Vol 2 సంచిక 4
July 2011
ముద్రింప తగిన వార్తాలేఖ
పూర్తి వార్తాలేఖ యొక్క కాగితం ప్రతి కావలెనన్నఈ పుటను ముద్రించండి
డా.జిత్ కే అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి
ప్రియమైన చికిత్సా నిపుణులకు,
మన ప్రియమైన స్వామి తమ భౌతిక శరీరాన్ని విడిచి పెట్టారే కానీ మనందరిని ఒంటరిగా విడిచి ఎక్కడికి వెళ్ళలేదు. ఎన్నో సంవత్సారులగా స్వామి, సేవను మించిన ఆధ్యాత్మిక క్రమశిక్షణ మరొకటి లేదని మళ్ళి మళ్ళి మనందరికీ గుర్తుచేస్తూనే ఉన్నారు. "మరొకరికి సేవ చేయడానికి, సహాయపడడానికి, ఓదార్చడానికి లేదా ప్రోత్సాహించడానికి మీరు చెయ్యెత్తినప్పుడు, మీరు సాక్షాతూ దైవం కోసం ఎత్తినట్లే అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరులో దేవుడు ఉన్నాడు కనుక" అని స్వామి చెప్పారు. నిస్వార్థ ప్రేమతో ఇతరులకు సేవను అందించటమే మనం స్వామికి సమర్పించుకునే ప్రణామాలు.
మనందరికీ గత మూడు నెలలు ఎంతో కఠినంగా గడిచింది. ఎన్నో తీపి జ్ఞాపకాలతో మనసు నిండిపోతోంది. ముఖ్యంగా స్వామి మరియు వైబ్రియానిక్స్ సంభందించిన జ్ఞ్యాపకాలు. 1994 జూలై లో, బ్రిందావన్ సాయి రమేష్ హాలులో, విశ్వానికే ప్రభువైన మన స్వామి, వైబ్రియానిక్స్ పోటేన్టైసేర్ యొక్క మొదటి నమూనాను దీవించడానికి కిందకి ఒంగారు. (ఆరు రోజులుగా స్వామీ యొక్క దీవెనలు కోసం ఎదురు చూస్తున్న నేను సంబరాశ్చర్యాల కారణంగా యంత్రాన్ని నేలనుండి పైకి ఎత్తలేక పోయాను) మరుసటి రోజిచ్చిన ఇంటర్వ్యూలో స్వామి "OM7 Heart" కార్డును యంత్రంలోనున్న కన్నంలో పెట్టటం ద్వారా యంత్రాన్ని ప్రయోగించారు.
మరోసారి ఇంటర్వ్యూ గదిలో స్వామి "ఈ ఔషధం డయాబెటిస్ ను నయం చేస్తుందా?" అని చాలా అమాయకంగా అడిగారు. తమ విద్యార్థులకు మరియు భక్తులకు వైబ్రియానిక్స్ చికిత్సపై శిక్షణ ఇవ్వవలసిందిగాను మరియు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో తమ వైద్యులకు ఈ చికిత్స పై ఒక ప్రసంగం ఇవ్వవలసిందిగాను నన్ను ఆదేశించారు. దీని తరువాత నుండి స్వామి అడుగడుగునా తమ మార్గదర్శకత్వాన్ని ప్రసాదిస్తూనే ఉన్నారు.
గత 17 సంవత్సరాలుగా, వైబ్రియానిక్స్ కు సంభందమై స్వామి తరచుగా నాకందించిన ఆదేశాలను మరియు దీవెనలను వైబ్రియానిక్స్ చికిత్సా నిపుణులతో పాల్పంచుకోవటం నా కర్తవ్యం. అటువంటి క్షణాలను, తదుపరి వార్తాలేఖల్లో మీ అందరితోను పాల్పంచుకుంటాను.
స్వామి మనకు సేవ చేయడానికి ఒక అద్భుతమైన సాధనాన్ని ప్రసాధించారని మనం భావిస్తే కనుక, మన పాత్రలను మరింత తీవ్రంగాను మరియు మరింత అంకిత భావంతోను పోషించే ప్రయత్నాన్ని చేయడానికి ఇదే సమయం.
మేము మా వంతుగా, కొత్త చికిత్సా నిపుణులకు ఒక నవీనమైన శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించాము. నేను ప్రశాంతి నిలయంలో అన్ని తరగతులకి శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తూ ఉండేవాడిని. ఇప్పుడు, అర్హత పొందిన ఉపాధ్యాయుల ద్వారా, అనేక ప్రాంతాలలో తరచుగా శిక్షణా శిబిరాలను నిర్వహించనున్నాము. యాదృచ్ఛికంగా, స్వామి నాణ్యతపై దృష్టిని ఉంచాలని పరిమాణం పై కాదని ఎల్లప్పుడూ నాకు చెప్పేవారు. నేను ఇప్పటికే సీనియర్ చికిత్సా నిపుణులకు, ఉపాధ్యాయులుగా అర్హత పొందడానికి శిక్షణ ఇవ్వటం ప్రారంభించాను. 108 కామన్ కాంబోలలో శిక్షణ పూర్తి చేసిన నిపుణులు, సాయిరామ్ వైబ్రియానిక్స్ యంత్రాన్ని ప్రయోగించే శిక్షణ పొందడాని కై, దరఖాస్తును పంపవచ్చు. ఈ శిక్షణ పూర్తయిన తరువాత మీరు ఉపాధ్యాయుల శిక్షణ పొందడానికి అర్హులవుతారు.
