Vol 3 సంచిక 4
July/August 2012
ముద్రింప తగిన వార్తాలేఖ
పూర్తి వార్తాలేఖ యొక్క కాగితం ప్రతి కావలెనన్నఈ పుటను ముద్రించండి
డా.జిత్ కే అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి
ప్రియమైనచికిత్సానిపుణులకు
మీనుండి అందుతున్న నెల వారీ రిపోర్టుల ద్వారా మీరు ఎన్ని గంటలు ఈ వైబ్రో సేవలో పాల్గొంటున్నారు, మీ నుండి లభించే చికిత్స ద్వారా ఎంతమంది రోగులు మీరందించే ఈ వైబ్రో చికిత్సా పద్దతి ద్వారా స్వస్థత పొంది ఆరోగ్యవంతులవుతున్నారు అనే విషయాలు తెలుసుకోవడం ఎంతో సంతృప్తినిస్తోంది. నిజం చెప్పాలంటే భగవంతుడి దయ మనపైన అపారంగా ఉంది, ఉంటుంది అనడానికి ఇది ఒక గొప్ప నిదర్శనం. అమెరికా లోనూ మరియు బ్రిటన్ లోనూ వైబ్రియోనిక్స్ సేవ కోసం స్వామి కొత్త మార్గాలను అందుబాటులోనికి తీసుకు వస్తున్నారు (ప్రస్తుతం నెలకు రెండు సార్లు ఈ శిబిరాలు జరుగుతున్నాయి).
ప్రతీ నెలలో రెండు ఆది వారాలు వాషింగ్ టన్ డిసి లో, వైట్ హౌస్ సమీపంలో ఉన్న పార్కులో పలు మత విశ్వాసాలకు చెందిన ఒక ఆధ్యాత్మిక బృందం 100-150 వరకూ గూడు లేని నిరుపేదలకు వైద్య చికిత్స నందిస్తున్నారు. విశేష మేమిటంటే ఈ మందులతో పాటు రుచికరమైన వేడి వేడి శాకాహార భోజనం, చల్లని, వెచ్చని పానీయాలు కూడా ప్రసన్నవదనాలతో పేషంట్లకు అందించ బడుతున్నాయి. ఒక సీనియర్ వైబ్రియానిక్స్ ప్రాక్టీషనర్ 1339…యుఎస్ఎ మరియు వారి సహాయకురాలు ఈ పార్కులో నిస్సహాయులకు మధ్యాహ్న భోజనం ఇచ్చే సమయంలో ఒక టేబుల్ పెట్టుకొని వీరందరికి వైబ్రో మందులు ఇవ్వడానికి అనుమతింప బడ్డారు. ఒక మహిళ కంటికి కేటరాక్ట్ (కంటిశుక్లం) నిమిత్తం రెమిడి తీసుకున్నారు. నెల తర్వాత ఆమె అదే ప్రదేశానికి వచ్చి ప్రాక్టీషనర్ కు కృతజ్ఞతలు తెలిపారు, ఎందుకంటే ఆమె కంటి దృష్టి అద్భుతంగా మెరుగయ్యింది. ఇటువంటి ఆశ్చర్యకరమైన సంఘటనలు ఈ పార్కులో ప్రాక్టీషనర్ల కృషి వల్ల సాధారణ మయ్యాయి. ఈ క్యాంపు కూడా పార్కులో సజావుగా సాగుతోంది. ఇదంతా చూసాక ఈ నిరాశ్రయులకు ప్రత్యామ్నాయ చికిత్సలు ఎంత అవసరమో ప్రాక్టీషనర్ కు అర్ధమయ్యింది. ఎందుకంటే ఆరోగ్య పరిరక్షణ విషయంలో ఇతర వైద్య విధానాలతో ఉత్పన్నమయ్యే సమస్యలు ప్రజలను ప్రత్యామ్నాయ మార్గాల వైపు ఆకర్షితులయ్యే విధంగా చేస్తున్నాయి.
లండన్ లోని సౌతాల్ పార్కు వద్ద ప్రతీ సంవత్సరం వివిధ మత విశ్వాసాల సమ్మేళనం జరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం అక్కడి నిర్వాహకుల పిలుపు మేరకు జూలై 8 వ తేదీన మన వైబ్రియానిక్స్ టీం అక్కడ ఒక మెడికల్ క్యాంపు నిర్వహించారు. అననుకూల వాతావరణము కొంచంసేపు దోబూచులాడినా స్వామి దయతో అనుకూలంగా మారడమే కాక అసంఖ్యాకంగా ప్రజలు వచ్చి వైబ్రియానిక్స్ గురించి తెలుసుకొనడం వారిలో కొందరు చికిత్స పొందడం కూడా జరిగింది. అంకిత భావం గల ప్రాక్టీషనర్లు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకూ ఓపికగా కేంద్రం వద్ద ఉండడంతో 121మంది పేషంట్లు లబ్ది పొందారు. సీనియర్ ప్రాక్టీషనర్లకు రెండు నెలల క్రిందట శిక్షణ తీసుకున్న కొత్త ప్రాక్టీషనర్లు కూడా సహాయ పడడం విశేషం. నిర్వహణ సులభతరం చేయడానికి కొందరు రెమిడిలు తయారుచేయం, కొందరు పేషంట్లకు రెమిడిలు వాడే విధానాన్ని వివరించడం, కొందరు రిపోర్టులు తయారుచేయడం ఈ విధంగా పని విభజన చేసుకున్నారు. ప్రత్యేకంగా ఒక బృందం తమ లాప్టాప్ లో జిజ్ఞాస కలవారికి వైబ్రియానిక్స్ ప్రదర్శన నిర్వహించే పనిలో నిమగ్నమయ్యారు. అక్కడ చేరిన ప్రతీ ఒక్కరూ స్వామి అక్కడే ఉన్న అనుభూతిని పొందడం విశేషం.
