Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

Vol 8 సంచిక 1
January/February 2017
ముద్రింప తగిన వార్తాలేఖ


పూర్తి వార్తాలేఖ యొక్క కాగితం ప్రతి కావలెనన్నఈ పుటను ముద్రించండి

డా.జిత్. కే అగ్గర్వాల్ యొక్క మాటల్లో

ప్రియమైన విబ్రియో అభ్యాసకులరా,

ముందుగా మీ అందరికీ ప్రమోద భరితమైన ఈ 2017 నూతన సంవత్సర శుభాకాంక్షలు.

ఈ నూతన సంవత్సరం మనందరి జీవితములలో  అన్ని రంగాల లోనూ సమృద్ధి కరమైన ఆనంద ప్రదాయి గా ఉండాలని మన ప్రియ భగవానుని హృదయ పూర్వకంగా ప్రార్ధిస్తున్నాను.  గడచిన 2016 సంవత్సరాన్నిఅన్ని విషయాలలో విజయ వంతమైనట్టిది గా మలచిన మన మార్గదర్శి భగవాన్ బాబాకు ఒక్క క్షణం మన  హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుకుందాం. ఈ సందర్భంగా  గడచిన సంవత్సర విషయాలను మీతో ఇలా పంచుకోవడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది.

  • సంస్థాపరమైన అభివృద్ధి; అంకిత భావము గల స్వచ్చంద నిర్వాహకులు కాలానుగుణంగా సంస్థ కార్యక్రమాల రూపకల్పనలోనూ  నియమ సరళి ,విధి విధానాలను  రూపొందించడం  అంతేకాకుండా సమయానుకూలంగా వివిధ ప్రదేశాలలో  శిక్షణా తరగతులు  నిర్వహించడంలో చక్కని ఫలితాలు కనబరిచారు. కొత్తగా సంస్థ లో ప్రవేశించే వారికోసం ఒక సమగ్రమైన నూతన ఎంపిక పధ్ధతి రూపొందింపబడింది.  నిరంతర శిక్షణ ,అభివృద్ధి దిశ లో సంస్థ ముందుకు సాగుతోంది.
  • ఫలవంతమైన పర్యవేక్షణ, సమస్యా సాధన ,మేధో నైపుణ్యము, పరిశోధనా వేగిరత దిశలో ప్రాక్టీషనర్లకు నిరంతర శిక్షణ కల్పింపబడడం. ఇవి కూడా ఒక సుహృద్భావ, స్నేహశీల, సహాయ జనిత వాతావరణంలో నిర్వహింపబడడం ఒక శుభసూచకం.
  • విస్తృత ప్రసార మాధ్యమం యొక్క పుట్టుక; అమెరికా ,కెనడా దేశాలలో ప్రారంభింపబడిన ఈ నెట్ వర్కు  సరియయిన  వైద్య సౌకర్యాలు లేక, ప్రమాదకర పరిస్థితులలో, భౌతిక వనరుల దృష్ట్యా  జన జీవన స్రవంతికి దూరంగా ఉంటున్న రోగులకు సమాచారం అందించడం ఈ మాధ్యమం ప్రధాన లక్ష్యము. అంతేకాకుండా అంతర్జాతీయ  స్థాయిలో ఒక విస్త్రుతమైనా నెట్వర్క్ కలిగి ఉండడం.
  • సుదూరంగా ఉన్న ప్రాక్టీషనర్ల వైద్య రికార్డులను అందుబాటులోనికి తీసుకుని రావడం అడ్మినిస్ట్రేటర్ లు, కోఆర్డినేటర్లు, టీచర్లతో ప్రాక్టీషనర్లు అనుసంధానం కావడం. రికార్డులు  అందుబాటులో ఉంచుటకు అనువైన విస్త్రుతమైన నెట్వర్క్ఏర్పాటుచేయడం.
  • నూతనముగా చేరిన ఎ.వి.పి.లు తగినంత అనుభవం పొంది విజయవంతంగా తమ కోర్సు పూర్తి చేసి వి.పి.లు గా మారుటకు వ్యక్తిగతంగా మెంటర్లను అందుబాటులో ఉంచడం.
  •  2004 కు చెందిన విబ్రియో మార్గదర్శినిని మరింత మెరుగు పరిచి 2016 సరికొత్త ఎడిషన్ గా తీర్చి దిద్దడం.

మీతో మరో ఆనందదాయకమైన విషయం పంచుకోబోతున్నాను.ఈ  2016 సంవత్సరం లో మనకు అందిన అనేక ఆశ్చర్యకరమైన కేస్ హిస్టరీల ద్వారా విబ్రో విధానం పట్ల ప్రాక్టిషనర్ ల అంకిత భావం, వారి తపన ప్రస్పుటం గా కనిపిస్తోంది.

           స్వామి పదే పదే చెపుతూ ఉంటారు. ప్రేమకు హద్దులు లేవని. కనుక మనం ఈ దివ్య నియమానికి కట్టుబడి అందరం ఒకటే అనే ఉదాత్త భావనతోనే కలసి పనిచేస్తూ 2017 సంవత్సరాన్ని మరపురానిదిగా చేద్దాం. ఈ సంవత్సరం మొక్కలు, జంతువుల పైన  పరిశోధన చేయుటకు వాటి అవసరాలు కనుగొనుటకు అంకిత భావం కల ఒక పరిశోధనా టీం ను రూపొందించాలని ఆలోచన ఉన్నది. మన లక్ష్యం ఏమిటంటే మొక్కలు,జంతువులకు కావలసిన ఒక సమగ్రమైన వైద్య విధానము అందుబాటులోనికి తీసుకొని రావడం. ఈ 2016 సంవత్సరం లో చేపట్టిన మెంటర్ ప్రోగ్రాం ను మరింత పటిష్ట పరుస్తూనే డిజిటల్ టెక్నాలజీ, క్లౌడ్ కంప్యూటింగ్ వ్యవస్థ ను అందుబాటులోనికి తీసుకురావాలని ఆలోచన ఉంది. చాలామంది ప్రాక్టిషనర్ లు మానవ మనుగడ, జీవన విధానము గూర్చిన అంశాలను తిరిగి ప్రవేశ పెట్టాలని ఎందు కంటే రోగుల సమస్యలు తెలుసుకొనడానికి ఇది తమకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందనే అభిప్రాయం వెలిబుచ్చారు. ఈ  సంవత్సరంలో ఈ వార్తా లేఖతో పాటు నిరంతర విద్యలో భాగంగా మానవ వ్యవహార శైలి ఆరోగ్యము అనే ఉప శీర్షిక ప్రారంభింపబడింది. ఈ శీర్షిక లో మానసిక, భౌతిక, ఆధ్యాత్మిక ఉన్నతి కోసం ఉపవాసము అనే విషయం పై చక్కటి వివరణ ఇవ్వబడింది. ఈ సంచిక లో జపాన్ దేశానికీ చెందిన జీవకణ శాస్త్రవేత్త, శరీరనిర్మాణ శాస్త్రము మరియు వైద్య శాస్త్రానికి  గానూ 2016 సంవత్సరపు నోబెల్ బహుమతి గ్రహీత ఐన డాక్టర్ యోషినోరి ఓషుమి స్వీయభక్షక నిర్మాణాలు  ఆటోఫాజి విధానముల పై వారి పరిశోధనా వ్యాసం ఇవ్వబడింది

ఇంత గా  ఔత్సాహకర వాతావరణం ఉన్నందువల్ల  ప్రాక్టి షనర్ లు ఇంకా మన విబ్రో విధానం లో జరుగుతున్న పరిశోదనలు, కొంగ్రొత్త పోకడలను గూర్చి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. ఈ దిశ లో మేము సహృదయులకూ ,నైపుణ్యంతో కూడిన వ్యక్తులకూ ,సేవాద్రుక్పధం కలిగిన వారికీ పురోగమన దిశలో ఉన్న మా విబ్రియో కుటుంబం లోకి హృదయ పూర్వకంగా స్వాగతం పలుకుతున్నాము. స్వామి తమ అపార అనుగ్రహంతో మనకిచ్చిన అరుదైన వరమైనట్టి సాయి విబ్రియోను  ఆత్మ విశ్వాసంతో ముందుకు తీసుకొని వెళ్ళడానికి మరింత విస్త్రుతంగామానవాళికి సేవలందించే భాగ్యం మనందరికి స్వామి ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ

మీ అందరికి ప్రేమను మరియు కాంతిని  ప్రసరిస్తూ,

ప్రేమపూర్వకంగా సాయి సేవలో,

జిత్ కే అగ్గర్వాల్

గర్భసంచిలో కనపడని శిశువు యొక్క ఒక మూత్రపిండము 01339...USA

 29-సంవత్సరాల ఒక మహిళ  మే 2016 లో ఒక అబ్బాయికి జన్మనిచ్చింది.మామూలుగానే గర్భధారణ సమయం లో 20 వ వారంలో నిర్వహించే అల్ట్రాసౌండ్ లో బేబీకి ఒక్క మూత్రపిండము మాత్రమే ఉన్నట్లు డాక్టర్లు కనుగొన్నారు. కనుక డెలివరీ అయ్యే లోపు మిగిలిన సమయంలో ప్రతీ 4 వారాలకొక సారి అల్ట్రా సౌండ్ స్కానింగ్ చేయవలసిందిగా వారు అభ్యర్ధించారు. ఈవిధముగా జరిగినందుకు ఆ యువజంట చాలా నిరాశ కు లోనయ్యారు. తదుపరి నిర్వహించిన అల్ట్రా సౌండ్ స్కానింగ్ లో రెండుసార్లు కూడా అదే రిపోర్టు- కిడ్నీ కనిపించకుండా పోవడం. ఆమె భర్త ఈ విషయాన్నీ ఒక సాయి భక్తునికి చెప్పినప్పుడు వారు సాయి విబ్రియో గురించి చెప్పారు. అంతేగాక ఆ ప్రాక్టీ షనర్ యొక్క ఫోన్ నెంబరు మరియు ఎడ్రెస్ కూడా ఇచ్చారు. ఆ రోజు సాయంత్రమే భర్త చెప్పిన ఎడ్రస్ కు వెళ్లి ప్రాక్టి షనర్ను కలసి తన బాధంతా చెప్పుకున్నాడు.

ఫిబ్రవరి 24 వ తేదీన క్రింది కోమ్బో డోస్ ఇవ్వబడింది . .

CC10.1 Emergency + CC12.1 Adult tonic + CC12.2 Child tonic + CC13.1 Kidney & Bladder tonic + CC13.2 Kidney & Bladder infections + CC13.4 Kidney failure + CC13.5 Kidney stones + CC15.1 Mental & Emotional tonic…TDS 

౩ రోజుల పాటు రోజుకు ౩ సార్లు తదనంతరం రోజుకు 4 సార్లు ఇవ్వవలసిందిగా సూచింప బడింది. ఆ తరువాతరోజులలో 4వ వారం నిర్వహించిన స్కానింగ్ లో కూడా కిడ్నీ కనిపించలేదు కానీ 36వ వారం నిర్వహించిన స్కానింగ్ లో రెండవ కిడ్నీ కనిపించింది. ఆ యువజంట ఆనందానికి అవధులే లేవు. అది బాబా ప్రసాదంగా భావించి వారు బాబాకి తమ హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుకున్నారు. 2016 ఏప్రిల్ నెల 30 తేది న పూర్తీ ఆరోగ్యంతో ఉన్న మొగ బిడ్డకి ఆ తల్లి జన్మ నిచ్చింది.

ఈ సంఘటన గూర్చి శిశువు యొక్క తండ్రి వ్యాఖ్యానం : 
“….పుట్టబోయే శిశువులో ఒక కిడ్నీ లోపించిందనే విషయం మమ్మల్ని ఎంతగానో కృంగదదీసింది. వేరు దారి లేక స్వామికే మొరపెట్టుకున్నాము. మా ప్రార్ధన మన్నించి బాబు యొక్క లోపాన్ని సరిచేసినందుకు స్వామి కి ఎంతో కృతజ్ఞులం. మాకు దారి చూపిన ప్రాక్టి షనర్ కు కూడా హృదయపూర్వక ధన్యవాదాలుఅలాగే స్వామి మా పట్ల ప్రదర్శించిన అవ్యాజమైన ప్రేమకు శతకోటి వందనాలు తెలియ చేసుకుంటున్నాము.."

