Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

Vol 2 సంచిక 2
March 2011
ముద్రింప తగిన వార్తాలేఖ


పూర్తి వార్తాలేఖ యొక్క కాగితం ప్రతి కావలెనన్నఈ పుటను ముద్రించండి

డా.జిత్. కే అగ్గర్వాల్ యొక్క మాటల్లో

ప్రియమైన సాధకులకు,

మీ అందరికి ప్రశాంతి నిలయం నుండి సాయి రామ్ ! ఒక అందమైన అనుభూతితో నూతన సంవత్సరం ప్రారంభమైనది మరియు మరోసారి కొన్ని అద్భుతమైన వైబ్రో సమాచారాలను మీతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. వైబ్రియానిక్స్ శిక్షణ పొందిన సాధకుల సంఖ్య, చికిత్స పొందిన రోగుల సంఖ్య మరియు సేవ చేసిన సమయం వంటి వివరాలతో కూడిన మా వార్షిక నివేదికను, ప్రతి సంవత్సరం మేము స్వామికి సమర్పించే విషయం మీ అందరికి తెలిసే ఉంటుంది.  ఈ సంవత్సరం, జనవరి 19న స్వామి తమ దివ్య హస్తాలలో నివేదికను అందుకొని చదివారు మరియు "చాలా సంతోషం" అని అతిసుందరమైన చిరునవ్వు చిందిస్తూ చెప్పారు. నూతన సంవత్సరం సందర్భంగా, సాక్షాతూ భగవంతుడు నేరుగా మనకిచ్చిన బహుమతి ఇది. స్వామీ ఈ సేవా కార్యక్రమాన్ని కేవలం ఆశీర్వదించడమే కాకుండా మనం చేసే సేవను చూసి సంతోషించడం మనందరికీ ఈ సేవను మరింత ఉత్సాహంతో చేయడానికి ఒక ప్రోత్సాహకం.

వ్యక్తిగత స్థాయిలో, ఎన్నో అద్భుతమైన విషయాలు జరుగుతున్నాయని విన్నాము. ఒక వైబ్రో చికిత్సా నిపుణులు 2792 108CC బాక్సును తీసుకున్న వెంటనే బాక్సులో ఉన్న ప్రతియొక్క సీసా చుట్టూ విభూతి రావడం జరిగింది(వెనుక పేజీలో పటం చూడండి) లండన్లో మరొక చికిత్సా నిపుణులు తయారు చేసే ప్రతియొక్క వైబ్రో మందుపై లేదా రోగి యొక్క నమోదు పత్రంపై విభూతి రావడం జరుగుతోంది.  అనేక విధాలుగా తమ మద్దతును మరియు సర్వవ్యాపకత్వాన్ని చూపించి మనందరిని ఆశీర్వదిస్తున్నందుకు స్వామికి కృతజ్ఞ్యతల్ను తెలుపుకుంటున్నాము.

 

మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కేరళ రాష్ట్రంలో నిర్వహించ బడిన ప్రథమ AVP శిక్షణా శిభిరం పూర్తైన ఒక నెల తర్వాత, శిక్షణ పొందిన సాధకులు తమ సొంత వార్తాలేఖను ప్రారంభించారు. ఈ అద్భుతమైన చొరవను అభినందిస్తూ, ఇతర వైబ్రో చికిత్సా నిపుణులకు ఇది స్ఫూర్తి కలిగిస్తుందని ఆశిస్తున్నాము.

మా పాత వెబ్సైట్ చిరునామా www.sairam.freeuk.com ఇకపై ఉండదని మరియు మా కొత్త URL www.vibrionics.org అని గమనించగలరు. ప్రస్తుతం ఈ కొత్త వెబ్సైట్ ను నవీకరించే ప్రక్రియ జరుగుతున్నది. ఈ ప్రక్రియ పూర్తవ్వగానే మీకు ప్రకటన ఇవ్వబడుతుంది.

చివరిగా ఒక జ్ఞాపిక - మనము వైద్యులు కాము, స్వామి యొక్క సాధనములు. స్వామియే రోగులను నయంచేసే ప్రధాన వైద్యుడు.

మీ  ఇ-మెయిల్స్ ను మాకు పంపుతూ ఉండండి మరియు స్వామిని ఎంతో సంతోషపర్చే మీ సేవను కొనసాగించండి!

ప్రేమపూర్వకంగా సాయి సేవలో

జిత్ అగ్గర్వాల్

ప్లాంటార్ ఫేసిఐటిస్ (మడమ భాగంలో సమస్య) 11205...India

ఒక 52 ఏళ్ళ మహిళ ఎనిమిది నెలల పాటు మడము వాపుతో భాధపడింది. వైద్యుడు ఇచ్చిన మందులతో ఈమెకు ఉపశమనం కలుగలేదు. ఆమె మడము భాగంలోనున్న ఎముకలో వరసగా కొద్ది రోజుల పాటు ఇంజెక్షన్లు ఇస్తే ఉపశమనం కలుగే అవకాశముందని వైద్యుడు చెప్పారు. ఈ భాదాకరమైన చికిత్సను నిరాకరించి, ఈ రోగి ఒక వైబ్రియానిక్స్  చికిత్సా నిపుణులను సంప్రదించింది. ఒక సంవత్సరం క్రితం ఈమెకు సయాటికా సమస్య కూడా ఉండేదని వైబ్రో నిపుణులకు చెప్పింది. ఈమె వయస్సును దృష్టిలో పెట్టుకొని ఈమెకు బోలు ఎముకల వ్యాధికి సంభందించిన మందును కూడా చేర్చి ఈ క్రింద వ్రాసిన మందులు ఇవ్వబడినాయి:
CC3.7 Circulation + CC18.5 Neuralgia + CC20.3 Arthritis + CC20.4 Muscles & supportive tissues + CC20.5 Spine + CC20.6 Osteoporosis…QDS