స్వామి యొక్క వైబ్రియానిక్స్ వ్యవస్థను భారత దేశంలో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అందరికి తెలియచేయడానికి, మాకు ఉపాధ్యాయుల అవసరముంది కనుక, భవిష్యత్తులో నేను ఉపాధ్యాయుల శిక్షణా శిబిరాలు నిర్వహించడానికి ఆసక్తిగా ఉన్నాన. అంకిత భావంతో సేవనందిస్తున్న చికిత్సా నిపుణులు, వైబ్రియానిక్స్ లో తదుపరి స్థాయికి శిక్షణ పొందాలని ఆసక్తిగా ఉంటే కనుక, దరఖాస్తు పత్రం కొరకు నాకు నేరుగా [email protected] వద్ద వ్రాయండి. దయచేసి మీ వ్యక్తిగత నమోదు సంఖ్యను, ఈ వార్తాలేఖ యొక్క విషయం(సబ్జెక్ట్) లైన్లో ఉన్న విధంగా, వ్రాసి పంపండి. పాఠకులు మన వార్తాలేఖలో మరిన్ని అసాధారణమైన రోగ చరిత్రలను చూడాలన్న కోరికను వ్యక్తం చేసారు. ఇతరులను ప్రేరేపించే నిమిత్తమై, రాబోయే వార్తాలేఖల్లో ప్రచురణ చేయడానికి, విజయవంతమైన రోగ చరిత్రలను లేదా ఆకట్టుకునే విధంగా ఉన్న రోగ చరిత్రలను నా ఇమెయిల్ చిరునామాకు పంపండి.
స్వామి మనపై కురిపించిన అపారమైన దివ్య ప్రేమకు చెల్లింపు ఏ విధంగా ఇవ్వగలము? స్వామి మనకోసం తీసుకున్న శ్రమ వృధా కాలేదని ఏ విధంగా చూపించగలం? మనలో ప్రతియొక్కరు అంతర్గతంగా మనలోనున్న స్వామిని గుర్తించాలి మరియు ఇతరులలోనూ స్వామిని చూడాలి. అంతేకాకుండా స్వామి స్వయంగా ఏ విధంగానైతే నడుచుకునేవారో అదే విధంగా మనం నడుచుకోవాలి. చికిత్సా నిపుణులారా! మనమందరము ఐక్యత, సామరస్యం మరియు అంకితభావంతో వైబ్రియానిక్స్ సేవను అందించటం ద్వారా స్వామి యొక్క దివ్య ప్రేమను ఈ ప్రపంచమంతా వ్యాపింప చేయాలి.
ప్రేమపూర్వకంగా సాయి సేవలో,
జిత్ అగ్గర్వాల్.
రక్తశుద్ధి క్రియ 02640...India
జబ్బుగానున్న మూత్రపిండం మరియు అధిక రక్తపోటు సమస్యలతో భాదపడుతున్న ఒక 45 ఏళ్ళ వ్యక్తి, లాస్ ఆంజెలిస్, US నుండి ఇండియా లోనున్న ఒక వైబ్రో చికిత్సా నిపుణుడను వైబ్రో చికిత్స కొరకు సంప్రదించటం జరిగింది. మూత్రపిండ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకొనున్న ఈ రోగి వారానికి మూడు సార్లు, ప్రతిసారి ఐదు గంటలు కొనసాగే రక్తశుద్ధి క్రియను చేయించుకుంటున్నారు. చికిత్సా నిపుణుడు క్రింది మందులను ఈ రోగికి కొరియర్ ద్వారా పంపించారు
CC3.3 High BP + CC13.4 Kidney Failure + CC15.1 Mental & Emotional Tonic…2 గోలీలు QDS
వైబ్రో చికిత్స ప్రారంభించిన మూడు నెలల తరువాత, రోగి యొక్క క్రెయాటినిన్ స్థాయిలు 9 నుండి 5కి తగ్గిపోవడం చూసిన వైద్యుడు ఆశ్చర్యపోయారు. దీని కారణంగా, రోగికిస్తున్న రక్తశుద్ధి క్రియ యొక్క సమయాన్ని ఐదు నుండి మూడు గంటలకు తగ్గించటం జరిగింది. ఈ అద్భుతమైన ఫలితాలకు కారణమైన ఆహారం ఏమిటని వైద్యుడు రోగిని అడిగారు. మరో ఆరు నెలల తరువాత రోగియొక్క ఆరోగ్యం మరింత మెరుగుపడిన కారణంగా, రక్తశుద్ధి క్రియ యొక్క సమయాన్ని మరికొంచం తగ్గించటం జరిగింది. మరో రెండు నెలల తరువాత, రక్తశుద్ధి క్రియ చేయించుకునే అవసరం ఇంక లేదని వైద్యుడు చెప్పటంతో, ఈ రోగికి చాలా ఆనందం కలిగి ఇండియాకి వచ్చి చికిత్సా నిపుణుడకు కృతజ్ఞ్యతల్ను తెలుపుకున్నారు.
