Vol 2 సంచిక 1
January 2011
ముద్రింప తగిన వార్తాలేఖ
పూర్తి వార్తాలేఖ యొక్క కాగితం ప్రతి కావలెనన్నఈ పుటను ముద్రించండి
డా.జిత్ కే అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి
ప్రియమైన అభ్యాసకులకు,
మన రెండవ వార్తలేఖ కూడా అత్యంత ప్రజాదరణ పొంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన అభ్యాసకులచే ఉత్సాహంగా చదవబడినదని తెలియచేయుటకు నేను చాల సంతోషించుచున్నాను. 108 cc బాక్స్తో నయం చేయబడ్డ రోగుల వివరాలు తెలుసుకుని గతంలో 108 బాక్స్లేకుండా తర్ఫీదు పొందిన పూర్వఅభ్యాసకులు 108 బాక్స్కొరకు కొన్నినెల్లలుగా మా దగ్గరకు వస్తున్నారు!
ప్రశాంతి నిలయం గత కొన్నినెలలుగా స్వామి యొక్క 85 వపుట్టినరోజు మరియు క్రిస్మస్వేడుకలుతో చాలా సందడిగా ఉంది. ఆశ్రమమును సందర్సించుచున్న భక్తులు రోగులు మాత్రమే కాకుండా వైబ్రియోనిక్స్నేర్చుకోవాలని ఉత్సాహపడుతున్నఎందరో భక్తులు స్థిరమైన ప్రవాహంలా మమ్మల్నిసంప్రదించారు. మీరు వైబ్రియోనిక్స్(Vibrionics) ఉపయోగించి సాదించిన అత్యుతమ ఫలితాలను అసాదారణ రోగనివారణులను వినడానికి మాకు చాలా అద్బుతంగాఉంది. కేవలం ఒక చిన్నవిన్నపము - మీ యొక్క కేసు నివేదికలను మాకు రాసిపంపినచో వాటిని తదుపరి వార్తలేఖలలో ప్రచురించినచో అవి ఇతర వైద్యులకు అపారమైన విలువ మరియు చాలా ఉపయోగకరంగా ఉండగలదు.
జన్మదిన వేడుకల సందర్భంగా ఇక్కడ పుట్టపర్తిలో మా అభ్యాసకులు ప్రశాంతి నిలయం రైల్వేస్టేషన్వద్ద ఒక తొమ్మిది రోజుల పాటు సాయి వైబ్రియోనిక్స్వైద్యశిబిరం నిర్వహించారు. ఈ ప్రత్యేక బృందం ఉదయం ఏడు నుండి మొదలై సాయంత్రం చీకటి పడేవరకు రోజుకు 500 రోగులు సగటున అంకితభావంతో తమ సేవలందించారు.
21 నవంబర్రాత్రి సుమారు 9 గంటలకు ఇక క్యాంపు ముగుస్తుందనగా, అత్యద్బుతంగాఒకఅభ్యాసకుని 108cc బాక్స్లోస్వామి ఫోటోపైన విభూతి రాలి వుండడం చూసి( క్రిందచుడండి)మొత్తం టీం అంతా చాలా సంతోషించారు. భగవంతుని దైవికమైన దీవెనలు విభూతిరూపంలో !!! ఎంత కరుణామయుడో స్వామి, తాను ఈ మొత్తం పనిలో మన మధ్యే ఉంటూ - మనల్నిదీవిస్తూ, మార్గదర్సకంచేస్తూ, ప్రోత్సహిస్తూ, అభయమిస్తూ, మనం చేసేపనంతా తన పనే అని నిరూపించారు. మేము ఎల్లప్పుడూ మీనుంచి వినడానికిఎదురుచూస్తుంటాము – వార్తాలేఖల మీద మీ అబిప్రాయంకోసం, భవిష్యత్తు సమస్యల కోసం సూచనలు, మీ నెల వారీ నివేదికలు మరియు మరింత ఆసక్తికరమైన మరియు ఉత్తేజకరమైన కేసు చరిత్రలు కోసం. వీటి కోసం కొన్ని నిమషముల సమయం కేటాయించి మాకు ఈమెయిలు పంపండి. ప్రస్తుత వార్తలేఖను ఆస్వాదిస్తూ, స్వామి యొక్క నిరంతర కృపతో వ్యాదులను నయం చెయ్యడం అనే గొప్ప కార్యమును చేస్తూనే ఉండండి.
