Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

Vol 6 సంచిక 2
March/April 2015
ముద్రింప తగిన వార్తాలేఖ


పూర్తి వార్తాలేఖ యొక్క కాగితం ప్రతి కావలెనన్నఈ పుటను ముద్రించండి

డా.జిత్. కే అగ్గర్వాల్ యొక్క మాటల్లో

ప్రియమైన చికిత్సా నిపుణులకు,

గత 21 సంవత్సరాలుగా సాయివైబ్రియోనిక్స్ అంచనాలకు మించి అడుగులు వేస్తూ ముందుకు సాగుతోంది. ఎంతోమంది తమ తమ మానసిక శారీరక ఆరోగ్య సమస్యల నిమిత్తం ప్రత్యామ్నాయ పద్ధతుల వైపు మరలుతూ ఉండగా మన సాయివైబ్రియోనిక్స్  అందరకీ అందుబాటులోనికి వస్తోంది. గత సంవత్సరం ముఖ్యంగా  మన ప్రాక్టీషనర్లు ఇచ్చిన సమాచారము వల్ల, అంతర్జాలంలో అందుబాటులో ఉన్న మన వెబ్సైటులు, ఇంకా సాయివైబ్రియోనిక్స్ గురించి ప్రాధమిక సమాచారము అందించే వీడియో   Vibrionics, Sai Ram Healing vibrations. What is it?, ఇంకా  Souljourns interviews,   Vibrionics website  మరియు ఆన్లైన్ లో లభించే   Newsletter. వలన సాయివైబ్రియోనిక్స్ గురించి వివరాలు తెలుసుకోవాలనే వారి సంఖ్య  గణనీయంగా పెరిగినట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి.

కనుక సాయివైబ్రియోనిక్స్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి తో వచ్చే వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు మీరు కూడా గమనించి ఉంటారు. ఐతే తరుచుగా మన మదిలో మెదిలే ఒక ప్రశ్న ఏమిటంటే అలోపతి థెరపీ కి సాయివైబ్రియోనిక్స్ థెరపీకి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? మనం ప్రతీసారి సాయివైబ్రియోనిక్స్ అలోపతి తో ఏకీభవిస్తుంది అని చెపుతూ వచ్చాం. సాయివైబ్రియోనిక్స్ రెమిడి తీసుకోవడం వలన అలోపతి మందులు ఆపాల్సిన అవసరం లేదని కూడా చెపుతూ వచ్చాం. ముఖ్యంగా మధుమేహము, గుండె జబ్బులు, మానసిక రుగ్మతలు వంటి ప్రమాదకరమైన వ్యాధుల విషయంలో అలోపతి మందులు అసలు ఆపకూడదు. ఏ పేషంటైనా వైద్యుని పర్యవేక్షణలో ఉన్నప్పుడు తను తీసుకునే మందుల విషయంలో మార్పులు చేర్పులకు వారి సలహా తప్పని సరిగా తీసుకోవాలి. ముఖ్యంగా ఈ విషయం ప్రాక్టీషనర్లందరూ అవగాహన చేసుకోవాలి.

ఇదే సమయంలో వైబ్రియోనిక్స్ చికిత్సా పరంగా ఎంతో ప్రయోజనకారి. ఒకవేళ పేషంటుకు మందులు అందుబాటులో లేకపోయినా  లేక పేషంటు ప్రత్యమ్నాయ మార్గాన్ని ప్రయత్నిoచాలనుకున్నా నిరభ్యంతరంగా వైబ్రో విధానము ఎంతో ఫలవంతమైనది గా వారికీ సూచించవచ్చు. సాయి వైబ్రియోనిక్స్ పేషంటుకు ప్రయోజనం చేకూర్చడానికి రూపొందించిన దివ్యమైన విధానమని, ఇతరత్రా వైద్య విధానాల వలె ఇది ఎంతమాత్రం హానికరమైనది కాదు అని కూడా మనం నమ్మకం కలిగించాలి.

ప్రస్తుతం మనం మన వైబ్రియోనిక్స్ థెరపీ వైద్య విధానానికి అనుకూలంగా ఉన్న విషయాన్ని ప్రపంచానికి తెలిపేటందుకు కావలసిన సాక్ష్యాలు సేకరించే దిశలో ఉపక్రమిస్తున్నాము. దీని నిమిత్తం నేను ప్రాక్టీషనర్లను కోరేదేమిటంటే వైబ్రో రెమిడి లద్వారా  పేషంటు లో మెరుగుదల కనిపిస్తోంది అని చెప్పడానికి పేషంటుకు చెందిన రిపోర్టులన్నీ అనగా ఎక్స్ రే, స్కానింగ్, రక్త పరీక్షలు ఇవన్నీ సేకరించవలసిందిగా సూచన. దీని ద్వారా పేషంటు లో వైబ్రో మందుల ద్వారా వారి జబ్బులు తగ్గుతున్నాయనే నమ్మకాన్ని పెంపొందించవచ్చు. పేషంటుల నుండి లేదా వారి డాక్టర్ల నుండి సేకరించిన ఆధారాలు కూడా ఈ సందర్భంలో ఎంతో ఉపకరిస్తాయి.  ప్రస్తుతం మధుమేహం మరియు  గుండె జబ్బుల విషయంలో ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తున్నాము. ముందు ముందు ఇతర వ్యాదుల విషయంలో కూడా దీనిని విస్తరిస్తాము.  కనుక మధుమేహం మరియు  గుండె జబ్బులకు సంబంధించిన సమాచారాన్ని నేరుగా    [email protected]  కు పంపండి. ఇలా పంపిన ప్రతీ రిపోర్టును జాగ్రత్తగా పరిశీలించి మీకు సమాధానం పంపుతాను.

నాయొక్క మరో విన్నపం ఏమిటంటే ప్రాక్టీషనర్లు తమ తమ ప్రాంతాలలో వైబ్రోనిక్స్ గురించి సమాచారాన్ని విస్తృత పరచవలసిందిగా సూచన. ఐతే వైబ్రో గురించి మీరేమైనా ఉపన్యాసం ఇవ్వదలిచినా లేక కరపత్రం పంపిణి చేయదలిచినా మీ ప్రాంతపు కోఆర్డినేటర్ అనుమతి తీసుకోగలరు. ముఖ్యంగా ఈ థెరపీ గురించి అతిశయోక్తులు లేదా వక్రీకరించిన విషయాలు ప్రచారం చేయవద్దని మనవి. అంతేకాక AVP స్థాయిలో ఉన్నవారు ఇటువంటి ప్రయత్నమేమీ చేయవద్దని సూచన.

రాబోయే నెల ఏప్రిల్ 24 వ తేదిన స్వామివారి ఆరాధనోత్సవాలు జరపబడనున్నాయి. మనమంతా కూడా ఈ వేడుకలను మాములుగా జరుపుకునే దానికి విభిన్నంగా జరుపుకుందాం. ఈ సందర్భంగా మనమంతా  ప్రేమ సేవద్వారా మన వైబ్రో వృత్తికి పునరంకితమవుదాము. వైబ్రో ప్రాక్టీషనర్ లుగా ఇదే మనం బాబాకు ఇవ్వగలిగే కృతజ్ఞతాభివందనము. మనం ఎంత పని వత్తిడిలో  ఉన్నా మన వద్దకు వచ్చే పేషంట్లను ప్రేమతో ఆహ్వానిస్తూ మాటల్లో మృదుత్వాన్ని చూపుల్లో అనురాగాన్ని నింపుకొని ఆనందం అందించి పంపుదాం. మన ప్రేమ విశ్వాసాల పైన ఆధారపడే వైబ్రియోనిక్స్ శక్తివంతం ఔతుంది.  

సాయి సేవలో మీ

జిత్ కె.అగ్గర్వాల్

చేతి చర్మము పైన దద్దుర్లు 02806...Malaysia

59 సంవత్సరాల మహిళ చేతుల పైన మరియు అరికాళ్ళకింద దద్దుర్లు మరియు దురద అనే సమస్యతో ప్రాక్టీ షనర్ ను సంప్రదించారు. గత 6 నెలలుగా ఈ సమస్య ఆమెను బాధిస్తోంది. ముఖ్యంగా ఆమె వ్రేళ్ళ ద్వారా ఏర్పడిన సమస్య మరీ బాధిస్తోంది. ఈ దద్దుర్లు ఉన్నచోట ఆమె వ్రేళ్ళవద్ద చర్మము పగిలి ఉన్నట్లు ( క్రింది ఫోటోలు గమనించండి ) ప్రాక్టీషనర్ గుర్తించారు. ఆమె వ్రేళ్ళ  చివర్లలో బొబ్బలు కూడా ఉన్నట్లు  ప్రాక్టీషనర్ గుర్తించారు. బాధ ఉపశమనం కోసం ఈవిడ  ఒక స్టెరాయిడ్ క్రీం ( బెటాసాలిక్) మరియు ఎలర్జీ నిరోధానికి యాంటీ హిస్టామినిక్స్, ఉదయం అరస్ 10 mg రాత్రి అటారక్స్ మందులు వాడుతున్నారు. ఐతే ఆమె ఈ మందులు ఆపివేయాలని నిశ్చయించుకున్నారు.