చురుకైన అభ్యాసకులందరూ వైబ్రో సేవలో పాలుపంచుకుంటూనే మీ సౌకర్యాన్ని వీడి కొంత సమయాన్ని వెచ్చించి జనబాహుళ్యము లోనికి వెళ్లి ఇటువంటి క్యాంపుల ద్వారా ఇంకా వైబ్రియానిక్స్ అంటే తెలియని ప్రజానీకానికి దీనిని గురించి తెలియజేయ వలసిందిగా విజ్ఞప్తి. ఒకవేళ మీరు ఇప్పటికే అటువంటివి ఏర్పాటు చేసి ఉంటే చేయాలనే ఆలోచనలో ఉంటే మీ ఆనందంలో పాలుపంచుకొనడానికి మాకు తెలియపరచండి. పేషంట్ల నుండి వచ్చే అద్భుతమైన స్పందనే ( వీరిలో ఎక్కువశాతం మరే ఇతర వైద్యవిధానానికి డబ్బులు వెచ్చంచే స్థితిలో ఉండరు) స్వామి నిరంతరం మనతోనే ఉన్నారు, పేషంట్లను వారే పంపుతున్నారు, చికిత్సా వారే చేస్తున్నారు అనే విషయాన్ని గుర్తుచేస్తూ ఉంటుంది.
ఇటీవలే నేను చూసిన ఆసక్తికరమైన మరియు అనేక విజ్ఞాన విశేషాలను తెలియజేసే వెబ్సైట్ గురించి సమాచారమును మీతో పంచుకోవలనుకుంటున్నాను. అమెరికా లోని జాతీయ వైద్య గ్రంధాలయమునకు చెందిన ఈ వెబ్సైట్ వివధ వైద్య పరిస్థితులు, ప్రక్రియల గురించిన వీడియో సమాచారము చక్కని బోధనా విషయాలుగా అందిస్తుంది. ముఖ్యంగా ఎటువంటి వైద్య నేపథ్యమూ లేని మన ప్రాక్టీషనర్లకు ఇవి ఎంతో ప్రయోజనకారిగా ఉంటాయి.
మీ అనుభవంలోకి వచ్చిన అసాధారణ రోగచరిత్రలను మాకు పంపవలసిందిగా మరోమారు విజ్ఞప్తి చేస్తున్నాను. త్వరలోనే ఇటువంటి అద్భుతమైన రోగచరిత్రలతో మరో పుస్తకాన్ని ముద్రించే ఆలోచనతో ఉన్నాము. మీ సహకారము లేనిదే మేమిది చేయలేము కనుక మీరు పంపే రోగచరిత్రలను ముద్రణా రూపంలో చూసుకోవడానికి (ఐతే అభ్యాసకుడు మరియు రోగి యొక్క గోప్యతను కాపాడడానికి పేర్లను ; ముద్రించము కేవలం మీ రిజిస్ట్రేషన్ నంబరు మాత్రము ముద్రిస్తాము). త్వరలోనే మీ నుండి అటువంటి స్పందనను ఆకాంక్షిస్తూ.
ప్రేమతో సాయి సేవలో
జిత్.కె.అగ్గర్వాల్
Vibrionics సౌతాల్ పార్క్, లండన్ లో విశ్వాసాల పండుగ యూనిటీ నిలిచిపోయినట్లు
పార్క్ లో vibro - హోంలెస్ వాషింగ్టన్ DC USA అందిస్తోంది
అతి చురుకుగా ఉండే (హైపర్ ఆక్టివ్) అమ్మాయి 02640...India
ఒక తల్లి హైపర్ యాక్టివ్ గా ఉంటున్న తన 4 సంవత్సరాల పాపను ప్రాక్టీషనర్ వద్దకు తీసుకోని వచ్చారు. ఈ పాప ప్రవర్తన అసాధారణంగా అనగా ఉద్వేగంతోనూ, కోపంతోనూ, ఆందోళనతోనూ, విధ్వంస కరంగానూ ఉంటోంది. అలోపతి మందులు ఎన్ని వాడినా ఫలితం లేకపోవడంతో కూతురి ప్రవర్తన కారణంగ ఆ తల్లి భౌతికంగా, మానసికంగా కూడా విసిగిపోయి ప్రాక్టీషనర్ ను కలిసారు. పాపకు క్రింది రెమిడి ఇవ్వబడింది:
CC15.5 ADD & Autism…TDS.
నెల రోజులు రెమిడి తీసుకున్న తర్వాత ఆమెకు పూర్తిగా తగ్గిపోయింది.
సూచన: ఈ రోజుల్లో పాకేజ్ తో వచ్చే డ్రింకులు, క్యాండీలు తీసుకోవడం సాధారణ మై పోయింది. కానీ వాస్తవానికి వీటిలో పరిమళం కోసము, నిలువ ఉంచేందుకోసము హానికరమైన రసాయనాలు, కృత్రిమ రంగులు, ఇంకా అధిక మొత్తంలో చక్కెర వాడడం వలన అవి ఎదుగుతున్న పిల్లల ప్రవర్తనలో అసాధారణ మార్పులు కలిగిస్తాయి కనుక వీటిని పిల్లలకు ముఖ్యంగా హైపర్ ఆక్టివ్ గా ఉన్న పిల్లలకు దూరంగా ఉంచాలి. అటువంటివి ఏవైనా కొనవలసివస్తే జాగ్రత్తగా చదివి హానికరం కానివే తీసుకోవాలి.
ప్రసవానంతరం ఛాతిలో నొప్పి 02802...UK
28 సంవత్సరాల మహిళకు ప్రాక్టీషనర్ వద్దకు రావడానికి రెండు వారాల మునుపు సిజేరియన్ ద్వారా ప్రసవం జరిగింది. వారం తర్వాతా ఆమెకు వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉన్నాయంటే విపరీతమైన చెమట, భరింపరాని ఒళ్లు నొప్పులు, శక్తి లేనట్లుగా ఐపోవడం. అంతేకాక తన నవజాత శిశువుకు పాలు ఇచ్చే సమయంలో విపరీతంగా నొప్పి వస్తోంది. డాక్టరు ఆమెకు యాంటి బయాటిక్స్ ఇచ్చారు కానీ ఏమాత్రం ఫలితం లేదు. ఆమెకు క్రింది రెమిడి ఇవ్వడం జరిగింది:
CC8.3 Breast disorders + CC9.2 Infections acute + CC10.1 Emergencies + CC15.1 Mental & Emotional tonic + CC21.11 Wounds & Abrasions…TDS.
చివరి కామన్ కొమ్బో CC21.11 రొమ్ము భాగంలో ఏమైనా గడ్డలు వంటివి ఉంటే వాటి నివారణ నిమిత్తం ఇవ్వబడింది. ఆరు రోజుల తర్వాత పేషంటు ప్రాక్టీషనర్ ను కలసి తనకు రెమిడి తీసుకున్న రెండవ రోజు నుండే మెరుగయ్యిందని ప్రస్తుతం వ్యాధి లక్షణాలన్నీ పూర్తిగా తగ్గిపోయాయని చెప్పారు. ఈమె ఇప్పుడు ఏవిధమైన నొప్పి ఇబ్బంది లేకుండా పాపకు పాలు ఇవ్వగలుగుతున్నారు.
