Vol 3 సంచిక 2
March 2012
ముద్రింప తగిన వార్తాలేఖ
పూర్తి వార్తాలేఖ యొక్క కాగితం ప్రతి కావలెనన్నఈ పుటను ముద్రించండి
డా.జిత్. కే అగ్గర్వాల్ యొక్క మాటల్లో
ప్రియమైన ప్రాక్టీషనర్లకు ప్రేమ పూర్వక సాయిరాం !
మీ అందరూ ఈ పవిత్రమైన మహాశివరాత్రి పర్వదినాన్ని ఆనందకరంగా జరుపుకొని ఉంటారని ఆశిస్తున్నాను. ఇక్కడ ప్రశాంతి నిలయంలో భజనలు మనోహరంగా ఉండటమే కాకుండా వైబ్రియోనిక్స్ కు సంబంధించినంతవరకూ మనకు ఒక ప్రత్యేకమైన అవకాశం కూడా ఏర్పడింది. మహాశివరాత్రి పవిత్రోత్సవం అయిన 2012 ఫిబ్రవరి 20న సాయి సంస్థల అఖిలభారత అధ్యక్షుడు శ్రీనివాసన్ గారు భారతదేశంలోని వివిధ రాష్ట్రాల అధ్యక్షులు మరియు వారి వైద్య సమన్వయకర్తల కోసం వైబ్రియోనిక్స్ వర్క్ షాప్ నిర్వహించారన్న వార్త మీ అందరికీ ఎంతో ఆనందదాయకం ఔతుందన్న విషయం నాకు తెలుసు. సంస్థలోని పదాదికారులలో వైబ్రియోనిక్స్ గురించి అవగాహన కల్పించడం ఈ సదస్సు యొక్క ప్రధాన ఉద్దేశ్యము. మనకు ప్రత్యేక సూచనలు ఇవ్వడానికి స్వామి మనమధ్య తన భౌతిక రూపంలో లేనందున వైబ్రియానిక్స్ అధికారిక స్థానం ఈ సమావేశం స్పష్టం చేసిందని చెప్పవచ్చు.
భగవాన్ బాబా వారి ఆశీర్వాదాలు కోరుకుంటూ వేదం పఠనం జరుగుతూ ఉండగా అఖిలభారత అధ్యక్షుడు దీపం వెలిగించడం ద్వారా ఈ శిక్షణా శిబిరాన్ని ప్రారంభించాము. వారు తన ప్రారంభ ప్రసంగంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థ పతాకంపై భారతదేశంలో వైబ్రియానిక్స్ సదస్సులు జరగకపోయినా భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో నిర్వహించే శిబిరాలను సాయి సంస్థ సులభతరం చేస్తుందని హామీ ఇచ్చారు.
సంక్షిప్తంగా ఈ వైద్య విధానం గురించి పరిచయం చేస్తూ రెమిడీ లను తయారు చేయడానికిసాయిరాం పోటెంటైజర్ ఎలా ఉపయోగింప బడుతుందో ఒక ప్రదర్శన ఇచ్చాను. స్వామి సంకల్పంతో ప్రవేశపెట్టబడి 1994లో ఆశ్రమంలో దీన్ని సాధన చేయడం మొదలు పెట్టినప్పటి నుండీ అనేక సందర్భాలలో స్వామి ఈ వైద్య విధానాన్ని ఎలా ఆశీర్వదిస్తూ వచ్చారో ప్రేక్షకులకు తెలియజెప్పడం అవసరమని భావించి అట్టి వివరాలు అందించడం జరిగింది. అనగా స్వామి మొదటి సారి సాయిరాం హీలింగ్ మిషనును ఎలా ఆశీర్వదించారు, విదేశాల్లో మరియు భారతదేశంలో సెమినార్లు నిర్వహించడానికి వారు మనల్ని ఎలా ఆశీర్వదించారు, వైద్యపట్టభద్రులు కానివారు కూడా ఈ చికిత్సా పద్దతిని ఎలా అభ్యసించగలరు, (స్వామి మాత్రమే నిజమైన వైద్యుడు మనమంతా వారి దివ్య హస్తంలో పనిముట్లు) స్వామి అనేక రకాల వైబ్రో పుస్తకాలను, 108 కోంబో బాక్సును, వార్తాలేఖను ఎలా ఆశీర్వదించారో మరియు వరుసగా మూడు సంవత్సరాలు గురు పూర్ణిమకు వైబ్రియానిక్స్ కు చెందిన కేకును కట్ చేయడం ద్వారా మనలనందరినీ ఎలా ఆశీర్వదించారో వివరించడం జరిగింది. వాస్తవానికి స్వామి ఆశీర్వాదాలను మరియు సూచనలు జాబితాగా చేసినప్పుడు గత 18 సంవత్సరాలు స్వామి మనకు ఎంత ఇచ్చారో తెలుసుకొంటే ఆశ్చర్యం కలుగక మానదు. నిజం చెప్పాలంటే ఇంత చక్కని మార్గదర్శకత్వం మరియు ఆదరణ అందించే ప్రేమమూర్తి మనకు లభించడం మనందరి భాగ్యవిశేషం.
మహారాష్ట్ర, ఢిల్లీ-NCR, కేరళ, కర్ణాటక, మరియు జమ్మూకాశ్మీరుకు చెందిన వైబ్రియానిక్స్ కోఆర్డినేటర్లు మరియు బోధన అధ్యాపక సభ్యులు చిన్నచిన్న ఉపన్యాసాలు ఇచ్చారు. వారు స్పృశించిన అంశాలు వైబ్రియానిక్స్ సేవలను ఎంత సులభంగా నిర్వహించవచ్చు, సమర్థవంతమైన వైద్యం కోసం అభ్యాసకుని విశ్వాసం యొక్క ఆవశ్యకత, గ్రామాలు మరియు మురికివాడలలో నిర్వహించ బడుతున్న క్యాంపులద్వారా రోగుల చికిత్సలో ఒనగూడే ఆశ్చర్య కరమైన ఫలితాలు, వాటికి కొన్ని అద్భుతమైన ఉదాహరణలు, మరియు చికిత్సపొందుతున్న రోగుల సంఖ్య మరియు అంకితభావం గల అభ్యాసకులు చేసిన సేవా గంటల సంఖ్య వంటివి వివరించారు.