2014 మే 10 వ తేదీన ప్రాక్టీషనర్ క్రింది రెమిడి ఇచ్చారు:

CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC21.3 Skin allergies + CC21.5 Dry sores ...90 మీ.లీ.నీటిలో 6 గోళీలు వేసుకొని ప్రతీ 6 గంటలకు ఒక చెంచా

పైన పూత గా రాయడానికి వీరు CC21.3 Skin allergies + CC21.5 Dry sores, ప్రతీ రెమిడి ౩ చుక్కలు  మృదువుగా ఉండే లిక్విడ్ పారఫిన్  క్రీం లో కలిపి BD గా  రాసుకునేందుకు సూచించారు.

3 వారాల తర్వాత అనగా  2014 మే 31వ  తేదీన పేషంటు తన వ్రేళ్ళ పైన పొక్కులు గతంలో కన్నా వేగంగా మానిపోయాయని  చెప్పారు. గతంలో ఇలా మానడానికి 7 రోజులు పట్టేదని ప్రస్తుతం 2 రోజులలోనే తగ్గిపోయిందని చెప్పారు. అలాగే దురద కూడా చాలావరకు తగ్గిపోయిందని చెప్పారు. అలాగే పైన పూతగా ఇచ్చిన క్రీం అద్భుతంగా పనిచేస్తున్నందుకు ఆనందంగా ఉందని దీనిని ఇలాగే వాడడానికి నిశ్చయించుకున్నట్లు తెలిపారు. 2014 జూన్ 5 నాటికి మొట్టమొదట వచ్చిన వ్యాధి లక్షణాలు 90% తగ్గిపోయాయని తెలిపారు. క్రింద ఫోటోలు కూడా ఇవ్వబడ్డాయి. ప్రాక్టీ షనర్ ను మరలా సందర్శించే నాటికి  అనగా 2014, ఆగస్టు 28 నాటికి పేషంటు యొక్క చర్మ వ్యాధి పూర్తిగా తగ్గిపోయినప్పటికీ మరల రెమిడి రిఫిల్ చేయించుకోవలసిందిగా సూచింపబడ్డారు.

మే 10  (ఎడమవైపు ) మరియు జూన్ 5 (కుడివైపు ) 2014, కుడి చూపుడు వేలును చూడండి:

 

 

మే 10వ తేదీ (ఎడమవైపు ) మరియు జూన్  5వ తేదీ  (కుడి వైపు ) 2014, ఎడమ బొటన వేలు క్రింద భాగం చూడండి:

 

మే 10వ తేదీ (ఎడమవైపు ) మరియు జూన్  5వ తేదీ  (కుడి వైపు ) 2014, కుడి బొటన వేలు క్రింద భాగం చూడండి::

కండరము ములు మరియు నాడీ తంతువుల వద్ద అస్వస్థత (మాయాస్తెనీయ గ్రావిస్) 10001...India

55 సంవత్సరాల మహిళా సహాయక చికిత్సా నిపుణురాలు 2001 నుండి మాయాస్తెనీయ గ్రావిస్ వ్యాధితో బాధ పడుతూ 2014.జూన్ నెలలో ప్రాక్టీ షనర్ ను సంప్రదించారు. ఆమె శరీరంలో కండరాలన్నీ ఈ వ్యాధికి గురయ్యాయి. కానీ ముఖ్యంగా ఈమెకు గల మూడు సమస్యలు బాగా ఇబ్బంది పెడుతున్నాయి. అవి 1. ఈమెకు ద్వంద్వ దృష్టి (వస్తువులు రెండుగా కనబడడం) ఉండడంతో దృష్టిని ఒకే చోట నిలపలేరు. దీనివలన ఆమె 15 నిమిషాలకు మించి చదవలేరు. రాత్రి పూట అసలు చదవలేరు  2. ఈమె  గొంతులోని కండరాలు చాలా బలహీనంగా ఉంటాయి అందువలన ఆమె అలసిపోయినపుడు నాలుక బరువెక్కిపోయి ఆమె మాట్లాడలేని స్థితి ఎదురవుతోంది.  3. చివరగా ఈమె భుజాలు బరువుగా ఉండి త్వరగా అలసటకు గురియవుతాయి. ఇంతేకాకుండా ఈమెకు  మాయాస్తెనీయ గ్రావిస్ వ్యాధికి  సంబంధించిన స్వాదీనములో లేని మూత్ర విసర్జన వంటి సమస్యలు కూడా ఉన్నాయి. 

ఇవేకాక  అదనంగా వీరికి 2011 నుండి స్టెరాయిడ్స్ వాడడం ద్వారా వచ్చిన మధుమేహ వ్యాధి,  ఇంకా 2013 నుండి హైపో థైరాయిడిజం వ్యాధి కూడా ఉన్నాయి. మందులు తీసుకుంటూ ఉన్నప్పటికీ వీరికి రక్తంలో చెక్కెర శాతంలో  హెచ్చుతగ్గులు ఏర్పడుతున్నాయి. ఐనప్పటికీ  ప్రస్తుతం వీరు ఈ రెండు వ్యాధులకు అలోపతి చికిత్స తీసుకుంటూ ఉన్నారు. వీరి ఎనర్జీ లెవెల్ కూడా చాలా తక్కువగా ఉన్నట్లు ప్రాక్టీషనర్ గుర్తించారు.  ప్రాక్టీషనర్ వీరికి క్రింది రెమిడి లు ఇచ్చారు:

బలహీన కండరాలకు, మూత్రం ఆపుకోలేని తనానికి, శక్తికోసం :

#1.  CC13.3 Incontinence + CC18.4 Paralysis + CC20.4 Muscles & Supportive tissue + NM2 Blood + NM3 Bone I + NM5 Brain TS + NM7 CB7 + NM12 Combination 12 + NM17 Eye + NM21 KBS + NM45 Atomic Radiation + NM48 Vitamin Eye Compound + NM63 Back-up + NM86 Immunity + NM90 Nutrition + NM104 Tops + BR18 Circulation + BR23 Skeletal + SM14 Chemical Poison + SM26 Immunity + SR233 Ruby + SR281 Carbo Veg + SR291 Gelsemium 200C + SR360 VIBGYOR + SR374 Causticum 1M...TDS

మధుమేహ వ్యాధికి :

 #2. CC6.3 Diabetes + CC12.4 Autoimmune diseases...BD, మధ్యాహ్నo మరియు రాత్రి భోజనo చేసిన 30 నిమిషాల తరువాత   

అలసట/నిస్సత్తువ కోసం :

#3. SR221 Heart Chakra + SR223 Solar Plexus...అవసరం మేరకు

#4. Nosode made from the allopathic medicines Wysolon, Shelcal, Glycifase, Zivast, Thyronorm, Gemohos,     Folytrax, Multivitamin and Vitamin D...TDS  

#5. Blood nosode...BD, ఖాళి కడుపుతో ఉదయము మరియు సాయంత్రం

మూడు నెలల తర్వాత పేషంటుకు మాట్లాడే శక్తి 70 శాతం పెరిగడమే కాక ఆమె భజనలు కూడా పాడగలుగుతున్నారు. వీరి దృష్టి కూడా 30 శాతం మెరుగవడంతో ఒకేసారి అరగంట సేపు చదవగలగడమే కాక రాత్రిపూట కూడా కొన్ని నిముషాలు చదవ గలుగుతున్నారు. వీరికి రక్తంలో చెక్కెర శాతం కూడా పైన ఇచ్చిన మందుల వల్ల స్థిర పడ్డాయి.  వీరి థైరాయిడ్ పని తీరు లో మార్పు ఏమీ లేదు కానీ మొత్తంగా వీరికి ముఖ్యంగా #3, వలన నిస్సత్తువ పోయి బలం చేకురినట్లు అనిపించింది. 2014 సెప్టెంబర్ నాటికి వీరు వైబ్రో రెమిడిలు వాడుతూనే ఉన్నారు. అలోపతి ద్వారా MG వ్యాధికి చికిత్స లేని తరుణంలో సంజీవని లా వైబ్రో రెమిడి లు లభించాయని అందువలన ఎంతో ఆనందంగా ఉందని వీరు తెలిపారు.

