Vol 8 సంచిక 2
March/April 2017
ముద్రింప తగిన వార్తాలేఖ
పూర్తి వార్తాలేఖ యొక్క కాగితం ప్రతి కావలెనన్నఈ పుటను ముద్రించండి
డా.జిత్. కే అగ్గర్వాల్ యొక్క మాటల్లో
ప్రియమైన అభ్యాసకులకు,
మీరందరు మహత్తరమైన మహా శివరాత్రి పండుగను ఘనంగా జరుపుకొని, ఆ ఆధ్యాత్మిక అనుభూతిని మీ నిజ జీవితంలో చక్కగా పొందుతున్నారని నేను చాలా బలంగా విశ్వసిస్తున్నాను. ఒకానొక శివరాత్రి దివ్య ఉపన్యాసాలలో స్వామి చెప్పారు మీరు మీ యొక్క కష్టాలకు బాధలకు మూల కారణం కనుగొనలేక పోతున్నారు. అందువలన మంచి పనులను చేయండి. పవిత్రమైన భావాలను పెంపొందించుకోండి. మీ తోటి మానవులకు సేవ చేయండి. ఈ విధమైన మార్గంలో ప్రయాణించడం భక్తి తో సరి సమానం . పల్లెలోనూ మురికి వాడల్లోనూ సేవ చేస్తూ వారికి కావాల్సిన కనీస వసతులను కల్పించడం ద్వారా తమ అడుగు జాడల్లో నడవాలని స్వామి ఆకాంక్షిస్తున్నారు. ఇది స్వామి తన చిన్న వయసు నుంచే నిరూపిస్తూ వచ్చారు.…Sathya Sai Speaks Volume 32 part-1
స్వామియొక్క ఈ ఉపదేశాన్ని మనం మన జీవితం యొక్క ప్రధాన మార్గదర్శక సూత్రంగా తీసుకొందాం. మనందరం మన యొక్క హద్దులను చెరిపేసుకుని పరిశోధన కార్యక్రమాల్ని విస్తారం గావించడం ద్వారా ఒక కొత్త ఒరవడిని సృష్టిద్దాం. ౨౦౧౭ వార్షిక ప్రణాళిక ప్రకారం, గత సంచికలో చెప్పిన విధంగా మేము నిర్దిష్టమైన పరిశోధనను, మొక్కలు మరియు జంతువుల చికిత్సా విధానాలపై చేస్తున్నాము. దీని కోసం మేము టెస్ట్ మరియు కంట్రోల్ గ్రూప్స్ ను ఎంచుకుని మా పరిశోధన కొనసాగిస్తాము. ఇందుకు అనుకూలమైన వాతావరణం మరియు అంకిత భావం గల పరిశోధకులు మాకు అవసరము. అందువలన ఈ బ్రహత్తరమైన కార్యక్రమంకోసం, మొక్కలు మరియు జంతువుల సంరక్షణపై ఆసక్తి మరియు అవగాహనా ఉన్న వారందరు ముందుకు వచ్చి అంగీకార సూచకంగా నాకొక ఈమెయిల్ పంపాలని నేను కోరుచున్నాను
23 ఫిబ్రవరి, 2017న, మహాశివరాత్రి పర్వదినాన, శ్రీ సత్య సాయి ఉన్నత వైద్య విధాన సంస్థ, వైట్ ఫీల్డ్, బెంగళూరు లో గల వెల్నెస్ క్యాంపులో విబ్రియోనిక్స్ ను అంతర్భాగంగా చేయడం ద్వారా స్వామి తమ అపార దయను, కృపను మనపై కురిపించారని నేను మీకు కృతజ్ఞతా భావంతో సవినయంగా తెలియచేయుచున్నాను. .
విబ్రియోనిక్స్ లో ప్రగతి మరియు ఆధాత్మిక పురోగతి రెండు ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి - క్రమబద్ధమైన ఆధ్యాత్మిక జీవనసరళి లేకపోతె ఎవరైనా విబ్రియోనిక్స్ లో ఉత్తమ ఫలితాలు సాధించలేరు. కేరళలోని షోరనూర్ లో గల సాయి ఆసుపత్రి నందు మన కేరళ అభ్యాసకులు నూతన సంవత్సరంలో మొట్టమొదటి సాధన క్యాంపు నిర్వహించారని తెలియ చేయుటకు నేను చాల సంతోషించుచున్నాను. ఇటువంటి ప్రేరణ కలిగించే సాధన క్యాంపులు క్రమం తప్పకుండా ప్రపంచమంతా జరుగుతూ ఆధ్యాత్మిక జీవన విధానం యొక్క ఆవశ్యకతను మన అభ్యాసకులకు బోధపడేటట్లు చెయ్యాలని నేను గట్టిగా కోరుకుంటున్నాను. ఈ అద్భుత ప్రయత్నాన్ని మేము మనసారా అభినందిస్తున్నాము
ఈ సంచిక లో మన చర్చాంశం “నీరు”. స్వామి అంటారు “నీరు మనిషి యొక్క జీవనాధారం”. మేము నీటియొక్క అత్యద్భుతమైన గుణాలను మరియు డీహైడ్రేషన్, దాని నివారణ మీద ఒక వ్యాసాన్ని పొందుపరుస్తున్నాము. మీరు దీనిని చాల ఉత్సుకతతో చదవగలరు. వేసవి కాలం సమీపంలో ఉన్నందున ఇది మీకు చాలా ఉపయోగకరం కూడా. అతి చిన్న వయసులోనే విబ్రియోనిక్స్ అబ్యాసకులుగా మారిన నలుగురు యువ అభ్యాసకులును మీకు పరిచయం చేస్తున్నాము. ఎంతో ఉత్సాహంతో మరియు ప్రేమతో వారు చేసే విబ్రియో సేవ ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపింది. ఇది చాలా అభినందించదగ్గ విషయం
ఈ సంచికను శ్రద్దగా చదువుతున్నపుడు స్వామి యొక్క దివ్య సందేశాన్ని చూసినప్పుడు మనం ఎంతో ప్రేరణ మరియు ఉత్తేజాన్ని పొందుతాము. “ఉన్నత భావాలు, ఆశయాలు పెంపొందించుకోండి. మిమ్మల్ని మీరు ఉద్దరించుకోండి. జీవిత ప్రధాన గమ్యమైన భగవంతుణ్ణి చేరుకోవడానికి ప్రయత్నించండి”...మహా శివరాత్రి దివ్య సందేశం, బృందావన్, మార్చ్ 7, 1978. ప్రేమమయమైన దివ్యత్వం మనందరి జీవితాశయం మరియు విబ్రియోనిక్స్ సేవ ద్వారా మనం దానిని అందుకోవాలని ఆశిస్తున్నాను.
సదా ప్రేమమయమైన సాయి సేవలో,
జిత్ కే అగర్వాల్.
మల్టిపుల్ (అనేక సార్లు) స్ట్రోక్స్ , వినికిడి లోపం మరియు జ్ఞ్యాపక శక్తి క్షీణత 03535...USA
ఆశుపత్రి నుండి డిస్చార్జ్ అయిన ఒక 89 సంవత్సరాల వృద్ధుడను వైబ్రో చికిత్సా నిపుణులు వెళ్లి చూడటం జరిగింది. ఆ వృద్ధుడు తాను బాధపడుతున్న బలహీనత, వినికిడి లోపం మరియు జ్ఞ్యాపక శక్తి క్షీణత వంటి సమస్యలకు చికిత్సా నిపుణులను వైబ్రో చికిత్సను కోరటం జరిగింది. ఈ సమస్యలకు రోగి ఏ విధమైన మందులను తీసుకోవటం జరిగింది. గత కొన్ని సంవత్సరాల్లో రోగికి అనేక గుండెపోట్లు మరియు అనేక స్ట్రోక్స్ (రక్తక్షయం కారణంగా) కలిగటంతో రోగి రక్తాన్ని పలచపర్చే మందులను తీసుకుంటున్నారు. దీని కారణంగా రోగికి దీర్ఘకాలిక రక్తహీనత సమస్య ఏర్పడడంతో తరచుగా ఆశుపత్రిలో హీమోగ్లోబిన్ యొక్క(రక్తగోళకము) స్థాయిని మెరుగుపర్చేందుకు, రక్తంలో ద్రవం ఎక్కించడం జరిగేది. రోగికి సహాయం లేకుండా నడవటం మరియు నిలబడటం ఇబ్బందికరంగా ఉండేది.
2015 నవంబర్ 2 న రోగికి క్రింది మందులు ఇవ్వబడినాయి:
#1. CC3.5 Arteriosclerosis + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC17.3 Brain & Memory tonic + CC20.3 Arthritis…BD
వైబ్రో చికిత్స తీసుకుంటున్న సమయంలో రోగి రక్తాన్ని పలుచపరచే మందును తీసుకోవటం కొనసాగించారు. ఒక నెల తర్వాత వినికిడి లోపానికి క్రింది మందు ఇవ్వబడింది:
#2. CC5.2 Deafness + #1...BD
గత పది సంవత్సరాల నుండి రోగి అధిక రక్తపోటు మరియు డయాబెటిస్ సమస్యలకు మందులను తీసుకుంటున్నారన్న విషయం chikithsa నిపుణులకు రెండు వారాల తర్వాత తెలిసింది. అతని రక్తపోటు 125/౭౫ ఉంది అయితే అతని HbA1c 8.7% ఉండటం తో అల్లోపతి చికిత్స తీసుకుంటున్నప్పటికీ చక్కెర స్థాయి అధికంగా ఉన్నట్లు తెలిసింది. ఈ లక్షణాల కొరకు క్రింది మందులు ఈ రోగికి ఇవ్వడం జరిగింది:
#3. CC3.3 High Blood Pressure + CC6.3 Diabetes + #2...BD
2016 జనవరి 15 న రోగి యొక్క ఇంటిలో జరిగిన ఒక విందులో కుటుంభ సభ్యులు మరియు మిత్రులు రోగి యొక్క ఆరోగ్య స్థితిలో ఏర్పడిన మెరుగుదలను చూసి ఆశ్చర్య పడ్డారు. అంతకు ముందు పది నిమిషాల కంటే అధిక సమయం కూర్చోలేకపోయిన రోగి విందులో ఐదు గంటల పాటు కూర్చొని కార్యక్రమాలను చూసి ఆనందించగలిగారని రోగి యొక్క కుమార్తెలు చికిత్సా నిపుణులకు తెలిపారు.
అంతేకాకుండా రోగి యొక్క జ్ఞ్యాపక శక్తి, వినికిడి శక్తి మరియు గమన శక్తిలో మెరుగుదల ఏర్పడినట్లుగా రోగి యొక్క కుమారుడు గమనించి చికిత్సా నిపుణులకు తెలపడం జరిగింది. ఏప్రిల్ లో #3 యొక్క మోతాదు OD కి తగ్గించబడింది. 2016 జూన్ నాటికి రోగి యొక్క వినికిడి శక్తి 80% మరియు శక్తి స్థాయిలు 100% మెరుగుపడ్డాయి.
రక్తపోటు మరియు డయాబెటిస్ కు తీసుకుంటున్న అల్లోపతి మందులతో పాటు వైబ్రో చికిత్సను రోగి కొనసాగించారు. 2016 డిసెంబర్ లో చేసిన HbA1c పరీక్ష ద్వారా రక్తంలో చక్కెర స్థాయి మెరుగుపడినల్టు తెలిసింది. రోగి ఇప్పుడు సహాయం లేకుండా నడవగలుగుతున్నారు.
2017 జనవరి నాటికి రోగి ఆరోగ్యంగా ఉన్నారు. వైబ్రో చికిత్స ప్రారంభించిన సమయం నుండి రోగికి ఆశపత్రిలో చేర్చే అవసరం ఒక సారి కూడా రాలేదు. రోగి యొక్క ఆరోగ్యం మెరుగుపడడానికి వైబ్రియానిక్స్ చికిత్స మాత్రమే కారణమని రోగి యొక్క కుటుంభ సభ్యులు నమ్ముతున్నారు.
రోగి యొక్క కుమారుడి వ్యాఖ్యానం:
సాధారణంగా ఆరోగ్యంగా ఉండే మా తండ్రిగారికి గత ఐదు సంవత్సరాలుగా ఆరోగ్య స్థితి క్షీణించింది. ఆయన దైవంపై అపారమైన భక్తి విశ్వాసాలు గలవారు. ఆయన ఆరోగ్యంగా ఉన్న రోజులలో అనేక మందికి హోమియోపతి మందులను ఉచితంగా ఇవ్వడం ద్వారా వారికి సహాయ పడేవారు. వైబ్రియానిక్స్ ద్వారా ఆయన ఆరోగ్యం మెరుగుపడడం చూసిన మాకు ఎంతో ఆనందం కలిగింది. వైబ్రియానిక్స్ చికిత్స ప్రారంభించిన సమయం నుండి మా తండ్రిగారిని ఆశపత్రిలో చేర్చే అవసరం రాలేదు. ఆరోగ్యం మెరుగుపడిన కారణంగా ఆయన ప్రస్తుతం ఆనందంగా ఉన్నారు.
వ్యాకులత, భయం, గాభరా 03535...USA
వ్యాకులత, తీవ్ర భయం మరియు గాభరా వంటి లక్షణాలతో బాధపడుతున్న ఒక 30 ఏళ్ల వ్యక్తి చికిత్సా నిపుణులను సంప్రదించారు. గత పది ఏళ్లుగా ఈ లక్షణాలు ఉన్నప్పటికీ రెండు సంవత్సరాలుగా తీవ్రమైనట్లు రోగి తెలిపారు. మనోరోగ వైద్యుడను సంప్రదించినప్పటికీ ఫలితం లభించలేదు. గాభరా పడిన సమయంలో రోగికి రక్తపోటు తీవ్రమయేది (160 /80), గుండె దడ పెరిగి శ్వాస తీసుకోవడం ఇబ్బందికరంగా ఉండేది. దీని కారణంగా అతనికి తల తిరిగేది. తన భార్య వారి మొదటి బిడ్డను జన్మనిచ్చిన సమయంలో రోగి యొక్క లక్షణాలు మరింత తీవ్రమయ్యాయి. రోగి తన వ్యాకులత మరియు భయాలను ఎవరితోనూ పంచుకునేవారు కాదు. వ్యాకులత కారణంగా రోగి ఏకాగ్రతతో ఏ పనిని చేయలేకపోయేవారు. తాను అనుభవిస్తున్న మనో వ్యాకులత తన పగవాళ్లకు కూడా కలగకూడదని అతను భావించారు. ఎప్పటికైనా ఈ సమస్య తీరి తాను సాధారణ స్థితికి చేరుకుంటారన్న నమ్మకం అతనికి లేదు. బాల్యంలోనే తన తండ్రిని కోల్పోయాడని మరియు తన తల్లి ఒక భయస్తురాలని ఎల్లప్పుడూ వ్యాకులపడుతూ ఉండేదని తనకి కూడా అదే మనస్తత్వం వచ్చిందని చికిత్సా నిపుణులకు రోగి తెలిపారు. రోగి ఈ లక్షణాలకు ఏ విధమైన మందులను తీసుకోవడం లేదు.
2016 ఫిబ్రవరి 10న క్రింది మందులు రోగికి ఇవ్వబడినాయి:
#1. CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC15.2 Psychiatric disorders + CC17.2 Cleansing + CC17.3 Brain & Memory tonic + CC18.1 Brain disabilities…TDS
ప్రతివారం రోగిని మానిటర్ చేయడం జరిగింది. రెండు వారాల తర్వాత తన మనస్థితిలో మరుగు ఏర్పడినట్లుగా రోగి తెలిపారు. మూడు వారాల తర్వాత రోగి యొక్క వ్యాకులత, భయం మరియు గాభరా 90% వరకు తగ్గిపోయాయి. రోగి యొక్క రక్తపోటు 135 /80 కి తగ్గింది.
