Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

Vol 8 సంచిక 5
September/October 2017
ముద్రింప తగిన వార్తాలేఖ


పూర్తి వార్తాలేఖ యొక్క కాగితం ప్రతి కావలెనన్నఈ పుటను ముద్రించండి

డా.జిత్ కే అగ్గర్వాల్ యొక్క డెస్కు నుండి

ప్రియమైన వైబ్రో అభ్యాసకులరా ,

అత్యంత పవిత్రమైన  దసరా నవరాత్రుల సందర్భముగా ఇలా మీతో నా భావాలను పంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ రోజులు ఎంత పవిత్రమైనవో స్వామి మాటలలో ‘‘ భారతీయులు ఈ నవరాత్రులను ప్రాచీన కాలము నుండి దివ్య మాతను దేవీ గా కొలుస్తూ ఒక పండుగ గా జరుపుకుంటూ ఉన్నారు. వారు ఈ దేవీ యొక్క అంశాలను  దుర్గ,లక్ష్మి,సరస్వతి గా ఈ తొమ్మిది రోజులు కొలిచి పూజిస్తారు’’. 1991అక్టోబర్ 18 నాటి శ్రీవారి దివ్యోపన్యాసము. “దుర్గ మనకు భౌతిక,మానసిక,ఆధ్యాత్మిక శక్తులను ప్రసాదిస్తే లక్ష్మి మనకు సంపదను ప్రసాదిస్తుంది. సంపద  అనగా కేవలం ధనం  అని అర్ధం కాదు తెలివి తేటలు సంపదే మంచి శీలము సంపదే. మంచి ఆరోగ్యము కూడా సంపదే . ఇక సరస్వతి మనకు జ్ఞానాన్ని,యుక్తా యుక్త వివేచన ను ప్రసాదిస్తుంది.  ఈ నవరాత్రి ఈ దేవతల(దివ్య స్త్రీ మూర్తులు)  యొక్క శక్తులను మానవాళి గ్రహించడం కోసం ఈ నవరాత్రి ఉత్సవాలను జరుపుకుంటారు.” -   1988 అక్టోబర్ లో దసరా నాటి శ్రీవారి దివ్యోపన్యాసం నుండి .

    ప్రపంచవ్యాప్తంగా తుఫాన్లు వల్ల ,వరదల వల్ల,అడవులలో దావానలం వల్ల ,భూకంపాలవల్ల,మానవాళికి అపార నష్టం వాటిల్లు తున్న తరుణంలో ఈ వార్తాలేఖ మీ చేతిలోనికి వచ్చింది. ఈ వైపరీత్యాల  కారణంగా బాధలకు,నష్టాలకు గురిఐ నట్టి వారికోసం మేము హృదయ పూర్వకంగా ప్రార్ధిస్తున్నాము. మా విన్నపం ఏమిటంటే హృదయపూర్వకంగా ప్రార్ధిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అట్టి వారికోసం స్వస్థత పూర్వక మైన శక్తిని ఈ ప్రకృతి వైపరీత్యాలకు గురి యయిన వారికి ప్రసరింప జేయండి. మరియు ప్రకృతి సిద్ధ సహజ వనరుల కోసం మనిషి చేస్తున్న దురాగతాలవల్ల ,భూఉపరితల వేడిమి వల్ల భూమాతకు కష్టం కలగ కుండా ఉండడం కోసం కూడా మీ ప్రార్ధన ద్వారా శక్తిని ప్రసరింప జేయండి. ముఖ్యమైన విషయం ఏమిటంటే మనందరికీ భగవద్భక్తీ ,ప్రేమా ఉన్నాయి.  ఈ ప్రేమను మానవాళి అంతటికీ రోజంతా ప్రసరింప జేయండి.

పోలాండ్ లోని మన వైబ్రియోనిక్స్ సోదర సోదరీ మణులు అంకితభావం తో ఒక నిశ్శబ్ద విప్లవం లాగా దేశవ్యాప్తంగా తమ నిస్వార్ధ సేవలతో వైబ్రియోనిక్స్ జండాను అందలమెక్కిస్తున్నారు. 2017 మే-జూన్ వార్తాలేఖ లో మార్చ్ 24-27 మధ్య జరిగిన్ జాతీయ పోలిష్ సదస్సు గురించి గత సంచికలో ప్రస్తావించాము. కృతజ్ఞతాపూర్వక కానుక గా ఈ సంచికను పోలాండ్ మరియు సరిహద్దు యురోపియన్ దేశాలకు సంబంధించిన చికిత్సా నిపుణుల వివరాలు, కేసుల వివరాలు,మరియు పరిశోధనా వ్యాసాలతో వారికి అంకితం చేస్తున్నాము.

     సంస్థ యొక్క నిరంతర కార్య కలాపాలను డిజిటైజేషన్ చేసే ప్రయత్నంలో భాగంగా మేము ఒక క్రొత్త అంతర్జాల ఆధారిత పోర్టల్ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నాము. దీనిలో ప్రాక్టీ షనర్ లు వ్వ్యక్తిగత సమాచారాన్ని నిక్షిప్తం చేసేందుకు మరియు అంతర్జాలం ద్వారా తమ  IASVP దరఖాస్తులను పంపేందుకు ఉపయోగ పడుతుంది. ఇంకా ప్రాక్టీ షనర్ లు తమ నెలవారీ రిపోర్టులను   ఈ మెయిల్ లో పంపడం ద్వారా తమ కో ఆర్డినేటర్ లకు పంపే శ్రమ తప్పుతుంది .ఒక నెల రోజులలో ఈ ప్రక్రియను పూర్తీ చేయాలనీ ప్రాక్టీషనర్లందరికి  తమ రిజిస్టర్ చేసిన ఈ మెయిల్ ద్వారా సమాచారం పంపడం జరుగుతుందని తెలియ జేస్తున్నాము .

ఈ వైబ్రియోనిక్స్ పట్ల ప్రపంచవ్యాప్త అవగాహన కల్పించడంలో మనం ఇంకా చాలా వెనుకబడే  ఉన్నట్లు నా అభిప్రాయం. కనుక ప్రతీ ఒక్క ప్రాక్టీ షనర్ ప్రతీ వారము ఒక క్రొత్త వ్యక్తికి వైబ్రియోనిక్స్ పట్ల కొంత సమాచారము అందించాలి ( ఇది మన AVP మరియు SVP మాన్యువల్ లోని నియమావళిని అతిక్రమించకుండా ఉండాలి)మరియు వారికి క్రింది  లింక్ ను కూడా https://www.youtube.com/watch?v=roXS0_WcU28&feature=youtu.be తెలియ చేయండి. అలాగే వైబ్రియోనిక్స్ అంటే ఏమిటి అనే విడియో కూడా వారికి చూపించండి . ఇది వారిలో వైబ్రియోనిక్స్ పట్ల అవగాహన పెంచడానికి మన మిషన్ భూమండలం అంతా వ్యాపించడానికి దోహద పడుతుంది దీనివల్ల వైబ్రో మందుల ఫలితాలను ఎక్కువ మందికి అందించే అవకాశం కలుగుతుంది.  అటువంటిఅనుభవాలతో కూడిన కథానికలను మాకు ప్రచురణార్ధం పంపిస్తే అవి ఎంతో మందికి స్పూర్తి దాయకంగా ఉంటాయి.  

  మన వైబ్రియోనిక్స్ మిషన్ అద్భుత ఫలితాలతో ముందుకు వెళుతున్న కొలదీ పరిపాలనా విభాగానికి సంబందించిన అవసరాలు కూడా అదే నిష్పత్తిలో ఇతోధికంగా పెరుగుతూ వస్తున్నాయి. కనుక ప్రపంచ వ్యాప్తంగాను,ప్రాంతీయ పరంగానూ,స్థానిక అవసరాల దృష్ట్యా ప్రాక్టీషనర్ ల వద్దనుండి మరింత సహకారము అవసరము, కనుక మీరు ఏ రూపంలో మాతో చేయి కలిపినా కొండంత సహాయం చేసిన వారవుతారు. దయ చేసి [email protected] కు  రాయండి,లేదా మీ ప్రాంతీయ లేదా మీ దేశపు కోఆర్డినేటర్ ను మరింత సమాచారము కోసము,మరిన్ని సేవ అవకాశాల కోసం సంప్రదించండి.

  కేరళ వైబ్రియో టీం అంతటికీ ప్రాక్టీషనర్ లు అందరి తరఫునా ఓణ౦ పండుగ  శుభాకాంక్షలు. ఒకసారి స్వామి ఈ కేరళ వాసుల గురించి ఏం చెప్పారంటే  , “కేరళ సత్యసాయి సంస్థలోని సభ్యులు మహిళలు,పురుషులు కూడా వారు ఏ కార్యక్రమం చేసినా భారీ ఎత్తున చేస్తారు కనుక  కేరళ భక్తులు  భవిష్యత్తులో చేసే  సేవాకార్యక్రమాలలో  కూడా ఇదే ఒరవడిని కొనసాగించాలని ఆశీర్వదిస్తున్నాను’’!!

ప్రేమతో సాయి సేవలో మీ

జిత్ కె అగ్గర్వాల్

చెవిలో హోరు 02856...UK

2015 ఆగస్ట్ 15 వ తేదీన 82 ఏళ్ల వృద్ధ మహిళ చెవిలో హోరుకు వైబ్రో రెమిడి కావాలని ప్రాక్టీషనర్ ను కోరారు. ఒక సంవత్సర కాలంగా వేధిస్తున్న ఈ సమస్యవల్ల ఈమెకు రెండు చెవులలోను అనేక శబ్దాలు వినవస్తూ ఉన్నాయి. అలోపతి డాక్టర్ వీరికి చెవిలో ఇన్ఫెక్షన్ అని గుర్తించి ఇచ్చిన జంటామైసిన్ చెవిలో వేసుకునే మందును సంవత్సరం పాటు వాడినా ఏమాత్రం ఫలితం కలుగలేదు. ఆమె రెమిడి ని లోపలి తీసుకోవడానికి నిరాకరించడంతో ఆలివ్ నూనెలో క్రింది రెమిడి ని కలిపి ఇవ్వడం జరిగింది.

CC5.1 Ear infections + CC5.3 Meniere’s disease…BD, ఒకసారికి రెండు చుక్కలు.

ఐతే ప్రాక్టీషనర్ చెప్పినప్పటికీ వీరు జంటామైసిన్ తీసుకోవడం మానేసి కేవలం వైబ్రియోనిక్స్ మాత్రమే తీసుకున్నారు. వారం లోనే వీరు పూర్తిగా కోలుకొని రెమిడి వాడడం పూర్తిగా మానేసారు. 2017 ఆగస్ట్ లో విషయం తెలుసుకొనడానికి ప్రాక్టీషనర్ ఫోన్ చేయగా ఈమెకు మరలా సమస్య రాలేదని తెలిసింది. 

 

శరీరానికి ఎడమ పార్శ్వములో చలి 11520...India

48-సంవత్సరాల వయసుగల మహిళ మూడు సంవత్సరాలుగా ఎడమ పార్శ్వము వైపు చలితో బాధ పడుతున్నారు. ఈ విధంగా చలికాలంలోనే (నవంబర్ నుండి ఫిబ్రవరి ) ఆమె ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఈ సమస్య కలుగుతోంది.  శీతాకాలంలో వీరి చుట్టుపక్కల ఉష్ణోగ్రత 2 డిగ్రీల గా ఉంటోంది.ఈ పేషంటుకు వేరే ఇతర సంస్యలేవి లేవు.

వీరు సంప్రదించిన   డాక్టర్  ఇది కేవలం మానసిక అస్తవ్యస్త స్థితి తప్ప వేరే కాదని చెప్పి కొన్ని మల్టి విటమిన్ మాత్రలు తో పాటు ప్రతిరోజూ దేహములో రక్త సరఫరా మెరుగుదల కోసం కొన్ని ఎక్సెర్ సైజులు చెప్పడం జరిగింది. దీనికి తృప్తి చెందని పేషంటు ఆ బాధ తోనే  2016 నవంబర్ 7 న సహాయం కోసం  ప్రాక్టీ షనర్ ను కలవడం జరిగింది. ఆమె ప్రాక్టీ షనర్ తో ఏమన్నారంటే తన 75- సంవత్సరాల ఆంటీ కూడా ఇదే సమస్యతో బాధ అనుభవించగా డాక్టర్లు ఇది విటమిన్ లోపముతో కూడిన సమస్య గా భావిన్చారని  కానీ దురదృష్టవశాత్తూ ఆమెకు పక్షవాతము వచ్చినదని కనుక తనకు కూడా ఇదే పరిస్థితి వస్తుందనే భయం వెన్నాడుతోంది.

క్రింది రెమిడి ని ఒక వారానికి గానూ ఇవ్వడం జరిగింది.

CC3.1 Heart tonic + CC3.7 Circulation + CC15.1 Mental & Emotional tonic + CC18.1 Brain disabilities + CC18.4 Paralysis + CC18.5 Neuralgia...TDS

ఈ మధ్యలోనే ప్రాక్టీషనర్ తన సీనియర్ తో ఈ కేసు విషయం మాట్లాడడం జరిగింది. సీనియర్ ప్రాక్టీ షనర్ వీరితో ఈ పేషంటు లో రుగ్మతకు కారణం అతని గుండెకు సంబంధించిన నరాలలో ఘనీభవించిన పదార్ధాలు ఉండడమో లేక ఏదయినా షాక్ కు గురికావడమో అని భావించారు.

కనుక ఒక వారం తరువాత 2016 నవంబర్ 13 న పేషంటు వచ్చినప్పుడు క్రింది రెమిడి ఇవ్వడం జరిగింది.

NM25 Shock + SR548 Colocynthis + CC3.1 Heart tonic + CC3.2 Bleeding disorders + CC3.3 High Blood Pressure + CC3.4 Heart Emergencies + CC3.5 Arteriosclerosis + CC3.6 Pulse irregular + C3.7 Circulation + CC18.3 Epilepsy + CC18.4 Paralysis + CC18.5 Neuralgia...TDS

మూడు వారాల తర్వాత పేషంటు కు 30%మెరుగుదల కనిపించింది. ఆమెకు భుజాలు,తొడలు ఇలా కేవలం కొన్ని భాగాలలోనే చలి కలుగుతోది.పేషంటు రెమిడి వేసుకోవడం కొనసాగిస్తూనే ఉన్నారు. 5 వారాల తర్వాత ఆమె పరిస్థితి లో 70% మెరుగుదల కనిపించింది. ఆమెకు ప్రస్తుతం సాధారణ  పరిస్థితిలో మాములుగానే ఉంటోంది కానీ చలి వాతావరణమునకు నేరుగా గురి ఐనప్పుడే చలి కలుగుతోంది.

  రెండు నెలల తర్వాత  2017 జనవరి 17న పేషంటుకు 100% మెరుగయ్యింది.డోసేజ్ ను BD గా ఒక వారము OD గా ఒక నెల మరియు OW గా నాలుగు వారాలు వాడి తరువాత పూర్తిగా మానివేయడం జరిగింది.  2017 సెప్టెంబర్ నాటికి పేషంటుకు పూర్తిగా మాములుగా ఐ పోయింది.

 

కిళ్ళ వాతము 11582...India

2016 ఆగస్ట్ 27 తేదీన 37-సంవత్సరాల వయసుగల మహిళ కీళ్ళ వాతము తో  ప్రాక్టీషనర్ ను సంప్రదించడం జరిగింది.ఇద్దరు  పిల్లల తల్లి ఐన ఈమెకు రెండవ ప్రసవము తర్వాత కీళ్ళ లోనూ వ్రేళ్ళ లోనూ బొటన వేళ్ళ లోనూ విపరీతమయిన నొప్పి కలగ సాగింది. ఈవిధంగా 7 సంవత్సరాలుగా  బాధ పడుతోంది..  వీరు నిముసిలిడ్ మాత్రలను  డాక్టర్ సూచన మేరకు BD,గా తీసుకుంటున్నారు. అదనంగా వీరు ఆయుర్వేద ఆయిల్ మాసేజ్ కూడా ప్రయత్నించారు.కానీ ఏవి కూడా ఈమెకు వ్యాధిని తగ్గించలేక పోయాయి. ఆమె వ్రేళ్ళు కూడా వంకర తిరిగి ఉన్నట్లు ప్రాక్టీ షనర్ గమనించారు. కనుక ఈ మహిళ ఇతరత్రా కోర్సులన్ని మానివేసి వైబ్రో నే ప్రయత్నించాలని నిర్ణయించుకున్నారు. క్రింది రెమిడి ఆమెకు ఇవ్వబడినది :

CC3.7 Circulation + CC15.1 Mental & Emotional tonic + CC20.1 SMJ tonic + CC20.2 SMJ pain + CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue...QDS for 15 days, thereafter TDS

వీరికి త్వరగానే స్వస్థత చేకూరి నెల రోజులలోనే 35% మెరుదల కనిపించిందని ఆనందంగా తెలిపారు.రెమిడి ని TDS  తీసుకున్నారు  మరో రెండు నెలలలో పేషంటుకు నొప్పి విషయంలో 90% మెరుగుదల కనిపించింది. ఆమె వ్రేళ్ళు ఇప్పుడు వంకరగా ఉండడం లేదు ఆమె తన పనులను మాములుగానే చేసుకోగలుగుతున్నారు. 2017 జనవరి 3వ తేదీన తనకు 100% నయమైనట్లు తెలిపారు.కనుక డోసేజ్ ను BD గారెండు నెలలు ఆ పైన క్రమంగా తగ్గించుకుంటూ OD  గా మార్చి   2017 ఆగస్టు 5 నాటికి  పూర్తిగా మానివేయడం జరిగింది.అలాగే ప్రాక్టీషనర్ సూచన మేరకు పేషంటు తన జీవన సరళిని మార్చుకొని ప్రతీ రోజు కొన్ని ఎక్సెర్ సైజులు చేయడం యోగా చేయడం అలవరుచుకున్నారు. అలాగే ఆహారము విషయంలో కూడా కొన్ని మార్పులు చేసుకొని వంకాయలు,ఆలుగడ్డలు తినడం పూర్తిగా మానేసారు. 2017 సెప్టెంబర్ నాటికి  ఆమెకు ఎటువంటి నొప్పి  లేకుండా పూర్తిగా తగ్గిపోవడంతో ఆనందంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. 