పోలెండ్ కు చెందిన ఒక కోఆర్డినేటర్ వైబ్రియానిక్స్ సాధన ద్వారా మన ప్రభువైన స్వామికి ఎలా సన్నిహితం కాగలమో, 1999లో వైబ్రియానిక్స్ పోలండుకు ఎలా వచ్చిందో మరియు క్రమం తప్పకుండా సదస్సులు, పునశ్చరణ తరగతులు ఎలా నిర్వహింపబడుతున్నాయో వివరించారు. UK నుండి వచ్చిన మా చురుకైన అభ్యాసకులలో ఒకరు ఈ అద్భుత వైద్య విధానం గురించి నమ్మశక్యం కాని కొన్ని కేసులను సమర్పించారు. రోగ స్వస్థతలో పనిచేసేది రెమిడీ మాత్రమే కాదు రోగితో ప్రేమగా మాట్లాడటం, రోగి చెప్పేది మనం ఓపికతో వినడం ద్వారా తన బాధలు తీరడానికి మార్గం సుగమం అవుతుంది. ఇది కూడా చికిత్సలో ఒక భాగమే అనే చాలా ముఖ్యమైన విషయాన్ని ఆమె తెలియజేసారు. UK నుంచి వచ్చిన మన పరిశోధనా బృందపు అధినేత వైబ్రో వ్యవస్థపై ఆమెకున్న నమ్మకం గురించి మరియు మనందరికీ స్వామి ప్రేమ ఎలా శక్తినిస్తుంది అనేదానిని గురించి మాట్లాడారు.
USA నుండి అభ్యాసకురాలు మరియు మన వార్తాలేఖ సంపాదకురాలు స్వామి ఆశీర్వాదము చేత దీనికి అంకురార్పణ ఎలా ఏర్పడిందో వివరించారు. సేవ చేయాలనుకునే ఉత్సుకత కలిగిన ఎవరైనా ప్రముఖ భారతీయ భాషలలోనికి వార్తాలేఖను అనువదించడానికి ముందుకు రావలసిందిగా ఆమె ఆహ్వానించారు. గత సంవత్సరం స్వామి పుట్టినరోజున ప్రారంభించిన మన కొత్త వెబ్సైట్ www.vibrionics.org గురించి ప్రత్యక్ష ప్రదర్శన ద్వారా వివరించారు. అనంతరం ఒక చిన్న ప్రశ్నోత్తరాల సెషన్ జరిగింది. ఆ తర్వాత స్వామి అనేక సందర్భాల్లో వైబ్రియానిక్స్ ను ఆశీర్వదించిన సంఘటనలతో కూడిన వీడియో ప్రదర్శనతో ఈ వర్క్ షాప్ ముగిసింది.
వాస్తవానికి ఇది చాలా విజయవంతమైన రోజు. ఇది అభ్యాసకులుగా మనకు ఎంత ఫలవంత మైనదో ప్రేక్షకులకు కూడా అంతే ఉత్పత్తులను అందిస్తుందని మేము ఆశిస్తున్నాము. సాయి సేవ ప్రపంచ వ్యాప్తంగా వైబ్రియానిక్స్ ద్వారా వ్యాప్తి చేయడానికి ఇది చక్కని ముందడుగు కావాలని ఆశిస్తున్నాము.
సమస్త లోక సుఖినోభవంతు
ప్రేమతో సాయి సేవలో మీ
జిత్ కె అగ్గర్వాల్
ఇన్ఫెక్షన్ వలన చర్మానికి ఎలర్జీ 11414...India
2 రెండు సంవత్సరాల బాలుడ్ని శరీరమంతా వ్యాపించిన అలెర్జీతో అభ్యాసకుని వద్దకు తీసుకుని వచ్చారు. శరీరమంతటా ఇన్ఫెక్షన్ మరియు దురద వ్యాపించి ఉంది. గత నాలుగైదు నెలలుగా వారి యొక్క వైద్యుడి సూచన మేరకు బాలుని తల్లిదండ్రులు అనేక చర్మపు క్రీములను మరియు అల్లోపతి మందులు వాడారు కానీ ఏ మాత్రం ప్రయోజనం కనిపించలేదు. తల్లి హోమియోపతి వైద్యుడిని ఏమైనా సహాయం చేస్తారని ఆశతో సంప్రదించారు కానీ బాలుని పరీక్షించిన తర్వాత వారు బాలునికి రెండు మూడు సంవత్సరాల్లో నయమవుతుంది కానీ 18 వేల రూపాయలతో ఖర్చవుతుందని తెలిపారు. తల్లిదండ్రులు అంత డబ్బులు చెల్లించలేక లేక చివరి ప్రయత్నంగా సాయి వెైబ్రియానిక్స్ ను ఆశ్రయించారు. అబ్బాయికి క్రిందిరెమిడీ ఇవ్వబడింది:
CC21.2 Skin infections + CC21.3 Skin allergies…QDS.
వారం తర్వాత శరీరం పొడిగా మారిపోయింది. ఇది ఒక చక్కని సంకేతం కావడంతో ఔషధం కొనసాగించమని తల్లికి చెప్పబడింది. మరో 15 రోజుల్లో చర్మం 90 శాతం నయమయ్యింది. ఇది నమ్మశక్యంగా లేదని తల్లి వ్యాఖ్యానించింది. ఇదే రెమిడీ కొనసాగించాలని తల్లికి సూచించారు. మరో 15 రోజులు రెమిడీని TDS తగ్గించిన మోతాదులో కొనసాగించవలసిందిగా సూచించారు. ఆ తర్వాత బాలునికి పూర్తిగా తగ్గిపోయే సరికి పిల్లవాడు తల్లిదండ్రులు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు.
