Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

Vol 7 సంచిక 4
July/August 2016
ముద్రింప తగిన వార్తాలేఖ


పూర్తి వార్తాలేఖ యొక్క కాగితం ప్రతి కావలెనన్నఈ పుటను ముద్రించండి

డా.జిత్ కే అగ్గర్వాల్ యొక్క మాటల్లో

ప్రియమైన అభ్యాసకులారా,

గురు మహిమ యొక్క ఆనందం మనకు అగుపడడం ప్రారంభమయినప్పుడు మాత్రమే మనలో స్వచ్ఛమైన ఆనందం మరియు జ్ఞానోదయం కలుగుతుంది. ఆ పరమాత్ముడినే గురువుగా పొందిన మనము ఎంతో అదృష్టవంతులము. "గురు" అన్న సంస్కృత పదానికి "అంధకారాన్ని తొలగించే వారు" అని అర్థం. గురువు పై శ్రద్ధ కలిగియుండడం సర్వశ్రేష్టమని నా నమ్మకం. గురువు పై నిబంధన లేని శ్రద్ధ కలియుండడం ద్వారా మాత్రమే మనము పరమానందం పొందగలుగుతాము.

ప్రశాంతి నిలయంలో అత్యంత పవిత్రమైన సందర్భాలలో ఒకటైన గురు పూర్ణిమ వేడుక దగ్గరకు వచ్చిన సమయంలో మీకు రాయడం నాకెంతో ఆనందాన్ని ఇస్తున్నది. మన హృదయాలలో మనకు అత్యంత ప్రియమైన మరియు ప్రధాన రోగ నివారణ కారకుడైన భగ్వాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పైన ఉన్న భక్తి విశ్వాసాలను మరింత ధృడ పరుచుకోవాలని మరియు ఈ విశేషమైన సమయంలో దివ్య ప్రేమ మరియు నిస్వార్థ సేవ యొక్క దివ్య కాంతిలో మనమందరని ముంచెత్తాలని స్వామిని ప్రార్థిస్తున్నాను.

వైబ్రియానిక్స్ కార్యక్రమం, సహకార శక్తి యొక్క ప్రత్యక్ష ఫలితంగా గొప్ప పురోగమన పరిణామానికి గురవుతోందన్న విషయాన్ని మీ అందరితో పాలుపంచుకోవడం నాకు అపార ఆనందాన్ని ఇస్తున్నది. గత వార్తాలేఖలో సూచించబడినట్లుగా, వైబ్రియానిక్స్ లో నిరంతర అభివృద్ధి మరియు జ్ఞ్యానం కొరకు ఇండియా, UK మరియు USA వంటి దేశాలలో చికిత్సా నిపుణుల బృందాల ద్వారా క్రమమైన సమావేశాలను జరపడం జరిగింది. అసాధారణ సంఖ్యలో చికిత్సా నిపుణులు పాల్గొనడం మరియు ముఖ్యమైన విషయాలను మరియు అనుభవాలను పాలుపంచుకోవడం ద్వారా ఈ సమావేశాలు గొప్ప విజయాన్ని సాధించాయి.

సమావేశాలు చాలా నిర్మాణాత్మక రీతిలో జరపబడినవి. సీనియర్ చికిత్సా నిపుణులు ఆహారం, శరీరంలో ఉన్న కీలక అవయవాలు, మిశ్రమాలు వంటి అత్యంత ముఖ్యమైన విషయాల పై ప్రదర్శనలను ఇవ్వడం జరిగింది. ఎనర్జీ కాంబో (మిశ్రమం) మరియు కార్టిసోల్ కాంబో వంటి ప్రత్యేక ప్రయోజనాలు గల మిశ్రమాల ద్వారా కలిగిన విజయవంతమైన ఫలితాలను సీనియర్ చికిత్సా నిపుణులు పాలుపంచుకోవడం జరిగింది. (మరిన్ని వివరాలకు, ఈ వార్తాలేఖలో ఇవ్వబడిన "అదనపు సమాచారం" విభాగంను చదవండి). ఒక ఆరోగ్యకరమైన జీవనశైలిను నిలబెట్టుకోవటానికి, ఆరోగ్యకరమైన ఆహారం యొక్క ప్రాముఖ్యత గురించి వివరంగా చర్చించబడింది. అంతేకాకుండా, ల్యూపస్ మరియు ఆబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ వంటి తీవ్రంగా బలహీనపరిచే దీర్ఘకాలిక అనారోగ్యాల చికిత్సకు సహాయపడే విధంగా, ఇటువంటి రోగ సమస్యల చికిత్సలో విజయాన్ని సాధించిన చికిత్సా నిపుణులు వివిధ వైబ్రో మిశ్రమాల వివరాలను పాలుపంచులోవడం జరిగింది. కొన్ని సమావేశాలలో, రేడియానిక్స్ మరియు వైబ్రియానిక్స్ యొక్క అనుగుణ్యత వంటి ఆధునిక విషయాల పై చర్చ జరపబడినది. అంతేకాకుండా, ప్రేమ, కృతజ్ఞత మరియు క్షమ వంటి సద్గుణాల యొక్క శక్తి ద్వారా వ్యతిరేకమైన శక్తి తరంగాలను సానుకూలమైన ఆరోగ్యకరమైన శక్తి తరంగాలుగా రూపపరివర్తన చేయవచ్చని ఈ సమావేశాల్లో చెప్పబడినది.

చికిత్సా నిపుణులు03531…UK ద్వారా మరొక ముఖ్యమైన యత్నం అసామాన్యమైన రీతిలో ప్రారంభించ బడియున్నది. ఆ యత్నం  ప్రతి ఒక్క చికిత్సా నిపుణులు యొక్క వివరాలను వైబ్రో నిర్వాహక టీము, సమన్వయకర్తలు మరియు శిక్షకులకు అందుబాటులో ఉండేవిధంగా ఒక డేటాబేస్ (సమాచార సంచయం) ను తయారు చేయడమే. తదుపరి కొన్ని నెలల్లో ఈ పని పూర్తవుతుందని ఎదురుచూస్తున్నాము.

ప్రపంచ స్థాయిలో రోగులకు ఉచితంగా ఒక ప్రత్యామ్నాయ ఆరోగ్య సంరక్షణ సంస్థగా వైబ్రియానిక్స్ ఒక స్థిరమైన రీతిలో వేగంగా ముందుకు వెళ్లడం గమనిస్తుంటే, వైబ్రియానిక్స్ భవిష్యత్తులో ప్రపంచ వ్యాప్తంగా ఒక ప్రధాన చికిత్సా విధానంగా ఎన్నుకోబడుతుందని నేను పూర్తిగా నమ్ముతున్నాను. మా జీవితకాలంలో స్వామి యొక్క ఈ సేవా కార్యక్రమం ఒక అద్భుతమైన మరియు దివ్యమైన స్థితికి చేరుకోవడాన్ని చూసే సౌభాగ్యాన్ని ఇచ్చినందుకు స్వామికి మా కృతజ్ఞతలు. ఈ ప్రతిష్ట, వైబ్రియానిక్స్ కార్యక్రమంలో సేవను అందిస్తున్న ప్రతి ఒక్కరికి చెందుతుంది. స్వామి యొక్క ప్రేమ వాహిని పుస్తకంలో ముందుమాటలు రాసిన ప్రొఫెసర్ ఎన్.కస్తూరి గారి మాటలు గుర్తుకు వస్తున్నాయి: "ఇక్కడ సూచించబడిన సాధన ద్వారా (ఆధ్యాత్మిక ఆచరణ) కలిగే కుతూహలాన్ని అనుభవిస్తూ అదే సమయంలో మీరు కరుణాసాగరం యొక్క ఘనతకు ప్రతిస్పందిస్తున్నారు”.

ప్రేమపూర్వకంగా సాయి సేవలో,

    డా.జే కే అగర్వాల్

తలతిరుగుట (వెర్టిగో), సైనస్ యొక్క వాపు 03524...USA

ఒక 45 ఏళ్ల వ్యక్తి, మూడు సంవత్సరాల పాటు, తలతిరుగుట (వెర్టిగో) సమస్యతో భాధపడేవారు. వైద్యుడుచే ఇవ్వబడిన వివిధ అల్లోపతి మందుల ద్వారా, రోగికి ఉపశమనం కలగలేదు. మంచం నుండి లేచే సమయంలో లేక తలను వేగంగా తిప్పిన సమయంలో అతనికి తల తిరిగేది.  అప్పుడప్పుడు ఈ రోగ లక్షణం కారణంగా అతనికి కారు నడపడానికి భయంగా ఉండేది. ఈ సమస్యకి కారణం చెవి అంతర్భాగంలో ఉన్న నీరే అని అతను నమ్మారు.

అతనికి అలెర్జీ కారణంగా నాలుగు ఏళ్ల పాటు తరచుగా సైనస్ల యొక్క వాపు సమస్య ఉండేది. ఈ సమస్య కారణంగా రోగికి ఊపిరి తీసుకోవడం ఇబ్బందికరంగా ఉండేది. అవసరమైన సమయంలో అతను మందుల దుకాణాల నుండి OTC మందులను తెచ్చుకొని వాడేవారు. 2015 జులై 18 న క్రింది వైబ్రో మందులు ఇతనికి ఇవ్వబడినాయి:
CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC18.1 Brain disabilities + CC18.7 Vertigo + CC19.2 Respiratory allergies…TDS in water

ప్రారంభంలో రోగికి, మందును ఒక గంట వరకు ప్రతి పది నిమిషాలకు ఒక గోలి తీసుకోమని చెప్పబడింది. ఆపై ఒక గోలీను రోజుకి మూడు సార్లు (TDS) తీసుకోమని చెప్పబడింది. దీనితో పాటు, రోగికి మరింత సహాయపడే విధంగా, చికిత్సా నిపుణులు, జల నేటి క్రియ (ఉప్పు నీటితో అనునాసికములను కడిగే ప్రక్రియ) ప్రదర్శించి చూపారు. అంతేకాకుండా, చికిత్సా నిపుణులు రోగిని ప్రతిసారి వైబ్రో గోలీని నాలుక క్రింద ఉంచిన సమయంలో, "నేను నయమయ్యాను, భగవంతుడికి ధన్యవాదాలు" అని స్థిరముగా చెప్పుకోమన్నారు. అతను ఈ చికిత్సను తీసుకుంటున్నసమయంలో, వెర్టిగో సమస్యకు సంబంధించిన అల్లోపతి మందులను తీసుకోలేదు కానీ  సైనస్ సమస్య తీవ్రంగా ఉన్న సమయంలో మాత్రము, దీనికి సంబంధించిన అల్లోపతి మందులను తీసుకొనేవారు.

ఈ చికిత్స ఒక అద్భుతం వలె రోగి ఆరోగ్యాన్ని మెరుగుపరిచింది. చికిత్స ప్రారంభించిన రెండు వారాల్లో, వెర్టిగో సమస్యలో 50 శాతం మరియు సైనసైటిస్ లో 60 శాతం మెరుగుదల కలిగింది. వైబ్రియానిక్స్ చికిత్సతో పాటు జలనేటి క్రియ సైనసైటిస్ సమస్యను నయంచేయడానికి సహాయపడుతోందని రోగి భావించారు. ప్రస్తుతం మందు యొక్క మోతాదు TDSకి తగ్గించ బడింది. ఆగస్టు నెల పూర్తయ్యే ముందు రోగికి వెర్టిగో లో 80 శాతం మరియు సైనసైటిస్ లో 90 శాతం మెరుగుదల కలిగి, రోగి నిర్భయంగా కారు నడపడం కొనసాగించారు. సెప్టెంబర్ నెల పూర్తయ్యే సమయానికి రోగికి వెర్టిగో మరియు సైనసైటిస్ సమస్యలు పూర్తిగా తొలగిపోయాయి.

    2015 అక్టోబర్ లో, ఈ వ్యక్తికి పూర్తిగా నయంకావడంతో, వైబ్రియానిక్స్ చికిత్సను తీసుకోవడం నిలిపారు. సైనసైటిస్ సమస్య తొలగడంతో, ఇతర అల్లోపతి మందులను తీసుకొనే అవసరం ఇతనికి రాలేదు. 2016 జూన్ నాటికి ఇతనికి వెర్టిగో లేక సైనసైటిస్ లక్షణాలు తిరిగి రాలేదు.  

