Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

Vol 9 సంచిక 2
March/April 2018
ముద్రింప తగిన వార్తాలేఖ


పూర్తి వార్తాలేఖ యొక్క కాగితం ప్రతి కావలెనన్నఈ పుటను ముద్రించండి

డా.జిత్ కే అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి

ప్రియమైన వైబ్రో అభ్యాసకులరా,

 రాబోయే కొద్ది రోజులలో ఉగాది, రామ నవమి, గుడ్ ఫ్రైడే మరియు ఈస్టర్ పండుగలు ఒకదాని తరువాత మరొకటి వస్తున్న అత్యంత పవిత్రమైన సమయాన్ని పురస్కరించుకొని మీతో ఇలా నా భావాలను పంచుకొనడం ఎంతో ఆనందాన్ని అందిస్తోంది. ఇట్టి పవిత్రమైన పండుగల యొక్క ప్రాముఖ్యతను గురించి సాక్షాత్తు భగవంతుడే వివరించగా విని ధన్యుల మైన మనం మరొక్కసారి వాటిని పునరావలోకనం చేసుకొనడానికి శ్రీవారి ఉపన్యాసములలోని కొన్ని  మధుర వాక్యాలను మననం చేసుకొందాం:

 "నేడు ఉగాది, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నూతన సంవత్సరం. ఈ క్షణం నుండి, చెడు ఆలోచనలు మరియు చెడు లక్షణాలను విడిచిపెట్టి కొత్త జీవితాన్ని ప్రారంభించండి. మీ  హృదయాన్ని పరిశుద్ద పరుచుకోండి. అప్పుడు మాత్రమే మీ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. మీరు ఒక్కక్షణం  కూడా వేచి ఉండవలసిన అవసరం లేదు. సాయి చెప్పేది ఏదియో అది జరిగితీరుతుంది. సాయి భక్తులుగా ఉన్న మీరు స్వార్ధపరత్వం వీడి  సమాజ సంక్షేమం కోసం మీ జీవితాలను అంకితం చేయాలి... " సత్య సాయి స్పీక్స్, వాల్యూమ్ 35

 "ప్రతి సంవత్సరం శ్రీ రామ నవమి పండుగ వస్తూనే ఉంటుంది. కానీ దాని నిజమైన ప్రాముఖ్యత ఇప్పటివరకు మనకు అర్థం కాలేదు. మీరు రాముడిని  ఒక రూపము గానే గుర్తించారు. కానీ  రాముడు  ఏ ప్రత్యేకమైన రూపానికి పరిమితం కాదు. అందరి హృదయాలలో ప్రతిఫలిస్తున్న ఆత్మయే రాముడు. రాముడు  ఒక సాధారణ వ్యక్తి కాదు. మానవజాతి సంక్షేమం కోసం భూమిపై అవతరించిన దేవుడే రాముడు”...సత్య సాయి స్పీక్స్, వాల్యూమ్ 40   

 "ఈస్టర్  పవిత్ర పండుగను  ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరూ  జరుపుకుంటారు. ఈ సమయంలో, యేసు యొక్క అనుచరులు శిలువపై అయన  త్యాగాన్ని  మూడు రోజుల తరువాత అతని పునరుత్థానమును ఎంతో కృతజ్ఞతతో జ్ఞాపకం చేసుకుంటూ జరుపుకునే పండుగ ఇది "... ది ట్రెజర్ ఆఫ్ లైఫ్, సత్య సాయి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్.  (http://www.sathyasai.org/events/festival/easter-2017)

స్వామి యొక్క ప్రేమపూర్వక అనుగ్రహం ద్వారా. వారి యొక్క మిషన్ సాయి వైబ్రియోనిక్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న రోగులకు చికిత్స నందించడంలో భారీస్థాయిలో గణనీయమైన సంఖ్యతో అద్భుతంగా సాగుతోంది. ఐనప్పటికీ కొన్ని ప్రాంతాలలో  రోగికి అందుబాటులో ప్రాక్టీషనర్ లేకపోవడం గమనించవలసిన విషయం. అటువంటివారి కోసం ఫోన్ లేదా  స్కైప్లో రిమోట్ సంప్రదింపులకు సిద్ధంగా ఉండటానికి మరియు సిద్ధంగా ఉన్నవారికి వైబ్రియానిక్స్ ఒక చక్కని అవకాశాన్ని అందిస్తోంది. మేము అభ్యాసకుల నిమిత్తం రెండు నెట్వర్క్ లను ప్రారంభించాలనుకుంటున్నాము: 

a. తమ దేశ పరిధిలోనే గుర్తించిన పేషంట్లకు తమ సేవలో భాగంగా రెమిడి బాటిళ్ళను పోస్టు చేయడం 

b SVP లు తమయొక్క SRHVP ఉపయోగించి నివారణలు ప్రసారం చేయడం .ఐతే వారు రోగి యొక్క కలర్ ఫోటోను  ప్రింట్ చేసి దానిని ఉపయోగించి బ్రాడ్కాస్టింగ్ చేయవలసిన అవసరం ఎంతయినా ఉంది. అలా సేవచేయడానికిగాను సిద్దంగా ఉన్న అభ్యాసకులు  [email protected] ద్వారా మాకు తెలియజేయండి.

 మన  మిషన్ విజయానికి కారణాలు, చికిత్సలో మనం అనుసరిస్తున్న ఉన్నత ప్రమాణాలు అలాగే మనవద్దకు వచ్చే పేషంట్లందరికీ సాధ్యమైనంత వరకూ సేవ చేయడానికి ప్రయత్నించడం.  దీనిని మరింత సమర్ధవంతంగా నిర్వహించడానికి  అనుగుణంగా, కొత్త AVP లను ప్రవేశపెట్టడం, ప్రస్తుతం ఉన్నవారికి తిరిగి ఆధునిక పద్ధతులలో శిక్షణ నివ్వడం, మరియు నిష్క్రియాత్మకమైన వారిని ఉత్తేజపరచడం చాలా అవసరం. భారత దేశం లో ఎక్కువమంది అభ్యశకులు ఉన్నట్టి మహారాష్ట్ర రాష్ట్రంలో మన భారతీయ అభ్యాసకులు 10355&10001  ప్రేమతో మన AVP మాన్యువల్ ను మరాఠీభాష లోనికి అనువదించారు. ఈ విధంగా అక్కడి నిపుణులకు వారి స్థానిక భాషలో పఠనం మరింత సౌకర్యవంతమైనది గానూ ప్రయోజనకరముగానూ ఉంటుంది. మాన్యువల్ యొక్క ముద్రిత నకలును [email protected] ద్వారా పొందవచ్చు. 

అన్ని విధులు సజావుగా నిర్వహిం చడానికి సంస్థ నిర్మాణమును పది విభాగాలుచేసి ఒక ప్రధాన బృందాన్నిఈ విభాగాలు నిర్వహించడానికి ఏర్పాటుచేయడం జరిగింది. ఈ విభాగాలు: IASVP సభ్యత్వం, డేటాబేస్ నిర్వహణ, టీచింగ్, అడ్మిషన్స్, ప్రమోషన్లు, వార్తాలేఖల తయారీ, అనువాదాలు, పరిశోధన, వెబ్సైట్ ఉత్పత్తి మరియు నిర్వహణ, మరియు సాధారణ పరిపాలన. ఐతే ఈ విభాగాలలో ఒకటి గానీ అంతకంటే ఎక్కువ విభాగాలలో  సేవలందించడానికి మరియు ఎన్ని గంటలు ఈ సేవలో పాల్గొంటారో అనే విషయం 2018 ఏప్రిల్ 7 వ తేదీ నాటికి మన వెబ్సైటు [email protected]  కు ఈమెయిల్ ద్వారా తెలియజేయ వలసిందిగా అభ్యర్థిస్తున్నాము.     

నెలవారీ నివేదికలను మరింత సమర్థవంతంగా మరియు సౌకర్యవంతంగా సమర్పించడానికి అభ్యాసకులు వెబ్ సైట్లోనికి నేరుగా ప్రవేశించి వారి సేవా గంటలను నమోదుచేయడానికి వీలుగా ఏర్పాటుచేయడం జరిగింది. ఈ సౌకర్యాన్ని పొందడానికి [email protected]  కు ఈమెయిల్ పంపడం ద్వారా మీకు  కొన్ని సూచనలు వస్తాయి. వాటిని అనుసరించడం ద్వారా మీ సమాచారం అప్లోడ్ చేయబడుతుంది. అంతేకాకుండా  మీ యొక్క వ్యక్తిగత సరికొత్త సమాచారాన్ని నమోదు చేయడానికి మీ కలర్ ఫోటోను అప్లోడ్ చేయడానికి కూడా దీనిలో అవకాశం కల్పింప బడింది. కనుక ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవలసిందిగా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాము.  

 ఇప్పుడు  VP మరియు పై స్థాయి లో ఉన్నవారందరికీ IASVP లో సభ్యత్వాన్ని పొందడం  తప్పనిసరి చేయబడింది. మీరు సభ్యత్వం కోసం అవసరమైన చర్యలు పూర్తి చేసి సంతకం చేసిన ఫారం పంపిన  తర్వాత, మీరు  ప్రాక్టీసు చేసుకోవడానికి చాలా సహాయకారిగా ఉండే ఒక ID కార్డును అందుకుంటారు. దయచేసి IASVP దరఖాస్తును నేరుగా అభ్యాసకుల వెబ్సైట్లో సమర్పించవచ్చని గమనించండి.

మీ అందరికీ ఆనందకరమైన ఉగాది, రామ నవమి మరియు ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ,

ప్రేమతో స్వామిసేవలో,

మీ జిత్.కె.అగ్గర్వాల్.

దీర్ఘకాలికమైన లింఫో ప్లాస్మా సైటిక్ సోరియాసిస్ 12051...India

నాలుగు సంవత్సరాల వయస్సు నుండి దీర్ఘకాలిక లింఫోప్లాస్మాటిక్ సోరియాసిస్ తో బాధపడుతున్న ఒక 9 ఏళ్ల బాలుడు తన అరచేతులపై మరియు కుడి మడమ మీద గాయాలు కలిగి ఉన్నాడు. దీనికి  అదనముగా  రెoడు గాయాలు వెనుక వీపు వైపు ఒకటి ఎడమకాలి మీద ఒకటి గాయాలు ఉన్నాయి. ఇతనికి వివిధ చర్మ నిపుణుల చేత సిఫారసు చేయబడిన అనేక వైద్య పరీక్షలు కూడా చేసారు. గత ఐదు సంవత్సరాలలో అనేక అల్లోపతిక్ మందులు మరియు ఆయింట్మెంట్ లను కూడా వాడారు.

కానీ ఏమాత్రం  మెరుగుదల లేదు. జూలై 2016 లో, అభ్యాసకుడు బాబుకు క్రింది కాంబో ఇచ్చారు. 

CC10.1 Emergencies + CC12.2 Child tonic + CC12.4 Autoimmune diseases + CC15.1 Mental & Emotional tonic + CC21.10 Psoriasis + CC21.11 Wounds & Abrasions…TDS మరియు ఆలివ్ ఆయిల్ ద్వారా పై పూతకు కూడా ఇవ్వబడింది.

ఈ బాబు  ఒక మారుమూల ప్రదేశంలో నివసిస్తున్నందున, అతను తరచుగా అభ్యాసకుడిని సందర్శించలేకపోయేవాడు. అందుచేత మూడు నెలల తరువాత, అతను సందర్శించినప్పుడు  50% అభివృద్ధిని గమనించారు. బాలుడికి అదే రెమిడి కొనసాగించవలసిందిగా సూచించబడగా  మూడునెలల తర్వాత  తన తదుపరి సందర్శనలో, 70% మెరుగుదల కనిపించింది. చికిత్సను మరికొంత కాలము కొనసాగించగా ఆ  సంవత్సరం ముగింపులో, అరచేతులు మరియు మడమ మీద 100% మెరుగుదల కనిపించింది (చిత్రాలు చూడండి). వెనుక మరియు కాళ్ళపై ఉన్న గాయాలు కూడా తగ్గిపోయాయి. రెండు నెలల పాటు మోతాదు BD కి తగ్గించబడి, తరువాత నాలుగు నెలలపాటు OD కి తగ్గించడం జరిగింది. వైబ్రియోనిక్స్ చికిత్స చేస్తున్నప్పుడు బాబు ఏ విధమైన ఇతర ఔషధాలను తీసుకోలేదు. బాలుడి తల్లిదండ్రులు ఈ అధ్భుతానికి ఎంతో ఆనందించి అనేకమంది పేషంట్లను ప్రాక్టీషనర్ వద్దకు పంపడం జరిగింది.

చెవిలో హూరు వలన వచ్చే తలదిమ్ము 12051...India

44 - సంవత్సరాల మహిళ చెవిలో హోరు వలన వచ్చే తలదిమ్ముతో  ( పేషంటు యొక్క అలోపతి డాక్టర్ చేత సూచిoచబడింది )  2 సంవత్సరాలుగా బాధపడుతున్నారు. గత రెండున్నర నెలలుగా ఆమెకు తలతిరుగుడు తో పాటు వాంతి చేసుకున్నప్పుడు రక్తపు చుక్కలు కూడా కనబడుతున్నాయి. ఈమె తలదిమ్ముకు అలోపతి మందులు తీసుకున్నారు కానీ ఏమాత్రం ఫలితం ఇవ్వకపోవడంతో నైరాశ్యంలోకి వెళ్ళిపోసాగారు.

ఈమెకు  2016 జూలై నెలలో క్రింది రెమిడి ఇవ్వడం జరిగింది:

CC5.2 Deafness + CC5.3 Meniere’s disease + CC10.1 Emergencies + CC15.1 Mental & Emotional tonic + CC18.7 Vertigo…TDS నీటితో

వారం రోజులలోనే పేషంటు కు తలదిమ్ము నుండి 100% ఉపశమనం కలుగగా చెవిహోరు నుండి 80% ఉపశమనం కలిగింది. నెల రోజులలోనే ఆమెకు పూర్తిగా తగ్గిపోయింది కానీ రెమిడి ని TDS. కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. మూడునెలల తర్వాత మోతాదు OD కి తగ్గించి నెలరోజులు అనంతరం OW తీసుకోవడం ప్రారంభించారు. ఐతే ముందు జాగ్రత్త కోసం ఇప్పటికీ అనగా  ఫిబ్రవరి  2018 నాటికి కూడా కొనసాగిస్తూనే ఉన్నారు. వైబ్రోతో తను పొందిన చికిత్స నుండి స్పూర్తిని పొంది అందరికీ ఈ మందులు వాడవలసినదిగా సూచిస్తున్నారు. 