 

కార్పాల్ టన్నెల్ సిండ్రోమ్ (CTS) 11576...India

46-సంవత్సరాల వయసుగల మహిళ కు మే 2016 నుండి కుడి మణికట్టుకు (CTS) వ్యాధి అనగా ప్రధాన నరము కుంచించుకుపోవడం వలన కలిగే నొప్పి తో కూడిన వ్యాధి వచ్చింది. ఆమెకు  కంప్యూటర్లపట్ల ఆసక్తి లేదు,సెల్ఫోన్లు ఉపయోగించరు. వైద్య సంబంధముగా ఈ వ్యాధికి తగిన కారణమూ తెలియరాలేదు. నాలుగు వారాలుగా ఆమెకు తీవ్రమైన నొప్పి ,మరియు కొంచం వాపు కూడా ఉంటున్నాయి.ఇంతేకాక ఈ నొప్పి బొటన వ్రేలు,చూపుడు వ్రేలు,మరియు మధ్య వ్రేలు మీదుగా భుజం వరకూ వ్యాపిస్తోంది. వీరి యొక్క డాక్టర్ దీనిని తీవ్రమైన CTS కండిషన్ గా పరిగణించారు. డాక్టర్ ఆమె మణికట్టు వద్ద ఒక బద్ద వంటి ఆధారముతో ముంజేతిని జాలీ వంటి భాగంలో ఉండేవిధంగా అమర్చారు.అలోపతి వైద్యం మొదటిరోజున ఆమెకు నొప్పి నివారిణి ఇచ్చి అదనంగా ఇబు ప్రోఫెన్ BD గా ఇచ్చారు కానీ దీనివల్ల ఆమెకు తలతిరుగుడు ఊపిరి అందకపోవడం వంటివి ఏర్పడడం తో ప్రాక్టీషనర్ వద్దకు రావడానికి వారం రోజులు ముందు వాటిని తీసుకోవడం మానేసారు.  వీరు హోమియోపతి  మందు రుటా గ్రావోలేన్స్ 30C,కూడా తీసుకున్నారు కానీ వైబ్రో చికిత్స ప్రారంభమవుతూనే వాటిని మానేసారు.  

పెండ్యులం ద్వారా చేసిన పరిశీలన లో వీరికి కుడి మనికట్టులో నరము కుంచించుకు పోవడం మరియు కాల్షియం లోపము బహిర్గతమయ్యాయి. 2016 జూన్ 3 వ తేదీన క్రింది రెమిడి వీరికి ఇవ్వడం జరిగింది:
CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC18.5 Neuralgia + CC20.3 Arthritis…TDS నీటితో

రెండు రోజులలో 20% మెరుగుదల కలగడం తో వీరికి డాక్టర్ కట్టిన జాలీ వంటి దానిని వారంతట వారే తొలగించుకున్నారు.నాలుగు రోజులకల్లా భగవంతుడి లీల మాదిరిగా నొప్పి మొత్తం మాయమయ్యింది. జూన్ 16 కల్లా డోసేజ్ BD గానూ మరొక నెలా పదిహేను రోజులు OD గానూ తరువాత అక్టోబర్ వరకూ  OW గా తీసుకొని తరువాత మనివేసారు. 2017 ఆగస్టు నాటికి వీరికి CTS, వ్యాధి గానీ కనీసం చిన్న నొప్పి కూడా లేకుండా ఆనందగా ఉండగలిగారు.

శప్తాల పండ్ల చెట్టుకు జిగురు వ్యాధి 01620...France

2017 ఏప్రిల్ నెలలో ఒక మహిళ (గమ్మోసిస్) వ్యాధితో బాధ పడుతున్న తన శప్తాలు పండుల(పీచ్ )చెట్టు కు చికిత్స కోసం వచ్చారు.ఈ చెట్టుకు ఒక్క ఆకు  కూడా లేకుండా మొత్తం రాలిపోయాయి.గత సంవత్సరం ఆమెకు కాయలేమి దొరకలేదు ఉన్నవి కూడా పురుగుల  బారిన పడ్డాయి.కనుక ఈ మహిళ తన చెట్టుకు రెమిడి కావాలని ప్రాక్టీ షనర్ ను సంప్రదించారు . ప్రాక్టీషనర్ క్రింది రెమిడి ని ఆమెకు ఇచ్చారు:

CC1.2 Plant tonic…OW

ఐదు గోళీలను 200 మీ.లీ.నీటిలోవేసి అవి కరిగిన తర్వాత బాగా కదిపి ఈ నీటిని లీటరు నీటిలో కలపాలి. బాగా కదిపిన తర్వాత అవసరమైతే నీటిని కలిపి 10 లీటర్ల ద్రావణం గా కూడా తయారుచేసుకోవచ్చు.  

ఈ మహిళ ఈ ద్రావణాన్ని రెండు వారాలలో రెండు సార్లు మాత్రమే చల్లారు.మొదటిసారి చల్లిన తర్వాత ఆకులు పెరగడం మొదలయ్యాయి. 

 2017 సెప్టెంబర్ లో పంట దిగుబడి అద్భుతంగా ఉండడంతో పాటు ఆకులు అద్బుతంగా ఉండడం, ౩౦కిలొగ్రాములు అందమైన పండ్లు లభించడమూ జరిగింది..

చెట్టు యజమాని వ్యాఖ్య :

నాకు ఎంత అద్బుతంగా ఉందంటే   శప్తాలు లు పండు విరివిగా కాచి వానితో నేను జాం  మరియు కేకులు ఎన్నో తయారుచేసుకున్నాను .ఈ ఫలితం చూసాక మందు ద్రావణాన్ని గార్డెన్ లో ఉన్న అన్ని మొక్కలకు చల్లాను. వచ్చిన ఫలితాలతో ఆనందంగా ఉన్నాను.

సంపాదకుని వ్యాఖ్య ;

*గమ్మోసిస్ అనేది కొన్ని రకాల మొక్కలు చెట్లకు జిగురు వంటి ద్రావకము కొమ్మలపైనా  కాండము పైనా స్రవించడం.ఈ వ్యాధి  కొన్నిపరాన్న  జీవుల ప్రభావము చేత ఆకురాల్చే చెట్లకు ముఖ్యంగా చెర్రీ,ప్లం,అప్రికాట్, పీచ్ మరియు నారింజ రకాల చెట్లకు వస్తూ ఉంటుంది. 

 

వెన్ను నొప్పి 11578...India

2016,మే 23వ తేదీన 53-సంవత్సరాల వయస్సుగల వ్యక్తి వెన్ను నొప్పి సమస్యతో ప్రాక్టీ షనర్ ను కలుసుకున్నారు.12 సంవత్సరాల క్రితం అతని వెన్నుముక కు  తీవ్రమైన దెబ్బతగిలింది. నిజానికి అతని వీపు మొత్తానికి నొప్పి ఉన్నప్పటికీ క్రింది భాగంలో మరి ఎక్కువగా ఉంది.అలా ప్రతీరోజు నొప్పితోనే గడిచిపోయేది.ముఖ్యంగా మంచం మీదనుండి లేవడం నరకప్రాయం గా ఉండేది.6 నెలల పాటు అలోపతి మందులు తీసుకున్నారు అనంతరం నొప్పి బాగా భరింపరానిదిగా ఉన్నప్పుడు మందులు తీసుకునేవారు. ముఖ్యంగా శీతాకాలం నొప్పి భరింపరానిదిగా ఉండేది.అతనికి క్రింది రెమిడి ఇవ్వబడింది :

CC3.7 Circulation + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC18.5 Neuralgia + CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue + CC20.5 Spine + CC20.7 Fractures…TDS in water

ట్రీట్మెంట్ మొదలుపెట్టిన కొద్దికాలానికే వీరు వేరే దేశం శీతాకాలంలో వెళ్ళవలసి  వచ్చింది. ఐతే రెండు వారాలలోనే చలి ఎక్కువగా ఉన్న  ఆ వాతావరణంలో కూడా నొప్పి తగ్గి కొంత మెరుగనిపించింది.

చికిత్స మొదలుపెట్టిన 4 వారాల  తర్వాత 40% ఆరువారాల తర్వాత  100% మెరుగుదల కనిపించింది. వీరు అటూఇటూ సులువుగా తిరగగలగడమే కాక ఉదయం పక్క మీదనుండి లేవడం కూడా ఇబ్బందేమీ లేకుండా లేవగలుగుతున్నారు .

మరో రెండు వారాలు రెమిడి తీసుకున్న తర్వాత అతని అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాల రీత్యా అనేక దేశాలు తిరగవలసి ఉన్నందున రెమిడి తీసుకోవడం పూర్తిగా మానేశారు. సంవత్సరం తర్వాత అనగా 2017 జూలై నెలలో తనకు మరలా నొప్పిగని మరేవిధమైన ఇబ్బంది గానీ రాలేదని చెప్పారు.

అభ్యాసకుల వివరాలు 03039...Poland

ప్రాక్టీషనర్ లు  03040 & 03039 పోలాండ్ లో ఉంటూ ఇటివలే జర్మనీ వలస వెళ్ళిన ఈ కుటుంబం యావత్తు సాయి వైబ్రియోనిక్స్ కుటుంబము అని చెప్పవచ్చు.ఈ కుటుంబంలోని దంపతులతో పాటు వీరి ముగ్గురు పిల్లలు కూడా తమ పాఠశాలలో స్నేహితులకు రెమిడి లు ఇస్తూ ఉంటారు. వీరంతా వైబ్రియోనిక్స్ లో ఒక విలక్షణ విధానాన్ని పాటిస్తూ ఉంటారు.వీరు ఎవరయినా పేషంటు తమవద్దకు వస్తే ఆ పేషంటు రోగానికి కారణం   మొత్తం కుటుంబం లోని సభ్యుల పైన ఉంటుందని భావిస్తూ కుటుంబం మొత్తానికి వీరు రెమిడి లు ఇస్తారు. వారు విన్నదేమిటంటే ‘‘బిడ్డకు అనారోగ్యము కలిగితే మొదట తల్లికి చికిత్స చెయ్యాలి’’.వారి అనుభవం కూడా దీనినే రుజువు చేస్తోంది.ఎందరో తల్లిదండ్రులు తమ పిల్లలకోసం ఈ చికిత్సా నిపుణులను సంప్రదించినపుడు మొదట తల్లిదండ్రులకు చికిత్స చేయాలని వీరు గుర్తించారు. పిల్లలకు వచ్చిన వ్యాధులకు సంబంధించినంతవరకు తల్లిదండ్రులకు మందులు ఇచ్చి నివారణ చేసి నట్లయితే పిల్లలకు సహజంగానే వ్యాధి నివారణ అవుతున్నట్లు వీరు గుర్తించారు. కుటుంబం యావత్తూ మందులు వాడినట్లయితే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటున్నాయని కుటుంబ పరంగా చేసినవిశ్లేషణలో  వీరు తెలుసుకోగాలిగారు.

వీరి ఇంట్లో మెడికల్ కిట్ లో క్రింది రెమిడి లు ఉంటాయి:

CC10.1 Emergencies, వీరి ముగ్గురు పిల్లలు కేవలం దీనిని మాత్రమే తమతో తీసుకెళతారు.

NM35 Worms + NM66 Bilharzia + CC4.6 Diarrhoea

SR315 Staphysagria;  దీనితో పాటుగా CC11.2 Hair problems కలిపి తమ పేలతో ఉన్న తమ అబ్బాయిలకు ఇచ్చారు, దీనివల్ల మరలా పేల  సమస్య వీరికి కలుగలేదు. 

SM1 Removal of Entities, దీనిని నెలకు ఒకసారి గానీ రెండు సార్లు గానీ ఇంట్లోని వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ఉపయోగిస్తారు. ఎవరయినా తమ ఇంట్లో సభ్యులకు అశాంతిగా,ఆనంద విహీనంగా ఉంటే దీనిని ఉపయోగించవలసిందిగా సూచిస్తున్నారు.  

SM1 Removal of Entities + SM2 Divine Protection  తమ అపార్ట్ మెంట్ లో గానీ ఇంట్లో గానీ కుటుంబ సభ్యులకు ప్రతీ చిన్న విషయానికి కోపం తెచ్చుకోవడం, ఆవేశ పడడం ఇలా వ్యతిరేక భావాలు ఉంటున్నట్లయైతే ఈ రెమిడి ని ఒక బాటిల్ లోని నీళ్ళలో కలుపుకొని తమ అపార్టుమెంటులో చల్లుకోవలసిందిగా సూచిస్తున్నారు. ఇలా తరుచుగా చేస్తూ ఉండడం వలన ఇంట్లో శాంతి ఆనందము నెలకొంటాయని వీరి అభిప్రాయము .

CC1.2 Plant tonic

CC9.2 Infections acute  ఏదయినా ఇన్ఫెక్షన్ వచ్చినపుడు ఇది ఉపయోగిస్తే రెండు రోజుల లోనే తగ్గిపోతుంది.

CC11.6 Tooth infections

ఏదయినా సెలవు రోజున బయటకు వెళ్ళవలసి వస్తే తమ ఆస్తి పాస్తులు రక్షింప బడడానికి  మిషన్ లో SM2 Divine Protection కార్డును వదిలి వెళతారు .

ప్రాధమికంగా ఈ ప్రాక్టీ షనర్ లు వారి పేషంట్ల ఆరోగ్య స్థితిని (వీరి యొక్క బయో రెజోనేన్సు అధ్యయనం ఆధారంగా ) వివరించి వారు  త్వరగా కోలుకోవ డానికి అనారోగ్యము యొక్క స్థితిని కూలంకషంగా వివరిస్తారు. దురదృష్టవశాత్తూ ఇది ఒక్కొక్కసారి, పేషంటు మానసిక స్థితికి మించినది గానూ, భయాందోళనలు రేకెత్తించేవి గానూ పేషంటు కు అర్ధం చేసుకోవడానికి కష్టమైన విషయంగా పరిణమించి గందరగోళమును సృష్టిస్తున్నాయి.అందుచేత వీరు తమ పంధా మార్చుకొని సున్నితమైన విషయాలను పేషంటు స్థాయికి తగ్గట్టుగా  పాజిటివ్ గా  అన్వయించుకొనే లా  తర్ఫీదు నివ్వడం ప్రారంభించారు.దీనివల్ల పేషంటు తన సమత్వ స్థితిని తన సౌకర్యాన్ని పెంచుకోక పోయినా కనీసం ఆ స్థితిలో ఉండగలిగే విధంగా చేయగలుగుతున్నారు.

అప్పుడే వారు తగిన వైబ్రో రెమిడి లను , ప్రయోజనకారి ఐన ఆహారము,దేహ ప్రక్షాళనకు అనువయిన విధానాలు తెలియ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఆధ్యాత్మిక ప్రక్షాళనకు సయోధ్య మరియు క్షమించే తత్వము తో కూడిన ప్రాచీన హవాయి దీవులకు చెందిన క్షాళన ప్రక్రియ హో ‘అపోనోపోనో ‘ను పేషంట్లకు సూచించ సాగారు. వీరి అనుభవం ప్రకారము ఈ రెండింటి అనగా రెమిడి లు క్షాళన ప్రక్రియ అద్భుత ఫలితాలను అందించింది. దీనితో పాటుగా వీరు అలోపతి కి చెందిన డిసీజ్ వంటి పదాలు   పురాతనమైన పేర్లు,లేబుళ్ళు ఉపయోగించడాన్ని ప్రోత్సహించరు. వీరి ఉద్దేశ్యంలో ప్రతీ ఒక్క రుగ్మతకు ఒక ప్రత్యేక కారణమూ,ప్రయోజనమూ ఉంటుంది తప్ప మనలను చావమని  చెప్పడానికి మాత్రం కాదు అని వీరి అభిప్రాయము. 

ఈ ప్రాక్టీ షనర్లు మైధునం మరియు వయసు విషయంలో ప్రత్యేకమైన టానిక్ లను కనుగొన్నారు. వీరు విభిన్నవయసులకు చెందిన ఆడవారి దేహ మనో బుద్ధులు త్వరగా వికాసం చెందడానికి సాధారణంగా : CC8.1 Female tonic + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic…TDS నెల వరకు తరువాత BD గా రెండు నెలలు రెమిడి లని అందిస్తారు. అలాగే మొగవారికోసం CC14.1 Male tonic ,యువతకు CC14.2 Prostate. ను,పిల్లలకు   CC12.2 Child tonic ను అందిస్తారు.ఇవి వారిలో స్థిరత్వాన్ని,ఇంగిత జ్ఞానాన్ని కలిగిస్తాయని, ఇవి అమోఘమైనవిగా అభివర్ణించ లేమేమో కానీ చాలా వరకూ వ్యాధులకు ,కొన్ని సందర్భాలలో అత్యంత సంక్లిష్టమైన వ్యాధులు కూడా అదృశ్య మైన సంఘటనలకు వీరు ప్రత్యక్ష సాక్షి. అలాగే బలహీనంగా ఉండి  వైబ్రో థెరపీ కొత్తగా ప్రారంభిస్తున్న వారికి ఇవి వరప్రదాయనులని వీరి అభిప్రాయము.

