Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

Vol 7 సంచిక 5
September/October 2016
ముద్రింప తగిన వార్తాలేఖ


పూర్తి వార్తాలేఖ యొక్క కాగితం ప్రతి కావలెనన్నఈ పుటను ముద్రించండి

డా.జిత్ కే అగ్గర్వాల్ యొక్క మాటల్లో

ప్రియమైన చికిత్సా నిపుణులకు,

కేరళ చికిత్సా నిపుణులు చేపట్టిన శ్రేష్టమైన మొదటియత్నం మరియు గొప్ప సేవ యొక్క నివేదికను గొప్ప ఆనందం మరియు ప్రశంసతో మీకు అందిస్తున్నాను. ఈ నెల ఓనం పండుగ జరుపుకుంటున్న సందర్భంలో కేరళ చికిత్సా నిపుణులు పై ప్రత్యేక కేంద్రీకరణం చేయబడుతున్నది.  ప్రతి సంవత్సరం ఈ రోజున మహాబలి చక్రవర్తి పాతాళ లోకం నుండి భూలోకానికి వచ్చి ప్రజల సంక్షేమాన్ని సరి చూస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. కేరళ భక్తులు ఎల్లప్పుడూ ఓనం సమయంలో అతిసుందరమైన మరియు ఆడంబరమైన వేడుకలను స్వామి దివ్య చరణాల వద్దకు తీసుకువచ్చేవారు. కేరళ రాష్ట్రం లో అర్పణా భావనగల అనేక చికిత్సా నిపుణులు ఉన్నారని ఎంతో ఆనందంతో తెలుపుకుంటున్నాను.

ముఖ్యంగా సంపూర్ణ అంకిత భావంతో సేవను అందిస్తున్న ముగ్గురు చికిత్సా నిపుణుల వ్యక్తిగత వివరాలను మరియు వారు చికిత్సను అందచేసి అద్భుతమైన ఫలితాలను పొందిన అనేక రోగ చరిత్రలను ఈ సంచికలో పాలుపంచుకోవడం మాకెంతో ఆనందంగా ఉంది. కేరళలో మొత్తం 106 చికిత్సా నిపుణులు ఉన్నారు. కేరళకు చెందిన అనేక చికిత్సా నిపుణులు వైద్య సదుపాయాలు లేని గిరిజన ప్రాంతాలు మరియు పేదరికం వ్యాపించియున్న ఇతర ప్రాంతాల్లో తమ సేవలను అందిస్తున్నారు. తమ ఇళ్లల్లో రోగులను చూడడమే కాకుండా ఆరోగ్య శిబిరాలను క్రమం తప్పకుండా నిర్వహించడం ద్వారా గత ఏడు సంవత్సరాలలో ఐదు లక్షల రోగులకు వైబ్రో చికిత్సను అందజేశారు. వారి సేవ ఎంతో ప్రశంసనీయమైనది. అంతేకాకుండా, కేరళ చికిత్సా నిపుణులు 108CC పెట్టెలను సేకరించడమే కాకుండా వాటిని సమీకరించటం కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. ఇది కంటికి కనిపించే దానికి కంటే ఎక్కువ పని. ప్రతి యొక్క సీసా ఐదు వివిధ భాగములను జాగ్రత్తగా సమకూర్చి తయారుచేయబడింది. ఇంత అద్భుతమైన సేవను అందచేసినందుకు వారికి మా హృదయపూర్వక కృతజ్ఞతను మరియు ప్రశంసలను తెలుపుకుంటున్నాము.

వైబ్రియానిక్స్ చికిత్స పై మేము ప్రస్తుతం అందిస్తున్న శిక్షణ యొక్క నాణ్యతను పెంచేందుకు ఇటీవల ఒక కొత్త విధానాన్ని ప్రారంభించడం జరిగింది.  ఈ కొత్త పద్ధతిలో ప్రతియొక్క శిక్షణార్థి, ఒక అనుభవం గల చికిత్సా నిపుణులుని పర్యవేక్షణలో ఉంచబడుతారు. ఈ పద్ధతి శిక్షణార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. AVP లకు (సహాయక చికిత్సా నిపుణులు) తగిన శిక్షణ లభించేంత వరకు మరియు VP స్థాయికి చేరేంత వరకు మరియు వైబ్రియానిక్స్ లో పూర్తిగా స్థిరపడేంత వరకు ఈ కొత్త ప్రక్రియను కొనసాగించడం జరుగుతుంది. "లవ్ ఆల్ సర్వ్ ఆల్" అన్న స్వామీ యొక్క సందేశం తరఫున పయణించేందుకు చేసే ప్రయత్నంలో ఇది ఒక్క చిన్న అడుగు.

చివరిగా మే/జూన్ వార్తాలేఖలో సూచించబడిన విధముగా బ్రాడ్కాస్టింగ్ నెట్వర్క్ సక్రమముగా నిర్వహించబడుతున్నది. 'అదనంగా' విభాగంలో మరి కొన్ని వివరాలను మీరు తెలుసుకోవచ్చు.

మునుపటి వార్తాలేఖల్లో చెప్పిన విధంగా ప్రభావాత్మక రీతిలో ఈ చికిత్సా విధానం పురోగతిని సాధిస్తోందని నేను వినయపూర్వకంగా తెలుపుకుంటున్నాను. సాటి వారి యొక్క సంక్షేమాన్ని ఆశిస్తూ ఆనందంతో తమ సమయాన్ని మరియు శక్తిని అందిస్తున్న చికిత్సా నిపుణులందరికి నా హృదయపూర్వక అభినందనములను మరియు ప్రశంసలను అందజేస్తున్నాను.

ప్రేమపూర్వకంగా సాయి సేవలో

డా.జే.కే.అగర్వాల్

కంటి చూపు కోల్పోవుట 11958...India

రెండు సంవత్సరాల నుండి షార్ట్ సైట్ సమస్య (దూరపు వస్తువులు కనబడకపోవుట) కలిగియున్న ఒక 40 ఏళ్ల మహిళ వైబ్రో చికిత్సా నిపుణులను 2015 జులై 13 న సంప్రదించడం జరిగింది. ఆమెకు మాక్యులర్ డిస్ట్రాఫి (కంటి కండరాల బలహీనత) ఉన్నట్లుగా వైద్యులచే నిర్ధారించబడింది. ఆమె కంటి చూపు యొక్క రిపోర్ట్ : RE -6/60 (కుడి కన్ను), LE - 6/24* (ఎడమ కన్ను) మరియు నియర్ విషన్ (సమీప ద్రిష్టి) N36**. ఆమె లండన్ మరియు ఇండియా లో అనేక వైద్యులను సంప్రదించడం జరిగింది. ఆమె క్రమంగా కంటి చూపు పూర్తిగా కోల్పోయే అవకాశముందని వైద్యులచే చెప్పబడమే కాకుండా, ప్రపంచంలో ఎక్కడైనా ఆమె కంటి సమస్యకు చికిత్స లభించిన సందర్భంలో చికిత్సకు కావలసిన ఖర్చులను తాము భరిస్తామని వైద్యులు సవాల్ చేశారు! 2013 డిసెంబర్ లో కంటి చూపు కోల్పోవడం కారణంగా ఆమె తన ఏవియేషన్ ఇంజనీరు ఉద్యోగాన్ని రాజీనామా చేయడం జరిగింది. ఆమెకు ఇతర ఆరోగ్య సమస్యలు లేని కారణంగా ఏ విధమైన మందులను ఆమె తీసుకునేది కాదు. గత కొన్ని సంవత్సరాలుగా కుటుంభంలో ఆమె ఎదుర్కొంటున్న సమస్యలు మరియు కంటి చూపు కోల్పోవడం కారణంగా ఆమె డిప్రెషన్ కు (మనసు యొక్క క్రుంగుపాటు) గురైంది.

2015 ఆగస్టు 20 న ఆమెకు క్రింది కాంబోలు ఇవ్వబడినాయి:

#1. CC7.2 Partial vision + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC15.2 Psychiatric disorders + CC17.2 Cleansing…TDS 

#2. CC7.2 Partial vision…QDS రోస్ వాటర్లో(పన్నీరు )కలపబడిన కంటి చుక్కలు

ఒక నెల రోజులలో రోగి యొక్క కంటి చూపు మెరుగుపడడం మొదలయింది. క్రమంగా ఆమె వ్యక్తులను గుర్తుపట్టడం, టీవీ మరియు వార్తాలేఖలో ముఖ్యవార్తలను చదవడం మరియు మొబైల్ ఫోనును ఉపయోగించడం వంటివి చేయగలిగింది.  ఇప్పుడు ఆమె పెద్ద అక్షరాలను చదవగలుగుతోంది మరియు చిన్న అక్షరాలను చదివేందుకు వీలుగా మాగ్నిఫైయింగ్ గ్లాస్సెస్ (భూతద్దము) ఆమెకు ఇవ్వబడినాయి. 2016 జులై 1 న ఆమె యొక్క కంటి చూపు పరీక్ష ఫలితాలు: RE (కుడి కన్ను) 6/24, LE (ఎడమ కన్ను) 6/9; సమీప ద్రిష్టి ఇప్పుడు ఆమె పిల్లలకు పాఠాలు కూడా నేర్పగలుగుతోంది. కంటి చూపును తిరిగి ప్రసాదించినందుకు భగవంతుడుకు తన కృతజ్ఞతలను ఆమె తెలుపుకుంటోంది! ఆమె ఇప్పటికి వైబ్రో మందును తీసుకోవడం కొనసాగిస్తున్నది.

చికిత్సా నిపుణుల విమర్శ :                   
ఎటువంటి చికిత్స ద్వారా క్షీణించిన చూపును తిరిగి పొందే అవకాశం లేని ఈ రోగికి, వైబ్రియానిక్స్ ద్వారా కంటి చూపు పూర్తిగా తిరిగి రావడం గమనార్హం.

సంపాదకుడి వివరణము :
* షార్ట్-సైటేడ్నెస్ (హ్రస్వదృష్టి/ దూరపు పార్వలేని): 6/6 సాధారణ ద్రిష్టి యొక్క రీడింగ్స్. 6/12 ఉన్న వ్యక్తులు 6m లో ఉన్న వస్తువులను మాత్రమే చూడగలుగుతారు. అయితే సాధారణ ద్రిష్టి గల వ్యక్తులు 12m వరకు వస్తువులను చూడగలుగుతారు. షార్ట్ సైట్ ఉన్న వారు సమీపంలో ఉన్న వస్తువులను మాత్రమే చూడగలుగుతారు. 6/12 లేక 6/24 కొలతలు ఉంటే, షార్ట్ సైట్ సమస్య ఉందని అర్థం.

** హ్రస్వదృష్టి యొక్క బలహీనత: హ్రస్వదృష్టి యొక్క బలహీనత : N5 అధిక హ్రస్వదృష్టి ను , N7-N8 స్వల్ప బలహీనతను, N10-N18 కొంత బలహీనతను, N20-N36 తీవ్రమైన బలహీనతను మరియు N48 అతి తక్కువ హ్రస్వదృష్టి ను సూచిస్తాయి.

ముఖము వైవర్ణ్యము కావడము, అతిరోమత్వము 11958...India

మూడు వారాలకు ముందు తన ముఖ చర్మము వైవర్ణ్యము కావడము గమనించిన ఒక 70 సంవత్సరాల మహిళ 2016 ఫిబ్రవరి 29 న చికిత్సా నిపుణులను సంప్రదించడం జరిగింది. ఆమె యొక్క రెండు బుగ్గల పై చర్మము రంగు మారడమే కాకుండా, గడ్డం రెండు వైపులా జుట్టు పెరిగింది. ఈ లక్షణాలకు కారణం ఆమె ఎండలో ఎక్కువగా పని చేయడం కావచ్చు. వైద్యులచే ఆమెకు మెళటైట్ క్రీము ఇవ్వబడింది, అయితే ఆమెకు ఈ క్రీము ద్వారా పూర్తిగా ఉపశమనం కలగలేదు.

