Vol 3 సంచిక 5
September/October 2012
ముద్రింప తగిన వార్తాలేఖ
పూర్తి వార్తాలేఖ యొక్క కాగితం ప్రతి కావలెనన్నఈ పుటను ముద్రించండి
డా.జిత్ కే అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి
ప్రియమైన అభ్యాసకులకు,
భారతదేశం అంతటా మెడికల్ క్యాంపులను నిర్వహిస్తున్న మన సీనియర్ వైబ్రియానిక్స్ అభ్యాసకులు ఇద్దరు ఇటీవల హిమాలయాలలో ఈ వేసవిలో నిర్వహించిన శిబిరమునకు సంబంధించిన అద్భుతమైన నివేదికలను పంపారు. ఇద్దరు విదేశీయులు ఉచిత ఔషధం ఇస్తున్నారన్న వార్తలు హిమాచల్ ప్రదేశ్ లోని లోయలలో మారుమ్రోగే సరికి అనేకమంది రోగులు ఐదారు గంటలు బస్సులో ప్రయాణించి ఆపై మరో రెండు గంటలు నడిచి ఈ అద్భుతాలనుచేసే ఔషధం పొందడం కోసం క్యాంపుకు చేరుకోవడం జరిగింది. ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా వారి యొక్క కండరాల నొప్పులు, ఆర్థరైటిస్, గ్యాస్ సమస్యలు లేదా కడుపులో పుండ్లు, పంటి నొప్పి మొదలగునవి ఈ మందులతో అనేక సందర్భాలలో ఒక్క రాత్రికే నయమవుతున్నాయని విని ఎంతో సంతోషం పొందారు. వారు ఈ వార్తలను వారి బంధువులు మరియు స్నేహితులకు పంపగా ఎటువంటి ప్రకటనలు లేకుండానే మణికరన్, బర్షిని, కాల్గా, కీర్ గంగ మరియు పురానా కాంగ్రా అనే ప్రాంతాల్లో అభ్యాసకులు నిర్వహించిన మెడికల్ క్యాంపులకు ఈ ప్రాంతాల చుట్టుపక్కల వారే కాకుండా ఇంకా ఎంతో దూరంగా ఉన్నటువంటి మనాలి, మండి, బుంతర్ మరియు కులు ప్రాంతాల నుండి కూడా అనేకమంది ఈ దివ్య ఔషధాలు కోసం వచ్చారు.
స్వామి దయతో అభ్యాసకులు 412 మంది రోగులకు చికిత్స చేశారు, మరియు అనేక అద్భుత నివారణ లీలలు కూడా చూశారు. తీవ్రమైన ఒంటి నొప్పులు (బోలు ఎముకల వ్యాధి) జ్వరము, కాలేయలోపం, రక్తహీనత వ్యాధులతో పాటు భర్త మరణం కారణంగా ఎంతో దుఃఖిస్తూ ఒక వృద్ధ మహిళ మంచం పట్టింది. ఆమెకు చికిత్స ప్రారంభించిన మూడు రోజుల తర్వాత 70% మెరుగయ్యి తన ఇంటి చుట్టూ స్వయంగా నడవ కలగడమే కాక జ్వరం కూడా తగ్గిపోవడంతో ఆమె ఎంతో ఆనందంగా ఉంది. ఆమె కుటుంబ సభ్యులు అంతా ఎంతో సంతోషంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రతీరోజు అధిక భారాన్ని మోసే అనేకమంది పోర్టర్లు వారి శరీర నొప్పులు ఒక్క రాత్రిలోనే మాయమయ్యే సరికి తమ కృతజ్ఞతలు తెలియజేశారు. అభ్యాసకులు స్వామి యొక్క అపారమైన ప్రేమ మరియు కరుణకు విస్మయమవుతూ తమకు ఈఅద్భుతమైన అవకాశం కల్పించినందుకు స్వామి దివ్య లీలలకు సాక్ష్యంగా నిలిచినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
మేము ఈ సెప్టెంబరులో ఇటలీలోని వెనిస్ లో సీనియర్ VP ల కోసం వర్క్ షాప్ నిర్వహించాము. తొమ్మిది మంది అభ్యర్థులతో కూడిన ఈ చక్కని బృందము కష్టపడి పనిచేసారు. వర్క్ షాప్ కు రావడానికి ముందుగానే SVP కోర్సు మొత్తం క్షుణ్ణంగా చదివారు. వీరి యొక్క అంకితభావం వలననే ఈ శిక్షణా శిబిరం మూడు రోజుల్లోనే పూర్తి చేయడం సాధ్యమైంది. అభ్యర్థులంతా వారికోసం పెట్టినటువంటి పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. అనంతరం సాయిరాం పోటెన్ టైజర్ తీసుకున్నారు. ఈ వర్క్ షాప్ కోసం అన్ని ఏర్పాట్లు చేసిన మా ఇటాలియన్ కోఆర్డినేటర్ 2494 కు ఈ ఘనత దక్కుతుంది. ఇటలీలో వీరు అభ్యర్థుల కోసం క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న సమావేశాలు అభ్యాసకులు తమ జ్ఞానాన్ని అనుభవాలను పరస్పరం పంచుకునేందుకు తమ అభిరుచిని సజీవంగా ఉంచుకునేందుకు ఇవి ఎంతో దోహద పడుతున్నాయి!
అటువంటి సమావేశాలను, పునశ్చరణ తరగతులను ఇతర ప్రాంతాల్లో కూడా నిర్వహించాలని, కోఆర్డినేటర్లు మరియు క్రియాశీల అభ్యాసకులను గట్టిగా కోరుతున్నాను. ఇవి అభ్యాసకులకు మరింత ఉత్తేజాన్ని కలిగించి మనం ఎంచుకున్న సేవా మార్గాన్ని ఉత్సాహంతో ప్రేమతో చేయడం ద్వారా మన ప్రభువు బాబా వారికి దగ్గరవడానికి ప్రేరేపిస్తాయి.
ప్రేమ పూర్వక సాయి సేవలో మీ
జిత్ కె అగర్వాల్
మనందరికీ తెలిసిన విధంగా అనారోగ్యానికి చికిత్స చేయడంలోనూ, ఆరోగ్యాన్ని కలిగించడంలో ఆహారం యొక్క పాత్ర కీలకమైనది. నేను ఇటీవల 3 ఆసక్తికరమైన మరియు ఉపయోగకరమైన వెబ్సైట్లను చూశాను అవి:
1. http://www.acidalkalinediet.com/Alkaline-Foods-Chart.htm#.UC31BjICCdM.gmail
ఆమ్ల మరియు ఆల్కలీన్ ఆహారాల మధ్య తేడాను గుర్తించడానికి ఈ సైట్ ప్రత్యేకించి అద్భుతమైనది.