 2013 లో వీరి స్నేహితుని యొక్క 15 సంవత్సరాల  కుమారుని యొక్క పుట్టుకతో వచ్చిన హైపోక్జియా (కణజాలానికి ప్రాణవాయువు తక్కువగా అందే వ్యాధి),మూర్చ వ్యాధి, అస్పెర్జెర్ సిండ్రోమ్ (సమాజంలో ప్రవర్తించవలసిన రీతిలో స్వభావం ఉండక పోవడం కండరాల అనియంత్రత ),చికాకు, నాడీకణజాల శోధము (పదేపదే ముక్కును రుద్దుకోవడం),పొల్లక్యురియ ,దస్తూరి బాగాలేక పోవడం,క్లాస్ వర్క్ చేయలేకపోవడం ,లోపభూయిష్టమైన చూపు,పదే పదే వచ్చే ఎలర్జీ మరియు న్యుమోనియా,చీకటి అంటే భయం,స్వీట్ ల పైన మక్కువ ఇలా అనేక రుగ్మతలకు రెమిడి లు ఇవ్వడం జరిగింది. ప్రాధమికంగా   CC4.6 Diarrhoea + CC4.10 Indigestion + CC7.2 Partial Vision + CC15.5 ADD & Autism + CC17.2 Cleansing. ఇవ్వబడింది. నెల రోజు ల తర్వాత CC17.2  ను తొలగించి కొత్త రెమిడి  CC18.2 Alzheimer’s disease + CC18.3 Epilepsy + CC18.5 Neuralgia పాత డానికి జోడించి ఇవ్వడం జరిగింది. మూడు నెలల తర్వాత వారు క్రింది రెమిడి కూడా జత చేయడం జరిగింది. CC12.2 Child tonic + CC15.2 Psychiatric disorders.ఇతని సమస్యలన్నీ అదృశ్యమవడంతో  2016 జనవరి లో చికిత్స పూర్తయ్యింది. ప్రస్తుతం ఈ 19 సంవత్సరాల యువకుడు తన గ్రాడ్యుఏషణ్  పూర్తి చేసుకొని తదనంతర విద్య కొనసాగించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. . 

ఈ అబ్బాయికి చెందిన 72-సంవత్సరాల నాయనమ్మ పెద్దప్రేగు క్యాన్సర్ గురించి 2013 మే నెల నుండి ప్రతీ రెండు వారాలకు ఖిమోథెరపి  తీసుకుంటున్నారు. వీరికి ఇంకా పార్కిన్సన్ వ్యాధి,మలబద్ధకం,హెర్నియా (గిలక) వ్యాధి కూడా ఉన్నాయి. 2013 సెప్టెంబర్లో క్రింది రెమిడి తో వీరి వైద్యం ప్రారంభమయ్యింది. SR350 Hydrastis + SR405 Ruta + SR559 Anti Chemotherapy + CC2.1 Cancers–all + CC2.3 Tumours & Growths + CC4.9 Hernia + CC17.2 Cleansing + CC18.6 Parkinson’s disease. అదనంగా త్వరగా జీర్ణము కావడానికి,సులభంగా మలవిసర్జన చేయడానికిగాను ఆహారము సూచించబడింది. ఒక నెల తర్వాత క్రింది రెమిడి CC17.2 ను తొలగించి  NM13 Constipation + BR8 Constipation + BR12 Liver + CC4.4 Constipation ను కలపడం జరిగింది.ఇది ఎటువంటి దుష్ప్రభావాలు లేని ఖిమోథెరపి వలె పనిచేసింది.  పరీక్ష చేయిన్చుకున్న ప్రతిసారీ కణుతులు 2014 చివరినాటికి కేన్సర్ పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడామె 76-సంవత్సరాల పూర్తి ఆరోగ్యవంతురాలయిన మహిళ.

  2014, ఫిబ్రవరి 8 వ తేదీన  మానసిక రుగ్మతలతో బాధ పడుతూ ఉన్న 75 సంవత్సరాల మహిళకు వైద్యం చేసారు.ఈమెకు డ్రైవింగ్  ఛేసే టప్పుడు కళ్ళు తిరగడం, అలసట ఒక్కొక్కసారి స్పృహ కోల్పోవడం కూడా జరుగుతోంది. దీర్ఘకాలంగా ఈమె కండరాల తిమ్మిరులు, రక్తపోటు, గుండెజబ్బు,పాదాలకు ఫంగస్ వలన ఏర్పడే సమస్యలు,కంటి సమస్యలు,స్వీట్ అంటే బాగా ఇష్ట పడడం ,రుగ్మతలు, మొదలగు సమస్యలతో బాధ పడుతున్నారు.  బయో రెసొనెన్స్ పద్ధతి ద్వారా ఈమెకు  ట్రైపానోసోమియాసిస్ (trypanosomiasis)వ్యాధి ఉన్నట్లు కనుగొన్నారు.. ఆమె యొక్క జీవితము,కుటుంబపరిస్థితి, ఈమె నివసిస్తున్న వాతావరణము,వీటిగురించి సుదీర్ఘమైన సంభాషణ అనంతరం క్రింద పేర్కొన్న రెమిడి ఈమెకు ఇవ్వడం జరిగింది. CC8.1 Female tonic + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic…TDS  మొదటి నెలకు అనంతరం BD గా  రెండు నెలలకు. పేరసైట్స్ అనగా పరాన్నజీవులనిమిత్తం CC4.6 Diarrhoea + CC4.8 Gastroenteritis + CC4.10 Indigestion…TDS గా నెలకు అనంతరం 14 రోజుల విరామం తర్వాత మరొక నెలవరకు ఇవ్వబడింది.ట్రైపానోసోమియాసిస్ (Trypanosomiasis)అతినిద్ర వ్యాధి నిమిత్తం ఆమెకు CC9.3 Tropical diseases + CC20.4 Muscles & Supportive tissueTDS నెలవరకు 14 రోజుల విరామం తర్వాత మరొక నెలవరకు ఇవ్వబడింది.

నెల తర్వాత పేషంటు పేరాసైట్ కి చెందిన లక్షణాలు తగ్గిపోయినట్లు తెలియజేసారు . మధ్యమధ్య  ఈ పేషంటు ఇతర వ్యాధి లక్షణాలకు  కూడా రెమిడి లు ఇవ్వబడ్డాయి. రెండు సంవత్సరాలు రెమిడి లను క్రమం తప్పకుండా  వాడిన తర్వాత పాదంలో మైకోసిస్ తప్ప మిగతా వ్యాధులన్నీ తగ్గిపోయాయి. 

ఈ చికిత్స తో ప్రభావితం ఐన పేషంటు ఎందరో పేషంట్లను ప్రాక్టీషనర్ల  వద్దకు పంపసాగారు.వారు ఈ పేషంటు యొక్క బంధువులు స్నేహితులతో పాటు ఈమె పెంపుడు పిల్లి, కుక్క, మొక్కలకు  కూడా చికిత్స చేసారు.  ప్రధానంగా ఈ పేషంటు యొక్క 84 సంవత్సరాల భర్త 10 సంవత్సరాల క్రితం గుండె పోటు రావడమూ,అలాగే గత సంవత్సర కాలంగా  ఈ పేషంటుకు  ప్రోస్టేట్ క్యాన్సర్ అని చెప్పడంతో బాగా నీరస పడిపోవడమే కాక మానసిక వత్తిడికి కూడా లోనయ్యారు. ఇతను  క్యాన్సర్ కారక గ్రంధిని తొలగింప జేసుకొని కేతేటరైజేషన్ చేయించుకున్నారు. ఐతే తరుచుగా కోపపడడము,జ్ఞాపక శక్తి లోపించడం అనే సమస్యలు ఏర్పడాయి. వీరు ప్రోస్టేట్ క్యాన్సర్ కు కూడా చికిత్స తీసుకున్న ౩ నెలల తర్వాత వీరి PSA సూచి (ప్రోస్టేట్ క్యాన్సర్ సూచిక )సాధారణ స్థాయికి చేరుకుంది.  వీరికి మూత్రపిండాలు మరియు మూత్రాశయము,నరాల వ్యవస్థ,శారీరక శక్తి కోసం,మానసిక సమతౌల్యత కోసం,పాదాలలోని ఫంగస్ నివారణకు,దంతాల నొప్పి ఇంకా అనేక వ్యాధుల కోసం రెమిడి లు ఇవ్వబడ్డాయి.సంవత్సరానికి ఒక్కసారి వీరికి ఇవ్వబడ్డ SM10 Spiritual Upliftment వీరి మూర్తిమత్వము లో  అద్భుత ఫలితాలు కనబరిచింది. వీరు నివసించే గదిని దుష్ప్రభావనిర్మూలన కోసం   SM1 Removal of Entities + SM2 Divine Protection తో స్ప్రే చేసే వారు.అలాగే 3 సంవత్సరాలు క్రమం తప్పకుండా ప్రాక్టీషనర్  00512 నుండి బ్రాడ్కాస్టింగ్ సహాయము కూడా పొందారు.  ఈ విధమైన ప్రేమ పూరితమైన అన్ని రకాల చికిత్సల ఫలితంగా ప్రస్తుతం వీరు పాడగలగడం, పద్యాలు రాయగలగడమే కాక వీరు చనిపోవడానికి సంవత్సరం ముందు ఒక పుస్తకం కూడా వ్రాయడం జరిగింది. 87 సంవత్సరాల వయస్సులో తన కుటుంబ సభ్యుల మధ్య ఆనందంగా తనువు  చాలించారు.

మన చుట్టూ ఉన్న పర్యావరణం మన విలువైన జీవ శక్తిని పెంచడంలో  గానీ తగ్గించడంలో  గానీ ప్రభావితం చేస్తుంది. పర్యావరణం అనడంలో వీరి ఉద్దేశ్యం మన వృత్తీ,గృహ కృత్యాలు,మన ఆహారము,ఇళ్ళు,మొక్కలు,జంతువులూ, మన జీవితాన్ని ప్రభావితం చేసే వివిధ వ్యక్తులూ ఇలా మన చుట్టు ఉన్న ప్రతీ ఒక్కటీ దీనిలోనికి వస్తుంది.  అననుకూల పరిస్థితులలో జీవించడం హానికారక జీవుల  (పోలిష్ భాషలో పరాన్న జీవుల కార్ఖానా)ఆవాస కేంద్రముగా ఉంటుందని వీరి అభిప్రాయము. దీని ఫలితముగా మన శరీరము హానికారక బ్యాక్టీరియ,ఫంగస్ ,వైరస్ లకు కేంద్రముగా మారుతుందని వీరి అభిప్రాయము.కనుక పేషంట్ల విషయంలో వీరు మొదట మనసుకు చికిత్స చేయడం పైన ఎక్కువ దృష్టి పెడతారు.

ఈ వైబ్రియో కుటుంబము ప్రాక్టీషనర్ 00512 అందించిన సహకారానికి,వాత్సల్యానికి కృతజ్ఞత తెలియజేస్తున్నారు.వీరంతా సాధ్యమయిన్నన్ని ఎక్కువ సార్లు కలుసుకొంటూ  తమ జ్ఞానాన్ని విస్తరించుకొంటూ తద్వారా మరింత లబ్ది పొందే ప్రయత్నం చేస్తున్నారు. సంక్లిష్టమైన కేసులు వచ్చినప్పుడు తగిన సూచనలు ఇవ్వడం, పెండ్యులం సహాయంతో ఎటువంటి రెమిడి లు ఇవ్వాలిఅనేది కూడా ఈ ప్రాక్టీషనర్  చెపుతూ ఉండేవారు. అవసరమైనప్పుడు రెమిడి లను బ్రాడ్కాస్టింగ్ చేసి కూడా ఇచ్చేవారు. ఈ వైబ్రోయో కుటుంబము ప్రాక్టీషనర్ 00512 తో ఉన్న సంబందము అద్బుతఫలితాలను అందించేది గానూ దానిని మాటల్లో వర్ణించలేనిది గానూ అభివర్ణిస్తున్నారు.పేషంట్లు కూడా ఖచ్చితమైన ఫలితాలు పొందుతుండడంతో వైబ్రియోనిక్స్ పట్ల వీరి నమ్మకం కూడా పెరిగింది.  వైబ్రియోనిక్స్ కుటుంబంలో భాగమై  నిస్వార్ద సేవద్వారా ప్రేమ మూర్తి మన స్వామి చేతిలో పనిముట్లుగా ఉన్నందుకు తామెంతో ధన్యుల మయ్యామని ఈ దంపతులు భావిస్తున్నారు. ఈ సేవ ద్వారా మానవులు,జంతువులూ,మొక్కలూ,ఒక్క మాటలో చెప్పాలంటే పర్యావరణానికి సేవనందిస్తూ తామెంతో ఆనందాన్ని అనుభవిస్తున్నట్లు ఈ దంపతులు తెలియజేస్తున్నారు.

 

అభ్యాసకుల వివరాలు 00512...Slovenia

ప్రాక్టీషనర్ 00512…స్లొవేనియా   స్లొవేనియా కు చెందిన ఈ ప్రాక్టీ షనర్ గురించి వార్తాలేఖ సంపుటము 7 సంచిక 6 లో ఇవ్వబడింది . ఐతే పోలాండ్ ప్రాక్టీ షనర్ లతో వీరికి ఉన్న సన్నిహిత సంభందమును పురస్కరించుకొని వీరు పోలాండ్ జాతీయ వైబ్రో సదస్సుకు ఆహ్వానింప బడ్డారు. వీరి సమర్పణ వ్యాసంలో ఎన్నో అద్భుతమైన కేసుల గురించి ప్రస్తావన చేసారు.వీరి దృష్టిలో పేషంటు తో మొదటి సమావేశమే అత్యంత ప్రాధాన్యత కలిగినది. పేషంటు సందర్శనలో ప్రాక్టీషనర్ పట్ల నమ్మకము,గౌరవం,విశ్వాసము క్రమంగా పెరిగిఒక సానుకూల ద్రుక్పధం ఏర్పాటుకు దోహద పడుతుంది. ముఖ్యంగా వీరు పేషంట్లు చెప్పే విషయాలను జాగ్రత్తగా విని నోట్స్ లో వ్రాసుకొని ఖచ్చితమైన నిర్దారణకు వస్తారు.ఆత్మవిశ్వాసం లేకపోవడం ,తనకు తాను అంగీకరించక పోవడం ,ప్రేమలేకపోవడం,ఇవన్నీ వ్యాధికి కారణాలు అని వీరి భావన. ఇదే విషయం వీరు పేషంట్లకు కూడాతెలియజేస్తారు.

సాధారణంగా మన మానసిక భావోద్వేగాలకు కారణం గత అనుభవాలను బట్టి ఉంటుందని ఇవి ప్రస్తుత కాలంలో కోపము ,అసూయ,భయము రూపాలలో వ్యక్తమవుతూ ఉంటాయనే విషయం పేషంట్లు గ్రహించ లేరని  వీరి భావన. ముఖ్యంగా క్షమించే తత్వం అనేది అలవరచుకోవాలని ఇదే రోగ నిర్మూలనకు నాంది అని వీరి భావన. ఈ విధంగా కౌన్సిలింగ్ ద్వారా వీరు పేషంటు లో ఒక క్రొత్త జీవితానికి బాట వేస్తే వీరిచ్చే రెమిడి లు దేహంలోని మూలకణాలలోనికి వెళ్లి వ్యాధి మూలాలను నశింపజేస్తాయి.వీరి ఉద్దేశ్యంలో పేషంట్లు తమ చెడు అనుభవాలను కూడా పంచుకోవడానికి సిద్ధంగా ఉండాలి. దీనివలన సరియయిన రోగనిర్ధారణ జరిగి ప్రాక్టీ షనర్ ఇచ్చే రెమిడి లు సక్రమంగా వాడడం వారిచ్చే సూచనలు పాటించడం ద్వారా వ్యాధి లక్షణాలు పూర్తిగా నశిస్తాయి.  

ఈ ప్రాక్టీ షనర్ మన ఆరోగ్యమును మనమే కాపాడుకోవడానికి -మనమే తీసుకోవలసిన చర్యలు, మన పరివర్తన ఇలా రెండు విధాలుగా ఉంటుందనే భావన వ్యక్తంచేస్తున్నారు. మొదట మనకు వచ్చిన వ్యాధిని అన్ని స్థాయిలలో (భౌతిక,మానసిక,ఉద్వేగ పరంగా)అంగీకరించే స్థితి, దీనిని మనకు మనమే తగ్గించుకోవడానికి దృఢ సంకల్పము వహించడం.  దీనికి సహాయపడే కొన్ని అంశాలు భగవంతుడు అందరిలోనూ ఉంటాడని అందరితో సామరస్యముగా ఉండడం. ఇలా చేయడం వలన మన ఆంతరంగికంగా ,బాహ్యంగా కూడా పొందిక ఏర్పడి అది చక్కటి ఆరోగ్యానికి మార్గం సుగమం చేస్తుంది. ‘’రోగులుంటారు గానీ రోగం ఉండదు’’ అనే దానిని వీరు బలంగా విశ్వసిస్తారు.