సాయి సేవలో,
జిత్. కే. అగ్గర్వాల్.
గర్భాశయ క్యాన్సర్ 02703...Japan
ఒక 67 ఏళ్ల మహిళ గర్బాశయ కేన్సురుతో భాదపడుతూ తన వైద్యునిచే శస్త్ర చికిత్స చేసుకోవాల్సిందిగా సలహా పొందినది. ఆవిడ విబ్రియో అభ్యాసకుని సహాయం కొరకు సంప్రదించింది. ఆమెకు క్రింది బిళ్ళలు ఇవ్వబడినవి.
CC2.1 Cancers + SR350 Hydrastis + SR391 Kreosotum + SR537 Uterus…QDS
రెండు నెలలు తర్వాత ఆమె యొక్క కాన్సర్కణితి పరిమాణం తగ్గినా, ఆవిడ యొక్క గర్భ సంచి శస్త్ర చికిత్స ద్వారా తొలగించడం జరిగింది. కానీ ఆవిడ పొత్తి కడుపులో నీరు చేరి కాన్సర్ ఆ ప్రాంతానికి సోకడం జరిగింది. వైద్యులు ఆవిడ కాన్సర్మూడవ దశకు చేరిందని రేడియేషన్/కేమోతేరపి వైద్యం తీసుకోవాల్సిందిగా ఆవిడకు సూచించారు. కానీ, ఆవిడ అన్ని విదములైన అల్లోపతి మందులను తిరస్కరించి విబ్రియో బిళ్ళలనే తీసుకోవటం మొదలుపెట్టింది. అభ్యాసకుడుక్రిందిరెమేడిలనుకూడాఆవిడబిళ్ళలలోకలిపిఇచ్చారు.
SR271 Arnica + SR345 Calendula + SR353 Ledum…QDS
రెండు నెలల తరువాత, కాన్సర్పూర్తిగా అదృశ్యం అవ్వడం మరియు ఆమె పూర్తిగా కోలుకోవడం చూసి డాక్టర్చాలాఆశ్చర్యపోయారు. ఆమె క్రింది విబ్రియో రెమేడిలను కొనసాగించింది
CC2.1 Cancers…QDS; SR248 Vessel of Conception...4 doses and SR298 Lachesis…2 doses.
ఎడిటర్ యొక్క వ్యాఖ్య:
ఇది పరిపూర్ణమైన రోగ స్వస్థతకు ఒక అద్బుత ఉదాహరణ. కాని అభ్యాసకుడు పొందిన ఫలితాన్ని ఈ క్రింది రేమేదీలతో కూడా పొందవచ్చు
CC2.1 Cancers + CC2.3 Tumours + CC8.1 Female Tonic + CC8.4 Uterus
కోడి పిల్లలలో వ్యాధి 02715...Germany
ఒక విబ్రియో అభ్యాసకుని తల్లికి 23 కోళ్ళు ఉండేవి. కానీ ఒక అంటు వ్యాధి వలన మూడు తప్ప మిగిలిన కోళ్ళు చనిపోయాయి. ఆ మూడింటిలో ఒక కోడి చాల బలహీనంగా ఉండి, తల ఎత్తడానికి, నేరుగా నడవటానికి చాలా ఇబ్బందిపడేది. ఈ కోడి మిగిలిన రెండు కోళ్ళ నుంచి ఇంట్లో వేరుగా ఉంచబడినది. విబ్రియో అభ్యాసకురాలు ఈ క్రింది రెమేడిలను తన తల్లికి పంపించింది.
CC1.1 Animal Tonic + CC18.4 Stroke…TDS
అభ్యాసకురాలి తల్లి ఆ బిళ్ళలను కోడి పిల్లల ముక్కులో వేసేది. కొద్ది రోజులలోనే వాటి ఆరోగ్య పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. బాగా బలహీనంగా ఉన్న కోడి పిల్ల తల ఎత్తి, ఆహారం బాగా తినగలగుతూ చక్కగా నడవసాగింది. ఒక వారం తరువాత అది గుడ్లు కూడా పెట్టగలిగింది. అందువలన ఇప్పుడు ఈ రేమడీలు రోజుకి ఒక మారు తీసుకుంటున్నది(OD). తరువాత అదే రేమేడి బలహీనంగా, బరువు తక్కువుగా ఉన్న మిగిలిన రెండు కోళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. అవి కూడా తక్కువ సమయంలోనే పుంజుకున్నాయి. అబ్యాసకురాలి తల్లికి ఇప్పుడు మూడు ఆరోగ్యవంతమైన కోళ్ళు ఉండడంవలన, మొత్తం కోళ్ల మంద చనిపోవడం అనే బాధ నుంచి కొంత ఉపశమనం లభించింది.
