Vol 2 సంచిక 3
May 2011
ముద్రింప తగిన వార్తాలేఖ
పూర్తి వార్తాలేఖ యొక్క కాగితం ప్రతి కావలెనన్నఈ పుటను ముద్రించండి
డా.జిత్ కే అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి
ప్రియమైన చికిత్సా నిపుణులకు
“నాపైన నమ్మకం ఉంచండి. నేను ఎప్పుడూ తప్పు చేయను. నా అనిశ్చితతను ప్రేమించండి. అదే నా సంకల్పం. నా ఆదేశం ఉంటే తప్ప ఏమీ జరగదని గుర్తుంచుకోండి. మనసును స్థిరంగా ఉంచుకోండి. మీకు నాకు మధ్య సంబంధం పురాతన మరియు శాశ్వతమైనది. ఈ సంభంధం ప్రాపంచిక సంబంధాలు వంటిది కాదు. నేను మీ అందరిని సముద్రం నుంచి పైకి లేచే అలలు వలె చూస్తాను. నేను మీ ఆనందకరమైన రూపాన్ని చూస్తాను. మీరు ఆనంద స్వరూపులు కనుక ప్రేమ ద్వారా శాశ్వత ఆనందాన్ని పొందాలని కోరుకుంటున్నారు. ఇదే ఆనందానికి పునాది. కేవలం నన్ను ప్రేమించడం ద్వారా సంతృప్తి పడవద్దు. నేను మిమ్మల్ని ప్రేమించే విధంగా మీ ప్రవర్తన ఉండాలి."...సత్య సాయి బాబా SSS సంచిక 3
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు, తమ భౌతిక రూపాన్ని వీడి ఒక నెల పైన కావొస్తోంది. ప్రశాంతి నిలయంలో మరియు ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఈ శోకం నుండి నెమ్మదిగా కోలుకుంటున్నారు.
“నా అనిశ్చితతను ప్రేమించండి." తమ భౌతిక శరీరాన్ని వదలడంతో సహా, స్వామి ప్రతీది, భక్తులపై తమకున్న స్వచ్చమైన ప్రేమ కారణంగానే చేస్తున్నారని మనం గుర్తుంచుకోవాలి. స్వామీ యొక్క ప్రతిచర్య అర్ధవంతంగాను, మంచి ఉద్దేశ్యంతోను మరియు మనం నేర్చుకోవాల్సిన మంచి పాఠాలతోను నిండి ఉంటుంది. మనమందరము కూడాను స్వామీ భౌతిక శరీరం యొక్క ఆఖరి కొద్ది నెలల పై ధ్యానం చేసి, అందులో మనం మన జీవన విధానం గురించి మరియు సమయం వచ్చినప్పుడు శరీరాన్ని ఎలా వీడాలో కూడా నేర్చుకోవాలి.
ఉదాహరణకు శారీరిక సవాళ్లు ఎదురైనప్పడికి, తమ విధిని నిర్విరామంగా నిర్వర్తించడం. శ్వాస మరియు గుండె సంభందించిన సమస్యలతో తమ శరీరం క్షీణిస్తున్నప్పడికి, స్వామీ వేలాది భక్తులకు దర్శనమిస్తు వాళ్ళందరికీ దీవెనలతో పాటు గొప్ప ఆనందాన్ని అందిస్తూనే ఉన్నారు. "నేను ఈ దేహాన్ని కాదు. నేను ఎల్లప్పుడూ ఆనందంగానే ఉంటాను." అని స్వామీ పదే పదే చెప్పేవారు. అయితే, స్వామికి శారీరిక నొప్పి లేదని అర్ధం కాదు. తనను నొప్పితో గుర్తించుకోకుండా, శారీరిక నొప్పికి అతీతంగా, ఆనంధంగా ఉండాలని ఆర్థం.
స్వామీ యొక్క దివ్య సౌందర్యాన్ని కనులారా చూసే భాగ్యాన్ని కోల్పోయామని నిరాశ పడరాదు. మన ప్రతి ఆలోచన, మాట మరియు చర్యలోను, సత్యం, ప్రేమ,శాంతి ,ధర్మం మరియు అహింస వంటి స్వామీ భోధించిన మానవతా విలువలు కూడియుండడం చాలా అవసరం. అహంకారాన్ని తొలగించుకొని, స్వామీ చేతిలో ఒక బోలు వేణువు వలె మారాలి. ఈ విధంగా మనం మారినప్పుడు, స్వామీ యొక్క దివ్య కీర్తి మన ద్వారా ప్రకాశిస్తుంది. మనము స్వామీ యొక్క పరిపూర్ణమైన సాధనములుగా మారుతాము.
