Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

Vol 7 సంచిక 2
March/April 2016
ముద్రింప తగిన వార్తాలేఖ


పూర్తి వార్తాలేఖ యొక్క కాగితం ప్రతి కావలెనన్నఈ పుటను ముద్రించండి

డా.జిత్. కే అగ్గర్వాల్ యొక్క మాటల్లో

ప్రియమైన వైబ్రియో అభ్యాసకులారా 

వైబ్రియోనిక్స్ ద్వారా మానవాళికి సేవ చేయాలనే ఉన్నత ఆశయం గలవారికి శిక్షణ ఇచ్చి సాయిరాం హీలింగ్ వైబ్రేషణ్ పోటెంటైజర్  ద్వారా దివ్య తరంగాలను అందరికీ (మొక్కలకి,జంతువులకి,మనుషులకు ) ప్రసరింప జేయాలనే దివ్య సంకల్పము తో 22 సంవత్సరాల క్రితం ఈ బీజం అంకురించింది . ఆనాటి  సంకల్పమే ఈనాడు  వేలకొద్ది ప్రాక్టీషనర్లలో అద్భుతమైన పరివర్తన తెస్తూ వారి హృదయ మందిరాలను ప్రేమ మందిరాలుగా మారుస్తోంది.  అ ప్రేమే లక్షలకొద్దీ జీవితాలను నిస్వార్ధ ప్రేమ ద్వారా స్పృశిస్తూఉంది. మనవోద్ధారణ కోసం కంకణం కట్టుకొన్న కొన్ని జీవితాలు నిష్కామ కర్మ ద్వారా (ఏ విధ మైన ఫలితాన్ని ఆశించకుండా)ప్రపంచ గతిని మార్చగలవు అని చెప్పడానికి నిలువెత్తు సాక్ష్యమిది.   సంకల్ప దశ నుండి ప్రపంచవ్యాప్త ఉద్యమం గా రూపుదిద్దుకున్నక్రమమును మనం వైబ్రియోనిక్స్ విషయంలో చూస్తున్నాము.

మన సంస్థ విషయంలో గతం నుండి కూడా పరిపాలనా పరంగా అనేక కార్యకలాపాలలో మెరుగైన విధానాలను అమలుపరుస్తూ వస్తున్నాము. సంస్థ విస్తరించే కొలదీ దీని అంతరనిర్మాణం పెంచుకోవలసిన ఆవశ్యకతనుకూడా  గుర్తించాము. అంతేకాక సంస్థ పాలనా సౌలభ్యం కోసం కొన్ని ప్రత్యేక సంస్కరణలు ప్రవేశ పెట్టవలసిన అవసరం కూడా ఉంది.ఎందుకంటే అత్యంత బలంగా నిర్మించికున్న ఈ పునాది పైన సంస్థ పురోగతి అనూహ్యంగా పెరిగిపోతున్న వైనం మనం భవిష్యత్తులో చూడబోతున్నాము. ఈ దిశలో పాలనా బాధ్యతలను తమ భుజస్కందాలపైన వేసుకొని సంస్థను ముందుకు తీసుకుపోగలిగిన దక్షత గలిగిన ప్రాక్టీషనర్ ల సేవలు ఎంతో అవసరం .విస్తృతంగా వ్యాపించి ఉన్న పరిపాలనా అంశాలను అనేక విభాగాలుగా వికేంద్రికరణ చేయడం ద్వారా సేవచేయడానికి ఎక్కువమందికి అవకాశం కల్పించబడింది. అటువంటి కొన్నివిభాగాలు –క్రొత్తగా ప్రవేశించే వారికి దరఖాస్తులు అందించడం,వివిధ దేశాలలో కోఆర్డినేటర్లు ,సమన్వయకర్తలు,టీచర్ల సంఖ్యను అభివృద్ధి పరచడం,వెబ్సైట్ నిర్వహణాభాద్యత తీసుకోవడం, ఇంకా వార్తాలేఖలను తయారు చేయడంలోనూ ,ఇతర భాషలలోనికి తర్జుమా చేయడంలోనూ,వివిధరకాల విభాగాలలో ప్రాక్టీషనర్ లకు శిక్షణ ఇవ్వడంలోనూ,వై బ్రియోనిక్స్ కు చెందిన పుస్తకాలూ,ఇతర స్టడీమెటీరియల్ ను పునః సమీక్షించడం లోనూ,వార్తా సంచికలను ప్రచురించడం లోనూ,పరిశోధనా ప్రాజెక్టులను చేపట్టడం లోనూ,ప్రాక్టీషనర్ లు మరియు అశేష జనావళి నిమిత్తము దృశ్య శ్రవణ కార్యక్రమములు,తయారుచేయడంలోను,సమాచార క్రోడీకరణ నిమిత్తము , ఇలా అనేక రంగాలలో విస్తృతంగా వ్యాపించి ఉన్న పనిని మన వైబ్రియోనిక్స్ టీం లో ఉన్న స్వచ్చంద సేవకులు భాగస్వామ్యం వహించి సరళీకృతం చేయడానికి ముందుకు రావలసిందిగా సూచన.  

నేను మీ అందరినీ కోరేదేమిటంటే స్వచ్చందంగా ముందుకు వచ్చి ఈ పరిపాలనా విభాగంలో వివిధ పాత్రల నిర్వహణకు మీకు బాగా తెలిసిన రంగంలో గానీ లేదా మీకు బాగా అభిరుచి గల రంగంలో గానీ పేర్లు నమోదు చేసుకోవలసిందిగా సూచన. ఈవిధముగా మీరు చేసే సేవ మీ మాసవారి నివేదికలో నెలవారీ సేవా గంటలుగానే నమోదు  చేసే అవకాశం కూడా ఉంది.

మన సంస్థను వృత్తిపరంగా బలోపేతం చేసే కార్యక్రమములో భాగంగా ప్రస్తుతం ఉన్న రెండు హోదాలలో వెంటనే అమలులోనికి వచ్చే విధంగా చిన్న మార్పులు తీసుకువస్తున్నాము. ఇకనుండి అసిస్టెంట్ వైబ్రియోనిక్స్ ప్రాక్టీషనర్ అనేది అసోసియేట్ వైబ్రియోనిక్స్ ప్రాక్టీషనర్ (AVP) గానూ జూనియర్ వైబ్రియోనిక్స్ ప్రాక్టీషనర్ (JVP) అనేది వైబ్రియోనిక్స్ ప్రాక్టీషనర్(VP)గానూ పిలవబడతాయి.  ఈ మార్పు ప్రాక్టీషనర్లకు ఇచ్చే శిక్షణ,అమరియు వీరి అనుభవం రూపంలో మరింత స్పష్టంగా వ్యక్తమవుతుంది.

ఈ కాలం వైబ్రియోనిక్స్ కు ఉద్విగ్న భరితమైన కాలం. ఉత్సాహవంతులయిన, అంకితభావం గల  ప్రాక్టీషనర్ లద్వారా  వారి చేయూత  ద్వారా మనం  అదనపు వనరులను సమకూర్చుకొని వైబ్రియోనిక్స్ ద్వారా ఉచితంగా అందరికీ ఆరోగ్యం అనే బృహత్కార్యక్రమానికి, నూతన పరిణామ దశ వైపు అడుగిడదాం .

ప్రేమతో సాయి సేవలో

జిత్ కె.అగ్గర్వాల్ 

ఉలిపిరి కాయలు 01620...France

21 -సంవత్సరాల యువతి కుడి అరికాలి పైన ఏర్పడిన అనేక ఉలిపిరికాయలతో ఇబ్బంది పడుతూ ప్రాక్టీషనర్ ను సంప్రదించారు.  వీరి యొక్క అలోపతిక్ డాక్టర్ సర్జెరీ చేసి వీటిని తీసివేయడం కష్టమని అవి మరలా మరలా వస్తూ ఒక  వల వలె వ్యాపిస్తూనే ఉంటాయని చెప్పారు. ఈ సమస్యతో ఏర్పడిన ఆందోళన తో పాటు సాధారణముగా ఆమె చిత్తము వ్యాకులత తో కూడి ఉంటుంది. క్రింది రెమిడి ఆమెకు ఇవ్వబడింది :

#1. NM6 Calming + NM16 Drawing + SR318 Thuja 30C + SR339 Sycotic Co…TDS

#2. SR249 Medorrhinum 200C…ప్రతీ రెండు వారాలకు ఒక డోస్ ( మొత్తంగా చేరి 4 మోతాదులు )

నాలుగు రోజుల తరువాత ఆమె వ్యాధి నుండి 70% కోలుకోవడం చూసి డాక్టర్ చాలా ఆశ్చర్య పడ్డారు. మరొక వారం  అలాగే కొనసాగించిన  ఆమెకు  100% మెరుగుదల కనిపించింది.అందుచేత ఈమె  #1 ను మరో రెండు వారాల పాటు  OD గానూ ఆ తరువాత కొద్ది కాలము OW గానూ తీసుకున్నారు.  #2  ను పూర్తి డోస్ తీసుకున్నారు మరలా ఆమెకు ఏ సమస్యా తిరిగి తలెత్తలేదు. 