   చికిత్సా నిపుణుల వ్యాఖ్యానం:
   ఒక రోజు రోగి యొక్క భార్య, రోగి యొక్క మంచం వద్ద చెదిరి పడియున్న వైబ్రో గోలీలను చూసి, చికిత్సా నిపుణుల వద్ద తిరిగి గోలీలను తీసుకోవాలని అనుకుంది. అయితే ఇది, తన భర్తను పూర్తిగా నయంచేసినట్లుగా స్వామి తనకి ఇచ్చిన సంకేతమని భావించి, గోలీలను తిరిగితీసుకొనే   అవసరం లేదని చెప్పారు. ఈ చికిత్స ద్వారా ఉపశమనం పొందిన ఈ వ్యక్తి తన స్నేహితులకు వైబ్రియానిక్స్ చికిత్సను సిఫారసు చేస్తున్నారు.

 

కీళ్ల శోథ (ఆస్టియో ఆర్త్రైటిస్) 03524...USA

ఒక 80 ఏళ్ల మహిళ, దీర్ఘకాలిక మోకాళ్ళ నొప్పి కి చికిత్స కోరుతూ చికిత్సా నిపుణులను సంప్రదించింది. ఈ మహిళ దాదాపు పదిహేను సంవత్సరాల పాటు మోకాళ్ళ నొప్పులతో బాధపడేది. రోగి యొక్క మోకాలి చిప్పఎముక క్రింద ఉన్న కండరములు కందిపోయాయి మరియు మోకాళ్ళు బిరుసుకు పోవటం కారణంగా ఈమెకు నడవటం ఇబ్బందికరంగా ఉండేది. వైద్యుడుచే ఇవ్వబడిన స్టెరాయిడ్లును తీసుకుంది కానీ ఉపశమనం కలగలేదు. ఈ రోగ సమస్య కారణంగా ఈమెకు మనసు క్రుంగుదల ఏర్పడింది. ఈమె ప్రతి రోజు ఆస్పిరిన్ 325 మి.గ్రా తీసుకొనేది. ఈమెకు నయంకావడానికి సాయి వైబ్రియానిక్స్ సహాయపడే అవకాశం ఉందని చికిత్సా నిపుణుల ద్వారా తెలుసుకొన్న ఈమె చాలా ఉత్సాహపడి, వెంటనే వైబ్రో చికిత్స తీసుకోవడానికి అంగీకరించింది.

2015 నవంబర్ 15 న, రోగికి క్రింది వైబ్రో మిశ్రమాలు ఇవ్వబడినాయి:
CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC18.1 Brain disabilities + CC20.1 SMJ tonic + CC20.2 SMJ Pain + CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue + CC20.6 Osteoporosis…QDS

ఈ చికిత్స తీసుకున్న సమయంలో, రోగి ఒక ఆస్పిరిన్ మాత్రను (325 మి.గ్రా) మాత్రమే తీసుకోవటం కొనసాగించింది. మూడు వారాల్లో మోకాళ్ళ నొప్పి మరియు బిరుసుతనం 50 శాతం తగ్గిపోయాయని రోగి ఉత్సాహంతో చికిత్సా నిపుణులకు తెలిపింది. రోగి వైబ్రో మందులను తిరిగి నింపించు కోవడానికి వచ్చినప్పుడు, ఇబ్బంది లేకుండా నడవగలిగింది. డిసెంబర్ నెలలో మందు యొక్క మోతాదు TDSకి తగ్గించబడింది. ఒక నెల తర్వాత, రోగి యొక్క నొప్పి మరియు కీళ్ల బిరుసుతనం 80 శాతం తగ్గినట్లుగా తెలపడంతో వైబ్రో మందు యొక్క మోతాదు ODకి తగ్గించడం జరిగింది. రెండు వారాల్లో ఆమె ఆరోగ్య పరిస్థితి 90 శాతం మెరుగుపడింది. ఆపై నెల తర్వాత ఆమెకు పూర్తిగా నయమయింది. దీనికారణంగా, వైబ్రో చికిత్సను నిలిపేశారు. 2016 జూన్ నాటికి రోగి ఇబ్బంది లేకుండా నడవగలుగుతోంది. ఆమె మోకాళ్ళ నొప్పికి ఆస్పిరిన్ మందు తీసుకోవడం కూడా మానేసింది. అయితే గుండె పోటు మరియు స్ట్రోక్ వ్యాధుల నివారణ కొరకు తక్కువ మోతాదులో ఆస్పిరిన్ మాత్రను (81 మి.గ్రా) తీసుకుంటోంది.

చాలని తల్లిపాలు 03526...USA

తల్లిపాలు చాలక ఇబ్బందిపడుతున్న ఒక మూడు నెలల బిడ్డకు తల్లైన ఒక 24 ఏళ్ల మహిళ, వైబ్రియానిక్స్ గురించి తెలుసుకొని చికిత్సా నిపుణులను, సహాయం కొరకు సంప్రదించింది. ఆమె యొక్క చనుబాలు రోజురోజుకి తగ్గిపోవటం కారణంగా వైద్యుడు బిడ్డకు సీసా పాలు పట్టించమని సలహా ఇవ్వడం జరిగింది. అయితే ఈ మహిళ, బిడ్డకు తల్లి పాలివ్వడం కొనసాగించాలని ఆశ పడింది.  ఆమె, మణికట్టు సంబంధించిన (కార్పల్ టన్నల్ సిండ్రోమ్) సమస్యతో కూడా బాధపడేది. దీని కారణంగా, ఆమెకు ఎడమ చేతిలో నొప్పి ఉండేది. నొప్పి నుండి ఉపశమనం కొరకు వైద్యుడుచే పెయిన్ కిల్లర్లు ఇవ్వబడినాయి.

ఆమె ఒక ఆరోగ్యకరమైన జీవనశైలీను పాటించేది మరియు ఆమె కుటుంబం ఆమెకు తగిన సహకారాన్ని అందించేది. బిడ్డ యొక్క సంరక్షణ కొరకు ఆమె తన ఉద్యోగాన్ని విడిచి పెట్టింది. క్రింది మిశ్రమాలు ఆమెకు ఇవ్వడం జరిగింది:
#1. CC8.1 Female tonic + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC20.3 Arthritis…TDS

ఒక వారం తర్వాత, బిడ్డకు సరిపోయే విధంగా చనుబాలు యొక్క సరఫరా పెరగడంతో ఆమె ఎంతో ఆనందించింది. నాలుగు వారాల తర్వాత ఆమె చికిత్సా నిపుణులను సంప్రదించి, మూడు రోజుల క్రితం వైబ్రో మందులు పూర్తయినట్లుగాను, అప్పటినుండి చనుబాలు యొక్క ఉత్పత్తి తగ్గడాన్ని ఆమె గమనించినట్లుగాను తెలిపింది. వెంటనే ఆమె చికిత్సా నిపుణులను వైబ్రో మందులను తిరిగి నింపి ఇవ్వమని కోరింది. మిశ్రమాల్లో కొంత మార్పు చేయడం జరిగింది. ఈ మహిళ తల్లిపాలు యొక్క ఉత్పత్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన కారణంగా, CC20.3 Arthritis ను చేర్చకుండా, క్రింది మిశ్రమాలను ఇవ్వడం జరిగింది:
#2. CC8.1 Female tonic + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic…TDS

ఈ మహిళ, బిడ్డకు 11 నెలలు పూర్తయ్యే వరకు పైన ఇవ్వబడిన వైబ్రో మిశ్రమాలను తీసుకోవడం జరిగింది. ఆపైన బిడ్డకు ఇతర ఆహార పదార్థాలను ఇవ్వడం ప్రారంభించింది.

చికిత్సా నిపుణుల వ్యాఖ్యానం:
వైబ్రియానిక్స్ చికిత్స ద్వారా ఎటువంటి ఫలితాలను ఎదురు చూడవచ్చో రోగికి ఖచ్చితంగా తెలియలేదు కానీ, ఆమెకు అద్భుతమైన ఫలితాలు లభించాయి. చెప్పలేని కారణాల వలన ఆమె తన చేతి నొప్పికి వైబ్రో చికిత్సను తీసుకోకుండా, వైద్యుడుచే ఇవ్వబడిన పెయిన్ కిల్లర్లను మాత్రము తీసుకోవాలని నిర్ణయించుకుంది. దీని కారణంగా నేను కీళ్ల వాపుకి సంబంధించిన వైబ్రో మిశ్రమాన్ని నిలిపి వేయడం జరిగింది.

తీవ్రమైన మలబద్ధకం 03526...USA

ఒక 15 ఏళ్ల అమ్మాయి దాదాపు ఐదు సంవత్సరాల నుండి తీవ్రమైన మలబద్ధకం సమస్యతో బాధపడేది. దీని కారణంగా కడుపు నొప్పి నుండి ఉపశమనం కొరకు ఆమె వైద్యుడను సంప్రదించడం జరిగింది. కానీ ఆమె తన కడుపు నొప్పి మలబద్ధకం సమస్య వలన కలుగుతోందని తెలుసుకోలేకపోయింది. ఆమెకు హెలికోబాక్టెర్ ఇన్ఫెక్షన్ ఉందని అనుమానించి, వైద్యుడు రోగికి ఆంటీబయాటిక్లను ఇచ్చారు. రోగి వైద్యుడను తిరిగి సంప్రదించిన సమయంలో వైద్యుడు చేసిన ఉదర పరిశీలనలో, ఆమె  పేగులలో మలం పేరుకుందని గమనించారు. అనేక సార్లు ఆమెకు విరోచనకారి మందులను ఇచ్చినప్పటికీ, రోగికి తాత్కాలిక ఉపశమనం మాత్రమే కలిగింది. కడుపు నొప్పి మరియు కడుపు ఉబ్బుదలతో పాటు రోగికి తలనొప్పి సమస్య కూడా ఉండేది. రోగి యొక్క ముక్కు నుండి ఆమె యొక్క ఉదర భాగం వరకు ఒక గొట్టాన్ని అమర్చడం ద్వారా రోగి యొక్క ఉదర భాగంలో పేరుకున్న మలాన్ని తొలగించడానికి వైద్యుడు ప్రయత్నం చేయడం జరిగింది. ఈ సమస్యకు అల్లోపతి చికిత్స ద్వారా పూర్తి ఉపశమనం లభించడం సాధ్యం కాదని మరియు ఏదైనా ప్రత్యామ్నాయ చికిత్సా విధానాన్ని రోగికి చేయించమని వైద్యుడుచే సలహా ఇవ్వబడింది. రోగి యొక్క తండ్రిగారు ఒక సాయి భక్తుడి సిపార్సుతో చికిత్సా నిపుణుడను సంప్రదించడం జరిగింది. ఆ సమయంలో రోగి కడుపు నొప్పి మరియు ఉబ్బుదల సమస్యలతో బాధపడుతోంది. మొదటి సంప్రదింపు సమయంలో, ఒక ఆరోగ్యకరమైన జీవన శైలిని రోగి పాటిస్తున్నట్లుగా చికిత్సా నిపుణులు గమనించడం జరిగింది. అప్పుడప్పుడు ఆమెకు సైనస్ సమస్య వచ్చేదని మరియు శస్త్రచికిత్స ద్వారా రోగి యొక్క అడినాయిడ్లు (ముక్కుకును నోటికిని మధ్య పెరుగు కొయ్యగండలు) తొలగించబడ్డాయి. ఒక ఆధ్యాత్మికమైన కుటుంబం నుండి వచ్చిన ఈ రోగి, మానసిక చింతలు ఏమి లేని ఒక సంతోషమైన యువతియని నిపుణులు తెలుసుకున్నారు.

