Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

Vol 5 సంచిక 1
January/February 2014
ముద్రింప తగిన వార్తాలేఖ


పూర్తి వార్తాలేఖ యొక్క కాగితం ప్రతి కావలెనన్నఈ పుటను ముద్రించండి

డా.జిత్. కే అగ్గర్వాల్ యొక్క మాటల్లో

ప్రియ వైబ్రియోసాధకులారా,

నేను మీకందరికీ పవిత్రమైన, సంతోషప్రదమైన నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలుపుతూ ప్రారంభిస్తున్నాను! రోజులు లెక్కపెట్టగా, పుట్టపర్తిలోని మొదటి అంతర్జాతీయ సాయి విబ్రియోనిక్స్ సమావేశం జరుగుటకు, కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నవి. ఎంత ఉత్తేజకరమైన విషయం! ఆనందంతో, ఆతృతతో సన్నాహాలు జరుగుతున్నవి. 26 జనవరి, ఆదివారంనాడు జరగబోయే ఈ అంతర్జాతీయ ప్రారంభోత్సవం నాటికి, ప్రతి పని సజావుగా జరుగులాగున నిర్ధారించుటకు, రోజంతా, రాత్రి సైతం పనిచేస్తున్న అనేకమంది వాలంటీర్లు మనవద్ద వున్నారు.

సమావేశానికి రిజిస్టర్ చేసుకున్న, ఆశ్రమంలో వసతి అవసరమయ్యే, అభ్యాసకులందరికీ వసతి ఇవ్వబడుతుంది. స్వామి కృపవల్ల సమావేశానికి హాజరైన అభ్యాసకులకు ఉత్తరములోనున్న (N7) 7వ బ్లాక్ లో వసతి యివ్వగలమని హామీ యిస్తున్నాము. జనవరి 25న మీ బాడ్జీలు (ముద్రబిళ్ళలు), ఫోల్డర్లను సేకరించుకునేందుకు, మీరు N7 బ్లాక్ లో, ఉదయం 9 నుంచి వ్యక్తిగతంగా నమోదు చేసుకోవాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. బ్యాడ్జ్ ఉన్న వారికి మాత్రమే, సమావేశమునకు ప్రవేశార్హత ఇవ్వబడుతుంది. కనుక ఇది చాలాముఖ్యం.

సమావేశపు వేదిక పెద వెంకమరాజు కళ్యాణమండపం (స్వామివారి పాతమందిరం). మేము మా సమావేశాన్ని నిర్వహించడానికి, ఈ పవిత్రస్థలం దొరకుట మా అదృష్టం. శ్రీ బాబా యొక్క గొప్ప ఆశీర్వాదంవల్ల, ఉదయం 8 నుండి సాయంత్రం 6 గంటల వరకు మేము కేసుల వివరాలు, యితర వివరాలు అందజేయగలము . సాయి విబ్రియోనిక్స్ ఎగ్జిబిషన్ 26 వ తేదీన ప్రతినిధులకు, అదే వేదిక వద్ద 27 వ తేదీన ప్రజలకందరికి తెరువబడి ఉంటుంది. 27 వ రోజు ఉదయం మేము సమావేశంతో బాటు సదస్సు నిర్వహిస్తాము. వివరాలు నమోదు సమయంలో ఇవ్వబడతాయి. సమావేశానంతరం సమావేశ విచారణల పుస్తకం కాపీలను అందరికీ అందుబాటులోకి తీసుకురాబడుతాయి.

మీలో చాలామంది సమావేశంలో అడగాల్సినప్రశ్నలతో వస్తారని నాకు తెలుసు. దయచేసి వాటిని మీ ఫోల్డర్ పాకెట్ లో యిచ్చిన నోట్ పాడ్ పై వ్రాసి సమర్పించండి. మాసమయాన్ని బట్టి, ప్రశ్నలకు సమావేశంలోనో, లేదా మరునాడో సమాధానాలు ఇవ్వబడతాయి. సమాధానం యివ్వని ప్రశ్నలు, మా తర్వాతి వార్తాలేఖలతో ప్రచురించబడతాయి.

దక్షిణభారత క్యాంటీన్ 1వ అంతస్తులో, ప్రతినిధులందరికీ అల్పాహారాన్ని, సమావేశవేదికవద్ద మధ్యాహ్నభోజనం, టీ వడ్డిస్తారు. 26వ తేదీ సాయంత్రం సమావేశం ముగిసిన తర్వాత, ప్రతినిధులందరికీ, ఉత్తరభారత క్యాంటీన్లో వేడుక సందర్భంగా ప్రత్యేకవిందు జరుగుతుంది.

స్వామి సదా క్రమశిక్షణ ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. కనుక మన సమావేశమునకు హాజరైనవారంతా, ఆదర్శమైన సాయిభక్తులవలె ప్రవర్తించెదరని, నేను నమ్ముతున్నాను. ప్రశాంతిమందిర్ క్రమశిక్షణ పాటించి, వారిని తృప్తిపరచాలి. అభ్యాసకులందరు డ్రెస్ కోడ్ పాటిస్తూ, తెల్ల పేంట్, చొక్కా పురుషులు, కోవెలకు ధరించే, సాదా, పూర్తి-పొడవు దుస్తులు మహిళలు ధరించాలి. ఈ అంతర్జాతీయసమావేశం తొలి నుండి, అన్నిదశలలో స్వామి మనతో వుంటారని మనకు తెలుసు. స్వామి శారీరకంగా మనమధ్య లేకున్నను, ఈప్రత్యేకరోజున, హాజరైన వాళ్ళని తనప్రేమలో వోలలాడిస్తూ, ఆయన మనతో ఉంటారు. చివరగా, మీరంతా సంతోషంతో యిళ్లకు చేరుకొని, పునరుద్ధరించబడిన శక్తి, ఉత్సాహంతో వైబ్రోసాధన కొనసాగిస్తారని ఆశిస్తున్నాము. సమావేశానికి హాజరవలేకున్నా, మీ హృదయాలు యిక్కడే వుంటాయని మాకు తెలుసు. మరోసారి మీ అందరికీ చక్కటి సాయి ప్రేమతో, దీవెనలతో నిండిన నూతన సంవత్సరం 2014 శుభాకాంక్షలు తెలుపుతున్నాను.

ప్రేమపూర్వకమైన శ్రీ సాయి సేవలో,

జిత్ అగర్వాల్

నిద్రలో పడక తడుపుట 02765...India

దీర్ఘకాలిక పక్క తడిపే (ఎన్యూరెసిస్) సమస్యకల, స్కూలుకు పోవు, 12 ఏళ్ల బాలికకు వైబ్రియోనిక్స్ రెమెడీని పంపమని అభ్యాసకుని కోరారు. ఆమెయిల్లు దూరమైనందున, నెలవారీ విబ్రో శిబిరానికి రాలేకపోయింది. ఆమెకు పోస్ట్ ద్వారా పంపబడింది:
CC12.2 Child tonic + CC13.3 Incontinence...TDS

తల్లి ఆత్రుతకి, ఇబ్బందిపడుతున్న పాపకి గొప్ప ఉపశమనం కలిగిస్తూ, ఒక నెలలోనే సమస్య వేగంగా తగ్గిపోయింది.