మూసుకుపోయిన ధమనులు (veins) 02799...UK
ధమనులు మూసుకుపోయిన 74 సంవత్సరాల అధిక బరువు గల వ్యక్తి ఈ అభ్యాసకునికి మొదటి కేసుగా తటస్థించడం జరిగింది. అతను కొంచంసేపు ఆగి విశ్రాంతి తీసుకోకుండా 2-3 మీటర్ల కంటే ఎక్కువ నడవలేరు. అతని డాక్టర్లు ఎమ్మారై స్కానింగ్ తర్వాత బైపాస్ సర్జరీ అవసరమని తెలిపారు. ఇది రెండు వారాల్లో నిర్వహించడానికి ఏర్పాటు చేయబడింది. ఈలోగా అతను వైబ్రియానిక్స్ ద్వారా ఎంతోకొంత మేలు జరుగుతుందని లేదా కనీసం వైద్యులు చేయబోయే ఆపరేషన్ యొక్క ఆందోళన అధిగమించాలానే ఆశతో అభ్యాసకుడుని సంప్రదించారు. అతనికి క్రింది రెమిడీ ఇవ్వబడింది:
CC3.1 Heart tonic + CC15.1 Mental & Emotional tonic…TDS
అభ్యాసకుడు అతనిని ఉడికించిన లేదా తాజా కూరగాయలు తినాలని, పిండి పదార్థాలు వంటి భారీ ఆహారాన్ని నివారించమని చెప్పి బహిరంగ ప్రదేశంలో కష్టపడి కొద్దిదూరమైనా నడవటానికి ప్రయత్నించాలని సూచించారు. రోగి ఒక వారం తర్వాత వచ్చి తనకు చాలా బాగుందని తెలిపారు. స్థానిక పార్క్ లో క్రమం తప్పకుండా నడుస్తున్నానని మరియు తేలికపాటి ఆహారాన్ని ఆస్వాదిస్తున్నాని తెలిపారు. ఆ తరువాత ముందుగానే ఏర్పాటు చేసిన విధంగా ఆపరేషన్ కోసం ఆసుపత్రిలో చేరారు. ఇప్పుడు అతను ఆపరేషన్ గురించి ఎక్కువగా ఆందోళన చందడంలేదు. ఆపరేషన్ చేసే ముందు మరొక స్కానింగ్ తీయగా ఫలితం వైద్యుల్ని ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే అతను ధమనుల్లో నిరోధం ఏమీ లేనట్లుగా చూపించింది. అతనికి ఆపరేషన్ అవసరం లేదని వైద్యులు చెప్పారు.
బొల్లి లేదా లూకోడెర్మా 02763...India
48 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి అభ్యాస కుని వద్దకు చికిత్స కోసం వచ్చారు. ఎందుకంటే అతను క్రమంగా చర్మంపై ఉన్న వర్ణద్రవ్యం కోల్పోవడం కారణంగా శరీరంలో కొన్ని భాగాలపై తెల్లని ప్యాచెస్ ఏర్పడ్డాయి. అతనికి క్రింది రెమిడి ఇవ్వబడింది;
CC21.2 Skin infections + CC15.1 Mental & Emotional tonic…TDS
రెండు నెలల్లోనే తెల్లటిమచ్చలు కొంచం మసకబారినట్లు గుర్తించారు. రోగి యొక్క సాధారణ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు CC12.1 Adult tonic పై రెమిడికి జత చెయ్యబడింది. మరొక రెండు నెలలు గడిచిన తర్వాత తెల్ల మచ్చలు ఆకారంలో మరికొద్దిగా తగ్గాయి. మరో రెండు నెలల తర్వాత అవి పూర్తిగా పోయాయి. మచ్చలు తిరిగి రాకుండా ఉండటానికి తగిన మోతాదులో ఈ రెమిడీలు కొనసాగించ బడ్డాయి.
ఈ వ్యాధిని నిర్మూలించడం చాలా కష్టమైనప్పటికీ స్వామి దయతో పూర్తిగా తగ్గిన అద్భుతమైనటువంటి చికిత్స ఇది.
అలోపీసియా (బట్టతల) 02799...UK
దాదాపు పూర్తిగా బట్టతల అయిపోయిన ఒక బాలికను ఆమె తల్లి అభ్యాసకుని వద్దకు తీసుకువచ్చారు. ఆమె వైద్యుడు స్టెరాయిడ్స్ ఇవ్వడం తప్ప మరే చికిత్స చేయలేమని చెప్పడంతో అంత చిన్న పిల్లను అటువంటి చికిత్సకు గురిచేయడం పాప తల్లికి మనస్కరించలేదు. ఈ పాపను పాఠశాలలో అందరూ ఆటపట్టించడం, గేలి చేయడం, చాలా సిగ్గుగా అయ్యి పాప క్రమక్రమంగా అంతర్ముఖంగా మారిపోయే ఒక ఒక విచార కరమైన పరిస్థితి ఏర్పడింది. పాపకు CC11.2 ఇచ్చారు కానీ ఇది పనిచేయలేదు. పాప యొక్క రక్తం మరియు రోగనిరోధక వ్యవస్థతో ఇది సంబంధం కలిగి ఉందని భావించి ఆమె తలపై మిగిలివున్న కొద్ది వెంట్రుకలతో నోసోడ్ తయారు చేసి ఇచ్చారు. పది నెలల తర్వాత ఆమె తలంతా ఒత్తుగా గురుగాఉం డే జుట్టు ఏర్పడింది.
క్షీణించిన లివర్ 02494...Italy
57 సంవత్సరాల వయసు గల ఒక మహిళ లివరు క్షీణించి సరిగా పనిచేయక పోవడంతో అభ్యాస కుని వద్దకు సహాయం కోసం వచ్చారు. ఆమె అల్సరుతో, రక్తహీనతతో మంచానికి పరిమితమై లివర్ మార్పిడి కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ఆమెకు క్రింద రెమిడీలు ఇవ్వబడినవి:
#1. NM22 Liver + OM17 Liver-Gallbladder + SR263 Nat Sulph (200C) + SR284 Chelidonium + SR330 Addiction to Alcohol + SR504 Liver + SR547 Carduus Mar …TDS
#2. NM2 Blood + OM1 Blood + BR1 Anaemia + SR361 Acetic Acid + SR494 Haemoglobin…TDS
రెండు నెలల్లోనే ఆమె మంచం మీద పడిఉండవలసిన పరిస్థితి తప్పిపోయి చక్కటి ఆరోగ్యం చేకూరింది. ఆ తర్వాత వారాలలో కూడా మెరుగుదల అలాగే కొనసాగింది. రెండు నెలల తర్వాత లివర్ యొక్క అల్ట్రాసోనిక్ పరీక్ష చేయించి అవి పూర్తిగా స్వస్తత పొందినట్లు రిపోర్టు చూపించింది. డాక్టర్లకు నమ్మశక్యం కాకుండా ఉంది. వారు ఆశ్చర్యపోయి ఇది సాధ్యం కాదని కానీ అల్ట్రాసౌండ్ నివేదిక ఆమె కాలేయం అద్భుతంగా పునర్నిమాణము పొందినట్లుగా చూపిస్తోందని అందువల్ల కాలేయం మార్పిడి అవసరం లేదని అన్నారు. తొమ్మిది సంవత్సరాల తర్వాత కూడా ఆమె ఎంతో ఆరోగ్యంగా ఉంది. ముందు జాగ్రత్తగా ఆమె CC4.11 Liver & Spleen + SR330 Addiction to Alcohol. రెమిడీ సాధారణ మోతాదు తో కొనసాగిస్తున్నారు.