2016 ఏప్రిల్ లో రక్తపోటు సమస్యకు మందు చేర్చి ఇవ్వబడింది:
#2. CC3.3 Blood pressure + #1...TDS
ఆరు వారాల తర్వాత రోగి దీర్ఘకాలంగా బాధపడుతున్న వ్యాకులత మరియు భయం నుండి పూర్తిగా విముక్తి పొందారు. ఆగస్టులో రోగి యొక్క రక్తపోటు సాధారణ స్థాయికి (120 /80) చేరుకుంది. నాలుగు నెలల్లో రోగి యొక్క ఆరోగ్య పరిస్థితి 100% మెరుగుపడింది. మొదట్లో వైబ్రియానిక్స్ పై నమ్మకం లేని ఈ రోగి తనకి జరిగిన ఈ అద్భుతానికి కృతజ్ఞతలను తెలుపుకున్నారు. ఎల్లప్పుడూ చింతిస్తూ భయపడుతూ ఉండే రోగి ప్రశాంతంగా మారిపోవడం చూసిన రోగి యొక్క కుటుంభ సభ్యులు ఎంతో ఆశ్చర్య పోయారు. ఆత్మవిశ్వాసంతోను మరియు శక్తివంతంగాను అతను జీవించడం ప్రారంభించారు. వ్యాకులత మరియు భయం తొలగటం కారణంగా అతను తన దున చర్యలను ఏకాగ్రతతో చేయగలిగారు. 2017 జనవరి నాటికి అతను అంతకు ముందు బాధపడిన మనోరోగ లక్షణాలు తిరిగి రాలేదు. ఇప్పటికి అతను #2 TDS మోతాదులో తీసుకుంటున్నారు. ప్రస్తుతం రోగికి ఏర్పడిన ఆఖలేసియా (ఆహార నాళము బిగుసుకుపోయి మ్రింగ లేక పోవుట) సమస్యకు చికిత్సా నిపుణులు వైబ్రో చికిత్సను ఇవ్వడం జరుగుతోంది.
మూలవ్యాధి, ఫీకల్ ఇంకంటినెన్స్ ( మలము ఆపుకొనలేకపోవుట), ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ , గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ (అజీర్ణ సమస్యలు) 01001...Uruguay
రక్తం కారుతున్న మూలలు మరియు మలము ఆపుకొనలేకపోవుట వంటి సమస్యలతో గత పదిహేను ఏళ్లుగా బాధపడుతున్న ఒక 74 సంవత్సరాల వృద్ధుడు 2016 జూన్ 20 న చికిత్సా నిపుణులను సంప్రదించడం జరిగింది. రోగికి ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ మరియు గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వంటి అజీర్ణ సమస్యలు ఉన్నట్లుగా వైద్యులచేఒక నెల క్రితం నిర్ధారించబడింది.
ఈ రోగికి క్రింది మందులు ఇవ్వబడినాయి:
#1. CC3.2 Bleeding disorders + CC4.4 Constipation + CC4.6 Diarrhoea + CC4.10 Indigestion + CC12.1 Adult tonic…TDS
రోగి ఈ సమస్యకు ఇతర మందులను తీసుకోలేదు. జూన్ 27 రోగికి మూలవ్యాధి కారణంగా రక్తం కారటం సమస్య పూర్తిగా తగ్గిపోయింది. IBS (ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్) సమస్య 20% వరకు మెరుగుపడింది. అయితే మలము ఆపుకొనలేకపోవుట సమస్య లో మెరుగుదల ఏర్పడలేదు.
జులై 13 న క్రింది మందులు రోగికి ఇవ్వబడినాయి:
#2. CC4.2 Liver & Gallbladder tonic + CC4.8 Gastroenteritis + CC15.1 Mental & Emotional tonic + #1…TDS
చికిత్సా నిపుణులు రోగికి గుదము కండరాలను బలపరిచే వ్యాయామాల వివరాలను ఇచ్చి ప్రతిరోజు అనేక మార్లు ఆ వ్యాయామాలను చేయమని సలహా ఇచ్చారు. ఆగస్టు 19 న రోగికి మలము ఆపుకొనలేకపోవుట మరియు IBS సమస్యలో 90% మెరుగుదల ఏర్పడింది. రోగి #2 మందును TDS మోతాదులో తీసుకోవటం కొనసాగించారు. 2017 జనవరి 17న మందు యొక్క మోతాదు రెండు వారాలకు BDకి తగ్గించబడింది. జనవరి 31 న OD కి తగ్గించబడింది. అయితే, రోగికి రక్తం కారటం సమస్య తిరిగి ఏర్పడింది. మందు యొక్క మోతాదు తిరిగి BD కి పెంచటం జరిగింది. దీని తర్వాత రక్తం కారటం సమస్య తగ్గింది మరియు ఇతర రోగ లక్షణాలు కూడా తొలగిపోయాయి. రోగి ఇప్పుడు BD మోతాదులో మందును తీసుకుంటున్నారు.
అలెర్జిక్ రైనైటిస్ (నాసికయందలి మంట- వ్యాధి), అజీర్ణం మరియు ఆందోళన 01001...Uruguay
32 ఏళ్లగా అలెర్జిక్ రైనైటిస్ (శ్వాసకోశ సమస్య) మరియు అజీర్ణం, ఉబ్బిన ఉదరం, తలనొప్పి వంటి రోగ లక్షణాలతో బాధపడుతున్న ఒక 49 సంవత్సరాల మహిళ చికిత్సా నిపుణులను సంప్రదించడం జరిగింది. 2014 లో విడాకులు తీసుకున్న సమయం నుండి ఆమెకు ఆందోళన, భయం మరియు నీరసం వంటి మానసిక సమస్యలు ఏర్పడ్డాయి. ఓదార్పు కోసం ఆమెకు అమితముగా తినే అలవాటు ఉండేది.ఈ రోగ సమస్యల కొరకు ఆమె అంతకు ముందు ఏ విధమైన చికిత్సను తీసుకోలేదు. 2016 సెప్టెంబర్ 26 న రోగికి క్రింది మందులను ఇవ్వడం జరిగింది:
అజీర్ణం మరియు మానసిక సమస్యలు:
#1. CC4.1 Digestive tonic + CC4.2 Liver & Gallbladder tonic + CC4.10 Indigestion + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC15.3 Addictions + CC15.4 Eating disorders + CC18.1 Brain disabilities…TDS
అలెర్జిక్ రైనైటిస్ (శ్వాసకోశ సమస్య):
#2. CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC19.2 Respiratory allergies + CC19.5 Sinusitis...TDS
ఆపై రెండు నెలలకు రోగి చికిత్సా నిపుణులను సంప్రదించలేదు. డిసెంబర్ 10 న మందులను తిరిగి తీసుకునేందుకు చికిత్సా నిపుణులను సంప్రదించింది. క్రమం తప్పకుండా మందులను తీసుకోవడం కారణంగా ఆమె యొక్క ఆరోగ్యం మెరుగుపడింది. నవంబెర్ నుండి రోగి యొక్క అజీర్ణం మరియు శ్వాసకోశ సమస్యలలో 100% మెరుగుదల ఏర్పడింది. ఆమె యొక్క మనోస్థితిలో కూడా మెరుగుదల ఏర్పడి తలనొప్పి సమస్య తొలగిపోయింది. 2017 జనవరి 16న రోగి పూర్తిగా కోలుకున్నట్లుగా చికిత్సా నిపుణులకు తెలిపింది. దీని కారణంగా మందుల మోతాదు BD కి తగ్గించబడింది. ఫిబ్రవరి 7న ఆమె యొక్క ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడినట్లు తెలిపింది. అందువలన మందు యొక్క మోతాదు మరో నెల వరకు OD కి తగ్గించాలని నిర్ణయించబడింది.
కళ్ళు దురద మరియు మంట 01001...Uruguay
ఒక 57 ఏళ్ల మహిళకు నాలుగు సంవత్సరాల నుండి రెండు కళ్ళల్లోనూ దురద, మంట మరియు అలసట వంటి సమస్యలు ఉండేవి. ఆమె కంప్యూటర్ వద్ద ఎక్కువ సమయం గడపడం ఈ రోగ సమస్యలకు దారి తీశాయి. నాలుగు సంవత్సరాల నుండి ఆమె అల్లోపతి చికిత్స తీసుకుంటోంది. ఆమెకు ఆంటీ అలెర్జీ మందులు మరియు కంటి చుక్కలు ఇవ్వబడినాయి కానీ వాటి ద్వారా ఆమెకు ఉపశమనం కలుగలేదు.
2016 ఆగస్టు 8 న క్రింది మందులు రోగికి ఇవ్వబడినాయి:
#1. CC4.2 Liver & Gallbladder tonic + CC7.1 Eye tonic + CC7.3 Eye infections + CC7.6 Eye injury + CC15.1 Mental & Emotional tonic…TDS
ఆ మహిళ అల్లోపతి కంటి చుక్కలతో పాటు వైబ్రో మందును కూడా తీసుకునేది. ఆగస్టు 18 న రోగి యొక్క లక్షణాలలో 20% మెరుగుదల ఏర్పడింది. ఐదు వారాల తర్వాత 60% మెరుగుదల ఏర్పడింది. డిసెంబర్ 15 నాటికి రోగి యొక్క కంటి సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోయాయి. ఆమె అల్లోపతి మందులను తీసుకోవడం ఆపి వైబ్రో మందును TDS మోతాదులో తీసుకుంది. ఆమె కంప్యూటర్ పై తన పని ఇబ్బంది లేకుండా చేసుకోగలిగింది. 2016 డిసెంబర్ 29 న మందు యొక్క మోతాదు రెండు వారాలకు BD కి ఆపై రెండు వారాలకు OD, ఆ తర్వాత 2017 ఫిబ్రవరి 15 వరకు వారానికి మూడు సార్లు (3TW) కి తగ్గించబడింది. ఆమె యొక్క కంటి సమస్యలు తిరిగి కలగలేదు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా ఉంది.
అధిక శరీర వేడి 11577...India
ఒక నెల రోజులనుండి అధిక శరీర వేడితో బాధపడుతున్న ఒక 35 ఏళ్ల వ్యక్తి 2016 ఏప్రిల్ 4 న చికిత్సా నిపుణులను సంప్రదించటం జరిగింది. అతని ఉద్యోగ్యం రీత్యా మండే ఎండలో ఎక్కువగా ప్రయాణం చేస్తూ ఉండేవాడు. రోగికి వేడి కారణంగా కడుపులో నొప్పి, విరోచనాలు మరియు శరీరమంతయు భరించలేని మంట కలిగేవి. అతను తగినంత ద్రవాలు తీసుకున్నప్పటికీ అతనికి ఈ సమస్య నుండి ఉపశమనం కలుగలేదు. ఈ సమస్య కొరకు అతను ఏ విధమైన చికిత్సా తీసుకోలేదు.
రోగికి క్రింది మందులు ఇవ్వబడినాయి:
CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC21.3 Skin allergies...TDS
రెండు రోజులలో రోగి యొక్క శరీర వేడి పూర్తిగా తగ్గిపోయింది. నాలుగు వారాల తర్వాత చికిత్సా నిపుణులను తిరిగి సంప్రదించిన సమయంలో అతను రోగ లక్షణాలన్నీ తొలగి ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపాడు. ముందు జాగ్రత్తగా అతను ఎండా కాలం పూర్తయ్యే సమయం వరకు మందును TDS మోతాదులో తీసుకోవడం కొనసాగించాడు. ఆరోగ్యంగా ఉన్నట్లు అతను కొన్ని నెలల తర్వాత చికిత్సా నిపుణులకు తెలిపాడు.
చాతి పై గాయం 11578...India
చాతి పై నొప్పితో బాధపడుతున్న ఒక 9 ఏళ్ల పాపను చికిత్సా నిపుణుల వద్దకు తీసుకు రావడం జరిగింది. నాలుగు నెలల క్రితం పాఠశాల వద్ద ఒక బంతి తగిలి పాపకు చాతి పై గాయం ఏర్పడింది. పాపకు రొమ్ము వద్ద వాపు ఏర్పడి నొప్పి కలిగింది. పాపను వైద్యుడు వద్దకు తీసుకు వెళ్ళలేదు.
క్రింది మందులు పాపకు ఇవ్వబడినాయి:
CC3.1 Heart tonic + CC3.7 Circulation + CC10.1 Emergencies + CC12.2 Child tonic + CC20.2 SMJ pain + CC20.7 Fractures...QDS
ఒక వారం తర్వాత పాపకు వాపు పూర్తిగా తగ్గింది కానీ నొప్పి 50 % మాత్రమే తగ్గింది. మరొక వారం రోజులలో పాపకు నొప్పి పూర్తిగా తగ్గింది. ఆపై రెండు వారాల వరకు మందును BD మోతాదులో పాపకు కొనసాగించమని చెప్పబడింది. పాపకు పూర్తిగా తగ్గడంతో వైబ్రో మందు ఆపబడింది.
సంపాదకుని వ్యాఖ్యానము:
ఛాతీపై నొప్పి గాయం వల్ల కలిగింది కాబట్టి గుండెకు సంబంధించిన మందులను చేర్చే అవసరం లేదు.
మనసు క్రుంగుపాటు (క్లినికల్ డిప్రెషన్) 02799...UK
గత ఇరవై సంవత్సరాలుగా వైద్యపరమైన మనసు క్రుంగుపాటుతో బాధపడుతున్న ఒక 61 ఏళ్ల మహిళను వైద్యుడైన భర్త చికిత్సా నిపుణుల వద్దకు 2016 ఆగస్టు 6న తీసుకురావడం జరిగింది. స్నేహితుల ద్వారా వైబ్రియానిక్స్ చికిత్స గురించి తెలుసుకొని చివరి ఆశగా చికిత్సా నిపుణులను సంప్రదించడం జరిగింది. ఆమె భయస్తురాలని, ఇతరులతో సంభాషించడం ఆమెకు ఇబ్బందికరమని, OCD (ఒబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్) మరియు ఇతర మానసిక రుగ్మతలతో భాధపడుతోందని రోగి యొక్క భర్త వైబ్రో నిపుణులకు చెప్పారు. f trashcans on the roadside. నిజానికి వారి జీవితంలో కొద్దిపాటు ఆనందం కూడా ఉండేది కాదు. ఇతరుల వలె జీవితాన్ని సాధారణముగా గడపలేక పోయేవారు. ఒక సాధారణ మహిళగా కనపడే ఆమె భయస్తురాలని చికిత్సా నిపుణులు కనిపెట్టారు. అంతే కాకుండా తన మనస్థితి గురించి చర్చ జరిగే సమయంలో రోగికి అసౌకర్యం కలగడం వైబ్రో నిపుణులు గమనించారు.
రోగి క్రింది అల్లోపతి మందులను తీసుకునేది: క్రుంగుపాటు కు సిటాలోప్రాం 10 mg మరియు బైపోలార్ డిసార్డర్ కు ఉపయోగించే కేవెషియాపైన 200 mg . ఈ మందులను తీసుకునున్నప్పటికీ ఆమె యొక్క ఆరోగ్యం క్షీణించిందే కానీ మెరుగుపడలేదు.
రోగికి క్రింది మందులు ఇవ్వబడినాయి:
CC4.2 Liver & Gallbladder tonic + CC10.1 Emergencies + CC13.1 Kidney & Bladder tonic + CC15.1 Mental & Emotional tonic + CC15.2 Psychiatric disorders + CC17.3 Brain & Memory tonic + CC18.1 Brain disabilities...QDS
మూడు వారాల తర్వాత రోగి యొక్క మనస్థితిలో 25% మెరుగుదల కనబడినట్లు మరియు ఆమె కొంత ఆనందంగా ఉంటున్నట్లు భర్త తెలిపారు. అల్లపతి మందుల యొక్క దుష్ప్రభావాలను ఎరిగిన భర్త వాటి వాడకాన్ని తగ్గించాలని ఆశపడ్డారు. చికిత్సా నిపుణులు అల్లోపతి మందులను 10 % తగ్గించమని మరియు వై బ్రో మందును QDS మోతాదులో తీసుకోమని సలహా ఇచ్చారు
రెండు వారాల తర్వాత 50% మెరుగుదల ఏర్పడినట్లు తెలిసింది. భయం తొలగిపోవడంతో ఆమె కుటుంభ సభ్యులతో ఇబ్బంది లేకుండా ఆనందముగా కలిసి జీవించడం ప్రారంభించింది. అందువలన అల్లోపతి మందు యొక్క మోతాదు 20% తగ్గించబడింది.
