Vol 3 సంచిక 6
November/December 2012
ముద్రింప తగిన వార్తాలేఖ
పూర్తి వార్తాలేఖ యొక్క కాగితం ప్రతి కావలెనన్నఈ పుటను ముద్రించండి
డా.జిత్. కే అగ్గర్వాల్ యొక్క మాటల్లో
ప్రియమైన ప్రాక్టీషనర్లకు,
స్వామి యొక్క 87వ జన్మదిన వార్షికోత్సవం ఎంతో వైభవంగా ఆహ్లాదకంగా ముగిసిన అనంతరం ప్రశాంతి నిలయంలో ఒక ఆనందకరమైన వాతావరణము నెలకొంది. ఇది మన పుట్టపర్తి వైబ్రియోనిక్స్ నిపుణులకు కూడా ఎంతో బిజీగా ఉండే సమయమే కారణం ఏమిటంటే వరసగా ఈ నాల్గవ సంవత్సరము కూడా ఉచిత వైద్య శిబిరం ప్రశాంతి రైల్వే స్టేషన్ లో (ఫోటోలు చూడండి) ఏర్పాటు చేసి సేవ చేశారు. స్వామి యొక్క జన్మదిన వేడుకలు స్వామి జన్మస్థలంలో జరుపుకోవడానికి సుదూర ప్రాంతం నుండి అనేక గంటలు రైళ్లలో ప్రయాణం చేసి వచ్చిన వేయి మందికిపైగా రోగులకు వైద్యం అందించారు. ప్రతీ చిన్న విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవడం ద్వారా స్వామి యొక్క అదృశ్య ప్రేమపూర్వక అనుగ్రహం వ్యక్తమయ్యింది. అంత పెద్ద సమూహాన్ని ఊహించనందున ఒకానొక సమయంలో వెంట తెచ్చుకున్నమందు సీసాలు మొత్తం అయిపోయినాయి. కొన్ని నిమిషాల తరువాత, ఊహించని ఒక అభ్యాసకుడు వచ్చి కావలసినన్ని మందు సీసాలు ఇచ్చి వెళ్లారు. ఆ తరవాత వైద్య శిబిరం తన పూర్తి సామర్ధ్యం లో పనిచేయడం ప్రారంభించింది! ఈ సంవత్సరం క్యాంప్ లో ఇలాంటి అద్భుతాలు ఎన్నో జరిగాయి. ఒక సేవాదళ్ పాదం చాలా తీవ్రంగా కాలింది, ఇలా కాలినప్పుడు అది నయమవడానికి కనీసం వారం రోజులు పడుతుంది. మన అభ్యాసకులు గాయం కోసం రెమెడీ ని ఎక్స్ ట్రా విర్జిన్ ఆలివ్ ఆయిల్ లో తయారుచేసి గాయం మీద రాసి నోటిలో తీసుకోవడానికి ఒక బాటిల్ గోళిల సీసా కూడా ఇచ్చారు. ఒక గంటలోనే, సేవాదళ్ ఎప్పటిలాగానే నడిచారు ఎటువంటి నొప్పి లేదా గాయం ఆనవాలు లేదు! ఇది మన స్వామి యొక్క అపారమైన ప్రేమ కి నిదర్శనం!
ఈ సంవత్సరం అక్టోబర్ లో అమెరికాలో (ఫోటో చూడండి) హార్ట్ఫోర్డ్, కనెక్టికట్లో జేవీపీ అభ్యాసకులకు వర్క్ షాప్ నిర్వహించాము. అమెరికా మరియు దక్షిణ అమెరికాలోని కొలంబియా నుంచి వచ్చిన 21 భక్తులు ఆత్మ సెంటర్ వద్ద జరిగిన రెండు రోజుల వర్క్ షాప్ కు హాజరై విజయవంతంగా కోర్సు పూర్తి చేసారు. పూర్తి అర్హత పొందిన ఒక వైబ్రియో టీచర్ ను భవిష్యత్తులో వైబ్రియో సేవ చేయడానికి ఆసక్తి చూపే సాధకులకు శిక్షణ ఇచ్చుటకు నియమించామని మీకు తెలియచేయడానికి నేను ఎంతో సంతోషించుచున్నాను. మీరు ఆ టీచర్ ను [email protected] ద్వారా సంప్రదించవచ్చు.
స్వామి అనుగ్రహంతో, వైబ్రియోనిక్స్ సేవ విస్తరిస్తోంది మరియు స్వామికి సేవ చేద్దామనే నిబద్దత ఉన్నవారందరికీ కూడా అవకాశం ఉంది. మీరు మీ దేశం కోసం ఒక సమన్వయకర్త కావడానికి ఆసక్తి లేదా టీచర్స్ శిక్షణ కోర్సు కోసం దరఖాస్తు చెయ్యాలనుకుంటే, నాకు ఒక ఇమెయిల్ పంపండి.
నవంబర్ 24న, త్రిచూర్ జిల్లా, కేరళ, భారతదేశం కు చెందిన వైబ్రియోనిక్స్ అభ్యాసకులు ఒక శాశ్వత వైబ్రియోనిక్స్ స్వస్థత శిబిరం సమాజంలోని ఆనారోగ్యపాలైన దీనుల కోసం రోజూ సేవ చేయడానికి స్థాపించారు. ఇది అద్భుతమైన ముందడుగు మరియు గొప్ప సేవ ముఖ్యంగా ఇది ఆ గ్రామ ప్రజలకు అందునా డబ్బులేని పేద ప్రజలకు ఒక అద్భుతమైన అవకాశం. భారతదేశం యొక్క ఇతర రాష్ట్రాలు, వారి నుండి ప్రేరణ పొంది త్వరితంగా భారతదేశం లో ఇంకా ప్రపంచవ్యాప్తంగా అనేక కేంద్రాలు ఏర్పడాలని మేము ఆశిస్తున్నాము.
నవంబర్ 25న, భారతదేశం లో బెంగుళూర్ వద్ద క్యాన్సర్ ప్రత్యామ్నాయ చికిత్సలు గురించి కార్డ్ రోడ్ హాస్పిటల్లో ఒక సదస్సు నిర్వహించారు. ఆరుగురు నిపుణులు వివిధ రకాల క్యాన్సర్ శక్తివంతమైన చికిత్సలు గురించి సమాచారం ఇచ్చారు. ఆసుపత్రి నుండి వచ్చిన ముగ్గురు శస్త్ర చికిత్స నిపుణులు, శక్తి చాలన చికిత్సలు వలన లబ్ది పొందిన రోగుల అద్భుతమైన వ్యక్తిగత అనుభవాలను పంచుకున్నారు. వైబ్రియోనిక్స్ గురించి క్యాన్సర్ రోగులతో, వైద్యులతో మాట్లాడేందుకు నన్ను ఆహ్వానించడం గౌరవంగా ఉంది. నేను ఆరు వివిధ రకాల క్యాన్సర్ కేసులు వైబ్రియోనిక్స్ ద్వారా పూర్తిగా ఎలా నయమైనవో వివరించాను. స్వామి కృప వలన నా ఉపన్యాసాన్ని అందరు చక్కగా ఆదరించారు.
