Vol 5 సంచిక 5
September/October 2014
ముద్రింప తగిన వార్తాలేఖ
పూర్తి వార్తాలేఖ యొక్క కాగితం ప్రతి కావలెనన్నఈ పుటను ముద్రించండి
డా.జిత్. కే అగ్గర్వాల్ యొక్క మాటల్లో
ప్రియమైన చికిత్సా నిపుణులకు,
ఈ సంచిక రెండు అంశాల్లో మనం అధిగమించిన ఒక మైలు రాయిని సూచిస్తుంది. మొదటిది ఈ సంచికతో మనం నాలుగవ
వార్షికోత్సవానికి చేరుకున్నాము. సాయి వైబ్రియానిక్స్ వార్తాపత్రిక యొక్క ప్రచురణ 2010 సెప్టెంబర్ లో మొదటి సంచికతో ప్రారంభమైంది. ఇది సమర్పించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు నేను ఒక కాపీని ముద్రించి స్వామి దర్శనానికి తీసుకు వెళ్ళాను. దర్శనంలో కూర్చున్నప్పుడు నేను అడగకుండానే స్వామి నన్ను పిలిచి వార్తాలేఖను వారు ఒక్కొక్కటిగా లేఖలోని 4 పేజీలనూ చూసి ఎంతో సంతోషంతో ఆశీర్వదించారు. కృతజ్ఞతతో నా హృదయం ఆనందంతో ఉప్పొంగింది. ఈ వార్తా పత్రిక ప్రచురణ వారి దయ వల్ల మాత్రమే ఇలా నిరవధికంగా కొనసాగుతోందని నాకు తెలుసు.
ప్రధానంగా ఈ వార్తాలేఖ ఒక సమస్యను పరిష్కరించడానికి ఆవిర్భవించింది. 2010 నాటికి సాయి వైబ్రియానిక్స్ శిక్షకులు 16 సంవత్సరాలుగా అభ్యాసకులకు మెంటరింగ్(గురువులుగా వ్యవహరించడం) చేస్తూ ఉన్నారు. భారత దేశము మరియు 80 ఇతర దేశాలలో ఇప్పటివరకు నాలుగు వేల మంది అభ్యాసకులు పని చేస్తూ ఉన్నారు. ఇంకా ఎంతోమంది అభ్యాసకులు తమ శిక్షణ పూర్తి చేసుకొని ప్రతీ సంవత్సరం వైబ్రియానిక్స్ సేవను ప్రారంభిస్తున్నారు. అయితే ఇది మాకు ఒక సమస్యను సృష్టించింది, మా ప్రధాన బృందంలోని ముగ్గురు లేదా నలుగురు సభ్యులు సూచించిన మేరకు: వైబ్రియానిక్స్ అభ్యాసకుల సంఖ్య ప్రతీ సంవత్సరం పెరుగుతున్నప్పటికీ మనం కోరుకున్నట్లుగా అందరితో సన్నిహిత సంబంధాలు కొనసాగించలేక పోతున్నాం. ప్రతి ఒక్కరికీ అవసరం మేరకు క్రమానుసారంగా సమాచారం అందించడానికి నియమితమైన మార్గం లేదు. కనుక ఈ మెయిల్ కు జోడించిన వార్తాలేఖ దీనికి మంచి పరిష్కారం అనిపించింది. కాబట్టి మేము అటువంటి ఏర్పాటు చేయడానికి పూనుకున్నాము.
ముందుకు సాగిపోతూనే దీన్ని ఎలా కొనసాగించాలో నేర్చుకుంటూ వచ్చాము. ప్రాథమికంగా రెండు నెలలకు ఒకసారి వార్తాలేఖ ప్రచురింప బడటానికి ఏమి అవసరమో లేదా సాయిబాబా ఎవరిని మాకు సహాయం నిమిత్తం పంపుతారో తెలియని పరిస్థితిలో ఉన్నాము. అభ్యాసకులు దీన్ని ఎలా స్వీకరిస్తారో, ఎలా ఉపయోగించుకుంటారో, వారు ఏమి కావాలని కోరుకుంటున్నారో కూడా మాకు తెలియదు. అదృష్టవశాత్తు ఎంతోమంది అభ్యాసకులు తమ సమయాన్ని ప్రతిభను అందించడానికి ముందుకు రావడంతో ఈకార్యక్రమం రూపుదిద్దుకుంది. ఆ విధంగా వార్తాలేఖ ప్రచురణ సుసాధ్యం చేసిన గత మరియు ప్రస్తుత సహాయకులు అందరికీ ఎంతో కృతజ్ఞతలు.
మనందరికీ తెలిసినట్లుగా, వార్తాలేఖ ఇటీవల ఎంతో అభివృద్ధి చెందుతోంది. అభ్యాసకుల కేంద్రీకృత సమాచారం విస్తరిస్తోంది. ఈ మార్పులు వార్తాలేఖ ప్రస్తుత లక్ష్యాన్ని ప్రతిబింబిస్తాయి. దీని లక్ష్యం అభ్యాసకులు తమ రోగులకు సాధ్యమైనంత ఉత్తమమైన సాయి వైబ్రియానిక్స్ సంరక్షణ అందించడానికి అభ్యాసకుల సామర్థ్యాన్ని పెంపొందించడంలో సహాయ పడుట; నిరంతర విద్యను అందించుట మరియు అభ్యాసకులకు సామాజిక దృక్పధాన్ని పెంపొందించుకోవడంలో వారికి సహాయ పడుట. అభ్యాసకులు తమ అనుభవాన్ని మరియు జ్ఞానాన్ని పంచుకున్నప్పుడు, ఈ సేవ ఇతరులను వారి హృదయాలు తెరవడానికి, ప్రశ్నలు అడగడానికి మరియు భాగస్వామ్యం అందించడానికి ప్రోత్సహిస్తుందని మేము భావిస్తున్నాము. వైబ్రియానిక్స్ పురోగతి కోసం మీ అనుభవాలను పంచుకోవడం చాలా అవసరమని మేము భావిస్తున్నాము. సామాజిక పురోగతిని సాధించడానికి ఐక్యత భావాన్ని పెంచుకోవడం ఎంత ముఖ్యమో స్వామి మనకు ఎన్నో సార్లు చెప్పారు. .
మన ప్రధాన బృందము మరియు ఇతర శిక్షకులు తమకు తెలిసిన ప్రతి విషయాన్ని నేర్పుతూనే ఉంటారు. కానీ మీరు ఈ ప్రక్రియలో మీ పాత్రను కూడా సరియైన రీతిలో పోషించడం ఎంతో ప్రాధాన్యత కలిగిన అంశం. అభ్యాసకులు ఒకరికొకరు బోధించుకొనడానికి మరియు నేర్చుకోవడానికి ఎన్నో ఉన్నాయి. సాయిరాం వైబ్రేషనల్ హీలింగ్ ప్రధానంగా అభ్యాసకులు తమ ఆచరణాత్మక జ్ఞానం మరియు అనుభవాన్ని అందించడం ద్వారానే ముందుకు సాగుతుంది. మరో మాటలో చెప్పాలంటే మన వార్తాలేఖ యొక్క ప్రధాన లక్ష్యం బోధన మరియు సహకారం రెండింటికి ఒక వాహకముగా ఉపయోగపడటమే.
ఈ సంచిక మరొక విషయంలో కూడా ఒక మైలురాయి అని చెప్పవచ్చు. ఇప్పటి వరకు పిడిఎఫ్ ఆకృతిలో ప్రచురించిన వార్తా లేఖలలో ఇదే చివరిది. ప్రశాంతి నిలయంలోని మా ఈమెయిల్ సర్వర్ యొక్క పరిమితుల కారణంగా మేము ఇప్పటివరకూ పిడిఎఫ్ ఆకృతిని ఉపయోగిస్తూ వచ్చాము. అభ్యాసకులకు కంటెంట్ విషయంలో మరింత సౌలబ్యమ్ కలిగించడానికి వచ్చే సంచిక నుండి html వెబ్ ఆధారిత వార్తాలేఖ గా మార్చాలని మేము ప్రణాళిక సిద్ధం చేస్తున్నాము. మీలో వార్తాలేఖను ముద్రించాలనుకునేవారు మరియు చదవాలనుకునేవారు కొత్త సంస్కరణల ద్వారా కొనసాగించవచ్చు. వార్త లేఖలోని విషయాలను ఆన్లైన్ ద్వారా యాక్సెస్ చేయడానికి ఇష్టపడేవారు ఇప్పుడు ఇంటరాక్టివ్ ఫార్మేట్ యొక్క ప్రయోజనం పొందవచ్చు. మీ డెస్క్టాప్, ల్యాప్టాప్, టాబ్లెట్ లేదా స్మార్ట్ ఫోన్ ఇంకా అలాంటి ఇతర పరికరాలతో వార్తాలేఖలు తెరమీద యాక్సెస్ చేసుకొని చదవవచ్చు. ఇందులోని అంశాలను మీరు ఏ క్రమంలో నైనా చదవచ్చు. అలాగే ప్రస్తుత వార్తాలేఖ లోని అంశాలు మరియు పాత వార్త లేఖలోని అంశాలు సెర్చ్ చేయడానికి లేదా శోధించడానికి ఇప్పుడు ఎంతో అనుకూలంగా ఉంటాయి. అనగా రోగులకు చికిత్సచేయడంలో మీకు సహాయపడటానికి అన్ని సంబంధిత అంశాలు శోధించడానికి కీవర్డ్ లేదా కీలక పద శోధన మరియు సబ్జెక్ట్ సెర్చ్ లేదా విషయ శోధన ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకు మీరు మధుమేహం చికిత్సపై అన్ని రోగ చరిత్రలను శోధించవచ్చు లేదా నీటితో తయారుచేసిన నివారణ వాడకాన్నిత్వరగా మరియు సౌకర్యవంతంగా పోల్చవచ్చు.