రొమ్ము పై అంటెడు మొటిమ 01339...USA
ఒక 69 ఏళ్ళ మహిళకు మూడు సంవత్సరాలుగా ఎడమ రొమ్ము సమీపంలో ఒక మొటిమ వచ్చింది. మధ్యమధ్యలో, ఆమె మొటిమను నొక్కినప్పుడు, చీము వెలువడేది. ఒకరోజు ఆ మొటిమ ఉన్న ప్రాంతం ఎర్రబడి, వాచీ, నొప్పిగా ఉండటం ఆమె గమనించింది. ఆ మొటిమ, రొమ్ము క్యాన్సర్ అయ్యుండవచ్చని ఆమె భయపడి, వైబ్రో చికిత్సా నిపుణుడను సంప్రదించటం జరిగింది. చికిత్సా నిపుణుడు రోగిని మొటిమున్న ప్రాంతాన్ని శుబ్రంగాను మరియు పొడిగాను ఉంచాలని సలహాయిచ్చి, క్రింది మందులను ఇచ్చారు:
CC2.1 Cancers + CC8.3 Breast abscess + CC21.11 Infections…2 pills QDS
ఈ మందును ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే నొప్పి తగ్గింది. మూడవ వారం చివరిలో, మొటిమ వచ్చిన ప్రాంతంలో వాపు మరియు చీము తగ్గిపోయాయి. రెండు వారాలకు TDS గా మోతాదు తగ్గించబడింది. ఆపై ఒక వారానికి, రోజుకి ఒకసారి (OD) మోతాదులో వైబ్రో మందును కొనసాగించింది. మొత్తం ఆరు వారాల తరవాత కొద్దిపాటి పాలిపోయిన చర్మం మాత్రమే మిగిలింది. ఆమెను నయంచేసినందుకు సత్యసాయి బాబావారికి కృతజ్ఞ్యతలు తెలుపుకోవడానికి భారతదేశానికి వచ్చింది.
ఏనుగుగజ్జి (ఎక్జిమా) 02762...USA
15 సంవత్సరాల క్రితం వైద్యుడుచే ఎడమ కాలిలో ఏనుగుగజ్జి లేదా తామర వ్యాధి సోకిందని చెప్పబడిన ఒక 51 ఏళ్ళ మహిళ వైబ్రో చికిత్సా నిపుణుడను సంప్రదించటం జరిగింది. 15 సంవత్సరాల నుండి ఆమె ఎడమ కాలుపై నిరంతరం మంట, పగుళ్ళు మరియు ద్రవ స్రావం వంటి సమస్యలతో భాధపడేది. దీని కారణంగా ఆమె సాక్సు కాని బూట్లు కాని వేసుకోలేక పోయేది. ఆమె వాడిన అనేక రకముల క్రీంలు మరియు లేపనాలు ఆమెకు సహాయపడలేదు. ఆమెకు చికిత్సా నిపుణుడు క్రింది మందులను ఇవ్వటం జరిగింది
CC21.6 Eczema. మొదటి మూడు రోజులకు నీటిలో ఆరు సార్లు, ఆపై TDS
మూడు వారాల తరువాత దురద కొద్దిగా మాత్రమే తగ్గింది. మరో నెల రోజుల తరువాత 10% మెరుగుదల కనిపించింది. ఈ సమయంలో రోగిని నూనెలో మందును తయారు చేసుకొని, పైపూతగాను మరియు మౌఖికంగాను వేసుకోమని చెప్పబడింది.
ఒక నెల తరువాత, ఆమెకు నిద్రలేమి సమస్య ఉన్నందు కారణంగా, CC15.6 Sleep disorders, పై మందులతో పాటు చేర్చివ్వటం జరిగింది. మూడు నెలల తరువాత, ఆమెకు దురద మరియు ద్రవ స్రావం 30% తగ్గిందని తెలిపింది. ఆపై కొన్ని నెలల తరువాత, క్రమముగా అభివృద్ధి కలిగి, ఆమెకు తామర వ్యాధి పూర్తిగా తగ్గిపోయి ఆమె ఎడమ కాలు మరియు పాదం సాధారణంగా మారిపోయాయి.
సంపాదకుని వ్యాక్యానం:
ఇది స్వామి యొక్క 108 కాంబోల ద్వారా జరిగిన మరో అద్భుతమైన వైద్యం. తామర , చర్మ అలేర్జీలు లేదా విచర్చిక చర్మరోగము వంటి సమస్యలున్న రోగులకు చికిత్సనివ్వటం ప్రారంభించే సమయంలో, చర్మ వ్యాధికి తగిన మందును నూనెలో లేదా విభూతి లేదా బియ్యప్పిండిలో కలిపి పైపూతగా ఉపయోగించమని చెప్పటం మంచిది. ఇలా చేయటం ద్వారా రోగికి తక్షణ ఉపశమనం కలుగుతుంది.