మనం ఏది తింటామో అదే రిఫ్లెక్షన్ రూపంలో బయటకు వస్తుందని వీరి ఆభిప్రాయము.అందుకే వీరు తమ పేషంట్ల కు పౌష్టికాహారం,ఆరోగ్యనియమలు వివరించి తద్వారా వ్యాధి త్వరగా తగ్గడానికి మార్గం ఏర్పరుస్తారు. వీరి దృష్టిలో పాకేజ్ చేసిన ఆహార దినుసులలో పోషక విలువలు ఏమాత్రం ఉండవు. దీనికన్నా మాక్రో బయోటిక్ ఆహారము చాలా మంచిదని తన విషయంలోనే దీనిని నిర్ధరాణ చేసుకున్నానని అంటున్నారు.  మన జీర్ణ వ్యవస్థ శాఖాహారమునకు  సమర్ధ వంతంగా పనిచేస్తుందని వీరి అభిప్రాయము.మన మూత్రపిండాలలో శరీరానికి కావలసిన శక్తి ప్రోగుబడి ఉంటుందని ఇది తరిగి పోకుండా ఎప్పటికప్పుడు పునః పూరణ జరుగుతూ ఉంటుందని వీరి భావన. మనం జీవించడానికి రెండు లీటర్లనీరు,కొంత ఆహారము ఉంటే చాలని ఇంత మాత్రం కోసము జంతువులను చంపి తినడం మహాపాపమని అసలు ప్రపంచములో యుద్ధోన్మాదానికి ఈ జీవహింసే కారణమని వీరిభావన.   

వీరు నిస్వార్ధం గా మానవులకు,మొక్కలకు,జంతువులకు వైబ్రో రెమిడి లను నీటిలో కలిపి ఇస్తూ ఉంటారు.వీరి దగ్గరకు ప్రాక్టీషనర్ లు పనిచేయని మెషీన్లు తెచ్చి పెడుతూ ఉంటారు. వీటిని తిరిగిపనిచేసే టట్లు చేసి వాటితో అనేక రకాల సమస్యలకు ఉదాహరణకి యాక్సిడెంట్ లవలన గాయాలు,కోమాలో ఉన్న పేషంట్లు,మాదక ద్రవ్యాలకు బానిసలయిన పెద్దలు,పిల్లలు ఇలా   అనేక మందికి లబ్ది చేకూరుతున్నది. పాత యుగోస్లోవియా లోని జిల్లాల లోనూ అక్కడి ప్రాంతాలలోను డాక్టర్లు ఉండరు,మందులు దొరకవు కనుక అక్కడ వీరు వైబ్రో సేవలు అందిస్తున్నారు. వైబ్రో మందులను అక్కడి ప్రజలు బాగా నమ్ముతారు ఎందుకంటే ఈ మందులు వాడిన వారిలో 90% మందికి నయమయ్యింది.

 2015 లో ప్రాక్టీ షనర్ 1300 పేషంట్లకు వైద్యం అందించారు. 2016 నాటికి ఈ సంఖ్య 1704  పెరిగింది. మార్చ్ లో సదస్సుకు హాజరవడానికి వచ్చేనాటికి వీరు 430 పేషంట్లను చూసారు, వీరిలో కొత్తవారు 280 మంది. వీరికి వచ్చే పేషంట్లలో మెడికల్ డాక్టర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ సదస్సులో కొన్ని అద్బుత అనుభవాలను వీరు సభికులతో పంచుకొన్నారు. వాటిని క్రింద పొందు పరచడం జరిగింది : ఒక లేడి డాక్టర్ కు సహాయకురాలిగా పని చేస్తున్న యువతి కారు ప్రమాదానికి గురి ఐన రెండు నెలల తర్వాత ప్రాక్టీషనర్ ను కలిసారు. ఆమె లివరు పూర్తిగానూ మరియు, శరీరపు ఎడమవైపు భాగము కూడా బాగా పాడయి పోయింది. మూడు నెలలు వైద్యం అనంతరం ఆమెకు ప్రతీ భాగము తిరిగి ఏర్పడడం ఆమె తిరిగి మాములుగానే నమలగలగడం,మాట్లాడ గలగడం చేయసాగింది. వైబ్రో చికిత్స గురించి తెలియని న్యురాలజిస్టులు ఏదో అద్భుతం జరగడం వలననే తప్ప లేనిదే ఇది అసాధ్యం  అన్నారు.

  • ఒక అలోపతి డాక్టర్ కుమార్తె తో సహా 21 మంది అమ్మాయిలకు గర్భధారణ లో అవాంతరాలు ఏర్పడడం ముఖ్యంగా కృత్రిమ గర్భధారణ తర్వాత కూడా సమస్యలు ఎదుర్కొంటున్న కొందరికి  వైబ్రో ద్వారా  గర్భధారణ సులభతరం అయ్యింది.  వీరిలో ఒక తల్లి తన 7 సంవత్సరాల కుమారుడిని తీసుకొని వచ్చినపుడు ఆ బాబు తనను చూడడం అదే ప్రధమం ఐనా నాకు ఈ ప్రాక్టీషనర్ తెలుసు అని చెప్పడం ఆశ్చర్యం కలిగించింది. ప్రాక్టీ షనర్ అభిప్రాయం ప్రకారము తల్లి గర్భవతి కాకముందే బిడ్డ, తల్లి యొక్క (ఆరా ) సూక్ష్మదేహములోనికి ప్రవేశిస్తాడు. గర్భధారణ  కష్టంగా ఉన్న తల్లులకు ఈ ప్రాక్టీషనర్ ఇచ్చే సలహా ఏమిటంటే ఆత్మవిశ్వాసం పెంచుకొని తమకిష్టమైన బిడ్డ కోసం ప్రేమతరంగాలను వ్యాపింపజేస్తూ ఉంటే కోరుకున్న పిల్లలు పుట్టే ఆవకాశం ఉందని వీరి అభిప్రాయము. 
  • మన చర్మ వ్యాధులకు కారణం లోపల ఉన్న సమస్యలు  బాహ్య రూపములో వ్యక్తం కావడమే అని ప్రాక్టీషనర్ అభిప్రాయము. మనం భయపడే విషయాలు మన ఆలోచనల కన్నా వేగంగా పయనిస్తాయని వీరి అభిప్రాయము. వీరి యొక్క 12 సంవత్సరాల మనుమడు తల మరియు ముంజేతుల పైన బొల్లి వ్యాధితో బాధ పడుతూఉండేవాడు. కానీ అది త్వరలోనే చాలా చోట్లకు వ్యాపించింది. చర్మవ్యాధుల నిపుణుడు ఇచ్చిన ఆయింట్మెంట్ సంవత్సరం వ్రాసినా  కూడా ఫలితం కనిపించలేదు. ఈ మచ్చలు ముక్కు మీద వ్యాపించిన తర్వాతనే ప్రాక్టీ షనర్ కల్పించుకోవడం జరిగింది. ఎప్పుడూ ముభావంగా తనలో తానుగా  ఉండే ఈ బాబు తనతో పూర్తిగా సహకరిస్తేనే తన వైద్యం మొదలు పెడతానని చెప్పడం జరిగింది. అతను ఒప్పుకోవడంతో త్వరగా కోలుకోవడం కోసం తనను తాను ప్రేమించుకోగలగడం,ప్రపంచ పరిధిలోనికి తనను తాను బహిర్గత పరుచుకోవడం కోసం రెమిడి లతో పాటు కొన్ని అఫిర్మేషన్స్(అంతః చేతన ప్రేరేపించే వాక్యాలు) ఇవ్వడం కూడా జరిగింది.  అతని యొక్క పాఠశాల డ్రామాలో పాత్ర పోషించడం ద్వారా తాను సహజ నటుడుననే అవగాహన పిల్లవానికి కలిగింది. మెల్లిగా అతనిలో ఆత్మ విశ్వాసము పెరిగి తనలో ఉన్న ప్రతిభను ప్రదర్శించడం ,నైపుణ్యాలను పెంపొందించుకోవడం ప్రారంభించాడు.రెండు నెలల లోనే అతని సమస్యలన్నీ అదృశ్యమయ్యాయి.ఒక కొత్త జీవితానికి స్వాగతం పలుకుతూ స్వయం ప్రేమికుడు గా మారాడు .
  • 11-సంవత్సరాల పాప చదవలేదు,అంకెలు లెక్కపెట్టలేదు. ప్రాక్టీషనర్ దీనికి కారణం ఆ పాప యొక్క తండ్రి తో ఉన్న సంబంధం అని గుర్తించారు. ప్రేమ,ఆప్యాయతలు కనబరచవలసిన ఈ తండ్రి చాలా కటువుగా ఉండడంతో పాపలో కుంచించుకు పోయే తత్వం రావడం ఈ సమస్యకు ఒక కారణమయ్యింది. నెల రోజుల పాటు ఇద్దరూ వైబ్రో రెమిడి లు తీసుకున్న తర్వాత పాప చదవడం లెక్కబెట్టడం చేయగలిగింది.
  • మర్జువానా కి అలవాటు పడ్డ 17 సంవత్సరాల యువకుడు తన ఇంటిలోనూ,పాఠశాల లోనూ ఇబ్బందులు ఎదుర్కోనసాగాడు ఈ వ్యసనానికి  కారణము తల్లి ప్రేమ లోపించడమే. అతని తల్లి ప్రతీ ఒక్కటీ ఉత్తమంగా ఉండాలని కోరుకునే వ్యక్తి. తన కుమారుడు పాఠశాలలో ఉత్తమ ఫలితాలు కనబరచాలని దాని నిమిత్తం కటువుగా ఉంటూ తన ప్రేమను ఆప్యాయంగా దగ్గరకు తీసుకొనే విధానాన్ని విస్మరించింది. ప్రాక్టీ షనర్ ఆ బాలునితో తన జీవన విధానము మార్చుకోవాలని,టెన్నిస్,బాస్కెట్ బాల్ ,ఈత ఇటువంటి వాటికి  వెళుతూ ఉండాలని అన్నిటికన్నామించి తనను తాను విశ్వశించాలని చెప్పారు. అతి త్వరలోనే యితడు ఈ దురలవాటును మానేశాడు. 8 సంవత్సరాల క్రితం ఇతని సోదరి మూర్చ వ్యాధి నుండి ,ఇతని తండ్రి నోటి లో వ్రణమునకు  వైబ్రో చికిత్స తో నివారణ పొందారు.
  • ఒక అబ్బాయికి పంటికి సంబంధించిన ఇన్ఫెక్షన్ వల్ల నోరు వాచింది. దీనికి గానూ ప్రాక్టీషనర్  NM114 Elimination ఇచ్చి రాత్రంతా వేసుకోమని చెప్పగా ఉదయానికల్లా బాబుకు తగ్గిపొయింది.  
  • ఈ ప్రాక్టీ షనర్ అధిక సంఖ్యలో విజయవంతంగా కేన్సర్ కేసులను నివారణ చేసారు,అందులో 5 రక్త క్యాన్సర్ కేసులను రక్త మార్పిడి లేకుండానే నివారణ చేయగలిగారు.క్యాన్సర్ పేషంట్ ముఖ్యంగా ఆహారపు అలవాట్లను మార్చుకోవాలని వీరు సూచిస్తున్నారు. వైబ్రియోనిక్స్ తో పాటు క్రింది సంపూర్ణమైన ఆహారాన్ని తీసుకోవలసిందిగా వీరు సూచిస్తున్నారు
    • సేంద్రియ తవుడు  - ఇది రోగనిరోధకశక్తిని పెంచడంలో అత్యుత్తమమైనది.మామూలు మందులతో పాటు దీనిని కూడా తీసుకోవడం ఉత్తమం.
    • పచ్చని శిలాద్రవం , బార్లీ గడ్డితో చేసిన జూస్ ,దీనిలో విటమిన్లు,ఖనిజలవణాలు,ఎమినో యాసిడ్లు,క్లోరోఫిల్,విటమిన్ E కన్నా బాగా పనిచేసే యాంటిఆక్సిడెంట్ ఉన్నాయి.ఇది జీర్ణ శక్తిని పెంచి టాక్జిన్లు శరీరంలో చేరకుండా చేయడంతో పాటు మంచి ఆల్కలైజర్ కూడా పనిచేస్తుంది.
    • శైటెక్ పుట్టగొడుగులు , ఇవి విటమిన్ B మరియు విటమిన్ D పుష్కలంగా కలిగిఉండి గుండెకు సంబంధించిన వ్యాధుల నివారణ లోనూ ,క్యాన్సర్ కణాల నిర్మూలన లోనూ,శక్తిని పెంచడంలోనూ, మెదడు పనితీరు మెరుగు పరచడంలోనూ,కడుపు మంట తగ్గించడంలో నూ,రోగనిరోధకశక్తిని పెంచడంలోనూ అద్భుతంగా పనిచేస్తుంది.   

ఐతే మన వైబ్రో రెమిడి లు సూక్ష్మ స్థాయిలో పనిచేస్తే పైన చెప్పబడిన అనుబంధ పదార్ధాలు శారీరక లేదా భౌతిక స్థాయిలో పనిచేసి ఆరోగ్యాన్ని ఇస్తాయి.

క్యాన్సర్ తో  బాధ పడుతున్న రోగులు దీనిని హృదయ పూర్వకంగా ఆహ్వానిస్తూ ఇది భగవంతుడి వరంగా భావించాలి. తమలో ఉన్నదానిని గుర్తించి సాధ్యమయినంతవరకు తమ ప్రవర్తనను మార్చుకోవడానికి ప్రయత్నించాలి. దీనిద్వారా సంపూర్ణ పరివర్తన దానిద్వారా వ్యాధి నివారణ కలుగుతుంది.  .

ఈ ప్రాక్టీషనర్ వివిధ రకాల వ్యాధులతో ఉదాహరణకు పొదుగు కు ఇన్ఫెక్షన్ వంటి వ్యాధులతో బాధ పడుతున్న ఎన్నో జంతువులను (కుక్కలు,పిల్లులు,గుర్రాలు)వైబ్రో మందులతో త్వరగా నయం చేయగలిగారు.అలగే మొక్కలు,వృక్షాలు కూడా త్వరలోనే వ్యాదులనుండి విముక్తి పొందాయి.వాటికీ కూడా సొంత భావాలు,జ్ఞాపకాలు ఉంటాయని వీరి అభిప్రాయము. డాక్టర్ రుడాల్ఫ్ స్టీనర్  టెక్నిక్ ఉపయోగపెడుతూ 4 ఎకరాలలో కేవలం  జంతువుల విసర్జకాలను ఉపయోగిస్తూ జీవగతిక (biodynamic)  వ్యవసాయ క్షేత్రం  10 సంవత్సరాలుగా  నడుపుతున్నారు. డాక్టర్ స్టీనర్  ఈ సమకాలీన ఆంత్రో పోసోఫి (anthroposophy ) ఆవిష్కరణకు ,ఉత్తమ విలువలు గల బయో డైనమిక్ ఆహారము తయారీకి ఆద్యుడు అని చెప్పుకోవచ్చు.

ప్రస్తుత పరిణామాల దృష్ట్యా చూస్తే ఈ గడ్డుకాలంలో కూడా మానవత్వం ఇంకా జీవించే ఉంది అని ఈ ప్రాక్టీ షనర్ బలంగా నమ్ముతున్నారు. తన విషయమే చూసినట్లయితే వైబ్రియోనిక్స్ భోధనలు తన నెంతో ప్రభావితం చేస్తూ తన జీవన యాత్రను కొనసాగించేలా తోడ్పాటు నందిస్తున్నాయని వీరి అభిప్రాయము.ఉదాహరణకు వీరి ఇంట్లో వర్షపు నీరు రెండు పాత్రలలో పట్టి ఉంచబడింది.ఇవి రాగి తీగల ద్వారా తన SRHHVP మిషన్ లోని ఒక వెల్లుకు కలిపి బాబాను ప్రార్ధిస్తూ బాబా దీవెనలు అందుతున్నాయని మానసికంగా తలపోస్తూ మరొక వెల్లులో  NM86 Immunity మరియు  SR315 Staphysagria. ఉంచి నీటిని చార్జ్ చేయడం వలన ఆ నీరు త్రాగడానికి మరియు వంటకు అద్భుతంగా ఉపయోగ పడుతున్నాయని తెలుపు తున్నారు. చివరిగా వీరు స్లొవేనియా దేశంలోనే కాక యూరప్ లోని ప్రక్కనున్న దేశాలలో ఉన్న ప్రాక్టీషనర్లకు తన సహాయ సహకారాలను కొనసాగిస్తూనే ఉంటానని స్థిరంగా తెలియజేస్తున్నారు.

అభ్యాసకుల వివరాలు 01919...Poland

ప్రాక్టీషనర్ 01919…పోలాండ్   వీరు పోలండ్ దేశానికి చెందిన ఒక ఫిజిషియన్. వీరి వైబ్రియోనిక్స్ ప్రస్థానం భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి ఆశ్రమంలో 2001 జనవరి లో ప్రారంభమయ్యింది.   ఒక పేషంటు పైన ఈ వైబ్రో గోళీల ప్రభావం ప్రత్యక్షంగా చూసి తన కళ్ళను తానే నమ్మలేకపోయారు. వెంటనే దీని గురించి మరింత తెలుసుకోవాలని భావించారు. కొన్ని నెలల తర్వాత డాక్టర్ అగ్గర్వాల్ గారు పోలాండ్ సందర్శించినప్పుడు తక్షణమే ‘‘క్రకౌ’’ లో జరుగుతున్న శిక్షణా శిబిరములో నమోదు చేసుకున్నారు.శిక్షణ విజయవంతంగా ముగించుకొని పరీక్ష పాసై SRHVP మెషిను మరియు అనుబంధ కార్డులు తీసుకొని పేషంట్లకు వైద్యం అందించడం తనతోనే ప్రారంభించారు. వీరు తన శరీరంలో  మియాజం తొలగింపు మరియు క్లెన్సింగ్ చేసుకోవడం పైన దృష్టి పెట్టారు. వీరు   SRHVP మిషన్ ను ఎక్కువగా రిమోట్ హీలింగ్ కు ఉపయోగించేవారు.