 

గర్భాశయంలో ( సెర్విక్స్ లో ) కురుపులు 11389...India

13ఏళ్ళ అమ్మాయి గర్భాశయంలోని చిన్న, తెల్లని చీము, చాలా దురదకల్గిన, బాధాకరమైన కురుపులతో, గతవారంగా బాధపడుతోంది. 3 ఆగష్టు 2013న ఆమెకు ఇచ్చిన పరిహారం:

CC8.5 Vagina & Cervix...6TD 3 రోజులు మరియు TDS 2 రోజులు

4 రోజుల్లో పాతకురుపులు మాయమైనా, అదే సమయంలో కొన్ని కొత్తవి కనిపించినవి. చికిత్స క్రిందివిధంగా మార్చబడింది:

CC8.5 Vagina & Cervix + CC21.7 Fungus + CC21.11 Wounds & Abrasions...6TD చొప్పున, 5 రోజులపాటు, కొబ్బరినూనెలో అదే కాంబోతో కలిపి, సోకిన ప్రాంతంలో వ్రాయమనిరి. ఈ చికిత్స తర్వాత ఆమెకు పూర్తిగా నయమైనది.

 

కంగారుతో తల్లిని వదలని బాలుడు 00534...UK

7 ఏళ్ల రోగగ్రస్తుడైన బాలుడు కంగారుతో, తల్లిని క్షణమైనా విడిచిపెట్టడు. పాఠశాల గేటువద్దకూడా తల్లిచేతిని వదలడు. అతను ఎక్కడున్నా అమ్మ అతని వెనుక వుండాల్సిందే. అతను పాఠశాలకు వెళ్ళేముందు అతిగా తినడంతో, బడికి వెళ్ళేముందు అనారోగ్యం పాలవుతాడు. అతను మలద్వారం చుట్టూ చికాగ్గా వుండి బాధపడుతున్నాడు. అభ్యాసకుడు అతనికి ఇచ్చినది:

NM35 Worms + SR424 Chicory made in water...5 ml TDS

2 రోజులలో మార్పు వచ్చి, అతను తన తల్లిని, పాఠశాల గేటువద్ద వెనక్కు పంపించేసి, తరగతిలోకి సంతోషంగా పరుగెత్తేడు. అప్పటినుండి అతను పాఠశాలలో అనేకమంది మిత్రులను సంపాదించుకొని, శారీరకంగా బరువు పెరిగి, ఆత్మవిశ్వాసంతో, సంతోషంగా ఉన్నాడు.

 

చెవి బయట భాగంలో సంక్రమణ (ఇన్ఫెక్షన్), కాళ్ళలో నీరు చేరుట 02711...Malaysia

64 ఏళ్ల మహిళ, గత 3 నెలలకు పైగా, చెవులనుండి, దుర్గంధపూరితమైన ద్రవం కారుతూ బాధపడుతోంది. అంతేకాక 10 రోజులై ఆమెకాళ్లు ఎర్రగా, వాచిపోయేయి. ఇప్పటికే ఆమె జిపి (GP), చెవి సంక్రమణ కోసం యాంటీబయాటిక్స్ మాత్రమేకాక, ఆమె కాళ్లలో నీరు నిలుపుదలకోసం మాత్రలు సూచించిరి. ఆమె కు జూన్ 13, 2011 న క్రింది పరిహారం ఇచ్చిరి:

#1. NM16 Drawing + NM26 Penmycin + NM36 War + OM10 Ear + BR19 Ear…TDS

జూన్ 18న ఆమె తన జిపి (GP) కి, చెవులకు తీసుకుంటున్న యాంటీబయాటిక్స్ వల్ల తీవ్రంగా బాధపడుతున్నందున  అవి ఆపేస్తానని, తనకు అనారోగ్యం కలిగించనందున, వైబ్రియోనిక్స్ మాత్రలు మాత్రమే తీసుకుంటానని చెప్పింది. ఆమె జూన్ 20 న తన డాక్టర్ పంపగా 'చెవి, ముక్కు, గొంతు’ నిపుణుని వద్దకు వెళ్లింది. 18 జూన్ న విబ్రో అభ్యాసకుని చూచుటకు మళ్ళీ వెళ్లినప్పుడు, ఆమెకు ఇవ్వబడింది:

#2. NM36 War + OM10 Ear + BR19 Ear...OD సీసాలో మందు పూర్తయేవరకు తీసుకోవలెను.

జూన్ 20 తేదీన నిపుణుడు ఆమె చెవులు పరీక్షించగా, చీము పూర్తిగా మాయమైంది. చెవిలో గులిమి (వేక్స్) తొలగించిన తర్వాత, ఆమె చెవులు మామూలుగా, ఆరోగ్యంగా వున్నట్లు నిపుణుడు చెప్పిరి. 22 జూన్, తదుపరి నియామకంరోజున వెళ్లినప్పుడు, రోగి విబ్రియోనిక్స్ అభ్యాసకునితో గతంకన్నా తన కాళ్ల ఎరుపు, వాపు తగ్గినవని, కానీ ఇప్పుడు రక్త ప్రసరణమీద దానిప్రభావం కలగవచ్చుననే అనుమానం వెలిబుచ్చింది. ఆమెకు ఈ కింది పరిహారాన్ని #2 తో పాటుగా ఏకకాలంలో తీసుకోవలసిందిగా యివ్వడమైనది:

#3. NM32 Vein-Piles + BR18 Circulation + SM15 Circulation + SR539 Vein…TDS

ఆగస్టు 12 న మళ్ళీ వెళ్ళినప్పుడు, రోగి బాహ్య చెవి సంక్రమణంలో వందశాతం మెరుగై, చెవులలో చీము, దుర్వాసన పోయినట్లు తెల్పిరి. ఆమె కాళ్ళలో నీరు చేరుట కూడా మెరుగుపడినట్లు చెప్పిరి. ఆగష్టు 12, 2011 న ఈ క్రింది నివారణలు ఇవ్వబడ్డాయి:

#4. BR18 Circulation + SM6 Stress + SR503 Ligament + SR510 Muscle...TDS

#5. CC12.1 Adult tonic... TDS

మార్చి 2012 న, రోగి తనకాళ్ళ సమస్యలన్నీ పూర్తిగా తగ్గటమే కాక, చివరి రెండు సంబంధమిశ్రమాలవల్ల, నూతనశక్తి పుంజుకున్నట్లు భావిస్తున్నట్లు నివేదించారు.

 

తేలుకాట్లు 02765...India

నెలవారీ విబ్రో శిబిరాలలో రోగులకు చికిత్స చేసినప్పుడు, చాలామంది ప్రజలు తేలుకుట్టి బాధపడుతూ రావటంతో తక్షణం ఉపశమనం కలుగుటకు యిచ్చు పరిహారం: CC21.4 Stings & Bites. అభ్యాసకునివద్ద, అతని 108 సాధారణ కాంబోస్ బాక్స్ లేనప్పుడు, ఒక నిర్జనప్రదేశంలో, ఇటీవలే, SR353 Ledum తో అవే ఫలితాలు లభించాయి.

 

ప్రశ్నలు సమాధానాలు

1. ప్రశ్న: అలోపతీ, ఆయుర్వేద వంటి ఇతర వైద్య వ్యవస్థల పట్ల వైబ్రియోనిక్ అభ్యాసకుల సరైన అభిప్రాయం ఏమిటి?

సమాధానం: విబ్రో అభ్యాసకులు అన్ని ఇతర వైద్య వ్యవస్థలపట్ల పూర్తి గౌరవం కలిగి ఉండాలి. ప్రతి ముఖ్యమైన వైద్యవ్యవస్థ, తన పాత్రను తను పోషిస్తుందని మేము నమ్ముతున్నాము. వాస్తవం ఏమిటంటే, అన్ని ఆరోగ్య సమస్యలను నయం చేయగల ఏ ఒక్క ప్రత్యేక వ్యవస్థ ప్రపంచంలో లేదు. ప్రతి వ్యవస్థ దాని స్వంత యోగ్యతలను మరియు పరిమితులను కలిగి ఉంది. ఒక వ్యక్తికి ఏ వైద్య వ్యవస్థ బాగా పనిచేస్తే, అతను / ఆమె దానిని అనుసరించాలి. కొన్ని సందర్భాల్లో, వైద్యం యొక్క నిర్దిష్ట వ్యవస్థ మిగతావానికన్నా బాగా పని చేయవచ్చు, కానీ అదే వ్యక్తితో విభిన్న ఆరోగ్య పరిస్థితిలో అదే వ్యవస్థ పనిచేయకపోవచ్చు.

