Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

Vol 2 సంచిక 6
November 2011
ముద్రింప తగిన వార్తాలేఖ


పూర్తి వార్తాలేఖ యొక్క కాగితం ప్రతి కావలెనన్నఈ పుటను ముద్రించండి

డా.జిత్ కే అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి

ప్రియమైన చికిత్సా నిపుణులకు,

వైబ్రియానిక్స్ యొక్క కొత్త వెబ్సైట్ పూర్తిగా తయారైందని, స్వామీవారి జన్మదినోత్సవమైన ఈ రోజు ప్రారంభించబడిందని అత్యంత ఉత్సాహంతోను ఆనందంతోను తెలుపుకున్తున్నాము – www.vibrionics.org. మీకు యుసెర్ నేమ్ మరియు పాస్వర్డ్ తో పాటు ఇమెయిల్ వచ్చియుంటుంది - లాగిన్ చేసి చూసుకోగలరు. మీ ప్రతిపుష్టికి స్వాగతం - సలహాలు, వ్యాఖ్యానాలు లేదా అభినందనలు. తద్వారా ఈ వెబ్సైట్ను మరింత ఉపయోగకరమైనధిగాను, సమాచారమందజేసేదిగాను మరియు ఉపయోగ సౌలభ్యంగల ఒక వేదికగాను తయారు చేయడానికి మాకు సహాయకరంగా ఉంటుంది.  వైబ్రియానిక్స్ కి  సంభందించిన అనుభవాలు, ప్రత్యేకమైన రోగ చరిత్రలు మరియు ఇతర వైబ్రో సంభందిత సమాచారాలు మరియు ప్రశ్నలను పాల్పంచుకోవడానికి ఈ వెబ్సైటును ఒక ఉన్నత వేదికగా తయారు చేయాలని మేము ఆశిస్తున్నాము. స్వామి యొక్క అనంతమైన దీవెనలతో వైబ్రియానిక్స్ నివారణలు ఎంత సమర్థవంతంగా పనిచేస్తాయో మనందరికీ తెలిసినదే. ఇప్పుడు సైబర్ రైలెక్కి ఈ చికిత్సా విధానాన్ని ఇంటర్నెట్ చేరుకొనే దూరాల వరకు తీసుకెళ్ళే సమయం ఆసన్నమైంది!

మీ అందరికి ఒక ముఖ్య గమనిక - భారతదేశంలో ఉన్న మా చికిత్సా నిపుణులు కోసం మేము కొత్త సచివాలయాలు సృష్టించడం జరిగింది. మీ నెలవారీ నివేదికలను, మీరు నివసిస్తున్న రాష్ట్రం ప్రకారముగా (మీరు శిక్షణ పొందిన రాష్ట్రం ఏదైనప్పటికీ) క్రింది ఈ-మెయిల్ చిరునామాలకు మాత్రమే పంపవలసిందిగా కోరుకుంటున్నాము. మీ నివేదిక యొక్క ప్రతిని ఇతర ఈ-మెయిల్ చిరునామాలకు పంపరాదు మరియు క్రింద ఇవ్వబడిన రూపనిరూపణలో మాత్రమే మీ నివేదికలను పంపవలెను. మీ నివేదికలతో పాటు ఏ విధమైన జోడింపులను పంపవద్దు. సూచించిన రూపనిరూపణలో, మీ ఈ-మెయిల్ యొక్క ప్రధానభాగంలో మీ నివేదికను నకిలీ చేసి పంపాలి.

భారతదేశంలోనున్న సచివాలయాలు

ఆంధ్ర ప్రదేశ్ ……..[email protected]                         కర్ణాటక …..............….[email protected]

అస్సాం ……..[email protected]                           కేరళ ………….……..[email protected]

ఢిల్లీ- ఎన్ సి ఆర్.…[email protected]                     మహారాష్ట్ర & గోవా ….[email protected]

గుజరాత్............ [email protected]                            రాజస్తాన్….…………….[email protected]

హర్యానా ……….[email protected]                             సిక్కిం …………..…….  [email protected]

జె & కే …………[email protected]                               ఉపీ & ఉకె ……...……….[email protected]

భారతదేశంలోనున్న చికిత్సా నిపుణులందరు పంపవలసిన ఈ-మెయిల్ చిరునామా: [email protected]

ఇతర దేశాలలో ఉన్న సచివాలయాలు

 ఇటలీ దేశంలోనున్న నిపుణులు పంపవలసిన ఈ-మెయిల్ ఐడీ:………….…[email protected]

 పోలాండ్ దేశంలోనున్న నిపుణులుపంపవలసిన ఈ-మెయిల్ ఐడీ ………….[email protected]

 ఇతరదేశాలలో ఉన్న నిపుణులు పంపవలసిన ఈ-మెయిల్ ఐడీ ……………...[email protected]

నివేదిక యొక్క నిర్దిష్ట ఆకృతి

                                                        నెల యొక్క నెలవారీ నివేదిక    

పేరు: ___________________________నమోదు సంఖ్య: ____________      

ఈ నెలలో సేవ గంటలు: _____           

చికిత్సివ్వబడిన రోగుల సంఖ్య : పాత  ___ + కొత్త ___ + జంతువులు ___+ మొక్కలు ____అసాధారణ రోగ చరిత్ర (ఉంటే కనుక):

మీరు ఇతర ఈ-మెయిల్స్ ను పంపడానికి మేము ప్రత్యేక ఐడీలు సృష్టించాము. తాఱుమాఱును తప్పించడానికై మరియు జవాబు వేగంగా పొందడానికై మీరు సంభందిత మెయిల్స్ను తగిన ఐడీలకు పంపవలసిందిగా కోరుతున్నాము. 