2. http://www.thefutureofhealthnow.com/defeating-ms-with-the-paleo-diet-drug-free లేదా
చైతన్యాన్ని, జ్ఞాపకశక్తి మరియు అభిజ్ఞ నైపుణ్యాలను కబళించిన మల్టిపుల్ స్కెలోరోసిస్ ను ఓడించిన వైద్యురాలి నమ్మశక్యం కాని వీడియో ఇది. జీవించడం లేక మరణించడం అనే దశలో తనపై తాను ప్రయోగాలు నిర్వహిస్తూ ఆహారాన్ని నాటకీయంగా మార్చడం ద్వారా ఆమె విజయం సాధించగలిగింది. ఈ వీడియో చూడటం ద్వారా ప్రతి ఒక్కరూ ప్రయోజనం పొందవచ్చు అని నేను నమ్ముతున్నాను ఇది నిజంగా జీవితాన్ని మార్చే కథ.
జ్ఞాపకశక్తి మరియు ఇతర మానసిక సామర్థ్యాలు వయసు పెరిగే కొద్దీ అనివార్యంగా తగ్గుతాయని శాస్త్రవేత్తలు నమ్ముతారు. ఇక దీనిని నమ్మవలసిన అవసరం లేదు. మెదడుకు కొత్త న్యూరాన్లు ఏర్పరచు కోవడానికి మరియు జీవితమంతా కొత్త న్యూరోమార్గాలను సృష్టించగల సామర్థ్యం ఉందని ఇప్పుడు మనకు తెలుస్తోంది. ఈ వ్యాసంలో అమెరికాలోని హార్వర్డ్ మెడికల్ స్కూల్ కు చెందిన మెదడు మరియు జ్ఞాపకశక్తి నిపుణురాలు మెదడును ఆరోగ్యంగా ఉంచడానికి ఆమె ఏం చేస్తున్నారు అనే సమాచారం అందించబడింది. ఆసక్తికరమైన ఇటువంటి విషయాలను మీరంతా చదవడం ప్రయోజనకరం.
తుంటి మరియు కాలికి గాయం 11272...India
96 ఏళ్ళ వయసున్న ఒక వృద్ధ మహిళ కింద పడిపోవడం వల్ల తుంటి మరియు కుడి కాలు విరిగింది. వయసు అధికంగా ఉన్నప్పటికీ అలోపతి వైద్యులు ఆమెకు మత్తు ఇచ్చి ఆమెను తిరిగి సాధారణ స్థితికి మార్చడానికి నిర్ణయించారు. అభ్యాసకుడు రోగికి ఆపరేషన్ అనంతరం ఆమె త్వరగా కోలుకోవడానికి క్రింది రెమిడి ఇచ్చారు:
#1. CC20.6 Osteoporosis + CC20.7 Fractures…6TD
#2. CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic…TDS
45 రోజుల తర్వాత రోగి ఎవరి సహాయం లేకుండా మంచం పైన కూర్చోగలుగు తున్నారు. కొన్ని వారాల అనంతరం ఆమె మళ్ళీ శక్తివంతంగా అయ్యారు. ఈ రెమిడీలు తీసుకోవడంలో ఆమెకు కలిగిన మరొక ప్రయోజనం ఏమిటంటే ఆమె ఇప్పుడు అన్నీగుర్తుంచుకో గలుగుతున్నారు ఆమె జ్ఞాపకశక్తి ఎంతో మెరుగు పడింది! అభ్యాసకుడు తన అనుభవాన్ని ఇలా తెలియ జేస్తున్నారు ప్రతి రోగి లోను మీరు స్వామిని చూసినప్పుడు వారితో ప్రేమగా సంభాషించ గలుగుతారు, మీ ప్రార్థనలను స్వామికి సమర్పించ కోగలుగుతారు మరియు మీసేవ అత్యంత అంకితభావంతో చేస్తే వైబ్రో నివారణలు అద్భుతాలు చేయగలవు!
సాయిరాం మిషనును ఉపయోగించినట్లయితే క్రింది కార్డులు ఉపయోగించండి:
#1. NM3 Bone I + NM20 Injury + NM25 Shock + NM32 Vein-Piles + NM67 Calcium + OM18 Sacral & Lumbar + OM27 Supportive Tissue + OM30 Connective Tissue + BR21 Injury + BR23 Skeletal + SM28 Injury + SM36 Skeletal + SR457 Bone + SR573 Osteoporosis…6TD
#2. NM4 Brain 2 + NM5 Brain Tissue Salts + NM6 Calming + NM12 Combination 12 + NM63 Back-up + NM69 CB8 + BR2 Blood Sugar + BR4 Fear + SM5 Peace & Love Align. + SM41 Uplift + SR325 Rescue + SR434 Larch + SR437 Oak + SR438 Olive + SR546 Baryta Carb (30C)...TDS
అధిక రక్త పోటు 02799...UK
48 ఏళ్ల వ్యక్తి వైబ్రియానిక్స్ అభ్యాసకుడిని చూడటానికి వచ్చారు, ఎందుకంటే అతను గత 15 సంవత్సరాలుగా అధిక రక్తపోటుతో (160/100 ఉంటుంది) బాధపడుతున్నారు. అతను అల్లోపతి మందులు తీసుకుంటున్నా ఏమాత్రం ప్రయోజనం కలగలేదు. అతనికి క్రింది రెమిడీ ఇచ్చి రెండు వారాల తర్వాత ఎలా ఉందో చెప్పమని సూచించడం జరిగింది:
CC3.1 Heart tonic + CC3.3 High Blood Pressure + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC18.1 Brain disabilities…TDS
పక్షం రోజుల తర్వాత అతని బిపి 140/ 80 కి చేరిందని మరొక రెండు వారాల తర్వాత తన బిపి 125/70 స్థాయికి చేరిందని తెలిపారు. అతని డాక్టరు అలోపతి మందును తదనుగుణంగా తగ్గించారు. అభ్యాసకుడు రెమిడి మరొక 6 నెలలు అదే మోతాదులో అలాగే కొనసాగించమని తర్వాత క్రమంగా OD కి తగ్గించమని సూచించారు.