2016 జనవరి 17 న, చికిత్సా నిపుణులు క్రింది మందులను ఇవ్వడం జరిగింది:
CC4.4 Constipation + CC12.2 Child tonic…TDS రెండు వారాల వరకు

ఒక వారం తర్వాత, రోగి యొక్క తండ్రి, వైబ్రో చికిత్స ప్రారంభించిన రెండు రోజుల్లో, రోగికి ఉపశమనం కలిగినట్లుగా తెలియజేసారు. కడుపులో నొప్పి మరియు ఇతర రోగ సమస్యలు పూర్తిగా మాయమయ్యాయి. పైనివ్వబడిన మందులు మరొక వారం రోజుల వరకు TDS మోతాదులో కొనసాగించి, ఆపై నెల రోజులకు BD మోతాదులోను, ఆపై ఒక నెల వరకు OD మోతాదు లోను, రోగి తీసుకుంది. ఆపై ఆరు నెలల వరకు వారానికి ఒకసారి (OW) మందును తీసుకోవడం కొనసాగించింది.

ప్రయాణం సమయంలో కలిగే తీవ్ర ఆరోగ్య సమస్య 03527...France

మూడేళ్ళ వయస్సు గల ఒక బాలుడు, తనకు 18 నెలల వయసు నుంచి, ప్రయాణాలు చేసే సమయంలో తీవ్ర అనారోగ్యంతో బాధపడేవాడు. కారు ప్రయాణం మొదలుపెట్టిన 10-20 నిమిషాలకు, ఆ బాలుడు తీవ్ర అస్వస్థతకు గురైయ్యేవాడు. ఆ బాలుడు యొక్క ముఖం పాలిపోయి, వాంతులు మొదలయ్యేవి. ఈ సమస్యకు ఆ బాలుడికి ఏ విధమైన చికిత్స ఇవ్వబడలేదు. బాలుడి యొక్క అమ్మమ్మగారు వైబ్రో చికిత్స కొరకు ఒక చికిత్సా నిపుణులను సంప్రదించడం జరిగింది. క్రింది మందు, 2016 ఏప్రిల్ 9 న, రోగికి ఇవ్వబడింది:
CC15.1 Mental & Emotional tonic + CC17.1 Travel sickness...తరచుగా ఈ మందును ఇవ్వమని చెప్పబడింది.

వoద మైళ్లకు పైగా ప్రయాణించ వలసిన ఒక సందర్భంలో,బాలుడి యొక్క అమ్మమ్మ గోలీల రూపంలో మందును ఇవ్వడానికి ఇష్టపడింది (సూచించబడినట్లుగా నీటిలో కాదు). ప్రయాణం ప్రారంభించడానికి ఒక గంట ముందు ఒక డోస్, ప్రయాణం మొదలైన వెంటనే ఒక డోస్, ఆపై ఒక గంట సమయం వరకు, పది నిమిషాలకు ఒక గోలి ఇవ్వడం జరిగింది. ఆ బాలుడికి, ప్రయాణం సమయంలో సాధారణంగా కలిగే ఆరోగ్య సమస్యలు కలుగలేదు. దీని కారణంగా వారు ఆనందంగా ప్రయాణించగలిగారు. వారికి 100% ఫలితాలు లభించడంతో, తిరుగు ప్రయాణంలో ఇదే పద్ధతిలో వైబ్రో గోలీలను ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత బాలుడి యొక్క తల్లి ప్రయాణాల సమయంలో, వైబ్రో మందులను బాలుడికి ఇవ్వడం కొనసాగించిన కారణంగా, బాలుడికి ప్రయాణం సమయంలో  కలిగే ఆరోగ్య సమస్య పూర్తిగా తొలగిపోయింది.

బొల్లి (విటిలిగో) 02840...India

గత మూడు సంవత్సరాలుగా, కాళ్ళు, చేతులు మరియు ముఖం పై బొల్లి సమస్యతో బాధపడుతున్న ఒక 8 ఏళ్ల బాలుడను, 26 ఆగస్టు 2015 న ఒక వైబ్రో చికిత్సా నిపుణుల వద్దకు తీసుకు రావడం జరిగింది. గతంలో ఈ బాలుడకు చర్మ వైద్యుడుచే ఇవ్వబడిన వైటమిన్ బిళ్ళలు మరియు ఇతర మందుల ద్వారా ఉపశమనం కలగకపోవడమే కాకుండా, రోగికి వాంతులు, శరీర వాపు మరియు బొల్లి మచ్చలపై ఎర్ర విస్ఫోటకములు (బాయిల్స్) వంటి దుష్ప్రభావాలు కలగడంతో అల్లోపతి చికిత్సను నిలిపి వేయడం జరిగింది. ఆ తర్వాత, రోగి యొక్క తల్లి తండ్రులు అతనికి ఒకటిన్నర సంవత్సరాల పాటు ఆయుర్వేద చికిత్స చేయించారు. అయితే ఈ చికిత్స ద్వారా కేవలం కొంత మెరుగుదల మాత్రమే ఏర్పడడంతో తల్లి తండ్రులకు సంతృప్తి కలగలేదు. కొంత కాలం తర్వాత వీరు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు దీవించిన సాయి వైబ్రియానిక్స్ చికిత్స గురించి వినడం జరిగింది. సాయి భక్తులైన వీరు వెంటనే తమ బిడ్డకు ఈ చికిత్సను చేయించాలని నిర్ణయించుకుని, వైబ్రో చికిత్సా నిపుణులను సంప్రదించడం జరిగింది. క్రింది మిశ్రమాలను ఈ రోగికి ఇవ్వడం జరిగింది:
CC15.1 Mental & Emotional tonic + CC21.2 Skin infections + CC21.3 Skin allergies…6TD 

మందు యొక్క మోతాదు: మూడు వారాలకు 6TD (రోజుకి ఆరు సార్లు), ఆపై మూడు వారాలకు QDS (రోజుకి నాలుగు సార్లు), ఆ తర్వాత TDS మోతాదులో కొనసాగించబడింది. ఈ మిశ్రమమును బాధిత చర్మం పైపూతగా (BD) ఉపయోగించేందుకు విభూతిలో కూడా కలిపి ఇవ్వడం జరిగింది

ఈ చికిత్స ప్రారంభించిన ఎనిమిది వారాల తర్వాత, రోగి యొక్క ముఖం పై ఉన్న తెల్ల మచ్చలన్నీ పూర్తిగా తొలగి, అతని చర్మ వర్ణం సాధారణ స్థితికి తిరిగి మారింది. అతని కాళ్ళు మరియు చేతులపై ఏర్పడిన మచ్చలు 95% వరకు తొలగిపోయాయి. దీని కారణంగా మందు యొక్క మోతాదు ఆపై రెండు వారాలకు OD కి, ఆ తర్వాత OW కి తగ్గించడం జరిగింది. పదమూడు వారాల తర్వాత రోగి యొక్క కాళ్ళు మరియు చేతుల పై మచ్చలు పూర్తిగా తొలగిపోయాయి. మిశ్రమం కలపబడిన విభూతితో పాటు (పైపూతకు) ఈ మందును మరికొంత కాలం వరకు OD మోతాదులో తీసుకోవలసిందిగా చికిత్సా నిపుణుల చే అతనికి సలహా ఇవ్వబడింది. రోగికి బొల్లి సమస్య పూర్తిగా తొలగిన కారణంగా 2016 మే లో, పైపూత మందును పూర్తిగా నిలిపి, మౌఖికంగా తీసుకొనే మందు యొక్క మోతాదును మరింత తగ్గించి ఇవ్వడం జరిగింది (నెలకు ఒకసారి).

చర్మంవూడుట 11572...India

2016 జనవరి 4 న, రెండు చేతుల్లోను తీవ్రమైన దురద, నొప్పి, వాపు మరియు చర్మం వూడుట సమస్యలతో బాధపడుతున్న ఒక 30 ఏళ్ల మహిళ చికిత్సా నిపుణులను సంప్రదించింది. ఈ వ్యాధి లక్షణాలు, రోగికి ఎంతో అసౌకర్యాన్ని కలిగించాయి. ఈ రోగ సమస్య  మొదలైన వెంటనే రోగి అల్లోపతి వైద్యుడుని సంప్రదించి మందులను తీసుకోవడం జరిగింది. ఆ మందుల ద్వారా ఉపశమనం కలగకపోయేసరికి రోగి వైబ్రో చికిత్సను తీసుకోవడం ప్రారంభించింది. ఈమెకు క్రింది మందులు ఇవ్వబడినాయి

చర్మం పై పూతకు:
#1. CC21.2 Skin infections + CC21.3 Skin allergies + CC21.6 Eczema…. నీటిలో కలిపి పైపూతగా ఉపయోగించుటకు (6TD)

మౌఖికంగా తీసుకొనుటకు:
#2. CC8.1 Female tonic + CC10.1 Emergencies + #1…6TD

ఆరు దినాలలో రోగి యొక్క చేతులపై కలిగిన వ్యాధి లక్షణాలు పూర్తిగా తొలగిపోయాయి. ఆపై పదిహేను రోజులకు రోగి మందును రోజుకి మూడు సార్లు (TDS) తీసుకుంది. 2016 మే నాటికి ఈ మహిళకు ఈ చర్మ వ్యాధి తిరిగి రాలేదు.

నీళ్ల విరోచనాలు 11570...India

కడుపులో నొప్పి మరియు నీళ్ల విరోచనాలతో మూడు రోజులుగా బాధపడుతున్న ఒక 50 ఏళ్ల వ్యక్తి, 2015 మే 25 న వైబ్రో చికిత్స కోరుతూ చికిత్సా నిపుణులను సంప్రదించారు. ఈ రోగి కొన్ని రోజులుగా ఒక పార్కులో ఉన్న కుళాయి నుండి నీరు త్రాగుతున్నట్లుగా వైబ్రో చికిత్సా నిపుణులకు తెలపడంతో క్రింది మందులను ఈ రోగికి ఇవ్వడం జరిగింది:
CC4.6 Diarrhoea + CC4.10 Indigestion + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic… నీటిలో కలిపి ఒక గంట సమయం వరకు పది నిమిషాలకు ఒకసారి తీసుకోవాలి

వ్యాధి సమస్య కొనసాగిన సందర్భంలో ఇదే విధంగా మరో గంట సమయం వరకు మందును తీసుకొని మరియు మరుసటి రోజు ఆరు సార్లు (6TD) తీసుకోవలసిందిగా చెప్పబడింది. రోగికి వైబ్రో చికిత్స ప్ర్రారంభించిన ఒక రోజులోనే పూర్తి ఉపశమనం కలిగింది. ఆపై రోగికి మందు యొక్క మోతాదు క్రింది విధముగా తగ్గించడం జరిగింది: ఒక రోజు మూడు సార్లు (TDS), ఆపై ఒక రోజు రెండు సార్లు (BD),ఆపై ఒక వారం వరకు రోజుకి ఒకసారి (OD).

ముఖ పక్షవాతము, నరాల దౌర్బల్యం (న్యూరోసిస్) 11576...India

2015 డిసెంబర్ 3 న, తీవ్ర నొప్పి, ముఖంలో పక్షవాతం మరియు స్పర్శరహితమైన ఎడమ బుగ్గ, వంటి వ్యాధి లక్షణాలతో ఒక 30 ఏళ్ల వ్యక్తి చికిత్సా నిపుణులను సంప్రదించడం జరిగింది. ఇతను ఒక ప్రముఖ టీవీ ఛానెల్ లో వీడియో జాకీ గా ఉద్యోగం చేస్తున్న కారణంగా అధికంగా మాట్లాడవలసిన అవసరం ఉంటుంది. ఈ రోగ లక్షణాలు కారణంగా తాను ఆత్మగౌరవం కోల్పోవడమే కాకుండా తీవ్ర ఆతృత మరియు భయం తనలో కలుగుతున్నట్లుగా రోగి తెలిపారు. అంతేకాకుండా పీడ కలలు మరియు మానసిక ఆందోళనతో భాధపడుతున్నట్లుగాను రోగి తెలిపారు.

