Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

Vol 9 సంచిక 1
January/February 2018
ముద్రింప తగిన వార్తాలేఖ


పూర్తి వార్తాలేఖ యొక్క కాగితం ప్రతి కావలెనన్నఈ పుటను ముద్రించండి

డా.జిత్ కే అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి

ప్రియమైన చికిత్సా నిపుణులకు,

ఈ క్రొత్త సంవత్సరం ఒక అద్బుతమైన సంవత్సరం. ఈ 2018 సంవత్సరాన్ని ఆశావహమైన ధృక్పధంతో ఒక ప్రత్యేకమైన సంవత్సరం కావాలని ఆకాంక్షిస్తూ ... 1970 జనవరి 14 వ తేదీన స్వామి వారందించిన సందేశం తో ప్రారంభింపదలిచాను:

కాలెండరు తయారుచేసే వారు సంవత్సరాలను లెక్కవేసి ఇదిగో ఈరోజు కొత్త సంవత్సరం మొదటి రోజు లేదా న్యూ యిఎర్ డే అని నిర్ణయిస్తారు. నిజం చెప్పాలంటే సూర్యుని చుట్టూ భూమి తిరిగిన కాలాన్ని బట్టి వారు లెక్క గడతారు. దాని కన్నా జరిగిపోయిన కాలాన్ని సాధించిన పనితో ముడిపెట్టి న్యూ ఇయర్ డే నిర్ణయించడం శ్రేయస్కరం. ప్రతీ వ్యక్తికీ ఒక న్యూ ఇయర్ డే ఉంటుంది. అది ఏమిటంటే తాను ఈ భూమి మీద ఉండి సూర్యుని చుట్టూ తిరగడం ముగిసిన నాడు (ఈ జనన మరణ చక్రం నుండి విడుదలైన నాడు), అతని జ్ఞాన నేత్రం తెరువబడిన నాడు, అతనిలో విచక్షణ ఉదయించి బంధ విమోచనం జరిగిన నాడు అప్పుడే ఆ వ్యక్తికి న్యూ ఇయర్ డే..అంతః పరిశీలన ద్వారా భగవంతుడి సంకల్పాన్ని తెలుసుకో, వారి ఆజ్ఞను శిరసా వహించు, వారికి ఏ చర్య బాగా సంతృప్తి కలిగిస్తుందో తెలుసుకో అలా నిన్ను నీవు తీర్చి దిద్దుకో. లోభ, ద్వేష, భావాలతో నీ హృదయాన్ని రాయి లా తయారు కానివ్వకు. ప్రేమతో మృదువుగా చెయ్యి. ప్రేమ పూర్వక ఆలోచనలతోనే హృదయపు మలినాలను ప్రక్షాళన చెయ్యి. నీ హృదయాన్నే ఒక ఆలయంలా తీర్చిదిద్ది దానిలో అంతర్యామిని ప్రతిష్టించు. అలా  అంతరంగంలోనే రమిస్తూ సుజ్ఞాన అనందానుభూతులను అనుభవించు.”

2017వ సంవత్సరం మనకెన్నో విజయాలను అందించింది. కొన్ని సంవత్సరాలుగా అంకిత భావంతో మనవాళ్ళు అందిస్తున్న సేవల వలన చికిత్సా రంగానికి సంబంధించి సంస్థా పరంగా మన సామర్ధ్యాలను పెంపొందించుకోవడం విశేషం. ఈ దిశలో భాగంగానే 2004 లో రూపు దిద్దుకున్న SVP ల మార్గదర్శిని పుస్తకాన్ని అప్ టు డేట్ చేయడం, వార్తాలేఖలలో ‘‘జీవనవిధానము మరియు ఆరోగ్యము’’ అన్న అంశాన్ని తిరిగి చేర్చడం, బెంగుళూరు వైట్ ఫీల్డ్ లో ఉన్న సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో సాయివైబ్రియానిక్స్ ను వారి వెల్ నెస్ క్లినిక్ లో ఒక అంతర్భాగంగా చేయడం, ప్రాక్టీషనర్ ల వివరాలను డిజిటలైజ్ చేయడం (అనగా ఇప్పుడు ప్రాక్టీషనర్ లు తమ వ్యక్తిగత వివరాలలో మార్పులు చేర్పులు చేసుకోవడం, తమ ఫోటోను కూడా అప్లోడ్ చేసుకోవడం  IASVP మెంబెర్ షిప్ కు దరఖాస్తు చేయడం, మాస నివేదికలను ఈ వెబ్సైట్ కే పంపడం వంటి వెసులుబాటు కల్పించ బడింది), అమెరికా లో మన రిమోట్ బ్రాడ్కాస్టింగ్ ను విస్తరించడం, వైబ్రియానిక్స్ శిక్షణ మరియు మెంటరింగ్ రంగాలను విస్తృత పరిచే దిశలో కూడా మార్గదర్శకాలు రూపొందించబడడం ఇవన్నీ కూడా విజయ సోపానాలే.

ఈ 2018 ని మనందరి సమష్టి కృషితో ఒక మరపురాని సంవత్సరముగా మలచమని భగవాన్ బాబా వారిని ప్రార్ధిస్తున్నాను. మన మిషన్ క్రొత్త పుంతలు తొక్కుతూ ముందుకు సాగుతోంది. మనం ఇప్పటికే  మన ఆన్లైన్ డేటాను మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవడం, ఆన్లైన్ శిక్షణను ఎక్కువ స్థాయికి విస్తరించడం, పరిశోధనా రంగాన్ని అనేక వ్యాధులకు (మొక్కలు, జంతువులలో కూడా) చికిత్స నందించే దిశగా మరల్చడం, మరియు మన సంస్థను గూర్చి మన కార్యక్రమాల గురించి సమాజంలో ఇంకా వీటి గురించి తెలియని అట్టడుగు వర్గాలకు కూడా మన క్లినిక్కులు, మెడికల్ క్యాంపులను విస్తరించడం ద్వారా సమాచారం చేరవేయడం వంటి అనేక బృహత్తర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాము. వీటన్నింటికన్నా కూడా  మన వైబ్రియానిక్స్ రంగాన్ని ఇప్పటికే సుస్థిరంగా విస్తరించి ఉన్న అలోపతి వంటి వైద్య రంగ స్థాయికి తీసుకురావడాన్ని లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగడానికి వైబ్రియానిక్స్  ఎలా పనిచేస్తుందో, ఎలాంటి అద్భుత ఫలితాలను అందిస్తూ ఉందో వంటి విషయాల పట్ల మనకు సంపూర్ణ అవగాహన ఉండాలి. దీనికోసం మనం భౌతిక శాస్త్రంలో క్వాంటం మెకానిక్స్/భౌతిక శాస్త్రాన్ని లోతుగా అధ్యయనం చెయ్యాలి. కనుక దీనిపట్ల అవగాహన, అభిరుచి ఉండి నిస్వార్ధంగా సేవ చెయ్యాలనుకునే ప్రాక్టీషనర్ లు ముందుకు వచ్చి, వైద్యనిపుణుల విశ్వాసాన్ని చూరగొనే రీతిలో దీనిని ముందుకు తీసుకు వెళ్ళవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.

ఈ ప్రారంభాన్ని ప్రయోజనకారి గా మలచడానికి మన అంతరంగం నుండి చురుకుగా ముందుకు కదిలే సుగుణాన్ని బయటకు తీసి స్వామి అడుగు జాడలలో నడుస్తూ దేహ తత్వం నుండి దేహి తత్వం (భగవత్తత్వం) వైపు మనం ప్రయాణం సాగించాలి. దీనిని సాధించడానికి నిస్వార్ధ సేవ తప్ప మరో మార్గము లేదు అని చెప్పడానికి ఉదాహరణగా గత నెలలో స్వర్గస్థులైన మహారాష్ట్ర లోని నాగపూర్ కు చెందిన ఇద్దరు ప్రాక్టీషనర్లు అందించిన సేవలే నిదర్శనం. ప్రాక్టీషనర్11270, పి హెచ్డి మరియు వ్యవసాయ ఆర్ధిక శాస్త్రంలో ప్రొఫెసర్ గా పనిచేస్తూ వైబ్రియానిక్స్ ద్వారా వ్యవసాయ మరియు జంతు క్షేత్ర రంగాలలో విశేష సేవలందిస్తూ తన 84వ ఏట పరమపదించారు. ప్రాక్టీషనర్10590, విశ్రాంత శస్త్రచికిత్సా నిపుణులు. 2007లో  నాగపూర్ లో మొబైల్ మెడికల్ సేవలు వంటి అనేక సేవలకు ఆద్యులు. వీరు తన 86వ ఏటి వరకూ సంక్లిష్టమైన కేసులతో సహా అనేక కేసులను పరిష్కరించి వైబ్రోరంగానికి విశేష సేవలందించారు. ఈ ఇద్దరు కూడా తమ ప్రజ్ఞతో స్థానికంగా ఉన్న ప్రాక్టీషనర్లకు సమస్యా నివారణ లో కూడా ఇతోదికంగా కృషి చేసారు. 

ఈ వైబ్రో రంగము ద్వారా మొక్కలు, జంతువులు, మానవులకు నిస్వార్ధంగా సేవలందించడం నిజంగా ఒక అధ్బుతమైన దివ్యమైన భవ్యమైన సేవ అని నా అభిప్రాయము. ఇట్టి మహత్తరమైన  సేవా రంగంలో ప్రాక్టీషనర్ లందరూ పాల్గొంటూ ప్రాంతీయం గానూ ప్రపంచవ్యాప్తంగాను దీనిని విస్తరించడానికి, కొంగ్రొత్త ప్రణాలికలతో ముందుకు తీసుకు వెళ్ళడానికి ముందుకు వస్తారని నా ఆకాంక్ష మరియు ప్రార్ధన.

ప్రేమతో సాయి సేవలో మీ

జిత్.కె.అగ్గర్వాల్

 

హైపోఖాండ్రియా /వ్యాధి లేకపోయినా ఉన్నట్లుగా భ్రమించడం 11567...India

 35-సంవత్సరాల జీవశాస్త్ర ఉపాధ్యాయుడు గత 4 సంవత్సరాలుగా బెంగగా ఉంటున్నారు. మాములుగా చూడడానికి బాగానే కనిపిస్తున్నా చిన్న చిన్న విషయాలకే వీరు ఆందోళన చెందుతూ ఉంటారు. ఎప్పుడైనా వీరి స్నేహితుడికో, లేక బంధువుకో రక్తపోటు అనిగానీ, మధుమేహం అని గానీ వింటే తనకి కూడా ఆ వ్యాధి వచ్చిందేమో అని కంగారు పడతారు.  ఇటువంటి అర్ధంలేని భయాలతో వీరికి పాదాలలో తిమ్మురులు, మధుమేహం ఉన్నట్లు భ్రాంతి, ఛాతిలో నొప్పి, గుండె దడ, రక్తపోటు ఉన్నట్లు భ్రాంతి, ఛాతిలో మంట, జీర్ణకోశ వ్రణములున్నట్లు భ్రాంతి, ఇవన్నీ కలుగుతున్నాయి. విపరీతమైన భయం దానితోపాటు పైన పేర్కొన్న వ్యాధులు ముఖ్యంగా గుండె దడ వీరి ఆందోళనను పెంచి నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఎన్నోసార్లు ఆత్మహత్య చేసుకుందామని కూడా భావించారు. ఇదంతా కూడా కేవలం ఒక మానసిక రుగ్మత తప్ప శరీర రీత్యా ఏ ఇబ్బంది లేదని కేవలం మానసిక ఆందోళన, వత్తిడి వలననే ఈ భ్రాంతులు కలుగుతున్నాయని పేషంటుకు కౌన్సిలింగ్ ఇవ్వబడింది. పేషంటు యొక్క బి.పి, షుగరు, కొవ్వు పదార్ధాల శాతం అన్నీ కూడా నార్మల్ గా ఉన్నాయని వారికి చూపించి స్థిమిత పరచడం జరిగింది.   

 2016, ఆగస్టులో క్రింది రెమిడి వీరికి ఇవ్వబడింది :

#1. CC4.5 Ulcers + CC4.10 Indigestion + CC10.1 Emergencies + CC12.1Adult tonic + CC14.1 Male tonic + CC15.1 Mental & Emotional tonic + CC15.2 Psychiatric disorders + CC18.1 Brain disabilities...TDS

15 రోజుల తర్వాత  వీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు తనకి ఆందోళన తగ్గింది గానీ ఇంకా అటువంటి ఆలోచనలు వస్తున్నాయని చెప్పారు. రెండు నెలల తర్వాత అతను, గత కొన్ని వారాలుగా రెమిడి తీసుకోకపోవడం వలన తన పరిస్థితి అధ్వాన్నంగా మారిందని చెప్పారు. అతని భయాలన్నీ పోగొట్టి నచ్చచెప్పి, రెమెడీని మరువకుండా నియమం ప్రకారం ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి, రెమిడి ని క్రింది విధంగా మార్చి ఇవ్వడం జరిగింది:

#2. CC17.2 Cleansing + #1...TDS

పేషంటుకు ధ్యానము, ప్రాణాయామము వంటివి చేస్తూ విశ్రాంతి పొందవలసిందిగా సలహా ఇవ్వబడింది. ఒక వారము తర్వాత తనకు చెడు ఆలోచనలు రావడం, ఆందోళన 20%తగ్గినట్లు పేషంటు తెలియజేసారు. నెల రోజుల తర్వాత 90%మెరుగయ్యింది.  #2 ను అలాగే కొనసాగించవలసిందిగా సూచించడమైనది. నాలుగు నెలలు వాడిన తర్వాత పేషంటు 100% పూర్తి ఆరోగ్యవంతులయ్యారు. ఐనప్పటికీ TDS గా 2 నెలలు, BD గా 2 నెలలు చివరగా OD గా 1 నెల కొనసాగించారు. తనకు పూర్తిగా నమ్మకము ఆత్మవిశ్వాసము చేకూరిన తర్వాత రెమిడి తీసుకోవడం ఆపారు. పేషంటు అనుదినమూ యోగా చేస్తూ ఆరోగ్యవంతమైన జీవనవిధానాన్ని అనుసరిస్తున్నారు.

సంపాదకుని వ్యాఖ్య : *హైపోఖాండ్రియాసిస్ లేదా హైపోఖాండ్రియా అనేది ఒక వ్యక్తి అనవసరంగా తనకేదో జబ్బు ఉన్నట్లు అనుక్షణం భ్రమించే స్థితి. ఇది శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఏ జబ్బూ లేదని మెడికల్ రిపోర్టులు సూచిస్తున్నా ఇంకా తనకేదో జబ్బు ఉందని బెంగ పెట్టుకోవడంగా చెప్పవచ్చు. హైపోఖాండ్రియా ఉన్న పేషంటును హైపోఖాండ్రియాక్ అంటారు. ఈ హైపోఖాండ్రియాక్లు ఏ చిన్న రోగ లక్షణాన్ని ఇతరులలో గమనించినా తమకు కూడా అది ఉందని అదొక పెద్ద జబ్బని ఆందోళన చెందుతూ ఉంటారు.

 

కంటి ఎరుపుదనం, నొప్పి, వాపు 11567...India

9-సంవత్సరాల అబ్బాయికి క్రింది ఫోటోలో చూపిన విధంగా ప్రాక్టీషనర్ వద్దకు రావడానికి ఒక రోజు ముందునుండి కంటికి పై రెప్ప లో వాపు, ఎరుపుదనం, నొప్పి కలిగాయి.