హైపోథైరాయిడ్ 02799...UK
ఈ అభ్యాసకురాలు సియెరా లియోన్ లో ఉన్నప్పుడు యుకె నుండి అల్లోపతి బృందంతో వచ్చిన ఒక మహిళ వైద్యురాలు ఈ అభ్యాసకురాలు అక్కడ ప్రజలకు వైద్య చికిత్స చేయడం చూసారు. ఆమె యుకెకి తిరిగి వచ్చినప్పుడు తనకు థైరాయిడ్ పనిచేయడం లేదని వైబ్రియానిక్స్ తనకు ఏదైనా సహాయం చేయగలదా అని అభ్యాసకురాలిని ఆ వైద్యురాలు సంప్రదించారు. ఆమెకు గత ఐదు సంవత్సరాలుగా హైపోథైరాయిడ్ ఉంది మరియు అప్పటి నుంచి ఆమె రోజూ 50 మిల్లీగ్రాముల థైరాక్స్జిన్ తీసుకుంటోంది. ఆమె చాలా దూరంలో ఉన్నందువలన ఆమెకు పోస్టు ద్వారా క్రింది రెమిడీ పంపబడింది:
SR308 Pituitary Gland + SR319 Thyroid Gland + SR521 Pineal Gland + SR568 Hypothyroidism + CC15.1 Mental & Emotional tonic…TDS
రెండు నెలల తర్వాత ఆమె రక్త పరీక్ష చేయించుకోగా థైరాయిడ్ పనితీరు సాధారణ స్థితిలో ఉన్నందున ఆమె వైద్యుడు థైరాక్జిన్ 25mgకి తగ్గించారు. ఆమె రెమిడీ ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు.
ప్రశ్నలు సమాధానాలు
1. ప్రశ్న: సాధారణ కోంబో లో ఉపయోగించే లవ్ అండ్ పీస్ అలైన్మెంట్ మరియు డివైన్ ప్రొటెక్షన్ వైబ్రేషన్ లు ఎలా ఎంచుకోబడ్డాయి ఎలా పనిచేస్తాయి అనేది వివరించగలరా?
జవాబు: మీకు తెలిసినట్లుగా కంపనం అంటే శక్తి క్షేత్రం అన్ని శారీరక అవయవాలకు ప్రకంపనములు ఉంటాయి. అదే విధంగా అన్ని భావోద్వేగాలు మరియు మానసిక మరియు ఆధ్యాత్మిక లక్షణాలు కూడా వైబ్రేషన్ కలిగి ఉంటాయి. సాంకేతికతను ఉపయోగించి రేఖాగణిత నమూనాల రూపంలో ఈ కంపనాలను సిమ్యులేటర్ కార్డులలో బంధించవచ్చు. ఒక వైబ్రియానిక్స్ పోటెన్టైజర్ ఈ నమూనాలను తిరిగి అసలు శక్తి క్షేత్రం గా మారుస్తుంది. ఆ తర్వాత ఈ కంపనాలు ఆల్కహాల్ లోకి పంపబడి నిల్వ చేయబడతాయి. మీరు పేర్కొన్న రెండు కార్డులను కలిగి ఉన్న కోంబో బయట మూలాల నుండి ప్రతికూల శక్తులకు గురయ్యే రోగికి చికిత్స చేస్తుంది. రోగిని అట్టి శక్తులకు గురికాకుండా నిరోధించి రక్షిస్తాయి. మరింత వివరణాత్మక విశ్లేషణ కోసం రేడియోనిక్స్ పై ఏదైనా పుస్తకం చదవండి. ఇంకా మరింత సమాచారం కావాలంటే www.vibrionics.org లో ప్రాక్టీషనర్ పోర్టల్ లో లాగిన్ అవ్వండి.
_____________________________________
2. ప్రశ్న: ఫ్లూ తర్వాత వచ్చే దీర్ఘకాలిక దగ్గుకు మంచి కోంబో ఏమిటి? నా వద్ద సాయిరాం మిషను ఉంది.
జవాబు: ఫ్లూ తరువాత దీర్ఘకాలిక దగ్గుకు జలుబుకు క్రింది రెమిడీ ఇవ్వండి : NM8 Chest + NM63 Back-up + NM71 CCA + NM75 Debility + OM19 Cardiac & Lung + SM26 Immunity + SM31 Lung and Chest + SR505 Lung….TDS ఉపశమనం పొందే వరకు
_____________________________________
3. ప్రశ్న: నాకు చాలా సంవత్సరాలుగా అనొరెక్సియా తో (ఆకలి లేకపోవడం) బాధపడుతున్న రోగి ఉన్నారు. ఇప్పుడు ఆమె కోలుకుంది కానీ నేను ఆమెకు CC8.8 Menses Irregular ఇచ్చినప్పటికీ ఆమెకు తరచుగా బహిష్టు రక్తస్రావం అవడంలేదు. ఆమె జీర్ణక్రియ కూడా బలహీనంగా ఉంది, దయచేసి సలహా ఇవ్వండి
జవాబు: దీర్ఘకాలిక అనోరెక్సియా నుండి కోలుకున్న స్త్రీకి ఋతుస్రావం అరుదుగానే ఉంటుంది ఎందుకంటే ఆమెకు ఇంకా రక్తహీనత ఉంటుంది. చాలా కాలం పాటు బలహీనమైన జీర్ణక్రియతో పోషకాలు లేకపోవడమే దీనికి కారణం. జీర్ణక్రియకు సహాయపడే అధిక స్థాయి ప్రోటీన్లు మరియు పెరుగు క్రమం తప్పకుండా తీసుకోవడం చాలా ముఖ్యం. సాధారణ ఋతు చక్రానికి తిరిగి రావడానికి మద్దతుకోసం క్రింది రెమిడీ ఇవ్వండి:
CC3.1 Heart tonic + CC8.1 Female tonic + CC8.8 Menses irregular మరియు జీర్ణక్రియకు సహాయ పడడానికి రెమిడీ: CC4.1 Digestion tonic + CC12.1 Adult tonic.