ఆమెకు క్రింది మిశ్రమాలను (కాంబోలు) ఇవ్వడం జరిగింది:                        

#1.  CC8.1 Female tonic + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC21.1 Skin tonic…TDS  

#2.  CC8.1 Female tonic + CC21.1 Skin tonic…TDS రోస్ వాటర్ (పనీరు) లో కలిపి ముఖంపై పూయడానికి 

వైబ్రో చికిత్స ప్రారంభించిన తర్వాత ఆమె మెళటైట్ క్రీమును ఉపయోగించలేదు. మూడు రోజుల్లో ఆమె యొక్క చర్మం 50 % మెరుగుపడింది. ఒక వారంలో ఆమె చర్మం 80% మెరుగుపడడమే కాకుండా ఆమె యొక్క గడ్డం పైనున్న జుట్టు పూర్తిగా తొలగిపోయింది. 2016 మేలో ఆమె చర్మ సమస్య దాదాపు పూర్తిగా తొలగిపోయింది(2%). ఆ సమయంలో ఆమె #1 కాంబోను TDS మోతాదులో తీసుకోవడం మరియు #2 కాంబోను ముఖంపై పూయడం కొనసాగించారు.

ఉబ్బు నరాలు, శ్వాసకోశ అలెర్జీ 11958...India

ఉబ్బు నరాల కారణంగా కలిగిన తీవ్రమైన నొప్పితో ఒక 30 ఏళ్ల మహిళ 2016 ఫిబ్రవరి 17న చికిత్స కొరకు వైబ్రో చికిత్సా నిపుణులను సంప్రదించడం జరిగింది. ఆమె ఒక సంవత్సరం నుండి ఈ సమస్యతో బాధపడుతున్నారు. తీవ్ర నొప్పి కారణంగా ఆమెకు రాత్రిళ్ళు నిద్ర పట్టేది కాదు. రోగి యొక్క నానమ్మగారికి ఇదే రోగ లక్షణం ఉండేది కాబట్టి ఈ సమస్య రోగికి వంశానుగతంగా వచ్చియుండవచ్చు. ఆమెకు గత రెండు సంవత్సరాలుగా దుమ్ము అలెర్జీ కారణంగా రైనైటిస్ (నాసికయందలి మంట- వ్యాధి). ఆమెకు క్రింది రోగ లక్షణములు ఉండేవి : ముక్కు నుండి నీరు కారుట, తుమ్ములు మరియు గొంతు నొప్పి. ఈ సమస్య నుండి ఉపశమనం కొరకు ఆమె అంతకు ముందు హోమియోపతి చికిత్సను తీసుకోవడం జరిగింది గాని ఆమెకు ఉపశమనం కలగలేదు. క్రింది వైబ్రో మిశ్రమాలు ఆమెకు ఇవ్వబడినాయి:

ఉబ్బు నరాల సమస్యకు:
#1. CC3.7 Circulation + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic…TDS 

#2. CC3.7 Circulation…QDS  నీటిలో కలిపి కాళ్ళపై పూత

శ్వాసకోశ అలెర్జీ సమస్యకు:
#3.  CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC19.2 Respiratory allergies + CC19.7 Throat chronic…6TD 

ఈ చికిత్సను తీసుకొనే సమయంలో ఆమె ఇతర మందులను తీసుకోలేదు. ఒక వారం తర్వాత రోగికి కాళ్ళ నొప్పులు 50 % తగ్గిపోయాయి. రెండు వారాల తర్వాత కాళ్ళ నొప్పులు 90% తగ్గాయి గాని ఇతర లక్షణాలలో (ముక్కు కారుట, తుమ్ములు మరియు గొంతు నొప్పి) 75% ఉపశమనం మాత్రమే కలిగింది. మార్చ్ 17న ఆమె కాళ్ళ నొప్పులు పూర్తిగా తగ్గిపోయాయి. #1 మరియు #2 కాంబోల మోతాదు BDకి తగ్గించబడింది. ఐదు వారాల తర్వాత ఆమె వైబ్రో మందులను తీసుకోవడం ఆపింది.

ఏప్రిల్ 10 న ఆమెకు రైనైటిస్ సమస్య నుండి పూర్తిగా (100%) ఉపశమనం కలిగింది. #3 యొక్క మోతాదు ఆపై మూడు వారాలలో క్రమంగా తగ్గించబడింది. 2016 మే లో ఆమెకు కాళ్ళ నొప్పి లేదా రైనైటిస్ సమస్యలు తిరిగి కలగలేదు.

బ్రెస్ట్ క్యాన్సర్ 11993...India

బ్రెస్ట్ క్యాన్సర్ వ్యాధికి వరుసగా అల్లోపతి చికిత్సలను తీసుకొని మంచం పట్టిన ఒక 50 ఏళ్ల మహిళ యొక్క కుటుంభ సభ్యులు వైబ్రో చికిత్సా నిపుణులను సంప్రదించడం జరిగింది. 2013 మార్చ్ లో ఆమెకు క్యాన్సర్ వ్యాధి ఉందని నిర్ధారించబడింది. ఆమెకు క్రింది చికిత్సలు చేయించడం జరిగింది: స్తనచ్ఛేదనం (ఒంటిప్రక్క), రేడియోథెరపి మరియు కీమోథెరపీ(రసాయనచికిత్స). మొదట్లో ఈ చికిత్సలు విజయవంతమైనట్లు అనిపించింది గాని క్యాన్సర్ తిరగబెట్టడంతో ఆమెకు పది కీమోథెరపీ సెషన్స్ ఇవ్వబడినాయి. ఈ చికిత్స యొక్క ప్రభావానికి తట్టుకోలేక ఆమె మంచానపడింది.

2013 సెప్టెంబర్ 1 న ఆమెకు క్రింది మిశ్రమాలతో చికిత్స ఇవ్వబడింది:

CC2.1 Cancers – all + CC2.2 Cancer pain + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic…6TD

 రెండు నెలల తర్వాత నవంబర్ 1న, ఆమె ఆరోగ్యస్థితి 50% వరకు మెరుగుపడింది. సహాయం లేకుండా రోగి నడవడం ప్రారంభించింది. నాలుగు నెలల  తర్వాత 2014 జనవరి లో, ఆమె ఆరోగ్యం 75% మెరుగుపడింది. రోగి తన రోజువారీ పనులను చేసుకోగలిగింది. ఆరు నెలల తర్వాత మార్చ్ లో ఆమె ఆరోగ్యంలో 90% మెరుగుదల ఏర్పడింది. 2014 మేలో ఆమె క్యాన్సర్ వ్యాధి నుండి పూర్తిగా కోలుకుంది. ఆ సమయంలో చేసిన పరిశీలనలో క్యాన్సర్ వ్యాధి యొక్క జాడ కనిపించలేదు. క్రింది విధముగా రోగికి మందు యొక్క మోతాదు తగ్గించడం జరిగింది: ఒక నెల వరకు TDS, తదుపరి నెల BD, ఆపై ఆరు నెలలకు OD, ఆ తర్వాత OW, తర్వాత పదిహేను రోజులకు ఒకసారి. 2016 ఆగస్టు నాటికి ఆమె ఆరోగ్యంగా జీవిస్తోంది మరియు సంరక్షణ కొరకు వైబ్రో మందును నెలకి ఒకసారి తీసుకుంటోంది.

పొట్ట, ప్రేగు మరియు మూత్రపిండములో క్యాన్సర్ 11993...India

క్యాన్సర్ యొక్క అంతిమ స్థాయికి చేరుకున్న ఒక 58 ఏళ్ల మహిళ 2013 జులై 20 న చికిత్సా నిపుణులను సంప్రదించడం జరిగింది. చికిత్సా నిపుణులను సంప్రదించడానికి ఆరు నెలల ముందు నుండి ఆమె అల్లోపతి మందులతో పాటు ఆరు కీమోథెరపీ సెషన్లు తీసుకోవడం జరిగింది గాని సఫలితాలు లభించలేదు. క్రింది సమస్యలతో రోగి బాధపడింది: పొట్టలో తీవ్రమైన నొప్పి, శరీర బరువును కోల్పోవడం, తీవ్రమైన అలసట పాదాల్లో వాపు మరియు జుట్టు కోల్పోవడం. రోగి మంచాన పడింది మరియు ఆశ కోల్పోయింది. చికిత్సా నిపుణులు రోగి యొక్క వైద్య పరీక్షల రిపోర్టులను చూడడం జరిగింది.

క్రింది కాంబోలు రోగికి ఇవ్వబడినాయి:
CC2.1 Cancers – all + CC2.2 Cancer pain + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic…TDS

రెండు నెలల తర్వాత ఆమె ఆరోగ్య స్థితిలో 50% మెరుగుదల ఏర్పడింది. క్రింది మార్పులు రోగిలో ఏర్పడ్డాయి: జుట్టు తిరిగి పెరగడం మొదలైంది, పాదాలలో వాపు తగ్గింది, అలసట తగ్గి నడవడం ప్రారంభించింది. అనంతర సంప్రదింపులలో (ఫాలో అప్) రోగి ఆరోగ్య స్థితిలో మరింత మెరుగుదల కనిపించింది. ఆమెకు చేయబడిన వైద్య పరీక్షల ఫలితాలు రోగి యొక్క మెరుగుపడిన ఆరోగ్య స్థితిని ప్రతిభింభించాయి. 2014 జనవరి 15 న, క్యాన్సర్ వ్యాధి నుండి 100% కోలుకున్నట్లుగా రోగి తెలపడం జరిగింది. వైబ్రో మందు యొక్క మోతాదు క్రమంగా మూడు నెలలకు ఒక సారికి (సంరక్షణ కొరకు) తగ్గించబడింది. 2016 ఆగస్టు నాటికి ఆమె ఆరోగ్యంగా తన జీవితాన్ని గడుపుతోంది మరియు వైబ్రో మందును మూడు నెలలకు ఒకసారి తీసుకోవడం కొనసాగిస్తోంది.

సంపాదకుడి వివరణము :
 యొక్క చికిత్సా నిపుణులు ఇదే కాంబోను ఉపయోగించి అనేక క్యాన్సర్ రోగులకు విజయవంతంగా చికిత్సను ఇచ్చియున్నారు. చోటు లేనందువలన అన్ని రోగ చరిత్రలు ప్రచురించడం వీలుపడడం లేదు.

 
 

మూత్రపిండ వైఫల్యం 11993...India

ఒక సంవత్సరం నుండి వారానికి మూడు సార్లు రక్తశుద్ధి చికిత్సను చేయించుకుంటున్న ఒక 44 ఏళ్ల వ్యక్తి చికిత్సా నిపుణులను సంప్రదించడం జరిగింది. అతను దీర్ఘకాలంగా బాధపడుతున్న ఒత్తిడి, మైగ్రేన్ తలనొప్పి వంటి సమస్యలకు అనేక అల్లోపతి మందులపై ఆధారపడి ఉండేవారు. 2010లో రోగికి మూత్రపిండంలో వ్యాధి మొదలైంది. రెండు సంవత్సరాల తర్వాత అతని క్రియాటినిన్ స్థాయి 9కి పెరిగి రక్తశుద్ధి చికిత్స ద్వారా తగ్గించడం జరిగింది. రోగి చికిత్సా నిపుణులను సంప్రదించిన సమయంలో రోగి యొక్క రక్త పరిశోధన రిపోర్టుల ద్వారా మూత్రపిండ సంబంధమైన పారామితులు చాలా అధికంగా ఉన్నాయి.

