెంచుతుంది. ఐతే తేనెను బాగా వేడిగా ఉన్న నీటితో ఇవ్వడం లేదా తేనెను వేడి చేయడం వంటివి చేయకూడదు. దానివలన తేనె విష తుల్యముగా మారే అవకాశము ఉంది. అలాగే దీనిని  సంవత్సరం లోపు పిల్లలకు ఇవ్వడం కూడా మంచిది కాదు.32

*పురాతన కాలంలో ఉపయోగించిన రీతిగా ఇనుప పాత్రలలో ఆహారాన్ని తినడం చాలా మంచిది. ఇనుప పాత్రలు గానీ లేదా పళ్ళాలలో గానీ వండిన పదార్ధాలు ఇనుమును గ్రహించడం వలన అవి రక్తహీనత ఉన్న రోగికి సత్వర ఉపశమనాన్ని ఇస్తాయి.13,24 నల్లగా కనిపించే బెల్లములో ఇనుము శాతం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే చెరుకురసాన్నిపెద్ద పెద్ద ఇనుప పాత్రలలో మరిగించడం ద్వారా ఈ బెల్లాన్ని తయారు చేస్తారు కనుక దీనిలో సులువుగా జీర్ణమయ్యే ఇనుప ధాతువు ఉంటుంది.52

*ప్రతీ క్షణం విటమిన్ Gతీసుకుంటూ ఉండండి. ఎప్పుడూ సంతోషంగా ఉండండి. ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండండి. అంతర్యామిగా ఉన్న భగవంతుడి సామీప్యాన్ని ఎల్లప్పుడూ అనుభవించండి!

సాయి వైబ్రియానిక్స్: భగవాన్ బాబా వారిచేత ఆశీర్వదింపబడిన ఈ అద్భుతమైన రెమిడీలు రక్త హీనతను అరికట్టడమే కాక ఇది శారీరక స్థాయికి రాకముందే (సూక్ష్మ శరీర స్థాయిలో ఉన్నప్పుడే) నివారించగల శక్తివంతమైనవి. ప్రాక్టీషనర్ లు ‘108 కామన్ కొంబో’ లేదా ‘వైబ్రియానిక్స్ 2016’ పుస్తకాలను చదవవచ్చు.

రిఫెరెన్స్ కోసం కావలసిన వెబ్సైట్ ఎడ్రస్ లు:

1. http://www.sssbpt.info/ssspeaks/volume05/sss05-39.pdf

2. https://www.mayoclinic.org/diseases-conditions/anemia/symptoms-causes/syc-20351360

3. https://www.speakingtree.in/blog/a-visual-guide-to-anemia

4. https://www.health24.com/Medical/Anaemia/Anaemia-20130216-3

5. https://draxe.com/anemia-symptoms/https://draxe.com/vitamin-c-foods/

6. https://www.labce.com/spg469710_normal_red_blood_cell_rbc_characteristics.aspx

7. https://medlineplus.gov/ency/article/003644.htm 

8. Taber’s Cyclopaedic Medical Dictionary, Edition 20, pages 105, 966,1141.

9.  http://www.who.int/vmnis/indicators/haemoglobin.pdf

10. https://www.healthline.com/nutrition/iron-deficiency-signs-symptoms

11. https://blogs.mercola.com/sites/vitalvotes/archive/2007/06/25/How-do-You-Know-if-You-Are-Anemic.aspx

12. https://www.webmd.com/a-to-z-guides/understanding-anemia-symptoms#1

13. https://www.drweil.com/health-wellness/body-mind-spirit/heart/anemia/

14. https://www.nhsinform.scot/illnesses-and-conditions/nutritional/iron-deficiency-anaemia

15. Pallor detects anaemia in kids: https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC2797134/

16. Study on pica: https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC2850349/

17. https://articles.mercola.com/sites/articles/archive/2016/11/05/craving-ice-iron-deficiency.aspx

18. https://kidshealth.org/en/parents/pica.html

19. https://www.healthline.com/health/pernicious-anemia

20. https://www.sciencedaily.com/releases/2018/01/180122110806.htm

21. http://www.journalijar.com/article/6859/prevalence-of-anemia-in-men-due-to-various-causes-in-kancheepuram-  district/

22. https://www.medicinenet.com/anemia/article.htm#what_are_the_signs_and_symptoms_of_anemia