Gangrene, Scar Tissue 01616...Croatia

An experienced practitioner aged 59 consulted a senior Practitioner 02793…USA for herself on a case of gangrene. She had been bitten by a dog in October 2014. Her right hand was mangled and the little finger was badly injured. Osteomyelitis developed in the finger bone and gangrene spread in the hand. The infection did not respond to antibiotics. After a month’s treatment, doctors recommended that the finger be amputated to allow the infection in the rest of the hand to be treated. The case was then taken over by another doctor at the same hospital, who was a friend of the patient. She asked him to try to save the finger, which he did. In an operation to fix the bone and clean it (22 November 2014), he also took a bone sample, which showed Staphylococcus aureus still present.

At the time, she was taking:
#1. CC20.6 Osteoporosis + NM36 War + OM3 Bone Irregularity + SM28 Injury + SR315 Staphysagria…6TD

She was also planning to add a nosode of the antibiotic. She was advised to consult our Head of Research 00002…UK and she started the following treatment on her recommendation:
#2. CC20.2 SMJ pain + CC20.3 + CC20.4 Muscles & Supportive tissue + CC20.6 Osteoporosis + CC20.7 Fractures + CC21.11 Wounds & Abrasions + NM36 War…6 pills in ½ litre of water, sip hourly during the day for 2 days, then 6TD reducing on improvement

#3. Antibiotic nosode…TDS, to be taken separately in between the above combo

#4. Blood nosode…BD, to be taken separately morning on waking and night before sleep

After 5 weeks, the infection was completely gone. The finger was saved, and the practitioner began physical therapy to restore hand function. The hand had immobilized for 3 months, and the joints were frozen because of adhesions and scar tissue. So she started:
#5. CC21.1 Skin tonic + NM96 Scar Tissue + NM113 Inflammation…6TD

As of March 2015, she had recovered 70% movement in her hand and finger.

The patient's comment:
The doctors were confused by my recovery. They told me that I had a very bad outlook and that amputation had been highly probable. Thanks to the two practitioners but most of all, I would like to thank Swami for his Grace. I am enormously thankful and happy to be part of Vibrionics team. Since 1999, I have seen many good things happen for my patients through sharing Vibro.

The practitioner's comment:
The case lasted a long time but here's what I think about it. For 15 full years, I have been a practitioner and I have often wondered about the impatience of patients who feel that if the treatment does not work right away, then it's not right. I assure them that they need to be persistent and together we will look for combinations that will work for their situation. And so this came to be a time of temptation for me personally. Despite a situation that was deteriorating rapidly, I firmly believe in what I do, and persevered in that faith through the days and months. I always knew and I know now that Swami is with me and that He is my sole refuge.

 

పారాడెంటోసిస్ 01619...Serbia

2014 జూన్ 5 వ తేదీన 45 సంవత్సరాల మహిళకు క్రింది దవడలో పారాడెంటోసిస్ కలిగింది. దీని వలన ఆమెకు తీవ్రమైన మంట, పళ్ళు ఊగిపొతున్నట్లు, ఇంకా చిగుళ్ళు ఎరుపెక్కి బాధాకరంగా ఉండసాగాయి.  ప్రాక్టీషనర్ వద్దకు రాకముందు 20 రోజులుగా దంత వైద్యుని వద్దకు వెళుతూనే ఉన్నప్పటికీ తగ్గక పోవడంతో పళ్ళు పీకివెయ్యాలని చెప్పారు. కనుక పేషంటు వై బ్రో రెమిడి తీసుకోవాలని నిశ్చయించారు.

ఈమెకు క్రింది రెమిడి ఇవ్వబడింది :

NM89 Mouth & Gum + NM113 Inflammation + SR293 Gunpowder...TDS.

ఈమె మరే చికిత్స తీసుకోకుండానే 15 రోజులలో వ్యాది లక్షణాలు పూర్తిగా మాయమయ్యాయి. ఐనప్పటికీ ఈమె మరో మూడు నెలల పాటు రెమిడి తీసుకోవడంతో చిగుళ్ళు గట్టిపడి తర్వాత ఒక్క పన్ను కూడా ఊడలేదు.

పేషంటు వ్యాఖ్య:

2014 జూన్ నుండి నేను పారాడెంటోసిస్ వ్యాధితో బాధపడుతున్నాను. నా డాక్టరు పళ్ళను పీకివెయ్యాలని  చెప్పారు. వైబ్రో రెమిడి తీసుకున్న తర్వాత పరిస్థితి మారిపోయింది ఇప్పుడు పండ్లను పీకవలసిన అవసరమే లేదు. ఇవి వాడినప్పటి నుండి నాకు ఏ సమస్యా లేకుండా ఆనందంగా ఉన్నాను.

కడుపులో పుండ్లు (Gastritis) 02897...UK

ప్రాక్టీషనర్ ఈ విధంగా వ్రాస్తున్నారు. 79 సంవత్సరాల వయసుగల మహిళ జ్వరము, వికారం, మంటగా ఉండే నాలుక, కడుపు నొప్పి, కడుపులో మంటతో ప్రాక్టీషనర్ ను సంప్రదించారు. వికారం వలన ఆమె తినేది చాలా తక్కువ అందులోనూ మసాలా తో కూడినవి, వేడి పదార్దాలు తినే పరిస్థితే లేదు. ఏ ఆహారము ఐనా రుచి అదోరకంగా ఉంటోంది, కనీసం స్వీట్ ను చిన్న ముక్క నోట్లో పెట్టుకున్నా చేదుగా అనిపిస్తోంది. పేషంటుకు పై వ్యాధులతో పాటు మధుమేహము, అధిక రక్తపోటు, గుండెపోటు కూడా ఉండడంతో అలోపతి మందులు తీసుకుంటున్నది. అందువలన పెద్దగా ఇబ్బందేమీ పడటం లేదు.

ఐతే పేషంటుకు పైన పేర్కొన్న లక్షణాలు 5 నెలల క్రితం ప్రారంభమై ప్రస్తుతం భరింపరాని స్థితిలో ఉన్నాయి. ఆమెకు చాలా నీరసంగా ఉంటోంది కాని బ్లడ్ రిపోర్టు ప్రకారము ఆమెకు అనీమియా లేదని తెలిసింది. డాక్టర్ వారం రోజుల కోసం కోర్సు వ్రాసారు. కానీ వారం తర్వాత పరిస్థితి మరింతగా దిగజారి  నేను ఆమెను చూసే సమయానికి ఆమె మంచానికే పరిమితమైన స్థితిలో ఉంది.

నేను పేషంటును 2014 ఆగస్టు 19 వ తేది నుండి చికిత్స చేయడం ప్రారంభించాను. పేషంటు ఇచ్చిన సమాచారము ప్రకారము ఆమె కడుపులో పుండ్లు మరియు బహుశా మలేరియా వ్యాధి తోనూ బాధపడుతున్నట్లు గ్రహించాను. తను కొన్ని నెలల క్రితం వరకూ అనేక సార్లు అమెరికా వెళ్ళినపుడు కూడా వీరిని డాక్టరు పరిక్షించడం కానీ వీరి కుటుంబము వారు పరిగణనలోకి తీసుకోవడం కానీ చేయలేదు. ఇచ్చిన సమాచారం ఆధారంగా చేసుకొని క్రింది రెమిడి ఇచ్చాను:

CC4.1 Digestive tonic + CC4.2 Liver & Gallbladder tonic + CC4.3 Appendicitis + CC4.4 Constipation + CC4.8 Gastroenteritis + CC4.10 Indigestion + CC9.2 Infections acute + CC9.3 Tropical diseases + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic

పేషంటుతో అరలీటరు బాటిల్ నీటిలో కొన్ని గోళీలు వేసుకొని బాగా కదిపి  క్రింద సూచించిన  విధంగా తీసుకోమన్నాను:

రోజులు  1-3: ప్రతి 10 నిమిషాలకి ఒకసారి

రోజు 4:  ప్రతి గంటకి ఒకసారి

రోజు 5: ప్రతి రెండు గంటలకి ఒకసారి

రోజు 6 మరియు ఆ తర్వాత:  QDS ఆమెకు  బాగుందనిపించే వరకూ ఆతర్వాత TDS

పూర్తిగా కోలుకొన్నాక రెండు వారాలు: OD  

3 వ రోజు నాటికి పేషంటుకు 45% తగ్గిపోయింది. ఆమె లేచి తిరగడం, తను తినేది కొద్దిగానే ఐనప్పటికీ ఆహారము తయారు చేసుకోవడం చేసుకోసాగింది. జ్వరము, వికారం, కడుపు నొప్పి, మంట తగ్గిపోయాయి. 6 వ రోజు నాటికి పేషంటుకు 100% నయమయ్యింది. దీనితో ఆమె తనకు తన భర్తకు వంట చేసుకోవడమే కాక ఇంటికి సంబంధించిన అన్ని పనులు చేసుకోగలుగుతున్నారు. ఆమె తన పూర్వపు స్థితికి చేరానని తలవడంతో దానికి తగ్గట్టు గానే ప్రాక్టీ షనర్ రెమిడి ని TDS  గా  7 వ రోజునుండి (2014 ఆగస్టు 25) కొనసాగించవలసిందిగానూ వారం తర్వాత OD గా రెండు వారాలు తీసుకోమని ఆమెకు చెప్పారు. 2014 సెప్టెంబర్ 14 నుండి ఆమె రెమిడి తీసుకోవడం పూర్తిగా మానివేసారు.   