వేలాది మందికి వైద్య సదుపాయం మరియు ఆశ అందించడానికి ఒక ఉత్తమ సాధనంగా వైబ్రియానిక్స్ చికిత్సా విధానాన్ని స్వామీ ఆశీర్వదించారు. ఈ సేవను అందించే, స్వామీ యొక్క సాధనములైన మనము ఎంతో అధ్రుష్టవంతులము. మనమందరము కలిసి, ఈ సేవను మరింత శ్రద్ధతోను మరియు ప్రేమతోను చేయాలని ద్రిడంగా నిశ్చయించు కోవాలి. స్వామీ ప్రసాదించిన ప్రేమను పంచుకోవడం ద్వారా ప్రేమ మరింత పెరుగుతుంది.
ప్రేమపుర్వకంగా సాయి సేవలో
జిత్ కే అగ్గర్వాల్
దగ్గు నుండి అద్భుతమైన ఉపశమనం 02090...India
పుట్టినప్పటినుండి దగ్గుతో భాదపడుతున్న ఒక 60 ఏళ్ళ మహిళ, ఉపశమనం కొరకు వైబ్రో చికిత్సా నిపుణుడను సంప్రదించింది. ఈ మహిళ తన దగ్గు నయం కావడానికి అల్లోపతి, ఆయుర్వేదం మరియు హోమియోపతి వంటి అనేక వైద్యాలను చేయించుకుంది కాని ఉపశమనం కలుగలేదు. వైబ్రో నిపుణుడు క్రింది వ్రాసియున్న మందులను ఇవ్వడం జరిగింది:
CC19.6 Cough – chronic…TDS (ఒక నెల)
నెల రోజులకు ముందే ఈ మహిళ తనకు 75% వరకు నయమైందని చెప్పింది. అప్పుడు ఈమెకు క్రింది వ్రాసియున్న మందులను ఇవ్వడం జరిగింది:
CC19.2 Allergy + CC19.6 Cough…TDS
ఒక నెల తర్వాత ఈ మహిళ తనకు 90% ఉపశమనం కలిగిందని చెప్పింది. వైబ్రో నిపుణుడు ఈమెకు, మరో నెల రోజులు తీసుకోవడానికి ఈ మందులను ఇవ్వడం జరిగింది:
CC19.6 Cough + CC19.2 Allergy + CC19.3 Asthma….TDS
నాలుగో సారి ఈ మహిళ వచ్చి, తన జీవితంలో మొదటి సారి తనకు దగ్గు సమస్య నుండి అద్భుతమైన ఉపశమనం కలిగిందని, వైబ్రో నిపుణుడకు ఎంతో ఆనందంగా చెప్పింది. ఆమెకి మరియు ఆమె కుటుంభ సభ్యులుకు ఇదొక కొత్త అనుభవమని ఆమె చెప్పింది. ఆమె స్నేహితులు మరియు ఇరుగు పొరుగులో ఉన్నవారు, ఆమెకెలా నయమైందని తెలుసుకోవడానికి చాలా కుతూహుల పడ్డారు. వాళ్ళల్లో అనేక మంది తమ ఆరోగ్య సమస్యల ఉపశమనం కొరకు ఈ నిపుణుడను సంప్రదించడం జరిగింది.
శుక్రాశయపిండములో వాపు (నిరపాయమైన) 02762...USA
శుక్రాశయపిండములో వాపున్నట్లు నిర్ధారించబడిన ఒక 72 ఏళ్ళ వ్యక్తికి భాదాకరమైన మూత్రవిసర్జన సమస్య ఉండేది. వైద్యులు శస్త్ర చికిత్స చేయించుకోవల్సింధిగా ఈ రోగికి చెప్పడం జరిగింది. ఈ వృద్ధుడు శస్త్ర చికిత్స వద్దని వైబ్రో చికిత్సా నిపుణుడను సంప్రదించడం జరిగింది. ఈ రోగికి ఈ క్రింద వ్రాసియున్న మందులు ఇవ్వబడినాయి:
CC13.2 Frequent Urination + CC14.2 Prostate + CC12.1 Adult Tonic + CC10.1 Emergency…TDS నీటిలో తయారు చేయబడింది.
మూడు రోజుల తర్వాత ఈ రోగికి కొంతవరకు ఉపశమనం కలిగింది. ఈ మందులను రోజుకి మూడు సార్లు (TDS) తీసుకోవడం కొనసాగించారు. మూడు వారాల తర్వాత మరింత ఉపశమనం కలిగింది. భాదాకరమైన మరియు తరచుగా ఉండే మూత్ర విసర్జన సమస్య చాలా వరకు తగ్గిందని ఈ రోగి వైద్యులకు తెలియచేయడంతో శస్త్ర చికిత్సను వాయదా చేయడం జరిగింది. మరో రెండు నెలల తర్వాత, ఈ రోగికి పూర్తిగా నొప్పి తగ్గిపోయింది. ఈ రోగి ఆపై రెండు నెలలకు మందులను రోజుకి రెండు సార్లు తీసుకున్న తర్వాత పూర్తి ఉపశమనం కలిగిందని తెలియచేయడంతో వైబ్రో నిపుణుడు మందులను ఈ విధంగా మార్చిచ్చారు:
CC13.2 Frequent Urination + CC14.2 Prostate + CC12.1 Adult Tonic….OD
రెండు నెలల తర్వాత మోతాదును 3TW గాను, ఆ తర్వాత 2TW గాను తగ్గించబడింది. ఆపైన ఆరోగ్య సంరక్షణ కొరకు మరియు వాపు తిరిగి ఏర్పడకుండా ఉండడానికి మందులను వారానికి ఒక సారి (OW) తీసుకోవడం జరిగింది.