ఈ మెషిన్ తో రెమిడి లు తయారు చేయడం ఎక్కువ సమయాన్ని హరించేది గా ఉండేది. 2008 లో 108 CC బాక్స్ ప్రవేశపెట్టినప్పుడు వీరెంతో ఆనందపడ్డారు ఎందుకంటే ఇది రెమిడి లు తయారు చేయడానికి పట్టే సమయాన్ని తగ్గించి వేసింది.అంతేకాకుండా ఈ కోమ్బోల పనితీరు వీరు పరిశీలించిన వీరు ఇది ఒక ‘’మహాద్భుతం’’ అనే నిర్దారణ కు వచ్చారు. ముఖ్యంగా చర్మ వ్యాధులు, వ్యాధినిరోధక శక్తి లోపం వలన కలిగే వ్యాధులు, ఆత్మవిశ్వాసం లోపించడం, స్త్రీలలో బాధాకరమైన నెలసరి,మానసిక వత్తిడి,ఇటువంటి కేసులలో రేమిడిల పని తీరు అద్భుతం.అలాగే పిల్లలలోను జంతువుల్లోనూ కూడా ఈ రెమిడి లు అమోఘంగా పనిచేస్తున్నాయి.  పైన పేర్కొన్న విధంగా రెమిడి లు ఇవ్వడంతో పాటు వీరు ‘’హో అపోనో పోనో”పధ్ధతి పాటించవలసిందిగా తన పేషంట్లకు సూచిస్తారు.వీరు  తన భర్త తో పాటు ఈ హవాయి పద్ధతిని తమ జీవితాలలో స్వయంగా అనుసరిస్తున్నారు.

ప్రాక్టీషనర్ ఈ సెమినార్ లో ఎన్నో కేసుల గురించి పంచుకోవడం జరిగింది వాటిలో కొన్ని అద్బుతమైన వాటిని క్రింద ఉదహరించడం జరిగింది. ఈ కేసులలో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కొన్ని కేసులు రోజులలో నయం కాగా కొన్ని గంటల్లోను కొన్ని నిమిషాలలోను నయం కాబడినాయి.

A 53-సంవత్సరాల వయసుగల మధుమేహంతో బాధపడుతూ కాలిలో రక్త సరఫరా నిలిచిపోయిన  పేషంటు కు డాక్టర్లు అతని కాలుతొడ క్రింది భాగము వరకూ తీసివేయవలసి ఉంటుందని చెప్పారు.  బుధవారము కాలు తొలగించడానికి  నిర్నయించారు. శనివారము ఈ పేషంటు ప్రాక్టీషనర్ వద్దకు రాగా క్రింది రెమిడి ఇవ్వడం జరిగింది NM32 Vein-Piles + NM114 Elimination + OM5 Circulation + BR18 Circulation…TDS. రెండు రోజుల చికిత్స తర్వాత రోగగ్రస్తముగా ఉన్న  కాలి బొటన వ్రేలి  చివరన రంధ్రాలు ఏర్పడి షులేస్ వలె ధారగా చీము కారడం ప్రారంభించింది. రక్త సరఫరా తిరిగి సాధారణ స్థాయికి చేరుకోవడంతో కాలు తొలగించవలసిన అవసరం లేదన్నారు.ఆ విధంగా పేషంటు పూర్తిగా కోలుకోవడం జరిగింది.

వీరి ప్రాక్టీసు లోనే 70 సంవత్సరాల మహిళను 108 కొమ్బో ద్వారా చికిత్స చేసిన మరొక కేసు గురించి ప్రస్తావిస్తున్నారు.ఈ పేషంటు యొక్క ఎడమ కాలికి వచ్చిన . నెల రోజుల అలోపతిక్ చికిత్స తర్వాత డాక్టర్ ఆమెతో పరిస్థితి లో మార్పు రానందున మోకాలి పైవరకూ కాలు తొలగించవలసి ఉంటుందని చెప్పారు.ఆమె ప్రాక్టీషనర్ ను ఆశ్రయించడంతో క్రింది రెమిడి ఇవ్వడం జరిగింది : CC3.4 Heart emergencies + CC3.7 Circulation + CC21.1 Skin tonic…TDS. మూడు రోజుల చికిత్స తర్వాత కాలిబొటనవ్రేళ్ళ నుండి చీము కారిపోయింది .రక్త సరఫరా తిరిగి ప్రారంభమయ్యి పేషంటుకు పూర్తీ ఆరోగ్యము చేకూరింది

35 సంవత్సరాల మహిళ గత 10 సంవత్సరాలుగా కాళ్ళు,చేతులు,ఉదరము పైన సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నారు. వీరు అలోపతి మందుల ద్వారా వైద్యం తీసుకున్నారు కానీ నయమవ్వలేదు. ఈమెకు క్రింది రెమిడి ని ఇవ్వడం జరిగింది. CC21.10 Psoriasis...6TD వారం రోజుల వరకూ అనంతరం ఈ డోస్ TDS.కి తగ్గించ్గడం జరిగింది. మూడు వారాల తర్వాత సోరియాసిస్ పూర్తిగా తగ్గిపోయింది.చర్మవ్యాధులకు సంబంధించిన మరొక సమస్య ఏమిటంటే 7 సంవత్సరాల పాపకు తన రెండవ సంవత్సరం నుండి రెండు పాదాల పైనా ఆటోపిక్ డెర్మటైటిస్ వ్యాధి( అటోపి ద్వారా కలిగే చర్మవ్యాధి) ఉన్నట్లు గుర్తింప బడింది.  మొదట రక్తము రాసి తో కూడిన బొబ్బలు ఏర్పడి అవి చితికి పుండ్లుగా మరి నడవడానికి కూడా కష్టమైపోయింది. ఈ 5 సంవత్సరాలుగా అలోపతి చికిత్స తీసుకుంటున్నా ఏమాత్రం ఉపయోగం కలగలేదు.ఆమెకు క్రింది రెమిడి ఇవ్వడం జరిగింది. CC21.3 Skin allergies…TDS. వారం తర్వాత పాప వ్యాధి లక్షణాలన్నీ తగ్గిపోయి పూర్తీ ఆరోగ్యం చేకూరింది.

76 సంవత్సరాల వ్యక్తి మోకాలి నొప్పులతో బాధ పడసాగారు.అలోపతి మందుల ద్వారా అతనికి నయం కాలేదు,ప్రతీరొజూ ఉదయం 5 గంటలకు ఈ నొప్పి ప్రారంభ మవుతుంది.వీరు కనీసం తన ప్లాట్ కు ఉన్న 5 మెట్లను కూడా ఎక్కలేని స్థితిలో ఉన్నారు.ఒక రోజు సాయంత్రం 10 గంటలకు ప్రాక్టీషనర్ క్రింది రెమిడి ఇవ్వడం జరిగింది. CC20.1 SMJ tonic + CC20.2 SMJ pain + CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue. మరుసటి రోజు ఉదయం 8 గంటలకు ఎటువంటి నొప్పి లేకుండానే నిద్రలేవడం జరిగింది.అప్పటినుండి అతనికి ఎప్పుడూ మోకాళ్ళ నొప్పులు రాలేదు ఏమాత్రం కష్టం లేకుండానే నడవగలుగుతున్నారు. ఇదే రెమిడిని  మోకాళ్ళు వాచి నడవడానికి వంగడానికి ఇబ్బంది పడుతున్న 57 సంవత్సరాల మహిళకు TDS గా ఇవ్వడం జరిగింది.గతంలో ఆమె అలోపతి మందులు వాడారు కానీ ఫలితము లేదు.రెమిడి ప్రారంభించిన వారం తర్వాత కాళ్ళ వాపులు పూర్తిగా పోయాయి.అప్పటినుండి ఆమెకు ఎంతో ఉపశమనం కలిగింది.

మరొక పేషంటు చాలా, కాలంగా థైరాయిడ్ తో బాధ పడుతున్నారు.దీనివల్ల ఇతని మెడ రెండు పక్కలా గడ్డలు కూడా వచ్చాయి. వీటివల్ల ఇతను తరుచుగా తల ప్రక్కకు వాల్చిఉండడంతో అది అలా ఉండిపోయింది.డాక్టర్ ఆపరేషన్ చేసి వీటిని తొలగించాలని చెప్పారు కానీ డానికి పేషంటు ఒప్పుకోలేదు. మూడుసంవత్సరాల క్రితం ఇతను ప్రాక్టీషనర్ ను కలసినపుడు క్రింది రెమిడి ఇవ్వడం జరిగింది. CC3.1 Heart tonic + CC6.1 Hyperthyroid + CC12.4 Autoimmune diseases + CC13.1 Kidney & Bladder tonic. కఫం వంటి పదార్ధం స్రవించడం మొదలయ్యి అతని గడ్డలు అదృశ్యమయ్యాయి.ఐతే మూడు సంవత్సరాల వైబ్రో చికిత్స తర్వాత కూడా   వాసనతో కూడిన పొడవైన ధారల వంటి పదార్ధం మొల భాగం వరకూ వ్యాపిస్తూ అలా కారుతూనే ఉన్నాయి.ఇతను ఇంకా చికిత్స తీసుకుంటూనే ఉన్నాడు.

జాబ్రేజ్ లోని అనోరేక్జియా వార్డులో  16-సంవత్సరాల యువతి చాలా సంక్లిష్టమైన స్థితిలో ఉంది. డాక్టర్లు కొన్ని గంటలలోనే ఆమె దేహత్యాగం చెయ్యవచ్చు అని నిర్ధారించి దానికి తగిన ఏర్పాట్లు చేసుకోవలసిందిగా బంధువులకు సూచించారు. ఈ అమ్మాయి తాత గారు ప్రాక్టీషనర్  ను సంప్రదించారు. ప్రాక్టీషనర్ ఆమెకు CC15.4 Eating disorders.ను ఇచ్చారు.రెండు రోజుల తర్వాత పేషంటు మంచం నుండి లేవగలిగింది. నాలుగు రోజుల తర్వాత ఆమెను డిశ్చార్జ్ చేసారు.ఇప్పుడామె తన శారీరక బరువును తిరిగి పొంది.పూర్తి ఆరోగ్యంగా ఉన్నది.  

 30-సంవత్సరాల యువకుడు డిప్రెషన్ బాధ పడుతూ అలోపతిక్ మందులు వాడారు కానీ ఫలితం ఏమీ లేదు అన్నారు.ప్రాక్టీషనర్ అతని ఫోటో ద్వారా బ్రాడ్కాస్టింగ్ చేసి SM5 Peace & Love Alignment రెమిడి ఇవ్వడం జరిగింది.3 రోజుల తర్వాత అతని డిప్రెషన్  తగ్గిపోగా మానసిక స్థిరత్వం తిరిగి పొందగలిగాడు.

A woman agedమూలశంక బాధ పడుతూ నడవడం కూడా చేతకాని స్థితిలో ఉన్న 37 సంవత్సరాల మహిళకు,  CC4.4 Constipation  ఇవ్వడంతో రెండు రోజులలోనే ఆమెకు వ్యాధి అదృశ్య మయ్యింది. 

 27 సంవత్సరాలమహిళ తీవ్రమైన నెలసరి నొప్పితో బాధ పడుతూ ఉండేది. కేవలం కొన్ని డోసులు CC8.7 Menses frequent + CC8.8 Menses irregular, ఇవ్వడంతో ఈ నొప్పి తగ్గిపోయి మరలా రాలేదు.

ఆరు నెలలు వయసుగల ఒక ప్రత్యేక జాతికి చెందిన కుక్క పిల్లకు కాలి పైన కణితి వంటిది రావడం,అది పశువైద్యనిపుణులకు కూడా అంటూ పట్టనిది గా అయ్యింది.వారు ఈ పప్పీ కి నొప్పి నివారిణులు,ఇన్ఫెక్షన్ తగ్గించే శక్తివంతమైన మందులు ఇచ్చారు కానీ ప్రయోజనం లేదు.అది కణితి వలన కుంటటం కూడా నివారణ కాలేదు.. దీనికి  CC1.1 Animal tonic +CC20.2 SMJ pain + CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue రెమిడి నీటితో  ఇవ్వబడింది.రెండు రోజుల తర్వాత నొప్పి తగ్గిపోయింది.ఇప్పుడు ఆ కుక్క ఎంతో ఆరోగ్యంగా ఉండడంతో యజమాని కుక్క రుగ్మతల గురించి పూర్తిగా మరిచిపోయాడు. మరొక కేసు విషయంలో  రెండు సంవత్సరాల గినియా పంది ఆహారం తినడం మానేసి ఆసక్తి లేకుండా తన యొక్క బోను లోనే ఉండసాగింది.పశు వైద్యుడు దానికేసహాయమూ చేయకపోగా అది త్వరలోనే చనిపోతుందని చెప్పారు.దీనికి  CC1.1 Animal tonic + CC3.1 Heart tonic + CC10.1 Emergencies + CC 13.1 Kidney & Bladder tonic రెమిడి ఒక డోస్ రెమిడి తో ఇవ్వడం జరిగింది.5 నిమిషాల్లోనే అది లేచి నిలబడి తన ఆహారము తినడం తో పాటు పూర్తీ ఆరోగ్యం తో ఒక సంవత్సరం వరకు బ్రతికింది.

16 సంవత్సరాల వైబ్రో సేవలో వీరు ఎంతో ఆనందాన్ని సంతృప్తిని అనుభవించారు.వారి మాటల్లోనే చెప్పాలంటే ‘’ ప్రతీ రెండు నెలలకుఒకసారి  డాక్టర్ అగ్గర్వాల్ గారి ద్వారా వార్తాలేఖ రూపంలో అందే సమాచారం ద్వారా ఎంతో నేర్చుకోగాలుగుతున్నాను. అలాగే నాకు ఎప్పుడూ సమస్య ఎదురయినా మా దేశపు కోఆర్డినేటర్  02515  వీరందించిన సహాయ సహకారాలు మరువలేనివి.నాకు ఇట్టి సేవాభాగ్యాన్ని ప్రసాదించినందుకు భగవంతుడికి ఎంతో కృతజ్ఞురాలిని.

అభ్యాసకుల వివరాలు 02652...Poland

ప్రాక్టీషనర్ 02652 ...పోలాండ్   వీరు తమ 13 ఏళ్ల వైబ్రియోనిక్స్ సేవలో వైబ్రో రెమిడి లు ఎందరో పేషంట్ లకు ఆరోగ్యాన్ని ఇవ్వడంలో గొప్ప వరదాయని వంటివని అభిప్రాయ పడుతున్నారు. అలాగే పేషంట్లు తమ జీవన సరళి ని కూడా మార్చుకోవడం తప్పనిసరి అనీ అలా మార్చుకోని  పక్షంలో ఏదో ఒక రూపంలో వ్యాధి తిరిగి ప్రవేశిస్తుందని కూడా వీరు తెలుసుకున్నారు. ప్రస్తుతం వీరు తమ పేషంట్ లు ఆరోగ్యకరమైన జీవన సరళి ని ఎలా పెంపొందించుకోవచ్చునో కౌన్సిలింగ్ చేస్తూ దీనికి వీరు’‘ఆల్కలిన్ విధానము’’ అని పేరు పెట్టారు. దీనివల్ల పేషంట్ ల ఆరోగ్యములో గణనీయ మైన మార్పులు వచ్చినట్లు కనుగొన్నారు. అటువంటి కొన్ని విశిష్టమైన కొన్ని కేసుల వివరాలు ఈ శిబిరములో ప్రదిర్శించ బడ్డాయి.అట్టివానిలో రెండు ఈ వ్యాసము చివర ఇవ్వబడ్డాయి.  ఈమె  తమ భావాలను అనుభవాలను ఇతర ప్రాక్టీ షనర్ లతో పంచుకోనడానికి ఎప్పుడూ సుముఖంగా ఉంటారు కాబట్టే  తాను కనుగొన్న విధానమును  ‘’ఆల్కలిన్ విధానము-ఆరోగ్య రహస్యము ‘’  పేరుతొ ఈ సదస్సులో పవర్ పాయింట్ విధానము ద్వారా ప్రదర్శించడంలో ఆశ్చర్యమేమీ లేదు . వీరు చెప్పిన సమాచారము ననుసరించి ఈ విధానము లో దేహాన్ని తన సహజ సిద్ధమైన సమతుల్యమైన స్థితికి తీసుకు రావడమే ప్రధానము .దీనికోసం వీరు చెప్పిన ప్రధానాంశాలు మనసు,ఆహారము, నిద్ర, వ్యాయామము,సూర్యకాంతి,మరియు ఆరోగ్యకరమైన వాయువు.  