సైనస్ ఇన్ఫెక్షన్ 01339...USA

2016 మార్చి18వ తేదిన 68 సంవత్సరాల వృద్ధుడు తను 6 నెలలుగా సైనస్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నట్లు తెలిపాడు. వ్యాది నివారణ కోసం ఎన్నో మందులు వాడినప్పటికీ ప్రయోజనం కనిపించలేదు. దీనికి తోడు అప్పుడప్పుడు విపరీతముగా తలపోటువస్తుoడడం తో నిత్యకృత్యాలు చేసుకోవడం కూడా కష్టమయ్యింది. తను సంప్రదించిన విబ్రో ప్రాక్టీషనర్ క్రింది రెమెడి ఇవ్వడం జరిగింది.

CC2.3 Tumours & Growths + CC9.2 Infections acute + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC19.2 Respiratory allergies + CC19.5 Sinusitis…QDS నీటిలో  

నాలుగు రోజుల తరువాత అనగా 22 మార్చ్ 2016, తేదిన ఆ పేషంటు తనకు తలపోటు, సైనస్  ఇన్ఫెక్షన్  చాలావరకు తగ్గిపోయిందని చెప్పాడు. అతను మరొక వారము  QDS వాడి తరువాత OD కి మారడం జరిగింది . చివరిగా 27 వ తేదిన  తనకు పూర్తిగా నయమయ్యిం దని చెప్పి మరియొక సమస్యకు డోస్ తీసుకోవడం జరిగింది.

కుక్క లో దీర్ఘకాలిక దగ్గు, శ్వాస కోశ ఇబ్బంది 00462...USA

మన విబ్రియో ప్రాక్టీషనర్ తమ ఇంటి ప్రక్కన ఉన్న వారి 13 సంవత్సరాల కుక్క ఒక సంవత్సరం నుండి పొడి దగ్గు మరియు శ్వాస కోశ సమస్యతో బాధ పడుతున్నట్లు గ్రహించారు. వెటర్నరీ డాక్టర్ ఇచ్చిన మందులు ఏమీ పనిచెయ్యలేదు, సరికదా దానిని చంపేసి దాని బాధ నుండి విముక్తి చేయమని అయన సలహా ఇచ్చారు. కుక్క యజమాని సూచన పైన 2013 లో విబ్రియో ప్రాక్టీషనర్  వైద్యం ప్రారంభించారు. కుక్క యజమాని కొన్ని రోజులు వెటర్నరీ మందులను ఇవ్వడం వాయిదా వేసి క్షుణ్ణంగా కుక్కను పరీక్షింప చేసారు. కుక్క ఉపిరితిత్తులు బాగానే ఉన్నవి కానీ సెర్వికల్ గ్రంధులు బాగా ఉబ్బి ఉన్నవి,నొప్పి మాత్రం లేదు. క్రింది కొమ్బో డోస్ కుక్కకు ఇవ్వబడింది.

NM36 War + NM63 Back-up + NM95 Rescue Plus + CC19.6 Coughchronic….నీటితో రెండు రోజుల కొకసారి మార్చే విధంగా

రెండు రోజుల తర్వాత యజమాని కుక్కతో నడుస్తూ కనిపించారు. వ్యాది 100 శాతం నయమయ్యింది. వారం తర్వాత డోస్ ఆపేసి నప్పటికీ కుక్క వ్యాది పూర్తిగా తగ్గిపోయి మరో ఒకటిన్నర సంవత్సరం కాలం పాటు ప్రశాంతంగా జీవితం గడిపి నిద్రలో ప్రాణం వదిలింది. 

మూత్ర నాళ సంక్రమణ వ్యాధి 00462...USA

2001వ సంవత్సరం ఒకనాటి రాత్రి ఎవరో ఈ ప్రాక్టీషనర్ యొక్క తలుపు తడుతున్న శబ్దం వినిపించసాగింది. తలుపు తెరిచే సరికి పక్కింటి యజమాని కొడుకు చాలా ఆందోళనగా కనిపించాడు. అతని తల్లికి చాలా తీవ్రంగా నొప్పివస్తోందన్న విషయం తెలుసుకొని వెంటనే అక్కడికి చేరుసరికి అక్కడ 45 సంవత్సరాల పెరు దేశానికి చెందిన ఒక మహిళ మూత్ర విసర్జన చేసే సమయంలో తీవ్రమైన నొప్పి మరియు బాధ అనుభవిస్తున్నట్లు చెప్పింది. భాష సమస్య వల్ల ఆమెను ఎక్కువ ప్రశ్నలు అడగలేదు కానీ ఆమె చెప్పిన దానిని బట్టి ఆమెకు మూత్రాశయ వ్యాధి అని నిర్ధారించి ఆమె ఏ మందులను వాడడం లేదని తెలుసుకొని క్రింది కొమ్బో ఇచ్చాడు. 
#1. SM33 Pain + SR260 Mag Phos + CC13.2 Kidney & Bladder infections...ప్రతీ 5 నిమిషాలకు ఒక సారి తీసుకోవలసిందిగా సూచించడం జరిగింది.

కానీ అవసరమైతే అత్యవసర వైద్యం చేయించడానికి వీలుగా ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఐతే ఆమె అత్యవసర వైద్యం కోసం వేచి ఉండగానే 20 నిమిషాల్లో ఆమెకు 20 శాతం మెరుగుదల కనిపించింది. గంట కల్లా 50 శాతం వ్యాధి తగ్గినట్లు నిర్ధారణ చేసుకొంది. నొప్పి కూడా లేదు. మెల్లిగా లేచి నిలబడి నడవడానికి ప్రయత్నించింది. ఏ ఇబ్బంది లేదు. అంతేకాదు మూత్ర విసర్జన సమయము లో కూడా మునుపటి నొప్పి గానీ మంట గానీ లేవని తెలుసుకుంది. మరో అరగంట గడిచే సరికి 75 శాతం వరకు వ్యాధి తగ్గి పోయింది. ఆమెకు మెడికల్ ఇన్సురెన్స్ లేనందువల్ల డబ్బులు ఎలా కట్టాలో అని ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఇలా వ్యాధి తగ్గిపోయే సరికి ఆనందంగా నర్సుల సూచనపై ఇంటికి చేరుకొంది. మరుసటి రోజు వరకూ ప్రతీ గంటకు ఒకటి చొప్పున డోస్ తీసుకుని తర్వాత రోజుకు ౩ సార్లు  చొప్పున  డోస్ తీసుకొనసాగింది.

మూడవ రోజున ఆమెకు చాలా వరకు నయమయి నొప్పి తగ్గిపోయినందు వల్ల డోస్ను క్రింది విధంగా మార్చడం జరిగింది.

 
#2. CC13.2 Kidney & Bladder infections...TDS 

వారం రోజులలో నూరు శాతం తగ్గుదల కనిపించే సరికి ఆమె డోస్ ను రోజుకు రెండుసార్లు తీసుకోసాగింది. తరువాత ఆ కుటుంబం ఉరు వదిలి వెళ్ళిపోవడం వల్ల ప్రస్తుత స్థితి గురించి తెలియరాలేదు.

హే ఫీవర్ మరియు తలపై దురద 02899...UK

2014మార్చి 29వ తేదీన, 31-సంవత్సరాల ఒక మహిళ హే ఫీవర్ మరియు తలపై దురద చికిత్స నిమిత్తము ప్రాక్టీషనర్ ను సంప్రదించినది. తనకు 13వ సంవత్సరము నుండి ఈ వ్యాధితో బాధ పడుతూ యాంటీ హిస్టమిన్  టాబ్లెట్లు వాడుతున్నారు. ఈ వ్యాధి వల్ల ఆమెకు దురద, కంటివెంట నీరు కారడం ఇంతేకాక కలువలున్న తావులకు వెళ్ళినప్పుడు విపరీతమైన తుమ్ములు.రావడం జరిగేది. యాంటీ హిస్టమిన్ టాబ్లెట్లు కొంత ఉపశమనం కలిగించినా 2012 నుండి జ్వరం మాత్రం చాలా తీవ్రముగా వస్తుండేది. అంతేకాకుండా 5 సంవత్సరాలకు పైగా ఆమె తల పైన దురదతో బాధ పడుతూ ఉన్నది. కారణం ఏమిటన్నది తెలియ రాలేదు. డాక్టర్ సలహా పైన ఆమె షాంపు మార్చడంతో కొంత ఉపశమనం కలిగింది కానీ బాధ మాత్రం పూర్తిగా పోలేదు. ఆమెకు క్రింది డోస్ ఇవ్వడం జరిగింది.

హే ఫీవర్ మరియు కంటి దురద,నీరు కారడం:
#1. CC7.3 Eye infections + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC19.2 Respiratory allergies…TDS.

తల పైన దురద:
#2. CC15.1 Mental and Emotional tonic + CC21.3 Skin allergies…TDS.

ఒక వారం  తరవాత ఆమె తల పైన దురద పూర్తిగా తగ్గిపోయిందని చెప్పింది. ఐతే ప్రాక్టీషనర్ సలహా పైన ఆమె మరొక 3 వారాలు అదే డోస్ వాడింది. హే ఫీవర్ విషయానికొస్తే ఆమె కంటి దురదలు, నీరు కారడం 50 శాతం వరకూ నయమైనవి. అందువల్ల ఆమె  తాను తీసుకొనే ట్యాబ్ లెట్ డోస్ కూడా తగ్గించింది. జూన్ 2014  ఆమెకు నిరాశాజనకంగా ఉన్న కాలము. హే ఫీవర్ తట్టుకోలేని విధంగా రావడంతో ఆమె ఆరోగ్యము పూర్తిగా శిధిలావస్థలోకి చేరుకొంది. వాతావరణం వేడిగా పొడిగా ఉన్నప్పుడు ఆమె పరిస్థితి మరీ విషమం గా ఉండేది. అప్పుడు ఆమె మొదటి డోస్  #1 ను 20 నిమిషాల తేడాతో ఎన్ని ఎక్కువ సార్లు వీలైతే అన్నిసార్లు వేసుకోమని ప్రాక్టీ షనర్ సూచించారు. 4 వారాల తర్వాత ఆమెకు నూరు శాతం నయమయ్యి ఎంతో అనందం పొందింది. తర్వాత ఆమె సెప్టెంబర్ వరకూ రోజుకు రెండు సార్లు వేసుకోవలసింది గా సూచింప బడింది. జనవరి 2015 లో ఆమెకు తల పైన దురద తిరిగి ప్రారంభ మయ్యింది. కానీ రెండవ డోస్  #2 ను వారం రోజుల పాటు తీసుకోగానే పూర్తిగా తగ్గిపోయింది. 2015 వేసవి నుండి ఆమె మొదటి డోస్  #1 ను మధ్య మధ్య తీసుకుంటూ యాంటీ హిస్టమిన్ టాబ్లెట్లు పూర్తిగా మానివేసినది. విబ్రియో రెమెడీ తన పైన అద్భుతంగా పనిచేశాయని చెపుతూ ఇంక తనకున్న ఒకే ఒక సమస్య లిలీ పువ్వులు దగ్గర కాగానే తుమ్ములు రావడం. 2016 నుండి హే ఫీవర్ ను కంట్రోల్ లో ఉంచడానికి ఆమె ఒకటవ డోస్ #1ను రోజుకు ఒకసారి OD గా తీసుకోసాగింది. కానీ పుప్పొడి పెరిగే సీజన్లో రెండుసార్లు BD తీసుకోవలసిందిగా సూచింప బడింది. రాను రాను ఆమె కలువలకు చాలా దగ్గరగా ఉన్నా ఏ ఇబ్బంది లేని పరిస్థితి కలిగింది. మధ్యస్తంగా ఉండే రోగ లక్షణాలు బాగా వేడిగా ఉండే వేసవి రోజులలో పుప్పొడి శాతం ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే కనిపించేవి. కనుక సెప్టెంబర్ 2016 నుండి 1 వ డోస్ పూర్తిగా మానివేసి  2017 వేసవిలో ప్రివెంటివ్ డోస్ లాగా తీసుకొనుటకు నిర్ణయించుకున్నారు. అంతేకాదు  2016, డిసెంబర్ తర్వాత తల పైన దురద తిరిగి రాలేదు.