ఆస్త్మా 02789...India
12 సంవత్సరాల పాపకు చిన్నప్పటినుండి ఆస్త్మా ఉంది. ప్రాక్టీ షనర్ ఆమెకు క్రింది రెమిడి ఇచ్చారు:
CC19.3 Chest infections chronic + CC19.4 Asthma attack…TDS.
రెమిడి తీసుకుంటున్న సమయంలో ఒక్కసారి కూడా ఆస్త్మా రాలేదు. ఈ అమ్మాయి రెమిడి తీసుకోవడం కొనసాగించింది.
సూచన: చిన్నపిల్లలకు ఎవరికయినా చిన్నప్పటినుండి ఆస్త్మా ఉన్నట్లయితే వారికి ట్యూబర్కులినమ్ మియాజం ఉన్నట్లు భావించాలి. కనుక సాద్యమైనంత తొందరగా దీనికి చికిత్స చేయాలి.
అధిక రక్తపోటు తో కూడిన మదుమేహం 11423...India
49 సంవత్సరాల వ్యక్తి ప్రాక్టీషనర్ని సందర్శించిన సంవత్సరం క్రితం నుండి మధుమేహంతో బాధ పడుతూ ఉన్నట్లు నిర్దారించారు. అలాగే వీరికి అధిక రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ కూడా ఉంది. వీరికి క్రింది రెమిడి ఇవ్వబడింది:
CC3.3 High Blood Pressure + CC3.5 Arteriosclerosis + CC6.3 Diabetes…TDS.
స్వీయ పర్యవేక్షణ లోనే కొన్ని వారాలపాటు పేషంటు క్రమం తప్పకుండా మందులు వాడినప్పటికీ ఫలితం కనిపించలేదు. ఐతే ఈ కాలంలో పేషంటు యొక్క లివరు కూడా దెబ్బతిన్న విషయం వెలుగులోనికి వచ్చింది. కనుక ప్రాక్టీషనర్
CC4.2 Liver and Gallbladder tonic ను పై రెమిడికి కలపడం జరిగింది. దీని తర్వాత పేషంటు తనకు క్రమంగా ఆరోగ్యం మెరుగవుతున్న విషయం గుర్తించారు. క్రమం తప్పకుండా చేయించుకుంటున్న పరీక్షల వలన పేషంటు యొక్క బ్లడ్ షుగర్ సాధారణ స్థాయికి వచ్చినట్లు గుర్తించారు. రెండు నెలల తర్వాత, చేయించుకున్న పరీక్షలో రక్తంలో చెక్కర స్థాయి 120/80 ఉండడమే కాక కొలెస్ట్రాల్ పూర్తిగా తగ్గిపోయింది. పేషంటు యొక్క కుటుంబ వైద్యుడు ఇతనితో ‘నీవిప్పుడు డయాబెటిక్ పేషంటువు కాదు!’ అని చెపుతూ తను వాడుతున్న ప్రత్యామ్నాయ వైద్య విధానము గురించి ఆరా తీసారు. ఈ విధంగా అలోపతి మందులను చాలా వరకు తగ్గించి వైబ్రో కోమ్బో ను కొనసాగించారు.
క్లోమములో వచ్చిన వ్యాధి (పాంక్రియా టైటిస్) 02494...Italy
క్లోమపు వ్యాధితో హాస్పిటల్లో చేరిన ఒక మహిళ కు సహాయం చేయడానికి, ప్రాక్టీషనర్ ను వెంటనే వచ్చి కలవమని కబురు పంపించారు. ఆమె అలోపతి మందులకు ఏమీ ప్రతిస్పందించక పోవడంతో డాక్టర్స్ ఆమె మీద చాలా జాలి చూపించారు. ప్రాక్టీషనర్ సాయిరాం పోటేంటైజర్ తో క్రింది రెమిడి బ్రాడ్కాస్టింగ్ చేసి ఇచ్చారు:
NM36 War + OM1 Blood + OM17 Liver-Gallbladder + SM1 Removal of Entities + SM2 Divine Protection + SR265 Aconite + SR271 Arnica + SR293 Gunpowder + SR516 Pancreas…day and night.
కొద్ది రోజుల్లోనే పేషంటుకు మెరుగవడం మొదలయ్యింది; ఈమెకు నొప్పులు తగ్గిపోవడమే కాక జ్వరం కూడా నెమ్మదించింది. వారం చివరికల్లా ఆమె పూర్తిగా కోలుకొని ఇంటికి వెళ్ళిపోయారు. ఆమె ఇంత త్వరగా కోలుకోవడం చూసి డాక్టర్లే ఆశ్చర్యపోయారు.
108CC బాక్సు కలిగిన ప్రాక్టీషనర్ లు: CC4.7 + CC15.1 + CC12.1…6TD. ను ఇవ్వవచ్చు .
పిల్లలు పుట్టడంలో ఇబ్బంది 10437...India
29 సంవత్సరాల మహిళకు వివాహమయ్యి 10 సంవత్సరాలయినా, పిల్లలు పుట్టలేదు. ఒకసారి ఆమె గర్భం ధరించింది కానీ పిండము పూర్తిగా ఎదగకుండానే గర్భ విచ్చితి జరిగింది. వారు చేయించు కున్న వైద్య పరీక్షల నివేదికల ప్రకారము ఆమెలోనూ తన భర్త లోనూ కూడా అసాధారణ సమస్యలేమీ లేవు కానీ ఆమె స్థూలకాయం తో బాధపడుతూ ఉన్నారు. గతంలో, ఆమె ఆపరేషన్ ద్వారా కండరాలను తొలగించుకోవడం జరిగింది. ఇంకా ఆమెకు హైపో థైరాయిడ్ కూడా ఉన్నది. క్రింది రెమిడి ఆమెకు ఇవ్వబడింది:
భార్యకు: OM24 Female Genital + BR16 Female + SM21 Female + SM39 Tension + SM41 Uplift + SR255 Calc Sulph + SR262 Nat Phos…TDS.
భర్తకు: OM22 Male Genital + BR17 Male + SM32 Male + SM39 Tension + SM41 Uplift + SR216 Vitamin-E + SR254 Calc Phos + SR522 Pituitary Anterior + SR534 Testes…TDS.
