Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

Vol 6 సంచిక 3
May/June 2015
ముద్రింప తగిన వార్తాలేఖ


పూర్తి వార్తాలేఖ యొక్క కాగితం ప్రతి కావలెనన్నఈ పుటను ముద్రించండి

డా.జిత్ కే అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి

ప్రియమైన అభ్యాసకులకు

మీరు మి 108CC బాక్స్ రీఛార్జ్ చేసుకున్నారా?

నేను సాధకులకు ఒక ముఖ్య గమనికతో ఈ వార్తాలేఖ ప్రారంభం చేయాలనుకుంటున్నాను. సాయి వైబ్రియానిక్స్ రేమడీల యొక్క సామర్థ్యాన్ని మెరుగుపర్చడానికి మేము నిరంతరంగా 108CC మాస్టర్ బాక్స్ నవీకరణ చేస్తున్నాము. మీ బాక్స్ ని  వీలైనప్పుడల్లా రీఛార్జ్ చేయడానికి  ప్రయత్నించండి .కానీ ప్రతి రెండు సంవత్సరాలకి ఒకసారి మిశ్రమాల శక్తిని నిర్ధారించడానికి  మీ బాక్సుని రేచార్జ్ చేయడం అనివార్యం. ఈ సేవ, నెలవారీ రిపోర్టులు క్రమముగా మాకు పంపించే అభ్యాసకులందిరికి అందించపడుతుంది.మీరు మీ బాక్సుని  పుట్టపర్తిలో  లేదా మీ స్థానిక సమన్వయకర్త తో గాని రీఛార్జ్ చేయించు కోవచ్చు.

సాయి వైబ్రియానిక్స్ అభ్యాసకుల అంతర్జాతీయ సంఘంలో చేరండి

ధీర్గకాల నిరీక్షణ తర్వాత మేము సాయి వైబ్రియానిక్స్ అభ్యాసకుల అంతర్జాతీయ సంఘంయోక్క గుర్తింపు పత్రాలు (ID cards) అర్హత పొందిన JVPలు మరియు SVPలకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటిస్తున్నాను. ఈ సంఘంలో సభ్యత్వం, వైబ్రియానిక్స్ సాధనకి మద్ధతుకాను మరియు అభ్యాసకులకి అదనపు రక్షణ అందించడానికి  ఉద్దేశించబడింది. మా వెబ్సైట్ www.vibrionics.org ను సందర్శించి ఈ సంఘంయోక్క నియమాలు మరియు నిభందనలు అంగీకరించినట్లయితే, ఆన్లైన్ దరఖాస్తు పత్రాన్ని పూర్తి చేసి పంపండి. ఆ తర్వాత మీకు గుర్తింపు పత్రాలు పంపబడుతాయి.

కృతజ్ఞ్యతలు

సాయి వైబ్రియానిక్స్ లో  మేము చేసే ప్రతి సాధన,స్వామీ కృప మరియు అనేక సాధకుల సహాయం వలనే సాధ్యమవుతోంది.ఆన్లయిన్ వార్తాలేఖకు సమాచారం అందించిన అభ్యాసకులకి మా ధన్యవాదాలు. గత ఒక ఏడాదిగా వార్తాలేఖ సంచికల్లో మీరు చూస్తున్న కేసు వివరాలు, అభ్యాసకుల వివరాలు సేకరించి పంపిస్తున్నఅభ్యాసకులకు మరియు సంపాదకత్వంలో మాకు తోడ్పడిన అభ్యాసకులకు మా కృతజ్ఞ్యతలు. పరిశోధన విభాగంలో పని పూర్తి చేసిన అభ్యాసకులకి మా కృతజ్ఞ్యతలు.ఈ అభ్యాసకుల  వివరాలు ఈ క్రింద వ్రాయబడినాయి: ఆర్జెంటినా: 02128, 02885; ఆస్ట్రేలియా: 02892; క్రోఎశియా: 01616, గ్రీసు: 01626, 02295; ఇండియా: 02090, 02817, 10014, 10228, 10375, 10776, 10940, 11219, 11271, 11310, 11476, 11483, 11520, 12051; ఇటలీ: 02494; జపాన్: 02779; మలేషియా: 02806; U.K :00534, 02802, అనామధేయుడు (1); USA : 02864, అనామదేయులు (2).

అదనంగా అభ్యాసకులందరు తమ తమ ప్రాంతీయ భాషలలో చదువుకోడానికి వీలుగా UK లో నివసిస్తున్న స్వామి భక్తుడైన ఒక అభ్యాసకుడు ఇంగ్లిష్ ఆన్లయిన్ వార్తా లేఖను బహుభాషా వార్తాలేఖగా విస్తృతం చేసి తన సేవని అందిస్తున్నారు. అదే సమయంలో, అబ్యాసకులకు,రోగులుకు ఉపయోగపడేలా వార్తాలేఖలను వారి నిరవధిక శ్రమ మరియు శ్రద్ధ తో బహుళ భాషలలో అనువదిస్తున్న ప్రతిఒక్క అనువాదకులకు  మా ప్రగాడ కృతజ్ఞతలు మరియు అభినందన తెలియచేసుకుంటున్నాము.

రాబోయే నెలల్లో, మునుపటి బహుళ భాషా వార్తాలేఖలునుండి గత కేసు వివరాలన్నీ కూడాను అందరికి అందుబాటులో ఉండాలని ఆశిస్తున్నాము.దీని కొరకై అనువాదకుల సహాయం మరింత అవసరమని తెలియచేసుకుంటున్నాను. ఈ సేవ చేయడానికి ఆశక్తి ఉన్నవాళ్ళు [email protected] ద్వారా నన్ను సంప్రదించవచ్చు.

రిఫ్రెషర్ వర్క్ షాప్

 'అదనంగా' ఈ విభాగంలో,18th మే న ఎస్సెక్స్, UKలో జరిగిన వైబ్రియానిక్స్ అభ్యాసకుల వార్షిక రిఫ్రెషర్ వర్క్ షాప్ యొక్క కొన్ని ముఖ్యాంశాలను మీతో పంచుకోవడం నాకు ఆనందంగా ఉంది. ఈ సమావేశం నిర్ణయాలు సంకలనం చేసిన UK సమన్వయకర్త మరియు అతని అద్భుతమైన టీం కు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇవి తెలుసుకోవడానికి అభ్యాసకులందరికీ చాలా ఆశక్తిగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి ప్రయోజకరముగా ఉండడానికి, ఇలాంటి నివేదికలు భవిష్యత్తులో మరిన్ని అందరితో పుంఛుకొవలని అనుకుంటున్నాము. మీరు భవిష్యత్తులో వైబ్రియానిక్స్  వర్క్షాప్లో పాల్గొంటే వాటి యొక్క ముఖ్యాంశాలను మాకు రికార్డు చేసి పంపవలసిందిగా కోరుకుంటున్నాను.

ప్రేమభరితమైన సాయి సేవలో

జిత్ కే అగ్గర్వాల్

శరీరమంతా దురద 12051...India

ఒక 85 ఏళ్ల వ్యక్తి అనేక సంవత్సరాలుగా తన శరీరమంతా దురదతో బాధపడ్డాడు. అతను వివిధ అల్లోపతి మందులు మరియు లోషన్లు వాడినప్పడికి ఫలితం లభించలేదు. అతను మే 2014 లో వైబ్రో అభ్యాసకుడుని సంప్రదించారు. ఈ క్రింద వ్రాసిన మందులు ఇతనికి ఇవ్వబడినాయి

CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC12.4 Autoimmune diseases + CC15.1 Mental & Emotional tonic + CC21.1 Skin tonic + CC21.2 Skin infections…TDS

3 వారాల వ్యవధిలోనే అతని ఆరోగ్యం మెరుగుపడింది. రెండు నెలలు ఈ మందులు తీసుకున్న తరవాత ఇతని  రోగ లక్షణాలు పూర్తిగా తగ్గిపోయాయి. అతను 2014 డిసెంబర్ వరకు ఇవే మందులు రోజుకి రెండు సార్లు(BD) తీసుకోవడం కొనసాగించారు. అతని అంతిమ గడియ సమీపిస్తోందని గ్రహించి స్వామీ పటాన్ని తన చేతిలో పట్టుకొని 2014 జనవరి 1st న ఇతను కన్నుమూశారు. తన అసౌకర్యాన్ని తొలగించి తనని చివరికి నయంచేసిన స్వామికి కృతజ్ఞ్యతలు తెలుపుకుంటున్నట్టు తన కుటుంభ సభ్యులకు చెప్పారు. 

ఉర్టికేరియా (దీర్ఘకాలిక దద్దుర్లు) 11483...India

ఒక 32 ఏళ్ళ మహిళ విపరీతమైన ఉర్టికేరియాతో  (దద్దుర్లు) భాధపడేది. పది నెలలుగా అల్లోపతి మరియు హోమియోపతి వైద్యాలతో ఫలితం లేకపోయేసరికి ఈమె వైబ్రో అభ్యాసకుడిని సంప్రదించింది. ఈ కింద వ్రాసిన మందులు ఈమెకు ఇవ్వబడినాయి

NM21 KBS + NM36 War + NM46 Allergy 2 + NM62 Allergy B + OM28 Immune system + SR268 Anacardium (200C) + SR270 Apis Mel + SR319 Thyroid Gland + SR322 Urtica Urens + SR353 Ledum (200C) + SR497 Histamine…6TD, in water

ఈ మందులు తీసుకున్న రెండు రోజులకి ఈమెకు పుల్ అవుట్ వచ్చిందని తెలిసి ఈమెను అభ్యాసకుడు ఒక రోజు మందులు తీసుకోవడం ఆపమని చెప్పారు. క్రమంగా ఈమెకు మందులు OD నుండి BD,TDS వరకు పెంచడం జరిగింది.రెండు వారాల తరవాత ఈమెకు 75% నయమైంది. ఆరు వారాల తరవాత ఈమెకున్న దద్దుర్లు పూర్తిగా తగ్గిపోయాయి. మరో మూడు నెలలకు ఈమెకు డోసేజ్ వారానికి ఒక సారిగా(OW) తగ్గించబడింది.

రోగి వ్యాఖ్యనాలు:
నేను 2013లో శివరాత్రి భజనలు పాడుతుండగా దురదతో కూడిన  దద్దుర్లు నా కాళ్లు మరియు చేతులు మీద వ్యాపించి ఉండటం చూసి ఒక డెర్మటాలజిస్ట్ ని  సంప్రదించాను. నాకున్న వ్యాధి యుర్టికేరియా యని వైద్యుడు ద్వారా తెలిసిందిదాని తరవాత ఎనిమిది నెలలకు నాకొచ్చిన చర్మ వ్యాధి మరింత ఎక్కువయ్యింది. ప్రతి రోజు నేను అంటి హిస్టమైన్లు తీసుకోవాల్సి వచ్చింది.ఆపై ఐదు నెలల తరవాత 2014 మే లో వ్యాధి తీవ్రమైంది. ప్రాణానికి అపాయం లేకపోయినా వ్యాధి నాకు చాలా అసౌకర్యాన్ని కలిగించింది.

ఆరు నెలలపాటు అల్లోపతి మరియు హోమియోపతి వైద్యాలు తీసుకొని  అలిసిపోయానుఒక రోజు నేను మా ఇంటికి వెళుతుండ్డగా దారిలో ఒక చిన్న స్వామీ పటం రోడ్డు మీద పడియుండడం చూసాను పటం వెనుక సాయి వై బ్రియానిక్స్ గురించి వ్రాసియుండడం చూసి అది స్వామి నాకిచ్చిన  సందేశమని అనిపించింది.

వెంటనే నాకు ఎంతో ప్రియమైన మరియు గుర్గౌన్ (Gurgoan) లో వైద్య శిబిరాలలో నాతో పాటు పని చేసిన ఒక అభ్యాసకురాలు గుర్తుకు వచ్చింది. ఆమె నాకు వైబ్రో మందులు వెంటనే ఇచ్చింది.

రెండు రోజులలో నాకు వ్యాధి తీవ్రమైంది కాని రెండు వారాల తరవాత నాకు చర్మ వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది. వైద్యం తీసుకున్న ఆరు నెలల తరవాత కూడా నేను ఎంతో ఆరోగ్యంగా ఉన్నాను. ఇదంతా స్వామి దయ వల్లే జరిగింది.

ఫుడ్ పాయసనింగ్ , IBS సమస్య 11968...India

ఒక 60 ఏళ్ళ మహిళకు ఒక ఫంక్షన్లో ఆహారం తీసుకున్న అనంతరం తీవ్ర ఫుడ్ పాయిసనింగ్ లక్షణాలు మొదలయ్యాయి. ఆమె దాదాపు పదేళ్ళ నుండి  ఇరిటబుల్ బవల్ సిండ్రోం నుండి భాద పడుతోంది. ఆమె అభ్యాసకుడిని సంప్రదించిన సమయంలో ఒక చుక్క నీరుకూడా తాగలేన పరిస్థితిలో ఉంది.

అభ్యాసకుడు వెంటనే నీటిలో ఈ క్రింద వ్రాసిన మందుల్ని ఇచ్చారు:
CC4.1 Digestion tonic + CC4.6 Diarrhoea + CC4.8 Gastroenteritis + CC4.10 Indigestion + CC12.1 Adult tonic…TDS

ఒక గంటలో  25% నయమయినట్లుగా ఆమె ఫోన్ చేసి చెప్పింది. రెండు రోజులు ఈ మందుల్ని నీటిలో తీసుకోవడంతో ఆమెకు వాంతులు మరియు విరోచనాలు పూర్తిగా తగ్గి, ఆహారాన్ని కొంచం తీసుకోవడం మొదలుపెట్టింది.

ఆమెకు అంతకు ముందున్న IBS సమస్య కూడా నయమైనట్లుగా తెలియచేసింది. ఆమెకున్న ఈ IBS సమస్య వల్ల ఆమెను తరచుగా ఆసుపత్రి లో చేర్చవలసి వచ్చేది. ఈ మందులు తీసుకోవడం వలన ఆసుపత్రి లో చేరే అవసరం రాలేదని ఆమె ఎంతో ఆనందంగా తెలియచేసింది.

అభ్యాసకుని వ్యాఖ్యానం:
ఇది విన్నాక నాకు ఎంతో ఆనందంగాను సంతృప్తిగాను ఉంది.