పళ్ళ ఇన్ఫెక్షన్ 01339...USA
ఒక 59 ఎళ్ళ మహిళ రెండు సంవత్సరాలుగా తన రెండు పళ్లలో తకువ స్థాయి ఇన్ఫెక్షన్, వేడి మరియు చల్లని, ఘన లేదా ద్రవ పదార్థములు తీసుకుంటే సున్నితత్వం వలన భాదపడుతూ ఉంది. దంత వైద్యుడు ఆమె పళ్ళను ఎక్స్రే తీసి, రూట్కెనాల్ట్రీట్మెంట్మరియు నొప్పి తగ్గడానికి పళ్ళ నరములు శస్త్ర చికిత్స సూచించారు. శస్త్ర చికిత్స రేపనగా అబ్యాసకుడు క్రింది రేమేడిలను ఆవిడకు ఇచ్చారు
CC11.6 Teeth-decay + CC21.11 Abscess…TDS
రోగి తన దంత శస్త్ర చికిత్సకు ముందు మూడు డోసులను వేసుకుని స్వస్థత కొరకు సాయిబాబాను ప్రార్దించింది. ఆవిడ దంత కుర్చీలో కూర్చోగానే తన దంతముల సమస్య నయమైనట్లు తనకు మదిలో అనిపించింది. దంత వైద్యుడు ఆమె దంతములను పరీక్ష చేసి ఆశ్చర్యపోయి ఆవిడ దంతముల యొక్క మూలములు పరిపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నట్లు మరియు ఏ విదమైన వైద్యం అవసరం లేదని చెప్పారు. స్వామి అపార కృప వలన ఈ రోగి దంత వైద్యం వలన కలిగే నొప్పి నుంచి తప్పించబడింది. అంతే కాకుండా చాలా ఖరీదైన దంత వైద్యం కోసం తను అప్పు చేయాలనుకొన US $ 2300 ఆమెకు ఇక అవసరం రాలేదు
తీసి వేయబడకుండా కాపడబడిన ఒక మధుమేహ రోగగ్రస్తుని పాదము 02640...India
ఒక 54 ఏళ్ళ వ్యక్తి ఎన్నో సంవత్సరాలుగా మదుమేహం వ్యాదితో బాదపడుతూ తన కుడి పాదం యొక్క వ్రేళ్ళు శస్త్ర చికిత్స ద్వార తొలగించుకోవల్సివచ్చింది. అతను తన కుడి పాదము మరియు మోకాలి వరకు కుడి కాలు తొలగించుకోవడానికి వైద్యశాలలో చేరవలసి వచ్చింది. ఒక విబ్రియో అబ్యాసకుడు అతని కాలు కాపాడటం కోసం క్రిందివి ఇచ్చారు.
#1. NM20 Injury + NM25 Shock + NM32 Vein-Piles + SM15 Circulation + SR264 Silicea (200C) + SR293 Gunpowder + SR298 Lachesis (30C) + SR325 Rescue + SR408 Secale Corn (30C)…TDS
#2. SM17 Diabetes + SM39 Tension + SM41 Uplift…TDS
పదిహేను రోజుల తరువాత ఈ రోగిని చూసి అతని వైద్యుడు, ఇతని ఆరోగ్యం చాల మెరుగైందని అందువలన కాలును తిసి వేయవలసిన అవసరం లేదని, కాని ప్లాస్టిక్సర్జరీ అవసరం రావచ్చని చెప్పారు. విబ్రియో అబ్యాసకుడు అతనిని రేమేడిలను కొనసాగించమని చెప్పారు. ఒక నెల రోజుల తరువాత ఈ రోగిని వైద్యశాల నుంచి ఇంటికి పంపించారు మరియు ప్లాస్టిక్సర్జరీ అవసరంలేదని తెలిపారు. స్వామి యొక్క అపార కృప వలన ఈ పేద రిక్షా కార్మికుడు తన వృత్తిని కొనసాగిస్తూ కుటుంబాన్ని పోషించగలుగుతున్నాడు. ఈ మొత్తం వైద్యం 45 రోజుల సమయం తీసుకుంది.