అస్వాధీన మూత్రవిసర్జన 01620...France

65 సంవత్సరాల వయసు గల మహిళ తనకు అత్యంత సన్నిహితులైన బంధువు మరణం తో మానసిక వ్యధకు లోనై వైద్యం నిమిత్తం హాస్పిటల్లో చేరారు. అక్కడ ఈమె బాగా బలహినమవడమే కాక ఈమెకు మూత్రము నియంత్రణలో లేకుండా  రావడం ప్రారంభమయ్యింది.రెండు సంవత్సరాల తర్వాత 2014 సెప్టెంబర్లో సాయివైబ్రియోనిక్స్ వార్తాలేఖ చదివి తనకు తెలిసిన ఒక చికిత్సా నిపుణుడిని చికిత్స కోసం ఆశ్రయించారు. క్రింది రెమిడి ఆమెకు ఇవ్వడం జరిగింది :

CC12.1 Adult tonic + CC13.3 Incontinence + CC15.1 Mental & Emotional tonic…TDS

మర్నాటి ఉదయం మొదటి డోస్ తీసుకున్న తర్వాత ఆమెకు మూత్ర సమస్య మాయమయ్యింది.ఐతే మరో మూడువారాలు డోస్ వాడి మెల్లిగా తగ్గించ వలసిందిగా సూచించడమైనది. తనకు ఇంత త్వరగా నయమయ్యినందుకు ఎంతో సంభ్రమాశ్చర్యాలలో ఈమె వైబ్రియోనిక్స్ లో శిక్షణ పొంది ప్రాక్టీషనర్ గా మారారు .2015లో వీరికి కాలు విరిగినప్పుడు మరలా పూర్వపు వ్యాధి తిరిగి వచ్చినప్పటికీ వీరు తనంతతానే నయం చేసుకున్నారు. 

నిద్ర లేమి వ్యాధి 01620...France

ఆఫ్రికా దేశం నుండి వచ్చి ప్రస్తుతం యూరప్ లో పని చేస్తున్న 30-సంవత్సరాల యువ ఇంజినీరు నిద్రలేమితో బాధ పడుతూ నిత్యమూ అలసటకు గురి ఔతున్నారు. వారు చెప్పిన దాని ప్రకారము గత 10 సంవత్సరాలగా  రోజుకు రెండు గంటలు నిద్ర పట్టడం కూడా కష్టమే. మందులకు బానిస అవకూడదనే ఉద్దేశంతో వాటిని తీసుకునేవారు కాదు. 2015 నవంబర్ 15 న వీరికి క్రింది  రెమిడి ఇవ్వబడింది :

CC10.1 Emergencies + CC15.1 Mental & Emotional tonic + CC15.6 Sleep disorders…నిద్ర పోవడానికి అరగంట ముందు ఒకడోసు,నిద్రపోయే ముందు ఒక డోసు,అవసరాన్ని బట్టి నిద్రపట్టే వరకు ప్రతీ అరగంటకు ఒక డోసు.

రెండు రోజుల పాటు కేవలం రెండు డోసులు తీసుకున్నంత మాత్రాననే చక్కగా నిద్రపట్టేదట. ఇతని సహోద్యోగులు వీరిలో చాలా మార్పు వచ్చిందని ఇప్పుడు అలసట లేకుండా చాల ఉత్సాహంగా ఉంటున్నట్లు గమనించారట. ఎన్నో సంవత్సరాల తర్వాత ఇలా నిద్రపట్టడం అద్భుతం అని వీరు భావిస్తున్నారు. ప్రస్తుతం వీరు ప్రతీ రొజూ రెమిడి తీసుకుంటూ నిద్రలేమి సమస్యకు దూరమయ్యారట . 2016 జనవరిలో రెమిడి తిరిగి భర్తీ చేయబడింది. 
 

అధిక సంకోచంతో హృదయ స్పందన మందగించడం 01480...France

2014 జనవరి నెలలో ఆశ్రమానికి దర్శనార్ధమై వచ్చిన,40-సంవత్సరాల వ్యక్తి తనకు గుండె 20% మాత్రమే పనిచేస్తున్నట్లు ప్రాక్టీషనర్ తో చెప్పారు. తిరిగి తన దేశం వెళ్ళిపోయి గుండె మార్పిడి లేదా వాల్వ్ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకోవాలనే ఆలోచనతో ఉన్నారు. వీరికి క్రింది రెమిడి ఇవ్వబడింది :

#1. CC3.4 Heart Emergency + CC3.6 Pulse irregular + CC10.1 Emergency + CC15.1 Mental & Emotional tonic…6TD నాలుగురోజుల వరకు, అనంతరం TDS

మూడు వారాల అనంతరం ప్రాక్టీ షనర్ ను కలిసినప్పుడు తనకి ఇప్పుడు ఎంత ప్రశాంతంగా నిర్మలంగా ఉందంటే తను భయము లేకుండా సముద్ర స్నానానికి కూడా వెళ్ళివచ్చానన్నారు. ఈ పేషంటు కు అదేమందు తోపాటు జ్ఞాపక శక్తి లోపం వల్ల ఉత్పన్నమైన వత్తిడి ఆందోళన తగ్గడానికి కూడా మందులు ఇమ్మని అతని భార్య అభ్యర్ధించారు. అందువల్ల ప్రాక్టీ షనర్ #1  ను క్రింది విధముగా మార్చడం జరిగింది.  

#2. CC3.4 Heart emergency + CC3.6 Pulse irregular + CC10.1 Emergency + CC15.2 Psychiatric disorders + CC17.3 Brain & Memory tonic…TDS

 త్వరలోనే పేషంటు తిరిగి తమ దేశం వెళ్ళిపోయి నిర్ధారిత శస్త్రచికిత్స కోసం ఆసుపత్రికి వెళ్ళగా పరీక్షలన్నీ చేసిన అనంతరం పేషంటు ఆనంద పడే విధంగా మరియు డాక్టర్లు ఆశ్చర్య పడే విధంగా అతని గుండె పనితీరు 18% మెరుగుపడిందని అనగా దీని పనితీరు 30% ఉందని ప్రస్తుతం ఆపరేషన్ అవసరం లేదని చెప్పారు.

సంవత్సరం తర్వాత పేషంటు ను ఆశ్రమంలో కలిసినప్పుడు ఆపరేషన్ అవసరం లేకుండానే తనకు మెరుగయినట్లు ఎంతో హాయిగా ఉన్నట్లు తెలియ జేశారు. 

మూత్ర విసర్జన ఆధీనములో లేకుండుట (ఎన్యురెసిస్) మరియు వత్తిడి 01480...France

గత 10 సంవత్సరాలుగా రాత్రిపూట పక్క తడుపుతున్న 12 సంవత్సరాల అబ్బాయిని అతని తల్లి ప్రాక్టీషనర్ వద్దకు తీసుకొని వచ్చారు. యితడు వత్తిడికి,ఆందోళనకు గురియవుతూ  అప్పుడప్పుడూ కోపాన్ని కూడా ప్రదర్శిస్తున్నాడట. ప్రాక్టీషనర్ అతనికి క్రింది రెమిడి ఇవ్వడం  జరిగింది : 

CC12.2 Child tonic + CC13.3 Incontinence + CC15.1 Mental & Emotional tonic…TDS

ఒక నెల తర్వాత బాబులో చెప్పుకోదగిన  విధంగా ముఖ్యంగా భావోద్వేగాల పరంగా 30% మెరుగుదలను  ప్రాక్టీ షనర్ గుర్తించారు. కనుక అదే రెమిడి  ని కొనసాగించావలసిందిగా సూచించారు.

రెండు నెలల తర్వాత బాబుకు పక్కతడపడం 70% తగ్గడమే కాక మానసికంగా కూడా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాడు. కనుక ప్రాక్టీషనర్ అదే రెమిడి కొనసాగించ వలసిందిగా సూచించారు.

సంవత్సరము తరువాత బాబుకు ఒక్కసారికూడా పక్కతడిపిన దాఖలాలు లేవు.భావోద్వేగాలు విషయంలో కూడా ఈ సంవత్సరకాలంలో అతను ఒత్తిడికి గురియయిన ఒక్కసారి తప్ప మిగతా కాలమంతా ప్రశాంతముగా ఉండగలిగాడు .

ప్రాక్టీషనర్ వ్యాఖ్య :

ఆందోళన ,వత్తిడి,ధైర్యాన్ని కోల్పోవడం,వంటి సమస్యలకు CC15.1 Mental & Emotional tonic మరియు/లేదా  CC15.2 Psychiatric disorders ఇవి అద్భుతంగా పనిచేస్తున్నట్లు గ్రహించారు.

 

మేకలో ఎర్రబడిన పాలపొదుగు 01480...France

ఒక తల్లి మేక తన పొదుగు నుండి పదే పదే పాలు తాగుతున్న తన పిల్లలను దూరంగా నెట్టడం ప్రాక్టీషనర్ గమనించారు. నిజం చెప్పాలంటే ఈ పిల్లలు అ పొదుగు పట్టుకొని వ్రేలడుతున్నాయి. దీనివల్ల తల్లిమేకకు పొదుగంతా ఎర్రబడి చెప్పలేనంత బాధకు   గురిఔతోంది.

తల్లిమేకను ఈ బాధ నుండి విముక్తి కలిగించాలని ప్రాక్టీ షనర్ క్రింది రెమిడి దానికి ఇవ్వడం జరిగింది :

CC1.1 Animal tonic + CC8.1 Female tonic + CC8.3 Breast disorders…TDS నీటిలో

ఒక వారం తర్వాత తల్లి మేక యొక్క పొదుగు మాములుగా మారిపోవడంతో దానికి నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. 

