Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

Vol 5 సంచిక 6
November/December 2014
ముద్రింప తగిన వార్తాలేఖ


పూర్తి వార్తాలేఖ యొక్క కాగితం ప్రతి కావలెనన్నఈ పుటను ముద్రించండి

డా.జిత్. కే అగ్గర్వాల్ యొక్క మాటల్లో

ప్రియమైన విబ్రియో అభ్యాసకులరా,

నూతన స్టైల్ లో తయారైన వార్తా లేఖ విడుదల సందర్భంగా

మన ప్రియతమ ప్రభువు భగవాన్ శ్రీ సత్య సాయి బాబా యొక్క 89వ జన్మదిన పవిత్ర శుభ సందర్భమున, సాయి విబ్రియోనిక్స్ యొక్క వార్తాలేఖను ప్రేమపూరిత సేవతో సమర్పించుటకు మేమెంతో సంతోషించుచున్నాము. వార్తాలేఖను ఈ విధమైన నూతన తరహాలో సమర్పించుటకు మాకు అనుగ్రహించిన స్వామికి మేము కృతఙ్ఞతలు తెలుపుకొంటున్నాము. కష్టాలు మరియు రోగముల బారిన పడిన వారికి, సేవలందించుటకు విబ్రియో అభ్యాసకులుగా మనందరం పునరంకితం అవ్వడం ద్వారా స్వామి మీద మన యొక్క భక్తిని చూపుతాం.

హెచ్‌టి‌ఎం‌ఎల్ పంధా అనుసరించి మేము తయారు చేసిన తోలి సంచిక ఇది. దీని వలన పాఠకులకు సబ్జెక్టు ప్రకారం కేసులను వెతుకుటకు వీలు కల్గుతుంది. ప్రస్తుతానికి శోధన ప్రక్రియ ఈ సంచికకు మాత్రమే ఉపయోగపడుతుంది. పదములను మరియు గత అన్ని సంచికల విషయాలను శోధించటానికి  ఈ శోధన ప్రక్రియను మేమింకా విస్తృత పరుస్తాము. కానీ ఈ పనికి మా టీంకు కొంత సమయం పట్టవచ్చు. అందువలన మీరు ఓర్పు వహించవల్సిందిగా కోరుచున్నాము. ఈ నూతన పంధా వార్తా లేఖను మరింత చేరువగా, ఉపయోగకరంగా చేస్తుందని మేము భావిస్తున్నాము.

వార్తాలేఖను మెరుగు పరిచినందుకు మరియు దానికవసరమైన సామాగ్రిని అందించడానికి ఎంతో మంది సహాయ సహకారాలందించారు. మీ యొక్క ప్రేమపూరిత సేవకు మా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు. అభ్యాసకులందరు మా ఈ కృషికి ఉత్తేజితులై తమ కేసు హిస్టరీలను ఇతర విషయాలను రివ్యూ కొరకు మాకు పంపగలరని ఆశిస్తున్నాము (కేసు హిస్టరీల కొరకు దశా నిర్దేశములను ఈ సంచికలో క్రింద ఇచ్చిన ప్రకటనలు విభాగంలో చూడండి). కాలక్రమమున వార్తా లేఖ మరింత అభివృద్ధి చెందగలదని భావిస్తూ ఈ విషయంలో స్వామి యొక్క మార్గదర్శకత్వమును మేము సదా కోరుతాము.

ఈ సంచికను చదివిన తరువాత మీరు మీ యొక్క వ్యాఖ్యానమును, సూచనలను మరియు నూతన స్టైల్ లో తయారైన వార్తా లేఖ గురించి అభిప్రాయాలను మా టీం సభ్యులు తెలుసుకోవడానికి పంపగలరని భావిస్తున్నాము. మీ నుంచి స్పందనను మేము చాలా హర్షిస్తాము. మీరు నన్ను నేరుగా [email protected] వద్ద సంప్రదించవచ్చు.

ఆధునిక ట్రైనింగ్ గురించి క్రొత్త విషయాలు మరియు నూతన వార్తా లేఖా విభాగం

సాయి విబ్రియోనిక్స్ న్యూస్ లెటర్ మీకు మీ విబ్రియో ప్రాక్టీస్ లో సహాయ పడగలదని మరియు ప్రాక్టీషనర్ల మధ్య సమిష్టి తత్వాన్ని అలవర్చగలదని మేము భావిస్తున్నాము. విబ్రియో ప్రాక్టీషనర్లు రోగులకు అత్యంత ప్రేమతో, అత్యుత్తమ వైద్య సేవ అందించే విధంగా తోడ్పడటమే మా లక్ష్యం. ఇది జ్ఞప్తిలోఉంచుకొని నేను రెండు ప్రకటనలు చేయబోచున్నాను.

మొదటిది, ఈసంచికతో ప్రారంభించి, మీరు రోగులకుచేసే చికిత్సను మెరుగుపరచే వివిధ వ్యాసాలను ప్రచురించబోతున్నాను. ఈ వ్యాసాలు కాలక్రమంగా వార్తాలేఖలలో ప్రకటించబడి, విబ్రియోనిక్స్ వెబ్ సైట్లో ప్రచురించ బడును. నేను తరచుగా వివరణకోరే, వైద్యులకి తోడ్పడే ముఖ్యవిషయాలన్నీ యీవ్యాసాలలో తెలుపబడును. ఇటువంటివన్నీ ప్రశ్న-జవాబుల శీర్షికలో ప్రచురితమయే సౌలభ్యం లేదు. ఈ వ్యాసములవలన చికిత్స విధానాలను పునరావలోకించి, సరిదిద్ది, ప్రస్తుత నూతనవిధానాలను జతచేసే వీలుకలుగుతుంది. దయచేసి ప్రాక్టీషనర్స్ అందరూ ఈ వ్యాసాలను తదేకంగా చదవమని కోరిక.

మొదటి వ్యాసం: మందు మోతాదు, సేవించే విధం. ఈ వ్యాసం విబ్రియోనిక్స్ వెబ్ సైట్ లో, రిసోర్సెస్ లైబ్రరీలోని, బుక్స్, వీడియోస్ & ఆర్టికల్స్ సెక్షన్లో వున్నది. ఇది ప్రాక్టీషనర్స్ కొరకు మాత్రమే. మీరు www.vibrionics.org లో లాగిన్ చేసి చూడగలరు.    

రెండవది: వార్తాలేఖలో ‘అదనముగా’ అనే శీర్షిక జత చేస్తున్నాము. ఇదే వార్తాలేఖలో అంతిమ శీర్షిక. దీనిలో విబ్రియోనిక్స్ సంఘానికి ఉపయుక్తమైన వివిధ విషయాలు చర్చించబడును. భౌగోళికంగా వేరై, వివిధ ప్రదేశాలలో వున్నా, మనుషుల హృదయాలు ఒకటే.

మన తొలి వ్యాసం ‘అదనముగా’ శీర్షికలో అమెరికా మరియు కెనడా శిక్షకులు & సహ దర్శకులు 01339…USA, తమ ప్రాంతంలోని వివిధ ప్రాక్టీషనర్స్ ని ఏరీతిలో సంప్రదించి, వారిని ప్రశ్నలడిగి పరస్పరం నేర్చుకొనునట్లు చేయుచున్నారో వివరిస్తారు. ప్రాక్టీషనర్స్ తో సంప్రదింపులకు యిదొక మంచి ఉదాహరణ. ఈ విధంగాచేయుటకు యితరమార్గాలు కూడా వున్నవి. అనుభవజ్ణులైన ప్రాక్టీషనర్స్ ని తమ ప్రశ్నలడిగి, వారినుండి తమప్రావీణ్యత వృద్ది చేసుకొని, తమరోగుల చికిత్సను మెరుగుపరచుట ముఖ్యమైనది. ఈ నివేదిక ద్వారా అభ్యాసకులకు, యితర అభ్యాసకులను కలిసే అపూర్వ అవకాశం, మరియు పబ్లిక్ ప్రదేశాలలో కాకుండా జరిగే ఇటువంటి సత్సంగాల వలన కలిగే లాభాలు అర్థమవుతాయి.

సాయి వైబ్రియానిక్స్ అనగానేమి?

పూజ్యబాబావారి 89వ జన్మదిన శుభ సందర్భమున (నవంబర్ 23వ తేదీన) వారి జ్ణాపకార్ధo “సాయి వైబ్రియానిక్స్ అనగానేమి” అను వీడియో, ‘సాయిరాం స్వస్తతా తరంగాలు’ (సాయిరాం హీలింగ్ వైబ్రేషన్స్) ఇంగ్లీష్ తోబాటు 13 భాషలలొ విడుదల చేయబడినది తెలుపుటకు నేనెంతో సంతోషించుచున్నాను. 

ఈ వీడియో తొలి ‘అంతర్జాతీయ వైబ్రియానిక్స్ సమావేశం’, పుట్టపర్తిలో ఈ సంవత్సరం జనవరిలో ప్రదర్శించబడినది. నూతన అనువాదాలు త్వరలోనే వైబ్రియానిక్స్ వెబ్ సైట్ www.vibrionics.org లో చూడగలరు.  

ఆరోగ్యమునకు కొన్ని సూచనలు

చివరగా నేను మీకు చెప్పబోయేదేమిటంటే, ఇటీవలే రేడియో సాయిలో ప్రచురితమైన వ్యాసం, శాకాహారఓ యొక్క  విలువ - ప్రధమభాగం, ద్వితీయభాగం http://media.radiosai.org/journals/vol_12/01OCT14/Vegetarianism-part-01.html లో చదవండి.