శిశువులో నిగూఢమైన నొప్పి 02921...Italy

2016 ఏప్రిల్ 16వ తేదిన ఒక తల్లి తన 8 సంవత్సరాల పాపను ప్రాక్టీషనర్ వద్దకు తీసుకొని వచ్చింది..ఆ పాప పొత్తి కడుపులోను మరియు ప్రేగులలోనూ విపరీతమైన నొప్పితో 3 నెలలు గా బాధపడుతూ ఉంది..కానీ ఆ నొప్పి రాను రానూ తలకు, వీపు వైపు, భుజాలకూ కాళ్ళకు చేతులకు వ్యాపించింది. ఆమె ఆ నొప్పి భరించలేక పెద్దలు తీసుకునే అధిక డోసుకు అలవాటుపడిపోయింది. కానీ ఆ బాధా నివారణలను వాడడంలో ఆమె పొందే ఉపశమనం కొద్ది సేపు మాత్రమే. డాక్టర్లు ఆమె బాధకు నివారణ కానీ కనీసం ఆ బాధకు కారణం ఏమిటో కూడా తెలుసుకోలేక పోయారు. వైద్య పరీక్షల ద్వారా కూడా ఆమె బాధకు కారణం ఏమిటో తెలుసుకో వడానికి సాధ్యం కాలేదు. ఆమె తల్లి చెప్పిన దానినిబట్టి పాప గతించిన కాలంలో ఎట్టి మానసిక సంబంధ వ్యాదులకు భయాందోళనల కూడా గురికాలేదు. ఈ నొప్పి ఎప్పుడయినా ఎక్కడయినా మొదలు కావచ్చు. ఈ నొప్పి కొన్ని నిమషాలు కానీ కొన్ని గంటలు కానీ ఉంటుంది. ఇప్పటికే ఆమె 2 నెలలు పాఠశాలకు వెళ్ళలేకపోయినది అంటూ ఆ తల్లి తన గోడు వెళ్ళ బోసుకున్నది. తన స్నేహితుల ద్వారా విబ్రియో గురించి తెలుసుకొని వచ్చానని చెప్పింది. ఏప్రిల్ 17వ తేదీన పాపకు క్రింది డోస్ ఇవ్వడం జరిగింది: 
CC4.6 Diarrhoea + CC12.2 Child tonic…6TD

కేవలం ఒక్క రోజులోనే పాపకు నొప్పి 75% తగ్గిపోయి తరువాత రండు రోజులూ ఆనందంగా గడిపింది. కానీ 3 వ రోజు ఆమెకు పుల్లౌట్ రావడంతో భరింపరాని నొప్పి వచ్చింది. పెయిన్ కిల్లర్స్ ఇచ్చినా ప్రయోజనం లేకపోవడంతో మందు వేసుకోవడం రెండు రోజులు ఆపారు.

5వ రోజున రోజుకు ఒక్కటి చొప్పున OD డోస్ ఇవ్వబడింది. అదే రోజు ఆమెకు 10 శాతం బాధ నివారణ ఐనట్లు అనిపించింది. వారం గడిచేసరికి పెయిన్ కిల్లర్స్ వాడడం పూర్తిగా మానేసింది. నొప్పి 75 శాతం తగ్గిపోయింది. ఐతే పాప కొంత అనీజీ గా ఉన్నప్పటికీ ప్రాక్టీషనర్ అదే డోస్ కంటిన్యూ చేయాలనీ నిశ్చయించారు. రెండు వారలు గడవగానే నొప్పి పూర్తిగా నూరు శాతం మాయమయ్యింది.  పాప మరియు ఆమె తల్లి ఆనందానికి అవధులే లేవు.

అదే డోస్ 3 వారాలు కంటిన్యూ చేసాక  3TW గా ఒక వారము 2TW గా మరొక వారము చివరగా OW  గా రెండు వారాలు వేసుకొని జూన్ 30 న ఆపివేసింది. అక్టోబర్ 2016 నాటికి ఆమెకు ఏ విధమైన నొప్పి రాలేదు.

రక్త నాళికలు గడ్డకట్టడం (డీప్ వీన్ త్రంబోసిస్ ) 10940...India

2012 లో రక్త నాళికలు గడ్డకట్టే వ్యాధి తో ఒక 33  సంవత్సరాల మహిళ హాస్పిటల్లో చేరింది. వ్యాధి తగ్గినట్లు అనిపించినా 3 సంవత్సరాల తర్వాత మరల తిరగ బెట్టింది .ఆమె వైబ్రియోనిక్స్ ప్రాక్టీషనర్ ను సంప్రదించింది. ఆమెకు కుడి మోకాలి క్రింద భాగమంతా రాయిలా గట్టిగానూ, తిమ్మిరిగాను ఉంటుంది. దీనివల్ల ఆమెకు నడవడం ఇబ్బందికరంగా ఉండడమేకాక బాసిపెట్టు వేసుకొని కూర్చున్నప్పుడు చాలా బాధగా ఉంటోంది.ఆమె బోధనా వృత్తిలో ఉండడం వల్ల చాలా సమయం నిలిచి ఉండడం, మెట్లు ఎక్కుతూ ఉండడం ఆమెకు ఉన్న బాధను కాస్తా ఎక్కువ చేసింది.

2015 అక్టోబర్ 28 తేదీన క్రింది కొమ్బో ఆమెకు ఇవ్వబడింది.

CC3.1 Heart tonic + CC3.4 Heart emergencies + CC20.4 Muscles & Supportive tissue…TDS.

ఆమె డాక్టర్ ఇచ్చిన మందులను వాడడం లేదు కానీ కొన్ని ఎక్సర్సైజులు మాత్రం చేయసాగింది. 

రెండు వారాలు మందులను వాడిన తర్వాత ఆమెకు 60% నివారణ కలిగింది. కానీ  భజనల్లో కుర్చొనడం, ఎక్కువ సేపు నిలబడి పాఠాలు చెప్పడం ఇబ్బంది గానే ఉంది. ఆమె అదే మందును రోజుకు రెండు సార్లు వాడవలసినదిగా సూచింప బడింది.

మూడు వారల తర్వాత ఆమెకు 95 శాతం బాధ నివారణ అయ్యింది. ఇప్పుడామె ఎక్కువ సమయం నిలబడడం లో గానీ మెట్లు ఉపయోగించు కోవడంలో గానీ ఇబ్బంది పడడం లేదు. కనుక డోస్ ను నెల రోజుల వరకూ రోజుకు ఒక్కసారికి తగ్గించడం జరిగింది. ఆ తర్వాత ఆమె మందు తీసుకోవడం పూర్తిగా ఆపారు. 2016 డిసెంబర్ నాటికీ ఆమెకు వ్యాధి నుండి పూర్తి విముక్తి లభించింది. ఎప్పుడయినా మరీ ఎక్కువ సమయం నిలబడవలసి వస్తే కొంత ఇబ్బంది ఉంటోంది కానీ విశ్రాంతి తీసుకొంటే తగ్గిపోతుంది.  

ఆహార పరమైన మానసిక రుగ్మత 11567...India

2015 మార్చ్ 20వ తేదీన 22 సంవత్సరాల యువతిని ఆమె తల్లి ప్రాక్టీషనర్ వద్దకు తీసుకు వచ్చింది. చిన్నతనము నుండీ ఈ యువతికి అన్నం తినడం అలవాటు లేదట కారణం ఏమిటంటే అన్నం తింటే ఆమె గొంతు పట్టేస్తుందట. కనుక ఆమె మూడు పూటలా స్నాక్స్ తింటూ జీవితం సాగిస్తోంది.

 ఆ యువతి తల్లి ఎందరో డాక్టర్లను సంప్రందించింది. కానీ వారందరూ ఆమెకు ఏ సమస్యా లేదు, ఆమె ఆహార నాళము కూడా చక్కగా ఉంది అని చెప్పారు. అందుచేత ఆ యువతి సమస్య మానసిక మైనదేమో అని భావించింది. తెలిసిన వారు ఇచ్చిన సలహా పైన చిన్నచిన్న ముద్దలుగా అన్నం తినాలని ప్రయత్నించింది. కానీ గొంతు పడుతుందేమో అన్న భయంతో ముద్ద ముద్ద కూ మంచి నీరు త్రాగుతూ ప్రయత్నించింది. అలా కూడాను ఎక్కువ ముద్దలు తినలేకపోయింది. హోమియోపతి మందులు వాడి చూసారు కానీ ప్రయోజనంలేదు.  

ఆ యువతికి క్రింది రెమిడి ఇచ్చారు.

CC12.1 Adult tonic + CC15.2 Psychiatric disorders + CC15.4 Eating disorders…TDS

మరుసటి దినము ప్రాక్టీషనర్కు వచ్చిన సమాచారం ప్రకారము ఒక్క గోళీ వేసుకోగానే బాగా ఆకలి అనిపించి కొద్దిగా ఆహారం తీసుకున్నదట. పది రోజుల తర్వాత ఆమె తీసుకొనే అన్నం పరిమాణం లో 25 శాతం పెరుగుదల, ఆమె తీసుకొనే నీటి పరిమాణం లో 25 శాతం తగ్గుదల కనిపించాయి. అన్నం తింటే గొంతు పట్టేస్తుదనే ఆమె భయం కూడా పూర్తిగా పోయింది. పూర్తిగా తగ్గేవరకు రెమిడి వాడేలా సలహా ఇవ్వబడింది.

సంపాదకుని వ్యాఖ్య :
ఇది చాలా అరుదయిన విషయం. ఇది అంతః చేతన లో ఏర్పడిన సమస్య కావచ్చు. బహుశా పసితనం లో తగిన వయసు రాకుండానే తల్లి పాలు మాన్పించినందువల్ల ఈ సమస్య ఏర్పడి ఉండవచ్చు.

ఆహార రుగ్మతలు 11577...India

ఒక 60సంవత్సరాల మహిళ హటాత్తుగా ఆహారం పైన విరక్తి పెంచుకొని అన్నం, నీరు తీసుకోవడం మానేసింది. 3 రోజుల తర్వాత ఆమెను అత్యంత బలహీన స్థితిలో హాస్పిటల్లో ఎడ్మిట్ చేసారు. ఎన్ని టెస్టులు చేసినప్పటికీ రోగమేమిటో అంతు చిక్కలేదు. కొన్ని మందులు రాసిచ్చి ద్రవ పదార్దాలు, తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోమని చెప్పారు. కానీ ఆమె బాగా విరక్తిచెంది ఉండడంతో కనీసము మందులు తీసుకోవడానికి కూడా నిరాకరించారు. కుటుంబ సభ్యుల బలవంతం మీద కేవలం కొద్దిగా నీరు మాత్రమే తీసుకుంటున్నది. రెండు రోజుల తర్వాత ఆమెను డిశ్చార్జ్ చేసారు, ఆమె కుటుంబ సభ్యులకు ఇక ఆమె పైన ఆశలన్నీ వదులుకున్న నిస్సహాయ స్థితి లో సాయి వైబ్రియోనిక్స్ ప్రాక్టీషనర్ ను సంప్రదించారు. ఆమె కూడా ఈ రెమిడి వాడడానికి ఒప్పుకోవడంతో  8 ఏప్రిల్ 2016 న, క్రింది కొమ్బో ఇచ్చారు:
CC12.1 Adult tonic + CC15.4 Eating disorders...QDS నీటితో

కేవలం రెండు రోజులలోనే ఆమెలో మార్పు వచ్చి కొద్దిగా ఆహారం, నీరు తీసుకోవడం ప్రారంభించింది. వారం తర్వాత ఆమె అందరిలాగే ఆహారం నీరు తీసుకోవడమే కాదు మాట్లాడడం, నడవడం కూడా చేయసాగింది. ఏప్రిల్ నెలాఖరుకు ఆమెలో నూరు శాతం మార్పు వచ్చేసింది. రెండు వారల పాటు QDS గానూ అనంతరం రెండు వారల పాటు BD గానూ డోస్ ఇవ్వబడింది. 2016,డిసెంబర్ నాటికీ ఆమె జబ్బు పూర్తిగా మటుమాయమయ్యింది.

పార్శ్వపు నొప్పి, నిద్ర లేమి సమస్య 03516...Canada

ఒక 40 సంవత్సరాల మహిళ 2015 మార్చ్ 10వ తేదిన వైబ్రియోనిక్స్ ప్రాక్టీషనర్ ను సంప్రదించి తనకు 3 సంవత్సరములుగా తీవ్రమైన పార్శ్వపు నొప్పి, నిద్రలేమి సమస్య ఉందని చెప్పారు. ఆమె పార్శ్వపు నొప్పి తీవ్రమైన తలపోటు వికారంతో వస్తోందని ఇది ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం పడుకొనే వరకు ఉంటోందని చెప్పింది. దీన్ని తట్టుకోలేక పగలు అప్పుడప్పుడు కాస్త విశ్రాంతి  తీసుకుంటూ ఉంటాననీ అలా చేయలేకపోతే కళ్ళు తెరవలేను, పని పైన మనస్సు నిలపలేనని చెప్పింది. ఆమె హోమియో పతి మందులు ప్రయత్నించారు కానీ ప్రయోజనం లేదు. అల్లోపతి డాక్టర్ ఆమె వ్యాధికి కారణం కనుగొనలేక పోవడంతో ఏ మందులు ఇవ్వలేదు. నిద్రలేమి కి మందులు వాడడం లేదు కానీ పార్శ్వపు నొప్పి తట్టుకోలేక ఆమె చాలా అధిక డోస్ పెయిన్ కిల్లర్ లను వాడుతున్నారు. ఇటువంటి నిస్సహాయ స్థితిలో ఆమె ప్రాక్టిషనర్ ను సంప్రదించారు.

