Vol 2 సంచిక 5
September 2011
ముద్రింప తగిన వార్తాలేఖ
పూర్తి వార్తాలేఖ యొక్క కాగితం ప్రతి కావలెనన్నఈ పుటను ముద్రించండి
డా.జిత్ కే అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి
ప్రియమైన చికిత్సా నిపుణులకు,
స్వామీ యొక్క దయతో, 108CC పెట్టె యొక్క నూతన ఉత్పతి సిద్ధమైందని తెలిస్తే మీరందరు ఎంతో సంతోషిస్తారు. చికిత్సా నిపుణుల నుండి మాకందిన ప్రతిపుష్టిల సహాయంతోను మరియు మూడు సంవత్సరాల పాటు జరుపబడిన విస్తృతమైన పరిశోధన యొక్క ఫలితంగాను, 108 మిశ్రమాలు సవరింపబడి 1,100 రకముల వ్యాధులకు సంభందించిన మందులు ఏర్పరచటం జరిగింది. 2011 ఆగస్ట్ 11న ఈ కొత్త పెట్టెను స్వామీ యొక్క దీవెనల కోసం, ప్రశాంతి మందిరంలో సమర్పించడం జరిగింది.
ఆగస్ట్ 16న భారతదేశం, జర్మనీ, ఇటలీ, పోలాండ్, రష్యా, UK మరియు USA కు చెందిన భక్తులైన కొందఱు చికిత్సా నిపుణులు, 108CC పెట్టెను స్వామికి సమర్పించడానికి మరియు కొత్త పెట్టెలో దివ్యశక్తిని నింపమని స్వామిని ప్రార్థించడానికి, ప్రధానకార్యాలయం(S4-B1,PN)లో గుమికూడారు(చిత్రం చూడండి). వేద పారాయణ తర్వాత, పోలాండ్కు చెందిన భక్తులు భావపూర్వకంగా భజనలు పాడారు. చివరిగా ఆగస్ట్ 17న, ఆశ్రమ అధికారుల అనుమతితో, భగవాన్ యొక్క మహాసమాధి వద్ద కొత్త పెట్టెను స్వామీ దీవెనల కోసం సమర్పించడం జరిగింది (చిత్రం చూడండి).
అక్తోబెర్ 6న విజయదశమి తర్వాత, ఈ కొత్త 108CC పెట్టె, చికిత్సా నిపుణులు తమ తమ మిశ్రమాల పెట్టెలను రీచార్జ్ చేసుకునేందుకు వీలుగా, ప్రధానకార్యాలయంలో లభిస్తుందని తెలియచేసుకుంటున్నాను. పూర్తిగా పునరీక్షించబడిన 108CC పుస్తకం కూడా అదే సమయంలో అందుభాటులో ఉంటుంది. ఈ నూతన 108 మిశ్రమాలు మరిన్ని వ్యాధి సమస్యలను నయంచేయడానికి సహాయపడతాయి కనుక, చికిత్సా నిపుణులు ప్రశాంతి నిలయాన్ని సందర్శించినప్పుడు, తమ మిశ్రమాల పెట్టెలను కొత్తగా పునరీక్షించ బడిన మిశ్రమాలతో రీచార్జ్ చేసుకునే అవకాశాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాము. స్వామీ యొక్క ఆశీశులతో, పునరీక్షించబడిన ఈ మిశ్రమాల ద్వారా మనం మరింత అధిక సంఖ్యలో రోగులకు నయంకావడానికి సహాయపడాలని, ఆ విధంగా సమాజానికి మరింత ఉన్నత రీతిలో సేవనంధించాలని ఆశిస్తున్నాము.
మన ప్రియమైన స్వామి తమ భౌతిక దేహాన్ని వదలి వెళ్ళిన ఈ భాదాకరమైన సమయంలో కూడా మీరందరు మరింత అంకిత భావంతో వైబ్రియానిక్స్ సేవను చేయటం చూసి నాకు చాలా ఉత్సాహంగా ఉంది. అవసరం ఉన్నవారికి చేరుకునేందుకు మరిన్ని వైబ్రియానిక్స్ శిబిరాలు నిర్వహించబడుతున్నాయి. ఇటువంటి ఒక శిబిరం సెప్టెంబర్ 2న పుట్టపర్తి సమీపంలోనున్న కొత్తచెరువులో, సత్యసాయి జూనియర్ కాలేజిలో నిర్వహించబడింది. ఈ శిబిరంలో 300 రోగులకు (130 ఉన్నత పాటశాల విద్యార్థులు, 70 ప్రాథమిక పాటశాల విద్యార్థులు మరియు 100 గ్రామస్థులు) చికిత్సనివ్వటం జరిగింది. పుట్టపుర్తి నుండి, అత్యంత భక్తి శ్రద్ధలు గల నలుగురు చికిత్సా నిపుణులు ఐదు గంటల పాటు వైబ్రియానిక్స్ మందులివ్వటం జరిగింది (చిత్రం చూడండి). భారతదేశంలోనూ మరియు ఇతర దేశాలలో జరిగే శిబిరాల వివరాలు మరియు చిత్రాలను తదుపరి వార్తాలేఖల్లో పాల్పంచుకోవడానికి, శిబిరాల వివరాలను మరియు చిత్రాలను మాకు పంపించ వలిసిందిగా కోరుకుంటున్నాము.
చివరిగా, ఒక మనవి... మీరు వార్తాలేఖను అందుకొనే ప్రతిసారి, మీ వ్యక్తిగత రిజిస్టర్ నెంబర్ ఇమెయిల్ యొక్క విషయం లైన్లో ఉండటం మీరు గమనిస్తారు. భవిష్యత్తులో మీరు మాకు పంపించే ఇమెయిల్స్ లో (నివేదికలు, రోగ చరిత్రలు, ప్రశ్నలు మొదలైనవి) ఈ సంఖ్యను మీరు విషయ లైన్లో తప్పకుండా వ్రాయండి. వైబ్రియానిక్స్ సంఘం పెరుగుతున్న కొద్ది, భవిష్యత్తులో మాకు ఈ సంఖ్య లేకుండా ప్రశ్నలకు ప్రత్యుత్తరం ఇవ్వటం సాధ్యం కాకపోవచ్చు.