శిశువులో నిద్ర సమస్య 03507...UK

2016,జనవరి 14 న చిన్నప్పటినుండి నిద్ర సమస్యతో బాధ పడుతున్న 20 నెలల శిశువును అతని తల్లి ప్రాక్టీ షనర్ వద్దకు తీసుకొని వచ్చారు.యితడు రాత్రిళ్ళు నిద్ర పట్టక ప్రతీ అర్ధ గంటకు లేస్తూ రాత్రంతా మెలుకువ గా ఉంటాడు. అతడు పెద్దవాడవుతున్న కొద్దీ సమస్య కూడా పెరుగుతూ వచ్చింది. దీనివల్ల అతని తల్లి కూడా ఇబ్బంది పడుతూ నిద్ర లేక పోవడంతో నీరసంతో పాటు మానసిక వత్తిడికి కూడా గురియవుతున్నారు. ఈ శిశువుకు ప్రాక్టీ షనర్ క్రింది రెమిడి ఇచ్చారు:

CC12.2 Child tonic + CC15.6 Sleep disorders...నిద్ర పోవడానికి అరగంట ముందు,నిద్రకు ఉపక్రమించే ముందు మరియు  బాబు  మధ్యలో నిద్ర లేచిన మొదటిసారి కూడా ఒక డోస్ ఇవ్వవలసింది గా తల్లి సూచించబడింది . 

రెండు రోజుల తర్వాత శిశువు లో నిద్ర 80% పెరిగింది. ఈ రెండు రోజులలో అతడు రోజుకు రెండు సార్లు మాత్రమే లేచేవాడు.     2016 జనవరి 27 న అ తల్లి ప్రాక్టీ షనర్ తో బాబు రాత్రిళ్ళు ఒక్కసారి మాత్రమే నిద్ర లేచి నట్లు తిరిగి వెంటనే నిద్ర పోతున్నట్లు తెలిపారు. ఇది 20 నెలల వయసున్న శిశువుకు ఇది సాధారణం కనుక ఆవిడ ఈ పరిణామానికి చాలా ఆనందించారు. ప్రస్తుతం ఆమెకు తన కొడుకు వల్ల నిద్రాభంగం లేక హాయిగా నిద్ర పోగలుగు తున్నారు. మరొక నెల రోజులు డోసేజ్ ని అలానే ఇవ్వమని   ఆ తర్వాత రోజు విడిచి రోజు ఆ పైన మెల్లిగా తగ్గించు కుంటూ రావలసిందిగా ప్రాక్టీషనర్  సూచించారు.

 

తీవ్రమైన జలుబు,దగ్గు మరియు బొబ్బలు 02859...India

తన 22 సంవత్సరాల కుమారునితో జరిగిన స్కైప్ సంభాషణలో అతడు తరుచుగా తుమ్ముతూ ,దగ్గుతూ ఉన్నట్లు తల్లి గుర్తించారు.వారం నుండి ఆవిధంగా బాధపడుతున్నట్లు అంతేకాక అతని వీపు క్రింది భాగంలో బొబ్బలు వచ్చి గత మూడు రోజులుగా  బాగా నొప్పి పుడుతున్నాయని కూడా చెప్పాడు.బాబు తల్లి ప్రాక్టీషనర్ ను సంప్రదించగా క్రింది రెమిడి  బ్రాడ్కాస్ట్ చేసి ఇచ్చారు :

CC10.1 Emergencies + CC19.2 Respiratory allergies + CC19.6 Cough chronic + CC21.1 Skin tonic + CC21.2 Skin infections + CC21.11 Wounds & Abrasions...TDS అరగంట కొకసారి .

మరునాటికల్లా పేషంటుకు 90% తగ్గిపోయింది. కఫం గానీ,తుమ్ములు గానీ లేవు. ఇబ్బందిగా కనిపించిన బొబ్బలు పూర్తిగా మాయమయ్యాయి. ఐ రెమిడి మరొక రోజు  TDS గా తీసుకొని తర్వాత  OD కి తగ్గించడం జరిగింది.. 

పేషంటు వ్యాఖ్య :
ఒక అద్భుత శక్తి నా అనుభవ పథం లోనికి వచ్చి నా భౌతిక శరీరంలో గాయపడిన భాగాలనే కాక న మానసిక స్థితిలో కూడా మార్పు తీసుకొని వచ్చింది. ఇంత త్వరగా నిశ్శబ్దం గా ఆశ్చర్య కరంగా నా లోపల మరియు బయట ఉన్న గాయాలు మానిపోవడం ఇంకా ఆశ్చర్యకరంగానే ఉన్నది.  ఒక వారం పాటు గొంతు నొప్పి దుర్భర మైన దగ్గు,కారుతూ ఉన్న ముక్కు తో బాధ అనుభవించాక మా అమ్మ ఇవన్నింటిని ఒక్క పూట లో90% తగ్గించేసారు .మూడు రోజులుగాప్రతీ క్షణము ను అసౌకర్యానికి గురి చేసిన  ‘‘ఎదో తెలియని  వీపు పైన గాయం’’ అదే సమయంలో మాయమైపోయింది. ఈ మందులు తయారు చేసిన వారికి అలాగే దీనికి కారణ భూతురాలయిన మా అమ్మకి రుణపడి ఉంటాను.

పెంపుడు పక్షి కాలికి గాయం 03516...Canada

2014 డిసెంబర్ మధ్యలో ఈ ప్రాక్టీషనర్ యొక్క 11 సంవత్సరాల ఆడ బడ్గి పక్షికి ఎడమ కాలికి గాయమయ్యి పంజరం లో నిలబడ లేక కదలలేక,పైకి ఎక్కలేని పరిస్థితిలో ఉంది. దీని కాళ్ళుమూసుకు పోయి చాపడానికి  వీలుకాకుండా ఉన్నాయి.  సహజంగా ఈ పక్షుల కు గల సాధారణ జీవిత కాలం  8 సంవత్సరాలను కూడా అది అధిగమించింది.  దీని పరిస్థితి చూసి ఇది మరో మూడు వారాల కన్నా ఎక్కువ కాలం  బ్రతకదని  భావించారు. ఒక సంవత్సరం క్రితం ఇలానే మరో పక్షికి  గాయం ఐతే వెటర్నరీ డాక్టర్ ఏమీ చేయలేక పోయారు, ఒక వారం తర్వాత అది మరణించింది.   

2015 జనవరిలో వీరు వైబ్రియోనిక్ ప్రాక్టీషనర్ గా శిక్షణ పొందాక వీరి మొదటి పేషంటు ఈ పెంపుడు పక్షే. జనవరి 11 న క్రింది రెమిడి డానికి ఇవ్వడం జరిగింది :

CC1.1 Animal tonic  ప్రతీ రోజూ అది త్రాగే నీటితో కలిపి ఇవ్వబడింది. 

రెండు వారాల తర్వాత ఈ పక్షి మెల్లగా ధ్వనులు చేయడం,చిన్నగా కదలడం ప్రారంభించింది. నాలుగు వారాల తర్వాత దాని  గాయమైన కాలును కష్టంగా కదల్చడం ప్రారంభించింది . మరొక నెలలో కాలును ఉపయోగించడం 95% మెరుగయ్యింది. 2015 మే నాటికి ఈ పక్షి తన రెండు కాళ్ళను ఉపయోగించి నడవడం పైకి ఎక్కడం చేయగలగడమే కాక చాలా చురుకుగా ఉండసాగింది. రెమిడి 2015 నవంబర్ వరకూ కొనసాగించబడింది. 2016 ఫిబ్రవరి నాటికీ ఇది ఏ సమస్యా లేక అరుస్తూ నడుస్తూ,ఆహారం తింటూ ఆనందంగా ఉంది.

మోకాళ్ళ నొప్పి మరియు బిగుసుకు పోయిన భుజాలు 03502...USA

63-సంవత్సరాల మహిళ గత రెండు సంవత్సరాలుగా భుజాల నొప్పి తో బాధ పడుతూ ఉంది. కనీసం ఆమె వంట గదిలో దినచర్యలకు సంబంధించిన చిన్న చిన్న బరువులు ఎత్తడానికి కూడా చాలా దుర్భరంగా ఉంది. వీరి యొక్క అలోపతి డాక్టర్  దీనిని ఆర్థర్రైటిస్ గా గుర్తించి కొన్ని జాగ్రత్తలు చెప్పారు. వీరికి నోటికి వేసుకోవడానికి మందులే కాక భుజానికి కూడా అప్పుడప్పుడూ ఇంజక్షన్ ఇచ్చేవారు. భుజాలకు రాయడానికి ఒక ఆయింట్ మెంట్ కూడా ఇచ్చారు.   ఏమైనప్పటికీ ఈ వైద్యం ఖరీదయినదే కాక దీని నుండి పొందే బాధా నివారణ అంతంతమాత్రము గానే ఉంది. పైగా మందులు తీసుకోవడం ఆపగానే తిరిగి నొప్పి విజ్రుమ్భించేది.  2014 జూలై నెలలో ప్రాక్టీ షనర్ క్రింది రెమిడి ఆమెకు ఇచ్చారు :

CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC20.1 SMJ tonic + CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue + CC20.6 Osteoporosis…TDS

మూడు వారాలు ఈ మందులు వేసుకోగానే వీరు నొప్పి నుండి పూర్తిగా విముక్తి పొందారు. మూడు నెలల అనంతరం ప్రాక్టీ షనర్ వీరిని కలసి నపుడు ఆవిడ ఆనందంగా ఏ విధమైన భుజాల నొప్పి లేకుండా వంటింట్లో పనులు చేసుకుంటూ కనిపించారు. డోసేజ్ ని ఒక నెల రోజులు OD గానూ అనంతరం ప్రివెంటివ్ డోసేజ్ OW గా మరో నెల రోజులు తీసుకోవలసింది గా సూచించారు. 2016 ఫిబ్రవరి నెల నాటికీ పేషంటుకు ఏ విధమైన నొప్పి లేకుండా ఉండటమే కాక డోసేజ్ ను OW గా కొనసాగిస్తూ ఉన్నారు.