హాడ్కిన్స్ వ్యాధి 00660...USA
హాడ్కిన్స్ వ్యాధి ఉన్న ఒక 65 ఏళ్ళ మహిళ వైబ్రో చికిత్సా నిపుణుడను చికిత్స కొరకు సంప్రదించింది. ఈ రోగికి క్రింది మందులు ఇవ్వబడినవి:
NM6 Calming + NM30 Throat + NM59 Pain + NM63 Back-up + NM110 Essiac + SM13 Cancer + SM24 Glandular + SM40 Throat...6TD రెండు వారాలకు, ఆపై TDS
నాలుగు నెలల తర్వాత ఈమె వైధ్యుడుచే చేయబడిన రక్త పరీక్ష ద్వారా, ఈ వ్యాధి పూర్తిగా నయమైందని నిర్ధారించబడింది. ఆపై కొంత కాలానికి రోగి ఈ మందులను తీసుకోవడం కొనసాగించింది.
సంపాదకుని వ్యాక్యానం:
వైబ్రో చికిత్స మహిమకు ఇది యొక్క అద్భుతమైన ఉదాహరణం. నిపుణుడు 108CC బాక్సును ఉపయోగించి క్రింది మందులను ఇచ్చియుంటే, ఇవే ఫలితాలు లభించియుండేవి
CC2.1 All Cancers + CC19.7 Throat
బాల్యంనుండి అంధత్వం 02640...India
బాల్యంనుండి అంధత్వంతో భాదపడుతున్న మధ్యవయస్కురాలైన ఒక మహిళను, ఒక కంటి శస్త్రచికిత్సా నిపుణుడు, అల్లోపతి వైదుడైన ఒక వైబ్రో చికిత్సా నిపుణుడు వద్దకు వైబ్రో చికిత్స కొరకు తీసుకు రావడం జరిగింది. ఈ రోగికి క్రింది మందులు ఇవ్వబడినవి:
CC7.1 Eye Tonic + CC12.1 Adult Tonic…QDS
ఈ మందులను రెండు వారాలు తీసుకున్న తర్వాత, ఈ మహిళకు కంటి చూపు మెరుగుపడి, స్పష్టంగా చూడగలిగింది. రెండు నెలల తర్వాత ఈమె వార్తాపత్రికను కూడా చదవ గలిగింది.
ఒక భావోద్వేగ మరియు మానసిక రుగ్మత 00002...India
భావోద్వేగ మరియు మానసిక రుగ్మతతో భాదపడుతున్న ఒక యువతీ తన కుటుంభంతో వైబ్రో చికిత్సా నిపుణుడు వద్దకు వచ్చింది. ఈ యువతీకి, 11 ఏళ్ళ వయస్సుండగా, ఒక రోజు, ఈమెకు తన తమ్ముడును కొంత సమయం చూసుకోవలిసింధిగా చెప్పి, ఇంటి పెద్దలు పని మీద బయిటకి వెళ్ళడం జరిగింది. ఆ సమయంలో ఈమె తమ్ముడు మూర్చ రోగం కారణంగా ఫిట్స్ వచ్చి పడిపోయాడు. ఇది చూసి, ఏమి జరుగుతోందో అర్థం కాని ఆమె మానసికంగా దెబ్బ తింది. తప్పు తనదేనని తలచి ఆమె మానసిక రుగ్మతకు గురైయింది.
దీని తర్వాత ఆమె వ్యక్తిత్వం పూర్తిగా మారిపోవడం ప్రారంభమైంది. ఆమె కలహాశీలతకు మరియు అశాంతికి గురైంది. వైద్యులు అనేక మందులిచ్చినప్పటికి శాశ్వత పరిష్కారం లభించలేదు. తల్లి తండ్రులు ఆమెను సంతోష పరచడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం లేక పోయింది. రోజు రోజుకి ఆమె మానసిక రుగ్మత మరింత తీవ్రమైనది.