ఈవ్యాసంలో శాకాహారం ప్రాముఖ్యత గురించి శ్రీ సత్య సాయిబాబా వారి బోధనలున్నవి. మాంసాహార భోజనము వల్ల మానవశరీరంలో కలుగు అనారోగ్యాలు, మనసుమీద కలిగే దుష్ప్రభావం గురించి శ్రీ బాబాగారు స్పష్టంగా విశదీకరించారు. కనుక ఈ వ్యాసాన్ని మీరు చదవటమేకాక, యితర రోగులకు కూడా చదివి, వినిపించి, శాకాహారం తినుటవల్ల కలిగే లాభాలను, మాంసాహారం తినుటవలన ఏదుర్కొంటున్న అనారోగ్యస్థితిని విశదీకరించి, వారు తమ ఆహారంతో ప్రయోజనం పొందేలా చేయమని కోరుతున్నాను.

ప్రేమపూరితమైన సాయిసేవలో,

జిత్ అగర్వాల్

 

ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ 10251...India

అమెరికాలో నివసించేటప్పుడు 80 సంవత్సరాల పెద్దామె కడుపునొప్పితో ఆకలిలేక ఏడాదిగా బాధపడుతూ, కుమార్తె వద్దకు ముంబాయి రాగా, 2014 ఫిబ్రవరిలో ఆమెకు జరిపిన వైద్యపరీక్షలలో ఆమెకు ఎడెనోక్యార్సినోమా (ప్యాంక్రియాటిక్ క్యాన్సర్) ఉన్నట్లు తెలిసింది. ఆ కణితి 5 x 2.6 సెం.మీ. సైజ్ తో, 3.3 జీవక్రియ చర్యతో IIB దశలో ఉన్నట్లు తేలింది. దీనికి శస్త్రచికిత్స లేదు. ఆమెకు 19సార్లు రేడియేషన్, కీమోథెరపీ మందులు యిచ్చేరు. వైద్యుల అబిప్రాయం ప్రకారం ఇటువంటి వైద్యం వలన కణితి యొక్క జీవక్రియ చర్యని 1.5 కు తగ్గించడం ద్వారా కాన్సర్ యొక్క వ్యాప్తిని అరికట్టవచ్చు కానీ దీర్ఘకాలిక ప్రయోజనం తక్కువ. చికిత్స తరువాత, రోగి చాలా నిరాశతో, నిరుత్సాహంతో ఉన్నది.

ఈ పరిస్థితిలో ఆమెకు క్రింద పేర్కొన్న మిశ్రమాలు యివ్వబడినవి.

CC2.1 Cancers-all + CC2.2 Cancer pain + CC2.3 Tumors & Growths + CC4.7 Gallstones + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic…6TD

వైబ్రోని తీసుకున్న ఒక నెలలోనే ఆమెలో విశ్వాసం పెంపొంది, బలాన్ని మెల్లగా తిరిగి పొందింది. ఆమె కడుపులో మంటకూడా తగ్గి, జూలై 2014 నాటికి ఆమె నెమ్మదిగా కోలుకొనసాగిoది. జూలై 2014 లో, ఒక PET-CT స్కాన్ జరిగింది. వైద్యుల ప్రకారం, రోగియొక్క కణితి క్షీణించింది మరియు దాని జీవ క్రియాత్మక చర్య సున్నాకి పడిపోయింది. ఆమె న్యూయార్క్ తిరిగి వచ్చిన తర్వాత, సెప్టెంబర్ 2014 లో న్యూయార్క్ లో చేసిన CT స్కాన్ కూడా భారతదేశంలో స్కాన్ వలెనే ఉండి జీవక్రియ కార్యకలాపాలు నిలిచినట్లు నిర్ధారించినది. ఆగస్టులో ఆమె టైప్2 మధుమేహంతో బాధపడుచుండగా యిచ్చిన ఔషధంతో మధుమేహం నియంత్రణకు వచ్చింది. అక్టోబర్ లో జరిగిన మూడవ CT స్కాన్ మిగిలిన కణజాలంలో ఎటువంటి మెటాస్టాటిక్ కార్యకలాపాలు లేవని నిర్ధారించింది. ఈ శుభవార్తతో ప్రతి 2నెలలకు స్కాన్ చేయనక్కరలేదని ఆమె వైద్యులు చెప్పారు. ఆమెకు తక్కువ వైద్య పరీక్షలు జరిగే అవకాశం ఉంది. అక్టోబర్ నాటికి, ఆమె విబ్రియో QDS ను కొనసాగిస్తూనే వున్నది.

రోగి వ్యాఖ్య:
రోగి చాలా సంతోషంగా వున్నది. ఆమెకు తన అద్భుతమైన రోగనివారణకు విబ్రియో వైద్యమే కారణమనిపిస్తుంది. స్వామి తనపై చూపిన అపార కరుణకు ఆమె స్వామికి కృతజ్ఞతరాలుగా నిలిచిపోయింది.

ఆస్త్మా 02799...UK

62 ఏళ్ల మహిళ తీవ్రమైన ఉబ్బసంతో 40 సం.లకు పైగా బాధపడుతూ అప్పట్లో స్టెరాయిడ్ ఇన్హేలర్ 3 - 4 సార్లు వుపయోగించేది. ఆమెకు ఏప్రిల్1, 2014 న క్రింది చికిత్స ప్రారంభించబడిoది:
CC10.1 Emergencies + CC15.1 Emotional & Mental tonic + CC19.1 Chest tonic + CC19.2 Respiratory allergies + CC19.3 Chest infections chronic + CC19.6 Cough chronic + CC19.7 Throat chronic...QDS ఒక నెల వాడిన పిమ్మట TDS కు తగ్గించింది.
4వారాలలో ఆమెకు వ్యాధి సగం తగ్గింది. ఇన్హేలర్ ఉపయోగం BDకి తగ్గించగలిగింది. 5వారాల చికిత్స తరువాత, మే8, 2014 న, ఆమె ఇన్హేలర్ వాడుక ఆపివేసి, పూర్తిగా బాగుందని ప్రాక్టిషనర్ తో చెప్పటానికి వచ్చింది. కాని వారు ఆమెకు దీర్ఘకాల ఆస్త్మా రోగం ఉండేది కనుక 6నెలల పాటు BD చికిత్సను కొనసాగించి, జీవితమంతా OD ని కొనసాగించమని చెప్పిరి. ఆమె ఆనందంగా అంగీకరించింది.

మలబద్దకం, అజీర్ణం & ఈతకల్లు (కాoడిడా) 11966...India

ఆగష్టు15, 2014న, 2½ సం.ల వయసున్న ఒక బాలుడు గత 1½ సం.లుగా దీర్ఘకాలిక మలబద్ధకం, అజీర్తితో బాధపడుతూ చికిత్సకోసం తీసుకురాబడ్డాడు. అతను కడుపునొప్పితో దాదాపు ప్రతిరాత్రి మధ్యలో నిద్రలేస్తూ ఏడుస్తున్నాడు. తల్లిదండ్రులు అలోపతి వైద్యాన్ని2సార్లు ప్రయత్నించారు. కాని బాధ తగ్గలేదు. అతనికి  200 ml నీరు (ప్రతి కాంబో ఒక డ్రాప్) లో చేసిన మందుకాంబో ఇచ్చితిమి:
#1. CC4.1 Digestion tonic + CC4.4 Constipation + CC4.10 Indigestion + CC12.2 Child tonic…TDS

3రోజుల చికిత్సతో, మలబద్ధకం, అజీర్తి పోయాయి. చికిత్సకు మునుపు బాలుడు అతిగా చాక్లెట్లు బిస్కెట్లు తినేవాడు. అందువలన అతని ఆహారంలో మార్పులు చేశారు. బిస్కెట్లు అతనికి ఇవ్వకుండా అతని ఆహారంలో చక్కెర తగ్గించి, అదే మోతాదుతో వైద్యం జరిగింది. కొద్ది నెలలుగా శిశువు మలరంధ్రం చుట్టూ శిలీంధ్రవ్యాధి (ఫంగల్ ఇన్ఫెక్షన్ )వ్యాపించి, 2" బొబ్బ తరచుగా కనిపించేది. ప్రాక్టీషనర్ శరీరప్రేగుల శిలీంధ్రవ్యాధి అదుపుకోసం మిశ్రమం క్రింది విదంగా  మార్పు చేసినారు:
#2. Combo #1 + CC12.2 Child tonic + CC17.2 Cleansing + CC21.7 Fungus…TDS

నీటిని కూడా 200 ml నుండి 400 ml వరకు పెంచారు. 2-3 రోజుల తరువాత శిలీంధ్ర సంక్రమణ, 2వారాల తరువాత చర్మవ్యాధి కూడా సంపూర్తిగా నయమైనవి. 

కీళ్ల నొప్పులు మరియు బిగుసు తనం 03112...Greece

18సం.ల. కుర్రవాడు తన శరీరంలో కీళ్లన్నీనొప్పిగా ఉన్నవని, తనశరీరం మొద్దుగావుందని, వంచలేనని, వేళ్లు మరియు కాళ్లు తిమ్మిరితనంతో ఉన్నాయని ఫిర్యాదుచేశాడు. తను కదిలినప్పుడల్లా, తనకీళ్లలో కరకరమనే శబ్దం వస్తుందని చెప్పాడు. అతను వృద్ధునివలె బాధపడుచున్నాడు. ఈ విదంగా అతను గత కొన్ని నెలలుగా భాద పడుతున్నాడు కానీ ఏ వైద్యున్నీ సంప్రదించలేదు. రోగికి ఫిబ్రవరిలో క్రింది విబ్రియో చికిత్స ప్రారంభించారు:
CC20.1 SMJ tonic + CC20.2 SMJ pain + CC20.3 Arthritis…TDS

అదే రెమెడీని అతను తన సమస్యలు తిరిగి రాకుండా ఉండుటకు TDS వాడుతున్నాడు.