రెండు వారాల తర్వాత 60 % మెరుగుదల ఏర్పడి అల్లోపతి మందుల యొక్క మోతాదు 25% తగ్గించబడింది. ఇంటిలో పనులు ఆనందముగా చేసుకోగలుగుతున్నట్లు ఆమె చికిత్సా నిపుణులకు తెలపడం జరిగింది. మరో రెండు వారాల తర్వాత ఆమెకు 70% ఉపశమనం కలిగడంతో అల్లోపతి మందుల యొక్క మోతాదు 50 % తగ్గించబడింది.
మూడు వారాల తర్వాత ఆమెకు 90% నయమైంది. ఆమె యొక్క ప్రవర్తన సాధారణ స్థితికికి చేరుకుంది. అల్లోపతి మందుల మోతాదు 75% కి తగ్గించడం జరిగింది. 2016 డిసెంబర్ 2న ఆమె 100% నయమైంది. ఇంత ఆనందాన్ని తాను ఎప్పుడు అనుభవించలేదని ఆ మహిళ తెలిపింది. పిరికితనం పూర్తిగా తొలగిపోయినట్లుగాను ఆమె తెలిపింది. డిసెంబర్ 16 న ఆమె అల్లోపతి మందులను పూర్తిగా ఆపినట్లు, ఇంక వాటిని వేసుకొనే అవసరం లేదన్న అద్భుతమైన వార్తను చికిత్సా నిపుణులకు ఎంతో ఆనందముతో తెలిపింది. అతి తక్కువ సమయంలో జరిగిన ఈ అద్భుతాన్ని చూసిన రోగి యొక్క భర్త ఎంతో సంబర పడ్డారు. వైబ్రో మందు ఆపై పదిహేను రోజులకు TDS మోతాదుకు తగ్గించబడింది. 2017 జనవరి నాటికి వైబ్రో మందును BD మోతాదులో మరో ఆరు నెలల వరకు తీసుకోవడం కొనసాగిస్తుంది.
చికిత్సా నిపుణుల యొక్క వ్యాఖ్యానము:
నేను ఎన్నో విజయవంతమైన కేసులను చొసి ఉన్నాను కానీ ఈ కేసు అతి తక్కువ సమయంలో అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ కేసులో రోగి యొక్క భర్త ఒక ముఖ్యమైన పాత్రను పోషించారు. రోగియైన భార్యకు మందులను శ్రద్ధ మరియు ప్రేమతో వేయడంతో ఆమెకు వేగంగా ఉపశమనం కలిగింది.
సంపాదకుడి వ్యాఖ్యానం:
అనిగియున్న కోపాన్ని తొలగించేందుకు లివర్ టానిక్ చేర్చబడింది మరియు భయాన్ని తొలగించేందుకు ఎమెర్జెన్సీ మరియు కిడ్నీ టానిక్ చేర్చబడింది.
దీర్ఘకాలిక దగ్గు మరియు ప్రయాణ వికారం 11570...India
బాల్యం నుండి దగ్గు సమస్యతో బాధపడుతున్న ఒక 15 సంవత్సరాల యువతి 2015 జులై 12న చికిత్సా నిపుణులను సంప్రదించింది. అంతకు ముందు అల్లోపతి మరియు హోమియోపతి చికిత్సలను తీసుకుంది కానీ ఉపశమనం కలగలేదు.రోగి యొక్క తండ్రికి ఇదే రోగ లక్షణం ఉండేది. అందువలన రోగికున్న దీర్ఘకాలిక దగ్గుకి కారణం పరిసరాలలో ఉండే అలెర్జిన్ల అయ్యుండవచ్చని లేక తండ్రి నుండి ఇన్ఫెక్షన్ రోగికి వచ్చి ఉండవచ్చని అనుమానించారు. ఆమెకు క్రింది మందులు ఇవ్వడం జరిగింది:
దీర్ఘకాలిక దగ్గు:
#1. CC9.2 Infections acute + CC10.1 Emergency + CC12.2 Child tonic + CC15.1 Mental & Emotional tonic + CC19.2 Respiratory allergies + CC19.3 Chest infections chronic + CC19.5 Sinusitis + CC19.7 Throat chronic…TDS
వైబ్రో మందును ప్రారంభించిన సమయంలో ఆమె ఇతర మందులను తీసుకోవడం లేదు. మూడు వారాల తర్వాత రోగికి 75% ఉపశమనం కలిగింది. దీర్ఘకాలిక సమస్య అయ్యుండడం వల్ల డిసెంబర్ 25 వరకు అదే మోతాదులో మందును తీసుకోవడం జరిగింది. డిసెంబర్ 25న రోగికి దగ్గు సమస్య పూర్తిగా తొలగి పోయింది. అందువలన మందు యొక్క మోతాదు రెండు వారాలకు BDకి తగ్గించడం జరిగింది. ఆ తర్వాత ఒక నెల వరకు OD మోతాదులో తీసుకొని 2016 ఫిబ్రవరి 10 న ఆపబడింది.
వికారం మరియు అస్వస్ధత కలిగే లక్షణం ఉంది. దీని కారణంగా ప్రయాణంలో ఆమె ఆహారం తీసుకునేందుకు భయపడేది. రోగికి క్రింది మందులు ఇవ్వబడినాయి:
ప్రయాణ వికారం
#2. CC10.1 Emergencies + CC15.1 Mental & Emotional tonic + CC17.1 Travel sickness
రోగికి మందును నీటిలో కలిపి ప్రయాణం సమయంలో ప్రతి 15 నిమిషాలకు ఒకసారి 5 ml తీసుకోమని చెప్పబడింది. రోగికి ప్రయాణం సమయంలో ఒక సారి మాత్రమే వికారం కలిగింది. తిరుగు ప్రయాణంలో ఆమెకు వికారం కలగలేదు. అందువలన ఆమె సాధారణంగా ఆహారాన్ని తీసుకోగలిగింది. ప్రయాణం చేసే ప్రతి సారి వైబ్రో మందును తీసుకోమని చికిత్సా నిపుణులు రోగికి సలహా ఇచ్చారు. ఈ విధంగా చేయడంతో ఆమెకు ప్రయాణ వికారం సమస్య పూర్తిగా తొలగిపోయింది. 2016 జూన్ లో ఆమె వైబ్రో మందును తీసుకోకుండా దూర ప్రయాణం చేసినప్పటికీ ఆమెకు వికారం కలగలేదు.
2016 డిసెంబర్ నాటికి ఆ యువతి ఏ విధమైన ఆరోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా జీవిస్తోంది.
అభ్యాసకుని వివరాలు 03535...USA
అభ్యాసకుడు 03535...USA కెమికల్ ఇంజనీరింగ్ లో పి హెచ్డీ చేసిన వీరు వృత్తిరీత్యా శాస్త్రవేత్త. తన చిన్నతనంలోనే స్వామి సన్నిధి చేరిన వీరు సాయి సంస్థ చేపట్టిన ఎన్నో వివిధ సేవా కార్యక్రమాలను ప్రత్యక్షంగా చూసారు. తన సాయి సంస్థలో చేపట్టే 3 విభాగాల సేవా కార్యక్రమాలన్నిట్లోనూ వీరు పాల్గొంటారు మరియు ప్రత్యేకించి వీరికి SSE బోధించడమంటే చాలా ఇష్టం.
స్వామి బోధనలు, సిద్ధాంతాలచే ప్రభావితులైన వీరికి సేవా చేయాలనే కోరిక బలంగా ఉండేది. మొదట వీరు అమెరికాలో వైద్య భీమా లేని వారికి ఉచిత వైద్య స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహించారు. అది అద్భుతంగా విజయవంతమైంది. కానీ వీరు వైద్య సహాయం కోరే వారికి ఇంకా చవకైన మెరుగైన రెమెడీలను ఇవ్వాలని భావించారు. సాయి విబ్రియోనిక్స్ వీరి ఆకాంక్షకు సరిగ్గా సరిపోయింది! వీరు మొదటగా విబ్రియోనిక్స్ గురించి తన సెంటర్లో 2015 మొదట్లో తన సహ సభ్యుడి ద్వారా తెలుసుకొన్నారు. విబ్రియోనిక్స్ యొక్క సత్తా గ్రహించి వీరు వెంటనే ట్రైనింగ్ కొరకు దరఖాస్తు పెట్టుకొన్నారు మరియు ట్రైనింగ్ పొందటానికి అర్హత సాధించి అక్టోబర్ 2015 లో ఏవీపి అయ్యారు. వీరు చాలా త్వరగా మే 2016 లో పూర్తి స్థాయి ప్రాక్టీషనరుగా మారి అక్టోబర్ 2016 లో సీనియర్ ప్రాక్టీషనర్ ఎష్వపి SVP అయ్యారు. స్వామి తన ప్రార్థనలను విబ్రియో సేవా చేసే భాగ్యం కల్పించడం ద్వారా నెరవేర్చారని వీరు భావిస్తారు.
ప్రాక్టీషనర్ అయిన వెంటనే వీరు ఒక సంవత్సర కాలంలో 91 రోగులకు వైద్యం చేసి స్వామి 91వ పుట్టిన రోజున సమర్పించాలని భావించారు. కానీ తాను అమెరికాలోని ఒక మారుమూల ప్రదేశంలో నివసిస్తుండడం వలన తాను అనుకొన్న లక్ష్యాన్ని చేరుకోగలనా అన్న చింత వీరికి మొదలైంది. అంతేకాకుండా అమెరికాలో ఇటువంటి వైద్య సహాయం కొరకు వచ్చే వారు మరియు తనకు తెలిసిన వారు చాలా తక్కువని వీరి భావించారు. కానీ హృదయపూర్వకమైన ప్రేమ మరియు దయతో వీరు ఇచ్చే వైద్యం చూసి అవసరం ఉన్న ఎంతో మంది రోగులు ఆకర్షితులయ్యారు. చాలా సుదూర ప్రాంతాల నుంచి వైద్యం కోసం వచ్చే వారు కానీ తాను అనుకున్న లక్ష్యం ఇంకా చాలా దూరంలో ఉంది. తన యొక్క ప్రార్థనలతో వీరు తన జన్మ స్థలమైన భారత దేశంలో ఎక్కువ మందికి వైద్య సేవా చేయడానికి వీరికి అవకాశం దొరికింది. సెప్టెంబర్ 2016లో తనకు దొరికిన రెండు వారముల సెలువు రోజులలో వీరు తన స్వస్థలంలో, స్థానిక సాయి సెంటర్ అధ్యక్షులకు మరియు చాలా మంది భక్తులకు విబ్రియోనిక్స్ వీడియోను మరియు సాయి విబ్రియోనిక్స్ యొక్క మొట్టమొదటి అంతర్జాతీయ కాన్ఫరెన్స్ పుస్తకమును చూపించారు. దేని ఫలితంగా సుమారు 20 మంది వైద్యము కొరకు రాగలరని వీరు భావించగా, అమితాశ్చర్యంగా అధిక సంఖ్యలో రోగులు వీరు ఇంటి వద్దనే నిర్వహించిన చిన్న మెడికల్ క్యాంపులకు వచ్చారు. ఆ విధంగా వీరు ఈ భారత దేశ యాత్రలో 140 మందికి పైగా వైద్య సేవ అందించారు.
ఈ ప్రాక్టీషనర్ భగవంతుని ఆశీర్వాదం వల్ల వివిధ రోగములైన అసిడిటీ, విరేచనాలు, ఆందోళన, కీళ్ల నొప్పులు, ఆస్తమా, రక్త పోటు, మధుమేహం, మూర్ఛ వ్యాధి, ఫ్లూ, ఫ్రోజెన్ షోల్డర్, గౌట్, అజీర్తి, మూత్ర పిండాల సమస్యలు, మైగ్రైన్, ప్యానిక్ అటాక్స్, సోరియాసిస్, సయాటికా, స్ట్రోక్, వణుకు మరియు అలీసిరేటివ్ కొలైటిస్ను నయం చేసారు. పైన చెప్పిన రోగములలో చాలా వాటికి చెప్పుకోదగ్గ మెరుగుదల కన్పించింది. వైద్య విద్యలో ఏ విధమైన పరిచయం మరియు అనుభవం లేకపోవడం వలన తాను కనీసం ఒక వ్యక్తికైనా వైద్యం చేయగలనని వీరు కలలో కూడా ఊహించలేదు. ఎంతో మంది యొక్క బాధ, కష్టాలను తీర్చడం వలన వీరు స్వామికి కృతజ్ఞతతో నిండిన ఆనందంతో పొంగిపోతున్నారు.
వీరి విబ్రియో సేవలో స్వస్థత పొందిన కొంత మంది రోగుల వివరాలు క్రింద చుడండి :
1. ఒకసారి ఏళ్ల బాలిక తల్లి ప్రగాఢ కృతజ్ఞతాభావముతో ఈ ప్రాక్టీషనర్ దగ్గరకు వచ్చింది. ఆవిడ కుమార్తె చిన్నతనం నుంచే తీవ్రమైన ఆస్తమా విద్యాదితో బాధ పడుతూ స్వస్థత కొరకు ఇన్హేలర్ ఉపయోగించేది. కానీ విబ్రియోనిక్స్ వైద్యం ప్రారంభమైన కొన్ని నెలలకే ఆ అమ్మాయికి ఇన్హేలర్ అవసరం లేకుండా ఆస్తమా అదుపులోకి వచ్చింది. ఇంతకుమునుపు ఆ అమ్మయికి వ్యాయామానికి కానీ ఆటలకి కానీ తగినంత శక్తి లేక నీరసంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి కరాటే సాధన చేస్తోంది.
2. 26 ఏళ్లగా అమీబిక్ డిసెంట్రీతో (రక్త విరేచనాలు) బాధ పడుతూ ఒక వ్యక్తి ఆ వ్యాధి వలన విపరీతమైన ఆహార నియంత్రణ పాటించవలసివస్తూ అనారోగ్యంగా ఉండేవారు. 3 నెలల విబ్రియోనిక్స్ వైద్యం తరువాత వారి వ్యాధి లక్షణాలన్నీ పోయి ఇప్పుడాయన ఏ ఇబ్బంది లేకుండా రెస్టారెంట్లో కూడా భోజనం చేయగలుగుతున్నారు.
3. చాల ఏళ్లగా ఒక మహిళా సంతాన లేమితో బాధ పడుతూ ఉండేవారు. అంతేకాక ఆమెకు 2013లో మరియు 2016లో గర్భస్రావం జరిగింది. రెండవ సారి గర్భస్రావం జరిగాక తీవ్రమైన బాధ మరియు నిరాశతో ఆమె ఇక తనకు సంతాన భాగ్యం కలగదని భావించారు. ప్రాక్టీషనర్ ఈ దంపతులకు పోస్టులో రేమేడీలను నవంబర్ 2016లో పంపించగా కేవలం రెండు నెలల తరువాత జనవరి 2017లో ఆమె గర్భం ధరించారు. ఆమె సంతోషానికి అవధులే లేవు.
4. మూడు సంవత్సరములపైగా సెరిబ్రల్ ఆటాక్సియాతో బాధ పడుతూ నడక మరియు మాటలో తీవ్రమైన ఇబ్బంది ఎదుర్కొంటున్న ఒక వ్యక్తి ఆరోగ్యం విబ్రియోనిక్స్ రెమెడీలు తీసుకొన్న రెండు నెలల తరువాత చెప్పుకోదగ్గ విధంగా మెరుగు పడింది.
5. విబ్రియోనిక్స్ వైద్యం మొదలు పెట్టాక చాల మంది డియాబెటిక్ రోగులలో అద్భుత మెరుగుదల కన్పించింది. చాల మంది యొక్క షుగర్ శాతం సాధారణ స్థాయికి చేరగా మరికొందరికి ఇన్సులిన్ అవసరం రాకుండా పోయింది.