ఒక నెల తర్వాత రోగి పూర్తిగా కోలుకొని, ఏ నొప్పి లేకుండా హాయిగా నడవ గలిగింది. చికిత్సా నిపుణులు మరో నెల రోజులు ఈ మందులను TDS మోతాదులో తీసుకోమని చెప్పారు. అప్పటి నుండి రోగికి మడములో నొప్పి లేదా వాపు సమస్య తిరిగి రాలేదు.

సంపాదకుని వ్యాఖ్యానం:
ఈ రోగి కేసులో విజయవంతమైన ఫలితం లభించినప్పడికి, చికిత్స ప్రారంభంలో కేవలం మడమ వాపుకి మాత్రం మందునిచ్చి, బోలు ఎముకల సమస్య లేదా సయాటికా సమస్యల లక్షణాలు కనిపించినప్పుడు వాటికి సంబoదించిన మందును చేర్చిచ్చుంటే భాగుండేది.

స్కార్లెట్ జ్వరం 02680...Japan

ఒక 18 నెలల బాలుడికి ఒక వారం రోజుల పాటు తీవ్రంగా జ్వరం వచ్చి, ఆహారం తినకుండా కనీసం నీరైనా తాగకుండా ఉండేవాడు. తల్లిపాలు తప్ప ప్రతీది వాంతులు చేసుకునేవాడు. ఈ బాలుడు నిద్రపోకుండా నిరంతరం ఏడుస్తూనే ఉండేవాడు. ఈ బాలుడికున్న ఇతర వ్యాధి లక్షణాలు: శరీరం అంతటా దద్దుర్లు (నోటిలో కూడా) మరియు విరోచనాలు. డాక్టర్లు ఈ బాలుడికి స్కార్లెట్ జ్వరమని నిర్ధారించారు. ఇటువంటి తీవ్రమైన పరిస్థితిలో బాలుడికి అల్లోపతి మందులివ్వడం ఇష్టపడక తల్లి వైబ్రియానిక్స్ చికిత్సా నిపుణులను సంప్రదించింది. ఈ క్రింద వ్రాసిన మందులు ఈ బాలుడికి ఇవ్వబడినాయి:
NM2 Blood + NM18 General Fever + NM26 Penmycin + NM36 War + NM80 Gastro + NM86 Immunity + SM41 Uplift + SR316 Streptococcus…every 10 minutes for 3 hours, then 6TD and TDS on improvement

మొదటి డోస్ తర్వాత బాలుడు నీరు తాగి వాంతి చేసుకోకుండా ఉన్నాడు. ఒక రోజు తర్వాత బాలుడి ఆరోగ్యం మరింత మెరుగు పడింది. మూడు రోజుల తర్వాత, బాలుడి ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి వచ్చింది కాని ఎనిమిది రోజుల తర్వాత బాలుడి ముఖం, చేతులు మరియు కాళ్ళు వాచడం కారణంగా ఈ క్రింద ఉన్న మందులను పైనున్న మందుల మిశ్రమంలో చేర్చివ్వబడింది:
NM21 KBS + OM15 Kidneys

ఐదు రోజుల తర్వాత ఈ శిశువు సాధారణంగా తినడం మరియు నడవడం ప్రారంభించాడు. మూడు వారాల తర్వాత రోగ లక్షణాలు పూర్తిగా తొలగిపోయాయి. ఈ శిశువు యొక్క భరువు కొద్దిగా తగ్గింది కాని చాలా ఆరోగ్యకరంగా ఉన్నాడు. అంతేకాకుండా ఈ శిశువు యొక్క చర్మం అనారోగ్యం రావడానికి ముందు కంటే కూడా స్పష్టంగా మారింది.

సంపాదకుని వ్యాక్యానం:
విజయవంతమైన కేసులో ఒక వైబ్రియానిక్స్ హీలింగ్ పోతంటైసర్ (SRHVP)ఉపయోగించబడింది. 108 బాక్సు ను ఉపయోగించినట్లయితే, క్రిందున్న మందులను ఇవ్వచ్చు:
CC9.4 Scarlet Fever + CC13.1
Kidney tonic                   

వీటితో కూడా విజయవంతమైన ఫలితాలు లభించి ఉండేవి.