ఎడిటర్ యొక్క వ్యాఖ్య:
అప్పట్లో 108cc బాక్సు లేక పోవడం వలన అబ్యాసకుడు వైబ్రియోనిక్స్పోటేన్టైసర్ను(potentisor) వాడారు . ఒక వేళ అబ్యాసకుడు 108cc బాక్సు వాడి ఉంటె పై వాటికి బదులు క్రింది రేమేడిలను ఇచ్చి అంతే సమాన ఫలితాలను పొంది ఉండవచ్చు
CC3.7 VaricoseVeins + CC21.11 Abscess + CC6.3 Diabetes…TDS
ప్రశ్న జవాబులు
1. ప్రశ్న: QDS, TDS, BD మరియు OD అనగా అర్ధం ఏమిటి?
జవాబు: QDS అనగా ఒక రోజుకు 4 సార్లు; TDS అనగా ఒకరోజుకు 3 సార్లు; BD అనగా రోజుకు 2 సార్లు మరియు OD అనగా రోజుకు ఒకసారి. ఈ సంక్షిప్తాలు లాటిన్పదాల నుండి వచ్చినవి. 6TD అనగా రోజుకు 6 సార్లు.
_____________________________________
2. ప్రశ్న: నీటిని శుద్ధి పరిచే ఒక చవకైన మరియు సులభమైన మార్గం ఏమైనా ఉందా?
జవాబు: నీటిని ఒక బ్రిస్టల్నీలం (ముదురునీలం) సీసాలో ఉంచి ప్రత్యక్ష సూర్యకాంతిలో మూడు నిమిషాల పాటు ఉంచితే ఆ నీరు త్రాగడానికి చక్కగా సరిపోతుంది. ప్రత్యక్ష సూర్యకాంతి లేకపోతే పగటి వెలుతురులోపది నిముషాలు, కృత్రిమ వెలుగులో ముప్పై నిముషాలు పడుతుంది.
_____________________________________
జవాబు: అవును, ఏ గ్రంధి అయినా విబ్రేషున్స్ (కంపనాలు)సాయంతో పునరుద్ధరించబడతాయి.
_____________________________________
4. ప్రశ్న: ఈ నివారణలు మానసిక స్థాయిలో పనిచేయగలవా?
జవాబు: నిజానికి, ఈ నివారణలుఅన్నిమూడు స్థాయిలలో పనిచేస్తాయి–శరీరం, మనసు మరియు ఆత్మస్థాయిలలో. ఎందుకనగా ఇది ఒక నిజమైన, సంపూర్ణమైన వైద్య విధానము. కానీ ఒక వ్యాదిని శరిర వ్యవస్థ నుంచి సంపూర్ణంగా తొలగించాలంటే ఆ వ్యాది యొక్క మూల కారణమును కొనుగోనాలి మరియు దాని కారణాలను,రోగ లక్షణాలను నయం చేయాలి. మూలకారణం ఒక షాక్, గాయం, ఒత్తిడి, సంక్రమణ మొదలైనవి ఉండవచ్చు.
దివ్య వైద్యుడి యొక్క దివ్య వాక్కు
"సేవ అనునది అందరి హృదయములలో నున్న భగవంతునికి నీవు చేసే ఆరాధన".
-సత్యసాయిబాబా
"అన్నింటి కన్నా గొప్పదైన విషయం సేవ కన్నా మరొకటి లేదు. మనం మన జీవితాలను సేవ కొరకు అంకితం చేయాలి. సేవ చేయలేని వ్యక్తి మనిషి కాజాలడు. అతను పశువు కన్న హీనం. మనం ఎట్టి పరిస్థితిలోనైనా సేవను వదిలిపెట్టరాదు. సేవ మన జీవితానికి శ్వాస వంటిది. సేవే మన జీవితం. సేవే మన గమ్యం."