వాస్తవానికి మేము ఈ సంచిక తోనే ఈ మార్పులన్నీ చేయాలనుకున్నాము. కానీ html మార్పిడి ప్రక్రియ ఆశించిన దానికంటే ఎక్కువ సమయం తీసుకుంటోంది. మా వంతు మేము కృషి చేస్తూనే ఉన్నాం కానీ ప్రతిదీ స్వామి సంకల్పం మేరకే జరుగుతుంది.
దీన్ని ముగించే ముందు నా వల్ల జరిగిన ఒక వ్యక్తిగత సాంకేతిక లోపం గురించి క్షమించ వలసిందిగా అభ్యర్థిస్తున్నాను. అభ్యాసకులు నాకు పంపిన కొన్ని పెండింగ్ ఈ మెయిల్ లు వాటికి సమాధానం ఇచ్చే లోపుగానే అనుకోకుండా నా కంప్యూటర్ నుండి తొలగించబడ్డాయి. నేను రోజుకు అనేక డజన్ల కొద్దీ ముఖ్యమైన ఈ మెయిళ్లను స్వీకరిస్తాను. కాబట్టి ఈ తప్పిదం వల్ల ఎంతోమందికి ఇబ్బంది కలిగి ఉండవచ్చు. ప్రతీ ఈ మెయిల్ కు సమాధానం ఇవ్వడమే నా యొక్క విధానము. కాబట్టి మీరు నా నుండి ప్రత్యుత్తరం పొందకపోతే దయచేసి మీ సందేశాన్ని తిరిగి పంపండి. ఈ తప్పిదానికి మరొకసారి క్షమాపణలు వేడుకుంటున్నాను. అర్థం చేసుకున్నందుకు మీకు ధన్యవాదాలు.
ప్రేమ పూర్వక సాయి సేవలో మీ
జిత్.కె. అగ్గర్వాల్
నోటి పూత 02806...Malaysia
2014 మార్చి 23న, 38 ఏళ్ల వ్యక్తి 15 సంవత్సరాలుగా నోటి పూతతో బాధపడుతూ చికిత్స కోసం వచ్చారు. వీరు కొన్ని సంవత్సరాలుగా అనగా : 2002-2004; మరియు 2005, అనేక మంది అల్లోపతి వైద్యులు చేత చికిత్స పొందారు. వైద్యులు హెర్పెస్ సింప్లెక్స్ గా నిర్ధారించి యాంటీ వైరల్ ల జోవిరాక్స్(ఎసిక్లో వీర్) మరియు కార్టికోస్టెరాయిడ్, ప్రెడ్ని సోలెన్, సమయోచితంగా ఉపయోగించిన బాహ్య అనువర్తన క్రీములతో మూడు నెలలు ఉపయోగించినప్పటికీ; ఇవన్నీ తాత్కాలిక ఉపశమనం ఇచ్చి పునరావృతం అయ్యేవి, కానీ శాశ్వతంగా ఎటువంటి మార్పు లేదు;
2006 లో, చెవి ముక్కు మరియు గొంతు నిపుణుడు టాన్సీలెక్టమీ మరియు విటమిన్లు ఇచ్చారు కానీ ఎటువంటి పురోగతి లేదు): 2007- 2010 మధ్య సాంప్రదాయ చైనీస్ ఔషధం తీసుకున్నారు (కానీ ఉపశమనం లేదు); మరియు 2011- 2014 మధ్య అదనపు వైద్యుల వద్ద చికిత్స తీసుకున్నారు (కానీ ఉపశమనం లేదు). ఒక పరీక్షలో నాలుక అంతటా మరియు నోటి శ్లేష్మ ఉపరితలంపై పూత లాగా కనిపించింది. నాలుక పూత మరియు గొంతు అసౌకర్యం కారణంగా రోగి ద్రవ లేదా పాక్షిక ద్రవ ఆహారము మరియు అతి కష్టంగ ఘన ఆహారం తీసుకునేవారు. ఎందుకంటే దానిని మింగెటప్పుడు చాలా నొప్పిగా ఉండేది. ఈ సమస్య కారణంగా రోగి ఎంతో ఆందోళన మరియు విచారంతో ఉన్నారు. రోగి ప్రతిరోజూ ఉదయం నిద్ర లేచిన తర్వాత 200-250 మిల్లీ లీటర్ల నీరు త్రాగాలని రెండు వారాలపాటు క్రింది నివారణ తీసుకోవాలని సూచించబడింది:
#1. CC11.5 Mouth infections + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic…5 గోళీలు 90 ml నీటిలో కరిగింప జేసి; 5 ml చొప్పున 6 గంటలకు ఒకసారి
ఏప్రిల్ 5న, రోగిని తిరిగి పరీక్షించినప్పుడు, ఐదు శాతం స్వల్ప ఉపశమనం కనిపించింది. అతనికి ఇంకా ఎన్నో నోటి పుండ్లు ఉన్నాయి, కానీ అంత బాధాకరంగా లేవని తెలిపారు. నోటి పూత తగ్గడానికి స్టెరాయిడ్లు తీసుకున్నట్టుగా రోగి తెలిపారు. రోగిని నివారణ కొనసాగించవలసిందిగానూ అయితే 5ml నివారణ నీటిని ప్రతి మూడు గంటలకు ఒక మోతాదు చొప్పున రెండు వారాల వరకు తీసుకొని, మరలా రావలసిందిగా సూచించారు.
ఏప్రిల్ 20న, తిరిగి పరీక్షించినప్పుడు నోటి పుండ్లు సంఖ్యలోనూ మరియు వాటి తీవ్రతను లోనూ 40 % ఉపశమనం కనిపించింది. ఈసారి నయం కావడానికి పట్టిన సమయం గణనీయంగా తక్కువగా ఉందని రోగి తెలిపారు. 5 నుంచి 7 రోజుల్లో నయం అయ్యే అల్సర్లు ఇప్పుడు రెండు రోజుల్లోనే నయం అయ్యాయని తెలిపారు. ఇది వైబ్రియనిక్స్ యొక్క అద్భుతం ఎందుకంటే ఈ రెండు వారాలు స్టెరాయిడ్లు తీసుకోవడం ఆపి వేసినట్లుగా రోగి తెలిపారు.
మే 10వ తేదీన రోగికి ఇచ్చే నివారణ క్రింది విధంగా మార్చబడింది:
#2. Combo #1 + CC21.8 Herpes... 90 ml మినరల్ వాటర్లో 5 గోలీలు కరిగింప జెసి ; 5 ml ప్రతి 3 గంటలకు (6TD)
మే 22న, తిరిగి పరీక్షించినప్పుడు, 50-60% మెరుగుదల కనిపించింది. నాలుక మీద కొద్ది సంఖ్యలో మాత్రమే పుండ్లు కనబడుతున్నాయి. అయితే ఇప్పుడు రోగి అన్నం వంటి ఘన ఆహార పదార్థాలను ఎటువంటి నొప్పి లేకుండా తింటున్నట్లు తెలిపారు. రోగిని నివారణ అలాగే కొనసాగించమని కోరుతూ మోతాదును TDS కు తగ్గించారు.
జూన్ 8 నాటికి, రోగి నాలుక ఎక్కువలో ఎక్కువ పూర్తిగా కోలుకుంది. మొత్తం నోటిపూత మరియు నోటి పుండ్లు ఇప్పుడు 80 నుంచి 90 శాతం మెరుగు పడ్డాయి. రోగి 15 సంవత్సరాల తర్వాత తన సాధారణ ఆహారాన్ని తిరిగి ప్రారంభించ గలిగారు.
చికిత్స కొనసాగించాలని మరియు ఏదైనా పునరావృతం ఎదుర్కొంటే వెంటనే అభ్యాసకుని కలవాలని సలహా ఇవ్వబడింది. 2014 జూలై నాటికి, రోగి వైబ్రియనిక్స్ చికిత్సా నివారణ కొనసాగిస్తున్నారు. ఎటువంటి పునరావృతం కలుగలేదు.
మూత్రాశయ రుగ్మత & మధుమేహం 11520...India
మధుమేహానికి వైబ్రియో చికిత్స(క్రింది నివారణ చూడండి) పొందుతున్న ఒక వృద్ధుడు (80) 2014 జూలై 17న, సిస్టిటిస్ లేదా మూత్రాశయ శోధము గురించి నివారణ కోరారు. అతనికి 102 F ( 38.9C) జ్వరం ఉంది. మూత్రంలో చీము కణాలు 80-100/hpf.ఉన్నాయి. వారం క్రితం నుండి, అతనికి తరచూ మూత్ర విసర్జన, మూత్ర విసర్జన చేసేటప్పుడు నొప్పి మరియు మంట, మూత్రం ఆపుకోలేని తనము ఉన్నాయి. ఇతనికి దీర్ఘకాలిక మలబద్ధకం (30 సంవత్సరాలు నుండి) మరియు మధుమేహం (38 సంవత్సరాలు నుండి) ఉన్న చరిత్ర కూడా ఉంది.
తీవ్రమైన లక్షణాలు కోసం ఇతనికి ఈ క్రింది నివారణ ఇవ్వబడింది:
#1. NM21 KBS + NM36 War + SM27 Infection + SR456 Bladder (Urinary) + SR536 Urethra + CC10.1 Emergencies …TDS
జులై 22న, అనగా నివారణ ఇచ్చిన ఐదు రోజుల తర్వాత రోగి 50% ఉపశమనం కలిగినట్లుగా తెలిపారు. మూత్ర విసర్జన చేసేటప్పుడు అతనికి నొప్పి మరియు మంట లేదు. జ్వరం కూడా పోయింది కాబట్టి అతని ఉష్ణోగ్రత సాధారణ స్థాయిలో ఉంది.