పుట్టుకతో వచ్చిన గుండె వ్యాధి 02640...India

పుట్టుకతో వచ్చిన గుండె వ్యాధి సమస్యతో ఒక ఆరు నెలల పాపను ఒక వైబ్రో చికిత్సా  నిపుణుడు వద్ద తీసుకు రావడం జరిగింది.  అల్లోపతి డాక్టరైన ఈ వైబ్రో సాధకుడు శిశువును పరీక్షించి, శిశువు యొక్క హృదయంలో వ్యాధి ఉందని నిర్ధారించారు. బిడ్డ యొక్క తల్లి తండ్రులకు శాస్త్రచికిత్స చేయించే ఆర్ధిక స్తోమత లేనందువల్ల వైబ్రో చికిత్సా నిపుణులు ఈ క్రింద వ్రాసిన మందులను ఇవ్వడం జరిగింది:
CC3.1 Heart Tonic + CC3.4 Heart Emergencies + CC12.2 Children Tonic

మొదటి కొన్ని వారాలు ఈ మందులను నీటిలో రోజుకి నాలుగు సార్లు ఇవ్వడం జరిగింది. ఆపై రోజుకి మూడు సార్లు (TDS ) ఇవ్వడం జరిగింది. ఈ చికిత్సను ఒకటిన్నర సంవత్సరాలు శిశువుకిచ్చారు.

రెండేళ్ళ వయస్సున్న ఈ శిశువును పరిశీలించిన హృదయ వ్యాధి నిపుణుడు, 2D ఎకో పరీక్ష మరియు ఇతర నివేదికలను చూసి, గుండె వ్యాధి లక్షణాలు ఏవీ లేవని ఎంతో ఆశ్చర్యంతో చెప్పారు.

గాయపడిన పిల్లి 02494...Italy

ఒక నాలుగేళ్ల ఆడ పిల్లి తీవ్రంగా గాయపడడం వల్ల, పిల్లి యొక్క కుడి పక్కటెముకలో స్వల్ప పగులు కలిగి ఉన్నట్లు కనుగొనబడింది. ఈ తీవ్ర గాయం కారణంగా పిల్లి  విపరీతంగా భెధిరి పోయింది  మరియు తీవ్ర నొప్పితో భాధపడింది. పిల్లి యొక్క యజమాని పిల్లికి అల్లోపతి మందులను ఇవ్వడం ఇష్టపడక, వైబ్రో చికిత్సా నిపుణుడను సంప్రదించారు. ఈ క్రింద ఉన్న వైబ్రో మందులు ఇవ్వబడినాయి:
NM20 Injury + NM3 Bone I + SR271 Arnica (30C) + NM95 Rescue

వైబ్రో మందును నీటిలో కలిపి ఒక గంట సమయం వరకు, ప్రతి పది నిమిషాలకి ఒక డోస్ చప్పున పిల్లికి ఇవ్వబడింది. ఆపై మూడు రోజులకు ప్రతి రోజు ఆరు సార్లు (6TD) మరియు ఆపైన TDS మోతాదులో ఈ మందు ఇవ్వబడింది.

ఒక రోజు తర్వాత పిల్లికి నొప్పి 50% తగ్గిందని మరియు పిల్లి చాలా ప్రశాంతంగా కనిపించిందని చికిత్సంధించిన నిపుణుడు చెప్పారు. మూడు రోజుల తర్వాత పిల్లి 100% కోలుకుందని, ప్రమాదం జరిగడానికి ముందు ఉన్నట్లుగా పరుగులెత్తుతూ గెంతుతూ తిరగడం కొనసాగించిందని నిపుణుడు తెలిపారు.

సంపాదకుని వ్యాఖ్యానం:
విజయవంతమైన ఫలితాలు లభించిన ఈ కేసులో వైబ్రియానిక్స్ హీలింగ్ పోతంతైసర్ ను (SRHVP) ఉపయోగించి మందు తయారు చేయబడింది. 108CC బాక్సు అందుబాటులో ఉండుంటే CC10.1 Emergencies ఇచ్చి విజయవంతమైన ఫలితాలను పొందియుండవచ్చు.

PCOD లేదా పోలిసిస్టిక్ ఓవరియన్ డిసీస్ (అండకోశాలలో తిత్తులు) 10728...India

ఒక 42 ఏళ్ళ మహిళ తన ఋతు కాలాల సమయంలో అధిక రక్తస్రావం సమస్యతో పాటు విపరీతమైన నొప్పితో భాధపడేది. అంతేకాకుండా, ఈ రోగి అండకోశాలలో అనేక తిత్తులు ఉండేవి మరియు ఋతు కాలాలు అపక్రమంగా ఉండేవి. ఈమెకు ఈ క్రింద రాసియున్న మందులు ఇవ్వబడినాయి:
CC8.7 Menses Painful + CC20.6 Osteoporosis…TDS

ఈ చికిత్సను ప్రారంభించిన ఒక నెల తర్వాత రోగియొక్క ఋతు క్రమం, నొప్పి లేకుండా సాధారణంగా మారింది, అయితే అల్ట్రా సౌండ్ పరిశీలనలో రోగి  యొక్క కుడి అండకోశంలో పెద్ద రక్తసిక్త తిత్తు ఉందని తెలిసింది. వైద్యుడు ఈమెకు శస్త్రచికిత్స చేయాలని చెప్పారు. రోగి శస్త్రచికిత్స చేయించుకోవడం నిరాకరించి వైబ్రో చికిత్సా నిపుణుడను సంప్రదించింది. ఈమెకు ఇవ్వబడిన మందులు:
CC8.4 Ovaries + CC20.6 Osteoporosis …TDS

పది రోజుల తర్వాత చేసిన అల్ట్రా సౌండ్ పరిశీలనలో రోగి యొక్క రెండు అండకోశాలలోను తిత్తులు మాయమయ్యాయని తెలిసింది. వైబ్రియానిక్స్ ద్వారా ఆమెను నయం చేసినందుకు ఈ మహిళ స్వామికి కృతజ్ఞ్యతల్ను తెలుపుకుంది.