మణికట్టు(wrist) మీద గడ్డ 11572...India

2014 సెప్టంబర్ 15న ఒక 27 ఏళ్ల మహిళ ఆమె ఆరు నేలలగా భాదపడుతున్న కుడి మణికట్టు మీద నొప్పికరమైన గడ్డ సమస్యతో అభ్యాసకుడిని సంప్రదించింది. ఆమెకు ఈ క్రింద వ్రాసిన మందులు ఇవ్వబడినాయి

CC2.3 Tumours & Growths + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC21.1 Skin tonic + CC21.2 Skin infections + CC21.3 Skin allergies...TDS, 200ml నీటిలో 5 మాత్రలు

స్వామి దయవల్ల ఆమెకు ఒక రోజులోనే  నొప్పి తగ్గింది. ఈ మందులు ఎనిమిది రోజులు తీసుకున్న తరవాత గడ్డ 100% తగ్గిపోయింది. ఇంత త్వరగా ఉపశమనం కలిగిందని ఆమె ఎంతో సంతోషపడింది. (వైబ్రియానిక్స్ తీసుకునే ముందు: ఎడమ వైపు, వైబ్రియానిక్స్ తీసుకున్న తరవాత: కుడి వైపు)

 

కీళ్ళ వాపులు 02817...India

అభ్యాసకుడు వ్రాసినది: మేము విజయవంతంగా నయంచేసిన వ్యాదులలో కీల్లవాపు ఒకటి. నేను ఇంతకముందు ఈ సమస్యతో భాద్ధపడ్డాను కనుక ఈ భాద ఎలావుంటుందో ఊహించగలను. ఈ సమస్యకి మందు తయారు చేస్తునప్పుడల్లా భగవంతుడు నాదేగ్గరే ఉన్నట్లు అనిపిస్తుంది.

ఒక 49 ఏళ్ళ మహిళ ఏడేళ్ళగా భాదపడుతున్న కీళ్ళ వాపుల సమస్యవల్ల నన్ను సంప్రదించింది. ఆమెకు మోకాళ్ళు,మోచేతులు మరియు భుజాలలొ నొప్పి తీవ్రంగా ఉండేది. దీనివల్ల ఆమెకు నిద్రపట్టక నీరసంగా ఉండేది. ఆమె వైద్యుడు ఆమెకు రుమటాయిడ్ కీళ్ళ వాపులని చెప్పారు. ఆమె మోకాళ్ళ మీద ఇంజక్షన్లు వేయించుకోవడంతోపాటు రోజుకి రెండు పారసిటమాల్ మాత్రలు వేసుకునేది. ఆపై ఆయుర్వేద తైలాన్నికూడా రాసుకునేది. ఆమె వైద్యుడు ఆమెకు శస్త్ర చికిత్స చేయాలని చెప్పడంతో ఆమె భయపడి నన్ను వై బ్రో మందులు కొరకు సంప్రదించింది. ఆమెకు ఈ క్రింద వ్రాసిన మందులు ఇవ్వబడినాయి

CC3.7 Circulation + CC10.1 Emergencies + CC15.1 Mental & Emotional tonic + CC18.5 Neuralgia + CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue...TDS

పదిహేను రోజుల తరవాత ఆమెకు కీళ్ళ వాపుల సమస్య 70% నయమైందని మళ్ళి మందులు నిమ్పించుకుని వెళ్ళింది. ఆమె పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం మానేసి హాయిగా నిద్రించగలిగింది. రెండు నెలల తరువాత ఆమెకు నొప్పి పూర్తిగా తగ్గింది కాని కొద్దిగా అసౌకర్యం ఉండేది. నాలుగు నెలల తరవాత అదికూడా తగ్గి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందింది.

కేసు గురించి సంక్షిప్తంగా 2014 అంతర్జాతీయ కాన్ఫరంస్ బుక్లో రాయబడియుంది.

కీళ్ళ వాపులు ,రుతుక్రమంలో అపక్రమత మరియు PCOD 02817...India

ఒక 43 ఏళ్ళ మహిళ వీపు మరియు కీళ్ళ నొప్పులతో భాధపడేది. ఆమె కీళ్ళవాపులతో రెండేళ్ళు భాధపడింది. ఆమెకు రుతుక్రమంలో అపక్రమత ఉండేది. ఆమెకు PCOD  (పాలిసిస్తిక్ ఓవరియన్ డిసీస్ ) సమస్య కూడా ఉండడంతో తీవ్రమైన కడుపునొప్పితో భాధపడేది. ఈ వ్యాదులవల్ల ఆమె ఎంతో అసౌకర్యానికి గురయింది. ఆమెకు తన జుట్టు దువ్వుకోవడం కూడా కష్టంగా ఉండేది. ఆమె దినచర్యలలో ఉపద్రవం కలిగింది. అల్లోపతి మరియు ప్రకృతి వైద్యాలు ఆమెకు ఉపశమనాన్ని కలిగించలేదు. ఉపశమనం కలుగుతుందన్న ఆశ ఆమెకు పోయింది. తన సమస్యలన్నీ దేవుడికి వదిలిపెట్టింది. కొన్నాళ్ళ తరవాత బాబా దయవల్ల వైబ్రియానిక్స్ వైద్యం ఆమెకు లభించింది. ఆమెకు ఈ క్రింద వ్రాసిన మందులు ఇచ్చారు

CC3.7 Circulation + CC8.1 Female tonic + CC8.4 Ovaries & Uterus + CC8.8 Menses irregular + CC15.1 Mental & Emotional tonic + CC18.5 Neuralgia + CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue + CC20.5 Spine…TDS

రెండు రోజుల తరువాత ఆమె ఫోన్ చేసి తనకు పెయిన్ కిల్లర్స్ వాడే అవసరం లేదని చెప్పింది.15 రోజుల తరవాత ఆమెకు రుతుక్రమం ఏ భాధా లేకుండా మొదలయింది. దీని తరవాత ఆమెకు రుతుక్రమంలో క్రమత ఏర్పడింది. ఒక నెల రోజులలో ఆమెకు కీళ్ళ నొప్పులు 50% తగ్గిపోయాయి. ఆపై రెండు నెలల తరవాత ఆమెకు ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడింది. ఆమె కీళ్ళ వాపులు ఏడూ నెలలో పూర్తిగా తగ్గినా కీళ్ళ వాపు సమస్య ఆమె కుటుంభంలో ఎక్కువగా ఉండడంవల్ల ఆమె ఈ క్రింద వ్రాసిన మందుల్ని రోజుకొకసారి వేసుకుంటోంది

CC3.7 Circulation + CC12.1 Adult tonic + CC20.3 Arthritis…OD

కేసు గురించి సంక్షిప్తంగా 2014 అంతర్జాతీయ కాన్ఫరంస్ బుక్లో రాయబడియుంది.

పసి బిడ్డలో కామెర్లు 02817...India

ఒక kg బరువు కూడా లేన ఒక శిశువుకు పుట్టిన కొద్ది గంటల్లో కామెర్లు వ్యాధి సోకినట్లు వైద్యులు చెప్పారు. ఇంక్యుబేటర్ లో పెట్టబడిన ఆ శిశువుకు తల్లి పాలు పిండి ఇవ్వబడింది. వైద్యులు ఆ శిశువు బ్రతకడం అసాధ్యమని చెప్పారు. ఆ శిశువుయొక్క అమ్మమ్మగారు వెంటనే ధర్మక్షేత్రలో ఒక అభ్యాసకుడిని కలిసి ఈ క్రింద వ్రాసిన మందుల్ని బిడ్డకివ్వడం కోసం తీసుకు వెళ్ళింది

CC4.11 Liver & Spleen + CC10.1 Emergencies + CC12.2 Child tonic…TDS

తల్లి పాలులో ఈ మందుల్ని కలిపి బిడ్డకు ఇచ్చారు. ఇమందుల్ని విబుతిలో కలిపి ఇంక్యుబేటర్ మీద జల్లడం కూడా జరిగింది. ఒక రోజులో శిశువుకు పాలు జీర్ణించుకునే శక్తి మరియు బరువు పెరగడం ప్రారంభమయింది. పది రోజుల తరువాత ఆ శిశువుయొక్క బరువు 2.2 kg లుగా పెరిగడంతో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేసారు. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్న ఆ శిశువుకు మూడేళ్ళ వయస్సు.

 

హైపోథైరాయిడిజం, పాదాల వాపు, కీళ్ల నొప్పి, మానసిక వ్యాకులత 02817...India

అభ్యాసకుడు ఇట్లు వ్రాస్తున్నారు: మేము వైబ్రో మందులు తీసుకుంటున్నఒక స్నేహితుడి ఇంట్లో ఒక 73 ఏళ్ల మహిళను కలుసుకున్నాము. ఆ స్త్రీ గత 15 సంవత్సరాల పాటు అనేక సమస్యలతో భాధపడింది: ఆమె అరికాళ్ళలో మంట,అరికాళ్ళు మరియు కాలి వేళ్ళలో వాపు నొప్పివలన ఆమెకు నడవడం కష్టమయింది. దీనివలన మానసిక ఆందోళనకు గురయింది. గత ఐదు సంవత్సలుగా  ఆమె కీళ్ళ నొప్పులు,ఆపుకొనలేని మూత్ర విసర్జన మరియు హైపోథైరాయిడిజం సమస్యలతో కూడా భాద పడింది. ఆమె అనేక సంవత్సరాలు అల్లోపతి చికిత్స తీసుకుంది కాని ఆమె పరిస్థితిలో మెరుగుదల లేదు. ఆమెకున్న ఆపుకొనలేని మూత్రవిసర్జన సమస్యవల్ల ఆమె ఇల్లు వదలి ఎక్కడికి వెళ్ళేది కాదు. ఆమె పరిస్థితికి తనను తాను నిందించుకుంటూ ఉండేది. ఆమె నా చేతులు పట్టుకుని ఏడుస్తూ తనకు వైబ్రియానిక్స్ మందులు ఇవ్వమని కోరింది. ఆమె తన భర్తనుండి విడిపోయి ఇరవై సంవత్సరాలు అయినట్లు ఆమతో మాట్లాడాక తెలుసుకున్నాను. ఆమె అనారోగ్యానికి ఇదే మూల కారణమని నాకు అనిపించింది. చికిత్స ప్రారంభంలో, ఆమె రోజువారీ 12 వివిధ అల్లోపతి మాత్రలు తీసుకునేది. నేను ఆమె డాక్టర్ని అడగకుండా ఏ అల్లోపతి మందుని ఆపవద్దని చెప్పి ఈ క్రింద వ్రాసిన మందుల్ని ఇచ్చాను

CC3.1 Heart tonic + CC3.7 Circulation + CC6.2 Hypothyroidism + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC13.1 Kidney & Bladder tonic + CC13.3 Incontinence + CC15.1 Mental & Emotional tonic + CC20.3 Arthritis…TDS

ఈ పేషంటు నాలుగు రోజుల తరవాత నాకు ఫోన్ చేసి ఆమె అల్లోపతి మందులు తీసుకోవడం ఆపేసినట్లు మరియు చాలా ఆనందంగా ఉన్నట్లు చెప్పింది. ఆమెకున్న రోగ లక్షణాలు 50% వరకు తగ్గిపోయాయని చెప్పింది. నేను ఆమె వైద్యుడిని సంప్రదించకుండా అల్లోపతిక మందులు ఆపడానికి వీలు లేదని చెప్పినా ఆమె వినలేదు.

15 రోజుల తరవాత ఆమె మందుల రీఫిల్ కొరకు నన్ను సంప్రదించినప్పుడు ఆమెకు 70% నయమైందని చెప్పింది. ఆమె నాతో "నేను ఈ అద్భుతమైన  మందుల్ని మాత్రమే తీసుకుంటాను" అని చెప్పింది. ఆమె మొదటి సందర్శన జరిగిన ఒక నెల తరువాత ఆమెకు చాలావరకు తన సమస్యలు  తగ్గినట్లు చెప్పింది. కొద్ది వారాల తరవాత పూర్తిగా ఆమెకు నయమైంది. ఇప్పుడు ఆమె ఆరోగ్యంగాను ఆనందంగాను ఉంది. క్రమం తప్పకుండా ఆమె అమృతంగా భావించే ఈ వైబ్రో మందుల్ని తీసుకోవడం కొనసాగిస్తోంది.

ఆప్టిక్ న్యురైటిస్ (ఆప్టిక్ నరంలో వాపు) మరియు ట్రాకోమా( కొయ్యకండల వ్యాధి) 02817...India

అభ్యాసకుడు ఇట్లు వ్రాస్తున్నారు: ఒక 23 ఏళ్ళ యువకుడుకు ఆరు సంవత్సరాలు తీవ్రమైన కంటి సమస్యలతో భాధపడేవాడు. అతనికి ఆప్టిక్ న్యురైటిస్ మరియు ట్రాకోమా(కొయ్యకండల వ్యాధి) ఉన్నట్లు వైద్యులు నిర్ధారణ చేసారు. అతను స్టెరాయిడ్ మాత్రలు వాడేవాడు. ఈ రోగ సమస్యల  ప్రభావం అతని చదువు మీద పడింది. అతని కళ్ళు ఎప్పుడు నీళ్ళు కారుతూ, ఎర్రగా మరియు నొప్పిగా ఉండడంతో అతను ఏడ్చేవాడు. ముంబైలో కాలుష్యం అధికంగాను మరియు వాతావరణం చాలా వేడిగాను ఉంటుందని వైద్యులు ఆ రోగి కుటుంబాన్ని ముంబైని వదిలి వెళిపోమన్నారు కాని అతని తండ్రి ముంబైలో వ్యాపారం నడుపుతూ ఉండడం వలన అక్కడే ఉండిపోయారు. ఆ యువకుడికి ఎవరితోనూ మాట్లాడడం కాని ఎక్కడికయినా వెళ్ళడం కాని ఇష్టముండేది కాదు.అతని తల్లి నన్ను వైబ్రో చికిత్స కోసం సంప్రదించింది. అతనికి ఈ క్రింద వ్రాసిన మందులు ఇవ్వబడినాయి

CC3.7 Circulation + CC7.3 Eye infections + CC7.6 Eye injury + CC10.1 Emergencies + CC15.1 Mental & Emotional tonic + CC20.4 Muscles & Supportive tissue + a nosode of his steroids (prepared with the SRHVP machine)…TDS

ఇదే మందుల్ని కంటి చుక్కలు వలె ఉపయోగించడానికి పన్నీరులో తయారు చేయబడింది. రెండు రోజుల్లో, అతని కళ్ళ ఎరుపు,మంట మరియు నీళ్ళు కారడం వంటి లక్షణాలు 50% వరకు తగ్గిపోయాయి. మరో పది రోజుల సమయం లో అతను తన కళ్ళలో  మధ్యాహ్నం పూట కొద్దిగా అసౌకర్యం మాత్రం ఉందని, 90% నయమైందని చాలా ఆనందముగా తెలిపాడు. మరో నెల రోజులలో అతనికి సంపూర్ణంగా నయమైందని తెలిపాడు. అతను ఇప్పుడు రోజువారి ఒకసారి (OD) ఈ మందుల్ని పిల్స్ రూపంలో మరియు కళ్ళ చుక్కలు వలె తీసుకోవడం కొనసాగిస్తున్నాడు. 