ఈ రోగికి కేవలం హైబీపీ కోసం ఎందుకు ఇన్ని కాంబోలు ఇచ్చారు అని మీరు ఆశ్చర్యపోవచ్చు. అనుభవజ్ఞులైన ఈ అభ్యాసకురాలు అధిక బీపీ వల్ల అనేక సంవత్సరాలుగా అల్లోపతి మందులు వాడుతూ ఉన్నందువల్ల రోగికి ఇతర సమస్యలు కూడా ఏర్పడి ఉండవచ్చని భావించి మానసిక ఒత్తిడి మరియు నాడీ వ్యవస్థ లోని బలహీనతల కోసం రెమిడీలను ఆమె తన చికిత్సా మిశ్రమంలో చేర్చారు.
సాయిరాం మిషనును ఉపయోగించినట్లయితే క్రింది కార్డులు ఉపయోగించండి:
NM2 Blood + NM6 Calming + NM12 Combination 12 + NM25 Shock + NM37 Acidity + NM57 Heart Palpitations + NM64 Bad Temper + NM69 CB8 + NM95 Rescue Plus + OM1 Blood + OM7 Heart + BR2 Blood Sugar + BR7 Stress + SM4 Stabilising + SM5 Peace & Love Align. + SM11 Blood Pressure + SM15 Circulation + SM39 Tension + SM41 Uplift + SR302 Nux Vom + SR433 Impatiens + SR461 Brain (Medulla) + SR462 Brain (Pons) + SR523 Pituitary Posterior + SR531 Suprarenal/Adrenal Gland + SR535 Thymus Gland.
గృహంలో వాడిన మొక్క పునరుజ్జీవనం 10275...India
ఈ అభ్యాసకుడు తన ఇంటిలో పెంచుకునే బ్రహ్మకమలం మొక్కకు ఫంగల్ ఇన్ఫెక్షన్ కోసం చికిత్స చేసారు. ఈ వ్యాధి వలన ఆకులపై తెల్లని మచ్చలు ఏర్పడ్డాయి. CC1.2 Plant tonic ను అరలీటరు నీటిలో వేసి రోజు మొక్కలపై పిచికారీ చేయడం జరిగింది. రెండు మూడు రోజుల్లో తెల్లని మచ్చలు తగ్గడం మొదలయ్యాయి కొత్త ఆకులు కనిపించాయి మరియు ఒక మొగ్గ వికసించింది.
పై మొక్క వలనే మరొక మొక్క కూడా దాని ఇంటి యజమాని ఇల్లు మారినప్పుడు ఆకులు వాడి పోగా దీనికి కూడా ఇదే చికిత్స (CC 1.2 Plant tonic) తో కేవలం ఒక డోసు మొక్కపై పిచికారీ చేయగానే అది కోలుకోవడం ప్రారంభించింది.
మీవద్ద 108CC బాక్సు లేకపోతే మీ మొక్కల పెరుగుదలకు వాటిని వ్యాధులనుండి కాపాడడానికి క్రింది కార్డులు ఉపయోగించండి:
మీ దగ్గర 108CC బాక్సు లేకపోతె మొక్కల పెరుగదలకు లేదా వాటి రోగ నివారణకై, సాయి రామ్ పోతెన్తైసిర్ ను వీటిని ఇవ్వడానికి ఉపయోగించండి:
NM2 Blood + NM3 Bone + NM12 Combination 12 + NM20 Injury + NM25 Shock + NM91 Paramedic Rescue + SM1 Removal of Entities + SM2 Divine Protection + SM4 Stabilising + SM5 Peace & Love Alignment + SM6 Stress + SM14 Chemical Poison + SM26 Immunity + SM41 Uplift + SR325 Rescue + SR329 Crab Apple + SR360 VIBGYOR + SR432 Hornbeam + SR566 Fungi-pathogenic.
దీనిని ఆల్కహాల్ తో డ్రాఫర్ బాటిల్ లో తయారు చేసి ఒక లీటర్ నీటికి 5 చుక్కలు వేసి బలహీనంగా మరియు తెగులు సోకిన మొక్కల పై చల్లాలి.
గ్లూకోమా 01176...Bosnia
76 సంవత్సరాల వయసుగల ఈ అధ్యాపకురాలు 2 సంవత్సరాల క్రితం ఆమె కళ్ళు తనిఖీ చేయించుకోవడానికి వెళ్లారు. ఎందుకంటే ఆమె అద్దాలు ఆమె దృష్టికి అంతగా సహాయం చేయడం లేదు ఆమె కళ్లను పరీక్షించిన తర్వాత కంటి డాక్టర్, ఆమె తండ్రి లాగానే, ఆమెకు రెండు కళ్ళల్లో ఒత్తిడి వలన గ్లూకోమా సుమారు 32mmHg ఉందని తెలిపారు. ఆమె కుడి కంటికి ఏ అద్దాలు పనిచేయవని ఎందుకంటే అది ‘లేజీఐ’ గా మారిపోయిందని చెప్పారు. డాక్టర్ మరొక హెచ్చరిక కూడా చేశారు. వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఆమె తండ్రికి అదే పరిస్థితి ఉంది కనుక ఆమె చివరకు పూర్తిగా అందురాలై పోయే అవకాశం ఉందని తెలిపారు. కంటి ఒత్తిడిని తగ్గించడానికి ఆమెకు కంటిలో చుక్కలు (Cosopt) ఇచ్చారు. రెండు నెలల తర్వాత పరీక్షించినప్పుడు 20mmHg కనిపించింది అయినప్పటికీ తర్వాత ఆమె ఆ చుక్కలను ఆపివేయవలసి వచ్చింది, ఎందుకంటే ఆ చుక్కల వలన ఆమెకు ఎలర్జీ ప్రతిచర్యలు అభివృద్ధి అవడమేకాక ఆమె నాలుకపైన వాపు వచ్చింది. అప్పుడు కొత్త చుక్కలు (Xalatan) ఇవ్వబడ్డాయి కానీ వీటి వలన ఆమె కళ్ళలో మంట ఏర్పడడంతో ఆమె వాటిని కూడా ఆపివేసింది. అభ్యాసకుడు క్రింది రెమిడీతో తనను తానే చికిత్స చేసుకోవాలని నిర్ణయించుకున్నారు:
NM17 Eye + NM48 Vitamin Eye Compound + NM109 Vision + BR20 Eye + SR454 Aqueous Humour + SR465 CN2: Optic…TDS
ఆమె కొంతకాలం తర్వాత 108 CC బాక్సు సంపాదించుకోగలిగారు. అప్పుడు ఆమె క్రింది రెమిడీ కూడా తీసుకున్నారు:
CC7.1 Eye tonic + CC7.4 Eye defect + CC7.5 Glaucoma…TDS
వైబ్రియానిక్స్ నివారణ ప్రారంభమైన నాటి నుండి ఆమె కంటి దృష్టి క్రమంగా 25 శాతం మెరుగుపడింది. మరియు కంటి పీడనం సంతృప్తి కరంగా అనగా 15 మరియు 20mmHg మధ్య ఉంటోంది. పైన పేర్కొన్న అన్ని రెమిడీలతో ఆమె చికిత్సకొనసాగిస్తూ ఉన్నారు.