రోగ చరిత్రలు. ఈ శీర్షక క్రింద అత్యుత్తమ ఫలితాలు లభించిన రోగ చరిత్రలు మాత్రమే మాకు పంపవలెను. ఇటువంటి చరిత్రలు పంపే సమయంలో రోగులలో రోగం లేదా రోగ లక్షణాల యొక్క కాలవ్యవధి మరియు చికిత్స పొందే సమయంలో, రోగ లక్షణాల లేదా వ్యాధి యొక్క మెరుగుదల(శాతం) వంటి వివరాలను పంపవలెను. చర్మ సమస్యలకు చికిత్సను అందిస్తున్న సమయంలో, చికిత్సకు ముందు మరియు తర్వాత, చర్మ రోగంతో ప్రభావితమైన ప్రాంతాలను (తగిన సందర్భాలలో) ఫోటో తీసి పంపడం మంచిది. ఇతర రోగ చరిత్రలలో వైద్యుడిచే ఇవ్వబడిన నివేదికను పంపవలెను. మీరు భారతదేశంలో నివసిస్తుంటే కనుక, రోగ చరిత్రలను  [email protected]కు పంపవలెను. మీరు ఇతర దేశాలలో నివసిస్తుంటే కనుక, [email protected] కు పంపవలెను.

మేము మన వైబ్రియానిక్స్ వెబ్సైట్ కొరకు రోగ చరిత్రలను నిర్మిస్తున్నాము, కాబట్టి రోగ చరిత్రలను వెబ్సైట్లో ప్రచురణకు సమర్పించాలని మీరు భావిస్తే కనుక, పైన ఇవ్వబడిన చిరునామాకు పంపవలెను.

రోగుల సందేహాలు: మీరు భారతదేశ నివాసియైతే, రోగుల సమస్యలకు సంభందించిన సలహాలు, వాళ్లకి ఇవ్వవలసిన మిశ్రమాలు మరియు నివారణలు వంటి వివరాలు క్రింది ఈ-మెయిల్ చిరునామా వద్ద, మా ప్రత్యేక బృందం నుండి మీరు పొందవచ్చు: [email protected]

విదేశాలలో నివసించేవారు సలహాల కొరకు సంప్రదించవలసిన ఈ-మెయిల్ చిరునామా: [email protected]

చికిత్సా నిపుణుల వివరాలు: విదేశాలలో ఉన్న చికిత్సా నిపుణుల చిరునామాల కొరకు,   [email protected] వద్ద సంప్రదించండి. భారతదేశంలోనున్న చికిత్సా నిపుణుల చిరునామాల కొరకు [email protected] ను సంప్రదించండి.

మరోసారి మీయందరికీ ఒక జ్ఞాపిక: మేము మిమ్మల్ని సులభంగా గుర్తించడానికి వీలుగా, మాకు పంపే ప్రతియొక్క ఈ-మెయిల్ యొక్క విషయ సూచిక లైన్లో మీ ప్రత్యేక నమోదు సంఖ్యను వ్రాసి పంపవలసిందిగా కోరుతున్నాము. ఇలా చేయడం ద్వారా మీరు మా వద్దనుండి ప్రత్యుత్తరాన్ని వెంటనే పొందవచ్చు. వైబ్రియానిక్స్ సేవా రంగంలో ప్రస్తుతం 4000 వేలకు పైగా చికిత్సా నిపుణులు ఉన్నారు (రోజురోజుకి ఈ సంఖ్య పెరుగుతోంది), ఈ కారణంగా  భవిష్యత్తులో మేము అనామిక ఈ-మెయిల్స్ కు ప్రత్యుత్తరాలు ఇవ్వక పోవచ్చు.  ప్రత్యేక నమోదు సంఖ్య లేన ఈ-మెయిల్స్ అన్ని కూడను అనామిక ఈ-మెయిల్స్ అని భావించబడతాయి.

ఇటీవల, పోలిష్ చికిత్సా నిపుణులు పోలాండ్లో ఉన్న సోబోట్కాలో పునరధ్యయన శిబిరంలో పాల్గొన్నారు. రెండు దినాలు జరిగిన ఈ శిబిరంలో అమోఘమైన ప్రతిపుష్టి లభించింది. అరవైకి పైగా చికిత్సా నిపుణులు ఈ శిబిరంలో పాల్గొని, వైబ్రియానిక్స్ మిశ్రమాలతో వాళ్ళ అనుభవాలను పాల్పంచుకున్నారు. వీళ్ళల్లో కొంతమంది అత్యద్భుతమైన కొన్ని రోగ చరిత్రలను వివరించారు. ఇటువంటి చరిత్రలను మేము తదుపరి వార్తాలేఖల్లో మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాము. ఇటువంటి సదస్సులు ఉపయోగకరమైన సమాచారం అందచేసివిగాను, అందరిని ఉత్తేజపర్చేవిగాను ఉంటాయి - మీరుంటున్న ప్రాంతంలో ఇటువంటి సదస్సును ఏర్పాడు చేయాలని మీరు ఆశిస్తే కనుక, మాకు తెలియ చేయగలరు. మేము ఇతర చికిత్సా నిపుణులను సంప్రదించి సదస్సు ఏర్పాడు చేయడానికి సహకరిస్తాము.

చివరిగా ఒక చిన్న గమనిక...మేము వైబ్రియానిక్స్ సాధనను 1994 నుండి చేస్తునప్పటికి, 2011లో అధికారికంగా వైబ్రియానిక్స్ అన్న పేరును మన శ్రేయోభిలాషియైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి గౌరవార్ధం, సాయి వైబ్రియానిక్స్ గా మార్చబడింది.. స్వామి ప్రసాదిస్తున్న అత్యంత ప్రేమకు, అపారమైన కృపకు, మార్గధర్శకత్వానికి మరియు మనమందరము నిస్వార్థ సేవనంధించే మానవులను నయం చేస్తున్నందుకు స్వామికి మేము నిత్యము కృతజ్ఞతతో ఉంటాము. మీ సాధనములుగా మమ్ము ఎంచుకున్నందుకు మా ధన్యవాదాలు, స్వామి.

సాయి సేవలో,

జిత్ కే అగ్గర్వాల్

దీర్ఘకాలిక జ్వరలక్షణము 02786...Russia

అర్జంటినాకు చెందిన 34 సంవత్సరాల వయస్సు గల ఒక మహిళ ప్రశాంతి నిలయంలో ఉన్న వైబ్రో చికిత్సా నిపుణులను క్రింది రోగ లక్షణాల చికిత్స కొరకు సంప్రదించింది: గత 14 సంవత్సరాల పాటు నిరంతర జ్వరం, గొంతు నొప్పి, శ్వాసనాళాల వాపు వంటివి. ఈమె వైద్యులు సలహాపై రక్త పరీక్షలతో సహా వివిధ పరీక్షలు చేయించుకున్నప్పటికి, వైద్యులు రోగనిదానము చేయలేకపోయారు. రోగితో మాట్లాడిన తర్వాత, చికిత్సా నిపుణులు, ఈమెకు ఇరవై సంవత్సరాల వయసున్నప్పుడు ఈమె యొక్క స్నేహితుడు తీవ్రమైన మలేరియా జ్వరంతో భాధపడినప్పుడు, ఆశ్పత్రిలో మూడు రోజులు అతనికి తోడుగా ఉండి సేవ చేసిందని తెలిసింది. ఈమెకున్న జ్వరలక్షణం ఆ సమయం నుండి ప్రారంభమైంది. అయితే, ఆ సమయంలో మలేరియా పరీక్ష చేయించుకుంటే మలేరియా లేదని తెలిసింది.