ఆమెకు ఇవ్వబడిన కొంబో  

పార్శ్వపు నొప్పికి:
#1.  CC11.3 Headaches + CC11.4 Migraines + CC12.1 Adult tonic + CC15.2 Psychiatric disorders + CC17.3 Brain & Memory tonic + CC18.1 Brain disabilities...TDS

నిద్రలేమి వ్యాధికి:
#2.  CC15.6 Sleep disorders...2 doses before bedtime, 1 hour apart. 

నెల రోజులు వాడిన తర్వాత ఆమె పార్శ్వపు నొప్పిలో 10%తగ్గుదల, నిద్ర పోవడంలో 20% పెరుగుదల కనిపించింది. మే 2015 నాటికీ అనగా రెండు నెలలు గడిచేసరికి 50% మెరుగుదల కనిపించింది. ఆగస్టు నాటికి 90% మెరుగుదల కనిపించే సరికి  #1 ను  OD గానూ  #2 ను పాత డోస్ ప్రకారముగానూ తీసుకోసాగారు. పెయిన్ కిల్లర్ వేసుకోవడం పూర్తిగా మానేసారు.

మార్చ్ 2016 నాటికి మెరుగుదల 90 శాతమే ఉన్నా పార్శ్వపు నొప్పి వారానికి 2 లేదా 3 సార్లు మాత్రమే వస్తుండడంతో నొప్పికి  #1 ఎక్స్ట్రా డోస్ గా తీసుకోసాగారు. చివరి రిఫిల్ సీసాలు ఇచ్చేనాటికి ఆమె ఎంతో ఆనందంగా కనిపించారు. ప్రాక్టీషనర్ ఆమెను మంచి ఆహారము, తీసుకుంటూ చక్కని జీవన శైలిని కలిగి ఉండమని సలహా ఇచ్చారు. సెప్టెంబర్లో ఆమె తన బాబును తీసుకోని వచ్చినప్పుడు తనకు ఏ రుగ్మతలు లేవని చెప్పారు. డిసెంబర్ 2016 నాటికి తిరిగి ఆ వ్యాధులు తలెత్త లేదని చెప్పారు.

దీర్ఘకాలిక తెల్లబట్ట వ్యాధి 11578...India

ఒక 40 సంవత్సరాల మహిళ గత 20 సంవత్సరాలుగా ప్రతీ  రోజు అయ్యే తెల్లబట్ట వ్యాధితో బాధపడుతున్నారు. ఈ వ్యాధికి కారణ మేమిటో ఆమెకు తెలియలేదు మందులు కూడా ఆమె వాడలేదు. కానీ పరిస్థితి రాను రానూ చాలా ఇబ్బందికరంగా ఉండడంతో ఆమె వైబ్రియోనిక్స్ ప్రాక్టీషనర్ ను సంప్రదించి 2016 ఏప్రిల్ 11న క్రింది డోస్ తీసుకొన్నారు.


CC8.1 Female tonic + CC8.5 Vagina & Cervix + CC8.6 Menopause + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic...QDS 

రెండు వారాల్లోనే ఆమెకు 75%, నెల రోజులలో 100%వ్యాధి నయం అయ్యింది. మరో నెల రోజుల పాటు డోస్ ను  BDగా తీసుకోని తర్వాత పూర్తిగా మానేశారు. తర్వాత ఆమె తన కీళ్ళనొప్పులు, రక్తహీనత వ్యాధులకు కొంబో తీసుకున్నారు. చివరి సారి కలిసినప్పుడు గత 7 నెలలు గా తనకు ఏ వ్యాధి లేదని తెల్లబట్ట వ్యాధి పూర్తిగా మాయమయ్యిందని చెప్పారు.

సంపాదకుని వ్యాఖ్య :
దీర్ఘకాలికమైన వ్యాదులన్నింటికి నిర్ణీతమైన పధ్ధతి లో డోస్ తగ్గించుకుంటూ రావాలి. ప్రస్తుత సమస్య 20 ఏళ్ల నాటిది కనుక క్రమంగా ఎక్కువ కాలం పాటు డోస్ తగ్గించు కొంటూ వచ్చి OWగా దానిని పరిసమాప్తి చెయ్యాలి.

అభ్యాసకుల ప్రొఫైల్ 01339...USA

ప్రాక్టీ షనర్  01339...USA     మార్కెటింగ్ మరియు సేల్స్ విభాగంలో వైస్ ప్రెసిడెంట్ గా అమెరికాలోని ఒక ప్రఖ్యాత ఆరోగ్య భీమా సంస్థలో పనిచేయుచున్న ఈమె  2006 లో దాని నుండి వైదోలగింది. కారణం ఆమె పని చేయుచున్న కంపెనీ మేనేజ్ మెంట్, ఆరోగ్య భీమా సంస్థలు, ఫార్మాసుటికల్ కంపెనీలు లాభార్జన దృష్టి తో వ్యాపారం చేస్తున్నాయి కానీ పేద పేషంట్ల సంక్షేమం కోసం కృషి చేయడం లేదు. ఇది చాలా అధర్మం అని ఆమెకు తోచింది. కాలం గడుస్తున్న కొద్దీ ఆమె చేస్తున్న పనికి  ఆమె యొక్క ఆధ్యాత్మిక జీవితమునకు పొత్తు కుదరదు అని ఆమెకు తోచింది. అంతేకాక అనారోగ్యముగా ఉన్న పేషంట్లకు సేవ చేయుటకు కంపెనీ వారు నిరాకరించడంతో ఆమె వెంటనే వైదొలగింది. అప్పటినుండి ఆమె వైబ్రియో పేషంట్ల కోసం విస్తృతంగా పనిచెయ్యడం ప్రారంభించింది. గత 10 సంవత్సరములుగా ఆమె ఉంటున్న ప్రాంతంలోని ఒక ఉచిత ధార్మిక స్వచ్చంద సంస్థ లో వాలంటీర్ గా పనిచేస్తోంది. ఇదేకాక  ఆమె తన దేశంలోనూ అంతర్జాతీయముగా కూడా కొన్ని స్వచ్చంద సంస్థలు నెలకొల్పింది.

1999 లో ఆమె మొదటిసారి భగవాన్ బాబా వారిని చూడడానికి ప్రశాంతి నిలయం వచ్చినప్పుడు నిలయం లోని రూమ్మేట్ ద్వారా సాయి వైబ్రియోనిక్స్ గురించి తెలుసుకున్నారు. ఒక సాయంకాలపు వేళ డాక్టర్ అగ్గర్వాల్ గారిని కలుసుకొన్నది. వారు ఆమె విబ్రియో ట్రైనింగ్ తీసుకొనడానికి అంగీకరించారు. కొన్ని రోజుల తర్వాత ఆమె SRHVP కార్డులూ, విబ్రియో గోళీలు, రెమిడి సీసాలు మరెన్నో ఆశలతో సేవా లక్ష్యంతో ప్రశాంతి నిలయం విడిచి తమ ఊరు  చేరుకున్నారు. ఎక్కడయినా ఎప్పుడయినా సేవ ఉన్నదని తెలిస్తే చాలు ఆనందంగా ఆ సేవలో పాల్గొంటారు.                                               ప్రశాంతి నిలయం వచ్చిన ఈ ట్రిప్ లోనే ఆమె బాబాతో ఎన్నోసార్లు ఆంతరంగిక సంభాషణల భాగ్యం పొందారు. మొదటి ఇంటర్వూలో బాబా ఆమెకు కొత్త ఉద్యోగం ప్రసాదిస్తానని చెప్పారు. ఆమె ఆశ్చర్యంతో స్వామీ 3 నెలల క్రితమే నేను కొత్త జాబ్ లో జాయినయ్యాను కదా అన్నారు. అప్పుడు స్వామి నాకు తెలుసు కానీ నేనిచ్చే జాబ్  నీకు ఎంతో సేవా భాగ్యాన్ని సంతృప్తిని అందిస్తుంది అని చెప్పారు. ఆ మాటలు అక్షరాలా నిజమయ్యాయి. 2009, ఈమె ఆశ్రమానికి వచ్చి అగ్గర్వాల్ సార్ను కలిశారు. బాబా వారి ద్వారా ఆశీస్సులు పొందిన 108CC బాక్స్ గురించి తెలపగానే ఆమె దానిని ఉపయోగించడంలో ట్రైనింగ్  తీసుకున్నారు. శిక్షణ ముగించుకొని కోమ్బో బాక్స్ తో ఇంటికి చేరారు.

కొన్ని నెలల తర్వాత అమెరికాలో జరిగిన రిట్రీట్ కు హాజరయ్యారు. అక్కడ జరిగిన మెడికల్ క్యాంప్ లో వైబ్రియోనిక్స్ గురించి అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యం తో అందులో పాల్గొన్నారు.ఆశ్చర్యకరంగా మొదటి రోజు ఆమె 25 మంది పేషంట్లకు వైద్యం చేసారు. ఆ తర్వాత ఆమె పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యి లాగా మారిపోయింది. ఆమె వద్ద పేషంట్లకు ఇవ్వడానికి సరిపడా రెమెడీ బాటిల్స్ లేవు. 9 మాత్రమే ఉన్నాయి. ఇంటికి వెళ్లి తెచ్చుకొనే పరిస్థితి లేదు. స్వామిని ప్రార్ధించి క్యాంప్ లో కూర్చుని వైద్యం ప్రారంభించారు. ఒకరి తర్వాత ఒకరు పేషంట్లు వస్తూనే ఉన్నారు. క్యాంప్ పూర్తి అయ్యే సమయానికి ఆమె 29 మంది పేషంట్లకు వైద్యం చేసారు. అందరికీ రెమిడి బాటిల్స్ సరిపోయాయి. 9 ఆమె తెచ్చుకున్నవి. 20 బాబా సృష్టించినవి ఎంత ఆశ్చర్యం?  ఆ విధంగా రెండు రోజులలో ఆమె 54 మంది పేషంట్లను, బాబావారి లీలనూ  చూసారు.  బాబా వైబ్రియోనిక్స్ పట్ల ఎంత మక్కువ తో ఉన్నారో అర్ధ మై మరింత ప్రేమతో, నమ్మకం తో పేషంట్లకు సేవలందించే బాబా వారి ఉపకరణం గా మారారు. వైబ్రియోనిక్స్ ను వ్యాప్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకొన్నారు. ఎంతో మంది ఆమె వద్దకు వైద్యం కోసం రాసాగారు. పేషంట్ల పట్ల ఆమె చూపే వాత్సల్య, ప్రేమాభిమానాలకు, పిల్లల వైద్య నిపుణులయిన ఆమె భర్త ముగ్ధులై తన పంధాను కూడా మార్చు కున్నారు.

ఆమె ఉండే ప్రాంతము జనాభా శాతం తక్కువగానూ, దూర దూరంగానూ ఉండే ప్రాంతం కనుక ఆమె తన ప్రాక్టీస్ కోసం ఎక్కువగా  ఫోన్లు, ఈ మెఇల్, స్కైప్ పైన ఆధార పడ్డారు. ఆమె ద్వారా వ్యాది నివృత్తి పొందిన పేషంట్లు వారి అనందాన్ని కుటుంబీకులకు, స్నేహితులకు, పంచడంతో కొత్త పేషంట్లకు కొదవ ఉండేది కాదు.

ఈ ప్రాక్టీషనర్ ప్రశాంతి నిలయం సందర్శించినప్పుడల్లా డాక్టర్ అగ్గర్వాల్ గారు కంప్యూటర్ వద్ద ఎంతో సమయం వెచ్చిస్తూ  వివిధ ప్రాంతాలు నుండి వచ్చిన ఈమెయిల్ లకు సమాధానం పంపడం, ఒకేప్రశ్నకు అనేకసార్లు  అనేకమందికి సమాధానం పంపడం ఇదంతా కష్టంతో కూడుకున్న, సమయాన్ని హరించే విధానము అని భావించి ‘సార్ మీరు ఈ వెబ్సైటు ను అప్డేట్ చేసి పదే పదే అడిగే ప్రశ్నలకు సమాధానాలు, కొంగ్రొత్త పోకడలు, ప్రాక్టీషనర్ లకు సూచనలు ఇవన్నీ చేర్చడం వల్ల మీకు సమయం కలసి వస్తుంది, ఎంతో మంది ప్రాక్టీషనర్ లకు ఉపయుక్తంగా కూడా ఉంటుంది అని చెప్పారు. వెంటనే అగ్గర్వాల్ సార్ బాగుంది అదేదో నీవే చేయరాదా అన్నారుట. నేనా నాకసలు కంప్యూ టర్ పరిజ్ఞానమే లేదు అని ఈమె చెప్పారట. వెంటనే అగ్గర్వాల్ సార్ లేదు లేదు నీవు చేయగలవు స్వామి నీకు సహాయ పడతారు అన్నారట. ఆ విధంగా స్వామి పంపిన సాఫ్ట్ వేర్ నిపుణుల సహాయంతో 2009 గురుపూర్ణిమ నాటికీ  www.vibrionics.org ను ప్రారంభించడం జరిగింది. ఆమె టేబుల్ పైన ఇప్పటికీ ఒక స్వామి సూక్తి రాసి ఉంటుంది ²ఎంత పెద్ద పని ఐనా ఫరవాలేదు నీవు చేయగలవు స్వామి నీకు ఎల్లవేళలా సహాయ పడతారు” (2007 మార్చ్ సత్యసాయి స్పీచ్ ).

