Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

Vol 3 సంచిక 1
January 2012
ముద్రింప తగిన వార్తాలేఖ


పూర్తి వార్తాలేఖ యొక్క కాగితం ప్రతి కావలెనన్నఈ పుటను ముద్రించండి

డా.జిత్ కే అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి

ప్రియమైన చికిత్సా నిపుణులకు 

వైబ్రియానిక్స్ చికిత్సా నిపుణులలో కొంత మంది కొత్త 108CC పెట్టెకు బదులుగా సాయిరాం హీలింగ్ వైబ్రేషణ్ పొటెంటైసెర్ (SRHVP) ను మరియు కార్డులను ఉపయోగిస్తున్నారని మీలో చాలా మందికి తెలిసిన విషయమే.  వైబ్రియానిక్స్ వైద్యశాలలు మరియు శిబిరాలకు అధిక సంఖ్యలో తరళి వస్తున్న రోగులకు పొటెంటైసెర్ ద్వారా మందులను తయారు చేసి ఇవ్వడం ఇబ్బందికరంగా ఉండడం కారణంగా, నాలుగు సంవత్సరాల క్రితం, స్వామీ దీవెనలతో, ఈ నూతన చికిత్సా వ్యవస్థను ప్రారంభించడం జరిగింది. సదృశమైన వ్యాధులు మరియు రోగ లక్షణాల చికిత్సకు ఉపయోగించబడే మందులను కలిపి, సంసిద్ధంచేసిన 108 మిశ్రమాల ద్వారా, మానవులను, జంతువులను  మరియు మొక్కలను శోకే దాదాపు అన్ని వ్యాధులకు చికిత్స చేయవచ్చు. ఒకే మందు అనేక రోగ లక్షణాలను నయం చేయడం ఎలా సాధ్యమని మీరు ఆశ్చర్యపోవచ్చు. ఉదాహరణకు, CC21.2 మొటిమల నుండి బొల్లి సమస్య వరకు అన్ని చర్మ వ్యాధులను నయం చేస్తుంది. చికిత్స పొందుతున్న రోగానికి సంభందంచిన మందులు రోగంతో అనునాదం చెందడము మరియు ఇతర వైబ్రేషన్లు ఏ విధమైన హాని కలిగించకుండా రోగి యొక్క శరీరం నుండి ధాటి పోవడమే, దీనికి కారణం..108 మిశ్రమాలు భగవాన్ మనకి ప్రసాదించిన ఒక అద్భుతమైన కానుక. వీటి ద్వారా వేగంగా మరియు సులభంగా చికిత్సను అందించడానికి మాత్రమే కాకుండా సులభమైన రీతిలో శిక్షణను ఇవ్వడానికి కూడా వీలుగా ఉంది. మీరు 108CC పెట్టెను తయారు చేయడానికి ముందు శిక్షణ పొందియున్నట్లయితే లేక ఈ పెట్టెను పొందాలని ఆశించినట్లయితే, దయచేసి మమ్మల్ని సంప్రదించండి. 108CC పెట్టెను క్రియాశీలంగా ఉపయోగిస్తూ, SRHVP యంత్రాన్ని ఉపయోగించే శిక్షణను పొందే అవసరముందని భావించే వారు, వైబ్రియానిక్స్ లో ఉన్నత తరగతి యొక్క వివరాలకు మాకు వ్రాయవచ్చు.  చైతన్యవంతమైన చికిత్సా నిపుణులకు తాము ఎన్నుకున్న ఈ సేవా మార్గంలో సహాయపడడం మాకు ఎల్లప్పుడు ఆనందాన్నిస్తుంది.

కొన్ని 108 మిశ్రమాల యొక్క కొత్త శీర్షికల పై కొంత అస్పష్టత ఉన్నట్లుంది. కొత్త పుస్తకంలో (2011లో సంకలనం చేయబడింది), మిశ్రమాల సంఖ్యలలో మార్పు లేదు కాని వీటి ద్వారా నయమయ్యే మరికొన్ని రోగాల పేరులు చేర్చడం జరిగింది. మిశ్రమాన్ని తగినంతగా వివరించని శీర్షికలను మాత్రము మార్చడం జరిగింది. మీకు సందేహాలేమైనా ఉంటె కనుక, అనుక్రమణికను చూసి మీరెన్నుకున్న మిశ్రమం, మీరు చికిత్స ఇస్తున్న రోగానికి తగినదేనా కాదాయని నిశ్చయపర్చుకోవచ్చు.

క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం సమయంలో, మా కార్యాలయం, కొత్త పెట్టె కోసం వచ్చిన చికిత్సా నిపుణులతో నిండిపోయింది. కొత్త పెట్టెను కొనే అవసరం లేదని మరోసారి మీయందరికీ గుర్తు చేస్తున్నాను. మీరు పర్తిని సందర్శించే సమయంలో ప్రస్తుతం మీ వద్దనున్న పెట్టెను తీసుకు వచ్చి, దీవెనలు కోసం బాబా యొక్క మహాసమాధి వద్ద పెట్టబడిన మాస్టర్ పెట్టె నుండి మీ పెట్టెను రీచార్జ్ చేసుకోవచ్చు. మీ పెట్టెలను రీచార్జ్ చేసుకోవడానికి కార్యాలయానికి వచ్చినప్పుడు, మా వద్ద నుండి కొత్త 108CC పుస్తకాన్ని(2011 సంకలనం) తీసుకోవచ్చు.