రోగికి క్రింది కాంబోలను ఇవ్వడం జరిగింది:
CC12.1 Adult tonic + CC13.4 Kidney failure + CC15.1 Mental & Emotional tonic…6TD

రోగి వైబ్రో మందులతో పాటు అల్లోపతి మందులను తీసుకోవడం కొనసాగించారు. రెండు నెలల తర్వాత రోగి యొక్క క్రియాటినిన్ స్థాయి 3 నుండి 3 .5 కి తగ్గిపోయింది మరియు రక్తశుద్ధి చికిత్స వారానికి రెండు సార్లు మాత్రమే ఇవ్వబడింది. నెలా పదిహేను రోజుల గడిచాక రక్తశుద్ధి చికిత్స కేవలం వారానికి ఒక సారి మాత్రమే ఇవ్వవలసి వచ్చింది. 2014 జనవరి 1 నుండి రక్తశుద్ధి చికిత్స నెలకి ఒకసారి మాత్రమే ఇవ్వడం జరిగింది మరియు రోగి యొక్క క్రియాటినిన్ స్థాయి 2.5 నుండి 3 కి తగ్గింది. 2014 మార్చ్ 1 న క్రియాటినిన్ స్థాయి 1.9 కి తగ్గిపోవడం కారణంగా రక్తశుద్ధి చికిత్స చేసే అవసరం లేదని వైద్యులచే చెప్పబడింది. వైబ్రో మందు యొక్క మోతాదు క్రమంగా క్రింది విధముగా తగ్గించబడింది : 2014 మార్చ్ 1 నుండి ఒక నెల వరకు OW , ఆ తర్వాత రెండు నెలల వరకు నెలకు ఒకసారి. ఆ తర్వాత వైబ్రో మందు ఆపబడింది. 2016 ఆగస్టు నాటికి రోగి ఆరోగ్యవంతంగా జీవిస్తున్నారు.

క్రియాటినిన్ స్థాయిలపై సంపాదకుడి వివరణము:
రక్తంలో క్రియాటినిన్ యొక్క సాధారణ స్థాయి : మొగవారిలో సుమారు 0 .6 నుండి 1.2 mg /dl మరియు ఆడవారిలో 0.5 to 1.1 mg /dl ఆరోగ్యవంతమైన యువకులలో క్రియాటినిన్ స్థాయి సాధారణ స్థాయి కంటే అధికంగా ఉండవచ్చు. వృద్ధులలో క్రియాటినిన్ స్థాయి సాధారణ స్థాయి కంటే తక్కువై ఉండవచ్చు.  శిశువులలో, కండరాల ఎదుగుదల బట్టి 0.2 లేదా దీని కంటే అధికంగా ఉంటుంది. పోషకాహారలోపం, శరీర బరువు తగ్గిపోవడం మరియు దీర్ఘకాలిక వ్యాధులు కారణంగా రక్తంలో వయస్సుకి తగిన క్రియాటినిన్ స్థాయి కంటే తక్కువ ఉండవచ్చు.

మూత్రపిండాల్లో రాళ్లు 11993...India

2013 జనవరిలో మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నట్లుగా వైద్యులచే నిర్ధారణ చేయబడిన ఒక 32 ఏళ్ల మహిళ సెప్టెంబర్ లో వైబ్రో చికిత్సా నిపుణులను సంప్రదించడం జరిగింది. రోగి యొక్క స్కాన్ రిపోర్టు లో 3mm, 6mm, 6.5mm and 8mm పరిమాణాలు గల నాలుగు రాళ్లు కనిపించాయి. ఆమె క్రింది సమస్యలతో బాధపడింది: తీవ్ర నడుము నొప్పి, వీపు నొప్పి, పాదాల్లో వాపు మరియు మూత్ర విసర్జన సమయంలో ఇబ్బంది. ఆపరేషన్ చేయించుకోమని వైద్యులచే ఆమెకు సలహా ఇవ్వబడింది గాని ఆమె అంగీకరించలేదు. రోగి కీళ్ల నొప్పులతో కూడా బాధపడుతూ ఉండేది. ఒక సంవత్సరం నుండి ఆమె కాల్షియం తీసుకుంటూ ఉండేది.

2013 సెప్టెంబర్ 8 న ఆమెకు క్రింది కాంబోలను ఇవ్వడం జరిగింది:
CC12.1 Adult tonic + CC13.5 Kidney stones + CC15.1 Mental & Emotional tonic…TDS

రోగి వైబ్రో చికిత్సను ప్రారంభించే ముందు అల్లోపతి మందులను తీసుకోవడం ఆపింది. రెండు నెలల తర్వాత 2013 నవంబర్ 3న రోగి తన కడాపటి స్కాన్ రిపోర్టును చికిత్సా నిపుణులకు చూపించింది. ఆ రిపోర్టు ద్వారా రోగికి మూత్రపిండాల్లో రెండు రాళ్లు మాత్రమే మిగిలాయని, వాటి పరిమాణం  4mm మరియు 5mm కి తగ్గిపోయిందని తెలిసింది. 2014 జనవరి 4 నాటికి మూత్రపిండాల్లో రాళ్లు పూర్తిగా తొలగిపోయాయని తెలిసింది. మందు యొక్క మోతాదు క్రమంగా OWకు తగ్గించబడింది. ఆరోగ్య సంరక్షణ కొరకు ఈ మోతాదులో మందును ఆరు నెలలకు రోగి తీసుకోవడం జరిగింది. రోగికి ఇప్పటివరకు రాళ్ళ సమస్య తిరిగి కలగలేదు.

సంపాదకుడి వివరణము:
ఈ రోగి కాల్షియం గోలీలను తీసుకునేది. ఈ గోలీల ద్వారా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదము ఉందని కనుగొనపడింది. క్రింది లింక్ లో మూత్రపిండాల్లో రాళ్ళ నివారణకు ఉపయోగపడే సలహాలు ఇవ్వబడినాయి: 

http://www.mayoclinic.org/diseases-conditions/kidney-stones/basics/prevention/con-20024829.

 

సోరియాసిస్ (విచర్చిక చర్మరోగము) 11993...India

ఐదు సంవత్సరాల నుండి సొరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న ఒక 41 ఏళ్ల వ్యక్తి 2014 సెప్టెంబర్ 7 న చికిత్సా నిపుణులను సంప్రదించడం జరిగింది. వ్యాధి లక్షణాలు ప్రారంభమైన సమయంలో రోగి చర్మం పై అలెర్జీ కి సంబంధించిన ఆయింట్మెంట్ (లేపనం) పూయడం జరిగింది. దాని తర్వాత రోగి యొక్క చర్మం ఎర్రగా మారి దురద మొదలై గోక్కోవడం కారణంగా చర్మం ఊడిపోవడం ప్రారంభమైంది. చర్మం పై గాయాలు శరీరమంతయు వ్యాపించడం కారణంగా రోగి ఇతరులను కలిసేందుకు ఇబ్బందిపడేవారు. రోగి అల్లోపతి మరియు ఆయుర్వేద చికిత్సలను ప్రయత్నించారు గాని ఫలితం లభించలేదు. వైబ్రియానిక్స్ ప్రారంభించే ముందు రోగి రెండు చికిత్సలను ఆపడం జరిగింది.

రోగికి క్రింది మందులు ఇవ్వబడినాయి:
CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC21.10 Psoriasis…TDS

   

   రెండు నెలల తర్వాత నవంబెర్ లో రోగికి 75% మెరుగుదల ఏర్పడింది. దురద మరియు చర్మం రాలిపోవడం వంటి సమస్యలు తగ్గిపోయాయి. గాయాల పై కొత్త చర్మం రావడం మొదలయింది. వైబ్రో ప్రారంభించిన ఐదు నెలల తర్వాత 2015 ఫిబ్రవరి 5న రోగికి పూర్తిగా తగ్గిపోయింది. గాయాలు పూర్తిగా తగ్గిపోయాయి. మందు యొక్క మోతాదును క్రమంగా 2015 జూన్ వరకు OW కి తగ్గించడం జరిగింది. ఆపై చికిత్స నిలపబడింది. 2016  ఆగస్టు నాటికి రోగికి చర్మ సమస్య తిరిగి రాలేదు.

అధిక రక్తపోటు, వెరీకోస్ అల్సర్లు (సిరాజ వ్రణములు) 11276...India

ఏడు సంవత్సరాల నుండి రక్తపోటు మరియు పదిహేను సంవత్సరాల నుండి రెండు కాళ్లల్లో వెరికోస్ అల్సర్లు తో బాధపడుతున్న ఒక 55 సంవత్సరాల మహిళ 2015 నవంబెర్ 14 న చికిత్సా నిపుణులను సంప్రదించింది. ఆ సమయంలో రోగి యొక్క వెరీకోస్ పుండ్ల నుండి రక్తం మరియు తెల్లటి ద్రవము కారడంతో పాటు నొప్పిగా కూడా ఉంది. అంతేకాకుండా రోగికి కాళ్ళ వాపులు కారణంగా నడవడం ఇబ్బందికరంగా అనిపించింది. వైద్యుడు సలహా పై ఆమె కాళ్లపై కట్టు కున్నది. ఆమె యొక్క బీపి 220 /100 . అంతకు ముందు రోగి ఈ రెండు సమస్యలకు అల్లోపతి, ఆయుర్వేదం మరియు హోమియోపతి చికిత్సలను తీసుకునేది గాని ఉపశమనం కలగలేదు.

క్రింది మిశ్రమాలను రోగికి ఇవ్వడం జరిగింది:
#1. CC3.3 High Blood Pressure (BP) + CC3.7 Circulation + CC15.1 Mental & Emotional tonic...5TD

#2. CC8.6 Menopause + CC12.1 Adult tonic + CC18.5 Neuralgia…5TD

 చికిత్స ప్రారంభించిన ఒక నెల వరకు వైబ్రో మిశ్రమాలతో పాటు రోగి అల్లోపతి మందులను కూడా తీసుకోవడం జరిగింది. వారం రోజుల తర్వాత రోగి యొక్క బీ.పి సాధారణ స్థాయికి చేరుకుంది గాని ఆమె #1 ను 5TD మోతాదులో తీసుకోవడం కొనసాగించింది.

డిసెంబర్ 25 న, # 2 ముందుకు బదులుగా # 3 ఇవ్వబడింది:
#3. CC21.11 Wounds & Abrasions + #2...5TD

డిసెంబర్ నెలాఖరుకి రోగి యొక్క ఆరోగ్య స్థితిలో 50% మెరుగుదల ఏర్పడింది. చికిత్సా నిపుణులు రోగి యొక్క కాళ్లకు కట్టిన కట్టును తొలగించమని సలహా ఇచ్చారు.

రెండు నెలల్లో రోగికి వేరికోస్ పుండ్లు 80% వరకు తగ్గిపోయాయి. ఆమె రెండు కాళ్ళు దాదాపు సాధారణ స్థితికి చేరుకున్నాయి మరియు ఆమె సాధారణంగా నడవడం ప్రారంభించింది. అయితే, కాళ్ళ వాపు తగ్గలేదు.

దీని తర్వాత రోగికి ఒక ప్రయాణం చేసే అవసరం వచ్చింది. ప్రయాణించిన తర్వాత రోగికి వేరికోస్ పుండ్లు తిరిగి ఏర్పడ్డాయి. అందువలన జనవరి 25న రోగికి క్రింది మందులు ఇవ్వబడినాయి

#4. CC10.1 Emergencies + #1...QDS ఒక నెల వరకు, అందువలన #1 ఆపబడింది.

#5. CC17.2 Cleansing…TDS ఏడు రోజుల వరకు

#6. CC3.7 Circulation + CC21.11 Wounds & Abrasions…5TD గాయాలను పసుపు, తులసి, మిరియాల చెట్టు యొక్క కొమ్మ మరియు ఆకులు, వేపాకులు, తమలపాకులు మరియు ఉప్పు కలిపి ఉడికించిన నీరుతో శుభ్రం చేసిన తర్వాత స్వచ్ఛమైన కొబ్బరి నూనెలో కలిపి చర్మం పై పూయవలెను.