జులై 26న రోగి 99 శాతం ఉపశమనం కలిగిందని తెలిపారు. అతను ఎక్కువ మూత్ర విసర్జన చేయవలసిన అవసరం రాలేదు. మూత్రాన్ని నిలుపుకోగల శక్తి ఏర్పడింది. అలాగే మూత్రంలో చీము కణాల సంఖ్య సాధారణ స్థితికి 3-4/hpf కి చేరుకుంది.
రెండవరకం మధుమేహం చికిత్స కోసం రోగి గతంలో అనగా 2012 డిసెంబర్లో అభ్యాసకుని వద్దకు వచ్చారు. అతనికి మధుమేహ కుటుంబ చరిత్ర కూడా ఉంది. అతని తల్లి మరియు అతని సోదరీ సోదరులు అందరూ మధుమేహ బాధితులే. అతను 1982 లో అతనికి 42 సంవత్సరాల వయసులో మధుమేహం నిర్ధారింప బడి అలోపతి చికిత్స తీసుకున్నారు. అతను Volibo M 0.3mg టాబ్లెట్లు BD మరియు Ozomet PG 2 ట్యాబ్లెట్లు TDS గా తీసుకుంటున్నారు. కానీ నిరాహారంగా ఉన్నప్పుడు బ్లడ్ షుగర్ స్థాయి 185-200mg/dL ఉంది. అతనికి క్రింది నివారణ ఇవ్వబడింది:
#2. CC6.3 Diabetes + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic…TDS
11 నెలల రెండు వారాల వైద్య చికిత్స తర్వాత నిరాహారంగా ఉన్నప్పుడు అతని రక్తంలో చక్కెర 80-120mg/dL ఉంది. అతని వైద్యుడు Ozomet మోతాదు BD కి తగ్గించారు .
2014 మార్చిలో, అభ్యాసకుడు SVP శిక్షణ పూర్తి చేసుకున్నాక నివారణను ఈ క్రింది విధంగా మార్చి ఇచ్చారు:
#3. NM6 Calming + NM21 KBS + NM36 War + NM63 Back-up + BR2 Blood Sugar + SM5 Peace and Love Alignment + SM17 Diabetes...TDS
2014 జూలై చివరి నాటికి, రోగి యొక్క వైద్యుడు అలోపతి మందులను ప్రారంభ మోతాదులో 50 శాతానికి తగ్గించారు మరియు రోగి వైబ్రో నివారణలు కొనసాగిస్తున్నారు. రోగికి స్వీట్లు మరియు మేక మాంసం తినడం చాలా ఇష్టం. అతను క్రమం తప్పకుండా రోజుకు ఒక స్వీటు తింటున్నప్పటికీ నిరాహారంగా రక్తంలో చక్కెర 110mg/dL గానే ఉంది.
పేషెంట్ వ్యాఖ్య:
“నా వయసు 40 సంవత్సరాలు నాకు మధుమేహం ఉంది మరియు తీవ్రమైన యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా ఉంది. నేను వైబ్రో చికిత్సలు గత సంవత్సరం నుంచి తీసుకుంటున్నాను. అలోపతి మందులు సగానికి తగ్గించిన తర్వాత కూడా నా మధుమేహం ఇప్పుడు నియంత్రణలో ఉంది. పది రోజుల్లో నా మూత్రం లో ఇన్ఫెక్షన్ లో (80-100 చీము కణాలు ) నుండి సాధారణ స్థాయికి (3-4 చీము కణాలు ), చేరింది మరియు మూత్రం వెళ్లేటప్పుడు నొప్పి మరియు మంట కూడా పోయింది నా ఆరోగ్యం మెరుగు పడింది. నా సమస్యలను సమర్థవంతంగా చికిత్స చేసినందుకు ధన్య వాదాలు”.
గంజాయి వ్యసనం 02758...Russia
ఒక యువ జంట, 25ఏళ్ల యువకుడు మరియు 24 ఏళ్ల యువతి గంజాయి తాగడానికి చాలా బలంగా బానిసలయ్యారు. ఇది చెడు లక్షణమని వారు అర్థం చేసుకోవడమే కాదు దాని నుండి బయట పడాలని కూడా కోరుకుంటున్నారు. కానీ అలా చేయడానికి సంకల్ప శక్తి సామర్థ్యము లేదు. వారి చిన్న వయసు కారణంగా వ్యసనం మినహా మరే ఇతర తీవ్రమైన లేదా దీర్ఘకాలిక వ్యాధులు లేవు. జూలై 2013 ప్రారంభంలో వారికి చికిత్స ప్రారంభించినప్పుడు, యువకుడు నాలుగు సంవత్సరాలు మరియు యువతి రెండు సంవత్సరాల నుంచి గంజాయి ఉపయోగిస్తున్నారు. వారు వైభ్రియానిక్స్ తప్ప వేరే చికిత్స ఏదీ తీసుకోలేదు. వారికి క్రింది నివారణ ఇవ్వబడింది:
#1. CC15.3 Addictions + CC17.2 Cleansing…TDS
చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, చికిత్స యొక్క మొదటి రోజు నివారణలు తీసుకున్న తర్వాత యువకుడు చాలా రోజులు గంజాయి తీసుకోకుండా ఉండగలిగాడు. మొదటి నెల తర్వాత, యువకుడు తనలో 50% మెరుగుదల కనిపించిందని చెప్పాడు; యువతి 25% మెరుగుదల కనిపించిందని చెప్పారు. వారిరువురు తమ బాటిళ్ల లోని గోళీలు పూర్తి చేసే సమయానికి ఎక్కువలో ఎక్కువ దీని నుండి బయట పడతామని భావించారు. కాబట్టి వారు అభ్యాసకురాలిని సంప్రదించకుండా చికిత్సను ఆపివేశారు. కానీ అలవాటు ఇంకా నియంత్రణలోకి రాలేదు కనుక చికిత్సను తిరిగి ప్రారంభించవలసి వచ్చింది. 2013 సెప్టెంబర్లో వారికి రెండవ కోర్సుగా క్రింది నివారణ ఇవ్వబడింది :
#2. CC15.2 Psychiatric disorders…TDS
ఇది యువకునకు పూర్తి నివారణ ఇచ్చింది అప్పటినుండి గంజాయి ముట్టుకోలేదు మరియు దాని పొగ వాసన కూడా భరించలేక పోయేవాడు. యువతికి 90% ఉపశమనం కలిగింది అయితే ఒత్తిడికి గురైనప్పుడు అప్పుడప్పుడు ఆమె గంజాయి పొగ త్రాగడం కొనసాగిస్తోంది.
అభ్యాసకుని వ్యాఖ్య:
ఈ వ్యక్తుల గురించి ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మాదకద్రవ్యాలు లేకుండా జీవించడమే కాదు కొంతకాలం తర్వాత వారు ఇస్కాన్(ISKCON) కు హాజరు కావడం ప్రారంభించారు . భగవంతుని అనుగ్రహంతో మాదకద్రవ్యాల వ్యసనం పై విజయం సాధించడమే కాక భగవంతుని చెంతకు రావడం తమంతట తామే సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించారు. మనందరికీ ఎంతో స్ఫూర్తినిచ్చే ఇలాంటి అద్భుతాలు చేసిన భగవంతునికి ధన్యవాదాలు !”