23. http://www.pbnrhm.org/docs/iron_plus_guidelines.pdf

24. https://www.artofliving.org/in-en/ayurveda/ayurvedic-treatments/6-home-remedies-anemia

25. http://www.sankalpindia.net/book/haemoglobin-test

26. https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC5503668/

27. https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC3128151/

28. http://indianbloodbank.com/donors-guidelines.html

29. http://www.hsa.gov.sg/content/hsa/en/Blood_Services/Blood_Donation/Can_I_Donate/iron-and-blood-donation/new-hemoglobin-criteriaformaleblooddonors.html

 

Prevention and Cure

30. Eating Wisely and Well by Ramesh Bijlani (from Integral yoga of Sri Aurobindo and Mother), Rupa Publications 2012, Chapter 5, page 48-55

31. Sathya Sai Baba Speaks on Food, Sri Sathya Sai Sadhana Trust Publication, Dec.2016 edition, page 65; http://www.saibaba.ws/teachings/foodforhealthy.htm  

32. https://www.slideshare.net/BhimUpadhyaya/food-body-by-sadhguru

33. https://food.ndtv.com/food-drinks/fruits-for-anaemia-load-up-on-these-6-fruits-to-boost-your-haemoglobin-1761166;

      https://food.ndtv.com/health/anemia-diet-9-ways-to-include-iron-rich-foods-in-your-meals-1273991

34. https://www.healthline.com/nutrition/iron-rich-plant-foods#section3

35. https://www.medindia.net/patients/lifestyleandwellness/curry-leaves-health-benefits.htm

36. https://www.myfooddata.com/articles/vegetarian-iron-foods.php

37. https://www.africrops.com/africrops-moringa-a-solution-to-iron-deficiency/

38. http://www.academicjournals.org/journal/IJMMS/article-full-text-pdf/86F279D77

39. https://ods.od.nih.gov/factsheets/iron-consumer/

40. https://www.banyanbotanicals.com/info/ayurvedic-living/living-ayurveda/herbs/amalaki-amla/

41. https://www.globalhealingcenter.com/natural-health/foods-high-in-vitamin-c/

42. Vitamin C utilisation: https://medlineplus.gov/ency/article/002404.htm

43. https://www.myfooddata.com/articles/foods-high-in-folate-vitamin-B9.php

44. https://www.globalhealingcenter.com/natural-health/folic-acid-foods/

45. https://articles.mercola.com/sites/articles/archive/2007/01/16/get-your-folic-acid-from-whole-food-sources-not-multi-vitamins.aspx

46. Best time to take vitamin B: https://www.medicalnewstoday.com/articles/319556.php

47. https://www.livestrong.com/article/245167-how-to-prevent-vitamin-b12-deficiency/

48. Fermented rice food: http://sssbpt.info/ssspeaks/volume09/sss09-21.pdf

49. http://www.drvasudev.com/Vitamin-B12-&-vegans.asp

50. https://food.ndtv.com/opinions/magical-benefits-of-fermented-foods-like-yogurt-idli-or-dhokla-1285304

51. https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC3551127/

52. www.ihatepsm.com/blog/jaggery-gud

 

2. ఫ్రాన్సులో మొదటి  SVP వర్క్ షాప్  14-17 మే  2018

ఫ్రెంచ్ టీచర్ మరియు కోఆర్డినేటర్01620 ఆధ్వర్యంలో ఇద్దరు ఉత్సాహవంతులైన VP ప్రాక్టీషనర్లకు ఫ్రాన్సులో SVP వర్క్ షాప్ నిర్వహింప బడింది. ఈ ఇద్దరూ కూడా 2015 లో ఇదే కోఆర్డినేటర్ ద్వారా AVP శిక్షణ పొందినవారే కావడం విశేషం. శిక్షణకు 10 రోజుల ముందు ఈ భాగస్వాములు కలుసుకొని ఈ కోర్సులో వారు నేర్చుకున్న విషయాల పైన సవివరమైన చర్చ జరిపి తమ అవగాహనను ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నారు. శిక్షకురాలు వీరికి కార్డులను, SRHVP మిషన్ ను ప్రయోజన కారకంగా ఎలా ఉపయోగించాలనే విషయాలను చక్కగా వివరించారు. కార్డులు ఉపయోగించే విధానము సరియైన రీతిలో నేర్చుకునేందుకు వీలుగా అనేక అభ్యాసకృత్యాలు విద్యార్ధులకు ఇవ్వబడ్డాయి. అలాగే అలోపతి మందులను పోటేన్ టైజ్ చేయడం, బ్లడ్ నోసోడ్ తయారుచేయడం పైన కూడా చక్కని అనుభవ పూర్వక అభ్యాసాలు కల్పింపబడ్డాయి. స్నేహ పూర్వక వాతావరణములో జరిగిన ఈ శిక్షణ తమకెంతో ఆనందాన్నిచ్చిందని ఇక్కడ నేర్చుకున్న అంశాలను ద్విగుణీకృతమైన ఉత్సాహంతో తమ ప్రాక్టీసు లో ఉపయోగిస్తామని అభ్యర్ధులు తెలిపారు. విద్యార్ధులు ఉత్తమ శ్రేణిలో పాసవడమే కాక తమ ఇళ్ళకు చేరిన వెంటనే మిషన్ తో పేషంట్ లను చూడడం ప్రారంభించారు. కార్యక్రమ అంతిమ దశలో డాక్టర్ అగ్గర్వాల్ గారి ద్వారా నిర్వహించిన స్కైప్ కాల్ లో ఎన్నో విలువైన సూచనలు అభ్యర్ధులు అందుకోవడం జరిగినది.