బాబావారి అనుగ్రహంతో, ఈ దంపతులకు ఒక కుమారుడు కలిగాడు ఐతే నిర్ణీతమైన సమయము కంటే ముందే జన్మించడం వలన నెలా పదిహేను రోజులు నిపుణుల సంరక్షణ లో ఇంక్యుబేటర్ లో ఉంచడం జరిగింది. ప్రస్తుతం రెండు నెలల వయసు తో ఆరోగ్యంగా ఉన్న ఈ బాబును చూసి తల్లిదండ్రులు ఎంతో ఆనందంగా ఉన్నారు.
జారిన మోచిప్ప 02799...UK
55 సంవత్సరముల వయసుగల మహిళ కుంటుకుంటూ ప్రాక్టీషనర్ వద్దకు వచ్చారు. ఈమె జారిన మోచిప్ప తోనూ మోకాళ్ళ నొప్పితోనూ గత 10 సంవత్సరాలుగా బాధ పడుతున్నారు. ఆమెకు క్రింది రెమిడి ఇవ్వబడింది:
NM3 Bone-I + NM6 Calming + NM24 Rheumatism & Arthritis + NM36 War + NM40 Knees + NM113 Inflammation + OM3 Bone Irregularity + OM16 Knees + OM18 Sacral & Lumbar + OM30 Connective Tissue + OM31 Spine: Lumbar-Sacral + OM32 Spine: Dorsal + OM33 Spine: Brainstem + SM34 Arthritis + SM33 Pain + SR293 Gunpowder + SR295 Hypericum (200C) + SR457 Bone + SR463 Cranial Nerves (CM) + SR479 Cartilage + SR500 Intervertebral Discs + SR517 Parathyroid…TDS మూడు నెలల వరకూ.
ఒక నెల తర్వాత పేషంటు తనకు 75% నయమయ్యిందని చెప్పారు. పేషంటు రెమిడి తీసుకోవడం కొనసాగించారు. తరువాత నెలలో నొప్పి బాగా తగ్గింది. కనుక రెమిడి ని BD గానూ మరుసటి నెలకు OD గానూ తగ్గించడం జరిగింది.
108CC బాక్స్ ఉపయోగించే ప్రాక్టీషనర్ ల కోసం: CC20.1 + CC20.2 + CC20.3 + CC20.4 + CC20.5…TDS
ప్రశ్న జవాబులు
1. ప్రశ్న: గోళీల రూపంలో ఉన్న వైబ్రేషన్ ను నీటి రూపం లోనికి మార్చుకొనడానికి ఏ నిష్పత్తి పాటించాలి?
జవాబు: నిష్పత్తి అనేది ఇక్కడ అప్రధానమైన విషయం. దీనికి ఖచ్చితమైన నిష్పత్తి ఏమి లేదు! సాధారణంగా 200 మి.లీ. నీటిలో 4 గోళీలు వేయమని చెపుతాము. ఐతే ఒక లీటర్ నీటిలో 5 గోళీలు వేసుకున్నా సరిపోతుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇలా కలిపిన దానిని108 సార్లు బాగా కదపాలి. ఇలా తయారు చేసుకున్న రెమిడిని ప్లాస్టిక్ స్పూన్ తో 5 మి.లీ. తీసుకుని మింగటానికి ముందు నాలిక క్రింద ఒకనిమిషం ఉంచుకొని అనంతరం మింగాలి.
_____________________________________
2. ప్రశ్న: నేను గమనించిన విషయం ఏమిటంటే నా 108 CC బాక్సులో ఉన్న రెమిడిల ద్రవ పరిమాణము నేను ఉపయోగించక పోయినా తగ్గిపోతోంది. ఎందుకిలా జరుగుతోంది?
జవాబు: ఇది చాలా సాధారణం. మనం రెమిడిలకు ఉపయోగించే వైద్య పరమైన ఆల్కహాల్ చాలా స్వచ్చమైనది, దీనియొక్క బాష్పీబవన స్థానం చాలా తక్కువ. అందుచేత మనం మూత గట్టిగా పెట్టినప్పటికీ రెమిడి సీసాల నుండి ద్రవం ఆవిరయి పోతూ ఉంటుంది.
_____________________________________
3. ప్రశ్న: రెండు నెలల పాటు నేను వేరే ప్రదేశానికి వెళ్ళవలసి వచ్చినప్పుడు నా పేషంట్ల నిమిత్తం ఎలాంటి ఏర్పాటు చేసుకోవాలి?
జవాబు: మీ కుటుంబ సభ్యులలో గానీ లేదా మీ పేషంట్ల నుండి గానీ రెమిడి లు తయారు చేయగల సమర్ధత ఉన్నవారిని ఎన్నుకొని వారిని మీ సహాయకుడిగా తర్ఫీదు ఇవ్వవలసిందిగా సూచన. అదేవిధంగా మీ ప్రాంతంలో ఉన్న మరొక ప్రాక్టీషనర్ తో సంప్రదింపులు జరుపుతూ మీరు స్థానికంగా లేనప్పుడు మీ పేషంట్లు వారిని సంప్రదించే విధంగా ఏర్పాటు చేసుకోండి. అటువంటి వారు ఎవరి గురించి మీకు తెలియ నట్లయితే సమాచారము కొరకు [email protected] కు రాయండి.
_____________________________________
4. ప్రశ్న: 108CC బాటిల్ రీఫిల్ చేసిన తర్వాత దానిని షేక్ చేసే విధానము పైన నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి నివృత్తి చేయగలరు.
జవాబు: 108CC రెమిడి బాటిల్ ను పైన పట్టుకొని అరచేతిలో 9 సార్లు తడుతూ బాగా కదపాలి. ఇలా చేస్తూ మన ఇష్ట దైవాన్ని “ఓ భగవంతుడా ఈ రెమిడి నయం చేసే నీ దివ్య ప్రేమతో శక్తివంతం కావాలి” అని ప్రార్దించాలి. మనసును కేంద్రీకరించి ఈ విధంగా చేసి నట్లయితే ఆ రెమిడికి అదనపు శక్తి జోడింప బడుతుంది.
_____________________________________
5. ప్రశ్న: 108CC బాటిళ్ళను ప్రతీ రెండు సంవత్సరాల కొకసారి కదిపితే (షేక్ చేస్తే) మరలా అవి శక్తివంతం అవుతాయని నేను విన్నాను. ఇది సరియయినదేనా?