ఎప్పటికప్పుడు, అభ్యాసకులు, 2012 డిసెంబర్ 21గురించి స్వామి ఏమైనా చెప్పారా అని నన్ను అడుగుతుంటారు. బాబా దీని గురించి ప్రత్యేకంగా చెప్పినట్లు నా దగ్గర సమాచారం లేదు. కానీ, మనం మానవ చరిత్రలో ఒక ముఖ్యమైన అభివృద్ధి ప్రారంభ దశ వద్ద ఉన్నామని నిస్సందేహంగా చెప్పగలను. నిస్సందేహంగా, చెప్పబడుతున్న ప్రతిదీ మనందరికి ఒక మేలుకొలుపు నిస్తుంది. కొంతమంది ఒక అద్భుతమైన సంఘటన విశ్వంలో 21-23 డిసెంబర్ 2012, సమయంలో 8 నిమిషాలు పాటు జరుగుతుంది అని నమ్ముతున్నారు. ఈ 8 నిమిషాల పాటు అత్యంత అధిక పౌనఃపున్యం గల శక్తి ప్రవాహం ఈథర్ మీద ప్రసరించబడుతుంది. మనలో సూక్ష్మ శక్తులను గ్రహింపగల జ్జ్ణానులు గతంలో అనుభవించిన దేనికైనా మించి ఆకళింపు చేసుకోగల సంపూర్ణ అవగాహన ఉన్నవారు దీని గురించి తెలుసుకొనగలరు. మరింత సమాచారం త్వరలో మా వెబ్ సైట్ లో పోస్ట్ చేయబడుతుంది, కాబట్టి www.vibrionics.org కు లాగ్ ఆన్ అవడం మరిచిపోకండి.
సాయికి ప్రేమపూర్వక సేవలో
జిత్ అగర్వాల్
PN రైల్వే స్టేషన్, పుట్టపర్తి వద్ద మెడికల్ క్యాంప్ 21-23 నవంబర్ 2012
హార్ట్ఫోర్డ్ CT USA లో JVP శిక్షణ క్లాస్ 20-21 అక్టోబర్ 2012
విష పడిశము (ఇన్ఫ్లుఎంజా) టైప్ H1N1 - స్వైన్ ఫ్లూ 11205...India
54 ఏళ్ల మహిళ స్వైన్ ఫ్లూ వ్యాది ఉన్నట్లు నిర్దారణ చేయబడి ఆస్పత్రిలో చేరవలసినదిగా సూచించబడినది. ఆవిడ వైబ్రో మెడిసిన్ తనకు సహాయ పడుతుందేమో అనే ఆశతో వైబ్రియో అబ్యాసకుడిని సంప్రదించింది. ఆవిడకు క్రింది రేమేడిలు ఇవ్వబడినవి.
CC9.2 Infections acute + CC9.3 Tropical diseases + CC19.1 Chest tonic + CC19.2 Respiratory allergies + CC19.3 Chest infections chronic + CC19.6 cough chronic
ఆ రోజు సాయంత్రం మొదలు మరుసటి రోజు ఉదయం11 గంటలకు వైద్యుడును సంప్రదించే వరకు ప్రతి గంటకు ఒక డోసు తీసుకోవాల్సిందిగా ఆమెకు సూచించారు. మరుసటి రోజు వైద్యుడు ఆమెను పరీక్షించి 80% ఇన్ఫెక్షన్ తగ్గినట్లు, అందువలన ఆస్పత్రిలో చేరవలసిన అవసరంలేదని చెప్పారు. ఆవిడను అవుట్ పేషంట్ రోగిగా వైద్యం చేసి తక్కువ డోసు యాంటిబయోటిక్స్ ఇచ్చారు. ఆవిడ వైబ్రియో రెమిడీలను మరో రెండు వారాలపాటు తీసుకొన్నారు, మొదటి వారం TDS, రెండవ వారం BD. ఈ రెండు వారాలలో ఆవిడ పరిపూర్ణ స్వస్తత పొందారు.
సంపాదకుని వ్యాఖ్యానం: సాయి రామ్ పొటెన్ టైజర్ వాడే అబ్యాసకులు పై రెమిడీలకు బదులుగా ఇవి ఇవ్వవచ్చు: NM8 Chest + NM18 General Fever + NM30 Throat + NM31 Tonsils & Glands + NM63 Back-up + NM70 CB9 + NM79 Flu Pack + SM41 Uplift.
మస్తిష్క (సెరిబ్రల్) క్షీణత 02640...India
ఒక వైబ్రియో మొబైల్ వైద్య శిబిరానికి ఒక మహిళా తన 2½ సంవత్సరాల కుమారుడిని చేతిలో పట్టుకుని తీసుకువచ్చింది. ఎందువలనంటే అతను నడవలేడు, నిలబడలేడు మరియు అతని తల చాల పెద్దదిగా ఉండి, కనులు కూడా స్తిరంగా లేక చేతులను కూడా పైకేత్తలేక పోయేవాడు. చూడటానికి అ దృశ్యం చాల హృదయవిదారకంగా ఉంది. అందరి హృదయాలు అ బాలుడిని చూచి చలించిపోయాయి. అతనికి ఈ క్రింది రెమిడీలు ఇవ్వబడ్డాయి:
CC12.2 Child tonic + CC18.1 Brain disabilities + CC20.1 SMJ tonic + CC20.3 Arthritis + CC20.5 Spine...QDS మూడు నెలల పాటు.
మూడు నెలల తరువాత జరిగిన వైద్య శిబిరంలో, ఆ బాలుని తల్లి యొక్క ప్రక్కింటావిడ ఆ బాలునిలో చాల మంచి మార్పు కనపడిందని చెప్పింది. అతనిప్పుడు నిలబడగలడు, కూర్చోగలడు, చేతులను కొద్దిగా పైకెత్తగలడు మరియు అతని చూపు కూడా స్థిరంగా ఉండి చక్కగా నవ్వగలుగుతున్నాడు. ఈ అధ్బుతమైన వార్త విని అందరు చాలా సంతోషించారు. అందరు ఇతనిలోని మంచి మార్పు ఇలాగే కొనసాగాలని స్వామిని ప్రార్ధించారు మరియు పై రెమేడిలను కొనసాగించటానికి అతనికి వైబ్రియో గోలీలు ఎక్కువగా ఇవ్వబడ్డాయి.
సంపాదకుని వ్యాఖ్యానం: మీరు సాయి రామ్ పోటెమ్ టైజర్ ఉపయోగించేవారైతే పై రెమిడీలకు బదులుగా ఇవి ఇవ్వవచ్చు: NM4 Brain + NM5 Brain TS + NM25 Shock + NM90 Nutrition + OM20 Paralysis Flaccid + OM21 Paralysis Spastic + SM12 Brain & Paralysis + SR356 Plumbum Met + SR458 Brain Whole + SR459 Brain (Broca’s Area) + SR460 Brain (Cerebellum) + SR461 Brain (Medulla) + SR462 Brain (Pons) + SR463 Cranial Nerves + SR532 Sympathetic Nervous System + SR546 Baryta Carb.