రాభోయే నెలల్లో మీలో అనేక మందిని, నూతన మాస్టర్ మిశ్రమాల పెట్టె నుండి మీ వైబ్రో పెట్టెలను రీచార్జ్ చేసుకొనే నిమిత్తమై మరియు స్వామీ మనకు ప్రసాదించిన ఈ ఉత్తమైన సేవను కొనసాగించడానికి కావలిసిన శక్తిని పునరావేశించుకోవడానికి ప్రశాంతి నిలయానికి వస్తారని మేము ఆశిస్తున్నాము.
ప్రేమపూర్వకంగా సాయి సేవలో,
జిత్ అగ్గర్వాల్
2011 ఆగస్ట్ 16న: చికిత్సా నిపుణులు 108 CC బాక్సును స్వామీ చరణాల వద్ద సమర్పించుట
2011 ఆగస్ట్ 17న: వైబ్రియానిక్స్ 108 CC మాస్టర్ బాక్సును భగవాన్ మహాసమాధి వద్ద సమర్పించుట
బహువిధ సమస్యలు 02813...Belgium
15 సంవత్సరాల వయస్సు నుండి శ్వాస కోశ సంభందించిన సమస్యతో భాదపడుతున్న ఒక 31 ఏళ్ళ వ్యక్తి, చికిత్సా నిపుణుడను సంప్రదించాడు. ఈ కారణంగా ఇతనికి రాత్రిళ్ళు అల్లోపతి మందులు తీసుకుంటే తప్ప నిద్ర పట్టేది కాదు. అంతేకాకుండా గత ఐదు సంవత్సరాల నుండి సర్పి బొబ్బలు సమస్యతో భాధపడుతున్నాడు. అతని సోదరుడికి ఇటీవల క్యాన్సర్ వ్యాదుందని నిర్ధారించ బడింది మరియు భావోద్వేగ సమస్యల కారణంగా సోదరుడు అతనికి దూరమయ్యాడు. ఈ కారణాల వల్ల రోగికి విచారం మరియు ఒత్తిడి మరింత పెరిగాయి.
CC15.1 Mental & Emotional tonic + CC17.2 Cleansing + CC21.8 Herpes...TDS
ఒకే ఒక డోస్ తీసుకోగానే రోగికి ఉపశమనం కలిగింది. ఆపై కొద్ది రోజులలో అతనికున్న రోగ సమస్యలన్నీ మాయమయ్యాయి. రోగి ఆపై మూడు వారాలకు వైబ్రో మందును TDS మోతాదులో తీసుకోవటం కొనసాగించాడు. ఆ తర్వాత చికిత్సా నిపుణుడు మోతాదును క్రమ క్రమంగా తగ్గించారు.
ఆరు వారాల తర్వాత, అతనికి శ్వాస కోశ సంభందించిన ఎల్లర్జీ సమస్య పూర్తిగా నయమైపోయిందని రోగి ఖాయం చేసారు. అల్లోపతి మందుల అవసరం లేకుండానే రోగికి నిద్ర పట్టడం ప్రారంభమైంది. మరియు సోధరుడుతో అతనికున్న భావోద్వేగ సమస్యలు కూడా పరిష్కారమైనట్లు తెలిపారు. "జీవితంలో మొట్టమొదటి సారిగా నాకొక సోధరుడున్నాడు" అని అతను చికిత్సా నిపుణుడికి తెలియచేసాడు.
చికిత్సా నిపుణుడు వ్యాఖ్యలు:
అసాధారణమైన రీతిలో రోగికి, శ్వాసకోశ అల్లెర్జీ సంభందిత ఒక వైబ్రో మిశ్రమానికి భధులుగా CC17.2 Cleansing ని ఇవ్వటం జరిగింది. ఈ మిశ్రమం కేవలం శారీరిక స్థాయిలో మాత్రమే కాకుండా భావోద్వేగ మరియు మానసిక స్థాయిలలో కూడా పనిచేస్తుంది కనుక, నిపుణుడు చేసిన ఎంపిక సరియైనదని మనకి తెలుస్తోంది. సోదరుడుతో తెగిపోయిన సంభందాల కారణంగా కలిగిన మనోవేదన, రోగికున్న ఆరోగ్య సమస్యలకి కారణం అయ్యుండవచ్చు."అన్ని వ్యాధులు మనస్సులోనే ప్రారంభమవుతాయి" అన్న స్వామీ మాటలను చికిత్సా నిపుణులైన మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి.
థైరాయిడ్ గ్రంథి మాంద్యం (హైపోథైరాయిడిజం) 02836...India
బాల్యం నుండి హైపోథైరాయిడిజం సమస్యతో భాదపడుతున్న ఒక 27 ఏళ్ళ వ్యక్తి చికిత్సా నిపుణులను చికిత్స కొరకు సంప్రదించారు. ఇతనికి ఉన్న రోగ లక్షణాలు: శరీరంలో శక్తి లేనందువలన చూడడానికి సోమరిపోతు వలె కనిపించటం, జుట్టు వ్రాలిపోవటం, ముఖం వాపు, ధీర్గకాలిక రక్తహీనత మరియు పీడకలల కారణంగా నిద్ర పట్టకపోవటము. ఈ రోగి మధ్య మధ్యలో అల్లోపతి వైద్యం చేయించుకొనేవాడు కాని సఫలితం లభించలేదు. ఇటీవల రోగి పరిస్థితి మరింత క్షీణించింది.
రోగికి ఈ క్రింద వ్రాసిన మందులు ఇవ్వబడినాయి:
CC3.1 Heart tonic + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC18.1 Brain & Memory tonic…TDS.
ఒక నెల తర్వాత రోగికి కొంత ఉపశమనం కలిగింది. పీడకలలు తగ్గి రోగికి నిద్రలేమి సమస్య నయమైంది. క్రింద వ్రాసిన విధముగా మందు మార్చి ఇవ్వబడింది:
CC3.1 Heart tonic + CC6.2 Hypothyroidism + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic...TDS.
రెండు నెలల తర్వాత, రోగి పరిస్థితిలో 50% మెరుగుదల ఏర్పడింది. రెండు నెలలు చికిత్స కొనసాగించిన తర్వాత రోగికి 95% నయమైంది. మరో రెండు నెలల తర్వాత, స్వామీ అనుగ్రహంతో అతనికి పూర్తిగా నయమైంది.