జవాబు: ఇదమిద్ధం గా ఇదే చేయాలి అంటూ ప్రత్యేకమైన నియమాలు ఏమీ లేవు. మనం రెమిడి ఉపయోగించేటప్పుడు, రీఫిల్ చేసే టప్పుడు షేక్ చేస్తూనే ఉంటాము. ఐతే ముందు జాగ్రత్తకోసం మేమేమి సలహా ఇస్తామంటే ప్రతీ బాటిల్ ను 9 సార్లు అరచేతి పైన తట్టాలి అలా చేస్తే కొమ్బో లు మరలా శక్తివంతం అవుతాయి.
_____________________________________
6. ప్రశ్న: మహిళా ప్రాక్టీషనర్ ఋతు సమయంలో రెమిడి లను పేషంట్లకు ఇవ్వవచ్చా?
జవాబు: ఔను, నిరభ్యంతరంగా ఇవ్వవచ్చు; మహిళలకు కానీ పురుషులకు కానీ ప్రధానంగా ఉండవలసింది ఏమిటంటే ఆలోచనలలో పవిత్రత, పేషంట్లకు రెమిడి ఇచ్చేటప్పుడు ప్రశాంత చిత్తము తో ఇవ్వాలి.
చికిత్సా నిపుణులారా: మీకు డాక్టర్ అగ్గర్వాల్ గారితో పంచుకొనేందుకు ఏమయినా ప్రశ్నలున్నయా? ఐతే ఈ వెబ్సైట్ కు మెయిల్ మ పంపండి [email protected].
దివ్య వైద్యుడి దివ్య వాణి
"సేవ ఏ రూపంలో ఎక్కడ చేసినా ఆధ్యాత్మిక క్రమశిక్షణ తో చేయాలి, మానసిక పవిత్రత కోసం చేయాలి. ఇట్టి భావనతో సేవ చేయలేక పోయినట్లయితే అది నిష్ప్రయోజన మవడం గానీ లేదా అహంకార ఆడంబరాలను పెంపొందించుకొనేది గా కానీ మారిపోతుంది. ఒక్క నిమిషం ప్రశాంతంగా ఆలోచించండి మీరు దేవునికి సేవ చేస్తున్నారా లేక దేవుడే మీకు సేవ చేస్తున్నాడా? ఆకలితో ఉన్న ఒక శిశువుకు పాలు ఇచ్చినప్పుడో, లేక పేవ్మెంట్ పైన చలితో వణుకుతున్న సోదరునకు దుప్పటి కప్పినప్పుడో భగవంతుడు ఇచ్చిన దానిని మరొక భగవంతుని చేత సృష్టింప బడిన వానికి అందిస్తున్నారు! ఆధ్యాత్మిక నియమం ప్రకారము మీరు భగవంతుడు ఇచ్చిన దానిని తిరిగి భగవంతునికే సమర్పిస్తున్నారు! కనుక బాగా గుర్తుంచుకోండి - భగవంతుడే మీకు సేవ చేస్తున్నాడు! కానీ ఆ ఘనతను మీకు ఆపాదిస్తున్నాడు. భగవంతుడి సంకల్పము లేనిదే గడ్డిపోచ కూడా కదలదు కనుక ప్రతీ క్షణము సర్వమూ సమకూర్చిన ఆ సర్వేశ్వరుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండండి!”
-సత్య సాయి బాబా - దివ్యవాణి, ఫిబ్రవరి 20, 1966
"భౌతికమైన దేహ పరిశుభ్రత కన్నాఆంతరంగిక పవిత్రత కోసం మనసును పరిశుభ్ర పరచండి. గుర్తుంచుకోండి సర్వవ్యాపి ఐన భగవంతుడు అందరిలోనూ ఉన్నాడు. ఇతరులకు అనందం చేకూర్చడానికే నిరంతరం మీరు ప్రయత్నించాలి. నిజమైన పండుగ అందరూ తమ ఆనందాన్ని ఇతరులతో పంచుకోన్నప్పుడే ఉంటుంది. కనుక మీ ఆనందాన్ని ఇతరులతో పంచుకోండి, అప్పుడే మీరు వారినుండి స్వీకరించడానికి అర్హత ఉంటుంది. ’’ఇచ్చి పుచ్చుకో‘’ అనే దానిని పాటించండి కేవలం నేను నా కుటుంబము అనే స్వార్దాన్ని వీడి ఇతరుల సంక్షేమం కోసం పాటుపడండి.”
-సత్య సాయి బాబా - దివ్యవాణి, ఏప్రిల్ 15, 2003
ప్రకటనలు
రాబోయే శిక్షణా శిబిరాలు
-
ఇండియా ముంబాయి: 21-22 జూలై తేదిలలో - 108CC బాక్సు పైన JVP లకు శిక్షణ. వివరాలకు నంద్ అగ్గర్వాల్ ను [email protected] ద్వారా సంప్రదించగలరు.
-
ఇండియా కేరళలోని కాసరగడ్: జూలై 28-29 తేదిలలో - 108CC బాక్సు పైన JVP లకు శిక్షణ. వివరాలకు M.పంకజాక్షన్ ను [email protected] ద్వారా సంప్రదించగలరు.
-
ఇటలీ వెనిస్: సెప్టెంబర్ 14-17 తేదిలలో లో - SVP శిక్షణా శిబిరము. వివరములకు ఫెబియో ప్రేవిఎతి : 041-563 0288. ద్వారా లేదా [email protected] ద్వారా సంప్రదించగలరు.
-
యునైటెడ్ స్టేట్స్ డల్లాస్, టెక్సాస్: అక్టోబర్ 6-7 తేదిలలో - 108CC బాక్సు పైన JVP లకు శిక్షణ అక్టోబర్ 20 -21 తేదిలలో హర్టిఫోర్డ్, కనెక్టికట్ - 108CC బాక్సు పైన JVP లకు శిక్షణ Box వివరాలకు [email protected] ద్వారా సంప్రదించగలరు.
-
చికిత్సా నిపుణులందరికి: మీరు ఏదయినా శిక్షణా శిబిరము నిర్వహించదలచి ఉంటే వివరాలను: [email protected] కు పంపండి.