కాబట్టి, వారి అవసరం మరియు కోరిక ప్రకారం రోగి వివిధ సమస్యలకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వ్యవస్థలను యెంచుకోవచ్చు. రోగికి తను ఎంచుకున్న వైద్యం వ్యవస్థలో విశ్వాసం వుండటం ముఖ్యం. వేర్వేరు వ్యవస్థల గురించి వివాదాలు అనవసరం. విబ్రో చికిత్స ప్రకారం, దేవుడు మాత్రమే రోగాన్ని నయం చేయగలవాడు. విబ్రో అభ్యాసకులు, తాము దేవునిచేతిలో పరికరాలమని భావిస్తున్నారు మరియు వారు అన్ని రోగులలో నివసిస్తున్న దేవుని సేవ చేస్తున్నారు.

_____________________________________

2. ప్రశ్న: నేను 108CC పెట్టెలో శిక్షణ పొంది దాదాపు రెండు సంవత్సరాలయినది. పూర్తి శక్తివంతంగా కాంబో స్పందనలను ఉంచడానికి నేను ఇప్పుడు కాని భవిష్యత్తులో కాని ప్రత్యేకంగా చేయాల్సింది ఏదైనా ఉందా?

సమాధానం: మీరు ప్రతి రెండు సంవత్సరాలకు మీ 108CC బాక్సును రీఛార్జ్ చేయాటం చాలా ముఖ్యం. రీఛార్జ్ చేయడంలో మీకు సహాయం చేయడానికి మీరు మీ శిక్షకుడికి తిరిగి వెళ్లాలి. మీకు సహాయం చేసే శిక్షణకు ముందుగా, మీరు సాధారణ నెలవారీ విబ్రో నివేదికలు, మీ శిక్షకునికి పంపినట్లు నిర్ధారణ అవసరం. లేకపోతే, మీరు దేవునికి కొత్త వ్రాతపూర్వక వాగ్దానాన్ని సమర్పించాలి. గతంలో సమర్పించక పోయినట్లయితే, మీరు 108CC పెట్టెకు తిరిగి ఛార్జ్ చేయటానికి ముందు గత ఆరు నెలల నివేదికలు సమర్పించాలి.

_____________________________________

3. ప్రశ్న: నేను వేర్వేరు లేదా ముందువచ్చిన అదే సమస్య కోసం, ఒకే నెలలో ఒకటి కన్నా ఎక్కువ సార్లు చూసే రోగులను నా నెలవారీ నివేదికకోసం లెక్కించడానికి అయోమయంగా ఉన్నాను.

సమాధానం: ఏనెలలోనైనా, మొదటిసారి వచ్చిన రోగులందరూ క్రొత్త రోగులుగా మరియు ముందు సందర్శించిన వారందరూ పాత రోగులు గా పరిగణింపబడతారు. కనుక నెలలో ఒకరోగి చేసిన సందర్శనల సంఖ్యతో సంబంధం లేకుండా ఒకసారి మాత్రమే లెక్కించాలి.

_____________________________________

 

వైద్యులకే వైద్యుడి యొక్క దివ్య వాక్కు

"మీరు ఎక్కడున్నా, ఏ పని చేసినా, దానిని ఆరాధనచర్యగా, అంకితభావంతో, ప్రేరేపకుడు, సాక్షి, గురువు అయిన దేవునిమహిమ తెలియపరచే ఒక చర్యగా చేయండి. మీ కార్యకలాపాలను 'ఇవి నాకోసం' మరియు 'ఇవి దేవుని కోసం' వంటి వర్గాలలో విభజించవద్దు.” అందర్నీ ప్రేమించు, అందర్నీ సేవించు, ఎల్లప్పుడు సహాయపడు, ఎవర్నీ బాధించకు.”                                                                              

సాయి సంస్మరణలతో సత్య సాయిబాబా యొక్క 80 వ పుట్టినరోజు, 2005

“ప్రతిఫలాపేక్ష ఆశించకుండా చేసే సేవ మనిషిని ఉన్నత స్థాయికి దివ్యత్వానికి తీసుకువెళుతుంది. మానవులు ఉద్దాత గుణములైన ప్రేమ, కరుణ, నిజాయితీ, క్షమా గుణం అలవర్చుకోవాలి. ఈ గుణములు ఉన్నపుడు మాత్రమే అతను అంకిత భావంతో సేవ చేయ గలుగుతాడు. తమలో దాగిఉన్న అంతర్గత అవలక్షణాలను వదిలించుకోవటానికి మానవులు భగవంతుడు తమకిచ్చిన ఈ శరీరం కేవలం తమ స్వార్ధ ప్రయోజనాలకోసం కాదని ఇతరులకు సేవ కోసమని అర్దం చేసుకోవాలి”  

సాయి సంస్మరణలతో సత్య సాయిబాబా యొక్క 80 వ పుట్టినరోజు, 2005

ప్రకటనలు

  1. ఇండియా కేసరఘడ్, కేరళ: ఏవిపి వర్క్ షాప్ ఫిబ్రవరి 2014, రాజేష్ రామన్ కు మెయిల్ పంపండి-[email protected] లేదా ఈ నెంబర్ కి ఫోన్ చేయండి 8943-351 524 / 8129-051 524.
  2. ఇండియా పుట్టపర్తి: ఏవిపి వర్క్ షాప్ 28-30 జనవరి 2014, హెమ్ కు మెయిల్ పంపండి -[email protected]
  3. ఇండియా పుట్టపర్తి: యెస్ వి పి వర్క్ షాప్ 28 జనవరి – 1 ఫిబ్రవరి 2014, హెమ్ కు మెయిల్ పంపండి [email protected]

అదనపు సమాచారం

సాయి విబ్రియోనిక్స్ విద్యా ప్రయోజనాలకోసం ఆరోగ్య సమాచారం, దానికి సంబంధితవ్యాసాలను అందిస్తుంది; ఈ సమాచారం వైద్యసలహా కాదు. రోగులకు వారి నిర్దిష్ట రోగపరిస్థితి గురించి వారి వైద్యుని చూడమని సలహా ఇవ్వండి.

విటమిన్ డి: ప్రయోజనాలు మరియు వ్యాధి నివారణ

విటమిన్ డి - కొన్ని ఆహారాలలో లభించు, ఆరోగ్యమునకు, బలమైన ఎముకలకొరకు అవసరమైన  పోషక పదార్థం యీ విటమిన్ డి. ఇది ఆహారం, దాని అనుబంధాలనుండి కాల్షియంను (ఎముకల ఆరోగ్యానికి ప్రధానమైనది) గ్రహించడానికి సహాయం చేస్తుంది. కాల్షియంతో పాటు, విటమిన్ డి వృద్ధులను గుల్లబారిన ఎముకల వ్యాధిని కాపాడటానికి సహాయపడుతుంది.

అనేకవిధాలుగా శరీరానికి విటమిన్ డి చాలాముఖ్యం. కండరాలు కదలికకు, మెదడు, యితర శరీరభాగాలమధ్య సందేశాలను తేవడానికి నరములకు చాలా అవసరంబ్యాక్టీరియా, వైరస్ లపై దాడి చేయటానికి, రోగనిరోధక వ్యవస్థకు విటమిన్ డి చాలా ముఖ్యమైన అవసరం.