సంపాదకుని వ్యాఖ్యలు:
దీర్గాకాలంగా హైపోథైరాయిడిజం సమస్యతో భాదపడుతున్న ఒక వ్యక్తికి ఇంత తక్కువ సమయంలో వ్యాధి పూర్తిగా నయమవ్వటం ఒక అద్భుతమైన విషయం. చికిత్సా నిపుణులు మొదటి సారి మందిచ్చినప్పుడు CC6.2 Hypothyroidism ఇచ్చియుంటే కనుక రోగ సమస్య మరింత వేగంగా తగ్గే అవకాశముండేది. అయితే, CC18.1 Brain & Memory tonic ఇవ్వటం ఒక మంచి నిర్ణయం. ఈ మిశ్రమం రోగి కోలుకోవడానికి గణనీయంగా సహాయపడియుంటుంది. చాలా సంవత్సరాలుగా రోగికి ఈ సమస్య ఉండేది కనుక అతను తగిన జాగ్రతలు తీసుకుంటూ ఉంటాడని నమ్ముతున్నాము. థైరాయిడ్ గ్రంథి బలంగా ఉండడానికి రోగి CC6.2 Hypothyroidism OD మోతాదులో తీసుకుంటూ ఉండటం చాలా అవసరం.
ఏనుగు గజ్జి మరియు ముఖంలో గడ్డ 02826...India
మెడ యొక్క కుడి భాగం నుండి తలమీద చర్మం వరకు శోకిన ఏనుగు గజ్జి వ్యాధి సమస్యకు చికిత్స కోరుతూ ఒక 45 ఏళ్ళ మహిళ చికిత్సా నిపుణులను సంప్రదించింది. ఈ సమస్య కారణంగా రోగికి మంట మరియు దురదలు ఎక్కువగా ఉండేవి. ఐదు నెలల క్రితం రోగి నుదుటి పై, చిన్న గడ్డలతో కూడిన నిమ్మకాయ పరిమాణంలో ఒక కణితి లేచింది. ఐదేళ్ళగా రోగి శరీరం అక్కడక్కడ నల్లగా మారింది. రోగికి రక్తహీనత సమస్య కూడా ఉండేది. రోగి, బహుశా ఈ వ్యాధి వల్ల కలిగిన విచారం, అసౌకర్యం మరియు ఇబ్బంది కారణంగా మానసికంగా కుంగిపోయింది. ఆమె ఆంటి బయాటిక్లు మరియు ఇతర అల్లోపతి మందులు మరియు ఆయుర్వేద చికిత్స తీసుకున్నప్పడికి సఫలితం లభించలేదు. రోగికి ఈ క్రింద వ్రాసిన మందులు ఇవ్వబడినాయి:
CC2.3 Tumours & Growths + CC3.1 Heart tonic + CC12.1 Immunity + CC15.1 Mental & Emotional tonic + CC21.2 Skin infections + CC21.3 Skin allergy + CC21.6 Eczema …TDS for a month.
రోగి ఇరవై రోజుల తర్వాత తిరిగి వచ్చి తన ముఖం పైనున్న కణితిలోనున్న చిన్న గడ్డలు మాయమయినట్లుగాను, దాని కారణంగా తనకి ఎంతో ఆనందంగా ఉన్నట్లుగాను నిపుణుడకు తెలియచేసింది. రెండు నెలల తర్వాత, కణితి పరిమాణం 50% వరకు మరియు ఏనుగు గజ్జి సమస్య 20% వరకు తగ్గిపోయాయి. చికిత్స కొనసాగింది. మూడు నెలల తర్వాత కణితి చాలా వరకు తగ్గి చిన్న పొలుసులు మాత్రమే మిగిలాయి. దీని కారణంగా ఆమె మానసిక వ్యాకులత తగ్గింది. మరో రెండు నెలల వరకు చికిత్స కొనసాగించిన తర్వాత రోగి పూర్తిగా కోలుకుంది.
తుంటి నొప్పి 10080...India
తుంటి నొప్పితో భాదపడుతున్న 72 ఏళ్ళ వయస్సు గల ఒక వృద్ధురాలు చికిత్సా నిపుణులను సంప్రదించింది. తీవ్రమైన నొప్పి కారణంగా ఆమె కొన్ని సంవత్సరాలుగా కదలలేక మరియు మంచం నుండి లేవలేక భాధపడేది. రోగికి క్రింది వ్రాసిన మందులు ఇవ్వబడినాయి:
CC15.1 Brain & Emotional tonic + CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue + CC20.5 Spine…TDS
ఈ మందులను ఆరు నెలల పాటు క్రమం తప్పకుండా తీసుకున్న తర్వాత ఆమె లేచి నడవటం ప్రారంభించింది. ఆమెకు పూర్తిగా నయమైనట్లుగా తెలియచేయటంతో మందు నిలిపివేయబడింది.
సంపాదకుని వ్యాఖ్యలు:
రోగులు వృద్దులైయుంటే కనుక, ముఖ్యంగా ఎముకల సమస్యలున్న వారైయుంటే కనుక, వైబ్రో మందులను తక్కువ మోతాదులో కొనసాగించటం మంచిది.
తీవ్ర శోషరస పాండురోగం (ల్యుకేమియా) శోకిన కాలు 02826...India
రెండునర్ర సంవత్సరాల బాలుడుకి ల్యుకేమియా(రక్త క్యాన్సర్) శోకింది. జ్వరంతో మొదలైన ఈ వ్యాధి ఒక నెల తర్వాత వైధ్యులచే ల్యుకేమియా యని నిర్ధారించబడింది. రోగికి రసాయనచికిత్స (కీమోతేరపి) మరియు ఇతర అల్లోపతి మందులు ఇవ్వబడినాయి. అల్లోపతి వైద్యం మొదలైన రెండు వారాల తర్వాత, ఆ పిల్లవాడి యొక్క తాత మరియు నానమ్మగారులు వైబ్రో చికిత్సా నిపుణుడను సంప్రదించి మందులను పుచ్చుకున్నారు. వైబ్రియానిక్స్ బాబాచే ఆశిర్వదింప బడింది కనుక తప్పక వారి మనవుడు కోలుకుంటాడని నమ్మారు. రోగికి క్రింది వ్రాసిన మందులు ఇవ్వబడినాయి:
CC2.1 Cancer + CC3.1 Anaemia + CC12.2 Children’s tonic…TDS
వైబ్రో మందును ప్రారంబించిన ఒక నెల తర్వాత, పిల్లవాడు బలహీనంగా ఉన్నప్పటికీ ఉత్సాహంగా ఉన్నట్లుగా రోగి యొక్క తాతగారు తెలిపారు. వైద్యానికి రోగి యొక్క స్పందన భాగుందని ఆశ్పత్రి నివేదిక తెలిపింది. మరో నెల రోజులు వైబ్రో చికిత్సను కొనసాగించిన తర్వాత, పిల్లవాడిలో 25% మెరుగుదల ఏర్పడింది. ఆపై కొన్ని నెలలు వైబ్రో మరియు అల్లోపతి వైద్యం తీసుకున్న తర్వాత, రోగి యొక్క పరిస్థితిలో మరింత అభివృద్ధి కలిగింది.చికిత్సా నిపుణులు రోగం తిరగబెట్టకుండా ఉండడానికి మరో నెల రోజులు కొనసాగించమని వైబ్రో మందునిచ్చారు.