వైబ్రియోనిక్స్ తన సేవా పరిధి ని విస్తృత పరుస్తూ ప్రాక్టీషనర్ లతో మరింత వేగవంతంగా సమాచార సంబంధాలు కొనసాగిస్తూ ముందుకు దూసుకుపోసాగింది. ఆ విధంగా జూలై 2010 నాటికీ ఈ ప్రాక్టీషనర్ డాక్టర్ అగ్గర్వాల్ సార్ తో కలసి ఒక క్రొత్త ప్రాజెక్ట్ ‘‘ సాయి వై బ్రియోనిక్స్ వార్తా లేఖలు’’ప్రారంభించి రెండు నెలలలోనే మొదటిసారిగా వార్తా లేఖను రూపొందించి 2010 సెప్టెంబర్ 17 న డాక్టర్ అగ్గర్వాల్ గారిచే స్వామికి బహూకరించబడింది .స్వామి ప్రతీ పేజీని నిశితంగా పరిశీలించి ఆశీస్సులు అందించి ఆ లేఖను తమ వద్దే ఉంచుకున్నారు. ఇప్పుడు వార్తా లేఖ అనేది అనేకమంది కార్యకర్తలు, ప్రాక్టీషనర్ లు, అనువాదకులు, లేఖకులు, సమీక్షకుల సేవకు, ప్రేమకు గీటురాయి. ఇది వైబ్రియోనిక్స్ కుటుంబ సభ్యులను ఒక్క తాటి మీదకు తెచ్చి తమ భావాలూ అనుభవాలు, ప్రశ్నోత్తరాలు, రోగ చరిత్రలూ, ప్రాక్టీషనర్ల  ప్రేరణ కలిగించే ఆంతరంగిక సమీక్షలు, అన్నింటి సమాహారంగా విశ్వ వ్యాప్తమయ్యింది.

అమెరికాలోని హార్ట్ ఫోర్డ్ CT లో  22 మందితో మొదటి వర్క్ షాప్ 2012 అక్టోబర్ లో ఈ ప్రాక్టీషనర్ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యింది. డాక్టర్ అగ్గర్వాల్ మరియు శ్రీమతి అగ్గర్వాల్ ట్రైనీలుగా వ్యవహరించారు. ఈ వర్క్ షాప్ అనంతరం ఈమె అమెరికా, కెనడా దేశాలకు ట్రైనర్ మరియు కోఆర్డినేటర్ గా నియమింపబడ్డారు. 2013 నుండి ఈమె ఎంపిక ఐన విద్యార్ధులకు ఈ-కోర్స్ నిర్వహించడం, 3 రోజుల AVP వర్క్ షాప్ నిర్వహించడం వంటివి ఇతర టెక్నిషియన్లు,వాలంటీర్లు  సహాయంతో నిర్వహిస్తున్నారు. నెలకొకసారి ప్రాక్టీ షనర్ల ఉపయోగార్ధము సంబంధిత అంశాల పైన కాన్ఫెరెన్స్ లు కూడా నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఈమె ఇతర సీనియర్ ప్రాక్టీషనర్ ల సహాయంతో హాస్పిటల్లో ఉండి విబ్రో సేవలు అందుకోలేని పేషంట్ల నిమిత్తం  AVPలు/VP లకు ఉప యోగకరంగా ఉండే విధంగా 2016 గురు పూర్ణిమ రోజున ప్రసార మాధ్యమాన్ని ప్రారంభించారు.

1999 లో స్వామి చెప్పిన రీతిగా వైబ్రియోనిక్స్ సేవ ఈమెకు అపరిమితముగా ఆనందాన్ని అందిస్తోంది. ఆధ్యాత్మికత లో కూడా ఆమెలో ఎంతో పరివర్తన వచ్చింది. “ నా హృదయం  వైబ్రియోనిక్స్ ద్వారా విద్యార్ధులకు, రోగులకు, సేవలందించుట  ద్వారా దయ ప్రేమ కరుణ లతో నిండిపోయింది. ఎవరు బాధ పడుతూ ఉన్నా, వైబ్రియోనిక్స్ సేవల కోసం ఎవరు ఎదురు చూస్తున్నా వారిపట్ల నాకు తెలియకుండానే ఒక ప్రేమ ప్రవాహం ప్రసరిస్తోంది. నన్నుఈ విధంగా మార్చి ఒక ఉత్తమమైన ఉపకరణం గా మార్చుకున్నందుకు స్వామికి ఎంతో కృతజ్ఞురాలిని ’’ అంటున్నారీమె. నిజంగా ఇది హృదయాన్ని తాకే గాధ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

అభ్యాసకుల ప్రొఫైల్ 00462...USA

ప్రాక్టీ షనర్  00462…USA  ఈ ప్రాక్టీ షనర్ 1978 లో బెంగుళూరులో ఉన్నప్పుడు హోమియోపతి గురించి మొదట సారి తెలుసుకున్నారు. ఒక వర్క్ షాప్ జరుగుతూ ఉంటే స్వామి నారాయణి మరియు స్వామి ఆనందలను కలుసుకునే భాగ్యం వీరికి కలిగింది. ఈ దంపతులు నారాయణి మిక్స్చర్ అనబడే అనేక హొమియోపతీ మిశ్రమాలను తయారుచేసి రోగులకు ఇచ్చేవారు. వెటర్నరీ డాక్టర్ గా పనిచేస్తున్న ప్రాక్టీ షనర్ కొన్నిప్రత్యేక మైన వ్యాధులకు తమ విభాగంలో మందులు లేకపోవడంతో నారాయణి హీలింగ్ విధానము గురించి నేర్చుకోవాలని భావించారు. ఆకర్షనీయమైన ఫలితాలతో చక్కని వైద్యంతో ముందుకు వెళుతున్న నారాయణి సిస్టం బెంగుళూరు విభాగంలో వీరు వాలంటీర్ గా పేరు నమోదు చేయించుకున్నారు. ఈ క్లినిక్ లు వారానికి రెండు సార్లు సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభ మై ఎంత సమయమైనా సరే చిట్ట చివరి పేషంట్ ను చూసే వరకు ( సుమారు  200-400 వరకు పేషంట్లను ) ప్రేమ అంకిత భావంతో కొనసాగుతాయి.

ఈ ప్రాక్టీ షనర్ తన గతించిన అనుభవాలను గుర్తుకు తెచ్చుకుంటూ ఒక సినియర్ ప్రాక్టీ షనర్  ఐన సాయిభక్తుడు తన పేషంట్లను చూసే సేవ చేసే తీరు వారి వ్యక్తిత్వము, తనను చాలా ప్రభావవంతం చేసాయని చెప్పారు. పేషంట్లు ఏ కులమైనా, ఏ మతమైనా, ధనికులైనా, పేదలైనా మనం వారిపట్ల ఒకే విధమైన ప్రేమను చూపించాలని తెలుసుకున్నారు. ఆ సాయిభక్తుని ప్రభావం వల్ల తన వైఖరిలో ఎంతో మార్పు వచ్చిందని ప్రాక్టీ షనర్ చెపుతున్నారు. 1986 లోఅమెరికా వెళ్ళిన తర్వాత ఇక్కడ నేర్చుకున్న విషయములను అమెరికాలో ఉన్న జంతువుల పునరావాస కేంద్రంలో, సేవ చేయడం ద్వారా ఆచరణలో పెట్టారు.

ఎన్నో సంవత్సరాల సేవా అనుభవంతో ఈ ప్రాక్టీ షనర్ జీవితంలోని ఎన్నో జటిలమైన సమస్యలకు పరిష్కారాలు మనం ఉహించని రీతిలో చాలా సరళంగా ఉంటాయని తెలుసుకున్నారు. తనకున్న అపారమైన పుస్తక పరిజ్ఞానము, రోగులతో వారి రోగాలతో ఉన్న అనుభవము, కొన్ని సామాన్య వ్యాధులకు, ఋతు సంబంధమైన వ్యాదులకు సులువైన రెమిడి లను కనుగొనేందుకు పురిగొల్పింది. ముఖ్యంగా అలెర్జీ , వృద్ధాప్య కీళ్ళ వాతము, గాయాలు, సామాన్య జ్వరము వంటి వాటిలో వీరు చక్కని ఫలితాలు సాధించారు. వీరు ప్రస్తుతం పనిచేస్తున్న టెక్సాస్ ప్రాంతంలో పుప్పొడికి సంబంధించి ఎలెర్జీలను నయం చేయడానికి వీరు కనుగొన్న వైబ్రియోనిక్స్ మరియు హోమియోపతి కాంబినేషన్ తో వీరు కనుగొన్న రెమెడీ, Allergen Zone 5 కన్నా బాగా పనిచేస్తున్నట్లు కనుగొనబడింది. వీరు ప్రతీ పేషంట్ ను జాగ్రత్తగా పరిశీలించి సామన్యంగా వచ్చే ఎలెర్జీలు  దీర్ఘకాలికమైనశ్వాశ సంబంధిత వ్యాధులుగా మారకుండా ఉండుటకు చాలా జాగ్రత్త వహిస్తారు. ఎలెర్జీ పైన వీరి విజయాలు అనేక నివేదికల రూపంలో పబ్లిష్ అయ్యాయి.

కేన్సర్ మరియు సోరియాసిస్ పైన వీరు అనేకమంది రోగుల చరిత్రలు, కేస్ హిస్టరీ లు మెడికల్ రిపోర్టులు, ప్రోగు చేయడం ద్వారా ఈ వ్యాధుల పైన పరిశోధనకు వీరెంతో కృషి చేసారు. ఇటీవల జరిగిన ఒక కాన్సెర్ వ్యాధి నివారణ గురించిన వివరాలను వీరు మనతో పంచుకోవాలని భావిస్తున్నారు. వీరితో పాటు జంతు పునరావాస కేంద్రంలో సహపాటి గా పనిచేస్తున్న ఒక మహిళకు చాతీ భాగంలో కుడి వైపు కేన్సర్ ఉన్నట్లు తెలుసుకున్నారు. అది చర్మం పై భాగాన గడ్డ రూపంలో ఏర్పడి ఉంది. ఆమెకు మెడికల్ ఇన్సురెన్సు లేనందువల్ల ఏ డాక్టర్ను సంప్రదించలేదు. ఈ ప్రాక్టీ షనర్  పునరావాస కేంద్రంలో ఎన్నో జంతువులకు వ్యాధులను నయం చేసినందువల్ల ఈమె ప్రాక్టిషనర్ను తన వ్యాధి గురించి సంప్రదించారు. ప్రాక్టీషనర్ ఆమెకు కేన్సర్ సంబంధితమైన రెమిడితో పాటు మానసిక భయాందోళనలు లేకుండా ఉండటానికి మెంటల్ అండ్ ఎమోషనల్ టానిక్ కూడా ఇచ్చారు.  