అలోపేసియా (బట్టతల మచ్చలు) 02640...India
ఒక మహిళ తల వెనుక భాగంలో రెండు మచ్చలు సుడుల వలె ఏర్పడి జుట్టు ఉడిపోవడంతో చికిత్సకోసం అభ్యాసకుని వద్దకు వచ్చారు. ఒక మచ్చ ఒక అంగుళం వ్యాసం మరొకటి ½ అంగుళం వ్యాసం కలిగి ఉన్నాయి. ఈ రెండు దగ్గర దగ్గరగా ఉన్నాయి. ఆమె గత రెండు సంవత్సరాలుగా వీటితో బాధపడుతున్నది. ఆమెకు క్రింది రెమిడీ ఇవ్వబడింది:
NM84 Hair Tonic + NM90 Nutrition + OM12 Hair + SM41 Uplift + SR272 Arsen Alb + SR306 Phosphorus + SR318 Thuja + SR319 Thyroid Gland…TDS
నాలుగు నెలల్లో రెండు బట్టతల మచ్చలు మందపాటి జుట్టు తో కప్పబడి పోయాయి
సంపాదకుని వ్యాఖ్యానం:
మీ దగ్గర 108CC బాక్సు ఉంటే CC11.2 Hair problems ఇవ్వండి.
డిప్రెషన్/ కృంగుబాటు 02365...Belgium
34 ఏళ్ల మహిళ తనకు జ్ఞాపకం ఉన్న నాటినుండి నిరాశతోనే జీవిస్తున్నది. ఆమె భర్త నుండి విడాకులు తీసుకుంది. ఈ పరిస్థితి కారణంగా తన ఇద్దరు పిల్లలను ఇతరుల సంరక్షణలో ఉంచింది. ఆమె చాలా భయంగా, ఉన్మాదంతో, విచారంగా స్థిరమైన తలనొప్పితో తల పైభాగమున అసౌకర్యంగా ఉన్న అనుభూతితో ఉంటున్నది. ఆమెకు ఆకలి లేదు, శక్తి కూడా లేనట్టుగా అనిపిస్తూ ఉంటుంది. డాక్టర్లు భౌతికంగా ఆమెకు ఏ సమస్యలు లేవని నిర్ధారించారు. ఆమెకు క్రింది వైబ్రియానిక్స్ రెమిడీలు ఇవ్వబడ్డాయి:
#1. NM6 Calming + NM12 Combination 12 + BR2 Blood Sugar + BR3 Depression + BR4 Fear + SM2 Divine Protection + SM6 Stress + SM9 Lack of Confidence + SM39 Tension + SR360 VIBGYOR + SR561 Vitamin Balance…TDS.
#2. SR383 Cuprum Met made in olive oil to massage feet…OD.
ఒక వారంలో గణనీయమైన మెరుగుదల ఏర్పడింది. ఆమె చాలా సంతోషంగా ఉంది. మరొక నెల వ్యవధిలో ఆమె ఎంతో ఆనందంగా ఏమాత్రం డిప్రెషన్ లేనట్లుగా కనిపించింది. ఆమె రెమిడీ మరొక రెండు వారాల పాటు కొనసాగింది. అభ్యాసకుడు ఆమెను తదుపరి సందర్శించి నప్పుడు ఆమె పూర్తిగా కోలుకుంది.
సంపాదకుని వ్యాఖ్యానం:
మీ దగ్గర 108CC బాక్సు ఉంటే CC15.1 ఇవ్వండి.
ప్రశ్న జవాబులు
1. ప్రశ్న: రెమిడీలను తయారు చేసేటప్పుడు మరియు 108 CC బాక్స్ లో ఆల్కహాల్ తో డ్రాపర్ బాటిళ్లను రీఫిల్ చేసేటప్పుడు షేక్ చేయడం గురించి నాకు అయోమయంగా ఉంది. దయచేసి స్పష్టం చేయండి.
జవాబు: చాలామంది అభ్యాసకులు కూడా ఈ విధానం గురించి అయోమయంలో ఉన్నారు. మునుపటి వార్తాలేఖలలో మేము ఈ సమస్యను పరిష్కరించి నప్పుడు ఇది చాలా ముఖ్యమైనది అని మేము గ్రహించాము. కాబట్టి గతంలో వ్రాసిన అన్ని విషయాలను సమీక్షించడానికి మేము ఈ అవకాశాన్ని తీసుకుంటున్నాము. ప్రస్తుత పరిశోధనల ఆధారంగా, రెమిడీ తయారీ సమయంలో షేకింగుకు సరైన విధానం క్రింద వివరించాము.
- ఛార్జ్ చేసిన ఆల్కహాలును మాత్రలకు జోడించే సమయంలో భూమికి సమాంతరంగా 8 ఆకారంలో బాటిల్ ను 9 సార్లు కదిలించాలి.
- మాత్రల నుండి నీటికి కంపనాలు బదిలీ చేసేటప్పుడు గరిష్ఠంగా ఒక లీటర్ (1000 ml) నీటికి 5 మాత్రలు వేసి మాత్రలు కరిగి పోయేవరకు లోహ రహిత చంచాతో కలపాలి.
- ఆల్కహాల్ నుండి నీటికి కంపనాలను బదిలీ చేయడానికి 200 మిల్లీలీటర్ల నీటిలో 1-2 చుక్కల ఆల్కహాల్ మాత్రమే అవసరం దీనిని తొమ్మిదిసార్లు కదిలించండి.
- నీటిలో పెద్ద మొత్తంలో నివారణ చేయడానికి 100 మిల్లీలీటర్ల (3½ ఔన్సులు) చార్జి చేసిన నీటిని గరిష్టంగా 20 లీటర్లు (5 గ్యాలన్ల) నీటిలో వేసి తొమ్మిది సార్లు కదిలించాలి.
- 108 CC బాక్సులో ఏదైనా డ్రాపర్ బాటిల్ లోని ద్రవం బాగా తక్కువగా ఉన్నప్పుడు డ్రాపర్ బాటిల్ను 2/3 ఆల్కహాల్ తో నింపి మీ అరచేతికి వ్యతిరేకంగా తొమ్మిది సార్లు నొక్కడం ద్వారా బాగా కదిలించండి.