అధిక బరువు, సక్రమంగా రాని నెలసరి,సంతానలేమి 02806...Malaysia

2014 ఫిబ్రవరి 20 వ తేదీన 28 సంవత్సరాల మహిళ స్థూలకాయం సమస్యతో ప్రాక్టీ షనర్ ను కలిసారు.  ఆమె ఎత్తు 168 సెం.మీ.లేదా 5 అడుగుల 5ఇంచులు in, బరువు  88 కేజీలు /194lb మరియు బాడి మాస్ ఇండెక్స్ (BMI) 31.6. ఈమె గత సంవత్సర కాలంగా సక్రమంగా రాని నెలసరి తో కూడా బాధపడుతున్నారు. వీటి నిమిత్తము ఏ మందులు వీరు తీసుకోవడంలేదు. ఐతే అనుభవం కలిగిన హోమియో వైద్యులు కనుక అధిక బరువు వల్ల  నెలసరి సమస్యలు ఏర్పడుతాయని  తన స్థూలకాయం సమస్యను పోగొట్టుకోవాలని భావించారు.

స్థూల కాయానికి :    
#1. CC6.2 Hypothyroid + CC15.4 Eating disorders...TDS

మూడువారాలు అయ్యేసరికి ఆమె తనబరువును 4.5kg/10lb, కోల్పోయారు కానీ ఆమెకు  అలసట, నీరసం కలగసాగాయి. కనుక రెమిడి ని క్రింది విధంగా మార్చడం జరిగింది.

నీరసానికి,స్థూలకాయమునకు :
#2.  CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + #1...TDS

నాలుగు వారాలలో వీరికి మెల్లగా గుణం కనబడి ఆమె చురుకుగా శక్తివంతంగా తయారయ్యారు. 2014 జూలై 3 నాటికి వీరు 7kg/15.4lb బరువును కోల్పోయారు.కానీ వీరికి నెలసరి మాత్రం ఇంకా సక్రమంగా రావడంలేదు. కనుక వీరికి అదనంగా క్రింది రెమిడి ఇవ్వబడింది.

 నెలసరి సక్రమము గా రావడానికి :
#3. CC8.8 Menses irregular...TDS

ఈ పేషంటుకు వివాహము జరిగి రెండేళ్లయినా సంతానము లేదు.  వీరు స్పెషలిస్ట్ ను సంప్రదించగా వీరి యొక్క ఒక అండాశయము సాధారణ స్థాయి కన్నా తక్కువ పరిమాణము లో ఉన్నదని చెప్పారు. వీరి యొక్క ఇతర ప్రత్యుత్పత్తి అంగాలు మరియు వీరి భర్త యొక్క వీర్య పరిమాణము కూడా సాధారణ స్థాయిలోనే ఉన్నాయి. వీరు సంతాన సాఫల్యం కోసం ఎట్టి చికిత్సా  కూడా తీసుకోలేదు. దంపతులిరువురికి సంతానము కోసం రెమిడి ఇవ్వబడింది.

భార్యకు :
#4. CC8.1 Female tonic...TDS

భర్తకు :
#5. CC14.1 Male tonic + CC14.3 Male infertility...TDS 

2014 అక్టోబర్ 1 వ తేదీన వీరు ప్రాక్టీషనర్ కు ఫోన్ చేసి తాను ప్రస్తుతం 7 వారాల గర్భవతి నని ఆనందంతో చెప్పారు. తాను తీసుకుంటున్న రెమిడి లన్నింటిని మానేసారు కానీ 4 వారాల తర్వాత వీరికి కలిగిన వికారము నాకు ప్రాక్టీ షనర్ ను సంప్రదించడం జరిగింది. వీరికి క్రింది రెమిడి ఇవ్వబడింది :

గర్భం దాల్చడానికి మరియు వికారానికి :
#6. CC8.2 Pregnancy tonic + CC8.9 Morning sickness + CC12.1 Adult tonic...TDS

వీరి యొక్క గర్భధారణ ఎట్టి అవాంతరాలు లేకుండా పూర్తయ్యి  2015 మే 26 న ఒక ఆడశిశువుకు జన్మ నిచ్చారు.,ఈ గర్భ ధారణ సమయంలోనే వీరి బరువు  70kg/154lb (వీరి ఎత్తుకు ఇది సాధారణము) నాకు చేరింది. అలాగే 2016 జనవరి నాటికీ వీరి బరువు 78kg/172lb కు చేరుకోవడం వీరు ఆనందించి తక్కువ కార్బో హైడ్రేట్ లు కలిగిన ఆహారం తింటూ ఇదే బరువును కొనసాగించాలని నిర్ణయించారు. వీరికి నెలసరి కూడా ఇప్పుడు సక్రమంగా వస్తున్నాయి.

నోటిపుండ్లు 11965...India

28-సంవత్సరాల మహిళ గత మూడు రోజులుగా నోటి పండ్ల తో బాధపడుతూ 2014 డిసెంబర్ 18 వ తేదీన ప్రాక్టీషనర్ ను కలిసారు. ఈ పుండ్లు  ఎంత బాధ కలిగిస్తున్నాయంటే ఆమెకు తినడం త్రాగడం కూడా ఇబ్బందిగా ఉంది. ఇలా రావడానికి ప్రత్యేక కారణమంటూ ఏమిలేదు అంతేగాక ఆమె దీనినిమిత్తం  మందులు కూడా ఏమీ వాడడం లేదు. ప్రాక్టీ షనర్ ఆమెకు క్రింది రెమిడి ఇవ్వడం జరిగింది :

NM89 Mouth and Gum... నీటితో ప్రతీ ప్రతీ 10 నిమిషాలకు ఒక డోస్ చొప్పున 2 గంటల వరకు

రెండుగంటల తర్వాత పేషంటు తాను ద్రవపదార్ధాలు తీసుకోగలుగు తున్నానని చెప్పారు. డోసేజ్ ను 6TD కి తగ్గించడం జరిగింది.ఆ తరువాత ఉదయానికి పేషంటు యొక్క పరిస్థితి మరింత మెరుగుపడి ఆమె తన నోటి యొక్క కుడి భాగము నుండి ఏదయినా తినగలుగు తున్నారు. ఆరోజు సాయంత్రానికి సాధారణ స్థితికి చేరుకొని నోటికి ఇరు ప్రక్కలా తినగల పరిస్థితి కలిగింది. డిసెంబర్ 20 నాటికి డోసేజ్ ను TDS కు తగ్గించడం జరిగింది. తరువాత రెండు రోజులకు అల్సర్ పూర్తిగా తగ్గిపోయింది. మరికొన్ని రోజులు రెమిడి ని OD తీసుకోవాల్సిందిగా పేషంటు సూచించబడ్డారు.

అభ్యాసకుల వివరాలు 01620...France

ప్రాక్టీషనర్ 1620…ఫ్రాన్స్  ఒకప్పుడు ప్రసిద్ధ దంత విభాగపు అధిపతి గా ఉన్నవీరు ప్రస్తుతం ఫ్రాన్సు దేశపు కోఆర్డినేటర్ గానూ అలాగే అక్కడ ఉన్న ముగ్గురు వైబ్రియోనిక్స్ శిక్షకులలో ఒకరుగాను ఉంటున్నారు

1990 నుండే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి భక్తురాలిగా ఉన్న వీరు 2000 సంవత్సరంలో మాత్రమే వారి మిత్రులద్వారా ఏమాత్రం సైడ్ ఎఫెక్ట్లు లేని పూర్తీ ఉచితంగా వైద్యం అందించబడే వైబ్రియోపతి అనే విభాగము గురించి తెలుసుకున్నారు.వీరు తన మిత్రులను బాబా ఆశ్రమంలో నడపబడుతున్న వైబ్రియో క్లినిక్ కు తీసుకు వెళ్ళమని కోరగా అదృష్ట వశాత్తు స్వామి సంకల్ప వశాన ఆ సమయంలో వైబ్రియోనిక్స్ శిక్షణా తరగతులు నిర్వహింప బడుతూ  ఉంటే వాటిలో పాల్గొనే అవకాశము చిక్కింది.ఈమెకు ఆంగ్ల పరిజ్ఞానము అంతంతమాత్రమే ఐనా వీరియొక్క అంకితభావము,పట్టుదలను చూసి డాక్టర్ అగ్గర్వాల్ సార్ వీరిని ఈ శిక్షణా తరగతులలో చేర్చుకున్నారు

 ప్రతిరోజూ సాయంత్రం వేళ వీరి స్నేహితురాళ్ళు వీరికి ఆరోజు శిక్షణలో చెప్పిన అంశాలను  విడమరచి చెప్పేవారు. సహజంగా ప్రతిభావంతురాలాయిన ఈమె తాను విన్నదానిని చక్కగా నోట్స్ తయారు చేసుకొని తన జ్ఞానాన్ని కూడా జోడించి సాయి వైబ్రియోనిక్స్ కు అన్వయించే వారు. త్వరలోనే కోర్స్ పూర్తి  చేసుకొని ప్రాక్టీసు ప్రారంభించాడానికి కావలసిన సరంజామా అంతా సమకూర్చుకొన్నారు. ఫ్రాన్స్ రాగానే ఆంగ్లము నేర్పబడే సంస్థ లో చేరి పట్టుదలతో ఆంగ్లం నేర్చుకొని సాయి వైబ్రియోనిక్స్ ఇంగ్లీష్ పుస్తకం చదవడం పూర్తి  చేసారు.అంతేకాక వీరి స్నేహితుల సహకారముతో ఈ పుస్తకాన్ని ఫ్రెంచ్ భాషలోనికి తర్జుమా చేయడానికి కూడా పూనుకున్నారు.       