వైద్యులు ఆమెకున్న సమస్య ఏమిటని నిర్ధారించ లేకపోయారు. వైబ్రో చికిత్సా నిపుణుడు మొదటి సారి ఆమెను చూసినప్పుడు, ఆమె ముఖం పాలిపోయి, భావరహితంగా ఉంది. ఈ యువతీ వైబ్రో నిపుణుడుతో మాట్లాడడానికైనా లేదా నిపుణుడను చూడడాని కైనా నిరాకరించింది. వైబ్రో నిపుణుడు ఈమెకు బాబా పైన ప్రేముందా లేదాయని ప్రశ్నించాడు. దానికి ఆమె బాబాను ప్రేమిస్తున్నట్లు తలనూపింది. వైబ్రో నిపుణుడు బాబా మందును ఇస్తున్నట్లు, దాన్ని క్రమం తప్పకుండా రోజు వేసుకోవల్సిందిగా ఈమెకు చెప్పారు. ఈ మందు తీసుకోవడం ద్వారా పూర్తిగా ఆమెకు నయమవుతందని మరియు బాబా పై ఆమెకున్న ప్రేమ కారణంగా ఆమెలో ఒక నూతన శక్తి ప్రారంభమవుతుందని హామీయిచ్చారు. రోగికి క్రింది మందులు ఇవ్వబడినవి:
CC15.2 Psychiatric Disorders + CC18.1 Brain Disabilities...TDS
కొన్ని నెలల తరువాత వైబ్రో నిపుణురాలు ఆశ్రమములో దర్శన్ హాల్ వదిలి వెళ్తుండగా, ఇద్దరు వ్యక్తులు ఆమె వద్దకు వచ్చారు. "స్వామీ ఈమెకు వైబ్రో చికిత్స ద్వారా పూర్తిగా నయం చేసారు" అని ఆ ఇద్దరులో ఒకామె చెప్పింది. మానసిక రుగ్మతతో చాలా కాలం భాదపడిన ఆ యువతీ నవ్వుతూ ఎంతో ఆనందంగాను, ఆత్మవిశ్వాసంతోను కనిపించింది.
ప్రశ్న జవాబులు
1. ప్రశ్న: వైబ్రో మందు కలపబడిన చక్కర గోలీలు కొన్నిటిని ఆల్కహాల్ లో కలిపి, కరిగించడం ద్వారా తయారు చేయబడిన మిశ్రమం, ఆల్కహాల్ మాధ్యమంలో నేరుగా తయారు చేయబడిన అసలైన మిశ్రమానికి సమానంగా ఉపయోగపడుతుందా? నేను ఈ ప్రశ్న అడగడానికి కారణం ఏమిటంటే, పారీస్ కి దూరంగా నివసిస్తున్న, నా వద్ద చికిత్స పొందుతున్న ఒక రోగికి అనేక నెలలు వైబ్రో మందులను తీసుకొనే అవసరముంది. ఒక వేళ ఇది సరైన పద్ధతి అయ్యుంటే కనుక, భవిష్యత్తులో, ఈ రోగి, ఆమెకివ్వబడిన గోలీలు పూర్తయ్యే లోపు, ఒక సీసాలో, ఈ విధంగా మిశ్రమాన్ని తయారు చేసుకోవడం సులభంగా ఉంటుంది.… చికిత్సా నిపుణుడు 2809
జవాబు: ఈ విధానం సరైనదే కాని, ఈ విధంగా తయారు చేయబడిన మిశ్రమం అసలైన మిశ్రమమంత ప్రభావవంతంగా ఉండకపోవచ్చు. పైగా, ఇది రోగి వైబ్రో గోలీలను ఎంత సురక్షితంగా ఉంచారన్న విషయంపై ఆధార పడియుంటుంది.
2. ప్రశ్న: 108CC బాక్సులో ఉన్న ఆల్కహాల్ సీసాలలో ఉన్న వైబ్రేషన్లు ఎంత కాలం వరకు నిలచియుంటాయి?…చికిత్సానిపుణుడు2494
జవాబు: ఆల్కహాల్ లో ఉన్న వైబ్రేషన్లు రెండు సంవత్సరాలు నిలచియుంటాయి. అయితే రెండేళ్ళు పూర్తయ్యే లోపు, మీరు ప్రతియొక్క సీసాను తొమ్మిది సార్లు కదిలించినట్లయితే, మరో రెండేళ్ళు వైబ్రేషన్లు నిలచియుంటాయి. ఈ విధంగా చేస్తూ ఉంటే, వైబ్రేషన్లు శాశ్వతంగా ఆల్కహాల్ లో నిలచియుంటాయి.