వ్యాధికి గురైన సేబాషియస్ తిత్తులు 11389...India
ఈ ప్రాక్టీషనర్ కుమారుడు ఎల్లపుడు తలను గోక్కునేవాడు మరియు అతని తలంతా చాలా చుండ్రు వుంది. అతను తన తల వెంట్రుకలు క్షవరం చేసుకున్నాక తన యొక్క దురదకు, చికాకుకు మూల కారణం కనపడింది. అతని తలంతా బొబ్బలతో నిండి ఉంది. ఈ బొబ్బలు సేబాషెయెస్ గ్రంధుల ద్వారా స్రవించిన ద్రవ పదార్థముల ద్వారా ఏర్పడిన తైల తిత్తులు. ఈ తైల తిత్తులు బాగా వాచిపోయి సంక్రమణం (infection) చెంది, ఈ విధమైన బొబ్బలుగా ఏర్పడ్డాయి. వీటిని వైద్యం చేయక అలాగే వదిలేస్తే ఇవి గ్రంధుల స్రావాన్ని అడ్డుకొని చాలా అసౌకర్యాన్ని కలుగ చేస్తాయి. అతనికి క్రింది రేమేడిలు ఇవ్వబడ్డాయి:
CC14.1 Male tonic + CC15.1 Mental & Emotional tonic + CC21.3 Skin allergies + CC21.7 Fungus…సాయంత్రం 5 గంటల నుండి 11 గంటల వరకు 6 సార్లు మరియు మరుసటి రోజు ఉదయం 2 సార్లు
మరుసటి రోజు ఉదయం 11 గంటలకు, అతని తలను పరీక్షించగా చర్మంపై వాపు 95% తగ్గిపోయింది. ఈ బాలుడు 10 రోజుల పాటు ఇదే కాంబోను TDS గా కొనసాగించాడు. ఆ తరువాత, చిన్న చిన్న బొబ్బలు ఏర్పడ్డాయి కానీ వాపైతే రాలేదు. అందువలన మరో 10 రోజులు వాడటానికి, కాంబోను క్రింది విధంగా మార్చి ఇవ్వడం జరిగింది:
CC11.1 Hair tonic + CC11.2 Hair problems + CC14.1 Male tonic + CC15.1 Mental & Emotional tonic…TDS మరో 10 రోజుల పాటు.
అప్పుడు చుస్తే కొంత పొడి చుండ్రు ఇంకా ఉంది కానీ, ఇన్ఫెక్షన్ పూర్తిగా పోయింది. అతనికి చుండ్రును పోగొట్టడానికి మరియు నివారించటానికి యాంటీ డ్యాన్ డ్రఫ్ షాంపు తప్ప ఇంక ఏ విధమైన వైద్యం ఇవ్వలేదు.
సంపాదకుని వ్యాఖ్యానం:
మీరు సాయి రామ్ పోటెన్ టైజర్ ఉపయోగించేవారైతే ఇవి ఇవ్వవచ్చు: NM12 Combination-12 + NM36 War + NM72 Cleansing + NM84 Hair Tonic + NM113 Inflammation + BR17 Male + SR250 Psorinum + SR264 Silicea (30C) + SR280 Calc Carb + SR292 Graphites + SR294 Hepar Sulph (30C) + SR351 Kali Carb + SR546 Baryta Carb.
ఎక్కువ జ్వరముతో కూడిన తీవ్రమైన చెవినొప్పి 01150...Croatia
5 సంవత్సరాల బాలుడు 40 డిగ్రీల సెంటీగ్రేడ్ అధిక జ్వరంతో, తీవ్రమైన చెవిపోటు, తల మరియు గొంతునోప్పితో తీసుకురాబడ్డాడు. అతనికి తన వైద్యునిచే రెండు కోర్సుల యాంటిబయోటిక్స్ ఇవ్వబడినవి, కాని తన ఆరోగ్య స్థితిలో ఏ విధమైన మార్పు రాలేదు. వైద్యుడు రక్త పరీక్ష చేయించమని చెప్పారు. ఆ బాలునికి అప్పుడు రక్త పరీక్ష జరుపగా తెల్ల రక్త కణాలు 200 కంటే తక్కువ ఉన్నట్లు తెలిసింది. ఈ బాలుని వైద్యుడు ఇతని ఆరోగ్య పరిస్థితి చూసి కొంత ఆందోళన చెందారు, కానీ మరి కొన్నిఅల్లోపతి మందులు ఇవ్వడానికి వెనుకాడారు. అందువలన, అ వైద్యుడు బెల్లడోన అనే హోమియో రెమేడిను ఈ బాలునికి సిఫారసు చేసారు! మన అభ్యాసకుడు క్రింది వాటిని ఈ బాలునికి ఇచ్చారు:
#1. NM86 Immunity + OM1 Blood…TDS
#2. NM113 Inflammation…TDS
#3. NM114 Elimination…OD
ఒక్కరోజులోనే అతని శరీర ఉష్ణోగ్రత తగ్గింది మరియు వారం రోజులలో సాధారణ స్థితికి చేరుకొని ఈ బాలుడు చక్కగా తినడం, నిద్రపోవడం, ఆడుకోవడం జరిగింది. మరొక వారం తరువాత, రక్త పరీక్ష జరుపగా ఫలితం ఈ సారి నార్మల్గా ఉంది. #2 మరియు #3 కొనసాగిన్చబడుతున్నాయి మరియు NM114 chest tonic...TDS ను సంపూర్ణ ఆరోగ్యం కోసం కలపటం జరిగింది.
సంపాదకుని వ్యాఖ్యానం:
మీరు 108 CC బాక్సు ఉపయోగించేవారైతే CC9.4 Children’s diseases ను పైవాటికి బదులుగా అంతే ఫలితమును సాధించుటకు ఇవ్వవచ్చు.
సంతాన ప్రాప్తి లేకుండుట 02799...UK
36 ఏళ్ళ మహిళకు పెళ్లై 11 సంవత్సరములు కావస్తున్న తన యొక్క రోగ నిరోధక వ్యవస్థ మరియు క్రోమోసోమ్స్లో ఏర్పడ్డ సమస్య వలన గర్భం ధరించక భాదపడుతూ ఉంది. ఆవిడకు మూడుసార్లు IVF చికిత్స విధానం ఇవ్వడం జరిగింది కానీ అవేవి ఫలితం ఇవ్వలేదు. ఆవిడకు ఒక బిడ్డను దత్తత తీసుకోవాల్సిందిగా సలహా ఇవ్వబడింది, కాని ఆవిడకు తన యొక్క సంతానం కావాలనే కోరిక బలంగా, మనసంతా నిండి ఉంది. అభ్యాసకుడు క్రింది వాటిని ఆమెకు ఇచ్చారు:
NM7 CB7 + OM24 Female Genital + BR7 Stress + BR16 Female + SM6 Stress + SM39 Tension + SR255 Calc Sulph (200C) + SR262 Nat Phos 200C + SR537 Uterus + SR544 Aletris Far…TDS
మరియు108 బాక్సు నుంచి CC14.3 Male infertility...TDS ఆవిడ భర్తకు ఇచ్చారు.
పై రెమెడీ లను ఆవిడ 5 నెలలు తీసుకొగా 6వ నెలలో ఆవిడ గర్భం ధరించింది. ఆవిడ తను గర్భం ధరించిన రెండు నెలల తరువాత ఈ విషయం తన వైద్యుడికి తెలిపింది, ఎందు కంటే ఆమె తాను నిజంగా గర్భవత లేదా అని నిర్దారించుకొని ఆ బిడ్డ పూర్తీ ఆరోగ్యంతో ఉన్నట్లు నమ్మకం కలిగాకే వైద్యునికి చెప్పాలని భావించింది. ఆవిడ గర్భంధరించిన విషయం విన్న వైద్యుడు ఆశ్చర్యపోయారు! స్కానింగ్ పరీక్షలో కూడా బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు మరియు ఆమెకు సుఖ ప్రసవం జరిగే అవకాశం ఉన్నట్లు తెలిసాకే ఆ వైద్యునికి కూడా నమ్మకం ఏర్పడింది. ఎ రోజులోనైన ఆమెకు ప్రసవం జరిగే అవకాశం ఉన్నందున ఆమె మొత్తం కుటుంబం, స్నేహితులు, సుఖ ప్రసవం కోసం ఎదురుచూస్తున్నారు.