ఈమె భావావేశపూరితమైన వ్యక్తి కాబట్టి, తనకు ప్రియమైన వ్యక్తి అనారోగ్యంతో భాదపడుతున్న సమయంలో ఒత్తిడి మరియు భయాలకు గురియైన కారణంగాను, ఇతర మలేరియా రోగులున్న వాతావరణంలో ఉన్న కారణంగాను, మలేరియా వ్యాధి యొక్క వైబ్రేషణ్ (స్పందనం) ఆమె యొక్క ప్రాణమయకోశము లేదా ఛాయాదేహములోకి ప్రవేశించిందని చికిత్సా నిపుణులు తలచి క్రింది వైబ్రో మిశ్రమాలను ఈ రోగికి ఇచ్చారు:
CC9.2 Infections acute + CC9.3 Tropical diseases…TDS

అనేక సంవత్సరాల పాటు కొనసాగుతున్న జలుబు మరియు జ్వర లక్షణాల కొరకు CC9.2 Infections acute ఇవ్వబడింది. CC9.3 Tropical diseases ఇవ్వడం ద్వారా  మలేరియా నుండి రోగికి ఉపశమనం కలుగుతుందని నిపుణులు ఆశించారు. చికిత్స ప్రారంభించిన మూడు రోజుల తర్వాత, బలమైన తీసివేత (పుల్ అవుట్) కారణంగా రోగికి తీవ్రమైన వాంతులు ప్రారంభమయ్యాయి. ఆపై వారం రోజుల తర్వాత తన స్వదేశమైన అర్జంటినాకు తిరిగి చేరుకున్న రెండు వారాలకు, చికిత్సా నిపుణులకు ఈ-మెయిల్ ద్వారా తనకు పూర్తిగా నయమైందని వారికి కృతజ్ఞ్యతలు తెలిపుకుంది.

కాలిపిక్కయొక్క ముందఱిభాగములో అస్థిమధ్యశోథ 02786...Russia

కాలిపిక్కయొక్క ముందఱిభాగములో అస్థిమధ్యశోథతో భాదపడుతున్న అజెర్బైజాన్ నుండి వచ్చిన ఒక 59 సంవత్సరాల వయసు గల ఒక మహిళ చికిత్స కొరకు నిపుణులను సంప్రదించింది. అస్థిమధ్యశోథ - సాధారణంగా అంటువ్యాధి కారణంగా కలిగే ఎముక యొక్క శోధము మరియు చీము కారుట. ఈ రోగి యొక్క కాలిపిక్కయొక్క ముందఱిభాగము నిర్జీవమైన మరకలతో పాటు నీలం మరియు భూడిద రంగులో ఉంది. ఎముక లోపల వైపున చీము కారుతున్న మూడు భగందరము/నాళవ్రణాలున్నాయి. వంకర  పడిన కాలి వేళ్ళకు రక్త ప్రవాహం సక్రమంగా జరగనందువల్ల రోగికి నడిచేడప్పుడు నొప్పిగా ఉండేది.

రోగికున్న ఈ సమస్య యొక్క చరిత్ర: రోగి తన బాల్యంలో ఒక పిల్లల గృహంలో పెంచబడింది. ఆ సమయంలో కఠోర వ్యవహారాన్ని ఎదుర్కొన్న ఈ రోగి సంతోషం లేని బాల్యాన్ని గడపవలసి వచ్చింది. పది సంవత్సరాల వయసులో ఒక ఎత్తైన స్థలం నుండి దూకడం కారణంగా తన కుడి పాదం తీవ్రంగా గాయపడింది. ఈ గాయాన్ని సరిచేయడానికి ఈమెకు శస్త్రచికిత్స చేయబడింది కాని, దీని కారణంగా కండరాల భాలహీనత ప్రారంభమైంది. అల్లోపతి డాక్టర్లు రోగికున్న ఈ సమస్యకి కారణం పోలియో వ్యాదియని నిర్ధారణ చేసారు. రోగికి ముప్పై సంవత్సరాల వయసులో శస్త్ర చికిత్సతో బాటు అల్లోపతి వైద్యం చేయబడింది కాని సఫలితం లభించలేదు. ఆ తర్వాత డాక్టర్లు ఈమెకు ఆస్టియోమైలిటిస్ అని నిర్ధారణ చేసారు. చికిత్సా నిపుణుడను సంప్రదించడానికి ఐదు సంవత్సరాల ముందు రోగికి వైద్యులు పరిస్థితి క్షీణిస్తున్న కారణంగా కాలును చేదించాలని చెప్పారు.

చికిత్సా నిపుణులు క్రింది మందులను ఇవ్వడం జరిగింది:
#1. CC15.1 Mental & Emotional tonic + CC18.1 Brain disabilities…TDS 

#2. CC20.6 Osteoporosis…6TD

మందు ప్రారంభించిన ఒక వారం తర్వాత రోగి, కాలి వేళ్ళల్లో కొంత నొప్పి ఉన్నప్పటికీ సులభంగా నడవ గలిగింది. ఈమెకు #2 గోలీల సీసాకు బదులు క్రింది మందు ఇవ్వబడింది:
#3. CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue + CC20.6 Osteoporosis…TDS మరియు

#4. CC21.11 Wounds & Abrasions…TDS (నూనిలో కలిపి చీము కారుతున్న భగందరముల(ఫిస్త్యులా) పై రాయడానికి.