6. విబ్రియోనిక్స్ రెమెడీలు ఉపయోగించడం వలన ఈ ప్రాక్టీషనర్ మరియు అతని మొత్తం కుటుంబం తమ యొక్క రోగ నిరోధక శక్తీ అత్యద్భుతంగా మెరుగుపడటం గమనించారు. అంతకుముందయితే వారికీ తరచుగా జలుబు మరియు ఫ్లూ వస్తుండేది. అందువల్ల మళ్ళీ మళ్ళీ అల్లోపతే మందులు వాడవలసి వచ్చేది. ఇప్పుడయితే అటువంటి రోగ లక్షణాలు విబ్రియోనిక్స్ రెమెడీలు తీసుకొన్న ఒక రోజులో లేదా కొన్ని గంటల్లో మాయమవుతున్నాయి.
SRHVP ఉపయోగించి ప్రసారణ (బ్రాడ్కాస్టింగ్) చేయడం వలన అద్భుతంగా నయమైన రెండు రోగ చరితాలను ప్రాక్టీషనర్ పంచుకుంటున్నారు.
1. SVP శిక్షణ వర్క్ షాప్ సమయమున తమ దూరపు బంధువు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్నట్లు తన భార్య ద్వారా తెలుసుకొన్నారు. అతను తన రక్త నాళములో ఏర్పడిన గడ్డ వలన స్టెంట్ చికిత్స తీసుకొని ఆ తర్వాత ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో అతనికి వెంటిలేటర్ అమర్చారు. అభ్యాసకుడు తాను శిక్షణ తీసుకొంటున్న సమయంలో రేమేడీలను రెండు రోజుల పాటు, ఆ తరువాత తన ఇంటినుంచే మరికొన్ని రోజుల పాటు ప్రసారణ చేసారు. రోగి యొక్క ఆరోగ్యం కుదుటపడి తనని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసారు. అతని బంధువులు అతని మీద ఆశ వదులుకొన్నారు, కానీ రోగి కోలుకోవడంతో ఇది కేవలం విబ్రియోనిక్స్ వలన సాధ్యమైన ఒక అద్భుత లీలగా వారు భావించారు.
2. ఈ మధ్యనే ప్రసారణ టీం ఈ అభ్యాసకుడికి మెదడులో కణితితో బాధ పడుతున్న ఒక 12 ఏళ్ల బాలుడి ప్రసారణ బాధ్యతను అప్పగించారు. ఇతను కొద్ది రోజులుగా ICU లో ఉన్నాడు మరియు ఆ కణితి ఇతని మెదడంతా వ్యాపించింది. తనకు వణుకు మరియు వాంతులు వచ్చే భావన ఉండేదని తల్లి చెప్పారు. తాను తన యొక్క పేరు కూడా చెప్పలేక పోయేవాడు మరియు తన కుటుంబాన్ని గుర్తు పట్టలేక పోయేవాడు. కేవలం వైద్యులు అడిగిన కొన్ని వాటికీ స్పందన చూపించేవాడు. ఈ అభ్యాసకుడు నిరంతరం ప్రసారణ చేయగా మరుసటి రోజుకే ఆ బాలుడు మాట్లాడగల్గాడు. అతను సాధారణ గదికి మార్చబడి రెండు రోజుల తరువాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయబడ్డాడు. ప్రసారణ కొనసాగించబడింది మరియు ఆ బాలుని ఆరోగ్యం చాల మెరుగు పడింది. ఒక రోజు ఆ బాలుని తల్లి, ఆ బాలుడు గింజలతో కార్డుపైన తయారు చేసినస్వామి చిత్రాన్ని, అందులో అభ్యాసకునికి ధన్యవాదములు తెలుపుతున్న సందేశాన్ని తీసుకొచ్చి అభ్యాసకునికి ఇచ్చారు. ఇది చాల అరుదైనది, ఉహించనిది మరియు ఈ అభ్యాసకునికి ఎంతో అపురూపమైనది ఎందుకంటే స్వచ్ఛమైన ప్రేమ మరియు కృతజ్ఞతా భావంతో ఒక బాలుడు సమర్పించిన అద్భుత కానుక ఇది.
రెమెడీలు తయారు చేసేటప్పుడు ఈ అభ్యాసకుడు ఎల్లపుడూ సాయి గాయత్రిని పఠిస్తారు. ఒక చేత్తో రెమెడీని ఉంచుకొని వీరు ధ్యాననిమగ్నులై ఒక హవర్ గ్లాసును ఉహించుకొని దాని పై భాగమున స్వామి ఉన్నట్లు మరియు తన స్వస్థతా తరంగములను శక్తిని క్రిందనున్న పిల్స్ పై ప్రసరిస్తున్నట్లు ఉహించుకొంటారు. రోగులందరిని నయం చేసేది కేవలం స్వామి మాత్రమే అని వీరు భావిస్తారు అందువలన స్వామికి శరణాగతి అవ్వడం ద్వారా వారి యొక్క వినమ్ర పనిముట్టుగా మారడానికి వీరు ప్రయత్నిస్తారు. విబ్రియోనిక్స్ సేవ తన యొక్క వ్యక్తిత్వంలో మరింత వినమ్రత, ప్రేమ, సంరక్షణ, దయ, విశ్వాసం, జాగరూకత, క్రమ శిక్షణ, మరియు స్వామి పై భక్తి తీసుకొచ్చిందని వీరు నమ్ముతారు.
వీరు విబ్రియోనిక్స్ సేవ ఉన్నతిని, సత్ఫలితాన్ని అందించే ఒక సమర్ధవంతమైన ఆధ్యాత్మిక సేవని గుర్తించారు. విబ్రియోనిక్స్ వైద్యం వలన రోగములు, బాధల నుండి విముక్తి పొంది చిరునవ్వులు చిందిస్తున్న వ్యక్తులను గుర్తు తెచ్చుకొన్నపుడు వీరు ఏంటో సంతృప్తిని ఆనందాన్ని పొందుతారు. ఈయన దృష్టిలో వృత్తిపరమైన లేదా సంపాదనపరంగా సాధించే అభివృద్ధికన్నా ఇది ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని ఇస్తుంది.
పంచుకుంటున్న రోగ చరితలు:
అభ్యాసకురాలి వివరాలు 01001...Uruguay
అభ్యాసకురాలు 01001… యురుగ్వే దక్షిణ అమెరికాలోని యురుగ్వే దేశానికీ చెందిన ఈమెకు చిన్నతనం నుంచే భగవంతునిపై ప్రగాఢ విశ్వాసం, ప్రేమ ఉండేది. తనకు అయిదు సంవత్సరముల వయసులో ఒకసారి మేరీ మాత యొక్క సుందరమైన దర్శనం కలిగింది. కానీ తన యొక్క ఆధ్యాత్మిక యాత్ర మాత్రం 21 ఏళ్ల వయసులో ప్రారంభమైంది మరియు రెండు సంవత్సరాల తరువాత తన యోగా టీచర్ ద్వారా సాయి బాబా గురించి ఆవిడ విన్నారు. వెంటనే తనకు ముక్తిమార్గానికి సహాయం చేయగల దివ్యమైన టీచర్ బాబా అని ఆవిడకు అనిపించింది. ఆరు సంవత్సరాల తరువాత డిసెంబర్ 2009 ఈమె ప్రశాంతి నిలయానికి వచ్చారు. ఆ సమయంలో ఆమె జీవితం అల్లకల్లోలంగా ఉంది. తాను తన ప్రేమికుడితో సంబంధం తెంచుకొనే దశలో ఉంది మరియు తాను ఇంకా ఇద్దరు భాగస్వాములతో కలిసి నిర్వహిస్తున్న మరియు తాను పని చేస్తున్న రెస్టారెంట్ మూసివేయబడుతోంది. ఇటువంటి దిక్కు తోచని స్థితిలో ఈమె దర్శన సమయమున బాబాను మార్గము చూపించమని హృదయపూర్వకంగా అడిగింది.
దర్శనం అయిన వెంటనే, తాను ప్రయాణించిన గ్రూపులోని యురుగ్వేకి చెందిన ఫ్రెండ్ ఈమెను అర్జెంటీనాకి చెందిన ఒక మహిళకు ఒక స్వస్థతా కార్యక్రమానికి సంబంధించి అనువాదంలో సహాయం చేయాల్సిందింగా కోరారు. ఈమె ఒప్పుకొని అ గదిలో ప్రవేశించగానే విబ్రియోనిక్స్ సేవ చేస్తున్న డా. అగర్వాల్ మరియు వారి సతీమణి హెమ్ అగర్వాల్ ను చూసారు. ఆవిడకు తాను జీవితంలో ఎప్పుడోకప్పుడు చేయాల్సిన పని ఇదేనని చాలా గాఢంగా బలంగా అనిపించింది. తన యొక్క హృదయపూర్వక ప్రార్థనకు బాబా అత్యద్భుతంగా స్పందించారు. కానీ సమయం సరిపోనందున ఆ సందర్శన లో ఆవిడ ట్రైనింగ్ తీసుకొనలేకపోయారు. కానీ విబ్రియోనిక్స్ పట్ల ఈమెకున్న ఆసక్తి ప్రేమ ఎంత బలమైనదంటే, అనువాదంలో సహాయం చేయడానికి, విబ్రియోనిక్స్ సేవలో ఒక భాగంగా ఉండటానికి, సేవ చేయడంలోని ఆనందాన్ని పొందటానికి, ప్రతి రోజు ఈమె వారి దగ్గరకు వచ్చేవారు.
డిసెంబర్ 2011లో ఈమె ప్రశాంతి నిలయానికి తిరిగి వచ్చి మరొక సారి విబ్రియో శిక్షణ కొరకు దరఖాస్తు చేసుకొన్నారు, కానీ ఈమె దరఖాస్తు తిరస్కరించబడింది ఎందుకంటే ఈమె అక్యూప్రెస్సుర్ థెరపిస్టుగా వృత్తి నిర్వహిస్తున్నారు. కానీ తనకు ప్రియమైన విబ్రియోనిక్స్ లో శిక్షణ కోసం వేచి చూస్తున్నారు. ఇంతలో అక్యూప్రెస్సుర్ మీద పని చేస్తూనే ఒక అద్భుత వ్యక్తిని కలుసుకున్నారు మరియు వారికీ 2013లో ఒక అందమైన పుత్రుడు జన్మించాడు.
ఈమెకు 5 ఏళ్లగా చికిత్స అందిస్తున్న యురుగ్వేకి చెందిన ఒక పెద్ద వయసు అభ్యాసకురాలు, నవంబర్ 2015లో తన యొక్క విబ్రియో యంత్రం పుస్తకాలూ మొదలైనవి ఈమెకు ఇవ్వాల్సిందిగా పెండ్యులం ద్వారా మార్గదర్సత్వం పొందారు. ఆవిడ డా. అగర్వాల్ గారిని వెంటనే సంప్రదించారు! అయన ఈమెకు దరఖాస్తు పత్రం పంపించారు. అప్పుడు ఈమె అక్యూప్రెస్సుర్ కొనసాగించడమే లేదా తన హృదయం యొక్క పిలుపు అనగా విబ్రియోనిక్స్ ను ఎంచుకోవడమా అనేది నిర్ణయించవల్సి వచ్చింది. ఈమె దీని గురించే ఆలోచిస్తుండగా ఒక రాత్రి బాబా వారు స్వప్నంలో కనపడి విబ్రియోనిక్స్ ద్వారా సేవ చేయడమే ఈమె యొక్క జీవిత లక్ష్యమని స్పష్టంగా చూపించారు. వెంటనే ఈమె ఏ విధమైన సంశయం లేకుండా తాను అక్యూప్రెస్సుర్ ను వదిలివేయాలని నిశ్చయించారు. అ తరువాత అభ్యాసకురాలైన అ పెద్దావిడ నుంచి ఈమె యంత్రాన్ని, ఇతర సామాగ్రిని పొందారు. ఇది జరిగిన ఒక నెలలోపే అ పెద్దావిడ తనువు చాలించారు!
మన అభ్యాసకురాలు జూన్ 2016లో AVP కొరకు ఆన్లైన్ లో శిక్షణ పొందారు. ప్రాక్టికల్ వర్క్ షాప్ కొరకు ఈమె లండన్ వెళ్లారు మరియు రెమెడీలతో నిండిన 108 సీసీ పెట్టెను పొందారు. అప్పటి నుంచి ఈమె తనను ఒక పనిముట్టుగా ఎంచుకొన్నందుకు భగవంతునికి హృదయపూర్వకమైన కృతజ్ఞతాభావంతో పనిచేస్తూనే ఉన్నారు. ఈమె చాలా చక్కని గ్రాహకురాలు మరియు తాను ఒక బిడ్డకి తల్లయినప్పటికీ, విబ్రియోనిక్స్ సేవ కోసం ఎంతో సమయాన్ని వెచ్చిస్తూ, చాలా కష్టపడి పనిచేస్తారు. ఆరు నెలల స్వల్ప వ్యవధిలోనే కీల నొప్పులు, చర్మ వ్యాధులు, జీర్ణ కోసం సమస్యలు, గుండె సమస్యలు మరియు మానసిక వ్యాధులు మొదలైన అనేక రోగములకు 70కి పైగా రోగులకు వైద్య సేవ అందించారు.
ఇంకొక అద్భుతంగా నయమైన వ్యాధుల వివరాలు. 78 ఏళ్ల ఒక వృద్ధుడు మూత్ర నాలం ఇన్ఫెక్షన్ వల్ల జ్వరం మరియు తరచూ మూత్రం రావడం వంటి సమస్యతో బాధ పడేవాడు. అతను ఆంటిబయోటిక్స్ వెంటనే తీసుకొన్నారు. 10 రోజులైనా కానీ అతని రోగ లక్షణాలు తగ్గకపోవడంతో అభ్యాసకురాలు అతనికి విబ్రియో రెమెడీలు ఇచ్చారు. కేవలం 24 గంటల్లో అతని రోగ లక్షణాలన్నీ పోయి అతను మాములు మనిషయ్యాడు.
31 ఏళ్ల ఒక వైద్యురాలు గత 5 నెలలుగా పొత్తి కడుపులో నిరంతర నొప్పి, మలబద్దకం కొంతకాలం అటుపిమ్మట విరేచేనాలు కొంతకాలం సమస్యతో బాధపడేది. ఇదంతా ఇంటిలో ఒక భావోద్వేగ సమస్యతో మొదలైంది. ఒక వైద్యురాలిగా ఆమె ఇది సిలియాక్ వ్యాధిగా భావించారు. కానీ అల్లోపతి మందులు తీసుకోకూడదని అనుకొన్నారు. విబ్రియో రెమెడీలు తీసుకొన్న 10 రోజులలో ఆమె ఆరోగ్యం 80 శాతం మెరుగైంది మరియు ఇంకొక రెండు వారాలలో ఆవిడ పూర్తి ఆరోగ్యవంతురాలయ్యారు.
ఈమె దగ్గర ఇటువంటి మరెన్నో అద్భుతంగా నయమైన రోగములు వివరాలు చాలా ఉన్నాయి మరియు ఆమె వైద్యం చేసిన చాలా రోగ చరితలు ప్రచురించబడ్డాయి కూడా. ఆమె యొక్క రోగులు చాలా మంది దేవుని యొక్క అనుగ్రహంతో పరిపూర్ణ స్వస్థత పొందారు.
పంచుకుంటున్న రోగ చరితలు:
- మొలలు, ఆపుకోలేని మలవిసర్జన, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్, గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్
- ఎలర్జిక్ రైనైటిస్, అజీర్తి, ఆందోళన, మైండ్ ఫుల్నెస్
- కన్నులు - దురద, మంట
అభ్యాసకుల వివరాలు 11577...India
అభ్యాసకులు 11577 & 11578… భారత దేశం 2016 మార్చ్ నుంచి పుట్టపర్తి మరియు పరిసర ప్రాంతాలలో విబ్రియోనిక్స్ సేవ చేస్తున్నారు. భర్త రసాయన శాస్త్రంలో పిహెచ్ది చేయగా, భార్య మానవ అభివృద్ధి మరియు కుటుంబ వ్యవహారాల్లో ఎమ్మెస్సీ చేసారు మరియు టెక్నికల్ కమ్యూనికేషన్ లో కూడా ఎమ్మెస్సీ చేసారు.