సంపాదకుని వ్యాఖ్యానం:
108CC బాక్సు ఉపయోగించేవారైతే:
స్త్రీ యొక్క ఇన్ఫెర్టిలిటీ కొరకు:
CC8.1 Female tonic.
సాయి రామ్ పోటెన్ టైజర్ ఉపయోగించేవారైతే:
పురుషుని యొక్క ఇన్ఫెర్టిలిటీ కొరకు:
OM22 Male Genital + SR216 Vitamin-E + SR254 Calc Phos (200C) + SR262 Nat Phos (200C) + SR522 Pituitary Anterior + SR534 Testes
గొంతు నొప్పి, దగ్గు మరియు సైనసిటిస్ 01176...Bosnia
75 ఏళ్ల మహిళ చాల రోజులుగా గొంతుమంట, కఫంతో కూడిన దగ్గు మరియు సైనసైటిస్తో భాదపడుతూ సహాయం కొరకు వచ్చింది. ఆవిడకు క్రిందివి ఇవ్వబడ్డాయి:
#1. NM36 War + NM70 CB9 + NM71 CCA + NM113 Inflammation…TDS
#2. SM26 Immunity + SM27 Infection + SM31 Lung & Chest + SM35 Sinus + SM40 Throat…TDS
ఒకవారం రోజుల తరువాత ఆవిడ ఆరోగ్యం 20 శాతం మెరుగైంది. అభ్యాసకుడు చాలా ప్రశ్నలు వేసాక, ఆవిడ తనకు 15 ఏళ్ల వయసులో స్కేబిస్ వ్యాధి సంక్రమించినట్లు తెలిపింది. అప్పటినుంచి ఆవిడ బ్రాంకైటిస్తో భాదపడుతూ ఉంది. 20 సంవత్సరాల తరువాత ఆవిడకు సైనస్ సమస్యవలన ఇబ్బందులు ఏర్పడ్డాయి. అంతే కాక కొన్నిసంవత్సరాలుగా అల్లోపతి వైద్యులు ఇచ్చిన చాలా రకాల యాంటిబయోటిక్స్ వలన చాలా ఎలర్జీ సంబంధిత సమస్యతో భాదపడ్డారు. ఆమె యొక్క దీర్ఘకాలిక సమస్యలను నయం చేయటానికి మరియు ఆవిడ అనారోగ్యం స్కేబిస్ వ్యాధితో మొదలైందని తెలుసుకున్న అబ్యాసకుడు ఆవిడకు ఒక సోరోనియుమ్ మియాస్మ్ కోర్సు,ఈ క్రింది విదంగా ఇవ్వాలని భావించారు:
#3. SR250 Psorinum 10M, 1M, 200C, 30C, 6C…ప్రతి పోటెన్సీ ఒక మోతాదు మధ్య వ్యవధి ఒక గంట ఉండాలి , అన్నిటికంటే ఎక్కువ పోటెన్సీ 10M తో ప్రారంభించాలి.
మొదటి రకమైన పుల్ అవుట్ ఒక రోజు తరువాత మొదలైంది, అనగా అన్ని రోగ లక్షణాలు పెరిగాయి. రెండు రోజుల తరువాత, ఆవిడకు కొంచెం ఉపశమనం కలిగింది. మూడు రోజుల తరువాత, ఆవిడకు క్రింది రెమెడీలు ఇవ్వబడ్డాయి:
#4. SR294 Hepar Sulph Calc 10M, 1M, 200C, 30C, 6C… తీసుకునే విధానం మరియు మోతాదు పైన చెప్పిన విధంగా. రెండు రోజుల తరువాత ఆవిడకు క్రిందివి ఇవ్వబడ్డాయి:
#5. SR318 Thuja 10M, 1M, 200C, 30C, 6C… తీసుకునే విధానం మరియు మోతాదు పైన చెప్పిన విధంగా
అయిదు రోజుల తరువాత, ఆవిడకు చాలా బాగా ఉన్న అనుభూతి కలిగింది. దగ్గు దాదాపుగా పోయింది. గొంతు కూడా బాగా ఉండి మరియు సైనస్లు క్లియర్ గా ఉన్నాయి. ఊపిరి తిత్తుల నుంచి వచ్చే కఫం కూడా త్వరగా తగ్గి ఒక వారం తరువాత, ఆవిడ దాదాపుగా 100% ఆరోగ్యంగా ఉంది.
సంపాదకుని వ్యాఖ్యానం:
ఒక మియాస్మ్ మరియు రెండు రెమెడీలను ఉపయోగించి దీర్గకాలిక ఆరోగ్య సమస్యలను కొత్త పద్ధతిలో నయం చేయటానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ.
ప్రశ్నలు సమాధానాలు
1. ప్రశ్న : ఒక స్నేహితురాలికి తొందర్లో కాన్పు అవుతుంది. అందువలన ఆవిడ నన్ను ప్లాసెంటా యొక్క నోసోడ్ చేయమని అడిగింది. కాన్పు అయిన తరువాత ఎంతసేపటికి నేను నోసోడ్ చేయవచ్చు? దీనికి కాల వ్యవధి ఏమైనా ఉందా?
జవాబు : ఏ శరీర భాగం యొక్క కచ్చితమైన వైబ్రేషన్ పొందాలంటే అది ఆరోగ్యంగా ఉండాలి. కానీ ప్లాసెంటా (మావి) అన్ని జీవ పదార్దాల్లాగే బాక్టీరియా తో మలినం చెంది కొంతకాలానికి కుళ్లిపోవచ్చు ముఖ్యంగా ఫ్రిజ్ లో ఉంచకపోతే. అందువలన కాన్పు అయిన వేంటనే ప్లాసెంటాను పొటెంటైజ్ చేయడం ఉత్తమం
డెలివరీ తర్వాత ప్లసేంటా వాడుక గురించి తరువాత వార్తాలేఖలో వివరించడం జరుగుతుంది.
_____________________________________
2. ప్రశ్న : 6 వారాల పసి పాప యొక్క తల్లి బాటిల్ పాలు తాగలేని ఇంకా మంచి నీరు కూడా పట్టని తన పాపకు వైబ్రియో మందులు ఎలా ఇవ్వాలో తెలుసుకోవాలనుకొంటోంది.
జవాబు : ముందుగా పసి పిల్లలకు కూడా వైబ్రియో పిల్స్ ఏ విధమైన హాని చేయలేవని మీరు గ్రహించాలి. కొన్ని పిల్స్ ను స్వచ్ఛమైన నీటిలో వేసి ఒక నీటిచుక్కను తల్లి చనుఁమ్రోలు పైన పాప పాలు తాగే ముందు ఉంచాలి. లేదా రెమెడీని ఆర్గానిక్ కొబ్బరి/ఆల్మండ్/ఆలివ్ నూనెలో చేసి పాప చర్మం పైన రుద్దవచ్చు. ఏమైనా పాప చర్మం పై నూనె రాయడం మంచిదే కదా.
_____________________________________
3. ప్రశ్న : నా తల్లి వయసు 89 సంవత్సరాలు మరియు ఆమె అల్జీమర్ వ్యాధితో బాధ పడుతోంది. ఆవిడ చాల బలహీనంగా ఉంది తాగడానికి తినడానికి తిరస్కరిస్తోంది . అంటే ఆవిడ తొందర్లో చనిపోబోతోందా? ఆలా అయితే నేను ఎలా ఈ మార్పును ఆవిడకు సులభతరం చేయగలను?