ఈ విధంగా పేషంటు వ్యాధి నుండి పూర్తిగా కోలుకున్నారు. ఇంత త్వరగా కోలుకోవడం ఆమెకు నమ్మలేని నిజం గా పరిగణిస్తూ సాయి వైబ్రియోనిక్స్ పట్ల నమ్మకం పెంచుకున్నారు. దానిని అందించిన వారికి సదా కృతజ్నురాలిగా ఉండాలని నిర్ణయించుకున్నారు.

శ్లేష్మ పొర యొక్క శోధనము (Gustatory rhinitis) 02870...USA

వృత్తి రీత్యా డాక్టర్ గానూ మరియు ప్రాక్టీషనర్ తండ్రి ఐనట్టి  82 సంవత్సరాల వృద్దుడు గత 10 సంవత్సరాలుగా గస్టేటరీ రైనిటిస్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఏదైనా తినడం ప్రారంభించగానే ఇతని ముక్కు కారడం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా వేడిగానూ, మషాలాల తోనూ ఉన్న భోజనం అది మధ్యాహ్నం కానీ లేదా రాత్రి గానీ  తినడం ప్రారంభించగానే ఇది ప్రారంభమవుతుంది. ఇలా  కారడం కూడా నిరంతరాయంగానూ ఎక్కువగానూ ఉండి తను తినే ఆహారంలో కూడా పడిపోతూ ఉండడంతో తినేటప్పుడు కూడా నిరంతరాయంగా టిస్యు పేపరుతో తుడుచుకుంటునే ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. పేషంటు తన సహచరులైన కొందరు గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులను 2013 పూర్వ భాగంలో సంప్రదించారు. వారి సూచన మేరకు యాంటిహిస్టమిన్ డిస్లోరేటడిన్ (antihistamine Desloratadine) 5 mg ను రాత్రి భోజన అనంతరం వేసుకునేవారు. కానీ పరిస్తితిలో 25% మెరుగుదల కనిపించండము తప్ప ప్రయోజనమేమి కలగలేదు, ముక్కు కారడం మానలేదు.

2014,ఫిబ్రవరి 18 న అతనికి క్రింది రెమిడి ఇవ్వబడింది:

CC19.1 Chest tonic + CC19.2 Respiratory allergies...TDS

వీరికి రెమిడి ఫిబ్రవరి లోనే ఇచ్చినప్పటికీ దీనితో నిజంగా తగ్గుతుందా అనే సంశయంతో సరిగా వేసుకునేవారు కాదు. కానీ ఏప్రిల్ చివరిలో కంటిన్యూ గా రోజుకు రెండు సార్లు వేసుకోవడం ప్రారంభించాక తినేటప్పుడు తన ముక్కు కారడం తగ్గిందని గమనించారు. మే 1 వ తేది మొదటిసారి తను తినేటప్పుడు తిన్న తర్వాత ముక్కు కారలేదని తెలిపారు. మే 29 నాటికి స్థిరమైన మెరుగదల కనిపించి 90% సమస్య పరిష్కారం ఐనట్లు తెలిపారు. జూన్  2014, నాటికి పూర్తిగా 100% తగ్గిపోవడమే కాక జూలై ఆగస్టు కూడా ఇదే రీతిగా ఫలితం కనిపించింది. కానీ దురదృష్టవశాత్తూ ఈ రెమిడి కొనసాగించమని ఎన్ని సార్లు చెప్పినా ఇతను వినక ఆగస్టు తర్వాత మందు వేసుకోవడం మానేయడంతో  సెప్టెంబర్ వరకూ బాగానే ఉండి ఆ తర్వాత అక్టోబర్ నుండి ముక్కు కారడం తిరిగి ప్రారంభమయ్యింది.  2015 మార్చ్ 16 నాటికి వీరి పరిస్థితి వైబ్రో రెమిడి తీసుకోక ముందు ఎలా ఉందో అలాంటి పరిస్థితి ఏర్పడింది.  

ప్రాక్టీషనర్ వ్యాఖ్య :

ఈ కేసు వైబ్రియోనిక్స్ మందులు నిత్యమూ క్రమశిక్షణతో వేసుకోవాలనే విషయాన్ని తేటతెల్లం చేస్తుంది. 

సంపాదకుని వ్యాఖ్య : వైబ్రియోనిక్స్ రెమిడి డోసేజ్ విషయంలో నిర్దిష్టమైన రిడక్షన్ (క్రమంగా తగ్గించే విధానము) తప్పనిసరిగా పాటించాలి.

మూసి ఉన్న స్థలాలను చూసి భయపడే వ్యాధి 02806...Malaysia

74 సంవత్సరాల పెద్దమనిషి గత 7 సంవత్సరాలుగా క్లాస్త్రోఫోబియా వ్యాధితో బాధ పడుతున్నారు. మూసి ఉన్న స్థలాలకు  అనగా లిఫ్టులు, మరుగుదొడ్లు, విమానాలు, ఇంకా ఏమైనా ఇరుకుగా ఉండే ప్రదేశాలకు వెళ్ళినపుడు  వీరు విపరీతంగా భయపడుతూ ఉంటారు. వెంటనే అక్కడ నుండి పారిపోయి విశాలంగా ఉండే ప్రదేశానికి చేరుకోవలసిందే. వీరు ఒక మానసిక చికిత్సా నిపునుడిని, చివరి ప్రయత్నంగా ఒక హిప్నాటిస్ట్ ను కూడా సంప్రదించారు కానీ ఫలితం లేదు.   

2014,ఫిబ్రవరి 18 న వీరికి క్రింది రెమిడి ఇవ్వబడింది:

CC15.2 Psychiatric disorders…TDS

మార్చి 3 వ తేదీ న వీరు రెండవసారి  వచ్చినపుడు తనకు రెమిడి తీసుకున్న మూడు రోజుల లోనే వ్యాధి పూర్తిగా నయమయ్యిందని తను మామూలు మనిషి నయ్యానని  చెప్పారు.

సర్వత్రా వ్యాపించిన రొమ్ము క్యాన్సర్ 10014...India

2009 సంవత్సరం జూలై నెలలో  ఒక సాయి భక్తురాలి ద్వారా  61 సంవత్సరాల మహిళ పూర్తిగా విస్తరించిన రొమ్ము క్యాన్సర్ తో ప్రాక్టీషనర్ ను సంప్రదించారు. ఈ క్యాన్సర్ ఆమె కుడి రొమ్ము భాగంలో ప్రారంభమై చాతీ భాగమంతా వ్యాపించడం తో పాటు ఉదరకోశ పటలమునకు కూడా వ్యాపించింది. ఇంతేకాక ఇది ఆమె క్లోమ గ్రంధి లో ఒక కణితిని, ఇంకా ఆమె పిత్తాశయము, మరియు ఇతర జీర్ణ కోశ భాగాలకు అలాగే ఇతర ముఖ్యమైన భాగాలకు, ఎముకలకు ఇలా శరీరమంతా వ్యాపించింది. దీనివలన ఆమెకు నొప్పి, అజీర్ణము, నీరసము, కలగడమే కాక ఆమె జూలై 30 నుండి మంచం పైనే ఉండ సాగింది. ఆమెకు క్రింది రెమిడి ఇవ్వబడింది:

#1.  CC2.1 Cancers – all + CC4.1. Digestion tonic + CC4.2 Liver & Gallbladder tonic + CC12.1 Adult tonic + SM1 Divine Protection…6TD 15 రోజుల వరకు, ఆ తరువాత QDS 15 రోజుల వరకు.

ఆమెను ఆయుర్వేద మందులను కూడా తీసుకోవలసిందిగా సూచించడమైనది. కనుక వైబ్రో రెమిడి ప్రారంభించిన ఒక నెల తర్వాత ఈ మందులను ప్రారంభించింది.