 

సోరియాసిస్, కీళ్ళనొప్పులు, చెవిలో హొరు 12051...India

63-సంవత్సరాల వయసుగల వ్యక్తి గత 10 సంవత్సరాలుగా సోరియాసిస్ తోనూ గత సంవత్సరంగా కీళ్ళనొప్పులతోను బాధపడుతున్నారు. వీరికి చేతిలో పుండ్లు, మరియు జాయింట్ల లో నొప్పులు కూడా ఉన్నాయి. ఇంతేకాకుండా ఒళ్లంతా దురద కూడా ఉన్నది. వీరు కీళ్ళనొప్పులు నిమిత్తం అలోపతి మందులు  (మిథోట్రెగ్జేట్ ) కూడా తీసుకుంటున్నారు.

2015 నవంబర్ లో వీరికి క్రింది రెమిడి ఇవ్వబడింది: 

 #1. CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC12.4 Autoimmune diseases + CC15.1 Mental & Emotional tonic + CC20.3 Arthritis + CC21.10 Psoriasis…TDS

నెల రోజుల పాటు రెమిడి తీసుకున్న తర్వాత పరిస్థితి కాస్త మెరుగుపడింది కానీ పేషంటుకు కుడి చెవిలో హోరు ప్రారంభ మయ్యింది. పేషంటు ఒక  ENT నిపుణుడికి చూపించగా కుడి చెవి 70% వినికిడిని కోల్పోయినట్లు తెలిపారు. అందుచేత ప్రాక్టీషనర్ క్రింది రెమిడి ని అదనంగా ఇవ్వడం జరిగింది: 

#2. CC5.2 Deafness + CC5.3 Meniere’s disease + CC18.5 Neuralgia…TDS

 #1 మరియు  #2 తీసుకున్న నాలుగు నెలలలోనే సోరియాసిస్ మరియు కీళ్ళనొప్పుల నుండి 100% ఉపశమనం పొందినట్లు అలాగే చెవిహోరు నుండి 40% ఉపశమనం పొందినట్లు తెలిపారు. మెడికల్ రిపోర్టులో కీళ్ళ నొప్పి జాడ కూడా కానరాలేదు. కనుక వీరి డాక్టరు మీతోట్రెక్జేట్ ను 15mg నుండి 5mgకి తగ్గించారు. ప్రాక్టీషనర్   #1 యొక్క మోతాదు OD గానూ  #2 ను TDS గానూ తగ్గించడం జరిగింది. 

6 నెలల తర్వాత పేషంటు చెవిహొరు నుండి పూర్తిగా కోలుకున్నారు కనుక   #2 ను OD కి తగ్గించడం జరిగింది.  2016 అక్టోబర్ లో పేషంటు పరీక్ష చేయించుకున్నప్పుడు వీరికి వినికిడి శాతం అద్భుతంగా మెరుగయినట్లు గతంలో ఉన్న70% నుండి 20% నకు చేరినట్లు ఫలితాలు తెలిపాయి. ఈ పురోగతి చూసి డాక్టర్ చాలా ఆశ్చర్యపడ్డారు. కీళ్ళ నొప్పులకు సంబంధించిన రిపోర్టులు కూడా నార్మల్ గా ఉన్నట్లే చూపిస్తున్నాయి. [ప్రస్తుతం వీరు #1 మరియు #2 లను ODగా తీసుకుంటున్నారు].

విట్రస్ ఫ్లోటర్స్ ( మెరిసే కంటి మచ్చలు ) మరియు గ్లుకోమా 10608...India

   2017 ఫిబ్రవరి17  న, 65 ఏళ్ల మహిళ  తనకు 2016 సెప్టెంబర్ 3 నుండి  కంటిలో మెరుపులు మరియు గ్లకోమా వ్యాధుల చికిత్స కోసం ప్రాక్టీషనర్ ను సంప్రదించారు. ఆమె  కుడి మరియు ఎడమ కళ్ళల్లో  మాములుగా ఉండవలసిన పీడనము 12 to 22mm Hg  కన్నా ఎక్కువగా  28 మరియు 34  ఉన్నాయి. వైద్యుడు దీనికి లేజర్ శస్త్రచికిత్సయే శాశ్వత నివారణ అని  సలహా ఇచ్చారు. కానీ కనీసం శస్త్రచికిత్స ఆలోచన కూడా భరింపలేని స్థితిలో భయపడి పోయి అశాంతికి గురైన పేషంటుకు వైద్యుడు ప్రస్తుతం కంటి వత్తిడి తగ్గడానికి కంటి చుక్కలను వ్రాసి ఇచ్చారు. 

కంటి చుక్కల మందులు ఖరీదైనప్పటికీ, కంటి ఆపరేషన్ బాధ తప్పిందనే ఆనందంతో పేషంటు మందులు వాడసాగారు. కంటి చుక్కలను ఉపయోగించిన  ఐదు నెలల తర్వాత, మరలా పరీక్షలు నిర్వహించగా కంటి ఒత్తిడి అలాగే హెచ్చు స్థాయిలోనే  ఉందని (18 మరియు 25) కనుక ఎంత తొందరగా వీలయితే అంత తొందరగా లేజర్ శస్త్రచికిత్స కు సిద్ధం కావాలని వైద్యుడు సూచించారు. ఐతే ఒక స్నేహితుని సూచన పైన వైబ్రో చికిత్స తీసుకొనడానికి పేషంటు నిర్ణయించుకున్నారు.

పేషంటు కంటి చుక్కలను వేసుకోవడం కూడా మానివేసి వైబ్రో అభ్యాసకుడు ఇచ్చిన క్రింది రెమిడి వేసుకోవడం ప్రారంభించారు:

#1. CC3.7 Circulation + CC7.5 Glaucoma + CC11.3 Headache + CC15.1 Mental & Emotional tonic...6TD

#2. CC7.5 Glaucoma...6TD నీటిలో కలుపుకొని కంటికి చుక్కల మందు వలె వాడాలి

నెల రోజుల తర్వాత పరీక్షలు నిర్వహించగా డాక్టర్ ఊహకు కూడా అందని విధంగా అద్భుతమైన మెరుగుదల కనిపించింది. కంటి పీడనము వరుసగా 15 మరియు 16కు తగ్గిపోయింది. కనుక శస్త్ర చికిత్స అవసరం లేదని వైద్యుడు చెప్పారు. అంతేకాక పేషంటు తన ఆహారము మరియు జీవనవిధానము అలవాట్లు ఏమయినా మార్చుకొనడం వల్ల అంత త్వరగా మార్పు సంభవించిందా అని ఆరా చేసారు. పేషంటు తను తీసుకుంటున్న వైద్య చికిత్స గురించి వివరాలు ఏమీ తెలపకుండా అలోపతి మందులు ఆపివేసి వైబ్రో రెమిడిలు కొనసాగించారు. #1 మరియు  #2 ల యొక్క మోతాదు 6TD నుండి  TDSకు తగ్గించడం జరిగింది. ప్రస్తుతం పేషంటుకు వ్యాధి లక్షణాలన్నీ పూర్తిగా అదృశ్యం ఐనప్పటికీ ముందు జాగ్రత్త కోసం రెమిడిలు కొనసాగిస్తూనే ఉన్నారు.

ప్రాక్టీషనర్ వ్యాఖ్యలు:
పేషంటు త్వరగా కోలుకొనడానికి కారణం ఆమె క్రమశిక్షణతో కూడిన ఔషద సేవనం క్రమం తప్పకుండా మందులు వాడడం
.

క్యాన్సర్ నొప్పి 03533...UK

అభ్యాసకురాలు అనారోగ్యంతో అంతిమ దశలో ఉన్న తన 82 సంవత్సరాల  ఆంటీని  9 నవంబరు 2015 న సందర్శించారు. రెండు సంవత్సరాల క్రితంనుండి ఆంటీ రొమ్ము క్యాన్సర్తో బాధపడుతున్నట్లు తెలిసింది; ఏదేమైనా, ఆమె కుటుంబం ఆమె వయస్సు మరియు బలహీనత కారణంగా ఏ వైద్య సహకారాన్ని కోరుకోలేదు. అక్టోబర్ మధ్యకాలంలో, అధిక నొప్పి కారణంగా, రోగిని ఆసుపత్రిలో చేర్చారు, అక్కడ ఆమెకు మత్తుమందు ఆధారిత నొప్పినివారిణిని ఇచ్చారు. ఇది ఆమె పరిస్థితిని మరింత విషమింప జేయడంతో ఆమె ఒక స్ట్రెచర్లో తిరిగి ఇంటికి తీసుకురాబడింది. ఆసుపత్రికి వెళ్లడానికి ముందు ఆమె సంపూర్ణంగా తెలివితో ఉన్నారు. ఇప్పుడు ఆమె అపస్మారక స్థితి లోనికి చేరుకొని కళ్ళు తెరవడమే కష్టమైపోయింది. ఆమె మంచానికే పరిమిత మైపోయి, మాట లేక అవిశ్రాంతంగ కనీసం పక్కకి తిరగడం కూడా లేకుండా నొప్పితో మూలుగుతూ ఏమీ చెప్పలేని పరిస్థితిలో ఉంది. కనీసం ద్రవపదార్ధాలు కూడా త్రాగలేని పరిస్థితి. ఈమె కోసం కుటుంబమంతా జాగరణ చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. కనీసం నొప్పి తెలియకుండా ఉండటానికి కూడా ఏమీ ఇవ్వలేని పరిస్థితి. 

ఈ స్థితిలో ప్రాక్టీషనర్  క్రింది కాంబోతో ఆమెకు చికిత్సప్రారంభించారు:

CC2.1 Cancers – all + CC2.2 Cancer pain + CC15.1 Mental & Emotional tonic + CC18.1 Brain disabilities...TDS

పేషంటు మరే ఇతర నొప్పి నివారణలను తీసుకొనే పరిస్థతి లేదు కనుక కేవలం వైబ్రో మందులనే ఇవ్వడం ప్రారంభించారు. పది రోజుల తరువాత, ఆమె కుటుంబం అభ్యాసకురాలికి రోగికి నొప్పి తగ్గిపోయిందని తెలియచేసింది. ఆకలివేసినప్పుడు మెలుకువ వచ్చి కొంచెం ఆహారం తీసుకొని తర్వాత నిద్రపోయేదట. వైద్యులు ఆమె నొప్పి నుండి 100% నివారణ పొందినందుకు చాలా ఆశ్చర్యపడ్డారు. ఆమె రెండు నెలల తరువాత 2016 జనవరి 15, న  శాంతియుతంగా తనువు చాలించే వరకూ వైబ్రో రెమిడిలను కొనసాగింది. పేషంటు అంతిమ క్షణాలలో బాధ లేకుండా ప్రశాంతంగా తుది శ్వాశ వీడడానికి అవకాశం కల్పించిన వైబ్రియొనిక్స్ కు   కుటుంబమంతా ఎంతో  కృతజ్ఞతలు తెలుపుకున్నారు.

పెద్ద ప్రేగులో వ్రణము 02802...UK

అనేక సంవత్సరాలపాటు పెద్దప్రేగులో వ్రణముతో బాధపడుతున్న 55 ఏళ్ల మహిళ, సెప్టెంబరు 6, 2014 న ప్రాక్టీషనర్ ను  సంప్రదించారు. వీరికి విరామం లేని నీళ్ళ విరోచనాల వ్యాధి మరియు కడుపు నొప్పి  కూడా  ఉన్నాయి. ఆమె బోవేల్స్/ప్రేవులు  రోజుకు 4 నుండి 8 సార్లు తెరవబడతాయి. జీర్ణాశయ నిపుణుడి పర్యవేక్షణలో ఉన్న ఈ పేషంటుకు  ప్రతి సంవత్సరం అనేక స్టెరాయిడ్స్ తో పాటుగా పెంటాసా 500 mg ని BD (IBS యొక్క స్వల్ప లేదా ఒక మోస్తరు గా వచ్చే నొప్పిని తగ్గించే మాత్రలు) గా సూచించారు. 

పేషంటుకు క్రింది కాంబో ఇవ్వడం  జరిగింది: 

#1. CC4.1 Digestion tonic + CC4.2 Liver & Gallbladder tonic + CC4.6 Diarrhoea + CC4.10 Indigestion + CC15.1 Mental & Emotional tonic…TDS 

రెమిడి తో పాటుగా పేషంటు తన అలోపతి మందులు కొనసాగించారు.  2015 మే  9 నాటికి పరిస్థితిలో మార్పు లేకపోయే సరికి ప్రాక్టీషనర్ రెమిడి ని క్రింది విధంగా మార్చారు: 

#2.  CC10.1 Emergencies + #1…TDS 

పేషంటు క్రమం తప్పకుండా రెమిడి వాడినప్పటికీ ఏమాత్రం మార్పు కలగక పోవడంతో  1 అక్టోబర్ 2015 న ప్రాక్టీషనర్ క్రింది రెమిడి తో చికిత్స ప్రారంభించారు:

#3. Stool nosode prepared at 1M potency...TDS

రెమిడి ప్రారంభించిన రెండు వారాలలోనే 50% మరియు ఆరు వారాలలోనే 80% ఉపశమనం కలిగింది. పేషంటు పరిస్థితిని పర్యవేక్షిస్తున్న జీర్ణాశయ నిపుణుడు,మొదట ఈమె రోగ లక్షణాల నివారణకు అజాతియోప్రిన్ Azathioprine (క్రోన్ వ్యాధి నివారణకు వాడే ఒక మందు) ఇద్దామనుకున్నా పేషంటు పరిస్థితి మెరుగ్గా ఉన్నందున దానిని ప్రారంభించకూడదని నిర్ణయించుకున్నాడు. తొమ్మిది వారాల తరువాత ఉపశమనం కలగడంతో అలోపతి మందుల అవసరమే లేకుండా పేషంటు  భారతదేశానికి ప్రయాణించగలిగారు. ఫిబ్రవరి 2016లో సమీక్షించినప్పుడు ఆమె తన పెద్దప్రేగు వ్రణము పూర్తి నియంత్రణలో ఉండడంతో #3 మినహాయించి మరే ఇతర మందులు తీసుకోవడం నిలిపి వేసారు. తనకు బాగా మెరుగవడం వలన ఆమె మోతాదును OD కి తగ్గించి,జూన్ 2016లో పూర్తిగా నిలిపివేసారు. ఆగష్టు 2016లో ఆమె పెద్దప్రేగు వ్రణము స్వల్పంగా పునరావృత మైనట్లు గమనించి, #3 పునఃప్రారంభించగానే మరలా మెరుగుదల కనిపించింది. కనుక రెమిడి ఆపడానికి ముందు #3 OD గా ఎక్కువ సమయం కొనసాగించాలని సూచింపబడడంతో పేషంటు అలాగే చేసారు. 2018 జనవరి లో ప్రాక్టీషనర్ సమీక్ష లో పేషంటు వైబ్రో మందులను తీసుకోవడం లేదని ఆమె పెద్దప్రేగు వ్రణము ఏమాత్రం పునరావృతం కాకుండా ఆమె ఆనందంగా ఉన్నట్లు తెలిసింది.