విటమిన్ డి మరియు సూర్యరశ్మి:

మీ చర్మానికి సూర్యకాంతి తగిలినప్పుడు, మీశరీరంలో స్వయంగా విటమిన్ డి తయారవుతుంది. విటమిన్ డి, విటమిన్లలో విలక్షణమైనది. ఏలనన మీశరీరంలో విటమిన్ డి హార్మోనుగా మార్చబడి, కొన్నిసార్లు "యాక్టివేటెడ్ విటమిన్ డి"/"కాల్సిట్రియల్" గా పిలువబడుతుంది.

మీకు అవసరమైన విటమిన్ డి, మీరు తినే ఆహారాల మీద ఆధారపడి ఉండదు. తగినంత విటమిన్ డి పొందాలంటే, సూర్యరశ్మికి మీ చర్మాన్ని బహిర్గతం చేయడమేకాక మీరు సప్లిమెంట్లను కూడా తీసుకోవాలి. ఇతర విటమిన్లు మరియు ఖనిజాలు పోలిస్తే, యిది కొంచెం క్లిష్టమైనా, అవసరమైన మోతాదులో విటమిన్ డి పొందడానికి తోడ్పడుతుంది.

విటమిన్ డి సంశ్లేషణకు సూర్యరశ్మి ముఖ్యమైనను, చర్మక్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి, సూర్యకాంతిని మితంగా పొందటం అవసరం.

విటమిన్ డి కి, ఎండ ముఖ్యమైనను, కొన్ని నిమిషాలకంటే ఎక్కువసేపు యెండలో ఉన్నప్పుడు, రక్షిత దుస్తులు ధరించి, మరియు 8 లేదా అంతకంటే ఎక్కువ SPF (సూర్య రక్షణ కారకం) తో సన్ స్క్రీన్ వాడాలి. టానింగ్ పడకలు చర్మం విటమిన్ డి ను తయారు చేయడానికి కూడా కారణమవుతాయి, అయితే చర్మక్యాన్సర్ వచ్చే ప్రమాదాలు ఉంటాయి.

 

మనకు విటమిన్ డి అవసరమేమిటి?

  • కాల్షియం మరియు భాస్వరం యొక్క శోషణం మరియు జీవక్రియ, వివిధ విధులు, ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఎముకల నిర్వహణ కొరకు ముఖ్యమైనది.
  • రోగనిరోధక వ్యవస్థను నియంత్రిస్తుంది.
  • ఎయిడ్స్ రోగనిరోధక వ్యవస్థ - విటమిన్ డి సాధారణ జలుబువంటి రోగాలను నిరోధిస్తుందని, ‘యూనివర్శిటీ ఆఫ్ కొలరాడో’, ‘డెన్వర్ స్కూల్ ఆఫ్ మెడిసిన్, మసాచుసెట్స్’, ‘జనరల్ హాస్పిటల్ & చిల్డ్రన్స్ హాస్పిటల్, బోస్టన్’ లోని రోగనిర్ధారణ శాస్త్రవేత్తలు అంటున్నారు.
  • మల్టిపుల్ స్క్లెరోసిస్ ప్రమాదం - విటమిన్ డి బహుళ స్క్లేరోసిస్ అభివృద్ధి చెందకుండా తగ్గించగలదు. ‘ఒరెగాన్ హెల్త్ అండ్ సైన్స్ యూనివర్శిటీ, USA లోని మల్టిపుల్ స్క్లెరోసిస్ అండ్ న్యూరోఇమ్యునాలజీ సెంటర్ డైరెక్టర్ మరియు న్యూరోలజి డిపార్ట్మెంట్ చైర్మన్ అయిన డెన్నిస్ బోర్డెట్ ప్రకారం, మల్టిపుల్ స్క్లేరోసిస్, ఉష్ణమండలంలో, సూర్యరశ్మికి చేరువగా వున్నచోట చాలా తక్కువగా ఉంటుంది.
  • సహేతుకంగా ఆలోచించి చేసే కార్య నిర్వహణ - 40 మరియు 79 సంవత్సరాల వయస్సు మధ్య 3000 యూరోపియన్ పురుషులను అధ్యయనం చేయగా, విటమిన్ డి మెదడు పనితీరును మెరుగుపర్చడంలో కీలక పాత్ర పోషిస్తుందని తేలింది.
  • ఆరోగ్యకరమైన శరీర బరువు – జార్జియా మెడికల్ కళాశాల, జార్జియాలో నిర్వహించిన పరిశోధన ప్రకారం ఆరోగ్యకరమైన శరీర బరువును నిర్వహించడంలో విటమిన్ డి బహుశా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని తేలింది.
  • ఆస్త్మాలక్షణాలు, మళ్ళీ తిరిగివచ్చుట(ఫ్రీక్వెన్సీ)- ఇది ఆస్తమా లక్షణాల తీవ్రతను మరియు ఫ్రీక్వెన్సీని తగ్గిస్తుంది. కోస్టా రికాలో 616 మంది పిల్లలు పర్యవేక్షించిన తర్వాత హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధకులు కనుగొన్నదేమంటే, ఆస్త్మా కారణంగా ఆసుపత్రుల కు వెళ్లాల్సిన సంభావ్యతను కూడా తగ్గిస్తుంది.
  • రుమటాయిడ్ ఆర్థరైటిస్(కీళ్లవాతం)-విటమిన్ డి మహిళల్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అభివృద్ధి చెందకుండా కొంతవరకు ఆపగలదు.
  • రేడియోధార్మిక నష్టంనుండి రక్షిస్తుంది –విటమిన్ డి శరీరరాన్ని రేడియోధార్మికత ప్రమాడమ్ నుండి పరిరక్షణ కలిగించగలదని, న్యూయార్క్ నగరంలో గల ఆరోగ్య, మానసిక పరిశుభ్రత విభాగంలోని రేడియోలాజికల్ నిపుణులు చెబుతారు.
  • విటమిన్ డి & క్యాన్సర్ ప్రమాదం - వివిధ అధ్యయనాలలో విటమిన్ డి తగినస్థాయిలో ఉన్నవారికి, తక్కువస్థాయిలో విటమిన్ డి వున్నవారికన్నా, క్యాన్సర్ అభివృద్ధి గణనీయంగా తక్కువని చూపబడినది. క్యాన్సర్ చికిత్స కేంద్రాలు, అమెరికా నిర్వహించిన అధ్యయనంలో క్యాన్సర్ రోగుల్లో విటమిన్ డి లోపం ఎక్కువగా ఉంటుందని తేలింది.
  • క్షయవ్యాధినుండి కోలుకొనుట – సెప్టెంబర్ 2012 లో అధికమోతాదులో విటమిన్ డి తీసుకున్నప్రజలకు క్షయవ్యాధినుండి త్వరగా కోలుకునే అవకాశముందని నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (PNAS) యొక్క ప్రొసీడింగ్ లో పరిశోధకులు నివేదించిరి.
  • హృద్రోగ ప్రమాదం - సెప్టెంబరు 2012 లో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో విటమిన్ డి యొక్క లోపం, గుండెపోటు మరియు చిన్నవయసులో మరణం వచ్చే ప్రమాదాన్ని పెంచుతుందని సూచించారు.

 

విటమిన్ డి లో వున్న 8 ముఖ్య లక్షణాలు

1. సూర్యకాంతి నుండి వెలువడే అతినీలలోహిత కిరణాలకు ప్రతిస్పందనగా మీ చర్మం ద్వారా విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది.

2. మీ చర్మంలో విటమిన్ డి ను ఉత్పత్తి చేసే, సహజ సూర్యకిరణాలు గాజుతలుపునుండి వ్యాప్తి చెందవు. కాబట్టి మీరు కారులో లేదా ఇంటిలో కూర్చున్నప్పుడు విటమిన్ డి ను మీరు ఉత్పత్తి చేయలేరు.