జవాబు : ఈ మార్పును సులభతరం చేయడానికి రెమేడీ SR272 Arsen అల్బ్ (CM). ఇది చివరి రోజులలో మనసును శాంతంగా ఉంచుతుంది. సమయం దగ్గర పడిందని మీకు తోచినప్పుడు రెమేడీ ని నీటిలో చేసి ఒక బొట్టును నోటిలో లేదా పెదాలపై వేయండి ... OD
బాక్స్ ఉన్న అబ్యాసకులు CC15.6 Sleep disorders ను ఉపయోగించండి ఇందులో SR 272 Arsen అల్బ్ ఉంది.
_____________________________________
4. ప్రశ్న : ఒక బాటిల్ పిల్స్ కి మనం గరిష్టంగా ఎన్ని కంబోలు కలపచ్చు? దానికేమైనా పరిమితి ఉందా? ఎక్కువ కంబోలు కలిపితే పిల్స్ ప్రభావం తగ్గే అవకాశముందా? ఈ కాంబోలలో ఏవైనా ఒకే బాటిల్ లో మిగిలిన కాంబోలతో కలిపి ఇవ్వకూడనివి ఏవైనా ఉన్నాయా ( నిద్ర లేమి కాంబో మినహాయించి )?
జవాబు : మీరు మీ ప్రాక్టీస్ ప్రారంభించిన కొత్తలో సంబంధిత సమస్యలకు సంబంధ మిశ్రమాలను మాత్రమే జోడించడానికి మేము సిఫార్సు చేస్తున్నాము. అయితే మీరు ఏ కాంబోకైనా CC10.1, CC12.1 (లేదా CC12.2), CC15.1 లేదా CC17.3 జోడించవచ్చు. కొన్నేళ్ల అనుభవం తర్వాత, మీరు వివిధ సమస్యలకు వివిధ మిశ్రమాలను కలిపి ఇవ్వవచ్చు. అయితే, 4 లేదా 5 సంబంధ మిశ్రమాల కంటే ఎక్కువ కలిపి ఇవ్వకపోవడం ఉత్తమం. లేకపోతె మీరు డైల్యూషన్ ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. దీనివలన కలపబడిన ఏ కాంబో ప్రభావమైన తగ్గవచ్చు.
_____________________________________
5. ప్రశ్న : మాన్యువల్ లో బాటిల్ లోని పిల్స్ వైబ్రేషన్స్ 6 నెలలపాటు ఉంటుందని ఇవ్వబడింది. కానీ వర్క్ షాప్ లో అవి 2 నెలలు వరకే ఉంటాయని విన్నట్టు గుర్తు.- కావున పిల్స్ లో వైబ్రేషన్స్ ఎంత కాలం నిలిచి ఉంటాయి? బోటిల్ ను అరచేతిపై 9 సార్లు కొట్టడం వలన పిల్స్ తిరిగి శక్తివంతం అవుతాయా?
జవాబు : అవన్నీ కూడా రోగి తన పిల్స్ బోటిల్ ను ఎంత జాగ్రత్తగా చూసుకున్నాడు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అందుకే ముందు జాగ్రత్త కోసం పిల్స్ కాల పరిమితి 2 నెలలని చెప్తాము. అయితే వేసుకోబోయేముందు బోటిల్ ను అరచేతి పై 9 సార్లు కొట్టడం ఉత్తమం. ఎందుకంటే ఇలా చేయడం వలన పిల్స్ మరింత ప్రభావవంతంగా పని చేస్తాయి.
_____________________________________
6. ప్రశ్న : 108 CC బాక్స్ ను ఏ ఉష్ణోగ్రత వద్ద ఉంచాలి? మనతో పాటు ప్రయాణంలో తీసుకెళ్లేటప్పుడు (ఉదాహరణకి కారు ట్రంక్ లో) అది అతి శీతల లేదా అతి వేడి (ప్రత్యక్ష సూర్య రశ్మి కాకుండా ) ఉష్ణోగ్రతను తట్టుకోగలదా?
జవాబు : 108 CC బాక్స్ ను చల్లని చీకటి ప్రదేశంలో ఉంచడం మంచిది. మండు వేసవిలో దానిని కార్ ట్రంక్ లో తీసుకెళ్లడానికి మేము సిఫారసు చేయము. ఆలా వేళ్ళ వలసి వస్తే ఇన్సులేటెడ్ కూలర్ బాక్స్ లో ఉంచి తీసుకెళ్లడం ఉత్తమం.
దివ్య వైద్యుని దివ్యవాణి
“సేవ అంటే మీరు ఇతరులకు చేసేది అనే కంటే మీకు మీరు చేసుకునేది అని మీరు తెలుసుకొంటారు! మీరు సేవ అనేది పరాయి వ్యక్తికి చేస్తున్నానని భావించినప్పుడు అది సేవ అనిపించుకోదు. అది సేవ అనే పవిత్ర పరిమళాన్ని కోల్పోయి, అహంకారం అనే దుష్ట సంకల్పానికి బీజం వేస్తుంది. మీచేత సేవను పొందిన వ్యక్తి కూడా దానిని హర్షించలేడు, ఎందుకంటే అతనికి తాను మీకంటే తక్కువ అన్న భావన కలుగుతుంది. అటువంటి సేవ, సాధన అనబడే నిజమైన సేవ కాదు”.
...సత్య సాయి బాబా, సత్య సాయి స్పీక్స్, Vol 10, Ch 20
ఎన్నో జన్మల పుణ్య ఫలం వలన లభించిన ఈ మానవ శరీరం జనన మరణ చక్రమనే సముద్రాన్ని దాటగల ఒక పడవ లాంటింది. సముద్రాన్ని దాటడమంటే దేహంలో నున్న దేహిని తెలుసుకోవడమే. శరీరంయొక్క ముఖ్య ఉపయోగమిదే. అందువలన ఎంత బలమైన దేహమున్నప్పటికీ, ఎంత బుద్ధికుశలత ఉన్నా, మనసు ఎంత ఏకాగ్రతతో ఉన్నపటికీ, లోనున్న అంతర్యామిని తెలుసుకోవడానికి తప్పక ప్రయత్నించాలి. అందువలన శరీరాన్ని బలంగా, దృడంగా, రోగరహితంగా ఉంచుకోండి. ఏవిధంగా పడవ సముద్ర ప్రయాణం చేయగలిగే విధంగా ఉండాలో, దేహం కూడా తన కర్తవ్యాన్ని నిర్వర్తించే విధంగా ఉండాలి. కావున మీ శరీరాన్ని చక్కగా సంరక్షించుకోండి."