హైపో థైరాయిడిజం, దీర్ఘకాలిక దగ్గు, మరియు అస్తమా 03542...UK

26 జూలై 2016, తేదీన 60 సంవత్సరాల వయసుగల మహిళ తన ఆరోగ్య సమస్యల గురించి ప్రాక్టీషనర్ ను సంప్రదించారు. 40సంవత్సరాల క్రితం మొదలయిన అస్తమా వ్యాధి ఆ తరువాత తగ్గిపోయినప్పటికీ ఇటీవలే తిరిగి ప్రారంభమయ్యింది. పరిస్థితి రానురానూ దిగజారుతూ గొంతులో గురకను అరికట్టడానికి ఈమె రోజుకు రెండుసార్లు ఇన్హేలర్ లేదా నెబ్యులైజర్ ఉపయోగించ వలసిన పరిస్థితి ఏర్పడింది. గత కొన్ని నెలలుగా ఈమెకు దగ్గు కూడా వస్తోంది. అలోపతి మందులు వాడుతున్నప్పటికీ ఫలితం కలుగలేదు. ఈ దగ్గు ఆమె అస్తమాను మరింత పెరిగేలా చేయడంతో డాక్టరు కూడా దిగజారుతున్న ఆమె పరిస్థితి చూసి ఆందోళన  చెందసాగారు. ఈమె గత కొన్ని సంవత్సరాలుగా హైపో థైరాయిడ్ కోసం  థైరాక్జిన్( thyroxine ) రోజుకు 100mg వాడసాగారు. అంతేకాక  రోజంతా  అలసటకు  గురైనట్లుగా ఉండడం వలన డాక్టర్ పర్యవేక్షణలోనే ఉండవలసి వస్తోంది. ఈమెకు లో బి.పి. కూడా ఉంది కానీ అలోపతి మందుల కారణంగా అది కంట్రోల్ లోనే ఉంది. .

ఈమెకు క్రింది రెమిడిలు  ఇవ్వబడినవి:

హైపో థైరాయిడిజం కొరకు:
#1. CC6.2 Hypothyroidism + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic…TDS

దీర్ఘకాలిక దగ్గు మరియు అస్తమా కొరకు:
#2. CC9.2 Infections acute + CC19.3 Chest infections chronic + CC19.6 Cough chronic…TDS

నాలుగు వారాల తరువాత, తాను దగ్గు నుండి పూర్తిగా కోలుకున్నట్లు మరియు ఈ కాలంలో ఎట్టి అల్లోపతి మందులను తీసుకోలేదని ఆమె తెలిపారు. అస్తమా నుండి కూడా ఆమె 80%  ఉపశమనం కలగడం వలన ఈ కాలంలో ఆమె ఒకసారి కూడా ఇన్హేలర్ ను  ఉపయోగించుకోవాల్సిన అవసరం రాలేదు. మరొక రెండు వారాలలో, ఆమె థైరాయిడ్ ఫంక్షన్ గణనీయంగా మెరుగుపడడం వలన ఆమె తీసుకొనే థైరాక్సిన్ మోతాదును డాక్టర్ రోజుకు 50mg కి  తగ్గించారు. మొత్తంగా, వైబ్రో మందుల కారణంగా ఆమె చాలా ఆరోగ్యంగా మరియు ప్రశాంతముగా ఉన్నట్లు భావించారు. ఒక నెల తరువాత, ఊపిరితిత్తుల పనితీరుకు సంబంధించిన మరియు రక్త పరీక్షల ఫలితాల ప్రకారము ఆమె ఊపిరితిత్తులలో గణనీయమైన మెరుగుదల కనబడడం చూసిన  డాక్టర్ ఆశ్చర్యానికి అంతులేదు. 2016 డిసెంబరు 10, నాటికి  ఆమె తన ఆస్త్మా, దగ్గు మరియు హైపోథైరాయిడిజం నుంచి 100% ఉపశమనము పొందినట్లు తెలిపారు. వైబ్రియోనిక్స్ రెమిడిలు ప్రారంభించిననాటి నుండి ఆమె తన ఇన్హేలర్ను ఉపయోగించవలసిన అవసరం రాకపోయేసరికి  డాక్టర్ ఆమె ప్రిస్క్రిప్షన్ నుండి దానిని తొలగించారు. అందువలన పేషంటు #2 రెండు వారాల వరకూ BD గానూ, OD గా మరో 2 వారాలు, OW గా నెల రోజులు తీసుకోని ఆపివేశారు.  ఆమె హైపోథైరాయిడ్ కోసం ఏ అలోపతి మందులు అవసరం రాలేదు. అయితే, అభ్యాసకుడు ఆమె #1ను కొనసాగించమని సలహా ఇచ్చారు. ఐతే ఈ సమయంలో పేషంటు  కొన్ని వారాలు  విదేశాలకు వెళ్లవలసిన అవసరం ఏర్పడింది. దురదృష్టవశాత్తు, ఆమె వైబ్రో రెమిడిలను వెంట తీసుకు వెళ్ళలేదు. ఆమె తిరిగి వచ్చిన తరువాత, మాములుగా చేయించుకొనే రక్త పరీక్ష ఫలితాన్ని చూసి డాక్టరు  ముందుజాగ్రత్త కోసం థైరాక్సిన్  50mg మందును మళ్లీ ప్రవేశపెట్టారు. ఫలితంగా, ప్రాక్టీషనర్ సూచన మేరకు #1ను ఫిబ్రవరి 2017 నుండి TDS గా తిరిగి ప్రారంభించబడింది. జూలైలో, ఆమె డాక్టర్ రోజువారీ థైరాక్సిన్ మోతాదును 25mgకి తగ్గించారు. నవంబర్ నుండి ఆమె #1 తీసుకోనప్పటికీ ఆమెకు ఎంతో ఆరోగ్యంగా ఉన్నట్లు అనిపించింది. జనవరి 2018 నాటికి, ఆమెకు ఆస్తమా కానీ  దగ్గుకానీ  తిరిగి రాలేదు.

కీళ్ళ నొప్పులు 01448...Germany

64 ఏళ్ల వ్యక్తి 35 సంవత్సరాలుగా  రుమటాయిడ్ ఆర్థరైటిస్ తో బాధపడుతున్నారు. ఇది తన వేళ్లు మరియు మణికట్టు కీళ్లలో వాపుతో ప్రారంభమై సంవత్సరాలు గడిచేకొద్దీ కాళ్ళకు, వీపుకు  వ్యాపించింది. వీరికి తన వేళ్లు, మణికట్టు, చేతులు, కాళ్ళు, మోకాలు మరియు వెనుక అన్ని కీళ్ళలో తీవ్రమైన నొప్పి మరియు కదలికలేక బిగుసుకుపోవడంతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాలం గడుస్తున్న కొద్దీ  నొప్పి బాగా పెరిగిపోయి తన సాధారణ దినచర్యను కూడా నిర్వహించలేకపోయే పరిస్థితి ఏర్పడింది. ఉదయపు సమయాలలో ఈ  లక్షణాలు మరీ  అధ్వాన్నంగా ఉంటున్నాయి. తను  చేతుల్లో ఏదైనా పట్టుకోవడం కూడా సాధ్యమయ్యేది కాదు. దీనికి తోడు బలహీనంత కూడా ఏర్పడింది. నెమ్మదిగా తన వెన్నెముక దాదాపు 60° వంగిపోవడం జరిగింది. వ్యాధి యొక్క తీవ్రత  వీరి  కదలికలను శాశించడంతో  ఇంటికే  పరిమితమై ఉండేవారు. వీరు దశాబ్దాలుగా ప్రఖ్యాత కీళ్ళ నిపుణులచే సూచించిన అలోపతి మందులను ప్రయత్నించారు. వీరు గత 20 సంవత్సరాలుగా నొప్పి నిరోధక మందు డైక్లోఫినాక్  50mg ని BDగా తీసుకుంటూ ఉన్నారు. ఆ తరువాత ఇది అసేక్లోఫెనాక్ 100mg OD గా మార్చబడింది. దీనికారణంగా కడుపులో సమస్యలు ప్రారంభం కావడంతో వీరు ఓమేప్రజోల్ 40mg BDను తీసుకోవడం ప్రారంభించారు. ఇట్టి నిరాశవహ పరిస్థితిలో వీరు  భారతదేశం యొక్క వివిధ ప్రాంతాలకు వెళ్లి అనేక ప్రత్యామ్నాయ చికిత్సలు ప్రయత్నించారు కానీ ఏమీ ప్రయోజనం కానరాలేదు.  కీళ్ళ వైద్యులు మరింత నష్టం కలగకుండా ఉండడానికి గానూ శస్త్రచికిత్సద్వారా మోకాలి కీళ్ళను   "ఫ్యూజ్ ” చేయాల్సి వచ్చింది. దీనితో మోకాళ్ళు వంచే పరిస్థితి పూర్తిగా పోయి వీరి కదలికలు  మరింత తగ్గిపోయాయి. వీరు స్టెరాయిడ్ కాని నొప్పి నిరోధక ఔషధము (NSAID) సహాయంతో, ఇంటి లోపల మాత్రమే అనగా రెస్ట్ రూముకు వెళ్ళడం వంటివి సపోర్టు ద్వారా కనీస కార్యకలాపాలు నిర్వహించసాగారు. ఐతే సంవత్సరాలు గడిచే కొద్దీ NSAIDల యొక్క దుష్ప్రభావాలు పెరిగిపోయి రక్తపోటు,  అరిథ్మియా మరియు కాళ్ళలో వాపు వంటి సమస్యలకు కారణమయ్యాయి, దానికోసం వీరి కార్డియాలజిస్ట్ రామిప్రిల్ల్ 5mg BD ను సూచించారు. మొదటి ఔషధము యొక్క దుష్ప్రభావాలు ఎదుర్కొనేందుకు రెండవ ఔషధాన్ని తీసుకునే ఈ వలయాకార విధానము రోగిని మరింత ఒత్తిడి లోనికి నెట్టింది. ఇదే సమయంలో చేయించుకున్న రక్త పరీక్ష రుమటాయిడ్ కారకమును పాజిటివ్ గా చూపించింది. X- రే రిపోర్టు కూడా ఎముకలకు చాలా నష్టం సంభవించినట్లు  ధ్రువీకరించాయి.

ఇటువంటి పరిస్థితిలో 15 డిసెంబర్ 2015 న క్రింది రెమిడి పేషంటుకు ఇవ్వబడింది:
CC10.1 Emergencies + CC15.1 Mental & Emotional tonic + CC20.1 SMJ tonic + CC20.2 SMJ pain + CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue + CC20.5 Spine + CC20.6 Osteoporosis + CC20.7 Fractures…QDS. 

నాలుగు వారాల తరువాత వ్యాధి లక్షణాలలో 30% మెరుగుదల కనిపించింది అందువలన పేషంటు తన నొప్పినివారణుల  మోతాదును తగ్గించారు. ఆరునెలల తరువాత, వీరికి 40% ఉపశమనం కలగడంతో NSAID నొప్పినివారణి మరియు ఓమెప్రజోల్ ను పూర్తిగా నిలిపివేసి, కేవలం వైబ్రో రెమిడిలను మాత్రమే తీసుకోసాగారు. తొమ్మిది నెలల తర్వాత, అభివృద్ధి 50% కు పెరిగింది. ఒక సంవత్సరం వైబ్రోరెమిడిలను వాడిన తర్వాత, వీరికి దాదాపు 80% ఉపశమనము లభించింది. 18 నెలల తర్వాత అనగా 2017 జూన్ నాటికి దాదాపు 90 శాతం ఉపశమనం కలిగింది. 2017 నవంబర్ నాటికి వీరికి రుమటాయిడ్ ఆర్థరైటిస్ కి సంబంధించి వాపు, నొప్పి, గట్టిదనము వంటి లక్షణాలు 100% అదృశ్యమయ్యాయి. సూచించిన విధంగానే పేషంటు వైబ్రో రెమిడిలను క్రమంగా కొనసాగించసాగారు.

వీరికి తన మోకాళ్ళు ఫ్యూజ్ చేయడం వలన ఎల్లప్పుడూ ఊతకర్రలు అవసరము తప్పనిసరైనప్పటికీ   తీవ్రమైన దుష్ప్రభావాలుతో కూడిన ఖరీదైన మందులను తీసుకోకుండా ఇంటి లోపల తన కార్యకలాపాలు కొనసాగించగలుగు తున్నందుకు పేషంటు తనకు చాలా ఆనందంగా ఉంది అని తెలిపారు. అలాగే డిసెంబరు 2017 నుండి వైబ్రో రెమిడిలు ప్రారంభించినందున త్వరలోనే  గుండెలో సమస్యల నిమిత్తం వాడుతున్న రామిప్రిల్ల్ కూడా  ఆపేయాలని వీరు భావిస్తున్నారు.  

సంపాదకుని వ్యాఖ్య:
ప్రాక్టీషనర్ జర్మనీ లోనూ పేషంటు ఇండియా లోనూ ఉండడంతో ఫోన్ ద్వారా సంప్రదింపులు జరిపి మెయిల్ ద్వారా రెమిడిలు పంపడం జరిగింది
.