ఫ్రాన్సులో వైబ్రియో ప్రాక్టీషనర్ గా  వీరి యొక్క ప్రారంభపు రోజులు పూలబాట మాత్రము కాదని చెప్పవచ్చు. వీరికి సహకారము అందించడానికి దగ్గరలో వేరే ప్రాక్టీ షనర్ లు లేరు. కేసులకు సంబంధించిన సమాచారము తెలుసుకొనడానికి నూతనంగా వస్తున్న మార్పులు తెలుసుకొనడానికి వార్తాలేఖలు లేవు,వెబ్సైట్లు లేవు. రెమిడి ల వల్ల లభిస్తున్న సానుకూల ఫలితాల స్పూర్తితో వంటరిగానే మొక్కవోని దీక్షతో వీరు తన వై బ్రో దీక్షను కొనసాగించారు. 

 స్వామి లీలలు ఈ ప్రాక్టీషనర్ కు కొత్తేమీ కాదు. 2013 లో ఈమెకు రొమ్ముపై క్యాన్సర్ అని నిర్ధారణ చేసి శస్త్రచికిత్స మరియు రేడియేషన్ థెరపి చేయించుకోమని చెప్పారు. తీవ్ర మైన ప్రార్ధనల ద్వారా స్వామికి శరణాగతి చేసి ఆమె అలోపతి మరియు హోమియో పతి మందులు రెండూ కలిపి తీసుకోవాలని నిశ్చయించుకున్నారు.రేడియేషన్ చికిత్స ద్వారా ఏర్పడే సైడ్ ఎఫెక్ట్ లకు లోను కావడానికి బదులు ఆమె చక్కగా కోలుకోవడమే కాక ఎంతో మానసిక ప్రశాంతతను అనుభవించారు. ఆపరేషన్ చేయించుకోవలసిన సమయం అసన్నమయినప్పుడు  ఆమెకు కేటాయించబడిన 108 గదిని చూసి ఎంతో ఆనంద పడ్డారు .

శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయిన తర్వాత మెయిన్ టేనేన్స్ డోసేజ్ ప్రారంభించడము  అంతేకాక అతిత్వరలో ఆమె కోలుకో గలిగినందుకు స్వామికి ఎంతో కృతజ్ఞత తెలుపు తున్నారు. ఈ కృతజ్ఞతను  జీవితాంతము  పేషంట్ లకు సేవచేయడానికి వినియోగించాలని నిర్ణఇంచు కున్నారు.  ఈ బాధాకరమైన జీవితం వీరిలో వ్యక్తిగతముగాను, ఇతరుల బాధలను అర్ధము చేసుకొనడానికి ఒక ప్రాక్టీషనర్ గానూ ఎంతో పరివర్తన తీసుకు వచ్చింది. తనకు తానే ఒక సజీవ ఉదాహరణగా ఉంటూ పేషంట్ల యొక్క బాధలు అర్ధం చేసుకొనడానికి ముఖ్యంగా కేన్సర్ వంటి భయంకర వ్యాధుల బారిన పడ్డ పేషంట్ల నమ్మకమును విశ్వాసాన్ని కలిగించేవారు.

 2010  లో మొదటి వార్తాలేఖ ప్రచురితమైన దగ్గరి నుండి ఇప్పటివరకు అన్ని వార్తలేఖలను ఫ్రెంచ్ భాషలోనికి తర్జుమా చేసారు., వీరు ఈ సేవను తన జ్ఞానాన్ని పెంపొందించే దానిగాను ఈ వార్తాలేఖల లో రాయబడిన ప్రాక్టీ షనర్ ల అనుభవాలు తన విశ్వాసాన్ని పెంపొందిన్చేవిగాను ఉంటున్నట్లు తెలియ జేస్తున్నారు. ఈ వైబ్రియో రెమిడి ల ద్వారా పేషంట్లకు స్వస్థత చేకూరు తున్న తీరు తన హృదయాన్ని కదిలించి వేస్తున్నట్లు వీరు  తెలుపుతున్నారు.  

  2014, డిసెంబర్ లో ప్రాక్టీషనర్ డాక్టర్ అగ్గర్వాల్ మరియు శ్రీమతి అగ్గర్వాల్ గారి అధ్వర్యంలో నిర్వహింపబడిన వైబ్రియోనిక్స్ ట్రైనర్ వర్క్ షాప్ ను విజయవంతంగా పూర్తి చేసారు. ఫ్రాన్సులో మరో ఇద్దరు ట్రైనర్ లతో కలసి ప్రణాళికలు సిద్ధం చేయడం AVP శిక్షణా శిబిరాలు నిర్వహించడంలో వీరు తమ జ్ఞానాన్ని ,అనుభవాన్ని పెంచుకుంటూ  ఈ సాయి వై బ్రియోనిక్స్ యొక్క విస్తృత పరిధికి కావలసిన ప్రేమవారధులను అందిస్తున్నారు. శిక్షకులందరూ కూడా కొత్త ప్రాక్టీషనర్ లకు బోధించడం,శిక్షణ నివడం,సర్టిఫికేట్ లు ఇవ్వడం,ఈ సేవ తమ కెంతో ఆనందాన్ని కలిగిస్తోందని,ఇది తమ భాగ్యమని తెలుపుచున్నారు.

ఫ్రాన్సులో కోఆర్డినేటర్ గా పనిచేస్తున్న వీరు ఈ అద్భుత చికిత్సా విధానాన్ని,దివ్య ప్రేమను అందరికీ పంచాలనే ఆకాంక్ష తో పనిచేస్తున్నారు. మధ్యలో మానివేసిన ప్రాక్టీషనర్ ల కోసం ప్రోత్సాహకరంగా శిక్షణాశిబిరాలు,ఇతరత్రా కార్యక్రమాలు ఏర్పాటు చేసి వారికి నిరంతరము నేర్చుకోవడానికి,ఇతర ప్రాక్టీషనర్ లతో సంబంధ బాంధవ్యాలు నెరపడానికి అవకాశాలు కల్పిస్తున్నారు. దీనివల్ల ఎందరో తిరిగి ప్రధాన స్రవంతిలో చేరి తమ సేవా సాధన ను కొనసాగిస్తారనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు

హృదయ సంభంద మైన బాంధవ్యాన్ని నెలకొల్పడం ద్వారా సాయి వైబ్రియోనిక్స్ తన హృదయాన్ని విశాలం చేసిందనే అభిప్రాయం వీరు వెలిబుచ్చుతున్నారు. నిరాశావహ దృక్పధంలో నూ,బాధలలోను ఉన్నవారి ఇబ్బందులను  వాత్సల్యంతోనూ ,ప్రేమతోనూ  వినడం ,అనునయించడం వలన వారిలో ఆశావహమైన దృక్పధాన్ని కలిగించ గలుగుతున్నానని, కనీసం టెలిఫోన్ ద్వారా మాట్లాడిన సందర్భంలో కూడా ఇటువంటి వారు అశాంతి నుండి ప్రశాంతికి మరలిన సందర్భాలున్నాయని వీరు పేర్కొంటున్నారు.  

వీరి వైబ్రియోనిక్స్ సేవ కేవలం వైద్యానికే పరిమితం కాకుండా పేషంట్ల కు ఆరోగ్యకరమైన ఆహార విధానాలు,జీవన విధానము వంటివి పేషంట్లకు చెపుతూ వారు  త్వరగా కోలుకోవడానికి అవకాశాలు కల్పిస్తున్నారు.  ఇంకా వీరు తమ చికిత్సా విధానములో ‘‘ స్వయం పరిశీలన వైద్యానికి మొదటి మెట్టు ‘’ అని భావిస్తూ తమ పేషంట్లతో ‘ నేనెవరిని,నేను జబ్బుతో ఉన్నట్లు ఎందుకు భావిస్తున్నాను,ఈ జబ్బుకు కారణ మేమిటి?’’ అని ప్రశ్నించు కొనేలా ప్రోత్సహిస్తారు. ఇలా తన సేవ ద్వారా పేషంట్లు తమ బాధలనుండి కోలుకొని ఆరోగ్య ఆనందాలను  పొందగలిగితే   వీరు స్వామికి సాయి వైబ్రియోనిక్స్ కు కృతజ్ఞతలను తెలుపుకుంటారు.