ఆమె #3 తీసుకోవడం కొనసాగించింది.

మార్పులు చేయబడిన మందులను తీసుకోవడం ప్రారంభించిన తర్వాత, రోగి యొక్క వాచిన కాళ్ళ నుండి, ద్రవ్యం కారింది. ఇది ఒక అనుకూలమైన సూచనయని వైద్యులు చెప్పారు. క్రమంగా రోగి యొక్క పరిస్థితి మెరుగుపడి, మూడు వారాలలో 40% ఉపశమనం కలిగింది. రక్త ప్రసరణ మెరుగుపడి పసుపు రంగులో ఉన్న పుండ్లు ఎర్రగా మారాయి. ఆమె కాళ్ళ వాపులు 65% వరకు తగ్గిపోయాయి.

ఫిబ్రవరి చివరిలో రోగి యొక్క ఆరోగ్య స్థితి మెరుగుపడిన కారణంగా, #4 యొక్క స్థానంలో #1 ఇవ్వబడింది మరియు #3 మరియు #6 కొనసాగించబడినాయి. మరో రెండు నెలల తర్వాత ఏప్రిల్ లో రోగికి 60 నుండి 70 % మెరుగుదల ఏర్పడింది. ఆగస్టు 20 నాటికి రోగి యొక్క ఆరోగ్య స్థితిలో 85% మెరుగుదల ఏర్పడింది. గాయాలు చాలా వరకు ఎండిపోయి, కొత్త చర్మం రావడం ప్రారంభమయింది. రోగి యొక్క బీ.పి సాధారణ స్థాయిలో నిలకడగా ఉంది. 2016 ఆగస్టు రిపోర్టు లో ఆమె యొక్క బీ.పి 128 /86 అని తెలిసింది. రోగి వ్యాధి నివారణ కొరకు #1 ను తీసుకోవడం కొనసాగిస్తోంది. పూర్తి ఉపశమనం కొరకు #3 మరియు #6 మిశ్రమాలలో CC21.1 చేర్చబడింది. ఆమె గత ఎనిమిది నెలలుగా ఏ విధమైన అల్లోపతి మందులను తీసుకోలేదు.

బెడ్ వెట్టింగ్ (నిద్ద్రలో పక్కను తడపటం) 11276...India

ప్రతిరోజు నిద్రలో మూత్ర విసర్జన చేసే లక్షణం గల ఒక ఆరు సంవత్సరాల బాలుడి యొక్క తల్లి తండ్రులు 2015 నవంబర్ 9 న చికిత్సా నిపుణులను సంప్రదించడం జరిగింది. గత ఐదు ఏళ్లగా అల్లోపతి, ఆయుర్వేద మరియు హోమియోపతి చికిత్సలను తీసుకున్నప్పటికీ సఫలితాలు లభించలేదు. ఈ సమస్య కారణంగా మరియు తల్లి తండ్రులు తన తోబుట్టువులతో పోల్చడంతో ఆ పిల్లవాడు నిరాశ నిస్పృహలకు గురయ్యాడు.

ఆ పిల్లవాడికి క్రింది మందులను ఇవ్వడం జరిగింది:

CC12.2 Child tonic + CC13.3 Incontinence + CC15.1 Mental & Emotional tonic…5TD 

   ఒక వారంలో పిల్లవాడుకు నిద్రలో పక్కను తడపడం సమస్య పూర్తిగా తగ్గిపోయింది (100%). తల్లి తండ్రులతో పాటు ఆ పిల్లవాడు ఎంతో ఆనందించారు. ఆపై ఐదు వారాల సమయంలో మందు యొక్క మోతాదు క్రమంగా తగ్గించబడింది. ఏడు నెలల తర్వాత 2016 జులై లో చికిత్సా నిపుణులను కలిసిన సమయంలో పిల్లవాడికి బెడ్ వెట్టింగ్ సమస్య తిరిగి రాలేదని తెలిపారు.

మతిభ్రమ 11576...India

మతిభ్రమతో బాధపడుతున్న ఒక 13 సంవత్సరాల కుమారుడను తండ్రి చికిత్సా నిపుణుల వద్దకు తీసుకు రావడం జరిగింది. గత ఏడు నెలలుగా ఆ బాలుడు స్కూల్ కి వెళ్లేందుకు నిరాకరించడమే కాకుండా అప్పుడప్పుడు ఉదాసీనత మరియు ఉద్వేగానికి గురైయ్యాడు.

చికిత్సా నిపుణులను సంప్రదించడానికి పది నెలలు ముందు నుండి రోగికి ప్రవర్తనాపరమైన లక్షణాలు ప్రారంభమయ్యాయి. విజయవంతంగా సాగుతున్న తన తండ్రి యొక్క వ్యాపారం పూర్తిగా నష్టపోయిన 14 నెలలు తర్వాత ఇతనికి మతిభ్రమ సమస్య ప్రారంభమయింది. ఆ తర్వాత ఒక మతాచార్యుడు ఖురాన్ పారాయణ చేయడం ద్వారా కోలుకున్నాడు మరియు స్కూల్ కి తిరిగి వెళ్లడం ప్రారంభించాడు. అయితే రెండు నెలల తర్వాత అతను స్కూల్ కి వెళ్లడం తిరిగి మానేశాడు. రోగిని అనేక మనోవైద్య నిపుణులు మరియు వైద్యుల వద్దకు తీసుకు వెళ్లడం జరిగింది గాని రోగి చికిత్సకు సహకరించలేదు. అల్లోపతి మందులను తీసుకునేందుకు కూడా నిరాకరించాడు.

10 జనవరి రోగికి క్రింది మందులు ఇవ్వబడినాయి:
CC12.2 Child tonic + CC15.2 Psychiatric disorders + CC17.2 Cleansing + CC17.3 Brain & Memory tonic…TDS

వైబ్రో మందును తీసుకోవడం ప్రారంభించిన మరుసటి రోజు నుండి అతను స్కూల్ కి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. చాలా నెలల తర్వాత ఆ పిల్లవాడు స్కూల్ కి వెళ్లడం కుటుంభ సభ్యులకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. అయితే, పిల్లవాడు క్లాసులో హాజరయ్యే బదులు స్కూల్ కౌన్సెలర్ (సలహాదారులు) యొక్క ఆపీసు వద్ద నిరీక్షిస్తున్నట్లుగా చికిత్సా నిపుణులకు రోగి యొక్క కుటుంభం తెలియచేసింది. రోగికి ఇదే మందును ఇవ్వడం కొనసాగించమని కుటుంభ సభ్యులకు సలహా ఇవ్వబడింది. మరుసటి రోజు నుండి పిల్లవాడి ఆరోగ్య స్థితిలో 100% మెరుగుదల ఏర్పడింది. అప్పటినుండి అతను ఆనందగా ఉంటున్నాడు మరియు స్కూల్ కి క్రమం తప్పకుండా వెళుతున్నాడు. అతనికి ఏప్రిల్ 2016 లో వైబ్రో చికిత్సను తీసుకోవడం ఆపడం జరిగింది. 2016 ఆగస్టు లో అతను ఆనందంగా స్కూల్ కి వెళ్లడం కొనసాగిస్తున్నాడు.

రోగి యొక్క తండ్రి యొక్క వ్యాఖ్యానం:
మా కుమారుడి సమస్యను పరిష్కరించడానికి వైద్యుల సహాయం మాత్రమే కాకుండా మతాధికారుల సహాయం కూడా తీసుకోవడం జరిగింది. అయితే మా కుమారుడి ప్రవర్తనలో మార్పు ఏర్పడలేదు. దైవ కృప మరియు వైబ్రియానిక్స్ మందుల ద్వారా మా అబ్బాయికి పూర్తిగా నయమైంది.

చికిత్సా నిపుణులు యొక్క వ్యాఖ్యానం:
పెండ్యులం స్కాన్ ద్వారా చేతబడి మరియు శాపాలు వంటి సమస్యలు ఉన్నట్లుగా తెలియడంతో రోగికి CC15.2 Psychiatric disorders ఇవ్వబడింది. ఇటువంటి సమస్యలున్న సందర్భాల్లో CC15.2 Psychiatric disorders   అద్భుతమైన ఫలితాలను కలిగించే ఒక మిశ్రమమని ఖచ్చితంగా చెప్పవచ్చు.

 
 

ఎప్లాస్టిక్ అనీమియా(కణజాలములు వృద్ధి కానందున కలిగిన రక్తహీనత) 11274...India

ఏడు సంవత్సరాలుగా ఎప్లాస్టిక్ అనీమియా (కణజాలములు వృద్ధి కానందున కలిగిన రక్తహీనత) వ్యాధితో బాధపడుతున్న ఒక 47 సంవత్సరాల మహిళ 2011 జనవరి 25 న చికిత్సా నిపుణులను సంప్రదించడం జరిగింది. ఆమె ప్రాంతీయ క్యాన్సర్ సెంటర్ లో ఈ వ్యాధికి చికిత్స చేయించుకునేది. రోగికి శరీరమంతయు తీవ్ర నొప్పి ఉన్న కారణంగా ఆమె రోజుకి ఆరు పెయిన్ కిల్లర్ మాత్రలను తీసుకునేది. రోగికుండే ఇతర రోగ లక్షణాలు : చలిగా ఉండడం మరియు మూత్రంలో రక్తం. ఆమె శరీరమంతయు చీము కారే గాయాలతో నిండియుండడం కారణంగా ఆమెకు భరించలేని దురద కలిగింది. ఆమె అల్లోపతి మందులను తీసుకుంది గాని ఫలితం లభించలేదు.

క్రింది మిశ్రమాలను రోగికి ఇవ్వడం జరిగింది:
#1. CC10.1 Emergencies…BD 

రోగి అల్లోపతి మందులతో పాటు వైబ్రో మందులను తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత సాయిబాబా రోగికి కలలో కనిపించి CC21.11 ఇవ్వవమని చెప్పారు.

ఫిబ్రవరి 25 న చికిత్సా నిపుణులు ఈ మిశ్రమాన్ని #1 తో పాటు చేర్చి ఇవ్వడం జరిగింది:
#2. CC21.11 Wounds & Abrasions + #1…TDS  

ఒక వారం తర్వాత రోగికి దురద తీవ్రంగానే ఉంది. అయితే చికిత్సా నిపుణులు రోగిని స్వామి సిఫార్సు పై ఇచ్చిన మందు కాబట్టి #2 మందును కొనసాగించమని సలహా ఇచ్చారు. ఒక నెల రోజుల్లో ఆమె చర్మం పూర్తిగా నయమైంది. ఆ తర్వాత తిరిగి బాబా నిర్దేశం ద్వారా చికిత్సా నిపుణులు  పైన ఇవ్వబడియున్న మందులో CC3.1ను చేర్చి ఇచ్చారు.

రోగికి ఇవ్వబడిన మిశ్రమం:
#3. CC3.1 Heart tonic + #2…TDS 

ఈ మిశ్రమాన్ని తీసుకున్న తర్వాత రోగి యొక్క ఆరోగ్యం వేగంగా మెరుగుపడింది. 2011 ఏప్రిల్ 24 న రోగికి ఎప్లాస్టిక్ అనీమియా పూర్తిగా నయమైంది. క్యాన్సర్ సెంటర్ లో చేయబడిన నిదానాత్మక పరీక్షల ద్వారా రోగి వైద్యులను తిరిగి సంప్రదించే అవసరం లేదని తెలిసింది. వైబ్రో మందు క్రమంగా తగ్గించబడి ఆ తర్వాత పూర్తిగా ఆపబడింది. 

