Vol 7 సంచిక 1
January/February 2016
ముద్రింప తగిన వార్తాలేఖ
పూర్తి వార్తాలేఖ యొక్క కాగితం ప్రతి కావలెనన్నఈ పుటను ముద్రించండి
డా.జిత్. కే అగ్గర్వాల్ యొక్క మాటల్లో
ప్రియమైన చికిత్సా నిపుణులకు,
మీ అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు.
ఈ పండుగ రోజులు మనమందరం ఆనందంగా ఉంటూ మన ప్రేమను అందరితో పంచుకునే సమయము. అంతేకాదు ఇది మన ప్రేమమూర్తి బాబా మనందరి పైన తమ అమూల్యమైన దీవెనలు కురిపించినందుకు గాను కృతజ్ఞతలు తెలుపుకునే సమయం కూడా. ఈ సంవత్సరం వైబ్రియోనిక్స్ దృష్ట్యా స్వామి చేత ప్రత్యేకంగా దీవెనలు పొందినట్టిది అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరం లో ఎన్నోసార్లు వర్కు షాప్ లు ప్రపంచ వ్యాప్తంగా అనేకచోట్ల నిర్వహించుటకు అవకాశం కలిగింది. (కొన్నిటిని గూర్చి ఈ సంచికలో ‘’అదనపు సమాచారం ‘’ అనే విభాగములో ఇవ్వబడినవి). ఇంకా పరిపాలనా విభాగము నెలకొల్పడం, వార్తాలేఖలను మరో 11 భాషలకు విస్తరించడం ఈ సంవత్సరంలోని మార్పులే. 2015 సంవత్సరంలో ఇచ్చిన పిలుపు ననుసరించి ఎంతోమంది ఉదారంగా వైబ్రియోనిక్స్ విస్తరించడానికి కావలసిన సంపాదకీయం, అనువాదం, కేసుల పరిశీలన, డేటా నిర్వహణ, వెబ్ సైట్ నిర్వహణ ఇలా ఎన్నో సేవలు అందిస్తూ వచ్చారు.
ఈ సంవత్సరం లోనే స్వామి “ప్రేమే ప్రాణం, ప్రేమే మార్గం, ప్రేమే లక్ష్యం” అనేది అర్ధం చేసుకొనేలా చేసారు. ఎన్నోసార్లు కర్తవ్యము గోచరించక నిస్పృహతో దిక్కు తోచని స్థితి లో ఉన్నప్పుడు స్వామి ఎవరో ఒకరిని పంపి ఆ పరిస్థితి నుండి గట్టెంకించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అటువంటి సందర్భానికి ఒక ఉదాహరణ గత వార్తాలేఖ లో ఇవ్వబడినట్టి స్వామి ఆరోగ్యం ప్రసాదించిన 90 మంది రోగులయొక్క కేస్ హిస్టరీ లను ఒక పుస్తకంగా ముద్రించి స్వామి వారి 90 వ పుట్టినరోజుకు కానుక గా సమర్పించ నైనది.
గత సంవత్సరం కూడా ఒక సీనియర్ వైబ్రియోనిక్స్ ప్రాక్టీషనర్ మరియు ఇంగ్లాండ్ లోని పరిశోధనల విభాగపు అధికారిణి 00002…UK మరియు వారి టీం సహకారంతో 2004 సంవత్సరపు సీనియర్ వైబ్రో ప్రాక్టీషనర్లకు SRHVP వినియోగము పైన ఉన్న మాన్యువల్ ను సవరించిన సరికొత్త ఎడిషన్ గా ముద్రించడమైనది. స్వామి ఆశీర్వాదముతో ఈ 2016 ఎడిషన్ కూడా స్వామి సమాధి చెంత జనవరి 1 వ తేదీన సమర్పించడమైనది. ఈ సరికొత్త ఎడిషన్ లో స్వామి 12 సంవత్సరాల క్రితం తమ దివ్య చేవ్రాతతో అనుగ్రహించిన నాటినుండి ఈ నాటి వరకు వచ్చిన మార్పులు నూతన విధానాల నన్నింటినీ పరిగణన లోనికి తీసుకోవడం జరిగింది. దీనిలో ఇటీవలే కేన్సర్ మరియు ట్యూమర్ విభాగము, విస్తృత పరిచిన మైయజం విభాగము, కొత్తగా సమాచారం చేర్చిన రోగనిరోధకశక్తిని పెంపొందించే విభాగము సరికొత్త ఆకర్షణలుగా ఉంటాయి. కొత్తగా పుట్టిన శిశువులకు, పిల్లలకు సరికొత్త కోమ్బో లను మిస్సిలినియస్ విభాగములో ఇవ్వడం జరిగింది. సీనియర్ ప్రాక్టీషనర్ లు ఈ ఎడిషన్ ను పుట్టపర్తి లోని మా రూము S4-B1 నుండి కానీ లేదా మీ స్టేట్ కో ఆర్డినేటర్ నుండి గానీ తీసుకొనవచ్చు.
ఈ రోజు అనగా జనవరి 15 భారత దేశంలో సరికొత్త పనులను ప్రారంభిస్తారు. ఈరోజు సూర్యుడు రాశి చక్రము లోని మకర రాశి లో ప్రవేశించి ఉత్తరాభిముఖంగా ప్రయాణం ప్రారంభించేరోజు.
ఈ రోజును ప్రశాంతి నిలయంలో మకర సంక్రాంతి గా జరుపుకుంటారు. బాబా వారు ఆధ్యాత్మిక పరంగా దీని ప్రాముఖ్యత వివరిస్తూ ఇది ఎంతో పవిత్రమైన రోజని ఈ రోజు సాధనా పరంగా నూతన నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగిపోవలసిందిగా సూచిస్తుండేవారు. సంక్రాంతి మన అంతరాభిముఖ ప్రయాణానికి అనువైన రోజు. ఆధ్యాత్మిక ప్రవర్తనలో మార్పును సూచిస్తూ ప్రయాణం ప్రారంభించే రోజు. స్వామి సూచన ప్రకారం మనం చేరాల్సిన లక్ష్యం, అనందనిలయము బాహ్యంగా లేదు, మనలోనే ఉంది.
15 జనవరి1996లో స్వామి తమ ప్రసంగములో “కళ్ళజోడును నుదుటున ఉంచుకుని దానికోసం ఇల్లంతా వెతుకుతున్నట్లు ఆనందం తమ హృదయంలోనే ఉంచుకొని దానికోసం బయట వెతుకుతున్నారు మానవులు. ఆ దివ్యత్వం నీలోనే ఉంది. బాహ్యంగా చేసే సాధనల ద్వారా కలిగే ప్రయోజనం శూన్యం. కనుక ఈ మకర సంక్రాంతి పుణ్య తిధిని పురస్కరించుకొని అంతరాభిముఖ ప్రయాణం ప్రారంభించండి. తనను తాను తెలుసుకొన్నవాడే ముక్తిని పొందుతాడు. మానసికంగా చేసే పూజలు మొదలగునవి కూడా హృదయానికి పరిపక్వత నివ్వలేవు. నవవిధ భక్తిమార్గములో స్మరణం తో మొదలుకొని శరణాగతి అనగా ఆత్మనివేదనంతో ముగుస్తుంది. అట్టి ఆత్మనివేదనమునకు మార్గం సుగమం చేసేదే ఈ సంక్రాంతి” అని సెలవిచ్చారు.
కనుక ఈ పవిత్రమైన రోజు మనందరికీ ఆనందాన్ని పంచుతూ మనం చేసే సేవ మన ఆధ్యాత్మిక పురోగతిని పెంపొందించేదిగా ఉండాలని కోరుకుంటూ
ప్రేమపూర్వకంగా సాయి సేవలో,
జిత్ కే అగ్గర్వాల్.
దీర్ఘకాలిక నిద్రలేమి సమస్య 03532...UK
67 సంవత్సరాల వ్యాపారస్తుడు 10 సంవత్సరాల నుండి నిద్రలేమి సమస్యతో బాధపడుతూ నివారణ కోసం వచ్చాడు. అతను ఎప్పుడూ చురుకుగా ఉంటాడు, నడవడం, ప్రయాణం చేయడం అంటే అతనికెంతో ఇష్టం. రాత్రి పడుకోగానే ఆలోచనలు ప్రవాహంలా వచ్చేస్తూ ఉంటాయి. కొన్నిరాత్రులు ఆత్రుత, ఆందోళనతో నిద్రపట్టదు. అతను మెలటానిన్( Melatonin)మందును నిద్రకోసం అప్పుడప్పుడు వేసుకుంటూ ఉంటారు.
2015 సెప్టెంబర్ 19 వ తేదిన వీరికి క్రింది రెమిడి ఇవ్వబడినది:
#1. CC15.6 Sleep disorders…నీటితో నిద్ర పోవడానికి అర గంట ముందు.
మర్నాడు అతను మందు వేసుకున్నాక రాత్రి బాగా నిద్రపట్టింది తెల్లారి 7 గంటల వరకు మెలుకువ రాలేదు అని చెప్పారు.
అక్టోబర్ 12 న వారు తనకు 80 శాతం మెరుగయ్యిందని రాత్రిళ్ళు 6 నుండి 7 గంటల సమయం నిద్రపోతున్నానని చెప్పారు. పేషంటు చెప్పిన దాని ప్రకారము అతని ఆందోళన, ఆత్రుత, బిగ్గరగా మాట్లాడడం వీటికోసం ప్రాక్టీషనర్ క్రింది రెమిడి ఇచ్చారు:
#2. CC15.1 Mental & Emotional tonic + #1…ఇది మాత్రం తను ఇంతకుముందు మాదిరి వలె కొనసాగించాలి.
2015 నవంబర్ 17 వ తేదీన పేషంటు తనకు ప్రతీ రాత్రి 7 గంటల నిద్ర ఖచ్చితంగా పడుతోందని తన నిద్రలేమి వ్యాధి 100% తగ్గిపోయిందని చెప్పారు. మరో వారం డోస్ ను అదేవిధంగా కొనసాగించి తరువాత ఒక వారం పాటు 3TW మరో వారం పాటు 2TW అలా తగ్గించుకొంటురావలసిందిగా సూచించడమైనది.