ప్రశ్నలు సమాధానాలు

1. ప్రశ్న:  నేను తినే కూరగాయిలు మరియు పళ్ళ నుండి రసాయనాలను తొలగించడం ఎలా?

    జవాబు:   ఎల్లప్పుడూ మీ సొంత తోట నుండి లేదా తాజా సేంద్రీయ పండ్లు మరియు కూరగాయలు తినడానికి ప్రయత్నించండి. లేదా మీరు తినే కూరగాయిలు మరియు పళ్ళల్లో రాసాయనాలున్నాయని మీకు అనిపిస్తే ఈ కింది విధానాన్ని ఉపయోగించండి: ఒక గిన్నెలో సగం వరకు నీరు పోసి, నీటిలో ఒక గరిటెడు ఉప్పు, రెండు గరిటేడ్లు వినెగర్ కలపండి. ఈ నీటిలో కూరగాయిలు మరియు పండ్లను ఇరవై నిమిషాలు పాటు నానపెట్టుంచండి. ఇలా చేయడం ద్వారా పురుగుల మందులు మరియు ఇతర రసాయనాలు తొలగిపోతాయి. ఆపై కూరగాయిలు మరియు పండ్లను తాజా నీటిలో పూర్తిగా కడగాలి..

_____________________________________

2, ప్రశ్న:  నేను ఒక వైబ్రియానిక్స్ వైద్యుడినని చెప్పుకోవచ్చా?

    జవాబు:   లేదు. మీరు వైబ్రియానిక్స్ వైద్యుడినని చెప్పుకో రాదు. మీరు స్వామీ యొక్క సాధనములు మరియు వైబ్రియానిక్స్ అభ్యసించే చికిత్సా నిపుణులు మాత్రమే. రోగులను నయంచేసే ప్రధాన వైద్యుడు స్వామి మాత్రమే. వైద్యులు రోగాలని నయం చేయడానికి విశేష శిక్షణ పొందియుంటారు. వైబ్రియానిక్స్ చికిత్సను ఇవ్వడానికి వైద్య సంభంధమైన జ్ఞ్యానం కలిగియుండక్కర్లేదు. మీరు ఇస్తున్న మందులకు మీరు డబ్బులు వసూలు చేయడం లేదా సహాయాలు అడగడం వంటివి చేయట్లేదు. ఇది అవసరమైన వారికి ప్రేమతో మనమంధించే సేవ. ఈ మందులో రసాయనాలను లేదా వాస్తవిక పదార్థాలను కలపడం లేదు. వాస్తవంలో ఇవి చక్కర గోలీలలో లేదా నీటిలో కలిపే కంపనాలు (వైబ్రేషన్లు) మాత్రమే. మీరిచ్చే ఈ మందులను అల్లోపతి మందులని రోగులు తప్పుగా అర్ధం చేసుకోవచ్చని మీకనిపిస్తే మందుల సీసా పైన "చక్కర గోలీలు మాత్రమే" అని చీటీలో వ్రాసి అతికించగలరు.

_____________________________________

3. ప్రశ్న:  వైబ్రో మందులకు భాగా స్పందిస్తున్న ఒక రోగి, అల్లోపతి మందులను తీసుకోవడం ఆపాలని కోరుకుంటోంది. నేను విధముగా ఆమెకు సహాయం చేయాలి?

    జవాబు:   రోగిని అల్లోపతి మందులను వేసుకోవడం ఆపమని మీరు చెప్పరాదు. నయమైనట్లు ఆమెకు అనిపిస్తుంటే, స్వయంగా ఆమె వైద్యుడు వద్దకు వెళ్లి మాట్లాడాలని చెప్పండి. అల్లోపతి మందులను తగ్గించే భాద్యత రోగిది లేదా రోగి యొక్క వైధ్యుడిది.

_____________________________________

4. ప్రశ్న:  ఒక రోగి యొక్క కుమారుడుకి మద్యం మరియు పొగాకు వంటి దుర్వ్యసనాలు ఉన్నాయి దురలవాట్లను మాన్పించడానికి వైబ్రో మందులను నా వద్దనుండి తీసుకొని తన కుమారుడికివ్వాలని రోగి కోరుకుంటోంది. విధముగా ఇచ్చిన మందులు పనిచేస్తాయా?