అదనపు సమాచారం
ఆరోగ్య చిట్కాలు
వీలయినంత తరుచుగా బొప్పాయి తీసుకోండి
ప్రప్రధమంగా దక్షిణ మెక్సికో ప్రాంతానికి చెందిన ఈ బొప్పాయి పంటను ఇప్పుడు అనేక దేశాలలో (బెజిల్, ఇండియా, ఇండోనేషియా, దక్షిణాఫ్రికా, వియత్నాం, శ్రీలంక) పండిస్తున్నారు. బొప్పాయి శక్తివంతమైన సంప్రదాయక ఔషదం గా అనేక శతాబ్దాలు ఉపయోగించబడింది. బొప్పాయి రుచికరమయిన పండు మాత్రమేకాదు, దీనిలో అనేక విటమిన్లు, ఫైటోకెమికల్స్ సమృద్ధిగా ఉన్నాయి. బొప్పాయి యొక్క ఇతర భాగాలూ కూడా అనారోగ్య సమస్యలకు ఉపయోగించినట్లు చారిత్రక నేపధ్యం ఉంది.
ఇప్పుడు ప్లోరిడా విశ్వవిద్యాలయ (యూఎఫ్) పరిశోధకుడు డాక్టర్ నామ్ దంగ్ మరియు జపాన్ లోని అతని సహచరులు బొప్పాయి కేన్సర్ కణాలను నాశనం చేస్తుందని తమ నూతన పరిశోదన ద్వారా తెలియజేస్తున్నారు. వాస్తవానికి వారు పరిశోధన శాలలో ఎండిన బొప్పాయి అకులనుండి తయారుచేసిన ఔషదం అనేక రకాలయిన కణుతులు ముఖ్యంగా గర్భాశయం, రొమ్ము, లివరు, ఉపిరి తిత్తులు, వంటి అనేక క్యాన్సర్ లను నిరోధించ గలిగింది.
ఇటీవలే ఎత్నోఫార్మకాలజీ పత్రికలో ప్రచురితమైన పరిశోధనా అంశం ప్రకారము బొప్పాయి కి వివిధరకాల కణుతులను అరికట్టే స్వభావము ఉండడమే కాదు బొప్పాయి ఆకు నుండి తీసిన రసం మన శరీరంలో సిగ్నలింగ్ వ్యవస్థను పటిష్టం చేసే Th1-type సైటో కిన్స్ ఉత్పత్తి చేసే స్వభావము కలిగినదని నిర్ధారణ అయ్యింది.
ఇది చాలా ముఖ్యమైన అంశం ఎందుకంటే బొప్పాయి ఉపయోగించడం వలన శరీరంలో క్యాన్సర్ అరికట్టడానికి కావలసిన రోగనిరోధక వ్యవస్థ పటిష్ఠ మవుతుంది. అంతేగాక, శరీరంలో మంట ఇంకా సుక్ష్మ జీవుల ద్వారా కలిగే ఇతరత్రా వ్యాధులను కూడా అరికడుతుంది.
పరిశోధనలు ఏం తెలుపుతున్నయంటే బొప్పాయి యొక్క క్యాన్సర్ నివారణ గుణం వీటి ఆకులరసాన్ని వాడినప్పుడు ఇంకా బలంగా ఉన్నట్లు కనుగొనబడింది. అంతేకాదు మిగతా ఇతర చికిత్సా విధానాల వలె కాకుండా దీనిని వాడడం వలన ఇతర కణాల పైన ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు.
డాక్టర్ డాంగ్ ఇచ్చిన నివేదిక ప్రకారము దుష్ఫలితాల ప్రభావం లేకుండా క్యాన్సర్ నివారింప బడడం బొప్పాయి లో ఉన్న గొప్ప విశేషం, ఆస్ట్రేలియా మరియు వియత్నాం ప్రాంతాలలోని అసంఖ్యాకంగా ఉన్న ప్రజల ద్వారా ఇది ప్రత్యక్షంగా నిరూపింప బడినట్లు వీరు తెలుపుతున్నారు. షాన్డ్స్ క్యాన్సర్ చికిత్స మరియు పరిశోధనా కేంద్రంలో వైద్య విభాగములో ప్రొఫెసర్ గా మరియు డైరెక్టర్ గా పనిచేస్తున్న డాక్టర్ డాంగ్ తమ అభిప్రాయాన్ని ఇలా వెలిబుచ్చుతున్నారు. ‘’ చికిత్సా విధానములో నేను చూసిన విన్న అంశాల ప్రకారము ఎవరయితే ఈ ఆకుల రసాన్ని తీసుకోవడం లేదో వారిలో చెప్పుకోదగిన పరిమాణములో టాక్జిన్ అనగా విషపదార్ధాలు ఉన్నట్లు నిర్దారింపబడింది, కనుక అది పనిచేసే వరకూ ఎక్కువ కాలం ఈ రసాన్ని తీసుకోవలసి ఉంటుంది ‘’.
ఇది ఇలా ఉండగా UF శాస్త్రవేత్తలు 10 రకాల క్యాన్సర్ల నివారణకు బొప్పాయి ఆకుల రసం ఎంతో సహాయకారిగా ఉంటుందని తెలిపారు. ఈ రసంత్రాగిన పేషంట్లకు 24 గంటల తర్వాత పరీక్షిస్తే కణుతుల పెరుగుదల తగ్గుముఖం పడుతున్నట్లు కనుగొనబడింది.
హానికారక గ్రంధుల వంటివాటిని నిరోధించడానికి బొప్పాయిలో ఉన్న ప్రత్యేకత ఏమిటి? దీనిని వివరించడానికి పరిశోధకులు బొప్పాయిలో ఉన్న T-లింఫోమా క్యాన్సర్ సెల్ లైన్ పైన దృష్టి సారించారు. వారు బొప్పాయి ఆకుల రసం లో ఉన్న సహజ సిద్ధమైన సమ్మేళన సామర్ధ్యము క్యాన్సర్ తాలూకు కణాలను మాత్రమే చంపివేస్తుంది కానీ, సాధారణ కణాలను మాత్రము ఏమీ చేయదు అని అని పరిశోధనా పూర్వకంగా కనుగొన్నారు.
పరిశోధకులు తమ బొప్పాయి మరియు క్యాన్సర్ నివారణ పరిశోధనలను జంతువుల పైన మనుషుల పైన కొనసాగించాలనే ప్రయత్నంతో ముందుకు వెళుతున్నారు. ఇంతేకాకుండా డాక్టర్ డాంగ్ మరియు వారి బృందము బొప్పాయి ఆకురసము క్యాన్సర్ ను నిరోధించడానికి దానిలో ఉన్న ప్రత్యేక పదార్ధాలు పైన టోక్యో విశ్వవిద్యాలయం నుండి పరిశోధనలు కొనసాగిస్తూ దానిపైన పేటెంట్ తీసుకునే ప్రయత్నంలో ఉన్నారు.