-
రెమిడీని క్రీము/జెల్/లేదా నూనెలో తయారు చేసేటప్పుడు మీరు 50 మిల్లీ లీటర్ల క్రీం మొదలైన వాటికి కొన్ని చుక్కల చార్జ్ చేసిన ఆల్కహాల్ ను జోడించాలి మరియు లోహ రహిత చంచా లేదా కాడ వంటి దానితో బాగా కలపాలి.
_____________________________________
2. ప్రశ్న: గోలీలు కన్నా నీటిలో కలిపిన కంపనాలు ప్రభావవంతంగా ఉంటాయి అనేది నిజమేనా?
జవాబు: అవును సంవత్సరాలుగా మేము అనేక మంది అభ్యర్థులు నుండి నివేదికలు అందుకున్నాము (ఇది మా వ్యక్తిగత అనుభవం కూడా). వైబ్రియానిక్స్ రెమిడీలు నీటిలో చాలా వేగంగా పనిచేస్తాయి. మా విశ్వాసానికి కారణం ఏమిటంటే a. మనకు తెలిసిన అన్ని పదార్ధాలలో కెల్లా నీటికి జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంటుంది. b. శరీరం దాదాపు 70 శాతం నీటిని కలిగి ఉన్నందున నీటి నుండి వేగంగా మరియు విస్తృతంగా వైబ్రేషన్లు అంతటా వ్యాపిస్తాయి. కనుక వారికి సౌకర్యవంతంగా ఉన్నప్పుడు 200 మిల్లీలీటర్ల (7 ఔన్సులు) నీటిలో 5 గోళీలు కరిగించుకొని 5 ml లేదా ఒక టేబుల్ స్పూన్ ద్రావణాన్ని తీసుకొమ్మని మీ రోగులకు సలహా ఇవ్వడం మంచిది.
మీరు ఒక గాజు గ్లాసు లేదా ప్లాస్టిక్ (లోహం కాకుండా) మాత్రమే మీ పేషంట్లు ఉపయోగించేటట్లు మరియు మొబైల్, కంప్యూటర్లు, ప్రత్యక్ష సూర్యకాంతి మొదలైన వాటినుంచి దూరంగా ఉంచడం వంటి సాధారణ జాగ్రత్తలు తీసుకొమ్మని కూడా చెప్పాలి. మీ సొంత కుటుంబ ఉపయోగం కోసం మీ నివారణను ఎల్లప్పుడూ నీటిలో చేయడానికి ప్రయత్నించండి. ఈనీటిని కొద్ది రోజులు ఉపయోగించవచ్చు. దీన్ని ప్రయత్నించండి, వీటి ఫలితాలు చూసి మీరు ఆశ్చర్యపోతారు.
_____________________________________
3. ప్రశ్న: గర్భిణీ స్త్రీకి తన గర్భంతో సంబంధం లేని వ్యాధుల కోసం నేను సురక్షితంగా చికిత్స చేయవచ్చా?
జవాబు: మీరు 108 CC బాక్సు నుండి ఏదైనా కోంబో లేదా సాయిరాం పోటెమ్టైజర్ తో తయారుచేసిన నివారణను ఇవ్వవచ్చు. (అదనంగా కాబోయే తల్లులకు వారికి సహాయ పడటానికి ఒక ప్రామాణిక నివారణ ఇవ్వండి. ఉదాహరణ గర్భధారణ టానిక్) సాధారణ చెకప్ అనగా గర్భధారణకు ముందు గాని వెనుక గానీ చెకప్ కోసం రోగికి ఆమె వైద్యురాలితో సంప్రదిస్తూ ఉండాలని, సలహా ఇవ్వడం గుర్తుంచుకోండి.
_____________________________________
4. ప్రశ్న: పేషెంటుకు రెమిడీ సూచించే సమయంలో వైద్యుడి శారీరక మరియు మానసిక ఆరోగ్యం ఎంతో ముఖ్యమైనది. నేను జ్వరము, జలుబు, లేదా మైగ్రేన్ తో ఉన్నప్పుడు రెమిడీలను సూచించవచ్చా? అలాగే ఒత్తిడికి గురైనప్పుడు, విచారంగా ఉన్నప్పుడు సూచించడం సమంజసమేనా?
జవాబు: ఒక అభ్యాసకుడు శారీరకంగా మరియు మానసికంగా ఆరోగ్యంగా ఉండటం మంచిదే. అవును మీకు బాగా లేనప్పుడు రెమిడీలు సూచించ వలసి వస్తే a. మీరు స్పష్టంగా ఆలోచించగలిగినప్పుడు b. వైద్యం ప్రారంభానికి ముందు మీరు స్వామికి మార్గదర్శకత్వం మరియు సహాయం కోరేందుకు స్పష్ట మైన మనసుతో ప్రార్ధించగలిగినప్పుడు మీరు రెమిడీలు ఇవ్వవచ్చు. ప్రేమ పూర్వక హృదయంతో అటువంటి సేవలో నిమగ్నమై ఉన్నప్పుడు అభ్యాసకుడు తనకున్న విచారము, బాధ (ఇవి తాత్కాలికమైనవే కావచ్చు) వంటి సమస్యలను అధిగమించి బాధపడుతున్న రోగులకు సహాయం చేయగలుగుతాడు.