శ్వాసనాళిక ఉబ్బసం 02799...UK
ఒక 65 ఏళ్ళ వృద్ధుడు, 20 సంవత్సరాల వయస్సు నుండి శ్వాసనాళిక ఉబ్బసం సమస్యతో భాధపడుతున్నట్లు చెప్పి, వైబ్రో చికిత్సా నిపుణుడను చికిత్స కొరకు సంప్రదించారు. ఈ రోగికి ఉబ్బసం సమస్య వచ్చినప్పుడు అల్లోపతి మందును తీసుకోవటంతో ఉపశమనం కలిగేది కాని పూర్తిగా నయంకాలేదు. రోగి యొక్క వ్యక్తిగత జీవితంలో ఒత్తిడి కూడా అధికంగా ఉండేది. ఈ రోగికి క్రింది మందులను ఇవ్వటం జరిగింది
ఒత్తిడి కొరకు:
NM6 Calming + BR7 Stress…TDS
అస్తమా కొరకు:
NM8 Chest + NM9 Chest TS + NM62 Allergy-B + NM70 CB8 + NM71 CCA + BR13 Allergy + BR14 Lung + BR15 Sinus + OM2 Respiratory + SR272 Arsen Alb (30C) + SR 297 Ipecac (30C) + SR451 ACTH Hormone…TDS
ఈ రోగికి కొంత కాలం వరకు అల్లోపతి వైద్యాన్ని కొనసాగించవలసిందిగా చెప్పబడింది. రెండు వారాలలో 30% ఉపశమనం కలిగిందని రోగి తెలిపారు. వైబ్రో మందులను మరో రెండు వారాలు కొనసాగించవలసిందిగాను మరియు అల్లోపతి మందును క్రమముగా తగ్గించవలసింధిగాను రోగికి చెప్పబడింది. నాలుగు వారాల తరువాత, 75% ఉపశమనం కలిగినట్లుగా రోగి చెప్పటంతో, అల్లోపతి మందును OD గా తగ్గించటం జరిగింది. నాలుగు వారాల సమయంలో వైబ్రో మందును తగ్గించటం జరిగింది. ఆరు వారాల తరువాత, వ్యాధి లక్షణాల నుండి పూర్తి ఉపశమనం కలుగటంతో, అల్లోపతి మందును పూర్తిగా ఆపటం జరిగింది. అయితే వ్యాధి నివారణ కొరకు వైబ్రో మందును రోజుకి ఒకసారి తీసుకోవటం ఈ రోగి కొనసాగిస్తున్నారు.
45 సంవత్సరాల తరువాత ఈ రోగి యొక్క భాద అంతమవ్వటం ఒక అద్భుతమైన విషయం. 108 కాంబోల బాక్సు ఉండుంటే కనుక, ఒత్తిడి కొరకు CC15.1 మరియు శ్వాసనాళిక ఉబ్బసం కొరకు CC19.3 ఇచ్చియుండవచ్చు. వీటితో ఇవే ఫలితాలు లభించియుందేవి. అల్లోపతి మందులను తగ్గించటం లేదా ఆపటం ముందు, అల్లోపతి వైద్యుడిని సంప్రదించి అనుమతి తీసుకోవలసిందిగా రోగులను ప్రోత్సాహిస్తున్నాము.
కాలి కండరాల నొప్పి, ఒత్తిడి మరియు శక్తి తక్కువగా ఉండే సమస్య 02804...India
ఒక 39 ఏళ్ళ మహిళ, ఒక సంవత్సరముగా కాలి కండరాల నొప్పితో భాధపడేది. ఆమెకు ఒత్తిడి మరియు శక్తి తక్కువగా ఉండటం సమస్యలు కూడా ఉండేవి. వీటినుండి ఉపశమనం కొరకు ఆమె చికిత్సా నిపుణుడను సంప్రదించింది. ఆమె కాలి నొప్పి తగ్గడానికి పెయిన్ కిల్లెర్లు, ఒత్తిడి మరియు తక్కువ శక్తి సమస్యల ఉపశమనానికి అల్లోపతి వైద్యం చేయించుకుంది కాని సఫలితాలు లభించలేదు.
ఆమెకు క్రింది మందులు ఇవ్వటం జరిగింది:
CC12.1 Adult Tonic శక్తి తక్కువ సమస్యకు + CC15.1 Mental & Emotional Tonic ఒత్తిడికి + CC20.4 Muscles & Supportive Tissue కాలి కండరాల నొప్పికి …TDS
రెండు వారాల సమయంలో రోగికి 90% ఉపశమనం కలిగిందని, వైబ్రియానిక్స్ చికిత్స ఆమెకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని సమాచారం అందచేసింది.
శ్వాసకోశ ఎలర్జీ మరియు ధీర్గకాలిక దగ్గు 01352...India
ఒక 56 ఏళ్ళ వ్యక్తి, దాదాపు ఐదు సంవత్సరాలు శ్వాసకోశ అలర్జీ సమస్యతో భాధపడ్డారు. ప్రతి ఉదయం విపరీతమైన తుమ్ములు, కంటిలో నీరు కారటం మరియు కొన్ని సార్లు ముఖం వాచటం వంటి లక్షణాలు ఈ రోగికి ఉండేవి. అంతే కాకుండా ఇరవై సంవత్సరాల పాటు దగ్గు సమస్య ఉండేది. దీని కారణంగా పసుపు లేదా భూడిద రంగులో కఫం వచ్చేది. అల్లోపతి మరియు అనేక ప్రత్యామ్నాయ చికిత్సలు చేయించుకున్నప్పటికి, ఉపశమనం కలుగలేదు. వైబ్రో చికిత్సా నిపుణుడు క్రింది మందులను ఇవ్వటం జరిగింది:
CC19.2 Respiratory Allergies + CC19.6 Cough - chronic…TDS.