కుక్క లో స్ట్రోక్ మరియు ప్రేగు సంక్రమణ 00829...Australia
2014 జూన్ లో ఒక సోమవారం ఉదయం అభ్యాసకుడు తన కుక్క దీదీ విషయంలో ఏదో మార్పు జరిగిందని గమనించారు. అది కొద్దిగా వాంతి చేసుకుంది మరియు నడవలేక పోతోంది. పశు వైద్యుని వద్దకు తీసుకువెళ్లారు. దీదీకి స్ట్రోక్ వచ్చిందని బహుశా వృద్ధాప్యం కారణంగా ( దీదీ వయస్సు 15 సంవత్సరాలు) ఇలా జరిగి ఉండవచ్చని తెలిపారు. దీదీకి జీర్ణవ్యవస్థకు సంబంధించిన ఇన్ఫెక్షన్ కూడా ఉందని ఇది ఇన్ఫెక్షన్ సోకిన మరొక దాని నుండి (ఇది పొరుగున ఉన్న కుక్క నుండి) పొంది ఉండవచ్చని తెలిపారు . దీదీకి మెదడులో వాపు నిమిత్తం కార్టిజోన్ ( cortisone) (2 టాబ్లెట్లు BD) రెండు రోజులకు మరియు ఇన్ఫెక్షన్ కోసం మూడు రోజులు యాంటీబయాటిక్స్ ఒక టాబ్లెట్ BD గా ఇచ్చారు. వైబ్రియానిక్స్ చికిత్స కూడా వెంటనే ప్రారంభించబడింది. సోమవారం(మొదటిరోజు) క్రింది నివారణ ఇవ్వబడింది:
#1. CC3.5 Arteriosclerosis + CC18.4 Paralysis…ప్రతి గంటకు
మంగళవారం (రెండో రోజు) మోతాదు ప్రతి రెండు గంటలకు ఒకసారి ఇచ్చే విధంగా మార్చబడినది. అదే సమయంలో ఇన్ఫెక్షన్ లేదా సంక్రమణ మరియు మంట కోసం అదనపు నివారణ కూడా ఇవ్వబడింది:
#2. CC9.2 Infections acute…every 2 hours
బుధవారం(మూడ వ రోజు) #1 మరియు #2 ను 6TD. వద్ద కొనసాగించారు. కార్ట్ జోన్ ఆకలిని ప్రేరేపిస్తుందనీ పశు వైద్యుడు చెప్పినప్పటికీ మూడవరోజు నాటికి కూడా అలా జరగలేదు. దీదీ ఇంకా ఏదైనా తినడానికి లేదా త్రాగటానికి నిరాకరిస్తూనే ఉన్నది. నడవడానికి ప్రయత్నించినప్పుడల్లా అది పడిపోతోంది. అది ఉన్నచోటనే పడుకుంటూ ఉన్నది. ఆ సాయంత్రం అభ్యాసకుడు దీదీని వేరొక పశు వైద్యుని వద్దకు తీసుకువెళ్ళారు. అనియంత్రిత వేగవంతమైన కంటి కదలికల కారణంగా వికారం కలుగుతూ ఉండవచ్చని ఆ వైద్యు డు తెలిపారు. అప్పుడు అభ్యాసకుడు కార్టిజోన్ మరియు యాంటీబయాటిక్స్ ఆపివేసి క్రింది నివారణ ప్రారంభించారు:
#3. CC4.10 Indigestion…6TD
గురువారం నాలుగవ రోజు ప్రారంభంలో దీదీ సాధారణంగా నడవడం ప్రారంభించింది కానీ దాని తల వంగి ఉంటోంది. ఆమె గిన్నెలో పిల్లి మాంసం ఉన్న ఆహారం మొత్తం తిని నీరు త్రాగడం ప్రారంభించింది. అభ్యాసకుడు శుక్రవారం ఐదో రోజు తర్వాత #3 ఆపివేసి #1 & #2 రెండింటిని 6TD వారాంతం వరకు (7 వ రోజు), అనంతరం మరొక వారం (8-14) TDS గా చివరిగా మరొక వారం (17-22) OD గా ఇచ్చిఆపివేశారు. స్ట్రోక్ వచ్చిన సుమారు నెల తర్వాత దీదీ మొరగటం, ఆడటం,పరిగెత్తడం, మళ్లీ సాధారణ మయ్యాయి. అది మునుపటి వలె మారిపోయింది. కానీ దాని తల మాత్రం స్వల్పంగా వంగి ఉంది.
పేలవమైన దృష్టి (మాక్యులర్ హోల్) 02799...UK
57 ఏళ్ల వ్యక్తి కంటి దృష్టి సరిగా లేనందువలన చికిత్స కోసం 2013 ఆగస్టు 14న, అభ్యాసకుని వద్దకు వచ్చారు. అతని కుడి కంటిలో దృష్టిని కోల్పోయారు. అతని యొక్క ఎడమ కంటి పాపలో రంధ్రం కారణంగా అతని ఎడమ కంటి దృష్టి 30 శాతం మాత్రమే ఉంది . ఈ రంధ్రం దానంతట అదే మూసుకు పోకపోతే అతను అంధుడు అవుతాడని నేత్ర వైద్యుడు చెప్పారు. అతను గత సంవత్సర కాలంగా కంటి ఆసుపత్రి నుండి చికిత్స పొందుతూనే ఉన్నారు కానీ పర్యవేక్షణ ప్రకారము అతనిలో మెరుగుదల 10 శాతం మాత్రమే కనిపించింది. అతనికి క్రింది నివారణ ఇవ్వబడింది:
CC7.1 Eye tonic + CC7.2 Partial Vision + CC7.4 Eye defects + CC7.5 Glaucoma + CC10.1 Emergencies + CC15.1 Mental & Emotional tonic…QDS రెండు వారాల తర్వాత TDS
2013 సెప్టెంబర్ 17న, రోగి ఒక నేత్ర చికిత్స నిపుణుడిని కలిసినప్పుడు ఎడమ కంటికి OCT(ఆప్టికల్ కోహేరేన్స్ టొమోగ్రాఫి) పరీక్ష నిర్వహించబడింది. ఎడమ కన్ను లోని రంధ్రము పూర్తిగా మూసివేయబడి ఉండడం నేత్ర చికిత్స నిపుణుడు కనుగొన్నారు. రోగి అప్పటినుండి తన దృష్టి ముందటి కంటే మెరుగ్గా ఉందని చికిత్స నిపుణునికి తెలిపారు ఇప్పుడు రోగి కుడికంటిలో కూడా ఏదో ఒక అనుభూతిని అనుభవిస్తున్నారు. కుడి కన్ను నుండి కన్నీళ్లు వస్తున్నాయి. అయితే ఇంతకు ముందు ఈ అనుభూతి గాని కన్నీళ్లు గాని రాలేదు. అక్టోబర్ 2013 నాటికి అతను పై నివారణను TDS గా కొనసాగిస్తున్నారు.
రోగి యొక్క వివరణ: ( 2013 సెప్టెంబర్ 30న అభ్యాసకుడికి పంపిన ఈ మెయిల్ ప్రకారం):
“ గతంలో మీరు చూసిన నివేదిక ప్రకారం మాక్యులర్ రంధ్రం కొంచెం తెరుచుకొని ఉంది కానీ ప్రస్తుతం OCT రిపోర్టు ప్రకారము మూసివేయబడినట్లుగా చూపిస్తున్నది. నివేదికలో పేర్కొన్నట్లుగా ఈ రంధ్రం ఇంతకు ముందు పూర్తిగా మూసి వేయబడి లేదు పాక్షికంగా తెరుచుకుని వుంది. నేను 2013 సెప్టెంబర్ 17న OCT పరీక్ష చేయించుకున్నప్పుడు, రంధ్రం పూర్తిగా మూసుకు పోయిందని నివేదిక తెలిపింది. నేను ఆగస్టు 14న మీ వద్దకు వచ్చాను . ఆ తేదీ నుండి నాకు ఇచ్చిన నివారణ OCT పరీక్ష సమయం వరకు తీసుకుంటూ ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నాను. మీరిచ్చిన నివారణల ద్వారానే రోగ నివారణ జరిగిందని పూర్తిగా నమ్ముతున్నాను.
ఈ చికిత్సపై నాకు పూర్తి నమ్మకం ఉంది. నా కుడి కంటి దృష్టి కూడా తిరిగి వస్తుందని నమ్ముతున్నాను కాబట్టి మాత్రలతో కొనసాగుతున్నాను ధన్యవాదాలు ”.
ప్రాక్టీషనర్ వ్యాఖ్య:
“నాకు ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి ముఖ్యంగా గ్లూకోమా కేసులు, వివిధ సమస్యలతో బాధపడుతున్న రోగులు స్వామి అనుగ్రహంతో మంచి ఫలితాలు పొందుతున్నారు”.
కీటకాల కాటు మరియు గాయాలు 11176...India
55 ఏళ్ల వ్యక్తి కి కీటకాల కాటు వల్ల పుండ్లు ఏర్పడి, గత 25 సంవత్సరాలుగా వాటినుండి చీము మరియు రక్తము స్రవిస్తున్నాయి. 20 సంవత్సరాల క్రితం అతని తల్లి పాముకాటుకు గురై చనిపోయిన కోపంతో ఆ వ్యక్తి పాముని చంపాడు. ఈ సంఘటన అతని మనసు పై గాఢంగా నాటుకొని తన సమస్యకు ఇది ఒక కారణమేమో అని భావించ సాగారు. అల్లోపతి మందులు అతనికి ఏమాత్రము ఉపశమనము ఇవ్వలేదు. 2013 ఫిబ్రవరిలో ఒక వైబ్రియో వైద్య శిబిరానికి అతను హాజరయ్యా రు. అప్పుడు అతనికి క్రింది నివారణ ఇవ్వబడింది:
#1. CC21.4 Stings & Bites…TDS
ఒక నెల తర్వాత, అతనికి కీళ్లవాతం ఉన్నట్టు తెలిపారు. అతనికి కాంబో క్రింది విధంగా మార్చబడింది :
#2. CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue + CC21.4 Stings & Bites…TDS
నాలుగు నెలలలో, అతని గాయాలు నయం అవ్వడం ప్రారంభించాయి 25 శాతం మెరుగుదల కనిపించింది. ఏడు నెలల తర్వాత, 75 శాతం మెరుగుదల, మరియు 8 నెలల తర్వాత 95 శాతం మెరుగుదల కనిపించింది. తర్వాత అతను 100% నివారణ కోసం వైబ్రియో చికిత్సను కొనసాగిస్తున్నారు.
చెవి నొప్పి 00609...Italy
58 సంవత్సరాలు వయసు గల ఈ అభ్యాసకుడు ఒక సాయంత్రం నిద్రించడానికి మంచం మీదికి చేరినప్పుడు అతని కుడి చెవి లో ఆకస్మాత్తుగా నొప్పి మొదలైంది. పదినిమిషాల తర్వాత నొప్పి భరించలేక పోయారు. ఏం చేయాలో తెలియక హోమియోపతి పుస్తకాలను తెరిచి నివారణ తెలుసుకొందామని అతను మంచం మీద నుండి లేచారు. అతను నడుస్తున్నప్పుడు నొప్పి శాంతించడం మరియు చలనం లేకుండా నిలబడి ఉన్నప్పుడు నొప్పి మరింత ఎక్కువ అవడం గమనించారు. అప్పుడు అతను దీని గురించి ఆలోచించి కదలికతో ముడిపడిన నొప్పికి రస్ టాక్స్ చికిత్స బాగా ఉపయోగపడుతుందని తన కోసం కింది నివారణ తయారు చేసుకున్నారు:
SR311 Rhus Tox (200C)
కేవలం రెండు గోళీలు తీసుకోగానే 5 సెకండ్లలో నొప్పి మాయమైంది.