దివ్య వైద్యుని దివ్యవాణి
“ప్రతీక్షణం దేవుని ధ్యానంలో గడపాలి. మరి అలా గడిపి నట్లయితే మన పని పూర్తిచేసుకోవడం ఎలా సాధ్యమవుతుంది? అని మీరు అనుకోవచ్చు. మీ పని మరియు దేవుని పని అని తేడాలను గుర్తించవద్దు. మీ పని కూడా దేవుని పనే ఎందుకంటే మీరు కూడా దేవుడే. ప్రార్థనా మందిరంలో మీరు చేసిందంతా దేవుని పనిఅనీ మరియు మందిరం వెలుపల చేసేది మీ పని అని అనుకోవడం పొరపాటు. మీరు అటువంటి వేరు భావాలు అనుసరించకూడదు. మీ హృదయం దేవుని యొక్క ఆలయం అని భావించి మీ దృష్టిని లోపలికి త్రిప్పండి. ఈ సత్యాన్ని గ్రహించి తదనుగుణంగా పని చేసేవాడే నిజమైన మానవుడు ”
-సత్య సాయి బాబా -దివ్యవాణి, గణేష్ చతుర్థి 2000
“ ప్రపంచవ్యాప్తంగా మనం చేసే సేవా సాధనలు ప్రాథమికంగా ఆధ్యాత్మిక క్రమశిక్షణ - మానసిక ప్రక్షాళన కోసమే! ఇట్టి వైఖరి లోపించి నప్పుడు మీరు సేవకు ఉపక్రమిస్తే అది నిష్ఫలం గానో, లేదా అహంకారము మరియు ఆడంబరము కోసం చేసినదిగా మారుతుంది. ఒక్క క్షణం ఆలోచించండి: మీరు దేవుని సేవ చేస్తున్నారా లేదా దేవుడు మీకు సేవ చేస్తున్నాడా?... మీరు ఆకలితో ఉన్న బిడ్డకు పాలు ఇచ్చినప్పుడు లేదా పేవ్మెంట్ మీద వణుకుతూ పడుకున్న సోదరునకు దుప్పటిని అందించినప్పుడు మీరు దేవుని బహుమతిని మరొక రూపంలో ఉన్న దేవుని చేతిలో బహుమతి పెడుతున్నారు. ”
-సత్య సాయి బాబా - సనాతన సారథి, డిసెంబర్ 1993
ప్రకటనలు
భవిష్యత్తులో నిర్వహించబోయే శిక్షణా శిబిరాలు
-
యుకె లండన్: JVP వర్క్ షాప్ 27-28 సెప్టెంబర్ 2012. సంప్రదించ వలసిన వారు పవలమ్ గుణపతి 020-8204 2114 లేదా ఈ మెయిల్: [email protected]
-
పోలండ్ రోక్లా: జూనియర్ VPల వర్క్ షాప్ మరియు AVP లకు పునశ్చరణ కోర్సు 6-7 ఏప్రిల్ 2013.
-
పోలండ్ (వేదిక ఇంకా నిర్ణయం కాలేదు): సీనియర్ VPల వర్క్ షాప్ 27- 29 సెప్టెంబర్ 2013 సంప్రదించ వలసిన వారు (పోలండ్ లోని వర్క్ షాప్ లన్నింటికి) డేరియజ్ హెబిజ్ at +48 606 879 339 లేదా ఈ మెయిల్ [email protected]
-
ఇండియా నాగపూర్ –మహారాష్ట్ర: JVP వర్క్ షాప్ 13-14 అక్టోబర్ 2012 సంప్రదించ వలసిన వారు అశోక్ ఘాటల్ 9637-899 113 లేదా ఈ మెయిల్ [email protected]
-
ఇండియా పంజాబ్: AVP వర్క్ షాప్ 1-2 December 2012. సంప్రదించ వలసిన వారు పుష్కర్ మెహతా 9958-995 234 లేదా ఈ మెయిల్: [email protected]
-
ఇండియా న్యూఢిల్లీ: AVP వర్క్ షాప్ 15-16 డిసెంబర్ 2012 మరియు SVP వర్క్ షాప్ 10-19 Dec 2012. సంప్రదించ వలసిన వారు వినోద్ నాగ్పాల్ 011-2613 2389 లేదా ఈ మెయిల్ : [email protected]
-
ఇండియా ముంబయి (ధర్మక్షేత్ర): AVP వర్క్ షాప్ 21-22 డిసెంబర్ 2012 మరియు పునశ్చరణ వర్క్ షాప్ 23 డిసెంబర్ సంప్రదించ వలసిన వారు సందీప్ కులకర్ణి 9869-998 069 లేదా ఈ మెయిల్: [email protected]
-
యునైటెడ్ స్టేట్స్ హార్ట్ ఫోర్డ్, కనెక్టికట్: JVP శిక్షణ 20-21 అక్టోబర్ సంప్రదించ వలసిన వారు సుశాన్ ఈ మెయిల్ [email protected]
శిక్షకులందరికీ విజ్ఞప్తి : మీరేదైనా వర్క్ షాప్ నిర్వహింపదలిస్తే వివరాలను: [email protected] కు పంపండి.
అదనంగా
ఆరోగ్య చిట్కాలు
మీరు మీ నిద్రను పాడు చేసుకుంటున్నారా?
మన నిత్యజీవితంలో మారథాన్ పరుగు పందెం వంటి హడావుడి మధ్య లేదా ముఖ్యమైన వారి తోటి ఘర్షణతో కూడిన వాతావరణంలో గడిపిన తరువాత 8 గంటల ఆనందకరమైన నిద్రను ఆస్వాదించడం అసాధ్యమే అనిపించవచ్చు. కానీ మనం అటువంటి కఠినమైన సందర్భంలోనే నిద్రను తగ్గించడం వల్ల, ఒత్తిడిని అధిగమించడం మరింత కఠినమైపోతుంది. కనుక ఏది దొరికితే అది విసిరివేయడం, మనుషుల మీద గొంతు చించుకొని అరవడం ఆపండి. మీరు ఒత్తిడికి గురైనప్పుడు కూడా మంచి నిద్ర ఎలా పొందాలి అనే దానిపై ఇక్కడ ఉత్తమమైన చిట్కాలు ఇవ్వబడ్డాయి.
మీ నిద్రకు భంగం కలిగించే వాటిని అధిగమించడానికి--- మీ కార్యాచరణ ప్రణాళిక
బెడ్ మీద కూడా పని భారం పెట్టుకోవద్దు, బెడ్ షీట్లు మరియు తల దిండులను మీ పనికి తాత్కాలిక వాహకాలుగా మార్చడం వల్ల మీరు మీ మంచాన్ని ఒక విశ్రాంత ప్రదేశంగా చూడటం కష్టం అవుతుంది. నిద్రవేళకు ముందే ల్యాప్టాప్, ఫోన్, మరియు ఇతర సాంకేతిక పరికరాలను దూరంగా ఉంచండి. ఈ గాడ్జెట్ల నుండి వచ్చే కాంతి శరీరం యొక్క సహజ నిద్రాచక్రాన్ని గందరగోళానికి గురి చేస్తుంది
సహేతుకమైన వేళల్లో నిద్రపోండి. (దీనిని అలవాటుగా చేసుకోండి) ముఖ్యంగా మనం పనిలో పూర్తిగా మునిగి పోయినప్పుడు మనం చేస్తున్న ప్రాజెక్టుకు రాత్రంతా మేలుకుని చివరి దిద్దుబాట్లు చేయాలని దృష్టి పెడుతూ ఉంటాం. కానీ రాత్రంతా నిద్ర లేకుండా ఉండడం వల్ల మరుసటి రోజు పని మీద దృష్టి పెట్టడం చాలా కష్టమవుతుంది, మరియు సూర్యోదయం వరకూ నిలకడగా పనిమీద ధ్యాస ఉంచడం వల్ల అది అభ్యాస సామర్ధ్యాలపై ప్రభావం చూపడమే కాక ఆందోళన స్థాయిలను కూడా పెంచుతుంది (ఇప్పుడు ఇదే ఎక్కువమందిని ఒత్తిడికి గురి చేసే విషయ మయ్యింది). సాధారణ నిద్ర వేళకు కట్టుబడి ఉన్నట్లయితే ఉదయం ఈ విషయాలను చక్కగా పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది.
