Vol 1 సంచిక 1
September 2010
ముద్రింప తగిన వార్తాలేఖ
పూర్తి వార్తాలేఖ యొక్క కాగితం ప్రతి కావలెనన్నఈ పుటను ముద్రించండి
డా.జిత్ కే అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి
ప్రియమైన అభ్యాసకులకు
ఈ ప్రతమ సాయి వైబ్రియానిక్స్ వార్తాలేఖను, మా వద్ద ఇ-మెయిల్ వివరాలు నమోదు చేసిన అభ్యాసకులందరికీ పంపబడుతోంది. వార్తాలేఖ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభ్యాసకులంధరిని కలిపి, ప్రేమ, జ్ఞ్యానం, వైబ్రియానిక్స్ సంభందించిన సమాచారాలు అందరు పంచుకోవాలని మరియు అభ్యాసకులంధరిని ప్రోత్సాహించాలని మా ఉద్దేశం. వైబ్రియానిక్స్కి సంభందించిన సూచనలను, సలాహాలను మరియు ఇతర సమాచారాలను మీకు అందించే ఒక ఉపయోగకరమైన సాధనంగా, వార్తాలేఖ ఉంటుందని మేము ఆశిస్తున్నాము. దీని ద్వారా మేము అందరికి ఉపయోగ పడే ఆరోగ్యానికి మరియు జీవన శైలికి సంభందించిన విషయాలను కూడా పంచుకోవాలని ఆశిస్తున్నాము. మీరు మీ పేషంట్లకు ఉన్నత రీతిలో చికిత్సంధించడానికి ఉపయోగపడేలా ఇతర కేసు వివరాలను కూడా వార్తాలేఖ ద్వారా పంచుకోవాలని నిర్ణయించుకున్నాము.
ఎంత తరచుగా మేము వార్తాలేఖను పంపిస్తామనేది, అభ్యాసకులనుండి మాకందే స్పందనపై ఆధారపడి ఉంటుంది. ఇది మీ వార్తాలేఖ. మీరు చికిత్సను అందించిన పేషంట్లు(మానవులు, మొక్కలు లేదా జంతువులు) యొక్క కేసు వివరాలను మరియు మీరు పాల్గొన్న వైబ్రియానిక్స్ శిభిరాల వివరాలను మాకు అందచేస్తారని ఆశిస్తున్నాము. వైబ్రియానిక్స్కి సంభందించిన మీ సందేహాలను మరియు ఇతర అభ్యాసకులతో పంచుకోవడానికి తగిన సమాచారాన్ని మీరు ఈ ఇ-మయిల్ కు పంపవలెను: [email protected]
మేము ప్రారంభించిన ఈ నూతన కార్యక్రమం అందరికి ఎంతో ఉపయోగకరంగాను, ఆశాక్తికరంగాను ఉంటుందని ఆశిస్తున్నాము. మా వార్తాలేఖ వాలంటీర్లు ఈ కార్యక్రమాన్ని ఉత్సాహంగా మరియు విజయవంతగా కొనసాగించేందుకు మీ స్పందన ఎంతో అవసరం.
సాయి సేవలో,
జిత్ అగ్గర్వాల్
పల్మనరీ త్రామ్బో ఏమ్బోలిసం (రక్తనాళములలో గడ్డలుకట్టి రక్తము పారుదలకు అడ్డుట) Missing...India
ఒక 31 ఏళ్ళ మహిళ త్రోమ్బస్ (గడ్డకట్టిన రక్తం) సమస్యతో భాధపడేది. దీని కారణంగా ఈ రోగి యొక్క పల్మనరీ ఆర్టరీలలో రక్త ప్రసరణలో ఆటంకం కలిగి ఆమెకు ఊపిరి తీసుకోవడం చాలా ఇబ్భందికరంగా ఉండడంతో ఏ పని చేయలేక పోయేది. ఎమర్జన్సీ వైద్యం ఇప్పించడానికి ఆమెను ఆశ్పత్రికి తీసుకు వెళ్ళారు కాని డాక్టర్లు ఆపరేషన్ చేయాలని, దానికి చాలా కర్చవుతుందని చెప్పడంతో వైద్యం ఇప్పించలేక పోయారు. దీని తర్వాత ఒక వైబ్రియానిక్స్ అభ్యాసకుడు పరిచయం కావడంతో ఆమెకు ఈ క్రింద వ్రాసిన మందులను ఇవ్వడం జరిగింది:
CC2.3 Tumours and growths + CC3.1 Heart Tonic + CC19.3 Asthma + CC19.4 Asthma emergency …QDS.