రోగికి ఈ రోగ లక్షణాలు మూడు వారాల క్రితం మొదలయ్యాయి. వైద్యుడుచే ఇవ్వబడిన 400mg ఇబుప్రోఫెన్ QDS తీసుకున్నప్పటికీ ఉపశమనం కలగలేదు. ఈ కారణంగా రోగి హోమియోపతి వైద్యుడను సంప్రదించి, మూడు వారాల వరకు ఈ చికిత్సను తీసుకుని, ఉపశమనం కలగనందువల్ల ఈ చికిత్సను కూడా నిలిపివేయడం జరిగింది. చికిత్సా నిపుణులు ఒక లోలకమును (పెండ్యులం) ఉపయోగించి రోగికున్న వ్యాధి లక్షణాలు, కుదృష్టి మరియు వామతంత్రము (బ్లాక్ మేజిక్) ద్వారా కలిగిన మనస్సంబంధమైన సమస్యలని కనుగొని క్రింది వైబ్రో మిశ్రమాలను తయారు చేసి ఇవ్వడం జరిగింది

ముఖ పక్షవాతానికి:
#1. CC3.7 Circulation + CC17.2 Cleansing + CC18.4 Paralysis + CC18.5 Neuralgia + CC20,4 Muscles & Supportive tissue… నీటిలో ప్రతి పావుగంటకు ఒకసారి. మెరుగుదల కనపడిన తర్వాత మోతాదును తగ్గించవలెను.

నరాల దౌర్భల్యం (న్యూరోసిస్) సమస్యకు:
#2. CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.2 Psychiatric disorders + CC17.3 Brain & Memory tonic…TDS నీటిలో

వైబ్రో మందును ప్రారంభించిన రెండు గంటల తర్వాత రోగికి తన ముఖంలో కొంత మెరుగుదల కనపడడంతో మందు యొక్క మోతాదును TDSకి తగ్గించుకున్నారు. మూడు రోజుల తర్వాత ముఖ పక్షవాతంలో 80% మెరుగుదల కనపడింది. రోగి యొక్క ఎడమ బుగ్గలో ఏర్పడిన స్పర్శహీనత చాలా వరకు తగ్గడంతో రోగి వీడియో జాకీ గా తన ఉద్యోగాన్ని కొనసాగించారు. ఒక నెల తర్వాత, రోగియొక్క ముఖంలో 95% మెరుగుదల కనపడింది. రెండు నెలల్లో పూర్తి ఉపశమనం కలిగినట్లుగా రోగి తెలిపారు. రోగికున్న నరాల దౌర్భల్యత ఐదు దినాల్లో 25% వరకు మరియు రెండు వారాల్లో 50% వరకు తగ్గింది. మూడు వారాల సమయంలో రోగికి నరాలకు సంబంధించిన రోగ లక్షణాల నుండి పూర్తి ఉపశమనం జరిగింది. అంతేకాకుండా అతనికి ఆందోళనకరమైన ఆలోచనలు మరియు పీడ కలలు రావడం పూర్తిగా ఆగిపోయినట్లుగాను తెలిపారు.

2016 ఏప్రిల్ నాటికి మందు యొక్క మోతాదు OW కి తగ్గించడం జరిగింది. ఆపై ఈ వ్యక్తి ఆనందంగానూ మరియు సంపూర్ణ ఆరోగ్యంతోనూ తన జీవితాన్ని కొనసాగించగలిగారు. 

రోగి యొక్క వ్యాఖ్యలు:
నాకు కలిగిన రోగ సమస్యలు కారణంగా నా జీవితం స్తంభించిపోయింది. మూడు వారాలు తీసుకున్న హోమియోపతి మందులు నాకు సహాయపడలేదు. నాకున్న సమస్యలన్నిటినీ సాయి వైబ్రియానిక్స్ అతి తక్కువ సమయంలో నయంచేసినందుకు నాకు ఎంతో ఆనందమగా ఉంది. ఏ విధమైన దుష్ప్రభావాలను కలుగ చేయని ఈ చికిత్స ద్వారా ఎంతో బాధాకరమైన ముఖ పక్షవాతం నుండి నేను విముక్తి పొంది నా ఉద్యోగాన్ని కొనసాగించగలిగాను.

పుట్టుకనుండి ఎక్జీమా (తామరవ్యాధి) 01180...Bosnia

పుట్టుక నుండి ఎక్జీమా అనబడే ఒక చర్మవ్యాధితో బాధపడుతున్న ఒక 12 ఏళ్ల బాలుడను 2015 అక్టోబర్ 14న చికిత్స కొరకు వైబ్రో చికిత్సా నిపుణుల వద్దకు తీసుకు రావడం జరిగింది. ఈ బాలుడు, పుట్టిన మూడవ రోజు నుండి ఈ చర్మవ్యాధితో బాధపడుతున్నాడు. రోగి యొక్క శరీరం అంతయు ఈ వ్యాధి వ్యాపించి యుండడం కారణంగా రోగికి తీవ్రమైన అసౌకర్యం కలిగేది (చిత్రాలను చూడండి). చీము కారుతున్న తామర కారణంగా రోగికి తీవ్ర దురద మరియు మంట కలిగేది. ముఖ్యంగా తామర ఎండిపోయినప్పుడు చర్మం కూడా ఎండిపోయి పగుళ్లు ప్రారంభమయ్యేవి. దీని కారణంగా రోగికి తీవ్ర నొప్పి కలిగేది. గోకడం కారణంగా రోగి యొక్క శరీరం తీవ్రమైన నొప్పితో కూడిన పుళ్ళతో కప్పబడి యుండేది. ఈ బాలుడికి నాడీవ్రణములు (సైనస్లు) మూసుకు పోవడం కారణంగా శ్వాస తీసుకోవడం ఇబ్బందికరంగా ఉండేది.

 

 

ప్రారంభంలో రోగికి ఇవ్వబడిన మందులు:
#1. SR389 Kali Bic 30Cనాలుగు గంటలకు ఒకసారి (మూడు సార్లు). మరుసటి రోజు పుల్ అవుట్ ప్రక్రియ కారణంగా రోగి యొక్క వ్యాధి లక్షణాలు మరింత తీవ్రమవ్వడం జరిగింది (చిత్రం చూడండి).

వ్యాధి లక్షణాలు మరింత క్షీణించకుండా ఉండే నిమిత్తమై చికిత్సగా నిపుణులు క్రీములో క్రింది మిశ్రమాన్ని సిద్ధం చేశారు:
#2. CC10.1 Emergencies + CC12.2 Child tonic + CC15.1 Mental & Emotional tonic + CC15.6 Sleep disorders + CC21.1 Skin tonic + CC21.2 Skin infections + CC21.3 Skin allergies + CC21.6 Eczema … TDS

*క్రింది పదార్థాలను ఉపయోగించి క్రీము తయారు చేయబడింది: కాచిన నెయ్య, కొబ్బరి నూనె, మైనం, కేలండ్యూలా నూనె, సీంఫైటం (ఒక విధమైన ఔషదం)నూనె మరియు విభూతి.

అదనంగా, నొప్పి గురించిన భయాన్ని తొలగించుటకు చికిత్సా నిపుణులు క్రింది మిశ్రమాన్ని ఇవ్వడం జరిగింది:
#3. SR543 Agaricus Mus 30C…OD అవసరమైనప్పుడు

అక్టోబర్ 27 న, రోగి యొక్క వ్యాధి లక్షణాలలో ఘనమైన మెరుగుదల కనిపించింది. అయితే రోగి యొక్క కంటి చుట్టూ తామర వ్యాధి లక్షణాలు మొదలవడం చూసిన చికిత్సా నిపుణులు క్రింది మందును ఇవ్వడం జరిగింది:
#4. SR249 Medorrhinum 30C… నాలుగు గంటలకు ఒకసారి (రోజుకి మూడు సార్లు).

చికిత్స ప్రారంభంలో రోగి యొక్క వ్యాధి లక్షణాలు తీవ్రమయ్యాయి. ఆ తర్వాత మెరుగుదల కనిపించింది. నవంబర్ 7 న రోగికి నొప్పి చాలా వరకు తగ్గిందని రోగి తెలియచేసారు. పైపూత ముందుగా ఉపయోగించుటకు క్రీములో తయారు చేయబడిన మిశ్రమం నొప్పిని తగ్గించడానికి రోగికి ఎంతో సహాయపడింది. దీని కారణంగా రోగి బడికి వెళ్లి చదువుకో గలిగాడు (చిత్రాలను చూడండి).

.

 

చికిత్సా నిపుణులు క్రింది మందును ఇచ్చారు:
#5. SR218 Base Chakra…OW (వారానికి ఒకసారి,నాలుగు వారాలకు)

నవంబర్ 21 న, రోగికి క్రింది రోగ లక్షణాలు ఏర్పడ్డాయి: ముక్కులో తీవ్ర దురద, మూసుకున్న నాడీవ్రణములు మరియు ముక్కునుండి గట్టిగానున్న తెల్లటి చీమిడి కారుట. చికిత్సా నిపుణులు తిరిగి #1...OD తో పాటుగా క్రింది మిశ్రమాలను ఇవ్వడం జరిగింది:

#6. SR331 Bacillus-7…ఒక సారి
#7. SR333 B. Morgan…ఒక సారి

ఒక వారం తర్వాత, రోగి యొక్క చేతిమణికట్టు మరియు చెవుల పై చిన్న తెల్లటి మచ్చలను చికిత్సా నిపుణులు గమనించడం జరిగింది. దీనికి కారణం స్ట్రెప్టోకోకై (ఒక విధమైన బాక్టీరియా క్రిములు) అని అనుమానించి క్రింది మిశ్రమాన్ని రోగికి ఇచ్చారు:

#8. SR316 Strep…OD 21 రోజులకు మరియు ఏడు రోజుల విరామం తర్వాత మరో 21 రోజులకు OD

#9. NM101 Skin-H + NM102 Skin Itch…TDS

2016 ఫిబ్రవరి 11 న, రోగికి తామర వ్యాధి లక్షణాలు దాదాపు పూర్తిగాను, నొప్పి పూర్తిగాను తగ్గిపోయాయి మరియు రోగి యొక్క ఆకలి సాధారణ స్థాయికి చేరుకోవడంతో రోగి యొక్క ఆరోగ్యం మెరుగుపడింది.

రోగి యొక్క తల్లిగారు టాన్సిల్స్ పరీక్ష చేయించడంతో రోగి యొక్క టాన్సిల్స్ పై  కేవలం 30% స్ట్రెప్టోకోకై మాత్రమే మిగిలి ఉన్నాయని తెలిసింది. చికిత్సా నిపుణులు క్రింది మందును ఇచ్చారు:
#10. Sulphuricum Acidum 30C హోమియో స్టోర్స్ నుండి...నాలుగు గంటలకు ఒకసారి, మొత్తం మూడు డోసులు మరియు #8...OD 21 రోజులకు.

2016 మార్చులో, వైద్యుడు ఒక అద్భుతమైన రీతిలో, ఈ బాలుడి యొక్క వ్యాధి పూర్తిగా నయమయిపోవడం చూసి ఎంతో ఆశ్చర్యపోయారు (చిత్రాలను చూడగలరు)

 

                                                                                 


                    

మెడ బిర్రుగానుండుట (సెర్వైకల్ స్పాండిలైటిస్) 11569...India

2015 ఏప్రిల్ 6 న, నీరసం మరియు తీవ్ర నొప్పితో ఒక 62 ఏళ్ల వ్యక్తి చికిత్సా నిపుణులను సంప్రదించారు. గత పదిహేనేళ్లుగా ఈ వ్యక్తికి సెర్వైకల్ స్పాండిలైటిస్ సమస్య కారణంగా, ఉదయం మరియు రాత్రివేళల్లో రెండు భుజాలు,కాళ్ళు ,ముఖ్యంగా పిక్కలు నొప్పిగా ఉండేవి. ఎక్సరే పరీక్షలో రోగికి నడుమ కింద మరియు మెడ వద్దనున్న వెన్నెముకలో ఆస్టియోఫైట్లు ఉన్నట్లుగా తెలిసింది. రోగి కొంత ఉపశమనం కోసం ఇంటిలో రోజువారీ మాలీషు (మసాజు) తప్ప ఈ రోగ సమస్యకు ఇతర మందులను ఉపయోగించలేదు.