3. విర్జీనియా, USA లో  2018 జూన్ 22-24 తేదిలలో   AVP వర్క్ షాప్

యు.యస్ మరియు కెనడా కోఆర్డినేటర్ 01339 ఆధ్వర్యంలో రిచ్మండ్ లోని ఆమె స్వగృహంలో 3 రోజుల వర్క్ షాప్ నిర్వహింపబడినది.  యుఎస్ఎ, కెనడా మరియు ట్రినిడాడ్ నుండి ఐదుగురు భాగస్వాములు ఇందులో పాల్గొన్నారు. అనేక నెలల పాటు క్రమం తప్పకుండ నేర్చుకున్న ఈ కోర్సు పాఠాలను ఈ శిక్షణ ద్వారా పరిపూర్ణం చేసుకొని సుశిక్షితులైన ప్రాక్టీషనర్ లుగా సేవా సాధనలో అడుగు పెట్టడానికి ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమములో పాల్గొన్నారు. శిక్షణ ఇచ్చే కోఆర్డినేటర్ కు సహకారం అందించడానికి ఈ అభ్యర్ధుల యొక్క ఈ కోర్సు టీచర్ లు కూడా కార్యక్రమములో పాల్గొన్నారు. ఈ మూడు రోజుల శిక్షణ లో పాల్గొన్న భాగస్వాములు ఐదుగురు కూడా ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. తమ గమ్యస్థానం చేరుకున్న వెంటనే వైబ్రో సేవలో పాల్గొనడానికి  ఉత్సాహంతో ఉన్నారు. ఒక అభ్యర్ధి తన కోసం ఎంతో మంది పేషంట్లు ఎదురు చూస్తూ ఉన్నారనడం విశేషం. ఈ శిక్షణా తరగతులలో పాల్గొనడం ఒక మరువలేని అనుభవం అనే అభిప్రాయాన్ని అభ్యర్దులంతా వ్యక్తపరిచారు.

 

4. చెన్నై-ఇండియా లో పునశ్చరణ సదస్సు 17 జూలై 2018  

 

వైబ్రియోనిక్స్ టీచర్ 11422 ద్వారా చెన్నైలో నిర్వహింపబడిన రిఫ్రెషర్ వర్క్ షాపుకు ఏడుగురు ప్రాక్టీషనర్ లతో పాటు అమెరికాకు చెందిన ఒక సీనియర్ విజిటింగ్ ప్రాక్టీషనర్ 03521  కూడా పాల్గొని చికిత్సా అభ్యాసకులకు కొన్ని ప్రయోజనాత్మకమైన సూచనలు తెలియజేసారు.