ఒక నెల రోజులలో ఆమె పూర్తిగా కోలుకుంది. ఆమె యొక్క ఆంజియోగ్రాఫి రిపోర్టు చూసి ఆమె రక్తనాళాలలో ఏ విధమైన అడ్డు లేదని తెలుసుకున్న డాక్టర్లు ఎంతో ఆశ్చర్య పోయారు.
పూర్తిగా నయమైన మల్టిపుల్ మైలోమా (ఒక రకమైన క్యాన్సర్) Missing...India
ఒక 51 ఏళ్ళ వ్యక్తికి ఒక రకమైన బోన్ మేరో క్యాన్సర్ ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. ఒక సంవత్సరం పాటు ఈ రోగము చేత ఈ పేషంటు మంచము పట్టారు. ఈ వ్యక్తికి కుడి భుజంలో కీలు ఫ్రాక్చర్ అయింది. డాక్టర్లు ఈ వ్యక్తికి నయంకావడం అసాధ్యమని చెప్పారు. ఈ పేషంటు ఒక వైబ్రియానిక్స్ అభ్యాసకుడిని సంప్రదించారు. ఈ పేషంటుకు ఈ క్రింద వ్రాసిన మందులు ఇవ్వబడ్డాయి:
CC2.1 Cancer + CC2.2 Pains of Cancer + CC2.3 Tumours and growths + CC12.1 Adult Tonic + CC20.2 Skeletal Pain + CC20.3 Arthritis + CC20.4 Muscles and supportive tissues + CC20.5 Spine + CC20.6 Osteoporosis + CC20.7 Fractures
ఒక వారం రోజులలో ఈ వ్యక్తికి ఉపశమనం కలుగడం ప్రారంభమైంది. పదిహేను రోజులలో అతను లేచి నడవడం ప్రారంభించారు. నాలుగు నెలల తర్వాత ఉద్యోగం చేయడం కొనసాగించారు. ఎం బాండ్ పరిశీలనలో ఈ వ్యక్తికి కాన్సర్ చాయ కూడా లేదని తెలిసింది.
కంఠంలో పక్షవాతం Missing...India
ఒక 54 ఏళ్ళ వ్యక్తికి స్ట్రోక్ కారణంగా మాట పడిపోయి కంఠంలో పక్షవాతం కలిగింది. ఈ పేషంటుకు డయాబెటిస్ లేక పోయిన నిశబ్ద రక్తపోటు సమస్య ఉండుండ వచ్చని డాక్టర్లు అనుమానించారు.ఈ పేషంటుకు పైపు ద్వారా ఆహారం ఇవ్వబడింది. ఈ పేషంటు కుమారుడు ఒక వై బ్రో అభ్యాసకుడిని కలవడం జరిగింది. వెంటనే ఈ పేషంటుకు ఈ క్రింద వ్రాసిన మందులు ఇవ్వబడినాయి:
CC18.1 Brain disabilities + CC18.4 Stroke + CC19.7 Throat …QDS
పేషంటుకు నోటి ద్వారా వైబ్రో మందులు ఇవ్వడం జరిగింది. వైబ్రో చికిత్స ప్రారంభించిన మూడు రోజుల తర్వాత ఈ పేషంటుకు ఆహారాన్ని మింగే శక్తి వచ్చింది. అంతేకాకుండా ఈ పేషంటు మాట్లాడడం కూడా ప్రారంభించారు. ఇప్పటికి ఈ పేషంటుకు స్ట్రోక్ కారణంగా తగ్గిపోయిన జ్ఞయాపక శక్తి మెరుగు పర్చడానికి వైబ్రో చికిత్స ఇవ్వబడుతోంది. ఈ పేషంటు పూర్తిగా నయమవ్వడానికి ఫిసియోతెరపి కూడా ఇవ్వబడుతోంది.