-సత్యసాయిబాబా
ప్రకటనలు
భారత దేశంలో రాబోవు శిక్షణా శిబిరము
గుజరాత్: 8 ఏప్రిల్నుండి 10ఏప్రిల్ 2011 వరకు,అసిస్టెంట్విబ్రియోఅబ్యాసకులకు 23వ శిక్షణా శిబిరము మరియు జూనియర్విబ్రియో అబ్యాసకులకు 12వ శిక్షణా శిబిరము ఉంటుంది.
అదనపు సమాచారం
అధ్బుతమైన దోసకాయ
ఈ సమాచారం అనేక వారాల క్రితం జరిగిన న్యూయార్క్టైమ్స్వారి " స్పాట్లైట్ఆన్దిహోమ్" సిరీస్లో, సాధారణ సమస్యలును పరిష్కరించడానికి సృజనాత్మక మరియు కొత్తమార్గాలను అన్వేషించడంలో బాగంగా ప్రచురింపబడింది.
1. దోసకాయలలో మనకు ప్రతి రోజు కావాల్సిన విటమిన్లు చాలా ఉన్నాయి. కేవలం ఒక దోసకాయ విటమిన్బి 1, విటమిన్ B2, విటమిన్ B3, విటమిన్ B5, విటమిన్ B6, ఫోలిక్యాసిడ్, విటమిన్సి, కాల్షియం, ఇనుము, పొటాషియం, జింక్, మెగ్నీషియం మరియు ఫాస్ఫరస్కలిగి ఉంటుంది .
2. మధ్యాహ్నం అలసిపోతున్న ఫీలింగ్ ఉందా? కేఫ్ఫిన్కలిగి ఉన్న సోడాను వదిలిపెట్టండి మరియు ఒక దోసకాయను తీసుకోండి. ఇది B విటమిన్లు మరియు పిండి పదార్థాలుకు మంచి మూలం. అందువలన కొన్ని గంటల పాటు శక్తి నివ్వగల సామర్ద్యం దోసకాయకుంది.
3.స్నానం తర్వాత మీ బాత్రూమ్ అద్దంను పొగమంచు కప్పేసిందా? అద్దంను ఒక దోసకాయ ముక్కతో రుద్దడం ప్రయత్నించండి. ఇది పొగమంచు తొలగించడానికి మంచి ఉపాయం మరియు స్పా వంటి సువాసన కూడా అందిస్తుంది.
4. మీ పూల మొక్కలను క్రిములు పురుగులు నాశనం చేస్తునాయా? కొన్ని దోసకాయ ముక్కలను ఒక ఫాయ్టిన్లో (pie tin) వేసి వాటిదగ్గర ఉంచండి. మీ తోట క్రిమి కీటక రహితంగా తయారవుతుంది. దోసకాయలో ఉన్న రసాయనాలు అల్యూమినియంతో చర్య జరిపి మనుషులు గ్రహించలేని, కాని క్రిమికీటకాలను తరిమి కొట్టే ఒక వాసనను వెదజల్లుతుంది.
5. బయటకు లేదా ఈత కొలనుకు వెళ్ళే ముందు సెల్యులిట్cellulite తొలగించడానికి ఒక వేగవంతమైన మరియు సులువైన మార్గం గురించి ఆలోచిస్తున్నారా? కొన్ని నిమిషాలు మీ సమస్య ప్రాంతం వెంట ఒక లేదా రెండు దోసకాయ ముక్కతో రుద్ది ప్రయత్నించండి. దోస కాయలో ఉన్న పైటో కెమికల్రసాయనాలు మీ చర్మం యొక్క కొల్లజేన్ను గట్టి పరిచి మీ చర్మం బిగుతుగా మరియు సెల్యులిట్కన పడకుండా ఉండేట్టు చేస్తాయి. ఇది చర్మం మీద మడతలకు కూడా అద్బుతంగా పనిచేస్తుంది!!!