3. ప్రశ్న: గోలీలలో వైబ్రేషన్లు ఎంత కాలం వరకు నిలచియుంటాయి. వైబ్రో గొలీల తయారి విధానాన్ని బట్టి, గొలీల యొక్క ఎక్స్పైరి తేది ఆధార పడి ఉంటుందా?… చికిత్సా నిపుణుడు 0512
జవాబు: గొలీల సీసాను వికిరణం నుండి సురక్షితంగా ఉంచినట్లయితే, గోలీలలో వైబ్రేషన్లు రెండు నుండి ఆరు నెలల వరకు నిలచియుంటాయి. కాని గొలీల సీసా మీతో పాటు ప్రయాణిస్తుంటే కనుక, ఫోన్లు నుండి వచ్చే వికిరణం కారణంగా వైబ్రేషన్ల యొక్క శక్తి తగ్గిపోతుంది. ఇటువంటి సందర్భాలలో, వైబ్రేషన్లు రెండు నెలలు మాత్రమే నిలచియుంటాయని గుర్తుంచుకోవాలి. సీసాలను అల్యుమినియుం కాగితంలో చుట్టబెట్టి ఉంచడం ద్వారా వికిరణాల దుష్ప్రభావం నుండి కొంత వరకు గోలీలను రక్షించవచ్చు.
4. ప్రశ్న: వైబ్రో మందులను నీటిలో తయారు చేయడానికి, ఒక లీటరు నీటిలో 25 ఆల్కహాల్ చుక్కలు వేసి కలపాలని చదివి తెలుసుకున్నాము. అయితే, ఇప్పుడు మొక్కలికి, జంతువులకి పది చుక్కలు చాలని చెబుతున్నారు. సరైన పద్ధతి ఏదో తెలుపవలసిందిగా కోరుతున్నాము. … చికిత్సా నిపుణుడు2494
జవాబు: అన్ని సందర్భాలలోనూ, ఒక లీటరు నీటిలో, 5 నుండి 10 ఆల్కహాల్ చుక్కలు కలపితే చాలని ఇటీవల కనుగొనబడింది.
5. ప్రశ్న: జంతువులకు వైబ్రో మందులను ఏ విధంగా ఇవ్వాలి? … చికిత్సా నిపుణుడు 2715
జవాబు: జంతువులకు మందులను నీటిలో కలిపివ్వడం శ్రేష్టం. అయితే, జంతువుల మరియు పిల్లల విషయంలో, వైబ్రో నీటిని నాలుక క్రింద, ఒక నిమిషం వరకు ఉంచే అవసరం లేదని గుర్తుంచుకోవాలి. వైబ్రో నీటిని తయారు చేసే విధానం: 5 ఆల్కహాల్ (వైబ్రో మిశ్రమం) చుక్కలను ఒక లీటరు నీటిలో వేసి, వంద సార్లు భాగా కలపాలి. ఈ విధంగా తయారు చేయబడిన వైబ్రో నీటిని నేరుగా జంతువుకు ఇవ్వవచ్చు లేదా జంతువు త్రాగే నీటిలో కలపవచ్చు.
మీరు డా.అగ్గర్వాల్ను ఏమైనా ప్రశ్న అడగాలని అనుకుంటున్నారా? అయితే, మీ ప్రశ్నలను ఈ కింద ఇవ్వబడిన వెబ్సైటుకు పంపించండి: [email protected]
ఆరోగ్య చిట్కాలు
ఊపిరి
ధ్యానం చేస్తున్న సమయంలో, మన దృష్టిని శ్వాస పైనుంచాలని మనందరికీ తెలిసిన విషయమే. తీసుకున్న ఊపిరి, కేవలం ఊపిరితిత్తులకు పరిమితం కాకుండా, ఉదరం వరకు చేరాలని మనకి చెప్పబడింది.
ఆరోగ్యానికి ఇది శ్రేయస్కరమని ఇప్పుడు కనుగొన్నాము. రాబర్ట్ ఫ్రైడ్ చే వ్రాయబడిన "బ్రీథ్ వెల్, బీ వెల్" పుస్తకంలో, చాలా మంది తీసుకొనే శ్వాస గాడమైనదిగా ఉండడంలేదని చెప్పబడియుంది. దీనికారణంగా, రక్తంలో ఉన్న కార్బన్ డై ఆక్సైడ్ యొక్క స్థాయిలో అసమతౌల్యం ఏర్పడి, చేతుల్లో జలదరింపు, తల తిరగడం, బలహీనత, అలసట, తరచుగా ఆవలించడం, మలబద్ధకం, నిద్ర పట్టక పోవడం, చిరాకు వంటి లక్షణాలు కనపడుతూ ఉంటాయి. సరైన రీతిలో శ్వాసను తీసుకోవడం కారణంగా, రక్తపోటు, ఆస్తమా మరియు మైగ్రేన్ తలనొప్పి వంటి దీర్గ కాలిక అనారోగ్య సమస్యలు మెరుగుపడతాయి. ఊపిరి తీసుకుంటున్న ప్రతిసారి, ఒక శిశువు యొక్క పొట్ట నెమ్మదిగా పైకి లేచి మరియు శ్వాస వదులుతున్న సమయంలో పొట్ట నెమ్మదిగా కిందకి దిగడం మీరు గమనించే ఉంటారు. ఈ విధంగా శ్వాసను తీసుకోవడం సరైన పద్ధతని రాబర్ట్ ఫ్రైడ్ చెబుతున్నారు. రాబర్ట్ ఫ్రైడ్ చే చెప్పబడిన ఒక వ్యాయామం, ఈ క్రింద ఇవ్వబడింది :
మీ శరీరం తలకిందులుగా ఉన్న ఒక మందు చుక్కలు వేసే పరికరం అని ఊహించుకోండి. ఈ పరికరం యొక్క రంద్రం మీ ముక్కుగాను మరియు దాని యొక్క బల్బు మీ ఉదర భాగంగాను ఊహించుకోండి. మీ ఉదర భాగంపై చేతులు పెట్టి, ఊపిరి తీసుకోండి. ఊపిరి తీసుకుంటున్న సమయంలో, చుక్కలు వేసే పరికరం యొక్క బల్బు విస్తరించే విధంగా, మీ ఉదర భాగం విస్తరిస్తున్నట్లు ఊహించుకోండి. ఆపై పరికరం యొక్క బల్బును గట్టిగా నొక్కినట్లు, మీ ఉదర కండరాలను కట్టడి చేస్తూ, ఊపిరిని వదలండి.