చికిత్సా నిపుణుల వ్యాఖ్యానం: గతంలో అనారోగ్యం కారణంగా ఇంటి నుండి బయటకు వెళ్లేవారు కాదు. అయితే 2011 ఏప్రిల్ లో మొదటి సారి ఆమె తన అమ్మాయితో కలిసి సాయి మందిరానికి వెళ్లి భజనలు హాజరు అయ్యి స్వామికి హారతి ఇచ్చినందుకు ఆమె ఎంతో ఆనందించారు.

 

చికిత్సా నిపుణులు 11958...India

 

చికిత్సా నిపుణురాలు 11958...భారతదేశం  కేరళ ఆరోగ్య సేవకవర్గములో, నేత్ర నిపుణురాలుగా ఉద్యోగం చేసి రిటయిర్ అయిన ఈమె, ప్రస్తుతం ఒక ప్రయివేట్ వైద్య కళాశాలలో ఉపాధ్యాయురాలుగా తన సేవలను అందజేస్తున్నారు.1962 నుండి ఈమె సాయి బాబా భక్తురాలు. డా.అగ్గర్వాల్ యొక్క సోల్జర్నస్ భేటీ ద్వారా ఈమెకు వైబ్రియానిక్స్ గురించి తెలియడం జరిగింది. ప్రత్యామ్నాయ చికిత్సలు పై ఆశక్తి మరియు వివిధ రకముల వ్యాధులకు చికిత్సను అందించాలన్న కోరిక ఉన్న ఈమెకు, వెంటనే సాయి వైబ్రియానిక్స్ చికిత్సా విధానంలో శిక్షణ పొందే అవకాశం కలిగింది. స్వామి స్వయంగా ఈ చికిత్సా విధానమును దీవించడమే కాకుండా రోగులను నయం చేసేది తామేనని రూఢిపర్చడం, ఈమెకు వైబ్రియానిక్స్ పై ప్రత్యేక ఆకర్షణను కలిగించాయి. 2015 జులై నుండి ఈమె వైబ్రో చికిత్సా నిపుణురాలుగా తమ సేవలను అందజేస్తున్నారు.

సేవను అందించే అవకాశాలు పుష్కలంగా కలిగి ఉన్న కేరళ సత్యసాయి అనాథాశ్రమ సంస్థచే నిర్వహించబడే సాయిగ్రామం ఆవరణలో ఈమె నివసిస్తున్నారు. ఒక అనాధాశ్రమం, వృద్ధాశ్రమం, ఒక పాఠశాల, మానసికరుగ్మతలున్న పురుషులకు ఒక గృహం వంటి వివిధ స్థాపనములు ఉన్న ఈ ఆవరణలో, ఈమె నెలవారీ శిబిరాలు నిర్వహించండంతో పాటు రోగులకు ప్రత్యేక సంప్రదింపులు మరియు అత్యవసర సంరక్షణను కూడా అందజేస్తున్నారు. వృద్దాశ్రమ నివాసితులకు ఈమె క్రమం తప్పకుండా, గులాబీ నీటిలో వైబ్రియానిక్స్ మందులను కలిపిన కంటిచుక్కలను ఇవ్వడం జరుగుతోంది. అంతేకాకుండా ఈ చికిత్సా నిపుణురాలు జంతువులకు, ముఖ్యంగా ఆవులకు ఏర్పడిన వివిధ గాయాలకు చికిత్సను ఇవ్వడంతో పాటు ప్రసవానంతర సంరక్షణకు సంబంధించిన చికిత్సను కూడా అందజేస్తున్నారు. ఇటువంటి అత్యుత్తమమైన సేవా కార్యక్రమంలో స్వామి తనను ఎంపిక చేసింనందుకు ఈమెకు ఎంతో ఉత్సాహంగా ఉంది!

వైబ్రియానిక్స్ సంరక్షణలో ఉన్న రోగుల యొక్క ముఖాలలో కలిగే ఉల్లాసాన్ని ఈమె పలుమార్లు గమనించారు. ఈ చికిత్స ద్వారా ఈమె అలెర్జీ మరియు ఆర్త్రైటిస్ (కీళ్లవ్యాధి) రోగులకు చికిత్సను అందించి విజయవంతమైన ఫలితాలను పొందింది. నయమయ్యే అవకాశం చాలా తక్కువని వైద్యులచే నిరూపణ చేయబడిన ఒక మ్యాకులర్ డిస్ట్రాఫి (కంటి కండరాల బలహీనత) రోగికి వైబ్రియానిక్స్ ద్వారా దృష్టి గణనీయంగా మెరుగుపడింది. ఈమె అనుభవంలో ఇది యొక్క అద్భుతమైన సంఘటనని ఈమె భావిస్తున్నారు. 'పరీక్ష/ ఎక్జామ్ " కాంబో CC15.1 Mental & Emotional tonic + CC17.3 Brain & Memory tonic ద్వారా ఈమె పిల్లల్లో మెరుగైన అభ్యసించే సామర్థ్యాన్ని మరియు ఏకాగ్రతను గమనించారు.  పిల్లలకు అద్భుతమైన రీతిలో సహాయపడే మరొక కాంబో: CC4.1 Digestion tonic + CC12.2 Child tonic మౌఖికంగా తీసుకోవడంతో పాటు వైబ్రియానిక్స్ మందులను పై పూతగా ఉపయోగించడం ద్వారా అద్భుతమైన ఫలితాలు లభించాయని ఈమె అనుభవం ద్వారా తెలుపుతున్నారు.

చికిత్సా నిపుణురాలు11276  తో పాటుగా ఈమె, అమృతానందమయి ఆశ్రమంలో నెలవారీ శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఈమె యొక్క సేవ క్రమంగా పెరిగి, ప్రస్తుతం ఒక నెలలో సుమారు 100 రోగులకు చికిత్సను అందజేస్తున్నారు. అప్పుడప్పుడు అల్లోపతి వైద్యం కోరుతు ఆశపత్రిలో ఈమెను సంప్రదించే రోగులకు, ముఖ్యంగా అల్లోపతి వైద్యం ద్వారా నయంకావడానికి అవకాశాలు లేని సందర్భాల్లో,  వైబ్రియానిక్స్ చికిత్స తీసుకోమని  ఈమె సలహా ఇస్తున్నారు. శ్వాసకోశ మరియు చర్మం సంబంధిత ఎలర్జీలు, ఎపిలెప్సి (మూర్ఛరోగము, కంటి చూపు క్షీణత, సెబేషియస్ తిత్తి, కీళ్ల వాపు, గాల్ స్టోన్స్ (పిత్తాశయంలో రాళ్లు), సున్నితమైన పళ్ళు/దంతములు, కార్పల్ టన్నెల్ సిండ్రోమ్, సన్ (ఎండ) ఎలర్జీలు, చర్మకీలములు, మొటిమలు, అతిరోమత్వం వంటి సమస్యలకు ఒక సంవత్సరంలో ఈమె విజయవంతంగా చికిత్సను అందించారు. అంతేకాకుండా, అనేక జంతువులు మరియు మొక్కలకు ఈమె చికిత్సను అందించారు. దూరంలో ఉన్న రోగులకు మరియు కుటుంభ సభ్యులకు ఈమె వైబ్రో మందులను తపాలు ద్వారా పంపిస్తున్నారు.

సంపూర్ణ అంకిత భావం మరియు హృదయపూర్వక ప్రార్థనలతో పాటు రోగులకు చికిత్సను అందించిన సమయంలో, అద్భుతమైన ఫలితాలు లభిస్తాయని ఈమె నమ్మకం. ఈ అవగాహన ఈమెను మరింత వినయపూర్వకమైన వ్యక్తిగా మార్చింది. స్వామి యొక్క సాధనంగా తనను భావిస్తు, చికిత్స కొరకు ఈమెను సంప్రదించే ప్రతి యొక్క రోగిలోను భగవంతుడను చూస్తున్నారు మరియు వైబ్రియానిక్స్ సేవను అందించే అవకాశం కలిగినందుకు ఈమె ఎంతో ఆనందిస్తున్నారు.

పంచుకుంటున్న రోగ చరిత్రలు

చికిత్సా నిపుణులు 11993...India

చికిత్సా నిపుణులు 11993…India, కేరళ రాష్ట్ర ప్రభుత్వం క్రింద కస్టమ్స్ మరియు ఎక్సయిజ్ విభాగంలో ప్రభుత్వాధికారిగా పనిచేస్తున్న వీరు అనుభవం మరియు ప్రవీణత గల ఒక చికిత్సా నిపుణులు. పరోపకారియైన వీరు త్రివేండ్రంలో ఒక దేవాలయం వెలుపల 12 సంవత్సరాల పాటు ప్రతి రోజు సుమారు 200 పేద ప్రజలకు అన్నదానం చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు.

2001లో వీరికి పేదరికం నిండియున్న కాసర్గోడ్ ప్రాంతానికి బదిలీ చేయబడింది. ఆపై మూడు సంవత్సరాలు తర్వాత ఈ చికిత్సా నిపుణుల తల్లిగారికి అంతిమ దశలో ఉన్న పెద్దప్రేగు క్యాన్సర్ వ్యాధి ఉన్నట్లుగా నిర్ధారణ చేయబడింది మరియు ఆమె కొన్ని రోజులు కంటే ఎక్కువ జీవించడం అసాధ్యమని వైద్యులు చెప్పడం జరిగింది. తల్లిగారి కోరికను అనుసరించి వీరు ఆమెను ఇంటికి తిరిగి తీసుకు రావడం మరియు ఆమెకు రేకి మరియు ప్రకృతివైద్యం వంటి ప్రత్యామ్నాయ చికిత్సలను చేయడానికి ప్రయత్నించారు. ఆమె మరో మూడు నెలలు జీవించి ఆపై ప్రశాంతంగా మరణించారు. ఈ అనుభవం ద్వారా, క్యాన్సర్ వంటి తీవ్ర జబ్బులతో బాధపడుతున్నవారికి సహాయపడాలన్న ఒక బలమైన కోరిక వీరిలో కలిగింది. వీరు ప్రకృతివైద్యం మరియు రేకి మాత్రమే కాకుండా ప్రాణ చికిత్స, ఆక్యుప్రెషర్, సు-జోక్ చికిత్స, హిమాలయ మరియు టిబెటన్ సింగింగ్ బౌల్స్ ను ఉపయోగించిన సౌండ్ థెరపీ(చికిత్స)వంటి వివిధ ప్రత్యామ్నాయ చికిత్సా విధానాలలో శిక్షణ పొందారు. హిప్నోథెరపి, కౌన్సెలింగ్ మరియు సైకో-న్యూరోబిక్స్ వంటి ప్రసిద్ధమైన విద్యాసంస్థల్లో శిక్షణ పొంది ఉత్తీర్ణులయ్యారు.

పురుగులమందు ఎండోసల్ఫాన్ ను  గాలిలో చల్లడం (ఏరియల్ స్ప్రే) కారణంగా నీరు కలుషితమై, కాసర్గోడ్ జిల్లాలో వందల కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయి. మానసిక మరియు శారీరిక రుగ్మతలతో బాధపడుతున్న పిల్లలను చూసిన వీరు ఎంతో బాధపడ్డారు. తక్కువ సమయంలో ఎక్కువ ప్రజలకు చికిత్సను ఇవ్వాలని ఆశించిన వీరు, తాను నేర్చుకున్న ప్రాతామ్నాయ చికిత్సలన్నీ వ్యాధులను నయంచేయడానికి అధిక సమయం తీసుకోవడంతో, ఒక సరళమైన పరిష్కారం కోసం వీరు స్వామిని ప్రార్థించారు. వెంటనే ఈ చికిత్సా నిపుణులు యొక్క రేకి గురువు మరియు వైబ్రియానిక్స్ చికిత్సా నిపుణులు వైబ్రియానిక్స్ యొక్క సామర్ధ్యం గురించి వీరికి చెప్పడం జరిగింది. వైబ్రియానిక్స్ చికిత్సా విధానంలో శిక్షణ పొందాలనే తీవ్ర ఆకాంక్ష వీరిలో కలిగింది గాని ఎంపిక పరిమాణాలు వీరికి అనుకూలముగా లేవని తెలుసుకొని వీరు స్వామిని సహాయం కోసం ప్రార్థించారు. ఒక రోజు ఉదయం వీరికి  స్వప్నంలో స్పష్టంగా స్వామి మరియు స్వామి చుట్టూ దేవతలు మరియు ఋషులు దర్శనమిచ్చారు. మరుసటి రోజు కాసర్గోడ్ సాయి సెంటర్ అందించే ప్రథమ స్థాయి వైబ్రియానిక్స్ శిక్షణలో పాల్గొనే అవకాశం వచ్చింది. వీరు మరియు వీరి యొక్క భార్య విజయవంతంగా ఈ శిక్షణను పూర్తి చేయడం జరిగింది.