 
 
 
 
 
 
 
 
 
 
 

బాబుకు ఏదయినా పురుగు కుట్టడం, లేదా ఏదయినా దెబ్బ తగిలి నట్లు సమాచారము లేదు. బాబు తల్లిదండ్రులు చెప్పిన ప్రకారము కంటి వైద్య నిపుణులు ఆంటిబయోటిక్స్ మరియు కంటిలో వేసే చుక్కల మందు సూచించారు. కానీ వారికి వైబ్రో మందుల పట్ల ఉన్న ప్రగాడ విశ్వాసము వల్ల ఆలోపతి కన్నా ఇవే మంచివని భావించారు.

 2017ఆగస్టు 4 వ తేదీన ప్రాక్టీషనర్ క్రింది రెమిడి ఇచ్చారు :
CC7.3 Eye infections...6TD నీటిలో కలిపి వేసుకొనేందుకు

అంతేకాక కాచి వడకట్టిన నీటిలో ఇదే రెమిడి 30మి.లీ. ను చుక్కలమందు సీసాలో వేసి మూడు పూటలా కంట్లో వేసుకోవలసిందిగా  …TDS గా సూచించబడినది 

కంట్లో పైన పేర్కొన్న మందు వేసిన కొన్ని నిమిషాలలోనే బాబు ప్రాక్టీషనర్ తో కంట్లో మంట చాలా వరకూ తగ్గిపోయిందని చెప్పాడు. మర్నాటికల్లా నొప్పి పూర్తిగా మాయమయ్యింది. ఎరుపుదనం కూడా 75%.తగ్గిపోయింది. రెండు రోజుల తర్వాత అనగా ఆగస్టు 6వ తేదీన కంటి ఎరుపుదనం పూర్తిగా తగ్గిపోయి ఫోటో లో చూపిన మాదిరిగా మారిపోయింది.

 

 
 
 
 
 
 
 
 
 
 
 

కనుక డోసేజ్ 6TD నుండి TDS గా రెండు రోజుల వరకూ  OD గా మరో రెండు రోజుల వరకూ కొనసాగించి అనంతరం ఆపివేయబడింది.

కంట్లో వేసే చుక్కలమందు కూడా TDS నుంచి  OD గా సాయంత్రం పూట వేస్తూ అలా రెండు రోజులు కొనసాగించి ఆపివేశారు. ఇంత త్వరగా బాబుకు తగ్గిపోయినందుకు అతని తల్లిదండ్రులు చాలా ఆనందించారు. ఎందుకంటే దీనివలన బాబు యాంటి బయాటిక్స్ వేసుకునే బాధ తప్పింది.

ప్రాక్టీషనర్ వ్యాఖ్య CC7.3 Eye infections రెమిడిని, ఒక చుక్క ను 100 మి.లీ.నీటిలో వేసుకోవాలి. 30 మి.లీ.నీటిలో వేసుకుంటే కంట్లో మంట వచ్చే అవకాశం ఉంది.

అండాశయము లో తిత్తులు, బాధాకరమైన ఋతు క్రమం 11568...India

30-సంవత్సరాల మహిళ ఒక సంవత్సర కాలంగా ఋతు సంబంధమైన నొప్పితో బాధపడుతూ  2017మార్చి3 వ తేదీన  ప్రాక్టీ షనర్ ను సంప్రదించారు. ఈమెకు అధిక రక్తస్రావం తో పాటు ఎక్కువకాలం (15 రోజులపాటు) ఇది కొనసాగుతోంది. దీని నిమిత్తం  ఆమె అలోపతి మందులు 6 నెలల పాటు తీసుకున్నారు కానీ ఏమీ ప్రయోజనం కనబడలేదు. 2016 అక్టోబర్ లో ఆమె పొత్తికడుపు ను అల్ట్రాసౌండ్ స్కానింగ్ తీయించగా ఆమె అండాశయం కుడిప్రక్క 16మీ.మీ.కణితి ఉన్నట్లు తెలిసింది. నెల తర్వాత శస్త్ర చికిత్స చేసి దానిని తొలగించగా ఆమెకు అధిక రక్తస్రావం ఆగిపోయి నెలరోజుల పాటు చక్కగా ఉన్నారు. మరుసటి నెలలో మరలా పేషంటుకు సమస్య యధాతదంగా కొనసాగడం మొదలయ్యింది.

కణితి మరలా ఏర్పడిందేమో అన్న అనుమానంతో మరలా స్కాంనింగ్ తీయించగా తొలగించిన ప్రాంతంలోనే తిరిగి 17మీ.మీ.కణితి కనిపించింది. (రిపోర్టులు ఉన్నాయి). డాక్టర్లు ఆమెను మరలా శస్త్రచికిత్స చేయించుకోవాలని సూచిస్తూ తాత్కాలిక ఉపశమనం కోసం నొప్పి నివారణ గోళీలు ఇచ్చారు. ఐతే  మరలా శస్త్ర చికిత్స చేయించు కోవడానికి  ఆమె సుముఖంగా లేరు ఎందుకంటే ఇది ఖర్చుతో కూడినదే కాకుండా ఎన్నాళ్ళు ఇలా కొనసాగుతుందో కూడా తెలియదు.    

వైబ్రో మందులు ప్రారంభించే నాటికి ఆమె తన ఋతు చక్రంలో రెండవ రోజు గడుస్తున్నది. ఆమె దీని నిమిత్తం మరే ఇతర మందులు తీసుకోవడం లేదు. 2017 మార్చి 22 న వీరికి క్రింది రెమిడి ఇవ్వబడింది. :

CC2.3 Tumours & Growths + CC3.7 Circulation + CC8.4 Ovaries & Uterus + CC10.1 Emergencies + CC15.1 Mental & Emotional tonic…6TD

రెమిడి తీసుకోవడం ప్రారంభించిన వెంటనే ఆమెకు ఎంతో ఉపశమనం కలిగింది. మూడు వారాల తరువాత డాక్టర్ సూచన పైన పొత్తికడుపు ను మరొకసారి స్కానింగ్ చేయించుకున్నారు. కణుతులేవి లేనట్లు రిపోర్టు వచ్చింది. (ఈ రిపోర్టులు కూడా ఉన్నాయి).  అంతేకాకుండా సర్జెరీ చేయవలసిన అవసరం కూడా లేనందుకు ఆమె ఎంతో ఉపశమనం పొందారు.  17మి.మీ. తిత్తి ఆపరేషన్ లేకుండా అలోపతి మందులేవి వాడకుండానే అదృశ్యం అవడం చూసి డాక్టర్ ఎంతో ఆశ్చర్యపోయారు. ఆమెకు రక్తస్రావం కూడా చాలా స్వల్పంగా అవుతూ 8వ  రోజుకు అదికూడా ఆగిపోయింది. అలాగే నొప్పి, మంట, కాళ్ళలో వాపు, నీరసం కూడా తగ్గిపోయాయి. మొత్తం మీద ఆమెకు అన్ని లక్షణాలకు సంబంధించి 75% ఉపశమనం కనిపించింది. అందుచేత మరో రెండు వారాలు ఇదే రెమిడిని  TDS గా తీసుకోవలసిందిగా ప్రాక్టీషనర్ సూచించారు. పేషంటు యొక్క తరువాతి ఋతు చక్రం నాటికి వ్యాధి లక్షణాలన్నీ పూర్తిగా మాయమవడమే కాక రక్తస్రావం కూడా సాధారణ స్థాయి లో  4-5 రోజులు మాత్రమే కొనసాగింది. పేషంటు ఇప్పుడు చాలా బలంగా ఆరోగ్యంగా కనిపించారు. రెమిడిని మరొక నెల రోజులు OD గా తీసుకోని అనంతరం ఆపివేయవలసిందిగా సూచింపబడింది. 2018 జనవరి నాటికి వ్యాధి లక్షణాలేవి పునరావృతం కాకుండా పేషంటు ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నారు.

 

పునరావృతమవుతున్న జలుబు 03533...UK

బ్రిటన్ దేశానికి చెందిన  65-సంవత్సరాల వయసు గల మహిళ గత 30 సంవత్సరాలుగా సంవత్సరానికి ఒకసారి అక్టోబర్ నెలలో మలేషియాలో ఉన్నతమ కుటుంబీకులతో 6 వారాల పాటు గడుపుతూ ఉంటారు. ఇలా మలేషియా వెళ్ళిన ప్రతీసారీ  జలుబు,తీవ్రమైన దగ్గు సైనుసైటిస్ కలుగుతూ ఉన్నాయి.  బహుశా ఇది ప్రయాణపు బడలిక వలన గానీ లేదా కాలుష్యం వలన గానీ కలుగుతున్నట్లు ఆమె భావించారు. ఈ సందర్శనలు ఇటు ఈమెకే కాక వారి కుటుంబ సభ్యులు కూడా ఈ వ్యాధుల బారిన పడడంతో  వారికీ ఇబ్బంది కలిగిస్తున్నాయి. పేషంటు తనంతటతానే శ్లేష్మ నివారణకు డికాగ్నిస్టెంట్ లు ,ఇంకా యాంటి హిస్టమిన్లు, పారసిటమాల్ ట్యాబ్లెట్లు వాడుతూ ఉంటే ఇవి ఆమె బాధలు తగ్గించడానికి బదులు ఆమె మగతగా మత్తుగా ఉండేలా చేస్తున్నాయి.,  చివరికి ఆమె  ఏ పరిస్థితికి వచ్చారంటే ఇక మలేషియా వెళ్ళడం కూడా మానుకోవలనుకున్నారు ఎందుకంటే ఆమె తిరిగి యుకె చేరే సరికి శక్తంతా హరింప బడి నీరసంగా ఐపోతున్నారు. ఇది ఆమె చేసే మిడ్వైఫ్ పనికి అంతరాయం కలిగిస్తోంది. 2015 అక్టోబర్ 18 వ తేదీన అనగా వీరు మలేషియా వెళ్ళడానికి 3 రోజులు ముందు ఈమెకు క్రింది రెమిడి ఇవ్వడం జరిగింది.:

CC9.2 Infections acute + CC10.1 Emergencies + CC15.1 Mental & Emotional tonic...BD

తను అక్కడ ఉన్నంతకాలము పేషంటు మందులను వేసుకోవడం జరిగింది. అంతేకాక తన కుటుంబ సభ్యులకు ముందు జాగ్రత్తగా ఇవ్వడం నిమిత్తం కొన్ని మందులను కూడా వీరు తీసుకెళ్ళారు. ఐతే కొందరే వీటిని వేసుకోవడం జరిగింది.అత్యంత ఆశ్చర్యకరంగా 30 ఏళ్లలో మొదటిసారి  ఆమెకు జలుబు వంటివేమీ రాలేదు.అలోపతి మందులు వాడని మూలంగా ఆమెకు నిద్రమత్తు కూడా  లేకుండా పోవడంతో తన కుటుంబ సభ్యులతో ఒక పెళ్లి సందర్భంగా ఆనందంగా గడపడానికి వీలయ్యింది. వీరి కుటుంబ సభ్యులు ఎవరయితే రెమిడి లు వాడారో వారు జలుబు బారిన పడకుండా హాయిగా ఉంటే రెమిడి లు తీసుకోనివారు మాత్రం ఆ లక్షణాలతో బాధ పడవలసి వచ్చింది. పేషంటు తిరిగి ఇంగ్లండు వచ్చాకా కూడా బలంగా ఆరోగ్యంగా ఉండగలిగారు. 2016.ఏప్రిల్ 5 న పేషంటు రెమిడి తీసుకోవడం మానేసారు. వీరు పార్ట్ టైం గా చేసే మిడ్ వైఫ్ ఉద్యోగం కొనసాగిస్తూ రాత్రిళ్ళు కూడా ఏ సమస్యా లేకుండా విధి నిర్వహణ చేయగలుగు తున్నారు. 2016 నవంబర్లో తను మలేషియా వెళ్ళవలసి వచ్చినపుడు వీరి కుటుంబ సభ్యులు తమకు కూడా రెమిడి మందులు తీసుకు రావలసిందిగా సూచించారు. పేషంటు తను వెళ్ళడానికి ముందే రెమిడి లు వేసుకోవడం ప్రారంభించి అక్కడ ఉన్నంతకాలము హాయిగా ఆరోగ్యంగా గడిపారు. 2017అక్టోబర్ 10 వ తేదీన తన వార్షిక ప్రయాణానికి ముందు వీరు ప్రాక్టీ షనర్ ను కలసినపుడు ఎంతో ఆరోగ్యంగా ఉండడమేకాక  2015 లో చికిత్స మొదలు కాక ముందు ఉన్న జలుబు,ఫ్లూ వంటివి మరలా పునరావృతం కాలేదు. తను మలేషియా వెళ్ళడానికి ఒక నెల ముందు నుంచి రెమిడి లు మొదలు పెట్టి తిరిగి వచ్చిన తర్వాత మూడు నెలలు కొనసాగించ వలసిందిగా సూచింపబడింది. వీరు యోగా తరగతులకు వెళుతూ ఆరోగ్యవంతమైన ఆహారము తింటూ చక్కని జీవనవిధానము గడుపుతూ ఆనందంగా ఉన్నారు.

సంపాదకుని వ్యాఖ్య సాధారణంగా ప్రయాణానికి 3 రోజులు ముందు రెమిడి తీసుకుంటే సరిపోతుంది.

తీవ్రమైన పళ్ళు మరియు చిగుళ్ళ వ్యాధి 10375...India

47-సంవత్సరాల వ్యక్తి గత 6 సంవత్సరాలుగా తీవ్రమైన పళ్ళు మరియు చిగుళ్ళ వ్యాధితో బాధపడుతున్నారు.వీరికి చిగుళ్ళ ఇన్ఫెక్షన్ మరియు మరియు వాటినుండి రక్తస్రావం అవుతూ ఉండడం వలన చాలా బాధ ననుభవిస్తున్నారు. ఇతని పళ్ళు చాలావరకు పింగాణీ పూతను కోల్పోయాయి. 40% వదులుగా కూడా ఐపోయాయి. గట్టిగా ఉన్నపదార్ధాలు ఏమీ కూడా వీరు తినే పరిస్థితి లేదు. వీరి కుటుంబ చరిత్ర చూచినట్లయితే జన్యుపరమైన కారణాల వలన ఈ వ్యాధి వచ్చినట్లు సూచిస్తున్నాయి. వీరి చిగుళ్ళకు వ్యాపించిన ఇన్ఫెక్షన్ వలన రెండు పళ్ళు పాడయిపోవడం తో 2012 మే నెలలో వాటిని తొలగించడం జరిగింది. బాధ ఉన్నప్పటికీ వీరు అలోపతి వంటి మందులేమీ తీసుకో లేదు.