సంపాదకుని వ్యాఖ్యలు:
ఇది మరణ సూచి అధికంగా ఉండే ఒక తీవ్రమైన వ్యాధి కాబట్టి రోగి యొక్క తాత నానమ్మలు, స్వామీ పైనున్న విశ్వాసంతో అల్లోపతి వైద్యంతో పాటు వైబ్రో చికిత్సను ఇప్పించాలని పట్టుబట్టడం ఒక వరం. చికిత్సా నిపుణుడు కచ్చితంగా ఆ పిల్లవాడికి తక్కువ మోతాదులో వైబ్రో మందునివ్వటం కొనసాగిస్తారని అనుకుంటున్నాము. CC12.2 Children’s tonic, ఇటువంటి ఒక తీవ్రమైన వ్యాధిని మరియు అల్లోపతి మందుల దుశ్ప్రభావాలని ఎదుర్కొనడానికి రోగికి సహాయపడింది.
మూత్రాశయంలో అంటురోగం శోకిన పిల్లి 01150...Croatia
చికిత్సా నిపుణుల కూతురి యొక్క పిల్లికి మూత్రాశయంలో, నొప్పితో కూడిన తీవ్ర అంటురోగం శోకింది. ఈ రోగం కారణంగా మూత్రంలో రక్తం కనిపించేది. పిల్లికి క్రింది మందులు ఇవ్వబడినాయి:
NM21 KBS + OM15 Kidneys + BR11 Kidney Balance + SM27 Infection...TDS
మూడు రోజులలో పిల్లికి కొంతవరకు నయమై. ఒక వారం రోజులలో పూర్తిగా కోలుకుంది.
నిపుణుల వద్ద 108 CC పెట్టె ఉండియుంటే కనుక, ఈ క్రింద వ్రాసిన మందులు ఇచ్చియుండవచ్చు:
CC1.1 Animal tonic + CC13.2 Urinary tract Infection…TDS
ప్రశ్న జవాబులు
ప్రశ్న: చికిత్స తీసుకున్న తర్వాత, కొన్నిసార్లు రోగులు తిరిగి రావడం లేదు. దీని కారణంగా చికిత్స ద్వారా వారికి సహాయం కలిగిందో లేదో నాకు తెలియడం లేదు.
జవాబు: చికిత్సానంతర పరీక్షకు ఒక నియామకము చేసి, ఒక కార్డు పై తేది మరియు సమయం వ్రాసి రోగులకు ఇవ్వండి. ఈ వివరాలను వారు చూస్తుండగా మీ స్వంత నియామక పుస్తకంలో వ్రాసుకోండి. ఉపశమనం కలిగినట్లయితే, రోగులు స్వయంగా వచ్చే అవసరం లేదని, అటువంటి సందర్భంలో మీకు ఫోను చేసి నియామకమును రద్దు చేయవలసిందిగా మీకు తేలపమని రోగులకు చెప్పండి. అయితే ఉపశమనం కలిగిన తర్వాత, రోగం తిరగ బడకుండా ఉండడానికి, వైబ్రో మందులను కొనసాగించడం చాలా ముఖ్యమని రోగులకు మీరు ఉద్ఘాటించి చెప్పాలి.
________________________________________
ప్రశ్న: నొప్పులు సమస్యున్న అనేక రోగులు CC20.3 + CC20.4 + CC20.5 కు స్పందించలేద.
జవాబు: మొదట మీరు, రోగులకు నొప్పులు ఎప్పుడు మొదలయ్యాయని వారిని అడిగి తెలుసుకోవాలి. అంతే కాకుండా, ఏదైనా ప్రమాదం లేదా వ్యాధి తర్వాత నొప్పులు ప్రారంభంయ్యాయాయని తెలుసుకోవడం చాలా ప్రధానం. ఏదైనా ప్రమాదం కారణంగా నొప్పులు ప్రారంభామయ్యుంటే కనుక, CC10.1 Emergencies + CC20.2 SMJ Pain వారికి సహాయపడుతుంది. ప్రమాదం కారణంగా కలిగిన గాయం రోగి మనస్సులో ఉండే అవకాశముంది కనుక CC10.1 Emergencies చేర్చడం చాలా ముఖ్యం. రోగికి నొప్పులు చికన్ గున్యా లేదా డెంగూ వంటి వ్యాధుల కారణంగా మొదలయ్యియుంటే కనుక, CC9.1 చేర్చాలి. ఈ మందును కనీసం ఒక నెల నుండి మూడు నెలల వరకు తీసుకొనే అవసరముంది.
________________________________________
ప్రశ్న: కొంతమంది రోగులు నాకు మూల్యం చెల్లించాలని ఆశపడుతున్నారు; వారికి మందులను ఉచితముగా తీసుకోవడం ఇష్టం లేదు. వారికి ఇది న్యాయమైన మార్పిడిగా అనిపించకపోయేసరికి చికిత్స కోసం రావడం పూర్తిగా మానేస్తున్నారు.
జవాబు: సేవ (ఏమి ఆశించకుండా మరియు ఏమి తిరిగి తీసుకోకుండా ఇతరులకు సహాయం చేయడమే సేవ యొక్క సూత్రం) యొక్క ఒక రూపంగా మీరు వైబ్రియానిక్స్ ను అభ్యసిస్తున్నారని వారికి వివరించండి. ఈ విధముగా సమాజానికి సహాయపడడం ద్వారా మీరు పొందే సంతృప్తి మరియు ఆనందాలే మీరు పొందే బహుమతులు. అయితే, వారికి ఇది ఇబ్భందికరంగా అనిపిస్తుంటే కనుక, వారికి తోచిన పైకమును సత్యసాయి సంస్థకు లేదా వారు ఎన్నుకున్న ఇతర సంస్థలకైనా విరాళంగా పంపవచ్చు. లేకపోతే, రోగిని సత్యసాయి సంస్థ పేరిట మీకొక చెక్కుని ఇవ్వమని చెప్పి, మీరా చెక్కును సంస్థ కార్యాలయానికి పంపించవచ్చు.