 

మెడ మరియు భుజాల నొప్పి 11587...India

6 నెలల క్రితం 48-సంవత్సరాల మహిళ ప్రమాదవశాత్తూ రిఫ్రిజిరేటర్ను గుద్దుకొనడం వలన క్రిందపడి ఆమె మెడకు గాయం అయ్యింది. ఆమె మెడ, భుజాలు విపరీతంగా నొప్పి పుట్టడంతో పాటు ఈ నొప్పి క్రమంగా వీపు క్రిందికి కూడా చేరింది. మెడికల్ రిపోర్ట్  లో వీపు మరియు నడుముల వద్ద ఎముకల అమరిక, ఎత్తు, సాంద్రత అంతా సరిగానే ఉంది. ఐతే C4-C5 మరియు C5-C6 డిస్కుల అమరికలో సాధారణంగా ఉండవలసిన ఖాళీ కన్నా కొంచం తగ్గుదల, ఏర్పడింది. అలాగే వీటి మధ్య ఉండే మెత్తని కణాలు దెబ్బతిన్నట్లు గానీ వాపుగానీ ఉన్న దాఖలా కూడా ఏమీలేదు. ఈమె సాధారణ నొప్పి నివారణ గోళీలు తప్ప ఏమీ వేసుకోలేదు  దానివలన  ఫలితం కూడా ఏమాత్రం కలగలేదు. 28 జూలై  2017,న ప్రాక్టీషనర్ ను కలిసే సమయానికి ఈమె విపరీతమైన నొప్పితో బాధపడుతూ సాధారణ గృహకృత్యాలు కూడా చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. 

ఈమెకు క్రింది రెమిడి ఇవ్వబడింది:
CC3.7 Circulation + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC18.5 Neuralgia CC20.5 Spine + CC20.7 Fractures…6TD

కేవలం రెండు వారాలలోనే అనగా 6 ఆగస్టు 2017, నాటికి ఆమెకు మెడ, భుజాలు, మరియు వెన్నుకు సంబంధించి 60% ఉపశమనం కలిగింది. అందువలన మోతాదును TDS కు తగ్గించడం జరిగింది. మరొక వారం తరువాత నొప్పి విషయంలో మరొక 25% ఉపశమనం కనిపించింది. వైబ్రో మందులు ప్రారంభించిన నెల రోజులలోనే ఆమె పూర్తిగా కోలుకొని తన గృహకృత్యాలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. మరొక రెండు వారాల వరకూ మోతాదును క్రమంగా OW కి తగ్గించడం జరిగింది. పేషంటు ఈ మోతాదును మెయింటెనెన్స్ మోతాదుగా కొనసాగించారు.19 జనవరి 2018, నాటికి నొప్పి పునరావృతం కాక పోవడం వలన ఆమె ఆనందంగా ఉన్నారు.

 

వారికోజ్ వీన్స్ (సిరుల ఉబ్బు) 03552...Qatar

44 ఏళ్ల అభ్యాసకుడు గత 5 సంవత్సరాలుగా నరాల ఉబ్బుతో బాధపడుతున్నారు. రెండు కాళ్లలో ఉబ్బిన సిరలు కనిపిస్తున్నప్పటికీ ఎడమ కాలులో మరింత ప్రస్పుటంగా కనిపిస్తున్నాయి. అతను కొన్ని నిమిషాలు జాగింగ్ చేసినా లేదా వేగంగా నడిచినా తీవ్రమైన నొప్పి వస్తోంది. దీనికోసం వీరు ఏ విధమైన ఇతర చికిత్సలు తీసుకోలేదు.

2016 ఆగస్టు 13న, పేషంటుకు ఈ క్రింది రెమిడి ఇవ్వబడింది:

CC3.5 Arteriosclerosis + CC3.7 Circulation + CC15.1 Mental & Emotional tonic + CC18.5 Neuralgia…TDS

రెమిడి ప్రారంభించిన మరుసటి రోజు అతని ఛాతీ యొక్క ఎడమ వైపు చర్మము పైన ఎర్రని దద్దుర్ల రూపంలో పుల్లౌట్   కనిపించింది. ఏ చికిత్స లేకుండా మూడు రోజుల తరువాత ఇది అదృశ్యమయ్యింది. రెండు వారాల తరువాత కాలి నొప్పి 25% తగ్గింది, అయితే రెండు కాళ్లపై ఉబ్బులు క్రమంగా తగ్గసాగాయి. మరొక రెండు వారాల తరువాత అనగా 10 సెప్టెంబరు 2016న  రెండు కాళ్ళలో నొప్పి పూర్తిగా అదృశ్యమయ్యింది; కుడి కాలులోని ఉబ్బు కూడా గణనీయంగా తగ్గింది. ఇంకొక  రెండు  వారాల తరువాత, కుడి కాలులోని అనారోగ్యపు బొబ్బలు పూర్తిగా అదృశ్యమయ్యాయి మరియు ఎడమ కాల్లో ఉన్నఉబ్బు తగ్గడం ప్రారంభమయ్యింది. ఈ మోతాదు రెండు వారాలు BD గా మరియు మరో రెండు వారాలపాటు OD గా తగ్గించబడింది. 2016 అక్టోబరు మధ్యకాలంలో,  ఎడమ కాలు మీద సిరల ఉబ్బుకు సంబంధించిన చర్యాశీలత ఇంకా కనిపిస్తున్నప్పటికీ, అభ్యాసకునకు దీనివలన అసౌకర్యం ఏమాత్రం కలగడం లేదు. ఇవి కేవలం ఉపరితలం మీద మాత్రమే ఉన్నందున తగిన సమయంలో వాటంతట అవే అదృశ్యమవుతాయని భావించారు. ప్రాక్టీషనర్ రెమిడి తీసుకోవడం నిలిపివేసినప్పటికీ  ఏ ఇబ్బంది లేకుండా అంతా సవ్యంగా ఉంది.

మూలశంక మరియు మలబద్దకము 11589...India

29 జూలై 2017, తేదీన 44-సంవత్సరాల వయసు గల వ్యక్తి  నాలుగు నెలలుగా మూలశంక మరియు తీవ్ర  మలబద్దకముతో ప్రాక్టీషనర్ ను సంప్రదించారు. గత 5 రోజులుగా క్రింద కూర్చోవడం చాలా కష్టతరంగా ఉండడంతో పాటు అతని మలంలో రక్తం కూడా పడుతున్నట్లు గమనించారు.ప్రాక్టీషనర్ ను కలిసే నాటికి రెండు రోజుల ముందునుండీ మలవిసర్జన లేక చాలా అసౌకర్యంగా ఉన్నారు.

వీరికి క్రింది రెమిడి ఇవ్వబడింది:

CC4.4 Constipation + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic...రెండు గంటల వరకూ అనంతరం 6TD

After 2 hours, the patient could pass the stool; there was no blood but it was painful. After three days, dosage was reduced to TDS as the patient was now passing stool without pain. Over the next  two months, the dosage was tapered down to OD and then to maintenance dosage of OW. As per last update in February 2018, the patient has regular bowel movement without any pain and he has chosen to continue the remedy at OW.

సంపాదకుని వ్యాఖ్య:;
రెమిడి తీసుకున్న రెండు గంటల లోనే పేషంటు మలవిసర్జన చేసారు.. దానిలో రక్తం పడలేదు కానీ చాలా బాధాకరంగా ఉంది. మూడు రోజుల తర్వాత పేషంటు నొప్పి లేకుండా మలవిసర్జన చేస్తుండడం తో మోతాదును  TDS కు తగ్గించడమైనది. తరువాత రెండు నెలలలో మోతాదు క్రమంగా  OD కి తగ్గించి అనంతరం మెయింటెనెన్సు మోతాదు OW గా తీసుకున్నారు

 

చికిత్సా నిపుణుల వివరాలు 12051...India

ప్రాక్టీషనర్ 12051...  చిన్ననాటి నుండి ఔషధములు మరియు పరిశోధన పట్ల ఆసక్తిని కలిగి ఉన్న కారణంగా ఈ ప్రాక్టీషనర్, అణు బయో టెక్నాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి అమెరికా లో పరిశోధనా శాస్త్రవేత్తగా పది సంవత్సరాలు పనిచేసారు. అంతేకాకుండా, 2001 నుండి సాయి సంస్థ యొక్క వివిధ సేవా కార్యక్రమాలలో వీరు చురుకైన భాగస్వామిగా ఉన్నారు.  స్వామి యొక్క బోధనల ద్వారా స్ఫూర్తి పొంది సేవ ద్వారానే పరివర్తన సంభవిస్తుంది అని వీరు గాడముగా విశ్వశిస్తారు. స్వామి యొక్క సందేశాన్ని కలలు ద్వారా పొంది వీరు  2008 అమెరికా నుండి భారతదేశంలోని పూనేకు చేరుకొని అదే స్పూర్తితో సేవలను కొనసాగించారు. అదే సమయంలో మొబైల్ వైద్య సేవలలో భాగంగా నిర్వహించే కార్యక్రమాల ద్వారా సాయి వైబ్రియోనిక్స్ కు పరిచయం చేయబడినారు. తన స్నేహితుడయిన ఒక ప్రాక్టీషనర్ ద్వారా ప్రేరణ పొందిన ఆమె త్వరలోనే సాయివైబ్రియానిక్స్ కోర్సులో చేరి 2012 లో AVP గానూ  మరియు 2013 లో VP గానూ  మారారు. 

వీరు AVP గా ఉన్నప్పుడే ఒక స్పష్టమైన కల ద్వారా రెండవసారి స్వామి చేత మార్గనిర్దేశం చేయబడి కుటుంబంతో సహా   బెంగుళూరుకు చేరుకొని తన నివాసమునకు సమీపంలో సాయి సెంటర్లో నడుస్తున్న ఒక వైబ్రియానిక్స్ క్లినిక్ ను పునరుద్ధరించడం ద్వారా వీరు సేవలలో పాల్గొనడం ప్రారంభించారు.

ఆమె తన 108 CC బాక్స్ గత మూడు సంవత్సరాలలో అనేక సార్లు స్వామి వారి దివ్య విభూతితో అనుగ్రహింపబడిన (ఫోటోగ్రాఫ్స్ చూడండి) విషయం మనతో  పంచుకుంటున్నందుకు  చాలా ఆనందిస్తున్నారు.

వీరు తాత్కాలిక వ్యాధులకు సంబంధించిన తీవ్రమైన శ్వాస మరియు జీర్ణసంబంధ మైన  అనారోగ్యాలు, ప్రయాణకాలంలో సంభవించే  అనారోగ్యం మరియు జెట్ లాగ్, చెవి ఇన్ఫెక్షన్, ఫ్లూ, మొదలైనవి మరియు దీర్ఘకాలికమైన వ్యాదులలో మధుమేహం, ఉబ్బసం, అధిక రక్తపోటు, హైపోథైరాయిడిజం, హెర్నియా, టిన్నిటస్, చర్మ వ్యాధులు, వివిధ రకాల క్యాన్సర్లు, చిత్తవైకల్యం, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్, దంత సమస్యలు, స్త్రీల సమస్యలు వంటివి ఎన్నింటినో నయంచేసారు 

దాదాపు అన్ని దీర్ఘకాలిక కేసుల్లో గణనీయమైన మెరుగుదల సాధించడం పై ఆనందంతో స్వామికి  కృతజ్ఞత తెలుపుకుంటున్నారు.   1000 మంది రోగులు వైబ్రియోనిక్స్ గురించి తెలుసుకుని, చికిత్స కోసం ఆమెను సంప్రదించడం అనేది కేవలం భగవంతుని యొక్క సంకల్పంతోనే సాధ్యమని వినమ్రంగా తెలియజేసుకుంటున్నారు.  ఒక సందర్భంలో, ఒక రోగి యొక్క దేవుడి గదిలో స్వామిపటం ముందు రెమిడి మాత్రలు సృష్టింపబడి ఉన్నాయి. అదేరోజు ఆమె తన స్నేహితుడయిన వైబ్రో అభ్యాసకుని  కలుసుకున్నప్పుడు వారి మధ్య జరిగిన సంభాషణలో ఆ పేషంటు వైబ్రో చికిత్స కోసం అభ్యాసకుడిని చేరుకోవటానికి ఈ సంఘటన దారితీసిందనే విషయం వీరు తెలుసుకో గలిగారు. మరొక సందర్భంలో, ఒక పేషంటు తను వైబ్రియోనిక్స్ చికిత్స   తీసుకోవాలా వద్దా అని స్వామికి రాసిన ఉత్తరానికి సమాధానంగా ఆ కవరులో విభూతి సృష్టింపబడి వుoడటo  నిజంగా ఒక గొప్ప విశేషం.   

వీరు తమ అనుభవంలో పేషంటుకు ఇచ్చే రెమిడి లకు అదనంగా CC10.1 Emergencies కలపడం వలన చికిత్స వేగవంతం అవుతుందని తెలుసుకున్నారు. అలాగే  CC12.4 Autoimmune diseases + CC21.10 Psoriasis సోరియాసిస్ వ్యాధిని పూర్తిగా దూరం చేసిందని తన అనుభవం ద్వారా తెలియజేస్తున్నారు. ప్రాక్టీషనర్ కు స్వయంగా కలిగిన కల్కేనియల్ స్పర్ (మడమ వెనుక ఎముక పెరుగుదల) మరియు ప్లాంటార్ ఫాసిటిస్ (అరికాలిలో చర్మం ముందుకు పొడుచుకు రావడం) CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC20.1 SMJ tonic తో  పూర్తిగా మూడునెలలలో నయం అయ్యాయి. ప్రస్తుతం వీరికి నడకలో ఏమాత్రం నొప్పిగానీ, అసౌకర్యం గానీ లేదు. 

 17-సంవత్సరాల అమ్మాయికి ఏర్పడిన దీర్ఘకాలికమైన పార్శ్వపు నొప్పి ఆమె దినచర్యను అలాగే ఆమె చదువును ప్రభావితంచేసింది. కనీసం తల ఎత్తి బ్లాక్ బోర్డ్ ను చూడడం కూడా కష్టంగా ఉండేది. ఐతే ఆమెకు ఇవ్వబడిన రెమిడి  CC10.1 Emergencies + CC11.4 Migraines + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic తో నెల రోజుల లోపే ఆమెకు పూర్తిగా నయమయ్యింది. ఆ అమ్మాయి మరియు ఆమె తల్లి కూడా ఈ అద్బుత చికిత్సకు ఎంతో ఆనందించారు

మరొక కేసు విషయంలో అల్జీమర్స్ మరియు చిత్తవైకల్యంతో బాధపడుతున్న ఒక 81 ఏళ్ల వ్యక్తి కి CC10.1 Emergencies + CC15.1 Mental & Emotional tonic + CC18.2 Alzheimer’s disease ఇవ్వడం వలన తన ప్రవర్తన పరంగా 18 నెలల్లో గణనీయమైన స్థాయిలో (80%) పెరుగుదల కనిపించింది. తన అదుపులేని ప్రవర్తనతో బాధపడుతున్న అతని కుటుంబ సభ్యులు ఈ విధంగా ఉపశమనం కలిగించినందుకు స్వామికి  మరియు వైబ్రియోనిక్స్ కు  కృతజ్ఞతను తెలియజేస్తూ రెమెడీలను కొనసాగిస్తున్నారు.