కొత్త సంవత్సరాన్ని ప్రారంభించే ఈ తరుణంలో ప్రశాంతి నిలయంలో ఉన్న ప్రకంపనలు అద్భుతంగా ఉన్నాయి మరియు ఎప్పటివలె స్వామి ఉనికి మరియు ప్రేమ భావం యొక్క అనుభూతి మాయందరికీ కలుగుతోంది. మనమందరము ఎప్పటికి స్వామి సేవను మరింత ఉత్సుకత మరియు నిస్వార్థ ప్రేమతో కొనసాగించాలని సంకల్పించుకుందాము. మీయందరికీ 2012 నిస్వార్థ సేవ మరియు ప్రేమతో నిండియుండాలని కోరుకుంటున్నాము!

ప్రేమపూర్వకంగా సాయి సేవలో

జిత్ కే అగ్గర్వాల్

స్మృతిలోపం, అలసట, మోకాలి నొప్పి 02859...India

నిరంతరంగా అలసట, స్మృతిలోపం మరియు మోకాలి నొప్పితో భాదపడుతున్న ఒక 46 ఏళ్ళ మహిళకు క్రింది వైబ్రో మందు ఇవ్వబడింది:
CC12.1 Adult tonic…TDS

ఒక నెల రోజుల్లో, ఆమెకున్న రోగ లక్షణాలని తగ్గిపోవడంతో మందు మోతాదును ఆపై పదిహేను రోజులకు BDకు తగ్గించబడింది. ప్రస్తుతం ఈమె మందును రోజుకి ఒకసారి (OD) తీసుకుంటోంది.

రక్తక్షయంతో కూడిన గుండెజబ్బు 02836...India

2001 నుండి గుండె సమస్యలు మరియు 2006 మరియు 2009 లో స్ట్రోక్ వ్యాధి భాదితుడైన ఒక 61 ఏళ్ళ వ్యక్తి, ఇటీవల  అనుభవిస్తున్న కొన్ని రోగ లక్షణాలు: తలతిరగటం మరియు స్పృహతప్పడం. ఈ సమస్యలకు చికిత్స కోరి చికిత్సా నిపుణుడను సంప్రదించడం జరిగింది. అంతకు ముందు ఈ వ్యక్తి గుండెజబ్బు మరియు నాడి నిపుణులను సంప్రదించిన సమయంలో చేయించుకున్న MRI పరీక్ష ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. చికిత్సా నిపుణుడు ఈ వ్యక్తికి క్రింది మందులను ఇవ్వడం జరిగింది:

CC3.5 Arteriosclerosis + CC15.1 Mental & Emotional tonic + CC18.7 Vertigo…6TD

ఆశ్పత్రిలో జరిగిన పరీక్ష ఫలితాలలో 2006 మరియు 2009 లో రోగికి వచ్చిన స్త్రోకులు కనిపించాయి. ఈ పరీక్ష ద్వారా రోగి యొక్క మెదడుకు రక్తప్రసరణ చేసే గళ ధమనులు ఎడమ వైపు 77 శాతం మరియు కుడి వైపు 48 శాతం కుంచించుకు పోయాయని వైద్యులు నిర్ధారించి శస్త్ర చికిత్స చేయించుకోమని సలహా ఇవ్వడం జరిగింది. స్వామిపై పూర్తి విశ్వాసము గల ఈ వ్యక్తి వైబ్రో మందులను క్రమం తప్పకుండా తీసుకోవడం కొనసాగించారు. అయితే అతని కుటుంభ సభ్యులు అతనికి శస్త్ర చికిత్స చేయించడం కోసం బొంబాయి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. శస్త్రచికిత్స చేయించుకోవడం కోసం బొంబాయికి వెళుతుండగా స్వామి అతని కలలో వచ్చి ఆందోళన పడవద్దని మరియు శస్త్రచికిత్స చేయించుకోవద్దని చెప్పారు. అందువలన అతను స్వామి పై పూర్తి నమ్మకముంచి, శస్త్ర చికిత్సను రద్దు చేసుకొని వైబ్రో చికిత్సా నిపుణుడు ఇచ్చిన మందులను మాత్రమే తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. స్వామి కృపతో ఆరు నెలలలో అతనికి గుండెకు సంబంధించిన వ్యాధి లక్షణాలు పూర్తిగా మాయమయ్యాయి.