మూడు వారాల తర్వాత రోగి పాదం యొక్క రంగు సాధారణ రంగులో మారింది. భగందరము నుండి కొద్దిగా చీము కారటం కొనసాగడం వల్ల చికిత్సా నిపుణుడు క్రింది మందులను ఇచ్చారు:
#5. Nosode of pus from fistulas…6TD

రెండు నెలల తర్వాత కాలిపిక్క యొక్క రంగు కూడా సాధారణ రంగులోకి మారింది. అంతకు ముందు చీము కారుతున్న  భగందరములలో రెండు పూర్తిగా నయమైపొయాయి. ఒక భగందరము నుండి మాత్రం చీముకు భధులుగా ద్రవం కారింది. చికిత్సా నిపుణులు #1 ను ఆపి మరిన్ని #3 మరియు #5 సీసాలను ఇచ్చారు.

అనేక సంవత్సరాల నుండి భాదపడుతున్న వ్యాధి నుండి ఉపశమనం కలిగినందుకు ఈ రోగి చాలా సంతోషపడింది.

దీర్గకాలిక జలుబు సమస్య 02786...Russia

రషియాకు చెందిన 47 సంవత్సరాల వయసున్న ఒక మహిళ తన తలనొప్పి మరియు జలుబు సమస్యలకు చికిత్స కోరుతూ చికిత్సా నిపుణులను సంప్రదించింది. ఈమెకు క్రింది వైబ్రో మందులు ఇవ్వబడినాయి:
CC9.2 Infections acute + CC9.3 Tropical diseases…TDS

మూడు రోజుల తర్వాత రోగికి జలుబునుండి కొంత వరకు ఉపశమనం కలిగింది కాని తలనొప్పి తగ్గలేదు. కొంత సేపు జాగ్రతగా ప్రశ్నించిన తర్వాత, 18 నెలల క్రితం ఆమెకు ఒక కారు ప్రమాదం సంభవించిందని తెలియచేసింది. ప్రమాదంలో కారు పూర్తిగా నశించింది కాని ఆమె గాయపడలేదు. రోగికున్న రోగ లక్షణములు అదే సమయం నుండి ప్రారంభం అయ్యాయని నిపుణులు గ్రహించి క్రింది మందులను ఇచ్చారు:
CC15.1 Mental & Emotional tonic + CC18.1 Brain disabilities…OD

దాదాపు మూడు నిమిషాల తర్వాత రోగి స్పృహ కోల్పోయింది. అయితే పది నిమిషాలలో స్పృహ తిరిగి వచ్చింది. ఆమెకు చాలా బలహీనంగా ఉన్నట్లు భావన కలిగింది. ఆమె భర్త యొక్క సహాయంతో వారు నివసిస్తున్న గదికి తిరిగి చేరుకొని విశ్రాంతి తీసుకుంది. మరుసటి రోజు ఈ రోగి చికిత్సా నిపుణులను కలిసి, 18 నెలలుగా ఆమెకున్న రోగ లక్షణములు పూర్తిగా తొలగిపోయాయని ఎంతో ఆనందంగా తెలిపింది.

కంటికి గాయం 02711...Malaysia

62 సంవత్సరాల వయసుగల ఒక మహిళ ప్రమాదవశాత్తు కళ్ళజోడు యొక్క కొసతో తన ఎడమ కంటిని పొడుచుకుంది. దీనివల్ల కంటిలో ఒక రక్తనాళం పగిలిపోయి, కంటిగుడ్డు పూర్తిగా ఎర్రబడి వాచిపోయింది. ఈ విధంగా ఎర్రబడిన కంటిని ఇతరులు చూడకుండా మరియు పిల్లలు భయపడకుండా ఉండడానికి ఈమె నల్ల కళ్ళద్దాలు పెట్టుకునేది. ఈమె యొక్క వైద్యుడు ఈమెకు పెయిన్ కిల్లెర్లు మరియు ఆంటిబయాటిక్లు ఇచ్చి మరో మూడు వారాలలో ఈమెకు పూర్తిగా తగ్గే అవకాశముందని చెప్పారు. వైధ్యుడను సంప్రదించిన మూడు రోజుల తర్వాత, వైధ్యుడుచే ఇవ్వబడిన మందుల కారణంగా రోగికి వికారం కలగడం వల్ల, వైబ్రో చికిత్సా నిపుణులను సంప్రదించింది. ఈమెకు క్రింది మందులు ఇవ్వబడినాయి:
NM17 Eye + BR 20 Eye + BR21 Injury + SM41 Uplift…TDS

మూడు రోజుల తర్వాత కంటి ఎరుపు పూర్తిగా తగ్గిపోయింది. ఒక వారం రోజులలో రోగి యొక్క కన్ను సాధారణమైన స్థితికి చేరుకోవడంతో ఆమె చాలా సంతోషపడింది.

గమనిక:
పైనున్న మందులకు బదులుగా 108 కామన్ మిశ్రమాల పెట్టెలో ఉన్న CC7.1 Eye tonic + CC7.6 Eye injury ఇవ్వవచ్చు.

హాడ్కిన్ వ్యాధి 00660...USA

హాడ్కిన్ వ్యాధి ఉందని వైధ్యులచే నిర్ధారించబడిన ఒక 65 సంవత్సరాల వయసుగల ఒక మహిళ చికిత్సా నిపుణుడను సంప్రదించింది. ఈమె గత రెండు సంవత్సరాలుగా అల్లోపతి వైద్యం చేయించుకుంటోంది. ఈ రోగికి క్రింది మందులు ఇవ్వబడినాయి:
NM6 Calming + NM59 Pain + NM63 Back up + NM110 Essiac + BR2 Blood Sugar + BR3 Depression + SM5 Peace & Love Alignment + SM13 Cancer + SM24 Glandular + SM40 Throat…6TD for two weeks then TDS.

రెండు వారాల లోపు రోగికి మనశ్శాంతి కలిగింది. ఆపై నాలుగు నెలల వరకు వైబ్రో మందులను తీసుకోవడం కొనసాగించి రక్తపరీక్ష చేయించు కావడంతో వ్యాధి సమస్య పూర్తిగా తొలగినట్లు తెలిసింది. గత ఆరు సంవత్సరాలుగా ఈ మహిళ క్యాన్సర్ నుండి విముక్తి పొందింది.

గమనిక :
పైనున్న మందులకు బదులుగా  CC2.1 Cancers ఉపయోగించవచ్చు.