పేషంటు వివరణ :
గత 10 సంవత్సరాలుగా నేను నిద్రలేమి సమస్యతో బాధపడుతూ జీవితం దుర్భరంగా మారి ఏ పనిమీద కూడాను ఏకాగ్రత నిలపలేని పరిస్థితి. రాత్రిళ్ళు నిద్ర పట్టక నాకు ఎదురయ్యే సమస్యలను ఎలా సాధించాలా అని పధకాలు వేసుకోవడం, ఉదయం అవి కార్యరూపం దాల్చక నీరసించి పోవడం. ఇలాంటి స్థితిలో మొదటిసారిగా వైబ్రియో రెమిడి తీసుకున్నప్పుడు తెల్లవారి 7 గంటల వరకు మెలుకువే లేదు. నా జీవితంలో అంత బాగా ఎప్పుడూ నిద్ర పోలేదు. రోజుకు అతికష్టం మీద 4 గంటలు (అది కూడా అదృష్టం కలిసొస్తేనే) నిద్ర పోవడం స్థితి నుండి విబ్రియోనిక్స్ మందులు తీసుకున్నాక 100%నయమయ్యి రోజుకు 7 గంటలు హాయిగా నిద్రపోయే స్థితికి చేరాను. ఎప్పుడయినా రాత్రిళ్ళు మేలుకొని ఉండాల్సిన పరిస్థితి వచ్చినా ఆ తర్వాత త్వరగానే నిద్ర పడుతోంది. రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు నిద్ర పోయే నాకు ఒక్కొక్క సారి ఉదయం 7.30 ఐనా మెలుకువ రాదు. నిద్ర లేచాకా ఎంతో హాయిగా ప్రశాంతంగా ఉంటోంది. వైబ్రియో రెమిడి వల్ల మరలా పాత సమస్య ఎప్పుడూ తలెత్తలేదు.
బిగిసుకుపోయిన భుజం 03504...UK
61 సంవత్సరాల మహిళ కుడి భుజము బిగిసుకు పోయినందుకు, కుడి చెయ్యి నొప్పికి నవంబర్ 3 న ప్రాక్టీషనర్ ను సంప్రదించింది. ఈ విధంగా సంవత్సరం నుండి ఇబ్బంది పడుతున్నప్పటికీ కేవలం మసాజ్ తెరపీ తప్ప మందులేమి తీసుకోలేదు. నొప్పికి కారణం ఏమిటన్నది తెలియలేదు. ఈమెకు ఇతర ఇబ్బందులు ఏమీ లేవు. ఆమెకు క్రింది రెమిడి ఇవ్వబడినది:
CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC20.2 SMJ pain + CC20.3 Arthritis + CC20.4 Muscle & Supportive tissue...TDS
మూడువారాల తర్వాత 2014, నవంబర్ 26 న తనకు 15 శాతం తగ్గినట్లు చెప్పారు. 2015 జనవరి 18 న 40 శాతం తగ్గినట్లు చెప్పారు. అనంతరం ఆమె రెండు నెలలకు సరిపడా మందులు తీసుకొని ఇండియా వచ్చారు. 2015 మార్చి 2 న తిరిగి వెళ్ళేనాటికీ ఆమెకు పూర్తిగా తగ్గిపోయింది కనుక ఆమె మందు మరికొంత కాలం వాడడానికి సుముఖంగా లేరు. కొన్ని నెలల తర్వాత అనగా 2015 డిసెంబర్ 9న ఆమె తన వ్యాధి పూర్తిగా తగ్గిపోయిందని మరల ఆబాధలు తలెత్త లేదని తెలిపారు.
చేతిపైన నొప్పి 02854...UK
2014 సెప్టెంబర్ 22 వ తేదీన 35 సంవత్సరాల మహిళ ఎడమ చేతి నొప్పి తో ప్రాక్టీషనర్ దగ్గరకు వచ్చారు. ఈ నొప్పి వారం రోజులుగా నరముదగ్గర నొప్పిగాను, మంటగాను, సూది తో గుచ్చుతున్నట్లు గానూ ఉంటోంది. దీనివల్ల ఆమె తన చేతిని ఉపయోగించ లేక ముఖ్యంగా వంటగదిలో చాలా అవస్థ పడుతున్నారు. చేతికి బ్యాండేజ్ తప్ప ఆమె మందులేమీ తీసుకొనలేదు.
ఆమెకు క్రింది రెమిడి ఇవ్వబడింది:
CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC18.5 Neuralgia...TDS
ప్రాక్టీషనర్ ఈ రెమిడిని నీటితో తీసుకోమని సూచించినా ఆమె గోళీల రూపంలో తీసుకున్నారు. రెండవ రోజుకల్లా ఆమె నొప్పి 50% తగ్గిపోయి కూరగాయలను కత్తిపీట పైన ఏమాత్రం ఇబ్బంది లేకుండా కోయగాలిగారు. 3 రోజులలో ఆమెకు నొప్పి 90% తగ్గిపోయింది కనుక రెమిడి ని BD మరో 4 వారాలు తీసుకోవలసిందిగా సూచించారు. 2015 జనవరిలో తనకి నొప్పి పూర్తిగా తగ్గిపోయిందని చెపుతూ వైబ్రియోనిక్స్ కు కృతజ్ఞత తెలియజేసారు.
కుక్క చెవిలో ఇన్ఫెక్షన్ 03527...France
టామ్ అనే పేరుగల 12½ సంవత్సరాల బెల్జియన్ షెఫర్డ్ జాతి మగ కుక్కకు ఎడమ చెవికి ఇన్ఫెక్షన్ వచ్చింది. దుర్వాసన తో కూడిన చీము చెవినుండి కారసాగింది. కుక్క యజమాని రెండు రోజులవరకూ ఈ విషయం గుర్తించలేనందున 3 వ రోజు అనగా 2015 జూలై 9 న ప్రాక్టీషనర్ ను కలిసారు. టామ్కు క్రింది రెమిడి ఇవ్వబడింది:
CC1.1 Animal tonic + CC5.1 Ear infections...QDS, నీటితో
ప్రాక్టీషనర్ సిరెంజి ద్వారా మందును నేరుగా టామ్ నోట్లో వేశారు. మెగ్నీసియం క్లోరైడు ద్రావణం తో ట్రీట్మెంట్ మొదలు పెట్టిన మొదటి రెండురోజులు కుక్క చెవిని శుభ్రం చేసారు. వేరే ఇతర వైద్యం ఏమీ చేయలేదు. రెండవ రోజుకే టామ్ చెవిలో చీము స్రవించడం ఆగిపోయి దాని ఆరోగ్యం మెరుగయ్యింది. కనుక డోసేజ్ ను TDS కు తగ్గించారు. 8 రోజులకు టామ్ కు పూర్తిగా తగ్గిపోయింది. ఐతే మరో 3 వారాల వరకు డోసేజ్ ను OW గా తీసుకోవలసిందిగా సూచించారు.
నిరంతరాయంగా ఫ్లూ మరియు దగ్గు 02899...UK
ఒక 64 సంవత్సరముల జూనియర్ ప్రాక్టీషనర్ కు 2015 అక్టోబర్ 17 సాయంత్రం నుండి గొంతుమంట, లోజ్వరంవచ్చాయి. ఐతే వీరు క్రింది వింటర్ రెమిడిని అక్టోబర్ 1 నుండి ఫ్లూ మరియు చాతి ఇన్ఫెక్షన్ నిమిత్తం తీసుకుంటున్నప్పటికీ ఈ ఇబ్బంది తలెత్తింది:
CC9.2 Infections acute + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC19.1 Chest tonic + CC19.3 Chest infections chronic + CC19.5 Sinusitis + CC19.6 Cough chronic + CC19.7 Throat chronic…OD
వీరు డోసేజ్ ని పెంచి ఆరోజు సాయంత్రం వరకు రెండు సార్లు చొప్పున తీసుకొని మరునాటి నుండి 6TD గా తీసుకోవడం ప్రారంభించారు. అదే సమయంలో వీరు OTC (ఓవర్ ది కౌంటర్ )గా అలోపతి మందులు పారాసిటమల్ ను జ్వరానికి, లెంసిఫెర్ ను జలుబు మరియు ప్లు కు తీసుకోసాగారు. 10వ రోజుకు వీరికి ఇంకా వదలకుండా వేధిస్తున్న స్వల్ప ముక్కు దిబ్బడ అప్పుడప్పుడు వచ్చేదగ్గు తప్ప 90%నయమయ్యింది. OTC మందులను ఆపేసి వైబ్రో రెమిడి ని ODకి తగ్గించారు.
ఐనప్పటికీ వీరికి 2015నవంబర్ 22 న స్వల్పంగా గొంతుమంట తిరిగి కలిగింది. వెంటనే డోసేజ్ ను 6TD కు పెంచారు. రెండవ రోజు బాగానే ఉంది కానీ మర్నాడు ఫ్లూ జ్వరం తో బాటు తనని నిద్రకూడా పోనీకుండా విపరీతమైన దగ్గు ప్రారంభమయ్యింది. దీనితో వీరు లెంసిఫెర్ కూడా 3 పూటలా తీసుకోసాగారు. వీరు తీసుకునే వింటర్ రెమిడి పరిస్థితి మరీ విషమించకుండా కాపాడుతున్నట్లు వీరికి అనిపించింది. ఇంకా వీరికి ఆకలి నీరసం కూడా పెరిగాయి
2015 డిసెంబర్ 4వ తేదీన వీరు డాక్టర్ను కలిసి వారి సూచనపైన కొన్ని పరీక్షలు చేయించుకున్నారు. డాక్టర్ వీరిని లెంసిఫెర్ వేసుకోవడం కొనసాగించమని పరిస్థితి విషమిస్తే వెంటనే వచ్చి తనను కలవాలని సూచించారు. మర్నాటికి పరిస్థితి దయనీయంగా తయారవుతూ ఇతనికి కళ్లివెంట కొద్దిగా రక్తం కూడా రాసాగింది. డిసెంబర్ 7వ తేదీన డాక్టర్ పరీక్షించి ఛాతీ లోనూ గొంతు లోనూ ఇన్ఫెక్షన్ ఏమీ లేదని చెప్పి ఇతని దగ్గుకు, సైనస్ కు అమక్సిసిలిన్ ఆన్టిబయాటిక్ ఇచ్చారు. 3 రోజుల తర్వాత దగ్గు 50% తగ్గడం తోపాటు నీరసం కూడా నెమ్మదించి శక్తి చేకురినట్లు అనిపించింది. కానీ దగ్గుతో పాటు రక్తం పడటం మాత్రం పెరుగుతూనే ఉంది. డాక్టర్ డిసెంబర్ 14 న వైరల్ ఇన్ఫెక్షన్ వల్లనే ఈ ఇబ్బంది వచ్చినట్లు చెప్పారు.