అభ్యాసకుని వ్యాఖ్య:
కొన్నిసార్లు సమస్యలకు పరిష్కారం అంతర్దృష్టి తోనూ మరియు అదృష్టంతో కనుగొన బడుతుంది..
హెర్పెస్ జోస్టర్ 00523...Belgium
ఒక మహిళా రోగి (63) ఎంతో కాలంగా క్రమం తప్పకుండా జలుబు సంబంధిత పుండ్ల (హెర్పెస్ జోస్టర్ )తో బాధపడుతున్నారు. ఆమెకు క్రింది నివారణ ఇవ్వబడింది :
SR261 Nat Mur…TDS
ఈ నివారణ తక్షణ ఉపశమనాన్ని ఇచ్చి పుండ్లను త్వరగా మానిపోవునట్లు చేయడం ద్వారా గొంతును సాధారణ స్థితికి తీసుకు వస్తుంది. దురద కు సంబంధించిన లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే నాట్ మూర్ ఉపయోగించడం వల్ల పుండ్లుగా మారకముందే నివారణ ఇస్తుంది.
చికిత్సా నిపుణుల వివరాలు 11483...India
అభ్యాసకురాలి11483…ఇండియా అనుభవాలు: గురుగావ్, హర్యానా,ఇండియా
ప్రాక్టీషనర్ 11483..ఇండియా నేను గురుగావ్ లో నివసిస్తున్నాను నేను సైన్స్ లో పట్టభద్రురాలిని. 2011 జూన్ నుండి, నేను వైబ్రియానిక్స్ ప్రాక్టీషనర్ గా ఉన్నాను. నేను 2012 డిసెంబర్లో SVP అయ్యాను. ఇప్పటివరకు నేను 2500 మంది రోగులకు చికిత్స అందించాను. నేను విజయవంతంగా చికిత్స చేసిన వాటిలో డిప్లో పియా లేదా ద్వంద్వ దృష్టి, ఎముకలు విరుగుట, గ్యాంగ్రీన్. లేదా రాచపుండు, నిరపాయ కణుతులు, ఆస్తమా, లుకోడెర్మా లేదా గజ్జి, మడమలో పుండ్లు, వంధ్యత్వము, లుకోరియా లేదా బ్లడ్ క్యాన్సర్, గాల్స్టోన్స్ లేదా పిత్తాశయంలో రాళ్ళు, సైనస్ ఇన్ఫెక్షన్లు, పార్శ్వపు నొప్పి, తామర వంటి చర్మ వ్యాధులు ఇంకా క్యాన్సర్ రోగులకు యాంటీ కీమోథెరపీ వంటి చికిత్సలు చేసి అద్భుతమైన ఫలితాలు పొందారు.
నేను ఈ సేవ చేయడం ప్రారంభించిన నాటినుండి ఎంతో కరుణ, వినయం, ఓపిక పెరిగి నా జీవితంలో ఎంతో మార్పు వచ్చింది. నేను ఎంత ఎక్కువ ఇస్తే అంత ఎక్కువ పొందుతాను అని తెలుసుకున్నాను. నేను చికిత్స చేస్తున్న రోగులలో ఒక రకమైన గౌరవం ప్రేమ రోగుల కళ్ళల్లో వ్యక్తమవుతూ ఉండగా చూశాను అదే నన్నునడిపిస్తుంది. నేను ఈ సేవ చేసేటప్పుడు ఒక రకమైన దివ్య భావము నాలో నెలకొంటోంది. ఇదే నన్ను స్వామికి దగ్గర చేరుస్తుంది.
గురుగావ్ లో ప్రతి పక్షం రోజులకు మాకు వైద్యశిబిరాలు జరుగుతూ ఉంటాయి ఇందులో ప్రాక్టీషనర్ లు మరియు అల్లోపతి వైద్యులు కూడా వస్తూ ఉంటారు. అక్కడ నుండి దీర్ఘకాలిక రోగాలు గల రోగులను తదుపరి తనిఖీ కోసం ఆసుపత్రులకు తీసుకు వెళ్తారు. అక్కడ చేయించిన పరీక్షలకు అనుగుణంగా అలోపతి మందులతో పాటు వైబ్రో మిశ్రమాలను కూడా ఇస్తారు. మా వైద్య శిబిరాల్లో లేత వయసులో ఉన్న ఇద్దరు రోగులకు సంబంధించిన రెండు కేసులను గురించి ఇక్కడ ప్రస్తావిస్తాను.
#1 5 సంవత్సరాల బాలుడు రోడ్డు దాటుతూ ప్రమాదానికి గురయ్యాడు. అతనికి తీవ్రమైన గాయాలు అయ్యాయి కుట్లు కూడా వేశారు. పది రోజుల తర్వాత డాక్టరు అతను ఎడమ చెయ్యి పనిచేయడం లేదని తెలుసుకున్నారు. కనుక అబ్బాయిని MRI స్కానింగ్ చేయించుకోమని సలహా ఇచ్చారు. ఆ అబ్బాయికి క్రింది నివారణ ఇచ్చాను:
CC10.1 Emergencies + CC12.2 Child tonic + CC18.5 Neuralgia...TDS
మరుసటి రోజు డాక్టర్ చెకప్ కోసము వచ్చి, బాలుడి చెయ్యి అంతకు ముందు రోజు కంటే 50 శాతం మెరుగ్గా ఉండటం గమనించి MRI స్కానింగ్ అవసరం లేదని చెప్పారు. రోగిని డిశ్చార్జ్ చేశారు. రెండు రోజుల తర్వాత బాలుడు చేతిని నయం చేయడానికి చేయాల్సిన ఫిజియోథెరపీ వ్యాయామాల గురించి వివరించడానికి నేను బాలుని తండ్రిని సంప్రదించినప్పుడు అబ్బాయికి 100% నయం అయింది కాబట్టి ఫిజియోథెరపీ అవసరం లేదని తెలిపారు.
#2. మా వైద్య శిబిరానికి వచ్చిన 15 ఏళ్ల బాలుడు గత రెండు సంవత్సరాలుగా సోరియాసిస్ తో బాధపడుతూ ఉన్నాడు. హోమియోపతి అలోపతి వంటి వివిధ రకాల చికిత్సలు తీసుకున్నప్పటికీ పరిస్థితి మెరుగు కాలేదు. నేను క్రింది నివారణ నోటిలోనికి తీసుకోవడానికి మరియు నీటితో బాహ్యంగా అనువర్తింప చేయవలసిందిగా సూచించాను:
CC21.2 Skin infection + CC21.10 Psoriasis...TDS
పదిహేను రోజుల తర్వాత, వైద్య శిబిరంలో నేను అతన్ని మళ్ళీ పరీక్షించాను. సోరియాసిస్ విషయంలో 60% మెరురుగుదల కనిపించడంతో అబ్బాయి చాలా సంతోషంగా ఉన్నాడు. పై నివారణ మరో రెండు వారాల పాటు తిరిగి ఇవ్వడంతో ఇప్పుడు పరిస్థితి 90% మెరుగుపడింది. కనుక బాలుడు వైబ్రియానిక్స్ పూర్తిగా నయం అయ్యేవరకు కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు.
వ్యక్తిగత వృత్తాంతము
నేను నా వ్యక్తిగత అనుభవాన్ని జోడించాలని అనుకుంటున్నాను. నేను కొద్ది మంది క్షయ రోగులకు చికిత్స చేస్తూ ఉండే దానిని. నేను వారిని చెకప్ కోసం తీసుకు వెళ్ళిన ప్రతీసారి, వైద్యులు వారిలో ఎవరూ వికారం, వాంతులు మరియు మంట గురించి ఫిర్యాదు చేయడంలేదని ఆశ్చర్యపోయేవారు. వీరికి LFT (కాలేయ పనితీరు పరీక్ష) నివేదికలు ఎల్లప్పుడూ నార్మల్ గానే ఉండేవి. ఇప్పుడు చెప్పబోయే పేషెంట్ 45 సంవత్సరాల వయస్సు గల ఒక మహిళ. ఆమె ఊపిరితిత్తుల్లో చాలా స్వల్ప భాగం మినహా మిగతా భాగమంతా వ్యాధి సోకి పాడైపోయింది. ఆమె అలోపతి చికిత్స తీసుకున్న రెండు మూడు రోజుల తర్వాత అనుకోకుండా తీవ్రమైన వికారం, వాంతులు మరియు మంట ఏర్పడ్డాయి. అప్పుడు వైబ్రయానిక్స్ చికిత్స ప్రారంభించేసరికి ఆమె దుష్ప్రభావాల నుండి ఉపశమనం లభించింది. ఒక నెల తర్వాత నేను ఆమెను చెకప్ కోసం డాక్టర్ వద్దకు తీసుకు వెళ్ళాను. ఆమెకు రెండవసారి ఎక్సరే తీయగా నివేదికల ఫలితం నమ్మశక్యం కాకుండా ఉంది. ఆమెకు ఊపిరితిత్తులలో చాలా స్వల్ప భాగం తప్ప మిగతాదంతా నార్మల్ గా ఉంది. వైద్యు డు ఆమెను ఈ అలోపతి మందులతో నీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగారు. ఆమె నన్ను చూపిస్తూ “ఈ మేడం కొన్ని మాత్రలు ఇచ్చారు అప్పటినుండి నాకే సమస్యలు లేవు అని చెప్పింది”.