సాయిరాం హీలింగ్ పొటెంటైజర్ ను ఉపయోగించే నిపుణులు క్రింది మిశ్రమాలను ఇవ్వవచ్చు:
BR5 Heart + BR18 Circulation + SM4 Stabilising + SM5 Peace & Love Alignment + SM15 Circulation + SR265 Aconite (200C) + SR271 Arnica (30C) + SR273 Aurum Met + SR383 Cuprum Met (30C) + SR413 Sumbul (200C) + SR415 Terebin (200C) + SR495 Heart + SR546 Baryta Carb.

వినికిడి లోపం మరియు స్ట్రోక్ 02859...India

ఒక 76 ఏళ్ల మహిళకు ఒక సంవత్సరం క్రితం వచ్చిన స్ట్రోక్ కారణంగా కుడి చెవిలో వినికిడి కోల్పోవడంతో పాటు ఎడమ చెవిలో ఒక ఇబబంధికరమైన ధ్వని వినిపించేది. అల్లోపతి వైద్యుడు ఈ సమస్యలకు కారణం చెవిలో అసమతుల్యత ఏర్పడడమేనని, దానికి పరిష్కారం ఏమి లేదని చెప్పారు. వైబ్రో చికిత్సా నిపుణుడు క్రింది మందులను ఇవ్వడం జరిగింది :

CC5.2 Deafness + CC5.3 Meniere’s disease + CC18.4 Paralysis…TDS

రెండు వారాలు ఈ మందులను తీసుకున్న తర్వాత, ఆమె కుడి చెవిలో వినికిడి ప్రారంభమైంది. రెండు నెలల తర్వాత ఆమె కుడి చెవితో స్పష్టంగా వినగలుగుతోందని చికిత్సా నిపుణులకు తెలియ చేసింది. ఆమె ఎడమ చెవిలో వినిపించే ఝంకారపు శబ్దం పూర్తిగా ఆగిపోయినట్లుగాను చెప్పింది. ఆమె ఇవే మందులను తీసుకోవడం ఇప్పటికి కొనసాగిస్తోంది...BD (రోజుకి రెండు సార్లు)

సాయిరాం హీలింగ్ పొటెంటైజర్ ను ఉపయోగించే నిపుణులు, క్రింది మిశ్రమాలను ఇవ్వవచ్చు: NM51 Earache + NM77 Ear Nerve + OM10 Ear + BR19 Ear + SM19 Ears + SR375 Chinin Sulph (30C) + SR380 Colchicum + SR415 Terebin (30C) + SR471 CN8: Auditory + SR490 Eustachian Tube.

మధుమేహము (డయాబెటిస్ మెల్లిటస్ రెండవ రకం) 02786...Russia

ఒక 58 ఏళ్ల మహిళకు తొమ్మిదేళ్లుగా రెండవ రకానికి చెందిన మధుమేహ సమస్య ఉండేది. అంతేకాకుండా, ఆమె అధిక బరువు, విపరీతమైన ఒత్తిడి, బలహీనత, అధిక భావొద్వేకము మరియు తీవ్ర అనారోగ్యంతో బాధపడేది. బైయెట్టా మరియు గ్లూకోవన్స్ వంటి అల్లోపతి మందులతో ఆమెకు చికిత్స ఇవ్వబడుతోంది. ఆమె చక్కెర స్థాయి 10 యూనిట్లుంది (సాధారణ చక్కెర స్థాయి 5.5 యూనిట్లు)

ఆమెకు ఇవ్వబడిన మిశ్రమాలు:

#1) CC12.1 Adult tonic + CC15.4 Eating disorders + CC18.1 Brain disabilities...TDS.

#2)CC6.3 Diabetes…TDS.

రెండు వారాల్లో, ఆమె ఆరోగ్యం మెరుగుపడి, శక్తి పెరిగింది. ఆమె యొక్క చక్కెర స్థాయి కొద్దిగా తగ్గింది. ఆపై పది రోజుల్లో, చక్కెర స్థాయి 9 యూనిట్లకు తగ్గింది.

 సాయిరాం పొటెంటైసెర్ ను ఉపయోగించి #2) ముందుకు బదులుగా క్రింది మందివ్వబడింది

#3) SM17 Diabetes + SM4 Stabilising + SM39 Tension…OD for the 1st week, then TDS.

మరొక వారం రోజుల్లో చక్కెర స్థాయి సాధారణ స్థాయికి చేరుకుంది. దీని కారణంగా రోగి అల్లోపతి మందు యొక్క మోతాదును తగ్గించడం ప్రారంభించింది. ఆ తర్వాత ఈ మహిళ తన స్వదేశానికి తిరిగి వెళ్లిన కారణంగా ఆమె యొక్క వివరాలు చికిత్సా నిపుణులకు లభించలేదు. అయితే వైబ్రో నిపుణులు ఆ మహిళకు మధుమేహం నుండి పూర్తి విముక్తి కలిగి ఆమెకొక సరికొత్త జీవితం ప్రారంభమయ్యుంటుందని ఆశిస్తున్నారు.