ఈ ప్రయత్నంలో డాక్టర్ డాంగ్ UF షాండ్స్ క్యాన్సర్ సెంటర్ లో వైద్య రసాయనిక శాస్త్రంలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న హెండ్రిక్ లుయేష్ గారితో భాగస్వామ్యం వహించి ముందుకు పోవడానికి ప్రయత్నిస్తున్నారు. డాక్టర్ లుయేష్ వైద్య ప్రయోజనాలకోసం ప్రాకృతికమైన వనరులను గుర్తించడం లోనూ వాటిని ఉపయోగం లోనికి తీసుకురావడం లోనూ సిద్ధ హస్తులు. వీరు ఇటీవలే పగడపు రాయి కి చెందిన సమ్మేళనం క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుందని కనుగొన్నారు.
ఆరోగ్య ప్రయోజనాలు:
తీయగా, మధురంగా ఉండే బొప్పాయి పండ్లు ఉదయపు పలహరానికి ఎంతో అనువుగా ఉండడంతో పాటు ఫ్రూట్ సలాడ్ లో ఇది చాలా బాగుంటుంది. దీనిని యోగర్ట్ తో కలిపి రుచికరమైన పదార్దము చేసుకోవచ్చు. ఆకుపచ్చని సలాడ్ లలో దీనిని రుచికోసం కలుపుకోవచ్చు. నిమ్మరసాన్ని బొప్పాయి తో చేసిన పదార్ధాల పైన పిండుకుంటే మరింత రుచికరంగా ఉంటుంది. బొప్పాయి యొక్క ఆరోగ్య ప్రయోజనాల విషయానికొస్తే ఇది గుండెజబ్బులు, క్యాన్సర్ నివారణ, జలుబు, ఫ్లూ వంటి వాటిని నివారించడమే కాకుండా జీర్ణశక్తిని కూడా పెంపొందిస్తుంది.
బొప్పాయిలో ఉన్న పోషకాలు:
బొప్పాయి లో C విటమిన్ పుష్కలంగా లభిస్తుంది. ఒక మధ్యస్థమైన పరిమాణములో ఉన్న బొప్పాయిలో ప్రతిరోజూ మనం తీసుకునే పరిమాణానికి 150% ఎక్కువ లభ్యమవుతుంది. దీనిలో బీటా–క్రోటిన్ రూపంలో విటమిన్ A, కూడా సమృద్ధిగా లభిస్తుంది. దీనిలో K విటమిన్, E విటమిన్, ఫోలిక్ యాసిడ్ ఇంకా పొటాషియం కూడా సమృద్ధిగా లభిస్తాయి.
గుండెజబ్బుల నివారణకు బొప్పాయి:
బొప్పాయి చేకూర్చే ఆరోగ్య ప్రయోజనాలలో మరొకటి ఇది గుండెజబ్బుల నియంత్రణకు ఉపయోగపడే మూడు విటమిన్లను కలిగి ఉంటుంది - అవి A, విటమిన్, E విటమిన్ మరియు బీటా కెరోటిన్. ఇంకా అదనంగా దీనిలో సమృద్ధిగా లభించే ఫోలిక్ యాసిడ్ గుండెజబ్బుల కు దోహదపడే అమినో ఆమ్లాల హోమో సిస్టిన్ ల స్థాయిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
జలుబు మరియు ఫ్లూ నివారణ కు:
C, విటమిన్ ఎక్కువగా ఉండే బొప్పాయి వంటివి రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఎంతో సహాయకారిగా ఉంటాయి. C విటమిన్ A, టైపు ఇన్ఫ్లుఎంజా, సాధారణ జలుబు, న్యుమోనియా లేదా నిమ్ము వీటి నివారణకు ఎంతో సహాయకారిగా ఉంటుంది. అలాగే బొప్పాయి లో ఉన్న A విటమిన్ రోగ నిరోధక వ్యవస్థకు మరింత సహాయకారిగా ఉంటుంది.
నాడీ సంబంధితమైన రుగ్మతల నివారణకు బొప్పాయి:
బొప్పాయి లో ఉండే ఫోలిక్ ఆమ్లము నాడీ సంబంధిత రుగ్మతలను నివారించడంలో ఎంతో సహాయకారిగా ఉంటుంది. ఫోలిక్ ఆమ్లము అధికంగా ఉండే బొప్పాయి వంటివి గర్భధారణకు ముందు మరియు గర్భధారణ సమయంలో తీసుకోవడం వలన పిండము వెన్ను మరుయు నాడీ వ్యవస్థ చక్కగా అభివృద్ధి చెందుతుంది.
జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండడానికి బొ ప్పాయి:
బొప్పాయిలో పాపెయిన్, మరియు ఖయమోపాపెయిన్ అనే ప్రత్యేక ఎంజైములు మాంసకృత్తులను జీర్ణం చేయడంలో ఎంతో సహాయకారిగా ఉంటాయి. బొప్పాయి ఆహారానికి సంబంధించిన విష పదార్ధాలను నిర్వీర్యం చేయడంలోనూ మరియు దీనిలో పుష్కలంగా ఉన్న జీర్ణ స్రావాల వలన జీర్ణ వ్యవస్థ మెరుగు పడడానికి ఎంతో సహాయకారిగా ఉంటుంది. దీనిలో ఆంటిఆక్సిడెంట్లు గా పనిచేసే విటమిన్లు C మరియు E ఇంకా ఫోలిక్ ఆమ్లము ఉండడం వలన ఇది కోలన్ క్యాన్సర్ నివారణకు ఉపయోగ పడుతుంది.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
విటమిన్ శోషణం చేసుకొనడంలో చర్మపు పాత్ర
‘’సూర్యకాంతి విటమిన్’’ గా అనేక సందర్భాలలో పిలవబడే D విటమిన్ సూర్యకాంతి నుండి సమృద్ధిగా లభిస్తుంది. ఐతే సూర్య కిరణాలు నేరుగా ఈ విటమిన్ ను ఇవ్వవు. సూర్యకాంతి కి గురికాబడిన శరీరము లోనికి చొచ్చుకుపోయిన అతినీలలోహిత (అల్ట్రా వైలెట్) కిరణాలు ఈ శక్తిని D విటమిన్ గా మారుస్తాయి. ఈ ప్రక్రియలో భాగం పంచుకునే లివరు మరియు మూత్రపిండాలు ఎంతో ప్రాధాన్యత గలిగిన కాల్సిట్రియోల్ హార్మోన్ ను తయారుచేస్తాయి.