    జవాబు:  లేదు. పొగాకు, మద్యం వంటి ధుర్వ్యసనాలున్న రోగుల విషయంలో, రోగులు మీ వద్దకు నేరుగా వచ్చి వైబ్రో చికిత్స ఇవ్వమని కోరాలి.   ధుర్వ్యసనాలను మానుకోవాలన్న రోగుల నిశ్చయం ధృడమైనదని మీరు నిర్ధారించుకున్న తర్వాతే చికిత్సను ప్రారంభించాలి. నయంకావడానికి, రోగి యొక్క బలమైన మానసిక వైఖిరి చాలా ముఖ్యమని మీరు గుర్తుంచుకోవాలి.

మీరు డా.అగ్గర్వాల్ను ఏమైనా ప్రశ్న అడగాలని అనుకుంటున్నారా? అయితే, మీ ప్రశ్నలను ఈ కింద ఇవ్వబడిన వెబ్సైటుకు పంపించండి:  [email protected]

వైద్యులకే వైద్యుడి యొక్క దివ్య వాక్కు


"మీరు దేవుని యొక్క సేవకుడుగా ఉన్నప్పుడు, సర్వశక్తులు మరియు ఆనందం మీకివ్వబడతాయి. ఒక యజమాని వలె ఉండడానికి ప్రయత్నిస్తే, మీ చుట్టూ ఉన్నవారిలో అసూయ, ద్వేషం, కోపం మరియు దురాశను కలిగించినవారవుతారు. మీరు దేవుని చేతిలో ఉన్న ఒక సాధనమని భావించండి.  దేవుని మిమ్మల్ని తీర్చిదిద్ది ఒక సాధనముగా ఉపయోగించనివ్వండి."
-సత్య సాయి బాబా

 

"సేవను అత్యుత్తమమైన సాధనగా భావించండి (ఆధ్యాత్మిక క్రమశిక్షణ). ఇది మీరు దక్కించుకున్నట్టు వంటి ఒక గొప్ప అవకాశం. మీరు చేసే ధ్యానం లేదా జపం కంటే, ఈ పెద్ద సమావేశాలకు మధ్య మీరు చేసే సేవ, మీ ఆధ్యాత్మిక అభివృద్ధికి మరింత ఉపయోగకరంగా ఉంటుంది. కాని, మీరు చేసే సేవ ద్వారా ఈ ప్రపంచంలో పరివర్తన తీసుకు రావచ్చని అనుకోవద్దు.  సేవ యొక్క అసలైన విలువ మీలో కలిగే పరివర్తన. సేవను ఒక సాధన వలె చేయండి. అప్పుడు మీరు వినయపూర్వకంగాను ఆనందంగాను ఉండగలరు. మీరు ఇతరులను అభివృద్ధిపరచుతున్నామని గర్వపడవద్దు, మిమ్మల్ని మీరు సంస్కరించుకోండి".
-సత్య సాయి బాబా

 

"మానవులకు దేవుని మార్గాలు అర్ధం కావు. ఒక ప్రత్యేక కార్యక్రమం ఒక నిర్దిష్ట పద్ధతిలో ఒక నిర్దిష్ట సమయంలో ఎందుకు జరుగుతుందని వాళ్ళు ఎలా తెలుసుకోగలరు? దేవునికి మాత్రమే సర్వము ఎరుక. కాని మానవులు చెడుగా మాట్లాడడం లేదా తీర్మానించడం వంటివి చేస్తుంటారు. ఉదాహరణకు ఇక్కడ ఎవరైనా అనారోగ్యంతో మరణిస్తే (ప్రశాంతి నిలయం). ఎవరైనా మరణాన్ని తప్పించుకోగలరా? అవతార మూర్తులు కూడా వారు వచ్చిన కార్యక్రమం పూర్తవ్వగానే భౌతిక రూపాన్ని విడిచిపెడతారు. మీకు కావాల్సిన వారు మరణించారని దేవునిపై నమ్మకం కోల్పోవడం అవివేకము".
-సత్య సాయి బాబా


 

ప్రకటనలు

వర్క్షాప్లు:

భారతదేశం: 8 నుంచి 10 ఏప్రిల్ 2011, గుజరాత్, అసిస్టెంట్ విబ్రో ప్రాక్టిషనర్స్ AVP లకు 23 వ వర్క్షాప్ మరియు జూనియర్ విబ్రో ప్రాక్టీషనర్స్ JVP ల కోసం 12 వ వర్క్షాప్.

భారతదేశం: 24-26 జూన్ 2011 ఢిల్లీలో, AVP ల కోసం మొదటి వర్క్ షాప్. మీ స్థానిక సమితి కన్వీనర్ను సంప్రదించండి.

ఇటలీ: 8-10 ఏప్రిల్ 2011 ఇటలీలో మొట్టమొదటి వర్క్ షాప్, వెనిస్ సమీపంలో ఒరిగోలో. ఫాబియో ప్రీవియాటి వద్ద 041-563 0288 లేదా ఇమెయిల్ ద్వారా [email protected].

పోలాండ్: 14-15 మే లో Opole - అసిస్టెంట్ Vibro ప్రాక్టీషనర్స్ మరియు JVPs కోసం వర్క్షాప్.