క్రింది మిశ్రమాలు రోగికి ఇవ్వడం జరిగింది:
CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC20.1 SMJ tonic + CC20.4 Muscles & Supportive tissue + CC20.5 Spine…TDS. ఈ మందులను రోగి ఆఫీసులో గోలీల రూపంలోను మరియు ఇంటిలో ఉన్నప్పుడు నీటిలోను తీసుకునేవారు. ఈ చికిత్సను ప్రారంభించిన తర్వాత రోగి మాలీషు చేయించుకోవడం నిలిపేశారు.

ఒక వారం తర్వాత, తన శక్తిస్థాయిలో గొప్ప మెరుగుదల ఏర్పడినట్లుగా రోగి తెలియచేశారు. అంతేకాకుండా తన భుజాల నొప్పి ఉదయం వేళలో 90% మరియు రాత్రివేళలో 50% మరియు కాళ్ళ నొప్పులు రెండు వేళల్లోనూ 50% తగ్గినట్లుగా తెలియచేశారు. రోగి యొక్క సౌకర్యం దృష్టిలో పెట్టుకొని మందు యొక్క మోతాదు 6TD కి పెంచబడింది.

ఎనిమిది వారాల తర్వాత, మే నెలలో, రోగి యొక్క భుజాల, కాళ్ళ నొప్పులు మరియు శక్తి స్థాయిలలో 90% మెరుగుదల ఏర్పడినట్లు రోగి తెలియచేశారు. దీని కారణంగా మందు యొక్క మోతాదు TDS కి తగ్గించబడింది. జూన్ నెలాఖరికి రోగికి 100% ఉపశమనం కలిగింది. జులై నెల మధ్యలో చికిత్సా నిపుణులు అందుబాటులో లేని కారణంగా రోగి వైబ్రో మందును తీసుకోవడం కొనసాగించలేకపోయారు. ఈ కారణంగా జులై నెలాఖరుకి నొప్పులు తిరిగి మొదలైనట్లుగా రోగి తెలియచేశారు.

TDS మోతాదులో తీసుకొనుటకు రోగికి వైబ్రో మందు పంపబడింది.

ఆగస్టు నెలఖారికి, తిరిగి 100% ఉపశమనం కలిగినట్లుగాను TDS మోతాదులో మందును కొనసాగిస్తునట్లుగాను రోగి తెలియచేశారు. కొన్ని రోజుల తర్వాత మరో వ్యాధి సమస్య కారణంగా హఠాత్తుగా రోగి ఆస్పత్రిలో చేర్చబడ్డారు. దీని కారణంగా వైబ్రో మందును తీసుకోవడం నిలపవలసివచ్చింది. అక్టోబర్ నెలలో రోగికి టైఫాయిడ్ మరియు టీ.బీ మెనింజైటిస్ (మేథో మజ్జా రోగం) వ్యాధులు ఉన్నట్లుగా నిర్ధారించ బడింది. ప్రస్తుతం ఈ రోగికి ఆస్పత్రిలో అల్లోపతి వైద్యం చేయించబడుతోంది.

2016 మే లో, భుజాలు మరియు కాళ్ళ నొప్పులు పూర్తిగా తగ్గినట్లుగా రోగి తెలియచేశారు.

ఆహార అలెర్జీ 03522...Mauritius

2015 మే లో ఆహార అలెర్జీలతో బాధపడుతున్న ఒక 46 ఏళ్ల వ్యక్తి చికిత్సా నిపుణులను సంప్రదించారు. ఐదేళ్ల క్రితం ఇతనికి కేండ్ ఆహారాల (తయారుచేయబడి డబ్బాలలో లభించే ఆహారం) అలెర్జీ మొదలయింది. ఈ ఆహారాన్ని తీసుకున్నప్పుడు, ఇతని చేతులు, మెడ మరియు చాతి పై దురదతో కూడిన ఎర్రటి మచ్చలు ఏర్పడేవి. రెండేళ్ల తర్వాత ఎండు పళ్ళు, గింజలు, కారం, పాల ఉత్పత్తులు మరియు గ్లూటెన్ మరియు ప్రిజర్వేటివ్లు (ఆహారాన్ని చెడిపోకుండా ఉంచే పదార్థాలు) వంటివి తీసుకున్నప్పుడు ఇతనికి ఇవే చర్మ సమస్యలు ఏర్పడడం మొదలయ్యాయి. 14 నెలల క్రితం, రోగి నోటిలోపల మరియు చిగుళ్ల పై చిన్న చిన్న గడ్డలు రావడం మొదలయింది. పైనున్న ఆహార పదార్థాలలో ఏ ఒక పదార్థాన్ని తీసుకున్నప్పటికీ రోగ లక్షణాలు తీవ్రమయ్యేవి. వైద్యుడు సలహా పై రోగి ఆహార అసహిష్ణుత (ఫుడ్ ఇంటోల్రన్సు) పరీక్ష చేయించుకున్నారు. ఈ పరీక్షలో ఇతనికి పైన ఇవ్వబడిన ఆహారా పదార్థాల అలెర్జీ ఉన్నట్లు రుజువైంది. అలెర్జీ కలిగించే ఆహార పదార్థాలను తీసుకోవడం నిలపడంతో అలెర్జీ సమస్య కొంత వరకు తగ్గింది. వైద్యుడుచే ఇవ్వబడిన ఆంటీ-అలెర్జిక్ అల్లోపతి మందులు, మౌత్ వాష్ మరియు లేపనం, ఇతనికి సహాయపడక పోయేసరికి వాటిని ఉపయోగించడం మానేశారు. 2015 మే 30 న చికిత్సా నిపుణులు రోగికి క్రింది మందులను ఇవ్వడం జరిగింది

దురద మరియు ఎర్ర మచ్చలకు:
#1. CC21.2 Skin infections + CC21.3 Skin allergies + CC21.7 Fungus...TDS

నోటిలో చిన్న గడ్డలకు:
#2. CC4.10 Indigestion + CC9.2 Infections acute + CC11.5 Mouth infections + CC12.4 Autoimmune diseases + CC15.1 Mental & Emotional tonic...6TD

రెండు వారాల తర్వాత నోటిలో గడ్డలు 50% తగ్గినట్లు మరియు దురదతో కూడిన ఎర్ర మచ్చలు పూర్తిగా తొలగినట్లుగా రోగి తెలిపారు. రోగికి పాల ఉత్పత్తులు ద్వారా కలిగే అలెర్జీ పూర్తిగా తగ్గింది. దీని కారణంగా #1 యొక్క మోతాదును OD కి మరియు #2 యొక్క మోతాదు TDS కి తగ్గించబడింది. ఒక నెల తర్వాత, నోటిలో గడ్డల సమస్య 80% తగ్గిపోయింది. ఐదున్నర నెలల తర్వాత ,2015 నవంబర్ 14న, నోటిలో గడ్డలు పూర్తిగా తొలగిపోయినట్లుగా రోగి తెలిపారు. #2 మోతాదు ODకి తగ్గించబడింది. #1 యొక్క మోతాదు OWకి తగ్గించబడి, 2016 జనవరి లో ఆపబడింది. ఆహార అలెర్జీలు పూర్తిగా తొలగినందుకు రోగి ఎంతో ఆనందపడ్డారు. 2016 మే 30 న రోగికి అలెర్జీ సమస్య తిరిగి రాలేదు. ఇతను #2 మందును OD మోతాదులో తీసుకోవడం కొనసాగిస్తున్నారు.

చికిత్సా నిపుణుల వివరాలు 03524...USA

చికిత్సానిపుణురాలు 03524…USA  1980లో మొట్టమొదటి సారి డా.భగవంతం ద్వారా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గురించి విన్నప్పటినుండి  ఉత్సాహభరితమైన సాయి భక్తురాలుగా జీవిస్తోంది.  ప్రతి సంవత్సరం ప్రశాంతి నిలయాన్ని సందర్శించే ఈమె, సాయి గ్రామ సేవా కార్యకలాపాల్లో, సాయి సేవా దళ వాలంటీర్లతో పాటు తన సేవలను అందచేస్తోంది. ఈ సేవలో భాగంగా ఆంద్రప్రదేశం మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఆర్థికంగా వెనుకబడిన జిల్లాల్లో నివసిస్తున్న ప్రజలకు క్యాన్సర్ వ్యాధి స్క్రీనింగ్ (ఒక రకమైన పరీక్ష) మరియు రోగనిర్ధారణ చేయబడే వైద్య శిబిరాల్లో ఈమె పాల్గొనటం జరిగింది. 

సాయి వైబ్రియానిక్స్ గురించి తన స్నేహితురాలు ద్వారా తెలుసుకున్నప్పటి నుండి ఈమెకు ఈ ఉన్నతమైన సేవా కార్యక్రమంలో పాల్గొనాలన్న ఆశక్తి కలిగింది. 2015 మేలో AVP (సహాయక చికిత్సా నిపుణులు) శిక్షణ పూర్తి చేసిన ఈమె విజయవంతమైన ఫలితాలతో తన సేవను అందిస్తోంది. GBS (గ్విల్లాయిన్ బార్ సిండ్రోమ్), రుబిన్స్టెయిన్-తయబై సిండ్రోమ్, స్ట్రోక్ వ్యాధి, సి.ఓ.పి.డి, రుమటాయిడ్ ఆర్థరైటిస్, గుండె జబ్బులు, తీవ్ర నడుము నొప్పి, పెద్దగడ్డలు(ట్యూమర్లు) వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి సహాయపడే అవకాశం ఇచ్చినందుకు స్వామికి తన కృతజ్ఞతలను తెలుపుకుంటోంది. స్వామి యొక్క సాధనంగా జీవించడం, తన సౌభాగ్యంగా భావిస్తున్న ఈమె, రోగుల అవసరాలకు ప్రాధాన్యతను ఇస్తూ రోగులకు అన్ని వేళలా   సహాయపడేందుకు సిద్ధంగా ఉంటున్నారు.

ఈ చికిత్సా విధానంలో ఆధ్యాత్మికం యొక్క ప్రాముఖ్యతను వెల్లడిస్తూ ఈమె వైబ్రో మందులను తయారు చేసే సమయంలో సాయి గాయత్రి మంత్రాన్ని ఉచ్ఛరిస్తారు. అంతే కాకుండా, మందును తీసుకునే ముందుగా గోలీల సీసాను కదలిస్తూ తమ తమ ఇష్ట దైవాన్ని ప్రార్థించమని రోగులకు ఈమె సలహా ఇస్తున్నారు. అంతేకాకుండా ఈమె వైబ్రో మందులను పూర్తి నమ్మకంతో తీసుకోవాలని మరియు మందును తీసుకొనే సమయంలో " నా శరీరం, మనస్సు మరియు ఆత్మ, ఆరోగ్యమైన స్థితికి చేరుకున్నాయి, ధన్యవాదాలు ప్రభు!" అని స్థిరముగా చెప్పుకోమని రోగులను ప్రోత్సాహిస్తోంది. అవసరమైనప్పుడు ఈమె రోగులను సీనియర్ చికిత్సా నిపుణుల వద్దకు బ్రాడ్ కాస్టింగ్ కొరకు పంపించడం ద్వారా వారికి సహాయం అందిస్తోంది.

ఒక రోగికి చికిత్సను అందించే సమయంలో, ఈమె ఒక త్రికోణాన్ని కల్పన చేసుకుని, భగవంతుడుని త్రికోణం ఒక్క తల (ఎపెక్స్) వైపు ఉన్నట్లుగా ఊహించుకొని మరియు త్రికోణం యొక్క అడుగు భాగానికి చెరో వైపు తాను  మరియు రోగి ఉన్నట్లుగా ఊహించుకునేది. కొందరు రోగులు కొద్ది గంటల్లో లేక ఒక రోజులో ఉపశమనం కలిగినట్లుగా తెలియచేశారు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న రోగులకు వైబ్రియానిక్స్ ద్వారా శారీరిక, మానసిక, ఆధ్యాత్మిక మరియు భావోద్వేగ స్థాయిలలో ఆరోగ్య స్థితి లభిస్తోంది. కొందరికి ధ్యానంలో ఏకాగ్రత మెరుగుపడటం మరి కొందరికి సంతృప్తి కలగడం వంటి అనుభవాలు కలిగినట్లు తెలిపారు.