 

Practitioner Profile 01480...France

ప్రాక్టీషనర్  01480…ఫ్రాన్స్  ఈ దంపతులు గత 20 సంవత్సరాలుగా వైబ్రియోనిక్స్ ప్రాక్టీసు చేస్తున్నారు. భర్త ఎన్నో సంవత్సరాలు ఆరోగ్య శాఖ లో పనిచేసి అలోపతి మందుల వలన కలిగే హానికరమైన ఫలితాలను ఆకళింపు చేసుకున్నారు.  ఎటువంటి సైడ్ ఎఫెక్టులు లేని ప్రత్యామ్నాయ చికిత్సా పద్దతుల పైన వీరి అన్వేషణ ఫలించి వైబ్రియోనిక్స్ లో వీరి చేరికను సుగమం చేసినది . ఈ దంపతుల మధ్య ఉన్న పరస్పర అవగాహన నిస్వార్ధ సేవ పట్ల వీరి అభిరుచి పుట్టపరి వెళ్లి భగవాన్ బాబాను దర్శించి ఆ తర్వాత డాక్టర్ అగ్గర్వాల్ గారి శిక్షణలో వైబ్రియోనిక్స్ చికిత్సా నిపుణులుగా మారడానికి దోహదపడింది    

సాయి వైబ్రియోనిక్స్ అంతటి లోనూ దాని యొక్క సేవా విభాగమే అత్యంతమౌలికమైనది ఈ దంపతులు గుర్తించారు. ఇద్దరూ కూడా తమ పేషంట్ల జీవితాలలో ఆరోగ్యాన్ని,ఆనందాన్ని నింపాలనే ఆశయం గలవారే. వీరి దృష్టిలో ప్రధాన లేదా ప్రస్తుతం ఉపయోగంలో ఉన్న చికిత్సా విధానాలు పేషంట్లను భయపెట్టేవిగాను ఇంకా చెప్పాలంటే అనేక కష్ట నష్టాలకు గురి చేసేవిగాను ఉన్నాయనీ అదే వైబ్రియోనిక్స్ విషయంలో చూసినట్లయితే ఒక ఆధ్యాత్మిక వాతావరణము,బేషరతుగా ఉండే ప్రేమకు ఇది నిలయం .పేషంట్ల లో భౌతిక,మానసిక భావోద్వేగ,ఆధ్యాత్మిక పరమైన మార్పు తెచ్చి దీర్ఘకాలికమైన ప్రయోజన కారక మైన చికిత్సను ఇది అందిస్తుంది .

వీరు మొట్టమొదటి సారి ఒక థైరాయిడ్ సమస్య తో వచ్చిన పేషంటుకు చికిత్స నందించి స్వస్థత చేకూర్చిన అనుభవం ఎల్లప్పుడూ ఆనందంగా గుర్తు చేసుకుంటూ ఉంటారు. వీరి వద్దకు వచ్చిన పేషంటు వారి అలోపతి డాక్టర్ సూచన మేరకు  లెవో థైరాక్జిన్ (Levothyroxine) మందును వాడుతున్నారు. నాలుగు నెలల వైబ్రో చికిత్స  తరువాత థైరాయిడ్ పూర్తిగా తగ్గిపోవడమే కాక అలోపతి మందులనుండి పూర్తి విముక్తి లభించింది.

 వైబ్రియోనిక్స్ సేవ వల్ల ఈ దంపతులలో ఒక ఉన్నతమైన అంతర్ద్రుష్టి,అవగాహన, ఇంకా వీరి అంతః చేతనలో ఎంతో పరివర్తన కలిగిందని చెపుతున్నారు. మనసు ద్వారా కాక హృదయము ద్వారా పని చెయ్యడం వీరికి అలవాటయ్యింది. వీరు ప్రాక్టీషనర్ 01620…ఫ్రాన్స్   తోకలసి శిక్షణ ఇచ్చే బృందము గా ఏర్పడి ఫ్రాన్స్ లో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇది వీరు క్రొత్తవారితోనూ ,సమవయస్కులతోను తమ అనుభవాలు పంచుకోవడానికి ఎంతో దోహద పడుతోంది.  వీరు 108CC బాక్స్ తోనే కాక  SRHVP ద్వారా రెమిడి లను బ్రాడ్ కాస్ట్ చేసి ఇవ్వడం ద్వారా అద్భుత ఫలితాలను సాధిస్తున్నారు.

వైబ్రియోనిక్స్ సేవ వీరికి ఫలితాన్ని ఆశించకుండా అంతా స్వామి సంకల్పానికి వదిలి జాగ్రత్తగా సేవ చేయడం నేర్పించింది. కొత్తగా వైబ్రియోనిక్స్ లో ప్రవేశించే వారికి వీరిచ్చేసందేశం ఏమిటంటే ‘’ ఆందోళన వద్దు ,భయం అసలే వద్దు,పూర్తి విశ్వాసం తో మున్ముందుకు సాగండి,ఎల్లప్పుడూ ఆనందంగా ఉండండి’’ !

ప్రశ్నలు సమాధానాలు

1. ప్రశ్న : వైబ్రియో రెమిడిలను హోమియో లేదా ఆయుర్వేద మందులతో పాటు తీసుకోకూడదనే విషయం నాకు తెలుసు మరి ఇతర అనుబంధ పదార్ధాలైన విటమిన్లు, ఖనిజ లవణాలను, మూలికలను ఈ రెమిడి లతో కలిపి తీసుకోనవచ్చా ?

   జవాబు : నిరభ్యంతరంగా తీసుకోవచ్చు కానీ రెమిడి లకు ఈ అనుబంధ పదార్ధాలకు మధ్య 20 నిమిషాల విరామం తప్పనిసరిగా ఉండాలి. 

________________________________________

2. ప్రశ్న: నా  పేషంట్లకు ఆరోగ్య సలహాలు ఇవ్వడానికి -ఏ ఏ ఖనిజ లవణాలు ఆరోగ్యానికి మంచివి ఇవి ఏ ఆహార పదార్ధాలలో లభిస్తాయి?

   జవాబు: ఈ ప్రశ్న ఈ ‘‘ప్రశ్నోత్తర వాహిని’’ పరిధికి మించినది. ఏ మైనప్పటికీ చికిత్సా నిపుణులు ఆహారము జీవన విధానం,ఆరోగ్యము వ్యాధులు పట్ల తమ జ్ఞానాన్ని పఠనము,పరిశోధన ద్వారా ఎప్పటికప్పుడు పెంచుకుంటూ ఉండాలి. ఇప్పుడు అంతర్జాలంలో చక్కటి సమాచారము లభిస్తున్నది. ఐతే కొన్ని సైట్ లు తమ ఉత్పత్తులు పెంచుకోవడానికి టప్పుడు సమాచారము అందిస్తూ ఉంటాయి. వాటికి దూరంగా ఉంటూ విద్యా సంబంధమైన ప్రసిద్ధ వెబ్సైట్లు అందించే వాటిని స్వీకరించాలి. . 

   ________________________________________

3. ప్రశ్న ఇటీవల దోమల ద్వారా వ్యాపించే క్రొత్తగా కనుగొన్న వ్యాధి జికా గురించి చాలా ప్రచారము జరుగుతున్నది. దీని నివారణకు ఏదయినా ప్రివెంటివ్ రెమిడి ఉందా ?

   జవాబు:  వ్యాధి ఎక్కువగా ప్రబలి ఉన్న ప్రాంతంలో  SR300 Malaria Off 200C…BD ను వరుసగా మూడు రోజులు అలా మూడు నెలలు ఇవ్వండి. ఈ మూడు రోజులు ఏ ఇతర హోమియో లేదా వైబ్రియో రెమిడి లు ఇవ్వకండి. పైన పేర్కొన్న మందు హోమియో స్టోర్స్ లో లభిస్తుంది. ఇది  మన  CC9.3 Tropical diseases.లో కూడా చేర్చబడి ఉన్నది.

    ________________________________________

4. ప్రశ్న: ఎవరైనా పేషంటు మరణ శయ్యపై ఉంటే అది మనం ఎలా తెలుసుకోవచ్చు? అతనికి ఏ రెమిడి ఇవ్వాలి ?

   జవాబు: సాధారణముగా పేషంటు యొక్క దగ్గర బంధువులద్వారా గానీ /పేషంటు యొక్క సంరక్షకుని యెద్ద నుండి గానీ లేదా డాక్టర్ వద్దనుండి గానీ ఈ సమాచారము పొందవచ్చు. ఇటువంటి పేషంట్లకు ప్రశాంతంగా ఉంచే రెమిడి  SR272 Arsen Alb CM లేదా  CC15.1 Mental & Emotional tonic…QDS చాలా ఉపకరిస్తాయి. ఏమయినప్పటికీ మరణాన్ని ఎవరూ ఉహించలేరు కానీ మరణం సమిపిస్తోందని తెలుసుకోవచ్చు.అటువంటి సందర్భంలో ప్రశాంతముగా మరణించడానికి పైన పేర్కొన్న రెమిడి లు ఉపకరిస్తాయి.అంతే కాకుండా ఇట్టి పేషంటుకు దగ్గరగా ఉన్న వారు కూడా తగినటువంటి రెమిడి తీసుకోవడం అత్యంత ఆవశ్యక మైనది.