      ప్రాక్టీ షనర్ ట్రీట్మెంట్ ప్రారంభించిన కొద్ది కాలంలోనే ఈమె ఒక మెడికేర్ ప్లాన్ క్రింద ఒక కేన్సర్ వైద్య నిపుణుడికి చూపించు కున్నారు. వారిచ్చిన సలహా మేరకు పూర్తి శరీరమునకు సంబంధించి తీ యించుకొన్న స్కానింగ్ లో రొమ్ము పైన ఒకటి చంకలలో 3 గడ్డలు ఉన్నట్లు తెలిసింది. ఆమె వీటికి ఖిమో థెరపీ చేయించుకోవలసి వచ్చింది. ఐతే ఆమె వై బ్రియోనిక్స్ మందులు కూడా వాడసాగారు. ఐతే ఖిమోథెరపీలో వచ్చే తలతిప్పుడు వంటి సైడ్ ఎఫెక్ట్స్ పట్ల జాగ్రత్త పడవలసిందిగా సలహా ఇవ్వబడింది. రెండు నెలల తర్వాత చేయించుకొన్న పరీక్షలు ఆమెకు ఎట్టి కేన్సర్ గడ్డలు లేవని ధ్రువపరిచాయి. ప్రస్తుతం ఆమె రెండు థెరపీలు వాడుతూ వ్యాధి నుండి పూర్తిగా విముక్తురాలయ్యారు

       ఈ ప్రాక్టీ షనర్ తన విజయాలకు కారణాలుగా 3 లక్షణాలు గురించి చెపుతున్నారు. 1) దివ్య మార్గదర్శకత్వమునకు సంపూర్ణ శరణాగతి 2) వైద్య విధానం పట్ల అచంచల విశ్వాసం 3)  లక్ష్య సాధనలో పవిత్రత. వీరు తమ అనుభవంలో గమనించినదేమంటే ఒక్కొక్కసారి ఏమరుపాటుగా నిర్దేశిత కార్డు బదులు వేరే కార్డు SRHVP మిషన్ నుండి తీసినా అది కరెక్ట్ కార్డుగా మారిపోయి సత్ఫలితాన్ని ఇస్తోంది. ప్రాక్టీ షనర్ గమనించిందేమిటంటే రోజువారీ గడబిడ మొదలు కాకముందే ఉదయమే రెమిడి ఇవ్వడం సత్ఫలితాన్ని ఇచ్చేది. ఒక జర్నల్ ను ప్రతీ రోజు వ్రాసుకోవడం అప్డేట్ చేయడం పరిశోదనాత్మకంగా కానీ మోనిటరింగ్ నిమిత్తం గానీ బాగా ఉపయోగ పడ్డట్లు కనుగొన్నారు. ఇంకా ధ్యానం కూడా సరైన నిర్ణయం తీసుకోవడానికి ఉపయోగ పడ్డట్లు గమనించారు. పేషంట్లకు  ప్రేమతో ఏమీ ఆశించకుండా సేవ చేసినప్పుడు వారు చూపే ఆప్యాయత, అనురాగాలు తనకు ఎంతో ప్రేరణను మరెంతో సంతృప్తి నిచ్చేవని తెలుపుతున్నారు. నిజంగా సాయి వైబ్రియోనిక్స్ ఇచ్చే పలితం అనపేక్షితమైనది .  

ప్రశ్నలు సమాధానాలు

1. ప్రశ్న: నా పేషంటు తన శరీరమునకు మాస్సేజ్ చేసుకోవడానికి చాలా ఘాటుగా ఉండే పుదీనా వాసన గల ఆయిల్ రాసుకోవచ్చా? దానివల్ల వైబ్రియోనిక్స్ పిల్ల్స్ పైన ఏమైనా ప్రభావం పడుతుందా?

    జవాబు : రెమిడిల సామర్ధ్యం తగ్గకుండా ఉండడానికి 20 నిమిషాల ముందు లేదా ఆయిల్ రాసుకొన్న గంట తర్వాత రెమిడి తీసుకోవడం మంచిది.  

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

2. ప్రశ్న : వైబ్రో పిల్స్ సమర్ధ వంతంగా పనిచేయడానికి వాటిని చేతులతో తాకవద్దని చెపుతాము .మరి రెమిడి వేయని ఖాళీ  గోళీలను తాకితే కలుషితం అవుతాయా?

   జవాబు : పరిశుభ్రంగా ఉన్న చేతులతో పిల్స్ తాకితే కలుషితం కాకపోవచ్చు కానీ అలా చేయవద్దనే మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. పరిశుభ్రమైన  నాన్ మెటాలిక్ స్పూన్ తోనే పిల్స్ నింపాలి. అప్పుడు కూడా సబ్బుతో కాక నీటితోనే చేతులు శుభ్రంగా కడుగుకొని నింపాలి.    

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

3. ప్రశ్న:మనం పేషంట్ల నుండి ఎట్టి డొనేషన్లు, బహుమతులు అంగీకరించరాదు ఒక వేళ వారు తమ అభిమానంతో బాటిళ్ళు గానీ గోళీలు గానీ రోజ్ వాటర్ గానీ తెస్తే వాటిని తీసుకోవచ్చా ?

   జవాబుఅయాచితంగా ఇచ్చే వాటిని తీసుకోవడంలో తప్పు లేదు ఐతే అటువంటి వాటిని మీరు ప్రోత్సహించ రాదు.

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

4.  ప్రశ్న: నా ఆల్కహాల్ బాటిల్ యాంటీ రేడిఏషణ్ ఎక్స్ రే కార్డులు  NM45 Atomic Radiation & SR324 X-ray తో చార్జ్ చేశాను నేను తెలుసుకున్న దాని ప్రకారం నోసోడ్ తయారీలో వేరే ఏ వైబ్రేషణ్ వాడకూడదు. మరి ఈ ఆల్కహాల్ ను నోసోడ్ తయారీలో వాడవచ్చా ?.

   జవాబు:   నోసోడ్ తయారీ లో వేరే ఇతర వైబ్రేషణ్ వాడకూడదు అన్నది వాస్తవమే కానీ శరీర విసర్జకాలయిన మూత్రము, ఉమ్మి, చీము తో నోసోడ్ తయారు చేసేటప్పుడు యాంటివైబ్రేషణ్ వాడాలి. ఐతే రక్తము, వెంట్రుకలు శరీర అంతర్గత భాగాలు కనుక వీటితో నోసోడ్ తయారీకి మాత్రం పరిశుద్ధ ఆల్కహాల్ వాడాలి.  

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

5.  ప్రశ్న: ఎవరైనా పేషంట్ ఒక దీర్ఘకాలిక వ్యాధి నిమిత్తం బ్లడ్ నోసోడ్ చాలా కాలంగా వాడుతూ ఉన్నప్పుడు తనకేదయినా ఎక్యుట్ ప్రాబ్లం వచ్చినప్పుడు నోసోడ్ తో పాటు ఎక్యుట్ రెమిడి కూడా ఇవ్వవచ్చా ?

     జవాబు: ఎక్యుట్ ప్రాబ్లం స్వల్ప కాలంలోనే తగ్గిపోతుంది కనుక నోసోడ్ ఆపడం మంచిది. తప్పనిసరిగా ఇవ్వవలసి వస్తే నోసోడ్ మరియు రెమిడి గంట తేడాతో వేసుకోవడం మంచిది. కానీ ఇలా చేయడం ఎక్యుట్ ప్రాబ్లం త్వరగా నివారణ కాకుండా జాప్యం చేస్తుంది.  

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

6. .ప్రశ్న : నా పేషంట్ల లో ఒకరు రెమిడి ని చల్లని నీటి తో తీసుకోలేరు గోరువెచ్చని నీటితోనే తీసుకుంటారు. దీనికోసం రెమిడి కంటైనర్ ను వెచ్చని నీరున్న పాత్ర లో ఉంచి వేడి చేస్తారు.ఇది సరియైనదేనా? వేడివల్ల రెమిడి ప్రభావం తగ్గుతుందా ? నీటితో కాక పిల్స్ రూపంలో రెమిడి వాడమంటారా ?  

  జవాబు: వైబ్రో రెమిడిలను 40C. ఉష్ణోగ్రత లోపు ఉంచాలని ఇంతకుముందు తెలియచేసాం. మీ పేషంట్ ఉపయోగించే పధ్ధతి మంచిదే కానీ బయటి కంటైనర్ లో నీటి ఉష్ణోగ్రత మరీ ఎక్కువ కాకుండా చూడడం మంచిది.

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

7.  ప్రశ్న: నా దగ్గరున్న ప్లాస్టిక్ రెమిడి వైల్ లకు బయటి అంచు కొంచం పైకి లేచి నట్లు ఉన్నందున క్రింది  బాటం  సమానంగా లేదు. రెమిడి వెల్ లోని బాటం తో వైల్ బాటం కాంటాక్ట్ కావడం లేదు కనుక ఇవి రెమిడి తయారీ కి వాడ వచ్చా ? నిజం చెప్పాలంటే నేను చూసిన అన్ని ప్లాస్టిక్ మరియు గ్లాస్ బాటిల్ లు  ఇలానే ఉన్నాయి?

   జవాబు:  ఔను చాలా బాటిళ్ళు ఇలానే ఉంటాయి ఒక శుభ వార్త ఏమిటంటే వైబ్రేషణ్స్ ఉబికి ఉన్న అంచు నుండి లోపల ఉన్న మీడియం వరకు ప్రయాణం చేస్తాయి కనుక ఇటువంటి బాటిళ్ళు ఉపయోగించవచ్చు

++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++               

                

8.  . ప్రశ్న: SRHVP వెల్ లో సాంపిల్స్, రెమిడి మీడియం లు ఉంచేందుకు మూత ఉన్న కంటైనర్ వాడాలా?

    జవాబు: లేదు, రెమిడి తయారు చేసేందుకు మూత లేని కంటైనర్ లే శ్రేష్టము..

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

9.  ప్రశ్న:   SRHVP లో రెమిడి తయారుచేయడానికి మనం ఒక డ్రాప్ ఆల్కహాల్ ఉపయోగిస్తాం. ఒక్కొక్కసారి చాలా కార్డులు తయారు చేయవలసి వస్తే చాలా వరకు ఆల్కహాల్ ఆవిరై పోతుంది. ఐనప్పటికీ మనం రెమిడి కోసం పిల్ల్స్ అందులో వేసి షేక్ చెయ్యవచ్చా?

     జవాబు: ఔను మీరు రెమిడి కోసం పిల్స్ వేసి షేక్ చెయ్యవచ్చు. రెమిడి వెల్ లో బాటిల్ ఉంచే ముందు మీరు బాటిల్ పైన మూత ఉంచి నట్లయితే  ఆల్కహాల్ ఎక్కువ శాతం ఆవిరి కాకుండా ఉంటుంది. ఐతే బాటిల్ లో తగినంత ఆల్కహాల్ ఉండే విధంగా మీరు జాగ్రత్త తీసుకోవాలి. ఒక్కొక్కసారి లాంగ్ కొమ్బో తయారు చేయ వలసి వస్తే ఎక్కువ సమయం తీసుకుంటుంది కనుక ఒక డ్రాప్ ఎక్కువ ఆల్కహాల్ వేసుకోవాలి. అంతేకాకుండా ఒకవేళ బాటిల్ లో తగినంత ఆల్కహాల్ ఉందని మీరు భావించినా చార్జింగ్ పూర్తయ్యాక మరో డ్రాప్ ఆల్కహాల్ వేయడం మంచిది.

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

   10. .ప్రశ్న: ఎవరైనా పేషంట్ అలోపతి మందుకు (పెయిన్కిల్లర్ లేదా యాంటిబయోటిక్) ప్రత్యామ్నాయ రెమిడి వాడుతుంటే వారు అలోపతి మందులను కొనసాగించాలా, అపివేయలా?

   జవాబు : యాంటిబయోటిక్ విషయంలో కోర్సు పూర్తయ్యేవరకు దానిని కొనసాగించాలి. పెయిన్  కిల్లర్ని మాత్రం పేషంట్ సౌకర్యం బట్టి ఫిజిషియన్ సలహా మేరకు అపివేయడం/తగ్గించు కొనడం చేయవచ్చును.

వైద్యులకే వైద్యుడి యొక్క దివ్య వాక్కు

“మన వల్ల ఎవరికైనా బాధ గానీ,హాని గానీ కలిగిన చో వారికి  ఏదో ఒక విధంగా సేవ చేసే ప్రయత్నం చేయాలి.ఎదో ఒకపని చేయడం మన పరిసరాలను శుభ్రంగా ఉంచడం ఇది మాత్రమే సేవ అనే భావంతో ఉండవద్దు.ఒక మంచి మాట మాట్లాడడం కూడా సేవే.నీ నుండి వచ్చే అనునయ వాక్యాలు అవతలి వ్యక్తీ హృదయ భారాన్ని తొలగిస్తాయి.నీవు చేసే సేవ వారి మనసులను తేలిక పరుస్తు౦ది.కనుక మంచి మాటలు మాట్లాడడం ద్వారా,మంచి పనులు చేయడం ద్వారా ఇతరులను ఆనంద పరచ గలగాలి,ఇదే ఉత్తమ సేవ.”          