  • వైబ్రియోనిక్స్ టీచర్ యొక్క ఇంటి చుట్టు ప్రక్కనే ఉంటున్న రోగికి చికిత్స నందించడంలో AVP లు మరియు VP లు భాగం పంచుకున్నారు. పేషంటుకు దీర్ఘకాలిక నొప్పి మరియు కడుపు పుండుకు సంబంధించిన సుదీర్ఘ చరిత్ర ఉంది. ఇతని సమస్యల మూల కారణము తెలుసుకొనడానికి అతని నుండి సంబంధిత సమాచారమును ఎలా పొందాలో అభ్యాసకులు నేర్చుకున్నారు. ప్రతీ సారీ భోజనమైన తర్వాత రెండు గ్లాసుల నీటిని త్రాగడం, రాత్రిపూట ఆలస్యంగా తినడం మరియు స్థిరమైన జీవన విధానము లేకపోవడం వంటి అనారోగ్యకరమైన అలవాట్లు ఉన్నాయని బహుశా ఇవే అతని వ్యాధికి కారణమని భావించి తగిన రెమిడిని సూచించారు.   
  • దీర్ఘకాలిక అనారోగ్యమునకు సంబంధించి సమర్థవంతమైన చికిత్సా విధానము పైన చాలా ఉత్సాహ జనితమైన చర్చ జరిగింది. ఇటువంటి సందర్భాలలో అత్యధికంగా ఇబ్బంది పెట్టే సమస్యను గుర్తించి  50% మెరుగుదల వచ్చేంత వరకు   సమస్యను అధిగమించడానికి ప్రయత్నించడం ఉత్తమమని భావించారు. ఆ తరువాత వేరే ఇతర ఇబ్బందికరమైన  సమస్యను గుర్తించి రెమెడీలను ఇవ్వడం ద్వారా క్రమబద్ధంగా ముందుకు సాగవచ్చు, అని తెలుసుకున్నారు.   
  • రోగికి ఇచ్చే ఒక గోళీ డబ్బాలో ఒకటి కంటే ఎక్కువ  కొంబో డ్రాప్స్ వేయవలసి వచ్చినప్పుడు ఆ గోళీలు ఉండలు కట్టకుండా లేదా ముద్దగా మారకుండా నివారించడానికి ఒకటి రెండు పద్ధతులు చర్చించబడ్డాయి. నాణ్యత గల గోళీ లు వాడడం, పరిమాణం పెద్దగా ఉన్న డబ్బాను వాడడం, ఒక కొంబో చుక్క వేసిన తర్వాత రెండో చుక్క వేయకుండానే డబ్బాను షేక్ చెయ్యడం ఇలా అన్ని చుక్కలు వేయడం  పూర్తయిన తర్వాత మామూలు పద్దతిలో 8 ఆకారంలో డబ్బాను షేక్  చెయ్యడం ఉపయోగకరంగా ఉంటుందని తెలుసుకోవడం జరిగింది. ఈ సదస్సులో చర్చించిన మరికొన్ని చిట్కాలు ప్రతీ రోజూ నీటిని తగినంతగా పద్దతి ప్రకారం త్రాగడం, వెల్ నెస్ కిట్టును ఎప్పుడూ వెంట తీసుకు వెళ్ళడం, కేస్ హిస్టరీ లేదా రోగ చరిత్రలను నియమ బద్దంగా రాయడం, వైబ్రియోనిక్స్ ను ముందుకు తీసుకు వెళ్ళడానికి వీలుగా జంతువులూ, మొక్కల పైన ఇవ్వబడిన కొంబోలతో పరిశోధన చెయ్యడం వంటివి చర్చించ బడ్డాయి. ఈ సందర్భంగా విజిటింగ్ ప్రాక్టీషనర్ ఒక మంచి సూచన చేసారు. ప్రపంచ శాంతి వర్దిల్ల చేయడానికి ప్రాక్టీషనర్లందరూ ఒకేసారి భూమాత ను ఉద్దేశిస్తూ SRHVP మిషన్ ద్వారా బ్రాడ్కాస్టింగ్  చేయడం, లేదా 108CC బాక్సు నుండి తగిన కొంబో ఎంచుకొని భూగోళము బొమ్మ పైన దానిని ఉంచడం ఫలవంతంగా ఉంటుందని ఇలా అమెరికాలో వారానికి ఒకసారి (గురువారము సాయంత్రం 8 గంటల నుండి శుక్రవారం ఉదయం 8 గంటల వరకూ) చేస్తున్నారని చెప్పారు.

*నీటి యొక్క ఉపయోగాలు, నీటిని సేవించే ఆరోగ్యకరమైన పద్దతులు, సహజ సిద్ధమైన విధానంలో నీటిని శక్తివంతం చేసే పద్దతులు గురించి సంపుటము 8 సంచిక 2&3 లలో  “నీరు మరియు ఆరోగ్యము ” 1-3.భాగాలు చూడవచ్చు.

ఓం శ్రీ సాయి రామ్