    ________________________________________ 

5. ప్రశ్న: ఒక ప్రత్యేకమైన వ్యాధికి బ్లడ్ నోసోడ్ తయారు చేసినప్పుడు మరే ఇతర వైబ్రో రెమిడి ఇవ్వకూడదని నేను అనుకుంటున్నాను. ఐతే ఈ  నోసోడ్ తీసుకుంటూ ఉన్నప్పుడే పేషంటుకు  జుట్టురాలిపోవడం,చుండ్రు సమస్యలు తలెత్తినపుడు డానికి ప్రత్యేకమైన రెమిడి ఇవ్వవచ్చా?

   జవాబు: ఏ వ్యాధి కైనా బ్లడ్ (లేదా వెంట్రుకలతో)నోసోడ్ ఇచ్చినపుడు అది ఇతర వ్యాధుల పైన కూడా పనిచేస్తుంది. అనగా ఈ నోసోడ్ పేషంటుకు  పూర్తిగా స్వస్థత చేకూర్చడానికి ప్రయత్నిస్తుంది. అందువల్ల మరే ఇతర రెమిడి ఇవ్వవలసిన అవసరం లేదు అలా ఇస్తే అది నోసోడ్ యొక్క ప్రభావాన్ని తగ్గించే అవకాశం ఉంది .

   ________________________________________

6. ప్రశ్న: బ్రాడ్కాస్టింగ్ చేయడానికి పేషంటు యొక్క ఫోటో దొరకనప్పుడు ఒక పేపరు మీద వివరాలు వ్రాసి (పేషంటు యొక్క పేరు,తేది, పుట్టిన ఊరు, పేషంటు యొక్క సమస్య )రెమిడి వెల్ లో వేయవచ్చా ?

    జవాబు: రెమిడి వెల్ ద్వారా బ్రాడ్కాస్టింగ్ చేయడానికి తప్పనిసరిగా పేషంటు తాలూకు వస్తువు ఉండాలి ఎందుకంటే పేషంటు తాలూకు వైబ్రేషణ్ దానిలో దాగి ఉంటుంది. కనుక పేషంటు వివరాలు పేపరు మీద వ్రాసి దానిని ఉపయోగించడం సరియయిన పధ్ధతి కాదు.కనుక పేషంటు యొక్క రక్తపు చుక్క గానీ ,వెంట్రుక గానీ లేదా ఫోటో గానీ (పూర్తి నిడివి కలిగినది ఐతే మంచిది) ఉపయోగించడం మంచిది.  

________________________________________

7. ప్రశ్న:నా దగ్గరకు వచ్చిన ఒక పేషెంటు  కు ఒక సమస్య నిమిత్తం రెమిడి ఇస్తే అతనికి 3 రోజులనుండి మలవిసర్జన ఆగిపోయింది. మలబద్ధకం పుల్లౌట్ లో భాగమేనా నేను ఆమెతో ఎక్కువ నీరు త్రాగాలని కూడా చెప్పాను.   

    జవాబు : ఈ పేషంటు కు మలబద్ధకం లేనట్లయితే ఇది రెండవ రకము పులౌట్ గా భావించవచ్చు. సాధారణంగా పెద్దప్రేవులో నీరు ఎక్కువగా శోషించబడితే మలము గట్టిగా మారి  మలబద్దకం ఏర్పడుతుంది. ఈ మలబద్దకము తోపాటు కడుపులో అసౌకర్యము కూడా తోడయితే అప్పుడు తాత్కాలికంగా డోసేజ్ ని తగ్గించే ప్రయత్నము చేయాలి లేదంటే   ఏమీ చేయవద్దు. ఎక్కువగా నీరు తీసుకోవడం మలబద్ధకం ఉన్నవారికి చాలా మంచిది. అల్బకరా గానీ దాని జ్యూస్ గానీ లేదా సై లియం పైన పొట్టు కూడా మలబద్ధకానికి బాగా పనిచేస్తుంది. 

________________________________________

8. ప్రశ్న: 108CC పుస్తకంలో కంటి సమస్యలతో బాధ పడుతున్నవారు (ఉదా:కేటరాక్ట్ ) 25,000 IU (ఇంటర్నేషనల్ యూనిట్ల) విటమిన్ A ను తీసుకోవాలని సూచించబడింది, ఇది సరియయినదేనా?

    జవాబు : మనం రోజూ తీసుకోవలసిన విటమిన్ A నిర్ధారిత ప్రమాణము 10,000 IU కన్నా తక్కువ. స్వామి నారాయణి సూచించిన 25,000 IU అనేది ఇప్పుడు వాడుకలో లేదు.  108CC పుస్తకం తరువాత సంచికలో ఈ విషయం చేరుస్తాము. 

________________________________________

9. ప్రశ్న: కూరగాయల పైనా,పండ్ల పైనా చేరి ఉన్న పురుగుమందులను శుభ్రము చేయుట గురించి నా పేషంట్లతో ఏమీ చెప్పాలి?

    జవాబు : తగిన ప్రమాణము గల ఒక  బౌల్ తీసుకొని  దానిలో ఒక చెంచా  నిండుగా ఉప్పు, రెండు  చెంచాల వినెగర్ వేసి బాగా కలపాలి.కూరగాయలు ,పండ్లను ఆ బౌల్ లో 20 నిముషాలు నాననివ్వాలి. ఈ విధానము  కూరగాయలు,పండ్ల పైన ఉన్న పురుగుమందులను తొలగిస్తుంది. ఇలా చేసిన తర్వాత నల్లా క్రింద వీటిని ఉంచి నీటిని ప్రవహింప చేస్తే ఆ పురుగుమందుల తాలూకు శేషము ఏ మైనా ఉన్నా తొలగిపోతుంది.

వైద్యులకే వైద్యుడి యొక్క దివ్య వాక్కు

మానసిక అశాంతి మనిషి ఆరోగ్యానికి ఎంతో చేటు చేకూరుస్తుంది కనుక మానవునిలో వత్తిడికి,అశాంతికి కారణమయినట్టి  భావోద్వేగాలను ,కోరికలను ,అదుపులో ఉంచుకొనడం ఎంతో అవసరం. ఆహారము తీసుకొనేటప్పుడు కూడా మనసును పవిత్రంగా,ప్రశాంతంగా ఉంచడం ఎంతో అవసరం. మనం ఆహారము తీసుకొనేటప్పుడు కోపాన్ని,ఉద్రేకాన్ని కలిగించే సంభాషణలలో పాల్గొనకుండా ఉండడం ఎంతో అవసరం. ఆహారము తీసుకునేటప్పుడు ఆవేశ కావేశాలకు లోనుకావడం మానసిక అశాంతికి కారణ మవుతుంది. ఇట్టి మానసిక అశాంతి అనారోగ్యానికి కారణ భూత మవుతుంది.ఇంతేకాక ఆహారము తీసుకునే టప్పుడు టి.వి. చూడడం,మానసిక అశాంతిని కలిగిస్తుంది కనుక టివి చూడకూడదు. ‘’ 
……సత్యసాయిబాబా , “ఆహారము ,హృదయము మరియు మనసు ”  1994 జనవరి 21 నాటి శ్రీవారి భాషణము  “సేవకు సంసిద్ధత ” శ్రీవారి భాషణము    1986 నవంబర్  21
http://www.sssbpt.info/ssspeaks/volume27/sss27-03.pdf

 

 

 నీవు ఈ ప్రపంచము మరియు దానికి సంబంధించిన విషయాలలో జోక్యం చేసుకోకూడదు. నోటితో భగవన్ నామాన్ని పలుకుతూ ప్రాపంచిక విషయాలకు ఎంత వీలయితే అంత దూరం ఉండు. నీకున్న 24 గంటలలో 6 గంటలు నీ దైనందిన అవసరాలకు ,6 గంటలు ఇతరుల సేవకు, ఆరు గంటలు నిద్రకు, ఆరు గంటలు భగవన్నామస్మరణ కు కేటాయించు. ఈ 6  గంటలు నిన్ను ఉక్కు కన్నా గట్టిగా తయారు చేస్తాయి. …సత్యసాయిబాబా, “మానవ నావ ”— సత్యసాయిబాబా,   1964 డిసెంబర్ 14 నాటి శ్రీవారి భాషణము   
http://www.sssbpt.info/ssspeaks/volume04/sss04-46.pdf

 

ప్రకటనలు

❖ ఇండియా పుట్టపర్తి : AVP వర్క్ షాప్, 2016 మార్చ్ 5-8 తేదీలలో సంప్రదించవలసిన వారు హేమ ,వెబ్సైట్ [email protected]

 ఇండియా డిల్లి –ఎన్సిఆర్ : VP వర్క్ షాప్ 2016 మార్చ్ 12  మరియు వార్షిక రిఫ్రెషర్ సెమినార్ 2016 మార్చ్ 13, c సంప్రదించవలసిన వారు సంగీత, వెబ్సైట్ [email protected]

❖ ఇండియా ముంబాయి (డి.కె.): రిఫ్రెషర్ సెమినార్  మరియు  AVP వర్క్ షాప్ 2016 ఏప్రిల్ 2-3 తేదీలలో, సంప్రదించవలసిన వారు సతీష్, వెబ్సైట్ [email protected] లేదా టెలిఫోన్ నంబర్  9869-016 624