3. మీ ఆహారంనుండి విటమిన్ డి తగినంత మోతాదులో పొందుట అసాధ్యం. సూర్యరశ్మికి శరీరాన్ని బహిర్గతం చేయటమే, మీ శరీరంలో స్వయంగా విటమిన్ డి ను ఉత్పత్తి చేసే ఏకైక నమ్మకమైన మార్గం.

4. విటమిన్ డి ఆహారంలో కనీస స్థాయిలో వుండడానికి ప్రతిరోజూ 10 పెద్ద గ్లాసులను విటమిన్ డి బలపర్చిన పాలు త్రాగాలి.

5. మీరు భూమధ్యరేఖకు బాహ్యంగా వుంటే, విటమిన్ డి సూర్యుడి ద్వారా శరీరంలో ఉత్పన్నం చేయటానికి ఎక్కువ సమయం అవసరం.

6. మీ చిన్నప్రేగులలో కాల్షియం శోషణకు కావలసిన స్థాయిలో విటమిన్ డి వుండుట చాలా ముఖ్యం. తగినంత విటమిన్ డి లేకుండా, మీ శరీరం కాల్షియంను గ్రహించలేదు, కనుక కాల్షియం సప్లిమెంట్లను తీసుకొనుట నిరుపయోగం.

7. దీర్ఘకాలిక విటమిన్ డి లోపం అత్యంత త్వరగా సవరించబడదు. శరీరంలో ఎముకలను బలపరచి, నాడీవ్యవస్థను పునర్నిర్మించడానికి, కొన్నినెలలపాటు, విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకుంటూ, సూర్యకాంతిలో శరీరాన్ని బహిర్గతం చేయాలి.

8. నాసిరకం సన్ స్క్రీన్లు (SPF = 8) కూడా, విటమిన్ డి ను వుత్పత్తి చేసే మీశరీరసామర్థ్యాన్ని 95% వరకు  అడ్డుకుంటాయి. శరీరంలో క్లిష్టమైన విటమిన్ లోపం కలగజేస్తూ, సన్ స్క్రీన్ ఉత్పత్తులు నిజానికి వ్యాధికి కారణమవుతాయి. సూర్యరశ్మి నుండి మీ శరీరంలో చాలా విటమిన్ డి ని ఉత్పత్తి చేయుట సాధ్యంకాదు: మీ శరీరం స్వీయ-నియంత్రించి, దానికి అవసరమైనంత మాత్రమే ఉత్పత్తి చేస్తుంది.

మీ మూత్రపిండాలు మరియు కాలేయం ద్వారా మీ శరీరంలో, విటమిన్ డి వుపయోగానికి ముందు వుత్పన్నమవుతుంది.  కాబట్టి కిడ్నీ లేదా కాలేయ వ్యాధి లేదా పాడైన కాలేయం విటమిన్ డి వుత్పత్తి చేయడానికి మీ శరీర సామర్థ్యాన్ని బాగా క్రుంగదీస్తుంది.

 

విటమిన్ డి లోపంవల్ల కలుగు రోగాలు

• విటమిన్ డి లోపంవల్ల, కాల్షియం శోషణ జరగకపోవుటవల్ల, బోలు ఎముకలవ్యాధి (ఆస్టియోపోరాసిస్) సాధారణంగా సంభవిస్తుంది.

• శరీరంలో తగినంత విటమిన్ డి వున్నచో, ప్రోస్ట్రేట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, నిరాశ, పెద్దప్రేగు కాన్సర్ మరియు మనోవైకల్యం లను రాకుండా నిరోధిస్తుంది.

• విటమిన్ డి లోపంవల్ల "రికెట్స్" అను ఎముకలను పూర్తిగా శిధిలంచేసే వ్యాధి కలుగుతుంది.

• విటమిన్ డి లోపం 2వ రకం మధుమేహంను మరింత పెంచుతుంది. క్లోమంలో (ప్యాంక్రీస్) ఇన్సులిన్ ఉత్పత్తిని తగ్గించవచ్చు.

• ఊబశరీరం విటమిన్ డి వినియోగం బలహీనపరుచుతుంది. ఊబకాయం వున్నవారికి 2 రెట్లు ఎక్కువ విటమిన్ డి అవసరం.

• సోరియాసిస్ చికిత్సకు ప్రపంచవ్యాప్తంగా విటమిన్ డి ని ఉపయోగిస్తారు.

• మనోవైకల్యానికి విటమిన్ డి లోపం ముఖ్యకారణంగా నివేదించబడింది.

• తగిన సూర్యరశ్మి లేకపోవడంవల్ల ప్రారంభించబడిన మెలటోనిన్ అసమతౌల్యం కారణంగా సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ సంభవిస్తుంది.

• దీర్ఘకాలిక విటమిన్ డి లోపం తరచుగా ఫిబ్రోమైయాల్జియాగా తప్పుగా గుర్తించబడుతుంది, ఎందుకంటే కండరాల బలహీనత, నొప్పులు మరియు నొప్పులవంటి లక్షణాలు చాలా పోలి ఉంటాయి.

• సూర్యరశ్మిని వారానికి 2-3 సార్లు పొందినచో, మధుమేహం మరియు క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం 50% - 80%  తక్కువ.

• విటమిన్ డి సప్లిమెంట్ (రోజువారీ 2000 యూనిట్లు) తీసుకునే శిశువులకు తరువాతి 20 సంవత్సరాలలో టైప్1 మధుమేహం వచ్చే ప్రమాదం 80% తక్కువగా వుంటుంది.

 

ఆహారంలో విటమిన్ డి

క్రిందనున్న పట్టికలో ఏ ఆహారములో ఎంత విటమిన్ డి వుంటుందో తెలియగలరు.

తగినంత విటమిన్ డి లేకపోవుటవల్ల ప్రమాదం కలిగే సామూహిక బృందం

  • తల్లిపాలు త్రాగే శిశువులు:

సామాన్యంగా మనిషి పాలలో అవసరానికి తగ్గ మోతాదులో విటమిన్ డి దొరకదు. మనిషి పాలలో విటమిన్ డి మోతాదు, తల్లి శరీరంలోని విటమిన్ డి మోతాదుమీద ఆధారపడి ఉంటుంది. కనుక విటమిన్ డి సప్లిమెంట్స్, అధిక మోతాదులో తీసుకుంటున్న తల్లుల పాలలో ఈ పోషకపదార్ధం అధిక మోతాదులో వుంటుంది.

  • వయసు మళ్లిన వృద్ధులు:

వృద్ధులలో విటమిన్ డి మోతాదు బాగా తగ్గుటచే, వారికి ప్రమాదం ఎక్కువ. ఏలనన వయసుతోపాటు చర్మానికి  విటమిన్ డి తయారు చేసే సామర్ధ్యం తగ్గుతుంది. వారు ఎక్కువగా యింటిలోనే వుండిపోతారు. వారు తగిన మోతాదులో విటమిన్ తీసుకోకపోవచ్చు.

·      చాలా తక్కువ సూర్యరశ్మి పొందే ప్రజలు:

ఎక్కువగా యింట్లోనే వుంటూ, మత కట్టుబాట్లవల్ల పొడుగు వస్త్రాలు, తలకి ముసుగులు ధరించే స్త్రీలు, అదేవిధంగా వృత్తిరీత్యా యెండకు బహిర్గతం అవలేనివారు, సూర్యరశ్మివలన తగినంత విటమిన్ డి పొందజాలరు. 