మానసిక ఆందోళనలు, కళ్ళకలక 03112...Greece

ఒక 17సం.ల. బాలుడు రెండు వేరు వేరు సమస్యలతో వచ్చాడు. గత 2సం.లుగా తను చాలా మానసిక ఆందోళనతో ఉన్నాడు. రాత్రిళ్ళు భయంకర ఊహలతో కనిపించని శక్తులు తనను ఇబ్బంది పెడుతున్నట్లు, ఆందోళనతో నిద్రపోవటం లేదు. అతను ఏ చికిత్స ప్రయత్నించలేదు. అంతే కాకుండా గత 10 సం.లుగా అతను దీర్ఘకాల కళ్లకలక వ్యాధితో బాధ పడుతున్నాడు. అందువలన అతని కళ్ళు చాలా ఎర్రగా, దురదగా ఉన్నాయి. అతను వ్యాధి నివారణకై అనేక సం.లు కార్టిసోన్ తీసుకున్నా, హోమియోపతి వాడినా ఎట్టి ఫలితం కల్గలేదు. ప్రాక్టీషనర్ అతనికి ఈవిధమైన మందు మిశ్రమాలను యిచ్చిరి:
మానసిక దాడులకు:
#1. CC15.1 Mental and Emotional tonic + CC15.2 Psychiatric disorders...TDS

కండ్లకలక కోసం:
#2. CC7.3 Eye infections + CC20.1 SMJ tonic...TDS

రోగికి జనవరి25, 2014న 2 మందు మిశ్రమాలను ప్రారంభించగా, తక్షణస్పందన వచ్చింది. 1వరోజు చికిత్స తర్వాత, అతను రాత్రంతా ప్రశాంతంగా నిద్రపోగలిగినాడు మరియు కనిపించని శక్తులు తనను ఇబ్బంది పెడతాయన్న భయం కూడా పోయింది.. మానసిక ఆందోళన పూర్తిగా తగ్గింది. 2రోజుల చికిత్స తర్వాత, అతని కళ్ళవ్యాధి పూర్తిగా నయమైనది.

ప్రయాణపు నలతలు, నీళ్ళ విరోచనలు, వాంతులు 11965...India

ప్రాక్టీషనర్ వ్యాఖ్య: నా వైబ్రియోనిక్స్ సాధన తొలిదశలో, కేరళనుండి ఏడుగురు అతిథులు ఏప్రిల్18, 2014న ఢిల్లీ చూచుటకై వచ్చినపుడు, నేను తొలి అద్భుతాన్ని అనుభవించాను. పలుచోట్ల తిరుగుతూ, బయట తిండి తిని, నీరు త్రాగడం వలన వారందరి కడుపులు పాడయి, వాంతులు, నీరసంతో జబ్బుపడిరి. నేను వెంటనే నీటిలో క్రింది మిశ్రమం సిద్ధం చేసాను:
CC4.6 Diarrhoea + CC4.10 Indigestion + CC17.1 Travel Sickness…1 tsp ప్రతి 10 నిమిషాలకు సేవించాలి.
మొదట అందరూ సంకోచించినా, కాస్సేపట్లో నలుగురు విబ్రియో మందు తీసుకోవటం ప్రారంభించారు. 1గంటలో మిగతా ముగ్గురికన్నా వారు మెరుగైనట్లు భావించారు. 2 గంటలలో విబ్రియోనిక్స్ చికిత్సతో వారు పూర్తిగా కోలుకుని, షాపింగ్ కి సిద్ధమైయ్యారు. మిగిలిన ముగ్గురు, వారిలో మార్పుచూసి, అదే మిశ్రమం, అదే విధంగా ప్రారంభించారు. 3 గంటలలో కోలుకుని, సాయంత్రం ఏడుగురూ విందు భోజనాలకు ఆనందంగా సిద్ధమైయ్యారు.

నోటి పూతలు, తెల్లబట్ట వ్యాధి, కంతి/గడ్డ 11964...India

బలహీనంగా, పాలిపోయిన ఒక 24 సం.ల. స్త్రీ, ఏప్రిల్16, 2014న, పలు ఆరోగ్యసమస్యలతో వచ్చింది. ఆమె నిత్యం కడుపునొప్పి, వాంతులతో బాధపడుతోంది. ఆమె వైద్యులు ప్రేగులో గడ్డ, ఉదర క్షయ వ్యాధి అనే శంకతో, 8 రోజుల్లో ‘లాపరోస్కోపీ’ చేయించుకోమని ఆదేశించారు. ఆమె గత సం. జూలై 2013లో ఇదే వ్యాది లక్షణాలతో ఆసుపత్రిలో చేరింది. కానీ ఈమె ఆరోగ్య సమస్య సుదీర్గ కాలంనుంచి ఉన్నందువలన సరైన ఫలితం కనిపించలేదు. ఆమె తన 12వ ఏటనుండి ఒక సారి తీవ్ర ఊపిరితిత్తులవ్యాధి వచ్చిన తరువాత నుంచి, వాంతులు, ఉదరంలో నొప్పితో బాధపడుతోంది. అంతే కాకుండా గత నెలనుండి నీరసం, ఉద్యోగవత్తిడి, నోటి పూతలతో, గత 2సం.లుగా తెల్లబట్టవ్యాధితో బాధపడుతోంది.

ప్రాక్టీషనర్ ఆమెకు ఈ క్రింది మందు మిశ్రమాలను ఇచ్చారు:
శస్త్రచికిత్సకు ముందు, ఒత్తిడి కోసం:
#1. CC10.1 Emergencies + CC15.1 Mental & Emotional tonic…TDS 3 రోజులు
నోటి పూతల కోసం:

#2. CC11.5 Mouth infections…QDS 3 రోజులు
తెల్లబట్టవ్యాధికోసం:
#3. CC8.5 Vagina & Cervix…QDS 3 రోజులు
పై ప్రకారం మందులు వాడిన తర్వాత, 4వరోజున, రోగి ఒత్తిడిలో 50%తగ్గింపు, నోటిపూతలలో 25%తగ్గింపు, తెల్లబట్టవ్యాధి 10% తగ్గినవి. పై మందులు కొనసాగించబడినవి.
10వరోజున ఒత్తిడి 100%, నోటిపూత 75%, తెల్లబట్టవ్యాధి 20% తగ్గినది. రోగికి శస్త్రచికిత్సచేసి, కడుపులో గడ్డతొలగించిరి. మే3న రోగికి ఆసుపత్రిలో చికిత్సను ఆపివేశారు. మరొక 18రోజులు వైబ్రియోనిక్స్ వాడేక, ఆమె నీరసంగావున్నా, ఉత్సాహంగా ఉంది. నోటిపుళ్ళు, తెల్లబట్టవ్యాధిలో మాత్రం 10వ రోజునాటి స్థితికన్న యేమి మెరుగవలేదు. కనుక మే4న వైద్యురాలు ఆమె చికిత్సను మార్చారు:
శస్త్రచికిత్సతరువాత మరియు నోటి పూతల కోసం:
#4. CC10.1 Emergencies + CC11.5 Mouth infections…TDS 1వారము    

తెల్లబట్టవ్యాధి, బలహీనత కోసం:
#5. CC8.5 Vagina & Cervix + CC12.1 Adult tonic …TDS 1వారము
ఈమార్పిడి తరువాత, మొదటివారంలో మెరుగుదల మొదలై, నోటి పూత 75%, తెల్లబట్టవ్యాధి 25% తగ్గింది. 2వారాలలో నోటిపూత 90%, తెల్లబట్టవ్యాధి 50% నయమయింది. 3వారాలలో (మే 25), నోటిపుళ్ళు పూర్తిగా పోయినవి. తెల్లబట్టవ్యాధి 75% తగ్గింది. నోటిపూతలు నయమైనందున, మోతాదు తగ్గించి (# 1 ... BD, 1 వ వారం, తరువాత OD రెండవ వారంలో) నెమ్మదిగా 2వారాల తరువాత నిలిపివేయబడింది. తెల్లబట్ట వ్యాధికి చికిత్స కొనసాగి, 4-5వారాల్లో90%, 6వారంలో95% తగ్గి, 7వవారంలో 100% పోయింది (జూన్ 22). చికిత్సకై మరో 3వారాలు (# 5 ... BD, రెండవ వారంలో OD, 3 వ వారం కోసం 3TW) మిశ్రమాలు సేవించెను. జూన్ చివరికి, రోగి పూర్తిఆరోగ్యముతో, ప్రకాశవంతంగా, సంతోషంగా కనిపించినది. పైసమస్యలు చికిత్స చేస్తున్నప్పుడు, 25 మేలో రొమ్ము బయాప్సీలో, ఫైబ్రోఆడెనోమా యొక్క నిర్ధారణ జరిగింది. ఈ నిరపాయమైన రొమ్ము వ్యాధికి రోగికి క్రింది చికిత్స ఇవ్వబడింది:
#6. CC2.3 Tumours & Growths…QDS 2 వారాల కోసం

పరిస్థితి గమనిస్తూ, మరో 2వారాల చికిత్ససాగింది. రోగికి నయమైంది. 5వారాల తరువాత మోతాదుతగ్గించి: # 6 ... BD 2వారాలు, 3TW మరో 2వారాలు ఇచ్చేక, అప్పుడు OW జూలై 27, 2014 ప్రారంభము చేసారు.
 