గురు గావ్ గ్రూపు పరిచయం
నేను ఇప్పుడు మా గురుగావ్ వైబ్రియానిక్స్ సమూహం లో పనిచేస్తున్న ఇతర అభ్యాసకులను పరిచయం చేయాలనుకుంటున్నాను. మరియు వారి అనుభవాలు పంచుకోవడానికి వారిని ఆహ్వానిస్తున్నాను.
చికిత్సా నిపుణుల వివరాలు 11482...India
ప్రాక్టీషనర్11482...ఇండియా నేను ఒక గృహిణిని. నేను 2011 లో న్యూఢిల్లీ లోని సాయి సెంటర్లో నా AVP శిక్షణ పొందాను. అప్పటి నుండి పేషంట్ల రోగాలను నయం చేయడానికి నేను వైబ్రియానిక్స్ సాధన చేస్తున్నాను.
నా రోగుల్లో ఒకరు 17 ఏళ్ల అమ్మాయి ఆమెకు పాదాలలో ఆనెలు మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్ గురించి ఫిర్యాదు చేసింది. ఆమె మూడు సంవత్సరాలుగా ఈ సమస్యతో బాధపడుతూ ఉంది. నేను ఆమెకు ఒక వారం రోజులపాటు క్రింది నివారణ ఇస్తూ ఆమె పాదాలను శుభ్రంగా ఉంచుకోవాలని సలహా కూడా ఇచ్చాను:
CC21.1 Skin tonic + CC21.5 Dry Sores…TDS
వారం చివరి నాటికి ఆమె పాదాలు 75% మెరుగుపడ్డాయి. ఆమె ఆరు వారాలపాటు నివారణ తీసుకోవడం కొనసాగించింది. ఆ తర్వాత ఆమెకు పూర్తిగా నయమయింది.
చికిత్సా నిపుణుల వివరాలు 11966...India
ప్రాక్టీషనర్ 11966...ఇండియా నేను 2014 ఏప్రియల్ నుండి వైబ్రియానిక్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఢిల్లీ ప్రాంతంలోని సాఫ్ట్ వేర్ కంపెనీలో ఒక ఐటీ ఇంజనీరుగా పనిచేస్తున్నాను. నేను గురుగావ్ లో జరిగే మెడికల్ క్యాంపులో ఒక రోగిగా వైబ్రియానిక్స్ కి పరిచయం చేయబడ్డాను. ఆ సమయంలో నేను డిప్రెషన్ తో బాధపడుతున్నాను. ఒక అభ్యాసకుని నుండి చికిత్స తీసుకున్నాను.
పూర్తిగా నయం అయింది. అప్పుడు నేను ఈ కోర్సు తీసుకొని ఈ సేవ చేయడం ప్రారంభించాను.
నేను గురుగాంవ్ లో వివిధ ప్రదేశాల్లో వారం విడిచి వారం ఆదివారాల్లో వైద్య శిబిరం నిర్వహించే ముగ్గురు అభ్యాసకుల బృందంలో ఒకడిని. మేము స్వామి దయతో గ్రామాలకు వెళ్ళి వైబ్రియానిక్స్ నివారణలు రోగులకు ఇస్తూ వుంటాము.
ప్రారంభంలో, అనారోగ్యాలకు సరి అయిన నివారణ ఎంపిక చేసుకోవడంలో నేను చాలా నెర్వస్ అవుతూ ఉండేవాణ్ణి. కానీ మా సీనియర్ ప్రాక్టీషనర్లు 11483 & 02859 నుండి సరైన మార్గదర్శకత్వం లో ఇది సులభతరం చేయబడింది. ప్రతీసారి ఎవరైనా రోగికి నివారణ ఇచ్చినప్పుడు నేను స్వామికి ఒక అడుగు దగ్గరగా వెళుతున్నట్లుగా భావిస్తుంటాను. ఈ సేవ చేయడం ఒక అద్భుతమైన అనుభూతి.
నేను చేసిన చికిత్సకు సంబంధించిన ఒక ఉదాహరణ: రెండు సంవత్సరాల వయసులో ఉన్న అబ్బాయికి దీర్ఘకాలిక మలబద్ధకం కేసు చికిత్స చేశాను. అతనికి 1 వ సంవత్సరం నుంచి మలబద్ధకం ఏర్పడింది. అతనికి అల్లోపతి మందులు ఇవ్వబడ్డాయి గాని సమస్య పునరావృతం అవుతూనే ఉంది. నేను అతనికి క్రింది నివారణ ఇచ్చాను.
CC4.1 Digestion tonic + CC4.2 Liver & Gallbladder tonic + CC4.4 Constipation + CC4.10 Indigestion...TDS
ఈ నివారణ 200ml నీటిలో తయారు చేసి ఇచ్చాను. 5 ml మోతాదు చొప్పున బాబు తీసుకున్నాడు. మూడు రోజుల్లో అతని మలబద్ధకం పోయింది. అతను ఈ నివారణను మరో రెండు వారాలు తీసుకున్నాడు. దాని తరువాత, సౌకర్యం కోసం మోతాదు OD కి తగ్గించబడింది.
చికిత్సా నిపుణుల వివరాలు 11968...India
నేను AMIE పూర్తిచేసుకుని చిన్మయ విద్యాలయంలో లైబ్రేరియన్ గా తొమ్మిది సంవత్సరాలు పని చేశాను. గత సంవత్సరం హైదరాబాద్ నుండి వెళ్ళిన తర్వాత స్వామి ఆశీర్వాదంతో ఇక్కడ ఉన్న ఒక సాయి కుటుంబంతో సన్నిహితం అవడానికి మరియు వైద్య శిబిరాలలో పాల్గొనడానికి అవకాశం లభించింది. ఇది నా జీవితంలో గొప్ప మార్పు ఎందుకంటే గత 20 సంవత్సరాలుగా హైదరాబాదులోని శ్రీ సత్యసాయి సేవా సంస్థలో పనిచేస్తున్న నేను, గురుగావ్ రావడమనేది నా జీవితంలో మిగిలి పోయిన సేవను పూర్తి చేసుకొనే చక్కని అవకాశం.
ఈశిబిరాలలో, నేను సీనియర్ ప్రాక్టీషనర్ 11483...ఇండియాచూశాను. అలోపతి వైద్యం తో పాటు వైబ్రియానిక్స్ చికిత్స చేస్తూ రోగులకు మార్గదర్శకత్వం వహిస్తూ అనేక విధాలుగా వారికి సహాయపడుతూ ఉన్నారు. ప్రాథమికంగా నేను ఎంతో ఆశ్చర్యపడడమే కాదు ఒక విధంగా మైమరచిపోయాను. చికిత్స చేయబడిన ఈ రోగులంతా చక్కగా రోగ నివారణ పొందడం చూసి, ఆహా ఏమిటి దేవుని ఆశీర్వాదం అని నేను ఆశ్చర్యపోయే దానిని. నాలో కూడా అందరికీ సహాయపడాలని మరియు వారు పొందే ఆనందం యొక్క మూలం కావాలని ఆత్రుత కలిగింది. ఢిల్లీ NCR కోఆర్డినేటర్ కి పరిచయం చేసి నన్ను వైబ్రియానిక్స్ కోర్సు తీసుకోవడానికి మార్గనిర్దేశం చేసిన ఈ చికిత్సా నిపుణురాలికి కృతజ్ఞురాలిని. చికిత్సా నిపుణుల మార్గదర్శకత్వంలోఆన్లైన్ కోర్సు పూర్తి చేసుకుని 2014 ఏప్రిల్ నుండి వైబ్రియానిక్స్ సేవ చేస్తున్నాను.
ఈ సందర్భంగా రెండు చికిత్సా అనుభవాలను మీతో పంచుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది.
#1. మొదటి అనుభవం వ్యసనానికి సంబంధించినది. నేను చికిత్స చేసిన రోగుల్లో 36 ఏళ్ళ వ్యక్తి పొగాకు మరియు పాన్ లేదా కిళ్లీ అలవాటును పోగొట్టుకోవాలని భావించాడు. ఇది అతను యుక్తవయసు నుండి అలవాటయింది. ఇది చాలా ఎక్కువ కాలం నుంచి ఉన్న దురలవాటు కనుక, అతనికి నేను కౌన్సిలింగ్ చేశాను మరియు దీని యొక్క దుష్ఫలితాలు గురించి అతనికి వివరించాను. ఆ తర్వాత అతనికి క్రింది నివారణ ఇచ్చాను:
CC15.1 Mental and Emotional tonic + CC15.3 Addictions...TDS
పదిహేను రోజులపాటు నివారణ తీసుకొనవలసిందిగా అతనికి చెప్పినప్పటికీ, చికిత్స తీసుకున్నరెండు రోజులకే ఆ వ్యక్తి పొగాకు మరియు పాన్ పై తన కోరికను కోల్పోయి రెండింటినీ పూర్తిగా తీసుకోవడం మానేసాడు. నివారణ మరొక వారం పాటు కొనసాగించమని కోరాను. అనంతరం మోతాదును ఒక వారం పాటు OD కి తగ్గించబడింది. అతను 100% పూర్తిగా దురలవాటు నుండి దూరం అయ్యాడు.
#2. రెండవ అనుభవం నా వ్యక్తిగతమైనది. ఒకసారి నాకు ఋతు రక్తస్రావం ఇరవై రెండు రోజులు ఆలస్యంగా రావడమే కాకుండా నిరంతర రక్తస్రావం అవుతూ ఉన్నప్పుడు, నాకు నేను ఈ విధంగా చికిత్స చేసుకున్నాను:
CC8.1 Female tonic + CC8.6 Menopause + CC8.8 Menses irregular + CC12.1 Adult tonic…TDS
నివారణ తీసుకున్న రెండు రోజుల తర్వాత నాకు కొంచెం మెరుగుదల కనిపించినది. మూడవ రోజు అదే మాత్రలను నీటిలో కరిగించి ఔషధాన్ని నీటి రూపంలో తీసుకున్నప్పుడు ఎంతో అద్భుతమైన ప్రభావాన్ని చూపించింది. రక్తస్రావం పూర్తిగా ఆగిపోయింది. నేను మరొక రోజు నీటిలో నివారణ తీసుకోవడం కొనసాగించాను. ఆపై ముందు జాగ్రత్తగా మరో రెండు రోజులు TDS గా తీసుకున్నాను.