________________________________________
ప్రశ్న: జనులు రైళ్ళలో లేదా పైకెత్తు యంత్రములలో (ఎలివేటరు) ప్రయాణిస్తున్నప్పుడు వైబ్రో మందులను వారితో పాటు తీసుకొని వెళితే కనుక, మందు యొక్క శక్తి తగ్గిపోతుందా?
జవాబు: ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ల వాడకం ప్రబలమై ఉన్న కారణంగా ఎక్కడికైనా ప్రయానించాలంటే మనం జాగ్రత వహించాలి. మీ వద్ద SRHVP మశీనుంటే కనుక, NM45 Atomic Radiation + SR324 X-ray ను మీ కొత్త ఆల్కహాల్ సీసాలో చేర్చడం చాలా ముఖ్యం. మీ వద్ద పెట్టె ఉంటే కనుక, దానిలోయున్న ప్రతియొక్క మిశ్రమ సీసాలోను ఈ రెండు మందులు ముందే చేర్చబడియున్నాయి. అయితే, వైబ్రో మందులను నిరంతరం మొబైల్ ఫోనులు, టీవీలు లేదా కంప్యూటర్ల సమీపంలో పెట్టియుంచితే కనుక, మందుల యొక్క శక్తి నిలచియున్టుందని మేము కచ్చితంగా చెప్పలేము.
రోగులు రోజుకి నాలుగు సార్లు కంటే ఎక్కువగా వైబ్రో మందును తీసుకోవలసియుంటే తప్ప, క్రింది విధముగా వారిని మందును తీసుకోవలసిందిగా మీరు చెప్పడం మంచిది: ఉదయం మేలుకోగానే ఒకసారి, ఆఫీసుకు వెళ్ళడానికి ముందు ఒకసారి, ఆఫీసు నుండి రాగానే ఒకసారి మరియు నిద్రించడానికి ముందు ఒకసారి. ఇంట్లో వారిని మందుల సీసాను, స్నాన గదిలోనో లేదా వికిరణం లేన మరొక గదిలోనో సురక్షితంగా పెట్టమని చెప్పాలి. నాలుగు సార్లు కన్నా ఎక్కువగా వైబ్రో మందును తీసుకోవలసిన రోగులు, కొన్ని గోలీలను మాత్రము విడిగా ఒక సీసాలో తీసుకొని మరియు ఆ సీసాను అల్యూమినియం రేకుతో చుట్టివేయడం ద్వారా వికిరణం నుండి కొంత వరకు మందులను రక్షించవచ్చు.
చికిత్సా నిపుణులు: మీరు డా.అగ్గర్వాల్ను ఏమైనా ప్రశ్న అడగాలని అనుకుంటున్నారా? అయితే, మీ ప్రశ్నలను క్రింది ఇవ్వబడిన వెబ్సైటుకు పంపించండి: [email protected]
దివ్య వైద్యుడి యొక్క దివ్య వాక్కు
“సాంకేతిక విజ్ఞానం ఎంతగానో వ్యాపించియున్న ఈ కాలంలో ప్రశాంతమైన జీవితం కష్టసాధ్యంగా మారిపోయింది. ప్రజలు వివిధ శారీరక మరియు మానసిక వ్యాధులకు గురియైపోతున్నారు. ఆధునిక మహానగరాలలో అనేకమంది సహజంగా నిద్రించే ఆనందాన్ని కోల్పోయారు. వారు నిద్ర మాత్రలు ఉపయోగించటం ద్వారా కృత్రిమ నిద్రను మాత్రమే అనుభవిస్తున్నారు. మందులను అధికంగా తీసుకోవటం కారణంగా గుండె మరియు రక్తపోటు సమస్యలు పెరిగిపోతున్నాయి. అనారోగ్యాల కారణంగా ప్రజలు భయాందోళనలతో జీవిస్తున్నారు. మందులు, మాత్రలు లక్షలకొద్ది ఉత్పత్తి చేయబడుతున్నాయి కాని ప్రజలలో ఆరోగ్య అభివృద్ధి కలగటంలేదు. నిజానికి కొత్త రకాల అనారోగ్యాలు ఉద్భవిస్తున్నాయి. తెలివిగల కొంత మంది మాత్రమే యోగా మరియు ఇతర ఆధ్యాత్మిక సాధనల యొక్క సమర్థతను గ్రహిస్తున్నారు. తమ సొంత అనుభవాల ద్వారా ఈ విషయాన్ని వారు నిర్ధారించారు.”
-సత్యసాయి వాహిని Ch 22: "నిత్య సత్యములు”
“మనం చేసే ప్రతియొక్క చర్యను దైవానికి నివేదనగా చేయాలి. సోమరితనము ఉండకూడదు. చేసే ప్రతి చర్య పవిత్రమైన ప్రేమ భావంతో చేయాలి. మీ శక్తి సామర్థ్యాలకు తగిన పనిని మీరు ఎన్నుకోవచ్చు. పవిత్రమైన చర్యలను చేయడంతో పాటు దివ్య నామస్మరణను కొనసాగించాలి. ఆధ్యాత్మిక సాధనను చేపట్టినప్పుడు అనేక అడ్డంకులు ఎదురవుతాయని అంటుంటారు. అడ్డంకులు ఎదురైనప్పుడు వాటిని పరీక్షలుగా భావించాలి. పరీక్షలు శిక్షించడానికి కాదు అభివృద్ధికి కావాల్సిన యోగ్యతను నిర్ధారణచేయడానికి మాత్రమేయని గుర్తించాలి. తరచుగా ఎదురయ్యే పరీక్షలు, అభివృద్ధికై తరచుగా మీకివ్వబడే అవకాశాలని అర్థం. పరీక్షల మధ్యలో పెద్ద కాలవ్యవధి ఉంటే కనుక, ఇంకా ఎక్కువ కాలం వరకు అభివృద్ధి చెందే అవకాశం లేదని అర్థం. ఆధ్యాత్మిక సాధనలో అడ్డంకులను ఇటువంటి స్పూర్తితో ఎదుర్కొని వాటిని అధిగమించడానికి ప్రయత్నించాలి.”
-సత్యసాయి బాబా, దివ్యోపన్యాసం, జూలై 7, 1985
ప్రకటనలు
జరగనున్న శిక్షణా శిభిరం
ఇండియా : సీనియర్ చికిత్సా నిపుణులకు 2011 అక్తోబెర్ 3న ప్రశాంతి నిలయంలో.