6. హ్యాంగోవర్లేదా భయంకరమైన తలనొప్పి నివారించడానికి ఉపాయం కావాలా? అయితే పడుకొనే ముందు కొన్ని దోసకాయ ముక్కలు తిని పొద్దున్నే తాజాగా తల నొప్పి లేకుండా నిద్రలేవండి. దోసకాయాలలో తగినంత చక్కెర, విటమిన్ B మరియు ఎలెక్ట్రోలైట్స్ ఉంటాయి !! ఇవి శరీర సమతుల్యతను మరియు కోల్పోయిన అవసరమైన పోషకాలు తిరిగి మనకు లబించేల చేస్తాయి
7.మధ్యాహ్నం లేదా సాయంత్రం వేసే చిరు ఆకలి పోగొట్టుకోవాలని ఉందా? దోసకాయలును శతాబ్దాలుగా యూరోపియన్వ్యాపారులు, వేటగాళ్ళు మరియు యాత్రికులు శీఘ్ర భోజనం కోసం ఉపయోగించేవారు
8. ఒక ముఖ్యమైనస మావేశo లేదా ఉద్యోగ ఇంటర్వ్యూకలిగి మరియు మీరు మీ బూట్లు మెరుగు పరచేందుకు తగిన సమయం లేదు అని బాధపడుతున్నారా? షూ మీద తాజాగా కోసిన దోసకాయ ముక్కతో రుద్ది ప్రయత్నించండి. దీని రసాయనాలు గొప్ప మెరుపును అందించటంతో పాటు నీటిని కూడా అంటకుండా చేస్తాయి
9. తలుపు లేదా కిటికీ శబ్దం చేస్తూ తెరుచుకుంటూ ఉందా మరియు WD-40, ఇంటి నునె లేదా? ఒక దోసకాయ ముక్క తీసుకోండి మరియు సమస్యాత్మక కీలు మీద రుద్దండి. చిటికెలో శబ్దం మాయం!
10. ఒత్తిడిలో ఉన్నారా మరియు ముఖ, శరీర మర్దన కోసం లేక స్పా సందర్శించడానికి సమయం లేదా? మొత్తం దోసకాయ కోసి మరిగే నీటి కుండలో వేయండి. దోసకాయ నుండి విడుదలయ్యే రసాయనాలు మరియు పోషకాలు వేడి నీటితో చర్య జరిపి ఆవిరిలో విడుదలవుతాయి. ఇవి ఒత్తిడిని తగ్గించి మనసుకు స్వాంతన చేకూర్చే చక్కని సువాసన అందిస్తాయి. ముఖ్యంగా బాలింతలకు మరియు పరీక్షల సమయంలో కళాశాలవిద్యార్థులుకు !
11. అప్పుడే వ్యాపార లావాదేవీలు పూర్తి చేసి భోజనం ముగించి గమ్లేదామింట్లేదని తెలుసుకున్నారా? ఒక దోసకాయ ముక్క తీసుకోండి మరియు మీ నాలుకతో మీ నోటి కప్పుపై బాగాన్ని 30 సెకన్ల పాటు అదిమి ఉంచండి. దోసకాయలో ఉన్న పైటో కెమికల్రసాయనాలు చెడు శ్వాస కలిగించే మీ నోటిలోని బ్యాక్టీరియాను చంపుతాయి.
12. మీ సింక్లు లేదా స్టెయిన్లెస్స్టీల్శుభ్రంచేయడానికి హరిత మార్గం గురించి ఆలోచిస్తున్నారా? ఒక దోసకాయ ముక్క తీసుకోండి మరియు మీరు శుభ్రం చేయడానికి కావలసిన ఉపరితలo మీద రుద్దండి. ఇది సంవత్సరాల తరబడి ఉన్న జిడ్డును వదిలించడమే కాకుండా తళతళలాడే మెరుపును, మీ చేతులకు వ్రేళ్ళకు ఎ మాత్రం హాని కలగకుండా ఇస్తుంది .
13. కలాన్ని ఉపయోగిస్తూ ఏదైనా పొరపాటు చేసారా? అయితే దోసకాయ ముక్కపై పొర తీసేసి మెల్లగా ఆ కలం రాతపై రాయండి. గోడలును అలంకరించేందుకు పిల్లలు ఉపయోగించిన క్రేయాన్స్మరియు గుర్తులపై కూడా ఇది అద్బుతంగా పని చేస్తుంది !!