 

ధీర్గకాలిక వీపు నొప్పి మరియు శయాటికా 02892...Australia

ఇరవై ఏళ్ళగా వీపు మరియు మెడ నొప్పితో భాదపడుతున్న ఒక 48 ఏళ్ళ మహిళ, ఒక సాయి భక్తుడు ద్వారా అభ్యాసకుడిని సంప్రదించింది. ఆమెకు శయాటికా నొప్పి మరియు పాదాలలో మండుతున్న సంచలనం కూడా ఉండేవి. దీనికి కారణం ప్రసవ సమయంలో ఆమెకు ఇచ్చిన ఎపిడ్యూరల్ వలన అయ్యుండచ్చని ఆమె చెప్పింది.19 ఏళ్ళ వయస్సప్పుడు ఒక కారు ప్రమాదంలో ఆమె కోకిక్స్ (వెన్నుపూసలు కలిసి ఏర్పడే త్రికోణాకారపు చిన్న ఎముక) దెబ్బ తిందని చెప్పింది. ఆమె ఉపశమనం కొరకు ఇన్ని సంవత్సరాలు యోగా, పైలేట్స్, ఫిజియోథెరపీ, స్విమ్మింగ్ మరియు అల్లోపతి మరియు హోపియోపతి మందులు ప్రయత్నించారు కాని సఫలితం లభించలేదు. ఫెబ్రవరి 18 న ఆమెకు క్రింద వ్రాసిన మందులు ఇవ్వబడినాయి

CC18.5 Neuralgia + CC20.1 SMJ tonic + CC20.2 SMJ pain + CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue + CC20.5 Spine…TDS

5 వారాల తరువాత ఆమె తిరిగి మార్చి 29 న అభ్యాసకుని సంప్రదించినప్పుడు ఆమె రోగ లక్షణాలలో ఏ విధమైన మార్పులేదని, అపార్ధం వలన ఆమె మందుల్ని సరైన మోతాదు తీసుకోవడంలేదని తెలిసింది. ఆమె అపార్ధం సరి చేసి ఆమె మనోవ్యాకులతతో భాదపడుతున్నట్లు తెలపడంతో, ఆమెకు మునుపు ఇచ్చిన మందులో CC15.1 Mental & Emotional tonic చేర్చి ఇవ్వడం జరిగింది.

 ఏడు వారాల తరువాత, మే 20న, ఆమె తిరిగి సంప్రదించినప్పుడు 20 సంవత్సరాలలో మొదటిసారిగా ఆమెకు నొప్పినుండి ఉపశమనం కలిగిందని చెప్పింది. ఆమెకు ఈ రోగ లక్షణాలు పూర్తిగా తగ్గినప్పటికీ, దీర్ఘకాలంగా ఈ సమస్యలు ఉండడంవలన అభ్యాసకుడు ఆమెను వైబ్రో మందులు మరి కొద్ది కాలం పాటు తీసుకొమ్మని చెప్పారు. ఏప్రిల్ 2015 నాటికి, ఆమె వైబ్రియానిక్స్ చికిత్స తీసుకోవడం కొనసాగిస్తోంది. ఆమె భాగస్వామి ఊపిరితిత్తుల క్యాన్సర్తో భాద పడుతున్న కారణంగా ఆమె అభ్యాసకుడిని మద్దతు మరియు కౌన్సిలింగ్ కొరకు సంప్రదిస్తోంది. ఆమె భర్తకు ప్రత్యామ్నాయ చికిత్స తీసుకోవడం ఇష్టం లేదు.

చర్మం మీద పుండ్లు మరియు దురద 02892...Australia

ఒక 47 ఏళ్ళ వ్యక్తి రెండేళ్ళగా తన చర్మం మీద నొప్పి మరియు మంటతో కూడిన ధద్దుర్లుతో భాధపడేవాడు. ఈ చర్మవ్యాధి వలన అతనికి చర్మం మీద సూదులతో గుచ్చుతున్నట్లు ఉండేదని చెప్పాడు. రెండు నెలలుగా దద్దుర్లు అతని శరీరమంతయు వ్యాపించడంతో అతని అసౌకర్యం మరింత పెరిగింది. (ఈ క్రింద ఇవ్వబడిన పటంలో (ఎడమ) అతని ఎడమ భుజం మరియు చేయి చూడండి)

అతను అల్లోపతి మరియు అనేక రకాల లేపనాలు వాడాడు కాని ఉపశమనం కలుగలేదు.

2015 ఫెబ్రవరి 1న అభ్యాసకుడు అతనికి ఈ క్రింద వ్రాసిన మందులు ఇచ్చారు

CC21.1 Skin tonic + CC21.2 Skin infections + CC21.3 Skin allergies + CC21.4 Stings & Bites + CC21.6 Eczema...TDS

చర్మం పైన రాయడానికి ఇవే మందుల్నివిబుతి మరియు ఆలివ్ ఆయిల్లో కలిపి అతనికి ఇవ్వబడింది. ఈ మందుల్నిరోజువారి రెండు సార్లు(BD) చర్మం మీద రాయమని అతనికి సలహా ఇవ్వబడింది.

రెండు రోజుల తరవాత ఫెబ్రవరి 3న అతనికి మంట మరియు దురద తగ్గినట్లు తెలిపాడు. ఈ మందులు అద్భుతంగా పనిచేసి అతని చర్మ వ్యాధి ఒక నెల రోజులలో పూర్హ్టిగా తగ్గిపోయింది. క్రింద ఇచ్చిన పటం (కుడి) చూడండి.

 

 

హెలిటోసిస్ (నోటిదుర్వాసన) 03119...Greece

ఒక 50 ఏళ్ళ వ్యక్తి చిన్న వయస్సునుండి నోటిదుర్వాసన సమస్యతో భాధపడేవారు. ఈ సమస్య వలన ఆయన సమీపంలో ఉన్నవారితో మాట్లాడం ఇబ్భందిగా అనిపించి ఆందోళన పడేవారు. 2013 అక్టోబర్ 5న ఈ పేషంటుకు ఈ క్రింద వ్రాసిన మందులు ఇవ్వబడినాయి

CC15.1 Mental and Emotional tonic + CC19.5 Sinusitis...TDS

ఒక నెల రోజులలో ఆ పేషంటుకి 70% నయమైంది. మరో నెల రోజులలో ఆయినకు ఈ సమస్య పూర్తిగా తగ్గిపోయింది. దాని తరవాత మోతాదు రోజువారి ఒకటిగా(OD)తగ్గించ బడింది. రోగ నివారణకై ఆ పేషంటు 2014 జూన్ వరకు ఈ మందులు తీసుకోవడం కొనసాగించారు.

కీళ్ళ భాద 12051...India

ఒక 75 ఏళ్ళ వృద్ధుడు రోజుకి ఒకటి నుండి రెండు కిలోమీటర్లు నడవగలిగేవారు. హఠాత్తుగా 2014 మార్చ్లో ఒక రోజు ఆయిన కుడి మోకాలులో విపరీతమైన నొప్పివల్ల నడవలేక పోయారు. డాప్లర్ సొనోగ్రఫీ, ఎక్సరే, MRI మరియు ఇతర పరీక్షల ద్వారా ఆయన యొక్క కుడి మోకాలులో ఆస్టియో ఆర్థరైటిస్ (కీళ్ళ భాద) ఉందని డాక్టర్ నిర్ధారించారు. ఒక నెల పైన అల్లోపతి మందులు వాడినప్పడికి ఫలితం కనపడలేదు. ఆయిన మరో వైద్యుడిని సంప్రదించినప్పుడు ఆయినకు బయోపెప్తయిడ్లు, కొలాజన్ మరియు సోడియం హ్యాలురోనేట్ కలిపిన మిశ్రమం ఇవ్వబడింది. 

ఇదే సమయంలో ఆయినకు వైబ్రో మందులు కూడా ఇవ్వడం జరిగింది

CC12.1 Adult Tonic + CC15.1 Mental & Emotional tonic + CC18.5 Neuralgia + CC20.3 Arthritis + CC20.4 Muscles and Supportive tissue + CC20.5 Spine…QDS

ఒక నెల రోజుల తరవాత ఆయినకు 70% ఉపశమనం కలిగింది. ఇదే మందుల్ని ఆయినకు చిటికడు విభూతి మరియు ఆలివ్ ఆయిల్లో కలిపి  మోకాలు మీద వ్రాయడానికి ఇవ్వబడింది. ఇలా చేయడం ద్వారా ఆయినకు అద్భుతమైన ఫలితం లభించింది. మరో నెల తరవాత ఆయిన సాధారణంగా నడవగలిగాడు. మోకాలు మీద మందు మరియు విభూతి కలిపిన ఆలివ్ ఆయిల్ వ్రాయడం వలన ఉపశమనం మరింత వేగంగా లభించిందని ఆయిన గమనించారు.

ఇంత ఉపశమనం కలగడంవలన ఆయిన యొక్క డాక్టర్ అల్లోపతి మందుల మోతాదు వారానికి ఒకసారిగా తగ్గించారు. 2014 డిసంబర్ నుండి ఆయిన కీళ్ళ భాద సంభందించిన మందుని రోజువారి రెండుసార్లు (BD) తీసుకుంటూ మరియు ఒకసారి (OD) మోకాలు పైన వ్రాస్తున్నారు. కొన్ని నెలల క్రితం అసాధ్యం అనిపించిన పని ఇప్పుడు సాధ్యమైనందుకు చాలా సంతోషంగా ఉందని ఆయిన చెప్పారు. భగవానియొక్క అపారమైన కరుణ వల్ల ఆయినకి నయమైందని, స్వామికి కృతజ్ఞ్యతలు తెలుపుకున్నారు.

వెర్టిగో 12051...India

ఒక 48 ఏళ్ళ మహిళ రెండు సంవత్సరాలు తీవ్రమైన వెర్టిగో సమస్యతో భాధపడింది. ఆమెకు విపరీతమైన వికారం, వాంతులుతో పాటు నిలకడగా నడవలేక పోవడం వంటి లక్షణాలు ఉండేవి. ఆమె ఒక ఏడాది పాటు ఒక నాడీ శస్త్ర నిపుణుడు ఇచ్చిన అల్లోపతి మందులు వాడింది కాని ఉపశమనం కలుగలేదు. సాయి వైబ్రియానిక్స్ చికిత్స గురించి తెలుసుకొని ఆమె అభ్యాసకుడిని సంప్రదించింది. ఆమెకు ఈ క్రింద వ్రాసిన మందులు ఇవ్వబడినాయి:

CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC18.1 Brain disabilities + CC18.7 Vertigo…TDS

ఒక వారంలో ఆమెకున్న రోగ లక్షణాలు 90% వరకు తగ్గి మరో నెల రోజులలో ఆమెకు పూర్తి ఉపశమనం లభించింది. ఆమె ఇప్పుడు ఇవే మందుల్ని రోజువారి ఒకసారి తీసుకుంటోంది. ఇంత అద్భుతంగా ఆమెకు వ్యాధి నివారణ ప్రసాధించినంతుకు స్వామికి కృతజ్ఞ్యతలు తెలుపుకుంది.

UTI మరియు ఆస్తమా 02707 & 02766...UK

ఈ అభ్యాసకురాలి మేనల్లుడు (46 ఏళ్ళ వయస్సు) 2014 ఎప్రల్ 28 న విపరీతమైన వాంతులతో ఆశ్పత్రిలో చేర్చపడ్డాడు. అతనికి అనేక దీర్ఘ కాలిక ఆరోగ్య సమస్యలు కూడా ఉండేవి: నడవలేకపోవడం, మాట్లాడలేక పోవడం, ఎపిలెప్సి(అపస్మారం), శాశ్వత పక్షవాతం ద్వారా భాదితమైన ఒక చేయి మరియు కీళ్ళ వ్యాధి. ఇంతేకాకుండా అతనికి ఆస్తమా మరియు అల్లర్జీల వల్ల శ్వాస తీసుకోవడం మరియు ఆహారాన్ని మింగడం ఇబ్భందికరంగా ఉండేది. ఇన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నప్పడికి అతను అందరితోను ప్రేమగాను ఆనందంగాను సంవదించగలిగేవాడు.

ఒత్తిడి మరియు అనారోగ్యంవల్ల ఆశ్పత్రిలో అతనికి నిద్ర పట్టేదికాదు.

మే 1న పేషంటు మేనత్తైన వైబ్రో అభ్యాసకురాలు రాత్రి 8.30కి ఆశ్పత్రికి చేరుకున్నాక పేషంటును ఒక నిశబ్ధమైన గదిలోకి తరలించారు. అక్కడ అభ్యాసకురాలు పేషంటుకు హామీ ఇచ్చి అతను సురక్షితంగా మరియు ప్రశాంతంగా ఉండడానికి సహాయపడింది. ఆ రాత్రి 10కి డాక్టర్ పేషంటుకు తీవ్రమైన మూత్ర సంక్రమణ ఉందని పేషంటు రోగ చరిత్ర దృష్టిలో పెట్టుకొని, అతను కోలుకోవడం చాలా కష్టమని చెప్పారు. పేషంటుకి గాడ యాన్టిబయాటిక్లు ఇస్తే ఉపశమనం కలుగవచ్చని చెప్పారు.

ఏదేమైనప్పటికీ అభ్యాసకురాలు భగవాన్ మీద పూర్తి విశ్వాంతో వైబ్రో అభ్యాసకుడైన తన భర్తకు ఫోన్ చేసి SRHVPయంత్రం ద్వారా ఈ క్రింద వ్రాసిన మందుల్ని ప్రసారం చేయమని(బ్రాడ్ కాస్టింగ్) చెప్పింది.

UTI కోసం:
#1. CC13.2 Kidney & Bladder infections…6TD

శ్వాస సమస్య కోసం:
#2. "Breathe Well" (CC19.2 Respiratory allergies + CC19.3 Chest infections chronic + CC19.6 Cough chronic)…6TD

ఆ రోజు పేషంటు ఏమి తాగినా వాంతి చేసుకున్నాడు కాని ఆ ముందు ఉన్నదానికన్నా అతని పరిస్థితిలో మెరుగు ఏర్పడింది. మరుసటి రోజు అభ్యాసకురాలు పేషంటుకు వీటబిక్స్(ధాన్యంలో ఒక రకం) తినిపించింది. ఆ తర్వాత అతనికి ఆశ్పత్రిలో చేరాక మొదటిసారి నిద్ర పట్టింది. అతను క్రమంగా ఆహారం తీసుకోవడం ప్రారంభించాడు. మరో రెండు రోజులలో అతను అన్ని వేళలు ఆహరం తీసుకోవడం మొదలుపెట్టాడు.

పేషంటుకు అత్తైన ఈ అభ్యాసకురాలు ప్రతి రోజు అతనితో ఉదయం 8.30నుండి సాయంత్రం 5.30 వరకు ఉండేది. అభ్యాసకురాలి ప్రేమ, సంరక్షణ మరియు వైబ్రో మందులు కారణంగా పేషంటుకు పూర్తిగా నయమై మే 6న అతన్ని ఆశ్పత్రినుండి డిశ్చార్జ్ చేసారు.