కాలేయ క్యాన్సర్ రోగి యొక్క చికిత్స Missing...India
ఒక 67 ఏళ్ళ మహిళ కాలేయంలో క్యాన్సర్, ఉదరంలో నీరు పట్టడం మరియు ఇతర సమస్యలతో భాధపడేది. ఉదరంలో చేరిన నీరును క్రమముగా బయిటికి తీయవలసి వచ్చేది. ఈమెకు రెండు మోకాళ్ళలోను కీళ్ళ వాపులుతో పాటు పిత్తాశయం ఉబ్బుదల సమస్య కూడా ఉండేది. ఈ పేషంటుకు డయాబెటిస్, రక్తపోటు, మలభద్ధకమ్ మరియు నిద్రలేమి సమస్యలు కూడా ఉండేవి. డాక్టర్లు ఈ పేషంటు మూడు నెలలు కన్నా ఎక్కువ కాలం బ్రతకడం అసాధ్యమని చెప్పేశారు. ఒక వైబ్రో అభ్యాసకుడు ఈ క్రింద వ్రాసిన మందులను ఈ పేషంటుకు ఇవ్వడం జరిగింది:
CC2.1 Cancer + CC2.2 Pains of Cancer + CC2.3 Tumours and growths + CC4.2 Liver & Gall Bladder Tonic + CC6.3 Diabetes + CC12.1 Adult Tonic + CC19.3 Asthma + CC19.4 Asthma emergency + CC20.3 Arthritis + CC20.6 Osteoporosis
ఈ చికిత్స ప్రారంభించిన వారం రోజులలోనే ఈ పేషంటుకు అల్లోపతి మందులు తీసుకునే అవసరం తగ్గిపోయింది. తొమ్మిది నెలల్లో ఈమె ఆరోగ్యం మెరుగు పడింది.ఈమెకున్న ప్ల్యురల్ ఎఫ్ఫ్యుషణ్ (పుపుస ద్రవం) సమస్య తగ్గి డయాబెటిస్ సమస్య అదుపులోకి వచ్చింది. ఒక్కపుడు మంచం పట్టిన ఈ పేషంటు లేచి తన పనులన్నీ చేసుకోగలిగింది. డాక్టర్లు మూడు నెలలు మాత్రమే బ్రతికి ఉంటుందని చెప్పినప్పడికి ఈ పేషంటు మరో రెండు సంవత్సరాలు ఆనందంగా జీవించి ప్రశాంతంగా శరీరాన్ని విడిచింది.
జవాబుల విభాగం
ప్రశ్న: ప్రపంచ వ్యాప్తంగా ఎంతమంది వైబ్రో అభ్యాసకులున్నారు?
జవాబు: 81 దేశాలలో 4000 కు పైన ఉన్న వైబ్రో అభ్యాసకులు ఉచితంగా ఈ చికిత్సను అందిస్తున్నారు.
_____________________________________
జవాబు: పేషంటుకు ఫ్లూ జ్వరం తగ్గే వరకు అతనికి దీర్గ కాలిక సమస్య కోసం ఇస్తున్న చికిత్సను ఆపడం మంచిది. ఇలా చేయడం వల్ల ఫ్లూ జ్వరం వేగంగా తగ్గే అవకాశం ఉంటుంది. కొందరు పేషంట్లు ఒకటే సమయంలో రెండు సమస్యలకి మందులు తీసుకోవడం ఇష్టపడుతూ ఉంటారు.