ఒక సీనియర్ ప్రాక్టీషనర్ 02802...యుకె వీరి కళ్లి లేదా కఫం శాంపిల్ తీసుకొని 1M పోటెన్సీ లో నోసోడ్ తయారు చేసి ఇచ్చారు. వీరు మిగతా అన్ని మందులు మానేసి దానిని డిసెంబర్ 15 నుండి రోజుకు రెండు సార్లు తీసుకోవడం ప్రారంభించారు. రెండవ రోజుకు 25%నయమనిపించింది. నోసోడ్ ను QDS గా తీసుకోవడం ప్రారంభించారు. రెండవ రోజుకు 50% మరియు 5 రోజుల తరువాత90%మెరుగయ్యి కళ్లి వెంట రక్తం పడడం పూర్తిగా తగ్గిపోయింది. ఆ విధంగా నోసోడ్ ను QDS గా డిసెంబర్ 31వరకూ కొనసాగించే సరికి 99%మెరుగుదల కనిపించింది. తరువాత డోసేజ్ ను BD గానూ జనవరి 15 వరకూ OD అనంతరం జనవరి 29 నాటికి పూర్తిగా ఆపాలని నిర్ణయించారు.
జలుబు, దగ్గు మరియు జ్వరము 11520...India
ఏప్రిల్ 18 వ తేదీన 32 సంవత్సరాల వ్యక్తి జలుబు, ఫ్లూ తో బాధ పడుతూ అత్యవసర స్థితి లో ప్రాక్టీషనర్ వద్దకు వచ్చారు. అతనికి జ్వరము102 F (38.9 C) ఉంటోంది మరియు అతనికి 3 గంటల నుండి వణుకు వస్తోంది, తుమ్ములు,దగ్గు కూడా వస్తున్నాయి. అతను వేరే మందులేవి వాడలేదు. వైబ్రో రెమిడి తీసుకొని తగ్గిన తర్వాత పక్కనే ఉన్న నగరంలో ఒక అధికారిక మీటింగ్ కు హాజరుకావాలని వచ్చారు.
అతనికి క్రింది రెమిడి ఇవ్వబడింది:
CC9.2 Infections acute + CC15.1 Mental & Emotional tonic + CC19.6 Cough chronic…ప్రతీ పది నిమిషాలకు 1 డోస్
గోళీల రూపంలో 3 డోసులు ఇంట్లోనే తీసుకున్నతరువాత అతనికి చాలావరకు తగ్గిపోవడంతో రెమిడి వెంట తీసుకెళ్లకుండానే తన అధికారిక కార్యక్రమాలకు హాజరయ్యారు. 24 గంటల తర్వాత ప్రాక్టీషనర్ కు ఫోన్ చేసి కేవలం 4 గంటల లోనే తనకు 100%నయంయ్యిందని జ్వరము, వణుకు, జలుబు, దగ్గు అన్నీ పూర్తిగా తగ్గిపోయాయని తన డ్యూటీ సక్రమంగా చేసుకోగలుగుతున్నానని ఆనందంతో తెలియజేసారు.
పునరావృత దీర్ఘకాలిక వినాళ గ్రంధుల వాపు (Chronic Recurrent Tonsillitis) 11567...India
2015 మార్చి 27 వ తేదీన 4 సంవత్సరములుగా తరుచుగా వచ్చే ఫోల్లికులర్ వినాళ గ్రంధుల వాపుతో బాధపడే 8½ సంవత్సరముల బాబును అతని తల్లి చికిత్సానిపుణుడి వద్దకు తీసుకొని వచ్చారు. నెలకు రెండు సార్లు వచ్చే ఈ వ్యాధి వచ్చినపుడు బాబు గొంతు నొప్పి, వాపు వల్ల ఏమీ మింగలేడు. దీని నిమిత్తం నెలకొకసారి అల్లోపతిక్ యాంటిబయోటిక్స్ తీసుకుంటున్నాడు.
2015 ఏప్రిల్ 3న క్రింది రెమిడితో అతనికి వైద్యం ప్రారంభమయ్యింది:
#1. CC12.2 Child tonic + CC15.1 Mental and Emotional tonic + CC19.7 Throat chronic…TDS
9 రోజుల వరకు బాబుకు యాంటిబయోటిక్స్ తీసుకోక పోయినప్పటికీ ఈ వ్యాధి లక్షణాలు తిరిగి రాలేదు. ఐతే ప్రాక్టీషనర్ మరొక సీనియర్ వైబ్రో నిపుణుడితో చర్చించి గతంలో వార్తాలేఖలో ఇటువంటిదే ఒక కేసులో (Chronic Tonsilitis10741…India, జూలై/ఆగస్ట్ 2014: సంపుటము 5, సంచిక 4) ఇచ్చిన రెమిడిని ఇచ్చారు:
#2. CC9.2 Infections acute + CC17.3 Brain and Memory tonic + #1…TDS
బాబుకు చక్కగా తగ్గిపోయి 2015 ఆగస్ట్ వరకు తిరిగి వ్యాధి తలెత్తక పోయేసరికి ఆ తల్లి బిడ్డల ఆనందానికి అవధులు లేవు. ఆ తర్వాత బాబు తల్లి తన ఉద్యోగ బాధ్యతల్లో పడిపోయి మందు సక్రమంగా ఇవ్వకపోవడంతో బాబుకు ఆగష్టు 28న గొంతుమంట నొప్పి వచ్చాయి. బాబు తల్లి #2 ను నీటితో పదినిమిషాల కొకసారి చొప్పున రెండు గంటల వరకు ఆ తర్వాత వారం వరకు 6TD ఇచ్చారు. 5 రోజులలో బాబు చక్కగా కోలుకున్నాడు. ఆ తర్వాత #2…TDS. గా ఇవ్వబడింది.
2015 డిసెంబర్ 5న బాబు తల్లి 6 రోజుల క్రితం మందులు ఐపోయాయని కానీ తాను బిజీగా ఉండడంతో వెంటనే వచ్చి తీసుకోలేక పొయానని బాబుకు మాత్రం ఏ ఇబ్బంది లేకుండా పూర్తిగా తగ్గిపోయిందని చెప్పారు. ప్రాక్టీషనర్ అలా చెయ్యకూడదని గట్టిగా చెప్పి తిరిగి రెమిడి ఇచ్చిTDS. గా వాడమని చెప్పారు. 2015 డిసెంబర్ 20 నుండి BD గా డోసేజ్ ఇవ్వాలని నిర్ణయించారు. రెమిడి ఇచ్చిన నాటినుండి బాబుకు ఒక్కసారి కూడా యాంటిబయోటిక్స్ఇవ్వకుండానే పూర్తిగా తగ్గిపోవడంతో బాబు తల్లి వైబ్రియోనిక్స్ కు స్వామికి ఆనందంతో కృతజ్ఞతలు తెలియజేసారు.
దీర్ఘకాలిక పక్క తడిపే వ్యాధి 11567...India
2015 మార్చి 29వ తేదీన 5 సంవత్సరాల బాబును దీర్ఘకాలిక పక్క తడిపే వ్యాధితో ప్రాక్టీషనర్ వద్దకు తీసుకొనివచ్చారు. ఈ వ్యాధి 2 సంవత్సరాల నుండి ఉన్నప్పటికీ బాబు పెద్దవాడయ్యే కొద్దీ నయమైపోతుందని తలిచారు. ఈ బాధ శీతాకాలంలో మరి ఎక్కువగా ఉండి ప్రతీరోజూ పక్క తడుపుతూనే ఉంటాడు. వేసవిలో వారానికి సుమారు రెండు సార్లు తడుపుతూ ఉంటాడు. ఈ బాబు చాలా చురుకైన విద్యార్ధి. మానసికముగా గానీ శారీరకంగా గానీ ఇతర సమస్యలు ఏమీ లేవు. ఇతని తల్లిదండ్రులు బాబును ఎవరిదగ్గర చూపించ లేదు, ఏ మందులు వాడలేదు. ప్రాక్టీషనర్ బాబును పడుకొనే ముందు నీరు తాగవద్దని చెప్పి క్రింది రెమిడి ఇచ్చారు.
CC13.3 Incontinence + CC15.1 Mental and Emotional tonic…TDS
2015 ఏప్రియల్ 8వ తేదీన వాడడం ప్రారంభించిన నాటినుండి వ్యాధి తగ్గుముఖం పట్టిందని ఈ పది రోజులలో పక్కతడిపేటువంటి ఇబ్బంది ఏమీ రాలేదని బాబు వాళ్ళ నాయనమ్మ చెప్పింది. ఈడోస్ ను TDSగా కొనసాగించమని సూచించారు. తరువాత రెండు నెలల్లో నెలకు ఒక్కసారిమాత్రమే బాబు పక్క తడిపాడని వారు చెప్పారు. ఇది ఒక గతంలో వలె వేసవిలో వారానికి రెండు సార్లు పక్క తడిపే దానితో పోలిస్తే గణనీయమైన అభివృద్ధి. వాళ్ళ నాయనమ్మ బాబును చల్లని వాతావరణమునకు గురికాకుండాను, పడుకొనే ముందు నీళ్ళు త్రాగడం మాన్పించడం వంటివి కొనసాగించింది. ఆమె సూచన మేరకు 2015 జూలై నుండి డోసేజ్ ను BD కి తగ్గించడం జరిగింది. మరుసటి నెలలో బాబు ఒక్కసారి కూడా పక్క తడపలేదు.