క్రింద వ్రాసిన విధంగా పేషంటు వైబ్రో మందుల మోతాదుని క్రమంగా తగ్గించుకున్నాడు. మరో మూడు రోజులకు #1.మూడు సారులు(TDS) తీసుకున్నాడు, ఆపై మూడు రోజులకు రెండు సార్లు(BD), ఆపై ఒక వారానికి మూడు సార్లు (3TW) , ఆ తర్వాత కొన్ని వారాలకు వారానికి ఒకసారి(OW). అభ్యాసకురాలు క్రమానుగతంగా ఒక నివారణ చర్యగా ఈ మందుల్ని ప్రసారం చేయడం కొనసాగిస్తోంది.

ఒక కుక్కకు గుదము సంక్రమణ 11572...India

జైరాయనే ఒక ఏడున్నర ఏళ్ళ ఆడ  గోల్డెన్ రిట్రీవర్కు తీవ్రమైన గుదము సంక్రమణ కలిగింది. గుదము ప్రాంతం చుట్టూ చీము కారుతుండేది. దానికి జ్వరం లేదుకాని నీరసంగా ఉండేది. చీము కారే ప్రాంతంనుండి దుర్వాసన వస్తుండేది. దానికి అల్లోపతి కాని ఇంకే విధమైన వైద్యం కాని చేయించలేదు. 2015 ఎప్రల్ 23న అభ్యాసకుడు ఈ క్రింద వ్రాసిన మందుల్నిచ్చి కుక్కకు సోకిన వ్యాధిని నయం చేసింది

#1. CC1.1 Animal tonic + CC4.4 Constipation + CC21.11 Wounds & Abrasions…6TD

#2. CC4.4 Constipation + CC21.11 Wounds & Abrasions…6TD, applied externally in water

ఈ మందులిచ్చిన రెండోరోజుకి చీము కారడం తగ్గింది. కాని పుండు తగ్గలేదు. ఈ మందుల్ని మరో నాలుగు రోజులు కొనసాగించడంతో 80% నయమైంది. ఏడో రోజునుండి మోతాదు TDSగా తగ్గించబడింది. పది రోజుల తర్వాత ఆ కుక్కకు 100% నయమైంది.

అభ్యాసకురాలి వివరాలు 02817...India

 

నేను నా భర్త ఎలా వైబ్రో సాధకులుగా అర్హత పొంది ఈ అత్యుత్తమమైన సేవ చేసే అవకాశాన్ని పొందామన్నదాన్ని గురించిన అనేక వివరాలు తొలి అంతర్జాతీయ కాన్ఫరంస్ (2014 జనవరి) పుస్తకంలో ఇంతకు ముందే ప్రచురింప బడినాయి.సంక్షిప్తంగా నా వివరాలు: నేను గత 37 సంవత్సరాలుగా ముంబైలో నివసిస్తున్నాను. 2003 వరకు నేను అత్యంత అభివృద్ధి చెందుతున్న ఆధ్యాత్మిక జీవితాన్ని అనుభవించేదాన్ని. ఆ సమయంలో జరిగిన ఒక దురద్రుష్టకరమైన సంగటన నా జీవితాన్ని మార్చివేసింది. మనోవ్యాకులతా మరియు స్థానభద్ధమైన జీవన శైలి నాలో ఆర్థరైటిస్ (కీళ్ళ వాపు) రోగానికి దారి తీసాయి. ఎన్ని వైద్యాలు చేయించుకున్నా ఉపశమనం కలుగలేదు. ఒక స్నేహితుడు ద్వారా వైబ్రియానిక్స్ చికిత్స తీసుకుని పూర్తిగా కోలుకున్నాను. వైబ్రియానిక్స్ అందిస్తున్న మానవాతీతమైన ఫలితాలను స్వయంగా చూసాక నేను నా భర్త వైబ్రో అభ్యాసకులుగా శిక్షణ పొందాలని నిర్ణయించుకున్నాము. 2009 మేలో ముంబైలో ధర్మక్షేత్రంలో అసిస్టెంట్ వైబ్రో ప్రాక్టీష్నర్లుగా (AVP) శిక్షణ పొందడానికి అవకాశం వచ్చింది. 2011 జనవరిలో జూనియర్ వైబ్రో అభ్యాసకులుగా(JVP)శిక్షణ పొంది, ఆ తర్వాత 2011 ఎప్రల్ లో మేము తొలిసారిగా ప్రశాంతి నిలయం వెళ్ళినప్పుడు మాకు సీనియర్ వైబ్రో అభ్యాసకుల శిక్షణ పొందే అవకాశం లభించింది.

మేము ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్లో తొలిసారిగా SRHVP యంత్రం ఉపయోగించి జ్వరం మరియు ఒళ్ళు నొప్పులతో భాద పడుతున్న ఒక పిల్లవాడికి మందు తయారుచేసి ఇవ్వడం జరిగింది.ఒక గంటలో ఆ పిల్లవాడికి జ్వరం తగ్గి ఆకలికూడా వేసింది.అది చూసి మాకు ఎంతో ఆనందం కలిగింది.మేము పర్తి సందర్శించిన ప్రతిసారి, ఆ పుణ్యస్థలం ప్రేమా శాంతులతో నిండిన ఒక మహాసముద్రమన్న భావన మాలో కలుగుతుంది. 

2011 జులైలో మేము "ఆల్ ఇండియా టీచర్ ట్రైనింగ్"(రాష్ట్రీయ వైబ్రో ఉపాధ్యాయుల శిక్షణ) పూర్తి చేసాము.ప్రారంభంలో మేము జబల్పూర్ మరియు నాగపూర్లో ఇతర వైబ్రో ఉపాధ్యాయులకు సహకారులుగాయుండి అనుభవం పొందాము.ఇప్పటి వరకు మేము అనేక వర్క్ షాపులు జరిపి 80 పైగా AVP లు మరియు JVP లకు శిక్షణ ఇచ్చాము. భార్యాభర్థలిద్ధరము ఒక బలమైన జట్టుగా మా సేవను అందిస్తున్నామని నా భావన. మేము భారతదేశంలో ఇతర ప్రాంతాలలో వైబ్రియానిక్స్ యొక్క విశిష్టతను వ్యాప్తి చేయడానికి సహాయపడుతున్నంతుకు చాలా ఆనందిస్తున్నాము.ఇతర వైబ్రో సాధకులకు శిక్షణ ఇవ్వడం ద్వారా మా వైబ్రో సాధన  మరింత మెరుగు పడుతోంది.

మేము ఏడు సంవత్సరాలలో 12,000కు పైన పేషంట్లకు వైబ్రో చికిత్స ఇవ్వడం జరిగింది.ఇందులో 80% నుండి 90% కేసులలో విజయవంతమైన ఫలితాలు లభించాయి. మేము క్రమం తప్పకుండా ప్రతినెల రెండవ మరియు నాల్గవ శనివారం ముంబైలో ధర్మక్షేత్రంలో జరిపే వైబ్రో క్లినిక్లో హాజరవుతున్నాము.

మేము చేస్తున్న వైబ్రో సాధనపై కొన్ని ఆలోచనలు: ఏడేళ్ళగా వైబ్రో అభ్యాసం చేయడం వల్ల రోగుల సమస్యలు మరియు రోగ లక్షణాలు పైన మాకు మంచి అవగాహన, రోగ నిదానం చేసే సామర్ధ్యం పేరిగి ఉన్నత రీతిలో వైబ్రో చికిత్సను అందించ గలుగుతున్నాము.ముంబైలాంటి మహానగరాలలో అధికమైన కాలుష్యం, ఉద్యోగస్తులు ఎక్కువ సమయం ప్రయాణం చేయవలిసియుండడం, ఒత్తిడి వంటి కారణాల వల్ల మానసిక మరియు శారీరిక సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి.

బాబా ఎవరెవరినైతే ఈ చికిత్స ద్వారా నయం చేయాలనుకుంటున్నారో వారిని మా దగ్గరికి బాబాయే పంపిస్తున్నారు. వీలయినంత ఎక్కువగా వైబ్రో సేవను అవసరమైనవారికి అందించాలన్నదే మా లక్ష్యం.ఈ ఉన్నతమైన సాధన చేయడంతో మనమందరము కూడా భగవంతునియొక్క బిడ్డలమేయన్న నిజాన్ని గ్రహించగలిగాము.వైబ్రో సాధన ద్వారా మాకు సాటి మానవులకు సహాయ పడే ఒక సువర్ణ అవకాశం వచ్చిందని భావిస్తున్నాము. రోగులపై జాలి చూపడం కన్నా ప్రేమనివ్వడం ఎంతో ప్రధానమని నాకు అవగతమైంది. అనేక మంది రోగులు, వారి జీవనశైలిలో మేము చెప్పే సాధారణమైన అనుకూలమైన మార్పులు చేసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతున్నారు.

 మాకు ఎంతో ప్రేరణనిచ్చిన ఒక శిశుబాలుడు కేసు వివరం: కామెర్లు సోకిన ఒక శిశుబాలుడు వైబ్రో మందులతో నయం కావడంతో ఆ శిశువుయొక్క అమ్మమ్మగారు ఆ శిశువును "బాబా బిడ్డ" యని పిలిచేది. ఆ శిశువుయొక్క అందమైన నవ్వు చూసినప్పుడు భగవంతుడు స్వయంగా పంపుతున్న రోగులందరికీ ఇంకా ఎక్కువగా సేవనంధించాలని ప్రోత్సాహన కలిగింది. సర్వత్రా సర్వ వేళలా బాబా ఉనికిని మేము గ్రహించ గలుగుతున్నాము.

క్లిష్టమైన కేసులలో మేము SRHVP యంత్రాన్ని వాడి ప్రత్యేక మందుల్ని తయారు చేయడం చాలా ఉపయోగకరమని తెలుసుకున్నాము.కొన్ని కేసులలో పేషంటు తీసుకుంటున్న ఆంటిబయాటిక్ యొక్క నోసోడును ఆ పేషంటుకు  తయారు చేసివ్వడం మంచి ఫలితాలని అందిస్తోంది.ఈ విధముగా తయారుచేయబడిన నోసోడ్ ఆంటిబయాటిక్ వల్ల కలిగే దుష్ప్రభావాలను తొలగించడమే కాక అదే ఒక్క ఆంటిబయాటిక్లాగా పనిచేస్తుంది.

అంతర్జాతీయ వైబ్రియానిక్స్ కాన్ఫరంస్ పుస్తకంలో ప్రచురింపబడిన కేసు వివరాలు మరియు ఇతర సమాచారాలు వైబ్రియానిక్స్ చికిత్సపై పేషంటుల కున్న నమ్మకాన్ని మరింత బలపరచడానికి  చాలా సహాయకరంగా ఉంటాయని నా నమ్మకం. పేషంట్ల నమ్మకం పెరగడం వల్ల సఫలితాలు వేగంగా లభ్యమవుతాయి. పేషంట్లుకి సంభందించిన అన్ని వివరాలు ఒక పుస్తకంలో తప్పకుండా వ్రాస్తూండాలని, ఈ విషయంలో క్రమశిక్షణ పాటించడం ముఖ్యమని మేము అభ్యాసకులందరికీ సలహా ఇస్తూ ఉంటాము. అంతకంటే ముఖ్యంగా పేషంట్లు అభ్యాసకులని సంప్రదించడానికి  ఆనందంగా రావాలి. మా దెగ్గర శిక్షణ పొందిన అభ్యాసకులందరికీ వైబ్రో పుస్తకాలు చదువుతూ ఉండమని సలహా ఇస్తాము.

మేము వైబ్రో సాధన చేయడం వల్ల పొందిన శుభాస్సీసులు అనేకం.మాకు ఇంత ఉత్తమమైన సేవ చేసే అవకాశాన్ని ఇచ్చినందుకు బాబాకు మా కృతజ్ఞ్యతలు తెలుపుకుంటున్నాము.

అభ్యాసకురాలి వివరాలు 02892...Australia

నర్సింగ్ లో మరియు ప్రసూతివైద్యం లో నాకు నేపధ్యముంది.నేను ప్రస్తుతం స్వామీ యొక్క ఐదు మానవతా విలువలను భోధించే ఉపాధ్యాయులకు సహకారిగా శిక్షణ పొందుతున్నాను.నేను స్వామి యొక్క ఆచరణాత్మక ఆధ్యాత్మిక బోధనల ఆధారంగా ఒక పుస్తకం కూడా రాస్తున్నాను.

నేను 1999 నుండి స్వామీ భక్తురాల్ని.2013 గురుపూర్ణిమ సందర్భంలో నాకు వైబ్రియానిక్స్ గురించి తెలిసి ఇదే నేను చేయవలసిన సాధనయని నాకు అనిపించింది.నా దరఖాస్తు పత్రాన్ని డా.అగ్గర్వాల్ గారికి సమర్పించాను.నన్నుఆస్ట్రేలియాకి వెళ్లి ఆన్లైన్ కోర్సు పూర్తిచేశాక తిరిగి వచ్చి మిగతా కోర్సు పూర్తి చేయమని చెప్పారు.నాకు ఈ సేవ ద్వారా అందరికి సహాయపడాలని అనిపించి నవంబర్ నెల లో స్వామి పుట్టినరోజు సమయంలో తిరిగి వచ్చి కోర్సు పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాను.2013లో నేను కోర్సు పూర్తి చేసాను. 2015 నవంబర్ లో సీనియర్ కోర్సు చేయడానికి తిరిగి పర్తి వెళుతున్నాను. భవిష్యత్లో శిక్షకుల కోర్సు చేయాలన్నది నా లక్ష్యం. స్వామి సేవ చేయగలగడం నా అధ్రుష్టమని నేను భావిస్తున్నాను.సేవ చేయడం వల్ల స్వామీ దీవెనలు ఎంతగానో నాకు లభ్యమవుతున్నాయి.

సాయి వైబ్రియానిక్స్ చికిత్స తీసుకున్న పేషంట్లలో చూసే అద్భుతాలన్నిటికీ మూల కారణం స్వామీ యొక్క దివ్యానుగ్రహం మాత్రమే. నేను ఆస్ట్రేలియాలో సాయి వైబ్రియానిక్స్ సహ సమన్వయకర్తగా ఉండే అవకాశం కూడా నాకు లభ్యమైంది.ఆస్ట్రేలియా చాలా పెద్ద దేశం కావడం వల్ల అభ్యాసకులు ఎక్కువ సంఖ్యలో ఉండడం ఎంతో అవసరం.