_____________________________________
జవాబు: పేషంటుతో కర్మల గురించి చర్చించడం సరియైన పద్ధతి కాదు. ప్రేమతో పేషంట్లకు చికిత్సను అందించాలి. కర్మ సంభందించిన విషయాలను దేవుడుకి పేషంటుకు మధ్య వదిలిపెట్టాలి.
వైద్యము యొక్క హీలేర్ నుండి దైవ పదాలు
"మితమైన ఆహారం తీసుకుని దీర్ఘాయువును పొందండి. యుగ యుగాలుగా యోగులు ఇచ్చిన సలహా ఇదే. ఈ సలహాను అరుదుగా పాటిస్తున్నారు. మనుష్యులు పొట్టను ఆహారంతో నింపుతున్నారు. ధనవంతులు గర్వంతో ఖరీదైన విందులు ఏర్పాడు చేసి అధిక కొవ్వున్న ఆహారాలు మరియు ఆరోగ్యానికి హాని కలిగించే ఇతర ఆహారాలను భుజించి జీర్ణ శక్తికి హాని కలుగ చేస్తున్నారు. ఆరోగ్యం యొక్క విలువను గుర్తించినవారు సాత్వికమైన ఆహారాన్నే తీసుకుంటారు."
-సత్య సాయి బాబా, సత్య సాయి స్పీక్స్, సంపుటము XI
"ప్రసరణము, కంపనం మరియు సాకారవస్తుత్వము, ఈ మూడు శక్తుల సంయోగం కారణంగా మానవుడు జీవిస్తున్నాడు. దీన్ని ప్రకృతి అంటారు. ప్రాణ శక్తి దీని యొక్క కదలికకు కారణం. చైతన్య శక్తైన ప్రజ్ఞా శక్తి ఈ కదలికకు మార్గం నిర్దేశిస్తుంది. చైతన్య శక్తి, ప్రాణశక్తి మరియు విషయ శక్తుల కలయికే మానవుని యొక్క జీవితం. ఈ సత్యాన్ని విస్మరించి, మానవుడు తన శరీరానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నాడు. శరీరానికి మాత్రమే అన్ని శక్తులు ఉన్నాయన్న భ్రమతో జీవిస్తున్నాడు.
అమెరికా ఒక పుష్కలమైన, ఆహార కొరత లేన ఒక దేశమని అందరికి తెలుసు. అందువల్ల ఈ దేశంలో ప్రజలు అధికంగా తింటూ, జీవితాన్ని భోగములో గడుపుతూ ఉంటారు. ఈ కారణంగా, ఈ దేశ ప్రజలు గుండెకు సంభందించిన వ్యాధులతో అధికంగా భాధపడుతున్నారు.