ప్రశ్న జవాబులు
ప్రశ్న: వైబ్రో గోలీలున్న సీసాను బ్యాటరీలున్న గడియారం దెగ్గరగా పెట్టవచ్చా?
జవాబు: పెట్టవచ్చు. బ్యాటరీలు, గోలీలలను ప్రభావితం చేయవు కనుక గడియారం దెగ్గరగా గోలీలున్న సీసాను పెట్టవచ్చు. టీవీ (దూరదర్శిని), కంప్యూటర్, మొబైల్ ఫోన్లు, మైక్రోవేవ్ లేదా బలమైన అయస్కాంత క్షేత్రంతోనున్న పరికరాల నుండి కనీసం మూడు అడుగుల దూరంలో ఈ గోలీలను ఉంచవలెను.
ప్రశ్న: గోలీలను నాలుక కింద ఎందుకు పెట్టవలెను?
జవాబు: నాడికొనలు ఎక్కువగా నాలుక కింద ఉండటం కారణంగా, గోలీలను నాలుక కింద పెట్టాలి. ఇలా చేయటం ద్వారా వైబ్రేషన్లు సులభంగాను, ప్రభావవంతంగాను శరీరంలోపలికి పీల్చబడుతాయి.
ప్రశ్న: రోగి నయమైన వెంటనే వైబ్రో మందును తీసుకోవడం ఆపవచ్చా?
జవాబు: రోగికి పూర్తిగా నయమయ్యే వరకు, రోగి వైబ్రో మందును తీసుకోవటం కొనసాగించాలి. ఆపై మోతాదును నెమ్మదిగా తగ్గించుకుంటూ వెళ్ళాలి. ఉదాహరణకు, TDS నుండి OD , ఆపై వారానికి మూడు సార్లు, ఆపై రెండు సార్లు, చివరికి వారానికి ఒకసారి. తగ్గింపు కాలం, నయం కావడానికి తీసుకున్న సమయంలో మూడో వంతు కావచ్చు. వ్యాధి నయమైన తర్వాత, హఠాత్తుగా ఈ మందును తీసుకోవడం ఆపినప్పుడు, వ్యాధి తిరిగి వచ్చే అవకాశముంది. కొందఱు రోగులు వ్యాధి నివారణ కొరకు, తక్కువ మోతాదులో ఈ మందును కొనసాగించడానికి ఇష్టపడతారు. తరువాత, ఒక నెల రోజులకి రోగనిరోధక శక్తిని పెంచే మందును లేదా తగిన టానిక్ ను ఇవ్వటం మంచిది.
ప్రశ్న: నేను సీసాలను పునరుపయోగించవచ్చా?
జవాబు: అవును. సీసాలను శుబ్రమైన నీటితో కడగటం ద్వారా వాటిని పునరుపయోగించవచ్చు. సీసాలను రాత్రంతా నీటిలో నానపెట్టియుంచితే, వాటిలోనున్న చక్కెర నిల్వలు కరిగిపోతాయి. సీసాల లోపల సబ్బు లేదా డిటర్జెంట్లను ఉపయోగించవద్దు. ఆ తర్వాత, సీసాలకు మూతలు పెట్టడానికి ముందుగా, అవి పొడిగా ఉండేలా చూసుకోవాలి.
ప్రశ్న: జబ్బుగా ఉన్న తైరాయిడ్ గ్రంధిని పునరుద్ధరించటం సాధ్యమేనా?
జవాబు: అవును. సాధ్యము. కణాల పునరుత్పత్తి సాధ్యం కనుక, ఏ గ్రందినైన వైబ్రేషన్ల ద్వారా పునరుద్ధరించవచ్చు!
చికిత్సా నిపుణులు: మీరు డా.అగ్గర్వాల్ను ఏమైనా ప్రశ్న అడగాలని అనుకుంటున్నారా? అయితే, మీ ప్రశ్నలను క్రింది ఇవ్వబడిన వెబ్సైటుకు పంపించండి: [email protected]
దివ్య వైద్యుడి యొక్క దివ్య వాక్కు
“మీ ఆశయాలు స్వచ్చమైనవిగా ఉన్నప్పుడు, దైవకృప మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. మీరందించే సేవ అకళంకమైనదిగా ఉండాలి. మీరు చేసే చర్య లేదా సేవ ఏమిటనేది ముఖ్యం కాదు. స్వచ్చమైన భావాలు లేనప్పుడు, మీరు చేసే చర్యలలో కళంకం ఏర్పడుతుంది.
-సత్యసాయి బాబాSSS సంపుటము XVII
“చర్యలు జరుపుటకు మీకు చేతులు అవసరం. మనం చేసే చర్యలు పవిత్రమైనవిగాను, స్వచ్చమైనవిగాను, ఇతరులకు సహాయపడేవిగాను మరియు ప్రయోజనాత్మకంగాను ఉండాలి. ఇటువంటి పవిత్రమైన చర్యల ద్వారా మనస్సు పవిత్రంగా మారుతుంది.”