  2012జూలై  23  న పేషంటు యొక్క శ్రీమతి గా ఉన్న వైబ్రియానిక్స్ ప్రాక్టీషనర్ 12051...ఇండియా ,ఇతనికి క్రింది రెమిడి ఇచ్చారు.:

#1. CC11.5 Mouth infections + CC11.6 Tooth infections + CC21.11 Wounds & Abrasions...TDS

పేషంటుకు రక్తం కారడం కొంచం తగ్గింది కానీ రెండు నెలల తర్వాత అతనికి ఫ్లాప్ శస్త్రచికిత్స ( అనగా పంటి చిగుళ్ళ వ్యాధి వలన పాడయిన ఎముకలను చిగుళ్ళను శుభ్రపరచడం) ఈ సందర్భంలోనే వదులుగా ఉన్న మరొక పంటిని కనుగొనడం జరిగింది.కొన్ని నెలల తర్వాత దీనిని తొలగించడం జరిగింది. .ఇంకా పింగాణి పూత పోతున్న ఆనమాలే కనిపిస్తూ ఉండడంతో, #1 క్రింది విధంగా మార్చడం జరిగింది.: 

#2. CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC20.2 SMJ pain + CC20.6 Osteoporosis + #1...TDS

ఇలా మూడు సంవత్సరాలు ఏ ఇబ్బంది లేకుండా గడవడం తో పేషంటు ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది. ఏ ఇతర మందులు వాడక పోయినా ఈ వైబ్రియానిక్స్ మందుల వల్లనే తనకు పళ్ళు పాడవడం  ఆగిపోయిందని చెప్పారు. ఐతే  ఈ పేషంటుకు ఇంకా కొన్ని వదులుగా ఉన్న పళ్ళు ఉన్నాయి. 2015 జూలై 18 న పేషంటు ఒక సీనియర్ ప్రాక్టీషనర్ ను సంప్రదించారు. వారు  #2 ను క్రింది విధంగా మార్చడం జరిగింది.

#3. NM6 Calming + NM59 Pain + BR4 Fear + SM27 Infection + SM28 Injury + SM36 Skeletal + SM38 Teeth + SR246 Stomach + SR264 Silicea 6X&30C + SR295 Hypericum 30C + SR296 Ignatia + SR315 Staphysagria…6TD 

 2 నెలల తర్వాత పేషంటు తనకు చిగుళ్ళ బాధ,వదులుగా ఉండే పళ్ళ బాధ నుండి 30% ఉపశమనం లభించిందని చెప్పారు  #3 ను అలాగే కొనసాగించి రెండు నెలల తర్వాత అన్ని లక్షణాల నుండి 90% ఉపశమనం లభించిందని చెప్పారు. 2016,మార్చి నెలలో పంటి వైద్యుడిని సంప్రదించగా  పేషంటు యొక్క ఆరోగ్యవంతమైన చిగుళ్ళు , గట్టిగా ఉన్నపళ్ళు చూసి ఆశ్చర్య పోయి వైబ్రో మందులనే కొనసాగించవలసిందిగా సూచించారు. 2016 ఏప్రిల్ లో డోసేజ్ ను TDS కు తగ్గించడం జరిగింది. జూలై నెలలో పేషంటు తిరిగి సందర్శించి నపుడు తనకు 100% స్వస్థత చేకురిందని చెప్పారు. 2016 సెప్టెంబర్ లో సాధారణంగా చేయించుకొనే క్లీనింగ్ కోసం వెళ్ళినపుడు ఇకనుండి క్లీనింగ్ అవసరం లేదని దంతవైద్యుడు చెప్పారు. రెమిడిలు వేసుకోవడం తో పాటు పేషంటు రెండు పూటలా బ్రష్ చేసుకోవడం,లిజరిన్ తో తోమి పుక్కిలించి ఊయడం కూడా అనునిత్యమూ చేస్తూ ఉంటారు.  2017అక్టోబర్ నాటికి పేషంటుకు చిగుళ్ళ బాధలు పంటి బాధలు పూర్తిగా పోయి ఆనందంగా ఉన్నారు ఐతే జాగ్రత్త కోసం రెమిడి, #3 ని TDS. గా కొనసాగించారు

పేషంటు వ్యాఖ్య : ఇప్పుడు నా పళ్ళ గురించి నాకు ఏమాత్రం చింత లేదు.గతంలో నేను మెత్తగా ఉన్న పదార్ధాలను తినడానికి కూడా భయపడే వాడిని. ఇప్పుడు నేను అన్ని రకాల పదార్దాలు,గింజలు,దక్షిణ భారతీయ మషాలా వంటకాలతో సహా ఎంతో హాయిగా   తినగలుగు తున్నాను. నాకు ఈ విధంగా వైబ్రియానిక్స్ తో కొత్త జీవితాన్ని ప్రసాదించి నందుకు స్వామికి ఎంతో కృతజ్ఞతలు తెలుపు కుంటున్నాను.

 

పరిక్షలంటే అత్యంత భయం 03555...UK

2017 సెప్టెంబర్ 24 వ తేదీన 22-సంవత్సరాల మెడికల్ స్టూడెంటు  మరో 5 రోజులలో ప్రారంభం కానున్న పరీక్షలు గురించి ఆందోళన చెందుతూ ప్రాక్టీషనర్ ను సంప్రదించాడు. అతని సమస్య ఏమిటంటే తను  ఎప్పుడు పరీక్షలు వ్రాయాల్సి వచ్చినా ఎంతో వత్తిడికి ఆందోళనకు గురి అవడమే కాకుండా ఏమీ తినడానికి కూడా మనస్కరించదు. తలలో విపరీతమైన పార్శ్వపు నొప్పి వచ్చి దేనిమీద ఏకాగ్రత చూపలేని పరిస్థితి. దీనితో పాటుగా పదే పదే మూత్ర విసర్జనకు వెళ్ళవలసి వస్తుంది. ఈ పరిస్థితుల దృష్ట్యా పరీక్షలలో కూడా ఉత్తీర్ణుడు కాలేకపోతున్నాడు. గతంలో ఈ పేషంటు కొన్ని ఫ్లవర్ ఎస్సెన్ సెస్ తీసుకున్నాడు కానీ ఫలితం ఇవ్వలేదు. మరే ఇతర మందులు కూడా ఈ యువకుడు వాడలేదు.  ఈ సమస్య తప్ప ఇతనికి మరే ఇతర సమస్యలు లేవు. ప్రాక్టీషనర్ ఇతనిని సముదాయించి త్వరలోనే తగ్గిపోతుందని భరోసా ఇచ్చి క్రింది రెమిడి ఇచ్చారు.

CC11.4 Migraines + CC12.1 Adult tonic + CC13.3 Incontinence + CC15.1 Mental & Emotional tonic + CC17.3 Brain & Memory tonic...TDS­

పేషంటుకు మొదటి డోసు ఇచ్చినప్పుడు ఎగిరి గంతేసి  "నా హృదయాన్ని ఎదో తాకింది......నాకు ఎప్పుడూ ఇటువంటి అనుభవం ఎదురు కాలేదు " అన్నాడు! మెల్లగా అతను మామూలు స్థితికి వచ్చాడు. ప్రాక్టీషనర్ అతన్ని సముదాయిస్తూ అంతా సవ్యంగా ఉంటుందని  ధైర్యంగా అతను పరీక్షలు రాయగలుగు తాడని ఊరడించారు.  

 పరీక్షలైన తర్వాత  సెప్టెంబర్  30 వ తేదీన ఇతను ప్రాక్టీ షనర్ వద్దకు వచ్చి తను పరీక్షలు చాలా బాగా రాయగలిగాననీ వైబ్రియానిక్స్ మందులు తనకు 100%.సహాయ పడ్డాయని చెప్పాడు. అలాగే పరీక్షలకు ముందు వెనుక కూడా తను ప్రశాంతంగానే ఉండగాలిగాననీ మునుపటి మాదిరిగా అనేకసార్లు వాష్ రూముకు వెళ్ళవలసిన పరిస్థితి రాలేదని చెప్పాడు. ఇప్పుడతనికి పార్శ్వపు నొప్పి గానీ, ఆందోళన గానీ వత్తిడి గానీ ఏదీ లేదు. ఇంత త్వరలో ఎంత మార్పు నమ్మలేకపోతున్నాను అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. 

వెన్ను నొప్పి 11578...India

2016, మే 23 వ తేదీన 53-సంవత్సరాల ఆస్ట్రేలియా దేశస్తుడు దీర్ఘకాలిక వెన్నునొప్పి గురించి ప్రాక్టీషనర్ ను కలిశారు. 12 సంవత్సరాల క్రితం అతనికి వీపు పైన తగిలిన దెబ్బ కారణంగా ఇది ఏర్పడింది. ఇతని వీపంతా నొప్పి ఉన్నప్పటికీ వీపుకు క్రింది భాగంలో  మాత్రం నొప్పి భరింప రానిదిగా ఉంది. ప్రతీ రోజూ నొప్పితో బాధపడడం ఒక ఎత్తైతే ప్రొద్దుటే నిద్ర మంచం మీదనుండి లేవడంనరక ప్రాయంగా ఉంది . పేషంటు అలోపతి మందులను 6 నెలల పాటుగా క్రమం తప్పకుండా తీసుకొని అనంతరం బాధ భరింపరానిదిగా ఉన్నప్పుడే తీసుకొనసాగారు .ముఖ్యంగా బాధ చలికాలంలో మరి ఎక్కువగా ఉంటోంది. ఇలాంటి స్థితిలో పేషంటుకు క్రింది రెమిడి ఇవ్వబడింది:

CC3.7 Circulation + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC18.5 Neuralgia + CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue + CC20.5 Spine + CC20.7 Fractures…TDS నీటితో

చికిత్స మొదలు పెట్టిన కొద్ది రోజులకే శీతాకాలంలో వీరు ఆస్ట్రేలియా వెళ్ళవలసి వచ్చింది. రెండు వారాలలోనే తను ఉన్న ప్రాంతంలో శీతల వాతావరణం ఉన్నప్పటికీ వీరికి  వెన్ను నొప్పి చాలా వరకూ తగ్గి పరిస్థితి మెరుగ్గా ఉంది. నాలుగు వారాలలో వీరికి 40% శాతం మెరుగుదల కనిపించి 6 వారాల కల్లా నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. వెన్ను భాగం మునుపటికన్నా మృదువుగా అవడంతో గుండ్రంగా తిరగడంలో గానీ ఉదయమే మంచం మీదనుండి లేవడం లో గానీ ఇబ్బంది పడడం లేదు

రెమిడి ని మరో రెండు వారాలు తీసుకోని ఆ తరువాత తనకున్న అంతర్జాతీయ ప్రయాణాల వత్తిడి కారణంగా మందులు తీసుకోవడం మానేసారు. వైబ్రో మందులు తీసుకునే సమయంలో మరే ఇతర అలోపతి మందులు కూడా తీసుకోలేదు.

  2017 జూలై నెలలో అనగా చికిత్స మొదలు పెట్టిన సంవత్సరం తర్వాత వీరు ప్రాక్టీషనర్ ను కలిసి తనకు పూర్తిగా తగ్గిపోవడమే కాక మరలా రాలేదని  ఇప్పుడు కనీసం నొప్పి నివారణ ట్యాబ్లెట్ కూడా వేసుకోలేదని ఆనందంతో తెలియజేసారు.

కృశించిపోతున్న మొక్క 03108...Greece

2017 వ సంవత్సం వేసవిలో ప్రాక్టీ షనర్ తమ ఇంట్లో పెరుగుతున్న గార్డెనియా మొక్కకు గత కొన్ని వారాలుగా కొత్తగా వస్తున్న ఆకులతో పాటు పాతవన్నీ పసుపురంగులోనికి మారిపోతున్నాయి.  గార్డెనియా మొక్కలలో ఇది సహజమే దానికి కారణాలు కనుగొనలేము. వీరి తోటమాలి మొక్కకు కావలసిన ఐరన్, మెగ్నీషియం, వంటి పోషకాలన్నీ వేసారు కానీ ఫలితం లేదు.ఆ తర్వాత నేల యొక్క pH విలువ ఎంత ఉందో తెలుసుకొని నీరు పోయడం కూడా తగ్గించారు. కానీ మార్పేమీ లేదు. తన ప్రయత్నమంతా చేసిన తర్వాత ఇక ఆ మొక్క బ్రతకడం కష్టమని దాన్ని వ్రేళ్ళతో సహా పెకలించివేయాలని అనుకొన్నారు.    

ఏమైనప్పటికీ ప్రాక్టీషనర్ 2017 జూలై  24 న మొక్కకు వైబ్రియో మందు ఇవ్వాలని తలచారు (ఫోటో చూడండి).

ఆమె ఒక చుక్క CC1.2 Plant tonic ను ఒక కప్పు నీటిలోవేసి రోజుకు 3-4 చొప్పున నాలుగు రోజులు ఇచ్చారు. అదే సమయంలో మొక్కతో మాట్లాడుతూ తన ప్రేమంతా వ్యక్త పరుస్తూ  త్వరగా కోలుకోవలసిందిగా మొక్కను కోరారు.  

నాలుగు రోజుల తర్వాత ఆమె ఏమీ గమనించారంటే ఆకుపచ్చగా ఉన్న ఆకులన్నీ అలాగే తాజాగా ఉన్నాయి. ఆ తర్వాత ప్రాక్టీషనర్ అనుకోకుండా నెల రోజుల పాటు ఊరు వెళ్ళవలసి వచ్చింది. ఐతే మొక్కకి ఆటోమాటిక్ గా నీళ్ళు వెదజల్లే విధంగా స్పింక్లెర్ మిషనును ఏర్పాటు చేసి వెళ్లారు. ఆమె వెళ్ళినప్పుడు ఎథెన్స్ నగరంలో వేసవి తాపం చాలా ఎక్కువగా ఉంది.  

 

 

 

కానీ సెప్టెంబర్ లో ప్రాక్టీ షనర్ తిరిగి వచ్చినప్పుడు వారిని అత్యంత ఆనందానుభూతి కి లోనుచేస్తూ మొక్క పచ్చగా ఆరోగ్యంగా కనిపించింది.

 

 

 

 

 

 

 

అక్టోబర్ లో తీసిన మరొక ఫోటో మొక్క ఆరోగ్యంగా అలానే పెరుగుతోందని దీనియొక్క ఆకుల సంఖ్య మరియు పరిమాణం కూడా పెరిగాయని సూచిస్తుంది.

కాలిపైన దీర్ఘకాలికంగాఉన్న గాయము (సెల్యులైటీస్) 02802...UK

76-సంవత్సరాల మహిళ గత రెండు నెలలుగా ఎడమకాలి క్రింది భాగంలో సెల్యులైటిస్ వ్యాధితో బాధ పడుతూ ఉన్నారు. ఆమెకు  ఈ కాలిపైన నొప్పి వాపు తో పాటుగా చర్మము ఎరుపురంగులోను ముట్టుకుంటే వేడిగానూ ఉంటోంది. గాయంతో ఉన్నప్పటి నుండీ అలోపతి మందులు వాడుతూనే ఉన్నారు కానీ ఏమాత్రం ప్రయోజనం కనబడలేదు. 2017 జూన్ 21 వ తేదీన ఆమెకు  క్రింది రెమిడి ఇవ్వబడింది: 

CC3.7 Circulation + CC9.2 Infections acute + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental and Emotional tonic + CC17.2 Cleansing + CC18.1 Brain disabilities + CC21.11 Wounds and Abrasions…TDS

జూలై 14వ తేదీ నాటికి తనకు 80% వరకూ తగ్గిపోయిందని నొప్పి కూడా లేదని చెప్పారు. వైబ్రో రెమిడి ల ఫలితం చూసి వారం తర్వాత తనంతటతానే అలోపతి మందులు వేసుకోవడం మానేసారు. ఆగస్టు 21నాటికి వీరికి 95% మెరుగుదల కనిపించింది. అందువలన ప్రాక్టీ షనర్ డోసేజ్ ను OD కి తగ్గించారు.