స్వీడన్ ఐరోపాలో చాలా సంపన్నమైన దేశం. ఈ దేశ ప్రభుత్వం ప్రజలకు సాధ్యమైన సౌఖర్యాలను అందిస్తోంది. ఇలా ఉన్నప్పటికీ ఈ దేశంలో ఆత్మహత్య చేసుకునే, మరియు విడాకులు ఇచ్చే వాళ్ళ సంఖ్య చాలా అధికంగా ఉంది. దీనికి కారణం ఏమిటి? ఇది ధనం లేదా ఇతర సౌఖర్యాల కొరత వల్ల కాదు. దీనికి కారణం ప్రజలలో ఆధ్యాత్మిక ద్రుక్పధం లేకపోవడమే. శరీరం మరియు ఇతర తాత్కాలికమైన విషయాలకు అధిక ముఖ్యత్వం ఇచ్చి, శాశ్వతమైన అంతరాత్మ మీద ఎవరు దృష్టి పెట్టట్లేదు. ఈ విధంగా వారు ఒక కృత్రిమ జీవితాన్ని గడుపుతున్నారు. "
–సత్య సాయి బాబా, సత్య సాయి స్పీక్స్, సంపుటము XXVI
“మనిషికి సమాజానికి మధ్య సంబంధం తేనెటీగ పువ్వు మధ్యున్న సంభంధం లాగానే ఉంటుంది. శిశువు తల్లి పాలును, తేనెటీగ పుష్పంలో ఉన్న తేనెను త్రాగి ఆనందిస్తున్నట్లుగానే మానవుడు ప్రకృతి అందించే బహుమతులను ఆనందంతో అనుభవించాలి. యుగ యుగాలుగా మానవుడు ప్రతికూల ఆలోచనలతో భాదితుడై ఉంటున్నాడు. ఒక అత్యాస గల మనిషి తన భాతు ఇచ్చే భంగారు గుడ్లను ఒక్క మాటు తీసుకునే ఉద్దేశంతో ఆ భాతును చంపిన ఒక పురాణ కధ ఉంది. ఇదే విధంగా మానవుడు తన మూర్ఖపు చర్యల ద్వారా ప్రకృతిలో అసమతుల్యత సృష్టించిడం వల్ల భూకంపాలు వంటి సహజ విపత్తులు సంభవిస్తున్నాయి. వివేకం లేకుండా శాస్త్రీయ ఆవిష్కరణలను ప్రయోగించడం కారణంగానే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రకృతి వనరుల క్షీణత కారణంగా కలిగే దుష్ప్రభావాల గురించి మానవుడు ఆలోచించట్లేదు."
–సత్య సాయి బాబా, సత్య సాయి స్పీక్స్, సంపుటము XXVI
అదనంగా
ఆరోగ్య చిట్కాలు
మీరు భోజనం చేసిన తర్వాత చల్లని పానీయాలు తీసుకోవడం ఇష్టపడతారా? ఆహారం తీసుకున్న తర్వాత చల్లని నీరు లేదా పానీయాలు తాగడం ఆరోగ్యానికి హానికరం. ఆహారం తర్వాత తీసుకున్న చల్లని పానీయాలు మనం తీసుకున్న ఆహారంలో ఉన్న నునె పదార్థాలను గట్టి పరచి జీర్ణ క్రియ వేగంను తగ్గిస్తాయి. ఈ విధంగా గట్టి పడిన పదార్థాలు మన కడుపులో ఉన్న "ఆసిడ్"(ఆమ్లం) తో చేరి విచ్ఛిన్నం చేయబడుతాయి. ఈ ప్రక్రియ తర్వాత పేగులు ఈ పదార్థాలను పీల్చుకుంటాయి.ఇలా పీల్చబడ్డ పదార్థాలు పేగులో ఒక పూత వలె ఏర్పడి ఆపై క్యాన్సర్ కు దారితీస్తాయి. ఆహారం తీసుకున్న తర్వాత వెచ్చని నీరు లేదా సూప్ తాగడం మంచిది. చైనా మరియు జపాన్ దేశాలకు చెందిన వారు ఆహారం తీసుకునే సమయం లో వేడిగా టీ తాగుతారు, చల్లని పానీయాలు తాగరు. మనము కూడా ఈ పద్ధతిని పాటిస్తే భాగుంటుంది.
గుండె పోటులు గురుంచి ఒక ముఖ్యమైన గమనిక: కేవలం ఎడమ చేతిలో నొప్పి మాత్రమే గుండె పోటు లక్షణమని అనుకోవడం తప్పు. గుండె పోటు మొదటి సారిగా వచ్చినప్పుడు గుండెలో నొప్పి రాకపోవచ్చు. వికారం మరియు తీవ్రంగా చమట పట్టడం వంటి లక్షణాలు కూడా సాధారణంగా కనిపిస్తూ ఉంటాయి.తీవ్ర దవడ నొప్పి కలుగియుంటే జాగ్రత వహించాలి. గుండె పోటు వచ్చిన వ్యక్తులలో 60% మంది నిద్రనుండి మేలుకోరు. ఈ లక్షణాలను మనమందరు తెలుసుకోవడం ఎంతో మంచిది.