చికిత్సా నిపుణుల వివరాలు 11380...India
ప్రాక్టీషనర్ 11380..ఇండియా వైబ్రియానిక్స్ ఉపయోగించి కూరగాయలను పండించడం గురించి నా అనుభవాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను.
సొరకాయ(బాటిల్ గార్డ్):
మాకు చక్కగా శుభ్రంచేసిన పెరడు ఉంది. ఇందులో కూరగాయల పెంపకం కోసం18’ X15’ స్థలం కూడా ఉంది. నేను అక్కడ సొరకాయ పాదులను పెంచాలని నిర్ణయించుకున్నాను. నేను యాంటి ఫంగస్ కాంబోతో ప్లాంట్ టానిక్ ఇలా తయారుచేశాను
CC1.2 Plant tonic + CC21.7 Fungus, 5 గోళీలు ఒక బకెట్ నీటిలో
నేను ప్రతి రెండు వారాలకు ఒకసారి అన్ని మొక్కలకు నీరు పోసాను. నేను అన్ని మొక్కలతో మాట్లాడుతూ వాటి మృదువైన ఆకులను తాకి “సాయిరాం అని ప్రేమగా అంటూ మంచి ఫలితాలు ఇవ్వాలని చెప్పాను.
సొరకాయలు తీగలు త్వరగా పెరిగి పిందెలు వేయడం ప్రారంభమైంది. 2014 ఏప్రిల్ మధ్యలో, నాటిన విత్తనాలు నుండి మొక్కలు 2014 మే నెల చివరినాటికి, సొరకాయ పిందెలు ఇవ్వడం ప్రారంభించాయి. దీని యొక్క పుష్పగుచ్చాలు పొడవుగా మరియు మృదువుగా పెరిగాయి. మేమున్న ఇంటికి పైన మరియు పక్కన నివసించిన వారు సొరకాయలను క్రమం తప్పకుండా చూస్తూ ఇవి ఇంత వేగంగా మరియు పొడవుగా ఎదగడానికి గల రహస్యం ఏమిటి? అని నన్ను అడగడం ప్రారంభించారు. కొన్ని సొరకాయలు 62 సెంటీమీటర్ నుండి 70 సెంటీమీటర్ల పొడవు (పైన మరియు తరువాత చిత్రాల్లో చూడండి) ఉండడమే కాక చాలా మృదువుగా ఉండేవి. సొరకాయను సుతారంగా గోటితో గిచ్చినప్పుడు దాని గుండా రసం బయటికి రావడం ప్రారంభమైంది!.
పెద్దవైన సొరకాయలను నా ఇరుగుపొరుగు వారికి మరియు స్నేహితులకు పంచి పెట్టాను.
ఈ సొరకాయతో చేసిన వంటకాలు చాలా రుచికరంగానూ మరియు కూరగాయలు మృదువుగా ఉన్నాయని వారు పేర్కొన్నారు.
నేను ప్లాంట్ టానిక్ గురించి వైబ్రేషన్స్ గురించి వారికి చెప్పాను.
ఆ తర్వాత కొంత మంది మహిళలు నా నుండి నివారణలు పొంది తమ సొంత కూరగాయల తోటలలో దీన్ని ఉపయోగించడం ప్రారంభించారు.
ముల్లంగి ,టర్నిప్ (ఎర్ర ముల్లంగి) మరియు పాలకూర
నేను నా పెరటి తోటలో ముల్లంగి మరియు పాలకూరను పెంచడానికి వైబ్రియానిక్స్ ఉపయోగించాను. మరోసారి అదే నివారణ ను సిద్ధం చేశాను:
# 1.2 Plant tonic + CC21.7 Fungus, బకెట్ నీటిలో 5 గోళీలు
నెలకొకసారి మొక్కలపై ఈ నీళ్లు పోస్తూ సాయిరాం అని దైవనామమును స్మరించే దానిని. నేను ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిళ్లలో కూడా నిల్వచేసి వారానికి ఒకసారి మొక్కలపై చల్లుతూ ఈ మొక్కలతో మాట్లాడుతూ ఉండే దానిని.
ఈ పటంలో చూపిన విధంగా పాలకూర ఆకులు వెడల్పుగా పచ్చగా పెరిగాయి. టర్నిప్ దుంపలు చాలా లావుగా మరియు గుత్తులుగా పెరిగాయి. (మధ్యలో చిత్రాన్ని చూడండి. ముల్లంగి దుంపలు మృదువుగా పొడవుగా పెరిగాయి. అందులో చాలా వరకూ 42 సెం.మీ. పొడవు కూడా పెరిగాయి(కుడి వైపు చిత్రం చూడండి). పచ్చి ముల్లంగి లేత కొబ్బరి వలె రుచిగా ఉన్నాయి. వాటిని రుచి చూసిన వారంతా ఎంతో ఇష్ట పడ్డారు
మునుపటి వలనే ఈ ఆర్గానిక్ వైబ్రో కూరగాయలను కూడా చుట్టుపక్కల వారికి పంచగా వీటితో తయారుచేసిన కూరలు ఎంతో రుచికరంగా ఉన్నాయని వారు తెలిపారు
అదనపు సమాచారం
Using Social Media to Spread the Message of Sai Vibrionics
Sai Vibrionics was blessed to have an article with pictures about the Conference released by Radio Sai on January 27, 2014 www.radiosai.org. If you like the article, write on their website and let Radio Sai know. Tell your Patients, Family and Friends to write too.
For practitioners, friends and patients on Facebook, Radio Sai also released the article. Be sure to „Friend‟ Radio Sai then go down to the January 27 article and “Like” the article.
Photos From the Conference
Om Sai Ram
ప్రశ్నలు సమాధానాలు
1. ప్రశ్న: నేను ఉండే ప్రాంతంలో ఇథైల్ ఆల్కహాల్ దొరకకపోతే సులువుగా దొరికే మితిలేటెడ్ స్పిరిట్ ను ఉపయోగించవచ్చా ?
జవాబు: ఉపయోగించకూడదు ఎందుకంటే మిథైల్ ఆల్కహాల్ విషపూరితమైనది అది లోపలికి తీసుకుంటే: రబ్బింగ్ ఆల్కహాల్ వలె పనిచేస్తుంది. ఆదర్శవంతంగా ఉండటానికి 96% స్వచ్ఛత కలిగిన ఆల్కహాల్ నే వాడాలి. ఇది అందుబాటులో లేకపోతే, తాత్కాలిక చర్యగా జిన్ లేదా వోడ్కా వంటి మద్యం ఉపయోగించవచ్చు,
_____________________________________
2. ప్రశ్న: SRHVP మిషను ఉపయోగించి ఒక వ్యాధి లక్షణానికి మంచి నివారణ తయారు చేస్తే దానిని నా 108 సిసి బాక్స్ లోని తగిన మిశ్రమానికి జోడించవ చ్చా?
జవాబు: 108CC బాక్సును మా పరిశోధన బృందం నిరంతరం నవీనీకరిస్తోంది. అందువల్ల వైబ్రియానిక్స్ యొక్క అభివృద్ధికి ఇటు వంటి విజయవంతమైన నివారణల సమాచారం ఎంతో ప్రాముఖ్యత కలిగినది. అయితే రోగికి వ్యక్తిగతంగా మీరు మిషన్ నుంచి తయారుచేసిన నివారణకు దీనిని జోడించ వద్దని సూచిస్తున్నాము. ఎందుకంటే మా పరిశోధనా బృందం ఒక సాధారణ మిశ్రమం జోడించే ముందు నివారణ యొక్క అనేక ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. అభ్యాసకులు అందరూ కనీసం రెండు సంవత్సరాలకు ఒకసారి 108 CC బాక్సును రీఛార్జి చేయాలని మేము సిఫార్సు చేస్తున్నాము. ఇందు కోసం స్థానిక సమన్వయకర్త ను సంప్రదించండి లేదా ఆశ్రమాన్ని సందర్శించి నప్పుడు ఏర్పాటు చేయడానికి ముందుగానే మాకు ఇమెయిల్ పంపండి
_____________________________________
3. ప్రశ్న: ఒక పేషెంటు తన వద్ద హోమియోపతి నివారణ ఉందని దానిని వైబ్రియానిక్స్ పై అతనికి ఉన్న విశ్వాసం కారణంగానో లేదా ఆర్థిక పరిస్థితి కారణంగానో పోటెన్ టైజ్ చేయమని అడుగుతున్నారు, దీనికి ఏ పొటెన్సీని ఉపయోగించాలి 200C సరి పోతుందా ?
జవాబు : మీరు హోమియోపతి నివారణను పోటెం టై జ్ చేయవలసి వస్తే ఆ నివారణ యొక్క అసలు పోటేన్సీ కి మాత్రమే వృద్ధి చెయ్యాలి. అయినప్పటికీ, రోగికి నిజంగా వైబ్రియానిక్స్ పై ఎక్కువ నమ్మకం ఉంటే రోగితో పూర్తిగా సంప్రదింపులు చేసి మన నివారణను సిద్ధం చేయటం మంచిది .