2015 ఆగస్టు 20వ తేదీన బాబు అమెరికా వెళ్ళిపోయాడు. సెప్టెంబర్ 5 నుండి డోసేజ్ ను రాత్రిపూట OD గా తీసుకోవాలని సూచించారు. 2015 నవంబర్ 24న నాయనమ్మ బాబుకు పూర్తిగా తగ్గిపోయిందని ఇప్పుడు పక్క తడపడం లేదని చెప్పారు. ఐనప్పటికీ అది చలికాలం కనుక అమెరికాలో చలి ఎక్కువ కనుక నివారణ డోసేజ్ OD గా తీసుకోవాలని సూచించడమైనది. 2015 డిసెంబర్ 24 నుండి కుటుంబ సభ్యుల సూచన పై డోసేజ్ మరింత తగ్గించడం జరుగుతుంది. సాయివైబ్రియోనిక్స్ వైద్యం వల్ల తమకు ఎంతో మేలు జరిగిందని ఆ కుటుంబ సభ్యులు అనందం వ్యక్తం చేసారు.
డెంగ్యు జ్వరము 01228...Slovenia
2015 జూలై నెలలో 19 సంవత్సరముల యువతి పుట్టపర్తి ని సందర్శిస్తున్న సందర్భంలో ఒక దోమ కాటు వల్ల ఎడమ కాలు వాచి ఆ ప్రాంతం ఎర్రగా మారి దురద పెట్టసాగింది. ఆ మచ్చ కొన్ని రోజులు అలానే ఉండిపోయింది. అది వర్షాకాలం కావడం వల్ల ఇది సహజమేనని ఒక్క దోమకాటు వల్ల వచ్చే నష్టమేమి లేదని భావించింది. 3-4 రోజుల తరువాత ఆమెకు విపరీతంగా జ్వరము, నీరసం, కీళ్ల దగ్గర నొప్పి, తలపోటు, కడుపులో తిప్పడం వల్ల వాంతులు వంటి లక్షణాలన్నీ కలిగాయి. నీరసం వల్ల ఎటూ కదల లేక ఇంట్లోనే మరో 3 రోజులు ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. వ్యాధి నయం చేసుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితము కలగకపోయే సరికి హాస్పిటల్లో చూపించుకున్నారు. రిపోర్టుల ద్వారా ఆమెకు డెంగ్యు అనీ రక్త మార్పిడి చేయించుకోవాలని సూచించారు. కానీ అందుకు నిరాకరించి ఆమె స్నేహితులకు వైబ్రో రెమిడిలతో నయమవడం చూసి వైబ్రియోనిక్స్ మందులు తీసుకున్నారు.
ఆమెకు క్రింది రెమిడి ఇవ్వబడింది:
#1. CC9.2 Infections acute + CC11.3 Headaches + CC21.4 Stings & Bites…పరిస్థితి ఆందోళనకరంగా ఉంటే ప్రతీ గంటకు ఒకసారి
#2. CC3.2 Bleeding disorders + CC4.6 Diarrhoea + CC9.2 Infections acute + CC9.3 Tropical diseases + CC10.1 Emergencies + CC12.4 Autoimmune diseases + CC20.4 Muscles & Supportive tissue…TDS
#3. Potentised Gold & Ruby 30C + Potentised Amethyst & Platinum 30C…OD
మర్నాటికి ఆమెకు వ్యాధి చాలా వరకూ నయమనిపించింది. జ్వరం ఇంచుమించు పూర్తిగా తగ్గిపోయింది. అల్పాహారం తీసుకున్నప్పటికీ వాంతి కాలేదు. 3 రోజులకు ఆమెకు 50% నయమయ్యే సరికి తను దేనినిమిత్తం వచ్చారో అట్టి ప్రపంచ వైబ్రో సదస్సు కు కూడా హాజరయ్యారు.
అదనంగా ఆమెకు క్రింది రెమిడి కూడా ఇవ్వబడింది:
#4. CC9.1 Recuperation + CC12.1 Immunity + CC20.2 SMJ pain…TDS
వారం రోజులకే ఆమెకు 70 % తగ్గిపోవడంతో తిరిగి తన దేశానికి వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఆమెకు నీరసం మాత్రమే ఉంది ఐతే ఈ రెమిడిల వల్ల నీరసం కూడా తగ్గిపోతుందనే విశ్వాసం ఏర్పడింది.
చికిత్సా నిపుణుల వివరాలు 01228...Slovenia
ప్రాక్టీషనర్ 01228…స్లోవేనియా సీనియర్ వైద్యనిపుణులైన వీరి వైబ్రియోనిక్స్ ప్రస్థానం 1996లో తన వ్యక్తిగత అనుభవం అనంతరం ప్రారంభమయ్యింది. వైబ్రియోనిక్స్ పట్ల వీరికెంతో ఆదరణ కలిగి తన స్లోవేనియా దేశం వెళ్ళిన తర్వాత ఎంతో సేవ చేసారు.(వివరాల కోసం సాయి వైబ్రియోనిక్స్ అంతర్జాతీయ కాన్ఫెరెన్స్ 2014 పుస్తకం 73 -78 పేజీలు చూడండి) చిన్నప్పటినుండి ఈమె జీవితం అనారోగ్యముతోనూ అనేక దుర్ఘటనలుతోనూ ప్రారంభమయ్యింది. రెండు కారుప్రమాదాలు, పక్కటెముకలు విరిగిపోవడం, వెన్నుముక శోధము(స్పోండ్ లైటిస్) అపస్మారక స్థితి, ఎన్నో ఆపరేషన్లు, డిప్రెషన్, చికెన్గున్యా, చిన్నప్పటినుండి దగ్గర చూపు లోపించడం ఇలాంటివి ఎన్నింటితోనో ఆమె సతమతమవుతూ ఉండేది. 2002 -04 మధ్య 14 నెలలు ఆమె హాస్పిటల్లోనే ఉండవలసి వచ్చినపుడు చాల స్ట్రాంగ్ అల్లోపతిక్ మందులు తీసుకోవలసి వచ్చింది. డాక్టర్లు ఆమె తిరిగి కోలుకోవడం కష్టమని కూడా అన్నారు. స్లోవేనియా మెడికల్ బోర్డు వారు ఆమెకు 30% వైకల్యము ఉన్నట్లు సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. ఆ సమయంలో అనువాదకురాలుగానూ ఉంటున్నఈమె తన వృత్తిని కూడా వదిలి పెట్టవలసి వచ్చింది. కారణం ఏమిటంటే ఆమె శరీరం 5% మాత్రమే పనిచేయడానికి సహకరిస్తోంది.
ఇలాంటి దయనీయ పరిస్థితిలో ఉన్న ఆమె జీవితములో వెలుగు రేఖలు ఉదయించాయి. ఆమె అనుభవించిన కష్టాలు వృధాగా పోలేదు. నెలల తరబడి హాస్పిటల్లో నిస్సహాయురాలుగా ఉన్న ఆమె జీవితములో బాబా ప్రవేశించి ఆమెను ప్రశాంతినిలయం మరలించారు. ఆమె మాటల్లోనే “ నేనున్న పరిస్థితిలో స్వామీయే నాకు దిక్కు. వారి అనుగ్రహంతో ఇండియా చేరాను. 6 నెలలు ప్రశాంతినిలయంలో గడుపుదామని బయలుదేరినపుడు నా సూట్కేస్ లో సగం అల్లోపతిక్ మందులతోనే నిండినది. ఈ మధ్య కాలంలోనే నేను వాడిన ఒక పెద్దసూట్ కేస్కు సమానమైన మందులు నాలో చాలా సైడ్ ఎఫెక్ట్ కలిగిస్తున్నాయి. నాకు వేరే ప్రత్యామ్నాయ వైద్య పద్ధతులను గురించి ఆలోచించే ఓపిక లేదు. నమ్మశక్యం కాని అద్భుతమైన లీల ఏమిటంటే ఇండియాలో నేను వాడే మందులు దొరకవని వత్తిడి చేసిన మా డాక్టర్ సలహా మేరకు అన్నిరకాల మందులు తెచ్చుకున్నప్పటికీ పుట్టపర్తిలో నా రూములో సూట్ కేస్ తెరిచి చూసేసరికి మందులన్నీ మాయమైపోయి ఉన్నాయి. ఇకనుండి అల్లోపతి మందులు జోలికి పోకుండా వైబ్రియో రెమిడిల వంటి ప్రత్యామ్నాయ మందులు మాత్రమే వాడమని అది స్వామి నాకు ఇచ్చిన సూచనగా భావించాను”.
ఆమె ఎన్నోరకాల ప్రత్యామ్నాయ వైద్య పద్ధతులు ప్రయత్నించారు కానీ అన్నింటికన్నా వైబ్రియోనిక్స్ అద్భుతంగా పనిచేస్తున్నట్లు అనుభవమయ్యింది. వైబ్రియో మందులు ప్రయత్నించిన 4 సంవత్సరాలలో దృష్టిలో 60% వృద్ధి కనిపించింది. మిగతా శారీరక సమస్యలలో 80% మెరుగుదల కనిపించింది. ఆమె తనకు వ్యాధి నివారణ ఐనందుకు ఎంతో ఆనందించి ఇక తన జీవితాన్ని తనలా వ్యాధితో ఇబ్బంది పడుతున్న వారి సహాయం కోసం అందించాలని నిర్ణయించుకున్నారు.