జూనియర్ చికిత్సా నిపుణులకు 2011 అక్తోబెర్ 8 నుండి 9వరకు ప్రశాంతి నిలయంలో. డా.జ కే అగ్గర్వాల్ ను సంప్రదించండి.
2011 అక్తోబెర్ 29న ఢిల్లీ లో, జూనియర్ చికిత్సా నిపుణులకు మొదటి శిక్షణా శిబిరం.
2011 అక్తోబెర్ 10 నుండి 11 వరకు ఢిల్లీ లో, జూనియర్ చికిత్సా నిపుణులకు శిక్షణా శిబిరం.
మీ స్థానిక సమితి కన్వీనర్ ను సంప్రదించండి. .
పోలాండ్: 2011 నవంబెర్ 11 నుండి 12 వరకు వ్రొక్లావ్ లో - చికిత్సా నిపుణులు అందరికి పునశ్చరణ శిబిరం. ఈ శిబిరం లో ఆశక్తికరమైన రోగ చరిత్రలు వివరింపబడతాయి. డేరియజ్ హేబిస్జ్ ను 071-349 5010 or వద్ద లేదా ఈ మెయిల్ ద్వారా [email protected].
2011 సెప్టెంబర్ 2న: పుట్టపర్తి వద్ద జరుపబడిన వైబ్రియానిక్స్ ఆరోగ్య శిబిరం...300 రోగులకు చికిత్స
అదనపు సమాచారం
బరువును అదుపులో ఉంచే కొబ్బరి నూనె
ఊబకాయం మరియు జీవక్రియ రుగ్మతల అంతర్జాతీయ జర్నల్ లో ప్రచురించిన అనేక అధ్యయనాలు, కొబ్బరి నూనె భరువును అదుపులో ఉంచడానికి సహాయపడుతుందని చెబుతున్నాయి. ఒక పరిశీలనలో, కొబ్బరి నూనెను తిన్న స్థూలకాయ పురుషుల్లో కొవ్వు కరగటం మరియు కాలరీల ఖర్చు వేగవంతంగా జరుగుతోందని మాత్రమే కాకుండా శరీరంలో కొవ్వు నిలవటం కూడా తగ్గిందని తెలిసింది. మరొక పరిశీలన, 27 రోజుల పాటు పద్యం చేసిన మహిళల్లో చేయబడింది. వీరు తీసుకున్న ఆహారంలో, రోజువారి కేలరీలలో 30%, కొబ్బరి నూనెలో ఉండేవిధంగా, మధ్యస్థ శృంఖల ట్రైగ్లిజరైడ్స్ (MCTs) నుండి వచ్చాయని మరియు అవి కొవ్వును మరియు కేలరీలను వేగంగా తగ్గించడానికి సహాయపడతాయని తెలిసింది. MCTలు పెద్ద ప్రేగులో ఉండే ఆరోగ్యకరమైన బాక్టీరియాను పోషించడమే కాకుండా జీర్ణకోశములో ఉండే హానీకరమైన వ్యాదికారకులతో పోరాడుతుంది.
కొబ్బరి నూనెలో లారిక్, కాప్రిక్ ఆమ్లాలు వంటి ఆరోగ్యకరమైన కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. లారిక్ ఆమ్లం హానీకరమైన సూక్ష్మజీవులతో పోరాడటమే కాకుండా H.pylori వంటి బాక్టీరియం నుండి రక్షిస్తుంది. కాప్రిక్ ఆమ్లానికి ఈస్టు తో పోరాడే లక్షణములున్నాయి. కొబ్బరి నూనె, ఒమేగా-3 నూనెల వలే, గుండెజబ్బుకు ఒక కారకమైన రక్తం యొక్క జిగటను తగ్గిస్తుంది. న్యూ గినియాలో త్రోబ్రియాండ్ ద్వీప స్థానికులు తీసుకొనే రోజువారి ఆహారంలో, 80% కేలరీలు కొబ్బరి మరియు కొబ్బరి నూనె నుండి వస్తున్నాయి. వారికి గుండెజబ్బు లేదా స్ట్రోక్ సమస్యలు ఏమాత్రము లేవు మరియు శరీరంలో అదనపు కొవ్వు తక్కువున్నవారిగా ఈ ద్వీప స్థానికులు గుర్తించబడుతున్నారు.
భరువు తగ్గించడానికి ఎంత కొబ్బరి నూనెను తీసుకోవాలని తెలుసుకోవడానికి మరింత పరిశోధన అవసరం. అయితే కొబ్బరి నూనెతో వంట చేయవచ్చు, స్మూతీ తో పాటు చేర్చవచ్చు, అన్నం లేదా పాస్తా పైన వేసుకోవచ్చు మరియు ఏ కూరలోనైనా చేర్చుకోవచ్చు. కాబట్టి ప్రతిసారి మీరు ఆహారం తీసుకొనే సమయంలో ఒక పెద్హ చెంచాడు కొబ్బరి నూనెను తీసుకుంటే మంచిది. మీరు కొబ్బరి నూనెను కొనేడప్పుడు చీటిపై "RBD" ముద్ర వేసియుంటే కొనరాదు. దీనికి "శుద్ధి మరియు దుర్గంధ హరము చేయబడిందని మరియు అది రసాయనాలతో ప్రాసెస్ (క్రమిక) చేయబడిందని అర్థం. "పచ్చి కొబ్బరి నూనె" లేదా "సేంద్రీయ కొబ్బరి నూనె" అని సూచించబడిన కొబ్బరి నూనెను మాత్రమే కొనండి.
మూలం:సాల్లీ ఫాలోన్ మోరెల్, MA అధ్యక్షుడు, వెస్టన్ A ప్రైస్ ఫౌండేషన్
ఒంటరిగా ఉన్న సమయంలో గుండెపోటు వస్తే ప్రాణరక్షణ ఎలా చేసుకోవాలి?
గుండెపోటుతో భాదపడుతున్న రోగికి, స్పృహ కోల్పోవడానికి పది సెకన్ల సమయం మాత్రమే ఉంటుంది. ఒంటరిగా ఉన్న రోగులు తమను రక్షించుకోవడానికి ఈ విధముగా చేయాలి: భాదితులు తీవ్రంగా మరియు పదే పదే దగ్గుతూ ఉండాలి. ప్రతియొక్క దగ్గుకి ముందు, ఒక లోతైన శ్వాసను తీసుకోవాలి మరియు దగ్గు లోతైనదిగాను మరియు దీర్ఘమైనదిగాను ఉండాలి.