సాయి విబ్రియోనిక్స్ వైద్యం అత్యంత ప్రభావవంతమైన చికిత్సా వ్యవస్థ అని ఈ అభ్యాసకురాలికి పరిపూర్ణమైన విశ్వాసం ఉంది. తన అనుభవాల ఆధారంగా ముఖ్యంగా పిల్లలలో యాంటీబయాటిక్స్ అవసరాన్ని ఈ చికిత్సా విధానము గణనీయంగా తగ్గించి వేయగలదని వీరు తెలుసుకోగలిగారు.  శ్రీ సత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్, వైట్ఫీల్డ్, బెంగుళూరులో ఏప్రిల్ 2017 నుండి 'వెల్నెస్ క్లినిక్'లో ఆమెకు సేవచేయడానికి అవకాశము కలిగినందుకు వీరు స్వామికి ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. గ్రామ సేవలో భాగంగా నిర్వహిస్తున్న  సాయి విబ్రియోనిక్స్  వైద్య  బృందంలో  చురుకైన సభ్యురాలిగా కూడా వీరు సేవలందిస్తున్నారు. తన పరిశోధనా నేపధ్యం కారణంగా వీరు సంస్థ నిర్వహిస్తున్న పరిశోధనలలో కూడా  హృదయ పూర్వక భాగస్వామ్యం వహిస్తున్నారు.

మన్నించే తత్వము, సవాళ్ళను స్వీకరించడం, మరియు చేస్తున్న పనికి పూర్తిగా న్యాయం చేయడం ద్వారా జీవితం ఆనంద మయంగా శాంతియుతంగా ఉంటుందని వీరి విశ్వాసము. ‘’ఎట్టి ఆహారమో అట్టి ఆలోచనలు, ఎట్టి ఆలోచనలో అట్టి జీవితం‘’ అంటారు స్వామి. కనుక ఆరోగ్యవంతమైన ఆహారము తీసుకుంటూ సంబంధ బాంధవ్యాలలో సమతుల్యం పాటిస్తూ పవిత్రమైన భావాలు కలిగి ఉండాలి అని వీరి అభిప్రాయము. దీనికి నిరంతర సాధన అవసరం. మన సాయి వైబ్రియానిక్స్ అట్టి అవకాశాన్ని అందించే ఉత్తమ సాధనం అని వీరి విశ్వాసము!

చికిత్సా నిపుణుల వివరాలు 10608...India

ప్రాక్టీషనర్ 10608…ఇండియా  కార్పోరేట్ నిర్వహణ మరియు ఇంజనీరింగ్ విభాగాలలో 45 సంవత్సరాల సుదీర్ఘకాలం పనిచేసి పదవీ విరమణ చేసిన తరువాత 2009 నుండి ఈ ప్రాక్టీషనర్ తమ జీవితాన్ని సాయి వైబ్రియానిక్స్ కే అంకితం చేసారు. వీరు సాయి వైబ్రియోనిక్స్ కు ఆకర్షిత మవడానికి కారణముగానూ తన జీవితంలో ఒక మలుపువంటిదిగా చెప్పబడే  సంఘటన 2004 లో తన భార్యకు ఏర్పడిన రుమటోయిడ్ ఆర్థరైటిస్ వ్యాధి.  దాదాపుగా పక్షవాతానికి గురయ్యే పరిస్థితికి దారితీయడంతో మంచం మీద పడి ఉన్న పరిస్థితిలో ఇతరుల సహాయం లేకుండా కనీసం ఒక చిన్ననీళ్ళ గ్లాసును ఎత్తడం గానీ, మంచంలో మరొక వైపుకు తిరగడం గానీ చేయలేని పరిస్థితి ఈమెది. అన్ని రకాల చికిత్సలు మరియు నొప్పి నివారణలు ప్రయత్నించిన తరువాత ఫలితం లేకపోయే సరికి ఆమె జీవితం మీద ఆసక్తిని కోల్పోయారు. 2007లో, స్నేహితులతో కలసి ఒక గెట్ టుగెదర్ ఫంక్షన్ లో  లిఫ్ట్ సౌకర్యం లేకుండా భవనం పై అంతస్తులో నివసిస్తున్న ఒక ప్రాక్టీషనర్ గురించి తెలిసి ఈ ప్రాక్టీషనర్ భార్య అతికష్టంతో ఈ మెట్లన్నిటినీ ఎక్కి చికిత్సా నిపుణుడిని కలిసారు. ప్రతిరోజూ ఎనిమిది అల్లోపతి ఔషధాలను తీసుకుంటే తప్ప జీవితం గడప లేని ఆ దశలో ఈమె రెమిడి  తీసుకోవడం ప్రారంభించారు. ఒక వారం తరువాత, నొప్పి తగ్గడం తో నొప్పి రెమెడీలను తీసుకునే అవసరం కూడా తగ్గింది. 15 రోజులు గడిచిన తరువాత, ఆమె ముందుగా తీసుకున్న దానికి సగం సమయంలోనే మెట్ల పైకి ఎక్కగలిగే స్థితి కలిగింది. 10 నెలల కాలంలో  ఆమె పూర్తిగా కోలుకొని సాధారణ మరియు ఆరోగ్యకరమైన జీవితం ప్రారంభించారు. ఈ అద్భుత వైద్యం తన శ్రీమతి తో పాటు వీరు 2009 లో వైబ్రియోనిక్స్ కోర్సులో చేరి AVP గా మారడానికి అభ్యాసకుడికి ప్రేరణ ఇచ్చింది. తర్వాత వీరు 2011 లో పుట్టపర్తి లో SVP కోర్సుకూడా పూర్తి చేసారు.  ఈ సమయంలో వీరు అనుభవించిన అనేక అద్భుతాలు వైబ్రియోనిక్స్ పట్ల వీరి విశ్వాసాన్ని మరింత బలపరిచాయి. మహా సమాధికి ముందు స్వామి యొక్క చివరి దర్శనాన్ని పొందగలగడం తన అదృష్టంగా వీరు భావిస్తున్నారు. అంతేకాక వైబ్రియోనిక్స్ ద్వారా సేవచేయగలగడం వారి ప్రేమ మరియు ఆశీర్వాదాలను పొందే అద్భుతమైన స్వామి మార్గము అని వీరి విశ్వాసము. 2011 లో వీరు వైబ్రియోనిక్స్ టీచర్ గా సర్టిఫికేట్ పొంది అప్పటి నుండి AVP లు మరియు VPల శిక్షణకు సంబంధించిన వర్క్ షాపులు మరియు రిఫ్రెషర్ కోర్సులు నిర్వహిస్తున్నారు

ఇప్పటివరకు వీరు తన శ్రీమతి తో కలసి 10,000 పైగా పేషంట్లకు చికిత్స చేసి హృదయము మార్దవమయ్యే ఫలితాలు పొందారు. వీరు తన అనుభవం ప్రకారము పేషంట్లు ప్రాక్టీషనర్ చెప్పిన సూచనల ప్రకారము రెమిడిలు తీసుకుంటే చాలా త్వరగా ఫలితం కలుగుతుందని తెలుసుకున్నారు. తన ఇంటిని సందర్శించే పేషంట్లను చూడడంతో పాటుగా నెలకు రెండుసార్లు ముంబాయిలోని స్వామి ఆశ్రమం ధర్మక్షేత్రం లో కూడా పేషంట్లకు చికిత్స చేస్తారు.  వీరు చికిత్స చేసిన కొన్ని కేసుల వివరాలు

52-సంవత్సరముల వయసు గల వ్యక్తికి శరీరమంతటా కీళ్ళ నొప్పులతో పాటు అసిడిటీ, చాతి నొప్పి, నీరు చేరుకోవడం, శ్వాస తీసుకోవడంలో సమస్యలు. D విటమిన్ లోపము, ఆకలి లేకపోవడం, శరీర మంతటా దురదలు ఉండడం తో వీరికి క్రింది రెమిడి ఇవ్వడం జరిగింది: 
#1. CC3.1 Heart tonic + CC3.7 Circulation + CC4.1 Digestive tonic + CC12.1 Adult tonic + CC12.4 Autoimmune diseases + CC13.1 Kidney & Bladder tonic + CC15.1 Mental & Emotional tonic + CC19.3 Chest infections chronic + CC20.2 SMJ pain + CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue; #2. CC21.2 Skin infections; #3. CC15. 6 Sleep disorders. 

రెండు రోజుల తర్వాత పేషంటుకు నీరు నిలవడంతో సహా సమస్యలన్నింటి నుండీ 40% ఉపశమనం లభించింది. అంతేకాక ఎన్నో సంవత్సరాల తర్వాత నిద్ర కూడా గాఢంగా కలగసాగింది. నెల రోజులలోనే అన్ని లక్షణాల నుండి  80%  ఉపశమనం లభించింది. ఈ సమయంలోనే ఆహారము మరియు  జీవనవిధానము నకు సంబంధించి కొన్ని సూచనలు చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ పేషంటు సంపూర్ణ ఆరోగ్యంతో ఆనందంగా జీవిస్తున్నారు.

మరొక కేసు విషయంలో 48-సంవత్సరాల మహిళకు ఛాతీ క్రింది భాగంలో నొప్పి, భోజనం చేసాక, ఊపిరి అందక పోవడం, పొట్ట బరువుగా ఉండడం, గ్యాస్ మరియు అసిడిటీ, రుతుకాలంలో నొప్పులు మరియు జ్వరం వచ్చినట్లు ఉండడం, కీళ్ళ నొప్పులు మరియు పట్టేసినట్లు ఉండడం, ఛాతీ లో ఎడమ రొమ్ములో గడ్డ వీటన్నింటి నిమిత్తము:
CC2.3 Tumours & Growths + CC3.7 Circulation + CC4.2 Liver & Gallbladder tonic + CC4.8 Gastroenteritis + CC4.10 Indigestion + CC8.3 Breast disorders + CC8.7 Menses frequent + CC12.1 Adult tonic + CC12.4 Autoimmune diseases + CC15.1 Mental & Emotional tonic + CC19.3 Chest infections chronic + CC19.6 Cough chronic + CC20.2 SMJ pain + CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive  tissue. 

ఇవ్వడం జరిగింది. రెండు వారాల తర్వాత ఆమెకు ఊపిరి బిగబట్టినట్లు ఉండడం పూర్తిగా తగ్గిపోవడమే కాక మిగతా వ్యాధి లక్షణాల విషయంలో కూడా తగినంత మెరుగుదల కనిపించింది. మూడునెలల తర్వాత ఎడమవైపు రొమ్ములో గడ్డ కరిగిపోవడమే కాక మిగతా దీర్ఘకాలిక వ్యాధి లక్షణాలు అన్నీ మటుమాయమయ్యాయి.

ఈ ప్రాక్టీ షనర్ బ్లడ్ నోసోడ్ మరియు పోటెన్ టైజ్ చేసిన యాంటిబయోటిక్ తో అద్భుత ఫలితాలు పొందారు. గోళీ రూపంలోనూ కంటి చుక్కలు* రూపంలోనూ ఇచ్చిన కొంబోలు గ్లుకోమా, కంటి కురుపులు, నీరుకారడం, ఇంకా ఇతర కంటి వ్యాధులకు అద్భుతంగా పనిచేశాయి. SRHVP ఉపయోగించి దూరముగా ఉన్నవారికి సైతం బ్రాడ్ కాస్టింగ్ ద్వారా చికిత్స చేయడం స్వామి అందించిన వరప్రసాదం అని వీరి భావన. ఈ విధంగా దాదాపు 100 పైగా పేషంట్ లకు సైనుసైటిస్, కీళ్ళనొప్పులు, పోలిసైటిక్ ఒవేరియన్ డిసీజ్  (PCOD) మరియు లైపోమా వంటి వ్యాధులను నయంచేయడము జరిగింది. అద్భుతం ఏమిటంటే పేషంటు యొక్క ఫోటో లేదా బ్లడ్ నోసోడ్ తీసుకొని బ్రాడ్ కాస్ట్ చేసిన 5-10 నిమిషాలలోనే స్వస్థత ప్రారంభ మయ్యేది.

పేషంట్లు తమ వ్యాధి నయం కాగానే ప్రాక్టీషనర్ చెప్పిన సూచనలను ముఖ్యంగా మోతాదు తగ్గించడం వంటివి పాటించరని అలాగే తమ జీవనవిధానము కూడా మార్చుకొనడానికి కూడా అంగీకరించరనీ దీనివలన వారికి వ్యాధి నయం కాబడినప్పటికీ మరలా వచ్చే అవకాశం ఉంటోందని ఈ ప్రాక్టీషనర్ వాపోతున్నారు.

* కంటిలో వేసుకునే చుక్కల తయారీకి సంపుటము 9 సంచిక 1 జనవరి-ఫిబ్రవరి 2018 వార్తాలేఖ ను చూడండి

పంచుకున్న కేసుల వివరాలు  :

ప్రశ్న జవాబులు

1. ప్రశ్న: SVP మాన్యువల్ 2016 లో కొన్ని సందర్భాలలో మదర్ టింక్చర్ యొక్క ప్రస్తావన ఉంది. అది మా దేశంలో దొరకనట్లయితే  SRHVP మిషన్ ఉపయోగించి తయారుచేసుకోవచ్చా?