…సత్యసాయిబాబా , “జన సేవయే జనార్ధనుని సేవ ” Summer Showers in Brindavan1973

http://www.sssbpt.info/summershowers/ssHYPERLINK "http://www.sssbpt.info/summershowers/ss1973/ss1973-08.pdf

 

“మనం పరిపూర్ణ ఆరోగ్యాన్ని పొందలేక పోవడంలో కోపానిదే ప్రధాన భూమిక..ఇది మన రక్తం లోకి హానికరమైన విషపదార్ధాలను చొప్పించి మన ప్రవర్తన లో చాలా మార్పు తీసుకుని వస్తుంది.. అనారోగ్యానికి మరో కారణం చెడు తలంపులు మరియు చెడు ప్రవర్తన. .లోకులంతా -చెడ్డవాడు అనారోగ్య కరంగా ఉండవలసిన అవసరం లేదు కదా అనుకొంటారు,కానీ మన అనారోగ్యానికి మూలము చెడు ఆలోచనలు దాని ద్వారా కలిగే మానసిక అనారోగ్యము . డాక్టర్లు కూడా తమ పేషంట్లతో మృదువుగా ప్రేమగా మాట్లాడాలి.తమ వృత్తిని ఇతరులకు సేవ చేసే టందుకు భగవంతుడు అనుగ్రహించిన వరం గా భావించాలి.కనుక మంచి ఆలోచనలు కలిగి ఉండడం,ఇతరులకు సేవ చేయడం ద్వారా మాన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అంతేగాక ఆహారం విషయంలో ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి.కొబ్బరిచెక్క ,కొబ్బరి నీరు మొలకెత్తే విత్తనాలు,పక్వం కానీ లేదా అర్ధ భాగం పక్వ మైన కూరగాయలు, ఆకు  కూరలు ఆరోగ్యానికి ఎంతో మంచివి". 

…సత్యసాయిబాబా, “మంచి తనము మంచి ఆరోగ్యము ” Discourse, 30 September 1981

http://www.sssbpt.info/ssspeaks/volumeHYPERLINK "http://www.sssbpt.info/ssspeaks/volume15/sss15-21.pdf

ప్రకటనలు

 

రానున్న రోజులలో నిర్వహింపబడు వర్క్ షాప్ ల వివరాలు

  • ఇండియా నాగపూర్, మహారాష్ట్ర : రిఫ్రెషర్ మరియు వీపీ సెమినార్ 18-19 ఫిబ్రవరి 2017. సంప్రదించండి రాజన్ [email protected] లేదా టెలిఫోన్ 9011-058 530
  • ఇండియా పుట్టపర్తి ఏవీపీ వర్క్ షాప్ 17-21 మార్చ్ 2017, సంప్రదించండి లలిత elayHYPERLINK "mailto:[email protected]"54HYPERLINK "mailto:[email protected]"@yahoo.com  లేదా టెలిఫోన్ 08555-288 377
  • పోలాండ్ విరోక్లా : జాతీయ రిఫ్రెషర్ సెమినార్ 25-26 మార్చ్ 2017, సంప్రదించండి దారిస్జ్ [email protected]
  • అమెరికా షెపర్డ్స్ టౌన్, w  v : ఏవీపీ వర్క్ షాప్ 31 మార్చ్ - 2 ఏప్రిల్ 2017, సంప్రదించండి సుసాన్ trainer1@usa"@usa.vibrionics.org

అదనపు సమాచారం

108CC బాక్స్ ఉపయోగించే వారికోసం కొన్ని జాగ్రత్తలు

ప్రాక్టీ షనర్     00002…UK, మా రిసెర్చ్ విభాగపు ప్రధాన అధికారిణికి  ఇటీవల కాలంలో ప్రాక్టీ షనర్  లు ఒక్క కొమ్బోతో నయం కావలసిన ప్రతీ చిన్న సమస్యకు కూడా ఎక్కువ కోమ్బో లు ఇస్తున్నట్లు వారి దృష్టికి వచ్చింది.ఎవరికైనా కొమ్బో డోస్ ఇవ్వవలసి వస్తే  ఆమె మెటిరియా మెడికా చూడడం ,  ప్రాక్టీషనర్ లనుండి వచ్చిన ఫీడ్ బ్యాక్, అపారమైన ఆమె స్వానుభవం,చివరిగా అంతః చేతన నుండి వచ్చే సంకేతం ఇవన్నీ పరిగణన లోనికి తీసుకోని రోగికి ఇవ్వవలసిన కోమ్బో నిర్ణయిస్తారు.  

     అనవసరంగా ఎక్కువ కోమ్బోడోస్ లను ఇవ్వడం వలన అవి పని చేయకుండా పోవడం దానివలన రోగికి అనవసర కాలయాపన జరుగుతుంది .కోమ్బో బుక్ లో వెనుక విషయ సూచిక లో చూపిన విధంగా సరైన కోమ్బో నిర్ధారించుకోలేక పొతే కాస్త దగ్గరగా ఉన్న డోస్ ఇవ్వడం,అలా వీలు కాని పక్షంలో  [email protected] కు వ్రాసి సమాచారం కూడా పొందవచ్చు .

++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

ఆరోగ్య చిట్కాలుఉపవాసం తో ఆనందానుభూతి  11422…India

    సహజంగా ఆహారం గ్రహించడం లో ఆనందాన్ని అనుభవించే జనులను మనం చూస్తూ ఉంటాము.కానీ ఉపవాసం లో ఉన్న ఆనందాన్ని అనుభవించే వారిని మనం చూడగలమా ?కష్టమేమీ కాదు.ఐతే దానియొక్క అత్యంతమౌలికమైన గుణాత్మక విలువలను అర్ధం చేసుకొన్నప్పుడు ఉపవాసంతో సహవాసం కూడా ఆ నందా నుభూతి నిస్తుంది.దీని నిమిత్తమే మనం మానవ జీవిత లక్ష్యము,ఆరోగ్యము,విజ్ఞాన  శాస్త్రము వీటి మధ్య ఉన్న సంబంధాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చెయ్యాలి .

1. ఉపవాసం వెనుక ఇమిడి ఉన్న శాస్త్రీయ దృక్పథం

       ఆటోఫగి అనే గ్రీక్ పదానికి అర్ధము స్వేయ భక్షక కణా త్మక శరీరము .దీని అర్ధము ఏమిటంటే ఈ నిర్మాణము తన శరీరంలో చేరే సూక్ష్మ జీవులను హానికరమైన వ్యర్ధాలను తనకు తానుగా ప్రక్షాళన చేసుకొంటుంది.    ఇది ఆహారం   తీసుకొనని  సమయంలో వ్యర్ధంగా శరీరంలో ఉన్నట్టి కణాత్మక  నిల్వలను పచనము చేస్తుంది.ఇంకా  ఆటోఫగి అనేది మన శరీరంలో చాలాకాలంగా నిల్వ ఉన్న ప్రోటీన్లను ,సంక్లిష్టమైన పెద్ద జీవకణాలను ,వాడుకలో లేని లేదా పాడయి పోయిన కణా౦ గాలను తొలగిస్తుంది. సంక్షిప్తంగా చెప్పాలంటే కొన్ని గంటల పాటు ఉన్న ఉపవాసం     ఆటోఫగాసోమెస్  అనే త్వచాలను  శరీరంలోని అన్ని కణములలో ఉద్భవింప జేసి అక్కడ చేరియున్న హానికరమైన పదార్ధాలు,బ్యాక్టీరియా,వైరస్ వంటివాటిని పట్టుకుంటుంది.వీటిని ప్రతీ కణం లోనూ వ్యాపించి ఉన్న లైసోసోమ్స్ అనే రీ సైకిల్ చేసే కంపార్ట్మెంట్ లకు పంపిస్తాయి.ఇవి ఈ వ్యర్ధాలను నశింప జేస్తుంటాయి.ఇదే సమయం లో ఉపయోగాకరముగా ఉన్నట్టి అంగాలనుండి కొత్త కణాలు తయారౌతాయి. కనుక ఉపవాసం అనేది మన శరీర నిర్మాణంలో అంతర్లీనంగా ఉన్న ప్ర క్షాలణా  వ్యవస్థ  ఆటో ఫేగి వ్యవస్థను ఉత్తేజ పరుస్తుంది..ఆటోఫేగి   అనేది 1960 లోనే గుర్తింప బడినప్పటికీ డాక్టర్ యోషినోరి ఓషుమి తన పరిశోధనతో దీనిని .ప్రయోగ పూర్వకంగా నిరూపించారు.అందువల్లనే ఈ కణనిర్మాణ జీవశాస్త్ర వేత్త ఆటో ఫేగి పై ఆయన చేసిన పరిశోధనలకు గానూ శరీర నిర్మాణ శాస్త్ర విభాగంలో 2016 లో నోబుల్ బహుమతిని అందుకున్నారు   .

2. కాన్సర్ మరియు ఇతర వ్యాధుల నివారణకు వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి ఉపవాసం 

   క్యాన్సర్ కణాలు పెరగ కుండా చూడడానికి ఒక సులభమైన ఉపాయం ఏమిటో తెలుసా తరుచుగా చేసే ఉపవాసమే.ఈ క్యాన్సర్ కణాలకు మాములు కణాల కన్నా ౩౦ శాతం ఎక్కువ ఆహారం కావాలి.కనుక అప్పుడప్పుడు చేసే  ఉపవాసం ద్వారా ఈ క్యాన్సర్ కణాలకు ఆహారం అందకుండా చేసి వాటి పెరుగుదలను నివారించవచ్చు.ఇటీవల నిర్వహించిన పరిశోదనల ద్వారా రాత్రి పూట చేసే 13 గంటల ఉపవాసం ద్వారా రెండవరకము డయాబెటిస్ ను,గుండె జబ్బులను,రొమ్ము క్యాన్సర్ నూ ఇంకా ఇతర క్యాన్సర్ లనూ నివారించవచ్చు అని తెలుసుకున్నారు. దీనిపైన ఇంక పరిశోధనలు జరుగుతున్నాయి. 

3. రోగ నివారణకు మల ప్రక్షాళనకు సహజ,మైన పద్ధతులు

     ఎవరైనా సరే ఆహారం తీసుకోవడం లేదా తీసుకోక పోవడం బలవంతంగా చేయరాదు.ఆహారం తీసుకోవడం లాగానే ఉపవాసం ఉండడం కూడా శరీరం యొక్క సహజ స్థితికి భంగం కలగ కుండా ఉండేలా చూసుకోవాలి. మానవ శరీర నిర్మాణం ఒక మండలంలో అనగా 40 నుండి 48 రోజులలో మార్పులు చేర్పులు పొందుతుంది.ఈ భ్రమణం లో శరీరం ఆహారాన్ని అసలు కోరని ౩ రోజులు  చేరి ఉంటాయి. అవి ఎప్పుడు ఉంటాయన్నది శరీరమే నిర్ణయిస్తుంది. ఈ ౩ రోజులను శరీరం ప్రక్షాళనకు అనగా తనలో చేరి ఉన్న వ్యర్ధాలను తొలగించుటకు ఉపయోగించు కొంటుంది.సాంప్రదాయ పరంగా భారతీయ సంస్కృతిలో ఏకాదశి చాంద్రమానం ప్రకారం 14 రోజులకొకసారి వస్తుంది.ఆ విధంగా ఈ మండల కాలంలో ౩ సార్లు వచ్చే ఈ ఏకాదశి రోజును ఉపవాసమునకు ఉపయోగించుకొంటారు.

4. జ్ఞాన వివేచన తో ఉపవాస దీక్ష

   ఎవరైనా ఉపవాసం లో పాల్గొనాలంటే శరీరము, మనసు కొన్ని  రోజులుగా ఇంకా చెప్పాలంటే కొన్ని నెలలుగా దానికి సిద్ధపడాలి.ముఖ్యంగా ఆహారం తినకుండా ఉండలేని వారికీ మానసిక అవరోధము,అసంపూర్ణ సాధన ,ఇవన్నీఅడ్డుపడుతూ ఉంటాయి. ఉపవాసం ప్రారంభించే ముందు భోజనానికి ,భోజనానికీ  మధ్య అల్పహారం తీసుకోవడం మానుకోవాలి. 8 గంటలు విరామం అనేది  చాలా ఆదర్శ వంతమైనది .కనీసం 5 గంటల విరామం తప్పనిసరి. మధ్యలో ఏదయినా .తినాలనిపించి నట్లయితే వెచ్చని నిమ్మరసం గానీ , గ్రీన్ టీ గానీ లేదా సులువుగా జీర్ణమయ్యే పండు గానీ  తీసుకోవాలి .ఉపవాసం దిశగా ఒక చిన్న ముందడుగు ఏమిటంటే రాత్రి పూట తగినంత విశ్రాంతి తీసుకుంటూ 13 గంటల విరామం పాటించడం.అనగా రాత్రి భోజనానికి మరునాడు ఉదయపు అల్పాహారానికి మధ్య 13 గంటల విరామం ఉండాలి. దీని తరువాత మెట్టు ఉపవాసం ఉండే రోజు ఒక్కసారి మాత్రమే భోజనం చేయడం.తరువాత మెట్టు పండ్లు గానీ పళ్ళ రసాలు గానీ తీసుకుంటూ గడపడం.ఇలా అలవాటు పడితే ఆహారం లేకుండా నీటితోనే రోజంతా గడపగలము .  