సాయిరాం హీలింగ్ పొటెంటైసెర్ ను ఉపయోగించే నిపుణులు క్రింది మిశ్రమాలను ఇవ్వవచ్చు: బలానికి:
NM63 Back-up + NM75 Debility;
for eating disorders: BR9 Digestion + SR280 Calc Carb (30C) + SR319 Thyroid Gland + SR341 Alfalfa + SR498 Hypothalamus + SR530 Stomach + SR572 Obesity; ఒత్తిడికి: NM6 Calming + NM37 Acidity + BR2 Blood Sugar + BR4 Fear + BR6 Hysteria + BR7 Stress + SM1 Removal of Entities + SM2 Divine Protection + SM4 Stabilising + SM5 Peace & Love Alignment + SM6 Stress + SM39 Tension; మధుమేహానికి: NM21 KBS + NM74 Diabetes + OM8 Hypo & Hyperglycaemia + OM9 Digestive Psychosomatic + BR2 Blood Sugar + SM41 Uplift + SR302 Nux Vom + SR305 Pancreatin + SR319 Thyroid Gland + SR320 Thyroidinum + SR499 Insulin + SR568 Hypothyroidism.

#3 ముందుకు సరి సమానమైన మిశ్రమం: CC6.3 + CC12.1 +CC15.1

కంటిపొర 02095...USA

డ్యూక్ అను 12 ఏళ్ల వయస్సున్న ఒక మొగ కుక్కకు కంటిపొర సమస్యకు చికిత్సా నిపుణుడు క్రింది మందులను ఇవ్వడం జరిగింది: NM47 Cataract Compound + NM48 Vitamin Eye Comp + NM68 Cataract Comp-B…BD.

కుక్కకు వైబ్రో చికిత్సిస్తున్నట్లుగా పశువైద్యుడకు తెలపలేదు. అందువలన కుక్క యొక్క కంటిని పరీక్షించిన సమయంలో కంటిపొర కరగడాన్ని చూసి వైద్యుడు ఆశ్చర్యపోయారు.

గమనిక: పైనున్న ముందుకు సరి సమానమైన మిశ్రమం : CC7.2 Partial Vision.

ప్రశ్న జవాబులు

ప్రశ్న: కీళ్ళవాత సమస్యతో వచ్చే రోగికి  CC20.3 ఇస్తే సరిపోతుందా లేక ఇతర మిశ్రమాలను చేర్చే అవసరం ఉందా?

జవాబు: కీళ్ళవాతమని నిర్ధారించబడిన రోగులు వైబ్రో చికిత్స కొరకు మీ వద్దకు వచ్చినప్పుడు CC20.1 లేదా CC20.2 తో చికిత్సను ప్రారంభించడం మంచిది. వీటితో రోగికి ఉపశమనం కలగని సందర్భంలో మాత్రమే CC20.3 ను ఇవ్వవలెను. ఈ మిశ్రమంతో కూడా ఫలితాలు లభించని సందర్భంలో, కీళ్ళవాతము కారణంగా కండరాలు భాధితమయ్యే అవకాశముంటుంది కనుక ,కండరాలు మరియు సహాయక కణజాలానికి సంభoధించిన మిశ్రమం CC20.4 ను చేర్చి ఇవ్వండి.

_____________________________________

ప్రశ్న: రక్తహీనత (అనీమియా) సమస్యకు తగిన మిశ్రమం ఏమిటి? ఈ సమస్యున్న అనేక మహిళలు చికిత్స కొరకు వస్తున్నారు.

జవాబు: రక్తహీనత చికిత్సకు CC3.1 Heart tonic ఇవ్వవలెను, అయితే, ఈ సమస్యకు మూలకారణం ఏమిటని కనుగొనడం ముఖ్యం. ఉదాహరణకు ఋతుస్రావం ఎక్కువగా ఉన్న మహిళకు CC3.1 తో పాటు CC8.7 Menses heavy ను చేర్చి ఇవ్వడం మంచిది. ఇనుము లోపం ఉన్న రోగులకు CC3.1 తో పాటు CC4.2 Liver tonic ను చేర్చి ఇవ్వవలెను.

_____________________________________

ప్రశ్న: దీర్ఘకాలిక వ్యాధికి చికిత్సను తీసుకుంటున్న సమయంలో రోగికి ఫ్లూ జ్వరము వచ్చింది. జ్వరానికి ఇచ్చే చికిత్స పూర్తయ్యే వరకు, దీర్ఘకాలిక సమస్యకు ఇస్తున్న చికిత్సను ఆపవచ్చా?

జవాబు: ఇటువంటి సందర్భాలలో స్థిర నియమాలు లేవు. కాబట్టి, చికిత్సా నిపుణులు తెలివైన నిర్ణయాలను తీసుకొని చికిత్సను అందించాలి. ఉదాహరణకు, క్యాన్సర్ వ్యాధికి చికిత్స పొందుతున్న రోగికి జలుబు వస్తే కనుక, క్యాన్సర్ వ్యాధికి ఇస్తున్న చికిత్సను ఆపకుండా, దానితో పాటుగా జలుబుకి చికిత్సను ఇవ్వాలి. అయితే, కీళ్ళవాత సమస్యకు చికిత్స పొందుతున్న ఒక రోగికి జ్వరం లేక జలుబు వచ్చినప్పుడు, దీనికి సంబంధించిన చికిత్స పూర్తయ్యే వరకు కీళ్లవాతానికి ఇచ్చే చికిత్స తాత్కాలికంగా ఆపడంలో హాని ఉండదు.