...సత్య సాయి బాబా - దివ్య వాణి, ఆగస్టు 3, 1966
ప్రకటనలు
- పోలాండ్, వ్రోక్లవ్: జేవీపీ ల వర్క్ షాప్ మరియు AVPల కొరకు రిఫ్రెషర్ కోర్సు ఏప్రిల్ 20-21, 2013
- పోలాండ్ (వేదిక ఇంకా నిర్ణయించలేదు) సీనియర్ VP వర్క్ షాప్ సెప్టెంబర్ 27-29, 2013. పోలాండ్ లోని అన్ని వర్క్ షాపుల కొరకు సంప్రదించండి దారిస్ హెబీస్ +48 606 879 339 లేదా ఇమెయిల్ ద్వారా [email protected]
- ఇండియా న్యూ ఢిల్లీ: AVP వర్క్ షాప్ 15-16 డిసెంబర్ 2012 మరియు SVP వర్క్ షాప్ డిసెంబర్ 10-14, 2012. సంప్రదించండి వినోద్ నాగపాల్ 011-2613 2389 లేదా ఇమెయిల్ ద్వారా [email protected]
- ఇండియా ముంబై ధర్మక్షేత్ర AVP వర్క్ షాప్ డిసెంబర్ 21-22 రిఫ్రెషర్ వర్క్ షాప్ 23 డిసెంబర్ 2012
- ఇండియా జల్గావ్ మహారాష్ట్ర వర్క్ షాప్ 12-13 జనవరి 2013 సంప్రదించండి సందీప్ కులకర్ణి 9869-998 069 లేదా ఇమెయిల్ ద్వారా: [email protected]
ప్రాక్టీషనర్లందరికి: మీరు ఏదైనా శిక్షణా శిబిరము నిర్వహించదలచి ఉంటే వివరాలను: [email protected] కు పంపండి.
అదనపు సమాచారం
అరటి పండు యొక్క నిజాలు
మన ఆహార పోషక మరియు ఔషధ విలువ అందించే పండ్ల విషయానికి వచ్చేసరికి వినయపూర్వకమైన అరటి తరచుగా నిర్లక్ష్యం చేయబడుతుంది. అరటి లో విటమిన్లు A B, C, E మరియు G పుష్కలంగా ఉన్నాయి. అంతేకాక అరటిలో ఖనిజాలు పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం, మరియు సెలేనియం ఉంటాయి.
ఒక అరటిలో మూడు సహజ చక్కెరలు సుక్రోజ్, ఫ్రక్టోజ్, గ్లూకోజ్ కలిగి – ఫైబర్ తో కలిపి ఉండి, అది ఒక తక్షణ, నిరంతర మరియు గణనీయమైన శక్తిని ఇస్తుంది. కేవలం రెండు మాగిన అరటి పళ్ళు తినడం వలన 90 నిమిషాల వరకు చేసే కఠిన శారీరక శ్రమకు కావాల్సిన శక్తి లభిస్తుందని పరిశోధనలు నిరూపించాయి. అందువలనే అరటి ప్రపంచంలో ప్రముఖ క్రీడాకారులుకి మొదటి పండు. పూర్తిగా పండిన అరటి అసాధారణ కణాలను పోరాడేందుకు సామర్థ్యం కలిగిన TEN అని పిలిచే ఒక పదార్ధం (Tumour నెక్రోసిస్ ఫ్యాక్టర్) ని ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి దుకాణాలు త్వరలో అరటిపండ్ల స్టాక్ లేదు అని అంటే, వెంటనే ఆశ్చర్యపడవద్దు . అరటి మాగే కొద్దీ మచ్చలు అభివృద్ధి అవుతాయి. ఆ మచ్చలు ఎంత ముదురుగా ఉంటె అంత రోగ నిరోధకత సామర్ధ్యం ఉంటుంది.
అందువల్ల జపనీస్ కు అరటి పండు అంటే చాలా ఇష్టపడుతారు దానికి కారణం, ఒక జపనీస్ శాస్త్రీయ పరిశోధన ప్రకారం, అరటి క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలు TEN కలిగి ఉంటుంది. అరటి పండు ఎంత బాగా మాగితే దాని యొక్క క్యాన్సర్ వ్యతిరేక లక్షణం అంత ఎక్కువుగా ఉంటుంది. అరటి, ద్రాక్ష, యాపిల్, పుచ్చకాయ, పైనాపిల్, పియర్ మరియు వివిధ పండ్లు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు పోల్చడం కోసం టోక్యో విశ్వవిద్యాలయంలో ఒక ప్రొఫెసర్, నిర్వహించిన ఒక జంతువు ప్రయోగంలో, అరటి ఉత్తమ ఫలితాలు ఇచ్చింది. ఇది తెల్ల రక్త కణాల సంఖ్య పెంచడమే కాకుండా క్యాన్సర్ వ్యతిరేక పదార్ధం TEN ఉత్పత్తిని మరియు శరీరం యొక్క రోగ నిరోధకత సామర్ధ్యం పెంచింది.
ప్రతి రోజు ఒకటి లేదా రెండు అరటి పండ్లు తింటే జలుబు, ఫ్లూ మరియు ఇతర రోగములు రాకుండా శరీర రోగనిరోధక శక్తిని ఇస్తుంది. జపనీస్ ప్రొఫెసర్ ప్రకారం, పసుపు చర్మం, మచ్చలు ఉన్న అరటి ఆకుపచ్చ చర్మం అరటి కంటే 8 రేట్లు అధికంగా తెల్ల రక్త కణాల సామర్ధ్యం మెరుగు పరుస్తుంది. అందువలన ప్రతి రోజు 1 లేదా 2 అరటి పళ్ళు ఆహారం లో తప్పనిసరిగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది
మనో వ్యాకులత: ఇటీవల జరిగిన ఒక సర్వే ప్రకారం డిప్రెషన్తో బాధపడుతున్న ప్రజల్లో చాలా మంది అరటి పండు తిన్న తరువాత చాల సౌఖ్యంగా ఫీల్ అయ్యారు మనసు చేపట్టిన అనేక మంది ఒక అరటి పండు తినడం తర్వాత మంచి భావించారు. దానికి కారణం అరటి పండ్లో ట్రీప్టోఫాన్ అనే ఒక్క రకమైన ప్రోటీన్ ఉంటుంది అది శరీరంలో సెరోటోనిన్ గా మారి మిమల్ని ప్రశాంతంగా మరియు ఆనందంగా ఉంచి మీ మానసిక స్థితిని మెరుగు చేస్తుంది
PMS: మాత్రలు మరిచిపోండి. ఒక అరటి పండు తినండి. దానిలో ఉన్న విటమిన్ B6 మీ మానసిక స్థితిని ప్రభావితం చేసే బ్లడ్ గ్లూకోస్ స్థాయిని నియంత్రిస్తుంది.
రక్తహీనత: అరటిపండ్లు లో ఐరన్ ఎక్కువ ఉంటుంది, అరటిపండ్లు రక్తం లోని హెమోగ్లోబిన్ ఉత్పత్తి ఎక్కువ చేస్తుంది. అందువలన రక్తహీనత యొక్క సందర్భాలలో సహాయపడుతుంది.
రక్తపోటు : అరటిలో పొటాషియం చాల ఎక్కువగా ఉండి సోడియం చాలా తక్కువ ఉండడం వలన అధిక రక్తపోటును నియంత్రిస్తుంది అందువలన అమెరికాలోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధిక రక్తపోటు మరియు స్ట్రోక్ వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుందని చెప్పడానికి అరటిపరిశ్రమకి అధికారికంగా అనుమతిచ్చింది
బ్రెయిన్ పవర్ : ట్వికెంహం (యూకే లోని మిడ్డ్లేసెక్స్లో ) లోని 200 స్కూల్ విద్యార్థులకు టిఫిన్, మధ్యాహ్న మరియు రాత్రి ఆహారంలో అరటిపండు తినడం వలన పరీక్షలు బాగా రాయగలిగారని తేలింది. పొటాషియం అధికంగా ఉన్న అరటి పండును తినడం ద్వారా మెదడు యొక్క చురుకుదనం బాగా మెరుగవుతుందని పరిశోధనలు చెబుతున్నాయి
మల బద్ధకం : అరటి పండ్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది దాని వల్ల మలం సాఫిగా అవుతుంది, ఇది మల బద్ధకం సమస్యను మందుల అవసరం లేకుండా పోగొడుతుంది.