వైబ్రియానిక్స్ వార్తాలేఖను అందుకోవాలని కోరుకుంటున్న అభ్యాసకులు ఈ ఇ-మెయిల్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి: [email protected]
మా వెబ్సైట్ www.vibrionics.org ను సంప్రదించండి.
స్వామీ ఆశిర్వధించిన వైబ్రియానిక్స్ కేకు, గురు పూర్ణిమ - 25 జూలై 2010
వరుసగా మూడవ సంవత్సరం, పవిత్రమైన గురు పూర్ణిమ రోజున, స్వామీ చరణాలకు సాయి వైబ్రియానిక్స్ కేక్ ను సమర్పించుకునే సువర్ణ అవకాశాన్ని ప్రసాదించి, మన వైబ్రియానిక్స్ టీంకు దీవెనలను అందించారు.
జూలై నెల ప్రారంభంలో జపాన్ నుండి వైబ్రియానిక్స్ అభ్యాసకుల టీం ఒకటి గురు పూర్ణిమ వేడుకలలో పాల్గొనే నిమిత్తమై పర్తి చేరుకుంది. ఇతర వాలంటీర్ల సహాయంతో ,15,000 ప్రసాదం పొట్లాలు ఈ టీం తయారు చేసింది. గ్రీసు దేశానికి చెందిన భక్తులు సాయి వై బ్రియానిక్స్ కేక్ ను తయారు చేసారు. ఈ ప్రసాదాన్ని గురు పూర్ణిమ కు ముందు రోజు, స్వామీ సాయి కుల్వంత్ హాలులో ఉన్న భక్తులందరికీ పంచమని చెప్పడంతో, మన వైబ్రియానిక్స్ టీంకు చాలా ఆనందం కలిగింది.
గురు పూర్ణిమ నాడు మధ్యాహ్నం, భక్తులు మరియు విద్యార్థులు గురు భజనలు పాడుతుండగా స్వామీ సాయి కుల్వంత్ హాలుకు వచ్చారు. స్వామీ వరండా దెగ్గరకు వస్తుండగా వైబ్రియానిక్స్ టీం స్వామికి వినమ్రతతో ఒక గులాబి పువ్వును సమర్పించింది. గులాబి పువ్వును తీసుకోవడమే కాకుండా , ఒక వైబ్రియానిక్స్ అభ్యాసకుడు తయారు చేసిన, పువ్వు ఆకారంలో ఉన్న ఒక కొవ్వొత్తిని వెలిగించి, తమ దివ్య హస్తాలతో స్వామీ వైబ్రియానిక్స్ కేక్ ను కూడా కట్ చేసారు. సంగీత కార్యక్రమము ముగిసిన తర్వాత స్వామీ ప్రసాదాన్ని కళాకారులకు పంచమని చెప్పడంతో, మా అందరికి ఎంతోఉత్సాహం కలిగింది.