ప్రస్తుతం నేను ఆస్ట్రేలియాలో ఉన్న సాయి వై బ్రియానిక్స్ పేషంట్లకి చికిత్స అందిస్తున్నాను.నేను ఫోన్,స్కయిప్ ,ఈమెయిలు ద్వారా పేషంట్లను సంప్రదించి మందుల్ని మెయిల్లో పంపిస్తున్నాను. సాయి భక్తులు వైబ్రో మందుల్ని భక్తితో మరియు పూర్తి విశ్వాసంతో తీసుకుంటున్నారని, ఇతరులు వెంటనే ఉపశమనం ఆశిస్తున్నారని నా అనుభవంలో నేను చూసాను. ఉపశమనం కలుగడానికి కొంత సమయం పట్టవచ్చని నేను నా పేషంట్లకు చెప్తాను.ఉదాహరణకు 25 ఏళ్ళగా బైపోలార్ డిసార్డర్ తో భాదపడుతున్న ఒక వ్యక్తికి పూర్తిగా నయంకావడానికి ఒక సంవత్సరం పట్టింది కాని అతను తీసుకుంటున్న 18 అల్లోపతి మందుల్నుంది విముక్తి పొందాడు. 'సాయి వైబ్రియానిక్స్ మానవజాతి కోసం సిద్ధంగా ఉంది, కానీ మానవాళి సాయి వైబ్రియానిక్స్ కోసం సిద్ధంగా లేదు' అని మాకు చెప్పబడింది, కాని స్వామీ ప్రేమ,శ్రద్ధ కొరకు తపించే అనేక మంది, పేషంట్లను నన్ను సంప్రదించడానికి పంపిస్తునే ఉంటారు. వారందరు కూడను ఈ వైద్యం ఉచితంగా ఇవ్వబడుతున్నందుకు ఎంతో క్రుతజ్ఞ్యత చూపారు.

 నేను "యు కేన్ హీల్ యువర్ లైఫ్"అన్న లూయీ హే పుస్తకంలో అందజేసే 'కొత్త మానసిక ఆలోచనా విధానాలు' నేను సాయి వైబ్రియానిక్స్ చికిత్సలో ఉపయోగపరుస్తున్నాను.నేను పేషంటు కోసం ఎంపిక చేసిన కొత్త ఆలోచనా విధానాన్ని ఒక రంగుల కాగితం మీద రాసిస్తాను.అదే కాగితం మీద రంగుల సీతాకోకచిలుక స్టికర్ని కూడా అతికిస్తాను.నేను నా పేషంట్లను ఈ మంత్రాన్ని మందు తీసుకుంట్టున్నపుడు లేదా ఇంకెప్పుడైనా చెప్పుకోమని సలహా ఇస్తున్నాను.

నేను ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో నివసిస్తున్నాను.ఈ కేంద్రం వారానికి రెండు సార్లు తెరిచి ఉంటుంది. ఈ కేంద్రాన్ని సందర్శించడానికి అనేక మంది వస్తూంటారు.వీళ్ళలో అనేక మందికి వైబ్రో చికిత్స అవసరం ఉంటోంది కనుక అనేక మంది పేషంట్లకు సేవ చేసే అవకాశం నాకు లభిస్తోంది.

స్వామీ నాపై చూపించిన అపార కరుణ నేను మాటల్లో చెప్పలేను.స్వామి సేవ చేయడం నా అద్రుష్టంగా నేను భావిస్తున్నాను. "నా పని మీరు చేస్తే మీ పని నేను చేస్తాను" అని స్వామీ అన్న మాటలు ఎంత నిజమో.ఈ "నిశబ్ద విప్లవం"లో పాల్గొంటున్న సాయి వీరులైన మనమందరము ఎంతో ధన్యులం.

అభ్యాసకురాలి వివరాలు 02901...Italy

అబ్యాసకురాలు02494...ఇటలీ ఇట్లు వ్రాస్తున్నారు: అభ్యాసకురాలు02901...ఇటలీ వరోన లో సంరక్షణాలయం డాల్ అబాకో వద్ద వయలిన్ నేర్చుకోవడం ప్రారంభించిన తర్వాత ఆమెకు ఒపరా గానంపై మరింత ఆశక్తుందని కనుగొన్నారు. 1983లొ హానర్స్ గ్రాడువేట్గా పట్టా పొంది 1984 నుండి ఆమె స్పాలేతో గ్లక్కుయోక్క ఒపరా "ఓర్ఫియో"లో ప్రధాన పాత్రను వహిస్తూ ఆమె తన కరీయర్ను ప్రారంభామించారు.ఆమెకు 25 ఏళ్ళ వరకు ఈ కరీయర్ అమోఘ్మగా కొనసాగింది. ప్రస్తుతం ఈ అభ్యాసకురాలు వెరోన సంరక్షణాలయంలో సంగీతంపై ఉపన్యాసాలిస్తున్నారు మరియు ఇటలీ, జపాన్, ఆస్ట్రియా మరియు ఇతర దేశాలలో మాస్టర్ తరగతులు తీసుకుంటున్నారు.1992 నుండి ఆమె తన గురువుగారికి సహాయ పడుతున్నారు.1996లొ వెరోనాలో కళాత్మక శిక్షను అందించే ఒక అకాడమి ను స్థాపించారు.ఈ అకాడమి లో ఆత్మశోధన నిమిత్తమై దేహ ఎరుకను (బాడి అవేర్నేస్స్) పెంచడానికి పూర్నరూపాంతకమైన శిక్షణ ధ్వని మరియు కదలికలు ద్వారా  ఇవ్వడం జరుగుతోంది.

అభ్యాసకురాలు02901...ఇటలీ వ్రాస్తున్నారు: నేను వైబ్రియానిక్స్లో  నా స్నేహితుడైన అభ్యాసకుడు02494...ఇటలీ ద్వారా అడుగుపెట్టాను.ఈ అద్భుతమైన చికిత్స ద్వారా నాకు మరియు నా కుటుంభ సభ్యులందరి ఆరోగ్య సంరక్షణకు ఎంతో ఉపయోగకరంగా ఉంది.గత ఐదేళ్ళగా నేను వై బ్రియానిక్స్ అభ్యాసం చేస్తున్నాను.

ఇంత మహత్తరమైన చికిత్సా విధానాన్ని ప్రసాదించినందుకు భగవంతుడికి కృతజ్ఞ్యతలు తెలుపుకుంటున్నాను.నేను మనస్పూర్తిగా నాకున్న సమయంలో  ఈ సాధన ద్వారా అవసరమైన వారికి సహాయపడుతున్నాను.ఈ చికిత్స ద్వారా రోగులకు కేవలం శారీరిక సమస్యలే కాకుండా మానసిక సమస్యలు  కూడను నయమవ్వడం దీని ప్రత్యేకత.ఈ చికిత్స తీసుకోవడం ప్రారంభించాక రోగుల ప్రవర్తనలో మరియు నడతలో పరివర్తన రావడం నేను గమనిస్తున్నాను. భగవంతుడు చూపించే మహిమలకు ఇదొక గొప్ప ఉదాహరణని నేను భావిస్తున్నాను.

జవాబుల విభాగం

1.  ప్రశ్న: నేను నెలవారీ నివేదికలు క్రమంతప్పకుండా పంపిస్తున్నాను కాని ప్రతి నెల నా రికార్డు పుస్తకం నుండి నేను సేవ చేసిన సమయం మరియు నేను చికిత్స ఇచ్చిన రోగుల సంఖ్య లెక్కపెట్టడానికి సమయం చాలా ఎక్కువ తీసుకుంటున్నాను.ఇది సులభంగా తక్కువ సమయంలో చేయడానికి మార్గమేదైన ఉంటె చెప్పాలని కోరుకుంటున్నాను.

     జవాబు: క్రింద పట్టికలో ఇచ్చిన విధముగా నిలువుగా టైటిల్స్ తో పాటు ఆరు భాగాలు చేసుకోండి:

తేది           సేవ చేసిన సమయం (గంటల్లో)    కొత్త పేషంట్లు     పాత పేషంట్లు      జంతువులు      మొక్కలు
1.4.15                             2.5                     1                       3                   1                 6
3.4.15                             0.5                    0                       1                    0                 6
.........                            ........                .......                 .......                .......         .......
30.4.15                           3.5                    2                       1                    0                 3
Total                               31                   24                     15                   5                99

పై ఉదాహరణలో చూపిన విధంగా ప్రతి సమావేశం పూర్తైన తర్వాత తగిన సంఖ్యలు రికార్డు పుస్తకంలో నమోదు చేసుకోవాలి. ప్రతి నెల చివరిలో మీరు కేవలం మీ నెలవారీ నివేదికలో ఐదు నిలువ వరుసలలో ఉన్న సంఖ్యలను జోడించి మొత్తాన్నిరాయాలి.ఇలా చేస్తే మీకు నెలవారీ నివేదికను రాయడం చాలా సులభమవుతుంది.

________________________________________

 2.  ప్రశ్న: కొన్నిసార్లు వై బ్రో మందుల ద్వారా నొప్పినుండి ఉపశమనం కలుగడం లేదు.ఇలాంటప్పుడు ఏమిచేయాలో చెప్తారా?     

జవాబు: డైక్లో ఫెనాక్ వంటి బలమైన అల్లోపతి పెయిన్ కిల్లర్ల నోసోడ్స్ తయారు చేసి ఇవ్వడం ద్వారా మంచి ఫలితాలు లభించ్చాయి. కాని కొంత మంది పేషంట్లకు అసలైన అల్లోపతి పైన్కిల్లర్ని కూడా వీటితో పాటు తీసుకొవలిసివచ్చింది. క్రమంగా అల్లోపతి పయిన్ కిల్లర్ మోతాదుని తగ్గించి ఆపై పూర్తిగా మానేశారు.అదనంగా రోగంపైనున్న దృక్పధాన్ని మార్చుకోమని మీ పేషంట్లకు మీరు సలహా ఇవ్వాలి. ఉదాహరణకు పేషంటు తనకున్న నొప్పి తగ్గుతున్నట్లు ఊహించుకోవడం మరియు  రోగంపై కాకుండా ఆశక్తికరమైన కార్యకలాపాలుమీద తన ద్రిష్టిని మళ్ళించడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మీరు సలహా ఇవ్వాలి. అంతే కాకుండా " నాకు నొప్పి లేదు,నేను భగవంతుడి దయతో ఆరోగ్యంగా ఉన్నాను" వంటి సానుకూలమైన నిర్ణయాలను మళ్ళి మళ్ళి చెప్పుకోమని మీరు పేషంట్లను ప్రోత్సాహించాలి.

________________________________________

3.  ప్రశ్న: పేషంట్లు నోసోడ్తో పాటు ఇతర వై బ్రో మందుల్ని కూడా తీసుకోవడం కొనసాగించవచ్చా?

      జవాబు: నోసోడ్ తీసుకుంటున్న ఒక పేషంటుకు కేవలం నోసోడ్ మాత్రమే ఇవ్వడం శ్రేష్టం. కొన్ని ప్రత్యేక సందర్భాలలో, నోసోడ్ తొ పాటు ఇతర వైబ్రేషన్లు ఇవ్వవచ్చు కాని కేసుకి తగిన చికిత్స అందించడం చాలా ప్రధానం. మీరు [email protected] వద్ద మీ ప్రశ్నలను పంపితే మా పరిశోధన టీంలో ఉన్న నిపుణుల సలహాలని పొందవచ్చు.

________________________________________

4.  ప్రశ్నరాగి లేదా వెండి పాత్రల్లో ఉంచిన నీరు త్రాగే పేషంట్లు వైబ్రో మందుల్ని తీసుకోవచ్చా?

      జవాబురాగి లేదా వెండి పాత్రల్లో ఉంచిన నీరు త్రాగడం ఆరోగ్యానికి లాభదాయకం మరియు అలాంటి నీరు వై బ్రెషన్లను తటస్తం చేయదన్న శుభావార్తని తెలుపుకుంటున్నాను. వైబ్రో మందుల్ని విడిగా ఉంచాలి. వీటిని లోహపు పాత్రల్లో తయారు చేయడంకాని లేదా ఉంచడంకాని చేయరాదు.

________________________________________

5.  ప్రశ్న: మందు సీసా పైన అతికించే పట్టీ మీద రోగం యొక్క పేరును రాయరాదని నాకు ఇటీవల తెలిసింది.పట్టి మీద రాసే సరియైన విధం ఏమిటో చెప్పమని కోరుకుంటున్నాను.

     జవాబు: మొదటి సందర్శన సమయంలో ప్రతి పేషంటుకు ఒక ప్రస్తావన సంఖ్యను కేటాయించాలి.ఈ సంఖ్యను సీసా పట్టీ మీద వ్రాయవచ్చు.రికార్డుల సంఖ్యలు క్రమంలో ఉంచితే పేషంటు యొక్క తదుపరి సందర్శనలో రోగియొక్క పూర్తి రికార్డును చూడడం సులభంగా ఉంటుంది. సీసా పట్టి మీద రోగం యొక్క పేరుని లేదా రోగ లక్షణాలని వ్రాయరాదని గుర్తుంచుకోవాలి.ఒక పేషంటుకి రెండు లేదా మూడు సీసాలు ఇస్తున్నప్పుడు పట్టీల మీద "శాంతి","ఆరోగ్యం"లాంటి రోగి సమస్యకి తగిన సానుకూల పదాలు వ్రాయడం మంచిది. ఒకే కుటుంభానికి చెందిన వ్యక్తులకు చికిత్సనందిస్తుంటే పేషంటు యొక్క పేరులో మొదటి అక్షరాన్ని సీసా పట్టీ మీద వ్రాయవచ్చు.

________________________________________

6.  ప్రశ్న: వైబ్రియానిక్స్ పుస్తకంలో పేషంట్లు రోజుకి 8 నుండి 12 కప్పులు నీరు త్రాగాలని చెప్పబడియుంది. ఒక పేషంటుకు గర్భాశయ ఫైబ్రాయిడ్లు సమస్య వల్ల మూత్రాశయంపై ఒత్తిడి పెరిగి మూత్ర విసర్జన ఇబ్భందికరంగా ఉండేది.ఎక్కువ నీరు త్రాగడం వలన ఆమె సమస్య మరింత తీవ్రమైందని నాతో చెప్పింది. మరి కొందరు పేషంట్లు రోజుకి 8 నుండి12 కప్పులు త్రాగాలన్న సిఫారసును కచ్చితంగా అనుసరించాల్సి ఉందాయని అడుగుతున్నారు.నేను వారికి వీలైనంత వరకు నీరు త్రాగితే చాలని చెప్పవచ్చా?     

జవాబు: రోగిని గుణపరచడానికి రోగి శరీరంలో ఉన్న విషపదార్థాల తొలగింపు ఎంతో అవసరం.ఇది నీరు ఎక్కువగా త్రాగడం వల్ల సులభంగా సాధ్యమవుతుంది. అధికంగా నీరు త్రాగడం వల్ల మరో ఉపయోగముంది.అదేమిటంటే వైబ్రో మందులు తీసుకుంటున్నప్పుడు ఒక వేళ పేషంటుకు పుల్ అవుట సంభవిస్తే అధికంగా నీరు త్రాగడం వల్ల విషపదార్థాల తొలగింపు వేగంగా జరిగి ఒక సులభమైన పుల్ అవుట కి దారి తీస్తుంది. పేషంట్లకు వాళ్ళు సాధారణంగా త్రాగే నీటికన్నా కొంచం ఎక్కువ నీరు త్రాగమని మృదువుగా చెప్పండి. తక్కువ నీరు త్రాగి నేరం చేస్తున్నానన్న భావన పెషంట్లో కలుగ నివ్వదు.