·      నల్లని లేక బాగా రంగు తక్కువగా వుండే చర్మం గలవారు:                                                                            ఎపిడెర్మల్ పొరలో వుండే వర్ణద్రవ్యం మెలనిన్ అధిక్యతవల్ల, నల్లని చర్మం ఏర్పడి, సూర్యకాంతి నుండి విటమిన్ డి ను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని చర్మంలో తగ్గిస్తుంది. వివిధ నివేదికల ప్రకారం, తెల్లవారికన్నా నల్లవారిలో తక్కువ సేరం (serum) 25 (OH) D గుర్తించబడ్డాయి. నల్లచర్మం గలవారు తెల్లవారికన్న సూర్యరశ్మికి 20 - 30 రెట్లు ఎక్కువగా సూర్యరశ్మికి బహిర్గతం అయితేనే, అదే మోతాదులో విటమిన్ డి  చేయగలిగే సామర్ధ్యం కలిగి ఉంటారు.

·      ఇన్ఫ్లమాటరీ ప్రేగువ్యాధి మరియు ఇతర పరిస్థితులు కలిగిన ప్రజలు కొవ్వు మాలాబ్జర్పషన్ (People with inflammatory bowel disease and other conditions causing fat malabsorption):

విటమిన్ డి కొవ్వు కరిగే విటమిన్, దాని శోషణ ఆహారపు కొవ్వును పీల్చుకునే సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది. ఆహార కొవ్వును పీల్చుకునే సామర్థ్యాన్ని తక్కువగాగల వ్యక్తులకు విటమిన్ డి భర్తీ అవసరమవుతుంది.

·      ఊబశరీరం లేదా గ్యాస్ట్రిక్ బైపాస్ శస్త్రచికిత్స పొందిన వ్యక్తులు

ఆరోగ్యకరమైన బరువుగలవారికన్న, బాడీ మాస్ ఇండెక్స్ ≥30 వున్నవాళ్లకి, తక్కువ-సెరమ్ 25 (OH) D వున్నచో, ఊబకాయులు సాధారణ బరువుకు సరిపోయేవారి  25 (OH) D స్థాయిలను, సాధించడానికి విటమిన్ డి బాగా యెక్కువ మోతాదులో తీసుకోవాలి.

విటమిన్ డి కి పరీక్ష
25(OH) D అనబడు రక్తపరీక్ష మాత్రమే మనశరీరంలో విటమిన్ డి సరైన మోతాదులో వుందో, లేదో నిర్ధారించగలదు.

Sources:

http://ods.od.nih.gov/factsheets/VitaminD-QuickFacts/

http://www.medicalnewstoday.com/articles/161618.php

http://www.vitamindcouncil.org/about-vitamin-d/what-is-vitamin-d/

http://www.naturalnews.com/003069_vitamin_D_deficiency.html

http://ods.od.nih.gov/factsheets/VitaminD-HealthProfessional/

http://www.vitamindcouncil.org/about-vitamin-d/testing-for-vitamin-d/

 

రోజుకో వుల్లిపాయ వైద్యుని దూరంగా వుంచుతుంది (1వ భాగం/3)

 

ఉల్లిపాయ ఆరోగ్యమునకు చాలా లాభకరమగుటచే, ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వంటలో ఉపయోగిస్తారు. దాని ఆరోగ్య ప్రయోజనాలన్ని ఒక వార్తాలేఖలో చెప్పాలంటే అసాధ్యం, అందుకే ఈఅంశాన్ని 3 భాగాలుగా విభజించితిమి. తదుపరి వార్తాలేఖలలో 2, 3 భాగాలు వస్తాయి.

రోజుకు ఒక ఉల్లిపాయ తిని, వైద్యుడిని దూరంగా ఉంచవచ్చు. వెల్లుల్లి వంటి ఉల్లిపాయ, అల్లియం కుటుంబానికి చెందినది.  రెండు రకాలు కూడా సల్ఫర్ కలిగిన సమ్మేళనాల్లో సంపన్నమైనవి. వీనివల్లనే ఘాటువాసనలు మరియు వారి ఆరోగ్య-ప్రోత్సాహక ప్రభావా చాలా బాధ్యలు వుల్లి, వెల్లుల్లి కి కలుగుతున్నవి. సత్య సాయిబాబా మనల్ని సాత్వికాహారం తీసుకోమని ప్రోత్సహిస్తున్నప్పటికీ, సాధారణంగా రాజసికఆహారంగా భావించిన ఉల్లిపాయలో అనేక ప్రయోజనాలు వున్నవని చెప్పేరు. తన ప్రసంగాలలో, ఉల్లిపాయను ప్రముఖ తెలుగు సామెత "ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయలేదు!'' అని ప్రశంసించేవారు. రక్తనాళాలలోని కొలెస్ట్రాల్ ను తగ్గించటానికి, మన జీర్ణశక్తిని మెరుగుపర్చడానికి, రోజుకి మనం ఒక తెల్ల వుల్లిపాయను తీసుకోవటం చాలామంచిదని సిఫార్స్ చేసేవారు.

ఉల్లిపాయ (Allium Cepa) ఆరోగ్యప్రదాన రసాయనాలతో, ముఖ్యంగా, ఆరోగ్యప్రధానములైన, ఫ్రూక్టాంస్ (fructans), ఫ్లావోనోయిడ్స్ (flavonoids) మరియు ఓర్గనో (organo)- అనే ప్రయోజనకారులైన 3 సల్ఫర్ సమ్మేళనాలతో నిండివున్నది. ఫ్రూక్టాంస్ ప్రయోజనమైన బాక్టీరియాకు మద్దతు యిస్తూ, జీర్ణశక్తిని కాపాడు కార్బోహైడ్రేట్ అణువులు. ఉల్లిపాయలలో అధికంగా ఫ్లావోనోయిడ్స్ (flavonoids), ప్రత్యేకంగా క్వెర్సేటిన్ అని పిలవబడు శక్తివంతమైన ఎంటియొక్సిడెంట్ (antioxidant) ఉంటుంది. ఉల్లిపాయ కోసినప్పుడు, సెల్ గోడలు దెబ్బతిన్నప్పుడు, ఉల్లిపాయలోని సల్ఫర్ సమ్మేళనాలు తయారవుతాయి. ఈ సమ్మేళనాల కలయిక కాన్సర్, హృద్రోగం, శ్వాసకోశ అనారోగ్యం, మధుమేహం, సంక్రమణవ్యాధులు వంటి అనేక అనారోగ్యాల బారినుండి శక్తివంతమైన రక్షణను అందిస్తాయి.

ఉల్లిపాయలు, గుండెఆరోగ్యం
గుండెపోటు

యూరోపియన్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ లో ప్రచురించిన ఒక వ్యాసంలో, ఇటాలియన్ పరిశోధకులు, ఉల్లిపాయలు అధికంగా ఉన్న ఆహారం అనగా వారానికి ఒకటి కాని, అంతకంటే ఎక్కువగాని ఉల్లిపాయలను తినేవారికి, అరుదుగా వుల్లి తినేవారికన్నా, గుండెజబ్బులు వచ్చే అవకాశాలు 22 శాతం తగ్గుతాయని చెప్పేరు.