ఐతే రెమిడి వల్ల చెప్పుకోదగిన ఉపశమనం లేకపోవడంతో  ఈ ప్రాక్టీ షనర్ మరొక సీనియర్ ప్రాక్టీ షనర్  02709…ఇండియా ను సంప్రదింఛి ఆగస్టు 26 న రెమిడి క్రింది విధంగా మార్చడం జరిగింది:

#2. CC2.1 Cancers – all + CC2.3 Tumours & Growths + CC4.7 Gallstones + CC4.11 Liver & Spleen…QDS

నలుగు వారాల తర్వాత ( అనగా సెప్టెంబర్ 22 న ) పేషంటులో చక్కని పురోభివృద్ధి కనిపించింది. ఆమె బయటకు వెళ్ళడం కూడా ప్రారంభించింది. పేషంటు భర్త ఆమె ఆహారము కూడా బాగా తీసుకుంటోందని చెప్పారు. ఆమె రెమిడి క్రింది విధంగా మార్చడం జరిగింది:

#3. CC2.1 Cancers – all + CC2.3 Tumours & Growths + CC4.1. Digestion tonic + CC4.2 Liver & Gallbladder + CC4.7 Gallstones + CC4.11 Liver & Spleen…QDS

నవంబర్  17 న ఈమె భర్త  ప్రస్తుతం పేషంటు ఆరోగ్య పరిస్థితి చాల మెరుగుగా ఉందని తెలిపారు. అంతేకాక  ఆమె ప్రయాణాలు కూడా చేస్తోందని ఒక తీర్ధ యాత్ర కు కూడా వెళ్లిందని తెలిపారు. మరొక నెల రోజుల కోసం ఆమెకు క్రింది రెమిడి ఇవ్వబడింది.

#4. CC2.1 Cancers – all + CC2.3 Tumours & Growths + CC4.1. Digestion tonic + CC4.2 Liver & Gallbladder + CC15.1 Mental & Emotional tonic…QDS.

ఈ రెమిడి ఇచ్చిన తర్వాత పేషంటు తనకు ఎంతో మెరుగుగా ఉందని తెలిపారు. ప్రాక్టీ షనర్ పేషంటు తోనూ ఆమె కుటుంబ సభ్యుల తోనూ రెమిడి ఆపకుండా వాడుతూ ఉండాలని పదే పదే తెలిపినప్పటికీ ఈమె తిరిగి రెమిడిల కోసం రాలేదు. సుమారు 6-7 నెలల తర్వాత ఆమె ప్రశాంతంగా మరణించారు.

కుక్క మెడ పైన గాయాలు 02885...Argentina

ప్రాక్టీ షనర్ ఇలా వ్రాస్తున్నారు: మా కుక్క పిట్టీ ని మా మేనల్లుడి వ్యవసాయ క్షేత్రంలో రెండు కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. దీనికి మెడ పైన చాలా పెద్ద గాయాలు అయ్యాయి. మా మేనల్లుడు ఆ సమయంలో దూరంగా ఉన్నాడు. అందువలన పిట్టి నాలుగు రోజుల పాటు గాయాలతో అలాగే ఉండవలసి వచ్చింది. మా మేనల్లుడి తల్లి గాయాలను శుభ్రపరిచి మందు వ్రాసింది. మా మేనల్లుడు ఉరునుంది వచ్చాక పిట్టి ని పశు వైద్యుని వద్దకు తీసుకువెళ్ళాడు. డాక్టరు పిట్టి కి గాయాల్ని శుభ్రపరిచి చెడిపోయిన మాంసాన్ని తొలగించారు. ఆ తర్వాత తీసిన ఫోటోలు క్రింద  చూపబడ్డాయి.

 

మే 7 వ తేదీన నేను పిట్టి ని చూడగానే వైబ్రో చికిత్స ప్రారంభించాను. నా దగ్గర ఎప్పుదూ అత్యవసరంగా ఉండే కిట్ నుండి ఎమెర్జెన్సీ రెమిడి, ఫిట్ వెల్, మూవ్ వెల్, బి వెల్, గెట్ వెల్  రెమిడి లు ఇచ్చాను.

CC9.2 Fevers & Infections + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & emotional tonic + CC18.1 Brain disabilities + CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue + CC20.5 Spine…లీటరు నీటిలో 4 గోళీలు నెల వరకూ  BD  అనంతరం  OD

దీనితో పాటు సిల్వర్ వాటర్    (కొలయిడాల్ సిల్వర్  తో రూపొందించిన నీరు ) ఇన్ఫెక్షన్ ఉన్న గాయానికి ఎడమవైపు రాయసాగాము. ఎందుకంటే వెటర్నరి డాక్టర్ ఆ భాగంలో ఇన్ఫెక్షన్ కు గురై పాడయిన  చర్మ భాగం ఉండడడం వలన దానిని శుభ్రం చేయవద్దని  చెప్పారు. దీనితో పాటు విభూతి కూడా మెడ అంతా రాస్తూ ఇతర రకాల శక్తి ప్రేరక చిట్కాలు కూడా ఉపయోగింవచాము. 7 రోజుల తర్వాత ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గిపోయింది  (క్రింద ఎడం ప్రక్క ఫోటోలు చూడండి).

జూన్ 5 నాటికి పిట్టి ఆహారం బాగానే తీసుకొంటోంది. ఇందువల్ల దీని బరువు 3 కేజీలు పెరగడంతో పాటు ఇది రోజుకు ఒక లీటరు వైబ్రో నీటిని కూడా త్రాగుతోంది. ఎడమవైపు ఉన్న గాయం ముసుకు పోయింది కానీ కుడివైపు గాయం ప్రస్తుతం 10 cm x 5cm  ఉంది. త్వరలోనే దీనికి కుట్లు వేసి మూసివేద్దామని వెటర్నరి డాక్టర్ చెప్పారు. (క్రింద మరియు ప్రక్కనున్న ఫోటోలు చూడండి.).

 

ప్రాక్టీషనర్ వివరాలు 10014...India

నేను ముంబాయి కి చెందిన శాంతాక్రజ్ ప్రాంతపు వాడిని. నేను మెకానికల్ ఇంజినీరింగ్ లో పట్టా తీసుకోని గత 22సంవత్సరాలుగా ఎయిర్ఇండియా లో ఏవిఏషన్ ఇంజినీరుగా పనిచేస్తున్నాను.  నేను 2007 లో వైబ్రియోనిక్స్ లో ప్రవేశించాను. ఆ సంవత్సరము మొదటి త్రయిమాసికము లో నాకు హైపర్ అసిడిటీ మరియు మానసిక ఆందోళన వలన నా జీవన శైలి పూర్తిగా మారిపోయింది. గత ఆరునెలలుగా అలోపతి మందులు తీసుకుంటూనే ఉన్నాను. అంతేకాక ఎండోస్కోపీ లో నా అన్నవాహిక  కోతకు గురైనట్లు రిపోర్టు వచ్చింది. చాలాకాలం నుండి అలోపతి మందులు తీసుకొనడం వలన కలిగే సైడ్ ఎఫెక్ట్ లను తగ్గించుకొనే ఉద్దేశంతో వీటిని మానివేయాలని నిశ్చయించుకొన్నాను. ఇదే సంవత్సరం ఏప్రిల్ నెలలో ధర్మక్షేత్రం లో ఇదే ఇబ్బంది తో బాధపడే ఒక సాయి భక్తుడి ని కలుసుకున్నాను. వైబ్రియోనిక్స్ మందులవల్ల అతని వ్యాధి నయమైనట్లు తెలిసింది. వారు నన్ను ఒక అలోపతి డాక్టర్ మరియు వైబ్రియో ప్రాక్టిషనరైన మహిళకు పరిచయం చేసారు. ఆమె సాయిసెంటర్ లో వైబ్రో క్లినిక్ నడుపుతున్నారు. వారిదగ్గర మందులు తీసుకొగానే నయమయ్యి చాలా ఆనందం కలిగింది. జూలై 3వ తేదిన ఒక ప్రాక్టీషనర్ నాకు ఫోన్ చేసి రానున్న రెండు రోజులలో వైబ్రియో వర్క్ షాప్ ఉందని దానిలో పాల్గొనడంతో పాటు తనకు కార్యక్రమ నిర్వహణలో సహాయపడవలసి ఉంటుందని  చెప్పారు. ఆ విధంగా జూలై 15 న నేను ఈ సేవ ప్రారంభించడం తో పాటు CC4.10 Indigestion…TDS రెమిడి  తీసుకోవడం ద్వారా మొదటి పేషంటు నాకు నేనే అయ్యాను.ఆరోజు రాత్రి నా వైబ్రియో కిట్టు ను 108 CC బాక్సు ను, హ్యాండ్ బుక్కును స్వామి ఆశీస్సులు కోసం వారి ఫోటో ముందు ఉంచాను. రెండు రోజుల్లోనే పుస్తకం మొదటి పేజీ పైన “ఓం” అనే అక్షరాలు విభూతితో కనిపించాయి (క్రింద నున్న ఫోటో చూడండి ). నన్ను ముందుకు సాగమని స్వామి ప్రోత్సహించడానికి ఇంతకంటే నిదర్శనం ఏమికావాలి ?

అప్పటి నుండి ప్రాక్టీషనర్ ల లిస్టులు తయారుచేయడం, వారికి అధికారిక సమాచారం పంపడం, రిపోర్టులు సేకరించడం వాటిని క్రోడీకరించడం, ఇంకా ధర్మక్షేత్రం లో వర్క్ షాప్ ల నిమిత్తం ఒక కోఆర్డినేటర్ గా ఏర్పాట్లు చూడడం ఇదంతా స్వామి ప్రసాదమే.  ఇప్పటికీ ఇది కొనసాగుతూనే ఉంది.  