❖  ఇటలీ పడువా , వెనిస్ : రిఫ్రెషర్ సెమినార్ 2016 మే 21 న, సంప్రదించవలసిన వారు మనోలిస్, వెబ్సైట్ [email protected]

 ఇండియా కాసరగడ్ , కేరళ : AVP వర్క్ షాప్ 2016 మే 28-29 తేదీలలో, సంప్రదించవలసిన వారు రాజేష్, వెబ్సైట్  [email protected] లేదా టెలిఫోన్ నంబర్  8943-351 524 / 8129-051 524

❖ ఫ్రాన్స్ దోర్దాగ్నే : రిఫ్రెషర్ సెమినార్  మరియు AVP వర్క్ షాప్ 2016, జూన్ 18-19 తేదీలు  సంప్రదించవలసిన వారు డేనియల్, వెబ్సైట్ [email protected]

 

అదనపు సమాచారం

శరణార్ధుల కోసం గ్రీస్ దేశంలో  వైబ్రియో మెడికల్ క్యాంప్

ఆఫ్రికా మరియు మధ్య ప్రాచ్య దేశముల మధ్య ఏర్పడిన సంక్షోభం కారణంగానూ,పేదరికం కారణంగానూ వలస  వచ్చిన శరణార్ధులకు మానవతా దృక్పధంతో  గ్రీస్ దేశంలోని ఎథెన్స్ నగరం ఆశ్రయం కల్పిస్తోంది. గత రెండున్నర నెలలులుగా ప్రాక్టీషనర్ లు  01768, 03118, 03107, 01379 ఈ క్యాంపులలోని శరణార్ధులకు వైబ్రియో సేవలు అందిస్తున్నారు.

హొమియోపతీ డాక్టర్ గానూ మరియు ఆక్యుపంక్చర్ నిపుణురాలు గానూ ఉన్న ఒక సాయి సోదరి మాతో కలసి ఎందరో శరణార్ధులకు సేవలందించారు.ఆ అనుభవాలు మీతో పంచుకోదలుచుకున్నాము.  

  ఈ సేవ  2015 డిసెంబర్ 12 న ప్రారంభమయ్యింది. ఇప్పటి వరకు 10 మార్లు సందర్శించిన  ఈ ఎథెన్స్ ప్రాంతంలోని రెండు వేరువేరు క్యాంపులలో 135 మంది పేషంట్లను వీరు చూడడం జరిగింది. ప్రాక్టీషనర్లు ప్రధానంగా గాయాలు,మరియు హానికరమైన ,కఠిన తరమైన ప్రయాణం వల్ల ఏర్పడినసమస్యలకు  మందులు ఇవ్వడం జరిగింది. చాలామంది శరణార్ధులు గ్రీస్ చేరుకునే ప్రస్థానంలో బలవంతంగా టర్కీ సముద్రపుటొడ్డున ప్రయాణము చేయవలసి రావడంతో జలుబు మరియు ఫ్లూ బారిన పడ్డారు. దిగ్బంధనం చేయబడిన ఈ ప్రాంతం నుండి తమ పిల్లలను,సామానును తీసుకొని రావడానికి పర్వతాలను కూడా దాటవలసి రావడంతో వీరిలో చాలామందికి కండరాల సమస్యలు ఏర్పడ్డాయి. ఎవరికైతే ఈ మందులు ఇవ్వబడ్డాయో వారి నుండి చక్కని స్పందన లభించింది కానీ తిరిగి ఈ మందులు కొనసాగించడానికి అవకాశం లేకుండా పోయింది, ఎందుకంటే వీరు యూరప్ కు తమ ప్రయాణం కొనసాగించడానికి ముందుకు సాగిపోతూ ఉండేవారు.  ప్రాక్టీషనర్ లు వారి భావాలను ఇలా వ్యక్తం చేస్తున్నారు. ‘‘అద్భుత మైన విషయం ఏమిటంటే మేము ఓపికతో ప్రేమతో శరణార్ధులు చెప్పేదంతా విని స్వాంతన వచనాలు పలుకుతూ రెమిడి లు ఇవ్వడం వారికెంతో తృప్తిని ఇచ్చింది. వారి బాధా తప్త ముఖాలలో మా కరుణామయ మాటలద్వారా ,మా ప్రేమద్వారా కల్పించగలిగిన ఆనందాన్ని స్ప్సష్టంగా  చూడగలిగాము’’. మా సేవలో భాగంగా కొందరు పశ్చిమ ప్రాంత అలోపతి డాక్టర్ లను కూడా కలుసుకొనే భాగ్యం కలిగింది . ఈ వైద్య సిబ్బంది ముఖ్యంగా డాక్టర్లు మేము చేసే సేవలకు తమవంతు సహకారం అందించారు. మొట్టమొదట ఈ సిబ్బంది లో ఉన్న ఒక నర్సు మా వైద్య విధానము పట్ల ఎన్నో సందేహాలు వెలిబుచ్చినా పేషంట్ల తో మేము ప్రవర్తించే తీరు కరుణ, ప్రేమలతో కూడిన మా సేవ విధానము చూసి ఆవిడ తన అభిప్రాయాన్ని మార్చుకున్నది.

_________________________________________

పరిపాలనా విభాగపు సేవకు గుర్తింపు 

ప్రాక్టీషనర్  02868…యుఎస్ఎ  వీరు వైబ్రియోనిక్స్ ప్రాక్టీషనర్ గా 2012 లోన్ సీనియర్ వైబ్రియోనిక్స్ ప్రాక్టీషనర్ గా 2015 లోనూ నమోదు చేయబడినారు.  నిరంతర ప్రవాహ పరంపరగా వస్తున్న వార్తాలేఖల విభాగమునకు డిజిటల్ యాక్సెస్ కల్పించడానికి ,ఈ వార్తాలేఖలను అభివృద్ధి పరుచబడిన అన్వేషణ,కార్యాచరణ  సహితంగా మన వెబ్సైట్లో  అప్లోడ్ చేయడానికి గల విస్తృత అవకాశాలను దృష్టిలో ఉంచుకొని వీరు ముందుకు వచ్చి దీనికంతటికి బాధ్యత తీసుకున్నారు. ఇది చాలా ప్రాముఖ్యత కలిగిన విభాగము ఎందుకంటే అనేక విభాగాలుగా ఉన్న వార్తాలేఖను సమీక్షించడం,ఫార్మేట్ చేయడం,ట్యాగ్ చేయడం వ్యక్తిగతంగా పంపించడం ఇవన్నీ దీనిలో భాగమే..

వార్తాలేఖలను పొందు పరచడం లోనూ 12 భాషలలో లభ్యమవుతున్న వీటిని సులభంగా అందుబాటులో ఉంచేలా చూడడంలోనూ వీరు కీలక పాత్ర నిర్వహిస్తున్నారు. వీరికి అంకితభావం గల ఆరుగురు ప్రాక్టీషనర్లు వార్తాలేఖలను ఇతర భాషలలోనికి అప్లోడ్ చేయడంలో సహకరిస్తున్నారు. ఈ విధంగా తమ నిశ్శబ్ద విప్లవం మాదిరిగా తమ సేవానిరతితో ప్రపంచవ్యాప్త అశేష పాఠకలోకానికి సేవలందిస్తున్నవీరు వీరి బృందాన్నిఅబినందించకుండా ఉండలేము.  .  .

ప్రాక్టీషనర్  11964...ఇండియా  వీరి వైబ్రియోనిక్స్ ప్రవేశము  2014 నూతన సంవత్సరం నాడు కావించబడింది.అత్యంత తక్కువ సమయంలోనే వీరు AVP నుండి  వైబ్రియోనిక్స్ ప్రాక్టీషనర్ గా అయ్యారు. వీరి సంకల్పము దీక్ష ఒక్క సంవత్సరం లోనే వీరిని సీనియర్ వైబ్రియోనిక్స్ ప్రాక్టీషనర్ గా చేసింది. అనంతరం వీరు కేస్ హిస్టరీ లు రాయడం, ఎడిటింగ్ చేయడం అనే పనిని చేపట్టారు. వైబ్రియోనిక్స్ సంస్థ లో ప్రపంచ స్థాయి ప్రామాణికతను తీసుకురావడానికి గల ప్రత్యేకమైన అవకాశాలను దృష్టిలో పెట్టుకొని  ఇటివలే వీరు ఇంటర్ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాయి వైబ్రియోనిక్స్ ప్రాక్టీషనర్స్  (IASVP). లో అప్లికేషన్స్ ఫర్ మెంబర్ షిప్ విభాగంలో పూర్తీ స్థాయి బాధ్యతను తీసుకోవడం జరిగింది. ఈ పనిలో వీరికి ఎంతో అంకిత భావంతో పనిచేసే ఇద్దరు సీనియర్ ప్రాక్టీషనర్లు 11271 & 11231…India  గుర్తింపు కార్డులు తయారీలోనూ వాటిని పంపించే ప్రక్రియ లోను సహాయపడుతున్నారు. ఇంతటి బృహద్ బాధ్యతను చక్కగా నిర్వహిస్తున్న వీరికి అభినందనలు తెలుపుతున్నాము.

Om Sai Ram