ఉల్లిపాయ"మంచి" హై డెన్సిటీ లిపోప్రోటీన్ కొలెస్ట్రాల్ స్థాయిని పెంచి, "చెడ్డ" లోడెన్సిటీ లిపోప్రోటీన్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది:

ఉల్లిపాయలలో ఘాటైన రుచిగల ఉల్లిపాయలు మరింత మంచివి. ఉల్లిపాయ తినుటవల్ల "మంచి" HDL కొలెస్టరాల్ స్థాయి పెరుగుతుందని రీసెర్చ్ చూపించింది. ప్రతిరోజు సగం ఘాటైన పచ్చని లేదా తెల్లని ఉల్లిపాయ తినుట లేదా దానికి సమానమైన రసం త్రాగినను, నాలుగింట ముగ్గురు రోగులలో 30% "మంచి" HDL కొలెస్ట్రాల్ పెంచడానికి సరిపోతుంది. అమెరికాలోని హార్వర్డ్ మెడికల్ స్కూల్లో కార్డియాలజిస్ట్ మరియు వైద్యశాస్త్రంలో ప్రొఫెసర్ అయిన డాక్టర్ విక్టర్ గుర్విచ్, కరోనరీ హార్ట్ డిసీజ్ తో వున్నరోగులకు ప్రతిరోజు ఉల్లిపాయలు తినమని సలహా యిస్తారు. ఉల్లిపాయలు యెక్కువగా వుడికించితే, దాని ప్రయోజనం తగ్గుతుందని కూడా ఆయన చెప్పారు. ఉల్లిపాయల్లో కనిపించే 150 కన్నా ఎక్కువ రసాయనాలలో, "మంచి" HDL ను పెంచేవి యేవో చెప్పలేకపోయినా, పచ్చిఉల్లిపాయలు చాలా బాగా పని చేస్తాయని పరిశోధకులు ఖచ్చితంగా చెప్పేరు. వండిన ఉల్లిపాయలో HDL పెంచే ప్రభావం బాగా తగ్గిపోతుంది, నాశనం చేస్తుంది. బలమైన, భరించలేని ఘాటైన ఉల్లిపాయలు మీఆరోగ్యాన్ని వివిధ మార్గాల్లో ప్రభావితం చేస్తాయి. మామూలు ఉల్లిపాయలు మీఆరోగ్యాన్ని వివిధ విధాలా ప్రభావితం చేసినను, ఘాటైన తెలుపు, పసుపు రకాలవల్ల అత్యంత మేలు కలుగుతుంది. పరిశోధనలో ఉల్లిపాయలు తినడంవల్ల "చెడ్డ" LDL రక్త కొలెస్ట్రాల్ ను తగ్గించగలదని తేలింది. ఒక అధ్యయనంలో, న్యూఢిల్లీలో 45మంది ఆరోగ్యవంతులకు 15 రోజుల పాటు, రోజుకి 3000-కేలరీలు-బాగా కొవ్వుగల ఆహారం ఇచ్చారు. వారి రక్త కొలెస్ట్రాల్ సగటున 219 నుండి 263 వరకు పెరిగింది. అయితే, రోజూ ఒక టేబుల్ స్పూన్ లేదా 10 గ్రాముల ఉల్లిపాయలను వారి కొవ్వు భోజనంతో పాటు తినుటవల్ల, వారి రక్త కొలెస్ట్రాల్ సగటున 237 కు తగ్గినది.

రక్తంలో గడ్డలేర్పడకుండా ఉల్లిపాయల తోడ్పాటు

ఆస్పిరిన్ వలెనే ఉల్లిపాయ కూడా (anti-coagulant) యాంటీ-కగల్యుంట్ గా పనిచేస్తుంది, ఇది రక్త ప్రసరణ వ్యవస్థలో రక్తప్రవాహాన్ని అడ్డుకునే ప్రమాదకరమైన రక్తం గడ్డలను నిరోధించడానికి సహాయపడుతుంది. ఈ నిరోధక గడ్డలు శరీరంలోని  గుండె లేదా మెదడువంటి వివిధ భాగాలకు ఆక్సిజన్ సరఫరాను నిలిపివేసి, గుండెపోటు లేదా స్ట్రోక్ వంటి వాటికి కారణమవుతాయి. కొన్ని ఉల్లిపాయ రసాయనాలు గడ్డలేర్పడకుండా వుంచితే, మరికొన్ని ఏర్పడుతుండగానే గడ్డలను కరిగిస్తాయి. ఒక దశాబ్దం పరిశోధన తరువాత, బ్రిటీష్ మరియు భారత శాస్త్రవేత్తలు, ఉల్లిపాయలు మీగుండెకు ఉత్తమమైనవని నిర్ధారించేరు. ఒక అధ్యయనంలో, వారు మొదట పురుషులకు వెన్న, మీగడలతో చాలా ఎక్కువ కొవ్వుగల భోజనం పెట్టిన తర్వాత వారిలో రక్తగడ్డలు కరిగించే కార్యకలాపాలు గణనీయంగా తగ్గాయి. అప్పుడు వారు వారికి అదేవిధమైన కొవ్వు భోజనం యిస్తూ, 2 ఔన్సుల (60 గ్రాములు)  పచ్చి, ఉడికించిన లేదా వేయించిన ఉల్లిపాయలు కూడా భోజనంలో జోడించిరి. కొవ్వుభోజనంతిన్న 2 1/2 గంటల తర్వాత రక్తపరీక్ష చేయగా, రక్తంలో గడ్డకట్టే సామర్ధ్యాన్ని, ఉల్లిపాయలు పూర్తిగా నిర్మూలించి నట్లు వెల్లడైంది. వాస్తవానికి, 1/2 కప్పు కన్నా తక్కువ ఉల్లిపాయలు, కొవ్వుకుగల రక్తాన్ని గడ్డకట్టించే శక్తిని నిర్మూలం చేస్తాయి. గుండె మీద ఉల్లిపాయలవల్ల కలిగే ప్రయోజనకరమైన ప్రభావాన్ని చూపించే ఈ అధ్యయనాలు, ఫ్రెంచ్ పారడాక్స్ లో బాగా వివరించబడ్డాయి - ఫ్రెంచ్ ప్రజలు సాధారణంగా అధిక (సేట్యురేటెడ్) కొవ్వుగల ఆహారం ఎక్కువగా తిన్నప్పటికి, వారిలో గుండెవ్యాధులు తక్కువగా ఉంటాయి దాదాపు అన్ని ఫ్రెంచ్ వంటకాలలో ఉల్లిపాయను వాడటమే దీనికి కారణం. వాస్తవానికి పెద్ద సర్వేలో ఉల్లిపాయ, వెల్లుల్లి యిష్టమైనవారికి, అల్లియం ఫ్యామిలీలోని ఈ ఉల్లి, వెల్లుల్లి తిననివారి కంటే మెరుగైన రక్తం ప్రొఫైల్స్ (కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ మరియు HDL) ఉన్నట్లు తేలింది. వారంలో కప్పు ఉల్లిపాయలు తిన్నవారికి కూడా తక్కువ రక్త కొలెస్ట్రాల్ మరియు మంచి హృదయ ఆరోగ్యం వున్నట్లు తేలింది.

 

ఉల్లిపాయలు, అధిక రక్తపోటు

అధికరక్తపోటు గల ఒక బృందంవారికి రోజుకు 730 ఎమ్.జి. చొప్పున క్వెర్సెటిన్ 28రోజులు యివ్వగా, వారి రక్తపోటు 2 - 7 పాయింట్లకు సిస్టోలిక్ లో, 2 - 5 పాయింట్లకు డయాస్టొలిక్ పడిపోయింది. ప్లేస్బో యిచ్చిన బృందంలో ఏమాత్రం మార్పులేదు.

మరొక అధ్యయనంలో, ఉల్లిపాయ వేసిన నూనె 2-3 టేబుల్ స్పూన్లు తీసుకున్న, తగుమాత్రంగా రక్తపోటుగల 67% మందిలో రక్తపోటును తగ్గించినవి. వారి సిస్టోలిక్ స్థాయి 25 పాయింట్లు, వారి డయాస్టొలిక్ రీడింగ్స్ 15 పాయింట్లు పడిపోయినవి.