కీళ్లవాతం 02915...Italy

39 సం.ల. ఒక మహిళ గత 3నెలలుగా కుడిభుజoలో  కీళ్లవాతం నొప్పితో భాద పడుతోంది. ఆ నొప్పి ఎంత తీవ్రంగా ఉందంటే రాత్రి పూట ఆమెకు నిద్ర పట్టడంలేదు. విబ్రియోనిక్స్ కు ముందు ఆమె నొప్పి తగ్గించే మాత్రలు, మందులు తైలమర్ధన, లేజర్ చికిత్స తీసుకోంది కానీ పెద్దగా ప్రయోజనం కలగలేదు. జనవరి 10, 2014 న, ఆమెకు క్రింది మిశ్రమం ఇవ్వబడింది:
NM24 Rheumatism & Arthritis + NM59 Pain + NM113 Inflammation + OM4 Cervical + SM28 Injury + SM36 Skeletal + SR284 Chelidonium + SR295 Hypericum (30C) + SR503 Ligament…TDS

5రోజుల్లో నొప్పి 70% తగ్గి, 10రోజుల్లో నొప్పి పూర్తిగా పోయింది. ఆమె మరో 2నెలలు చికిత్స తరువాత BD, పిమ్మట OD ని వాడి, ఆపడానికి ముందు మోతాదు తగ్గించింది. ఆమెకు ఎప్పుడూ పుల్ల్ అవుట్ రాలేదు. సెప్టెంబర్ 2014 నాటికి ఆమెకు నొప్పి తిరిగి రాలేదు.
ప్రాక్టీషనర్ యొక్క వ్యాఖ్య:
రోగి, నేను కూడా చికిత్స ఫలితంతో సంతోషించినాము. ఈ అద్భుతమునకై పరమాత్మునికి సదా కృతజ్ణులము.

 

సైనసైటీస్, ముక్కు దిబ్బడం & తుమ్ములు 02799...UK

6 సం.ల ఒక బాలుడు దీర్ఘకాలిక ముక్కు దిబ్బడ, దానివల్ల తలనొప్పి, తుమ్ములతో గత ఏడాదిగా బాధపడుతున్నాడు. జూన్21, 2014న అతనికి క్రింది కాంబో ఇవ్వబడింది:
తుమ్ముల కోసం:
#1. SR520 Phrenic Nerve...నీటిలో ఒకే మోతాదు
నాసికబాధలకు:
#2. CC12.2 Child tonic + CC19.1 Chest tonic + CC19.2 Respiratory allergies + CC19.5 Sinusitis...TDS
3రోజుల చికిత్స తరువాత తుమ్ములు ఆగిపోయాయని తల్లి చెప్పింది. నెల రోజుల చికిత్స తరువాత ముక్కు సమస్యలు, తుమ్ములు పూర్తిగా నయమైయ్యాయి. పై సమస్యలు తిరిగి రాకుండా ఉండుటకు ముందు జాగ్రత్తగా # 2 ...BD ను కొనసాగించమన్నారు. అక్టోబరు 2014 నాటినుండి కొనసాగించిరి.

గేంగ్రీన్, మధుమేహం 02494...Italy

ప్రశాంతినిలయంలో వైద్యులైన ఒక భార్యాభర్తల బృందం ఇటలీలో జబ్బుతోవున్న తమ మిత్రుడికి ఫోన్ చేసేసరికి అతను ప్రమాదస్థితిలో వున్నాడు. 64 సం.ల వారి మిత్రుడు, గత 30సం.లుగా మధుమేహంతో బాధపడుతూ, ఇన్సులిన్ పై ఆధారపడి ఉన్నా తన ఆరోగ్యంపై తగినంత శ్రద్ద తీసుకోలేదు. మధుమేహం వలన కలిగిన గేంగ్రీన్ సమస్యలవల్ల, అతని కుడికాలి బొటనవేలు తొలగించారు. మిగతా వ్రేళ్ళలో కూడా గేంగ్రీన్ సోకి, ఎముకలకు ఇన్ఫెక్షన్ వ్యాపించింది. అందువలన వైద్యులు త్వరగా శస్త్రచికిత్సచేసి, మోకాలు క్రిందవరకు కుడికాలు తీసేయాలని చెప్పారు. అతను జ్వరంతో బాధపడుతూ మంచానికే పరిమితమైయ్యాడు. అతను చాలా నిరాశ చెంది తనకిక వైద్య చికిత్స వలన కోలుకొనే  అవకాశమే లేదని భావించాడు. పూర్వం అతను వైబ్రియోనిక్స్ చికిత్సను పూర్తిగా నిరాకరించేవాడు. ఇప్పుడు ప్రాక్టీషనర్స్ అతడికి వైబ్రయోనిక్స్ ప్రసారం చేయడానికి, రోగి అనుమతిని అడగగా, వెంటనే అతను అంగీకరించాడు. వైద్యులు తనకి తగిన మందు మిశ్రమం మరియు వైబ్రియో ప్రసారం మర్నాటి ఉదయం చేస్తామని వాగ్దానం చేశారు. ఎందుకంటే అప్పటికే బాగా రాత్రయి, వారు అలిసిపోయారు. కానీ కొంతసేపటికి ఆ రోగి యొక్క  యాతన గుర్తువచ్చి, వారు ఉదయంవరకు ఆగలేక, వెంటనే క్రింది మందు తయారు చేశారు:
NM6 Calming + NM21 KBS + NM32 Vein-Piles + NM36 War + OM3 Bone + BR11 Kidney + SM15 Circulation + SM17 Diabetes + SM26 Immunity + SM27 Infection + SM29 Kidney + SR293 Gunpowder + SR316 Streptococcus + SR457 Bone + SR501 Kidney + SR556 Pyrogenium

వైద్యులు స్వామిని ప్రార్థిస్తూ డిసెంబర్ 8, 2007 న 11:30కు ప్రసారం చేశారు. 10 ని.లలో, రోగికి ఫోన్ చేసి, తాము ప్రసారం చేశామని, మార్పులను గురించి తెలుపమని అతన్ని కోరారు. ఆనందశ్చార్యాలతో, రోగి గతకొద్దినిమిషాల్లో తననొప్పి, జ్వరం పోయాయని చెప్పగా వైద్యులు అతని మాటలు నమ్మలేకపోయారు. వారు మరి కొన్నిరోజులు యంత్రంలో కాంబో 24 గంటలు నిరాటంకంగా ఉంచి ప్రసారాన్ని కొనసాగించారు. రోగి యొక్క కాలు దినదినానికి మెరుగయినది. వారం తరువాత, అతను పరీక్ష కోసం వెళ్లగా, వైద్యులు అతని కాలుకు శస్త్రచికిత్స అవసరం లేదని తెలుసుకొని ఆశ్చర్యపోయారు.

అభ్యాసకుని వ్యాఖ్యానము:
మేము ఇటలీకి తిరిగి వచ్చినప్పుడు, రోగి యొక్క కాలు చాలావరకు నయమైంది. అతను తనకు పిల్ల్స్ తో మధుమేహం చికిత్స కొనసాగించమని మమ్ము కోరాడు. అతనికి విబ్రియోనిక్స్ ప్రభావం తెలిసిందని, మేము చాలా సంతోషించాము. కానీ దురదృష్టవశాత్తు అతని క్రమశిక్షణాలోపం, శ్రద్ధగా సరైన మోతాదులో మందులు వాడక పోవడం వలన అతనికి పూర్తిగా నయమవలేదు.  కొన్నినెలల్లో అతను గుండెపోటువల్ల చనిపోయాడు. అతను తనకి స్వామి ఎంతో కరుణతో ఇచ్చిన అపూర్వ అవకాశాన్ని తెలుసుకోలేకపోయాడు. అందువలన ‘మనకి మనం తోడ్పడితేనే, దేవుడుకూడా తోడ్పడగలడు’ అనే సామెత నిజమైంది. దురదృష్టవశాత్తు, చాలా రోగులకు  ప్రేమ మరియు జ్ఞానంతో ఒక రెమెడీ చేయబడినప్పటికీ, రోగి దానిని క్రమశిక్షణతో తీసుకుంటే తప్ప అది తన ప్రభావం చూపించజాలదు.  

సంతాన లేమి కేసులు 10717...India

నేను వంధ్యత్వానికి (సంతాన లేమి) సంబంధించి చాల కేసులను చేశాను. సెప్టెంబర్ 9, 2009 న నాతొలి రోగిగా ఒక గృహిణి వచ్చింది. ఆమె భర్త డ్రైవర్. ఈజంటకు వివాహమై 10సం.లు. ఐనా పిల్లలు లేరు. గత 5సం.లుగా వారు వివిధ గైనకాలజిస్ట్ ల వద్ద చికిత్సపొందిరి. కాని ఫలితం లేకపోవుటవల్ల, వారు నిరాశకు గురయ్యారు. నా హృదయపులోతునుండి స్వామిని, 'వారికొక బిడ్డను ప్రసాదించమని' ప్రార్థించాను.