స్వల్ప విరామం తీసుకోండి. మీరు పనిని పూర్తిగా ఆపేసి ఎక్కడివక్కడ సర్దుకునే వరకూ దీర్ఘకాలం పని చేయడం కాకుండా మధ్య మధ్యలో కొంచెం విరామం ఇవ్వడం మంచిది. వెచ్చని నీటితో స్నానం లేదా ఆయుర్వేద మూలికలతో చేసిన టీని ఆస్వాదించండి. మిమ్మల్ని ఆందోళనకు గురిచేసే చింతలు మిమ్మల్ని వదలకుండా మీ నిద్రకు భంగం కలిగిస్తూ ఉంటే వాటిని ఒక పత్రికలో రాసిపెట్టుకోండి లేదా చక్కని ఆనందదాయకమైన సంగీతంతో విశ్రాంతి పొందండి.
ఒక పవర్ న్యాప్ (power nap మాగన్ను నిద్రను) తీసుకోండి. ఒత్తిడి అనే రాక్షసుడు మిమ్మల్ని రాత్రంతా విశ్రాంతి తీసుకోకుండా ఉంచినట్లయితే పగటిపూట మాగన్నుగా నిద్ర పోవడానికి ప్రయత్నించండి 10 నుండి 20 నిమిషాలు నిద్ర పోయినట్లయితే ఆ పగలంతా మీరు ఫ్రెష్ గా ఉండగలుగుతారు మరియు రాత్రి కూడా హాయిగా నిద్ర పోగలుగుతారు.
http://www.livestrong.com/blog/are-you-sabotaging-your-sleep#ixzz26kWO1Bzt
చర్మ క్యాన్సర్ అంటే ఏమిటి?
చర్మ క్యాన్సర్ అనే పదాన్ని చర్మాన్ని ప్రభావితం చేసే వివిధ క్యాన్సర్ పరిస్థితులను వివరించడానికి ఉపయోగిస్తారు. చర్మ క్యాన్సర్లలో రెండు ప్రధాన వర్గాలు ఉన్నాయి. మెలనోమా మరియు నాన్ మెలనోమా. నాన్ మెలనోమా క్యాన్సర్ కేసులు చర్మ క్యాన్సర్ యొక్క అత్యంత సాధారణము మరియు నయం చేయడానికి వీలుగా ఉండే రకాలు. మెలనోమా క్యాన్సర్, ప్రారంభంలోనే ఉన్నప్పుడు చికిత్స చేయగలిగిన ప్పటికీ ఇది బాగా ముదిరితే కేన్సర్లో ప్రాణాంతక రూపమని చెప్పవచ్చు.
నాన్ మెలనోమా క్యాన్సర్లలో కొన్ని రకాలు ఉన్నాయి. మెలనోమా క్యాన్సర్ తనలోనే అన్నీ ఉన్న వర్గంలో ఉంది.
నాన్ మెలనోమా చర్మ క్యాన్సర్ - బ్యాసల్ సెల్ కార్సినోమా
బ్యాసల్ సెల్ కార్సినోమా బాహ్యచర్మం యొక్క అత్యల్ప పొర ఎపిడెర్మిస్ లో ప్రారంభ మవుతుంది. ఇది నాలుగు చర్మ క్యాన్సర్ కేసులలో మూడింటికి బాధ్యత వహిస్తుంది. సాధారణంగా సూర్యరశ్మి ఎక్కువగా గురయ్యే ముఖం వంటి ప్రాంతాలను ప్రభావితం చేస్తుంది. సర్వసాధారణమైన రూపాలు - చిన్నవి దృఢమైన పాలిపోయిన రంగుతో గడ్డలు లేదా అటువంటివే గులాబీ లేదా ఎరుపు రంగులో ఉన్న ఉబ్బెత్తు ప్రాంతంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ క్యాన్సర్లు నెమ్మదిగా వ్యాప్తి చెందుతాయి మరియు చికిత్సకు బాగా స్పందిస్తాయి.
పొలుసుల కణ క్యాన్సర్
ఈ క్యాన్సరు కూడా ఎపిడెర్మిస్ పొరలోనే పైపొరపై ప్రారంభం అవుతుంది. ఇవి ఎర్రటి మరియు కఠినమైన ఉపరితల ముద్దలుగా కనిపిస్తాయి మరియు శరీరముపై బ్యాసల్ సెల్ క్యాన్సర్ల మాదిరిగానే అదే ప్రాంతంలో ప్రారంభమవుతాయి.
ఈ రెండు చర్మ క్యాన్సర్ల మధ్య పెద్ద వ్యత్యాసం ఏమిటంటే పొలుసులు కణాలు వ్యాప్తి చెందే అవకాశం ఉంది కనుక ఇది మొత్తం ఆరోగ్యానికి పెద్ద ముప్పుగా మారే అవకాశం ఉంది.
పుట్టకురుపు (మెలనోమా)
మెలనోమా కూడా సూర్యరశ్మికి సంబంధించినదే అయితే వీపు భాగము మరియు కాళ్ళ దిగువ వంటి ఈ ప్రాంతాల్లో అధికంగా సూర్య రశ్మికి గురికావడం వల్ల ఇవి ఏర్పడుతూ ఉంటాయి. మరియు పొలుసుల కణ క్యాన్సర్ కంటే ఇది చాలా తక్కువ సాధారణమే కానీ ఇది చాలా తీవ్రమైనది మరియు ప్రమాదకరమైనది, ఎందుకంటే శరీరంలోని ఇతర అవయవాలకు వ్యాపించే అవకాశం ఉంది మరియు వాస్తవానికి మరణానికి కూడా దారి తీస్తుంది.