పోలాండ్: వ్రోక్లాలో 12-13 నవంబర్ - అన్ని JVP లు మరియు పూర్తి Vibro ప్రాక్టీషనర్స్ కోసం రిఫ్రెషర్ వర్క్షాప్ మరియు ఆసక్తికరమైన సందర్భాలలో సమీక్ష.

అదనపు సమాచారం

ఆరోగ్య చిట్కాలు

భరువును మరియు రక్త చక్కెర స్థాయిను తగ్గించే దాల్చిని

ఒక పరిశీలనలో, సాధారణ వంటగది మసాలాగా ఉపయోగపడే, దాల్చిన చెక్క, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుందని తెలిసింది. అంతేకాకుండా దాల్చిన చెక్కకు కొవ్వును కరిగించి భరువును తగ్గించే లక్షణాలు కూడా ఉన్నాయని తెలిసింది. దాల్చిన చెక్క పురాతన కాలం నుండి ఉపయోగించ బడుతోంది.

ఒక పరిశీలనలో, ప్రతిరోజు ఒకటి నుండి ఆరు గ్రాముల దాల్చినను తీసుకున్న టైప్ 2 డయాబెటిస్ రోగులలో రక్త చక్కెర స్థాయిలు తగ్గాయని నిర్ధారించబడింది. దాల్చిన తీసుకోవడం వల్ల ఈ ఫలితాలు ఎలా లభించాయని నిర్ణయించబడలేదు కాని దాల్చిన ద్వారా కలిగిన సఫలితాలు దీన్ని తీసుకోవడం ఆపేసిన ఇరవై రోజుల వరకు కొనసాగాయి. భోజనం చేసిన తర్వాత, రోజుకి మూడు గ్రాములు దాల్చిన తిన్న ఆరోగ్యవంతులైన వ్యక్తులలో రక్త చక్కెర స్థాయిలు తగాయని, 2009 లో చేసిన ఒక పరిశీలనలో తెలిసింది.

శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు అధికంగా ఉన్నప్పుడు రక్తంలో ఉన్న అదనపు చక్కెర, తక్కువగా ఉపయోగించబడుతుంది (చక్కెర శరీరంలో కొవ్వుగా నిల్వ చేయబడుతుంది). ఈ కారణంగా భోజనం తర్వాత ఇన్సులిన్ తగ్గింపు చాలా శ్రేష్టమైనది. దాల్చిని రక్తంలో చక్కెర స్థాయిను, దీని కారణంగా కొవ్వు స్థాయిను నియంత్రించడానికి సహాయపడుతుంది. ఈ విధంగా దాల్చిని శరీర భరువును తగ్గిస్తుంది.

మధ్య యుగంలో దాల్చిని బంగారం కంటే ఎక్కువ విలువైనదిగా భావించ పడేది. 17 వ శతాబ్దం డచ్ పోర్చుగీస్ యుద్ధం భాగంగా, ఒక విధమైన తీపి దాల్చిని అపారంగా లభించే సిలోన్ దేశాన్ని (ఇప్పుడు శ్రీలంక) నియంత్రణలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయబడింది. సిలోన్ దాల్చిని లేదా "అసలైన దాల్చిని" అన్న పురాతన పేరు ఇప్పడికి ఉంది. మరొక పురాతనమైన మరియు ప్రధానమైన రకం కేసియా దాల్చిని. ఇది "అసలైన దాల్చిని" కన్నా తక్కువ కరీదులోను మరియు సులభంగాను లభిస్తుంది. కేసియా దాల్చిని గురించిన ప్రస్తావన బైబుల్లో చేయపడి ఉంది. ఈజిప్షియన్లు శవాలని భద్రపరిచే ప్రక్రియలోనూ మరియు ఆహార సువాసన కొరకు దాల్చిని చెక్కను ఉపయోగిస్తారు.

వివిధ తీయటి రుచులున్న అనేక దాల్చిన రకాలు పెరుగుతాయి. క్రిమినాశక లక్షణాలు దాల్చినిలో ఉన్న కారణంగా, అథ్లెట్ ఫుట్ (పాదాలలో ఒక రకమైన చర్మ వ్యాధి) నయంచేయడానికి ఇది ఉపయోగపడుతోంది. ధల్చినిని పీల్చడం వల్ల జ్ఞ్యాపక శక్తి మెరుగుపడుతుంది మరియు కడుపు రుగ్మతలు, అజీర్ణం వంటి సమస్యల ఉపశమనానికి కూడా ఉపయోగపడుతుంది.  దాల్చిని శరీరంలో అధికంగా వేడి సృష్టిస్తుందని గమనించాలి. ఈ వేడిని ఎదుర్కోవడానికి శరీరం తన సొంత వేడిని సృష్టించి సమతుల్యతను తీసుకు వస్తుంది. ఈ ప్రక్రియను తెర్మోజేనిక్స్ అంటారు. ఈ ప్రక్రియ ద్వారా కొవ్వు కరుగుతుంది.