సంపూర్ణ అర్పణా భావం కలిగిన ఈ జంట ఇతర చికిత్సా నిపుణులతో కలిసి గిరిజన ప్రాంతాల్లో వైబ్రో చికిత్సను అందించారు. సోరియాసిస్, ఎలెర్జీలు, ఆస్తమా, కంటి సమస్యలు, శారీరిక మరియు మానసిక రుగ్మతలు, అభ్యాసన సమస్యలు మరియు గర్భస్రావాలు వంటి సమస్యలకు ఈ బృందం చికిత్సను అందించడం జరిగింది. స్వామి కృపతో అనేక మందికి అద్భుతమైన రీతిలో వ్యాధులు నయమవ్వడం జరిగింది. 2013 నుండి కాసర్గోడ్ ఆశపత్రికి చెందిన పెయిన్ మరియు పాలియేటివ్ విభాగంచే సూచించబడే అనేక రోగులకు విజయవంతంగా చికిత్సను అందిస్తూ వస్తున్నారు. వీరు పొందుతున్న సఫలితాలను గమనించిన ఈ విభాగాలు తీవ్ర వ్యాధులతో బాధపడుతున్న రోగులకు వైబ్రియానిక్స్ చికిత్సను అందించి అమోఘమైన సఫలితాలను పొందుతున్నారు. ఈ చికిత్సా నిపుణులు ఇంత వరకు పది వేలకు పైగా  రోగులకు విజయవంతంగా చికిత్సను అందించారు.

దీనితో పాటు వ్యవసాయదారులు మరియు పాడి మరియు కోళ్ళు (పౌల్ట్రీ) పెంచుకొనే రైతులలో వైబ్రియానిక్స్ పై అవగాహన కలిగించిన ప్రథమ చికిత్సా నిపుణులుగా నిలిచారు. దక్షిణ భారతదేశానికి చెందిన కొందరు ప్రసిద్ధ సినిమా నటుల మద్దత్తుతో  వ్యవసాయం మరియు పశుపాలన లో విజయవంతమైన ఫలితాలతో కూడిన అనేక ప్రణాళికలు నిర్వహించారు. ఈ ప్రణాళికల ద్వారా విజయవంతముగా సేంద్రుయ పంటలు మరియు సేంద్రీయ పాల ఉత్పత్తి మాత్రమే కాకుండా ఒక రకమైన మరుగుజ్జు ఆవులలో పాల ఉత్పత్తి గణనీయంగా పెరగడం జరిగింది. వ్యవసాయ విభాగంలో వైబ్రియానిక్స్ చికిత్స పై పెరుగుతున్న అవగాహన, కాసర్గోడ్లో భారతీయ ప్రభుత్వానికి చెందిన సెంట్రల్ ట్యూబేర్ క్రోఫ్స్ రీసెర్చ్ యూనిట్ వారిని ఆకర్షించింది. వైబ్రియానిక్స్ ద్వారా ఉత్పాదన పెరిగిన కారణంగా వారు ఈ చికిత్సా నిపుణులు అందిస్తున్న వైబ్రియానిక్స్ సేవ పై గొప్ప ఆశక్తి చూపించి, కేరళలో ఇతర జిల్లాలలో ఉన్న పొలాల్లో ఈ చికిత్సా విధానాన్ని ప్రారంభించారు.  

పశువుల పరిశ్రమలో రైతులు పశువులకు కలిగే పాదాల సమస్యలు, పొదుగు వాపు మరియు విరోచనాలు వంటి వ్యాధి సమస్యలకు వైబ్రో చికిత్స ఉపయోగకరంగా ఉందని చెబుతున్నారు. అనేక పశు వైద్యులు మరియు పశువుల అధికారులు వైబ్రో చికిత్స ద్వారా విజయవంతమైన ఫలితాలను పొందారు. ఒక కోళ్ళ ఫారమ్ కి యజమానియైన ఒక ఇంజనీరింగ్ కళాశాల ఉపాధ్యాయుడు, వైబ్రో చికిత్స ద్వారా అనేక విజయవంతమైన ఫలితాలు లభించినట్లుగా తెలిపారు. తన ఫారమ్ లో ఉన్న కోళ్లు అధిక సంఖ్యల్లో మరణించిన తర్వాత ఇతను వైబ్రో చికిత్సను ప్రారంభించారు. వైబ్రో మందులను క్రమం తప్పకుండా ఇవ్వడం ద్వారా గుడ్ల ఉత్పత్తి పెరిగిందని ఇతను తెలుపుతున్నారు.

ఇటీవల ఈ చికిత్సా నిపుణులు కాసర్గోడ్ తో పాటు మరో రెండు స్థానాల్లో వైబ్రో సాధనను ప్రారంభించారు. అంతేకాకుండా వీరు క్రమం తప్పకుండా పాఠశాలలు, అనాధ శరణాలయాలు మరియు వృద్ధాశ్రమాలలో ఈ సేవను అందిస్తున్నారు. ముఖ్యంగా వామతంత్రము (బ్లేక్ మాజిక్), శాపాలు భాదితులకు ఈ చికిత్స ద్వారా అద్భుతమైన ఫలితాలు లభించాయని వీరు తెలుపుతున్నారు. కుటుంభంలో విబేధాలు అధికంగా ఉన్న సమయాల్లో శాంతికి సంబంధించిన నివారణ మందులను ఇళ్లల్లో చల్లినప్పుడు తరచుగా సమస్యలు పరిష్కరించబడిన సందర్భాలు ఉన్నాయని  వీరు తెలుపుతున్నారు. అమితమైన పరిమితి గల ఈ మహత్తరమైన చికిత్సను మరింత పెద్ద స్థాయిలో ఉదాహరణకు మత ఉద్రిక్తత, సంఘర్షణ మరియు అల్లర్లు  అధికంగా ఉన్న కాసర్గోడ్ వంటి ప్రాంతాలలో ఉపయోగించాలని వీరు అనుకుంటున్నారు.

అనంతమైన విశ్వాసం, నమ్రత మరియు అనంత సృజనాత్మకత పురోగతికి ప్రధానమైనవి. భగవంతుడు చేతిలో అంకిత భావంతో కూడిన ఒక  ఉత్తమ సాధనంగా జీవించడం మరియు స్వచ్ఛమైన భక్తితో ప్రతి ఒక జీవిలోను దైవాన్ని దర్శిస్తూ వారికి సేవను అందించడం సర్వశ్రేష్టమని వీరు భావిస్తున్నారు. వీటి ద్వారా చికిత్స పరిపూర్ణమై అద్భుతమైన ఫలితాలకు దారి తీస్తుందని వీరు పూర్తిగా నమ్ముతున్నారు. క్రెడిట్ మనమే తీసుకోకుండా నిజమైన క్రెడిట్ మరియు గౌరవం అసలైన నివారణ కర్తయైన భగవంతుడికి ఇవ్వడం ద్వారా అనుగ్రహం మరింతగా లభిస్తుంది. సాయి వైబ్రియానిక్స్ సాధన ద్వారా తనకు అత్యంత ప్రియమైన సాయి బాబాకు సేవ చేసే అవకాశం ప్రసాదించబడినందుకు వీరు తన హృదయపూర్వక కృతజ్ఞతలను తెలుపుకుంటున్నారు. "స్వామీ పై నాకున్న అనంతమైన కృతజ్ఞతా భావాన్ని తెలపడానికి నా పూర్తి జీవితకాలం సరిపోదు" అని వీరు చెబుతున్నారు.

 పంచుకుంటున్న రోగ చరిత్రలు

 

చికిత్సా నిపుణులు 11276...India

చికిత్సా నిపుణులు 11276...భారతదేశం త్రివేండ్రమ్ లో NIIT (ఒక ప్రముఖ IT శిక్షణ సంస్థ) అధినేతయైన ఈమె, ఇరవై సంవత్సరాలుగా స్వామి భక్తురాలు. ఈమె 2010 నుండి వైబ్రియానిక్స్ సేవను అందిస్తున్నారు. అంతకముందు ఈమెకు అల్లోపతి చికిత్సలు మరియు వ్యాధుల గురించి నేర్చుకోవాలన్న ఆశక్తి ఉండేది కాదు. ఆమె మాటల్లో " ఒక శిల్పి ఒక రాయిని, అందమైన శిల్పంగా చెక్కినట్లు" క్రమంగా వివిధ అనుభవాల ద్వారా స్వామి ఆమెలో పరివర్తనను తీసుకు వచ్చారు. గతంలో ఈమె రేకి మరియు సాయి సంజీవని వంటి చికిత్సలను అభ్యసించేవారు. 2006లో, ఒక స్నేహితురాలు ద్వారా వైబ్రియానిక్స్ గురించి పరిచయం ఏర్పడినప్పటికీ 2010లో కేరళలో నిర్వహించబడిన ఒక వైబ్రియానిక్స్ శిక్షణా శిబిరంలో ఈమె శిక్షణ పొందింది. ఒక సంవత్సరం తర్వాత ఈమె తదుపరి స్థాయియైన VP స్థాయికి అర్హత పొందింది. ఆ సమయంనుండి స్వామి యొక్క సాధనంగా నిస్వార్థ సేవను అందిస్తోంది. 

ప్రారంభంలో, పుస్తకాల్లో ఉన్న నియమాల అనుసారం ఈమె తన వైబ్రో సాధనను చేసినట్లుగా అంగీకరిస్తున్నారు. కాలక్రమేణా ఈమెలో ఆత్మవిశ్వాసం పెరగడమే కాకుండా అంతర్వాణిని స్పష్టంగా వినగలిగే జ్ఞ్యానం పెరిగింది. భగవంతుడి చేతుల్లో సాధనంగా పని చేసినప్పుడు అహం తగ్గుతుందని ఈమె భావిస్తున్నారు. రోగుల ఆరోగ్య స్థితిలో మెరుగుదల కనిపించిన సమయంలో ఈమె స్వామి యొక్క దీవెనలను మాత్రమే చూస్తుంది. అద్భుతమైన రీతులలో వ్యాధులు నయంకావడాన్ని దగ్గర నుండి చూసిన సమయంలో, ఈమెలో మరింత ప్రేరణ ఏర్పడి నిస్వార్థ సేవను అందించేందుకు మరింత బలాన్ని అందజేస్తోంది. వైబ్రియానిక్స్ సేవ ఫలితంగా తనలో ఆధ్యాత్మిక పురోగతి ఏర్పడుతున్నట్లుగా ఈమె భావిస్తున్నారు.