ప్రాక్టీషనర్ గా ఆమెకుఉన్న14 సంవత్సరాలు అనుభవంతో వైబ్రియో మెడికల్ క్యాంపులను సొంతంగా నిర్వహించే అనుభవం సంపాదించారు. ఆమె తన భర్తతోకలసి 90 క్యాంపులలో 20,000 మంది పేషంట్లను చూడడం జరిగింది. అలా నిర్వహించిన క్యాంపులలో కొన్ని అతి సుదూర హిమాలయ ప్రాంతాలలోని గ్రామాలు కూడా ఉన్నాయి. ప్రారంభంలో ఆమె ఒక సమగ్రమైన నోట్స్ వ్యక్తిగతమైన రెమిడిలను తయారుచేసేవారు. త్వరలోనే ఆమె పేషంట్లను అందరినీ చూడడానికిగాను తగినంత సమయం ఉండడం లేదని నోట్స్ తయారు చేయడం మానివేసి ముందు రోజే 108 CC బాక్స్ లోని బాటిల్లను సరి చూసుకొని తక్కువగా ఉన్నవాటిని నింపుకొని ఎక్కువగా వాడబడే 3 రెమిడి సమ్మేళనాలను తయారు చేసుకొని క్యాంపుకు వెళ్ళేవారు.
వంటినొప్పులకు :
CC3.1 Heart tonic + CC10.1 Emergencies + CC20.1 SMJ tonic + CC20.2 SMJ pain + CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue + CC20.5 Spine + CC20.7 Fractures + CC12.1 Adult tonic ఇది అవసరాన్ని బట్టి పెద్దవారికి ఇవ్వబడేది
జలుబు/ఫ్లూ వంటి వాటికి:
CC9.1 Recuperation + CC9.2 Infections acute + CC19.1 Chest tonic + CC19.3 Chest infections chronic + CC19.5 Sinusitis + CC19.6 Cough chronic + CC19.7 Throat chronic
విద్యార్ధులకు:
a. CC12.2 చిన్నపిల్లలకు మరియు b. CC17.3 Brain & Memory tonic పెద్ద పిల్లలకు
ప్రాక్టీషనర్ కు పిల్లలతో కలసి పనిచేయడం చాలా ఇష్టం. వీరు ఇలా వ్రాస్తున్నారు “ పిల్లలకు వారి లేత వయసులోనే సమర్దవంతమైన, ఎటువంటి దుష్ప్రభావాలు లేని వైబ్రియోనిక్స్ రెమిడిలను ఇవ్వడం మంచిదని నా ధృడమైన విశ్వాసము. వారు ఇంకనూ ఏ వైద్య విధానానికి బహిర్గతమై ఉండరు కనుక వారు ఈ వైద్య విధానము యొక్క అద్భుత ఫలితాలను జీవితాంతము గుర్తుంచుకొని తమ కుటుంబ సభ్యులకు ఇతరులకు వ్యాపింపజేస్తారు. అందుకోసం వారి వారి పాఠశాలలలో తరుచుగా వైబ్రో మెడికల్ క్యాంపులు నిర్వహించడం ద్వారా ఈ అద్భుత విధానము పట్ల వారి విశ్వాసము మరింత పెంపొందింపజేయబడుతుంది.
ఒక ముఖ్యమైన సంఘటనను ఇలా తెలియజేస్తున్నారు. “జూన్ 2015 నెలాఖరులో నేను వేదం నేర్పే పాఠశాలలో ఒక పిల్లవాడు డెంగ్యు జ్వరం వల్ల మరణించడం నన్ను తీవ్రంగా కలిచివేసింది. నేను వెంటనే ఏదో ఒకటి చేసి ముఖ్యంగా చిన్నారులలో ఈ ప్రాణాంతకమైన వ్యాధి వ్యాపించకుండా అరికట్టాలని భావించాను.
పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఏదైనా నివారణ మందు ఇచ్చి ఈ వ్యాధి ఇతర పిల్లలకు వ్యాపించకుండా అరికట్టవచ్చా అని అడిగారు. చాలామంది అప్పటికే జ్వరము, ఫ్లూ, జలుబు వంటి వాతావరణ మార్పుకు సంబధిత వ్యాధులతో బాధ పడుతున్నారు. ఇటువంటి సేవ కోసమే ఎదురు చూస్తున్న నేను వెంటనే కార్యరంగంలోనికి ప్రవేశించాను. ఎందుకంటే ఆరేళ్ళ క్రితం నేను ఈ వ్యాధి తోనే ఎంతో బాధననుభవించాను. అల్లోపతిమందుల వల్ల చికెన్గున్యా, డెంగ్యు తగ్గవచ్చేమో కానీ జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రూపంలో అవి తిరిగి తలెత్తే అవకాశము ఉంది. గత సంవత్సరం ఐదుగురు పేషంట్లకు డెంగ్యు జ్వరమును నివారణ చేసిన అనుభవాలను పురస్కరించుకొని వైబ్రియోనిక్స్ ఈ వ్యాధికి దివ్య సంజీవని అని భావించి నా భర్తతో కలసి రెండు సెట్ల నివారణామందులను (ప్రివెంటివ్ )తయారు చేశాను. కొంచం చిన్న వయసు గల పిల్లలకు వారి ఉపాధ్యాయుల ద్వారా క్రింది రెమిడి ఇప్పించాను:
#1. CC3.2 Bleeding disorders + CC9.2 Infections acute + CC9.3 Tropical diseases + CC10.1 Emergencies + CC12.1 Immunity + CC12.2 Child tonic + CC20.4 Muscles & Supportive tissue + CC21.4 Stings & Bites + Potentised Gold & Ruby 30C + Potentised Amethyst & Platinum 30C…BD
పిల్లలు ఉదయం పాఠశాలకు వచ్చినప్పుడు మరియు తిరిగి వెళ్లేముందు రెమిడి తీసుకొనేవారు. బాటిల్స్ ను వారి ఇంటికి మాత్రం ఇవ్వలేదు ఎందుకంటే ఈ షుగర్ గోళీలను మిఠాయి గా భావించి తినేస్తారేమోననే భయంతో.
పెద్ద పిల్లలకు సొంతంగా బాటిల్స్ ఇవ్వబడ్డాయి (వారికి వైబ్రో మందులు తీసుకోవడం అలవాటేనని).
#2. CC 3.2 Bleeding disorders + CC 9.2 Infections acute + CC9.3 Tropical diseases + CC10.1 Emergencies + CC12.1 Immunity + CC12.4 Autoimmune diseases + CC17.3 Brain & Memory tonic + CC20.4 Muscles & Supportive tissue + CC21.4 Stings & Bites + Potentised Gold & Ruby 30C + Potentised Amethyst & Platinum 30C…BD
ఇంకా దోమకాటుకు సరియైన చికిత్సపైన విద్యార్ధులకు అవగాహన కలిగించుటకు ప్రత్యేక ప్రయత్నంకూడా వీరు చేసారు. దోమకాటులన్నీ ప్రాణాంతకమైనవి కావు. దోమకాటు వల్ల శరీరం ఎర్రబడినా, దురద ఉన్నా, వాపు ఉన్నా అటువంటి వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. గర్భవతులైన వారు 4 నుండి 7 రోజులు వైబ్రోరెమిడిలను నివారణ డోస్ గా తీసుకుంటే సరిపోతుంది. 800 పైగా విద్యార్ధులు మరియు పెద్దవారు డెంగ్యు జ్వరానికి మరియు ఇతర వ్యాధికారక లక్షణాలకు నివారణ డోసులు తీసుకున్నారు. ప్రతీ పాఠశాలలోనూ ఉన్న ఉపాధ్యాయులకు ఎవరైన విద్యార్ధికి డెంగ్యు వ్యాధి లేదా ఇతర అంటు వ్యాధి సోకినట్లుంటే వెంటనే తెలియపరచవలసిందిగా సూచించారు. తమ వద్ద వివిధరకాల వ్యాధులకు మంచి మందులున్నవని ముఖ్యంగా వ్యాధి నిర్ధారణ గావించిన వెంటనే వాడితే తొందరగా నివారణ ఔతుందని వారికి నమ్మకం కలిగించారు.
2009నుండి బాబా వారి పుట్టిన రోజు సందర్భంగా 3 రోజుల వైబ్రో క్యాంప్ ను ప్రశాంతినిలయం రైల్వే స్టేషన్లో ప్రతీ సంవత్సరం నిర్వహిస్తూ గత 7 సంవత్సరాల నుండి సుమారుగా 850 మంది పేషంట్లకు వైద్యం అందించారు. వై బ్రియోనిక్స్ వీరి జీవితంలో ఎంత అంతర్భాగం అయ్యిందంటే సమాజములోని అందరినీ అనగా ఆశ్రమం బయట ఉండే పువ్వులు అమ్ముకునే మహిళలు, భిక్షగాళ్ళు, ఇలా ఎందరో తమకు ఏ ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే “సంప్రదించాల్సిన వ్యక్తి” గా ఐపోయారు. దీనికంతటికీ కారణం స్వామి ప్రేమను క్రియా రూపంలో చూపడం ద్వారా నిస్సహాయులకు సహాయం చేయడం ద్వారా, స్వామి అనంత ప్రేమకు వాహకంగా పనిచేసినందుకు లభించిన ఆనందం అని భావిస్తున్నారు.
తన వ్యక్తిగత అనుభవము, మెడికల్ క్యాంపులలో వేలాది మందికి వ్యాధి నివారణ అనుభవముతో వైబ్రియోనిక్స్ రెమిడిలతో తగ్గని వ్యాధి అంటూ ఏదీ లేదనే నిర్ధారణకు వచ్చారు. అంతేకాకుండా వైబ్రో మెడికల్ క్యాంపులు నిరుపేదలకు, నిస్సహాయులకు సహాయం అందించడానికి ఒక చక్కని వేదికగా వీరు భావిస్తున్నారు. జన బాహుళ్యము ఉన్న ప్రతీ చోటా ఒక వైబ్రియో ప్రధమ చికిత్స పెట్టె ఉండాలనే వీరి ఆశయం స్వామి ప్రేమకు పరాకాష్టగా వీరి ఉదాత్త స్వభావమునకు నిదర్శనంగా భావించవచ్చు.
ప్రశ్నలు సమాధానాలు
1. ప్రశ్న: ప్రాక్టీషనర్ తీవ్ర అనారోగ్యముతో (acutely sick) తో ఉన్నప్పుడు పేషంటును చూడవచ్చా?