-సత్యసాయి బాబా BSSB సంపుటము III
ప్రకటనలు
పోలాండ్ : 2011 నవంబెర్11-12న వ్రోక్లా వద్దనున్న సోబోట్కాలో, - సమస్త JVP లకు మరియు ఇతర వైబ్రో చికిత్సా నిపుణులకు పునశ్చరణ శిక్షణా శిభిరం జరగనున్నది. ఈ శిభిరంలో ఆశక్తికరమైన రోగ చరిత్ర వివరాలు తిరిగి పరిశీలింపబడతాయి. సంప్రదించవలసిన వ్యక్తి డారియుజ్ హేబిజ్ ఫొనె అంకె: 071-349 5010 లేదా ఇమెయిల్ చిరునామా: [email protected].
గమనిక: భవిష్యత్తులో మీ ఇమెయిల్ చిరునామాలను మారిస్తే, వీలైనంత త్వరగా క్రింది ఇమెయిల్ చిరునామాకు తెలియచేయండి: [email protected]. ఇమెయిల్ సదుపాయం గురించి తెలియని వైబ్రో సాధకులకు దయచేసి ఈ సమాచారాన్ని తెలియచేయండి. మీ సహకారానికి ధన్యవాదాలు.
ఈ వార్తాలేఖను మీరు మీ రోగులతో పాలుపంచుకోవచ్చు. రోగులకు ఏమైనా సందేహాలుంటే మిమ్మల్ని అడిగి తెలుసుకోవలెను. మీ సహకారానికి ధన్యవాదాలు.
ప్రస్తుతం మా వెబ్సైట్ నిర్మాణంలో ఉండడం కారణంగా కొన్ని అంశాలు అందుబాటులో ఉండవని తెలియచేసుకుంటున్నాము. www.vibrionics.org వద్ద పురోగతి తనిఖీ చేయగలరు.
జై సాయి రామ్!
ఆరోగ్య చిట్కాలు
మొబైల్ ఫోను కలిగించే ప్రమాదాలు
మొబైల్ లేదా సెల్ ఫోన్లు మన దైనందిన జీవితాలలో భాగంగా మారిపోయాయి. కనుక వీటిని ఉపయోగించడం ద్వారా కలిగే ప్రమాదాలేమిటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. మొబైల్ ఫోనును అధికంగా ఉపయోగించే వారు క్రింది విషయాలు తెలుసుకోవటం అత్యవసరం.
నిజానికి మొబైల్ అన్నది ఒక ద్విమార్గములొ సూక్ష్మతరంగాలను ప్రసరించే రేడియో. ఇది నిరంతరం యాంటెన్నాల ద్వారా సంకేతాలను అందుకుంటూ మరియు పంపుతూ ఉంటుంది. ఇది మీ వద్ద ఉన్నప్పుడు లేదా మీరు ఉపయోగిస్తున్నప్పుడు, దీని యొక్క యాంటెన్నాల ద్వారా వచ్చే సంకేతాలు మీ శరీరం లోపలి నుండి, సమీపంలోనున్న టవర్ను చేరుతాయి. దీనికి అర్థం మన శరీరాలు నిరంతరం వికిరణాలను ఎదుర్కుంటున్నాయి. మొబైల్ను చెవి దెగ్గర పెట్టుకొని మాట్లాడినప్పుడు, మన మెదడులో అనేక మార్పులు ఏర్పడతాయి. ఈ సంకేతాలు మెదడుకు హాని కలిగిస్తాయన్న విషయాన్ని పరిశోధకులు ఎవరికీ తెలియ చేయటం లేదు.
2011 మేలో, దాదాపు ఏకగ్రీవ నిర్ణయంతో, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) యొక్క సలహాదారులైన 31 నిపుణులు, ప్రపంచంలోనున్న ఐదు బిలియన్ మొబైల్ ఫోన్ వినియోగదారులు ఆశ్చర్యపోయే విధంగా, రేడియో తరంగాలు మరియు విద్యుదయస్కాంత వికిరణం, మెదడు క్యాన్సర్ కు ఒక "సాధ్యమైన కారణం" అని ప్రకటించింది. యంత్ర శూన్యికరణం, కొన్ని పురుగుమందులు, సీసం, కాఫీ మరియు అసాధారణంగా సంరక్షించబడిన కూరగాయలు వంటి కాన్సర్ కారకులతో పాటు సూక్ష్మతరంగ వికిరణం చేరింది. (సంపాదకుడు: వికిరణం వైబ్రో గోలీలలోనున్న వైబ్రేషన్లను నాశనం చేస్తుందని మనకు తెలిసిన విషయమే)
మొబైల్ ఫోన్లు కలిగించే ప్రమాదాల నుండి సురక్షితంగా ఉండడానికి కొన్ని సూచనలు:
1. మొబైల్ ఫోనులో "టెక్స్ట్ మెసేజ్ " పంపడం సురక్షితమైనది. మొబైల్ ఫోను లో మాట్లాడ రాదూ.
2. ఒక వేళ మొబైల్ ఫోనులో మాట్లాడే సందర్భం వస్తే కనుక, చెవి ఫోన్లను లేదా మైక్రో ఫోన్ను ఉపయోగించండి.
3. మొబైల్ ఫోనులో మీ సంభాషణలు సంక్షిప్తంగా ఉంటే మంచిది. దీర్ఘ సంభాషణలు చేయవలసి వచ్చినప్పుడు లాండ్లైన్ ఫోన్లను ఉపయోగించవలెను.