మొదటగా 2015లో భార్య ఒక కుటుంబ మిత్రుని ద్వారా విబ్రియోనిక్స్ గురించి తెలుసుకొన్నారు. వెంటనే ఆమెలో దీని మీద విపరీతమైన ఆసక్తి మొదలైంది. తాను ఒక చక్కని ప్రియమైన బాల వికాస్ ఉపాధ్యాయురాలు కావడంతో పుట్టపర్తి మరియు పరిసర ప్రాంత పల్లెలోని పిల్లలు తరగతిలో తమ ఆరోగ్య సమస్యలను ఆమెతో చెప్పేవారు. ఈ విద్యార్థుల ఆరోగ్య సమస్యలు తీర్చడానికి విబ్రియోనిక్స్ ఒక దివ్యమైన సాధనంగా ఆమె భావించి దానిని అభ్యసించి సేవ చేయాలని గట్టిగా సంకల్పించారు. ఈమె భర్త విబ్రియోనిక్స్ గురించి 9 ఏళ్ల మునుపే విన్నప్పటికి ఈమె కోర్సు కోసం చదవడం ప్రారంభించిన తరువాతే ఆసక్తి కనపర్చారు. వివిధ రకాల వ్యాధులను నయం చేయడంలో విబ్రియోనిక్స్ రెమెడీలు అత్యంత సమర్ధవంతమైనవని మరియు వాటిలో ఎటువంటి రసాయనాలు లేకపోవడం వలన అవి ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేక పూర్తిగా సురక్షితమైనవని గ్రహించి వీరు మంత్ర ముగ్దులయ్యారు.
ఇద్దరూ ఈ-కోర్సు తీసుకొని 4 రోజుల ప్రాక్టికల్ శిక్షణ వర్క్ షాప్ లో పాల్గొని అసోసియేట్ ప్రాక్టీషనర్లు అయ్యారు. కేవలం అయిదు నెలల తరువాత అన్ని అర్హతలు పొందిన తరువాత ఆగష్టు 2016లో వీరు పూర్తి స్థాయి విబ్రియోనిక్స్ ప్రాక్టీషనర్లు గా పదోన్నతి పొందారు.
భగవంతుని దీవెనలతో వీరు ఏప్రిల్ 2016 నుంచి సమీప గ్రామమైన ఎనుముల పల్లెలో విబ్రియోనిక్స్ వైద్య శిబిరాలు వారానికి రెండు సార్లు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు వీరు చక్కటి ఫలితాలతో జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పి, వడ దెబ్బ (సన్ స్ట్రోక్) మరియు విరేచనాలు వంటి వివిధ తీక్షణ (అక్యూట్) రోగములతో బాధ పడుతున్న 500 మంది పైగా రోగులకు వైద్య సహాయం అందించారు. అంతే కాకుండా దీర్ఘ కాల రోగములైన మైగ్రైన్, వెన్ను నొప్పి, మూత్ర పిండాల ఇన్ఫెక్షన్, ఆస్తమా, కన్ను మరియు చెవికి ఇన్ఫెక్షన్, కీళ్ల నొప్పి, క్రమబద్దత లేని నెలసరి, చర్మ అలెర్జీలు, తిండి సంబంధిత వ్యాధులు మరియు ఆపుకోలేని మల లేదా మూత్ర విసర్జనకు కూడా వీరు చికిత్స అందించారు.
తమ ప్రాక్టీస్ యొక్క మొదటి దశలో వీరు మెంటర్లు మరియు సీనియర్ ప్రాక్టీషనర్ల సలహాలు సూచనలు తీసుకొన్నారు. ఇది వివిధ రోగములను అర్ధం చేసుకోవడానికి మరియు తగిన పరిష్కార రెమెడీలు ఇవ్వడానికి వీరికి ఎంతో ఉపయోగపడింది. వీరు రోగము యొక్క మూల కారణం కనుగొనడానికి రోగులను తగు రీతిగా విచారించడం వలన ముఖ్యంగా గతంలో లేదా ప్రస్తుతంలో భావోద్వేగ సమస్యలున్న రోగులను, క్రమక్రమంగా రోగులకు తమ మీద నమ్మకం , విశ్వాసం బాగా బలపడిందని గ్రహించారు.
ఈ దంపతులు విబ్రియోనిక్స్ రెమెడీల సామర్థ్యం స్వయానా తమ యొక్క ఆరోగ్యం ఎంతో మెరుగవడం, తద్వారా అల్లోపతి మందులు వాడే అవసరం రాకపోవడంతో గ్రహించారు. ఈ విషయమై వారు ఎంతో సంతోషపడతారు. భర్త తనకు గత్ మూడున్నర ఏళ్లుగా గల నట్ అలెర్జీని వదిలించుకున్నారు. కేవలం 2 నెలలు పాటు విబ్రియో రెమెడీలు తీసుకోగానే తనకు నట్ ఎలర్జీ పోవడం, తనకు ఇష్టమైన అన్ని రకాల నట్స్ను సంతోషంగా తినగల్గడంతో ఈయన ఎంతో విస్మయం చెందారు. అంతకు మునుపు ఈ సమస్య కొరకు ఆయుర్వేదిక్ మందులు 6 నెలల పాటు, హోమియోపతిక్ మందులు ఒక సంవత్సరం పాటు వాడారు. కానీ మెరుగైన ఫలితం కనబడలేదు. వీరి భార్య కూడా తనకు ఏదైనా తీక్షణ సమస్య వస్తే విబ్రియో మందులనే వాడతారు.
తమకు ఎంతో సంతృప్తిని ఆరోగ్యాన్ని సంతోషాన్ని ప్రసాదిస్తున్న ఈ విబ్రియోనిక్స్ ను ప్రాక్టీస్ చేస్తున్నందుకు తాము భగవంతునిచే దీవించబడ్డామని వీరు భావిస్తారు. అంతేకాకుండా తమ రోగుల యొక్క ఆరోగ్యం మెరుగుపడి వారు స్వస్థత పొందడం చూసినప్పుడు తమకు లభించే మానసిక సంతృప్తి ఆనందానికి వీరు ఎంతో విలువనిస్తారు. వీరు సీనియర్ విబ్రియోనిక్స్ ప్రాక్టీషనర్ అవుటకు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే దానివలన తాము ఇంకా ఎక్కువ సేవ చేయ గల్గుతారు మరియు దివ్యమైన లక్ష్యంతో పనిచేస్తూ భగవంతునిచే దీవించబడిన సాయి విబ్రియోనిక్స్ ను ఇంకా ఉన్నత స్థితికి తీసుకెళ్లగలరు.
ప్రస్తుతం వీరిరువురు విబ్రియో పరిపాలనా పనులలో కూడా పాల్గొంటున్నారు. భార్య వార్తా లేఖనాలు సవరించే టీం తో కలసి పనిచేస్తున్నారు. భర్త ప్రాక్టీషనర్లు ను కదిలించి సమన్వయ పరచి పుట్టపర్తి మరియు విట్ ఫీల్డ్ ప్రాంతాలలో ఉన్న సత్య సాయి హాస్పిటల్స్ లో సాయి విబ్రియోనిక్స్ సేవను ప్రారంభించే పనులను చూసుకుంటున్నారు.
ఎంతో తియ్యగా పాజిటివ్ గా సాగుతోన్న ఈ శక్తివంతమైన యువ దంపతుల విబ్రియోనిక్స్ యాత్ర ఇతర యువ ప్రాక్టీషనర్లకు ఒక ఉత్తేజకరమైన ఉదాహరణ అనడంలో ఎటువంటి సందేహం లేదు.
పంచుకుంటున్న రోగ చరితలు:
- అతి శరీర ఉష్ణోగ్రత
- రొమ్ము గాయం
ప్రశ్న జవాబులు
1. ప్రశ్న: 200 ml నీటిలో ఐదు గోలీలను కలిపి తయారు చేయబడిన మందును TDS లేక తక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు మందు పాసిపోతోంది. దీనికి పరిష్కారం ఉందా?
జవాబు: వాతావరణం మరియు పర్యావరణ పరిస్థితులను బట్టి నీరు మూడు నుండి ఏడు రోజుల్లో పాసిపోయే అవకాశం ఉంది. ఈ కారణంగా, 100 ml నీటిలో మూడు గోలీలను కలిపి మూత కప్పబడిన ఒక పాత్రలో ఉంచటం మంచిది. స్వచ్ఛమైన నీరు మరి కొంత కాలం నిలవు ఉంటుంది. వైబ్రో నీటిని ఒక నిమిషం వరకు నాలుక క్రింద ఉంచుకొని మింగవలెను.
________________________________________
2. ప్రశ్న: మందును తీసుకునే ముందు వైబ్రో గోలీలు లేదా నీరు ఉన్న సీసాను కదిలించడం (షేక్ చేయడం) ద్వారా మందు యొక్క శక్తి మరింత పెరుగుతుందా?
జవాబు: అవును. సీసాను కదిలించడం ద్వారా అంతర్లీనమైన శక్తి మేలుకొలుపబడుతుంది. అయితే, సీసాను జోరుగా కదిలించరాదు. జోరుగా కదిలిస్తే మందు యొక్క శక్తి మారిపోయే అవకాశం ఉంటుంది.
________________________________________
3. ప్రశ్న: కంటి చుక్కలు (ఐ డ్రాప్స్) లేదా నేసల్ డ్రాప్స్ ను తయారు చేసేందుకు కుళాయి త్రాగు నీటిని ఉపయోగించవచ్చునా? నేను గత నాలుగు వారాలుగా వీటి తయారీ కొరకు డిస్టిల్డ్ నీటిని మాత్రమే ఉపయోగించడం జరిగింది. డిస్టిల్డ్ నీరు ఉపయోగించటం ద్వారా కాటరాక్ట్ కేసులలో మరిన్ని సఫలితాలు లభిస్తున్నాయని తెలుసుకున్నాను.
జవాబు: డిస్టిల్డ్ నీటిని ఉపయోగించటం మంచిది. సీసాలలో లభించే స్వచ్ఛమైన నీటిని ఉపయోగించడం కూడా మంచిది అయితే, ఇటువంటి నీరు కేవలం ఒక వారం రోజులు మాత్రమే నిలవు ఉంటుంది. కుళాయి నీటిని ఉపయోగొంచడం మంచిది కాదు. ముఖ్యంగా కంటి చుక్కల తయారికి కుళాయి నీటిని ఉపయోగొంచడం వల్ల కళ్ళు మండే అవకాశం ఉంది. ఇరవై నిమిషాలు మరిగించి చల్లార్చ బడిన కుళాయి నీటిని కంటి చుక్కల తయారికి ఉపయోగించవచ్చు.
________________________________________
4. ప్రశ్న: రోగి 100% నయం అయ్యాక మందు యొక్క మోతాదును నేరుగా TDS నుండి OW కి తగ్గించవచ్చా?
జవాబు: లేదు. మందు యొక్క మోతాదును నేరుగా TDS నుండి OW కి తగ్గించరాదు. రోగ లక్షణాలు తిరిగి కలగకుండా ఉండేందుకు మోతాదును క్రమక్రముగా తగ్గించడం మంచిది. TDS నుండి OD కి, ఆపై 3TW కి, ఆపై 2TW కి, చివరిగా OW కి మెల్లగా తగ్గించడం మంచిది. దీర్ఘకాలిక వ్యాధులున్న కేసులలో ఇదే విధముగా మోతాదును తగ్గించవలెను. అయితే అక్యూట్ కేసులలో TDS నుండి OD కి తగ్గించి, కొన్ని రోజుల తర్వాత ఆపవచ్చు.
________________________________________
5. ప్రశ్న: మేము వీపు నొప్పి మరియు కండరాల నొప్పితో బాధపడుతున్న రోగులకు చికిత్సను ఇవ్వడం జరుగుతోంది. ఉపశమనం కలగడంతో రోగులు ఆనందంగా ఉన్నారు. నొప్పి పూర్తిగా తగ్గినప్పటికీ, OD మోతాదులో మందును కొనసాగించాలని పట్టుబడుతున్నారు. ఇది సరియైన పద్ధతేనా?
జవాబు: వృద్ధావస్థలో ఉన్న రోగులు మందును OD మోతాదులో కొనసాగించవచ్చును. చిన్న వయసు గల రోగులకు మందు యొక్క మోతాదును క్రమక్రమముగా OW కి తగ్గించడం మంచిది.
________________________________________
6. ప్రశ్న: మొదటి రకమైన పుల్ అవుట్ కారణంగా రోగ లక్షణాలు తీవ్రమైన సందర్భంలో రోగి ఉపశమనం కొరకు అల్లోపతి మందును తీసుకోవడం మంచిదా?
జవాబు: అవును, మంచిదే. అల్లోపతి మందులు వైబ్రో మందులకు అనుకూలంగా పనిచేస్తాయి. వైబ్రో మందులు సూక్ష్మ స్థాయిలోను మరియు అల్లోలపతి మందులు శారీరిక స్థాయిలో ను పని చేస్తాయి.
________________________________________
7. ప్రశ్న: అక్యూట్ రోగ లక్షణాలు ఉన్న కేసులలో, వైబ్రో మందును ప్రారంభించిన వెంటనే రోగ లక్షణములు తీవ్రమవ్వటం పుల్ అవుట్ ను సూచిస్తుందా?
జవాబు: సాధారణంగా అక్యూట్ రోగ కేసులలో పుల్ అవుట్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. అక్యూట్ రోగ లక్షణాలు శరీరంలో ప్రవేశ పెట్టిన వెంటనే రోగ లక్షణాలు చికిత్స చేయని సందర్భంలో తీవ్రమైపోతాయి. తగిన వైబ్రో మందును ఇచ్చినప్పటికీ, వైబ్రో మందు పని చేసేందుకు కొంత సమయం పట్టడం కారణంగా లక్షణాలు తీవ్రమవుతాయి. ఖచ్చితంగా దీనికి కారణం పుల్ అవుట్ కాదు.
________________________________________
8. ప్రశ్న: మయాసం మందును తీసుకుంటున్న సమయంలో మరొక వైబ్రో మందును ఇవ్వవచ్చునా?
జవాబు: దీర్గకాలిక సమస్యలకు మయాసం తీసుకుంటున్న సమయంలో, మయాసం తీసుకునే మూడు రోజులు ముందు మరియు తీసుకున్న మూడు రోజులు తర్వాత వరకు మరొక వైబ్రో మందును ఇవ్వ రాదు. అక్యూట్ వ్యాధులకు చికిత్సను అందించే సమయంలో మయాసం ను ఇవ్వరాదు.
________________________________________
9. ప్రశ్న: న వద్దనున్న 108CC పెట్టెను రెండేళ్లకు ఒకసారి ప్రశాంతి నిలయం లో ఉన్న మాస్టర్ పెట్టెతో రీచార్జ్ చేయవలెనని నేను ఎరుగుదును. రెండేళ్ల సమయం ధాటి పోయిన తర్వాత, నేను పర్తికి ప్రయాణించడం వీలుకాని సందర్భంలో సాయి రామ్ హీలింగ్ వైబ్రేషన్ మశీనును ఉపయోగించి 108 మిశ్రమాలను తయారు చేసుకోవచ్చునా?
జవాబు: సాయిరాం పొటెంటైజర్ ఉన్న చికిత్సా నిపుణులు 108 కాంబోలను (మిశ్రమాలను) తాము తయారు చేసుకోవచ్చును. అయితే, ప్రతియొక్క మిశ్రమంలోను అతిముఖ్యమైన మరియు ఉన్నతమైన అంశం ఒకటి చేర్చబడియుంది- అదియే భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి యొక్క దివ్య శక్తి. మొట్ట మొదట 108 మిశ్రమాల తయారు చేసిన సమయంలో భగవాన్ మిశ్రమాల పెట్టెను దీవించటం జరిగింది. అప్పటినుండి ప్రశాంతి నిలయం లో ఉన్న మాస్టర్ పెట్టెలో ఉన్న మిశ్రమాలు క్రమం తప్పకుండా నవీకరించబడడము మరియు బాబా యొక్క శక్తివంతమైన శక్తి క్షేత్రములో తిరిగి ఎనెర్జయిస్ చేయబడడము జరుగుతున్నది. చికిత్సా నిపుణుల ద్వారా మాకు అందుతున్న అద్భుతమైన రీతిలో పూర్తిగా నయమైన లెక్కలేనన్న కేసులు దీనికి రుజువు. ప్రశాంతి నిలయానికి ప్రయాణం చేయలేని చికిత్సా నిపుణులు తమ మిశ్రమాల పెట్టె యొక్క రీచార్జ్ కొరకు తమ స్థానిక సమన్వయకర్తను సంప్రదించవలెను.