ఈ ఉదర శ్వాస సాధనను ప్రతిరోజు చేయడంతో, రెండు వారాల లోపు ఆరోగ్యం మేరుగుపడుతందని గమనిస్తారు. ఉదరం నుండి ఊపిరిని తీసుకోవడమే ఈ సాధన యొక్క గమ్యం. దీని కారణంగా మీరు చేసే ధ్యానం మరింత మెరుగుపడవచ్చు!
మూలం: రాబర్ట్ ఫ్రైడ్, న్యు యార్క్ హంటర్ కాలేజ్ లో బయో ఫిసియోలోజి మరియు బిహేవియరల్ న్యూరో సైన్స్ లో ప్రోఫ్ఫేసర్ మరియు బ్రీథ్ వెల్, బీ వెల్ అను ఒక కార్యక్రమానికి కర్త. ఒత్తిడి, ఆందోళన, ఆస్తమా, రక్తపోటు, మైగ్రేన్ మరియు ఇతర రుగ్మతల నుండి ఉపశమనం కొరకు ఈ కార్యక్రమం నిర్వహించబడుతోంది..
మంచి ఆరోగ్యం కొరకు రసాలు మరియు పండ్లు-కూరల సమన్వయ పానీయాలు
వేసవి కాలంలో రసాలు, పళ్ళుకూరల సమన్వయాలు(స్మూతీలు) వంటి చల్లని పానీయాలను ఎక్కువగా తీసుకోవాలని అనిపిస్తుంది. ఈ పానీయాలను ఆరొగ్యకరమైనవిగా తయారు చేసుకుంటే ఎంత భాగుంటుంది? పాట్ క్రాకేర్ వ్రాసిన "స్మూతీస్ బైబిల్" పుస్తకంలో ఇవ్వబడిన స్మూతీల తయారి విధానం: ఈ క్రింది పదార్థాలలో ఏదైనా ఒకటి అర కప్పు తీసుకోవాలి : పళ్ళ రసాలు, పాలు, పెరుగు లేదా టమాటాలు, కేరట్లు, బీట్రూట్లు లేదా కీరా ముక్కల నుండి తీసిన రసం లేదా గ్రీన్ టీ మరియు హెర్బల్ టీను కూడా ఉపయోగించవచ్చు. ఈ రసంలో, రెండు లేదా మూడు రకాల పళ్ళు లేదా కూరగాయలను చేర్చుకోవాలి. నాణ్యత గల పళ్ళు మరియు కూరగాయలను ఎన్నుకోవడం చాలా ముఖ్యమని రచయిత చెబుతున్నారు. దానిమ్మ (పీచు మరియు అంటియోక్సిడేంట్లు ఎక్కువగా ఉన్న గింజలుతో సహా), బ్లూబెర్రీలు, బ్లేక్ కరంట్లు, స్ట్రాబెర్రీలు వంటి పౌష్టిక విలువలు అధికంగా ఉన్న పండ్లను ఉపయోగిస్తే మంచిది. పైనాపిల్, మామిడి, కివీలు వంటి చక్కర అధికంగా ఉన్న పండ్లను ఉపయోగించే సమయంలో, ఆపిలు, పుచ్చకాయ లేదా స్ట్రాబెర్రీలు వంటి తక్కువ చక్కర ఉన్న పండ్లను చేర్చడం మంచిది.
ఇటువంటి ఆరోగ్యకరమైన పానీయాలను తయారు చేయడానికి ఎల్లప్పుడూ ఒక బ్లెండర్ ని ఉపయోగించడం మంచిది. బ్లెండర్ ను ఉపయోగించడం ద్వారా పండ్లలో మరియు కూరగాయిలలో ఉన్న పీచు పదార్థాలు మరియు ఇతర పౌష్టిక విలువలున్న పదార్థాలు నిలిచియుంటాయి.