స్కూల్లో తక్కువ మార్కులు 01159...Croatia

ప్రవర్తన లోపం, నేర్చుకోవడంలో లోపం మరియు స్కూల్ పరీక్షల్లో తక్కువ మార్కులు తెచ్చుకుంటున్న ఒక పది సంవత్సరాలు వయసుగల ఒక బాలికను చికిత్సా నిపుణుడు వద్దకు తీసుకు వెళ్ళడం జరిగింది. ఈ బాలికకు క్రింది మందులు ఇవ్వబడినాయి:
NM5 Brain tissue salts + NM104 Tops…TDS

ఈ మందును తీసుకున్న ఒక నెల తర్వాత బాలిక స్థిమితపడి, స్కూల్లో "A" గ్రేడులు తెచ్చుకుంది. బాలికలో కలిగిన అభివృద్ధిని చూసి అధ్యాపకురాలు ఆశ్చర్యపోయి బాలిక యొక్క తల్లిని ఆమెలో వచ్చిన మార్పుకు కారణం ఏమిటని అడిగింది!

గమనిక :
పైనున్న మందులకు బదులుగా  CC17.3 Brain & Memory tonic ఉపయోగించవచ్చు.

మూత్రపిండంలో అంటువ్యాది 01159...Croatia

28 ఏళ్ళు వయసుగల ఒక మహిళ చికిత్సా నిపుణుడను విపరీతమైన నొప్పి మరియు నెఫ్రైటిస్ - బాక్టీరియా ద్వారా మూత్రపిండంలో కలిగిన అంటురోగం మరియు సిస్టైటిస్ - తరచుగా మంటతో కూడిన మూత్రవిసర్జన. ఈ రోగికి క్రింది మందులను ఇవ్వడం జరిగింది:
#1. NM21 KBS + BR11 Kidney...TDS

#2. SR296 Ignatia...Single dose

ఒక రోజులోనే ఈమెకు చాలా వరకు ఉపశమనం కలిగి, మూడు రోజుల్లో పూర్తిగా వ్యాధి నయమైంది. వ్యాధి తిరిగి శోకకుండా ఉండడానికి ఈ మందు నెల రోజుల వరకు కొనసాగించబడింది.

గమనిక :
పైనున్న మందులకు బదులుగా CC13.2 Kidney & Bladder infections ఉపయోగించవచ్చు.

జవాబుల కార్ర్నేర్

ప్రశ్న: నిరంతరం నిద్రలేమి సమస్యతో భాదపడుతున్న రోగులకు, తగిన మందును ఇవ్వవచ్చా? ఇవ్వచ్చంటే, రోగులు రోజుకి ఈ మందును మూడు సార్లు తీసుకోవాలా లేదా నిద్రించడానికి ముందు తీసుకోవాలా?

జవాబు: దీర్ఘకాలంగా నిద్రలేమి సమస్యున్న వారికి లేదా ఒత్తిడి కారణంగా తాత్కాలికంగా ఈ సమస్య వచ్చిన వారికి CC15.6 మందును ఇవ్వవచ్చు. మన వైబ్రో మందు అల్లోపతి మందుల వలె వ్యసనాత్మకమైనది కాదు. నిద్రించడానికి అరగంట ముందు ఈ మందును తీసుకోవాలి. తీసుకున్న తర్వాత నిద్రపట్టన సందర్భంలో మరో సారి తీసుకోవచ్చు. ఈ విధముగా నిద్రపట్టేంత వరకు ప్రతి అరగంటకి ఒకసారి తీసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం నాలుగు సార్లు ఈ మందును తీసుకోవచ్చు. మధ్యరాత్రిలో మెలుకువ వచ్చి తిరిగి నిద్ర పట్టక పోతే కనుక మరొక సారి మందును తీసుకోవచ్చు.

సాయిరామ్ హీలింగ్ వైబ్రేషణ్ మశీనును ఉపయోగించే చికిత్సా నిపుణులు ఇవ్వవలసినవి:
NM6 Calming + NM28 Sleep + SM5 Peace & Love Alignment + SM37 Sleep + SM39 Tension + SR275 Belladonna (30C) + SR303 Opium + SR306 Phosphorus (30C) + SR309 Pulsatilla (30C).

_____________________________________

ప్రశ్న: నేను రొంప, జ్వరం నుండి ఈ మధ్యే కోలుకున్నాను కాని ఇప్పుడు నాకు జుట్టు రాలే సమస్య మొదలయింది. నేను ఏ మిశ్రమాన్ని(మందు) తీసుకోవాలి?

జవాబు:  జుట్టు రాలిపోయే సమస్యకు తీసుకోవాల్సిన మిశ్రమం CC11.1 లేదా CC11.2. జలుబు,జ్వరం వంటి లక్షణాల తర్వాత జుట్టు రాలడం కాని లేదా బలహీనత కారణంగా జుట్టు రాలడం కాని జరిగితే CC11.1 ఇవ్వాలి. దీర్ఘకాలంగా ఈ సమస్యున్న సందర్భంలో CC11.2 ఇవ్వవలెను. అస్వస్థత కారణంగా ఈ సమస్య వచ్చియుంటే కనుక CC12.1 ఇవ్వాలి. రోగికి అనీమియా (రక్తహీనత) సమస్య ఉండియుంటే కనుక CC3.1 సహాయపడుతుంది. సాయిరామ్ హీలింగ్ వైబ్రేషణ్ మశీనును ఉపయోగించే చికిత్సా నిపుణులు ఇవ్వవలసినవి ::

NM2 Blood + NM12 Combination-12 + NM22 Liver +  NM75 Debility + NM84 Hair Tonic + OM12 Hair + SM6 Stress + SM25 Hair + SM41 Uplift + SR264 Silicea + SR408 Secale Corn (30C).

_____________________________________

ప్రశ్న:  నా రోగులలో ఒకరు ఆయుర్వేద ఔషధాలు తీసుకుంటున్నారు. సాయి వైబ్రియానిక్స్ చికిత్స మొదలుపెట్టగానే అతను ఆయుర్వేద మందులను ఆపివేసే అవసరముందా?  వైబ్రో మందులను ఆయుర్వేదం లేదా హోమియోపతి మందులతో ఇవ్వరాదని శిక్షణా శిబిరంలో మా శిక్షకులు మాకు చెప్పారు.