    జవాబు: SRHVP నుండి మదర్ టింక్చర్ తయారుచేయడం సాధ్యం కాదు. అయితే, ఈ పదార్ధం కోసం కార్డును కలిగి ఉన్నట్లయితే  చాలా సందర్భాల్లో 1X (యంత్రంలో తయారు చేయగల అత్యల్ప సామర్థ్యము కలది) పోటేన్సీ తో తయారు చేసిన రెమిడి దీనికి  ఉత్తమ ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, మనకు అకోనిట్ (Aconite) మదర్ టింక్చర్ అవసరం అనుకుందాం అది పొందలేకపోతే, అప్పుడు ఉత్తమ ప్రత్యామ్నాయంగా SR265 Aconite అకోనిట్ కార్డును మిషన్ లో పెట్టి  1X ​​కు డయల్ సెట్ చేసి (డయల్ సెట్టింగ్ 40) సాధారణ పద్దతి లోనే రెమిడిని తయారు చేస్తాము.

________________________________________

2. ప్రశ్నవివిధరకాల పరికరాల నుండి వచ్చే రేడియేషన్ వైబ్రో రెమిడిల పైన ప్రభావము చూపుతుందని ఏదైనా అధ్యయనం  జరిగిందా?

    జవాబు: వైబ్రియోనిక్స్ రెమెడీలకు సంబంధించి అటువంటి పరిశోధన ఏదీ జరగనప్పటికీ ఆచరణాత్మకంగా పలువురు అభ్యాసకులు సెల్ ఫోన్లు, మైక్రోవేవ్ ఓవెన్లు, టెలివిజన్లు మరియు కంప్యూటర్ల వంటి వాటికి అనుకోకుండా రెమిడిలు గురైనప్పుడు అవి పనిచేయడం నిలిచిపోయినట్లు చెప్పారు. అవే గోళీలను రీఛార్జ్ చేసి ఉపయోగించినప్పుడు అవి ప్రభావవంతంగా పనిచేశాయి.  ఐరోపాకు చెందిన పరిశోధకులు ఈ విషయము గురించి అధ్యయనము చేసారు. హోమియోపతిలో తయారుచేయబడిన * థైరాక్సిన్ను కప్ప టాడ్పోల్ అభివృద్ధి మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో పరీక్షించారు. రేడియేషన్ కు గురికాని రెమిడి టాడ్పోల్ అభివృద్ధిపై స్థిరమైన ప్రభావం చూపింది. కానీ  సెల్ ఫోన్ రేడియేషన్ లేదా మైక్రోవేవ్ రేడియేషన్ కు గురైనప్పుడు, అది టాడ్పోల్ ను  ప్రభావితం చేసే సామర్థ్యాన్ని కోల్పోయింది, కానీ X- కిరణాలు మరియు బార్కోడ్ స్కానర్లకు గురిచేయడం వలన చెప్పుకోదగిన వినాశక ప్రభావము ఏమీ చూపలేదు.

*మూలం: వెబెర్ ఎస్, ఎండ్లెర్ పిసి, వెల్స్ ఎస్ యు ఈటల్ మరియు ఇతరులు. '’హైలాండ్ కప్పలపైన హోమియోపతిద్వారా తయారుచేసిన థైరాక్జిన్ ప్రభావము’’, హొమియోపతీ, సంపుటము 97, సంచిక 3, Jజూలై 2008, పేజి 165

_______________________________________

3. ప్రశ్నసాధారణంగా మేము అనుసరించే వైబ్రో గోళీలను నీటిలో కలిపే విధానము కన్నా 108CC బాక్సు నుండి తీసిన రెమిడి చుక్కను నేరుగా నీటిలో కలిపినట్లయితే ప్రభావవంతంగా ఉంటుందని చెప్పడానికి పరిశోధనలు ఏమైనా జరిగాయా?

    జవాబు:  యుకె  కి చెందిన ఒక ప్రాక్టీషనర్ ఇలా నేరుగా రెమిడి చుక్క నీటిలో కలిపితే వచ్చే ఫలితం అద్భుతంగా ఉంటుందని కనుగొన్నారు. అలాగే మరో ఇద్దరు ప్రాక్టీషనర్ లు కూడా ఇదే విషయం చెప్పారు కానీ దీని పైన వ్యవస్థాగతమైన పరిశోధన ఏదీ జరగలేదు. సమస్య ఏమిటంటే ఆల్కహాల్ నేరుగా ఉపయోగించడం వలన ఉత్పన్నమయ్యే సమస్యల వలన మేము గోళీలకే పరిమితమవుతున్నాము. ఐతే మీరు పేషంటుకు నీళ్ళ బాటిల్ లో రెమిడి వేసి ఇవ్వడం (లేదా పేషంటును బాటిల్ తెచ్చుకోమనడం) ద్వారా ఈ విధానము ప్రయత్నించవచ్చు. ఆల్కహాల్ రెమిడి నేరుగా పేషంటు నోటిలో వేసే ప్రయత్నం చేయవద్దు. గోళీలకు (రెమిడి వేసి రెండు నెలలు దాటకుండా ఉన్నవి)  CC బాక్సులోని కొంబో చుక్కకు పనిచేసే విధానములో గానీ ప్రభావం  విషయంలో గానీ ఏమాత్రం తేడా లేదనేది ఇంకొక వాదన.

________________________________________

     4. ప్రశ్న: వైబ్రేషన్ లేదా కంపనాలు గోళీలలో, ఆల్కహాల్ లో, నీటిలో ఎంతెంత కాలం నిలువ ఉంటాయి ?

         జవాబు : నేరుగా సూర్యరశ్మికి లేదా బలమైన అయస్కాంత క్షేత్రానికి గురికాకుండా జాగ్రత్తగా నిలువ చేసిన గోళీలలో వైబ్రేషన్ లు రెండు నెలల వరకూ నిలువ ఉంటాయి. మీరు తరచూ ఉపయోగిస్తున్న పక్షంలో ఆల్కహాల్ లో నిలువ చేయడం ఉత్తమం ఎందుకంటే దీనిలో వైబ్రేషన్లు రెండు సంవత్సరాల వరకూ నిలువ ఉంటాయి. ఐనప్పటికీ ఆల్కహాల్ లో నిలువ చేయమని మేము సిఫారసు చేయడం లేదు. నీరు తను ఉంచుకోగలిగినంత కాలము మాత్రమే కంపనాలు నిలువ ఉంటాయి కారణం ఏమిటంటే, వాతావరణం నుండి మలినాలను గ్రహించడంతో నీరు కలుషితమవుతున్నందున దీనిపై ప్రభావము పడుతున్నది. స్వేదనజలం (డిస్టీల్ల్ద్ వాటర్)  లేదా పరిశుభ్రమైన నీరు ఎక్కువ కాలం కంపనాలను నిలువ చేసుకోగలుగుతుంది.

________________________________________

5. ప్రశ్నఒక 10-సంవత్సరముల బాబు నిద్రలో బాగా గురక పెడుతూ ఉంటాడు. టాన్సిల్స్ పెరగడం వలన ఈ పరిస్థితి వచ్చినట్లు బాబుకు డాక్టర్ చెప్పారు. నేను క్రింది రెమిడి బాబుకు ఇవ్వాలనుకుంటున్నానుCC12.2 Child tonic + CC15.1 Mental and Emotional tonic + CC15.6 Sleep disorders + CC17.3 Brain and Memory tonic + CC19.5 Sinusitis + CC19.7 Throat chronicదయచేసి నేను ఇవ్వదలచిన కాంబో సరియైనదో కాదో సూచించండి.

    జవాబు: CC17.3, మరియు CC15.6 ఇవ్వవలసిన అవసరం లేదు. వాటిని వేరుగా రాత్రి పడుకునే ముందు ఇవ్వవచ్చు.   (వార్తాలేఖ సంపుటము 2 సంచిక 6 లో వివరాలు ఇవ్వబడ్డాయి). ఉదయం పూట CC15.6 ను ఇచ్చినట్లయితే బాబు పాఠశాల లో నిద్రపోయే అవకాశం ఉంది. మీరు సూచించిన మిగతా రెమిడి సరిగానే ఉంది.

దివ్య వైద్యుని దివ్య వాణి

ప్రతి జీవి దేవునిచే సృష్టింపబడినదే అనే ధృడ విశ్వాసాన్ని అభివృద్ధి పరుచుకొని ఆ ప్రకారం నడుచుకోవాలి. ప్రతీ జీవిలోనూ దేవుడు ఉంటాడు. మన హృదయమే దేవుని కోవెల. దయను కలిగి ఉంటేనే అది హృదయమని పిలవ బడుతుంది. అందువలన దయను పెంచుకోండి. దయ గల హృదయముతో సేవ చేస్తే అది పవిత్రమవుతుంది. కనిపించే ప్రతీ మానవుని నడయాడే దేవుడని భావించండి. దేవుడు సర్వత్రా ఉన్నాడు. అట్టి దేవుని విడిచి అల్పమైన శారీరక ఆనందాల కోసం కాంక్షించడం అవివేకం. వాస్తవం ఏమిటంటే మనం నిజమైన ఆనందాన్ని శరీరముతో ఎన్నడూ పొందలేము, హృదయముతోనే అనంత ఆనందాన్ని పొందగలము."
-సత్యసాయిబాబా, “మానవ సేవే మాధవ సేవ ” దివ్య ప్రవచనము,1 జనవరి 2004

http://www.sssbpt.info/ssspeaks/volume37/sss37-01.pdf

 

 

‘‘ఆహారం మరియు వినోదపు అలవాట్లు అనారోగ్యమునకు రెండు ప్రధాన హేతువులు. హానికర ధోరణులు ఈ రెండింటినీ ప్రభావితం చేయకుండా ఉండటానికి ఎంతో  శ్రద్ధ వహించడం అవసరం. ప్రస్తుతం, ఔషధాలు విస్తృతంగా వ్యాపించి ఆసుపత్రులు ప్రతీ వీధిలోనూ వాడలోనూ స్థాపింపబడినప్పటికినీ వ్యాధులు కూడా ఆ విధంగానే విస్తరించాయి. అసంబద్ధమైన ఆహారపు అలవాట్లు, కాలక్షేపమే  ఈ పరిస్థితికి కారణము’’
-సత్యసాయిబాబా, “ఆసుపత్రులు మరియు వైద్యము ” దివ్యప్రవచనము, 28 ఆగస్టు 1976 

http://www.sssbpt.info/ssspeaks/volume13/sss13-22.pdf 

 

ప్రకటనలు

నిర్వహింప బోయే వైబ్రో శిబిరాలు

  • ఇటలీ  వెనిస్:  AVP వర్క్ షాప్ 23-25 మార్చి 2018, సంప్రదించ వలసిన వారు మనోలిస్, వెబ్సైటు   [email protected]

  • ఇండియా  చెన్నై: పునశ్చరణ సదస్సు 15 ఏప్రిల్ 2018, సంప్రదించ వలసిన వారు లలిత, వెబ్సైటు   [email protected] లేదా  ఫోన్ నంబరు  8500-676 092

  • ఫ్రాన్స్  డోర్డోగ్నీ: SVP వర్క్ షాప్ 14-17 మే 2018, సంప్రదించ వలసిన వారు డేనియల్ , వెబ్సైటు   [email protected]

  • యుఎస్ఎ  రిచ్మండ్  VA: AVP వర్క్ షాప్ 22-24 జూన్  2018, సంప్రదించ వలసిన వారు సుశాన్ , వెబ్సైటు   t[email protected]

  • ఇండియా  పుట్టపర్తి: AVP వర్క్ షాప్ 22-26 జూలై 2018, సంప్రదించ వలసిన వారు లలిత, వెబ్సైటు  [email protected] లేదా  ఫోన్ నంబరు  8500-676 092

  • ఇండియా  పుట్టపర్తి: AVP వర్క్ షాప్ 18 -22  నవంబర్ 2018, సంప్రదించ వలసిన వారు లలిత, వెబ్సైటు  [email protected] లేదా  ఫోన్ నంబరు  8500-676 092

  • ఇండియా  పుట్టపర్తి: SVP వర్క్ షాప్  24-28 నవంబరు 2018, సంప్రదించ వలసిన వారు హేమ, వెబ్సైటు   [email protected]

అదనముగా

ఆరోగ్య చిట్కాలు

1. మనసు శరీర నిర్మాణము యొక్క ప్రక్షానా విధానము.

ఒక వ్యక్తి జ్ఞాన రంగంలో నిపుణుడు కావచ్చు, లేదా పదార్ధ నైపుణ్యములలో సిద్ధహస్తుడు కావచ్చు కానీ అంతర్గత శుద్ధి లేకపొతే అతని మెదడు ఎడారితో సమానము. 1-2”…శ్రీ సత్యసాయి బాబా

1. మానవ శరీరము అత్యంత ప్రతిభాశాలి.!3-5

మానవ శరీరము రూపొందింపబడిన తీరు ఎంత అద్భుతంగా ఉంటుందంటే  శరీరంలో ప్రతిరోజూ సృష్టించబడుతున్న రోజువారీ వ్యర్థాలు, కాలేయం మరియు మూత్రపిండాలు ద్వారా ఇంకా చర్మము ద్వారా చెమట ద్వారా విసర్జించబడి శరీరం శుద్ది అవుతోంది.  శరీరం యొక్క రోగనిరోధక వ్యవస్థను నిర్వహిస్తున్న శోషిక వ్యవస్థ ఒక వీధులు శుభ్రం చేసే వానిలాగా పని చేస్తూ, శరీర ద్రవాలను సమతుల్యం చేయడం మరియు అంటువ్యాధులకు వ్యతిరేకంగా రక్షించడం వంటి పనులు నిర్వహిస్తుంది.  బాహ్యముగా చూస్తే ప్రతికూల  పరిస్థితులు ఉన్నప్పటికీ, శరీరము  శుభ్రంగా మరియు తాజాగా ఉండటానికి రక్త ప్రసరణ వ్యవస్థ, జీర్ణవ్యవస్థ, మరియు శ్వాసకోశ వ్యవస్థలు దీనికి తమవంతు సహకారం అందిస్తాయి. శరీరము  యొక్క స్వీయ నియంత్రిత  నియంత్రణా వ్యవస్థ మన అవగాహన లేదా ఆలోచన లేకుండానే నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోతూ ఉంటుంది.