ఈమె తరచుగా ఉపయోగించే మిశ్రమాలు:

#1. CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC20.1 SMJ tonic + CC20.2 SMJ pain + CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue + CC20.5 Spine + 55 ఏళ్ళు మించిన మహిళలకు, CC20.6 Osteoporosis కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం కొరకు 

#2. CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC18.1 Brain disabilities భావోద్వేగ సమస్యలకు

పైన ఇవ్వబడిన రెండు మిశ్రమాలు భగవంతుడు ప్రసాదించిన అద్భుతమైన పరిహారాలని ఈమె నమ్మకం. ఈమెకు వెల్నెస్ కిట్ లో ఉండేటువంటి మూవ్ వెల్ మిశ్రమం ద్వారా కూడా అనేక అద్భుతమైన ఫలితాలు లభించడం జరుగుతోంది. ఒక సందర్భంలో తీవ్రమైన నడుము నొప్పితో బాధపడుతున్న ఒక మహిళ, పెయిన్ కిల్లర్ ను తీసుకొనుటకు నెమ్మదిగా మెట్లు దిగి వచ్చి ఈమె వద్ద మూవ్ వెల్ మిశ్రమము కలపబడిన గోలీలను కూడా తీసుకోవటం జరిగింది. ఈ మహిళ ముందుగా వైబ్రో గోలీలలను తీసుకొని ఆపై పావు గంట తర్వాత పెయిన్ కిల్లర్ ను తీసుకోవాలని నిర్ణయించుకుంది. అయితే పావు గంటకు ముందుగానే నొప్పి నుండి ఉపశమనం కలగటం చూసి ఆమె ఎంతో ఆశ్చర్యపడింది. మరొక సందర్భంలో, నొప్పి కారణంగా కారు వద్దకు నడిచి వెళ్ళడానికి ఇబ్బందిపడుతున్న ఒక మహిళను చూసిన చికిత్సా నిపుణురాలు ఆమెకు మూవ్ వెల్ మందును ఇవ్వటం జరిగింది. ఈ మందును చేతిలో పట్టుకొనియున్న ఆ మహిళ కారులో విశ్రాంతి తీసుకుంటుండగా, ఆమెకు నొప్పి మాయమయింది. ఇది ఖచ్చితంగా దైవం చేసిన అద్భుతమని ఆమె భావించింది.

సాయి వైబ్రియానిక్స్ సేవను ఎంతో శ్రద్ధతో చేస్తున్న ఈమె, తద్వారా ఎంతో ఆత్మానందాన్ని మరియు సంతృప్తిని పొందుతున్నట్లుగా భావిస్తున్నారు. సేవను అందించే సమయంలో సాయి గాయత్రి మంత్రాన్ని వందల సార్లు ఉచ్ఛరించటం ద్వారా ఈమె యొక్క ఆధ్యాత్మిక ఉన్నతి మెరుగుపడేందుకు సహాయకరంగా ఉంటోంది. దివ్య ప్రేమతో ఇతరులకు సేవను అందించి తద్వారా ఆత్మ పరివర్తన కలిగేందుకు ఒక సువర్ణావకాశాన్ని ఇచ్చిన భగవాన్ బాబా వారికి మనస్ఫూర్తిగా తమ కృతజ్ఞతలను తెలుపుకుంటోంది.

పంచుకుంటున్న రోగ చరిత్రలు

చికిత్సా నిపుణుల వివరాలు 03524...USA

చికిత్సా నిపుణుడు 03526…USA  చిన్ననాటి నుండి ప్రత్యామ్నాయ వైద్యాలపై ఆశక్తి ఉన్న ఈ చికిత్సా నిపుణుడు తన పద్దెనిమిదో ఏట హోమియోపతి చికిత్సా విధానములో నైపుణ్యాన్ని పొందారు. అంతేకాకుండా, వీరు ఆక్యుప్రెషర్ మరియు మాగ్నెటో థెరపీ వంటి వైద్యాలను కూడా నేర్చుకొవడం జరిగింది. ప్రశాంతి నిలయంలో విద్యార్థిగా సత్యసాయి హాస్టల్ లో హోమియోపతి వైద్య సేవను అందించే భాగ్యం వీరికి కలిగింది. USA కు వెళ్లి స్థిరపడ్డ తర్వాత, 2015 వరకు వీరు హోమియోపతి చికిత్స ను అందించటం  కేవలం తమ కుటుంబసభ్యులు మరియు మిత్రులకు మాత్రమే పరిమితం చేసుకున్నారు. సాయి వైబ్రియానిక్స్ గురించి వీరు మొట్టమొదటి సారిగా డా. అగ్గర్వాల్ మరియు శ్రీమతి.అగ్గర్వాల్ వారి యొక్క సోల్ జుర్న్స్ భేటీ లో వినటం జరిగింది. వెంటనే దీనికి సంబంధించిన వివరాలను తెలుసుకొని 2015 మే లో AVP శిక్షణను పూర్తిచేయడం జరిగింది. ఒక సంవత్సరం తర్వాత, VP స్థాయికి చేరుకున్న వీరు, SVP శిక్షణ పొందేందుకు ఆశక్తితో ఎదురుచూస్తున్నారు. వైబ్రియానిక్స్ లో పాటించబడే స్పష్టమైన మార్గదర్శకాలు మరియు మందులను తయారు చేయటంలో ఉన్న సౌలభ్యత మరియు విజయవంతమైన ఫలితాలు లభించడం వంటి గుణములను మరియు ప్రయోజనాలను అనుభవం ద్వారా గ్రహించిన వీరు పూర్తిగా హోమియోపతి నుండి వైబ్రియానిక్స్ కు మారిపోవటం జరిగింది.

చికిత్సా నిపుణుడు వైబ్రో చికిత్స తీసుకొనే సంభావ్యత ఉన్న వ్యక్తులతో సంభాషించే సమయంలో, తన అంతరాత్మ అందిస్తున్న మార్గనిర్ధేశాన్ని శ్రద్ధగా విని పాటిస్తారు. అంతర్వాణి ప్రేరణ కలిగించినప్పుడు, వీరు ఇతరులకు ఈ చికిత్సా విధానం గురించి చెప్పి నిర్ణయాన్ని వాళ్ళకే విడిచి పెడతారు. రోగులను తన వద్దకు పంపుతున్నది భగవంతుడే అని పూర్తిగా విశ్వసిస్తున్న వీరు, రోగుల సంక్షేమాన్ని కూడా భగవంతుడికే వదిలిపెట్టి, ఎటువంటి రోగ సమస్యలకైనా ఉదాహరణకు అనేక రకములైన అలెర్జీలు, ఆటిజం, పార్కిన్సన్స్ వ్యాధి (అవయవాల వణుకు రోగం) మరియు ఆటో-ఇమ్మ్యూన్ వ్యాధులకు చికిత్సను నిస్సంకోచంగా అందిస్తున్నారు.

అణచిపెట్టిన కోపం, ఆగ్రహం, దీర్ఘకాలిక ఒత్తిడి మరియు చింత వంటి భావోద్వేగ సమస్యలకు, CC15.1 Mental & Emotional tonic ద్వారా లభిస్తున్న అద్భుతమైన ఫలితాలను చూసి చికిత్సా నిపుణుడు ఎంతో ఆశ్చర్య పడుతున్నారు. అంతేకాకుండా వీరు CC4.4 Constipation ద్వారా కూడా అనేక అద్భుతమైన ఫలితాలను పొందుతున్నారు.                    

గత కొన్ని నెలలుగా వైబ్రో చికిత్సను అందిస్తున్న అనుభవంతో వీరు, రోగులకు శీఘ్ర ఉపశమనం కలిగేందుకు రెండు ప్రధాన లక్షణాలుండాలని గుర్తించారు: వైబ్రియానిక్స్ పై విశ్వాసం మరియు మందులను తీసుకోవడంలో క్రమశిక్షణ పాటిచటం. ఈ రెండు లక్షణాలు లోపించినప్పుడు సఫలితాలు లభించే అవకాశం తగ్గిపోతుంది. వైబ్రియానిక్స్ గురించిన వివరాలను తెలుసుకొనుటకు,  www.vibrionics.org వెబ్సైట్లో ఇవ్వబడిన వీడియోను మరియు రోగ చరిత్రలను చూడమని వీరు రోగులను ప్రోత్సాహిస్తున్నారు. వెబ్సైట్లో ఉన్న వివరాలు మరియు చికిత్సా నిపుణుడు స్వయంగా రోగులతో పాలుపంచుకొనే విజయవంతమైన రోగ చరిత్రల ద్వారా రోగులకు మరింత స్ఫూర్తి కలిగి, మందులను తీసుకోవడంలో క్రమశిక్షణను పాటిస్తున్నారు. సహనం యొక్క ఆవశ్యకతను గుర్తించిన వీరు, వ్యాధి నుండి ఉపశమనం కలిగే వరకు విశ్వాసం మరియు క్రమశిక్షణతో మందులను తీసుకోమని రోగులకు సలహా ఇస్తున్నారు.

స్వామి  ప్రసాదించిన చికిత్సా విధానం ద్వారా సేవను అందించే అవకాశం ఇవ్వబడటం ఒక గొప్ప విశేషంగా వీరు భావిస్తున్నారు. ఈ సేవను తన కర్తవ్యంగా భావిస్తున్న వీరు, వ్యాధులను నయంచేసే కర్త భగవంతుడు మాత్రమేనని పూర్తిగా విశ్వసిస్తున్నారు. భగవంతుడి చేతిలో ఒక శ్రేష్ఠతరమైన సాధనంగా ఉండేందుకు నిరంతరం కృషి చేస్తున్న ఈ చికిత్సా నిపుణుడి యొక్క నిస్వార్థ సేవ రోగులను ఎంతగానో కదిలిస్తోంది.

పంచుకుంటున్న రోగ చరిత్రలు

ప్రశ్న జవాబులు

1. ప్రశ్న: డయాబెటిస్ మరియు హైపోథైరాయిడిజం వంటి దీర్ఘకాలిక సమస్యల విషయంలో, వైబ్రియానిక్స్ మరియు అల్లోపతి చికిత్సలను సమాంతరంగా తీసుకోవడం ద్వారా ఫలితాలు వేగంగా లభిస్తాయా? ఇది విధంగానైనా హానికరమా?

   జవాబు: సాధారణంగా, వైబ్రియానిక్స్ చికిత్సను అల్లోపతితో పాటు ఇచ్చినప్పుడు వ్యాధి నుండి ఉపశమనం వేగంగా కలుగుతుంది. ఇది దీర్ఘకాలిక వ్యాధి సమస్యలకు కూడా వర్తిస్తుంది. అయితే, వైబ్రో మందును తీసుకుంటున్న సమయంలో రోగి యొక్క శరీరంలో ఉన్న పారామీటర్లు సరియైన దిశలో కదలటం ప్రారంభమయినప్పటికీ, రక్తంలో చక్కెర స్థాయి వంటి పారామీటర్లు తగ్గి హైపోగ్లైసీమియా సమస్య లేక బీపీ తగ్గి హైపోటెన్షన్ సమస్య కలిగే అవకాశం ఉంది కాబట్టి, చికిత్సా నిపుణులు జాగ్రత వహించి, OD మోతాదులో మందును ప్రారంభించి, క్రమంగా TDS కు పెంచటం మంచిది. ఇటువంటి సందర్భం రావచ్చని రోగులకు ఎరుకపర్చే అవసరం ఉంది.

_____________________________________

2. ప్రశ్న: చర్మ అలెర్జీ సమస్యతో బాధపడుతున్న ఒక 32 ఏళ్ల మహిళకు వైద్యుడుచే అల్లోపతి మాత్రలు మరియు మూడు రకాల లేపనములు ఇవ్వబడినాయి. చేతులకి మరియు శరీరం పై అలెర్జీ సమస్యకు బలమైన డెర్మోవేట్ స్టెరాయిడ్, మరియు ముఖానికి హైడ్రోకార్టిసోన్ మరియు వోయలా స్టెరాయిడ్లు ఇవ్వబడినాయిజెంటామైసిన్ ఆంటీబయాటిక్ కలపబడిన స్టెరాయిడ్లు యొక్క దుష్ప్రభావాలను తొలగించేందుకు, మూడింటిని కలిపి ఒక నోసోడి ను తయారు చేయవచ్చా లేక ఒకొక్క లేపనానికి ప్రత్యేక నోసోడి తయారు చేసే అవసరం ఉందా?