జవాబు: ఔను, ఐతే అతడి వ్యాధి అంటువ్యాధి కాకుండా ఉండాలి. తను పూర్తిగా అలసి పోయినట్లు కూడా ఉండరాదు. ముఖ్యంగా గమనించ వలసిన అంశం ఏమంటే అతని మనసు స్పష్టంగా ఆలోచించగల స్థితిలో ఉండాలి.
_____________________________________
2. ప్రశ్న: రెండు SRHVP మిషన్లు ఒకే దగ్గర ఉంచవచ్చా?
జవాబు: ఔను ఇది అంగీకరించబడునట్టి విషయమే. ఐతే గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే ఒకసారి రెమిడి తయారుచేసిన తర్వాత ఆ మందు SRHVP నుండి 25 సెం.మీ లేదా (10అంగుళాలు) దూరంగా ఉండాలి. అలా లేకపోయిన ట్లయితే ఆ మిషన్లో ఉన్న అయస్కాంతం రెమిడిని తటస్థపరుస్తుంది. అలాగే 108CC బాక్స్ కూడా ఈ మిషన్ కి 25 సెం.మీ. దూరంగా ఉండాలి.
________________________________________
3. ప్రశ్న: పేషంట్లు అందరికీ పులౌట్ అనుభవమౌతుందా ?
జవాబు: లేదు, రెమిడి తీసుకునే ముగ్గురిలో ఒకరికి మాత్రమే అనుభవమౌతుంది. చాల మంది పేషంట్లకు పులౌట్ జరిగినట్లు కూడా తెలియనంత నెమ్మదిగా జరుగుతుంది. మరికొందరిలో వ్యాధి వల్ల శరీరంలోని అసౌకర్యం ఈ పులౌట్ ను మరుగు పరుస్తుంది. కనుక సుమారు నలుగురిలో ఒకరికి మాత్రమే గుర్తింపదగిన పులౌట్ కలుగుతుంది.
________________________________________
4. ప్రశ్న: పిల్లలకు పులౌట్ అనుభూతి ఎందుకు కలగదు?
జవాబు: చిన్న పిల్లలకు వారి శరీరములో విషపదార్ధాలు ఎక్కువ ప్రోగుపడి ఉండవు కనుక పులౌట్ అనుభూతిని పొందలేరు. వారు పెద్దయిన కొద్దీ తల్లిదండ్రులు ఆరోగ్యకరమైన ఆహారము, ఉత్ప్రేరకం కలిగించని పదార్ధాలను ఇస్తూ సంతులిత జీవనం గడిపేలా ప్రోత్సహించాలి. అలాగే పిల్లలు చూసే కంప్యుటర్, సినిమాలు, టి.వి.ప్రోగ్రాములను కూడా గమనిస్తూ ఉండాలి.
________________________________________
5. ప్రశ్న: నలుపు తెలుపు ఫోటోను ప్రసార మాధ్యమంగా ఉపయోగించవచ్చా?
జవాబు: కొందరు ప్రాక్టీషనర్లు కలర్ ఫోటోనే ఉత్తమమైనదిగా భావిస్తారు. ఈ విషయంలో నిర్ణయాత్మకమైన పరిశోధన జరగలేదు. ఐతే ఉపయోగించే ఫోటో గ్రూపుఫోటో నుండి కత్తిరించినట్టిది కాక వ్యక్తిగతమైనదిగా ఉండాలి.
________________________________________
6. ప్రశ్న: వైబ్రో రెమిడిలను నీటితో తీసుకునే సందర్భంలో ఆ నీటిలో క్లోరిన్ కలిపి ఉంటే (ఒక్కొక్కసారి దీని వాసన భరింపరానిదిగా ఉంటుంది) అది రెమిడిల వ్యాధినిరోధక శక్తిని తగ్గిస్తుందా? ఈ ప్రశ్న అడగడంలో నా ఉద్దేశ్యము నీరు కాకుండా ఆహారం తీసుకున్న 20 నిమిషాల వరకు మనం తిన్న రకరకాల ఆహార పదార్ధాలు వాటి తాలుకు వైబ్రేషనలు మనం తీసుకున్న రెమిడిలను శూన్యం చేస్తాయని నా అభిప్రాయము.
జవాబు: మనకున్న లోకజ్ఞానం లేదా విషయ పరిజ్ఞానం అనుసరించి రసాయనిక సంకలనాత్మక పదార్ధాలు వైబ్రో రెమిడిల యొక్క వ్యాధి నయం చేసే శక్తిని తగ్గిస్తాయని తెలుసు. క్లోరిన్ పైన ఇంకనూ పరిశోధనలు జరగవలసి ఉన్నప్పటికీ క్లోరిన్ కలిపిన నీళ్ళు వాడకపోవడమే మంచిదని మా సూచన. చాలా చోట్ల రసాయనాలు లేకుండా ఉన్న శుద్ధ జలం లభ్యమౌతునే ఉంది. మీ కుళాయి నీటిని గూర్చి మీకు నమ్మకం లేకపోతె వేడిచేసి చల్లార్చిన నీటిలో రెమిడిని కలుపుకోవడం మంచిది.
________________________________________
7. ప్రశ్న: నొప్పి వంటి దీర్ఘకాలిక సమస్యలు సాధారణంగా ఎప్పుడూ ఇచ్చే నొప్పి నివారణ రెమిడిలతో నయమవుతయా?
జవాబు: ఔను ఇవి శరీరమును త్వరగా రెమిడికి ప్రతిస్పందించేలా సిద్ధం చేస్తాయి. ఐతే ఈ రెమిడిలను నీటితో (5 గోలీలు 200 మీ.లీ. నీటిలో) తీసుకోవడం శ్రేయస్కరం. మొదటి రోజు ప్రతీ 30 నిమిషాలకు ఒక్క సారి ఒకవేళ పేషంటు మెలుకువగా ఉండగలిగితే రాత్రిపూటకూడా వేసుకోగలిగితే (ఒక్కొక్క సారి తీవ్రమైన దురదకు కూడా ఈ పద్దతి మేలైనది) మంచిది. మరుసటిరోజు 6TD ఆ విధంగా కొన్ని రోజులు తర్వాత TDSకి మార్చాలి. ఒకవేళ నొప్పి తగ్గక పోయినా లేదా దాని తీవ్రత పెరిగినా ప్రతీ పది నిమిషాలకు ఒకటి చొప్పున మొదటి గంట వరకూ (వ్యాధి స్వల్పకాలిక లేదా దీర్ఘకాలికము ఎదైనా సరే) ఇంకా మార్పు ఏమీ లేదంటే మరొక గంట ఈ విధంగా చేసిన తర్వాత క్రమేణా తగ్గించుకుంటూ రావాలి.
________________________________________
8. ప్రశ్న: పిల్లలకిచ్చే వాక్సినేషన్ వల్ల వారిలో అనారోగ్యం కలిగితే CC9.4ను ఇవ్వవచ్చా?
జవాబు: ఇది వారికొచ్చిన వ్యాధి లక్షణాలను బట్టి ఉంటుంది. వ్యాధికి తగిన రెమిడి ఇవడం మంచిది. వాక్సిన్ ఉపయోగించి తయారుచేసిన నోసోడ్ ఇంకా ఉత్తమమైనది. త్వరగా పనిచేస్తుంది. జ్వరంగానీ ఇతరత్రా లక్షణాలను బట్టి CC9.4ను, చర్మ వ్యాధులకు సంబంధించినదయితే 21వ కేటగిరిలో సూచించిన ఏదయినా తగిన రెమిడిని ఇవ్వవచ్చు.
________________________________________
9. ప్రశ్న: పేషంటు చాలా వారాలు వైబ్రో రెమిడి వాడినప్పటికీ తన దీర్ఘకాలికమైనవ్యాధి నయం కాలేదని తెలిపినట్లయితే మరికొన్ని వారాలు రెమిడి వాడమని సూచింపవచ్చా?
జవాబు: లేదు, ఎందుకంటే ఈ రెమిడిలు అనుకున్న దానికంటే వేగంగా పనిచేస్తాయి. పేషంటు తన రోగ లక్షణములన్నీ వివరించి చెప్పాడా, మందులు సక్రమంగా వేసుకుంటున్నాడా, ఇచ్చిన సూచనలు పాటిస్తున్నడా, ఇవన్నీ సరిగా ఉంటే 3 వారాల తర్వాత రెమిడి పనిచేయలేదని తెలిపితే వెంటనే కొత్తది ఇవ్వాలి. కానీ పేషంటు ఇచ్చిన రెమిడి వల్ల ఎంతోకొంత ప్రయోజనం ఉందని తెలిపితే మందు మార్చే ముందు మరొక్క వారం వేచిచూడాలి.
వైద్యులకే వైద్యుడి యొక్క దివ్య వాక్కు
“ఈ రోజుల్లో గణాంకాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే రిపోర్టులు పెరిగిపోతూ వస్తున్నాయి. సంఖ్య పెరగాలనో లేక ఏర్పరుచుకున్న లక్ష్యం త్వరగా చేరాలని ఇట్టి విషయాలు గురించి పట్టించుకోకండి. నాకు క్వాలిటీ కావాలి గానీ క్వాంటిటీ తో అవసరం లేదు. నిజాయితీగా అంకిత భావంతోనూ భక్తితోనూ కొన్ని గ్రామాలకు చేసిన సేవే అత్యంత ఫలప్రదమైనది తప్ప మెహర్బానీ కోసం ఎక్కువ మందికి చేసే సేవలు నిష్పలం.”