  2017 సెప్టెంబర్ 10 నాటికి తనకు 100% పూర్తిగా తగ్గిపోయిందని పేషంటు చెప్పారు.ఐతే నెల వరకూ డోసేజ్ ను OD గా తీసుకోమని ఆ తర్వాత బాటిల్ పూర్తయ్యేంత వరకూ  OW తీసుకోమని ప్రాక్టీషనర్ సూచించారు.

దీర్ఘకాలిక రక్తపోటు 02799...UK

తన 76 సంవత్సరాల తల్లికి ఉన్న అధిక రక్తపోటు విషయంలో ఆందోళన చెందుతున్నఒక కుమార్తె  2016 జూన్ 27వ తేదీన ప్రాక్టీషనర్ ను కలిసారు. పేషంటుకు రక్తపోటు స్థిరంగా 205/105 ఉండడంతో  ఆమె భయాందోళనలకు గురయ్యి వెంటనే చికిత్స మొదలు పెట్టవలసిన స్థితిలో ఉన్నారు. . 

2003 లో పేషంటు కు మొదటి సారి స్వల్పంగా రక్తపోటు మొదలయ్యింది. ఆ సమయంలో రక్తపోటు 150/90 ఉండేది దీని నిమిత్తం ఆవిడ అలోపతి మందులు తీసుకునే వారు. కొన్ని సంవత్సరాల క్రితం పేషంటు భర్త చనిపోవడంతో కుమార్తే ఈమెను చూస్తూ ఉండేవారు. బహుశా భర్త మరణమే పేషంటు వ్యాధికి కారణమై  ఉండవచ్చు.

 2014, లో పేషంటు రక్తపోటు ఆమె అలోపతి మందులు వాడుతున్నప్పటికీ క్రమంగా పెరుగుతూ 205/105 కి చేరుకుంది.  ఈ విధమైన హై బి.పి. తో రెండు సంవత్సరాలు గడిపారు.  2016;మే 28 న ఆమెకు స్వల్పంగా గుండె పోటు వచ్చింది. ఆమెకు ఎడమవైపు స్వల్పంగా పక్షవాతం కూడా వచ్చింది. దీనికారణంగా  ఆమె నాలుగు అలోపతి మందులు తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. **(ఇవి క్రింద ఇవ్వబడ్డాయి)వీటివలన ఆమె త్వరగానే కోలుకొని నడవ గలిగారు కానీ రక్తపోటు మాత్రం అలోపతి మందులు వేసుకుంటున్నా అలానే కొనసాగింది. అదనంగా ఈ మందులు ఆమెకు మగతను తెచ్చిపెట్టడం తో ఆమె తన పాదాల పైన కుదురుగా నిలబడే పరిస్థితి లేక తూలిపోతూ చివరకు ఎవరో ఒకరి సహాయంతో ఇంట్లోనే ఉండిపోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈమె ప్రాక్టీషనర్ వద్దకు వచ్చినప్పుడు రక్తపోటు 205/105.గానే ఉంది.ఈమెకు క్రింది రెమిడి ఇవ్వబడింది : 

#1. CC3.1 Heart tonic + CC3.3 High Blood Pressure (BP) + CC3.5 Arteriosclerosis + CC3.7 Circulation + CC4.2 Liver & Gallbladder tonic + CC10.1 Emergencies + CC13.1 Kidney & Bladder tonic + CC15.1 Mental & Emotional tonic + CC15.2 Psychiatric disorders + CC18.1 Brain disabilities…QDS

#2. Sarpagandha పోటేన్ టైజ్ చేసినది 10M…QDS

మూడు నెలల తర్వాత పేషంటు యొక్క కుమార్తె తన తల్లి ఇంకా బలహీనంగాను,మత్తుగాను ఉంటున్నారని,ఆమె రక్తపోటు లో కూడా మార్పేమీ లేదని చెప్పారు. ఐతే మరొక కోణంలో చూస్తే ఆమె మానసికంగా మంచి స్థితి లోనూ,ఇంకా బలంగా ఆనందంగా కూడా కనిపిస్తున్నారు.అందుచేత ఆమె రెమిడి లు వాడడం కొనసాగించడానికే నిశ్చయించుకున్నారు. ఇలా మరొక నెల రోజులు వాడిన తర్వాత పేషంటు కు రక్తపోటు స్వల్పంగా  తగ్గి 190/95 స్థాయిలో నిలిచింది.. తనకి ఇంకా తలదిమ్ము పోలేదనే చెప్పారు. అదే సమయంలో రక్తపోటు తో ఉన్న మరొక  పేషంటులో వచ్చిన మార్పును ఆధారంగా చేసుకొని ప్రాక్టీ షనర్ క్రింది రెమిడి ఇచ్చారు.( దీనిని వీరు అడ్రినల్ డిస్ ఫంక్షన్ కొమ్బో అని పిలుస్తున్నారు )  

#3. SR261 Nat Mur + SR264 Silicea 30C + SR266 Adrenalin + SR280 Calc Carb 200C + SR290 Endocrine Integrity + SR295 Hypericum 200C + SR313 Sepia 1M + SR409 Spigelia 30C + SR451 ACTH Hormone + SR531 Suprarenal/Adrenal Gland + SR532 Sympathetic Nervous System + Iodum 30C from homoeo store…QDS

నెలా పదిహేను రోజులు వాడిన తరువాత పేషంటు యొక్క కుమార్తె చాలా ఉత్సాహంగా తన తల్లికి రక్తపోటు తగ్గిపోయిందని ప్రస్తుతం  160/90.వద్ద నిలకడగా ఉందని చెప్పారు. ఆమెకు మగత కూడా 40% తగ్గిందని ఇప్పుడు ఎవరి సహాయం లేకుండానే స్వతంత్రంగా ఉండగలుగు తున్నారని చెప్పారు.  వీరు తీసుకుంటున్న డాక్సజాసిన్  ( Doxazasine ) మందును అలోపతి డాక్టరు 4mg నుండి  2mg. తగ్గించారు.

నాలుగు నెలల తర్వాత అనగా  2017 ఏప్రిల్ లో ,పేషంటు రక్తపోటు 140/85 కు తగ్గి అలాగే స్థిరంగా కొనసాగింది. మగత నుండి కూడా పేషంటు పూర్తిగా కోలుకున్నారు.మరొక నెల తర్వాత  #1#2 మరియు  #3 యొక్క డోసేజ్  TDS. కు తగ్గించ నయినది.  2017అక్టోబర్ నెలలో తీసిన రక్తపోటు సూచి  150/70  గా ఉంది.మగత కూడా పూర్తిగా పోయింది. ఇప్పుడు పేషంటు ఆనందంగా ఆరోగ్యంగా ఉంటూ ఎవరి సహాయము లేకుండానే ఇంట్లో అన్ని పనులు చేసుకోగలుగుతున్నారు. వైబ్రో మందులను TDS గానూ అలాగే క్రింద సూచించిన అలోపతి మందులు కూడా తీసుకుంటున్నారు. ఈ విధంగా వైబ్రో మందుల వలన తనకు పూర్తి ఆరోగ్యం చేకూరినందుకు ఆనందం వ్యక్తపరుస్తూ తను బాబా భక్తురాలు కాకపోయినా పుట్టపర్తి సందర్శించాలని కోరుకుంటున్నారు.

*Losartan 50mg and Amlodipine 5mg.

** Ramipril 5mg BD, Bisoprolol 5mg BD, Indapamide 2.5mg BD మరియు రాత్రి పూట  Doxazasine4mg.

సంపాదకుని వ్యాఖ్య : సర్పగంధ (Rauwolfia Serpentina లేక  black snakeroot) అనే ఆయుర్వేద ఔషదం రక్తపోటు నివారణకు నిద్రలేమి తనానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఐతే దాని వైబ్రేషణ్ మాత్రమే తీసుకోవాలి కానీ బాహ్య రూపంలో పదార్ధము తీసుకోవాల్సిన అవసరం లేదని సూచన.

 

అరి పాదాల పైన దురద మరియు పొక్కులు 11585...India

11 సంవత్సరాల బాబు గత  రెండు సంవత్సరాలు గా అరిపాదాల లలో దురద మరియు పోక్కులతో బాధపడుతూ ఉన్నాడు. ఈ సమస్య వర్షాకాలం చివరిలో స్వల్పంగా దురదతో ప్రారంభమయ్యింది.  దురద అనిపించినప్పుడల్లా ఉపశమనం కోసం రెండుకాళ్ళు ఒకదానితో ఒకటి రుద్దుతాడు.  దీనివలన పొక్కులు చితికి ఒక విధమైన రసి కారుతూ పుండ్లుగా మారి బాధను  మరింత పెంచుతున్నాయి. ఈ బాధ కారణంగా బాబు పాఠశాలకు బూట్లు వేసుకొని వెళ్ళ లేక పోతున్నాడు. బాబు అలోపతి మరియు హోమియోపతి మందులు వరుసగా 6 నెలల చొప్పున వేసుకున్నాడు కానీ ఉపశమనం కలుగలేదు. అందువలన బాబు తల్లి మందులు వేయడం ఆపి 2017 మే 31న ప్రాక్టీషనర్ ను సంప్రదించారు..ప్రాక్టీషనర్ బాబుకు క్రింది రెమిడి ఇచ్చారు.

CC12.2 Child tonic + CC21.8 Herpes + CC21.11 Wounds & Abrasions…TDS 

ఒక వారం రెమిడి వాడగానే బాబు దురద వల్ల కాళ్ళు రుద్దడం మానేసాడు. దురద 50% వరకూ తగ్గిందని చెప్పాడు. మరో రెండు వారాలు వాడిన తర్వాత 80%మెరుగుదల వచ్చిందనీ దురద పూర్తిగా తగ్గిందని పొక్కులు చాలావరకూ తగ్గిపోయాయని చెప్పాడు. ఇదే డోసేజ్ ను మరో రెండు వారాలు వాడాడు. దీంతో అతని వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది. బాబు తల్లిదండ్రులకు ఆనందం ఉపాధ్యాయులకు ఆశ్చర్యం కలిగే రీతిగా  బాబు బూట్లు ధరించిస్కూలు కు వెళ్ళడం ప్రారంభించాడు.  

 2017జూలై 5 వ తేదీన డోస్ తగ్గించడం ప్రారంభమయ్యింది. ప్రాక్టీషనర్ డోసేజ్ ను BD గా రెండు వారాలు, OD రెండు వారాలు,మరియు OW గా మూడు వారాలు కొనసాగించడం జరిగింది.  2017ఆగస్టు 18 వ తేదీన బాబు తల్లి వారి అబ్బాయికి పూర్తిగా తగ్గిపోవడంతో  రెమిడి వేయడం మానేసినట్లు చెప్పారు. 2017అక్టోబర్ నాటికి  బాబుకు తిరిగి మునుపటి వ్యాది చిహ్నాలు ఏమీ లేకుండా ఆనందంగా ఉన్నాడని తెలిపారు.

తరుచుగా వచ్చే తలపోటు 03554...Guyana

2016 నవంబర్ 1వ తేదీన 56-సంవత్సరాల మహిళ తరుచుగా తనను బాధించే తలనొప్పి నుండి ఉపశమనం కోసం ప్రాక్టీషనర్ ను సంప్రదించారు. 5 సంవత్సరాల క్రితం ఇంట్లో జరిగిన గొడవల కారణంగా ఈమె భర్త కర్ర్ర తో తల పైన కొట్టడంతో అప్పటినుండి నొప్పి మరియు  తలపోటు ఈమెను బాధిస్తోంది. డాక్టర్ ఏమి చెప్పారంటే తల పైన బలంగా మోదడం వలన మెదడంతా కదిలి కొన్ని కణాలు దెబ్బతినడం కారణంగా ఈ ఇబ్బంది కలుగుతోందని ఈమె శేష జీవితమంతా ఈ నొప్పిని భరించ వలసిందేనని దీనికి నివారణ ఏమీ లేదని చెప్పారు. దీనితో నిస్పృహ చెంది తలనొప్పి వచ్చినప్పుడల్లా అలోపతి నొప్పి నివారిణి వేసుకొన సాగారు

  2016 ఆగస్టులో భర్త గతించిన తర్వాత ఈమెకు నడుము లోనూ చాతీ లోనూ నొప్పి రావడం మొదలయ్యింది. ఆమె ఇద్దరు డాక్టర్లను సంప్రదించగా ఒకరు భర్త మరణం వలన మానసిక వత్తిడి కారణంగా ఈ బాధ కలుగుతోందని మరొకరు కీళ్ళనొప్పులు కారణంగా కలుగుతోందని చెప్పారు. ఈమె వారు చెప్పిన రీతిగా మందులేమి తీసుకోకుండా ప్రాక్టీషనర్ ను సంప్రదించారు.వీరికి క్రింది రెమిడి ఇవ్వబడింది : 

తలనొప్పికి :

#1. CC11.3 Headaches + CC11.4 Migraines + CC18.1 Brain disabilities…TDS 

వంటి నొప్పులకు :

#2. CC3.4 Heart emergencies + CC8.1 Female tonic + CC8.6 Menopause + CC15.1 Mental & Emotional tonic + CC20.2 SMJ pain…TDS

రెండు వారాలు వాడిన తర్వాత ఆమె తన తలనొప్పి, ఛాతిలో నొప్పి, నడుం నొప్పి అన్నీ పూర్తిగా అదృశ్య మయ్యాయని ఇవి ‘’అద్భుతమైన గోళీలు’’ అని ఆమె చెప్పారు. ఇలా మరో రెండు నెలలు TDS గా తీసుకొని ప్రయాణాల కారణంగా జనవరి 17 నుండి వాడడం మానేసారు.  2017డిసెంబర్ నాటికి ఆమెకు పై నొప్పులేమి పునరావృతం కాకుండా ఆనందంగా ఉన్నారు.

చికిత్సా నిపుణుల వివరాలు 11567...India

ప్రాక్టీషనర్  11567...భారత దేశం  వీరు అత్యంత అంకిత భావం కల SVP మరియు చికిత్సేతర విభాగమైనట్టి ఫార్మకాలజీ లో  MD డిగ్రీ కలిగనట్టి అర్హతగల అల్లోపతీ డాక్టరు. ప్రస్తుతం వీరు ఒక ప్రఖ్యాత మెడికల్ కాలేజిలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేయుచున్నారు. తాము నేర్చుకున్న విషయాలను, తమ నైపుణ్యములను నిస్వార్ధ సేవకే ఉపయోగించాలనే తపనతో స్థానికసాయి సెంటర్ లలో నిర్వహించే మెడికల్ క్యాంపులలో పాల్గొనేవారే కానీ ఎన్నడూ ప్రైవేటు ప్రాక్టీస్ చేద్దామనే తలంపు కూడా వీరికి లేదు.  ఐనప్పటికీ ప్రతీరోజు పేషంట్లకు సేవ అందించలేకపోతున్నాననే బాధ ఏదో తెలియని శూన్యం మనసులో గూడు కట్టుకొని  స్థిమితం లేకుండా చేస్తూ ఉండడంతో స్వామినే మార్గనిర్దేశ్యం చేయమని ఈ వెలితిని పూడ్చమని హృదయపూర్వకంగా ప్రార్ధించారు.  ఆర్తితో ప్రార్ధించే వారి ప్రార్ధన వృధా కాదు అనడానికి నిదర్శనంగా స్వామి వీరికి కలలో కనిపించారు. తన అదృష్టానికి ఉప్పొంగిపోతూ తన ప్రార్ధన మన్నించమని స్వామిని కోరగా స్వామి సూటిగా వీరి కళ్ళ వైపు చూసి అదృశ్య మయ్యారు. కొద్ది రోజుల్లోనే ఒక సాయి సోదరుని ద్వారా సాయి వైబ్రియానిక్స్ గురించి తెలుసుకొనడం, దీని తాలూకు వెబ్సైట్ చూడడం, డాక్టర్ అగర్వాల్ గారి సౌల్ జర్న్స్ ఇంటర్వ్యూ లు చూడడంతో స్వామి తన ప్రార్ధన ఆలకించారు అనే ఒక స్పురణ వీరికి కలిగింది. వెంటనే వైబ్రియానిక్స్ శిక్షణకు దరఖాస్తు చేయడంతో ప్రక్రియ మొదలై 2015 మార్చి లో వీరు  AVP గా ఉత్తీర్ణు లైనారు . అంతేగాక రెండు సంవత్సరాల లోపే వీరు VP గానూ అనంతరం SVP గానూ ఉత్తీర్ణత సాధించారు.  