  • మనల్నిమనము స్వస్థ పరుచుకోవడానికి మనసు ఒక ప్రధాన మైన పనిముట్టు .సాయిబాబా అంటారు ‘’ప్రతీ వ్యాధికి మనసే కారణం కనుక మనసే ఆ వ్యాధిని నివారణ చేసే శక్తి కూడా కలిగి ఉంటుంది’’. స్వామి ఇంకా ఇలా అంటారు.  “..ప్రకృతి భగవంతుడి యొక్క ప్రతి బింబము. అట్టి దివ్య శక్తియే మన నిజమయిన స్వభావము’’ . కనుక మనలో ఉన్న దివ్యశక్తికి మనం ట్యూన్ చేసుకోగలిగితే అనంత మైన దివ్యశక్తి మనలో ప్రవహించి వ్యాదులన్నిటిని దూరం చేస్తుంది. ఈ దివ్య శక్తే పవిత్రమైన ప్రేమ .మనం అట్టి దివ్య ప్రేమను మన హృదయాలనుండి   ప్రవహింపనిస్తే మన తలపులు,మాట,క్రియలు ప్రేమమయ మవుతాయి మనలో ఎంత పరివర్తన వస్తుందంటే  విజ్ఞాన శాస్త్రం చేత  హృదయపు పొందిక అని పిలువబడే ,అట్టి స్థితి కలుగుతుంది. అధ్యయనాల ద్వారా నిరూపింప బడిన విషయం ఏమిటంటే అటువంటి స్థితిలో మన దేహంలో జీవకణాలు పునరుత్పత్తి చేయబడతాయి,హార్మోన్లు నియంత్రింప బడతాయి.యవ్వన సంబంధితమైన హార్మోన్ల ఉత్పత్తి పెరుగుతుంది రోగనిరోధక వ్యవస్థ పఠిష్టమవుతుంది.మనం శాంతిని,ఆనందాన్ని,రక్షణను,విశ్వాసాన్ని,రుజుత్వాన్ని,అంగీకరించే స్వభావాన్ని,ప్రేమను మనలో పెంపొందింప చేసుకోవడమే కాక క్రమేణా ఇతరులకు పంచబడే స్వభావము కలుగుతుంది .  వత్తిడి,భయాలు,న్యూనత వంటి వ్యతిరేక భావాలు తొలగింప బడతాయి. షరతులు లేని లేదా నిబంధనలు లేని ప్రేమ (ఫ్రీక్వెన్సీ - 528Hz) ఇది ప్రస్తుతం ఉన్న స్వస్థత చేకూర్చే వైబ్రేషణ్ లలో అత్యంత శక్తివంత మైనది.ఇది శరీర ములోని క్షారత్వాన్ని ఆమ్లత్వాన్ని సమతుల్యం లో ఉంచి దేహానికి కాంతిని ఆరోగ్యాన్ని ఇస్తుంది.  
  •  తర్వాతి విషయం ఆహారము. ఈ రోజుల్లో మనం తినే ఆహారము అమ్లత్వముతో కూడినది గా ఉంటున్నది అందుచేత వైరస్,బ్యాక్టీరియ,ఫంగస్,యీస్ట్ వంటివి పెరగటానికి తగిన వాతావరణం ఏర్పడుతోంది. ఆమ్లగుణము కలిగిన దేహం వల్ల మన రోగ నిరోధక వ్యవస్థ నిర్వీర్య మయ్యి జీవకణాలకు  ప్రాణవాయువు లోపం ఏర్పడి వాటి ఉత్పత్తికి ఆటంకం ఏర్పడుతుంది.  1933 లో విలియం హోవార్డ్ హే ఇలా చెప్పారు ‘’దేహంలో ఆమ్లము పెరగడం వలన అది దేహ వ్యవస్థ నంతటినీ విషతుల్యం చేసి రోగాలకు నిలయంగా మారుస్తుంది’’ వారు ఇంకా ఇలా చెప్పారు ఇది మీకు దిగ్భ్రమ గొలిపే విషయం కావచ్చు కానీ వాస్తవం ఏమిటంటే పైకి వేరువేరు గా కనిపించి నప్పటికీ రోగాలన్నింటికీ కారణం ఒకటే.

అసిడిటీ కి క్యాన్సర్ తో కూడా సంభంధం ఉంది. (Otto Warburg) ఒట్టో వార్బర్గ్ అనే శాస్త్ర వేత్త జీవకణాలలో ఆక్సిజన్ శాతం లోపించినపుడు ఆమ్ల వాతావరణము సృష్టించబడి అవి క్యాన్సర్ కణాలుగా మారేందుకు అవకాశం ఉందనే విషయం కనుగొన్నందుకు గానూ వీరికి1931 లోనోబెల్ బహుమతి వచ్చింది. కనుకనే క్షారయుత మైన లేదా ఆల్కలిన్ ఆహారము మన శరీరానికి ఎంతో మంచిది. ఎంత తినగలిగితే అంత వండని  ఆహారము, తాజా పళ్ళరసాలు,ముఖ్యంగా ఆకుకూరలు ఇవన్నీ కూడా శరీరాన్ని ఆమ్లయుత తత్వము నుండి దూరం చేస్తాయి.   మన శరీరంలో ఆమ్లత్వం ఎక్కువగా ఉంటే దీర్ఘకాలిక నిస్సత్తువ,శక్తి లేకపోవడం,నీరసం,నిద్రలేమి,కోపము,ఏకాగ్రత లోపించడం,భయము,ఆతృత,కంగారు,మైధునం పైన కోరిక లేకపోవడం ఇవన్నీ కలుగుతాయి.

వీటితో పాటు మనం రోజూ రెండు లీటర్ల పరిశుభ్రమైన నీటిని అనగా ఎక్కువ pH విలువ ఉన్న నీటిని త్రాగాలి.ఇటువంటి నీటికి కొంచం హిమాలయన్ ఉప్పు గానీ,నిమ్మ రసం గానీ,సిలికా గానీ కలిపితే అవి క్షారయుతంగా ఉంటాయి.   పరిశుద్ధమైన నీటికి క్రింది కోమ్బో కలపడంద్వారా వాటి శక్తిని పెంచవచ్చు: NM12 Combination-12 + SR360 VIBGYOR. లేదా CC12.1 Adult tonic. ను కూడా కలపవచ్చు

ఎప్పుడూ కూడా మనకు తగినంత నిద్ర ఉండాలనేది గుర్తు పెట్టుకోవాలి.  నిద్ర లోపిస్తే శారిరంలో ఆమ్లత్వము పెరిగి  పోతుంది. వయోజనులకు 6-7 గంటల నిద్ర అవసరం రాత్రి 10 గంటల నుండి 12 గంటల వరకు గల కాలంలో మన శరీరంలో కొత్త కణాలు ఉత్పత్తి అవుతాయి.అర్ధరాత్రి కి ముందు నిద్రించే ఒక గంట నిద్ర ఆ తర్వాత నిద్రించే 2-4 గంటల నిద్రకు సమానము. 

  • వ్యాయామము వలన దేహంలో హానికరమైన విషాలు తొలగింప బడడ మే కాక మనం తీసుకునే ఆక్సిజెన్ శాతాన్ని పెంచుతాయి దీనివలన దేహము యొక్క pH స్థాయిలు సమతుల్యంలో ఉంటాయి. ఎప్పుడూ కూడా అధిక శ్రమ కూడదు దీనివలన దేహము వత్తిడికి గురియవుతూ ఎక్కువ ఆమ్లాలను ఉత్పత్తి చేస్తుంది.నీవు వ్యాయామం చేసేటప్పుడు దేహము ఇచ్చే హెచ్చరికలకు విలువ నివ్వాలి .అంతేగాక రోజులో కనీసం దేహమును 30 నిమిషాల సేపయినా కదుల్చనివ్వాలి.  
  • చివరగా మనలో విటమిన్ D3 ఉత్పత్తికి చక్కటి గాలి సూర్యరశ్మి ఎంతో అవసరం .ఇవి మన దేహము క్రమబద్ధముగా పనిచేయడానికి ప్రధానమైనవి .

ఈ ప్రాక్టీషనర్ ఎప్పుడూ అనేక భయాలతో సతమతమవుతున్న తన స్నేహితురాలి కేసును వివరిస్తున్నారు. ఈ పేషంటుకు ఒక మానసిక వ్యాధి (అస్పెర్ సిండ్రోమ్)తో బాధపడుతున్న ఒక బిడ్డను భరించడంలో తరుచుగా కోపం కలుగుతోంది.ఈ పేషంటు జీవితంలో చాలా భాగం నిరాశ,నిస్పృహలతోనూ దీనివల్ల కలిగే అనారోగ్యం తోనూ గడిచిపోయింది.ఈమెకు క్రింది రెమిడి ఇవ్వడం జరిగింది. NM6 Calming + NM25 Shock + SM1 Removal of Entities + SM2 Divine Protection + SM3 Soul Cleansing + SM4 Stabilizing + SM5 Peace and Love Alignment + SM6 Stress + SM39 Tension…TDS. ఈ రెమిడి ని పేషంటు నెల రోజులు తీసుకోవడంతోనే ఆమె కష్టాలు,కన్నీళ్ళు గతం తాలూకు భావోద్వేగాలు దూది పింజం లా కదలిపోయాయి.వీరికి  CC12.1 Adult tonic + CC15.1 Mental and Emotional tonic…6TD ను 6 నెలలు నిమిత్తం ఇవ్వడం జరిగింది. ఈ ఆరు నెలల కాలంలో ఈమె అప్పుడప్పుడూ ప్రాక్టీషనర్ ను కలుస్తూ ఉండేవారు.వీరిరువురు ఆహారము గురించి,అలవాట్ల గురించి చర్చించుకునేవారు. పేషంటు తన జీవన విధానము మార్చుకొనడంతో అద్బుత ఫలితాలు కలగసాగాయి.ముఖ్యంగా ఆమె మానసిక స్థితిలోనూ ఆలోచన విధానంలోను ఎంతో మార్పు వచ్చింది. తను  ప్రార్ధించే దైవం తనను అన్నిరకాలుగా రక్షిస్తోందని ముఖ్యంగా తన పైన తనకు ప్రేమ ఆత్మవిశ్వాసము పెరిగాయని తెలిపారు. ఆమె తన కుమారుడిని హృదయ పూర్వకంగా ప్రేమించగలుగుతూ అతనికి నియమ బద్ధమైన ఆహారము అందించగలుగు తున్నారు. తన కుటుంబం యావత్తుకూ తాజా పళ్ళరసాలను అందిస్తూ మాంసాహారము చాలావరకూ తగ్గించారు.

ఈ కాలము లోనే ఆమె రెండవ సంతానము నిమిత్తము గర్భము దాల్చడంజరిగింది. ఆమెకు గర్భధారణ సజావుగా సాగడం కోసము    CC8.1 Female tonic + CC8.2 Pregnancy tonic + CC8.9 Morning sicknessTDS ఈ రెమిడి గర్భధారణ పూర్తికాల పర్యంతము వాడవలసినదిగా సూచించడం జరిగింది.డాక్టర్లు ఆమె ప్రస్తుత పరిస్థితిలో గర్భవిచ్చిత్తి కావడం గానీ లేదా ఈ 9 నెలలు బెడ్ రెస్ట్ కు పరిమితం కావడం గానీ జరుగుతుందని హెచ్చరించారు. కానీ ఇవేమీ లేకుండానే ఆనందంగా అనాయాసంగా గర్భధారణ చేయడం జరిగింది.  ఈమె స్వభావములో మార్పు రావడంతో తన భయాలన్నీ మటుమాయమై సుఖంగా ప్రసవించడం  జరిగింది. తన శ్రమకు ఫలితం లభించి  పేషంటు లో మార్పువచ్చినందుకు  ప్రాక్టీ షనర్ గర్వపడుతున్నారు .అందుకు తనకు ఎంతో ఆనందంగానూ సంతృప్తిగాను ఉందని తెలియజేస్తున్నారు.

ఇటీవల ఈ ప్రాక్టీషనర్ యొక్క ఒక పేషంటు తన జీవిత అలవాట్లను మార్పు చేసుకోవడం వలన ఎంతో లబ్ది పొందారు. 36 సంవత్సరాల వ్యక్తికి కడుపులో పుండు తీవ్ర స్థాయికి చేరుకుని అంబులెన్సు లో అత్యవసర చికిత్స చేయవలసిన తరుణంలో చివరి క్షణంలో డాక్టర్లు ప్రాణాపాయం నుండి కాపాడారు. ఈ సంఘటన తర్వాత పేషంటు అభ్యర్ధనపై క్రింది రెమిడి ఇవ్వడం జరిగింది.   CC4.5 Ulcers + CC4.10 Indigestion + CC15.1 Mental and Emotional tonic...TDS.  ఇతనికి ఎన్నోసార్లు నచ్చచెప్పిన మీదట అతని జీవన విధానము మార్చుకున్నారు,అంతేకాక వీరి వ్యాధికి మానసిక వత్తిడికి ప్రధాన కారణమైన పనిగంటలను కూడా తగ్గించు కున్నారు. రెండు వారాలు రెమిడి వాడగానే 20% మెరుగుదల కనిపించింది.ఇప్పటికీ వీరు రెమిడి ని TDS గానే తీసుకుంటున్నారు.సంవత్సరాల తరబడి పాతుకు పోయిన అలవాట్లు అంత త్వరగా మారడం కష్టం కనుక సాధ్య మయినంత త్వరలోనే ఆహారపు అలవాట్లను,జీవన విధానాన్ని మార్చుకునుటకు ఈ పేషంటు సుముఖంగా ఉన్నారని ప్రాక్టీషనర్ తెలియజేస్తున్నారు.  

తుది పలుకులుగా ఈ ప్రాక్టీ షనర్ ఆల్కలిన్ జీవన విధానము అనేది మనలో ఉన్న దివ్యత్వముతో సామరస్య పూర్వక సహజీవనం.మనము ఆ స్థితికి చేరుకొన్నప్పుడు మనసు దేహానికి కలిగే వ్యాధులను నిర్మూలిస్తుంది,శక్తి పెరుగుతుంది, త్వరగా వృద్ధాప్యం కలగ కుండా ఉంటుంది అంటున్నారు

ప్రశ్నజవాబులు

1. ప్రశ్న: a. దీర్ఘకాలికమైన వ్యాధులకు చికిత్స చేసే సందర్భంలో నా పేషంట్ లు కొందరికి 80% వరకు కోలుకుంటున్నారు ఆ తర్వాత ఇతర రెమిడి లను అనేక నెలలు ఈ వ్యాధి నిమిత్తం ప్రయత్నించినప్పటికి పరిస్థితిలో ఏమాత్రం మార్పు రావడం లేదు.ఈ 80% మెరుగుదలనే నూరు శాతముగా భావించి రెమిడి డోస్ తగ్గించే ప్రయత్నం చేయమంటారా? లేదా మాములుగా ఇస్తున్న రెమిడి ని ఎక్కువకాలం వాడమని చెప్పమంటారా?

b. నా పేషంట్ లు కొందరు విధి నుండి 100% కోలుకొన్నప్పటికీ డోస్ తగ్గించే ప్రయత్నం చేయగానే వారి రోగ స్థితి అధ్వాన్నంగా మారుతోంది.అందువల్ల నేను మునుపటి డోస్ సూచించవలసి వస్తోంది. ఇద్దరు పేషంట్ లు ఆవిధంగానే అనేక నెలలనుండి తీసుకుంటున్నారు.ఇలా చాలా కాలం తీసుకోవడం సరియయినదేనా?

జవాబు:   a. పేషంట్ యొక్క రోగ లక్షణాలు పూర్తిగా మాయమయితే తప్ప (రిడక్షన్ )డోసేజ్ తగ్గించడం ప్రారంభించరాదు.  పేషంటు  పూర్తిగా కోలుకున్న తర్వాత  పేషంటు రోగనిరోధక స్థితిలో కలసిపోయి ఉన్న మియాజం వ్యక్తమవుతూనే ఉంటుంది. దీనిని నిరోధించడానికి లేదా ఈ మియాజం తొలగించడానికి సరియయిన పద్ధతి ఏమిటంటే  SR560 All Miasms  ను క్రింది పధ్ధతి ప్రకారము ఇస్తూ ఉండాలి.  మీరు ఇస్తున్న చికిత్సను ఆపివేసి   మూడు రోజుల తర్వాత రెండు పోటేన్సి డోసు30C మరియు 1M లు కలిపి ఇచ్చి వేచి చూడాలి.పుల్లౌట్ వచ్చినట్లయితే అది తగ్గిపోయిన తర్వాత వారం రోజులు ఇది కొనసాగించాలి . పుల్లౌట్ రానంతవరకూ దీనిని కొనసాగించాలి. పుల్లౌట్ వస్తే తిరిగి ప్రధాన రెమిడి ప్రారంభించాలి.  ఒకవేళ పుల్లౌట్ గనక వచ్చినట్లయితే వారానికి ఒకటి చొప్పున 3 డోసులు  రెమిడి ఇవ్వాలి.ఆ తర్వాత అసలు రెమిడి ప్రారంభించాలి. ఒక ప్రాక్టీషనర్ అనుభవం ప్రకారం పేషంటు  తిరిగి అదే రుగ్మత కు లోనౌతున్నట్లయితే ఈ చికిత్స తర్వాత 3 నెలలకు ఒకసారి ఒక డోసు SR560 10M అన్ని మియాజం లకు ఇవ్వాలి.

b. ఒకవేళ పేషంటు వ్యాధినుండి పూర్తిగా కోలుకొని రెమిడి తగ్గించగానే తిరిగి వ్యాధి బారిన పడినట్లయితే పైన సూచించిన విధానము లోనే SR560 All Miasms ను ఇవ్వడం మంచిది.

________________________________________

2. ప్రశ్న: Iనేను విమానంలో  దూరప్రయాణం చేసేటప్పుడు  CC17.1 Travel sickness ను ఉపయోగిస్తాను ఐనప్పటికీ నేనింకా జెట్లాగ్ తో బాధపడుతున్నాను.దీనికి మరేదయినా రెమిడి సూచిస్తారా ?

జవాబు:      మాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమిటంటే మీరు రెమిడి ని సరిపడినంత కాలము తీసుకున్నారా ? విషయం ఏమిటంటే ప్రయాణానికి రెండు రోజుల ముందు నుండి CC 17.1 Travel sickness…TDS గా తీసుకొని ప్రయాణము రోజున  6TD గా తీసుకోవాలి.అలాగే ప్రయాణం పూర్తయిన తర్వాత కూడా TDS గా తీసుకోవాలి. ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రయాణంలో ఎక్కువగా మంచినీరు తీసుకోవాలి. మధ్యమధ్య రక్త సరఫరా కోసం కొద్ది దూరము నడవాలి( ముందుకు వెనక్కి ). చివరిగా ఇటీవల విమానయాన సంస్థలు ప్రయాణికులకు చేస్తున్న సూచనలను అనుసరించడం సీటులో  కూర్చుని ఉండగానే తేలికగా ఉండేవిధంగా కాలితో చేసే ఎక్సెర్ సైజ్ లు కూడా చేయడం మంచిది.