టీలు, బజ్జీలు, కేకులు, ఐస్ క్రీమ్లు, చారు, కుడుములు, కూరలు వంటి ఆహార పదార్థాలను మరింత రుచికరంగా ఉండాలంటే వాటిలో దాల్చిని చెక్కను చేర్చాలి. మీరు దాల్చిని చెక్క సువాసనను చూసి దాన్ని ఎన్నుకోవచ్చని మీరు గుర్తు పెట్టుకోవాలి. ఒక గాఢమైన మరియు తీపి వాసన, దాల్చిని యొక్క  తాజాదనాన్ని సూచిస్తుంది. దాని రుచి కొంతవరకు చేదు లేదా గాడమైన సువాసన లేకుండా ఉన్నట్లయితే, అది దాని బలహీనతను సూచిస్తుంది కాబట్టి దాన్ని పారవేయచ్చు. ఇటువంటి దాల్చిని భరువు తగ్గించడానికి పనికి రాదు. దాల్చిని చెక్కను ఇతర ఆహారాలుతో కలిపినప్పుడు, దాని సువాసన బయిటికి వస్తుంది కాబట్టి దాల్చిని యొక్క తాజాతనం చాలా ముఖ్యం.

ఇప్పటివరకు దాల్చిన ఎక్కువగా ఉపయోగించడం వలన, ఏ విధమైన శాశ్వత హానికరమైన ప్రభావాలు కలగలేదు. అయితే డయాబెటిస్ లేదా కొలెస్ట్రాల్ మందులను తీసుకొనే రోగులు తమ తమ వైద్యులు వద్ద సలహా తీసుకోవడం మంచింది. దాల్చిన రక్త చక్కెర నియంత్రణలో మరియు భరువు తగ్గించడంలో ఒక ఉత్తమ ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చని నిర్ధారించపడింది.

మూలం: NaturalNews.com and http://care.diabetesjournals.org

 

రుమటాయిడ్ ఆర్థరైటిస్(కీళ్ళ వాతం) యొక్క ఎనిమిది సంకేతాలు మరియు లక్షణాలు

రుమటాయిడ్ ఆర్థరైటిస్ (RA ) లేదా వాత రోగం కీళ్ళను మరియు ఇతర శరీర భాగాలను భాదింప చేసే ఒక తీవ్రమైన ఆటో ఇమ్యూన్ వ్యాధి. కాని ఈ రోగాన్ని నిర్దారించడం చాలా కటినం. ఈ రోగం యొక్క లక్షణాలు ఇతర అనారోగ్యాలను అనుకరించవచ్చు లేదా లక్షణాల తీవ్రత ఎక్కువై తగ్గుతూ ఉండవచ్చు. ల్యాబ్ పరిశోధనల్లో సరైన ఫలితాలు లభించక పోవచ్చు.  వ్యాధి ముదిరే వరకు ఎక్స్రేలు ఈ వ్యాధిని సూచించవు.

వాత రోగాన్ని నిర్ధారించే ఎనిమిది లక్షణాలు మరియు సూచనలు :

నయంకావడానికి లేదా మానడానికి కఠినమైన గాయాలు:  వాతరోగం కారణంగా, వచ్చే కీళ్ళ నొప్పిను మీరు ఒక గాయం వల్ల అని అనుకోవచ్చు. ఉదాహరణకు నయంకాని బెనికిన చీలమండ. న్యూ యార్క్ సిటీలో స్పెషల్ సర్జరీ హాస్పిటల్ లో పనిచేస్తున్న సహాయక కీళ్ళవాతశాస్త్ర నిపుణురాలు, లిసా A. మండల్, MD, MHP, ఈ రోగం యువతలో సర్వసాధారణమని చెభుతున్నారు.” ఒక రోగికి సాకర్ ఆట ఆడిన మరుసటి రోజు మోకాలు వాచిపోయింది. రెండు ఆర్థ్రోస్కోపిక్ శస్త్రచికిత్సలు మరియు తీవ్ర ఫిసియోతేరపి చేయించుకున్న రోగులను నేను చూసాను. ఈ రోగులకు వాతరోగం ఉంది.”

చేతులలో తిమ్మిరి లేదా జలదరింపు:  మణికట్టు మరియు చేతులలో జలదరించటం, వాతరోగం యొక్క లక్షణాలలో ఒకటి. దీన్ని కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అంటారు. ఈ వ్యాధి ఉన్న రోగులకు, వాపు  కారణంగా చేతుల్లోకి వెళ్ళే నరాలు నొక్కబడి జలదరింపు ఏర్పడుతుంది. ఈ వ్యాధి లక్షణాలు సాధారణంగా రాత్రి సమయంలో తీవ్రంగా ఉంటాయి. ఈ లక్షణాలతో వైద్యుడును సంప్రదించినప్పుడు, వాతరోగం యొక్క ఇతర లక్షణాలు లేనందువల్ల (లేదా మీరు చెప్పనందువల్ల) మీకున్నది కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అని నిర్ధారించి, వైద్యుడు దీనికి సంభంధమైన చికిత్సను మాత్రము మీకివ్వడం జరుగుతుంది.