వీరు 2015 మే నుండి స్థానిక సాయి సెంటర్లలో వైబ్రియోనిక్స్ క్యాంపులు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వీరు పార్శ్వపు నొప్పి, మోకాళ్ళ నొప్పి, సోరియాసిస్, అజీర్ణం, జలుబు, వైరల్ ఫీవర్లు, ఆందోళన, మదుమేహం, తలత్రిప్పడం, సైనుసైటిస్, స్త్రీల ఋతు సంబంధమైన సమస్యలు, మానసిక వ్యాధులు, భయాలు, అలెర్జీ లు, టైఫాయిడ్, జీర్ణకోశ వ్యాధులు వంటి అనేక వ్యాధులకు చికిత్సనందించారు. వ్యాదులన్నింటికీ మూలకారణం మనసే కనుక వివిధరకాల వ్యాధులకు సంబంధించి నంతవరకు  CC15.1 Mental & Emotional tonic ను కలపడం ద్వారా అద్భుతాలు సాధించవచ్చని వీరు తమ అనుభవం ద్వారా  తెలుసుకున్నారు. అలాగే పిల్లలలో వచ్చే వైరస్ సంబంధిత వ్యాధులను నయం చేయడంలో CC9.2 Infections acute + CC12.2 Child tonic అద్భుతంగా పనిచేస్తాయని తమ అనుభవం ద్వారా తెలుసుకొని ఇతరులకే కాక తమ పిల్లలకు కూడా ఇవే ఇచ్చేవారు. ఈ రెమిడి, వైరస్ వ్యాధులతో భాద పడుతున్న పిల్లలలో, రోగులలో వచ్చే బ్యాక్టీరియ ఇన్ఫెక్షన్ లను రాకుండా నివారించి తద్వారా యాంటిబయాటిక్ ల వాడవల్సిన అవసరం తప్పించి ఇటు పేషంట్లకు, వారి తల్లి దండ్రులకు గొప్ప ఉపశమనం కలిగిస్తుంది. పార్శ్వపు నొప్పి వలన కలిగే అతి తీవ్రమైన తల నొప్పులను కూడా CC11.3 Headaches + CC11.4 Migraines ద్వారా సమర్ధవంతంగా ఎదుర్కొని అద్భుతమైన ఫలితాలు పొందినట్లు వీరు తెలుపుతున్నారు. ఇంతేగాక స్టెరైల్ వాటర్ లో CC7.3 Eye infections ను కలిపి  చుక్కల మందును తయారు చేసి పేషంటుకు ఇచ్చినట్లయితే అది కళ్ళకలకలు, కళ్ళవాపు, కళ్ళమంటలు, గులాబీ కన్ను వంటి ఇన్ఫెక్షన్ వ్యాధులకు కూడా అద్భుతంగా పనిచేస్తుందని కూడా వీరు స్వీయ అనుభవం ద్వారా తెలుసు కున్నారు.  

వీరు తమ పేషంట్లకు చికిత్స చేసేటప్పుడు తరుచుగా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి సూక్తులను ముఖ్యంగా ఆరోగ్య కరమైన జీవనవిధానము గురించి స్వామి చెప్పిన వాటిని ఉటంకిస్తూ ఉంటారు. అలాగే తమ పేషంట్లకు వీరు స్వయంగా తయారు చేసిన  ‘’సాయిబాటలో జీవనవిధానము ‘’ అనే ఆడియో క్లిప్పింగ్ కూడా ఇస్తూ ఉంటారు. ఇది మన ఆలోచనల యొక్క ప్రభావము మన ఆరోగ్యం పైన, మరియు సమాజంలో మన అనుభవాల పైనా, ఎలా ఉంటుందనేది వివరిస్తుంది. సంపూర్ణమైన నివారణా విధానము లో వీరికున్న అపార జ్ఞానము ద్వారా ‘’వయొలెట్ ఫ్లేమ్’’ ధ్యాన విధానము ఆచరించడం ద్వారా మన చెడు ఆలోచనలను మంచి ఆలోచనలుగా మార్చుకొనేందుకు అవకాశం ఉందని వీరు తెలియజేస్తున్నారు. పేషంట్లకు చికిత్స చేయడం తో పాటు వారి అర్హతలను బట్టి ఈ దివ్యమైన వైద్య విధానము లోనికి ప్రాక్టీషనర్లుగా రావలసిందిగా వారిని ప్రోత్సహించడం వీరికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.  ఈ ప్రాక్టీషనర్ లో ఉన్న ఉన్నతమైన ఆదర్శం, ఎందరో పేషంట్లు తమ జీవన విధానము మార్చుకొని మానవత్వము నుండి దివ్యత్వము వైపు మరలడానికి దోహదపడింది.  

ప్రాక్టీషనర్ తన అనుభవం లోనికి వచ్చిన కొన్ని కేసులలో  ఒక 40-సంవత్సరాల స్త్రీ  గత 16 సంవత్సరాలుగా పార్శ్వపు నొప్పి, హార్మోన్ అసమతౌల్యం కారణంగా తలపోటు, నీరసం, గుండెదడ వంటి వాటితో బాధపడుతున్న కేసు గురించి మనతో సమాచారం పంచుకుంటున్నారు. ఈమె ఎన్నో రకాల చికిత్సలు చేయించుకున్నారు కానీ ఫలితం కనబడలేదు. పై లక్షణాలకు తోడు ఈమెకు కడుపులో మంట నిద్రలేమి కూడా కలగసాగాయి. ఈమెకు క్రింది రెమిడి ఇవ్వబడింది. CC3.7 Circulation + CC4.10 Indigestion + CC6.2 Hypothyroidism + CC8.6 Menopause + CC10.1 Emergencies + CC11.3 Headaches + CC11.4 Migraines + CC12.1 Adult tonic + CC15.4 Eating disorder. అంతేకాక ఆరోగ్యవంతమైన జీవన విధానము కూడా అలవరచుకోవలసిందిగానూ వ్యాయామం ద్వారా దేహానికి కొంత శ్రమను కూడా కల్పించవలసిందిగానూ సూచింపబడింది. రెమిడి తీసుకున్న రెండు వారాలలోనే తనకు 100% తగ్గిపోయిందని ఆమె చెప్పారు. దీనితో ఎంతో స్పూర్తిని పొందిన ఈమె ప్రాక్టీ షనర్ కు వారం వారం జరిగే మెడికల్ క్యాంపులలో సహకారాన్ని అందిస్తున్నారు.

మరొక కేసులో 51-సంవత్సరాల మహిళ గత 3½ సంవత్సరాలుగా కీళ్ళవాతం, కీళ్ళనొప్పులతో బాధ పడుతున్నారు. విపరీతమైన నొప్పి వలన తన దినచర్యలను కూడా చేసుకోలేక పోతున్నారు. ఆమె అలోపతి మందులు వాడుతూనే ఉన్నప్పటికీ నొప్పి ఏమాత్రం తగ్గలేదు. ఆమెకు క్రింది రెమిడి ఇవ్వబడింది. CC12.4 Autoimmune diseases + CC20.3 Arthritis. నాలుగు వారాలలోనే ఆమెకు 90% మెరుగుదల కన్పించింది. మూడు నెలలు వాడే సరికి ఆమెకు వ్యాధి లక్షణాలే లేకుండా పూర్తిగా తగ్గిపోయింది. ఈ అద్భుత నివారణ వీరి కుటుంబము పైన కూడా ప్రభావము చూపడంతో స్వామి పట్ల వారి నమ్మకము భక్తీ పెరిగాయి. అంతేగాక  వీరి కుమార్తె వృత్తీ రీత్యా అలోపతి డాక్టర్ ఐనప్పటికీ వైబ్రియానిక్స్ శిక్షణ తీసుకొని  2017 నవంబర్ లో AVP11590 అయ్యారు.

ఈ ప్రాక్టీషనర్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రాష్టాలకు కోఆర్డినేటర్ గా ఉంటున్నారు. వీరు వార్తాలేఖలను తెలుగు లోనికి అనువదించే కార్యక్రమానికి సమన్వయకర్తగా ఉన్నారు. ఇటీవల వైబ్రియోనిక్స్ లో వస్తున్న మార్పులు దీని ద్వారా లబ్ది పొందుతున్నరోగుల సంఖ్యలో పెరుగుదల, అదేవిధంగా ఎంతోమంది ఔత్సాహికులు శిక్షణ తీసుకోవడానికి ముందుకు రావడం ఇవన్నీ చూసిన తర్వాత ప్రాక్టీషనర్ ‘’ వైబ్రియానిక్స్ మానవాళికి సేవలందించడానికి సిద్దంగా ఉంది కానీ మానవాళి ఆ సేవలందుకొనడానికి  సంసిద్దంగా లేదు’’ అన్ననానుడిని సవరిస్తూ ‘’మానవాళి కూడా అందుకు సంసిద్దమై ఉంది’’ ఆని ధైర్యంగా ప్రకటిస్తున్నారు.

చికిత్సా నిపుణుల వివరాలు 11568...India

ప్రాక్టీషనర్ 11568…ఇండియా  2014 లో డాక్టర్ అగ్గర్వాల్ గారి సోల్ జర్న్స్ వీడియో చూడడం ద్వారా ఈమె స్పూర్తి పొంది వెంటనే స్వామికి తమ దివ్య ఆశీస్సులు ప్రసాదించమని ఉత్తరం వ్రాసారు. స్వామి విభూతిని   ప్రసాదించడం ద్వారా తమ ఆశీస్సులు అందించగానే వెంటనే AVP కోర్సుకు తమ పేరు నమోదు చేయించు కున్నారు. 2015 మార్చి నెలలో పుట్టపర్తిలో AVP శిక్షణ ముగించుకున్న ఈ ప్రాక్టీషనర్ ప్రస్తుతం SVP గా తమ సేవలందిస్తున్నారు.  

 2015 లో ఒక ఆలయంలో మరొక ప్రాక్టీషనర్ తో పాటు వైబ్రియోనిక్స్ క్యాంపు ప్రారంభించినపుడు అక్కడ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా, షిర్డీసాయి బాబా వారి నిలువెత్తు పటములు వీరి టేబుల్ దగ్గరే ఉండడం చూసి ఎంతో ఆనందించారు. అంతకుముందు వీరు చాల సార్లు ఈ ఆలయానికి వెళ్ళడం జరిగింది కానీ ఎప్పుడూ ఆ ఫోటోలు కనిపించలేదు.  ఈ ఫోటోలు గురించి వివరాలు సేకరించగా ఎవరో ఒక అపరిచిత వ్యక్తి ఆరోజు ఉదయమే ఆ ఫోటోలను అక్కడ వదిలి వెళ్లారని తెలిసింది. ఈ సంఘటన స్వామి ఆశీస్సులు ఈ క్యాంపు పైన దండిగా, మెండుగా ఉన్నాయని స్వామి ఎల్లప్పుడూ నిస్వార్ధ సేవ చేసేవారి వెంటే ఉంటారని స్పష్టం చేసింది. ముఖ్యంగా తనకంటే ముందే స్వామి క్యాంపు జరిగే ప్రదేశానికి చేరుకొని  తన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని నిరూపించడం ప్రాక్టీషనర్ కు మరింత ఆనందాన్నిచ్చింది. 15 రోజుల కొకసారి జరిగే ఈ క్యాంపులలో వీరికి అనుభవశాలురైన మరో ఇద్దరు ప్రాక్టీషనర్ల తోడ్పాటు కూడా ఉంటుంది.  వీరి ఉద్దేశ్యంలో ఇలా ఎక్కువమంది ప్రాక్టీషనర్లతో కలసి (బృంద కృత్యము) టీంవర్కు చేయడం ద్వారా ఎంతో ఆనందంతో పాటు ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి, అంతర్ద్రుష్టి ని పెంచుకోవడానికి ఉపయోగపడుతుందని వీరి అభిప్రాయం.

వీరు వార్తాలేఖలను ఎప్పటికప్పుడు చదువుతూ కొత్త విషయాలను అవగాహన చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ‘అగ్గర్వాల్ గారి డెస్క్ నుండి’’ అనే టాపిక్ వీరికి ఎంతో ప్రేరణ కలిగిస్తుంది. అలాగే ‘‘వైబ్రో రెమిడి లు ఉపయోగించిన కేసుల వివరాలు’’, ‘‘ప్రశ్న-జవాబులు” ఇవన్నీ కూడా ప్రతీ ఒక్క ప్రాక్టీషనర్ చదివి ప్రయోజనం పొందవలసిన విషయాలని వీరి నమ్మకం. ఇంతేగాక న్యూస్ లెటర్ లను వార్తలేఖలుగా తెలుగు లోనికి అనువదించడం స్వామి తనకిచ్చిన వరం అని వీరు భావిస్తున్నారు. దీనివలన వాటిని బాగా చదివి అర్ధం చేసుకోవడానికి, ఈ దివ్య విధానము గురించి మరింత లోతుగా అధ్యయనం చేయడానికి అవకాశం కలిగిందని వీరు భావిస్తున్నారు.  ఇదేకాక వీరు మెంటర్ గా ( కొత్తగా శిక్షణ తీసుకున్న AVP లకు రోగులకు చికిత్స చేసే విషయంలో వారు VP లు గా ఉత్తీర్ణత పొందే వరకూ సలహాదారుగా బాధ్యత వహించడం) బాధ్యత కూడా చేపట్టడం ద్వారా ఈ విధానము పైన వీరికి ఎంతో అవగాహన కలిగింది. ఈ పద్దతి ద్వారా మెంటీ (గ్రాహకుడు) మరియు మెంటర్ ఇద్దరూ తమ జ్ఞానాన్ని, అవగాహనను పెంపొందించుకోవచ్చు అని వీరి భావన.

వైబ్రో చికిత్సా విధానంలో వీరికున్న అచంచల విశ్వాసం వల్ల తాను చికిత్స చేసిన కేసులలో అద్భుత విజయాలు సాధించారు. ఇప్పటివరకూ వీరు శ్వాశకోశ సంబంధిత వ్యాధులు, సైనుసైటిస్, స్త్రీల ఋతు సంబంధిత సమస్యలు, పార్శ్వపు నొప్పి, సాధారణ తలనొప్పి, అసిడిటీ, పక్కతడుపుట, మోకాళ్ళ నొప్పులు, ఎండకు సంబంధించిన అలెర్జీలు వంటి వ్యాధులకు సంబంధించి 350 మంది పేషంట్లకు విజయవంతంగా చికిత్స చేసారు. అంతేకాక తలనొప్పి, వైరల్ ఫీవర్లు, జీర్ణకోశ వ్యాధులు, వడదెబ్బ, ఆందోళన, ఫోబియా వంటి మానసిక సమస్యలకు చికిత్స చేయడంలో వీరికి అపార అనుభవం ఉంది.  