________________________________________

7.  ప్రశ్నఉధ్యొగస్థులైన పేషంట్లకు మధ్యాహ్నం డోస్ తీసుకోవడం వీలు పడటలేదు. వాళ్ళు తమ ఆఫీసులలో కంప్యుటర్ మరియు మోబాయిల్ ఫోన్లనుండి వచ్చే కిరణ ప్రసారం వల్ల వైబ్రో మందుల్ని ఆఫీసులకు తీసుకు వెళ్ళడానికి ఇష్ట పడట్లేదు. దీనికి ఏదైనా పరిష్కారం ఉందా

      జవాబు: వికిరణం నుండి మందుల్ని రక్షించడానికి ఒకటి లేదా రెండు పిల్ల్స్ ను ఒక చిన్న కాగితంలో చుట్టి ఆఫీసుకు తీసుకు వెళ్ళచ్చు. ఒక వేళ మీరు మందపాటి రేకు రాపర్ ఉపయోగిస్తే, ఆ రాపర్ పిల్ల్స్ కు తగలకుండా ఉంచాలి.

ప్రధాన వైద్యుడు యొక్క దివ్య వాక్కు

 “ఈనాడు మానవుడు ఆందోళనతో భాధపడుతున్నాడు. ఆందోళనకు కారణం ఏమిటి? సంతృప్తి లేకపోవడమే దీనికి కారణం.ధనవంతుడకు సంపద పెర్చుకున్నప్పటికి సంతృప్తి లేదు.వర్రీ వలన హర్రీ మొదలవుతుంది. రెండు అనారోగ్యానికి దారి తీస్తున్నాయి.వర్రీ, హర్రీ మరియు కర్రీ (కొవ్వు పదార్ధాల), ఇవి మూడు హృదయ రోగాలు రావడానికి మూల కారణాలు.

కొవ్వు పదార్థాలు ఎక్కువ పరిమాణంలో తీసుకోవడం హృదయ వ్యాధులు రావడానికి అతిముఖ్య కారణం. కొవ్వు అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటే భరువు పెరిగి హృదయ వ్యాధులు కలుగుతాయని డాక్టర్లు కొవ్వు పదార్థాలను భుజించరాధని సలహా ఇస్తున్నారు. విషపదార్థాల వల్ల కూడా చాలా హాని కలుగుతుంది.అందుకని అందరు కూడను బలమైన ఆహారాన్ని మితముగా తీసుకోవాలి మరియు ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి మత్తు పానీయాలను త్రాగరాదూ. 50 సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత ఆహారం తీసుకోవడం క్రమంగా తగ్గించుకోవాలి”.  
–సత్యసాయి బాబా, దివ్యోపన్యాసం, 21 జనవరి 1994

 

 

“స్వచ్చమైన గుండె (purity of heart) ఉంటె అద్భుతాలు చేయవచ్చు. స్వచ్చమైన గుండెతో మొదలుపెట్టిన పనైనను విజయవంతమవుతుంది.మీ పనిలో ప్రేమా త్యాగాలు నిండియుంటే దనం హిస్తుంది".
–సత్యసాయి బాబా, దివ్యోపన్యాసం, 21 సెప్టంబర్ 1994,

 http://www.sssbpt.info/ssspeaks/volume27/sss27-03.pdf

ప్రకటనలు

❖  ఫ్రాన్స్ టూర్స్: AVP వర్క్ షాప్ 20-21 జూన్ 2015, సంప్రదించాల్సిన వ్యక్తి  డానియల్లె at [email protected]

❖  USA షెఫర్డ్స టవున్,WV: AVP వర్క్ షాప్ 17-19 జూలై 2015 మరియు also 11-13 సెప్టంబర్ 2015. SVP వర్క్ షాప్ 18-20 September 2015, సంప్రదించాల్సిన వ్యక్తి సూసన్ at [email protected].

❖ ఇండియా, పుట్టపర్తి, AP: AVP వర్క్ షాప్ 23-26 జూలై 2015, సంప్రదించాల్సిన వ్యక్తి  హేమ at [email protected]

❖  UK లండన్: రిఫ్రెషర్ సెమినార్ 4 Oct 2015 మరియు కోవంత్రి:అవేర్నెస్ ప్రదర్శన 12 జూలై 2015, సంప్రదించాల్సిన వ్యక్తి జేరం at    [email protected] లేదా టెలిఫోన్ ద్వారా 020-8551 3979 

 ❖  ఇండియా పూణే, మహా: రిఫ్రెషర్ & JVP సెమినార్ 10-11 అక్టోబర్ 2015, సంప్రదించాల్సిన వ్యక్తి  పద్మ at [email protected]

❖  ఇటలీ, పాడువా, వెనిస్: SVP వర్క్ షాప్ 16-18 అక్టోబర్ 2015, సంప్రదించాల్సిన వ్యక్తి  మనోలిస్ అత్ [email protected]

❖  ఫ్రాన్స్ టూర్స్: AVP వర్క్ షాప్ 20-21 జూన్ 2015, సంప్రదించాల్సిన వ్యక్తి  డానియల్లె at [email protected]

అదనంగా

18 మే 2014 ఇల్ఫోర్డ్, ఎసెక్స్, UKలో జరిగిన వై బ్రియానిక్స్ అభ్యాసకుల వార్షిక రిఫ్రెషర్ కోర్సు నుండి కొన్ని అంశాలు

1.0 హాజరైనవాళ్ళు: 25 అభ్యాసకులు , 3 అతిథులు. డా.జిత్ కే అగ్గర్వాల్ ప్రధార్శననిచ్చారు. డా.అగ్గర్వాల్ ఆ రోజు నిర్వాహకుడైన,UK  సమన్వయకర్తైన  మరియు జనవరి 2014లో ప్రశాంతి నిలయంలో జరిగిన మొదటి అంతర్జాతీయ సాయి వైబ్రియానిక్స్ అభ్యాసకుల కాన్ఫరంస్లో ఎంతో ఎక్కువగా సహాయపడిన  అభ్యాసకుడకు 02822...UK ,ధన్యవాదాలు తెలుపుకున్నారు.

1.1       108 కామన్ కాంబో బాక్సు   

ఈ బాక్సుని ప్రతి రెండు సంవత్సరాలకి ఒక సారి రీచార్జ్ చేయాలి. లేకపోతే మందులు దుర్భలం అవుతాయి. విద్యుత్- అయస్కాంత వికిరణం కాంబోల యొక్క సమర్థతను ప్రభావితం చేస్తుంది.విద్యుత్ ద్వారాలు , భూగర్భ ప్రవాహాలు , మొబైల్ ఫోన్లు మరియు ట్రాన్స్మిటర్లు వంటి వాటితో జాగ్రత్త వహించండి. అనింటి కన్నా ఎక్కువ హాని కార్డ్లెస్ ఫోన్లు వల్ల కలుగుతుంది.Wi -Fi : రౌటర్ / మోడెమ్ పడక గదిలో ఉంటె రాత్రి దాన్ని ఆపివేయండి

1.2      చక్రాలు

  • మన అవయవాల ఆరోగ్యం చక్రాలపై ఆధారపడి ఉంటుంది.(7 ప్రధాన + 2 అర్ధ ప్రధాన మరియు 300 పైనున్న ఇతర చక్రాలు)..
  • చక్రాలు అవయవాలను ఆరోగ్యకరంగా ఉంచడానికి మరియు సంతులత కొరకు శక్తిని అందుకుంటాయి.ఒక చక్రంలో అసమతుల్యత లేదా సంతులత లేకపోతే ఈథరు శరీరంలో వ్యాధి ఉద్భవించి క్రమంగా అది భౌతిక అవయవంల్లో విశదపరుస్తుంది.చక్రాలకు రంగులుంటాయి.ఎవరైతే ఈ చక్రాలని  చూడగలుగుతారో వాళ్ళు ఇతరులలో ఉన్న సమస్యలను చూడగలుగుతారు. ఈ సామర్ధ్యాన్ని అభివృద్ధి పరుచుకుంటే వైబ్రియానిక్స్ ఆచరణలో సహాయకారిగా ఉంటుంది.
  • మనస్సు వ్యాధులకు మూలకారణం. స్వామీ సులభంగా అర్ధమయ్యేలా "మంచి చూడండి,మంచిగా ఉండండి మరియు మంచి చేయండి" అని చెప్పారు.మనస్సు స్వచ్చంగా ఉంటె అనారోగ్యాలు దూరంగా ఉంటాయి.
  • అసూయ, కోపం, ద్వేషం, దురాశ, మదం, అహంకారం, మరియు కామము వంటి ఏడూ శత్రువులు మనలో ఉన్నాయి.స్వామీ తన భోధనల్లో చాలా సులభమైన మార్గం ఒకటి చెప్పారు: మీరు ఒక దుర్గుణం(శత్రువు) నియంత్రించడానికి ప్రయత్నిస్తే చాలు స్వామీ మిగతావాటిని చూసుకుంటారు.ఈ కలియుగంలో ఏమిచేసినా ఎదోయోక్క గడియలో అనారోగ్యం రాక తప్పదు.
  • సువర్ణ యుగం లోకి అడుగు పెడుతున్నామని అందరు అంటున్నారు.కొందరికి సువర్ణ యుగం రానే వచ్చింది. సానుకూలమైన వాతావరణం ఉన్నప్పుడు సువర్ణ యుగం సర్వత్రా వ్యాపిస్తుంది.

1.3     మన ఆలోచనలు

  • మన ఆలోచనలు మన ఆరోగ్యానికైన అనారోగ్యానికైన మూల కారణం. ఆరోగ్యం నిగూఢమైన శక్తులపై ఆధారపడి ఉంటుంది. ప్రతికూల ఆలోచనలువల్ల ప్రతికూల స్పందనలు సృష్టించబడతాయి. ఈ ప్రాథమిక నిర్మాణ కణాల ద్వారా శక్తి ప్రవహిస్తుంది.మనలో ఒక ప్రతికూల ఆలోచన కలిగిన వెంటనే అది  భాహ్య ప్రపంచానికి వెళిపోతుంది. దాన్ని ఆపడం చాలా కష్టం.
  • మనము ఎల్లప్పుడూ సానుకూల ఆలోచనలనే సృష్టించుకోవాలి,వీటిలో అతిముఖ్యమైనది క్షమా భావన. మనను దుఖించిన వ్యక్తులు ఎవరో ఒకళ్ళు అందరికి ఉండే ఉంటారని డా.అగ్గర్వాల్ చెప్పారు. మనకి దుఖం కలిగిన సందర్భాన్ని ఒకటి ఊహించుకొని ఆ దుఖం కలిగించిన వ్యక్తికి మీరు క్షమను మరియు మీ ప్రేమను పంపించందని ఆయన చెప్పారు.ఆ వ్యక్తికు ప్రేమను పంపడం ద్వారా ప్రతికూల ఆలోచనలు తొలగిపోతాయి. కొద్ది రోజులలోనే మీకు సానుకూలమైన ప్రతిస్పందన లభ్యమవుతుంది.ఈ ప్రతిస్పందనను మనం డా.అగ్గర్వాల్ తనకు మెయిల్ పంపవలసిందిగా కోరారు. వ్యాఖ్యానం: ఈ చర్య చేయడంవల్ల కలిగే ప్రయోజనాన్ని గుర్తించి అందరు చాలా మంచి ప్రతిపుష్టినిచ్చారు. అందులో ఒక అభ్యాసకురాలు ఈ సాధన చేసిన తర్వాత తన జీవితంలో ఒక మంచి మలుపు ఏర్పడిందని చెప్పింది.
  •  మీరు క్షమిస్తే మర్చిపోతారు. కాని గుర్తుంచుకుంటే క్షమించనట్లే. అంతయు దైవ సంకల్పమే, ఇంకెవరు భాధ్యులు కారని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం.
  • మనము ఇతరులను నియంత్రించడానికో లేదా మార్చడానికో ఇక్కడ లేము.మనలో మార్పు తెచ్చుకోవాలి.భగవంతుడిని నియంత్రణ తీసుకోమని ప్రార్థించండి. మన వైఖిరిని మార్చుకోవాలి.

 • ‘మన గుండె ఒక సీటున్నసోఫా లాంటిది.ఇది కేవలం దేవుడికి మాత్రము దాచిపెట్టండి.

 • మంచి మరియు అనుకూల ఆలోచనలు ఆహ్వానించండి.                                                                             

  • వ్యాధి నివారణకై చికిత్స పొంధడంకన్న వ్యాధి రాకుండా జాగ్రతలు వహించడం మన అంతిమ లక్ష్యం కావాలి.

1.4    వైబ్రియానిక్స్ మందుల మీద ఆలోచనలయోక్క ప్రభావం

కొందరు పేషంట్లకు వై బ్రో మందులు ప్రారంభంలో పనిచేసినట్లు తర్వాత పని చేయట్లేదన్న అనుభూతి కలుగుతోంది.దీనికి ఈ క్రింద వ్రాసిన కారణాలు కావచ్చు:                                                                                                         

  • పేషంట్లు శీఘ్ర నివారణ కోసం చూస్తున్నారు; వాళ్ళు వైబ్రియానిక్స్ పిల్ను 'మేజిక్ పిల్' అనుకుంటున్నారు.
  • పేషంట్లు ఇతర వైద్యాలు ఎంతకాలం తీసుకున్నారు? ఐదు రోజులలో నయం కావాలంటే ఎలా సాధ్యం?దీర్గ కాలిక వ్యాధి ఒక అలవాటు లాంటిది లేదా ఒక  వృక్షం వంటిది.అది శరీరంలో లోతుగా పాతుకుపోయి ఉంటుంది. చక్రాలలో అసమతుల్యత ఏర్పడియుంటుంది. పేషంట్లు అవాస్తవ అంచనాలతో వస్తున్నారు.దీనివలన నిరాశ చెందుతున్నారు.
  • పేషంట్లు నియమాలు పాటించకపోవడం లేదా జాగ్రతలు వహించకపోవడం
  • పేషంటు యొక్క ఆలోచనలు నివారణకు అడ్డుకావచ్చు.పేషంట్లు అసహనం వల్ల మరియు ఉపశమనం లభించట్లేదన్న తమ ప్రతికూల ఆలోచనలవల్ల ఒక అడ్డును సృష్టించుకుంటున్నారు. దీనివల్ల నయంకావడానికి మరింత సమయం పడుతుంది.
  • ఒక వ్యక్తి గాడమైన విశ్వాశాన్ని కలిగియుంటే, అది సానుకూల సౌరభం మరియు శక్తిని సృష్టిస్తుంది కాబట్టి నివారణ త్వరగా జరుగుతుంది.