4. మొబైల్ ఫోన్ల వలె వికిరణ ప్రమాదం అధికంగా ఉండే కార్డ్ లెస్ లాండ్లైన్ ఫోన్లను ఉపయోగించ రాదూ.
పర్యావరణ ఆరోగ్య సంస్థ వెబ్సైట్ www.ehtrust.org వద్ద మీరు మొబైల్ ఫోన్ల పై మరిన్ని సమాచారాలు తెలుసుకోవచ్చు.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
ఆరోగ్యానికి మరిన్ని రసాలు మరియు పండ్లు- కూరగాయిల సమన్వయాలు
సాయి వైబ్రియానిక్స్ యొక్క మే-జూన్ సంచికలో చేసిన వాగ్దానం ప్రకారం, ఇక్కడ మరిన్ని రసాల మరియు స్మూతీల తయారి విధానాలు ఇస్తున్నాము. ఉష్ణప్రదేశాలలో, ఈ సమయంలో సమృద్ధిగా లభించే అత్యంత రుచికరమైన మామిడి పండుతో ప్రారంభిద్ధాము.
పుచ్చకాయ మరియు మామిడిపండ్ల సమన్వయము
ఒలిచిన మరియు టెంక తీసిన ఒక మామిడి పండు, ఒలిచిన మరియు గింజలు తీసిన ఒక కస్తూరికరుబూజా పండు. వీటిని ఒక బ్లెన్డెర్ లో వేసి తిప్పాలి.
ఉదయం వేళలో ఈ అద్భుతమైన రసం యొక్క సువాసన నిద్దురమత్తును తొలగించి, శరీరంలో రక్త ప్రసరణను మేరుగుపర్చుతుంది.ఈ రసం త్రాగటం ద్వారా మనకు ఒక రోజుకి అవసరమైన A మరియు C విటమిన్లు లభిస్తాయి. అనేక శాతాభ్దాలుగా మూత్రవిసర్జన సక్రమముగా ఉండడానికి ఉపయోగపడే కర్భూజా పండు, ఉదయాన్న ఉండే ఉబ్భుధలను తొలగిస్తుంది. ఈ పండులో అడినోసిన్ అను ఒక పదార్థం రక్తం గడ్డకట్టడం మరియు గుండె దాడులు వంటి ప్రమాదాలను తగ్గించడానికి ఉపయోగ పడుతుంది. తక్షణ శక్తినిచ్చే మామిడి పండును గత 400 సంవత్సరాలుగా సాగుచేయటం జరుగుతోంది. ఈ రెండు పండ్లు రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడతాయి. ఈ రసాన్ని వేగంగానూ మరియు సులభంగాను తయారు చేసుకోవచ్చు. తాజాతనాన్ని అందచేసే ఈ చల్లటి పానీయం, మీ జీవక్రియ సరైన రీతిలో ప్రారంభం కావడానికి ఉపయోగపడుతుంది మరియు ఉదయ వేళలో ఉండే సోమరితనాన్ని తొలగిస్తుంది. ఈ రసాన్ని ఒక గ్లాసుడు త్రాగటం ద్వారా మీకు ఒక రోజుకి కావల్సిన శక్తి లభిస్తుంది!
బ్లూ పాషన్
గింజలు తీసిన మూడు పాషన్ పండ్లు, ఒలిచిన, గింజలు తీసిన ఒక కర్భూజా పండు మరియు ఒక మామిడిపండు, ఫాల్ సా పండ్లు (బ్లూ బెర్రీలు). వీటిని ఒక బ్లెన్డెర్ లో వేసి తిప్పి పలచగా చేసుకోవాలి.
ఈ రసం, A, B, C మరియు E విటమిన్లు, పోటాశియుం, కాల్శియుం మరియు కేరోటినాయిడ్లు గల ఒక బలవర్ధకౌషధము. ఇది క్యాన్సర్లు మరియు ఇతర ప్రమాదకరమైన వ్యాదులనుండి రక్షిస్తుంది. ఇది కళ్ళకు కూడా మంచిది. ఈ రసం చూడడానికి మాత్రమే కాదు, త్రాగడానికి కూడా భాగుంటుంది.
ఉత్తేజమును కలిగించే అద్భుతమైన రసం
కడిగి, ఒలవని (సేంద్రియ), గింజలు తీసిన రెండు ఆపిల్ పండ్లు
ఒలవని రెండు పెద్ద కేరట్లు (సేంద్రియ)
రెండు టమాటాలు, ఒక ఒలవని కివి పండు, గుప్పెడు కడిగిన వాటర్ క్రేస్స్, ఒక గుప్పెడు కడిగిన పాలకూర. వీటినన్నిటిని బ్లెన్డెర్ లో వేసి తిప్పి, పల్చగా చేసుకోవాలి.