_____________________________________
4. ప్రశ్న: నా రోగులలో చాలామంది తిరిగిరారు కాబట్టి చికిత్స విజయవంతం అయిందో లేదో నాకు ఖచ్చితంగా తెలియదు, నేను చేయగలిగేది ఏదైనా ఉందా?
జవాబు: ఈ సమస్య చాలా మంది అభ్యాసకులను ప్రభావితం చేస్తోంది మరియు దీనిని పరిష్కరించడం కూడా కష్టమే. దీని ప్రభావాన్ని తగ్గించడానికి ఒక మార్గంగా ఈ క్రింది అంశాలను గుర్తుపెట్టుకోండి:
-
రోగి మిమ్మల్ని సందర్శించినప్పుడు విశ్వాసం మరియు స్నేహపూర్వక వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నించండి. ఈ విధంగా అతను తన సమస్యను లోతైన స్థాయిలో మీతో పంచుకునే అవకాశం కూడా ఉంటుంది. తద్వారా అవసరమైన చికిత్సపై మీకు ఎక్కువ అవగాహన లభిస్తుంది. అంతే కాకుండా మీ ఇద్దరి మధ్య ఒక సంబంధం ఏర్పడుతుంది. ఈ అనుబంధంతో రోగి తిరిగి రావడానికి మరియు అతని పురోగతి గురించి మీతో చెప్పడానికీ, మీతో సన్నిహితంగా ఉండడానికి ప్రోత్సహిస్తుంది.
-
ఫాలోఅప్ చికిత్స కోసం తిరిగి రావడానికి ఎల్లప్పుడూ మరొక అపాయింట్మెంట్ ఇవ్వండి. మరియు నివారణ పురోగతిని ట్రాక్ చేయడం యొక్క ప్రాముఖ్యతను రోగికి నొప్పి చెప్పండి.
-
చికిత్స వేగంగా జరగడానికి కొన్ని సార్లు రెమిడీ మార్చాల్సిన అవసరం ఉందని మరియు వారు ఎంచుకోవడానికి ఇతర నివారణలు కూడా ఉన్నాయనే విషయం రోగితో చెప్పండి.
-
అపాయింట్మెంట్ రద్దు చేయాల్సిన అవసరం ఉంటే నివారణ ఎంత బాగా మరియు ఎంత త్వరగా పని చేసిందో మీరు అతని నుండి తెలుసుకోవలసిన అవసరం ఉన్నందున రోగి మీకు టెలిఫోన్ చేయాలి. కనుక అతను అందుకున్న ఉచిత చికిత్స పట్ల తనదైన మార్గంలో మీకు తన అభిప్రాయాన్ని తెలియజేయడం ముఖ్యమని అతనికి వివరించండి.
-
రోగికి పూర్తిగా తగ్గిపోతే ఈ సమస్య పునరావృతం కాకుండా ఉండడానికి మరియు ఇతర అనారోగ్యాలకు వ్యతిరేకంగా మీరు అతనికి రోగనిరోధకశక్తిని పెంచే లేదా రక్షణ ఇవ్వాలనుకుంటున్న విషయం వారికి తెలియజేయండి.
_____________________________________
5. ప్రశ్న: నేను శిశువులకు ఇవ్వకూడని వైబ్రేషన్లు ఉన్నాయా?
జవాబు: పిల్లలు మరియు శిశువులు పుట్టిన క్షణం నుండి వైబ్రియానిక్స్ రెమెడీలు ఇవ్వవచ్చు. ఆ వయసులో వారిలో చెడు అంతా త్వరగా చేరకుండా వారు సహజంగా స్వచ్ఛంగా ఉన్నందున ఈ రెమిడీలకు వారు పెద్దవారికన్నా త్వరగా స్పందిస్తారు కాబట్టి వారికి ఎక్కువ కాలం రెమిడీలు ఇవ్వవలసిన అవసరం లేదు.
వైద్యులకే వైద్యుడి యొక్క దివ్య వాక్కు
"ఆహ్లాదకరమైనపని చేయడం సులభమే కానీ ప్రయోజనకరమైన దానిలో నిమగ్నం కావడం చాలా కష్టం అని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. ఆహ్లాదకరమైనదంతా లాభదాయకం కాదు. గులాబీలతో నిండిన మార్గాన్ని వదులుకొని ప్రమాదకరమైన మార్గం ఎంచుకొని సుత్తి దెబ్బలు (వంటి బాధలు) భరిస్తూ కత్తి పోట్ల(వంటి కష్టాలను)ను ఎదుర్కొంటూ ధైర్యంగా ముందుకు సాగిన వానికే విజయం వరిస్తుంది. వాస్తవానికి గులాబీ రేకులతో ఏ రహదారి కూడా ఉండదు. జీవితం ఒక ధర్మక్షేత్రం. ఇక్కడ విధులు మరియు కోరికలు ఎల్లప్పుడూ వివాదంలో ఉంటాయి. మీ హృదయాలలో ఎగిసిపడే కోరిక, ద్వేషం, మరియు కోపం యొక్క జ్వాలలను సున్నితంగా తగ్గించండి. మిమ్మల్ని జంతువులు గా మార్చే ఈ శత్రువులకు లొంగిపోవడం పరిపూర్ణ పిరికితనం. అన్ని అడ్డంకులను ధైర్యంతో ఎదుర్కోండి. కష్టాలు మిమ్మల్ని ధృఢంగా మరియు శక్తివంతంగా ఉండేలా తీర్చిదిద్దుతాయి."
- సత్యసాయిబాబా - దివ్యవాణి, 1965 ఫిబ్రవరి 20
"భగవత్ సేవ కంటే మీ తోటి వారికి సేవ చేయడం చాలా అవసరం. వాస్తవానికి ఒక వ్యక్తికి సేవ చేయడం భగవంతుని సేవించిన దానితో సమానము. అదే నిజమైన భక్తి మార్గం. భగవంతుడికి తన పిల్లలను సంతోషపెట్టడంకంటే మించినది ఏముంటుంది. పురుష సూక్తం భగవంతుడికి వెయ్యి తలలు, కళ్ళు మరియు కాళ్ళు కలిగి ఉన్నట్లు వర్ణిస్తుంది. అంటే ప్రతీ జీవి దేవుడే. ఇక్కడ వెయ్యి తలల ప్రస్తావన ఉన్నప్పటికీ వెయ్యి హృదయాల ప్రస్తావన లేదు కనుక హృదయం ఒక్కటే. ఒకేరక్తం తల, కళ్ళు, కాళ్ళు ఇంకా ఇతర అవయవాలకు చేరుతుంది. అవయవానికి ఏదైనా అది వ్యక్తికే చెందుతుంది. అలాగే మీరు ఎవరికి సేవ చేసినా అది దేవునికే చేసినట్లు అవుతుంది. మీ లక్ష్యం దేవునికి సేవ చేయడం మరియు ఆరాధించడంగా మారితే మీ ప్రతీ అడుగు నవ వసంతం అవుతుంది. ప్రతీ అవకాశము భగవంతుని నుండి లభించిన విలువైన బహుమతే అవుతుంది."