మెలనోమా చర్మమునకు రంగును ఇచ్చే కణాలు మెలనోసైట్స్ లో మొదలవుతుంది. ఈ కణాలు వేసవిలో గరుకుగా లేదా పెళుసుగా ఉండేలా చర్మాన్ని చేస్తాయి. ఐతే ఇలా అప్పుడప్పుడు ఉంటుంది కానీ ఎల్లప్పుడూ మాత్రం ఉండదు. ఇది క్యాన్సర్ కణాలను గోధుమ లేదా నలుపు రంగులోకి మారుస్తాయి ఇలా చేయడం మంచిదే ఎందుకంటే వ్యాధి ముదిరిపోక ముందే ఈ క్యాన్సర్ ను గుర్తించవచ్చు.
చర్మ క్యాన్సర్ ను నివారించడం
సూర్యరశ్మి వలన చర్మానికి హాని కలగటమే దీనికి ప్రధాన కారణం ఇందులో ప్రమాదకరమైన అతినీలలోహిత కాంతి లేదా అల్ట్రావయొలెట్ కిరణాలు ఉంటాయి. ఈ కిరణాల నుండి మిమ్మల్ని మరియు పిల్లలను రక్షించడానికి ఇక్కడ కొన్ని మార్గాలు ఉన్నాయి
- ఎక్కువ సమయం సూర్యరశ్మికి గురికాకుండా ఉండండి. ముఖ్యంగా ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 వరకూ. గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే అల్ట్రా వైలెట్ కిరణాలు మామూలు సూర్యకాంతిలో ఎంత ప్రభావం కలిగిస్తాయో అంతే తీవ్రత ఆకాశం మబ్బుగా ఉన్నప్పుడు కూడా కలిగిస్తాయి.
- ప్రతిరోజూ సన్ స్క్రీన్ వాడండి. 15 లేదా అంతకంటే ఎక్కువ SPF తో బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్ ఉపయోగించండి. నునుపుగా ఉన్న చర్మం (ఫెయిర్ స్కిన్) ఉన్నవారు SPF-30 లేదా అంతకంటే ఎక్కువ ఉండే సన్ స్క్రీన్ వాడాలి. బయటకు వెళ్లడానికి 20 నుండి 30 నిమిషాల ముందు సన్ స్క్రీన్ రాసుకోమని వెళ్ళండి, మరియు ప్రతీ రెండు గంటలకు తిరిగి సన్ స్క్రీన్ రాసుకుంటూ ఉండండి.
- రక్షణ దుస్తులను ధరించండి. వాటితో పాటు విస్తృత అంచుగల టోపీలు, సన్ గ్లాసులు, మరియు గట్టి నేత బట్టతో చేసిన దుస్తులు ధరించండి అలాగే ముదురు రంగులు మరింత రక్షణ ఇస్తాయి.
- మీ చర్మాన్ని గురించి తెలుసుకోండి. ఏవైనా కొత్తగా మార్పులు చోటుచేసుకుంటున్నట్లైతే ముఖ్యంగా పుట్టుమచ్చలు మరియు ఇతర మచ్చలు విషయంలో మీ చర్మాన్ని తనిఖీ చేయించండి. చర్మానికి సంబంధించి మీరు తెలుసుకోవాల్సిన నిర్దిష్టమైన విషయాలు ఉన్నాయి. వీటిని ABCDE ఉపయోగించి సులభంగా గుర్తించవచ్చు.
ఏమిటీ ABCDE లు ?
చర్మంలో మార్పులు చోటుచేసుకున్నప్పుడు మనం ఏమి గమనించాలి గుర్తుంచుకోవడానికి ఇది ఒక సాధారణ మార్గము.
- అసిమెట్రీ అనగా క్రమానుగత లేమిని సూచిస్తుంది. మీ మచ్చ లేదా మోల్ అసమానంగా కనిపిస్తున్నదా?
- బోర్డర్ ఇర్రెగ్యులరిటీ లేదా సరిహద్దు అవకతవకలకు సూచిస్తుంది అంచులు సక్రమంగా లేవా?
- కలర్ ఇది రంగు యొక్క వైవిధ్యాన్ని సూచిస్తుంది. మీరు గాయం లోపల బహుళ రంగులను చూస్తున్నారా?
- డయామీటర్ అనగా వ్యాసాన్ని సూచిస్తుంది. ఇది ఆరు మిల్లీమీటర్ల కంటే వెడల్పుగా ఉందా ఐతే కొంచం ఆలోచించాలి.
- ఎవల్యూషన్ లేదా పరిణామాక్రమాన్ని సూచిస్తుంది. రంగు, పరిమాణం, లేదా లక్షణాలు మారాయా అనేది గమనించాలి.
చర్మ క్యాన్సరుకు చికిత్స
ఒక శుభవార్త ఏమిటంటే చర్మ క్యాన్సర్ ముందుగానే గుర్తించి నప్పుడు చక్కగా నయం చేసుకోవచ్చు (మెలనోమాతో సహా).
పైన వివరించిన విధంగా చర్మంలో ఏవైనా మార్పులు కనిపిస్తే మీరు మీ వైద్యుని సంప్రదించాలి. అతను లేదా ఆమె చర్మ క్యాన్సర్ నిర్ధారించడానికి బయాప్సీ చేయించుకోవాలి.
చర్మ కేన్సర్ చికిత్సలో స్వల్పమైన లేదా విస్తృతమైనది శస్త్రచికిత్స, లేదా రేడియేషన్ లేదా ఖిమో థెరపీ ఉండవచ్చు. ఇది చర్మ క్యాన్సర్ యొక్క రకము మరియు విస్తృతి పై ఆధారపడి ఉంటుంది.
ఇప్పటికే చికిత్స చేసినప్పటికీ కొన్ని చర్మ క్యాన్సర్లు పునరావృతం అవుతాయి. కాబట్టి మీరు గతంలో చర్మ క్యాన్సర్ తో బాధపడుతున్నట్లైతే క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకొనడం ముఖ్యం.
మూలాలు: What You Need To Know About Skin Cancer. Rockville, MD.: National Cancer Institute: 2005. (Accessed October 17, 2009 at http://www.cancer.gov/cancertopics/types/skin.)
సాయి వైబ్రియానిక్స్ వార్తాలేఖల ద్వారా ప్రచురించే ఈ సమాచారము విద్యా సంబంధ మైన సమాచారమునకే తప్ప దీనిని వైద్య సలహాగా భావించరాదు. ప్రాక్టీషనర్లు పేషంట్లను సరియైన వైద్య సమాచారము కోసము మరియు ప్రత్యేక వైద్య సలహాల నిమిత్తము వారి డాక్టర్లను సంప్రదించమని చెప్పవలసిందిగా సూచన.