నేను రెండు మిశ్రమాలు తయారుచేసాను. భార్యకు ఒక మందు మిశ్రమం:
#1. CC8.2. Pregnancy tonic…TDS

భర్తకు మరొకటి:
#2. CC14.3 Male infertility...TDS

పై రెమెడీలతో పాటు నేను ఒక లీటరు నీటిలో 2 చుక్కల CC10.1 Emergencies కలిపి, వారిద్దరిని విబ్రియో వైద్యం ప్రారంబించే మొదటి రోజు రోజు ఉదయాన్నే ఈ రెమెడీని ½ కప్ తీసుకోమని ఆ తరువాత వారి సంబందిత రెమెడీలను తీసుకోమని చెప్పాను. ఆ విధంగా వారు సెప్టెంబర్10 న విబ్రియోనిక్స్ ప్రారంభించి, 4నెలలు కొనసాగించేరు. జనవరి 2010 మధ్యలో, ఆ స్త్రీ సంతోషంగా, ఆనందభాష్పాలతో, నావద్దకు వచ్చి, కుటుంబవైద్యులు, ఆమెను 2నెలల గర్భవతని ధ్రువీకరించినట్లు చెప్పింది. నేను ఆమెను ప్రసవమయ్యే వరకు :#1 ...BD గర్బాస్రావాన్ని నివారించుటకు వాడమని చెప్పితిని. స్వామి దయవలన, ఆమె సురక్షితంగా, ఆరోగ్యమైన కుమార్తెని ఆగష్టు 27, 2010 ప్రసవించినది.

ఈమె ఒక చిన్నవూరినుండి కావటంవల్ల ఈవార్త త్వరగా వ్యాప్తి చెందినది. ఈమె కేసు సంతోషకరమైన ఫలితం పొందిన తెలిసి, కడుపు పండని అనేక జంటలు ఆమెను కలుసుకున్నారు. వారంతా నా చిరునామా తెలుసుకొని నన్ను సంప్రదించిరి. అలాంటి 12 కేసులకు నేను చికిత్స ప్రారంభించాను. వానిలో 4 కేసులు విజయం సాధించాయి.

అక్టోబర్ 8, 2010 న, ముందటి జంటకు బిడ్డ జన్మించిన 6వారాలకు, చికిత్సకోసం 29సం.ల. మహిళ నా వద్దకు వచ్చింది. ఆమె ఒక నర్సు. ఆమె ఒక పెయింటర్ ని  8 సం.ల క్రితం పెళ్లి చేసుకున్నది. ఆమె భర్త మితిమీరిన మద్యపానంతో, బలహీనమైనాడు. కానీ మొండిగా వైద్యుడివద్దకు వెళ్ళడానికి నిరాకరించేవాడు. ఆకారణంగా సంతానంలేక ఆమె నిరాశకు గురైంది. ఈ కేసుకోసం స్వామిని నేను ప్రార్థించాను. నేను మహిళ కోసం  #1 ...TDS మరియు ఆమె భర్త కోసం #2 ... TDS తయారు చేసాను.

భర్త యొక్క మద్యపానం మానిపించుటకు, నేను లీటరు నీటిలో CC15.3 Addiction మందు 3 చుక్కలను కలిపి సిద్ధం చేసాను. ప్రతిరోజు ఉదయం పైన యిచ్చిన మందు నీటిని 10 మి.మీ. తన భర్తకి #2...TDS మొదలెట్టేలోగా ఇవ్వమని ఆ మహిళకు ఆదేశించాను. ఈజంట అక్టోబరు 9 న చికిత్స ప్రారంభించారు. ఆరునెలల్లో ఆమెభర్త మద్యపానం 90% తగ్గి, ఏప్రిల్ చివరికి ఆమెలో గర్భవతి లక్షణాలు కనిపించాయి. ఆమె గర్భనిర్ధారణ తర్వాత, భార్య  #1...TDS కొనసాగించబడిoది. భర్త యొక్క మందు CC15.3 Addiction…TDS కు మార్చబడింది. వారికి చక్కని కుమార్తె డిసెంబర్ 24, 2011 న జన్మించింది. బిడ్డ కలగడమే కాక, ఆమె భర్త ముఖ్య సందర్భాలలో తప్ప మద్యం పూర్తిగా మానేసాడు. బిడ్డ పుట్టిన దగ్గరనుండి అతను చాలా సంతోషంగా వున్నాడు. ఈవిధంగా స్వామి ఆ జంటను దీవించారు.

అక్టోబర్15, 2010, పైన పేర్కొన్న మహిళ తన సమస్యతో నావద్దకు వచ్చిన వారంతర్వాత, మరొక జంట నన్ను చూడడానికి వచ్చారు. 36సం.ల. భార్య, 38సం.ల. భర్త, వారి పెళ్ళైన 14 సం.లలో సంతానంకోసం అనేక అలోపతి మందులు వాడారు. ఆ స్త్రీకి 24సం.లకి, 28సం.ల.కి 2 గర్భస్రావాలు జరిగినవి. నేను భార్యకు: #1...TDS / భర్తకు #2...TDS యిచ్చితిని.

నవంబర్ 2011 చివరివారంలో సంవత్సరంపైగా చికిత్స పొందేక, భర్త వచ్చి, తనభార్య గర్భవతిగా ఉందనే శుభవార్త చెప్పారు. నేను ఆమెను ప్రసవం వరకు #1...TDS ను కొనసాగించమన్నాను. అంతా బాగా జరిగిందనుకుంటే ప్రసవసమయంలో బొడ్డుత్రాడు మెడకు చుట్టుకొని శిశువు బ్రతకలేదు. ఈ విషాదం స్వామికి తెలుసు.

జనవరి 22, 2014న 33ఏళ్ల మహిళ సంతానంకోసం నావద్దకు వచ్చింది.  ఆమె 42సం.ల.భర్త లైంగికసమస్యలతో బాధపడుచున్నాడు. తను భావప్రాప్తి మరియు రతి సమయమున వీర్య స్కలనం చేయడంలో ఇబ్బంది పడుతున్నాడు. దానివల్ల దాంపత్యసుఖం కొరవడినప్పటికీ, సిగ్గువల్ల వైద్యునివద్దకు వెళ్లలేదు. ఒక వైద్యుడు అతని వీర్యం బాగా చిక్కగా వుండుటవలన వీర్యస్కలనం జరగటం లేదని అందువలన బిడ్డలు కలిగే మార్గం లేదని చెప్పటంతో, అతను న్యూనతభావంతో బాధపడుతూ లైంగిక సంపర్కమే మానేసాడు. తనకీజన్మలో పిల్లలు కలగరని ఆమె నావద్దకు వచ్చి ఏడ్చింది. నేను ఆమెను ప్రేమతో ఓదార్చి, దేవునిదయవుంటే అన్నీ సాధ్యమేనని ధైర్యం చెప్పాను.

ఆమెభర్తకొరకు 2మందులు సిద్ధం చేశాను. భర్త యొక్క భావోద్వేగ నియంత్రణకు, 1 లీటరు నీటిలో, 3చుక్కల CC15.1 Mental & Emotional tonic కలిపి సిద్ధం చేసాను. ప్రతి ఉదయం 10 మి.మీ. మిశ్రమాన్ని ఇవ్వమని, తరువాత CC14.1 Male tonic + CC14.3 Male infertility...TDS ఇవ్వమని ఆమహిళకు చెప్పేను. 2నెలల చికిత్స తర్వాత, తన భర్త రతిపట్ల ఆసక్తి చూపుతున్నాడని ఆమె చెప్పింది. వీర్యస్కలనం కూడా కొంత వరకు జరుగుతోంది. 6నెలల చికిత్స తర్వాత, జూలై 17న, ఆమె గర్భవతిగా ఉన్న వార్తను ఆనందంగా చెప్పింది. ఆమె భర్త కూడా నాకు కృతజ్ఞతలు తెలిపారు. డిసెంబరు 2014 లో బిడ్డ జన్మిస్తుందని భావిస్తున్నారు. అయితే భర్త తన వైబ్రియోనిక్స్ మందులను నిలిపివేశారు. కానీ భార్య "మా భౌతిక సంబంధాన్ని పక్కనబెట్టితే, నా భర్త చాలా సంతోషంగా ఉన్నారు. అతని యొక్క సహకారం, ఆనందం నాకు చాలు. అంతేకాక నేను బిడ్డను పొందుతున్నాను, అది దేవుని కృప. అంతే నాకు చాలు." అన్నది.

జనవరి 28, 2014న మరొక పిల్లల్లేని జంట, 28సం.ల భార్య, 35సం.ల. భర్త నావద్దకు వచ్చారు. భర్త క్షురకుడు, భార్య గృహిణి. పేదరికం వల్ల వారు వైద్యునివద్దకు వెళ్లలేదు. వారు 7సం.లుగా దేవుని నమ్మి, దేవుడే పిల్లలను ప్రసాదిస్తాడని ఎదురుచూసేరు. కాని క్రమంగా వారి విశ్వాసం చెదిరి, విబృయోనిక్స్ కొరకు వచ్చిరి. నేను ఆమెకు: #1...TDS ఇచ్చి, భర్తకు: #2 ...TDS యిచ్చేను. 4నెలల చికిత్స తర్వాత, ఆమహిళ గర్భవతి అయి, ప్రసవం వరకు: # 1 ... TDS ని కొనసాగిస్తోంది. 2015 జనవరిలో రాబోయే బిడ్డకోసం సంతోషంతో ఎదురుచూస్తున్నారు.