జవాబుఅవును. ఆ రోగి ఆయుర్వేద మందులను ఆపితే మంచిది. సాధారణంగా, సాయి వైబ్రియానిక్స్ మందులు ఆయుర్వేదం లేదా హోమియోపతి మందులతో పాటు ఇవ్వడం సురక్షితం కాదు. అయితే వైబ్రేషన్లు అల్లోపతి మందులతో కలిసి అనుకూలంగా పనిచేస్తాయి కనుక అల్లోపతి మందులతో పాటు ఇవ్వవచ్చు. మరింత వివరమైన సమాధానం కొరకు "మాన్యువల్ ఫర్ వైబ్రియానిక్స్ ప్రాక్టీశనెర్స్" (చికిత్సా నిపుణులకైన చిన్నపుస్తకం) పుస్తకాన్ని చూడండి.

_____________________________________

ప్రశ్న:  ఒక సాయి భక్తుడి 23 సంవత్సరాలు వయసుగల కుమారత్తేకు, మెదడులో అంటురోగం శోకితే అల్లోపతి వైద్యం చేసారు. ఆ మహిళ కోలుకుంది కాని తరచు విపరీతమైన తలనొప్పితో భాధపడుతోంది. ఆమె వైబ్రో మందు కొరకు నన్ను సంప్రదించింది. ఆమెకు ఏ మిశ్రమాల కలయిక ఇవ్వాలని నాకు ఖచ్చితంగా తెలియలేదు.

జవాబు: ఆ రోగికి CC11.4 Migraines + CC18.1 Brain & Emotional tonic ఇవ్వవలెను. ఎందుకంటే ఈ రెండు మిశ్రమాలలోను మెదడుకి సంభందించిన మందులు ఉన్నాయి. మీ వద్ద సాయిరామ్ హీలింగ్ వైబ్రేషణ్ మశీనుంటే కనుక మీరు ఇవ్వవలసినవి: NM5 Brain TS + NM6 Calming + NM44 Trigeminal Neuralgia + NM85 Headache-BP + OM13 Trigeminal + SR275 Belladonna (30C) + SR273 Aurum Met + SR295 Hypericum (30C) + SR359 Zincum Met + SR458 Brain Whole + SR468 CN5: Trigeminal.

_____________________________________

ప్రశ్న:  నా భర్త రెండుసార్లు గుండెపోటు వచ్చిన ఒక గుండె రోగి. అతనికి మధుమేహ సమస్య కూడా ఉంది. నేను అతనికి  CC3.1 Heart tonic + CC6.3 Diabetes ఇస్తున్నాను. అతనికి CC3.4 కూడా ఇచ్చే అవసరముందా? ప్రతి వ్యక్తికి రెండు మిశ్రమాల కన్నా అధికంగా ఇవ్వరాదని మాకు సలహా ఇవ్వబడింది, అందువల్ల మరొక మిశ్రమం చేర్చవచ్చా? నా భర్తకు సాయి వైబ్రియానిక్స్ పై విశ్వాసం లేదు కనుక నేను వైబ్రో మందులను నీటిలో కలిపి ఇస్తున్నాను. ఇలా చేయడం అతనికి సహాయపడుతుందా? దయచేసి సలహా ఇవ్వండి.

జవాబు: మీ భర్తకు CC3.1 Heart tonic ఇవ్వడం కొనసాగించండి. కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే, CC3.4 ఇవ్వవలెను. CC6.3 Diabetes కూడా కొనసాగించండి, అయితే అతను క్రమం తప్పకుండా రక్తంలో చక్కర స్థాయిని పరీక్ష చేసుకుంటూ ఉండడం చాలా ముఖ్యం. ఎందుకంటే మధుమేహం సంభందించిన వైబ్రో మందును తీసుకుంటున్న రోగులలో కొన్ని సార్లు వారు తీసుకొనే ఇన్స్యులిన్ మోతాదును తగ్గించ వలసియుంటుంది. రెండు కన్నా ఎక్కువ మిశ్రమాలను, కేవలం అధిక అనుభవమున్న చికిత్సా నిపుణులు మాత్రమే ఇవ్వవలెను మరియు అవసరముంటే మాత్రమె ఇవ్వవలెను. మీ భర్తకు వైబ్రియానిక్స్ పై నమ్మకం లేనప్పటికీ, ఈ మిశ్రమాలు అతనికి ఖచ్చితంగా సహాయపడతాయి మరియు మీకున్న ధృడ విశ్వాసం ద్వారా అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. వైబ్రియానిక్స్ చికిత్సా విధానాన్ని బాబా పలు మార్లు దీవించారని మరియు నయంచేసేది బాబానే కనుక అత్యద్భుతమైన ఫలితాలు ప్రతిరోజు లభిస్తూనే ఉన్నాయని మీరు గుర్తుంచుకోవాలి.

దివ్య వైద్యుడి యొక్క దివ్య వాక్కు

“దైవానుగ్రహాన్ని సంపాదించదానికి మూడు రకముల క్రియలు చేయాలి: (1) నిస్వార్థంగా చేసే క్రియలు (2) నిస్వార్థ ప్రేమ (3) పరిశుద్ధమైన/స్వచ్చమైన హృదయాల నుండి వెలువడే ప్రార్థనలు. ఇటువంటి క్రియలు నేరుగా దైవాన్ని చేరుకుంటాయి. మిగిలిన క్రియలు అధ్యక్షత వహించే వివిధ దేవతలచే అనుగ్రహింపబడతాయి. అందువల్ల ప్రార్థనలు నిస్వార్థమైనవిగాను, ప్రేమపూరితంగాను ఉండాలి. మనం ప్రార్థన చేసినప్పుడు మన దృష్టి ఫలితాల పై ఉండకూడదు.”
-సత్య సాయి బాబా, "థాట్ ఫర్ ది డే", జులై 23, 2011, ప్రశాంతి నిలయం

 

 

 