2007 డిసెంబర్ లో నేను JVP శిక్షణ పూర్తి చేసుకున్నాను. నాకు ఇచ్చిన క్రొత్త 108CC బాక్సును స్వామి ఫోటో ముందు ఉంచగా రెండు రెమిడి బాటిళ్ళ పైన స్వామి హస్తాక్షరి  రావడమే కాక  బాక్సు మొత్తం విభూతితో నిండిపోయింది. “ప్రేమతో బాబా” అనే అక్షరాలు NM18  రెమిడి పైన (సామాన్య జ్వరము)  (25వ సీసా) మరియు  “ శ్రీ సత్యసాయి ” అనే అక్షరాలు NM20 Injury రెమిడి పైన (29వ సీసా)  కనిపించాయి. (పైన ఉన్న ఫోటోలు తిలకించండి). ఈ సీసాలు మెడికల్ క్యాంపుల్లో పిల్స్ ఆలశ్యం లేకుండా త్వరగా ఇవ్వడం కోసం తయారు చేయబడ్డాయి. (ఆల్కహాల్ పడినప్పుడు చెరిగిపోకుండా ఉండడానికి  నేను ఈ అక్షరాల పైన టేపు అంటించాను)

 2013, జూలై 20 న నా యొక్క SVP కోర్సు ముగిసిన తర్వాత  నేను డాక్టర్ అగర్వాల్ గారినుండి  SRHVP మిషన్ తీసుకోని ఆరోజు సాయత్రం హారతి అనంతరం స్వామి ఆశీస్సుల కోసం సమాధిపై ఉంచడం జరిగింది.

ఇంటికి వచ్చిన తర్వాత దీనిని స్వామి ఫోటో ముందు ఉంచగా మూడు రోజుల తర్వాత స్వామి అనుగ్రహానికి సూచనగా మిషన్ రెండు బావుల లోనూ విభూతి రావడంతో దానిని జాగ్రత్త పరచి  అసాధారణ సమస్యలతో వచ్చే పేషంట్ లకు రెమిడి పిల్స్ తో పాటు ఇవ్వడానికి రెండు కంటైనర్ లలో భద్రపరిచాను. విచిత్ర మేమిటంటే సాంపిల్ వెల్ లో వచ్చిన విభూతి యొక్క రంగు రుచి రెమిడి వెల్ లో వచ్చిన విభూతి కి భిన్నంగా ఉన్నాయి.

ఇంతేకాక స్వామి ప్రేమతో తమ దివ్య హస్తాక్షరి ని చివరి కార్డు ఐనట్టి   SR576 Tumours పైన ప్రసాదించడం జరిగింది (ఫోటో చూడండి).  

 ఇదంతా కూడా ఒక దివ్యమైన ప్రణాళిక ప్రకారము జరిగిందనే విషయం మెల్లిగా నాకు అవగత మైనది. నాకు స్వామి వారి దర్శనం ధర్మ క్షేత్రంలో 1999 మార్చి 12 వ తేదీన స్వామి శాంతి దీప్ ఎదురుగ ఉన్న మెడికల్ సెంటర్ ను ప్రారంభించడానికి వచ్చినప్పుడు కలిగింది. సరిగ్గా 9 సంవత్సరాల (2008 లో)తర్వాత అదే స్థానంలో వైబ్రో పిల్స్ ఇచ్చే దివ్యమైన సేవలో పాలు పంచుకునే భాగ్యం కలిగింది. ప్రస్తుతం నేను మా ఇంట్లోనే కాక షిర్డీసాయి మందిరం, కదంవాడి, కలీనా, శాంతాక్రజ్ (తూర్పుముంబాయి ) లలో వారాంతపు సెలవులలో ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ వైబ్రో రెమిడిలు ఇస్తున్నాను. ఈ విధంగా ఇంతవరకు 2480 పేషంట్ లను చూడడం జరిగింది.

ప్రాక్టీషనర్ వివరాలు 02885...Argentina

 నేను ఒక కిండర్గార్టెన్ టీచర్ ను అంతకు మించి బాబాకు విశ్వసనీయమైన భక్తురాలిని. 2010 నుండి ప్రతీ సంవత్సరం పుట్టపర్తి సందర్శిస్తూనే ఉన్నాను. మొదటి సారిగా నేను నా స్నేహితురాలుతో వెళ్ళాను. ఆ సమయంలో ఆమె యొక్క 7 సంవత్సరాల బాబు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఇతను పుట్టుకతోనే వాచిపోయి పెరిగిన గుండె తో పుట్టాడు. భగవంతుని శరణు వేడే ఉద్దేశ్యంతో వెళ్లి అనుకోకుండా సాయి వైబ్రియోనిక్స్ నేర్చుకున్నాము. డాక్టర్ అగ్గర్వాల్ మరియు శ్రీమతి హేమ అగ్గర్వాల్ ఈ బాబుకు రెమిడి ఇచ్చారు. దీనిని అక్కడే ఇండియాలోనే వాడడం ప్రారంభించాము. రోజు రోజుకు బాబు ఆరోగ్యంలో ఎంతో మెరుగుదల కనిపించింది. అందుచేతనే నేను వైబ్రో థెరపీ నేర్చుకుని ప్రాక్టీ షనర్ అవుదామనుకున్నాను. ఐతే డాక్టర్ అగ్గర్వాల్ రెండు సంవత్సరాల వరకు అనుమతి ఇవ్వలేదు. ఆ తర్వాత ఆశ్రమం లోనే శిక్షణ తీసుకున్నాను. 2013 నుండి నేను JVP గా ఉన్నాను. ఇప్పటివరకూ అర్జంటినా లో 700 పేషంట్ లను చూసాను. ఈ సేవను శ్రద్ధతో ప్రేమతో చేయడానికి కావలసిన శక్తిని స్వామి నాకు ప్రసాదించారు. జంతువులకు చిన్న పిల్లలకు రెమిడి లు ఇవ్వడం అంటే నాకు మహా ఇష్టం ఎందుకంటే వీరి నుండి వ్యతిరేక భావలేమి రావు కనుక త్వరగా కోలుకునే అవకాశం ఉంది.

నేను పేషంట్ లకు చికిత్స ఇచ్చే సందర్భంలో తమహృదయంలో ఉన్న భగవంతుని పైన సంపూర్ణమైన విశ్వాసం ఉంచమని చెపుతాను.

ఈ సేవ ద్వారా నేను ఏది చేస్తున్నానో దానిని ప్రేమించ గలగడం అలవాటయ్యింది. వైబ్రియోనిక్స్ తో పనిచేస్తుంటే  ప్రేమావతారి స్వామితో ఉన్నట్లే ఉంటుంది.  

ఈ వైబ్రో సాధన వల్ల నా భావాలలో మార్పు వచ్చి ప్రేమతో పేషంట్ లు చెప్పేది ఓపికతో వినగల్గుతున్నాను. వారిని ఓదార్చి ప్రేమను అందించి వారికోసం ప్రార్ధనలు కూడా చేసే విధంగా స్వామి నాలో మార్పు తెచ్చారు.

ప్రశ్నలు సమాధానాలు

1.  ప్రశ్న: కొందరు పేషంట్లు రెమిడి లను నీటిలో కలుపుకొని అలా చార్జ్ అయిన నీటిని పగటిపూట తాగడం అనుకూలంగా ఉందని చెపుతున్నారు. ఐతే ఈ డోసేజ్ 6TD ఐనట్లయితే  పేషంటు దీనికన్నా ఎక్కువగా తీసుకోవడం వలన దైనా సమస్యగా మారడం లేదా పుల్లౌట్ రావడం వంటివి ఏవైనా జరుగుతాయా ?

సమాధానంఏ రెమిడి ఐనా చెప్పిన మోతాదులో క్రమశిక్షణతో తీసుకుంటేనే బాగా పనిచేస్తుంది. ప్రతీ సందర్భంలోనూ కాకపోయినా ఒక్కొక్కసారి అధిక మోతాదులో రెమిడి తీసుకున్నపుడు పుల్లౌట్ చాలా తీవ్రంగా రావచ్చు. వ్యాధి లక్షణాలు తీవ్రంగా ఉన్నప్పుడు రెమిడిని ఎక్కువసార్లు తీసుకోవచ్చు కానీ బాగా పనిచేయాలంటే నియమిత కాలవ్యవధిలో తీసుకుంటేనే మంచిది మరియు రెమిడి ని గోళీల రూపంలో కాక నీటితో తీసుకుంటేనే బాగా పనిచేస్తాయి.