సహాయమందే వరకు లేదా గుండె సాధారణంగా మళ్ళి కొట్టుకొనే వరకు, ప్రతిరెండు సెకన్లకు ఒకసారి, ఆపకుండా ఒక శ్వాస తీసుకొని, ఒక మారు దగ్గుతూ ఉండాలి.
శ్వాసను లోతుగా తీసుకోవడం ద్వారా ఊపిరితిత్తులలోకి ఆక్సిజన్ చేరుతుంది మరియు దగ్గడం ద్వారా గుండె అదుముకొని రక్త ప్రసరణ సక్రమముగా జరగడానికి వీలుంటుంది. ఈ విధముగా నొక్కుకోవడం ద్వారా, గుండె సాధారణ లయకు తిరిగి చేరుకుంటుంది. ఈ విధముగా కుదుటపడ్డాక గుండెపోటు భాదితులు ఆశ్పత్రిని చేరుకోవచ్చు. ప్రాణాలను రక్షించే ఈ క్రియను గురించి సాధ్యమైనంతవరకు అందరికి తెలియచేయండి.
మీ కాళ్ళకు కొవ్వు కలిగించే హానిని సూచించే 11 లక్షణాలు
కొవ్వు గుండెలో ఉన్న రక్త నాళాలలో ఆటంకం కలిగిస్తుంది. అయితే, కాళ్ళ పైన కూడా దాని ప్రభావాన్ని చూపించి, PAD లేదా పరిధీయ ధమనీయ వ్యాధికి (పెరిఫెరల్ ఆర్టిరియల్ డిసీస్) దారితీయవచ్చు. US లో 12 మిల్లియన్ల ప్రజలకు మరియు ప్రపంచవ్యాప్తంగా అనేక మందికి PAD వ్యాధి ఉంది. ఈ వ్యాధి గుండెజబ్బు, గుండెపోటు మరియు స్ట్రోక్ వంటి వ్యాధులకు దారితీసేప్రమాదముందని మొన్టేఫియోర్ మెడికల్ సెంటర్లో ఒక ఉన్నత ఇంటర్వెన్షనల్ చికిత్సకు చెందిన డేవిడ్ స్లోవుట్, MD చెబుతున్నారు. ఐదేళ్ళ తరవాత, 20 శాతం PAD భాధితులకు ప్రాణాంతకం కాని గుండెపోటు వస్తుంది.
మీకు PAD ఉండుంటుందని సూచించే 11 లక్షణాలు. శుభవార్త ఏమిటంటే ఈ వ్యాధిని పూర్తిగా నయంచేయవచ్చు.
కాళ్ళ నొప్పి
కాళ్ళల్లో ఒక విధమైన నొప్పి లేదా అసౌకర్యం లేదా కాళ్ళు చచ్చుబడి పోవడం PAD వ్యాధి యొక్క సాధారణమైన లక్షణములు. రక్త నాళాలలో అడ్డంకం ఉన్న కారణంగా పరిశ్రమ లేదా వినియోగం తర్వాత కాళ్ళకి కావలిసిన రక్త ప్రసరణ సక్రమంగా జరుగదు. డా.స్లోవుట్ అంటున్నారు "కాళ్ళు భరువుగానో లేదా అలసటగానో లేదా మండుతున్నట్లుగా ఉంటున్నాయని కొంత మంది చెబుతారు". నొప్పి, కాలి యొక్క ఏ భాగంలోనైనా ఉండవచ్చు మరియు ఒక కాలు లేదా రెండు కాళ్ళల్లోను ఉండవచ్చు. నొప్పి పునరుత్పాదకమైనదిగా కూడా ఉండవచ్చు: కొంత దూరం నడవగానే నొప్పి వచ్చి, కొంత సమయం విశ్రాంతి తీసుకోగానే తగ్గుతుంది, తిరిగి అదే దూరం నడచి వెళ్ళినప్పుడు నొప్పి ఏర్పడుతుంది.
రాత్రివేళ తిమ్మురులు
నిద్రిస్తున్న సమయంలో PAD భాధితులకు, మడమ,ముందరికాలు లేదా కాలి వేళ్ళల్లో తిమ్మురులు లేదా ఈడ్పులు వచ్చే అవకాశముందని, న్యు యార్క్ ప్రెస్బైటీరియన్ ఆశ్పత్రి / వైల్ కార్నెల్ మెడికల్ సెంటర్ వద్ద వాస్కులర్ అండ్ ఎండోవాస్క్యులర్ సర్జరీ సెంటర్ కు నిర్వాహకుడైన డారెన్ స్క్నీడెర్, మద్ చెబుతున్నారు. కుర్చీలో కూర్చోవడం లేదా మంచం నుండి కాళ్ళను క్రిందకు వేళాడనీయడం ద్వారా ఉపశమనం పొందవచ్చని ఈ డాక్టర్గారు చెబుతున్నారు.
చర్మం మరియు గోళ్ళలో మార్పులు
PAD వ్యాధి కారణంగా కాలి వేళ్ళ గోళ్ళు మరియు కాలి చర్మంపై మార్పులు ఏర్పడవచ్చు. కాళ్ళల్లో రక్త ప్రవాహం సక్రమంగా జరగనందువల్ల, వాటికి పోషణ అందదు. దీని కారణంగా కాళ్ళు మరియు పాదాల పై ఉండే జుట్టు వ్రాలిపోవడం మరియు కాళ్ళ పైనున్న చర్మం మెరుస్తూ, భిగుసుగా మారుతుంది. ఈ లక్షణములన్ని సాధారణంగా ఒకే సమయంలో కనిపిస్తాయని డా. స్క్నీడెర్ చెప్పారు.
అసాధారణ చర్మ రంగు
మిమ్మల్ని పరిశీలించే సమయంలో వైద్యులు ముఖ్యంగా మీ కాళ్ళ రంగులో మార్పుందాయని పరిశీలన చేస్తారు. కాలు పైకెత్తినప్పుడు రక్త ప్రవాహం తక్కువగా ఉండటం కారణంగా కాళ్ళ రంగు తెల్లగా ఉంటుంది. ఒక బల్లపై కూర్చుని కాలును వేళాడతీసినప్పుడు కాలి రంగు ఎర్రగానో లేదా ఊదా రంగులోకి మారవచ్చని డా.స్క్నీడెర్ చెబుతున్నారు. దీనికి కారణం ఏమిటంటే కాళ్ళకు అందే రక్త ప్రవాహాన్ని పెంచడానికి శరీరంలో ఉన్న రక్త నాళాల వెడల్పు అధికమవుతుంది. ఈ వ్యాదియున్న కొంత మందికి, రక్త ప్రవాహం సక్రమంగా జరగనందు వల్ల, పాదాలు లేదా కాలి వెళ్ళు పాలిపోయిన రంగులో లేదా నీలం రంగులోకి మారుతాయి.