వీరు అన్ని వ్యాధులకు సంబంధించిన రెమిడిలన్నింటికీ CC15.1 Mental & Emotional tonic కలపడం వలన వ్యాధి త్వరగా నయమవుతున్నట్లు తెలుసుకున్నారు. వీరికి SRHVP తో కూడా అద్భుత మైన అనుభవాలు ఉన్నాయి. అటువంటి ఒక ఉదంతం మనతో పంచుకుంటున్నారు. 32 సంవత్సరాల మహిళ, గొంతు లో గుచ్చుతున్నట్లు బాధ, దగ్గు, జ్వరం తో బాధ పడుతూ ప్రాక్టీషనర్ ను సంప్రదించారు. పేషంటు తెల్లవారిన తర్వాత పనికి ఎట్లా వెళ్ళాలా అని ఆందోళన లో ఉన్నట్లు  అనిపించింది. అంతేకాక ఆమెకు రోగం నయమవ్వడానికి అలోపతి మందులు వాడకుండా ఎలా తప్పించుకోవాలా అన్న ఆదుర్దా కూడా ఉన్నట్లు అనిపించింది. SRHVP, మిషన్ ఉపయోగించి వీరు NM6 Calming + NM18 General Fever + NM30 Throat + NM36 War ను తయారుచేసి ఇచ్చి తరుచుగా వాడమని చెప్పారు. ఆశ్చర్యకరమైన రీతిలో మరునాటికల్లా గొంతు నొప్పి, మరియు గొంతులో గుచ్చుతున్నట్లుగా అనిపించడం పూర్తిగా అదృశ్యమయ్యాయి. అంతేకాక జ్వరంగా అనిపించే లక్షణం కూడా మాయమయ్యింది.

మరో సందర్భంలో 36 సంవత్సరాల మహిళ గత కొన్ని సంవత్సరాలుగా రెండు కాళ్ళలో తిమ్మిరులతో బాధ పడుతూ ఉన్నారు. దీనివలన ఆమె బాసింపట్టు వేసుకొని ఎక్కువ సేపు కూర్చోలేక పోతున్నారు. ప్రాక్టీషనర్ ఆమెకు  NM14 Cramps ఇచ్చారు. మొదట ప్రతీ పది నిమిషాలకు ఒక డోస్ చొప్పున ఒక గంట సేపు తీసుకున్న తర్వాత ఆమె రెండు గంటలు నిర్విరామంగా కుర్చోగలిగారు. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ రోజంతా ఆమెకు తిమ్మిరులే లేవు!

వీరి అభిప్రాయం ప్రకారం వైబ్రియోనిక్స్ మనలో ఉన్న మాలిన్యాన్ని తొలగించి లోనున్న అంతర్యామికి చేరువగా చేరుస్తుంది. ఈ విధంగా వైబ్రో విధానం వలన ప్రాక్టీషనర్ లు ఎంతో లబ్ది పొందుతారని వీరి భావన. వ్యక్తిగతంగా హృదయాన్ని పరిశుద్ధమైన రీతిలో తీర్చిదిద్ది దానిలో దయ, ప్రేమ వంటి భావాలతో నింపడం తన బాధ్యత అనీ దానివలన దివ్యశక్తి ప్రవాహానికి ఒక చక్కని వాహకంగా ఉండగలుగుతానని వీరి అభిప్రాయము. అంతేకాక తను ఉపయోగించే రెమిడిలు పరిశుద్ధంగా ఉండడానికి తన దేహం నుండి వచ్చే వైబ్రేషణ్ కూడా పవిత్రంగా ఉంచడానికి వీరు ప్రయత్నిస్తూ ఉంటారు. తను ఆశించిన రీతిలో పవిత్రముగా చికిత్స సాగడానికై వీరు స్వామిని ఇలా ప్రార్ధిస్తూ ఉంటారు. ‘‘ ప్రియమైన స్వామీ, తమ దివ్య ప్రేమ ప్రవాహానికి నన్ను పవిత్ర వాహకంగా చేసి ఈ రోజు నా  చెంతకు వచ్చిన వారికి నయం చేసే శక్తిని ప్రసరింప జేసి వారిని స్వస్థత పొందేలా చేయండి.’’  

ప్రాక్టీషనర్ వృక్ష శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ పొందిన వారు గనుక భవిష్యత్తులో వైబ్రియానిక్స్ కి సంభందించి వ్యవసాయ రంగంలో పురోగమనం కోసం ఎంతో కొంత చేయూతనందించాలని తహతహలాడుతున్నారు. చివరిగా సాయి వైబ్రియానిక్స్ స్వామి మానవాళికి అందించిన గొప్ప వరం అని దీని వలన పేషంటుకు నయమవ్వడమే కాక ప్రాక్టీషనర్ లో కూడా పరివర్తన వస్తుందని స్వీయ అనుభవం ద్వారా తెలుసుకున్నానని మనకు తెలియజేస్తున్నారు.

 

ప్రశ్నలు జవాబులు

1 ప్రశ్న: నేను  CC7.3 Eye tonic ను ఒక చుక్క  30 మీ.లీ.శుద్ధి చేసిన నీటిలో వేసి కంటిలో చుక్కల మందులాగా వేయడానికి డ్రాపర్ బాటిల్ లో పోసాను.ఈ మందు వేయగానే పేషంటు కంటిలో మంటగా ఉందని చెప్పారు, దయచేసి ఇలా చుక్కల మందు తయారుచేసే సరయిన విధానము తెలుపగలరా ?

జవాబు : ఈ మంట రెమిడి లో ఉన్న ఆల్కహాల్ వలన కలిగింది. ఇలా మంట రాకుండా ఉండాలంటే  100మి.లీ.నీటిలో ఒక చుక్క కంటే ఎక్కువ రెమిడి వేయరాదు. ఒకవేళ మీరు మూడు వేరువేరు రకాల రెమిడి లు వేయాలనుకుంటే 300మి.లీ.నీటిని తీసుకోవాలి. ఆ తరువాతే ఈ నీటిని 30మి.లీ.డ్రాపర్ బాటిల్ లోనికి తీసుకోవాలి. మిగిలిన రెమిడి నీటిని మొక్కలకి వినియోగించాలి. ఇలా తయారు చేసిన రెమిడి 15 రోజుల వరకూ ఉపయోగించుకోవచ్చు. ఇలా తయారుచేయడానికి కావలసిన నీటిని మందుల షాపులో దొరికే స్టెరైల్ నీటితో గానీ లేదా ఇంట్లోనే నల్లా నీటిని 20 నిముషాలు మరిగించి చల్లార్చడం అవశేషాలు ఏమయినా ఉంటే అవి పాత్రలోనే ఉండేలా వడకట్టడం ద్వారా కూడా తయారు చేసుకోవచ్చు.

________________________________________

2 ప్రశ్నవైబ్రో రెమిడి లు నీటిలోనే ఎందుకు బాగా పనిచేస్తాయి.?నీటి యొక్క లక్షణము బట్టి అనగా  స్వేదన క్రియ డిఅయోనైజ్ చేసినవి స్ట్రక్చర్చేయబడిన నీళ్ళు ఇలాంటి మార్పుల వలన రెమిడి యొక్క శక్తి మారుతుందా

జవాబు: నీటికి ఉన్న అధిక శక్తి నిలుపదల చేసే స్వభావము వలన నీటితో కలిపిన రెమిడిలు బాగా పనిచేస్తాయి. అనేక వృత్తులకు చెందిన చికిత్సా నిపుణులు చెప్పిన దాని ప్రకారం నీటికి ఉన్న అద్వితీయ గుణం వలన నయం చేసే వైబ్రేషణ్ స్వీకరించి దాచుకొని తిరిగి శరీరానికి చెందిన భౌతిక,మనో వ్యాధులను నయం చేస్తుంది. రెమిడి యొక్క శక్తి నీటి యొక్క రకాన్ని బట్టి మారదు. ఒకవేళ రెమిడి నేరుగా నోటికి తీసుకున్నట్లయితే  వెంటనే కొన్ని నీళ్ళు కూడా తీసుకొనడం మంచిది. నీవు తీసుకొనే నీటి పట్ల సరియయిన నిర్ధారణకు రాలేక పొతే అప్పుడు బజారులో దొరికే డిస్టిల్ వాటర్ ను ఉపయోగించుకొనవచ్చు. 1వ ప్రశ్న కు జవాబు చూడండి.

________________________________________

3 ప్రశ్న: AVP మాన్యువల్ లో చెప్పిన ప్రకారం రెమిడి లు ఉపయోగించుటకు లోహపు చెంచాలను వాడకూడదు.ఐతే నేను రాగితో చార్జింగ్ ఐన నీటిని ఉపయోగిస్తూ దీనిలో అద్భుత ఫలితాలు ఉన్నట్లు గ్రహించాను. కనుక రాగితో చేసిన పాత్ర గానీ చెంచా గానీ ఉపయోగించుట సమ్మతమేనా తెలుపగలరు ?

జవాబు: ప్రస్తుతం లభిస్తున్న సమాచారము ప్రకారము వైబ్రియానిక్స్ రెమిడి లు వెండి మరియు రాగి తో సమన్వయం చెందుతాయి. ( కానీ ఇవి మలిన రహితంగా ఉండాలి) ఐతే ఇనుము అల్యూమినియం ఇత్తడి మాత్రం పనికిరావు.

________________________________________

4 ప్రశ్నపేషంటు వాడకుండా తిరిగి ఇచ్చిన రెమిడి లను ఏమిచేయాలి. వీటిని వదిలివేసిన SRHVP  తో న్యూట్రల్ చేసి తిరిగి ఉపయోగించవచ్చా?

జవాబు: దీని పైన మరికొంత దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. SRHVP  రెమిడి లను న్యూట్రల్ చేసినప్పటికీ గోళీలు స్వీకరించిన కొన్ని హానికరమైన కలుషితాలను నిర్వీర్యం చేయలేదు. ఉదాహరణకు ఒక పేషంటు గోళీని  మూత లోనికి తీసుకోని నోటిలో వేసుకున్నాడనుకొందాము. ఒక్కొక్కసారి తెలియకుండానే మూత నోటికి తగులుతూ ఉంటుంది. దీనివలన మన శ్వాస నుండి కొన్ని సూక్ష్మ క్రిములు మూతలో చేరే అవకాశం ఉంది. అందుచేత  రెమిడి గోళీలు కలుషితం కాలేదని నిర్ధారణకు వస్తే తప్ప వాటిని తిరిగి ఉపయోగించలేము. అలా కానీ పక్షంలో ఈ మిగిలిన గోళీలను తోటలోనో పెరటిలోనో ఉన్న మొక్కలకి నీటిలో  కలిపి పోసేయాలి.  బాటిల్ ను బాగా కడిగి ఆరబెట్టిన తర్వాత దానిని తిరిగి ఉపయోగించవచ్చు.

________________________________________ 

5 ప్రశ్న: వార్తాలేఖ లలో ప్రచురితమయ్యే కేసులలో ఎక్కువ శాతము  108CC బాక్సు కు సంబంధించినవే ఉంటున్నాయి ఈ రెమిడి లు SRHVP తో తయారుచేసిన వాటికన్నా బాగా పనిచేస్తాయనే కారణం ఏ మైనా ఉందా?

జవాబు:  108CCబాక్సు మరియు SRHVP రెండింటికి మన వైబ్రియానిక్స్ లో సముచిత స్థానం ఉంది. పెరుగుతున్న రోగుల అవసరాలు,మెడికల్ క్యాంపులలో త్వరగా పేషంట్లను చూసి పంపడానికి వీలయిన చక్కటి యంత్రాంగమును దృష్టిలో పెట్టుకొని 2007లో  108CC బాక్సురూపొందించడం జరిగింది. మొదట ప్రాక్టీషనర్ లు పేషంట్ల అవసరాల దృష్ట్యా కొన్ని బాగా అవసరమైన ఎక్కువగా ఉపయోగింపబడుతున్న రెమిడి లను ముందే తయారుచేసి పెట్టుకొని వాటిని మెడికల్ క్యాంపులలో ఉపయోగించేవారు. ఇలా వీటి ద్వారా వస్తున్న ఫలితాలను చూసి స్పూర్తిని  పొంది,స్వామి ఆశీస్సులు కూడా పొంది 108CC బాక్సు తయారుచేయడం జరిగింది.

 108CCబాక్సు కు ఉన్న బలాలేమిటంటే దీనితో వేగంగా పేషంట్లకు రెమిడి లు ఇవ్వవచ్చు. రెండవది స్వామి భౌతికంగా ఉన్నప్పుడు ఆశిర్వదించిన మాస్టర్ రెమిడి బాక్సు తో ఇచ్చే రెమిడి ల ప్రభావం అద్భుతంగా ఉంటున్నది. ఈ కొమ్బోలు ఒక్కొక్కటీ అనేక వ్యాధులను నయం చేయగల శక్తిగలవి. మనందరికీ తెలిసిన విషయమే 108CCబాక్సు లోని రెమిడిలు స్వామి చేత అద్బుతంగా ఆశీర్వదింప బడిన  SRHVPనుండి తయారు చేసినవే . సాధారణంగా  SRHVP నుండి తయారు కాబడే రెమిడి లు ఒక ప్రత్యేకమైన ప్రయోజనం కోసం లేదా ఒక ప్రత్యేకమైన రుగ్మత ను నిర్మూలించడానికి ఉద్దేశించనది గా ఉంటుంది.ముఖ్యంగా  108CC బాక్సు తో ఆశించిన ఫలితం రానప్పుడు ఈ రెమిడి ఉపయోగిస్తాము. సుశిక్షుతులైన ప్రాక్టీషనర్లు ఈ రెండింటినీ ఉపయోగించి ప్రయోజనం పొందుతున్నారు. 108CC బాక్సు తో చాలా ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఇంకా అదనంగా ప్రయోజనం పొందడానికి SRHVP బాక్సు ఉండాలి. ఐతే దీనికి ప్రత్యేకమైన శిక్షణ అవసరం.

దివ్య వైద్యుని దివ్య వాణి

“దేహ రక్షణ కోసం మనం తీసుకొనే ఆహారం మితంగా ఉంటేనే అది మనకు ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది.. అతిగా తినడం మన శరీర నిర్మాణ వ్యవస్థను విషతుల్యం చేస్తుంది. మనకు సంతృప్తిని ఇచ్చేది ఆహారమే, వ్యాధిని తెచ్చిపెట్టేది కూడా ఆహారమే ఐతే దానిని మితంగా హితం చేకురేలా తినాలి. అలాగే ఐశ్వర్యం కూడా అవసరమే కానీ అది కూడా మితం గానే ఉండాలి. ధనం ఎక్కువైన కొలదీ ఎన్నో సమస్యలు ఉత్పన్న మవుతాయి.ఈ ధనమే మనిషిని అహంకారి గా చేసి మంచి చెడు విచక్షణ కోల్పోయేలా చేస్తుంది.  దానకర్ణుడిగా కీర్తి సంపాదించుకోవాలి గానీ దుర్యోదనుడి లాగా పరమ లోభిగా మారి పతనమవకూడదు.."