నేను మా కుటుంబంలోని పెంపుడు పిల్లి కేసుతో ముగిస్తాను. డిసెంబరు 2011 లో, 1½ సం.ల మా పిల్లి గర్భం దాల్చింది. కడుపు పెద్దదై, బాగా నిద్రపోతూ ఉండేది. ఒకరోజు ఉదయం తను మూలుగుతూ తిండి మానేసింది. నేను తను ఆ రోజు ప్రసవిస్తుందేమోనని భావించాను. 2 రోజులు గడిచినా, పిల్లి అరుస్తూ, పాలుతప్ప వేరేమీ తీసుకోడంలేదు. మేము నిస్సహాయంగా బాధపడ్డాము. అప్పుడు నేను ఒక ప్లాస్టిక్ గిన్నెలో 30మి.లీ పాలలో, ఒకచుక్క CC10.1 Emergencies వేసి, కాస్త విభూతిని జోడించాను. ఆమె బాధ నివారణకై స్వామిని ప్రార్ధించేను. పిల్లి ఆపాలు తాగింది మరియు 2గంటల్లో, 3 అందమైన పిల్లులకు జన్మనిచ్చింది.

 

మొక్కలలో ఒత్తిడి 02864...USA

అభ్యాసకురాలు వ్రాస్తున్నారు : వైబ్రియోనిక్స్ సమావేశం సంపుటంలోని నా వ్యాసంలో, నేను 2013ఆగస్ట్ లో మరోప్రదేశం తరలి వెళ్ళే సమయంలో బాగాపాడైన  వివిధరకాల ఇంట్లో పెరిగే మొక్కలు, వైబ్రియోనిక్స్ వాడుకవల్ల ఆరోగ్యంగా పెరిగిన సంగతి తెల్పితిని.

నేను వాటికి యిచ్చినవి: #CC1.2 Plant tonic + CC15.1 Mental & Emotional tonic... 3TW నీటిలో కలిపితిని.

2 నెలల పైచికిత్సతో మొక్కలన్నీ కోలుకుని, ఆరోగ్యంగా అయినవి. ఇప్పుడు మీకు ఆ తరువాతి విషయాలను వివరిస్తాను. పై రెమెడీ 2TW గా కొనసాగించబడింది. పెద్దమొక్కలకు 6-8కప్పుల మందునీటిని, చిన్నవాటికి 2కప్పులు పోస్తున్నాము. సుమారు ఏడాది తరువాత మొక్కలు ఆకుపచ్చగా, రెట్టింపుగా పెరుగుట ఫోటోలలో చూడవచ్చు! ఎదుగుదలలో మార్పు ఫెర్న్ మొక్కలో ప్రస్పుటంగా ఫోటోలో కనపడటం మనం గమనించవచ్చు. ఈ ఫెర్న్ మొక్కే ఎక్కువగా తరలి వెళ్ళే సమయంలో పాడైంది. కాని తర్వాత ఆగష్టు2013లో, అక్టోబర్ 2013 లో, మరో ఏడాదితర్వాత 2014 అక్టోబరులో తీసిన ఫోటోలలో మొక్క యొక్క అద్బుతమైన ఎదుగుదల మనం చూడవచ్చు. 

Fern, August 2013 Fern, October 2013 Fern, October 2014

ఇంట్లో పెరిగే dracaena fragrans (indoor corn plant) మొక్కజొన్నమొక్కలో భారీమార్పులు  పై విబ్రియో మందులు వాడాక కనిపించాయి. ఈ మొక్క ప్రతి సంవత్సరం తియ్యని మల్లె పూల లాంటి వాసన గల పుష్పాలతో వికశిస్తుంది. కానీ 2013లో ఈ మొక్క పుష్పించలేదు. 2014లో ఇది పెద్దపువ్వులతో, ఇంకా తియ్యని ఘాడమైన సువాసనతో ఇల్లంతా నింపుతోంది. క్రింది ఫోటోలు ఈ కార్న్ మొక్క ఇంట్లోకి తెచ్చిన ఆగష్టు 2013, ఆ తరువాత అక్టోబర్ 2013 మరియు అది బాగా వికసించిన అక్టోబర్ 2014 నెలలో తీసినవి. 

Corn Plant, August 2013 Corn Plant, October 2013 Corn Plant, October 2014 Corn Plant, October 2014

ఒక తల్లి పిల్లి యొక్క ప్రసవ వేదన సమస్య 10717...India

అభ్యాసకురాలు వ్రాస్తున్నారు:  డిసెంబరు 2011 లో, 1½ సం.ల మా పిల్లి గర్భం దాల్చింది. కడుపు పెద్దదై, బాగా నిద్రపోతూ ఉండేది. ఒకరోజు ఉదయం తను మూలుగుతూ తిండి మానేసింది. నేను తను ఆ రోజు ప్రసవిస్తుందేమోనని భావించాను. 2 రోజులు గడిచినా, పిల్లి అరుస్తూ, పాలుతప్ప వేరేమీ తీసుకోడంలేదు. మేము నిస్సహాయంగా బాధపడ్డాము. అప్పుడు నేను ఒక ప్లాస్టిక్ గిన్నెలో 30మి.లీ పాలలో, ఒకచుక్క CC10.1 Emergencies వేసి, కాస్త విభూతిని జోడించాను. ఆమె బాధ నివారణకై ఒక తల్లి పిల్లి యొక్క ప్రసవ వేదన సమస్య ఒక తల్లి పిల్లి యొక్క ప్రసవ వేదన సమస్య స్వామిని ప్రార్ధించేను. పిల్లి ఆపాలు తాగింది మరియు 2గంటల్లో, 3 అందమైన పిల్లులకు జన్మనిచ్చింది.

ప్రాక్టీషనర్ వివరాలు 10717...India

స్వీయ అనుభవము

ఉత్తర కన్నడప్రాంతంలో బాల వికాస్ జిల్లా సమన్వయకర్తగా నేను పనిచేస్తున్నాను. మాకు 75 సమితి/భజన గ్రూపులు, 110 బాల వికాస్ కేంద్రాలు ఉన్నవి. నేను గురువులకు సూచనలివ్వడం, శిక్షణా కార్యక్రమ నిర్వహణ, పరీక్షలు నిర్వహణ, కేంద్రాలను సందర్శించడం మొదలైన వాటికి మార్గదర్శకత్వం చేసే గొప్ప ఉద్యోగంలో వున్నాను. నేను BSNL లో ఉద్యోగం చేసేవాడిని కాని రిటైర్ అగుటకు 11 సం.ల. ముందుగా నేను ఈ ఉద్యోగాన్ని వదిలి వెళ్ళాను. ఎందుకంటే పదవీ విరమణకు ముందే నేను ఆరోగ్యము, శక్తి ఉన్నప్పుడే స్వామి యొక్క సంస్తలలో సేవ చేయడం డబ్బు సంపాదించడం కన్నా ముఖ్యమని భావించాను.

నేను ప్రచారంకాని ప్రకటనగాని కోరలేదు [గమనిక: ఈమాటలన్నీ మా కర్ణాటక రాష్ట్ర కోఆర్డినేటర్ 10776 సిఫారసు చేసినవి. నేను స్వామికి సంతృప్తికల్గు పనిని చేస్తున్నానని ఆశిస్తున్నాను. నేను శ్రీ సత్యసాయి సేవాసంస్థల కార్యక్రమాల గురించి బాగా ఆలోచిస్తూ, స్వామి నాకు ఆప్పగించిన బాధ్యతలను నిర్వర్తిస్తున్నాను. అందుకని నేను ఎక్కువగా విబ్రో సేవ చేయలేనప్పటికి, రోగులు నా ఇంటికి వచ్చినప్పుడు మాత్రం నేను వారిని ప్రేమతో చూసుకుని సేవ చేస్తాను.

విబ్రియోనిక్స్ వైద్యంతో గర్భం మరియు ప్రసవానికి సంబందించిన కేసులలో నా యొక్క అనుభవాలను మీతో పంచుకోవాలనుకొంటున్నాను. నేను చాలా సంతాన లేమి కేసులకు చికిత్స అందించాను. వాటిలో దంపతులు కొన్ని సంవత్సరాలు సంతానంకై ఆరాటపడుతూ ఏ విదమైన ఫలితం పొందని కేసులు కూడా ఉన్నాయి. మరికొన్ని వాటిలో మానసిక భావోద్వేగ కారణాలు, ఆల్కహాల్ వ్యసనం, పురుషులలో రతి సంబందిత సమస్యలు మరియు గర్భస్రావం లాంటి కారణాలు కూడా ఉన్నాయి. వీటిలో కొన్ని గురించి సంతనలేమీ కేసులు శీర్షికలో మాట్లాడతాను. ఒక తల్లి పిల్లి ప్రసవ వేదన సమస్య గురించి కూడా నేను మీకు విశదీకరిస్తాను. 

ప్రాక్టీషనర్ వివరాలు 02864...USA

స్వీయ అనుభవం

నేను భారతదేశంలో పుట్టి, పెరిగేను. 1993లో అమెరికా వచ్చాను. ఇప్పుడు అర్బనా-చాంపైన్, ఇలినాయిస్ లో నాభర్త, ఇద్దరు కుమారులతో వుంటున్నాను. నేను సైకాలజీలో, బిజినెస్ మేనేజ్మెంట్ లో కూడా రెండు బ్యాచిలర్ డిగ్రీలు చేసితిని. నేను రేడియోలాజికల్ సైన్స్ లో సర్టిఫికేట్ కోర్స్ చేసి, మేము గత ఏడాది బఫెలో, న్యూయార్క్ కు మారే వరకు రేడియాలజికల్ టెక్నీషియన్ గా పనిచేసితిని. 