______________________________________

2.  ప్రశ్న:  కొందరు ప్రాక్టీషనర్ లు మొదట రెమిడి డ్రాప్స్ బాటిల్స్ లో వేసిన తర్వాత వాటిని గోళీలతో నింపుతారు. మరికొందరు గోళీలతో నింపిన తరువాతే రెమిడి చుక్కలు వేస్తారు  ఈ రెండు  పద్ధతులూ సరియైనవేనా ?

సమాధానం: రెండు పద్ధతులలోనూ ఫలితం ఒకటే. ఐతే ముందుగా రెమిడి డ్రాప్స్ వేయడం వలన 2/3 వంతు కన్నా ఎక్కువ గోళీలు బాటిల్ లో పడినప్పుడు వాటిని తొలగింఛినపుడు అవి వ్యర్ధమై పోతాయి. అంతేకాక ప్రయాణ సమయంలోనూ క్యాంపుల్లోనూ మొదట గోళీలను నింపుకొని వాటిని తీసుకెల్లడమే మీకు సదుపాయముగా ఉంటుంది.   

______________________________________

3.  ప్రశ్న: ప్రైమరీ స్కెలోరోజింగ్ కోలిన్జైటిస్ PSC వ్యాధి నివారణకు వైబ్రో రెమిడిలను ఉపయోగించవచ్చా – ఐతే ఏ విధంగా ?  

సమాధానం: అవశ్యం ఉపయోగించ వచ్చు. ఈ రెమిడి ని ఉపయోగించి చూడండి: CC4.2 Liver & Gallbladder tonic + CC4.6 Diarrhoea + CC4.11 Liver & Spleen + CC12.4 Autoimmune diseases + 21.4 Stings & Bites.

SRHVP మిషన్ ఉన్నవారయితే : NM2 Blood + NM22 Liver + NM102 Skin Itch + NM113 Inflammation + BR12 Liver + SM5 Peace & Love Alignment + SR284 Chelidonium 30C + SR340 Aloe 30C + SR504 Liver.

______________________________________

4.  ప్రశ్న: మూత్రపిండాలు, గుండె, లివరు వంటి ప్రధాన అవయవ మార్పిడి చేయించుకున్న పేషంట్లకు ఇవ్వవలసిన వైబ్రో చికిత్స గురించి సూచనలిస్తారా, అటువంటి వారికి కొత్తగా చేరిన అవయవం పట్ల శరీరంలో వ్యతిరేకత రాకుండా అల్లోపతీ మందుల వాడకం వలన వారి రోగనిరోధక వ్యవస్థ నిర్వీర్యం అవుతుందనే ఉద్దేశ్యం నాకుంది. కనుక వీరికి ఈ శక్తిని పటిష్ట పరిచేందుకు రెమిడిలు ఇవ్వవచ్చా? 

సమాధానం: ఇటువంటి సందర్భాలలో పేషంటు యొక్క అలోపతి వైద్యమునకు చేదోడు గా ఉంటూ అదే సమయంలో సైడ్ఎఫెక్ట్ లు రాకుండా ఉండేందుకు ప్రాక్టీషనర్ సానుభూతితోనే కాక విచక్షణతోనూ, అవగాహనా తోనూ, రెమిడి లు ఇవ్వవలసి ఉంటుంది. మీరిచ్చే రెమిడి పేషంటును  శారీరకంగా, మానసికంగా  దృఢంగా చేయడమేకాక కొత్తగా శరీరంలో చేరిన అవయవానికి వ్యతిరేకత రాకుండా చేయగలిగేదిగా ఉండాలి.  

ఈ రోగనిరోధక వ్యవస్థ కొత్త అవయవము పైన దాడి చేయకుండా ఉండడానికి తగిన పర్యవేక్షణ తోపాటు ఆరోగ్యవంతమైన ఆహారము, డాక్టర్ సలహాతో తగినటువంటి వ్యాయామము, యోగా, ఆరోగ్యవంతమైన ఆధ్యాత్మిక జీవన విధానము ధ్యానము, ప్రార్ధనలు ఎంతో ఉపకరిస్తాయి. ఇంకా పేషంట్లకు కావలసిన ఉపయోగకరమైన సూచనల కోసం ఈ వెబ్సైటు చూడండి  http://www.webmd.com/a-to-z-guides/life-after-transplant-tips-managing-health

ఇటువంటి వారికోసం CC12.1 Adult tonic ఇవ్వడం ఎంతో క్షేమకరం అలాగే ఏ పరిస్థితి లోనయినా సరే  CC15.1 Mental & Emotional tonic. నూ ఇవ్వవచ్చు. దీనితోపాటుగా ఆ అవయానికి చెందిన రెమిడి కూడా ఇవ్వడం, తను తీసుకునే అలోపతి డోస్ కు చెందిన నోసోడ్ కూడా తప్పనిసరిగా ఇవ్వాలి.

______________________________________

5.  ప్రశ్న: మరీ ఎక్కువగా కాక పోయినా నిత్యమూ అలవాటు ప్రకారం కిళ్ళీలు, వక్కలు నమిలేవారికీ, సారాయి సేవించే వారికీ  వైబ్రో రెమిడిలు ఇవ్వవచ్చా?

సమాధానం: ఇవ్వవచ్చు, ఆ రెమిడి లు వారికీ పనిచేస్తాయి. ఐతే సాధారణంగా మనం వక్కలు, సారాయి తీసుకోవద్దని చెపుతూ ఉంటాము. ఏమైనప్పటికీ వక్కలు, సారాయి, మాదక ద్రవ్యాలు, కిళ్ళీలు వంటి వాటికి బానిసలైన వారికి మందులు ఇవ్వాల్సి వస్తే పేషంట్లనే స్వయంగా మిమ్మల్ని కలవవలసిందిగా సూచించాలి. అంతేకాక ఆ పేషంటు స్వయంగా ఆ దురలవాటు నుండి బయటపడడానికి ధృడంగా సంకల్పం చేసుకొని ఉండాలి. అలాంటి వారికి రెమిడిలు సత్వర సత్ఫలితాలను ఇస్తాయి.

______________________________________

6.  ప్రశ్న: కొన్నిసందర్భాలలో పేషంటు రోగలక్షణాలు ప్రాధమికంగా మెరుగయ్యి ఒక స్థాయి చేరుకున్నాక ఏ విధమైన మార్పు ఉండదు. అటువంటి పరిస్థితిలో పేషంటుకు మేలు చేకూర్చడానికి ప్రాక్టీషనర్ ఏమి చెయ్యాలి ?

సమాధానం: పేషంటు డోసేజ్ విషయంలోనూ మందులను భద్రపరిచే విషయంలోనూ మీ సూచనలను ఖచ్చితంగా పాటించారా లేదా అనేది చూడండి. ఈ మందుల పైన పేషంటుకు విశ్వాసం పోయిందా, లేదా అతని అంతః చేతన లో ఏదైనా వ్యాధి నయమవ్వడానికి అడ్డుపడుతోందా అనేది తెలుసుకోవడానికి ప్రయత్నించండి. కౌన్సిలింగ్ తో పాటు  అవసరం మేరకు వేరే కాంబినేషన్ లో రెమిడి ఇవ్వడానికి ప్రయత్నించండి. బహుశా పేషంటు కు సరియైన విధానంలో క్లెన్సింగ్ కు గురిచేయడం, అవసరము మేరకు  రోగనిరోధక శక్తిని పెంచే ఏర్పాటు నియమ బద్ధమైన  కాలవ్యవధి లో అందేలా చూడండి. ఆ విధానంలో అతని శరీరం పూర్తిగా సహకరించే విధంగా మార్పు తీసుకురండి.