…సత్యసాయిబాబా, “ సేవకు సన్నద్ధత ” దివ్య భాషణము, 21 నవంబర్ 1986
http://www.sssbpt.info/ssspeaks/volume19/sss19-25.pdf
“మన ఆహారపు అలవాట్లలోనూ, పనిలోనూ, నిద్రించే సమయంలోను మితము హితము అనేది అత్యవసరము. వాస్తవానికి ఇదే ఆనందానికి రాచబాట. ఆధునిక మానవుడు దీనిని ప్రతీ విషయంలోనూ అపహాస్యం చేస్తూ తనఆరోగ్యానికి, క్షేమానికి ముప్పు తెచ్చుకుంటున్నాడు. మానవుడు తీసుకునే ఆహారము సక్రమమైనది గానూ, పవిత్రమైనదిగానూ, సమగ్రమైనది గానూ ఉండాలి. కానీ ఈనాడు ఎప్పుడయినా,ఎ క్కడయినా, ఏది దొరికితే అది తింటూ ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నారు. మన ఆరోగ్యాన్ని సక్రమంగా ఉంచుకోవడానికి ఆహారానికి ఎంతోప్రాధాన్యత ఉంది. మనం తీసుకునే ఆహారంలో కొవ్వు పదార్ధాలు ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి ఎందుకంటే అవి మనశారీరక, మానసిక ఆరోగ్యాలు రెండింటికీ మంచివి కావు. మధ్యపానం, మాంస భక్షణం మనిషిలో ఎన్నో ఆరోగ్య సమస్యలు కలుగ జేస్తాయి.”
…సత్యసాయిబాబా, “ఆహారము, హృదయము మరియు మనసు” దివ్య వాణి, 21జనవరి1994
ప్రకటనలు
❖ఇండియా పుట్టపర్తి: AVP శిక్షణా శిబిరము 2016 మార్చ్ 5-8 తేదీలు, సంప్రదించవలసిన వారు [email protected]
❖ఇండియా ఢిల్లీ -NCR: JVP శిక్షణా శిబిరము 2016మార్చి12 మరియు వార్షిక పునశ్చరణ శిబిరము13 మార్చ్ 2016, సంప్రదించవలసిన వారు [email protected]
❖ఇండియా కాసర్గోడ్, కేరళ: AVP శిక్షణా శిబిరం 25 -26 మార్చ్2016, సంప్రదించవలసిన వ్యక్తి రాజేష్, ఈ-మెయిలు: [email protected] లేదా ఫోను నంబెర్: 8943-351 524 / 8129-051 524
❖ ఇండియా ముంబై: పునశ్చరణ గోష్ఠి & JVP శిక్షణా శిబిరము 25-26 మార్చ్ 2016, సంప్రదించవలసిన వారు సతీష్, [email protected] లేదా ఫోను నంబెర్ 9869-016 624
❖ పోలాండ్ వ్రోక్లా: జాతీయ పునశ్చరణ శిబిరము7-8మే 2016, సంప్రదించవలసిన వారు డేరియుజ్ [email protected]
అదనపు సమాచారం
అమెరికాలో మొదటి SVP వర్క్ షాప్, వెస్ట్ విర్జీనియా, 18-20 తేదీలు సెప్టెంబర్ 2015
శరత్ కాలపు నీరెండలలో వాషింగ్టన్ డిసికి దగ్గర 2015 సెప్టెంబర్ 18-20 వారాంతపు తేదిలలో మొదటి సీనియర్ వైబ్రియో నిపుణుల శిక్షణా శిబిరము జరిగింది. 6 జూనియర్ ప్రాక్టీషనర్లు అమెరికా, కెనడా కోఆర్డినేటర్ 01339, ఇద్దరు సీనియర్ ప్రాక్టీషనర్లు పాల్గొన్న ఈ శిక్షణా శిబిరము ను శ్రీమతి మరియు శ్రీ జిత్ కె.అగ్గర్వాల్ గారు నిర్వహించారు. ఈ శిక్షణకు రాకముందు JVP విద్యార్ధులు SVP దరఖాస్తును పూర్తిచేసి 9 నెలల SVP e-కోర్సును కూడా విజయవంతంగా పూర్తిచేసారు. ఈ శిక్షణ యొక్క ప్రధాన లక్ష్యము SRHVPను సమర్ధవంతంగా వినియోగించుట గురించి. ప్రధానంగా సిమ్యులేటర్ కార్డులు ఉపయోగించి రెమిడిలు తయారుచేయడం, నోసోడ్లు ( సన్ నోసోడ్ తో సహా) తయారుచేయడం, ప్రసారం చేయడం, అల్లోపతిక్ మందులను పోటేన్టైజ్ చేయడం, అలెర్జీ నిరోధకాలు వాటి అనుబంధాలు, గతంలో ఇచ్చిన రెమిడిలను తటస్థ పరచడం వీటి గురించి ప్రధానంగా శిక్షణ ఇవ్వడం జరిగింది. డాక్టర్ అగ్గర్వాల్ SRHVP యొక్క పనితీరును వివరిస్తూ ఇది అనుకూలంగా స్వస్థత చేకూర్చే వైబ్రేషణ్ మాత్రమే ఇస్తుందని, అనగా వ్యాధిగ్రస్తమైన పదార్ధాన్ని పోటెంటైజ్ చేసినపుడు వచ్చే రెమిడికి వ్యాధి నయం చేసే వై బ్రేషణ్ మాత్రమే ఉంటుందని తెలిపారు.
రెమిడి లను ఎంచుకోవడం, పులౌట్, మియాజంలకు వైద్యం, క్షాళన లేదా క్లెన్సింగ్ నిర్వహణా నియమాలు, పెండ్యులం లేదా లోలకాన్ని ఉపయోగించడం గురించి సవివరమైన విషయాలను ప్రస్తావించడం జరిగింది. చికిత్సా నిపుణులకు వైబ్రియోనిక్స్ లో ఉన్న స్వస్థత చేకూర్చే నిర్మాణాలు (హీలింగ్ మెకానిజం) గురించి అనగా శరీరము తనకు తానే స్వస్థపరుచుకుంటుందని వైబ్రియో గోళీలు కేవలం అలా స్వస్థ పరుచుకొనే ప్రక్రియను క్రియాశీలం చేస్తాయని వివరంగా చెప్పారు.
ఈ SVP శిక్షణతో పాటుగా చికిత్సా నిపుణులను అనేక ప్రయోగాలలో పాల్గొని తమ పరిశీలనా ఫలితాలను తెలియపరచవలసినదిగా సూచించడమైనది.
1. ఒక రెమిడిని పేషంట్ TDS గా తీసుకుంటున్న సందర్భంలో మొదటి డోస్ ను నీటితో ప్రతీ 10 నిమిషాలకు ఒకటి చొప్పున రెండూ గంటలు వేసుకొని మిగతా రెండు డోసులు మామూలుగా వేసుకోమని చెప్పి ఫలితాలను రికార్డ్ చెయ్యాలి.
2. SRHVPతో ప్రసరింపచేస్తూ ఉన్నప్పుడు 200C పొటెన్సి, ఫలితాన్ని ఇవ్వనప్పుడు 1M పొటెన్సి నిచ్చి ఫలితాన్ని రికార్డ్ చేయండి.
3. ఫంగస్ లేదా బూజు వ్యాధి సోకిన ఒక మొక్క నుండి వ్యాధికి గురైన ఒక ఆకును తీసుకొని నీటితో నోసోడ్ ను తయారు చేయండి. ఇలా చార్జ్ చేసిన నీటిని మరింత ఎక్కువ చేసి వ్యాధి సోకిన మొక్కకు, ఇతర మొక్కల పైన చల్లండి, ఫలితాన్ని రికార్డ్ చేయండి. ఒక వ్యాధి సోకిన మొక్క నుండి తయారు చేసిన నోసోడ్ ఇతర వ్యాధి సోకిన మొక్కల పైన ప్రభావం చూపుతుందా లేదా రికార్డ్ చేయండి.
శిబిరములో పాల్గొన్న భాగస్వాములంతా శిక్షణ విజయవంతమైనట్లు భావించారు. వీరంతా తమ ప్రతిస్పందనలు (ఫీడ్బ్యాక్) తెలియ జేస్తూ కలిసికట్టుగా పనిచేస్తూ నేర్చుకోవడం అనేది ఈ శిక్షణా శిబిరములోని గొప్ప అంశమని అభిప్రాయపడ్డారు. ఇతర చికిత్సానిపుణుల అనుభవాలను, వారి సమాధానాలను తెలుసుకోవడం తమకు ఎంతో ఉపయోగకరంగా ఉందని తెలిపారు. ఏదో వారాంతపు కార్యక్రమంగా వచ్చిన వీరికి ఇంత అద్భుతమైన శిక్షణ లభించినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ శిక్షణ, సభ్యుల మధ్య ఒక అనుభందాన్ని సహకార తత్వాన్ని పెంపొందించింది. ముఖ్యంగా ఆతిధ్యం ఇచ్చిన కోఆర్డినేటర్ మరియు వారి భర్త తమ గృహాన్నే కాదు తమ హృదయాన్ని కూడా తెరిచి మర్యాద చేసినందుకు అందరు అభినందనలు తెలియజేసారు. సాయం సమయంలో వీరి అందమైన భవనంలో కలుసుకొని తమ దినచర్య పైన సమీక్ష నిర్వహించుకోవడం ఒక చక్కని అనుభూతిగా భావించారు.
ఈ శిక్షణ జరుగుతున్నప్పుడు ఈ ప్రోగ్రాం యొక్క ప్రాముఖ్యతను గుర్తించి అగ్గర్వాల్ గారు ఎంతో విస్తృతమైన దీనిని 3 రోజులకు ప్రోగ్రాంగా కుదించడం నిజంగా ఒక సవాలు. ఐనప్పటికీ పాల్గొన్న వారంతా కష్టపడి పనిచేసారు, ఎందుకంటే వీరి పరీక్షలలో ఆ ప్రతిభ కనబడింది. స్వామి ఈ శిక్షణ జరుగుతున్నన్ని రోజులలో తమతోనే ఉన్నట్లు సభ్యులు అనుభూతి పొందారు. వీరందరికీ తెలుసు తాము ఇతరులకు నిస్వార్ధంగా సేవ చెయ్యాలనే ఒక ఉన్నతమైన లక్ష్యానికి ఎన్నుకోబడ్డ వారమని. ఈ శిబిరంలో జ్ఞానము తో బాటు ఇతర చికిత్సా నిపుణులనుండి ఒక హాస్య రస వాతావరణంలో తమ భావాలను పంచుకోవడానికి అవకాశం కలిగింది. ప్రతీ ఒక్కరుకూడా ద్విగుణీకృతమైన ఉత్సాహంతో మరింత ఎక్కువగా మనుషులు, జంతువులూ, మొక్కలను విబ్రియోనిక్స్ ద్వారా సేవించాలనే పట్టుదలతో తమ ఇళ్ళకు చేరుకున్నారు.