_____________________________________
4. ప్రశ్న: రోగ చరిత్రల వ్యాధి నివారణలలో చూస్తే, అభ్యాసకుడు అభివృద్ధిని శాతం రూపంలో తెలియజేస్తూ ఉంటారు ఇది ఎలా గణిస్తారు ?
జవాబు: ఈ గణాంకాలు రోగి నుండి వచ్చినవి. అవి ఖచ్చితమైనవి కాకపోవచ్చు, కానీ అవి మంచి మార్గదర్శిగా పనిచేసి తరచుగా మన చికిత్సకు ప్రయోజనం చేకూరుస్తాయి. అయితే దీనిని గణించడం అంత సులభం కాదు. రోగితో కొంత సంభాషణ తర్వాత మాత్రమే ఈ సమాచారాన్ని అతని నుండి సేకరించవచ్చు.
_____________________________________
5. ప్రశ్న: కొంతమంది రోగులు TDS మోతాదులో ఉన్నప్పుడు CC6.3 Diabetes ను రాత్రి పూట ఒక మోతాదు తీసుకున్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయి తగ్గినట్లు తెలిపారు. దయచేసి రోగితో ఎలా వ్యవహరించాలో సలహా ఇవ్వండి.
జవాబు: రోగి అల్లోపతి ఔషధం కూడా తీసుకుంటున్నారా అన్న దానిపై ఇది ఆధారపడి ఉంటుంది. చాలా మంది రోగులు ఏదో ఒక రకమైన మధుమేహ ఔషధం మీద ఆధారపడి ఉన్నందున మనం జాగ్రత్తగా వ్యవహరించాలి. OD సూచించడం ద్వారా నివారణ ప్రారంభించండి, క్రమంగా TDS వరకు పెంచండి.
_____________________________________
6. ప్రశ్న: క్యాన్సర్ రోగికి అతని వైద్యుడు క్యాన్సర్ తగ్గిపోయిందని చెప్పిన తర్వాత కూడా అభ్యాసకుడు క్యాన్సర్ చికిత్స ను కొనసాగించాలా ?
జవాబు: అవును, ఎందుకంటే మనం ఇచ్చే అన్ని నివారణలకు చికిత్సను క్రమంగా తగ్గిస్తూ వస్తాము; కనుక రోగికి ఈ క్రింది నివారణ ఇవ్వండి:
CC2.1 Cancers – all + CC2.3 Tumours & Growths (అవసరం మేరకు ) + శరీర భాగానికి చెందిన ప్రత్యేక నివారణి…OD 4 వారాలకు తరువాత OW 4 వారాలకు . దీని తరువాత, కేవలం *CC2.1 Cancers – all…నెలకు ఒక మోతాదు చొప్పున 6 నెలలు తరువాత మూడు నెలలకు ఒక మోతాదు చొప్పున సంవత్సరం వరకు చివరగా సంవత్సరానికి ఒక మోతాదు చొప్పున ఏడు సంవత్సరాల వరకు తీసుకోవాలి.
*CC2.1 Cancers – all అనేది తల్లిదండ్రులు మరియు తాత ముత్తాతలలో ఎవరికైనా క్యాన్సర్ ఉన్నట్టయితే ఆ కుటుంబ సభ్యులకు ముందు జాగ్రత్త కోసం మరియు క్యాన్సర్ చికిత్స నుండి బయట పడిన కొత్త రోగులకు కూడా …OW గా నాలుగు వారాలకు, నెలకు ఒక మోతాదు చొప్పున ఆరు నెలల వరకు, మూడు నెలలకు ఒక మోతాదు చొప్పున సంవత్సరం వరకు చివరగా సంవత్సరానికి ఒక మోతాదు చొప్పున ఏడు సంవత్సరాల వరకు తీసుకోవాలి.
సూచన: పైన సూచించిన నివారణలు వాడుతునప్పుడు మూడు రోజుల ముందు లేదా మూడు రోజులు వెనక మరే ఇతర వైబ్రో మిశ్రమాలను తీసుకోకూడదు.
*ఒకవేళ SRHVP మిషను ఉపయోగిస్తే CC2.1 Cancers – all బదులుగా : BR4 Fear + SM1 Removal of Entities + SM2 Divine Protection + SR282 Carcinosin CM ఇవ్వాలి.
_____________________________________
వైద్యులకే వైద్యుడి యొక్క దివ్య వాక్కు
"శరీరము ఒక తాత్కాలిక నివాసం. ఇది అన్ని రకాల వ్యాధులు, గాయాలకు గురి అవుతూనే ఉంటుంది. అయితే ఈ శరీరము మనలను సంసారమనే సాగరాన్ని దాటించే ఒక చక్కని నావ వంటిది. ఈ నావను మంచి స్థితిలో మరియు ప్రయోజనకారిగా ఉంచాలి. మన శరీర సంరక్షణకు అవసరమైన దానికన్నా ఎక్కువగా మన దృష్టిని దేహం వైపు మరల్చ కూడదు. ఇది ఇతరుల భారాన్ని తగ్గించడానికి ఉపయోగించాలి కానీ మనకు మనం భారం కాకూడదు. ఈ దేహాన్ని ఇతరల సేవకు ఉపయోగించుకోవాలి కానీ వారి నుండి సేవలను పుచ్చుకోవడానికి ప్రయత్నించకూడదు ”.
…శ్రీ సత్యసాయిబాబా, అందరినీ ప్రేమించండి, అందరికీ సేవ చేయండి, ఎల్లప్పుడు సహాయం చేయండి, ఎవ్వరిని బాధపెట్టకండి, సత్యసాయిబాబా 81 రోజు 2005 జ్ఞాపకార్థ పుస్తకం నుండి గ్రహింప బడింది.
“సమాజంలో మంచి పేరు సంపాదించండి. సేవేమీ ధ్యేయం కావాలి. సేవ చాలా ముఖ్యమైనది. ఇది వినయాన్ని ప్రోత్సహించడానికి మరియు మానవ జాతి యొక్క ఏకత్వాన్ని మరింత పెంపొందించడానికి సహాయపడుతుంది. ఏకత్వాన్ని ప్రోత్సహించడమే మీ జీవిత లక్ష్యం కావాలి”.
…శ్రీ సత్యసాయిబాబా… అందర్నీ ప్రేమించండి, అందరి కీ సేవ చేయండి, ఎల్లప్పుడూ సహాయం చేయండి, ఎవరినీ బాధించ కండి,.సత్య సాయి బాబా వారి 81 పుట్టిన రోజు జ్ఞాపకార్థం 2005 లో విడుదల చేసి న పుస్తకంనుండి.
ప్రకటనలు
నిర్వహించబోయే శిక్షణా శిబిరాలు
ఇండియా కాకసర్ గడ్ కేరళ : AVP ట్రైనింగ్ 27-28 సెప్టెంబర్ 2014, సంప్రదించవలసిన వారు రాజేష్ రామన్ 8943 351524 లేదా వెబ్సైట్ [email protected]
యూ.కె. లండన్ : చికి త్సా నిపుణులందరి సమావేశము 2014 సెప్టెంబర్ 14 మరియు AVP శిక్షణా శిబిరం 2014 సెప్టెంబర్ 27-28, సంప్రదించవలసిన వారు జరమ్ 020-8551 3979 లేదా వెబ్సైట్ [email protected]
వైబ్రియానిక్స్ శిక్షణ ఇచ్చే వారికి సూచన: శిక్షణా శిబిరాలు కు సంబంధించి ప్రణాళిక సిద్ధం చేసుకుంటే వాటి వివరాలు : [email protected] కు పంపండి.
అదనపు సమాచారం
అభ్యాసకులు పంచుకున్నచిట్కాలు
ఎలక్ట్రానిక్ పరికరాలతో జీవించడం
సెల్ ఫోన్ రేడియేషన్ కు వ్యతిరేకంగా అల్యూమినియం ఫాయిల్ ను కవచంగా ఉపయోగించడం 01644...USA
నేను నా 108 cc బాక్స్ కిట్ ను అల్యూమినియం ఫోయి ల్ తో మూసి వేస్తాను. ఇప్పుడు చాలామందికి సెల్ ఫోన్లు ఉన్నాయి కనుక నేను నివారణలు ఇచ్చేటప్పుడు అల్యూమినియం ఫాయిల్ తోనే ఇస్తాను. కొంతకాలం ఈ ఫాయిల్ ను ఉపయోగించిన తర్వాత దాన్ని కాంతి వైపు తిప్పి చూస్తే దానిలో సన్నని రంద్రాలు ఉన్నాయని నేను గమనించాను. నేను నా సెల్ ఫోనును రంధ్రాలు ఉన్న అల్యూమినియం ఫాయిల్ లో ఉంచి కాల్ చేయగా దాని ధ్వని బయటకు వినిపించింది. కానీ కొత్త ఫాయిల్ లో ఉంచి కాల్ చేయగా ధ్వని వినిపించలేదు. కనుక దళసరిగా ఉన్న ఫాయల్ ఎక్కువకాలం మన్నుతుందేమో చూసి దానితో కొనసాగించడానికి ప్రయత్నిస్తాను.
విద్యార్ధులకు నిద్ర మరియు పరిశుభ్రత 11483…ఇండియా
స్కూల్ మరియు కాలేజీకి వెళ్లే పిల్లలు తమకు తరచుగా తలపోటు మరియు నిద్ర వస్తుందని చెబుతూ ఉంటారు, కనుక అటువంటి పిల్లలకు మనం ఇచ్చే నివారణతో పాటు వారు నిద్రించేటప్పుడు తమ మొబైల్ మరియు లాప్టాప్ దూరంగా ఉంచమని సలహా ఇవ్వాలి .