________________________________________

3. ప్రశ్న: నా పేషంటు ఒకామెకు మైలోప్రోలిఫే రేటివ్ అనే రక్త రుగ్మత ఉంది. ఈ రుగ్మత రెండు స్థితుల మధ్య మారుతూ ఉంటుంది.ఒక్కొక్కసారి ఇది  పోలీసితేమియా రుబ్రివేర (ఎక్కువ RBC కౌంట్ )మరొక సందర్భంలో త్రోమ్బో సితేమియా (ఎక్కువ ప్లేట్లేట్ కౌంట్)ఇలా రెండింటి మధ్య మారిపోతూ ఉంటుంది.  నేను మొదటసారి ఆమెకు నోసోడ్ ఇచ్చినప్పుడు ఆమెకు RBC కౌంట్ ఎక్కువగా ఉంది. నేను ఆమెకు బ్లడ్ నోసోడ్ తో చికిత్స చేస్తున్నాను.ఈమె మొదటిసారి నోసోడ్ కోసం రక్త నమూనా ఇచ్చినప్పుడు ఆమెకు ఎర్రరక్తకణాల సంఖ్య ఎక్కువగా ఉంది. నోసోడ్ కోసం అసలయిన నమూనాను వాడవలసినదిగా చెప్పబడి ఉన్నమీదట దానినే ఉపయోగిస్తూ ఉన్నాను.ఐతే ఈమె పరిస్థితి పైన చెప్పబడిన రెండు స్థితుల మధ్య మారుతూ ఉన్నది.మరి నన్ను ఇదే విధంగా రెమిడి ఇమ్మంటారా 

జవాబు:  పేషంటు రక్తంతో రెండు నోసోడ్ లు తయారు చేయండి, ఒకటి RBC కౌంట్ ఎక్కువగా ఉన్నప్పుడు మరొకటి ప్లేట్లేట్ కౌంట్ ఎక్కువగ్ ఉన్నప్పుడు అలా తయారుచేసి రెండింటినీ కలిపేసి ఒకే నోసోడ్ లాగా పేషంటుకు ఇవ్వండి.

________________________________________                                                                                                                                  

4. ప్రశ్న : నేను సాధారణంగా రెమిడి లను గోళీల రూపంలో ఇస్తాను. కానీ మొదటిసారి 108CC బాక్స్ నుండి ద్రవరూప రెమిడి ని నేరుగా నాలిక క్రింద వేస్తున్నాను ఇది సరియయినదేనా?

జవాబు:   లేదు సి.సి.డ్రాపర్ నుండి నేరుగా నోటిలోనికి రెమిడి వేయరాదు. వైబ్రేషణ్ కలిగి ఉండే ద్రవము త్వరగా ఆవిరయ్యే స్వభావముగల ఆల్కహాల్ నుండి తయారు చేస్తాము. తద్వారా వైబ్రేషణ్ త్వరగా గోళీలకు వ్యాప్తి చెందుతుంది. చికిత్స కోసం ఉపయోగించే వైబ్రేషణ్ ను గోళీల రూపంలో గానీ,నీటిరూపంలో గానీ విభూతి రూపంలో గానీ ఇవ్వాలి. మీ కామన్ కొమ్బో ల తయారీకి గానీ వాటిని రిఫిల్ చేయడానికి గానీ క్కువ 96% స్వచ్చమైన ఆల్కహాల్ నే వాడండి. అన్నింటికన్నా నీటికి వైబ్రేషణ్ పదిల పరిచే శక్తి ఎక్కువ కనుక ఒక్క డోస్ మాత్రమే ఇవ్వవలసి వచ్చినప్పుడు రెమిడి ని నీటిలో కలిపి నేరుగా పేషంటు నోటికి ఇవ్వండి.

 

దివ్య వైద్యుడి దివ్య వాణి

నీకు ఎంత కావాలో అంతే తిను అధికంగా తినవద్దు.నీవు తినవలసిన దానికన్నా ఎక్కువ తీసుకొని వృధా చేయవద్దు. ఎందుకంటే ఆహారం వృధా చేయడం మహాపాపం. నీవు వృధా చేసే ఆహారం మరొకరి కడుపు నింపవచ్చు. కనుక ఆహారము వృధా చేయవద్దు.ఆహారము భగవత్ స్వరూపము జీవితం భగవద్ ప్రసాదితము మానవుడు ఆహారము నుండే వచ్చాడు కావున మనిషి యొక్క దేహము ,మనసు,సంస్కారము నకు ఆహారమే ప్రధాన ఆధారము."

"శరీరము తీసుకునే ఆహారము యొక్క స్థూల భాగము మలము గా బయటకు తోసివేయ బడుతుంది.సూక్ష్మ భాగము శరీరములో రక్తముగా మారుతుంది.సూక్ష్మాతి సూక్ష్మ భాగము మనసుగా మారుతుంది. కనుక మనసు మనం తీసుకునే ఆహారమును ప్రతిబింబిస్తుంది.ఈ నాడు మనసులోని పశు లక్షణాలు,అసుర భావాలకు కారణం తీసుకునే ఆహారమే అని గ్రహించాలి."

-సత్యసాయిబాబా , “ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి బోధనలు –మొదటిభాగము”  https://www.sathyasai.org/publications/TeachingsOfBSSSB-Vol01.html

 

"అవసరంలో ఉన్న వ్యక్తికి హృదయ పూర్వకంగా సహాయము చెయ్యి దానివల్ల వచ్చే దివ్యానందాన్ని అందుకో .ఆ సేవ పెద్దగా ఉండాల్సిన అవసరం ఏమిలేదు ఇతరులు గుర్తించ లేనంత చిరు సహాయము గా ఉన్నా ఫరవాలేదు.దీనివలన నీలో ఉన్న మరియు అతనిలో ఉన్న భగవంతుడు సంతసించిన చాలు అనే భావనతో చేయాలి. "

-సత్యసాయిబాబా , “ సేవా సాధన పై ప్రవచనాలు ”  1981నవంబర్ 19 నాటి అనుగ్రహ భాషణము http://www.sssbpt.info/ssspeaks/volume15/sss15-31.pdf

 

ప్రకటనలు

 

నిర్వహింపబోవు సదస్సులు

  • యుఎస్ఎ  పశ్చిమ విర్జీనియా వాషింగ్టన్ డి.సి.వద్ద : AVP వర్క్ షాప్  13-15 అక్టోబర్ 2017, సంప్రదించవలసివారు  సుసాన్ [email protected]
  • ఇండియా  పుట్టపర్తి: AVP వర్క్ షాప్  18-22 నవంబర్ 2017, సంప్రదించవలసివారు లలిత [email protected] లేదా ఫోన్ నంబర్ 8500-676 092
  • ఇండియా  పుట్టపర్తి: SVP వర్క్ షాప్  24-28 నవంబర్ 2017, సంప్రదించవలసివారు హేమ [email protected]
  • ఇండియా  పుట్టపర్తి: AVP వర్క్ షాప్  17-21 ఫిబ్రవరి 2018, సంప్రదించవలసివారు లలిత [email protected] లేదా ఫోన్ నంబర్ 8500-676 092
  • ఇండియా  పుట్టపర్తి: AVP వర్క్ షాప్  22-26 జూలై 2018, సంప్రదించవలసివారు లలిత [email protected] లేదా ఫోన్ నంబర్ 8500-676 092
  • ఇండియా  పుట్టపర్తి: AVP వర్క్ షాప్  18-22 నవంబర్ 2018, సంప్రదించవలసివారు లలిత [email protected] లేదా ఫోన్ నంబర్ 8500-676 092
  • ఇండియా  పుట్టపర్తి: వర్క్ షాప్  24-28 నవంబర్ 2018, సంప్రదించవలసివారు హేమ [email protected]

అదనముగా

ఆరోగ్య చిట్కాలు 

ఆరోగ్యకరమైన ఆహార సేవనం !

ఎట్టి ఆహారమో అట్టి మనసు ;

 ఎట్టి మనసో అట్టి ఆలోచనలు ;

ఎట్టి ఆలోచనలో అట్టి శీలము  ;

ఎట్టి శీలమో అట్టి ఆరోగ్యము.” 1

1. ఆహారము అంటే ఏమిటి ? 2,3

ఆకారము,రుచి కలిగి ఉండి నోటితో తీసుకోగలిగిన వివిధరకాల పదార్ధాలతో కూడిన దానిని ఆహారము అంటారు. ఐతే ఇది మనం తీసుకోగలిగిన దానిలో ఒక భాగము మాత్రమే .మన ఐదు ఇంద్రియాలు దృష్టి,వాసన,వినికిడి, రుచి, స్పర్శ ద్వారా మనము లోపలకి తీసుకునే దంతా ఆహారమే. ఆహారము ద్వారా మరియు ఇంద్రియాలద్వారా మనం తీసుకునే విషయాల పైన మనసు ఆధారపడి ఉంటుంది. ప్రతీ ఇంద్రియము నుండి పవిత్రమైన పరిశుద్ధమైన ఆహారాన్ని తీసుకోవాలి.కనుక మనము ఇంద్రియాలద్వారా తీసుకునే దానిపైన నిఘా ఉంచాలి. ఇంద్రియాల ద్వారా పవిత్రమైన ఆహారము తీసుకున్నప్పుడు దేహమే దేవాలయము అవుతుంది.    

2. మనకు ఆహారము ఎంతో అవసరం  4-6

మన జీవితానికి కావలసిన నిత్యావసరాలలో ఆహారము కూడా ఒకటి ఎందుకంటే ఆహారము ద్వారానే దేహము వివిధరకాల కృత్యాలు నిర్వహించుకోవడానికి కావలసిన శక్తి వస్తుంది. మరియు మనసు వివేచన చేయడానికి కావలసిన శక్తి కూడా ఆహారము నుండే లభిస్తుంది. జీవితం ఆహారము తోనే ప్రారంభమవుతుంది ఆహారముతోనే కొనసాగింపబడి జీవిత లక్ష్య మైన దేహములో ఉన్న పరమాత్మను తెలుసుకని లక్ష్య సిద్ధి కోసం పాటు పడడానికి కూడా ఆహారమే కావాలి.ఆహారము ద్వారా కొనసాగింప బడే జీవితం అల్పము కాగా దివ్యశక్తి చే కొనసాగింప బడే జీవితము అజరామరము.

3. దేహము,మనసు పైన ఆహారము యొక్క ప్రభావము  2,7,10

ఆహారము మనసు యొక్క తత్వాన్ని నిర్ణయిస్తుంది. మాన్ దేహము వలెనే ఆహారానికి కూడా స్థూల,సూక్ష్మ,అతిసూక్ష్మ స్థాయిలు ఉన్నాయి. ఆహారము జీర్ణ మైన తర్వాత స్థూల భాగము మలము రూపములో బయటకు తోసివేయ బడుతుంది. సూక్ష్మ భాగము కండరాలు ఎముకల పెరుగుదలకు ,దేహ సంరక్షణకు తోడ్పడుతుంది. అతి సూక్ష్మ భాగము మనసు గా రూపొందుతుంది.అలాగే మనం తీసుకొనే ద్రవాహారము లో కూడా స్థూల భాగము మూత్రము రూపంలో బయటకు పోతుంది.సూక్ష్మ భాగము రక్తము గా తయారవుతుంది.అతి సూక్ష్మ భాగము ప్రాణము గా తయారవుతుంది. కనుక మనం తీసుకునే ఆహారము యొక్క స్వభావము పవిత్రముగా ఉండాలన్నదే ఇక్కడి ప్రధానాంశము.

4. పోషణ నిమిత్త మై కొన్ని సూచనలు  8-10

ప్రతీ దేహము లోనూ భగవంతుడు జఠరాగ్ని రూపములో ఉండి  మనం తిన్న ఆహారాన్ని జీర్ణము చేస్తాడు. అటువంటి దేవుడికి మనిషి సృష్టించిన వానికన్నా దైవం సృష్టించినవి సమర్పించడమే ఉచితము. దీనిని ఆధారముగా చేసుకొనియే భారతీయ శాస్త్రాలు ఆహారము యొక్క స్వభావము ఆధారముగా  సాత్వికము,రాజసికము,తామసికము అని 3 భాగాలుగా విభజించాయి.ఆధ్యాత్మిక పథంలో ముందుకు పోవాలనే సాధకులు సాత్విక ఆహారాన్ని తీసుకోవాలని సూచించబడింది.సాత్వికాహారము ప్రకృతికి దగ్గరగానూ,  వృక్ష సంబంధ మైనదిగానూ, మరే జీవికి హాని తలపెట్టని దిగానూ  ఉంటుంది. ఇది పవిత్రతను,సంతృప్తిని,ఆరోగ్యాన్ని,దీర్ఘాయుష్షును ,సరళతను,ఆధ్యాత్మిక జీవితానికి కావలసిన స్థిర చిత్తాన్ని అందిస్తుంది .

రాజసిక ఆహారము ఎక్కువ ఉప్పు,పులుపులతోనూ ,వేడిగానూ,మషాలాలతోను కూడి ఉంటుంది. ఇది దేహము,మనసు పైన ఉద్రేక స్వభావము చూపుతూ అనుక్షణం మనసును మంచి,చెడు మధ్య ఊగిస లాడేలా చేస్తుంది.  అటువంటి ఆహారము తినడం మొదట ఆనందంగా అనిపించ వచ్చు కానీ తర్వాత నిర్వేదానికి గురి చేస్తుంది. తామసిక ఆహారము ఎక్కువగా నిలువ చేయబడి ఉన్నదిగా  గానీ,ఎక్కువగా ఉడికించినదిగా గానీ,ఎక్కువ కొవ్వు పదార్ధాలతో కూడినదిగా  గానీ ఉంటుంది.ఇది భౌతికంగా మానసికంగా స్తబ్దతను,బద్దకాన్ని  కలిగించి  అనారోగ్యానికి గురి చేసేదిగా ఉంటుంది.

5. సాత్వికమైన ఆహారము  1,4,8-11

స్వచ్చమైన జలము,కొబ్బరి నీరు,పండ్లు,ఆకుపచ్చని తాజా కూరగాయలు,రాత్రిపూట నాన బెట్టిన గింజలు,చిరు ధాన్యాలు,చిక్కుళ్ళు,మొలకెత్తే విత్తనాలు, ఇవన్నీ కూడా సాత్వికాహారము నకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. చిక్కుళ్ళలో చాలా ఎక్కువ మోతాదులో మాంసకృత్తులు ఉంటాయి.వీటిని నీటిలో నానబెట్టుకొని మెత్తగా అయ్యాక తినాలి. సూక్ష్మ క్రిమి రహిత ,క్రొవ్వు తీసిన తాజా పాలు లేదా వాటి ఉత్పత్తులయిన పెరుగు,వెన్న,నెయ్యి మరియు ముడి తేనె ఇవి సాత్విక మైన ఆహారమే కానీ వీటిని తక్కువ పరిమాణంలో తీసుకోవాలి.

వండని ప్రకృతి సిద్ధమైన ఆహారము సాత్విక మైనది .ఎందుకు వండిన పదార్ధాలు సిఫార్సు చేయబడుట లేదు అంటే ఇక్కడ ఒక విషయం గ్రహించాలి వేపించిన గింజలు మొలకెత్తే స్వభావాన్ని కోల్పోతాయి ఎందుకంటే వాటి ప్రాణ శక్తితొలగించ బడుతుంది.  మనిషి మాత్రమే వండిన పదార్ధాల మీద లేదా అస్వాభావిక మైన పదార్ధాల పైన ఆధారపడి జీవిస్తాడు కనుకనే రోగాల పాలవుతాడు.పశు పక్షి మృగాదులు సహజ సిద్ధమైన ఆహారము తీసుకుంటాయి కనుక రోగాలు వాటి దరికి రావు.  

రెండవ రకపు సాత్వికాహారము  ఏమిటంటే తక్కువగా వండిన లేదా ఉడికించిన ఆకుకూరలు,కూరగాయలు మొదలగు తాజాగా వండిన ఆహారము. వండిన తర్వాత ఎంత ఎక్కువ సేపు ఈ ఆహారాన్ని ఉంచితే అంత తామసికముగా మారిపోతుంది. వండే పాత్రలు కూడా పరిశుభ్రంగా ఉండాలి మరియు వంట చేసేటప్పుడు ప్రేమతో చెయ్యాలి వడ్డించే టప్పుడు నవ్వుతూ వడ్డన చెయ్యాలి. . అందువల్ల పవిత్రమైన భావాలు ఆహారములో ప్రవేశించి దేహాన్ని ఆరోగ్యకరమైన దానిగా ఉంచుతాయి. ఇలా రోజూ సాత్వికాహారము నే భుజించి నట్లయితే  అది రాజసిక భావాలయిన కోరిక,కోపము,గర్వము,కామము,భ్రమ అసూయ ఇటువంటివి  మనలో పెరగ నీయక  పవిత్రంగా ఉంచుతుంది.                                                        

6. పండ్లు కూరగాయలను శుభ్రపరచడం  12-15

మనం తీసుకునే పండ్లు కూరగాయల పైన పురుగుమందులు,రసాయనిక మందుల అవశేషాలు ఉంటాయనే భయాలను త్రోసిపుచ్చలేము.వీటిని తొలగించడానికి ఒక పద్దతి ఏమిటంటే నల్లా క్రింద ప్రవహించే నీళ్ళలో  వీటిని ఉంచి బాగా కడగడం వీటిని 2% ఉప్పు ద్రావణం తో (అనగా లీటరు నీటిలో 20  గ్రాముల ఉప్పును వేయాలి) కడిగితే చాలా వరకు ఆ అవశేషాలు పోతాయి.ఐతే రెండు మూడు సార్లు కడగ వలసి ఉంటుంది. మరొక పద్దతి ఏమిటంటే ఆర్ద భాగం వరకూ నీరు ఉన్న ఒక పెద్ద గిన్నెలో ఒక చెంచా ఉప్పు ,రెండు చెంచాలు వినెగర్ వేసి కూరగాయలు పండ్లను 20 నిముషాలు నాననివ్వాలి.  ఎక్కువ సేపు నాననివ్వడం వలన పైన పేర్కొన్న అవశేషాలు పూర్తిగా తొలగి పోతాయి కానీ వినితో పాటు పోషకాలు కూడా పోతాయి.మరొక పద్దతి ఏమిటంటే అవకాశం ఉన్నవారు ఈ ఆర్గానిక్ కూరగాయలు,పండ్లను సొంతంగా పండించుకోవాలి లేదా నమ్మకమైన స్థానం నుండి వీటిని కొనుగోలు చెయ్యాలి.