గత ఒక సంవత్సరం నుండి చికిత్సా నిపుణులు11958 తో కలిసి ప్రతి నెల మూడు వైబ్రో శిబిరాలను నిర్వహించే అవకాశాలతో ఈమె ఆశీర్వదించబడింది. దీని ద్వారా ఈమెకు ఈ చికిత్సా విధానం గురించి మరింత నేర్చుకునేందుకు  మరియు ఇతరులతో తన అనుభవాలను పంచుకునేందుకు అనుకూలంగా ఉంది. మొక్కలు మరియు జంతువులకు చికిత్సను అందించడం ద్వారా ఈమెకు మరింత ఆనందం కలుగుతుంది. ఈమె ఒక అద్భుతమని భావిస్తున్నటువంటి ఒక సంఘటనను ఇక్కడ పంచుకుంటున్నారు. ఈమె పాల్గొన్న మొట్టమొదటి శిబిరం ప్రపంచ డయాబెటిస్ దినోత్సవం నాడు జరిగిందని ఈమె ఆ నాడు గ్రహించలేదు. ఆ శిబిరంలో మందుల కొరకు సుమారు వంద మంది వేచియుండగా, డయాబెటిస్ కు సంబంధించిన మందు సీసా ను (CC6.3 Diabetes) ఈమె అరచేతిలో పట్టుకొని ఉండగా విరిగిపోవడం జరిగింది. వెంటనే ఈ మందు యొక్క కొన్ని చుక్కలను భద్రపరచి ఒక పెద్ద సీసాలోకి ఈమె తీసుకున్నారు. ఇది భగవంతుడి యొక్క కృప మాత్రమే అని ఈమె పూర్తిగా విశ్వసిస్తున్నారు. అప్పటి నుండి ఈమె వద్దకు వచ్చే డయాబెటిస్ రోగుల సంఖ్య పెరుగుతూ వచ్చిందని (పెద్ద సీసా యొక్క ఆవశ్యకతను సూచించే విధంగా) మరియు వారందరికీ పూర్తిగా నయంకావడం ఆశక్తికరమైన విషయమని ఈమె చెబుతున్నారు. 

క్రమంగా ఈమె ఉబ్బు నరాలు (వెరికోస్ వెయిన్స్) వంటి సమస్యలకు వైబ్రియానిక్స్ చికిత్సతో పాటుగా వేపాకులు, పసుపు మరియు తులసాకులు మరిగించిన నీటితో గాయాలను కడగడం వంటి సాంప్రదాయ పద్ధతుల ద్వారా మరింత వేగంగా ఈ వ్యాధి నయమవుతున్నట్లుగా ఈమె తెలుపుతున్నారు. చర్మ రోగాలకు స్వచ్ఛమైన కొబ్బరి నూనెలో వైబ్రో మందులను కలపి ఇవ్వడం ద్వారా సఫిలితాలు మరింతగా లభిస్తాయని ఈమె అనుభవంతో తెలుసుకున్నారు.

స్వామి దివ్య హస్తాల్లో ఒక వినమ్ర సాధనంగా తనను భావిస్తున్న ఈమె, తన జీవితంలో జరిగేటివన్నీ స్వామి యొక్క సంకల్పం మాత్రమేనని భావిస్తున్నారు. ప్రతి ఒక చికిత్సా నిపుణులకు స్వామి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుందని ఈమె విశ్వాసం. అయితే, శరణాగతి భావంతో సేవను అందించడం ప్రధానమని ఈమె చెబుతున్నారు.

పంచుకుంటున్న రోగ చరిత్రలు

ప్రశ్న జవాబులు

1. ప్రశ్న: వైబ్రో మందులను తీసుకుంటున్న సమయంలో నీరు అధికంగా తాగడం యొక్క ముఖ్యత్వం ఏమిటి?

    జవాబు: ప్రతి రోజు, రోజుకి రెండు నుండి మూడు లీటర్ల స్వచ్ఛమైన నీరు తాగవలసిందిగా రోగులకు సలహా ఇవ్వబడుతుంది. భౌతిక స్థాయిలో, వైబ్రియానిక్స్ మందుల ద్వారా శరీర అవయవాలలో ఉన్న విష పదార్థాలు రక్తంలో కలుస్తాయి. ఈ విషపదార్థాలు నీటి సహాయంతో శరీరం నుండి తొలగించబడతాయి. నీరు అధికంగా తాగడం ద్వారా వ్యాధి వేగంగా నయమవుతుంది. నీరు అనేక పుష్టికారులను అందించడమే కాకుండా శరీరంలో జరిగే జీవక్రియను వేగవంతం చేస్తుంది. నీరు తక్కువగా తాగినప్పుడు  నిర్జలీకరణము ఏర్పడి శరీరం యొక్క పనితీరు క్షీణిస్తుంది. శరీరంలో కేవలం 1.5% నీటి నష్టం ఏర్పడడం కారణంగా (ఉదాహరణకు తీవ్ర వ్యాయాయం చేసిన సందర్భంలో లేదా ఉష్ణమైన వాతారణం కారణంగా) శరీర ఉష్ణోగ్రతలో మార్పు ఏర్పడడం, ఉత్సాహం మరియు ఏకాగ్రత తగ్గిపోవడం, తలనొప్పి, ఆతృత కలగడం, నీరసం మరియు జ్ఞ్యాపక శక్తి క్షీణించడం వంటి సమస్యలు ఏర్పడతాయి.

నీరు అధికంగా తాగడం ద్వారా మలబద్ధకం, క్యాన్సర్, మూత్రపిండాల్లో రాళ్లు వంటి అనేక వ్యాధి సమస్యలు నయమయ్యే అవకాశం ఉంది. భోజనం చేయడానికి అరగంట ముందు నీరు తాగడం ద్వారా మనము తీసుకొనే క్యాలరీల మొత్తం తగ్గుతుంది. ముఖ్యంగా ఇది వృద్ధులకు మరియు బరువు అధికంగా (ఒబీస్) ఉన్న వ్యక్తులకు సహాయపడుతుంది.

_____________________________________

2. ప్రశ్న: త్రాగునీటి నాణ్యతను మెరుగుపర్చేందుకు వైబ్రియానిక్స్ ను విధంగా ఉపయోగించవచ్చు?

    జవాబు: స్ట్రక్టర్డ్ (నిర్మితి) నీరు ఉత్తమ నాణ్యతగల త్రాగునీరు. AVP పుస్తకం లో స్ట్రక్టర్డ్ నీరు తయారీ విధానం ఇవ్వబడింది. నీటి నాణ్యతను మెరుగుపర్చేందుకు స్వచ్ఛమైన నీటిలో క్రింది కాంబోలను చేర్చవచ్చు: NM12 Combination-12 + SR360 VIBGYOR లేదా ను CC12.1 Adult tonic ను చేర్చండి.

_____________________________________

3. ప్రశ్నకాలిన గాయములు ఉన్న ఒక బిడ్డకు విధముగా చికిత్సను ఇవ్వవలెను?

   జవాబు: కాలిన గాయములకు బిడ్డలకైనా లేక పెద్దలకైనా ఒకే విధమైన చికిత్స ఇవ్వబడుతుంది. తక్షణ ఉపశమనం కొరకు SR346 Cantharis 6X తరచుగా ఇవ్వవలెను మరియు పై పూత ముందుగా నీటిలో 1X పొటెన్సీ లో ఇవ్వవలెను. కాన్తరిస్ క్రీమును (హోమియో దుకాణంలో లభిస్తుంది) అవసరమైన సమయంలో వెంటనే ఉపయోగించే విధముగా ఇంటిలో సిద్ధముగా ఉంచుకుంటే మంచిది.

పైన ఇవ్వబడిన మందు లేదా క్రీము అందుబాటులో లేకపోతే మీరు ముందుగా కాలిన ప్రాంతాన్ని చల్లబర్చడం అవసరం; ఈ విధంగా చేయడం ద్వారా చర్మ ఉష్ణోగ్రత తగ్గి గాయం మరింత తీవ్రమవ్వకుండా ఉండేందుకు సహాయపడుతుంది. కుళాయి నుండి వచ్చే చల్లటి నీటి క్రింద బాధిత ప్రాంతాన్ని ఉంచవలెను లేక బాధిత ప్రాంతమును చల్లటి నీరు పోసిన ఒక గిన్నెలో ఉంచవలెను. ఇటువంటి సందర్భాల్లో ఐస్ నీటిని ఉపగోయిస్తే కణజాలం శిధిలమయ్యే అవకాశం ఉంటుంది. బొబ్బలుంటే వాటిని పగులకొట్ట రాదు. క్రింది మిశ్రమాన్ని ఉపయోగించవలెను.           

CC10.1 Emergencies + CC15.1 Mental & Emotional tonic + CC18.5 Neuralgia + CC20.1 SMJ tonic + CC21.1 Skin tonic + CC21.4 Stings & Bites + CC21.11 Wounds & Abrasions…6TD

    ఒక జపాన్ చికిత్సా నిపుణులు, అత్యంత ప్రభావవంతమైన సహజ వైద్య పదార్థాల్లో ఒకటైన లోకట చెట్టు యొక్క ఆకుల నుండి తయారు చేసిన ద్రవరూపకమైన యౌషధమును ఉపయోగిస్తున్నారు. ఈ ఔషధమును బాధిత చర్మం పై స్ప్రే (చల్లటం) చేయవచ్చు  లేదా తేలికగా రాయవచ్చు.

_____________________________________

4. ప్రశ్నఉప్పు మరియు వినెగర్ ను (ద్రాక్షరసం పులుసు) ఉపయోగించి హెర్బిసైడ్లను, రసాయన ఎరువులు మరియు పురుగుమందుల యొక్క జాడలను కృత్రిమంగా పెరిగిన కూరగాయలు మరియు పండ్లు నుండి తొలగించవచ్చని AVP /SVP పుస్తకం ద్వారా నేను తెలుసుకున్నాను. ఇదే పనిని  వైబ్రియానిక్స్ ద్వారా చేయవచ్చా?

    జవాబు: ఉప్పు మరియు వినెగర్లో కూరగాయలను మరియు పండ్లను నానపెట్టి శుభ్రపరచడం చాలా మంచి పద్దతి.  అయితే ఈ విధానం యొక్క సమర్థతను మరింత పెంచేందుకు NM46 Allergy-2 + SM1 Removal of Entities + SR324 X-ray (108CCలో ఉండే మిశ్రమం:  CC17.2 Cleansing). ఈ విధంగా శుభ్రపర్చబడిన కూరగాయలు మరియు పండ్లు యొక్క సహజమైన రుచిని చూసి మీరు ఆశ్చర్య పోతారు. వేసవికాలంలో, నీటిలో కొన్ని ఐసు ముక్కలను వేయడం మంచిది. అయితే వరి మరియు అవకాడోలు వంటివి శుభ్రం చేసే సమయంలో వినెగర్ ను చేర్చవద్దు.

_____________________________________

5. ప్రశ్నకీళ్ల శైథిల్యం కారణంగా కలిగే దీర్ఘకాలిక కీళ్ల నొప్పులతో బాధపడుతున్న అనేక వృద్ధులకు నేను వైబ్రో చికిత్సను అందజేస్తున్నాను. కొన్ని సందర్భాల్లో వైబ్రో మందుల ద్వారా ఉపశమనం కలగడం లేదు. ఇటువంటి సందర్భాల్లో నేను వారికి ఏ విధముగా సహాయపడవచ్చు?

    జవాబు: ఈ సాధారణ సమస్యకు మూల కారణం మృదులాస్థి (ఎముకల మధ్యలో ఉన్న కుషన్ (పరిపుష్టి)) అరిగిపోయి ఆస్టియో ఆర్త్రైటిస్ వ్యాధికి దారి తీస్తుంది. మీరు క్రింది మిశ్రమాన్ని ఇస్తున్నారని నమ్ముతున్నాము: CC20.2 SMJ pain + CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue. గోలీల రూపంలో ఇవ్వడంతో పాటు ఈ మిశ్రమాన్ని ఆవధం, పల్లీల నూనె, నల్ల జీలకర్ర నూనెలను కలిపిన మిశ్రమంలో చేర్చి నొప్పిగా ఉన్న ప్రాంతం పై మస్సాజ్ (మర్దనం) చేయవలెను. వేడి నీటిలో స్నానం చేసిన తర్వాత ఈ విధముగా చేస్తే ఇంకా మంచిది. రుతువిరతి దశలో ఉన్న మహిళల్లో ఈస్ట్రోజెన్ హార్మోన్ తగ్గుతున్న కారణంగా పైన ఇవ్వబడిన మిశ్రమంలో SR513 Oestrogen (CC8.1 లో చేర్చబడింది) చేర్చడం సహాయకరంగా ఉంటుంది.  