విజయవంతంగా వైబ్రియానిక్స్ సాధన చేసేందుకు కావలసినవి
వైబ్రియానిక్స్ పేషంట్ల నుండి అద్భుతమైన స్పందన లభిస్తున్నప్పటికీ, ఒకటే రోగ సమస్య ఉన్న అనేక పేషంట్లు, ఒకటే మందుకు అనేక విధాలుగా స్పందించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కొన్ని సందర్భాలలో ఒక అభ్యాసకుడిచ్చిన మందు సఫలితాలను అందించడం, అదే మందును మరొక అభ్యాసకుడు ఇచ్చినప్పుడు ఫలితం లేకపోవడం వంటివి గమనిస్తున్నాము.…
దీనికి అనేక కారణాలున్నాయి. అన్నిటికన్నా ప్రధానమైనది విశ్వాసం. పేషంట్లు కన్నా అధికంగా అభ్యాసకులు ఈ చికిత్సపై పూర్తి విశ్వాసం కలిగియుండడం చాలా అవసరం. అభ్యాసకులకు 108 కామన్ కాంబో బాక్సులో ఉన్న ప్రతియొక్క మందులో ఇమిడియున్న మన ప్రియమైన భగవాన్ యోక్క దివ్య శక్తిపై పూర్తి విశ్వాసం ఉండాలి. ప్రారంభం నుండి స్వామీ వైబ్రియానిక్స్ సేవకు తమ దీవెనలను ఎంతగానో అందిస్తున్నారు. అనేక సందర్భాలలో స్వామీ, రోగులను నయం చేసే ప్రధాన కర్త తానే యని మనమందరు స్వామి యొక్క సాధనములు మాత్రమే యని చెప్పారు. ఈ 108 కామన్ బాక్సు తయారి వెనుక మరియు దీని ఉపయోగం వెనుక స్వామీ యొక్క దివ్య హస్తం తప్ప మరొకటి లేదని మనం గుర్తుంచుకోవాలి.
అభ్యాసకులందరు స్వామీ యొక్క సాధనములన్న విశ్వాసాన్ని కలిగియుండాలి. ఈ చికిత్సా విధానం పై పూర్తి విశ్వాసం కలిగియుండడంతో పాటు అభ్యాసకులు పేషంట్లను, త్వరలోనే వారు కోలుకుంటారని ప్రోత్సాహించడం కూడా ఎంతో ముఖ్యం. రోగ నివారణ కోసం ప్రార్థించిన ఒక వ్యక్తితో ఏసు క్రీస్తు " విశ్వాసం నిన్ను నయం చేసింది, వెళ్ళు" అన్న మాటలు మనందరికీ తెలుసు.
నివారణ ప్రక్రియలో మరో ముఖ్య అంశం ప్రేమ. అభ్యాసకులు ప్రేమతో తమ పేషంట్లతో మాట్లాడాలి. స్వామీ తమ దివ్యోపన్యాసాలలో రోగులకు ప్రేమతో చికిత్సను అందించడం వల్ల వాళ్లకు నివారణ మరింత త్వరగా లభిస్తుందని చెప్పారు. నిజం చెప్పాలంటే మందుల కన్నా మనమిచ్చే ప్రేమ రోగులను నయం చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రతి యొక్క అభ్యాసకుడు తమ పేషంట్ల కొరకు ప్రేమతో ప్రార్థన చేయాలి. అహంకారం లేని స్వచ్చమైన ప్రేమ నిండియున్న సాధనములుగా ఉండడానికి మనం ప్రయత్నించాలి.
మూడవ అంశం నమ్మకం. పేషంట్లకు అవసరమైన మందులు వాళ్లకు ఇవ్వబడుతున్నాయన్న నమ్మకం ప్రతి యొక్క అభ్యాసకుడు కలిగియుండాలి.. మనమిచ్చిన మందులతో కొందరు పేషంట్లు పూర్తిగా నయమై పోతారు. అవే మందులతో మరి కొంధరకి నయం కాకపోవచ్చు. ఇలాంటి సందార్భాలలో మనం దైవం పై పూర్తి నమ్మకముంచడం ఎంతో ముఖ్యం. ఈ చికిత్స ద్వారా పేషంట్లకు శారీరికంగా మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది.
"సాధ్యమైనంత వరకు మీరు చేయండి మిగతావి నేను చూసుకుంటాను" అని స్వామీ ఎన్నో సార్లు చెప్పారు. ఈ అద్భుతమైన సేవను విశ్వాసం, ప్రేమ మరియు నమ్మకంతో చేసి ఫలితాలను స్వామికి వదిలిపెట్టాలి.
జై సాయి రామ్