_____________________________________

ప్రశ్న: వివిధ నారాయణి సమూహాలకు చెందిన మందులను కలపవచ్చా? వైబ్రేషన్లను కలపడనాకి నిర్ణిత సూత్రాలు ఉన్నాయా?

జవాబు: మీరు వివిధ మిశ్రమాలు లేక మందులను కలపవచ్చు. వైబ్రేషన్లను కలపడానికి పాటించ వలసిన సూత్రం రోగికి వీలైనంత త్వరగా ఉపశమనాన్ని అందించకలగటం మాత్రమే. ఒక మిశ్రమం లేక ఒక మందును ఇతర మిశ్రమాలు లేక మందులతో కలపడం ద్వారా రోగికున్న వ్యాధి లక్షణాలు అన్నిటికి చికిత్సను అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఉదాహరణకు ఒక రోగికి జలుబుతో పాటు జ్వరం, తలభారం, గొంతునొప్పి, దగ్గు లేక జీర్ణాశయ సమస్యలు ఉంటే క్రింది మిశ్రమాన్ని ఇవ్వవచ్చు: NM11 Cold + NM18 General Fever + SM35 Sinus + SM40 Throat + NM8 Chest + NM80 Gastro. పైన ఇచ్చిన వంటి తీవ్రమైన సమస్యలకు, మిశ్రమాన్ని ఒకటి నుండి రెండు రోజులవరకు 6TD మోతాదులో తీసుకొని, ఆ తర్వాత, TDS మోతాదుకు తగ్గించవలెను.

దివ్య వైద్యుడి యొక్క దివ్య వాక్కు

“నేడు ఒక వ్యక్తి దుఃఖము మరియు కష్టాలలో ఉన్నాడంటే దానికి కారణం అతని మనసు. ఆనందం, భాధ, ప్రేమ, అయిష్టతలు మరియు మానవుడు అనుభవించే ప్రాపంచిక సుఖాలు, మనిషి యొక్క మనసు నుండే ఉత్పన్నమవుతాయి. ద్వైత భావం కలిగియున్న కారణంగా మానవుడు ఇటువంటి బాధలను అనుభవిస్తున్నాడు. మనసుకు సృష్టి యొక్క ఏకత్వం పై శిక్షణనిచ్చినప్పుడు ఏ రకమైన చెరువు ఉండదు. మీ జీవితంలో ప్రతీ సమస్యను మీరు చిఱునవ్వుతో ఎదుర్కోవాలి. ఈ ద్వైత స్వభావమున్న ప్రపంచంలో లాభాలు మరియు నష్టాలు ఉండడం సహజమే. కష్టాలనేవి, అనంతమైన ఆనందాన్ని పొందడానికి మొదటి మెట్టు. వీటినుండి తప్పించుకోవడం వీలు కాదు. మీరు కష్టాలను ఎదుర్కొన్నప్పుడు నిరాశ చెందరాదు లేదా విజయాన్ని ఎదుర్కొన్నప్పుడు పొంగిపోరాదు.”
-సత్య సాయి బాబా, 'థాట్ ఫోర్ థి డే' ప్రశాంతి నిలయం 

 

 

“మీ సేవను పొందే అర్హత ఇతరులకు ఉందా లేదాయని మీరు నిర్ణయించరాదు. వారు కష్టాలలో ఉన్నారా లేదాయని తెలుసుకొని వారికి తగిన సేవ చేయాలి. వారు ఇతరులతో ఏ విధంగా ప్రవర్తిస్తున్నారని మీరు పరిశీలించరాదు; వారిలో ప్రేమ ద్వారా ఖచ్చితంగా పరివర్తన తీసుకు రావచ్చు. సేవ అనేది పవిత్రమైన ఒక ప్రతిజ్ఞ, ఒక విధమైన సాధన, ఒక ఆధ్యాత్మిక మార్గం. సేవ మీ శ్వాస. మీ ఆఖరి శ్వాస వరకు సేవ మీతో ఉండాలి."
-సత్య సాయి బాబా , దివ్యోపన్యాసం , ఫెబ్ 19, 1970 

 

 

“నేల తడిగా ఉండటం వర్షం యొక్క రుజువు. అదేవిధంగా, సాధకుడు పొందే మనస్శాంతి, నిజమైన భక్తికి రుజువు. ఇటువంటి మనస్శాంతి సాధకుడను వైఫల్యాలు దాడి నుండి రక్షిస్తుంది. మనస్శాంతి, నష్టాలు మరియు అవమానాలు జరిగిన సమయంలోను సాధకుడను ప్రశాంతంగా ఉంచుతుంది."
-సత్య సాయి బాబా, సత్య సాయి స్పీక్స్, సంపుటం 5, పు.308 

ప్రకటనలు

జరగనున్న శిక్షణా శిబిరం

  • రోక్లా, పోలాండ్ లో, మార్చ్ 24-25 న - నూతన JVPలకు శిక్షణా శిబిరం. డారియుజ్ హేబిజ్ ను సంప్రదించవలసిన ఫోను.సంఖ్య: 071349 5010 మరియు ఈ మెయిల్: [email protected]       
  1. సమస్త ప్రశిక్షకులకు: మీరు శిక్షణా శిబిరాన్ని నిర్వహించనున్నట్లయితే దానికి సంబంధించిన వివరాలను [email protected] కు పంపవలెను.