- సత్యసాయిబాబా – దివ్యవాణి 1965 మార్చినెల
ప్రకటనలు
నిర్వహింపబోయే శిక్షణా శిబిరాలు
-
నాగపూర్ మహారాష్ట్ర - 14-15 ఏప్రిల్ 2012 AVP లకు కొత్త దరఖాస్తు దారులకు వర్క్ షాప్
-
జబల్పూర్ MP -మే2012 (తేదీ తరువాత ప్రకటింపబడుతుంది ) కొత్త దరఖాస్తు దారులకు వర్క్ షాప్ పై రెండింటి కోసం Dr A ఘటల్ ను 9637-899 113 నంబరు పై సంప్రదించండి లేదా వారి eమెయిల్ vc_2005@rediffm ail.com
-
పోలండ్ 14 ఏప్రిల్ రాక్లో 108CC ఉన్న అభ్యాసకులకు వర్క్ షాప్. సప్రదించవలసిన వారు డేరియజ్ హెబిజ్ +48 606 879 339 లేదా e మెయిల్ [email protected]
శిక్షకులందరికీ: మీరేదైనా వర్క్ షాప్ కోసం ప్రణాళిక సిద్ధం చేసుకుంటే వివరాలను [email protected] కు పంపండి.
అదనపు సమాచారం
ఇన్ఫ్లమేటరీ బ్రెస్ట్ (వక్షోజ) క్యాన్సరు IBC
అమెరికాలోని నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారు ఇన్ఫ్లమేటరీ బ్రెస్ట్ క్యాన్సర్ IBC అనేది రొమ్ము క్యాన్సర్ యొక్క అసాధారణమైన రకమనీ దీనిలో రొమ్ము క్యాన్సర్ కణాలు రొమ్ము యొక్క చర్మం లోని శోషరస నాళాలను అడ్డుకుంటాయని పేర్కొన్నారు. ఈ రొమ్ము క్యాన్సర్ యొక్క ఒక రకమైన రొటీన్ క్యాన్సర్ స్క్రీనింగ్ పద్ధతుల ద్వారా ( ఉదాహరణ ఫీలింగ్ ఫర్ లంప్స్, మమ్మో గ్రామ్స్) కొన్ని సార్లు తెలుసుకో లేము.
ఈ ప్రతిష్టంభన రొమ్ముయొక్క ఎరుపుదనం, వాపు మరియు వెచ్చ దనముగా మారడానికి కారణం కావచ్చు. రొమ్ము యొక్క చర్మం గులాబీ లేదా ఉదా లేదా గాయము ఏర్పడిన మాదిరిగా కనిపించవచ్చు. మరియు ఈ చర్మము చీలికలు కలిగినట్లుగా లేదా నారింజ తొనవలే చర్మం (ప్రీ డి ఆరెంజ్ అని పిలుస్తారు) లాగా కనిపించవచ్చు. ఈ మార్పులు తరచూ వారాల వ్యవధిలోనే త్వరగా ఏర్పడతాయి. ఈ రకమైన రొమ్ము క్యాన్సర్ యొక్క మరొక సంకేతం చేటి కింద కాలర్ బోన్ పైన లేదా రెండు ప్రదేశాల్లో శోషరస కణుపుల వాపు ఏర్పడుతుంది. తరచుగా కణితి ఉన్నట్టుగా కూడా తెలియని పరిస్థితి మరియు మమ్మోగ్రామ్ లో కూడా కనిపించకపోవచ్చు. ఇన్ఫ్లమేటరీ రొమ్ము కాన్సెర్ నిర్ధారణ బయాప్సి మరియు డాక్టరు యొక్క రోగనిర్ణయ తీర్పు ఫలితాల పై ఆధారపడి ఉంటుంది.
అమెరికాలోని మాయో క్లినిక్ ప్రకారం ఇన్ఫ్లమేటరీ బ్రెస్ట్ క్యాన్సర్ యొక్క సంకేతాలు మరియు లక్షణాలు :
* ఎరుపు ఉదా గులాబి లేదా గాయాల మాదిరిగా కనిపించే వక్షోజము
* మృదువైన లేదా దృఢమైన మరియు విస్తరించిన వక్షోజము
* వక్షోజములలో వెచ్చని అనుభూతి
* వక్షోజము లో దురద
* నొప్పి
* నారింజ తొణ మాదిరిగా చీలిక లేదా మసకబారిన చర్మ నిర్మాణము
* చర్మం మందంగా ఉన్న ప్రాంతాలు
* భుజం కింద కాలర్ బోన్ పైన లేదా రెండింటి వద్ద విస్తరించిన శోషరస కణుపులు
* చనుమొన చదునుగా కావడం లేదా లోపలికి కుంచించుకుపోవడం
* చనుమొనలపై వాపు లేదా కస్టర్డ్ చర్మం
* చనుమొన చుట్టూ చర్మం రంగులో మార్పు
ఇటీవల కాలంలో ఈ IBC వ్యాధి ఉదృతంగా విస్తరిస్తూ ఉండటం చాలా ఆందోళన కలిగిస్తోంది. కొంతమంది స్త్రీలకు వైద్య చికిత్స కోసం సమాయత్తం అయ్యేలోపే వ్యాధి లక్షణాలు తీవ్రంగా మారుతున్నాయి. IBC గతంలో శస్త్రచికిత్స ద్వారా చికిత్స చేసేవారు మరియు దాదాపు ప్రాణాంతకంగా భాబించేవారు, కానీ ఈ రోజుల్లో ఖీమోథెరపీ మరియు రేడియో థెరపీ వంటి చికిత్సలు IBC రోగులు మనుగడ సాధించే అవకాశాలు బాగా మెరుగుపరిచాయి....www.snopes.com
గమనిక: వైబ్రియానిక్స్ ప్రాక్టీషనర్లు ఈ రోగ నిర్ధారణ ఎదుర్కొంటున్న రోగికి సహాయపడటానికి బ్రెస్ట్ క్యాన్సర్ మరియు భావోద్వేగ మద్దతు కోసం వైబ్రియో పుస్తకాలను చదవండి.