ఒక విశిష్ట దీవెన: కళ్ళద్దాల లీల
అనా ఒక అంకిత బావం గల విబ్రియో అబ్యాసకురాలు. ఆవిడ తరచుగా పుట్టపర్తి చుట్టుప్రక్కల గ్రామాలను సందర్శించి అక్కడి రోగులకు వైద్యం అందిస్తుండేది. ఈ మధ్యనే ఆవిడ ఒక గ్రామంలో చాల మంది కంటి చూపు సమస్యతో బాధపడుతునట్లు గమనించింది. ఆవిడ వైద్యం వారికి ఉపయోగపడుతున్నా 27 మందికి కళ్ళద్దాలు వాడవలసిన అవసరం ఉన్నట్లు కానీ వారికి అవి కొనగలిగే ఆర్దిక స్తోమత లేనట్లు ఆవిడ గుర్తించింది .
అనా వారికి తను కేవలం విబ్రియో వైద్యం మాత్రమే అందిచగలని కళ్ళద్దాలు సమకుర్చలేనని తెలిపింది . అనా మరియు ఆమె భర్త వారిని వదలివెళుతుండగా ఆ రోగులు తను ఈసారి తమ దగ్గరికి వచ్చేటప్పుడు కళ్ళద్దాలు తీసుకురావల్సిందిగా ప్రాదేయపడ్డారు. అనా భర్త సరదాగా స్వామి ఏమి చేస్తారో చూద్దామన్నారు.
కొన్ని వారముల తరువాత ఒక మిత్రుడు అనా మరియు ఆమె భర్తను చూడడానికి వచ్చారు. అతను కొంత సందిగ్దంలో ఉన్నాడు. ఎందుకంటే అతను ఇండియా బయలుదేరి వచ్చే ముందు ఎవరో వ్యక్తి వచ్చి కళ్ళద్దాలు కల డబ్బా ఇచ్చి, వాటిని తనతో పాటు ఇండియా తీసుకెళ్లమని అక్కడ అవసరం ఉన్నవారికి వాటిని ఇవ్వమని చెప్పి వెళ్ళిపోయాడు. అయిష్టంగానే ఈ మిత్రుడు వాటిని పుట్టపర్తి తీసుకు వచ్చి వాటిని స్వామికి ఇవ్వాలని ప్రయత్నిస్తే స్వామి వాటిని వద్దనారు. ఆవిధంగా ఆకాశం నుంచి క్రిందపడ్డట్లుగా కళ్ళద్దాల డబ్బా అనా మరియు ఆమె భర్త వడిలో పడినట్లైంది!
అనా మరియు ఆమె భర్త ఈ కళ్ళద్దాల డబ్బాను తమ తదుపరి గ్రామ సందర్శన సందర్బంగా తీసుకేళ్ళారు. వారు కనీసం కొన్ని కళ్ళద్దాలైనా కొంత మందికి సరిపోగలవని బావించారు. గ్రామస్తులు చాల సంతోషంగా ఆ డబ్బా చుట్టుచేరారు. ఒక వ్యక్తి ఒక కళ్ళద్దాని తీసుకొని పెట్టుకోగా అవి తనకు సరిపోలేదు. అనా అతనికి ఇంకొకటి ఇవ్వగా అవి సరిగ్గా సరిపోయింది.ఇంకొక వ్యక్తి వచ్చి మొదటి కళ్లద్దాలను పెట్టుకోగా అవి సరిగ్గా సరిపోయింది. ఆ విధంగా ఒక్కొకరు తమకు సరిపోయే కళ్ళద్దాల కోసం వెదికి చూడగా ఆశ్చర్యంగా, అద్బుతంగా అందరికి తమ కంటి చూపుకి సరిపడా అద్దాలు చక్కగా దొరికాయి. ఒక కళ్ళజోడు మిగిలిపోగా అనా ఇక తిరిగి వెళ్ళడానికి సిద్దపడుతుండగా ఒక మహిళ పరిగెడుతూ వచ్చి తనకు కూడా కళ్ళద్దాలు కావాలనగా ఆ చివరి కళ్ళజోడు కూడా అద్బుతంగా ఆవిడకు సరిపోయింది.
ప్రతి గ్రామస్తునికి తనకు చక్కని కంటి చూపుకు సరిపడా కళ్ళజోళ్ళు దొరికాయి మరియు అన్ని కళ్ళజోళ్ళు ఉపయోగపడ్డాయి. ఈ దివ్యమైన లీల,కార్యం,సర్వాంతర్యామి, సర్వవ్యాపి అయిన సత్య సాయి దేవుడు తప్ప ఇంకెవరు చేయగలరు?
జై సాయిరామ్!