అదనపు సమాచారం

జ్వరాలను ప్రేమించాలి, వాటికి భయపడరాదు

నేటి ఆరోగ్య సంరక్షణలో జ్వరాల యొక్క పాత్రపై అతిపెద్ద దురభిప్రాయం ఉంది. చాలా మంది తల్లితండ్రులు జ్వరాన్ని అపార్ధం చేసుకున్న కారణంగా, జ్వరాన్ని చూసి భయపడుతున్నారు. నిజానికి, జ్వరాన్ని గౌరవించాలి. జ్వరమనేది శరీరంలో జరిగే ఒక అత్యంత అసాధారణమైన మరియు జటిలమైన వైద్య ప్రక్రియల్లో ఒకటని చెప్పవచ్చు. జ్వరం అనేది రోగనిరోధక ప్రతిస్పందనను ఉద్దీపనచేసి, శరీరాన్ని ఆక్రమించిన కిరుములను నాశనం చేయడం ద్వారా ఆరోగ్య పునరుద్ధరణ చేసే ఒక ముఖ్యమైన ప్రక్రియ. ఆరోగ్యకరమైన బిడ్డకు జ్వరం వస్తే ముప్పులేదని, తల్లితండ్రులు అర్ధంచేసుకోవాలని 2011లో జరపబడిన ఒక అధ్యయనంలో అమెరికాకు చెందిన పీడియాట్రిక్స్ సంస్థ నిర్ధారించింది. నిజానికి జ్వరం ప్రయోజకరమైన ఒక ప్రక్రియని మరియు చికిత్స యొక్క ప్రధాన లక్ష్యం శరీర ఉష్ణోగ్రత తగ్గించడం కంటే, బిడ్డకు సౌకర్యాన్ని మెరుగుపర్చడమేనని తెలుసుకోవాలి.

పూర్వకాలంలో జ్వరాలను అర్ధంచేసుకుని గౌరవించేవారు. తీరాన్ని చేరుకొనే కెరటం వలె, జ్వరం పైకెక్కుతూ క్రిందకి దిగుతూ ఉంటుందని పూర్వంలో అందరికి తెలిసిన విషయమే. అయితే, ఇప్పుడు జ్వరం యొక్క ప్రయోజనాన్ని తెలుసుకోకుండా చాలా మంది దాన్ని వివిధ మందులతో అణచివేయడానికి ప్రయత్నిస్తున్నారు. జ్వరాన్ని తగ్గించే ఇటువంటి పదార్థాలను "ఫీవర్ రెడ్యూసర్" అని అంటారు. ఈ మందులు జ్వరాన్ని వేగంగా తగ్గిస్తాయి. కానీ ఇలా చేయడం ద్వారా, శరీరంలో రోగనిరోధక వ్యవస్థ క్షీణించి, కిరుముల పెరుగుదలకు దారి తీస్తుంది. తద్వారా దీర్ఘకాలిక వ్యాధులు కలిగే అవకాశం ఉంటుంది.

 జ్వరం తగ్గించే మందులు తరచుగా దుర్వినియోగం చేయబడుతున్నాయి. వీటిని అధిక మోతాదులో తీసుకోవడం కూడా జరుగుతోంది. తల్లిదండ్రులలో యాభై శాతం మంది, 100.4°F లేదా తక్కువ ఉష్ణోగ్రతను జ్వరమని తలచి నిజానికి జ్వరం స్థితికి చేరుకొనే ముందుగానే జ్వరం తగ్గించే మందును బిడ్డలకు వేస్తున్నారు. అంతేకాకుండా 85 శాతం తల్లితండ్రులు నిద్రిస్తున్న బిడ్డలను మేల్కొల్పి మందులను వేయడం జరుగుతోంది. 80 శాతం వైద్యులు ఈ అలవాడును ఆక్షేపిస్తున్నారు. నిద్రిస్తున్న సమయంలో వ్యాధి గుణమయ్యే అవకాశం చాలా ఎక్కువ.