గృహము లోపల గాలిని శుభ్రపరిచే ఇంట్లో పెరిగే అందమైన మొక్కలు
గృహాలు మరియు కార్యాలయ భవనాలు శక్తిని ఆదా చేయడం కోసం మునుపెన్నడూ లేనంత కఠినంగా నిర్మాణం లేదా పునర్నిర్మాణము జరుగుతున్నాయి. కానీ ఇటువంటి వానిలో చెత్తను లేకుండా చేయడం అంటే క్రింద పరిచే కార్పెట్ మొదలు ఫర్నిచర్ వరకు అనేక వస్తువుల ద్వారా విడుదలయ్యే బెంజీన్ మరియు ఫార్మాల్డిహైడ్ వంటి ప్రమాదకరమైన రసాయనాలు లేకుండా చేసుకోవాలి. ఇంట్లో మరియు కార్యాలయాలలో ఉపయోగించే శుభ్రపరచడానికి ఉపయోగించే ఉత్పత్తులు అమ్మోనియా మరియు క్లోరినేటెడ్ ద్రావకాల వంటి రసాయనాలను విడుదల చేస్తాయని కూడా గమనించాలి.
ఇలాంటి రసాయనాల దీర్ఘకాలిక శ్వాస వల్ల తల నొప్పి, గొంతులో మంట, శ్వాసలో ఇబ్బంది అంతేకాక క్యాన్సర్ వంటి వ్యాధులకు కారణమవుతాయి. యుఎస్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ వారు మానవ ఆరోగ్యానికి హాని కలిగించే 5 ఉత్పత్తులలో ఒకదానిగా ఈ గృహం లోపల గాలిని పేర్కొన్నారు. శీతాకాలంలో ఈసమస్య మరింత ఘోరంగా ఉంటుంది. ఎందుకంటే మన ఇళ్లలో మరియు కార్యాలయాల్లో ఎక్కువ సమయం తలుపులు మూసివేయబడి ఉండటం వలన ఈ సమస్య మరింత ఎక్కువ అవుతుంది.
ఖరీదైన గాలి వడపోత వ్యవస్థ మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం కాదు. సాధారణ జాతీయ మొక్కలు గృహం లోపల గాలిని ప్రమాదకరమైన రసాయనాలను ఫిల్టర్ చేయగలవని US నేషనల్ ఏరోనాటికల్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ కనుగొంది. మొక్కల ఆకులు కొన్ని సేంద్రియ సమ్మేళనాలను గ్రహిస్తాయి మరియు వాటిని నాశనం చేస్తాయి. అయితే మొక్కల మూలాల చుట్టూ నివసించే సూక్ష్మజీవులు రసాయనాలను తమకు మరియు తాము అంటిపెట్టుకొని ఉన్న మొక్కకూ ఆహారం మరియు శక్తి వనరుగా మారుస్తాయి.
కొన్ని ఇంట్లో పెరిగే మొక్కలు ఇతర రకాల మొక్కల కన్నా గాలి వడపోత విషయంలో ప్రభావవంతంగా ఉంటాయి. క్రింద ఇవ్వబడిన 10 మొక్కలు పెంచడానికి తేలిక మరియు గాలిని శుభ్రపరిచే గొప్ప వనరుగా ఉపయోగ పడుతున్నప్పటికీ వాటిలో క్రింది నాలుగు మొక్కలు గాలిని శుభ్రపరచడంలో ప్రత్యేకించి ప్రభావవంతంగా ఉంటాయి:
1. అరెకాపామ్ (క్రైసలిడోకార్పస్ లుటీసెన్స్) దీనిని యెల్లో పామ్(పసుపు అరచెయ్యి) లేదా బటర్ ఫ్లై పామ్(సీతాకోకచిలుక అరచెయ్యి) అని కూడా అంటారు.
2. లేడీ ఫామ్ (రాఫిస్ ఎక్సెల్సా) గృహం లోపల గాలి నాణ్యతను మెరుగుపరచడానికి అత్యంత ప్రభావవంతమైన మొక్కలలో ఒకటి మరియు ఇది అనేక రకాల కీటకాలకు అధిక నిరోధకతను కలిగి ఉంటుంది. 6 నుండి 12 అంగుళాల వెడల్పు గల రెమ్మలకు మెరిసే ఆకులతో కుడి ఉంటాయి.
3. రబ్బరు మొక్క (ఫికస్ రోబస్టా) మందపాటి తోలు ముదురు ఆకుపచ్చ ఆకులు కలిగిన ఈ అందమైన మొక్క పరిమిత కాంతి మరియు చల్లని ఉష్ణోగ్రతలను తట్టుకుంటుంది మరియు గృహం లోపల గాలిలో నుండి విషరసాయనాలను తొలగించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఇప్పటి వరకూ పరీక్షించిన వాటిలో ఫికస్ జాతికి చెందిన మొక్కలలో ఉత్తమమైనది.
4. పీస్ (స్పాతి ఫైలమ్ sp) అందమైన తెల్లని పువ్వులు ను ఉత్పత్తి చేస్తుంది. ఇంటి లోపల వికసించే అతి తక్కువ సంఖ్య గల మొక్కల్లో విశ్వసనీయమైనదిగా పరిగణింప బడుతుంది.
క్రింది 6 మొక్కలు కూడా ఉపయోగపడతాయి:
5. డ్రాసినా“జానెట్ క్రెయిగ్” (డ్రాసినా డ్రెసిమెనిసిస్ “జానెట్ క్రెయిగ్ ”) తెగులు నిరోధక ఆకులు కల ఈ మొక్క దశాబ్దాలుగా జీవించగలదు. పేలవమైన కాంతి గల ప్రాంతాలను ఇది తట్టుకుంటుంది కానీ దాని పెరుగుదల మందగిస్తుంది. పొట్టి రకము లేదా కాంపాక్టాను ఇష్టపడేవారికి అనుకూలంగా ఉంటుంది. ఇది మూడు అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. ఐతే సాధారణ రకమైనట్లైతే ఎక్కువ జాగ్రత్త అవసరం మరియు కత్తిరించకపోతే 10 అడుగుల వరకూ పెరుగుతుంది.