... సత్యసాయి బాబా , “అవతారము మరియు భక్తులు ” దివ్యవాణి  23 జనవరి 1994
http://www.sssbpt.info/ssspeaks/volume27/sss27-31.pdf

 

 

"ఫలాపేక్ష లేకుండా కోరిక లేకుండా ప్రేమతో గానీ బాధ్యత అనే భావంతో చేసే పని యోగం అవుతుంది. అట్టి యోగము మనిషి నుండి పశు లక్షణాలు పోగొట్టి దివ్యత్వానికి కొనిపోతుంది. ఇతరులను సేవించడం,వారిలో భగవత్ స్వరూపాన్ని దర్శించడం ఆధ్యాత్మిక మార్గంలో పురోగమించడానికి దోహదపడుతుంది. ఇది సాధన వలన మీరు సాధించుకున్న స్థాయి నుండి దిగజారకుండా పదిల పరుస్తుంది. నిస్వార్ధ సేవ పుజాదికలకన్నా ఎంతో ఫలవంత మైనది. సేవ నీలో నిగూఢముగా ఉన్న స్వార్ధాన్ని తొలగిస్తుంది. హృదయాన్ని విశాలము చేసి వికసించి పరిమళించే లాగా చేస్తుంది. ."

... సత్యసాయి బాబా, “ప్రేమతో సేవ ” విద్యావాహిని  అధ్యాయము  8  
http://www.sssbpt.info/vahinis/Vidya/Vidya08.pdf

 

ప్రకటనలు

ప్రకటనలు

జరగబోయే వర్క్ షాపులు

అదనంగా

  1. ఆరోగ్య చిట్కాలు

కొబ్బరితో ఆరోగ్య అద్భుతాలు !

లేత కొబ్బరి నీరు, రుచికరమైన తెల్లని కొబ్బరి, కొబ్బరి నూనె, కొబ్బరి పాలు ఇవి మనిషి ఆరోగ్యానికి ప్రకృతి అందించిన వరాలు.

“  కొబ్బరి బొండం లో అమృతం లాంటి నీరుంటుంది. ఎవరు పోశారు? ఇది మనిషికి సాధ్యమయ్యే పనేనా ? లేదు కేవలం భగవంతుడు మాత్రమే ఆ పని చేయగలదు ." ... సత్యసాయిబాబా                                                                

1. కొబ్బరి నీళ్ళుపోషక పదార్ధాల కార్ఖానా 1-9

లేత కొబ్బరి కలిగి ఉండే కొబ్బరికాయల లోని నీరు అన్ని పోషక పదార్ధాలను కలిగి ఉంటుంది.ఇది పరిశుద్ధమైనదే  కాక మానవ రక్తంలోని ప్లాస్మా లో ఉండే పదార్ధాల మిశ్రమమంతా దీనిలో కూడా ఉంటుంది.

  • దీనిలో 94% నీరు చాలా స్వల్పంగా కొవ్వు పదార్దములు,ఉంటాయి కొలెస్ట్రాల్ అసలే ఉండదు.కొన్ని అధ్యయనాల ప్రకారం ఇది శరీరంలోని  HDL స్థాయిని పెంచుతుందని తెలుస్తోంది.
  • దీనిలో ఉండే కార్బోహైడ్రేట్ లు మానవ శరీరంలో ఉన్నవాటికి సరిపోలేలా సులువుగా జీర్ణమయ్యే చెక్కెర,ఎలక్ట్రో లైట్ల రూపంలో లభిస్తుంది.దీనిలో మన శరీరానికి కావలసిన ఐదు రకాల ఎలక్ట్రోలైట్లు,లవణాలు సమృద్ధిగా ఉంటాయి.   
  • సాధారణంగా మనం తినే పండ్ల లో కన్నా దీనిలో విటమిన్లు ఖనిజలవణాలు చాలా ఎక్కువ .
  • దీనిలో అధిక మొత్తంలో అమినో ఆమ్లాలు,ఎంజైములు,ప్రతిక్షా కారిణులు లేదా యాంటిఆక్సిడెంట్లు ఉండి ఇవి ఫంగస్,బాక్టీరియా,వైరస్ లకు వ్యతిరేకముగా పనిచేస్తూ శరీరము యొక్క రోగనిరోధకశక్తిని పెంచుతుంది.   
  • దీనిలో వృక్ష సంబంధమైన హార్మోన్లు సమృద్ధిగా ఉన్నాయి.అవి అకాల వృద్ధాప్య నివారణ,క్యాన్సర్ నివారణ,రక్తం గడ్డకట్టక పోవడం నివారణ వంటి వాటికి సహాయకారిగా ఉంటాయి.  
  • ఒక కప్పు కొబ్బరిలో  అనగా 240 గ్రాములలో -కార్బో హైడ్రేట్లు (9 గ్రాములు ), పీచు  పదార్ధము(3 గ్రాములు), ప్రోటీన్లు (2 గ్రాములు), విటమిన్ -C (RDI  రిఫెరెన్సు డైలీ ఇన్టేక్ అనగా నిత్యమూ ఎంత తీసుకోవలనో తెలిపే సూచి ప్రకారము 10% ), మెగ్నీషియం  (15% of RDI), మాంగనీస్ మరియు పొటాషియం (ఒక్కొక్కటి  17%  RDI ప్రకారము ), సోడియం  (RDI ప్రకారము 11% ), కాల్షియం  (RDI ప్రకారము 6%) మరియు వీటన్నింటితో పాటుగా 46 కేలరీల శక్తి కూడా ఉంటుంది. సాధారణముగా పరిమాణము బట్టి ఒక  కొబ్బరిబొండం లో  200 మి.లీ. నుండి 1000 మి.లీ.నీరు లభిస్తుంది.

హెచ్చరిక : దేనికైనా సరే మితము హితము ఉండాలి.ఏది తీసుకున్నా సరే మనకు మంచి జరిగేంత వరకే తీసుకోవాలి. కొబ్బరి కాయను పగలగొట్టిన వెంటనే తీసుకోవాలి ఎందుకంటే ఆలశ్యం చేసేకొద్దీ గాలి సోకడం వలన దానిలో ఉన్న పోషక విలువలు కోల్పోయే ప్రమాదం ఉంది.కొబ్బరికాయలు దొరకని వారు స్టోర్ లో తీసుకోదలిస్తే బ్రాండెడ్ కంపెనీ వాటిని మాత్రమే తీసుకోవాలి.కొబ్బరినీటిలో చెక్కర కలిపి లేదనికూడా నిర్ధారణ చేసుకోవాలి.

కొబ్బరి నీటి యొక్క ఔషధ గుణాలు 1-9

మూత్రపిండాల సమస్యలు ఎదుర్కోవడంలో సహాయకారి :  కొబ్బరి నీరు మూత్ర విసర్జన సహాయకారిగా పనిచేస్తూ మూత్రము తగినంతగా సాఫీగా పోయే మార్గం సుగమం చేస్తుంది. అధిక శాతం మూత్ర పిండాల నిపుణులు మూత్ర పిండాలలో రాళ్ల పరిమాణం తగ్గింపుకు ,లేదా వాటిని పూర్తిగా తొలగించడానికి రోజు మార్చి రోజు కొబ్బరి నీళ్ళను తీసుకోమని సలహా ఇస్తారు.

చర్మ సంరక్షణకు అద్భుతమైనది : మొటిమలు,మచ్చలు,ముడుతలు,చర్మము సాగిపోయినట్లు ఉండడం, కణజాలపు వ్యాధులు,ఎక్జిమా లేదా తామర వంటి వ్యాధుల నిమిత్తం రెండు నుండి మూడు వారాలు కొబ్బరి గుజ్జును రాసుకోవాలి. దీనిని రాత్రిపూట పడుకునేముందు రాసుకొని ఉదయమే కడుగు కున్నట్లయితే చర్మానికి యువజీవం ఉట్టి పడుతుంది. ఇది గాయాలు మాన్పడానికి,గజ్జి దురద నివారణకు,వేసవిలో వచ్చే గడ్డల నివారణకు, అమ్మతల్లి పోసినప్పుడు (స్మాల్ ఫాక్స్,చికెన్ ఫాక్స్) వచ్చే దద్దుర్లు ,తట్టు పొంగు మొదలగు వాటి నివారణకు ఉపయోగ పడుతుంది. .

శరీరం నుండి విష పదార్ధాలను తొలగించి నిర్జలలీకరణము కాకుండా చూస్తుంది. : ఉష్ణ ప్రాంతాలలో సాధారణంగా  నీళ్ళవిరోచనాలతో  నిర్జలీకరణ ( డీహైడ్రేషన్ )కు గురి అయ్యే రోగులకు సెలైన్ లాంటివి ఎక్కించవలసిన అవసరం లేకుండానే  కొబ్బరినీరు అద్భుతంగా పనిచేస్తుంది. అనగా డీహైడ్రేషన్ ఐన సందర్భాలలో దీనిని అమృతం లాగా భావించి తీసుకోవచ్చు. కొన్ని పరిశాధనా ఫలితాలు ఏమీ సూచిస్తున్నాయి అంటే కొబ్బరి నీరు మానవ శరీరముతో ఎంతగా కలిసిపోతుందంటే దీనిని నేరుగా సెలైన్ లాగా నరాలకు ఎక్కించ వచ్చట. అనగా మారుమూల ప్రాంతాలలో సెలైన్ వంటివి అందుబాటులో లేని సందర్భాలలో ప్రాణాన్ని రక్షించ డానికి ఎట్టి సందేహము లేకుండా దీనిని నరానికి ఎక్కించ వచ్చట.  

జీర్ణ వ్యవస్థకు, జీవక్రియలకు సహాయకారి : ప్రేవులలో సమస్యలతో బాధపడే శిశువులకు ఇది ప్రత్యామ్నాయ ఆహారంగా ఉపయోగపడుతుంది. ఇది ప్రేవులలో ఉండే పురుగులను సంహరించడానికి శరీరంలో అసిడిటీ సమస్య నిర్మూలనుకు ఉపయోగ పడుతుంది. మలబద్ధకం,నీళ్ళవిరోచనాలు, రెండింటికీ ఇది ప్రయోజనకర మైనదే. , ఆటగాళ్ళకు ఇది మంచి శక్తి కారిణి మాత్రమే కాక గర్భిణులకు కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇది మంటలను తగ్గించడమే కాక కాళ్ళు ,చేతుల లో వాపులనునిరోధిస్తుంది.  

ఇతర ప్రయోజనాలు : ఇది రక్తంలో గ్లూకోజ్ మరియు ఇన్సులిన్ స్థాయిని  సమతౌల్యం లో ఉంచడానికి, అసాధారణముగా రక్తం గడ్డకట్టడాన్ని నివారించుటకు,రక్తపోటు నియంత్రణకు, రక్త సరఫరా వ్యవస్థ పటిష్ఠ పరచడానికి, పలకికలు ఏర్పడడాన్ని నిరోధించడానికి,కంటిచూపును పెంచడానికి,ఎముకల బోలుతనం వ్యాధి(ఆస్టియో పోరోసిస్) నిరోధానికి ఉపయోగకరమైనది. ఇది మొక్కలకు కూడా మేలు చేస్తుంది. సాధారణంగా దీనిని మొక్కల పెరుగుదలకు సంప్రదాయకమైన సప్లిమెంటు గా ఉపయోగించేవారు.

2. కొబ్బరి గుజ్జు 10-11

లేత  కొబ్బరి తినడానికి ఎంతో మధురంగా ఉంటుంది, అంతేకాక దీనిలో ఎన్నో ఖనిజ లవణాలు,పీచుపదార్ధాలు,యాంటిఆక్సిడెంట్ లు,విటమిన్లు ముఖ్యంగా రక్తం గడ్డకట్టడానికి,ఎముకల నిర్మాణానికి ఉపయోగపడే కె విటమిన్ సమృద్ధిగా లభిస్తాయి.

బాగా తయారైన కొబ్బరికాయలతో చేసిన మిఠాయి కొంచం గట్టిగానూ,తీయగాను,ఉంటుంది .దీనిలో అధిక శాతం పీచుపదార్ధాలు ఉండడమేకాక ప్రేవులలో ఉండే హితకారక బ్యాక్టీరియా కు పోషక వర్ధిని గా కూడా ఉపయోగ పడుతుంది.. కొన్ని పరిశోధనల ప్రకారము ఈ పీచుపదార్ధాలు గుండెజబ్బులు,గుండె పోటు నివారణకు కూడా ఉపయోగపడుతాయని నిరూపించాయి.

3. కొబ్బరి నూనె  – అన్ని నూనెల లోనూ అత్యంత ఆరోగ్య కరమైనది.12-35

ఎండిన కొబ్బరికాయల నుండి తయారు చేసిన ముడి కొబ్బరి నూనెను బిస్కట్లు,చాక్లెట్లు,ఐస్ క్రీములు వంటి మిఠాయి పరిశ్రమ లలోనూ మందుల పరిశ్రమల లోనూ,ఖరీదయిన రంగులు తయారుచేసే పరిశ్రమల లోనూ ఉపయోగిస్తారు. అలాగే శుద్ధి చేయబడిన కొబ్బరి నూనెను వంటకు మరియు ఇతర సౌందర్య సాధన ప్రయోజనాలకు ఉపయోగిస్తారు.

బాగా తయారయిన తాజా కొబ్బరికాయల పాలనుండి విర్జిన్ కోకోనట్ ఆయిల్ తయారు చేస్తారు. ఇది మంచి పరిమళము తో పాటు దీని రుచి ఎంతో మధురంగా ఉంటుంది. కొందరు పరిశోధనా నిపుణులు చెప్పిన  దాని ప్రకారము ఇది రెండు కారణాలను బట్టి  ఇతర వృక్ష సంబంధ మైన నూనెల కన్నా ప్రత్యేక మైనది : 

(i) దీనిలో చాలా ఎక్కువగా (90%) మధ్యస్థ సంకెల రకానికి చెందిన సంతృప్త కొవ్వు ఆమ్లాలు ఉన్నాయి.* ఇవి మిగతా దీర్ఘ సంకెల రకానికి చెందిన సంతృప్తకొవ్వు ఆమ్లాల కన్నా ఆరోగ్య పరంగా అత్యంత ప్రయోజనాత్మకమైనవి. ఇవి ఇతర ప్రత్యేకమైన ఎంజైముల  అవసరం లేకుండానే కణజాలపు పొరలలో సులువుగా ఆవరిస్తాయి.జీర్ణ వ్యవస్థ పైన ఎక్కువ భారం మోపకుండానే సులువుగా జీర్ణమవుతాయి. వీటిని ఆసుపత్రులలో ప్రేగులలో కొంత భాగము ఆపరేషన్ ద్వారా తొలగింపబడి కేవలం ద్రవరూప పదార్దమే తప్ప ఘనపదార్ధాన్ని జీర్ణము చేసుకోలేని స్థితిలో ఉన్నవారికి ఆహారంగా ఇస్తారు. ఇవి నేరుగా లివర్ (కార్జము) లోనికి వెళ్లి కొవ్వు గా నిలవుండకుండా శక్తిగా మారుతుంది.  

* కొందరు నిపుణులు చెప్పిన ప్రకారము దీనికి సైద్దాంతిక ఋజువులు కూడా అందుబాటులో ఉన్నాయి.