7. మొదట ఆహారాన్ని భగవంతుడికి నివేదన చెయ్యాలి  11,16

మొదట ఆహారాన్ని తాను నమ్మి కొలిచే భగవంతుడికి లేదా ఒక సర్వోత్తం శక్తికి కృతజ్ఞతాపూర్వకముగా అర్పితము  చేయాలి . అంతేకాదు ఆ ఆహారము మనకు చేరడానికి దోహద పడ్డ ప్రతీ ఒక్కరికీ మనసులోనే  కృతజ్ఞత తెలుపుకోవాలి. ఆహారము తీసుకొనే ముందు ఏ ఒక్క జీవి కూడా ఆహారము లేకుండా మంచి నీరు లేకుండా ఉండరాదని ప్రార్ధించాలి. ఇంకా ఆహారము తినేముందు తనకిష్టమైన నామాన్ని లేదా మంత్రాన్ని స్మరించుకోవాలి..  ఇలా చేస్తే మనం తినే ఆహారము పవిత్రమై పండించిన లేదా వండిన వారికి సంబంధించిన వ్యతిరేక ఫలితాలు శక్తుల నుండి దూరం చేయబడుతుంది.అలాగే పవిత్రమైన సారము మన లోపలి చేరుకొని హృదయాన్ని పవిత్ర పరుస్తుంది.

8. ఆహారాన్ని ఎలా తీసుకోవాలి ? 1,3,17-19

పవిత్రమైన ఆహారము ఒక దివ్య వరప్రసాదితముగా భావించి నిశ్శబ్దముగా,ప్రేమతోను,కృతజ్ఞత తోనూ నిశ్శబ్ద వాతావరణములో నడుము నిటారుగా ఉంచి ప్రశాంతముగా కూర్చుని తీసుకోవాలి.  ఆహారము చక్కగా జీర్ణము కావడం కోసం ఒక ధ్యాన నిమగ్నతతో ,కృతజ్ఞతాపూర్వక భావనతో నోటిలో బాగా నమిలి మింగాలి. అలా  చేస్తే నోటిలోనే ఆహారము 50% వరకు జీర్ణమవుతుంది. ఆహారాన్ని మన కుటుంబ సభ్యులు,లేదా బంధువులు, స్నేహితులతో తింటే అది ఆనంద దాయకంగా ఉంటుంది. ఒకవేళ వంటరిగా తినవలసి వస్తే దైవభావనలతో తినాలి  ఆయుర్వేదం మన చేతితోనే మనం ఆహారం భుజించాలనే నియమాన్ని ప్రోత్సహిస్తుంది.ఎందుకంటే మన ప్రతీ వ్రేలు పంచభూతాలకు ప్రతీక కనుక ఇవి ఆహారము పచనమవడాన్ని ప్రోత్సహిస్తాయి .

ఆహారము తీసుకునే సమయంలో సంభాషణలో పాల్గొనడం,టి.వి. చూడడం లేదా ఉద్రేకం కలిగించే విషయాలు వినడం వీటివల్ల మనసు యొక్క ప్రశాంతతకు భంగం వాటిల్లుతుంది. ఏదయితే విన్నామో,చూసామో అవి కొంత కాలవ్యవధిలో మనసు పొరల లోనికి ప్రవేశించి అనారోగ్యాన్ని కలిగిస్తాయి. ఆహారమును తొందరపాటుగానూ,నిలబడి, అదొక నిత్య కృత్యము అన్నట్లు యాంత్రికంగా తినకూడదు.  

ఘనాహారము తినేముందు సులువుగా జీర్ణమయ్యే పండ్లు,పచ్చి కూరగాయలు తినడం మంచిది. మనం తినే ఆహారము గట్టిగానో తడిలేనిది గానో ఉంటే తప్ప ఆహారము తీసుకునే సమయంలో నీరు లేదా ద్రవపదార్ధాలు తీసుకోకుండా ఉంటే మంచిది. భోజనం చేసేందుకు అరగంట ముందు గానీ లేదా చేసిన రెండు గంటల తర్వాత గానీ నీరు త్రాగావచ్చు.

9. ఎంత తినాలి,ఎప్పుడు తినాలి  3,10,17,18

మనం తీసుకునే ఆహారము నియమిత పరిణామములో అవసరం మేరకు ఆకలి అనే వ్యాధికి మందు అనే భావంతో ఉండాలి.భోజనము పూర్తయిన తర్వాత ఉదరములో 50% ఘన పదార్ధలతోను,25% ద్రవపదార్ధాలతోనూ,మిగతా 25% గాలి తోనూ ఉండాలి.దీనివల్ల జీర్ణ రసాలు ఉత్పత్తి అయ్యి ఆహారము చక్కగా జీర్ణ మవడానికి అవకాశము కలుగుతుంది. పాటించవలసిన నియమం ఏమిటంటే భోజనం తినక ముందు ఎంత తేలికగా ఉన్నామో భోజనం అనంతరం కూడా అంటే తేలికగా ఉండాలి గానీ బద్దకంగా నిద్ర వచ్చే విధంగా ఉండరాదు. కడుపు నిండి నట్లు అనిపించింది అంటే మీరు ఎక్కువ తిన్నట్లే. 

మీరు సత్వికాహారము తీసుకున్నప్పటికీ అది అమితముగాను లేదా ఎక్కువ మోతాదులో (దానిలో నెయ్యి,బెల్లము వంటివి ఎక్కువగా ఉండడం)ఉన్నట్లయితే అది రాజసిక,తామసిక  గుణాలను ప్రేరేపిస్తుంది

మనకు 50 ఏళ్ళు పైబడిన తర్వాత క్రమేణా మనం తీసుకునే ఆహారము తగ్గించుకుంటూ రావాలి, నేను దేహాన్ని కాదు అనే భావన మనలో జాగృత మయితే మన శరీరం ఎక్కువ ఆహారం రుచులకోసం వెంపర్లాడదు. మన దేహము యొక్క అవసరాలను చాలా సున్నితంగా పరిశీలిస్తూ డానికి తగ్గట్టుగా ప్రతిస్పందించాలి. రాత్రి భోజనం చాలా తేలిక ఉండాలి మరీ ఆలశ్యం కాకుండా చూసుకోవాలి,ఉదరానికి నియమిత కాలానుగుణంగానే ఆహారము అందించాలి. మరుసటి భోజనం అందించే ముందు ఆకలి అనేది దేహానికి తెలియాలి. భారత ఇతిహాసాల ప్రకారము రోజుకు మూడు సార్లు తినేవాడు రోగి ,రెండు సార్లు తినేవాడు భోగి,ఒక్కసారి మాత్రమే తినేవాడు  యోగి .

10. నిషేదించవలసిన లేదా తగ్గించవలసిన ఆహారపు వివరములు  10,18

ఇక్కడ సూచించబడ్డ ఆహార దినుసులను పూర్తిగా మానివేయడం కానీ లేదా తగ్గించడం కానీ ఆరోగ్యానికి ఎంతో మంచిది. నిలువ ఉంచే పదార్ధాలు,కృత్రిమ రంగులు వేసిన పదార్ధాలు,సువాసన కోసం వేసే పదార్ధాలు ఇవన్నీ వేసి ప్యాకింగ్ చేసిన పదార్దాలు,,అలాగే  MSG ఇది రుచిని పెంచేది కానీ నిలవ ఉంచేది కాదు కానీ ఆరోగ్యానికి ఎంతో నష్టం కలిగిస్తుంది. ఇంకా మిఠాయిలు,చాకొలెట్ లు,ఐస్ క్రీం ,కూల్ డ్రింకులు,కెఫీన్(ఇది కాఫీ,టి లలో ఉంటుంది)కొవ్వు పదార్ధాలు,వేపుళ్ళు,ఇవన్నీ అనారోగ్యం కలిగించేవే.

ఇక్కడ సూచించబడ్డ ఐదు తెల్లని వస్తువులను తగ్గించడానికి ప్రయత్నించండి. వెన్న, నెయ్యి తో సహా  పాలు మరియు దాని ఉత్పత్తులు( దీని బదులు కొబ్బరి పాలు,మజ్జిగ,పెరుగు వాడవచ్చు) తెల్లని పంచదార (ఇది తప్పనిసరి అనుకుంటే బెల్లము లేదా పటికబెల్లము వాడవచ్చు),ఉప్పు (దీని బదులుగా రాతి ఉప్పు వాడవచ్చు)మైదా మరియు దాని ఉత్పత్తులు (దీని బదులు ముడి గోధుమ పిండి లేదా చిరు ధాన్యాల పిండి వాడవచ్చు. తెల్లని బియ్యం ( విని బదులుగా ముడి బియ్యము లేదా బ్రౌన్ రైస్ వాడవచ్చు

గ్రుడ్లు చేపలతో సహా మాంసాహారమును మానివేయాలి.అలాగే సారాయి ,ధూమపానము కూడా మానాలి ,ఎందుకంటే ఇవి భగవద్ నిర్మితమైన దేహ నిర్మాణానికి అవరోధాలు.ఇవి ఆద్యాత్మిక ప్రగతికి ప్రతిబంధకాలుగా పనిచేస్తాయి. 

11. ఆహారపు అలవాట్లు ఎలా మార్చుకోవాలి  15,20

మనం రోగాల బారిన పడేంత వరకూ మనకు అనారోగ్యం కలిగించే ఆహారము పట్ల ఉపేక్ష ఎందుకు వహించాలి ? కానీ ఇక్కడొక ఇబ్బంది ఉంది.అందరికీ ఒకే రకమైన పరిపూర్ణమైన ఆహారము లభించదు అనేది నిర్వివాదాంశం .దీని నిమిత్తము వ్యక్తి తాను తీసుకునే ఆహారము పైన ప్రయోగము చేసి తనకు ఏది అనుకూల మైనది,ఏది తనను ఆనందంగా ఆరోగ్యంగా ఉంచుతుంది అనేది తెలుసుకోవాలి.అలాగే తన మనసుకు తాను నచ్చ చెప్పుకుని కొంత కాలవ్యవధిలో మంచి ఆహారపు అలవాట్ల వైపు మరల్చాలి.   ఈ కాలవ్యవధి  మన దేహము మనసు ఈ ఆరోగ్య కరమైన ఆహార అలవాట్లకు సర్దుబాటు చేసుకోవడానికి ఉపకరిస్తుంది. దీని నిమిత్తము చిన్న చిన్న లక్ష్యాలు ఏర్పరుచుకొని ఒక్కొక్క వారములో వాటిని చేరుకుంటూ ఉంటే అది చాలా  సంతృప్తిని ముందుకు వెళ్ళడానికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది..ఇది మాకు కష్టంగా ఉంది అనుకున్న వారు మధ్యేమార్గం అనుసరించడం మేలు.

12. ఆహారము మరియు శీలసంపద  10

మానవుని శీలసంపదకు ప్రధాన ఆధారము ఆహారమే. మనుషులంతా ఒకటే కానీ వారు తమ ఇంద్రియాలద్వారా తీసుకునే విషయాల పవిత్రతను బట్టి మరియు తినే ఆహారము యొక్క గుణాన్ని బట్టి   సంఘంలో ఘర్షణలకు తావు కల్పిస్తోంది. ఎవరయినా ఇద్దరు వ్యక్తులలో ఒకరు సాత్విక ఆహారము,మరొకరు రాజసిక ఆహారము తినే వారయితే వారి మధ్య సయోధ్య అనేది అసంభవం. కనుక ఎవరయినా భగవంతునితో సన్నిహితంగా మెలగాలంటే భగవంతునితో సఖ్యం చేయాలంటే వారు సాత్విక మైన ఆహారము,సాత్విక ప్రవృత్తి,సాత్విక ఆలోచనలు,కలిగి ఉండాలి ఎందుకంటే భగవంతుడు పవిత్ర సత్వగుణ సంపన్నుడు.

మూలములు : ఈ వ్యాసము ప్రధానంగా ఆహారము పైన భగవాన్ బాబా చేసిన ఉపన్యాసాల పైన ఆధారపడింది.

  1. Sathya Sai Speaks Vol 27-3, Food, the heart, and the Mind, 21st January 1994
  2. Sathya Sai Speaks Vol 23-16, The Buddhi and the Atma, 26th May 1990
  3. Sathya Sai Speaks Vol 29-03,Triple transformation: Sankranti’s Call,15th January 1996
  4. Sathya Sai Speaks Vol 14-31, Food and Health, 21st September 1979
  5. Sathya Sai Speaks Vol 24-16, The Human Predicament and the Divine, 30th May 1991;
  6. Sathya Sai Speaks Vol 13-19, The Message of Love, 23rd November 1975 & Summer showers in Brindavan 1972, Chapter 4
  7. Sathya Sai Speaks Summer Showers in Brindavan 1993 Chapter 11.
  8. Sathya Sai Speaks 10th Aug 1983, Prashanti Nilayam, Sathya Sai Baba Speaks on Food, Sri Sathya Sai Sadhana Trust, Publications 2014, page 17-19
  9. Sathya Sai Speaks Vol 11, Forms of Food, 28th January 1971; Bhagvad Gita, Chapter 17, verses 7-10
  10. Sathya Sai Speaks Vol 16-19, Food and Character
  11. Sathya Sai Speaks Vol 35-22, Listen to the Master of Universe and Transform Yourselves into Ideal Human Beings, 23rd November 2002
  12. http://www.cfs.gov.hk/english/multimedia/multimedia_pub/multimedia_pub_fsf_128_02.html
  13. http://www.cseindia.org/node/2681\
  14. https://www.quora.com/How-much-of-combination-is-2-salt-water
  15. Manual  for Vibrionics Practitioners, chapter 9
  16. Sathya Sai Baba Speaks on Food, Sri Sathya Sai Sadhana Trust, Publications, 2014, page 21-22
  17. Food & Body, Isha Health and wholeness Guides
  18. https://www.mygov.in/sites/default/files/user_comments/Health_Tips_latest%20pdf.pdf
  19. Sai Vibrionics Newsletter, Vol.8 issue 2, p-15
  20. https://zenhabits.net/eating

 

2. పోలాండ్ లో సాయి వైబ్రియోనిక్స్  పోలిష్ కోఆర్డినేటర్  02515 వద్దనుండి సమాచారము 

పోలాండ్ లో మొదటి వైబ్రియో సదస్సు మొదటిసారిగా  1999 లో డాక్టర్ అగ్గర్వాల్ గారు మా దేశాన్ని సందర్శించి నప్పుడు జరిగింది. రెండు సంవత్సరాల తర్వాత వారు తిరిగి మా దేశాన్నిసందర్శించి నపుడు అనేక మైన వైబ్రో సదసులు జరిగాయి. మా దేశం నుండి ఎందరో భక్తులు పుట్టపర్తిలో  ప్రశాంతి నిలయం సందర్శించినపుడు సాయివై బ్రియోనిక్స్ లో శిక్షణ తీసుకున్నారు.  

108 కామన్ కొమ్బో బాక్స్ ప్రవేశ పెట్టిన మీదట కొత్తవారికి శిక్షణ నివడం ఇంకా శులభ తర మైనది.కనుక పోలాండ్ ఆవల నుండి ఇతర సహాయం ఏమీ అవసరం లేకుండానే మా దేశం లోనే శిక్షణ ఇవ్వసాగాము.ఇటీవల 2017 మార్చ్ లో స్పాలా లో జరిగిన సెమినార్ తో కలుపుకొని ఇప్పటివరకు 12 సదస్సులు జరిగాయి.ఇప్పటివరకూ పోలాండ్ లో 250 ప్రాక్టీషనర్ లు శిక్షణ పూర్తి  చేసుకొని  పేషంట్లకు వైద్యం చేయడానికి అర్హత పొంది ఉన్నారు

గత 5 సంవత్సరాలలో పోలిష్ ప్రాక్టీషనర్ లు 29,000 పేషంట్ లకు వైద్యం అందించి 59,000 గంటలు వైబ్రియో సేవలో పాల్గొన్నారు.మేము రెండు రకాల సమావేశాలను ఏర్పాటు చేస్తున్నాము ఒకటి క్రొత్తవారికోసం కోర్సు రూపం లోనూ,పాతవారికోసం సదస్సు రూపంలోనూ ఏర్పాటు చేస్తున్నాము.  పోలాండ్ దేశవ్యాప్తంగా సుమారు 70 మంది ఇటువంటి సదస్సులలో పాల్గొంటున్నారు.ఈ సదస్సులు ప్రాక్టీషనర్ లు తమ వైబ్రో జ్ఞానాన్ని,నైపుణ్యములను పెంచుకోవడానికి,.ఎంతగానో ఉపయోగ పడుతున్నాయి..   

 

 

 

 

 

 

 

Om Sai Ram