పేషంట్ల మొదటి సంపర్కంలో గుర్తుంచు కోవలసిన విషయాలు:

  • అధికంగా మాట్లాడే అవసరం లేదు.వై బ్రియానిక్స్ గురించి క్లుప్తంగా ఇలా చెప్పండి - ఇది సరళమైన,ఉచితమైన మరియు దుష్ప్రభావాలు లేన వైద్య విధానమని. ఈ వైద్యంలో ఏ విధమైన రసాయన పదార్థము ఉపయోగించలేదని మరియు ఇది కేవలం భగవంతుడు కృప మాత్రమేయని చెప్పాలి. వాళ్ళ వ్యాదులకి సంభందించిన విషయాలు తెలుసుకోవాలంటే పేషంట్లను వైబ్రియానిక్స్ వెబ్సైటు కు వెళ్లి గత వార్తాలేఖలను చదువమని చెప్పవచ్చు[www.vibrionics.org లేదా news.vibrionics.org] పురాతన సమస్యతో ప్రారంభించి పేషంట్ వ్యాధి సంభందించిన అన్ని విషయాలు మీ పేషంటు రికార్డు పుస్తకంలో రాసుకోవాలి.
  •  నివారణ సమయం గురించి పేషంట్లతో మాట్లాడవద్దు. నయం చేసేది మందులు కాదు దేవుడని చెప్పండి.వాళ్లకి ఓర్పుతో ఉండమని చెప్పి నయమవుతారని హామీనివ్వండి.  
  • పుల్ అవుట్ గురించి సరైన విధంలో వివరించండి.

సెషన్ యొక్క సారాంశము: వైబ్రేషన్ల ప్రభావం మన జీవితం పైన ఉంటుంది.ప్రతికూల ఆలోచనలు ఒక చక్రాన్ని కలతపర్చి ఆ చక్రానికి సంభందించిన అవయవంలో అనారోగ్యానికి దారితీస్తాయి.

1.5 ప్రశ్నలు

1.5.1 ప్రశ్న: వివాహాలలో మద్యం త్రాగమనడం మరియు మాంసాహారం అందించటం వంటి అంగీకరించలేని పరిస్థితిలు ఏర్పడితే మేము ఏంచేయాలి?

జవాబు: మనము ఇతరులు చేసే వాటికి ఎదురు చెప్పకుండా వాళ్లకు మన ప్రేమను మాత్రమే అందించాలి. మనం ఇతర్లుని మార్చలేము. మనం మనల్ని మార్చుకుని ఇతర్లకు నిదర్శనంగా ఉండాలి.

1.5.2 ప్రశ్న: కొందరు పేషంట్లు వైబ్రో మందులు ప్రారంభంలో భాగా పనిచేసి తర్వాత పని చేయడంలేదని భావిస్తున్నారు.దీనికి పరిష్కారం ఏమిటి?

 జవాబు: వివరణ: పేషంట్లు తక్షణ ఫలితాల్ని ఆశిస్తున్నారా?

  • పేషంట్లు ఇది ఒక మాజిక్ పిల్ అని భావిస్తున్నారు.ఉదాహరణకు 20 ఏళ్ళగా వీపు నొప్పితో భాదపడుతున్న ఒక వ్యక్తిని వైబ్రియానిక్స్ చికిత్స కోసం తీసుకువచ్చారు. ఆ వ్యక్తి బహుశా ఇంతవరకు సఫలితాన్ని ఇవ్వలేని అనేక వైద్యాలు చేయించుకుని ఉండవచ్చు.అలాంటప్పుడు వైబ్రో మందులు తక్షణ నివారణను ఇవ్వాలని ఎందుకు ఆశించాలి? ఆ పేషంటు వ్యాధి ప్రారంభంలోనే వైబ్రో చికిత్సని తీసుకునియుంటే అతనికి ఉపశమనం సులభంగా లభించేది.ఈ వ్యాధి పేషంటు శరీరంలో లోతుగా పాతుకుపోవడంతో దాన్ని నయం చేయడం అంత సులభం కాదు.వెళ్ళు తన్నిన ఒక మహా వృక్షంలా పెరిగిన ఈ వ్యాధిని నయం చేయడానికి అసాధారణ కృషి చేయడం అవసరం.
  •  నియమాలు పాటించినప్పడికి ఫలితాలు కలుగలేదంటే దానికి మరో కారణం పేషంటు యొక్క ఆలోచనలు కావచ్చు."నాకు నయం కావట్లేదు" వంటి  ప్రతికూల ఆలోచనల వల్ల నివారణకు ఆటంకం కలిగి నయం కావడానికి మరింత సమయం పడుతుంది.’
  • అభ్యాసకుల మరియు రోగుల సానుకూల ఆలోచనల వల్ల దివ్యమైన శక్తి ఉద్భవించి వైద్య ప్రక్రియ వేగవంతమవుతుంది.
  • రోగులతో వైబ్రియానిక్స్ గురించి మాట్లాడేడప్పుడు జాగ్రత వహించాలి: కొంత సమయం దీనికొరకు కేటాయించండి కాని క్లుప్తంగా ఉండాలి.మనము డాక్టర్లు కాకపోయినప్పటికీ వృత్తిపరమైన రీతిలో చికిత్సనంధించాలి. ఈ చికిత్స ఇతర చికిత్సలతో జ్యోక్యం కాదని పేషంట్లకు చెప్పాలి.
  • చికిత్సా సమయాన్ని గురించి అభ్యాసకులకే తెలియదు కాబట్టి దాని గురించి పేషంట్లతో చర్చించరాదు. చికిత్సకు పట్టే సమయం ఈ క్రింద వ్రాసిన అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది: వ్యాధి ప్రారంభమై ఎంత కాలమైంది, పేషంటు యొక్క వయస్సు, అతని జీవనశైలి, పర్యావరణం మొదలైనవి. 15 ఏళ్ళగా ఒక వ్యక్తికున్నరోగం ఒకటే పిల్తో నయమైన సందర్భం ఉంది. ఇదే రోగ సమస్య మరో రోగికి నయం కావడానికి అధిక సమయం పట్టవచ్చు.చికిత్సకు పట్టే సమయం భగవంతుడుపైన ఆధార పడియుంది. మందు పనిచేసే వరకు ఓర్పుతో ఉండాలి.
  •  అక్యూట్ సమస్యల నివారణ తక్కువ సమయంలో కలుగుతుంది. దీర్ఘకాలిక సమస్యలు నయంకావడానికి అధిక సమయం పట్టవచ్చు. ఇలాంటి సందర్భాలలో పేషంట్లు ఓర్పు వహించాలి.
  • మొదటి సారి పేషంటు మిమ్మల్ని సంప్రధించినప్పుడే ఒక సానుకూలమైన వాతావరణాన్ని సృష్టించాలి.

 1.5.3   ప్రశ్న: పుల్ అవుట్ ఎదుర్కొన్న రోగుల గురించి: వీళ్ళు అంతకు ముందున్న సమస్యలకన్న ఎక్కువ సమస్యలు ఎదుర్కోవల్సివస్తే ఏంచేయాలి?

జవాబు: వ్యాధి రోగి శరీరంలో లోతుగా పాతుకునియున్నప్పుడు ఇలాంటి సమస్యలు రావచ్చు. అనేక చక్రాలపై పడిన ప్రభావం వల్ల అనేక అవయవాలలో సమస్యలు ఏర్పడి ఉండుంటాయి.దీని ఎరుక పేషంటుకు ఉండకపోవచ్చు.పూర్తిగా పెరిగిన చెట్టుని భూమినుండి పైకి లాగినప్పుడు కొన్ని వేర్లు భూమిలో ఉండిపోతాయి. పుల్ అవుట్ అన్నది ఇటువంటిదే. ఇది వైబ్రో చికిత్సలో ఏర్పడే ఒక క్రియ మాత్రమే కాని ప్రతిక్రియ కాదు.పుల్ అవుట్ అన్నది రోగి శరీరంనుండి విషపధార్తాలని తీసి వేసే ఒక సానుకూలమైన క్రియ.పేషంటుకు పుల్ అవుట్ గురించి వివరించి ఓర్పు వహించమని ప్రోత్సాహించాలి. పుల్ అవుట్  రకాన్ని  బట్టి  మోతాదును సర్దుబాటు చెయ్యాలి.

 1.5.4  ప్రశ్న: మానసిక మరియు శారీరిక రోగాలతో లేదా బహుళ రోగాలతో, అల్లోపతి మందుల వల్ల కలిగిన దుశ్ప్రభావాలతో భాదితులైన  పేషంట్లకు చికిత్సను ఏ విధంగా ఇవ్వాలి?

 జవాబు: మానసిక అనారోగ్యం నియంత్రించడానికి ఇవ్వబడే మందుల దుష్ప్రభావాలు అధికంగా ఉంటాయి. దీన్ని పరిష్కరించేందుకు మీరు ఒక సీనియర్ అభ్యాసకుడిని సంప్రదించి ఒక ప్రత్యేక మందును (నోసోడ్) తయారు చేయించుకోవాలి.పేషంటుకు దుశ్ప్రభావాలని కలుగ చేస్తున్న అల్లోపతి మందుయొక్క నమూనాని SVP కు అందచేయాలి.ఇలా తయారు చేసిన వై బ్రో మందుని వాడటం వల్ల అల్లోపతి మందు కలుగచేసిన దుష్ప్రభావాలు తొలగిపోతాయి.పేషంటు ను అల్లోపతి మందు తీసుకోవడం కొనసాగించమని చెప్పాలి.

ప్రత్యామ్నాయంగా ఆ రోగికి CC17.2 Cleansingతో చికిత్స ప్రారంభించండి.ఈ చికిత్స తీసుకుంటున్నప్పుడు పేషంటు అధికంగా నీరు తాగాలని చెప్పడం చాలా ముఖ్యం.పేషంటుకు పుల్ అవుట్ సంభావ్యత గురించి ముందే హెచ్చరించండి. ఈ పరిహారం మొదలుపెట్టిన తర్వాత పేషంటు నొప్పుందని పిర్యాదు చేస్తే జాగ్రత వహించాలి. నొప్పి రావడం యొక్క పుల్ అవుట్ లక్షణం కావచ్చు.

 1.5.5   ప్రశ్న:  దీర్గ కాలంగా గౌట్ (వాతరోగం) సమస్యతో భాదితుడైన ఒక 50 ఏళ్ళ వ్యక్తికి వైబ్రో తీసుకుంటే తీవ్రమైన పుల్ అవుట్ రావడం జరుగుతోంది.కాని ఈ రోగికి అల్లోపతి మందు (అల్లోప్యూరినాల్) తీసుకుంటే ఉపశమనం కలిగింది. 15 ఏళ్ళగా ఈ వ్యాధితో భాద పడుతున్న ఈ పేషంటు ప్రత్యేకమైన ఆహారాని తీసుకుంటున్నాడు. పుల్ అవుట్ తీవ్రంగా రావటం వలన వైబ్రో మందులు అప్పుడప్పుడు మాత్రమే వేసుకోగలుగుతున్నాడు. ఈ పేషంటు సమస్యకు పరిష్కారం ఏమిటి?

జవాబు: పుల్ అవుట్ వస్తుందన్న భయంతో పేషంట్కు మానసిక ప్రతిష్టంభన కలిగియుండవచ్చు.భయం అన్నది ప్రేమకు వ్యతిరేకం.రోగి ఆధ్యాత్మిక స్థాయిలో పని చేయడం ద్వారా భయాన్ని అధికమించాలి. ఇలా చేస్తే వై బ్రో మందు మంచి ఫలితాన్నిస్తుంది.

1.5.6  ప్రశ్న: ఒక పిల్స్ సీసాలో ఎన్ని రకాలైన మందులను కలపవచ్చు?

జవాబు: దీనికి గరిష్ట పరిమాణం లేదు. అయితే కొత్త అభ్యాసకులు ఈ సూత్రాలను తప్పక గుర్తుంచుకోవాలి:

  • తక్కువ సమయంలో నయమయ్యే అక్యూట్ సమస్యలున్నప్పుడు అనేక రకాల మందుల్ని ఒకటే సీసాలో కలపవచ్చు.
  • శిక్షణ ప్రకారం, అనేక ధీర్గకాలిక వ్యాదులన్నప్పుడు,ఒక సమయంలో కేవలం ఒక మందుని ఇవ్వాలి.ఇలా చేయడం ద్వారా ఒక వేళ పుల్ అవుట్ సంభవిస్తే  దానికి కారణమైన మందు ఏదో నిర్దారించడం సులభమవుతుంది.      
  • అనేక రకాల మందుల్ని కలుపుతున్నప్పుడు పిల్స్ ఎక్కువగా నానిపోకుండా చూసుకోవాలి.

 1.5.7 ప్రశ్న: ఎన్ని రకాల వ్యాదుల్కి చికిత్స ఒకే సమయంలో ఇవ్వవచ్చు?

జవాబు: ఒకటే గ్రూప్కి చెందిన వ్యాదులైయుంటే ఒకే సమయంలో చికిత్సనివ్వవచ్చు. అసంగతమైన వ్యాదులైయుంటే ఉదాహరణకు: కంటి సమస్య మరియు కీళ్ళ వాపు- బహుశా కంటి సమస్యకు పేషంటు అల్లోపతి మందులను తీసుకుంటూ ఉండవచ్చు.ఈ సందర్భంలో పేషంటు కీళ్ళ వాపు సమస్యకు మాత్రమే చికిత్సనివ్వాలి.

రోగియొక్క ప్రాధాన్యత తెలుసుకోవడం ఉత్తమం.రెండు సమస్యలకు సంభందించిన మందుల్ని కల్పవచ్చుకాని ఉపశమనం కలుగడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు.

మనందరిలో(భగవంతుడు) సహజంగా వ్యాధిని నయం చేసే శక్తి ఉంటుంది.ఒక సమయంలో ఒక సమస్యపై దృష్టిని కేంద్రీకరించటం మంచిది. కీళ్ళ వాపు కేసులో పేషంటుకు నొప్పి ఎంత తీవ్రంగా ఉందని తెలుసుకొని, కంటి మందును కలపాలా వద్దా అని నిర్ణయించుకోవాలి.

1.5.8  ప్రశ్న: ఈ చికిత్సపై పేషంటుకు విశ్వాసం ఏర్పరచడానికి మనం ముందుగా రోగ లక్షణాన్ని నయం చేయడానికి చికిత్సనిచ్చి ఆపై రోగ కారణానికి చికిత్సనిస్తే అధిక సమయం పట్టవచ్చు కదా?

 జవాబు: నొప్పి భరించ గలిగేలా ఉంటే ముందుగా రోగ కారణానికి చికిత్సనివ్వాలి.కాని ఇలాంటప్పుడు పుల్ అవుట్ తీవ్రంగా ఉండవచ్చు. పేషంటు వయస్సు మరియు కేసు ప్రత్యేకత దృష్టిలో పెట్టుకొని చికిత్సనివ్వడం ముఖ్యం.

క్లెన్సింగ్(cleansing)మందులు వలన పుల్ అవుట్ వచ్చే అవకాశం ఉంది.ఇలాంటి సందర్భాలలో ప్రతిరోజు పేషంటు పర్యవేక్షణ అవసరం. ఒక మంచి అభ్యాసకుడు  ముందుగానే పేషంట్లకు పుల్ అవుట్ గురించి వివరముగా చెప్తాడు.పుల్ అవుట్ గురించి ముందుగానే తెలుసుకున్న పేషంట్లు పుల్ అవుట్ వస్తే సులభంగా ఎదుర్కొన గలుగుతారు.