2. విషపూరితమైన పదార్ధాలు శరీరంలో ఏవిధంగా చేరతాయి.?5

   భౌతిక, రసాయన, లేదా జీవసంబంధ ఏజెంట్ల ద్వారా చేరిన విష పదార్ధాలను ఎదుర్కోలేని స్థితిలో లేదా వాటిని బయటకు పంపలేని స్థితిలో శరీరము యొక్క అద్భుతమైన వ్యవస్థ నిర్వీర్యం ఐనప్పుడు అవి శరీరంలో పోగవుతూ పెరిగిపోతాయి. వాటి  యొక్క తీవ్రత లేదా దీర్ఘ కాల వ్యవధి కారణంగా, శరీరంపై ఒత్తిడి చాలా ఎక్కువ అవుతుంది. టాక్సిసిటీ అనేద  శరీరం విషప్రాయంగా ఉందని చెప్పడానికి ఉపయోగించే పదం. ఇది సాధారణంగా ఒక జీవరసాయన మార్పు వలె మొదలయ్యి కణాంగ సంబంధమైన లేదా సెల్యులర్ మార్పులకు తద్వారా భౌతికమైన శరీరధర్మ మార్పులకు దారితీస్తుంది..

సాధారణ సూచికలు 6-8 శరీరంలో టాక్సిసిటీ పెరిగిపోయింది అనడానికి కొన్ని సూచికలు స్థిరంగా కొనసాగే  అలసట,  బరువు పెరుగుట, చెడు శ్వాస, నాలుక మీద భారీ తెలుపు పూత లేదా పాచి పెరుగుదల, శరీరము నుండి దుర్వాసన, మలబద్ధకం, అజీర్ణం, అధిక వాయువు మరియు గట్టిపడిన మలం, వళ్ళు నొప్పులు, వాసన పడక పోవడం, దీర్ఘకాలిక సైనస్ సమస్యలు మరియు తలనొప్పి, చర్మ వ్యాధులు దీర్ఘకాలిక నిద్రావస్థ  మొదలైనవి.  ఇవి స్వల్పకాలికంగా లేదా దీర్ఘకాలికంగా ఉంటాయి. వీటి కారణంగా అంటురోగాలకు, లేదా దీర్ఘకాలిక వ్యాధులకు  గురికావడం  ఒక్కొక్కసారి, కోమా మరియు మరణానికి దారితీసే సంఘటనలు కూడా సంభవిస్తాయి. విషపూరితమైన పదార్ధాల వలన కలిగే వ్యాధులను నివారించే మార్గాలున్నప్పటికీ  దీనికి చాలా సమయం తీసుకుంటుంది.

 3. నిర్విషీకరణ చేయవలసిన అవసరం ఉందా ?7-16

 వైద్య పరిభాషలో, ఆల్కహాల్ లేదా ప్రాణాంతక మాదకద్రవ్య వ్యసనం యొక్క చికిత్స సందర్భంలో తప్ప నిర్విషీకరణ అనే పదం ఏదీ లేదు; దీనిని ఇప్పుడు ఉపసంహరణ వైద్యం గా సూచిస్తారు. మన శరీరం ప్రాధమికంగా ఒక స్వయంగా శుభ్రపరుచుకొనే యంత్రం కనుక  ఏ ప్రత్యేక నిర్విషీకరణ ప్రక్రియ అవసరం లేదు అనే వాదన కూడా ఇటీవల వినిపిస్తోంది. ప్రాసెస్ చేయబడిన ఆహారము,  అధిక కొవ్వు మరియు పంచదారతో చేసిన ఆహార పదార్ధాలను మాత్రమే పరిమితం చేసి బదులుగా  పండ్లు మరియు కూరగాయలు వంటి వాటిని ఎక్కువ మొత్తంలో ఆహారములో తీసుకోవాలి. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, శరీరం దాని అవయవాలు మరియు వ్యవస్థల ద్వారా మలినాలను విసర్జించలేని పరిస్థితి ఏర్పడితే  వెంటనే వైద్య సహాయం అవసరమవుతుంది.

దీనికి విరుద్ధంగా, 5000 ఏళ్లనాటి  "జీవితం మరియు దీర్ఘాయువుకు చెందిన శాస్త్రము’’ గా పిలువబడే ఆయుర్వేదమునకు చెందిన అంకిత భావము గల వైద్యశాస్త్ర నిపుణులు, ఆధునిక వైద్యము టాక్సిన్స్ మరియు నిర్విషీకరణకు అవసరమైన ప్రాధాన్యత ఇవ్వక  దీర్ఘకాలంగా నిర్లక్ష్యం చేస్తూ వచ్చిందని స్పష్టము చేస్తున్నారు 12-16.  ప్రస్తుతం ఈ భావన అనగా రసాయనాలు శరీరాన్ని విషతుల్యం చేస్తున్నాయనే భావన  వైద్య నిపుణులలో నెమ్మదిగా ఆదరణ పొందుతున్నది.

కొందరు వైద్య నిపుణులు ఇప్పటికే ఆయుర్వేద అధ్యయనం ప్రారంభించి టాక్సిన్లను నిరోధించడానికి ఆధునిక ఔషధ పరిజ్ఞానముతో ఆయుర్వేదాన్ని జోడించే పనిలో నిమగ్నమైనారు 13.

4. మనోదేహాలను పరిశుభ్రంగా ఉంచడం !12,14-21

బాహ్య సంబంధమైన విషాలు:  

మన శరీరము ఐదు ఇంద్రియాల ద్వారా పర్యావరణము నుండి మరియు ఆహారము నుండి విషాన్ని గ్రహిస్తుంది. సిగరెట్ల ద్వారా లోనికి చేరే పొగ, వాహనాలు మరియు పరిశ్రమల నుండి చేరే పొగ; త్రాగునీటి ద్వారా చేరే కాలుష్య కారకాలు, పండ్లు, కూరగాయలు మరియు ఇతర ఉత్పత్తుల పైన పిచికారీ చేసే పురుగుమందులు మరియు రసాయనాలు ద్వారాకూడా విషపదార్ధాలు శరీరములోనికి  చేరతాయి. వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణ నిమిత్తం వాడే ఉత్పత్తులలో ఉండే రసాయనాలు కూడా టాక్సిన్ల పెరుగుదలకు మూలము  12,14-16 .

తల్లి కడుపులో ఉన్న శిశువులు కూడా విష కాలుష్య వలయము  నుండి తప్పించుకోలేరు. 2004 లో ఒక పరిశోధనా అధ్యయనం, అమెరికాలోని  ఆసుపత్రులలో పుట్టిన బిడ్డల బొడ్డు తాడు రక్తంలో సగటున 200 పారిశ్రామిక రసాయనాలు మరియు కాలుష్య కారకాలు ఉన్నట్లు కనుగొన్నది. ఈ అధ్యయనం ఇంకా ఏం చెపుతోందంటే ఈ కాలుష్యం బొడ్డు తాడును దాటి అభివృద్ధి చెందే శిశువుకు కవచంగా నమ్ముతున్న గర్భస్థ మావిని (తల్లి యొక్క గర్భంలో) కూడా చేరుకొని హాని కలిగిస్తుందని తెలిపుతోంది.16-17. కనుక విషాన్ని లోపలికి చేరకుండా నివారించలేకపోతున్నామని స్పష్టమవుతుంది, ఐతే దానిని ఎలా ఎదుర్కోవాలనేది మనం తెలుసుకోవాలి.    

మనంతట మనం ఆరోగ్యంగా ఉన్నట్లు భావిస్తాము మనంతట మనం నిరుత్సాహముగా, బలహినముగా లేదా సాధారణమైన రోజువారీ కార్యక్రమాల నిర్వహణకు కావలసిన  శక్తిని సమకూర్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నా అది మన జీవనవిధానమును పునః పరిశీలించుకొనడానికి ఒక పిలుపు వంటిదని గమనించాలి. మనము మన అలవాట్ల ద్వారా శరీరంలో విషాలను నింపుతూ ఉండి ఉండవచ్చు. ఉదాహరణకి మనం తినడానికి ఇష్టపడే పాల ఉత్పత్తులు, ప్రాసెస్ చేయబడిన ఆహారము, లేదా కొవ్వు పదార్ధాల వలన మన శరీరక  వ్యవస్థలు నిరోధింపబడుతూ ఉండవచ్చు, ఎందుకంటే శరీరము వాటిని కలుపుకోలేక తొలగించనూలేక సతమతమవుతూ ఉంటుంది.18 

విషాలు అంతర్గతంగా కూడా సృష్టింపబడుతూ ఉంటాయి: సుదీర్ఘ కాలంగా అనుభవింపబడే ఒత్తిడి దీర్ఘకాలిక వ్యాధిగా గానీ లేదా  టాగ్జిన్స్ సృష్టించేదిగా కానీ మారి మన శరీరము మరియు మెదడులపైన దాడి చేస్తూ ఉంటుంది.19  ఇట్టి  విషపూరితమైన ఒత్తిడిని అనుభవించే పిల్లలు పెద్దయిన తర్వాత దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. 2o మన ఆలోచనలు నియoత్రణ లేకుండా ఎక్కువైతే అవి, విషపదార్ధములు పెరగడానికి కారణం అవడమే కాక చివరకు వ్యాధికి కూడా దారితీస్తుంది. కోరిక, కోపం, అహంకారం, దురాశ, భ్రాంతి, మరియు అసూయ అనే అరిషడ్వర్గములు మన అంతర్గత శాంతికి  భంగం కలిగించడమే కాక  రోగనిరోధక శక్తిని తగ్గించి విషాలను శోషింపచేసుకొనడానికి అవకాశం కల్పిస్తాయి.21

5. విషాలను తొలగించుకొనడానికి సాధారణ పద్దతులు 22-35

యోగా 22-24 యోగ అనేది మానవుడు ఆనందకరంగా జీవించడానికి మరియు పని భారం వలన ఏర్పడే వత్తిడి నివారించడానికి, శరీరము లోపల నుండి ఉత్పత్తి అయ్యే విషపూరితమైన పదార్ధాలు నివారించడం లోనూ ఒక చక్కని సాధనంగా ఉంటుంది. ఇది సత్యం, సంతృప్తి, అహింస, స్వీయ-అధ్యయనం మరియు అంకితభావం, అలాగే ఆసనాలు, మరియు ప్రాణాయం ( శ్వాస నిశ్వాసముల నియంత్రణ) వంటి  కొన్ని ప్రాథమిక పరస్పర అనుసంధానిత మార్గదర్శక సూత్రాలను అనుసరిస్తుంది. యోగా పద్ధతులు రక్త ప్రసరణ మరియు ఊపిరితిత్తుల సామర్ధ్యాన్ని పెంచుతాయి మరియు నిర్విషీకరణకు ప్రధానంగా బాధ్యత వహించే అత్యంత ముఖ్యమైన అవయవం 'కాలేయము'ను  ప్రేరేపించి, బలోపేతం చేస్తాయి. యోగ మార్గంలో జీవింపదలచిన వారు ఒక యోగ నిపుణుడు వద్ద గానీ లేదా యోగ పాఠశాల మార్గదర్శకంలో యోగ జీవన శైలిని స్వీకరించవచ్చు.

సాయి వైబ్రియోనిక్స్ రెమెడీలు: భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారిచే దీవించబడిన సాయి వైబ్రియోనిక్స్ రెమెడీలు, శరీరము  మరియు మనస్సు యొక్క సూక్ష్మ రంగాలలో విషాలను తొలగించి ఈ వ్యవస్థలను శుభ్రపరచడం ద్వారా రోగనిరోధకత మరియు సమతుల్యత రెండింటిని పెంచుతాయి. ప్రాక్టీషనర్లు, మరింత సమాచారము కోసం '108 కామన్ కాంబోస్' మరియు 'వైబ్రియోనిక్స్ 2016' లను చూడండి. 

ఆయుర్వేదం 12,25-26:  నిర్విషీకరణ ప్రక్రియ కోసం కోలన్ లేదా పెద్ద ప్రేగు  శుద్ధీకరణ లేదా శరీర ప్రక్షాళన వంటివాటికి వెళ్ళాలంటే, ఆయా సంస్థల ప్రామాణికతను మరియు సమర్ధతను గుర్తించిన తర్వాతే సరైన వ్యవస్థ మరియు సంస్థను ఎన్నుకోవాలి. టాక్సిన్లను తగ్గించడానికి ఆయుర్వేదములో కొన్ని ప్రత్యేకమైన పద్ధతులున్నాయి. లోపలికి చేరే విషాలను తగ్గించడం బయటకు వెళ్ళే విషాన్ని గరిష్టీకరించడం, తద్వారా విషపదార్థాల వృద్ధి నిరోధించడం. ఋతువులలో మార్పు, ముఖ్యంగా ఋతువు ప్రారంభం మరియు నిర్గమనము, శరీరం మరియు మనస్సు యొక్క నిర్విషీకరణకు ముఖ్యమైన కాలాలుగా భావిస్తారు. ఇంటిలో ఉపయోగించే  సాధారణ నిర్విషీకరణ పద్దతులలో కొన్ని నాలిక బద్దతో నాలుకను శుభ్రం చేయడం, పొడి చర్మం రుద్దడం, మసాజ్ చేయడం, ఆవిరి ప్రక్రియ మొదలైనవి. రాత్రి పడుకోబోయే ముందు అర చెంచాడు త్రిఫలా చూర్ణము  (తానికాయ, ఉసిరికాయ, కరక్కాయ అనే మూడు స్థానిక భారతీయ మూలికలతో  చేసినది)  ఒక కప్పు వేడినీటితో తీసుకుంటే అది జీర్ణ వ్యవస్థ నుండి విషాలను  తొలగించడానికి ఎంతో సహాయపడుతుంది.

సరళమైన గృహ చిట్కాలు 13  టీ మరియు సూప్ రూపంలో తీసుకునే ద్రవ పదార్ధాలు శరీరాన్ని నిర్విషీకరణ చేయడములో  అద్భుతాలు సృస్టిస్తాయి. కొన్ని ఉదాహరణలు బార్లీ నీరు, ఫెన్నెల్ టీ, జొన్న/టేపియోకా/గంజి, మరియు బ్రోకలీ, వెల్లుల్లి రేకలతో కలిపి చేసిన క్యాబేజీ మరియు ఉల్లిపాయ సూప్.

నిర్విషీకరణ పానీయాలు 27 మన అవసరాలకు అనుగుణంగా క్రింద సూచింపబడిన ప్రకృతి వరప్రసాదముల వంటి వానిలో రెండు లేదా అంతకంటే ఎక్కువ వాటిని ఎన్నుకొని పానీయాలు చేసుకొనవచ్చు. పుచ్చకాయ, దోసకాయ, నిమ్మకాయ, సున్నం, ద్రాక్ష పండు, కోరిందకాయలు, స్ట్రాబెర్రీలు, పుదీనా, అల్లం, రోజ్మేరీ, డాండెలైన్, ఆపిల్ పళ్లరసం వెనీగర్, మరియు కలబంద గుజ్జు.