పోషక విలువలు:
విటమిన్ కాల్సిట్రోయిల్ హార్మోన్ కు పూర్వగామిగా చెప్పవచ్చు. శరీరంలో కణముల తయారీ మరియు పెరుగుదల విషయంలో ఈ హార్మోన్ కు ఎంతో ప్రాధాన్యత ఉందని ప్రస్తుత పరిశోధనలు నిర్ధారిస్తున్నాయి. ఇదే D విటమిన్ ను మిగతా విటమిన్ లకన్నా వేరుగా చూడడానికి కారణ మవుతున్నది. ఇది శరీరపు వ్యవస్థలకు ఇందనం లాగా పనిచేస్తుంది కానీ మిగతా విటమిన్లు ప్రక్రియా సూచికలుగా మాత్రమే ఉంటాయి. ఇది కొవ్వులో కరిగే విటమిన్ గా ఉంటూ అదనముగా ఉన్న విటమిన్ శరీరములోని కొవ్వు కణాలలో నిల్వ ఉంటుందే తప్ప మిగతా నీటిలో కరిగే C మరియు అనేక B విటమిన్ల మాదిరిగా మూత్రం వెంబడి బయటకు జారీ కాదు.
ప్రముఖ పాత్ర :
విటమిన్ మన శరీరంలో అనేక ప్రాధమిక క్రియలు నిర్వర్తిస్తుంది. ముఖ్యంగా జీర్ణప్రక్రియ దశలో చిన్న ప్రేవులు తీసుకునే కాల్షియం స్థాయిని పెంచడములో ఇది ప్రముఖ పాత్ర వహిస్తుంది. D విటమిన్ లేకుండా, ఎముకల పెరుగుదల మరియు ఎముకల నిర్మాణము సాధ్యంకాదు. D విటమిన్ లోపము వలన పిల్లలలో రికెట్స్ వ్యాధి, పెద్దలలో ఆస్టియోమలాసియా, ఆస్టియోపోరోసిస్ (ఎముకల బోలుతనము, పెళుసుదనము) కలుగుతాయి. D విటమిన్ రక్తంలో కాల్షియం మరియు ఫాస్పరస్ స్థాయి నియంత్రించడానికి వాపులను నిరోధించడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి, జన్యుపరమైన వ్యవస్థ పటిస్టతకు ఉపయోగపడుతుంది.
విటమిన్ కు ఆధారాలు:
సూర్యరశ్మి విటమిన్ D తయారీకి చక్కని మూలము. ఆహార ఉపఉత్పత్తుల యొక్క జాతీయ ఆరోగ్య పరిశోధనా సంస్థ నివేదిక ప్రకారము "290-315 నానోమీటర్ల తరంగ దైర్ఘ్యం కల అల్ట్రా వైలెట్ (UV) B రేడియేషన్ ఆచ్చాదన లేని శరీరములోనికి చొచ్చుకొని పోయి క్యుటేనియస్ 7- డీహైడ్రో కొలెస్ట్రాల్ ను D3 ప్రివిటమిన్ గానూ, తిరిగి అది D3 విటమిన్ గానూ మారుస్తుంది." సూర్యరశ్మి కాకుండా D విటమిన్ లభించే ఇతర మూలాలు సోఖియే సల్మాన్, కాడ్ లివర్ నూనె, బలవర్ధకమైన పాల ఉత్పత్తులు, పుట్టగొడుగులను ఇతర ఉపఉత్పత్తులు గా తీసుకోవాలి ఎందుకంటే D విటమిన్ ప్రకృతి సిద్ధంగా పెద్ద మొత్తాలలో లభించదు.
దీనిని ఎలా పొందవచ్చు:
మన శరీరంలో విటమిన్ D తయారికి కావలసిన UVB కిరణాలను పొందడానికి ఉత్తమమైన పధ్ధతి తగినంత కాలం సూర్యకిరణాలకు శరీరాన్ని గురిచేయడమే. ఐతే మరీ ఎక్కువసేపు ఉండడం వలన చర్మపు క్యాన్సర్ వ్యాధి వచ్చే అవకాశం కూడా ఉంది. కొద్ది నిమిషాల పాటు శరీరాన్ని సూర్యకాంతి కి గురిచేయడం వలన UVB తాకిడికి కావలసినంత D విటమిన్ పొందేందుకు అవకాశము ఉంది. శ్యామల వర్ణము కలవారు తెల్లని రంగు కలవారికంటే ఎక్కువసేపు సూర్యకాంతి లో ఉండాలి కారణం ఏమిటంటే వారి శరీరంలో ఉన్న మెలోనిన్ శోషణ క్రియను తగ్గిస్తుంది. పరిశోధనా ఫలితాలు ఏం చెపుతున్నాయంటే పగలు 10 గంటల నుండి 3 గంటల వరకూ గల సమయంలో ఐదు నుండి 30 నిముషాల పాటు వారంలో రెండుసార్లు సూర్యకాంతి కి గురికావడం వలన శరీరానికి కావలసిన D విటమిన్ అందుతుంది. ఐతే చర్మపు క్యాన్సర్ కు గురయ్యే అవకాశం ఉన్నవారు, ఇంటికే పరిమితమైన వారు, వెలుగు రాని ప్రాంతంలో గడిపేవారు, ఉపాహారం రూపంలో ఈ విటమిన్ తీసుకొనడం ఉత్తమం.
శోషణ ప్రక్రియను నిరోధించేవి ఏవి:
ప్రదేశము, ఋతువు, బౌతిక అడ్డంకులు అల్ట్రా వైలెట్ కిరణాల శోషణను నిరోధిస్తాయి. మనం ధరించే దుస్తులు, సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ SPF15 కంటే ఎక్కువగా ఉన్న సన్ స్క్రీన్, కిటికీలకు వేసిన రంగులు, ఆకాశంలో మబ్బులు ఇవన్నీ కూడా సూర్యకాంతి నుండి D విటమిన్ తయారుచేసుకోవడానికి అవరోధం కలిగిస్తాయి. శ్యామల వర్ణము గలవారికి కూడా సూర్యకాంతి ఎక్కువ కావాలి ఎందుకంటే వారి చర్మములో అధిక మొత్తంలో ఉన్న మెలోనిన్ UVB కి బహిర్గతం కావడాన్ని తగ్గింస్తుంది.
www.livestrong.com/article/109767-skin-absorb-vitamin-d-sun/#ixzz20jZYHZLf