Practitioner 02864

మా బఫెలో సాయి సెంటర్లో, 2012 లో ఒక సాయిభక్తుడు చెప్పగా ‘సాయి వైబ్రియోనిక్స్’ గురించి మొదటగా నేను విన్నాను. ఆవేసవిలో నేను నడుమునొప్పితో బాధపడుతూ, ప్రాక్టీషనర్ ద్వారా మెయిల్ లో రెమెడీని పొంది, మందు మిశ్రమం మాత్రలు సేవించగా, వెంటనే తగ్గింది. అది చూచి నాభర్త వైబ్రియోనిక్స్ వాడిరి. కొన్నిరోజుల్లోనే మా వెన్ను సమస్యలన్నీ అద్భుతంగా తగ్గినవి. అప్పుడు నేను స్వామిని నాకీ సేవ చేసే అవకాశం అదృష్టం రావడం స్వామి సంకల్పమైతే ఆ అవకాశాన్ని ఇవ్వమని ప్రార్ధించాను. కొన్నినెలల తరువాత తొలిసారిగా అమెరికాలోయీ శిక్షణ ఇవ్వబోతున్నట్లు విన్నాను. మళ్ళీ నేను అదే స్వామి సంకల్పమైతే, అందులో పాల్గొనేటట్లు చేయమని స్వామిని ప్రార్థించాను. నా కోరిక ప్రకారం నేను 2012 అక్టోబరులో విజయవంతంగా JVP శిక్షణ పూర్తిచేసి, నేను గత 2సం.లుగా మందుమిశ్రమాలను సాదారణ కంబోలను ఉపయోగించి రెమెడీలను సిద్దం చేస్తున్నాను.

భగవాన్ అపారకృపవల్ల నడుమునొప్పి, మోకాలినొప్పి, మోకాలి శస్త్రచికిత్స తర్వాత, జ్వరం, పొట్టలో పుండ్లు, ఆమ్లత్వం, ఒత్తిడి, తామర, నిద్ర సమస్యలు, నిర్విరామ కాలునొప్పి, క్యాన్సర్ లకు చికిత్స విజయవంతంగా చేసాను. మొక్కలకి, జంతువులకి కూడా తగిన చికిత్స చేసాను.

అమెరికా,కెనడా ప్రాంతాలలో ఆపరేషన్స్ సమన్వయకర్త గా పని కూడా నాకు స్వామి యిచ్చేరు. నా ఉద్యోగబాధ్యతల్లో భాగంగా వైద్యులనుండి నెలవారీ నివేదికలను సేకరించి డా. అగర్వాల్ కు సమర్పించడం, వైద్యుల మందు మిశ్రమాలను మంచిస్థితిలోవుంచి, సీసాలు తాజాగా ఎండిపోకుండా వుంచుటవంటి ఆచరణాత్మక సలహాలను, చిట్కాలతో సహా వైద్యులకు నెలసరి రిమైండర్లను నేను పంపిస్తాను. నేను మందుమాత్రలు, సీసాలు మున్నగు ఇతర అవసరాలు వైద్యులకు సరఫరా చేస్తాను. ఇతర ప్రాక్టిషనర్స్ విధినిర్వహణకు తోడ్పడుట నా అదృష్టం. ఈబాధ్యత నన్ను బిజీగావుంచి, నాలో ఆత్మబలం కలిగిస్తూ, బాబా ప్రేమద్వారా మానవాళికి మంచి చేయగల అద్భుత అవకాశమిస్తోంది.

స్వామి ఆశీర్వాదంతో, నేను జనవరి 2014 లో భారతదేశానికి వెళ్లి మొదటి ఇంటర్నేషనల్ విబ్రియోనిక్స్ సమావేశానికి హాజరయ్యాను. సమావేశం తరువాత, నేను SVP కోర్సు పూర్తి చేసి, ప్రసారాల ద్వారా నా కుటుంబానికి, ఇతరులకు సహాయపడుతున్నాను.

చికిత్సా ప్రసారాలు రోగికి, వారి ఇంటిలో మరియు SRHVP యంత్రం చుట్టూ ఉన్న వ్యక్తులకు చాలా ఉపయోగంగా ఉంటాయన్న సంగతి నేను గమనించాను. నా ఉద్దేశంలో SRHVP యంత్రం స్వామి మానవాళికి ప్రసాదించిన ఒక  అధ్బుతమైన బహుమతి మరియు దీవెన. అందువలన దానిని ఖాళీగా ఉంచరాదు. స్వామికృపవల్ల SRHVP నిత్యం పనిచేస్తుంటుంది. నేను ఆ మెషీన్ లో SM5 Peace & Love Alignment ఎల్లపుడూ వుంచుతాను. ఇది కష్టసమయాల్లో మాకన్నివేళలా సహాయం చేసింది. మా పిల్లలను కొత్త హైస్కూల్ కు తగ్గట్లు సరిదిద్దింది మరియు మాకాన్ని విధాలా ఉపయోగపడింది.

సేవకు ప్రతిబింబాలు
దైవాన్ని ప్రేమించే అత్యుత్తమమార్గo అందరినీ ప్రేమించడం, అందరినీ సేవించడం, ఆని స్వామి బోధించారు. సేవ మనహృదయాన్ని, దృక్పధాన్ని విస్తృతం చేసి, ఆనందంతో నింపుతుంది, ఐక్యతను ప్రోత్సహించి, ఆత్మసత్యాన్ని ప్రకటిస్తుంది. వ్యక్తిలో దుర్గుణాలను నిర్మూలిస్తుంది. దైవంలో ఐక్యతకు ధ్యానం, యోగ, భజన, నామస్మరణ మున్నగు వేరేమార్గాలున్నాయి. వైబ్రియోనిక్స్ వైద్య సేవ ద్వారా మనం పరుల మంచిని కొరడమే కాకుండా, ఏ విధమైన వ్యక్తిగత లాభాపేక్ష లేకుండా నిస్స్వార్ధసేవలందిస్తున్నాము. విబ్రియోనిక్స్ నివారణలద్వారా ప్రాక్టిషనర్స్ గా స్వామి ప్రేమ, దీవెనల పవిత్రస్పందనలను ప్రపంచవ్యాప్తం చేస్తున్నాము.

 

ప్రశ్నలు సమాధానాలు

1. ప్రశ్న: ఎబోలా నివారణ మరియు చికిత్స కోసం ఏవైనా రెమెడీలు ఉన్నాయా?

 సమాధానం: నివారణకు : CC3.3 High Blood Pressure + CC3.5 Arteriosclerosis + CC9.3 Tropical diseases + CC19.7 Throat chronic...BD 3పూటలా వాడాలి. ముందునుండే బాధపడుతున్నవారికి బ్లడ్ నోసోడ్ వుపయుక్తమైనది.

++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

2. ప్రశ్న: పశ్చిమ నైలువ్యాధికిచ్చిన కాంబోకి నేను కృతజ్ఞుడిగా ఉంటాను. దీన్ని ఉష్ణమండల వ్యాధిగా పరిగణించాలా?

   సమాధానం:  క్రితం ఏడాది వరదలవల్ల ఈయేడు ప్రబలమైన దోమల ద్వారా వ్యాపిస్తున్న వైరల్ వ్యాధి వెస్ట్ నైల్ అనేది. దీని దృష్ట్యా, చికిత్సకోసం CC9.3 Tropical diseases + CC18.5 Neuralgia మరియు వ్యాధి నుంచి కోలుకొన్నాక, తక్కువ మోతాదులో అదే కాంబోను కొనసాగించండి.

++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

3. ప్రశ్న: పిల్లల్లో వేగంగా వ్యాప్తి చెందుతున్న సంక్రమణవ్యాధికి ఎన్టెరోవైరస్ D68 కొరకు కాంబో యివ్వగలరా?

 సమాధానం: ఎన్టెరోవైరస్ అనేది పికోర్నావైరస్ రకం, ఇదొక రైనోవైరస్, దీనివల్ల రోగులు జలుబుతో వేగంగా క్షీణించి, ఆసుపత్రిలో చేరి, శ్వాసకోసం వెంటిలేటర్స్ మీద ఆధారపడతారు. వారికి శ్వాసకష్టం ఉంటే CC9.2 Infections acute + CC19.3 Chest infections ఇవ్వమని నా సలహా. వ్యాప్తి చెందిన ప్రదేశంలోవుంటే పిల్లలకు, పెద్దలకు CC9.2 నివారణ మోతాదును ఇవ్వండి. ఇది ఉష్ణమండలీయవ్యాధి కాదు, మరియు వ్యాధి నుంచి కోలుకొన్నాక CC12.1 Adult tonic లేదా CC12.2 Child tonic ఇవ్వండి.

++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

4. ప్రశ్న: టైప్2 మధుమేహం చికిత్సలో యిచ్చే SR305 ప్యాంక్రిటిన్, SR499 ఇన్సులిన్, కాంబో CC6.3 మధుమేహంలో చేర్చబడలేదని నేను గమనించాను. మీరు ఇన్సులిన్ తీసుకునే మధుమేహం రోగులకు, ఈ కార్డ్స్ ను ఎప్పుడైనా ఇచ్చారా?

  సమాధానం: అవును, ఈ కార్డ్స్ CC6.3 మధుమేహంలో కనిపించవు. కాని వీటిని ప్రత్యేకంగా ఎందుకు కలపలేదoటే అవి రెండు OM8 Hypo & Hyperglycaemia మరియు BR2 Blood sugar లో కలపబడి ఉన్నాయి.  సోహమ్ బుక్3 లో ఈ విషయాలు వివరంగా ఉన్నాయి.  