ఆయిల్ పుల్లింగ్ 28-29  మన శరీరములో ప్రతీ విభాగము నాలుకతో కలపబడి ఉంది కనుక శరీరంలో అంటువ్యాధులను నివారించడానికి, దంత పరిశుభ్రతకు ఆయుర్వేదలో చెప్పబడిన ఆయిల్ పుల్లింగ్ గొప్ప నిర్విషీకరణ సాధనముగా పేర్కొనబడింది. స్వచ్ఛమైన కొబ్బరి లేదా నువ్వుల నూనె ఒక స్పూన్ నిండుగా తీసుకొని సుమారు 20 నిముషాల పాటు ఆ నూనంతా తెల్లగా నీటివలే మారిపోయేంత వరకూ పుక్కిలి పట్టాలి. ఆ తర్వాత దానిని  జాగ్రత్తగా ఉమ్మి వేసి సాధారణంగా దంతాలను ఎలా శుభ్ర పరుస్తారో ఆ విధంగా నోటిని  పూర్తిగా శుభ్రం చేయాలి. ఈ విధానము ఉదయాన్నే ఖాళీ కడుపుతో చేయడం మంచిది.

విషపదార్ధాల వృద్ధిని అరికట్టడానికి  లేద తగ్గిoచడానికి కొన్ని వ్యూహాలు 30-35

• స్థానికంగా పెరిగిన పండ్లు మరియు కూరగాయలతో కూడిన ఆరోగ్యవంతమైన సహజ సిద్ధమైన ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే రెడీ మేడ్ ఆహారపదార్ధాలు, కృత్రిమంగా తయారుకాబడిన వంటకాలు, జన్యుపరంగా సవరించిన ఆహారపదార్ధాలను తినడం మానేయాలి;

• ఆయుర్వేదంలో నిర్విషీకరణ కోసం చెప్పబడిన విధంగా వారానికి ఒకరోజు లేదా మీ వీలును బట్టి ఉపవాసం ఉండాలి;

• శరీరంలో సరైన హైడ్రేషన్ కోసం నీటిని ఎక్కువ తీసుకోవాలి;

• నీటిని త్రాగడానికి ప్లాస్టిక్ సీసాలు ఉపయోగించడం నివారించాలి;

• చర్మ సంరక్షణ ఉత్పత్తులు మరియు గృహ క్లీనర్ల విషయంలో నాణ్యమైన వాటినే ఎంచుకోవాలి;

• ఒత్తిడి స్థాయిని తగ్గించడానికి మరియు భావోద్వేగములను అదుపులో ఉంచుకోవడం ద్వారా టాక్సిన్ల పెరుగుదలను నిలువరించవచ్చు;

• తీరిక సమయాలలో తగినంత విశ్రాంతి తీసుకుంటూ నియమానుసారం నిద్రించాలి30-32

నిద్ర: నిద్ర మెదడుని నిర్విషీకరణ చేసేందుకు సహాయపడుతుoది. ఇటీవల చేపట్టిన అధ్యయనాల ప్రకారం మెదడు నుండి వ్యర్ధాలను తొలగించే శోషరస వ్యవస్థ అనే ప్రత్యేక యంత్రాంగం శరీరంలో ఉందని ఇది ప్రధానంగా నిద్రలో క్రియాశీలకంగా ఉంటుందని పరిశోధన ఫలితాలు నిరూపిస్తున్నాయి. ఒక ప్రక్కకు నిద్రించడం ఈ ప్రక్రియను పెంచడానికి ఉత్తమ మార్గం 33-35.

6. మనం విషాల నుండి దూరం కావచ్చు 21

మన ఆరోగ్యం మన చేతుల్లోనే  ఉంది. మన  శరీరం కాంతి యొక్క దైవిక కంపనాలుతో చుట్టబడి ఉంటుంది. మనము మనలోనే ఉన్న "ప్రకృతి" మరియు "దైవము" లను గుర్తించి మన ఉనికిని వానిలో గుర్తించినట్లయితే, ఏ విషక్రిములు మన దరి చేరవు. ఏ వ్యాధికి మనము గురికాము. కారణమేమిటంటే భగవంతుడు ‘‘ప్రకృతి‘’ కి కారణమైన పంచ భూతాలకు అధిపతి. మానవ శరీరము ఈ పంచ భూతలతోనే నిర్మితమైనది. మానవునిలో వీటి శక్తి అపరిమితం.

సూచనలు మరియు వెబ్సైటు మూలములు:

  1. https://www.happypublishing.com/blog/cleanliness-quotes/

  2. http://www.azquotes.com/quote/903138

  3. http://sauchacha.com/post/421138012/how-does-the-body-keep-itself-clean

  4. http://www.healthyandnaturalworld.com/6-ways-your-body-detoxifies-itself/

  5. http://pmep.cce.cornell.edu/profiles/extoxnet/TIB/manifestations.html

  6. https://www.mindbodygreen.com/0-13737/7-signs-you-have-too-many-toxins-in-your-life.html

  7. http://drhyman.com/blog/2010/05/19/is-there-toxic-waste-in-your-body-2/

  8. http://www.naturesintentionsnaturopathy.com/body-detox/signs-and-symptoms-of-a-toxic-body.html

  9. https://www.theguardian.com/lifeandstyle/2014/dec/05/detox-myth-health-diet-science-ignorance

  10. https://americanaddictioncenters.org/drug-detox/is-it-necessary/

  11. https://www.huffingtonpost.com/2014/04/18/detox-health-nutrition-diet_n_5173783.html

  12. https://artoflivingretreatcenter.org/ayurvedic-detox-harrison/

  13. http://www.panaceanova.com/medicines.html (exercise and detox procedures)

  14. https://bodyecology.com/articles/top-5-sources-of-toxins.php

  15. https://www.organicnutrition.co.uk/articles/detoxing-and-cleansing.htm

  16. https://www.healthyandnaturalworld.com/top-signs-your-body-is-toxic-and-what-to-do-about-it/

  17. https://www.ewg.org/research/body-burden-pollution-newborns#.WobVYiN940Q

  18. http://www.goodhealth.co.nz/health-articles/article/the-most-common-detox-questions-answered

  19. http://www.raisingofamerica.org/stress-good-bad-and-toxic

  20. https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC4928741/

  21. Sathya Sai Speaks: “Man’s magnificent body – How to keep it healthy” http://media.radiosai.org/journals/Vol_07/01SEP09/01-ssspeaks.htm

  22. https://www.artofliving.org/in-en/yoga/health-and-wellness/detox-yoga-cleansing

  23. https://artoflivingretreatcenter.org/practice-eight-limbs-yoga/

  24. https://artoflivingretreatcenter.org/exploring-wisdom-sri-sri-yoga/

  25. http://www.mapi.com/ayurvedic-knowledge/detoxification/ayurvedic-detoxification-routine.html  

  26. https://www.mindbodygreen.com/0-10595/5-tips-to-get-you-started-on-a-simple-ayurvedic-cleanse.html

  27. https://draxe.com/detox-drinks/

  28. https://draxe.com/oil-pulling-coconut-oil/

  29. http://www.wholesomeayurveda.com/2017/05/26/oil-pulling-detox-gandusha/

  30. https://www.mindbodygreen.com/0-11228/15-simple-ways-to-reduce-toxins-in-your-life.html

  31. Sai Vibrionics Newsletters of 2017 and 2018, Health Tips

  32. http://eatlocalgrown.com/article/12464-36-foods-that-help-detox-and-cleanse-your-entire-body.html

  33. https://www.medicalnewstoday.com/articles/267611.php

  34. https://articles.mercola.com/sites/articles/archive/2013/10/31/sleep-brain-detoxification.aspx

  35. https://www.neuronation.com/science/right-sleeping-position-will-help-your-brain-detox

 

2.    ఎ.పి.ఇండియా, వైబ్రో పధంలో మరింత ముందుకు! ప్రాక్టీషనర్ 11567 ద్వారా అవగాహనా సదస్సులు   

2018 ఫిబ్రవరి18 తేదీన ఆంధ్రప్రదేశ్ లో వైజాగ్ లోని సాయి సౌధలో వైబ్రో అవగాహనా సదస్సు నిర్వహింపబదినది. ఈ సదస్సులో ‘‘వ్యాధి, దాని మూలము, కారణాలు, వ్యాధి మీద ఆలోచనల ప్రభావము, వ్యాధుల నివారణలో వైబ్రియోనిక్స్  వైద్యం యొక్క పాత్ర, మరియు సాయి విబ్రియోనిక్స్ కు  సంబంధించిన సమాచారం’’. ఈ విషయాలు విపులంగా వివరింపబడ్డాయి. వైబ్రో చికిత్సకు సంబంధించి  విజయవంతమైన మూడు  కేసుల వివరాలు ఫొటోలతో సహా  పవర్ పాయింట్ ద్వారా  ప్రదర్శించబడ్డాయి. 60 కన్నా ఎక్కువ మంది ఈ సదస్సుకు హాజరయ్యారు. సదస్సు నిర్వాహకుల అభ్యర్థనపై, అభ్యాసకుడు ప్రతీ నెలలో వైబ్రో క్యాంపు నిర్వహించడానికి అంగీకరించారు. అట్టి వానిలో మొదటి క్యాంపు 25 మార్చి  2018   జరగనుంది.

విజయవంతం కావడానికి ఎంతో కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. జిల్లా అధ్యక్షుడు వైబ్రో చికిత్స గురించి మాట్లాడుతూ ఈ అద్భుత చికిత్సా విధానాన్ని జిల్లాలోని సమితులన్నింటిలో ఒక భాగామయ్యేలా కృషి చేస్తానని తెలిపారు.  ఈ కార్యక్రమానికి అనూహ్య మైన స్పందన లభించింది ఎందుకంటే ఈ కార్యక్రమాల అనంతరం ఎంతో మంది రోగులు చికిత్స పొందడమే కాక సదస్సులలో పాల్గొన్న కన్వినర్లు వైబ్రో మందులు తీసుకొనడంతో పాటు ఈ చికిత్సా విధానము నేర్చుకొనడానికి కూడా తమ అభిలాషను వ్యక్తంచేశారు. ఈ సదస్సులన్నీ ఏర్పాటుచేయడం లోనూ అవి విజయవంతం అవడానికి రాత్రుళ్ళు కూడా నిర్విరామంగా కృషి చేసిన ప్రాక్టీషనర్ 11585 కు ధన్యవాదాలు. 

 

3. 2018 మార్చి3-4  తేదీలలో కేరళ, ఇండియా లో రెండు రోజుల శిక్షణా శిబిరము  

రాష్ట్రములో వైబ్రో సేవ చేసే వారికి తన సహకారం అందిస్తుందని హామీ ఇస్తూ తమ ప్రసంగాన్ని ముగించారు.

రాష్ట్ర వైబ్రియోనిక్స్ కోఆర్డినేటర్ 02090 మాట్లాడుతూ మా వైద్యులు చేస్తున్న సేవ పార్ట్ టైము గానే ఉండవచ్చు కానీ వారి  భక్తి మరియు విధేయత మాత్రము ఫుల్ టైముగా ఉంటుంది అని చమత్కరించారు. అంతేగాక చికిత్సా నిపుణులు వైబ్రో సేవ యొక్క  పరిమాణం మరియు నాణ్యత రెండు మెరుగుపరచడానికి కృషి చేయాలనీ సూచించారు. ఈ శిబిరములో సాయి వైబ్రియోనిక్స్ అనేది స్వామి వారి దివ్య బోధనలను అనుసరించడానికి ఉపకరించే ఒక దైవిక ఉపకరణం కనుక అభ్యాసకుడు ఈ సేవని ఆధ్యాత్మిక సాధనగా పరిగణించాలి అని సూచించారు. కేరళ రాష్ట్రం 4 మండలాలుగా విభజించబడి ప్రతి ఒక్కటీ ఒక SVP నేతృత్వంలో నడుస్తోంది కనుక ఇప్పటి నుండి జోనల్ సమావేశాలు ప్రతీ క్వార్టర్ లోనూ (సంవత్సరం లో నాలుగు సార్లు) మరియు జిల్లా సమావేశాలు ప్రతి నెలలోనూ జరుగుతాయి. ఇది  నూతన VP లకు  శిక్షణ ఇవ్వడానికి మరియు ఇప్పటికే ఉన్న అభ్యాసకులకు పునః శిక్షణ ఇవ్వడానికి వీలు కల్పిస్తుందని తెలిపారు. కోర్ సమూహముగా ఏదయితే ఏర్పాటుచేయడము జరిగిందో ఆ సభ్యులు క్రియారహితముగా ఉన్న ప్రాక్టీషనర్ సభ్యులను వ్యక్తిగతంగా సంప్రదించి చురుకైన VP లుగా మార్చడానికి కావలసిన ప్రతి ప్రయత్నమూ చేస్తుంది. చురుకైన వైబ్రో అభ్యాసకుల ద్వారా ప్రజలందరినీ సమర్థవంతంగా కవర్ చేయడానికి అవసరమైనవి అవగాహన సెమినార్లు జిల్లా మరియు జోనల్ స్థాయిలో జరుగుతాయని సూచించడం జరిగింది.

 

 4. పుట్టపర్తి, ఇండియా  – సాధారణ శిక్షణా శిబిరాలు

 పుట్టపర్తిలో  ప్రస్తుతం శివరాత్రి, గురు పూర్ణిమ మరియు బాబా యొక్క పుట్టినరోజుకు ఈ విధంగా సంవత్సరానికి కనీసం 3 సార్లు  AVP శిక్షణా శిబిరాలను (ప్రతి ఒక్కటి 5 రోజులు కలిగి ఉండేవి ) ఏర్పాటుచేయడం జరుగుతోంది. AVP శిక్షణా శిబిరాలన్నీ ప్రస్తుతం నిష్ణాతులయిన ఇద్దరు సర్టిఫైడ్ టీచర్స్10375 & 11422 ద్వారా నిర్వహింపబడుచున్నవి. ఈ 5 రోజుల శిక్షణ సమయంలో AVP లు అందరూ టీచర్ల పర్యవేక్షణలో కనీసం 15 రోగులకు చికిత్స చేసే ప్రత్యక్ష అనుభవం పొందుతారు.

 

ఓం సాయి రామ్!