ముందుగా పళ్ళు కూరల సమన్వయము (స్మూతీ) యొక్క తయారికి ఎన్నుకున్న పళ్ళను మరియు కూరగాయిలను స్వచ్చమైన నీటితో శుబ్రంగా కడగాలి. బ్లెన్డర్ను ఉపయోగించే ముందుగా, దానిలో కొన్ని నీళ్ళు పొయ్యడం మంచిది. ఆపై తరిగిన పళ్ళ మరియు కూరగాయిల ముక్కలను ( కావాలంటే వీటితో పాటు ఐసు కూడా వేసుకోవచ్చు) వేసుకొని బ్లెన్డర్ను స్టార్ట్ చేయాలి. బ్లెన్డర్ను ముందుగా 10 నుండి 30 సెకన్లు వరకు తక్కువ సెట్టింగ్లో పెట్టుకోవాలి, ఆపై ఎక్కువ సెట్టింగ్లోకి పెంచి మరో 10 నుండి 30 సెకన్లు వరకు ఉంచవచ్చు. ఈ విధంగా తయారు చేయబడిన సమన్వయము ఎక్కువ తీయగా ఉందనిపిస్తే, కొద్దిగా నిమ్మ రసం చేర్చవచ్చు. లేదా ఎక్కువ పుల్లగా అనిపిస్తే అరిటిపండు, ద్రాక్ష పండ్లు, ఎండు కజ్జూరం, ఆప్రికాట్ వంటి పళ్ళ ముక్కలను చేర్చవచ్చు.
మరో రెండు రకాల స్మూతీలు తయారి విధానం: తోలు తీయని రెండు ఆపిలు పళ్ళ ముక్కలు, 350 గ్రాములు చెర్రీ పళ్ళు ( గింజలు తీసినవి). ఈ రసం విటమిన్ C, కారోటినాయిడ్స్, ఫోలిక్ ఆసిడ్, పోటాశియుం వంటి పౌష్టిక పదార్థాలు కలది మరియు చర్మానికి మంచిది. నాలుగు క్యారెట్లు (తొక్కతో పాటు); ఒక ఆపిల్ పండు (తొక్కతో పాటు), ఒక కివి పండు (తొక్కతీసినది), పార్స్లీ కొమ్మలు (కొతిమిరివంటి వొక కూరాకు) ఒక గుప్పెడి. విటమిన్లు A, C, E, B మరియు పోటాశియుం నిండుగా ఉన్న ఈ స్మూతీను ప్రొద్దున పూట త్రాగడం మీ ఆరోగ్యానికి ఎంతో మంచిది.
మీరు ఆస్వాదించడం కోసం మరొక ఆరోగ్యకరమైన పానీయం. తొక్క తీయని బీట్రూట్, కారెట్ మరియు ఆపిల్ ను ముక్కలుగా చేసుకొని, స్వచ్చమైన నీరు కలిపి, బ్లెన్డర్లో వేసి తిప్పుకోవాలి. ఈ రసాన్ని వెంటనే త్రాగితే మంచిది. ఈ పానీయంలో కొద్దిగా నిమ్మ రసాన్ని చేర్చుకుంటే మరింత రుచికరంగా ఉంటుంది. ఈ రసాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉన్నవారికి, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పచ్చి కూరగాయిలలో మరియు పండ్లలో ఉన్న పోషకాలు, మన కంటిచూపు, జీర్ణక్రియ మరియు విసర్జన క్రియలు మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి. ఈ రసాన్ని, ఉదయాన్నే, ఖాళి కడుపున తీసుకోవడం శ్రేష్టమైనది. ఈ రసాన్ని రోజుకి రెండు సార్లు తీసుకోవడం ద్వారా మీ ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది.
సాయి వైబ్రియానిక్స్ యొక్క తరువాతి సంచికలో ఆరోగ్యకరమైన రసాల పై, మరికొన్ని సలహాలను మీకు అందచేస్తాము.
దివ్య వైద్యుడి యొక్క దివ్య వాక్కు
“స్వార్ధం, అసూయ మరియు ఇతర చెడు భావాలతో నిండియుంటే, మనం ఉత్తమ సేవను చేయలేము. పాత్ర కాళీగా ఉన్నప్పుడు మాత్రమే, దానిలో మంచి పదార్థాలను నింపే అవకాశం ఉంటుంది. అందువలన, మొట్ట మొదటిగా మీలో ఉన్న చెడు భావాలను తొలగించుకోవాలి. ఆపై మీ గుండెలను నిస్వార్థ ప్రేమతో నింపుకోవాలి. ప్రేమతో నిండియున్న హృదయమే పవిత్రమైనది. ఏ సేవను చేసినా నిస్వార్థ స్పూర్తితో చేయాలి. ఈ విధంగా సేవను చేసినప్పుడు, మనం జీవితంలో అత్యుత్తమ దశను చేరవచ్చు. మనం చేసే సేవ చిన్నది కావచ్చు, అయితే పెద్ద మనసుతో చేసినప్పుడు అది గొప్ప ఫలితాలను అందిస్తుంది”.