చల్లటి పాదాలు
పాదాలు లేదా కాళ్ళు చల్లగా ఉండడం PAD వ్యాధికి మరొక సూచిక. కాని ఇది ఒక ఉత్తమ సూచన కాదని డా.స్క్నీడెర్ చెబుతున్నారు. ఎందుకంటే ఈ సమస్య PAD వ్యాధి లేని వ్యక్తుల్లో కూడా ఉండవచ్చు. అయితే, మీకు ఒక కాలు లేదా ఒక పాదం మాత్రం చల్లగా ఉన్నట్లు అనిపిస్తే కనుక, వెంటనే మీరు వైద్యుడును సంప్రదించడం మంచిది.
నయంకాని పుళ్ళు
PAD వ్యాధి పురోగమించిన రోగులలో, రక్త ప్రవాహం తగ్గిపోవడం కారణంగా పాదాలలో పుళ్ళు ఏర్పడతాయి. ఇస్కేమిక్ పుళ్ళు అనపడే వీటికి వెంటనే చికిత్సనివ్వడం మంచిది. లేదంటి ఇవి నయంకావు. ఈ పుళ్ళు నలుపు లదా గోధుమ రంగులో ఉండవచ్చు. ఇవి చాలా నొప్పిగా ఉంటాయి (మధుమేహం సంభందిత పుళ్ళు, ఈ వ్యాధి ద్వారా జరిగిన నరాల నష్టం కారణంగా, నొప్పిగా ఉండవు)
ఎరిక్టైల్ డిసఫంక్షన్
ఈ లక్షణము సంభవించే అవకాశం చాలా తక్కువ కాని కొంత మందిలో ఈ లక్షణము కూడా ఉండవచ్చని డా.స్లోవుట్ చెబుతున్నారు. అంతర్గత కీగడుపు సంభంధమైన ధమనులు నిగుడుటకు కావలిసిన రక్త సరఫరానిస్తాయి. ఈ ధమనులలో అడ్డంకులు ఏర్పడినప్పుడు ఎరిక్టైల్ డిసఫంక్షన్ ఎరిక్టైల్ డిసఫంక్షన్ కు (ED) దారి తీస్తుంది. రక్త నాళ సమస్య కారణంగా ED లక్షణమున్న రోగులు చాలా తక్కువని డా.స్లోవుట్ చెబుతున్నారు.
తిమ్మిరి లేదా బలహీనత
విశ్రాంతి సమయంలో మీ కాళ్ళు బలహీనంగా లేదా తిమ్మిరెక్కిన్నట్లుంటే కనుక, అది PAD యొక్క సూచిక కావచ్చని డా.స్క్నీడెర్ చెబుతున్నారు. సాధారణంగా PAD సమస్య తీవ్రంగా ఉన్న రోగులకు, కేవలం నడిచేడప్పుడు మాత్రమే కాకుండా విశ్రాంతి సమయంలో కూడా ఈ లక్షణములుంటాయి.
కాలిపిక్క కండరాల క్షీణత
PAD తీవ్రమైన దశలో ఉన్న రోగులు కాలిపిక్క కండరాల యొక్క క్షీణత లేదా పరిమాణం తగ్గడం వంటి సమస్యలను ఎదుర్కొనే అవకాశముంది. అతిసూక్ష్మ స్థాయిలో, తగినంత రక్త ప్రవాహం లోపించడం కారణంగా కండరపు పోగు యొక్క సంఖ్య మరియు పరిమాణం క్షీణించిపోతుంది. నిజానికి, తీవ్రమైన PAD సమస్య ఉన్నవారు, ప్రభావితమైన ప్రాంతంలో సగానికి పైగా కండరాలు కోల్పోతారు. అంతేకాకుండా, మిగిలిన కండరపు పోగు క్షీణించవచ్చు.
కణజాల క్షీణత
PAD భాదితులలో 80% మంది స్వల్ప రోగ లక్షణాల దశను ధాటి ముందుకి వెళ్ళరని మరియు ఈ వ్యాధి యొక్క తీవ్ర దశను అనుభవించే వారి సంఖ్య చాలా తక్కువని డా.స్క్నీడెర్ చెబుతున్నారు. ముదిరిన దశలో, ఈ వ్యాధి కణజాల క్షీణతకు మరియు అంగ, ప్రాణ హాని కలిగించే కండను తినిపొయ్యే పుళ్ళకు (గెంగ్రీన్) దారితీయవచ్చు. ముదిరిన PAD భాదితులలో అంగ విచ్చేదనం చేసే అవసరం రావచ్చు. అయితే, కాళ్ళల్లో రక్త ప్రసరణ మెరుగుపరచడానికి ధూమపానం మానివేయడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని, ఔషధాలను తీసుకోవడం మరియు బైపాస్ లేదా యాంజియోప్లాస్టీ వంటి శస్త్ర చికిత్సలను చేయించుకోవడం వంటివి సహాయపడతాయి.
రోగ లక్షణములు లేకపోవడం
చాలా మంది PAD భాధితులకు ఈ వ్యాధి లక్షణాలేవి కూడా ఉండవు. అయితే, ఈ వ్యాధి కారణంగా గుండె పోటు మరియు స్ట్రోక్ల సంభావ్యత పెరిగే ప్రమాదముంటుంది కాబట్టి PAD సంభవించే ప్రమాదం ఎక్కువున్న వ్యక్తులు, తగిన పరీక్షలను చేయించు కోవడం మంచిది. క్రింది వ్యక్తులలో PAD సంభవించే అవకాశం ఎక్కువుంది: పొగ తాగేవారు, 50 సంవత్సరాల వయస్సు దాటిన వారు మరియు మధుమేహం ఉన్నవారు. క్రింది రోగ సమస్యలు మీకుంటే కనుక, మీకు PAD వచ్చే సంభావ్యత ఎక్కువగా ఉంటుంది: అధికమైన కొవ్వు, రక్తపోటు మరియు గుండె జబ్బు ,స్ట్రోక్ వంటి సమస్యలున్న కుటుంభ చరిత్ర కలిగియున్న వారు. మూలం:Health.com
Om Sai Ram