దివ్య వైద్యుడి యొక్క దివ్య వాక్కు
“చెడు ఆలోచనలు మరియు చెడు భావాలు మనసులోనే ఆవిర్భవిస్తాయి. అదే సమయంలో మనసులో మంచి ఆలోచనలు మరియు భావాలు కూడను కలుగుతాయి. మనసు నుండి చెడు ఆలోచనలు మరియు భావాలను తీసి వేసినప్పుడు మాత్రమే మానవునికి మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. అనేక వ్యాధులకు మూల కారణం మనసులో నిండియున్న ఆలోచనలే. చెడు ఆలోచనలు అజీర్ణం, గుండె సమస్యలు, రక్తపోటు సమస్యలు వంటి వ్యాధులను కలుగజేస్తాయి. మనో వ్యాధులకు ఆందోళన మరియు చింతలే మూల కారణములు. చక్కెర వ్యాధి మరియు పల్మనరీ వ్యాధులకు మూల కారణం మనసులో కలిగే ఆలోచనలే."
-సత్యసాయి బాబా, "దివ్యనామము యొక్క శక్తి" దివ్యోపన్యాసము, నవంబెర్ 25, 1998
http://www.sssbpt.info/ssspeaks/volume31/sss31-05.pdf
“దురదృష్టముచేత ఈ నాడు మన దేశములో సమాజ సేవను గురించి అనేక విధములుగా చర్చించడం జరుగుతున్నది. ఇటువంటి సేవలను 'సమాజ సేవ' అనటం కంటే 'పటాటోప సేవ' అని అనవచ్చు. అనేక రాజకీయ నేతలు సమాజ సేవ చేయాలని అంటూ ఉంటారు. ఒక చీపురు కట్టను తీసుకొని వీధులను శుభ్రపరుస్తున్నట్లుగా ఒక ఫోటోగ్రాఫర్ ను పిలిపించి ఫోటోలు తీయించుకొని వార్తాపత్రికల్లో ప్రచురింప చేసుకోవటంలో మాత్రమే శ్రద్ధ చూపిస్తున్నారు. ఇటువంటి ప్రచారాలు చేసుకోరాదు. ఇటువంటి అహంకారాన్ని పెంచుకోరాదు. సేవ అన్నది మనసు నుండి ఆవిర్భవించాలి.”
-సత్యేసాయి బాబా, "మానవ సేవయే మాధవ సేవ" సమ్మర్ షావెర్స్ ఇన్ బృందావన్,1973
http://www.sssbpt.info/summershowers/ss1973/ss1973-08.pdf
ప్రకటనలు
జరగనున్న శిక్షణా శిబిరాలు
ఇండియా పుట్టపర్తి: AVP వర్క్షాప్ (శిక్షణా శిబిరం) 2017 మార్చ్ 17 నుండి 21 వరకు. సంప్రదించవలసిన వ్యక్తి: లలిత at [email protected] లేదా ఫోను : 08555-288 377
పోలాండ్ రోక్లా: రాష్ట్రీయ రిఫ్రెషర్ సెమినార్ 2017 మార్చ్ 25 నుండి 26 వరకు సంప్రదించ వలసిన వ్యక్తి : [email protected]
ఫ్రాన్స్ దొర్డోగన్: రిఫ్రెషర్ సెమినార్ మరియు AVP వర్క్షాప్ 2017 జూన్ 3 నుండి 4 వరకు సంప్రదించవలసిన వ్యక్తి : దేనియెల్లీ : [email protected]
ఇండియా పుట్టపర్తి: AVP వర్కుషాప్ 2017 జులై 10 నుండి 14 వరకు. సంప్రదించవలసిన వ్యక్తి హెమ్ : [email protected]
అదనపు సమాచారం
ఆరోగ్య చిట్కాలు
నీరు మరియు ఆరోగ్యం భాగం-1 - నీరు యొక్క వింతలు, అద్భుతమైన విశేషాలు!
నీరును అర్ధం చేసుకోవడం అంటే ఈ బ్రహ్మాండాన్ని, ప్రకృతి యొక్క రమణీయతను మరియు జీవితాన్ని అర్ధం చేసుకోవడమే. ముందుగా మనం నీరును, అది ఏ విధంగా మన జీవితాన్ని ప్రభావితం చేస్తుందో తెలుసుకోవాలి. అతి సాధారణమైన, అత్యద్భుతమైన నీరును మన వేదాలు అత్యంత పవిత్రమైనదిగా కీర్తించాయి. శాస్త్రజ్ఞులు నీటి యొక్క అద్భుత గుణాలను ఆశ్చర్యంతో తెలుసుకుంటున్నారు. నీరు మన నిత్య జీవితంలో అంతర్భాగం. మనం ప్రతిరోజూ నీటిని చూస్తాం, త్రాగుతాం మరియు అనేకావసరాలకు వాడుతాము. మన జీవితానికి నీరు ముఖ్యంగా పరిశుద్ధమైన నీరు అత్యవసరం. నీరు లేకుండా మనం జీవించగలమా?
1. మన భూమిలో ఉన్నది ఎక్కువ శాతం నీరే
పంచభూతాలలో ఒకటి నీరు మన భూమి మీద ఉంది. మిగిలినవి మట్టి ఆకాశం అగ్ని మరియు వాయువు. భూమిలో శాతం ఉన్నది నీరే. అదే విధంగా పంచ భూతాలతో నిండి ఉన్న మన మానవ శరీరం లో శాతం నీరే. mokkalu మరియు jantuvulalo కూడా నీరు శాతం మించి ఉంటుంది. సమస్త జీవకోటిలో నీరే అత్యధిక శాతం ఉంటుంది.
2. దివ్య ఉపదేశం
"మనం త్రాగే నీరు మనకు జీవితాన్ని ప్రసాదిస్తోంది. అది శివునియొక్క శిరసు నుంచి ఆవిర్భవిస్తుంది - బాబా రిగ్వేదంలోని ఆపః సూక్తంలో నీరు ప్రాణం మరియు శక్తికి ముఖ్య ఆధారంగా కారణంగా కీర్తించబడింది నీరు ఔషధం. దానిని అత్యంత భక్తిశ్రద్దలతో మనల్ని సంరక్షించాలని ప్రార్థిస్తూ సేవించాలి. మనం త్రాగిన నీరులో ఎక్కువ శాతం మూత్రంగా విసర్జించబడుతుంది. కొద్దీ శాతం ప్రాణ శక్తిగా మారుతుంది. అందువలన మనం తినే ఆహరం త్రాగే నీరు మన యొక్క ప్రవర్తనను నిర్దేశిస్తుంది. మనం ఈ ఆహారాన్ని నీటిని పరిశుద్ధం గావించుకున్నపుడే దివ్యత్వాన్ని పొందగలము"...సత్య సాయి బాబా, quoted from Vision of Sai vol-2 by Rita Bruce, p234
3. నీటికి విలక్షణ లక్షణాలున్నాయి
నీరులో రెండు హైడ్రోజెన్ అణువులు ఒక ఆక్సీజన్ అణువుతో ముడిపడి ఉండడం వలన నీటికి విలక్షణ విద్యుత్ రసాయన లక్షణాలుంటాయని విజ్ఞాన శాస్త్రం చెబుతుంది. నీరు సహజంగానే ఘానా, ద్రవ మరియు వాయు రూపాలలో ఉండగలదు. ఇటువంటి విలక్షణ లక్షణాలు నీటికి లేకపోతె ఈ భూమి మీద జీవ కోటి మనుగడ సాగించలేవు. శరీరంలో అనేక లవణాలు, పదార్దాలు కరగడానికి మరియు శరీరంలో జరిగే చాలా జీవ రసాయన చర్యలకు నీరు ఎంతో అవసరం3.
4. నీటిలో స్పందన మరియు ప్రతిచర్య గుణములుంటాయి1,6-8
నీటిలో వివరాలు విషయాలు గుర్తుపెట్టుకొనే శక్తి ఉంటుంది. నీటిని శక్తివంతం చేయవచ్చు. అందువలన నీటికి స్వస్థత కలిగించే లక్షణముంది. నీరు ఆలోచనలకూ, మాటలకు, సంగీతానికి చక్కగా ప్రతిస్పందిస్తుంది మరియు తన యొక్క భౌతిక ఆకారాన్ని మార్చుకుంటుంది. కలుషితమైన నీటిని ప్రార్థన మరియు పాజిటివ్ విషువలిసెషన్ ద్వారా శుభ్రపర్చవచ్చు. నీరు యొక్క స్పటికాలపై జపాన్ శాస్త్రవేత్త, రచయిత, ఫోటోగ్రాఫర్ మసారు ఏమోటో 1990లో చేసిన పరిశోధన ద్వారా ఇది నిరూపించబడింది. అతను నీటిని వివిధ రకాల మాటలకు (మాట్లాడిన మరియు టైపు చేసిన ) బొమ్మలకు, వీడియోలకు, సంగీతానికి మరియు ప్రార్థనకి గురిచేసి తరువాత ఆ నీటిని తొందరగా శీతలీకరణ చేసి మైక్రోస్కోప్ ద్వారా ఆ నీటి యొక్క స్పటికాల ఆకృతిని పరీక్షించారు.
అతిశీతలమైన (ఫ్రోజెన్) కొళాయి నీరు లేదా నిల్వఉంచిన లేదా కలుషితమైన నీరు అసమానమైన స్పటికాలుగా మారినట్లు గుర్తించారు. కానీ వర్షపునీరు, పరిశుద్ధమైన నదులు, వాగులు, మంచు గడ్డల యొక్క నీరు, పవిత్ర పుణ్య తీర్థాల నుంచి సేకరించిన నీరు చక్కని అందమైన స్పటికాలకృతిని పొందినట్లు గమనించారు. అంతేకాకుండా శబ్ద, ఆలోచన, వ్రాతపూర్వకంగా పాజిటివ్ వైబ్రేషన్స్ కు గురైన నీరు చక్కని కనులవిందైన సమన స్పటికాకృతిని పొందగా , నెగటివ్ వైబ్రేషన్స్ కు గురైన నీరు చిందరవందరైన, విరిగిన ఆకారాలను పొందినట్లు ఆయన గమనించారు. ప్రొఫెసర్ ఎమోటో ఏమంటారంటే పాజిటివ్ మాటలు నీటిని ఆధ్యాత్మికతో నింపి ఆ నీటియొక్క అద్భుతమైన గుణాలు పూర్తిగా మనకు ఉపయోగపడే విదంగా చేస్తాయి. ప్రేమ మరియు కృతజ్ఞతా భావ తరంగాలకు గురైన నీరు అత్యంత అద్భుతమైన, ఘనమైన స్పటికాలుగా మారాయి. ఆలోచనలు నీటిని ఇంత మార్పుకు గురి చేసాయంటే, ఇంక ఆ ఆలోచనలు మన మీద ఎంత ప్రభావం చూపించగలవో ఆలోచించండి!
విజ్ఞాన ప్రపంచం ఆయన పరిశోధనలపై వివిధ రకాలుగా స్పందిస్తుంటే, నీరు యొక్క మహిమాన్విత, అద్భుత లక్షణాలు ఇతర శాస్త్రజ్ఞుల పరిశోధనలలో కూడా నిరూపించబడ్డాయి 9-11.
5. నీరు - దృశ్యపూర్వక జ్ఞాపక శక్తి గల ఒక ఒక ద్రవ కంప్యూటర్ !
నోబెల్ బహుమతి గ్రహీత 2014లో చేసిన వాటర్ మెమరీ అనే డాక్యుమెంటరీ లో నీటి యొక్క అద్భుత ఫోటోగ్యార్ఫిక్ మెమరీ గురించి మరియు ఏ విదంగా నీటి సమూహం ఒక కంప్యూటర్ మేమెరి కార్డు వలె వివరాలను నిక్షిప్తం చేసుకుని తనలో దాచుకొనగలోదో వివరించారు. నీరు యొక్క రసాయన కూర్పు కంటే దాని యొక్క అణువులాకృతి చాలా ముఖ్యమైనదిగా మనం గుర్తించాలి. నీరు కాలుష్యాన్ని, రసాయన దుర్వినియోగాన్ని, మన భావాలను, చివరికి మన ఇష్టాయిష్టాలను గుర్తుంచుకొంటుంది. ఎక్కడ ప్రజలు పరస్పర నిందారోపణలు చేసుకొంటారో అక్కడ నేరాలు ఎక్కువగా జరుగుతాయి. మనం నీటిని ఏవిధంగా చూస్తామో ఆ విధంగా నీరు స్వరూపం మారుతుంది. చర్చిలో ఇచ్చే పవిత్ర బాప్తిస్మల్ నీటిని లాబరేటరీ లో పరీక్షించినప్పుడు ఆ నీటికి శక్తివంతమైన స్తిరాకృతి ఉన్నట్లు గుర్తించారు. నీరు సంకేతాలను తీసుకొనగలదు మరియు ప్రసారం చేయగలదు. 10000 కి మీ దూరం నుంచైనా మనం నీటిని సూక్ష్మ శక్తులతో శక్తివంతం చేయవచ్చు.
నీరు యొక్క జ్ఞప్తి ఉంచుకునే (జ్ఞాపక శక్తి) స్వభావాన్ని, రెమెడీలను వరుసగా పలుచన చేయడం ద్వారా మరింత శక్తివంతం చేయుటకై హోమియోపతి లో ఉపయోగిస్తారు. ఎంతగా పలుచన చేస్తారంటే రెమెడీ లో అసలు ఆ పదార్థమే లేనంతగా. కేవలం ఆ పదార్థం యొక్క జ్ఞాపకం మాత్రం ఆ రెమెడీ లో ఉంటుంది అందువలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
6. నేల తేమ యొక్క గుర్తు11 - ఒక వినూత్న పరిశోధన
అమెరికా లోని నాసా వారు ఆకాశం భూమి మరియు సముద్రం నుంచి డేటా సేకరించి అవి మన భూమికి భావితరాల భవిష్యత్తుకు ఏ విధంగా ఉపయోగపడగలవో పరిశోధిస్తుంటారు. 2015 నుంచి మసచుసెట్స్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ (MIT), కేంబ్రిడ్జి మరియు నాసా వారు నేల తేమ యొక్క మెమరీ, నేల పై ఉన్న 5 సెంటీమీటర్ల మట్టిని విశ్లేషించడం ద్వారా పరిశోధిస్తున్నారు. వారి పరిశోధనలు భూమి యొక్క వాతావరణ మార్పులను విశ్లేషించడంలో మరియు వ్యవసాయ పంటల అభివృద్ధికి సహకరించగలవు.