 పాదాల రోగ సమస్య:  నొప్పి లేదా వాపు వంటి వాతరోగం సంభందిత లక్షణాలు తరచుగా కనపడే ప్రాంతం ముందరికాలు. ఈ సమస్యున్న మహిళలు హీల్సున్న చెప్పులు ధరించడం ఆపేసి నొప్పి ఉపశమనం కొరకు పాదనిపుణుడను సంప్రదిస్తూ ఉంటారు. వాతరోగం ఉన్న కొంతమంది రోగులు,   ప్లాంటార్ ఫేసిఐటిస్ (అరికాలిలో మడమ వద్దనున్న కణజాలంలో వాపు కారణంగా కలిగే సమస్య) కారణంగా వచ్చే మడమ నొప్పితో భాధపడుతుంటారు.

కంటి సమస్యలు:  వాతరోగం ఉన్న రోగులలో జగ్రెన్స్ సిండ్రోమ్ అన్న ఒక కంటి సమస్య వచ్చే ప్రమాదముంది. ఈ సమస్యున్న రోగులకు, గ్రంధులలో ఏర్పడే వాపు కారణంగా కళ్ళు , నోరు, ముక్కు, గొంతు, లేదా చర్మం వంటి ప్రాంతాలు పొడిగా మారి మంట కలిగిస్తాయి. ఈ సమస్య వాతరోగం ప్రారంభమైన వెంటనే రావచ్చు, అయితే రోగులకు ఈ ఒక్క లక్షణం మాత్రముండే అవకాశం లేదు. పొడి కళ్ళ సమస్యున్న అనేక రోగులు కారణం కనుగొనేందుకు ఒక కంటి వైద్యుడును సంప్రదిస్తుంటారు. అయితే, డాక్టర్ మండల్, మనము ఏ వైద్యుడి వద్దకు వెళ్లినప్పడికి మనకున్న ఇతర రోగ లక్షణాలను వైద్యుడికి తెలపడం చాలా ముఖ్యమని చెబుతున్నారు.

 కీళ్ళ నొప్పులు:  కీళ్ళ నొప్పి వాతరోగం యొక్క ప్రధానమైన లక్షణాలలో ఒకటి. ఈ సమస్యకి కారణాలు అధికశ్రమ లేదా ఆస్టియో ఆర్త్రైటిస్ అని రోగులు అనుకుంటూ ఉంటారు. ఈ సమస్యను ఫైబ్రోమైయాల్జియా లేదా క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్ (నిరంతరం ఉండే అలసట) అని కూడా తప్పుగా నిర్ధారణ చేయవచ్చు. వాతరోగం కారణంగా కలిగే కీళ్ళ నొప్పులు తాత్కాలికమైనవి కావు. ఈ నొప్పి సాధారణంగా ఒక వారం కంటే ఎక్కువ కాలం ఉంటుంది. ఒకటే సమయంలోరెండు చేతులు, పాదాలు , మోకాళ్ళు మరియు చీలమండలలో నొప్పి ఉండవచ్చు. ఈ నొప్పి ఒక వారం కన్నా ఎక్కువ కాలం ఉండవచ్చు.

 ఉదయం వేళ కీళ్లలో భిగువు: రుమటాయిడ్ ఆర్థరైటిస్వా లేదా వాతరోగం యొక్క మరొక లక్షణం ఉదయం కీళ్లలో భిగువు సమస్య. మళ్ళీ, ఈ లక్షణం కూడా ఆస్టియో ఆర్థరైటిస్ వ్యాధిలో ఉండే ఒక సాధారణమైన సమస్య. అయితే, రెండింటి మధ్య వ్యత్యాసం ఏమిటంటే, ఆస్టియో ఆర్థరైటిస్ నొప్పి సాధారణంగా ఒక అరగంటలో తగ్గిపోతుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ కారణంగా ఏర్పడిన భిగువు తగ్గడానికి ఎక్కువ సమయం పడుతుంది. సరైన వ్యాయాయం చేయడం ద్వారా ఈ నొప్పి కొంతవరకు తగ్గుతుంది.

 కీళ్ళు కదలకపోవడం: వాతరోగం ఉన్న రోగులలో కొన్నిసార్లు కీళ్ళు కదలకపోవడం సమస్య ఉండవచ్చు ప్రత్యేకించి మోకాలి మరియు మోచేతి కీళ్ళు.  కీళ్ళ చుట్టూ ఉన్న స్నాయువులు యొక్క వాపు కారణంగా, కీళ్లలో కదలిక ఉండదు. దీని కారణంగా మోకాలి వెనుక తిత్తులు ఏర్పడి కదలికను నిరోధిస్తాయి. ఈ లక్షణం మోకాలి కీళ్లలో ఏర్పిడిన గాయం కారణంగానని తప్పుగా అనుకునే అవకాశముంది.

 బుడిపెలు:  వాతరోగం వల్ల ప్రభావిత కీళ్ళ దెగ్గర బుడిపెలు రావచ్చు. ఇవి తరచుగా మోచేతి వెనుక లేదా కళ్ళలో వస్తాయి. ఈ బుడిపెలు వాతరోగం భాగా ముదిరినప్పుడు కనిపిస్తాయి. ఈ లక్షణం గౌట్ అన్న మరొక రకమైన ఆర్థరైటిస్ సమస్యలో కూడా కనిపిస్తుంది.

 మూలం: Health.com 

Om Sai Ram