ఆరోగ్యాన్ని మెరుగు పరచే ఈ రసాన్ని వారానికి ఒకటి లేదా రెండు సార్లు తీసుకోవడం మంచిది. ఈ రసం మీరు ఒత్తిడి కలిగియున్న సమయంలో మీ శరీరం మరియు మెదడుకు మద్దుతును అందించి మీలో ఉత్తేజమును కలుగచేస్తుంది. ఈ రసంలో విటమిన్లు A మరియు C, బీటా కెరోటిన్, పోటాశియుం, మేగ్నిశియుం, జింక్ , ఐరన్ మరియు కాల్శియుం వంటి పోషక విలువలు ఉంటాయి. ఆపిల్ పండు మరియు వాటర్ క్రేస్స్ , జలుబు మరియు ఫ్లూ జ్వరాల నుండి రక్షించడానికి సహాయపడుతుంది.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
మీరు పండ్లచక్కెర (ఫ్రక్టోజ్ )గురించి చింతిస్తున్నారా?
సాధారణంగా ఒక స్వీటెనర్గా ఉపయోగపడే పండ్లచక్కెర (ఫ్రక్టోజ్) శరీరంలో క్యాన్సర్ యొక్క పెరుగుదలకు తోడ్పడే అవకాశముందని UCLA కు చెందిన శాస్త్రవేత్తలచే నిర్వహించ బడిన ఒక అధ్యయనం హెచ్చరిస్తోంది. ఈ అధ్యయనం లో, పండ్ల చక్కెర తో "పోషించ" బడిన వృక్వ కణాలు మరింత వేగంగా పెరిగినట్టు కనుగొనబడింది.
స్వీటేనర్గా ఉపయోగపడే ఈ పండ్ల చక్కెర ఇతర క్యాన్సర్ల యొక్క పెరుగుదలకు కూడా తోడ్పడుతుందని, ఈ అధ్యయనానికి కార్యకర్త మరియు ఈ విశ్వవిద్యాలయం యొక్క క్యాన్సర్ కేంద్రంలో, మెడిసిన్ మరియు న్యూరోసర్జరీ విభాగంలో సహాచార్యులైన డా. అన్తోనీహేనీచెప్పారు.
శుద్ధి చేయబడిన చక్కెర మరియు పండ్ల చక్కెర కలిగించే హానీల పై, డా.హేనీ ఈ విధంగా వ్రాస్తున్నారు: "ఆధునిక ఆహార పదార్థాలలో శుద్ధి చేయబడ్డ చక్కెర అధికంగా ఉందన్నది గుర్తుంచుకోవల్సిన విషయం. దీని కారణంగా స్థూలకాయం, మధుమేహం మరియు కొవ్వుతో నిండిన కాలేయం మొదలైన ఆధునిక వ్యాధులు వచ్చే ప్రమాదముంది."
హేని అమెరికాలో హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ (HFCS ) యొక్క వినియోగాన్ని తగ్గించడానికి, తగిన చర్యలను తీసుకోవలసిందిగా అమెరిక ప్రభుత్వాన్ని కోరారు. హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్, పాశ్చాత్య ఆహారంలో ఫ్రక్టోజ్ యొక్క ప్రధాన మూలం. పళ్ళు, కూరగాయలు మరియు చక్కెర వంటి ఇతర ఆహార పదార్థాల్లోను ఫ్రక్టోజ్ ఉంటుంది. ప్రజలకు ఉపయోగపడే అనేక ఆరోగ్య సూచనలు ఈ అధ్యయనంలో ఉన్నాయని హేని చెప్పారు.
అయితే కార్న్ రిఫైనర్ల సంఘము, మానవ శరీరంలో కాకుండా ఒక ప్రయోగశాలలో జరపబడిన ఈ పరిశోధనను నిరాకరించి, వృక్వము క్యాన్సర్ యొక్క మూలకారణాలు క్లిష్టంగా ఉంటాయని మరియు వాటిని పూర్తిగా అర్థంచేసుకోవడం కష్టమని, ఒక ప్రకటనలో తెలిపారు.
1970 మరియు 1990 ల మధ్య, హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్పు యొక్క వినియోగం 1000 శాతం పెరిగిందని క్యాన్సర్ పరిశోధకులు తెలిపారు. ఫ్రక్టోజ్ మరియు గ్లూకోజ్ యొక్క మిశ్రమమైన ఈ స్వీటేనర్ అనేక రకాల ఆహారాలలోను మరియు పానీయాలలోను (సాఫ్ట్ డ్రింకులు) ఉంది.
అమెరిక ఆహారంలో, ఇప్పటికి, ఫ్రక్టోజ్ యొక్క అత్యంత సాధారణమైన రూపంగా, చక్కెరను, ఉపయోగిస్తున్నట్లు ఈ సంఘం తెలిపింది. హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ యొక్క స్తానంలో చక్కెరను ఉపయోగించిన ఉత్పాదితాలను కొని మోసపోవద్దని, వీటిలో కూడా ఫ్రక్టోజ్ యొక్క స్థాయి అధికంగానే ఉంటుందని ఈ సంఘం హెచ్చరించింది. మూలం:www.cbsnews.com
సంపాదకుడు: పానీయాల సీసాలపై మరియు ఆహార పోట్లాలపై (పాకేజ్డ్ ఫుడ్) ఉన్న పట్టీ వివరాలను చదవడం చాలా అవసరమని మీకు సిఫార్సు చేస్తున్నాము. అనేక దేశాలలో ఉత్పాదకులు ఫ్రక్టోజ్ ను ఉపయోగించడం జరుగుతోంది.