-సత్య సాయి బాబా
ప్రకటనలు
-
నిర్వహించబడిన శిక్షణా శిబిరాలు
-
2011 ఫెబ్రవరి 26 న, భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి కృపతో, ప్రశాంతిగ్రాం లోనున్న శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యుట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ ( సూపర్ స్పెషాలిటి హాస్పిటల్) లో పనిచేస్తున్న డాక్టర్లకు మరియు జనరల్ హాస్పిటల్ డాక్టర్లకు, ఒక వైబ్రియానిక్స్ సదస్సు నిర్వహించబడింది. డా.అగ్గర్వాల్ గారు వైబ్రియానిక్స్ పై ఇచ్చిన పరిచయంతో సదస్సు ప్రారంభమైనది. దీని తర్వాత, ముంబై నుండి వచ్చిన డా.దీపా హోస్కోటే 2640, అనేక ఆశక్తికరమైన మరియు అత్భుతమైన రీతిలో స్వస్థమైన రోగ చరిత్రలను ప్రదర్శించడం జరిగింది. గుండె, కళ్ళు, శ్వాస వ్యవస్థ మరియు అస్థిపంజర వ్యవస్థ సంబంధించిన పలు క్లిష్టమైన రోగ చరిత్రలను సమర్పించారు. నయంకావడం అసాధ్యమని, ఇతర డాక్టర్లు చే నిర్ధారించబడిన రోగులకు, వైబ్రో చికిత్స ద్వారా కొత్త జీవితాలు ప్రాప్తించాయి. ఈ సదస్సును ఆశ్పత్రికి చెందిన సిబ్బంది అనుకూలమైన రీతిలో అందుకున్నారు. ఈ సదస్సు ద్వారా, ప్రశాంతి నిలయంలో అందరికి వైబ్రియానిక్స్ పై ఆశక్తి మరియు ఈ ప్రత్యామ్నాయ చికిత్సా విధానం పై అవగాహన ఏర్పడింది.
- పోలాండ్ లోనున్న ఒపోల్ లో, మే 14 మరియు 15 న, 15 మంది పాల్గొన్న ఒక JVP శిక్షణా శిభిరం నిర్వహించబడింది.
జరగనున్న శిక్షణా శిబిరాలు
- ఇండియా: 2011 జూన్ 24 నుండి 26 వరకు ఢిల్లీ, లో AVP లకు ప్రథమ శిక్షణా శిబిరం జరగనున్నది. మీ స్తానిక సమితి సంయోజకుడను సంప్రదించగలరు.
- ఇంగ్లాండ్: 2011 జూన్ 25 నుండి 26 వరకు లండన్ లో JVP లకు శిక్షణా శిబిరం జరగనున్నది మరియు ఇతర వైబ్రో చికిత్సా నిపుణులకు రిఫ్రెషర్ శిక్షణా శిబిరం జరగనున్నది. వివరాలకు డా.అగ్గర్వాల్ను సంప్రదించండి: ఫోన్ నంబరు: 020-7209 3413 లేదా 01865-511 171 లేదా [email protected] కు ఇమెయిల్ పంపండి.
- పోలాండ్: 2011 నవంబర్ 12 నుండి 13 వరకు వ్రొక్లావ్ లో, JVP లకు మరియు ఇతర చికిత్సా నిపుణలకు రిఫ్రెషర్ శిక్షణా శిబిరం జరగనున్నది. ఆసక్తికరమైన రోగ చరిత్రలపై సమీక్ష జరపబడుతుంది. వివరాలకు డరిఉస్శ్ హేబిస్జ్ ను సంప్రదించండి: ఫోన్ నంబరు: 071-349 5010 లేదా [email protected]. కు ఇమెయిల్ పంపండి.
గమనిక: భవిష్యత్తులో మీ ఇమెయిల్ చిరునామాలను మారిస్తే, వీలైనంత త్వరగా క్రింది ఇమెయిల్ చిరునామాకు తెలియచేయండి: [email protected]. ఇమెయిల్ సదుపాయం గురించి తెలియని వైబ్రో సాధకులకు దయచేసి ఈ సమాచారాన్ని తెలియచేయండి. మీ సహకారానికి ధన్యవాదాలు.
ప్రస్తుతం మా వెబ్సైట్ నిర్మాణంలో ఉండడం కారణంగా కొన్ని అంశాలు అందుబాటులో ఉండవని తెలియచేసుకుంటున్నాము. www.vibrionics.org వద్ద పురోగతి తనిఖీ చేయగలరు.
జై సాయి రామ్!