అధిక శరీర బరువు యొక్క ప్రభావం కీళ్లు మరియు మోకాళ్ళ పై పడుతుంది కాబట్టి ఇటువంటి రోగులు శరీర బరువును అదుపులో ఉంచుకోవడం మంచిది. శరీర బరువు ఒక పవుండు పెరిగితే ఆస్టియో ఆర్త్రైటిస్ వ్యాధి ఉన్న రోగులలో కీళ్ల పై ఒత్తిడి నాలుగు పవుండ్లు పెరుగుతుందని ఒక కొత్త అధ్యయనం చెబుతున్నది. మెట్ల పై ఎక్కి దిగడం ద్వారా ఇటువంటి రోగులలో కీళ్ల పై ఒత్తిడి ఎనిమిది రెట్లు పెరిగే అవకాశం ఉంది.

అందువలన శరీర బరువును తగ్గించుకోవడం ద్వారా కీళ్లపై పడే ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది. తద్వారా మోకాళ్ళ నొప్పి తగ్గడమే కాకుండా కీళ్లు మరింత అరిగిపోకుండా సంరక్షించు కోవచ్చు.

క్రమమైన వ్యాయాయం మోకాళ్ళ నొప్పి నిర్వహణలో మరో ముఖ్యమైన అంశం. నొప్పి కలిగే అవకాశముందని తలచి ఆస్టియో ఆర్త్రైటిస్ రోగులు వ్యాయాయం మానేసే అవకాశం ఉంది. అయితే ఈత, నడక లేదా సైక్లింగ్ వంటి తేలికైన వ్యాయామాల ద్వారా చలనశక్తి మరియు బలం పెరుగుతాయి. తేలికైన బరువులను ఎత్తే వ్యాయామాలను చేయడం ద్వారా క్వాడ్రిసెప్స్ (తొడలోని స్నాయువు-మాంసపుకండ) బలపడి మోకాళ్ళ నొప్పి తగ్గే అవకాశం ఉంది.

దివ్య వైద్యుడి యొక్క దివ్య వాక్కు

"సేవను అందించే సమయంలో మీకున్న సామర్థ్యాలను తలచి అహాన్ని పెంచుకోరాదు. వినయపూర్వకంగా ఉండండి మరియు భగవంతుడు మీకు సేవను చేసే అవకాశం ప్రసాదించారని గుర్తుంచుకోవాలి. ఇతరులకు మీరు సేవ చేసినప్పటికీ అది మీకు మీరే చేసుకునే సేవ అన్న సత్యాన్ని మీరు గుర్తుంచుకోవాలి... రోజు మీరు చేసే సేవ యొక్క ఫలితం భవిష్యత్తులో ఖచ్చితంగా మీకు లభిస్తుంది."
-సత్యసాయి బాబా, "మానవ సేవే మాధవ సేవ" సమ్మర్ షవర్స్, 1973 బృందావన్

http://www.sssbpt.info/summershowers/ss1973/ss1973-08.pdf

 

 

“చెడు ఆలోచనలు అనారోగ్యానికి దారి తీస్తాయి. ఆందోళన, భయం మరియు ఒత్తిడి కారణంగా ఆరోగ్యం మరింత క్షీణిస్తుంది. ఇవ్వనిట్టికి మూల కారణం దురాశ. దురాశ, భాధ మరియు నిరాశలకు దారి తీస్తుంది. ఆధ్యాత్మిక మార్గం మాత్రమే సంతృప్తిని ప్రసాదిస్తుంది. ప్రాపంచిక విషయాల పై వ్యామోహాన్ని విడిచిపెట్టాలి. ఇది మా పని మరియు అది దైవం యొక్క పని అని వేరు చేయరాదు. మీరు చేసే ప్రతి పని ఒక ఆరాధనగా మారాలి. బహుమతి ఏదైనా గాని అది దేవుడిచ్చిన వరమే అవుతుంది. భగవంతుడు అన్ని మన మంచికే చేస్తాడు. ఇటువంటి వైఖరిని కలిగియున్నప్పుడు భాధ మరియు దుఃఖం మనందరినీ మరింత బలపరచి దివ్యత్వం వైపు నడిచేందుకు సహాయపడతాయి.”
-
సత్యసాయి బాబా, "మంచి ఆరోగ్యం మరియు మంచితనం" దివ్యోపన్యాసం, 30 సెప్టెంబర్ 1981

http://www.sssbpt.info/ssspeaks/volume15/sss15-21.pdf

 

ప్రకటనలు

జరగనున్న శిక్షణా శిబిరాలు

ఫ్రాన్స్ వియెన్నె: రిఫ్రెషర్ మరియు అవెర్నెస్ చర్చసభ 11 సెప్టెంబర్ 2016 సంప్రదించవలసిన వ్యక్తి దేనియెల్లీ at [email protected]

❖ USA షెపర్డ్స్ టవున్, WV: SVP శిక్షణా శిబిరం 16-18 సెప్టెంబర్ 2016, సంప్రదించవలసిన వ్యక్తి సూసన్ at t[email protected]

​❖  UK ఆక్స్ఫర్డ్: SVP శిక్షణా శిబిరం 7-9 అక్టోబర్ 2016, సంప్రదించవలసిన వ్యక్తి జేరామ్ at [email protected] or by telephone at 020-8551 3979

❖  UK లివర్పూల్AVP శిక్షణా శిబిరం 24-25 అక్టోబర్ 2016, సంప్రదించవలసిన వ్యక్తి హెమ్ at [email protected]

❖ ఇండియా పుట్టపర్తి: AVP శిక్షణా శిబిరం 17-20 నవంబర్ 2016, సంప్రదించవలసిన వ్యక్తి హెమ్ at [email protected]

❖ పోలాండ్ రోక్లా: రాష్ట్రీయ రెఫ్రెషర్ చర్చసభ 25-26 మార్చ్ 2017, సంప్రదించవలసిన వ్యక్తి డెరియుజ్ at [email protected]

​❖  UK ఆక్స్ఫర్డ్: SVP శిక్షణా శిబిరం 7-9 అక్టోబర్ 2016, సంప్రదించవలసిన వ్యక్తి జేరామ్ at [email protected] or by telephone at 020-8551 3979

 

 

అదనపు సమాచారం

బ్రాడ్కాస్టింగ్ నెట్వర్క్ (ప్రసరణ యంత్రాంగం) ప్రారంభించబడింది

అనేక సంవత్సరాలకు ముందు సాయిరాం హీలింగ్ వైబ్రేషన్ పొటెంటైజర్ (SRHVP) ను పొంది, రోగులు లేకపోవడం కారణంగా సేవను చేయని చికిత్సా నిపుణులను గత కొన్ని సంవత్సరాలుగా US / కెనడా సమన్వయకర్త 01339 ఉత్తేజపర్చడం జరుగుతున్నది. 2016 ఫిబ్రవరి లో US / కెనడా సమన్వయకర్త ప్రశాంతి నిలయం దర్శన హాలులో కూర్చుని ఉండగా, సీనియర్ చికిత్సా నిపుణులను (SVPs) జూనియర్ చికిత్సా నిపుణులతో (JVPs) కలపాలన్న ఆలోచన ఆమెకు హటార్తుగా కలిగింది. దీని ద్వారా దూర ప్రాంతాలు మరియు ఆసుపత్రిల్లో ఉండే రోగులకు చికిత్సను అందించే అవకాశం ఉంటుందని ఆమెకు అనిపించింది. ఇంతవరకు, దూరంలో ఉన్న రోగులకు చికిత్సను అందించాలంటే ఒకటే మార్గం తపాలు ద్వారా వైబ్రో మందులను పంపడం. ఇలా పంపేందుకు వీలుకానప్పుడు ఇటువంటి రోగులకు వైబ్రో చికిత్సను పొందే అవకాశం ఉండేది కాదు. ఇటువంటి ఆలోచన స్వామి నుండి వచ్చిందని ఆమె గుర్తించి, దీని ద్వారా వైబ్రియానిక్స్ ప్రపంచమంతా వ్యాపించే సంభావ్యత ఎంతగానో ఉందని ఆమెకు అనిపించింది. ఈ విధంగా JVP లచే సూచించబడే రోగులకు వైబ్రో మందులను ప్రసరణ చేసి సేవను అందించే అవకాశాలు SVP లకు ఎక్కువగా లభిస్తాయి. ఈ ప్రథమ యత్నం సునువుగా కొనసాగేందుకు, SVP 02877…USAను నెట్వర్క్ మానేజర్ గా నియమించడం జరిగింది. 2016 జులై 19 న, పవిత్రమైన గురుపూర్ణిమ పర్వదినం సందర్భంగా, పొటెంటైజర్ ఉన్న 16 వాలంటీర్లు తో బ్రాడ్కాస్టింగ్ నెటవర్క ప్రారంభమైంది.  SVP యొక్క సహాయం కావలసిన ప్రతి JVPను అందుబాటులో ఉన్న ఒక SVPతో సంప్రదింపు ఏర్పాడు చేయడం మరియు చికిత్స యొక్క పురోగతిని తెలుసుకుంటూ ఉండడం ఈ నెట్వర్క్ మేనేజర్ యొక్క ప్రధాన విధి. ఈ పధకం క్రింది విధముగా పని చేస్తుంది: ముందుగా JVP విట్నెస్ (సాక్షి) కొరకు రోగి యొక్క పూర్తి పొడవు ఛాయాచిత్రం (లేదా సాధ్యమైతే రోగి యొక్క వెంట్రుకలు) సేకరిస్తారు. మేనేజర్ ను సంప్రదించిన తర్వాత ఈ విట్నెస్ ను రోగి యొక్క వైద్య సమాచారం మరియు ఆరోగ్య స్థితి వంటి వివరాలను SVPకు పంపిస్తారు. SVP రోగి యొక్క ఛాయాచిత్రాన్ని ఒక మంచి నాణ్యతగల ఫోటోగ్రాఫ్ పేపర్ పై తగిన పరిమాణంలో ఫోటోను ప్రింట్ (ముద్ర) చేస్తారు. దీని తర్వాత SVP చే తగిన వైబ్రో మందు తయారు చేయబడి 200C పొటెన్సీలో నమూనా వెల్ లో ఉంచబడుతుంది. విట్నెస్/సాక్షిని మందు యొక్క వెల్ లో పెట్టడం జరుగుతుంది. దీని తర్వాత హృదయపూర్వక ప్రార్థనలతో బ్రాడ్కాస్టింగ్/ప్రసరణ ప్రారంభం అవుతుంది. రోగిని లేదా రోగి కుటుంభ సభ్యులను మూడు రోజులకు ఒక సారి JVP సంప్రదించి రోగి యొక్క ఆరోగ్య స్థితిని తెలుసుకుంటారు. ఈ వివరాలను SVPకు తెలియచేయడం జరుగుతుంది. ఆపై SVP మందులో తగిన మార్పులు చేయడం జరుగుతుంది.

మొదటి నెల ఈ విధానం ద్వారా విజయవంతంగా 14 రోగులకు చికిత్స ఇవ్వడం జరిగింది. బ్రాడ్కాస్టింగ్ గురించిన ఆలోచనను కలిగించి తద్వారా  అధిక సంఖ్యల్లో రోగులకు చికిత్సను అందజేసే అవకాశం ప్రసాదించిన సాయికి మా కృతజ్ఞతలను తెలుపుకుంటున్నాము.

                                                                        ఓం సాయిరాం!