7. నీరును గౌరవించండి
మన ఆరోగ్యం యొక్క కిటుకు నీటిని గౌరవించడంలోనే ఉంది. చెడు ఆలోచనలు మరియు చెడు భావాల ద్వారా మన శరీరంలో ఉన్న నీరును మనమే కలుషితం చేసుకుంటాం. నీటిని చులకనగా చూడటం, లెక్క చేయకపోవటం ఇంకా ప్రమాదకరం. ఉదాహరణకి పట్టించుకోకుండా వదిలి వేసిన నీటిలో అసంపూర్ణ స్పటికాకృతి ఉంటుంది. మన ఆలోచనలు మరియు భావాల ద్వారా మనం నీరు యొక్క రసాయన కూర్పు మార్చకుండానే, అణువాకృతిని మార్చగలం. ఒక గ్లాస్ మంచి నీరును మనం ఏ విధంగా చూస్తాం, పట్టుకుంటాం, త్రాగుతాం అన్న ఒక్క విషయం మన మీద, మనం ఆ నీటిని ఇచ్చే ఇతరుల మీద ప్రభావం చూపుతుంది. నీటిని భక్తిశ్రద్దలతో గౌరవించడం ద్వారా మనం మన జీవితాలను ఏంతో ఆరోగ్యంగా, ప్రశాంతంగా, ఆనందోత్సాహాలతో గడపవచ్చు. నీరు పై భక్తి ‘అందరిని ప్రేమించండి అందరిని సేవించండి’ అనే సిద్ధాంతానికి దగ్గర చేసి మనం మానవత్వానికి భూమికి కృతజ్ఞతాపూర్వకoగా ఉండేటట్లు చేస్తుంది
8. ప్రేమ మరియు కృతజ్ఞత పంచడానికి నీటితో అనుసంధానం అవ్వండి
ఒక విధంగా మనం శరీరంలో ఉన్న కదిలే నీటి ట్యాంకుల వంటి వాళ్ళం. మన శరీరంలో ఉన్న నీరు యొక్క నాణ్యత బట్టి మన యొక్క మనస్తత్వం ఆధారపడి ఉంటుంది13. ఎప్పటివరకైతే మనం కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే ఆరు శత్రువుల యొక్క ఆదీనంలో బందీ అయి ఉంటామో అప్పటివరకు మన శరీరం, మెదడు, గుండెలో ఉన్న నీరు పవిత్రంగా ఉండజాలదు. మనం ప్రేమ, కృతజ్ఞత మరియు ఆశావహ దృక్పధం ద్వారా మనలో ఉన్న మరియు మన చుట్టుప్రక్కల ఉన్న నీరును శక్తిమయం చేసుకోగలం. ఈ విధంగా సర్వ వ్యాపి అయిన నీరును మనం ప్రేమ, శాంతి, ఆనందం మరియు కృతజ్ఞతను విశ్వంలో పంచుకోవడానికి ఒక మాధ్యమంగా ఉపయోగించవచ్చు. ఇలా చేయడం వలన ఆ పవిత్ర బావాలు ప్రతిబింబం, ప్రతిచర్య మరియు ప్రతిధ్వని ద్వారా మన దగ్గరకే తిరిగి వస్తాయి.
9. విబ్రియోనిక్స్ మరియు నీరు
విబ్రియోనిక్స్ రెమెడీలు నీటిలో చేసినా లేదా నీటితో తీసుకొన్నా అవి ఎందుకు ఎక్కువ ప్రభావవంతంగా, తొందరగా పనిచేస్తాయో మనం నీరు యొక్క సహజ సిద్దమైన లక్షణాలను పరిశీలిస్తే అర్ధమవుతుంది. అంతే కాకుండా రెమెడీలు తయారు చేసేటప్పుడు, ఇచ్చేటప్పుడు మరియు తీసుకునేటప్పుడు మన మనసు ప్రశాంతంగా ఆశావహ దృక్పధంతో ఉండటం అవసరం మరియు తగినంత నీరును శరీరంలోని కలుషితాలను కడిగి బయటకు పంపించడానికి అవసరం.
ప్రస్తావనలు మరియు లింకులు
- The Hidden Messages in Water by Masaru Emoto, Atria Books Edition, 2005 http://isha.sadhguru.org/blog/video/the-5-elements-of-existence-explained/
- Water has Unique Properties: http://www.physicalgeography.net/fundamentals/8a.html
- Sathya Sai Speaks, Vol.27, 23rd November 1994
- Rig Veda on water: http://www.greenmesg.org/mantras_slokas/vedas-apah_suktam.php
- Water can Respond and React: Emoto’ s experiments with water crystals: https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=emoto+water https://www.youtube.com/watch?v=Is8FE0RQo8A
- What the Bleep do we know –Feature film on thoughts and also water crystals: https://archive.org/details/WhatTheBleepDoWeKnow_201601#
- Water’s memories :Scientific Proof https://www.youtube.com/watch?v=59iuelCL0M
- Water Memory – a 2014 Film on Water Experiments by Professor Nobel Prize laureate Luc Montagnier ,Virologist, applying technology of Scientist, Dr Jacques Benveniste who first raised notion of water memory in1980s) https://www.youtube.com/watch?v=R8VyUsVOic0
- NASA study on Soil Moisture Memory http://www.jpl.nasa.gov/news/news.php?feature=6726
- Sadhguru at Chennai IIT on Water has Memory: https://www.youtube.com/watch?v=6C1p4HUHlfE
- We are a bottle of Memory: https://www.ishafoundation.org/news/columns/Mystic-Mantra/2012/DeccanChronicle-22-Mar-2012.pdf
నీరు మరియు ఆరోగ్యం భాగం - 2 -- డీహైడ్రేషన్
1. డీహైడ్రేషన్1-3 అనగానేమి ?
శరీరంలోని నీరు బాగా తగ్గిపోయి శరీరం తనంత తాను సరిగా పనిచేయలేకపోవడాన్ని డీహైడ్రేషన్ అంటారు. ఇది ఎవరికైనా రావచ్చు.
మన శరీరంలో మూడింట రెండు బాగాలున్న నీరు మన ఆరోగ్యానికవసరమైన ఒక ప్రాణాధార పోషకం. నీరు మన శరీరం చక్కగా పనిచేయటానికి ఎంతో అవసరం. నీరు పోషకాలను కణాలలోకి తీసుకెళుతుంది మరియు శరీర ఉష్ణోగ్రతను జీర్ణక్రియను సంరక్షిస్తుంది. అది మన కీళ్లను కళ్ళను తడిగా ఉంచి లూబ్రికేషన్ ఇస్తుంది మరియు విష పదార్దాలను బయటకు పంపించడం ద్వారా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతూ ఓకే షాక్ అబ్సర్బెర్ వలె పని చేస్తుంది.
మన శరీరం సాధారణ జీవ ప్రక్రియలో భాగంగా శ్వాస క్రియ విసర్జన క్రియ లాంటి ఇతర దైనందిన చర్యల్లో వాతావరణ మార్పుల్లో భాగంగా నీటిని కోల్పోతూ ఉంటుంది. శరీరంలో అత్యద్భుతమైన వ్యవస్థ నీరును చక్కగా అదుపు చేస్తూ అవసరమైన కణాలకి నీరును అందిస్తుంది. కానీ మానవ శరీరంలో కొవ్వుపదార్థాలని నిల్వ చేసే వ్యవస్థ ఉంది కానీ నీరును నిల్వ చేసే వ్యవస్థ లేదు.. అందువలన శరీరానికి తగినంత నీరు మనము ఇవ్వకపోతే శరీర సమతుల్యత దెబ్బ తిని డీహైడ్రేషన్ వచ్చే అవకాశముంది.
శరీరంలో నీటి శాతం 1 – 2, శాతం తగ్గితే మనం నీరును తీసుకోవాలి అన్న దానికి సంకేతంగా శరీరం లో దప్పిక అనే అద్బతమైన సహజ ప్రక్రియ ఉంది.
2. డీహైడ్రేషన్ కు ఒక మనిషి ఎలా గురవుతాడు3
డీహైడ్రేషన్ ఆకస్మికంగా కానీ ఒక వ్యాధి వలన కానీ ప్రతిసారి రాదు. ప్రతిరోజూ తక్కువ నీటినితాగడం, దప్పిక వేసినప్పటికీ నీరును త్రాగకపోవడం వంటి కారణాలవల్ల డీహైడ్రేషన్ రావచ్చు. దీర్ఘకాలిక డీహైడ్రేషన్ వలన ఎన్నో వ్యాధులు రావచ్చు.
డీహైడ్రేషన్ కు ఇతర అంశాలు లేదా వ్యాధులు కార్మ కావచ్చు.త్రాగవల్సిన నీరు కంటే తక్కువ నీరును త్రాగినప్పుడు లేదా ఎక్కువ నీటిని శరీరం నుంచి కోల్పోయినప్పుడు, అధిక పని లేదా వ్యాయామం అధిక వేడి లేదా ఒత్తిడికి లోనైనప్పుడు, వాంతులు విరేచనాలు అధిక జ్వరం , ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేయాల్సి రావడం శరీర గాయం లాంటి కారణాలవలన డీహైడ్రేషన్ రావచ్చు.క్రమ తప్పకుండ చల్లని పానీయాలు, కోక్ కాఫీ లాంటివి పొడి ఆహార పదార్థాలు శరీరం నీటిని కోల్పోయేలా చేస్తాయి. ఇలాంటి కారణాలవలన శరీరంలోని నీరు తగ్గి ఆకస్మికంగా డీహైడ్రేషన్ కు గురి కావచ్చు.
శరీరాన్ని తగినంతగా హైడ్రేషన్ లో ఉంచడానికి నీటికి బదులుగా ఏ ఇతర ద్రవ పదార్థం, పాలు పండ్ల రసాలు కూడ సరిపోవు.
3. డీహైడ్రేషన్ యొక్క లక్షణాలు1-4
విపరీతమైన దాహం, ఎండిపోయిన నోరు, వాచిన నాలుక, అలసట, బలహీనత, కళ్ళు తిరగటం, నిస్సతువ, గుడ్ దడ, తిక మక పడటం, మూర్ఛపోవడం, మూత్రం చాల తక్కువగా, చిక్కగా రావటం, తల నొప్పి, కడుపులో నొప్పి, బి పి తక్కువగా ఉండటం, ముడతలు లేదా పొడిబారిన చర్మం, పసుపు లేదా యెర్రని రంగులో మూత్రం ( మూత్రం సహజంగా ఏ రంగు లేకుండా లేదా లేత పసుపులో ఉంటుంది). ప్రతి ఒక్కరు తమ శరీరం యొక్క నీటి అవసరాలను హైడ్రేషన్ ను గమనిస్తుండాలి, కానీ తీవ్రమైన పరిస్థితులలో అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి!
డీహైడ్రేషన్ యొక్క లక్షణాలను ముందు మంచి నీరు త్రాగడం ద్వారా నివారించాలి. అంతేకాని మందులు లేదా రసాయనాలు అదే పనిగా ఉపయోగించడం శరీర కణ జాలానికి మంచిది కాదు.
4. చంటిపిల్లలు మరియు పెద్దల కొరకు ప్రత్యేక శ్రద్ద1-2
పెద్ద వయసు వారిలో తమకు దాహం వేస్తోందన్న ఎరుక వయసు పెరిగే కొద్దీ తగ్గవచ్చు. నీరు సక్రమంగా త్రాగకపోతే చంటిపిల్లలు, వృద్దులు, క్రీడాకారులు మరియు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు తొందరగా డీహైడ్రేషన్ కు గురవుతారు. అందువలన తల్లిదండ్రులు, ఆశ్రమ సంరక్షకులు ఈ విషయాన్ని తమ చంటిపిల్లలు, పిల్లలు, పెద్దలు, రోగుల విషయంలో గుర్తుంచుకోవాలి.
నివారణే ఉత్తమం. శరీరం తగినంత హైడ్రేషన్ తో ఉండేలా చూసుకోండి!1-2
శరీరం తగినంత హైడ్రేషన్ లో ఉంచడానికి రోగాల బారిన పడకుండా ఉండటానికి ప్రతి ఒక్కరు తమ శరీరావసరాలను దృష్టిలో ఉంచుకుని తగినంత నీరును ఎప్పుడు, ఎలా ఎంత త్రాగాలో నిర్ణయించుకోవాలి. ఇది ప్రతిమనిషి యొక్క వయసు, లింగభేదం, ఆరోగ్య స్థితి, వాతావరణం మరియు ప్రదేశాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఆరోగ్య సమస్యలున్నవారు మరియు / లేదా విద్య చికిత్స లేదా మందులు వాడుతున్నవారు జాగ్రత్త వహించాలి మరియు తమ వైద్యున్ని సంప్రదించాలి.
నిర్దిష్టమైన ప్రణాళిక ద్వారా నీరును త్రీసుకోవడం అనే పద్దతి ద్వారా మందులు ఉపయోగించకుండా రోగులకు చికిత్సనందించిన ఇరాన్ కు చెందిన ఒక ప్రముఖ వైద్యుడి సిద్ధాంతాలను ఇక్కడ పొందుపరుస్తున్నాము3
- మన శరీరం సుమారు 1.5 నుంచి 2 లీటర్ల నీటిని ప్రతి రోజు తన నిత్యావసర పనుల కోసం వినియోగించుకొంటుంది. క్రమం తప్పకుండా 1 లేదా 2 గ్లాసుల నీరు ప్రతిసారి అప్పుడపుడు రోజంతా త్రాగడం ఉత్తమం. నీరును డీహైడ్రేషన్ అవక మునుపే త్రాగడం ఉత్తమం.
- ప్రతితోజు ఉదయం పరగడుపున నిద్ర లేచిన వెంటనే నీరును త్రాగడం వలన దీర్ఘ నిద్ర వలన కలిగిన డీహైడ్రేషన్ పోతుంది. మొదట ఒక గ్లాసుతో మొదలుపెట్టి క్రమంగా ఒక నెల వ్యవధిలో 3 గ్లాసుల నీరు త్రాగడం చేయవచ్చు. పరకడుపున నీటిని త్రాగడం వలన నీరు అద్భుత విరేచనాకారిగా పనిచేసి శరీరంలోని విషాలను, వ్యర్దాలను బయటకు పంపించి అంతర్గతంగా పరిశుద్ధంగా ఉంచుతుంది. కానీ ఒక గంట వరకు ఉదయం కాఫీ లేదా టీ త్రాగకుండా జాగ్రత్త వహించాలి.
- వ్యాయామం చేసే ముందు నీరు త్రాగడం చాల ముఖ్యం. ఇందువలన చెమట ద్వారా నీరు పోవడానికి అవకాశం ఉంటుంది.
- స్నానం చేసిన తరువాత కళ్ళు తిరగడం వంటి సమస్యలున్నవారు స్నానానికి మందు నీరు త్రాగడం మంచిది.
- భోజనానికి అరగంట ముందు జీర్ణ వ్యవస్థను సమాయత్త పరచడానికి నీరుని ముఖ్యంగా ఉదర లేదా జీర్ణ సంబంధిత వ్యాధితో అజీర్తితో బాధ పడేవారు త్రాగాలి.
- భోజనం అయినా రెండు లేదా రెండున్నర గంటల తరువాత కడుపులో జీర్ణ ప్రక్రియ పూర్తయ్యాక నీరు త్రాగాలి. ఇది జీర్ణ వ్యవస్థ ఆహారాన్ని చిన్న చిన్న పదార్దాలుగా చేయడం వలన కలిగిన డీహైడ్రేషన్ ను సరిచేస్తుంది.
- ఎప్పుడైనా సరే దాహం వేసినప్పుడు నీరును త్రాగాలి - భోజనం చేసేటప్పుడు కూడా దాహం వేస్తె కొద్దిగా నీరును త్రాగవచ్చు.
- నిద్రలో గుండెపోటు వచ్చే అవకాశాన్ని తగ్గించటానికి రాత్రి పడుకొనే ముందు ఒక గ్లాసు నీరు త్రాగడం మంచిది.
7. 70-80 శాతం నీరు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం శరీర హైడ్రేషన్ కు అవసరం5
రోజంతా నీరును అదే పనిగా త్రాగడం సరి కాదని అందువలన శరీర సమతుల్యం దెబ్బ తినే అవకాశం ఉందని ఒక అభిప్రాయం ఉంది. దాహం వేసినప్పుడు దప్పిక తీర్చుకోవడానికి తగినంత నీరే కాకుండా 10-15 శాతం అదనంగా త్రాగాలి. తగినంత నీరును త్రాగుతూ నీటి శాతం ఎక్కువగా ఉన్న తాజా కాయగూరలు. పండ్లు తినడం చాల మంచింది ముఖ్యంగా వేసవి కాలంలో. మన శరీరంలో ఉన్న నీటికి అనుగుణంగా శాతం నీరున్న ఆహారాన్ని తీసుకోవడం చాల మంచిది.
8. డీహైడ్రేషన్ ను నివారణ మరియు నయం చేయడానికి ఉపయోగపడే విబ్రియోనిక్స్ రెమెడీలు
సారంలోని నీటి శాతాన్ని తగినంతగా ఉంచడానికి సరైన రెమెడీ NM34 Water Balance.
సీసీ బాక్సు ఉపయోగించేటట్లైతే క్రింది కాంబోలలో రోగి యొక్క ఆరోగ్య స్థితి, గురి కాబడ్డ అవయవాన్ని అనుసరించి తగిన దానిని ఉపయోగించాలి. CC3.1 Heart tonic, CC4.1 Digestion tonic, CC4.6 Diarrhoea, CC5.3 Meniere’s disease, CC7.3 Eye infections, CC12.1 Adult tonic, CC13.1 Kidney & Bladder tonic, CC18.1 Brain disabilities, CC19.6 Cough chronic, and CC21.1 Skin tonic.