ఆధునిక వైద్యం మనలోనున్న సహజ రోగ నివారణ శక్తిని ఉపయోగించుకొనే అవకాశాన్ని మన శరీరాలకి ఇవ్వడం లేదు. రోగ లక్షణాలు లక్ష్యంగా పెట్టుకొని చేసే చికిత్సల కారణంగా రోగులు, తక్షణ ఫలితాలు లభిస్తాయని ఆశించడం నేర్చుకున్నారు. తమ పిల్లల ఆరోగ్యం వేగంగా మెరుగుపడాలన్న ఆందోళన కలిగియున్న తల్లితండ్రులు, తక్షణ ఫలితాలను అందిస్తున్న చికిత్సలపై ఆధారపడడం మరింతగా చూస్తున్నాము. వ్యాధి యొక్క మూలకారణానికి చికిత్సను ఇవ్వకుండా, కేవలం వ్యాధి లక్షణాలకు మాత్రమే చికిత్సను ఇవ్వటం, ఒక ఇల్లు కాలిపోతుండగా అగ్నిప్రమాద సూచననిచ్చే అలారం నుండి బ్యాటరీలను తీసివేయడం వంటిది. తల్లితండ్రులకు మరియు పిల్లలకు తమ శరీరాల నుండి వ్యాధి లక్షణాలను కేవలం తొలగించుకోవడమే కాకుండా, ఆ సంకేతాలను గమనించి, వాటిని అర్ధం చేసుకోవడాన్ని నేర్పడం ఎంతో అవసరం.

మౌఖిక ఉష్ణోగ్రత 100.4° F ని మించియుంటే జ్వరమని అనబడుతుంది. సాధారణంగా జ్వరం స్వయం-పరిమితమైనది మరియు తక్కువ కాలం మాత్రమే ఉంటుంది. జ్వరం కారణంగా రోగం యొక్క గతి హీనస్థితికి మారిందని కానీ దీర్ఘకాల నరాల సంబంధిత సమస్యలు కలిగాయని కానీ ఆధారం లేదు. జ్వరం అనేది ఒక వ్యాధి కాదని అంతర్లీనంగా ఉన్న వ్యాధి యొక్క లక్షణం మాత్రమేనని తెలుసుకోవడం చాలా ముఖ్యం.

ప్రతియొక్క మానవుడు సజీవంగా ఉండాలని కోరుకుంటాడు. మానసికంగా, శారీరికంగా, శరీరధర్మ మరియు జీవశాస్త్రపరంగా మానవుడు జీవనాభివృద్ధి కోసం పనిచేస్తాడు. ఇది అర్ధం చేసుకున్నప్పుడు, జ్వరం అనేది, శరీరం క్రిములతో పోరాడడానికి నిర్వహించే ఒక శరీరధర్మ ప్రక్రియయని మరియు ఈ ప్రక్రియ జీవనాభివృద్ధికి సహాయపడుతుందని సులభంగా గ్రహించవచ్చు. బాక్తీరియా, వైరస్లు వంటి సూక్ష్మ విషక్రిములు మన శరీరంలోకి ప్రవేశించిన వెంటనే, హైపోథలామస్ (అధఃపర్యంకం) యొక్క "సెట్ పాయింట్" ను పెంచమని మెదడుకు సంకేతాలు పంపబడతాయి. దీనికారణంగా క్రిములను తొలగించే వరకు తాపక్రమనిర్ధారకము (థెర్మోస్టాట్) యొక్క క్రియాశీలత పెంచబడుతుంది. క్రిములలో ఉండే విషపదార్థాలు ద్వారా లేక క్రిములకు శరీరం యొక్క ప్రతిస్పందన అంటే సైటోకైన్లు, మైక్రోఫెజులు మరియు ఆంటీబాడీల ఉత్పత్తి ద్వారా ఈ సంకేతాలు అందుతాయి. ఉష్ణోగ్రత పెరుగుదల ద్వారా రోగనిరోధక వ్యవస్థ మరింత శక్తివంతమవుతుంది. వాపు ద్వారా ప్రభావిత ప్రాంతం రక్షింపబడి, ఇన్ఫెక్షన్ యొక్క వ్యాప్తి నిరోధించబడడమే కాకుండా, వైద్య ప్రక్రియ ప్రారంభించబడుతుంది.

జ్వరం 102°F ను మించినప్పుడు లేదా మూడు రోజులకు పైగా జ్వరం ఉన్నప్పుడు వైద్యుడుని సంప్రదించాలి. చల్లని గుడ్డతో శరీరాన్ని తుడవడం లేదా మంచుగడ్డ కట్టు వంటివి శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి సహాయపడతాయి. జ్వరం ద్వారా తీవ్ర అసౌకర్యం, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది, మన్యస్తంభము, మూర్ఛ వంటి లక్షణాలున్నప్పుడు వైద్యుడను సంప్రదించడం మంచిది. జ్వరం వచ్చిన సమయంలో శరీరానికి సరియైన ఆర్ద్రీకరణ (హైడ్రేషన్) మరియు ఉప్పు పునరుద్దరణ అవసరం http://www.naturalnews.com.      