(ii) దీనిలో లభించే కొవ్వు పదార్ధాలలో సగభాగము లారిక్ ఆమ్లము తో కూడి ఉంటుంది .అనగా ప్రకృతిలో కేవలం మానవాళికి సంబంధించి తల్లి పాలలో లభించే ప్రత్యేక కొవ్వుపదార్ధాల తో సమతూకంలో ఉండేటటువంటిదన్నమాట. మానవ శరీరము  ఈ లారిక్ అమ్లమును అత్యంత ప్రయోజనాత్మకమైన మోనో గ్లిజరిడ్ గా మారుస్తుంది. ఈ పదార్ధము సంత్రుప్త కొవ్వుపదార్ధాలలో ఉండే  HIV, సర్పి,పొంగు,తట్టు వంటి వ్యాధులు కలిగించే వైరస్ లను పరాన్నజీవులయిన బ్యాక్టీరియ ,ప్రోటోజోవా వంటి సూక్ష్మ జీవులను నాశనం చేస్తుంది. 

 3.1 ముడి కొబ్బరి నూనె యొక్క ఔషధ గుణాలు.12-35 

అనేక అధ్యయనాల ప్రకారం కొబ్బరి నూనె దీనిలో ఉన్న అద్వితీయమైన గుణాలవల్ల అనేక రుగ్మతలను తగ్గించడములో సహాయకారిగా ఉండడమేకాక  కాక ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. ముఖ్యంగా ఇది : 

  • కొలెస్ట్రాల్ ను (కొవ్వును) అదుపులో ఉంచి గుండెజబ్బులు, అధిక రక్తపోటు నుండి దూరం చేస్తుంది.
  • మతిమరుపు వ్యాధిని,మూర్చలను ఇంకా ఇతర మెదడుకు సంబంధించిన రుగ్మతలను దూరం చేసి మెదడుయొక్క పనితీరును జ్ఞాపక శక్తిని వృద్ధి చేస్తుంది ; 
  • మూత్ర పిండాలు,పిత్తాశయము అనగా బ్లాడర్  కు చెందిన ఇన్ఫెక్షన్ లను మరియు జీర్ణ వ్యవస్థకు చెందిన సమస్యలను నిరోధించడమే కాక ఇన్సులిన్ వ్యవస్థను పటిష్ఠ పరచి మధుమేహ సమస్యను అరికడుతుంది.  ;
  • ఇది వాపులను,తగ్గిస్తుంది, మోకాళ్ళ నొప్పులను అరికడుతుంది. ఎముకల బోలుతనాన్ని( పెళుసుగా మారడాన్ని) నిరోధిస్తుంది ;
  • రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది, జీవక్రియా వ్యవస్థను ఉత్తేజ పరుస్తుంది, క్యాన్సర్ ను నిరోధిస్తుంది.
  • శరీర బరువును తగిస్తుంది, కండరాలను తయారికి దోహదం చేస్తుంది,హార్మోన్లను సమతుల్యం చేస్తుంది.
  • సామాన్య జలుబు,ఫ్లూ, వంటి సమస్యలను తగ్గించడమే కాక న్యుమోనియా (నిమ్ము)నిర్మూలనుకు ప్రకృతి సిద్ధమైన ఔషదం గా పనిచేస్తుంది. 26;
  • మద్యపానానికి బానిసలు కావడాన్ని నిరోధిస్తుంది. తదనుగుణమైన వాటిని నివారిస్తుంది .27;
  • కొబ్బరి నూనె దంత సమస్యలను నివారిస్తుంది.నోటిని శుభ్రపరిచే మౌత్ వాష్ లాగా పనిచేస్తుంది, ఆయిల్ పుల్లింగ్ ద్వారా నోటిలోని సూక్ష్మ క్రిములను చంపడానికి ఉపయోగపడుతుంది.దంతాల పరిరక్షణ కు తోడ్పడుతుంది. నోటి దుర్వాసన పోగొడుతుంది.పెదాలు,నోరు,గొంతులో తడి ఆరకుండా చేస్తుంది, దీనితో సమానంగా బేకింగ్ షోడా కలిపి టూత్ పేస్ట్ గా కూడా ఉపయోగించుకొనవచ్చు.
  • చర్మానికి సంబంధించిన అన్ని వ్యాధులను నిరోధించి చర్మ సంరక్షిని గానూ కేశ రక్షని గానూ పనిచేస్తుంది. దీనిలో ఉన్న సూక్ష్మ జీవి నిరోధక, వైరస్ నిరోధక గుణాల వలన చెవికి సంబంధించిన ఇన్ఫెక్షన్ లు,ఫంగల్ ఇన్ఫెక్షన్ లు  పుండ్లు,దద్దుర్లు,కీటకము కరిచినందువలన కలిగే సమస్యలు,తేనెటీగల కాట్లు ముక్కువెంట రక్తం కారడం, మూలశంక, స్ర్త్రీ జననాంగాలలో తడి ఆరిపోవడం,వంటివి నిరోధించడమే కాక పిల్లలను ఆశిస్తున్న తల్లులకు మార్గం సుగమం చేస్తుంది..  తలలో పేలు నిరోధానికి కొబ్బరి నూనె ను సోపు గింజలతో కలిపి రాసిన ట్లయితే బజారులో దొరికే మందుల కన్నా బాగా పనిచేస్తుంది.   
  • కొబ్బరి నూనె ను ఇంటిని శుభ్రపరిచే లోషన్ గా కూడా ఉపయోగించవచ్చు.!17-18

కొబ్బరి నూనె వినియోగదారుల అనుభవాలు  కోకోనట్ డైట్ లో గానీ ఆరోగ్య సూచనల ఫోరం నుండి గానీ తెలుసుకోవచ్చు. 20.

3.2 ఇంట్లోనే విర్జిన్ కోకోనట్ ఆయిల్ పొందేందుకు సరళమైన మార్గము 32-35

ముదురుగా ఉన్న కొబ్బరికాయలన నుండి కొబ్బరినూనె ఎలాపొందవచ్చో క్రింద పేర్కొన్న కొన్ని వెబ్సైటు చూసి తెలుసుకోవచ్చు.     . ఎవరయినా ఇంట్లోనే ఇవి తయారుచేయలనుకుంటే తక్కువరకం కొబ్బరి నూనె ను బ్లీచింగ్,హైడ్రోజనేషన్,వంటి వాటి ద్వారా శుభ్ర పరచు కోవచ్చు ఐతే చివరిలో  వీటియొక్క అవశేషాలు పాత్రలో ఉండవచ్చు.

3.3 ముడి కొబ్బరినూనె పొందే మార్గం 17-22

రోజుకు రెండు స్పూన్ల (30మి.లీ.) ముడి సేంద్రియ కొబ్బరినూనె తిసుకోన్స్ద్సం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని అధ్యయనాలు తెలుపుతున్నాయి. కొన్ని రకాల గింజలు,అవకడో పండు,ఆలివ్ నూనె వంటి ద్వారా లభించే  ఆరోగ్య కరమైన కొవ్వు పదార్ధాలు కూడా కొబ్బరినూనె లో మనకు లభిస్తాయి.  ఐతే ఇలా తీసుకోవడం కొంచం కొంచం గా ప్రారంభించి మన అనుకూలతను బట్టి క్రమంగా  పెంచుకుంటూ పోవచ్చు. దీనిని మాములుగా తీసుకోవడం కష్టమనుకున్నవారు టీ,కాఫీ,సలాడ్ వీటిలో కలుపుకొని త్రాగవచ్చు. ఇది ఎక్కువ ఉష్ణోగ్రత వద్దకూడా స్థిరంగా ఉండగలదు కనుక దీనిని వంట కు కూడా వాడుకోవచ్చు.

హెచ్చరిక 23-24దీనిలో అధిక శాతంలో ఉన్న సంతృప్త కొవ్వు ఆమ్లము కారణముగా దీని యొక్క అద్వితీయమైన గుణముల పట్ల కొన్ని దేశాలలోని  ఆరోగ్య సంస్థలకు సందేహాలున్నప్పటికీ పరిశోధనా ఫలితాలు మాత్రం ఇది అద్భుత ఆరోగ్య కారిణి అనే తెలియ జేస్తున్నాయి.  

4. కొబ్బరి పాలు 36-39

జంతువులకు సంభందించిన పాలు పడని వారికి కొబ్బరిపాలను   ప్రత్యామ్నాయముగా కూడా వాడవచ్చు . ఈ  పాలలో సాగుడు గుణం కలిగినవి బంక వంటివి ఏమీ ఉండవు కనుక మిల్క్ షేక్ వంటి పదార్ధాలు చేసుకోవడానికి  అనుకూలంగా ఉంటుంది. అంతేకాక బ్యాకరీ పరిశ్రమ వారికి  పాలకి ప్రత్యామ్నాయంగా కూడా ఉపయోగ పడుతుంది.

కొబ్బరిపాలలో సమృద్ధిగా విటమిన్లు,ఖనిజలవణాలు ఉన్నాయి. దీనిలో సమృద్ధికరమైన పాళ్ళలో లారిక్ ఆమ్లము, తగు పాళ్ళలో ఫాటీ ఆమ్లాలు ఉండడం వలన ఇది కొబ్బరినూనె ఇచ్చే ఫలితాలన్నీ అందిస్తుంది. ఇది నోటి పూతను నివారించి నోటిలో పుండ్లను అరికడుతుంది. ఇది  చర్మము పైన ముడుతలు రాకుండా, ఎండకు రక్షణగా నూ చేసి చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది.జుట్టుకు కూడా కండిషనర్ లాగా పనిచేస్తుంది.  

సంబంధించిన వెబ్సైట్లు

దీనిలో ఇవ్వబడిన సమాచారము విద్యా సంబంధమైన సమాచారము కోసమే గానీ దీనిని చికిత్సా సంభదిత మైనదిగానూ, వ్యాధి నివారణ నిమిత్తము, వ్యాధి నిరోధానికి సంబంధించినది గానూ భావించరాదు. మరిన్ని వివరాలకోసం క్రింద సూచించిన వెబ్సైట్ లు చూడండి. వ్యక్తిగతమైన అవసరాల మేరకు చికిత్సా పరిస్థితుల మేరకు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

  1. http://www.coconutboard.nic.in/tendnutr.htm
  2. http://articles.mercola.com/sites/articles/archive/2011/11/27/coconut-water-ultimate-rehydrator.aspx
  3. https://fitnesspell.com/benefits-of-drinking-coconut-water/
  4. http://www.nutrition-and-you.com/coconut-water.html
  5. http://www.webmd.com/food-recipes/features/truth-about-coconut-water
  6. http://www.medindia.net/patients/lifestyleandwellness/coconut-water-health-benefits.htm
  7. https://www.healthline.com/nutrition/8-coconut-water-benefits
  8. https://drhealthbenefits.com/food-bevarages/beverages/health-benefits-of-coconut-water-from-young-coconut
  9. https://www.ncbi.nlm.nih.gov/pubmed/10674546
  10. http://www.be-healthy-with-coconuts.com/coconut-meat.html
  11. https://drhealthbenefits.com/food-bevarages/fruits/health-benefits-young-coconut-meat
  12. http://pca.da.gov.ph/pdf/techno/virgin_coconut_oil.pdf
  13. https://www.livestrong.com/article/363811-the-fatty-acid-composition-of-coconut-oil/
  14. https://www.organicfacts.net/health-benefits/oils/properties-of-coconut-oil.html
  15. http://www.coconutboard.nic.in/cnoqulty.htm
  16. http://www.coconutresearchcenter.org/
  17. https://articles.mercola.com/sites/articles/archive/2013/11/18/coconut-oil-uses.aspx
  18. http://products.mercola.com/coconut-oil/
  19. http://coconutoil.com
  20. http://www.coconutdiet.com
  21. https://www.healthline.com/nutrition/how-to-eat-coconut-oil
  22. http://www.naturallivingideas.com/eat-coconut-oil/
  23. https://draxe.com/coconut-oil-benefits/
  24. https://draxe.com/coconut-oil-healthy/
  25. https://www.healthline.com/nutrition/top-10-evidence-based-health-benefits-of-coconut-oil
  26. https://www.naturalnews.com/025038_coconut_child_oil.html
  27. http://www.coconutresearchcenter.org/hwnl_10-2/hwnl_10-2.htm
  28. https://www.ncbi.nlm.nih.gov/pubmed/27543472
  29. http://www.thehindu.com/society/Matters-of-the-heart/article17139237.ece
  30. https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC4247320/
  31. https://www.ncbi.nlm.nih.gov/pubmed/26545671
  32. https://healthytraditions.com/coconut-oil/what-is-virgin-coconut-oil
  33. https://www.youtube.com/watch?v=I5qlPhhjYzU
  34. https://www.youtube.com/watch?v=JcBE0eNQHTQ
  35. https://www.youtube.com/watch?v=qEZMm2NAwpo
  36. http://www.bbcgoodfood.com/howto/guide/ingredient-focus-coconut-milk
  37. http://www.seedguides.info/coconut-milk/
  38. http://www.med-health.net/Coconut-Milk-Benefits.html
  39. http://www.sharecare.com/health/diet-nutrition/article/coconut-milk-really-good-for-you

 

2. స్వామి వైబ్రియానిక్స్ పైన  తమ అనుగ్రహ వర్షం కురిపించడం కొనసాగిస్తూనే ఉన్నారు.……

రెండు విశిష్ట వైబ్రో వైద్యాలయముల ప్రారంభం

 2016.డిసెంబర్ 28 వ తేదీన హైదరాబాద్ లో ఉన్న శివం మందిరానికి చెందిన ఈశ్వరమ్మ సదన్ లో వైబ్రో వైద్యశాల ప్రారంభ మయ్యింది. ప్రతీ గురువారము ఇద్దరు ప్రాక్టీషనర్ లు పేషంట్ల చికిత్సా అవసరాలు చూస్తారు.

 

 

 

 

 

2017 డిసెంబర్ 12 వ తేదీన తెలంగాణా రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం  జిల్లా సత్యసాయి సేవాసంస్థ అధ్యక్షులు  పాల్వంచ మందిరంలో వైబ్రియానిక్స్ చికిత్సా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా  ప్రాక్టీషనర్  11585, తన స్వల్ప ప్రసంగం ద్వారా వైబ్రియానిక్స్ గురించి సభ్యులకు వివరించారు. చికిత్సా కేంద్రం ప్రారంభించిన వెంటనే 13 మంది పేషంట్లు వైద్య సహాయం పొందారు. ప్రతీ గురువారము ఇద్దరు ప్రాక్టీషనర్ లు  ఈ చికిత్సా కేంద్రాన్ని నడిపిస్తారు.

 

 

 

 

 

క్రొత్తగా శిక్షణ తీసుకున్న SVP పైన స్వామి కృపా వర్షం  

  2017 నవంబర్లో  SVP గా శిక్షణ పొంది  చికిత్సా నిపుణురాలు  11570 29 వ  తేదీన తమ ఇంటికి వెళ్లారు. నవంబర్ 30 వ తేదీన తన  SRHVP ని ఉపయోగించడం కోసం సోహం పుస్తకం 3,తెరవగానే అత్యంత ఆశ్చర్య కరంగా అమృత బిందువులు కవర్ పేజీ పైన కనిపించాయి.అంతేగాక మరింత అమృతం డిసెంబర్ 2 న కూడా కనిపించింది.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Om Sai Ram