అహంకారం అధికంగా ఉన్న వ్యక్తులు ఇతరుల పై అధికారం చెలాయించడానికి ఇష్టపడతారు. ఇటువంటి వ్యక్తులు ప్రపంచాన్ని స్వార్థం మరియు స్వీయ ప్రేమను దృష్టిలో పెట్టుకొని చూస్తారు." నా మాటలు నిజమైనవి", " నా అభిప్రాయమే సరియైనది", "నేను చేసే పని సరియైనది", ఇటువంటి ప్రవర్తన ఆధ్యాత్మిక సాధకులకు హానికరమైనది. సాధకులు, విమర్శలు మరియు సలహాల కోసం ఆత్రుతతో ఎదురుచూడాలి. అంతే కాకుండా, సాధకులు, కోపానికి, ప్రతీకారానికి దారితీసే చర్చలు మరియు వాగ్వాదాలు వంటివి చేయరాదు. ప్రపంచం నుండి గౌరవం సంపాదించడానికి పోరాడవద్దు. ఈ ప్రపంచం నుండి మీకు, మీ గొప్పతనానికి గుర్తింపు లేకపోతే, నిరాశ చెందడం లేదా కోపించడం సరికాదు.  ఆధ్యాత్మిక మార్గంలో విజయాన్ని సాధించాలంటే, ఈ సంగతిని మీరు అన్నిటికంటే ముందు నేర్చులోవాలి. మీచే దారి మళ్ళించి, మీ పురోగతికి ప్రమాదం కలిగిస్తుంది కనుక, ఎవరైనా మిమ్మల్ని స్తుతించినప్పుడు పొంగిపో రాదు."
-సత్యసాయి బాబా , "థాట్ ఫర్ ది డే", అక్టోబెర్ 28, 2011, ప్రశాంతి నిలయం

ప్రకటనలు

భారతంలో జరగనున్న శిక్షణా శిబిరాలు

2011 నవంబెర్ 26 నుండి 27 వరకు, నాగపూర్, మహారాష్ట్రలో - ప్రస్తుత AVPలకు శిక్షణా శిబిరం. డా.ఏ. ఘటోల్ ను ఈ ఫోను ద్వారా సంప్రదించండి: 9637-899 113 లేదా 9423-424 126 లేదా రాజన్ జోషి, ఫోను : 9422-548 910.

2011 నవంబెర్ 26 నుండి 27 వరకు, అలువా,కేరళాలో  - ప్రస్తుత AVPలకు శిక్షణా శిబిరం. సంప్రదించవలసిన వ్యక్తి ఎం.పంకజాక్షన్,ఫోను: 0480-282 0789 లేదా 9995-788 035.

2011 డిసెంబెర్ 17 నుండి18 వరకు, శ్రీకాకుళం, ఆంద్రప్రదేశంలో – ఈ చికిత్సా విధానాన్ని నేర్చుకోవడానికి కొత్తగా వచ్చినవారికి. మీ రాష్ట్ర సేవాదళ సమన్వయకర్త, శ్రీ రా.లక్ష్మణ రావుగారిని సంప్రదించండి : 9440-168 606 లేదా ఈ-మెయిల్ చిరునామా: [email protected] లేదా మీ జిల్లా అధ్యక్షుడైన జీ. రమణ బాబుగారిని సంప్రదించండి: 9394-769 108.

సమస్త శిక్షకులకు: మీరు శిక్షణా శిబిరం జరపాలని అనుకుంటే కనుక, వివరాలను [email protected] 

అదనంగా

ఆరోగ్య చిట్కాలు

కండరాల నొప్పిని నయం చేసే అల్లం

అల్లం, వికారం, అజీర్ణం వంటి సమస్యలకు సాంప్రదాయక ఔషధంగా భారత మరియు చైనా దేశాలలో దీర్ఘకాలంగా ఉపయోగపడుతోంది. అంతే కాకుండా తీవ్ర వ్యాయామం తర్వాత కలిగే కండరాల నొప్పి మరియు పుండ్లను నయం చేయడానికి అల్లం సహాయపడుతుందని ఇప్పుడు శాస్త్రీయంగా నిరూపితమైంది. అల్లాన్ని ప్రతి రోజు తీసుకున్నట్లయితే కఠినమైన వ్యాయామం తర్వాత కలిగే నొప్పులు తగ్గుతాయని ఒక కొత్త అధ్యయనం చూపుతోంది.

జార్జియా విశ్వవిద్యాలయంలో పరిశోధకులు అల్లంను రోజువారి మోతాదులో తీసుకుంటే వ్యాయామానికి సంభందించిన నొప్పులను నిరిదించ గలదా లేదాయని అధ్యయనం చేసారు. ఈ అధ్యయనంలో భాగంగా, 34 వ్యక్తులున్న ఒక బృందం, రెండు గ్రాములు పచ్చి అల్లం నిండిన గుళికలు తీసుకోవడం జరిగింది: ఇది పౌష్టిక ఆహారపు దుకాణాల్లో లభించే 500 mg పచ్చి అల్లం గుళికలకు సమానం. 40 వ్యక్తులు పాల్గొన్న రెండవ బృందం, రెండు గ్రాములు వేడి చేసిన అల్లాన్ని తీసుకోవడం జరిగింది. వేడి చేసిన అల్లానికి నొప్పి నుండి ఉపశమనం కలిగించే లక్షణములు పెరగవచ్చని మునుపటి అధ్యయనాలు నిరూపించాయి. మూడవ బృందం ఉత్తుత్తిమాత్రలను (ప్లాసిబో) తీసుకుంది. ఈ అధ్యయనంలో పాల్పంచుకున్న వారందరు 11 రోజుల వరకు గుళికలను తీసుకోవడం జరిగింది -- కండరాల నొప్పి మరియు వాపు కలిగించే విధంగా తీవ్రమైన బరువులెత్తే కార్యక్రమానికి ఏడు రోజులు ముందు.

గుళికలు తీసుకున్న 11 రోజుల తర్వాత, పాల్గొన్న వారందరిలో పలు వేర్వేరు చరరాశుల కొలత జరుపబడింది : కృషి, నొప్పి తీవ్రత, బలం, వాపు మరియు చలనపు పరిధి వంటివి. ప్రతిరోజు పచ్చి అల్లపు గుళికలను తీసుకున్న బృందంవారు ప్లాసిబో బృందం కంటే 25 శాతం తక్కువ నొప్పిని అనుభవించారు మరియు ప్రతిరోజు వేడి అల్లాన్ని తీసుకున్న బృందం వారు ప్లాసిబో బృందం కంటే 23 శాతం తక్కువ నొప్పిని అనుభవించారు.