పుల్ అవుట్కి హోమియోపతి పధం "వైద్య సంక్షోభం".ఈ పధం ప్రతికూల పదంగా ఉండటం కారణంగా మనమీ పదాన్ని వాడము.

 1.5.9   ప్రశ్న: వైబ్రియానిక్స్ చేతి పుస్తకంలో చర్మ సమస్యలకు వాసెలిన్ని ఒక మాధ్యమంగా ఉపయోగించవచ్చని రాసియుంది.వాసెలిన్ లోకి మందుల్ని ఎలా కలపాలో చెప్తారా?

 జవాబు: చర్మ సమస్యలకు చికిత్స రెండు విధాలుగా చేయాలి.మందుని చర్మం పై లేపనం వలె రాయవచ్చు మరియు మౌఖికంగా నీటిలో కలిపి తీసుకోవచ్చు.

 మందుల్ని వాసెలిన్ తో ఎలా కలపాలి : ఒక చుక్క మందుని వాసెలిన్ లో వేసి ఒక లోహముకాని గరిటతో మూడు నిమిషాలు భాగా కలపాలి.మరొక్క చుక్క మందును వేసి పై విధముగా మరో రెండుసార్లు కలపాలి.ఈ విధంగా మిశ్రమాన్ని సుమారు పది నిమిషాల పాటు కలిపాక వాసెలిన్ రంగు మారుతుంది.  పరిమళమైన వాసెలిన్ వాడకండి. పరిమళము లేని సహజ వాసెలిన్నే వాడండి.

  • చాలా సంవత్సరాలు పచ్చి వర్జిన్ నూనె వాడటం ఉత్తమమని సిఫారసు చేసారు కాని ఇటీవల కొబ్బరి నునె మరింత సపలితాలని ఇస్తుందని తెలిసింది.శీతల ఒత్తిడి చేయబడ్డ సేంద్రియ పచ్చి కొబ్బరి నునె శ్రేష్టమైనది.ఇది శరీరంలో కొవ్వు స్థాయిను తగ్గిస్తుంది.
  • వైబ్రియానిక్స్ పరిహారాలు (మందులు) చర్మం మీద అన్వయించేడప్పుడు రోగి యొక్క చేతులతో చేయవచ్చు.
  • నీటిలో ఎలా కలపాలి:200 ml నీటిలో ఒక చుక్క మందుని కలపాలి.భాదితమైన ప్రాంతంపై పేషంటు తన చేతులతో రుద్దాలి లేదా పత్తితో అద్ధవచ్చు.

1.6.0 ప్రశ్న : 60 ఏళ్ళు నిండిన అనేక వృద్ధ రోగులు ప్రేగుల నియంత్రణ సమస్యల కారణంగా ఇళ్ళనుండి బయిటకు వెళ్ళడానికి భయపడుతున్నారు.దీనికి పరిహారం ఉందా?గత కొన్ని నెలలుగా ఏడుగురు వృద్ధ పేషంట్లు నన్ను ఈ సమస్య పరిహారం కొరకు సంప్రదించారు.ఈ వృద్ధులకు ఆత్మ గౌరవం తగ్గి సమాజంలో అడుగుపెట్టడానికి సిగ్గుపడీ ఇళ్ళలో ఉండిపోతున్నారు.

జవాబు: డా.అగ్గర్వాల్ కండరాల పరిహారం NM7 CB7 కండరాల్ని బలపరచడానికి ఉపయోగించవచ్చని (SRHVP యంత్రం ఉపయోగించి తయారు చేయబడింది) లేదా: CC4.6 Diarrhoea +  CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC20.4 Muscles & Supportive tissue ఇవ్వవచ్చని చెప్పారు.

జవాబు: అతితుల్లో ఒకరైన ఒక MD ఈ సమస్య 60 నుండి 70 ఏళ్ళ వయస్సులో ప్రారంభం అవుతోందని చెప్పారు.ఈ సమస్య ప్రారంభ దశలో ఉన్నప్పుడు భాదితమైన కండరాలను (పైత్యరసనాళమును) పొద్దున మరియు రాత్రి వేళల్లో 9 సార్లు భిగసించటం మరియు సడలించటం వంటి వ్యాయామాలు చేయమని పేషంట్లకు చెప్పాలని అన్నారు.బయిటకు వెళ్ళడానికి ముందుగా ఇదే వ్యాయామాన్ని 18 సార్లు చేయాలని చెప్పారు. అంతేకాకుండా బయటికి వెళ్ళడానికి ముందు ఏవి తినకుండా త్రాగకుండా ఉండటం ఈ సమస్యని కొంతవరకు తగ్గిస్తుందని చెప్పారు.ఆక్యుపంక్చర్ మరియు కపల్భాటి యోగా కూడా ఈ పరిస్థితికి సహాయపడతాయని చెప్పారు.

1.6.1  ప్రశ్న: భరువు అధికంగా ఉన్న వ్యక్తులకు భరువు తగ్గడానికి ఏ మందుని ఇవ్వాలి? అందరికి హైపోతయిరాయిడిసం లేదు కాబట్టి  CC6.2 Hypothyroid కాంబో ని ఇవ్వలేము.ఏ కాంబో ని ఇవ్వాలో చెప్పమని కోరుకుంటున్నాను.

 జవాబు:  దీనికి ఇవ్వవలసిన కాంబో CC6.2 Hypothyroid + CC15.4 Eating disorders. ఇది అన్ని పరిస్తితిల్లోను పనిచేస్తుంది. బరువును తగ్గించుకోవాలంటే పేషంట్లు సరియైన వైఖిరిని కలిగియుండాలి.జీవన్ శైలిపై ఎరుక కలిగియుండాలి.భరువు ఎక్కువుగా ఉన్న వ్యక్తులకు ఆత్మగౌరవం తక్కువగా ఉంటుంది.ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం మరియు వ్యాయాయం చేయటం వంటి మంచి అలవాట్లువల్ల కలిగే ఉపయోగాలని పేషంట్లకు మీరు చెప్పాలి. ఆహారం తీసుకోవడానికి అరగంట ముందు నీరు త్రాగమని మరియు ముందుగా సలాడ్ తీసుకోమని సలహా ఇవ్వాలి.పేషంట్లను మితముగా ఆహారాన్ని తీసుకోవాలని మరియు ఆయుర్వేద శాస్త్రం ప్రకారం  ప్రతి ముద్దను 32 సార్లు నమిలి మింగాలని చెప్పాలి.

1.6.2 ప్రశ్న: మన కాంబో బాక్సులో కార్పల్ టనల్ సిండ్రోం కి పరిహారంగా CC20.3 Arthritis కాంబో ఉంది.కార్పల్ టనల్ సమస్యలో మధ్యలో ఉన్న ఒక నరం మణికట్టు కింద భాగములో ఎముకలు మరియు లిగమంట్లు మధ్యనున్న సన్నమైన మార్గంలో ఉండటం కారణంగా ఒత్తిడివల్ల నొక్కుకుపోతుంది. CC20.3 Arthritis కాంబో ఏ విధంగా ఈ నరాన్ని వాస్తవ స్థితికి తీసుకువస్తుంది?

 జవాబు:  మనికట్టులో 9 ఎముకలున్నాయి.ఈ కామ్బోలో ఉన్న వైబ్రేషన్లు సంభందిత చక్రాలలో సంతులనం తీసుకు వస్తాయి.దీని కారణంగా నరాలలో ఒత్తిడి తగ్గి వాస్తవ స్తితికి వస్తాయి. CC20.5 Spine స్లిప్ డిస్క్ సమస్యలకు కూడా ఇదేవిధముగా వైబ్రేషన్లు పని చేస్తాయి.కొన్ని కేసులలో ఒక్క డోస్తో ఈ సమస్యనుండి ఉపశమనం కలిగింది.ఇది భగవంతుడు కృప తప్ప వేరొకటి కాదు.

1.6.3 ప్రశ్న: పారాథైరాయిడ్ గ్రంధి అతిక్రియాశీలత సమస్యకు ఏ కాంబోని ఉపయోగించాలి? ఈ సమస్య కారణంగా శరీరంలో కాల్షియం స్థాయిలు పెరుగుతాయి.

 జవాబు: దీనికి SR517 Parathyroid ఇవ్వాలి. ఇది CC6.1 Hyperthyroid లో ఉంది. కాని రక్తముయోక్క నమూనా నుండి ఒక నోసోడ్ ను తయారు చేయటం ఇంకా మంచి ఫలితాలను ఇస్తుంది. పేషంటుకు కొంత సమయం కేటాయించి శరీరంపై మనస్సు యొక్క ప్రభావం గురించి చెప్పాలి. మంచి ఆలోచనలయోక్క సఫలితాల గురించి వాళ్లకి వివరించటం మంచిది.పేషంటుకు ఉపశమనం కలుగాలని భగవంతుడిని ప్రార్థించాలి.

పేషంట్లతో పాటు హో'ఒపోనోపోనో అని ఒక పురాతన హవాయియన్ ప్రార్థన యొక్క సలహాను అనుసరించి ఈ కింద వ్రాసియున్న నాలుగు వాఖ్యాలను  పునరావృతం చేస్తే మంచిది:1.నన్నుక్షమించు 2.నేను నిన్ను ప్రేమిస్తున్నాను 3.ఐ యాం సారి 4. ధన్యవాదాలు.ఈ వాఖ్యాలను చెపుతున్నపుడు మీ మనస్సులో మిమ్మల్ని గాయపరచిన లేదా మీచేత గాయపడిన వ్యక్తిని ఉద్దేశించి చెప్పుకోవాలి.

1.6.4 ప్రశ్న: ఒక క్లిష్టమైన కేసులో తనకు ఏ విధమైన అనారోగ్యము లేదని తలచే ఒక 39 ఏళ్ళ వ్యక్తికి ఏ కాంబో ఇవ్వవచ్చు? ఆ పేషంటు యొక్క తల్లి అతన్ని నన్ను సంప్రదించడం కొరకు తీసుకువచ్చింది.

 జవాబు: ఈ పేషంటుకు మానసిక సమస్య ఉండే సంభావ్యత ఉంది. ఈ పేషంటుకు CC15.2 Psychiatric disorders దీర్గ కాలం వరకు ఇవ్వాలి. CC18.1 Brain disabilities కూడా చేర్చవచ్చు.

వ్యాఖ్యానం: బహుశా పేషంటు యొక్క తల్లి అతని పరిస్థితికి కారణం కావచ్చని సూచించారు. ఒకొక్కసారి మందు ఇవ్వడం ఒకటే పరిష్కారాన్ని ఇవ్వదు.  ఆలోచనల ప్రభావం బిడ్డపై పడుతుంది కాబట్టి గర్భిణీ స్త్రీలు తమ ఆలోచనల గురించి శ్రద్ధ వహించాలి.

జవాబు: [డా.అగ్గర్వాల్ స్పందన:]   సాయి బాబాగారు అనారోగ్యానికి మూల కారణం మనస్సుయని చెప్పారు. ఈ సత్యాన్ని స్వామీ రామా [1970 లో మనస్సు-శరీర పరిశోధనలు US లో కొంత సమయం గడిపిన] నిర్ధారించి చూపించారు. US యూనివర్సిటి ఆడిటోరియుంలో ప్రేక్షకులలో ఒక వ్యక్తి చేతిపైన 10 డిగ్రీ అవకలన ఉండే ఉష్ణోగ్రతను సృష్టించి చూపారు.అంతేకాకుండా ఒక గోల్ఫ్ బంతి యొక్క పరిమాణంలో ఉన్న ఒక సిస్ట్ ను సృష్టించి మాయం కూడా చేసారు.దీనినుండి తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మనమందరము ఒకటే.

రోజంతా మనము ఆలోచనలు కలిగియుంటాము. వాటిలో చాలా ప్రతికూలమైనవిగా ఉంటాయి.వాటిని ఆపడానికి ప్రయత్నించవద్దు.వాటిని అనుకూల ఆలోచనలతో భర్తీ చేయాలి.

1.6.5 ప్రశ్న: సాధారణంగా రోగి యొక్క నోసోడ్ను నిల్వ చేయడం ఎలా?

 జవాబు: పిల్స్ లో కలిపిన నోసోడ్ అయితే ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది. మరొక సీసాలో కొన్ని పిల్స్ ఉంచి వాటిని ప్రతి ఆరు నేలలోక సారి పునరుద్ధరించే ప్రక్రియ చేయాలి. నమూనా పిల్స్ ను పేషంటు తన వద్ద ఉంచుకోవటం మంచిది.

1.7.  డా.అగ్గర్వాల్ నుండి అదనపు సిఫార్సులు:

  • 200 ml నీటిలో మందుని కలిపి 5 ml సింగిల్ డోసుగా తీసుకుంటున్నప్పడికి మీరు ప్రతి ఏడూ రోజులకి ఒకసారి పాత్రను శుబ్రపర్చి నీటిని మార్చాలి. మీరు పేషంట్లను మందు కలిపిన నీటిని మధ్యలో చూసుకోమని, నీటి రంగులో మార్పు లేదా పైన పొరలా ఏర్పడటం వంటి మార్పులు కలిగియుంటే నీటిని వెంటనే మార్చాలి.
  • పేషంటు నోటిలో సీసానుండి నేరుగా మందును వేయరాదు.
  • కళ్ళు మరియు చెవుల చికిత్సకు చుక్కలు తయారు చేయవచ్చు. కళ్ళ కోసం మందు తయారు చేసేడప్పుడు 200 ml స్వేదనజలం లో తయారు చేసి దీనినుండి 30 ml డ్రాపర్ సీసాలో నింపుకొని కంటి చుక్కలుగా వాడవచ్చు. మిగిలిన నీటిని పారవేయచ్చు.
  • సీసాలను, పాత్రలను శుబ్రపర్చడానికి వేడి నీరోకటి చాలు డిటర్జంట్ వాడవద్దు.
  • వైబ్రియానిక్స్ అభ్యాసకులందరి వద్ద కూడను ఎమర్జెన్సీ కిట్ ఉండటం ఎంతో అవసరం. అభ్యాసకులందరు ఎల్లప్పుడూ 9 కాంబో లున్న వెల్ నెస్ కిట్ను తమ వద్ద ఉంచుకోవాలని డా.అగ్గర్వాల్ నొక్కిచెప్పారు.(ఫార్ములాలు కొరకు వెల్ నెస్ కిట్ 108 కామన్ కాంబోలు, 2011 వైబ్రియానిక్స్ చేతి పుస్తకం, పు.2).

[గమనిక: ఈ వాత్క్ షాప్ లో రిపోర్టు చేయబడిన అసాధారణ కేసులు జూన్/జూలై 2015 వార్తాలేఖలో ప్రచురింప బడుతాయి].

ఓం సాయి రామ్