 (జ్వరానికి తగిన మందుల కొరకు మీ రెమెడీలు (మందులు) పుస్తకాన్ని చూడండి)

వినికిడి లోపం

వినికిడి లోపం గలవారు కుటుంభ సభ్యులు మరియు స్నేహితులతో జరిగే సంభాషణను విని ఆనందించలేరు. దీని కారణంగా వారు ఎంతో నిరాశ చెందుతారు. వినికిడి లోపం కారణంగా వినటం ఇబ్బందికరంగా ఉంటుంది కానీ అసాధ్యం కాదు. ఈ లోపం ఉన్నవారికి సులభంగా సహాయపడవచ్చు. చెవిటి వారికి ఏ విధమైన ధ్వనిని వినటానికి సాధ్యం కాదు.

వినికిడి లోపానికి కారణాలు ఏమిటి? కొన్ని కారణాలు:

  • వంశపారంపర్యంగా వచ్చినవి
  • చెవిశోథ లేదా నాడీమండల పటలశోథ
  • ఆఘాతం
  • కొన్ని రకాల మందులు
  • దీర్ఘకాలంగా బిగ్గరధ్వని విన్నప్పుడు
  • వృద్ధాప్యం

వినికిడి లోపంతో రెండు ప్రధాన రకాలు ఉన్నాయి. శ్రవణనాడి చెడిపోయినప్పుడు, ఒక రకమైన వినికిడి లోపం కలుగుతుంది. ఈ లోపం శాశ్వతమైనది. మరొక రకమైన లోపం మీ చెవి అంతర్భాగం వరకు ధ్వని చేరకుండా ఉన్నప్పుడు కలుగుతుంది.  చెవిలో గులిమి అధికంగా చేరిపోవడం, ద్రవం లేక చిల్లుపడిన చెవిగూట వంటి కారణాల వల్ల ఇది కలగవచ్చు. చికిత్స తీసుకోకపోతే, వినికిడి సమస్యలు మరింత తీవ్రమయ్యే అవకాశముంది. మీకు వినికిడి లోపమున్నట్లయితే, మీరు సహాయం పొందవచ్చు. సాధ్యమైన చికిత్సలు: వినికిడి పరికరాలు, చెవిలో కర్ణావృత్తి (కాక్లియా) యొక్క దూర్పు, ప్రత్యేక శిక్షణ, కొన్ని రకాల మందులు మరియు శస్త్రచికిత్స.

...NIH: వినికిడి లోపం మరియు ఇతర కంమ్యూనికేషన్ సమస్యల యొక్క రాష్ట్రీయ సంస్థ

(108 మిశ్రమాల పుస్తకంలో 5 వ విభాగం 'చెవులు' క్రింద చూడగలరు లేదా వైబ్రియానిక్స్ 2004 పుస్తకంలో – SRHVP 3.5 చూడగలరు ) 

 

ప్రోస్టేట్ వ్యాధులు

ప్రోస్టేట్ (శుక్రాశయపిండము) ఒక గ్రంధి. ఇది వీర్యము లేదా శుక్లము ద్రవ్య తయారీకి సహాయపడుతుంది. ప్రోస్టేట్ గ్రంధి మూత్రాశయం నుండి మూత్రాన్ని తీసుకువెళ్లే గొట్టాన్ని చుట్టుముడుతుంది. ఒక యువకుడిలో, ప్రోస్టేట్ వాల్నట్ యొక్క పరిమాణంలో ఉంటుంది. ఇది వయస్సుతో పాటు క్రమంగా పెరుగుతుంది. దీని పరిమాణం చాలా పెద్దదిగా మారినప్పుడు సమస్యులకు కారణమవుతుంది. 50 సంవత్సరాలు దాటిన వారిలో ఈ సమస్యను సాధారణంగా చూడవచ్చు. వయస్సు పెరిగిన కొద్ది ప్రోస్ట్రేట్ సమస్య సంభవించే అవకాశం అధికమవుతుంది.

కొన్ని సాధారణ సమస్యలు:

ప్రోస్ట్రేట్ యొక్క శోధము - సాధారణంగా బ్యాక్టీరియా ద్వారా కలిగే ఒక వ్యాధి 

బినైన్ (నిరపాయమైన) ప్రోస్ట్రేట్ పెరుగుదల లేదా BPH - ముఖ్యంగా రాత్రివేళ తరచుగా మూత్రవిసర్జన సమస్య కలిగించే మరియు పరిమాణం పెరిగిన ప్రోస్ట్రేట్.

ప్రోస్ట్రేట్ క్యాన్సర్ - ప్రారంభ దిశలో కనుగొనబడినప్పుడు చికిత్సకు స్పందించే ఒక సాధారణ క్యాన్సర్.      

… మధుమేహ, జీర్ణక్రియ మరియు మూత్రపిండం సంబంధించిన వ్యాధుల యొక్క రాష్ట్రీయ సంస్థ

(108 కామెన్ కాంబోల(మిశ్రమాల) పుస్తకంలో విభాగం-14 'మొగ అవయవములు' లేదా వైబ్రియానిక్స్ 2004 పుస్తకంలో -SRHVP 3.14 చూడగలరు

  • Om Sai Ram