5. దివ్య ఆజ్ఞలను అనుసరించండి 7-9

    జీవితం యొక్క పరమార్ధము,దానికి ఆరోగ్యం యొక్క నిజమైన అవసరము గుర్తించాలి. మన దివ్య గురువు అనేక సార్లు జీవితం యొక్క నిజమైన లక్ష్యము తనను తాను తెలుసుకోవడమే అని చెప్పారు. మానవుడు ఈ జనన మరణ చక్రము నుండి బయట పడాలి. మనం పుట్టింది తిరిగి పుట్టకుండా ఉండడానికే. మనం చేసే ప్రతీ పనీ ఈ లక్ష్యాన్ని ప్రతిబింబించాలి. మన సేవలు,పూజలు,జ్ఞానాన్ని ఈ లక్ష్యం సాధించడం కోసమే వినియోగించాలి. ఇది సాధించాలంటే ఆరోగ్యవంతమైన శరీరం ఉండాలి. కనుక ఈ శరీరం మన జీవిత లక్ష్య సాఫల్యానికి చక్కని ఉపకరణం గా భావించి దీనిని ఆరోగ్య వంతంగా ఉంచి ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవాలి. .  

ఆధ్యాత్మిక ప్రయోజనానికి,పరిపూర్ణమైన ఆరోగ్యానికి ఉపవాసం

బాబా వారు ఉపవాసము అంటే ఉప + వాసము అని అర్ధం చెపుతారు. ఉప అంటే సామీప్యము వాసము అంటే ఉండుట. అనగా దేవునికి సమీపంలో ఉండుట.  మనమందరం గుర్తు పెట్టుకోవలసిన విషయం  ఉపవాస లక్ష్యం ఏమిటంటే కేవలం దేహాన్ని ఆహారం లేకుండా చేసి శిక్షించడం కోసం కాదు.నిరంతర భగవన్నామస్మరణ తో గడపడం కోసం ఇది నిర్దేశించ బడింది.”…Sathya Sai Speaks vol 6 February 1966. “ఉపవాసం ఆధ్యాత్మిక  పరిపుష్టిని కలిగిస్తుంది ”…Mahashivratri Festival March 1966.  మన ఐదు జ్ఞానేంద్రియాల ద్వారా తీసుకొనే విషయాలన్నింటినీ ఉపవాసం రోజున నియంత్రణ చెయ్యాలి. అలా చేయగలిగితేనే తలపుల, వాక్కుల, చేతల ఏకత్వం సిద్ధిస్తుంది. .

సూచనలు మరియు అంతర్జాలంలో చిరునామాలు References and Links

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

 

ఫ్రాన్స్ లో జరిగిన రిఫ్రషర్ మరియు అవగాహనా సదస్సు  

 

ప్రాక్టీషనర్  01620 ఈ విధంగా రిపోర్ట్ చేస్తున్నారు. 2016, సెప్టెంబర్ 11 న ఫ్రాన్స్ దేశపు ఆగ్నేయ ప్రాంతంలోని వియన్నా ప్రాంతంలో ముగ్గురు అనభవ శాలురయిన ట్రైనర్ల ఆధ్వర్యంలో ఒక విబ్రియో సెమినార్ నిర్వహించ బడింది.దీనిలో అనుభవజ్ఞులైన వారే కాక కొత్తవారు కూడా పాల్గొన్నారు.పాతవారు 108 కొమ్బో బాక్స్ ప్రవేశ పెట్టక పూర్వము  SRHVP కార్డులు ఉపయోగించడంలో శిక్షణ పొందిన వారు.ఆ విధంగా పాతవారు విబ్రియోనిక్స్ లో నూతనంగా వచ్చిన మార్పులు చేర్పులు,ముఖ్యంగా 108 బాక్స్ ఉపయోగించడం గురించి తెలుసుకొనడానికి వస్తే కొత్త వారు విబ్రియోనిక్స్ గురించి అవగాహన పొందడానికి వచ్చారు . 

     ప్రేక్షకుల అభిరుచులను దృష్టిలో పెట్టుకొని ట్రైనర్లు  తెర పైన స్లయిడ్ లు చూపడంద్వారా వైబ్రియోనిక్స్ గురించి చక్కని అవగాహన కలిగించారు.108 కొమ్బో బాక్స్ పైన అవగాహన కోసమూ దాని ప్రయోజనాలు తెలియ పరుచుట కోసమూ  AVP ట్రైనింగ్ స్లయిడ్ లు,వీడియోలు చూపడం జరిగింది.ట్రైనర్లు ప్రతీ ఒక్క స్టూడెంట్ పైన ప్రత్యేక దృష్టి పెట్టి ఉత్తమ వైబ్రియోనిక్స్ ప్రాక్టీషనర్ ఎలా ఉండాలో  అవగాహన కలిగించారు. అంకిత భావం కలిగి కొత్త వారిలో ప్రేరణ కలిగించగల కొందరు సీనియర్ ప్రాక్టీషనర్ ల 01480  లప్రోఫైల్స్ కూడా చూపడం జరిగింది.పాల్గొన్న వారందరికీ బ్రోచర్,ఇంకా ప్రోస్పెక్టస్ ఇవ్వడం జరిగింది (భార్య భర్తలు ఇద్దరూ పాల్గొంటే ఒకటి చొప్పున )

     చివరిగా పాల్గొన్న వారినుండి తీసుకొన్న ఫీడ్ బ్యాక్ లో తామంతా కూడా ఈ సెమినార్ లో పాల్గొన్నందుకు ఎంతో ఆనందంగా ఉందని తమ అంచనాలకు తగ్గట్టుగా చక్కటి ట్రైనింగ్ తీసుకున్నామని ముఖ్యంగా 108 కొమ్బో బాక్స్ ఉపయోగించడం పైన పూర్తి అవగాహన కలిగిందని చెప్పారు.

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

 

పూనా లోని వేదాంత పాఠశాల లో జరిగిన వైబ్రో క్యాంప్            

ప్రాక్టీ షనర్   10375…India ఈ విధంగా తెలియ జేస్తున్నారు.స్వామి యొక్క అపార అనుగ్రహం వల్ల 2016 సెప్టెంబర్ లో పూనా కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న అలండి అనే పుణ్యక్షేత్ర పర్యాటక స్థలంలో ఉన్నట్టి వేదాంత స్కూల్ ప్రాంగణం లో నెలవారీ విబ్రియో క్యాంప్ ప్రారంభ మయ్యింది. అలండి  అనేది ప్రముఖ మరాఠా జ్ఞాని సంత్ జ్ఞానేశ్వర్ సమాధి చెందిన ప్రదేశము.ఇక్కడ ఉన్న సుమారు 100 వేదాంత పాఠశాలల లో విద్యార్ధులు  కీర్తనలు ,విఠోబా దేవుని కీర్తిస్తూ పాడే అభంగాలు వీటితో పాటు వేదాంత గ్రంధాలు అభ్యసిస్తూ ఉంటారు.ప్రస్తుతం మేము క్యాంప్ నిర్వహించిన పాఠశాలలో 15 నుండి ౩౦ సంవత్సరాల వయసు గల 350 మంది పురుష విద్యార్ధులు ఉన్నారు.వీరంతా వినయ విధేయతలతో చాలా సాదా సీదా గా ఉంటారు. పేద కుటుంబాల నుండి వచ్చిన ఈ విద్యార్ధులు ఆధ్యాత్మిక జిజ్ఞాసాసక్తులు.  ఈ పట్టణం వైద్య సౌకర్యాల దృష్ట్యా వెనుకబడిన ప్రాంతం కనుక వైబ్రియో సేవలు ఈ విద్యార్ధుల వైద్య అవసరాలు తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.   

     మొదటి వైబ్రియో క్యాంప్ విజయవంతంగా నిర్వహింప బడడం తో మరో మూడు క్యాంప్ లు వరుసగా నిర్వహింపబడి సుమారు 173 మంది రోగులకు వైద్య సేవలు అందించడం జరిగింది.ప్రస్తుతం నలుగురు ప్రాక్టీ షనర్ లు నెలవారీగా  ఈ సేవలు నిర్వహిస్తున్నారు

 . ఈ క్యాంప్ ఇచ్చిన ప్రోత్సాహం తో ప్రాక్టీ షనర్ లు ఈ సేవలను మిగతా పాఠశాలలకు , ఈ పట్టణం చుట్టుపక్కల గ్రామాలకు విస్తరించాలనే ఆలోచనతో ఉన్నారు.ఈ  ప్రాక్టీ షనర్  ఆలయ అధికారులను సంప్రదించి ఆలయ ప్రాంగణంలో కూడా వైబ్రియో వైద్య సేవలు అందించుటకు అనుమతి పొందారు. ఆలయాన్ని సందర్శించే భక్తులకు   ఉదయం రెండు గంటలు సేవలు అందించి తదుపరి పాఠశాలలో  సేవలు అందించడం లక్ష్యం గా ఈ ప్రాక్టీ షనర్ ముందుకు వెళుతున్నారు .

 

 

 

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

 

చెన్నై లో జరిగిన రిఫ్రెషర్ సెమినార్ 

ప్రాక్టీ షనర్  11422 చెన్నై నుండి ఈ విధంగా తెలియ జేస్తున్నారు.2016 డిసెంబర్ 9 వ తేదిన మొదటి రిఫ్రషర్ సెమినార్ చెన్నై లో జరిగింది.డాక్టర్ జిత్ కె అగ్గర్వాల్ స్కైప్ ద్వారా ప్రారంభ ముగింపు సందేశాలు ఇచ్చారు.ముఖ్యంగా ఈ సెమినార్ 4 అంశాల పైన దృష్టి కేంద్రీకృత౦ చేసింది. 

1. ప్రాక్టీషనర్ లు ప్రతీ రోజు వైబ్రియో పుస్తకాలూ,వార్తా లేఖలు, వై బ్రియో మొదటి అంతర్జాతీయ కాన్ఫెరెన్స్ పుస్తకం,చదవడం ద్వారా తమ  జ్ఞానాన్ని,అవగాహననూ పెంపొందించుకొనవలసినఆవశ్యకత  సాద్యమైనంతవరకు సెమినార్లు,వర్క్ షాప్ లకు హాజరు కావడం ద్వారా ఇతర ప్రాక్టీషనర్ లతో పరస్పర జ్ఞాన భాగస్వామ్యము కలిగించు కొనుట  .

2. వ్యాధి నివారణ చేసేది స్వామియే.ప్రాక్టీషనర్ కేవలం ఆ దివ్య హస్తాలలో ఒక పనిముట్టు మాత్రమేననే భావన ఎప్పుడూ తలుచుకుంటూ ఉండడం.

3. రోగుల యొక్క పేషంట్లకు సంభందించిన పూర్తి వివరాలు సంక్షిప్తంగా భద్రపరచడం,మరియు విజయవంతంగా పూర్తి కాబడిన కేసుల వివరాలు తెలియపరచడం.

4. ప్రాక్టీషనర్ లు తాము చేసిన ‘దేవునికి ప్రమాణం ‘ ప్రకారం ప్రతీ నెల చివరి రోజున కోఆర్డినేటర్ కు రిపోర్ట్ పంపడం ,తద్వారా  తిరిగి కోఆర్డినేటర్లు ప్రతీ నెల మొదటి తేదిన డాక్టర్ అగ్గర్వాల్ గారికి రిపోర్ట్ పంపడానికి వీలౌతుంది .  .

      ఈ సెమినార్ లో పాల్గొన్న వారు ముందుగా తమ సందేహాలను మెయిల్ చేయడం తో డాక్టర్ అగ్గర్వాల్ గారు సందేహ నివృత్తి చేసారు.అంతేకాకుండా దీనిలో పాల్గొన్న వారు 2017 అర్ధ వార్షికానికల్లా AVP మాన్యువల్ లోని ఒక్కొక్కరూ ఒక్కొక్క చాప్టర్ ను అప్డేట్ చేయడానికి అంగీకరించారు .

 

 

 

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

 

కేరళ మెరుపులు

స్వామి వారి 91వ జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేరళలోని త్రిశూర్ జిల్లాలో 2016 నవంబర్ 23 వ తేదీ న అనుదినమూ నిర్వహింపబడే విబ్రియో క్లినిక్ ను ప్రారంభించడం జరిగింది.పేదల బాధల్ని పోగొట్టి నిస్సహాయులను ఆదుకొనే విధంగా ఆనందపు కడలి లో మునకలీ నే విధంగా ఒక  పూజా పుష్పంగా దీనిని స్వామికి సమర్పించ నయినది.

 

 

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

 

Om Sai Ram