6. ఇంగ్లీష్ ఐవి (హైడెరా హెలిక్స్) దీనిని గ్రౌండ్ కవర్ అని పిలుస్తారు అయితే గృహంలో వేలాడుతున్న బుట్టలలో కూడా ఇది బాగా పెరుగుతుంది. ఇది విస్తృత శ్రేణి గృహ పరిస్థితులకు అనుగుణంగా ఉంటుంది అయినప్పటికీ కొన్నిసార్లు వసంతఋతువు వేసవిలో ఆరుబయట పెంచడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఐతే ఇంగ్లీష్ ఐవి అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోలేదు.
హెచ్చరిక : ఇంగ్లీష్ ఐవి లో ఉండే రసాయనాలు చర్మాన్ని చికాకు పెట్టవచ్చు. లేదా తాకితే అనారోగ్యానికి కారణం అవుతాయి. వీటిని పెంచేటప్పుడు చేతికి తొడుగులు ధరించండి మరియు పెంపుడు జంతువులు మరియు చిన్న పిల్లలకు దూరంగా ఉంచండి .
7. గోల్డెన్ పోథోస్ (ఎపిప్రెమ్నమ్ ఆరెమ్) తక్కువ కాంతి లేదా కాంతి లేకపోవడాన్ని తట్టుకుంటుంది. కీటకాలకు చాలా నిరోధకతను కలిగి ఉంటుంది. ఆకుపచ్చని గుండె ఆకారపు ఆకుల పైన బంగారు రంగు లేదా క్రీమ్ కలర్ చిలకరించినట్లుగా ఉండడాన్ని బట్టి గోల్డెన్ పోథోస్ అనే పేరు కలిగింది. ఇది సాధారణంగా వేలాడుతూ ఉన్న బుట్టలో పెరుగుతుంది కానీ ఇది పాకుతూ కూడా పెరగగలదు.
8. కార్న్ ప్లాంట్ (డ్రాసీనా ఫ్రాగ్రెన్స్ “మస్సంగినా”) దీనిని ఇలా ఎందుకు పిలుస్తారు అంటే దీని ఆకులు మొక్కజొన్న కాండాల మాదిరిగా కనిపిస్తాయి అంతేతప్ప ఇది మొక్కజొన్నను ఉత్పత్తి చేయదు. ఇది ప్రకాశవంతమైన కాంతిని ఇష్టపడినప్పటికీ ఇది తక్కువ కాంతిని కూడా తట్టుకుంటుంది.
9. సింగోనియమ్ (సింగోనియమ్ పోడో ఫైలమ్) దృశ్యమానంగా బాణం ఆకారంలో ఉండే ఆకుపచ్చ- తెలుపు లేదా ఆకుపచ్చ-వెండి రంగు ఆకులను ఉత్పత్తి చేస్తుంది.
10. స్నేక్ ప్లాంట్ (సంసివీరియా ట్రిఫాసయటా) ఈ జాబితాలోని ఇతర మొక్కల కంటే గృహం లోపల గాలిని శుభ్రపరచడంలో 50 శాతం తక్కువ ప్రభావవంతంగా ఉంటుంది కానీ ఇది చనిపోవడం చాలా కష్టం. కాబట్టి ఇతర ఇంట్లో పెరిగే మొక్కలను సజీవంగా ఉంచడానికి కష్టపడే వారికి ఇది ఒక చక్కని ఎంపిక. ఈ స్నేక్ ప్లాంట్ బల్లెము ఆకారంలో నిటారుగా నిలబడే ఆకులు కలిగి సాధారణంగా రెండు నుండి 4 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇది అప్పుడప్పుడు ఆకుపచ్చ తెలుపు పువ్వులను ఉత్పత్తి చేస్తుంది.
ఎన్ని మొక్కలు ?
నియమము ప్రకారము 100 చదరపు అడుగుల అంతర్గత స్థలానికి పైన పేర్కొన్న జాబితా నుండి ఒకటి లేదా రెండు మంచి మొక్కలు సరిపోతాయి. ఇవి పెంచుకునే కుండీలోని మట్టిలో బూజు అభివృద్ధి చెందనంతకాలం ఒకటి కంటే ఎక్కువ మొక్కలను కలిగి ఉన్నా ఆరోగ్యానికి ఇబ్బందేమీ లేదు.
హైడ్రో కల్చర్ కలిగి ఉన్న వారికి సహాయ కరమైన చిట్కా: హైడ్రో కల్చర్ లో పెరుగుతున్న మొక్కలు గాలిని శుభ్రపరిచే సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతాయని తాజా పరిశోధనలు సూచిస్తున్నాయి. హైడ్రో కల్చర్లో మొక్కలు నీరు చేరని (వాటర్ టైట్) కంటైనర్లలో మరియు వీటి వ్రేళ్ళు మట్టిపోసిన సాధారణ కుండీలలో కాకుండా ప్రత్యేకంగా తోట దుకాణాల్లో ఈ ప్రయోజనం కోసమే అమ్మే ప్రత్యేకమైన విస్తరించినమట్టి, గులకరాళ్ళు మొదలగు వాటిలో పెంచుతూ ఉంటారు.
పైన పేర్కొన్న అన్ని మొక్కలు ఈ కల్చర్ లో పెరుగుతాయి ముఖ్యంగా పీస్ లిల్లీ ఈ విధంగా పెరిగినప్పుడు బాగా అభివృద్ధి చెందుతుంది. హైడ్రో కల్చర్ మొక్కల పెంపకం మరియు నేల ద్వారా వచ్చే తెగుళ్ళు అభివృద్ధి చెందే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. హైడ్రో కల్చర్ ద్వారా పెరిగే మొక్కలకు సూక్ష్మ పోషకాలను కలిగి ఉన్న పూర్తి ఎరువులు అవసరం.
ఆధారము: ‘తాజాగాలిని ఎలా అభివృద్ధి చేసుకోవాలి ’ పెంగ్విన్ పేపర్బ్యాక్.రచయిత B.C. వుల్వర్టన్ PhD వీరు US మిలిటరీ మరియు నాసాలో 30 సంవత్సరాలుగా శాస్త్రవేత్తగా పని చేసారు. విష రసాయనాలు మరియు వ్యాధికారక సూక్ష్మ జీవుల నుండి రక్షించడానికి వ్యవస్థలను అభివృద్ధి చేసారు.