హ్యాంగోవర్లు : అరటి మిల్క్ షేక్స్లో తేనే కలుపుకుని తాగడం వలన హ్యాంగోవర్ బారి నుంచి అతి తొందరగా కోలుకోవచ్చు అరటి కడుపును శాంతపరచి తేనే యొక్క సహాయంతో తగ్గిన రక్త్తంలోని చక్కర శాతాన్ని పెంచుతుంది. పాలు మీ శరీరాన్ని రీహైడ్రాట్ చేస్తుంది
కడుపులో మంట : అరటిపళ్ళకి ఆమ్ల తత్వాన్ని తటస్థ పరిచే గుణం సహజంగానే ఉండటం వలన కడుపులో మంట తగ్గడానికి ఒక అరటి పండును తిని చుడండి
వేవిళ్ళు వికారము: రెండు భోజనాల మధ్య ఒక్క అరటి పండు స్నాక్స్ గా తింటే రక్తం లోని చక్కర శాతం పెరిగి వేవిళ్ళు వికారము దూరం అవుతుంది.
దోమ కాటు : క్రిమి కాటు క్రీం రాయడం కంటే, అరటి తొక్క లోపలి భాగంతో ప్రభావితమైన ప్రాంతం మీద రుద్దండి. చాలా మందికి ఇది అద్భుతంగా వాపు మరియు మంటను తగ్గించింది.
నరములు: అరటిపళ్ళలో నాడీ వ్యవస్థను శాంతపరచే B విటమిన్లు అధికంగా ఉంటాయి.
అధిక బరువు మరియు పని వద్ద: ఆస్ట్రియా లోని సైకాలజీ అధ్యయన సంస్థ ప్రకారం పని యందు ఎక్కువ ఒత్తిడి ఎదుర్కొనే ఉద్యోగులు చాకోలెట్స్ మరియు చిప్స్ వంటి ఆహారాన్ని ఎక్కువగా తింటారని తేలింది. 5000 మంది హాస్పిటల్ రోగులను గమనించిన పరిశోధకులు బాగా ఊబకాయం గల వ్యక్తులు అధిక ఒత్తిడి గల ఉద్యోగాలలో ఉంటున్నట్లు గమనించారు. ఒత్తిడి మూలంగా ఎక్కువగా చిరుతిళ్ళు తినే స్వభావాన్ని అధిగమించాలంటే ప్రతి రెండు గంటలకొకసారి అధిక కార్బోహైడ్రేట్ గల ఆహారాన్ని తీసుకోవాలని ఆ నివేదిక వెల్లడించింది
పుండ్లు: మెత్తని సున్నితమైన స్వభావం వలన అరటి పండును పేగులలోని సమస్యల కొరకు వాడతారు. ఇది అధిక ఆమ్ల తత్వాన్ని తటస్థ పరచటమే కాకుండా కడుపు లోపలి భాగంలో ఒక పూత లాగా ఏర్పడి మంటను తగ్గిస్తుంది
ఉష్ణోగ్రత నియంత్రణ : అనేక ఇతర సంస్కృతులలో, దేశాలలో అరటి పళ్ళను చల్లదనం ఇచ్చే పండుగా భావిస్తారు. ఎందుకంటే తల్లులు కాబోతున్న స్త్రీల యొక్క శారీరక మానసిక వేడిని ఇది తగ్గిస్తుంది
సీజనల్ ఎపెక్తివ్ డిజార్డర్ (SAD): సహజ మానసిక స్థితిని ఉత్తేజ పరచే ట్రీప్టోఫాన్ను కలిగి ఉండడం వల్ల అరటి పళ్ళు SAD రోగులకు చాల మేలు చేస్తాయి
ధూమపానం & పొగాకు ఉపయోగం : ధూమపానాన్ని మానాలనుకొంటున్న వ్యక్తులకు అరటి పళ్ళు సహాయం చేస్తాయి. ఎందుకంటే వాటిలోనున్న విటమిన్లు బి6. బి12 మరియు పొటాషియం మెగ్నీషియం, నికోటిన్ మానివేయడం వలన కలిగే పరిణామాల నుంచి శరీరం కోలుకునేందుకు తోడ్పడుతాయి
ఒత్తిడి: కీలక ఖనిజమైన పొటాషియం గుండెచప్పుడును సాధారణీకరణ చేస్తుంది, మెదడుకు ఆక్సిజన్ పంపుతుంది మరియు మీ శరీరం యొక్క జల సంతులనాన్ని నియంత్రిస్తుంది. మనం ఒత్తిడికి గురైనప్పుడు మన శరీర జీవ క్రియ వేగం పెరుగుతుంది అందువలన పొటాషియం శాతం తగ్గుతుంది. కావున పొటాషియం అధికంగా గల అరటి పళ్ళను తినడం చాలా మంచిది
స్ట్రోక్స్ : " న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ " లో పరిశోధన ప్రకారం, సాధారణ ఆహారంలో భాగంగా అరటి తినడం వలన 40% వరకు స్ట్రోక్ ద్వారామరణం సంభవించే ప్రమాదాన్ని శాతం వరకు తగ్గించవచ్చు!
పులిపిర్లు: సహజ ప్రత్యామ్నాయాలు వైపు ఆసక్తి ఉన్నవారు ఏమంటారంటే పులిపిర్లును పోగొట్టాలంటే, కొంచం అరటి తొక్క లోపలి భాగాన్ని పులిపిర్ పై ఉంచి ప్లాస్టర్ లేదా సర్జికల్ టేప్తో అతికించి ఉంచితే పులిపిర్ మాయం
అందువలన అరటి పండు నిజంగానే ఎన్నో రోగాలకు సహజమైన ఔషధం. కానీ గుర్తుంచుకోండి , అరటిని ఫ్రిజ్ లో మాత్రం ఉంచకండి! ఆపిల్ తో పోలిస్తే అరటిపండులో ప్రోటీన్ నాలుగు రెట్లు, కార్బోహైడ్రేట్లు రెండు రెట్లు, భాస్వరం మూడు రెట్లు, విటమిన్ A మరియు ఇనుము అయిదు రెట్లు మరియు ఇతర ఖనిజాలు మరియు విటమిన్ల రెండు రెట్లు అధికంగా ఉంటాయి . దీనిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. కావున ఇది అత్యుత్తమ ఆహార పదార్దాలలో ఒకటని కచ్చితంగా చెప్పవచ్చు. అందువలనే ఇప్పుడు మనం “ రోజుకొక అరటి ఉంచుతుంది దూరంగా డాక్టర్ని ” అని అంటాము
http://www.naturalnews.com/031308_bananas_health_benefits.html
http://www.naturalnews.com/028206_bananas_health.html
http://www.naturalnews.com/034151_bananas_nutrition_facts.html
http://healthmad.com/nutrition/10-health-benefits-of-bananas/
http://www.naturalnews.com/026376_selenium_cancer_thyroid.html
http://www.naturalnews.com/026368_calcium_magnesium_vitamins.html
http://www.nutritiondata.com/facts/fruits-and-fruit-juices/1846/2
http://health.learninginfo.org/banana-nutrition.htm
http://news.bbc.co.uk/2/hi/health/264552.stm
http://www.medicinenet.com/ace_inhibitors/article.htm
http://www.todayifoundout.com/index.php/2010/09/15-facts-you-probably...