ఉల్లిపాయల యొక్క ఆరోగ్య ప్రభావాలపై చేసిన 7 ఏళ్ల పరిశోధనల తర్వాత, పరిశోధకులు రోజుకు 100 గ్రాముల ఉల్లిపాయలు (2/3 కప్పు) తీసుకున్నవారికి, గుండె జబ్బు, అదేవిధంగా అధిక రక్తపోటు దూరమౌతాయని నిర్ధారించారు.

బోలు ఎముకలవ్యాధికి ఉల్లిపాయల ప్రయోజనాలు

నెలసరి ఆగిపోయిన తరువాత స్త్రీలలో బోలు ఎముకల వ్యాధి(ఎముక సన్నబడటానికి) చికిత్స కొరకు ఇచ్చిన ఔషధ అలెండ్రోనేట్ (ఫోసామాక్స్) యొక్క ఔషధ ప్రభావాలపై ఉల్లిపాయ తీసుకోవడం వల్ల దుష్ప్రభావం వున్నట్లు ఒక అధ్యయనం కనుగొంది. ఈ అధ్యయనంలో, (Alendronate) అలెన్డ్రోనేట్ లేదా ఉల్లిపాయ పొడితో చికిత్స పొందిన ఎలుకలలో ఓవియరీటోమీ (ovariectomy) ప్రేరిత ఎముక నష్టం అధ్యయనం చేసింది. ఎముక నష్టాన్ని ఎదుర్కోవటానికి ఉల్లిపాయల సామర్ధ్యం అలెన్డ్రోనేట్ (ఫోసామాక్స్) కు దగ్గరగా వచ్చింది. ఉల్లిపాయలు ఎముకలు మరియు కీళ్ళ నొప్పి, వికారం, పూతలు, యాసిడ్ బ్యాకప్ మరియు దద్దుర్లు వంటి దుష్ప్రభావాలు లేకుండా, ఎముకలను బలోపేతం చేస్తాయని తెలుస్తోంది.

స్విట్జర్లాండ్ లోని బెర్న్ విశ్వవిద్యాలయం పరిశోధకులు ఒక రసాయన సమ్మేళనం కనుగొన్నారు – జి‌పి‌సి‌ఎస్ (GPCS) అనబడు పెప్ టైడ్ (peptide) రసాయనం ఎముక విచ్ఛేదనం (ఎముక విచ్ఛిన్నం చేసే కణాలు) యొక్క చర్యను నిరోధిస్తుంది మరియు తద్వారా ఎముక నష్టాన్ని తగ్గిస్తుంది. ఎముక క్షీణత అనుకరించడానికి పారాథైరాయిడ్ హార్మోన్కు సంబంధించిన కొత్త ఎలుకల ఎముకలలోని ఎముక కణాలు, వైట్ ఉల్లిపాయ నుండి సేకరించిన GPCS సమ్మేళనం, ఎముక ఖనిజాల నష్టం, కాల్షియంతోపాటు గణనీయంగా నిరోధించబడ్డాయి.

ఇతర అధ్యయనాలలో, మనం తినే ఉల్లిపాయలు ఎముక ద్రవ్యరాశి, ఎముక మందం మరియు ఎముక ఖనిజ సాంద్రతను పెంచుతున్నట్లు తెలిపిరి. ఇటువంటి ప్రోత్సాహకరమైన జంతు మరియు మానవ అధ్యయనాలలో- ఉల్లిపాయలు ఎముక సాంద్రత నష్టం అనుభవిస్తున్న, ఋతుక్రమం ఆగిన మహిళలకు చాలా ప్రయోజనకరమని అని తేలింది. 35 మిలియన్ల మహిళల పోషక విలువలను విశ్లేషించిన ఒక పరిశోధనా అధ్యయనం, ఋతుక్రమం ముందు, ఆగిన మహిళల్లో ఉల్లిపాయల వినియోగం ఎముక సాంద్రతలో బలమైన ప్రయోజనాలతో సంబంధం కలిగిస్తుంది, అయితే ఉల్లిపాయ అరుదుగా వాడినచో, (ఒక నెల లేదా అంతకన్నా తక్కువ) ఎముకల ఆరోగ్యానికి ప్రయోజనం చాలా తక్కువ. ఋతుక్రమం ఆగిన మహిళలు ప్రతిరోజూ వుల్లిపాయలు తీసుకోవడంవల్ల, తుంటి ఎముకలు విరిగే ప్రమాదం చాలా తక్కువ.

మీ శరీర శుభ్రతకు, వుల్లిపాయలు

ఉల్లిపాయలలో (సల్ఫర్) గంధకం కలిగిన సమ్మేళనాలు మరియు విటమిన్ సి పుష్కలంగా ఉన్నవి. ఇవి పాదరసం, సీసం, ఆర్సెనిక్ మరియు కాడ్మియం వంటి భారీ లోహాల నుండి మీ శరీరాన్ని శుభ్రపరచడానికి చాలా మంచివి.

మా తదుపరి వార్తాలేఖలో, కాన్సర్, మధుమేహం,చర్మ వ్యాధుల బారినుండి వుల్లిపాయ యేవిధంగా సంరక్షించగలదో తెలియజేస్తాము.

Sources:
http://www.saibaba.ws/teachings/foodforhealthy.htm

http://onions-usa.org/img/site_specific/uploads/phytochemical_brochure.pdf

http://americanfitness.squarespace.com/onions-0712/

http://www.foods-healing-power.com/health-benefits-of-onions.html

http://www.foods-healing-power.com/health-benefits-of-onions.html

http://www.foods-healing-power.com/onions-for-your-heart.html

www.MedicineHunter.com

http://jn.nutrition.org/content/137/11/2405.full

http://www.foods-healing-power.com/onions-blood-pressure.html

http://curezone.org/dis/1.asp?C0=60

http://www.herballegacy.com/Peret_Medicinal.html

http://wrightnewsletter.com/2005/06/13/onion-consumption-may-slow-down-bone-loss/

http://health.tipsdiscover.com/onion-strong-cancer/

http://www.foods-healing-power.com/health-benefits-of-onions.html

http://www.foods-healing-power.com/onions-for-your-heart.html

http://www.ncbi.nlm.nih.gov/pubmed/12126069?dopt=Abstract

 

అభ్యాసకులందరికీ ముఖ్య గమనిక 

మాకు పంపబడుతున్న కొన్నికేసులు అద్భుతమైనవి కాని కొన్నిటిలో, కొన్ని ముఖ్యమైన వివరాలు లేని కారణంగా మీతో అన్ని కేసుల వివరాలను పంచుకోలేకపోవుచున్నాము. ఏలనంటే ఆ వివరాలు అభ్యాసకుల ద్వారానే మాకు అందించబడతాయి. కనుక  మీరు మీ కేసులను పంపినప్పుడు దయచేసి కింద కోరిన వివరాలని తప్పక చేర్చండి:

రోగి వయసు, పురుషుడు/స్త్రీ, చికిత్స మొదలైన తేదీ, అన్ని రోగలక్షణాల యొక్క వివరణాత్మక జాబితా, దీర్ఘకాల లక్షణాల యొక్క వివరణాత్మక జాబితా, ప్రతి రోగలక్షణం యొక్క వ్యవధి, ప్రతి దీర్ఘకాలిక లక్షణానికి మీరు వూహించిన కారణం, గతంలో జరిగిన చికిత్స వివరాలు లేదా ఇప్పటి చికిత్స వివరాలు, యివ్వబడిన కాంబో పరిహారాలు, వాటి మోతాదులు, తేదీవారీగా రోగి పరిస్థితిలో మెరుగుదల శాతం, మీరు పంపే రోజునాటి రోగిపరిస్థితి, ఇతర సంబంధిత సమాచారం మొదలైన వివరాలన్నీ, మీ కేసులను భవిష్యత్తు వార్తాలేఖలలో ప్రచురించడానికి మాకు సహాయపడతాయి.

 

Om Sai Ram