దివ్య వైద్యుని దివ్యవాణి

సేవ నిన్ను నా దరికి చేరుస్తుంది. నీ హృదయం అనే పూజాపుష్పము సేవద్వారా పరిమళాన్ని చేకూర్చుకొని నాకు మరింత ప్రీతి పాత్రమవుతుంది.”                                             

… సత్యసాయిబాబా, సత్యసాయిబాబా వారి  80 వ పుట్టినరోజు, 2005 సందర్భంగా విడుదలయిన అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు శీర్షిక నుండి  

 

"రోగాలను తప్పించుకొనే ఉద్దేశ్యంతో మీరు మందులెన్నో వేసుకుంటారు. కానీ మీ ఆనందాన్ని హరించి మిమ్మల్ని సామాజిక పరంగా ప్రమాదకరమైన స్థాయికి నెట్టే  రోగాలైన అసూయా, డంబము, అహంకారము, కోరిక వంటి వాటి గురంచి మీరు తెలుసుకోలేక పోతున్నారు. ఈ రోగాలను మటుమాయం చేయడానికి దైవమనే ఔధం తీసుకోండి. భగవంతుడు అన్ని జీవుల హృదయవాసియై ఉన్నాడని గ్రహించండి. మిరెవరినైనా మానసికంగా కానీ భౌతికంగా కానీ  దూషించినా, కష్టపెట్టినా మీరు భగవంతుని బాధించిన వారే ఔతారు. మీ హృదయంలో ద్వేషము, పగ వంటి వాటికి స్థానం కల్పించవద్దు. మీ ఆగ్రహాన్ని వ్యక్తపరచడానికి  జాగ్రత్తగా ఎన్నుకున్న పదాలను ఉపయోగించండి. కానీ చేతలు రూపంలో మాత్రం చూపకండి. మీ తప్పులు మీరు తెలుసుకొని పశ్చాత్తాపము తో మరలా అటువంటి తప్పులు జరగకుండా ఉండడానికి శక్తినిమ్మని భగవంతుని ప్రార్ధించండి."                                                        

…సత్యసాయిబాబా దివ్యవాణి, 14 అక్టోబర్ 1964

ప్రకటనలు

  • ఇండియా  ఢిల్లీ ఎన్ సి ఆర్ : AVP వర్క్ షాప్  4-5 ఏప్రిల్ 2015, సంప్రదించవలసిన వారు;  సంగీత  వెబ్సైట్  [email protected]

  • యుకె  లండన్ : రిఫ్రెషర్ సెమినార్  19 ఏప్రిల్ 15, సంప్రదించవలసిన వారు;  జెరం వెబ్సైట్   [email protected] లేక టెలిఫోన్ నంబరు  020-8551 3979                                                          

  • యుఎస్ఎ  షెఫర్డ్స్ టౌన్, WVAVP వర్క్ షాప్  1-3 మే మరియు  17-19 జూలై  2015, సంప్రదించవలసిన వారు; సుసాన్  వెబ్సైట్  [email protected]

  • ఇండియా  ముంబాయి : రిఫ్రెషర్ సెమినార్   6-7 జూన్ 15, సంప్రదించవలసిన వారు; సందీప్  వెబ్సైట్  [email protected]

  • ఇటలీ  పడువ, వెనిస్ : SVP  వర్క్ షాప్  16-18 అక్టోబర్  15, సంప్రదించవలసిన వారు; మోనాలిసా  వెబ్సైట్       [email protected]

అదనపు సమాచారం

లీసెస్టర్ క్యాంపు పైన నివేదిక,  1st ఫిబ్రవరి  2015 02897...యుకె

యుకె లో ఉన్న ప్రాక్టీ షనర్ ల కోసం లీసెస్టర్ లో ఏర్పాటు చేసిన మొదటి క్యాంపు ఇదే. మరొకటి పైప్ లైన్ లో ఈ  సంవత్సరంలో ఏర్పాటు చేద్దామనుకుంటున్నాము.  ఈ రోజు బాగా చలిగా ఉండడంతో 1.30 కి ప్రారంభము కావలసి ఉండగా 1 గంట నుండి  సభికులు రావడం ప్రారంభించారు. స్థానిక సాయి సెంటర్ నుండి వారి కోఆర్డినేటర్ సూచన మేరకు ఎందరో వాలంటీర్లు కూడా సేవ చేసే ఉద్దేశ్యంతో ముందే రావడం జరిగింది.  మేము మొత్తం ఆరుగురు ప్రాక్టీ షనర్లo కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు 108 కొమ్బో పుస్తకంలో ఉన్న ప్రార్ధన చేసి స్వామిని మా ప్రతీ అడుగులోనూ సహాయం అందించమని ప్రార్ధిస్తూ కార్యక్రమం ప్రారంభించాము.

కార్యక్రమము ప్రారంభించడంలో 20 నిముషాలు ఆలశ్యం ఐనప్పటికీ కార్యక్రమ పరిచయానికి చెందిన వీడియో మొదలు కాగానే ప్రేక్షకుల దృష్టంతా దానిపైన లగ్నమయ్యింది. వీడియో ప్రదర్శన పూర్తి కాగానే అలోపతిక్ డాక్టర్ మరియు వైబ్రో చికిత్సా నిపుణురాలు  02802...యుకె వైబ్రియోనిక్స్ ఎలా పనిచేస్తుంది, చెడు ఆలోచనలు ఆరోగ్యము పైన ఎలా ప్రభావము చూపుతాయి అనే విషయాల పైన అద్భుతమైన ప్రసంగం చేసారు. అనంతరం వీరు ప్రేక్షకులనుండి ఒకరి సహాయం తీసుకోని కినిసియలాజీ (శరీర చలనమునకు చెందిన శాస్త్రము) టెక్నిక్ యొక్క ఉపయోగముల గురించి తెలియ జేసారు. అనంతరం వైబ్రియోనిక్స్ శరీరము పైన పాజిటివ్ ఫలితాలు కలిగించేలా ఎలా పని చేస్తుంది అనేది కూడా వివరించారు. అనంతరం ఇద్దరు ప్రాక్టీ షనర్ లు వైబ్రియోనిక్స్ పైన తమ అనుభవాలను క్రోడీకరిస్తూ ప్రసంగించారు.  ఒక ప్రాక్టీ షనర్ తను అత్యంత క్లిష్టమైన మోకాలి నొప్పి నుండి వైబ్రో రెమిడి ద్వారా ఎలా కోలుకోవడం జరిగిందో వివరించారు..  మరొక ప్రాక్టీ షనర్ తన  పేషంటు జాయింట్ పెయిన్స్ నుండి వైబ్రో రెమిడి తో అతి తక్కువ కాలంలో 5 రోజుల్లోనే ఎలా నయం చేయబడిందో వివరించారు.  ఇప్పుడు తన పేషంటు ఏ ఇబ్బంది లేకుండా ఆనందంగా ఉన్నారని ప్రాక్టీషనర్ వివరించారు.

T

అనంతరం ప్రశ్నలకు అవకాశం ఇవ్వడంతో సభికులు అడిగిన అనేక  ప్రశ్నలకు ప్రాక్టీషనర్  02802...యుకె మరియు ఇతర ప్రాక్టీ షనర్ లు సమాధానము చెప్పారు.  పేషంట్లు రెమిడిలను ఎలా తీసుకోవాలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలపడం జరిగింది. దీని వలన ప్రాక్టీ షనర్ లకు కన్సల్టేషన్ విషయంలో ఎంతో సమయం ఆదా అయ్యింది.

పరిచయ కార్యక్రమం పూర్తికాగానే కన్సల్టేషన్  ప్రారంభమవడంతో పేషంట్లు క్రమేణా పెరగసాగారు. కన్సల్టేషన్ విభాగము మొదటి అంతస్తులో ఏర్పాటు చేయడం వలన గ్రౌండ్ ఫ్లోర్ లో పేషంట్లు వేచి ఉండడానికి, మరియు వారి రిఫ్రెష్మెంట్ కోసం ఏర్పాట్లు చేయబడినాయి. ఇలా చేయడం వలన కార్యక్రమ నిర్వహణమంతటా  నిశబ్ద వాతావరణం నెలకొంది. ప్రాక్టీషనర్ లు మధుమేహము, కీళ్ళనొప్పులు, జలుబు, ఫ్లూ, వంటి సాధారణ వ్యాదులనుండి క్లిష్టమైన గుండెజబ్బులు, వంటి వరకూ వ్యాధులకు రెమిడి లు ఇచ్చారు. BP అనేది రోగులలో సాధారణమై పోయింది. మా బృందమంతా పేషంట్ లకు నాలుగవ వారం తిరిగి కలుసుకొని ఫీడ్బ్యాక్ ఇవ్వవలసిందిగా సూచించాము. అంతేకాక ఏవైనా రెమిడి లు మార్చవలసి వస్తే మార్చడానికి కూడా అవకాశం ఉంటుందని భావించాము.  అంతేకాక వీరిలో ఎవరివద్ద నుండైనా ఫోన్ గానీ ప్రత్యుత్తరం గానీ రాకపోయినా వారిని ఫాలో అప్ చేయాలనీ కూడా నిర్ణయించుకున్నాము.

మేము మొత్తంగా 75 మంది పేషంట్లను చూసాము. ఈ సంఖ్య మాకు చాలా తృప్తి నిచ్చింది ఎందుకంటే మేము ఉన్నది ఆరు గురం ప్రాక్టీషనర్ లము కనుక ఇది మాకు ప్రోత్సాహదాయకమే. మాలో ప్రతీ ఒక్కరమూ కార్యక్రమము జరిగిన తీరు పట్ల చాలా ఆనందంగా ఉన్నాము. అలాగే పేషంట్ల నుండి, వారిని తీసుకువచ్చిన వారినుండి, సహాయకులనుండి, కావలసినంత ఫీడ్బ్యాక్ లభించింది.  మా చివరి కన్సల్టేషన్  సాయంత్రం 6 గంటలకు పూర్తికావడంతో క్యాంపు ముగించి స్వామికి కృతజ్ఞతలు చెల్లించి ఇంటికి మరలినాము.