పరిశోధన నడిపించిన పాట్రిక్ ఓ కానర్, పీహెచ్డీ, ఈ అధ్యయనం పూర్తయ్యాక ఈ విధంగా వివరించారు: అల్లం ఆస్పిరిన్, ఇబూప్రోఫెన్ వంటి స్టెరాయిడ్కాని, యాంటీ ఇన్ఫ్లమేటరీ మందుల (NSAID లు) వలె పని చేయడంతో పాటు అల్లం ఈ మందుల వలె కాకుండా, పరిధీయ నరాలలో నొప్పి గ్రాహకతను తగ్గించి, శరీరంలో తాపజనకమైన రసాయనాల ఉత్పత్తిని కూడా తగ్గిస్తుంది. పైగా ఈ గుళికలు తీసుకున్న వారికి ఇబుప్రోఫెన్ మరియు నాప్రొక్షెన్ వంటి మందులను తీసుకున్న వారి కంటే నొప్పి నుండి అధిక ఉపశమనం కలిగిందని మరియు అల్లోపతి మందుల కారణంగా కలిగే కడుపు సంభందించిన సమస్యలు ఏవి కూడా వీళ్ళకి కలగలేదు. ఈ ఫలితాలు "ది జర్నల్ అఫ్ పయిన్" సెప్టెంబర్ 2010 సంచికలో ప్రచురింపబడినాయి.

మీరు ప్రయత్నించాలని అనుకుంటే, మీరు తీవ్ర వ్యాయాయం చేయడానికి కొన్ని రోజుల ముందు నుండి 5 శాతం అల్లం నిండియున్న అల్లం గుళికలను కొని, రోజుకి ఒక రెండు గ్రాముల గుళికలను తీసుకోవడం ప్రారంభించండి. మీకు అల్లం యొక్క రుచి ఇష్టముంటే కనుక, రోజు ఒక చెంచా అల్లం పొడి లేదా సగం చెంచా అల్లం రసం లేదా ఒక గరిటెడు సన్నగా తరిగిన తాజా అల్లం ముక్కలను తీసుకోవచ్చు. 

జుట్టు ఎందుకు నెరిసిపోతుంది?

వయసు పెరుగుతున్న కొద్ది జుట్టు ఎందుకు నెరిసి పోతుందని మరియు దాన్ని నిరోధించదానికి లేదా కనీసం దాని వేగం తగ్గించడానికి చేయవలసింది ఏమైనా ఉందాయని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? జుట్టు నెరిసి పోవడానికి కొన్ని కారకాలు క్రింది ఇవ్వబడినాయి.

మీరు ఏ వయసులో ఉన్నప్పుడు మీ జుట్టు నెరవడం ప్రారంభం అవుతుందన్నది (మీ జుట్టు ఊడిపోకుండా ఉన్న సంధర్బంలో) జన్యుశాస్త్రం  ద్వారా నిర్ణయించబడుతుంది. బహుశా మీ తల్లిదండ్రులు మరియు తాతామామలకు జుట్టు నెరిసిన అదే వయసులోనే మీకు కూడా నెరవవచ్చు. అయితే జుట్టు నెరిసే వేగాన్ని తగ్గించడం కొంత వరకు మన చేతుల్లో ఉంది. ధూమపానం నెరిసే వేగాన్ని పెంచుతుంది.  రక్తహీనత, సాధారణంగా పౌష్టిక ఆహారం తీసుకోక పోవడం, B విటమిన్లు తక్కువగా ఉండడం మరియు చికిత్స చేయని థైరాయిడ్ సమస్యలు వంటి కారణాల వల్ల కూడా జుట్టు నేరిసిపోయే వేగం పెరుగుతుంది. మీ జుట్టు యొక్క రంగు మారడానికి కారణం ఏమిటి? సూర్యకాంతి ప్రభావంతో చర్మం కంధడానికి కారణమైన వర్ణద్రవ్యం పేరు మెలనిన్. జుట్టు రంగు మార్పు కూడా ఇదే వర్ణద్రవ్యం యొక్క ఉత్పత్తి పై ఆధారపడియుంది.

ప్రతియొక్క రోమకూపములోను మెలానోసైట్స్ అను వర్ణధ్రవ్య కణాలుంటాయి. మెలానోసైట్లు యుమేలానిన్ అను నల్ల రంగు లేదా ముదూరు గోధుమ రంగుగల ఒక వర్ణద్రవ్యాన్ని మరియు ఎరుపు-పసుపు రంగుగల ఫియోమెలానిన్ ను ఉత్పత్తి చేసి, మెలానిన్ ను జుట్టులో ఉండే ప్రధాన ప్రోటీనైన కేరాటిన్ ను ఉత్పత్తి చేసే కణాలకు అందచేస్తాయి. కేరాటిన్ ఉత్పత్తి చేసే కణాలు నశించినప్పుడు, మెలానిన్ యొక్క రంగు మాత్రం వీటిలో నిలచియుంటుంది. మీ తలవెంట్రుకలు నెరవడం మొదలయినప్పుడు మెలానోసైట్లు ఉన్నప్పటికీ, వాటి క్రియాశీలత తగ్గుతుంది. తల వెంట్రుకలలో వర్ణధ్రవ్యం తక్కువగా నిక్షిప్తమవుతుంది. దీని కారణంగా జుట్టు రంగు మారుతుంది. క్రమంగా నల్ల రంగుకు కారణమైన మెలానోసైట్లు నశించి, జుట్టు పూర్తిగా నెరిసిపోతుంది.

వృద్ధాప్య ప్రక్రియలో ఇది ఒక సాధారణ మరియు అనివార్యమైన భాగం మరియు ఇది ఏ ఒక్క వ్యాధికి సంభందించింది కాదు. కాని కొన్ని ఆటో ఇమ్మ్యూన్ వ్యాధుల కారణంగా జుట్టు వేగంగా నెరిసే అవకాశముంది. అయితే కొంతమందికి ఇరవై సంవత్సరాల వయసులోనే జుట్టు నెరిసిపోతుంది. తీవ్ర ఒత్తిడి లేదా దిగులు కారణాలగా కూడా జుట్టు నెరిసే అవకాశముంది.....ఏన్ని మేరీ హెల్మెన్స్టైన్, Ph.D. About.com 

Om Sai Ram