http://www.whfoods.com/genpage.php?tname=foodspice&dbid=7
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
మధుమేహాన్ని నియంత్రించే ఆరు ఆహారాలు
మధుమేహం రెండు రకాలు టైప్ ఒకటి మరియు టైప్ రెండు. రెండింటిలోనూ సమతుల్యత లేని బ్లడ్ షుగర్ మరియు ఇన్సులిన్ సమస్యలుంటాయి ఇన్సులిన్ హార్మోన్ గ్లూకోస్ ను కణజాల శక్తిగా మార్చే హార్మోన్. ఇది పోషకాల జీవ ప్రక్రియ చర్యకు చాలా అవసరం.టైప్ ఒకటి మధుమేహాన్నిజువెనైల్ డయాబెటిస్ అని కూడా అంటారు ఎందుకంటే ఇది చాలా చిన్న వయసులో వస్తుంది. పాంక్రియాస్ గ్రంధి ఇన్సులిన్ హార్మోన్ ను చాలా తక్కువ స్థాయిలో లేదా అసలు ఉత్పత్తి చేయలేని కారణం వలన ఇన్సులిన్ ను శరీరంలోకి ఇంజక్షన్ అనగా ఇన్సులిన్ పెన్, ఇన్సులిన్ పిల్స్ లేదా పోర్తబుల్ ఇన్సులిన్ పంప్ రూపములో ఇవ్వవలసి ఉంటుంది. టైప్ రెండు డయాబెటిస్ మధ్య లేదా ముసలి వయసులో వస్తుంది. ఇందులో శరీరం ఇన్సులిన్ నిరోధకత లేదా ఇన్సులిన్ ను సరిగా ఉపయోగించలేక పోవడం ఒక కారణం. టైప్ రెండు డయాబెటిస్ ను వ్యాయామం తో మరియు ఆహారపు అలవాట్లతో బ్లడ్ షుగర్ను గమనిస్తూ నియంత్రించవచ్చు.
దీర్ఘ కాలంగా బ్లడ్ షుగర్ ఎక్కువగా ఉంటె అది టైపు 1 లేదా 2 డయాబెటిస్ అవచ్చు. కానీ కొన్నిసార్లు ముఖ్యంగా టైపు 2 డయాబెటిస్ లో బ్లడ్ షుగర్ తక్కువగా ఉండడం జరుగుతుంది. మధుమేహ వ్యాధి లక్షణాలు అడ్రినల్. థైరాయిడ్, ఫైబ్రోమైయాల్జియా వ్యాధి లక్షణాలను పోలి ఉండవచ్చు. అందువలన బ్లడ్ షుగర్ పరీక్ష చేసుకుని మీకు మధుమేహం ఉందా లేదాని నిర్దారించుకోవడం మంచిది.
మధుమేహుల కొరకు ఆహారం
అధిక గ్లిసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాన్ని తినకపోవడం ఉత్తమం. అవి శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్స్ షుగర్, హై ఫ్రూక్టోజ్ కార్న్ సిరప్ తేనె, మాపుల్ సిరప్, కేకులు, బిస్క్యూట్లు మొదలైనవి. కృత్రిమ చక్కెర ప్రత్యామ్నాయ ఆహారం మీ మెదడు కణాలకు మంచిదిద్ కాదు. తక్కువ బ్లడ్ షుగర్ ( హైపోగ్లిసెమియా) ఉన్నపుడు తియ్యగా లేని పండ్ల రసాలు తీసుకోవడం మంచిది. కానీ హై బ్లడ్ షుగర్ ఉన్నపుడు వాటి తీసుకోకూడదు లేదా బాగా పలుచగా చేసి తాగాలి. ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్స్ లోని చాలా తినుబండారాలలో, ప్రొసెస్డ్ ఫుడ్ లో, అవి తియ్యగా లేకపోయినా వాటిలో చక్కర శాతం ఎక్కువన్న విషయం మీకు తెలుసా? అందువలన వాటిని తినకుండా సాధ్యమైనంత వరకు ఆర్గానిక్ ఫుడ్ ను తినండి కొనండి.
1) కూరగాయలు ముఖ్యంగా ఆకుకూరలు మీరు ప్రతి రోజు తినవచ్చు. ఉడికించిన కూరగాయలు మరియు పచ్చి సలాడ్లు అందరికి మంచివి. సలాడ్ డ్రెస్సింగ్ కోసం వాడే వాటిలో షుగర్ లేదా ఇతర స్వీటెనర్స్ ఉండే అవకాశం ఉంది. అందువలన ప్రాసెస్ చేయని, కోల్డ్ ప్రెస్ చేసిన వర్జిన్ వెజిటబుల్ నూనె, ఒక సొయా ఆయిల్ తప్ప వాడవచ్చు. లేదా వినెగర్ లేదా నిమ్మ రసం వాడవచ్చు.
(2) అవోకాడో మీ సాలాడ్స్లో రుచి మరియు పోషక విలువల కోసం కొన్ని అవొకాడో ముక్కల్ని కలపండి. అవొకాడోలో చాల తక్కువ జి ఉంటుంది . అంతేకాక వాటిలో మధుమేహులలో సహజమైన దీర్ఘ కాలిక ఇన్ఫ్లమేషన్ నయం చేసే ఒమేగా ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. అవకాడోలో ప్రోటీన్ లు కూడా చాల ఎక్కువ ఉంటాయి
(3) వాల్నట్ వీటిలో ఒమేగా ఫాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి మరియు GI తక్కువ. వీటిని సలాడ్లు లేదా మొలకెత్తే గింజలపై రుచి కోసం చల్లుకొని తినవచ్చు. ఉప్పు లేని ఇతర పచ్చి గింజలను కూడా మధుమేహులు తినవచ్చు.
(4) తాజా (సాగు చేయని) చేపలు, ముక్యంగా ట్యూనా లేదా కోల్డ్ వాటర్ సాల్మన్ లో ఒమేగా అధికంగా మరియు GI తక్కువ ఉంటుంది.
(5) ధాన్యాలు : ప్రొసెస్డ్ గ్రేయిన్స్ ను వాడకపోవడం మంచిది. కానీ కొన్ని తృణధాన్యాలు మీరు భావించే దాని కంటే ఎక్కువ GI (గ్లైసెమిక్ సూచిక) కలిగి ఉంటాయి. ఉదాహరణకి గోధుమ. వాటికీ ప్రత్యామ్నాయాలుగ క్వినోవా లేదా బక్ గోధుమ వాడచ్చు. ఆర్గానిక్ ముడి బియ్యం కొంత మంది డియాబెటిక్స్ లో పని చేయవచ్చు. ఎందుకంటే ఇది సంక్లిష్ట కార్బోహైడ్రేట్ కావున తొందరగా గ్లూకోస్ గా మారదు.కానీ చాల మంది నిపుణులు వీటిని ప్రతి రోజు డియాబెటిక్స్ తినకూడదని చెప్తారు.
(6) వివిధ చిక్కుళ్ళు (బీన్స్) రకరకాల బీన్స్ ను బ్రౌన్ రైస్ కి రుచి కోసం వాడచ్చు. బీన్స్ లో పొటాటో కంటే ప్రోటీన్ మరియు ఫైబర్ ఎక్కువగా తక్కువగా ఉంటాయి. వాటిని కూరగాయలతో కలపచ్చు లేదా వేరే కూరగా తినవచ్చు
Sources for this article include: http://www.ehow.com/about_5372662_safe-foods-diabetics.html
Learn more: http://www.naturalnews.com/037217_diabetics_foods_glycemic_index.html#ixzz26kf3a5Ps
*******************************************************************************************