   జవాబు: ప్రతి తైలం యొక్క సమర్థత, దుష్ప్రభావాలు, పరిమితులు ప్రత్యేకమైనవిగా ఉంటాయి. ఈ కారణంగా వైద్యుడు మూడు వివిధ తైలాలను ఇచ్చారు. అయితే వైబ్రియానిక్స్ పొటెంటైజర్ ద్వారా తయారు చేయబడే నోసోడి విభిన్నంగా పని చేస్తుంది. మనం ఒక మిశ్రమాన్ని ముందుగా తీసుకున్నప్పుడు, మిశ్రమంలో ఉన్న ప్రతి యొక్క వైబ్రేషన్ తన గురిని (టార్గెట్ ను) స్వయంచాలకంగా చేరుకొని, దానిపై పనిచేస్తుంది. ఈ విధంగా నోసోడి లో ఉన్న వైబ్రేషన్లు, స్టెరాయిడ్ల /తైలముల ద్వారా కలిగే  దుష్ప్రభావాలను నివారించేందుకు సహాయబడతాయి. దీని కారణంగా మూడు తైలముల మిశ్రమం యొక్క నోసోడి ఒకటి చేస్తే సరిపోవును. ఈ నోసోడి మూడు వివిధ నోసోడ్లకు సమానమైన రీతిలో పని చేస్తుంది. అంతేకాకుండా చికిత్సా నిపుణులకు ఇది తయారు చేయడం సులభం మాత్రమే కాకుండా రోగులకు మందును తీసుకోవడం కూడా అనుకూలంగా ఉంటుంది.

_____________________________________

3. ప్రశ్నవైబ్రో మిశ్రమాలలో ఉండే వైబ్రేషన్లను ప్రభావితం చేయకుండా ఇంటిలో వై ఫై(Wi-fi) కనెక్షన్ ఉంచటం సాధ్యమా?

    జవాబు: లెడ్, క్లోరోఫాం, గాసోలిన్ పొగలు, పురుగులమందు డీడీటీ మరియు 250 కు పైగా కారకులను, ప్రపంచ ఆరోగ్య సంస్థలో ఒక భాగమైన క్యాన్సర్ వ్యాధి పరిశోధన యొక్క అంతర్జాతీయ ఏజెన్సీ క్లాస్ 2 కార్సినోజెన్లుగా(కాన్సర్‌ కారకులు) వర్గీకరించింది. ఇదే జాబితాలో, విద్యుదయస్కాంత వికిరణం కొత్తగా ప్రవేశించింది. ఈ వికిరణానికి ప్రధాన కారణములు రేడియోలు, టీవీలు, మైక్రోవేవ్ ఓవెన్లు , సెల్ ఫోన్లు మరియు Wi -Fi పరికరాలు.

మొబైల్ ఫోను తో పోలిస్తే వై ఫై కనెక్షన్ కలిగించే వ్యతిరేకార్థక ప్రభావం తక్కువగా ఉంటుందని భావించబడుతోంది. 27 సెప్టెంబర్ 2012 న UK లో "ది గార్డియన్ "లో ప్రచురించబడిన ఒక వ్యాసం నుండి కొన్ని ముఖ్యాంశాలు:

“…..ముందుగా మొబైల్ ఫోన్లను ఉపయోగించటం ఆపాలి. ఉపయోగించే సమయంలో ఫోనును మెదడుకి దగ్గరగా పెట్టుకోవడం జరుగుతుంది. అయితే, వై ఫై పరికరమును మరొక గదిలో పెట్టుకునే అవకాశం ఉంది ( ఇన్వెర్స్ స్క్వాయర్ లా-inverse square law). ఒక సంవత్సరం పాటు వై ఫై పరికరం ద్వారా కలిగే వికారణము కంటే ఒక 20-నిమిషాల మొబైల్ ఫోను ద్వారా కలిగే వికిరణం (రేడియేషన్) మరింత ఎక్కువగా ఉంటుందని అంచనా వేయబడింది.

….. ఇరవై ల్యాప్టాప్లు మరియు రెండు రౌటర్లు, ఒక మొబైల్ ఫోనుకు సరిసమానమని, ఈ వ్యాసంలో చెప్పబడియుంది..

….. అల్యూమినియం రేకు ఒక సాధారణ ఫారడే గూడు వలె పనిచేస్తుంది. మీరు ఈ రేకులో మొబైల్ ఫోనును చుట్టి, మరొక ఫోను నుండి డైయల్ చేసి చూడవచ్చు. మీకు "అందుబాటులో లేదు" అన్న సమాచారం వస్తే, అల్యూమినియమ్ రేకు, వికిరణం నుండి రక్షకము వలె ఉపయోగపడుతుందని తెలుసుకోవచ్చు.

పైన ఇవ్వబడిన సమాచారం ప్రకారం, వై ఫై కనెక్షన్ గురించి చింతించే అవసరం లేదు, అయితే వైబ్రో మిశ్రమాలను వికిరణం (రేడియేషన్) యొక్క మూలము నుండి  కనీసం ఒక మీటర్ దూరంలో పెట్టడం ముఖ్యం.

_____________________________________

4. ప్రశ్న: దయచేసి SRHVP ఉపయోగించి బ్రాడ్కాస్టింగ్ చేసే విధానాన్ని వివరించవలసిందిగా కోరుతున్నాము.

   జవాబు: ముందుగా యంత్రంలో పొటెన్సీ ను 200C కు పెట్టుకోవాలి. కేవలం ఒక కార్డు యొక్క వైబ్రేషన్లను మాత్రమే మీరు ప్రసారం చేయవలసి యుంటే, యంత్రంలో ఉన్న కన్నములో తగిన కార్డును పెట్టవలెను. అనేక వైబ్రేషన్ల మిశ్రమాలను ప్రసారం చేయవలసిన సందర్భంలో, సాంపిల్ వెల్ లో మిశ్రమం ఉన్న సీసాను మరియు రెమెడీ వెల్ లో రోగి యొక్క ఫోటో లేదా వెంట్రుకలు లేదా బ్లెడ్ సాంపిల్ ను పెట్టవలెను. పది నిమిషాల ప్రసారం, ఒక మోతాదుకు సమానం అవుతుంది. TDS మోతాదు కొరకు మీరు ఇదే ప్రక్రియను రోజుకి మూడు సార్లు చేయవలెను. ఫలితాలు మీకు సంతృప్తి కరంగా లేకపోతే, మరింత సఫలితాలను అందిస్తున్న 1M  పొటెన్సీ కు పొటెన్సీ ను పెంచుకోవలెను.

_____________________________________

5. ప్రశ్న: CC17.2 Cleansing కాంబోను ఇతర వైబ్రేషన్ల తో పాటు కలిపి ఇవ్వవచ్చునా లేక కాంబో ను విడిగా మాత్రమే ఇవ్వవలెనా?

   జవాబు: CC17.2 Cleansing కాంబో ను ఖచ్చితంగా ఇతర వైబ్రేషన్లతో పాటు కలిపి ఇవ్వవచ్చు లేక సాధారణంగా ఈ కాంబో  పుల్ అవుట్ ను కలిగించదు కాబట్టి విడిగా కూడా ఇవ్వవచ్చు. అయితే రోగి ఆంటీబయాటిక్ లు మరియు ఇతర మందులను ఎక్కువగా తీసుకొనియున్న సందర్భాలలో మరియు తీవ్ర కాలుష్యం లేక వికిరణానికి (రేడియేషన్) రోగి గురికావటం వంటి సందర్భాలలో కొంత పుల్ అవుట్ వచ్చే అవకాశం ఉంది. ఇటువంటి సందర్భాలలో తక్కువ మోతాదుతో ఈ కాంబోను ప్రారంభించవలెను.

SRHVP ఉపయోగించే చికిత్సా నిపుణులకు, NM72 Cleansing, SM14 Chemical Poison and SM16 Cleansing వంటి ప్రక్షాళన రెమెడీలు (వైబ్రేషన్లు) నుండి ఎన్నుకునే అవకాశం ఉంది. అయితే ఈ వైబ్రేషన్లను విడిగా ఇచ్చిన సమయంలో తీవ్ర పుల్ అవుట్ కలిగే అవకాశం అధికంగా ఉంటుంది కాబట్టి చికిత్సా నిపుణులు ఈ వైబ్రేషన్లను ఇచ్చే సమయంలో జాగ్రత వహించే అవసరం ఉంది.

_____________________________________

6. ప్రశ్న: ప్రయిమరీ స్క్లిరోసింగ్ చోళన్గిటిస్ (గట్టిపడే పిత్తవాహినీశోథ) చికిత్సకు వైబ్రియానిక్స్ ను ఉపయోగించవచ్చునా?

    జవాబు: ఖచ్చితంగా, క్రింది కాంబోను ఉపయోగించవచ్చు:  CC4.2 Liver & Gallbladder tonic + CC4.6 Diarrhoea + CC4.11 Liver & Spleen + CC12.4 Autoimmune diseases + CC21.4 Stings & Bites.

SRHVP వాడుకదారులకు:  NM2 Blood + NM22 Liver + NM102 Skin Itch + NM113 Inflammation + BR12 Liver + SM5 Peace & Love Alignment + SR282 Carcinosin + SR284 Chelidonium 30C + SR340 Aloe Socotrina 30C + SR504 Liver.

దివ్య వైద్యుడి యొక్క దివ్య వాక్కు

"ఒక సేవా కార్యక్రమంలో ప్రవేశించే ముందు ఒక వ్యక్తి తనలో సాధన చేసేందుకు కావలసిన సాధన సామగ్రి - నిస్వార్థ ప్రేమ, వినయం, కరుణ, తెలివి, అవగాహన, సమస్య మరియు దాని సమాధానం యొక్క జ్ఞ్యానం, తన చేతులతో ఇతరుల సమస్యలను నయంచేయాలన్న ఆశక్తి మరియు అవసరమున్న వారికి తన సమయాన్ని, శక్తిని మరియు నైపుణ్యాన్ని ఆనందంగా అందించే ఉత్సుకుత వంటి ఉత్తమ లక్షణాలు ఉన్నాయా లేవాయని పరిశీలన చేసుకోవలెను."
-సత్యసాయి బాబా, "సాధనకు కావలసిన సామగ్రి' దివ్యోపన్యాసం,నవంబర్ 21,1986 

http://www.sssbpt.info/ssspeaks/volume19/sss19-25.pdf

 

 

 

“వైద్యుల చేతుల్లో చిక్కకుండా దీర్ఘ కాలం జీవించేందుకు ధృడంగా ప్రయత్నించండి. వైద్యులు మీకొక ఇంజెక్షన్ ఇచ్చే సమయంలో దాని యొక్క దుష్ప్రభావాలను ఎదుర్కొనేందుకు మరొక ఇంజెక్షన్ ను సిద్ధంగా ఉంచుకుంటారు. ఒక వ్యాధిని నయంచేసే ప్రయత్నంలో ఒక డజను వ్యాధులను కలిగిస్తారు. అంతేకాక, నకిలీ మందులను సిఫార్సు చేసి నిజాయతీలేని సంపదను కూడబెడుతున్నారు. నిరాడంబరమైన జీవితం, సరళమైన వ్యాయామాలు మరియు నాలుకపై తెలివైన నియంత్రణ ద్వారా దాదాపు అన్ని అనారోగ్యాలను నయంచేయవచ్చు. అనేక సంవత్సరాలు నా అవతార వైభవాన్ని తిలకించేందుకు మీరందరు దీర్ఘకాలం జీవించాలి."
-
సత్యసాయి బాబా, "మంచి ఆరోగ్యం మరియు మంచితనం" దివ్యోపన్యాసం, 30 సెప్టెంబర్ 1981

http://www.sssbpt.info/ssspeaks/volume15/sss15-21.pdf

 

ప్రకటనలు

 

జరగనున్న శిక్షణా శిబిరాలు

❖ ఇండియా కాసర్గోడ్ , కేరళ : AVP శిక్షణా శిబిరం  2-3 జులై  2016, సంప్రదించ వలసిన వ్యక్తి: రాజేష్  [email protected] or by telephone at 8943-351 524 / 8129-051 524