మెడికల్ క్యాంప్, జఖోల్, ఉత్తరాఖండ్, భారత దేశము, 2015 సెప్టెంబర్ 21-25 తేదీలు
ఉత్తరాఖండ్ లోని హిమాలయ మారుమూల ప్రాంతమైన జఖోల్ లో 2015 సెప్టెంబర్ నెల 21-25 తేదీల మధ్య వైబ్రో మెడికల్ క్యాంప్ నిర్వహించడానికి ముగ్గురు ప్రాక్టీషనర్లకు ఆహ్వానం అందింది. ఇంగ్లాండ్ కి చెందిన బెటర్ లైవ్స్ ఫౌండేషన్ మరియు ఉత్తరాఖండ్ లో డెహ్రాడున్ లో గల నిర్మల్ ఆశ్రమం కంటి ఇన్సిట్యూట్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ క్యాంప్ నిర్వహించబడింది. యుకె 02894, కెనడా 02750 మరియు ఉత్తరాఖండ్ 11121 ఈ ముగ్గురూ కలసి 1,080 పేషంట్లను చూడడమే కాక అదనంగా 350 మంది విద్యార్ధులకు సాధారణ టానిక్ లు ఇవ్వడం కూడా జరిగింది. ఈ క్యాంప్ అందరికీ ఎంతో సంతృప్తిని ఆనందాన్నిఇచ్చింది. అంతేకాకుండా స్థానిక డాక్టర్లు, నర్సులు, ప్యారామెడికల్ సిబ్బంది మరియు నిర్వాహకులకు వైబ్రియోనిక్స్ పట్ల అభిరుచి అవగాహనను పెంపొందించింది. ఒక ప్రాక్టీషనర్ వైబ్రియోనిక్స్ పట్ల డాక్టర్లకు సవివరమైన సమాచారాన్నికూడా అందించారు.
శిక్షణాశిబిరము, ఆలువా ,కేరళ , ఇండియా , 2015 అక్టోబర్ 2
ప్రొఫెసర్ ముకుందన్ డాక్టర్ ప్రొఫెసర్ ముకుందన్ గారి ప్రారంభోత్సవ ఉపన్యాసము పంకజాక్షన్ తో కలసి జ్యోతి ప్రజ్వలన
2015 అక్టోబర్ 2వ తేదీన కేరళలోని ఆలువాలో కేరళ రాష్ట్ర వైబ్రియోనిక్స్ ప్రాక్టీషనర్ల శిక్షణా శిబిరము జరిగింది. కేరళలోని వివిధ ప్రాంతాల నుండి 39మంది పాల్గొన్నారు. ప్రాక్టీషనర్ 11231 అతిధులను ఆహ్వానిస్తూ స్వాగతోపన్యాసం చేసారు.
ముఖ్య అతిధిగా విచ్చేసిన కేరళ రాష్ట్ర సత్యసాయి సేవాసంస్థ అధ్యక్షులు ప్రొఫెసర్ ముకుందన్ గారు స్వామితో తమ అనుబంధాన్ని, అద్వితీయ అనుభవాలను వివరిస్తూ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసారు. కేరళ కోఆర్డినేటర్ 02090 సభ్యులనుద్దేశించి మాట్లాడుతూ ప్రస్తుత ఆధునిక కాలంలో వైబ్రియోనిక్స్ యొక్క ప్రాముఖ్యతను వివరించి చెప్పారు. ప్రస్తుత తరుణంలో అందివచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వైబ్రియోనిక్స్ ద్వారా సమాజ సేవలో పాల్గొనాలని రానున్న కాలంలో మరింత ఎక్కువ సేవలు అందించాలనే ఆశాభావం వ్యక్తం చేసారు. ప్రాక్టీషనర్ 11231 వివిధ రకాల పోషినిలు ఉదాహరణకు “బాలపోషిని” (పిల్లల టానిక్ ) విద్యాపోషిని (విద్యార్ధుల టానిక్) గురించి వివరించారు. వీరు రక్తము యొక్క pH బ్యాలెన్స్, వత్తిడిని సమర్ధవంతంగా అరికట్టే విధానము గురించి కూడా వివరించారు. ప్రాక్టీషనర్ 11993...ఇండియా గారి, మానవ దేహంలో గల చక్రాలు సాయి వైబ్రియోనిక్స్ వాటికి గల సంబంధం అనే టాపిక్తో ఉదయం సమావేశము ముగిసింది. మధ్యాహ్నం సమావేశంలో ప్రాక్టీషనర్లందరూ కేస్ హిస్టరీల గురించిన సమాచారాన్ని, తమ అనుభవాలను తెలియజేసారు. సభ్యులందరూ కూడా వైబ్రో రెమిడిల యొక్క అద్భుత అనుభవాలను వివరించారు. ఇవి మిగతా వారికి ఎంతో ప్రేరణ నివ్వడంతో ఇటువంటి శిబిరాలు సంవత్సరానికి ఒక సారి గానీ, రెండుసార్లు గానీ నిర్వహించుకోవాలని సూచన చేయబడింది.
తమ ముగింపు ఉపన్యాసంలో కేరళ కోఆర్డి నేటర్ 02090 ప్రాక్టీ షనర్లందరూ తమ కోపాలను, ఇతరులను గూర్చి చెడుగా మాట్లాడడం, విచారంగా ఉండడం వంటివి పోగొట్టుకోవాలని చెప్పారు. ఇంకా ఎర్నాకులం జిల్లాలో జరుగుతున్నట్లుగా నెలకు ఒకసారి ప్రాక్టీషనర్ల సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుందని కూడా వారు చెప్పారు. కరతాళ ధ్వనులతో అందరూ దీనిని ఆమోదించగా హారతితో సమావేశము ముగిసింది.
JVP శిక్షణ మరియు రెఫ్రెషర్ కోర్సు, పూణే, మహారాష్ట్ర, భారత్ దేశము, 2015అక్టోబర్ 10-11తేదీలు
2015 అక్టోబర్ 10 -12 తేదీలలో పూనాలో, 11 మంది AVP లు మరియు 9 మంది JVP ల తో శిక్షణా శిబిరము మరియు రిఫ్రేషర్ కోర్సు జరిగింది. వైబ్రియోనిక్స్ టీచర్ మరియు పూనా కోఆర్డినేటర్10375 ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఇంకా వైబ్రియోనిక్స్ టీచర్లు 11422 & 02789 మరియు ముంబాయి కోఆర్డినేటర్ 10014 లు అభ్యాసకులకు విలువైన సమాచారమును అందించారు. శిక్షణకు ముందు AVPలు JVP మాన్యువల్లో ఉన్న అవసరమైన e-కోర్సు ను పూర్తిచేసారు. ఈ శిక్షణలో వైబ్రియోనిక్స్ ఆవిర్భావము, దీని అనువర్తనము గురించి చెప్పబడింది. ప్రాక్టీషనర్లకు సామూహిక కృత్యాలు ఇచ్చి కేస్ హిస్టరీలను డాక్యుమెంటేషన్ చేయడం, వీరికి ఇవ్వబడ్డ కేసులకు సంబంధించి మందు యొక్క మోతాదు (డోస్ మరియు డోసేజ్) సూచించే కృత్యాలు ఇవ్వబడ్డాయి. పాల్గొన్న వారికి బోధనా సిబ్బంది వైబ్రియోనిక్స్ పైన సమగ్ర జ్ఞానాన్ని అందించడమే కాక ఉపయోగకరమైన ఆరోగ్య చిట్కాలు కూడా తెలియచేసారు.
శిక్షణ ముగింపు రోజున పాల్గొన్నవారికి డాక్టర్ అగ్గర్వాల్ గారితో స్కైప్ కాల్ ఏర్పాటు చేయబడింది. స్వామి దయవల్ల గంటన్నర సమయం సాగిన ఈ పరస్పర చర్చ ప్రసార మాద్యమం ఇబ్బందులేమి లేకుండా చక్కగా జరగడం విశేషం. అనంతరం 108CC కిట్లు చార్జింగ్ చేసే సందర్భంలో అక్కడ వాతావరణం అంతా ఓంశ్రీసాయిరాం నామ స్మరణతో మార్మ్రోగిపోయింది. విభూతి వాసన హాలంతా వ్యాపించడంతో స్వామి తమతోనే ఉన్నారనే భావన సభ్యులను పులకింపచేసింది. ప్రతీ ఒక్క ప్రాక్టీ షనర్ స్వామి ఆశీస్సులు ఆ విధంగా అందినందుకు కృతజ్ఞతా భావంతో రెట్టించిన ఉత్సాహంతో పేషంట్లకు సేవచేసేటందుకు తమ ఇళ్ళకు తరలివెళ్లారు.
ప్రాక్టీ షనర్లు అందించిన ఫీడ్ బ్యాక్ లో శిక్షణలో కల్పింప బడ్డ అనేక ప్రదర్శనలు తమకు అనేక రకాలుగా ఉపయోగపడేవిధంగా ఉన్నాయని వ్రాసారు. ఒక సభ్యుడు ఇక్కడ అభ్యాసనా కృత్యాలు ఇతర సభ్యులతో భాషణలు తనను నిజమైన ప్రాక్టీ షనర్ గా రూపుదిద్దుకునేలా చేసాయని వ్రాసారు. మరొకరు వైబ్రియోనిక్స్ రంగంలో వచ్చిన నూతన మార్పులను తెలుసుకొనడానికి ఇది ఒక చక్కని వేదిక అని వ్రాసారు.
ఓం సాయి రామ్!