SRHVP యంత్రం ఉపయోగించేటట్లైతే రోగ లక్షణాలనుబట్టి క్రింది వాటిలో ఎంపిక చేసుకోండి: NM2 Blood, NM5 Brain Tissue Salts, NM18 General Fever, NM34 Water Balance, NM63 Back-up and NM75 Debility.
అత్యవసర మరియు ప్రాణాంతక పరిస్థితులలో ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యున్ని సంప్రదించాలి
ప్రస్తావనలు మరియు లింకులు
- https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=What+is+dehydration
- http://articles.mercola.com/dehydration-symptoms.aspx
- “You’re Not Sick ,You’re Thirsty” by Dr F. Batmanghelidj MD, based on his pioneering research into the role of water in the body and how it can relieve a stunning range of medical conditions by his experience of curing patients (Warner Books 2003 edn).
- http://cci-coral-club.okis.ru/file/cci-coral-club/knigi/FereydoonBatmanghelidj_Your_Bodys_Many_Cries_for_Water_eng.pdf
- http://www.ishafoundation.org/us/blog/the-power-of-water/
పైన ఉంచిన విషయాలు వివిధ వెబ్ సైట్లు మరియు పుస్తకాలలోని డేటా నుంచి గ్రహించబడినవి. అంతేకానీ వాటినే పాటించాలనీ లేదా వైద్య చికిత్సకు బదులుగా, ప్రత్నామ్యాయంగా వాటిని ఉపయోగించాలని చెప్పడం మా ఉద్దేశం కాదు.
2. వైటిఫిల్డ్, బెంగుళూరు లో ప్రారంభమైన సాయి విబ్రియోనిక్స్ క్లినిక్
బాబా ఒక వ్యక్తిగత ఇంటర్వ్యూ లో చెప్పినట్లుగా, విబ్రియోనిక్స్ శ్రీ సత్య సాయి జనరల్ హాస్పిటల్ యొక్క మెడికల్ సూపరింటెండెంట్, గత సంవత్సరం డా. అగర్వాల్ గారికి ఫోన్ చేసి శ్రీ సత్య సాయి ఉన్నత వైద్య సంస్థ, వైట్ ఫీల్డ్ లో జరగనున్న సాంప్రదాయేతర వైద్య విధానం యొక్క పరిచయ కార్యక్రమంలో భాగంగా విబ్రియోనిక్స్ గురించి మాట్లాడాల్సిందిగా ఆహ్వానించారు. నూతన సంవత్సరంలో ధన్వంతరి హాల్ లో జరగబోవు ఈ కార్యక్రమం యొక్క ఎజెండా డిసెంబర్ 31, 2016 న స్వామి వారి పద పద్మముల దగ్గర ఉంచగా, వెంటనే ఆ రెండు కాగితములు విభూతితో నిండిపోయినవి - నిజంగా సూపర్ స్పెషలిటీ ఆసుపత్రి యొక్క నూతన సాంప్రదాయేతర వైద్య విధాన అనుసంధాన ప్రక్రియకు ఇది ఒక అద్భుత దైవ ఆశీర్వాదము!
SSSIHMS యొక్క డైరెక్టర్ మరియు సూపరింటెండెంట్, ఇద్దరు కూడా సాంప్రదాయేతర వైద్య విధానం యొక్క ప్రాముఖ్యతను మరియు స్వామి యొక్క వైద్య సేవా రంగంలో దీనిని భాగంగా చేయడం యొక్క ఆవశ్యకతను గురించి చాల సేపు మాట్లాడారు. సాయి విబ్రియోనిక్స్ తో పాటు మూడు ఇతర సంపూర్ణ వైద్య విధానాలైన తాచిన్, యాక్సిస్ బార్స్ మరియు అక్యూప్రెస్సుర్ గురించి కూడా ప్రదర్శన ఇవ్వబడింది. వీలైనంత తొందర్లో లో ఒక వెల్నెస్ క్లినిక్ ను ప్రారంభించాలని నిర్ణయించారు. జనవరి 19, 2017 న SSSIHMS ప్రారంభోత్సవ వార్షికోత్సవ సందర్బంగా వెల్నెస్ క్లినిక్ యొక్క బ్రోచర్ ను సెంట్రల్ ట్రస్ట్ సెక్రటరీ సభ్యుడు విడుదల చేసారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక వైద్య ఆరోగ్య శాఖా మంత్రి, సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు మరియు ఇతర ప్రముఖులు విచ్చేసారు.
సాయి విబ్రియోనిక్స్ చరిత్రలో ఫిబ్రవరి 23, 2017 ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. ఎందుకనగా ఆ రోజు, SSSIHMS వైట్ ఫీల్డ్ లో, విబ్రియో క్లినిక్ అధికారికంగా వెల్నెస్ సెంటర్ లో ఓక బాగంగా ప్రారంభించబడింది. పవిత్రమైన మహాశివరాత్రి పర్వదినాన ఓపిడి విభాగంలో హాస్పిటల్ డైరెక్టర్ చే ఘనంగా విబ్రియో క్లినిక్ ప్రారంభించబడింది. విబ్రియోనిక్స్ పట్ల ప్రజల ఆసక్తి ఎంత గొప్పగా ఉందంటే, విబ్రియో వైద్య సేవలు మూడు రోజుల తరువాత మొదలు కావాల్సిఉంటే ఆ రోజు ఉదయమే అయిదు మంది విబ్రియో చికిత్స తీసుకొన్నారు. నిజంగా స్వామి యొక్క పరమాద్బుత కృప మరియు ఆశీర్వాదం !
3. వీపి రిఫ్రెషర్ వర్క్ షాప్ మరియు అవేర్నెస్ సెమినార్, నాగపూర్
ప్రస్తుత అభ్యాసకులకు మరింత శిక్షణ మరియు విబ్రియోనిక్స్ లోని నూతన సమర్థ వైద్య సేవా విధానాలను వారికి పరిచయం చేయుటకు రిఫ్రెషర్ వర్క్ షాప్ మరియు అవేర్నెస్ సెమినార్, మహారాష్ట్ర రాష్ట్రంలోని నాగపూర్ లో జరిగింది. కొన్ని నెలల కఠిన శ్రమతో VT10375 మరియు నాగపూర్ కోఆర్డినేటర్ SVP10228 ఈ సెమినార్ను నిర్వహించారు. ఎప్పుడూ కరెస్పాండెన్స్ కోర్సు చేయని వారు ఈ ఆన్లైన్ కోర్సులో మనస్ఫూర్తిగా ఉత్సాహంగా పాల్గొన్నారు. కంప్యూటర్ వాడడంలో అవగాహన లేని వారు మాన్యువల్ కోర్సులో పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేసారు. 29 మంది ఉత్సాహవంతులైన అభ్యాసకులు ( 14 AVPs & 15VPs )పాల్గొన్న ఈ రెండు రోజుల కార్యక్రమం VT10375 మరియు SVP10001 వారిచే విజయవంతంగా నిర్వహించబడింది. అంతే కాకుండా సాయి విబ్రియోనిక్స్ సేవను చేయుటకు ఆసక్తి గా ఉన్న మంది వ్యక్తులు, ఫిబ్రవరి 18-19, 2017లో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
విబ్రియోనిక్స్ యొక్క పరిచయం, రోగుల రికార్డ్స్ యొక్క ఆవశ్యకతను, రోగ చరిత్రలను రాయడం. విబ్రియోనిక్స్ లోని నూతన పంధాలను మరియు విబ్రియోనిక్స్ ను చక్కగా, సమర్థవంతంగా చేయడానికి అవసరమైన చిట్కాలను ఈ కోర్సులో భాగంగా నేర్పించారు. ఈ కోర్సుకు హాజరైన వారు, 21 కేటగిరిల 108 సీసీ బాక్సు గురించి, అది ఉపయోగించడానికి అవసరమైన ప్రాథమిక అనాటమిని, ప్రాక్టికల్ కోణంలో తెలుసుకొన్నారు.
అభ్యాసకులందరు పరీక్ష రాసి, చక్కగా ఉతీర్ణులవడంతో ఈ కోర్సు ముగిసింది. తరువాత అందరు దేవునికి చేసిన వాగ్దానం తిరిగి జ్ఞప్తికి తెచ్చుకొని మరలా వాగ్దానం చేసారు. ముగింపు కార్యక్రమంలో డా. అగర్వాల్, టెలి సదస్సు ద్వారా సభికులందరితోను మాట్లాడి వారి ప్రశ్నలు, సందేహాలను తీర్చి చాల సంతోషం కలిగించారు. ² రోగనివారణ, స్వస్థత కలిగించేది స్వామేనని మనమంతా కేవలం అయన యొక్క ఎంపిక కాబడ్డ పనిముట్లు ² అన్న సత్యాన్ని ఎల్లపుడు గుర్తుంచుకోవాలన్న ముఖ్యమైన సందేశంతో ఆ సదస్సు విజయవంతంగా ముగిసింది.
4. విబ్రియో అభ్యాసకులు సాధనా శిబిరం, కేరళ
కేరళ లోని విబ్రియో అభ్యాసకులు, నూతన సంవత్సర శుభ దినాన, వైద్య విభాగ రాష్ట్ర కోఆర్డినేటర్ మరియు కేరళ ట్రస్ట్ వారి షోరనూర్ సాయి హాస్పిటల్ సంరక్షకులైన డా. ఆనందమోహన్ గారిచే ప్రధమ సాధనా శిబిరాన్ని నిర్వహించారు. వారు మంది విబ్రియో అభ్యాసకులకు వారి విబ్రియో వైద్య సేవలో ఆధ్యాత్మికత మరియు వ్యక్తిగత సాధన యొక్క ప్రాముఖ్యాన్ని వివరించారు. స్వస్థత అనేది మనిషికి సంబంధించిందని కానీ నయమవ్వడం అనేది రోగమునకు సంబంధించిందని చెప్పారు. పరిపూర్ణ స్వస్థత కలగాలి అంటే ఆధ్యాత్మిక దృక్పధం కూడా ఉండాలి అని చెప్పారు. తన యొక్క వ్యక్తిగత ఆధ్యాత్మికత వికాసానికి ప్రతి అభ్యాసకుడు తానే బాధ్యత వహించాలని చెప్పారు. విబ్రియోనిక్స్ చికిత్స విధానం స్వయానా భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారిచే ప్రారంభించబడి ఆశీర్వదించబడింది. అందువలన ఇది అత్యంత పవిత్రమైంది మరియు శుభప్రదమైంది. కావున ప్రతి ఒక్కరు స్వామి యొక్క దివ్య హస్తాలలో పవిత్రమైన, ప్రేమతో నిండిన ఒక అద్భుత పనిముట్టుగా ఉండటానికి ప్రయత్నించాలి. తద్వారా విబ్రియో రెమెడీల స్వస్థతా సామర్ధ్యాన్ని పెంచుకోవాలి. మనం మన యొక్క రోజువారీ జీవితం ఆధ్యాత్మికతో నిండటానికి శక్తివంచన లేకుండా ప్రయత్నించాలి. దీని ద్వారా మనకే కాకుండా సహాయo, కోసం మన దగ్గరకు వచ్చే వారికీ కూడా ఎంతో మేలు జరుగుతుంది. వారు క్రింది విషయాల గురించి విపులంగా చర్చించారు.
- శరీరం-మనసు-ఆత్మ యొక్క సంబంధం మరియు ఆరోగ్యం పై వాటి ప్రభావం : ఆధ్యాత్మికంగా మనం ఈ చరాచర విశ్వంతోను మరియు అందరిలోనున్న దివ్య వైద్యుడైన ఆ భగవంతునితోను ముడిపడి ఉన్నాము. సర్వాంతర్యామి సర్వవ్యాపి అయిన ఆ దివ్య వైద్యుడే మన ఆరోగ్యానికి ఆరోగ్య సంరక్షణకు మూల కేంద్రం. శరీరం-మనసు-ఆత్మ ను అనుసంధానం చేస్తూ సంతుల్యతతో జీవిస్తూ కౌన్సిలింగ్ ద్వారా మనం ఆ దివ్య వైద్యుడితో సంబంధం పెట్టుకోవచ్చు.
- సమగ్ర పరిపూర్ణ చికిత్స విధానంగా ఆధ్యాత్మిక సంరక్షణ: దీనిని ప్రతి రోగికి అందించవచ్చు అయిదు మానవతా విలువలను నిత్య జీవితంలో ఆచరించడాన్ని ప్రోత్సహించడం ద్వారా ఆత్మశోధన ద్వారా ఈ విధానం ప్రశాంతమైన మనసును మరియు ఆహ్లాదకరమైన శరీరాన్ని అందిస్తుంది. అందువలన మనిషి యొక్క ఆలోచన దృక్పధం మారి ఆ వ్యక్తి ఉన్నత చేతనావస్థకు మరియు విస్తృత అవగాహనా ఎరుకకు చేరుకోగలడు.
- ఉపశమన చికిత్సలో ఆధ్యాత్మికత ప్రాముఖ్యం: ఆధ్యాత్మిక జీవన సరళి ప్రతి ఒక్కరికి రోగముల భారమును తగ్గిస్తుంది, ముఖ్యంగా నయం చేయలేని వ్యాధి ఉన్నవారికి, ప్రాణాంతకములైన వ్యాధి ఉన్నవారికి, తీవ్రమైన రోగంతో బాధ పడే వారికీ, అవసాన దశలో ఉన్నవారికి. భగవాన్ బాబా యొక్క బోధనలు, ఉపదేశానుసారం ఒక స్పష్టమైన ఆధ్యాత్మిక పరమార్థం ప్రతి ఒక్క హెల్త్ ప్రాక్టీషనర్, తాను ఏ విభాగానికి చెందిన వాడైనా (అల్లోపతి, ఆయుర్వేద, హోమియోపతి లేదా వేరే ఏ విభాగమైన) తప్పకుండా తెలుసుకోవాలి.
- రోగ నివారణా వైద్య విధానంలో భాగంగా ఆధ్యాత్మిక సంరక్షణ: రోగముల నివారణకై ఆరోగ్యకరమైన మనసు అవసరం మరియు ఆధ్యాత్మిక విజ్ఞానం అటువంటి మనసుకు పునాది వంటిది. ఆధ్యాత్మికత వలన కలిగిన మనోశక్తి మన శరీరం యొక్క రోగనిరోధక వ్యవస్థను పెంపొందిస్తుంది మరియు బలోపేతం చేస్తుంది. బలమైన రోగ నిరోధక వ్యవస్థ చక్కటి ఆరోగ్యమును ప్రసాదిస్తుంది మరియు అన్ని రోగ నివారణా వైద్య విధానాల సామర్ధ్యాన్ని పెంపొందిస్తుంది.
అంతకు ముందుగా చైర్మన్ ( రాష్ట్ర విబ్రియో కోఆర్డినేటర్ కూడా 02090) తన ప్రారంభ ఉపన్యాసంలో సాధన మీద స్వామి ఉపదేశాలను ఉదహరిస్తూ మన యొక్క మనసు మరియు బుద్ది ఎల్లప్పుడూ పవిత్రమైన ఆలోచనలతో మరియు నిస్వార్థమైన ప్రేమతో నిండి ఉండాలని చెప్పారు. ఇందువలన అభ్యసకులు తమ యొక్క స్వస్థతా కార్యక్రమాన్ని మరింత ప్రభావవంతంగా చేయగలుగుతారు. కార్యక్రమం యొక్క ముగింపు ఉపన్యాసంలో డా. అగర్వాల్ గారు మాట్లాడుతూ విబ్రియోనిక్స్ యొక్క నూతన పరిణామాల గురించి విశదీకరించారు. ఈ కార్యక్రమం చేపట్టినందుకు అభినందించారు. చివరగా పాలొగొన్న వారందరూ తాము నేర్చుకున్న దానికి ఎంతో సంతోషించి, భవిష్యతులో ఇటువంటి సాధనా క్యాంపులు మరిన్ని జరగాలని అభిలషించారు.
Om Sai Ram