❖ ఇండియా బెంగుళూరు, కర్ణాటక: రిఫ్రెషర్ సెమినార్ (పునశ్చరణ గోష్టి) 10 జులై  2016, సంప్రదించ వలసిన వ్యక్తి: శేఖర్  [email protected] or by telephone at 9741-498 008

❖ ఇండియా పుట్టపర్తి: రిఫ్రెషర్ సెమినార్ (పునశ్చరణ గోష్టి) 10 జులై  2016, సంప్రదించ వలసిన వ్యక్తి: శేఖర్  [email protected] or by telephone at 9741-498 008

 USA షెపర్డ్స్ టవున్   WV::AVP శిక్షణా శిబిరాలు 15-17 జులై & 14-16 అక్టోబర్  2016, సంప్రదించ వలసిన వ్యక్తి: సుసాన్  t[email protected]

❖ UK ఆక్స్ఫర్డ్: రిఫ్రెషర్  సెమినార్  31 జులై  2016, సంప్రదించ వలసిన వ్యక్తి: జేరం  [email protected] or by telephone at 020-8551 3979 

 ❖ USA షెపర్డ్స్ టవున్, WV:  SVP శిక్షణా శిబిరం 16-18 సెప్టెంబర్ 2016, సంప్రదించ వలసిన వ్యక్తి: సుసాన్  t[email protected]

​❖  UK ఆక్స్ఫర్డ్ : SVP శిక్షణా శిబిరం  7-9 అక్టోబర్  2016, సంప్రదించ వలసిన వ్యక్తి జేరం: [email protected] or by telephone at 020-8551 3979

అదనపు సమాచారం

వైబ్రియానిక్స్ యొక్క అభివృద్ధికి సహాయపడుతున్న చికిత్సా నిపుణుల సమావేశాలు

ఈ వార్తాలేఖ ప్రారంభంలో సూచించబడిన విధంగా ఇండియా, UK మరియు USA (US లో కాన్ఫెరెన్స్ కాల్స్ ద్వారా) లో అనేక చికిత్సా నిపుణుల సమావేశాలు జరపబడినవి. వైబ్రియానిక్స్ యొక్క అభివృద్ధికి సహాయపడుతున్న ఇటువంటి సమావేశాలను జరపడం కొనసాగుతూనే ఉంటుంది.

ఒక సమీకృత చికిత్సా విధానమైన వైబ్రియానిక్స్ యొక్క విజయానికి, ఈ చికిత్సా విధానం యొక్క వివిధ కోణాల పై రోగులు మరియు చికిత్సా నిపుణులు అవగాహన కలిగియుండటం చాలా అవసరం.  ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సమావేశాలు జరపబడినవి. ఈ సమావేశాలలో వివిధ ఆశక్తికరమైన అంశాల పై చర్చ చేయబడింది. ఈ సమావేశాల నుండి కొన్ని ముఖ్యాంశాలు:

  1. వైబ్రియానిక్స్ చికిత్సా విధానం పై సమాజంలో అవగాహన ను పెంచటం ప్రతి సమావేశంలోనూ ఒక సామాన్యమైన చర్చగా నిలిచింది. విజయవంతమైన ఫలితాలు లభించేందుకు మరియు అధిక సంఖ్యలో రోగులను ఆకర్షించేందుకు, స్వచ్ఛమైన అంకితభావం, దైవంపై మరియు ఈ చికిత్సా విధానం పై సంపూర్ణ విశ్వాసం మరియు కరుణ, ప్రేమలతో నిండియున్న హృదయం వంటి లక్షణాలు ప్రధానమని అనుభవముగల చికిత్సా నిపుణులకు లభించిన సఫలితాలు ద్వారా తెలుసుకొనబడింది. అంతేకాక, ప్రార్థనలు మరియు ప్రేమ ద్వారా ఒక ఆరోగ్యమైన వాతావరణాన్ని సృష్టించడం వైబ్రియానిక్స్ లో నిరంతర విజయాన్ని సాధించేందుకు అత్యవసరం.
  2.  కొత్త రోగులను మన వైబ్రియానిక్స్ వెబ్సైట్ ను మరియు అందులో ఇవ్వబడిన వీడియోను చూడమని ప్రోత్సాహించటం అత్యవసరం. ఆపై రోగులకు ఈ విధానం పై కలిగే సందేహాలను తీర్చే ప్రయత్నం చేయాలి. ఈ విధంగా చేయటం ద్వారా రోగులకు వైబ్రియానిక్స్ పై మంచి అవగాహన కలిగి ఈ చికిత్సా విధానం పై విశ్వాసం కలుగుతుంది. తద్వారా సఫలితాల యొక్క సంఖ్య పెరుగుతుంది.
  3. రోగులకు చికిత్సను అందించే సమయంలో ఏర్పడిన వ్యతిరేక శక్తిని తొలగించేందుకు, చికిత్సా నిపుణులు హో'ఒపోనోపోనో అనుబడే నాలుగు వాక్యాలున్న క్రింది హవ్వాయియన్ ప్రార్థనను చెప్పటం మంచిది: "ఐయామ్ సారి ; లవ్ యూ ; ప్లీస్ ఫర్గివ్ మీ; తాంక్ యు."
  4.  దైవంపై సంపూర్ణ శరణాగతి భావంతో, రోగులకు చికిత్సను అందించవలెను. ప్రతియొక్క వ్యాధి సమస్యకు చికిత్స ఇవ్వబడినదా లేదాయని చింతించే అవసరం లేదు. రోగులకు మందులను ఇచ్చే సమయంలో ప్రేమ భావంతో,"నా యొక్క పని పూర్తయింది, ఇకపై మీ దయ" యని నిశ్శబ్దంగా ప్రార్థించటం చాలా ముఖ్యం.
  5. మంచి ఆరోగ్యాన్ని నిలబెట్టడానికి కాలేయం, మూత్రపిండాలు, ఎడ్రినల్ గ్రంథులు మరియు ప్రేగు వంటి అవయవాలు పోషించే ముఖ్య పాత్రను గురించి చర్చ జరపబడింది. చికిత్సా నిపుణులు దీర్ఘ కాలిక వ్యాధులకు చికిత్సను అందించే సమయంలో ఈ అవయవాలలో సమతుల్యం ఏర్పరచేందుకు సహాయపడే మిశ్రమాలను చేర్చి ఇవ్వటం మంచింది. ఉదాహరణకు కాలేయంలో విషపదార్థాలు అధికంగా ఉండటం కారణంగా బ్రెస్ట్ క్యాన్సర్, మెదడు మరియు బ్లెడ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రేగులలో జీర్ణంకాని ఆహారం కారణంగా వాపు, తద్వారా ఆటిజం, అల్జీమర్, డయాబెటిస్ టైప్ 1, ఊబకాయం వంటి వ్యాధులు ఏర్పడే అవకాశం ఉంది. అడ్రినల్ గ్రంధి యొక్క వైఫల్యం కారణంగా డయాబెటిస్, అధిక రక్తపోటు సమస్య మరియు డిప్రెషన్ వంటి సమస్యలు ఏర్పడవచ్చు.
  6.  మానవ జన్యులు శాశ్వతంగా నియోజితబడినవి కావు, అనగా వాటికి వాతావరణాన్ని అనుసరించి పరిణామం చెందే అవకాశం ఉంది; ప్రధానంగా ఈ జన్యులు మనము పంచేంద్రియాలతో తీసుకునే ఆహారం ద్వారా ప్రభావితం అవుతాయి. అందుచేత సరైన ఎంపికలను చేసుకోవడం ముఖ్యం.
  7. బలమైన ఆహారం, ధ్యానం, వ్యాయాయం, నిద్ర, జాగరూకత మరియు ఏ పనైనా ఆనందం మరియు ఉత్సాహంతో చేయడం వంటి మంచి విషయాల ప్రాముఖ్యతను రోగులకు వివరించటం అత్యవసరం. అయితే చికిత్సా నిపుణుల మరియు రోగుల మధ్య ఒక మంచి అనుబంధం ఏర్పడేంత వరకు రోగుల యొక్క జీవనశైలి పై, చికిత్సా నిపుణులు ఏ సూచనలు ఇవ్వకుండా ఉండటం ముఖ్యం.
  8.  రోగులకు మిక్కిలి ఉపయోగకరమైన మరియు ఫలవంతమైన అనేక ప్రత్యేక మిశ్రమాలు చికిత్సా నిపుణులచే తయారు చేయబడుతున్నాయి. అటువంటి కొన్ని మిశ్రమాలు:

       కార్టిసోల్ మిశ్రమం: NM36 War + NM45 Atomic radiation + NM113  Inflammation + SM2 Divine       Protection + SM5 Peace & Love Align + SM6 Stress + SR324 X-ray + SR348 Cortisone

  •  బలానికి సంబంధించిన మిశ్రమం: NM2 Blood + NM12 Combination 12 + NM45 Atomic radiation + NM48 Vitamin Eye Comp + NM63 Back-up + NM67 Calcium + NM86 Immunity + OM1 Blood + OM28 Immune System + BR1 Anaemia + SM2 Divine Protection + SM5 Peace and Love Align + SM6 Stress + SM26 Immunity + SM41 Uplift + SR216 Vitamin E + SR223 Solar plexus + SR225 Throat + SR256 Ferrum Phos + SR281 Carbo Veg + SR306 Phosphorus + SR324 X-ray + SR360 VIBGYOR + SR361 Acetic Acid + SR494 Haemoglobin + SR509 Marrow + SR529 Spleen + SR561 Vitamin Balance
  •  ప్రయాణ సమయంలో ఉపయోగించవలసిన మిశ్రమం: CC4.4 Constipation + CC4.6 Diarrhoea + CC4.8 Gastroenteritis + CC4.10 Indigestion + CC9.2 Infections acute + CC9.3 Tropical diseases + CC10.1 Emergencies

     9.  అలెర్జీలు విషయంలో, రోగులకు రోగ నిరోధక శక్తి బలహీనపడిన కారణంగా, CC12.1 Adult tonic మరియు CC12.4 Autoimmune diseases మిశ్రమాలను ఉదాహరణకు, CC4.10 Indigestion ఆహార అల్లర్జీలకు, CC19.2 Respiratory allergies (శ్వాస సంబంధించిన అల్లర్జీలకు) మరియు CC21.3 Skin allergies (చర్మ అల్లర్జీలకు) ఉపయోగించడం ద్వారా విజయవంతమైన ఫలితాలు లభిస్తున్నాయి.

    10. ఆంటీ-అలెర్జీ మందులు, స్థానిక పుప్పొడి లేదా రోగి యొక్క కఫం వంటి పదార్థాలు నుండి తయారు చేయబడిన నోసోడులు వ్యాధి లక్షణాల నుండి ఉపశమనం కలిగించేందుకు మిక్కిలి ఉపయోగకరంగా ఉన్నాయని US చికిత్సా నిపుణులు కనుగొన్నారు. పూర్తి నివారణ కొరకు  వైబ్రియానిక్స్ మందులను సుదీర్ఘ కాలం వరకు తీసుకోవడం మంచిది.

     11. సమావేశంలో పాల్గొన్న వారందరికీ స్ఫూర్తి కలిగించే విధంగా, చికిత్స అందిస్తున్న సమయంలో నిరంతరం కొందరు చికిత్సా నిపుణులు తమకు కలుగుతున్న దివ్యానుభూతులను పాలుపంచుకోవడం జరిగింది.

     12. అనేక రోగులు తిరిగి రిపోర్ట్ చేయకపోవటం, చికిత్సా నిపుణులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. తదుపరి అపాయింట్మెంట్ యొక్క సమయం మరియు తేదిని సూచించే ఒక కార్డును ప్రతి యొక్క రోగికి ఇవ్వటం మాత్రమే కాకుండా, అపాయింట్మెంట్ రోజున రాలేని పక్షంలో   ముందుగానే తెలియజేయమని రోగులకు నొక్కిచెప్పడం చాలా ముఖ్యం.

 

                                                                                   ఓం సాయి రాం!