++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

5. ప్రశ్న: ఒక రోగికి మధ్యాహ్నభోజనం తర్వాత బాగా అలసట, తినగానే కడుపులో కదలిక, నిద్ర రావటం జరుగుతోంది. ఉద్యోగంలో అతనికి ఈవిషయం చాలా ఇబ్బందిగా వుంది. దయచేసి సలహా ఇవ్వండి

  సమాధానం: అతను భోజనంలో అలెర్జీని కలిగించేవి తిన్నా, లేదా భోజనంలో బరువైన పదార్ధాలు తిన్నా, కాలేయంపై ఒత్తిడి అధికమై, మీరు చెప్పిన బాధలు రావచ్చు. కనుక అతను వెన్న, నెయ్యి, పాలు, జున్ను, చమురు, కొవ్వు మరియు ఆల్కహాల్ వంటివి చాలా తక్కువ తినాలి. అతడు తనజీర్ణశక్తికి తగినవాటినే అతను యెంచుకోవాలి. జీర్ణశక్తి మామూలుగా అయ్యాక ఆల్కహాల్ తప్ప మిగతావన్నీ తినవచ్చు. అతనికి CC4.1 Digestion tonic + CC4.2 Liver & Gallbladder tonic ఇచ్చి అతని పరిస్థితికి సహాయపడవచ్చు.

++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

6. ప్రశ్న: నీటితో చేసిన మిగిలిపోయిన విబ్రో నివారణతో ఏది చెయ్యాలి అని దయచేసి సూచించండి.

 సమాధానం: నిల్వ ఉంచిన నీరు పాడై, బాక్టీరియా పెరగటంవల్ల కలుషితమవుతుంది. అందువలన నీటితోచేసిన వైబ్రో కాంబోమిశ్రమాలు, 7రోజులు దాటాక వాడరాదు. వేడి వాతావరణంలో యింకా త్వరగా పాడవుతాయి. కావున ముందే వాడేయాలి. అంతే కాక మందు సీసాలను, యితర మందు డబ్బీలను మూతవేసే వుంచాలి.

++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

7. ప్రశ్న: ఒక క్వార్ట్జ్ క్రిస్టల్ ను ఛార్జింగ్ చేయు విధానం ఏమిటి?

 సమాధానం: క్రిస్టల్ ను ఒకే కార్డ్ యొక్క వైబ్రేషన్ తో చార్జ్ చేయదలిస్తే క్రిస్టల్ ను రెమెడీ వెల్ లో 12 గంటలు పాటు ఉంచే ప్రామాణిక ప్రక్రియను వాడాలి. క్రిస్టల్ ను కాంబోతో ఛార్జింగ్ చేస్తున్నప్పుడు, ఒకకాంబోలో 10 కార్డ్స్ కన్నా ఎక్కువ వాడద్దు. అలా తయారైన కాంబోని సాంపుల్ వెల్ లో ఉంచి 30C వద్ద సామర్ధ్యాన్ని పెంచాలి. క్రిస్టల్ ఛార్జింగ్ కోసం 108CC బాక్స్ వాడరాదు. ఛార్జింగ్ ముందు క్వార్ట్జ్ క్రిస్టల్ ను శుబ్రపరచాలి. గంటసేపు పోతెంతైసర్ లో వుంచి  10MM పొటెన్సితో శక్తివంతముగా చేయచ్చు. ఎండలో కాని, పౌర్ణమిరాత్రిలో కానీ గంటవుంచి కూడా క్రిస్టల్ ను శుభ్రంచేయవచ్చు. ఒక చార్జ్డ్ క్రిస్టల్ ను 10ని.లు TDS ధరించాలి. శరీరంపై క్రిస్టల్ ఎల్లవేళలా ధరించితే, క్రిస్టల్ చార్జ్ 4 నెలలపాటు ఉంటుoది.

 

వైద్యులకే వైద్యుడి యొక్క దివ్య వాక్కు

"ఏ పరిస్థితుల్లోనూ ప్రేమను కోల్పోకండి. ఎవరైనా మిమ్మల్ని ద్వేషిస్తే, అతనిని మీ స్వంత సోదరునిగా ప్రేమించండి. మీరు అతన్ని రహదారిపై కలుసుకుంటే, కోపం చూపక, ప్రేమతో అతన్ని పలకరించు. మీ ప్రేమ ఖచ్చితంగా అతనిలో పరివర్తన తెస్తుంది."

                                                                         సత్యసాయిబాబా, సనాతన సారధి, జనవరి 2004

**********************************************************************************************"

ప్రతి ఒక్కరి ప్రథమ బాధ్యత, దేవుని ప్రేమను సృష్టిలో అన్నిటిలో ప్రవహింపచేయడమే. ప్రతి మనిషి తనకోసం కాక, సమాజానికి సేవలనందించవలెను. శరీరంపట్ల శ్రద్ధ తగ్గించి, స్వీయ సంతృప్తిని గ్రహించడమే మార్గం. మనుష్యులపట్ల నిస్వార్ధప్రేమను అవలంబించడమే మానవజన్మ లక్ష్యం."                               

                                                   శ్రీ సత్యసాయిబాబా వారి తెలుగు పద్యం, సనాతన సారధి, అక్టోబర్ 1996

ప్రకటనలు

రానున్న వర్క్ షాపులు:

❖ ఇండియాలో పుట్టపర్తి: ఏవిపి వర్క్ షాపు 19-22 నవంబర్ 2014, హెమ్ ని [email protected] వద్ద కాంటాక్ట్ చేయండి

❖ఇండియాలో ధర్మక్షేత్రం, ముంబయి: ఏవిపి వర్క్ షాపు 29-30 నవంబర్ 2014, సతీష్ ని కాంటాక్ట్ చేయండి    [email protected]  ఫోన్ లో మాట్లాడండి 022-2876 8883

❖ఇండియాలో ఢిల్లీ-యన్.సి. ఆర్ : ప్రాక్టీషనర్స్ సమావేశం 7డిసెంబర్ & ఎస్.వి.పి. వర్క్ షాపు 1-9 డిసెంబర్ 2014, సంగీతను కాంటాక్ట్ చేయండి  [email protected]

❖ ఇండియాలో కసరగడ్, కేరళ: ఏవిపి వర్క్ షాపు డిసెంబర్ 2014, రాజేష్ ని కాంటాక్ట్ చేయండి - [email protected] లేక ఫోను ద్వారా 8943-351 524 / 8129-051 524.

❖అమెరికాలో లెక్సింగ్టన్, ఏం.ఏ స్టేట్: ఏవిపి వర్క్ షాపు 9-11 జనవరి 2015, సూసాన్ ని కాంటాక్ట్ చేయండి -  [email protected] లేక ఫోన్ ద్వారా 304-274-0477

అందరు శిక్షకులకు: మీకు ఒక వర్క్ షాప్ షెడ్యూల్ ఉంటే వివరాలు పంపవలెను:  [email protected]

 

                                          అభ్యాసకులకు ముఖ్యమైన గమనిక 

మాకేసుల్లో చాలా అద్భుతమైనవానిని కూడా, కొన్ని ముఖ్యవివరాలు లేక పంచలేకపోతున్నాము. కనుక మీరు మీ కేసులను పంపినప్పుడు కిందివాటిని చేర్చండి:

దయచేసి మీ కేసుల్లో రోగివయస్సు, పురుషుడు/స్త్రీ, చికిత్స ప్రారంభించిన తేదీ, రోగలక్షణాల వివరాలజాబితా, అన్ని దీర్ఘకాలిక లక్షణాల వివరణాత్మక జాబితా, ప్రతి లక్షణం వ్యవధి, ప్రతి దీర్ఘకాలిక లక్షణంయొక్క కారణం, పూర్వపు లేక ప్రస్తుతపు చికిత్స వివరాలు, ఇచ్చిన కాంబో వివరాలు, మోతాదు, కాలవ్యవధి, తేదీలవారీగా ఎంతశాతం గుణం కనిపించినది, రోగి ప్రస్తుత పరిస్థితి, రోగి ఆకలి, నిద్ర వగైరా యితర రోగికి సంబంధించిన వివరాలు.

పై వివరాలన్నీ రాబోయే వార్తాలేఖలలో మీకేసులు ప్రకటించుటకు చాలా సహాయపడతాయి

మావెబ్ సైట్ www.vibrionics.org. మీరు మీ రిజిస్ట్రేషన్ నెంబర్ తో లాగిన్ (Login) అయి అభ్యాసకుని విభాగంలో చూడగలరు. మీ ఇ-మెయిల్ అడ్రసు మారినచో, దయచేసి మాకు [email protected] ద్వారా వీలైనంత వేగంగా తెలియ చేయండి.

మీరు ఈ వార్తాలేఖ మీ తలిదండ్రులతో పంచుకొనవచ్చును. వారి ప్రశ్నలు జవాబులకోసమో, పరిశోధనకొరకై మీకు పంపబడతాయి. 

అదనపు సమాచారం

కాన్ఫరెన్స్ కాల్స్ ఉపయోగించి ప్రాక్టీషనర్ సహాయం అందించుటలో నా అనుభవం

ప్రాక్టీషనర్ 01339…యు.ఎస్.ఏ

నేను కాన్ఫరెన్స్ కాల్స్ ద్వారా నాచుట్టుపట్ల అభ్యాసకులకు తోడ్పడిన అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. ఎందుకంటే ఈ విషయాలు ఇతరులకు ఉపయోగపడే అవకాశం ఉంది. 2012లో అమెరికా, కెనడాలలో శిక్షకునిగా, దేశసమన్వయకర్తగా విబ్రియో సేవను ప్రారంభించినప్పుడు, నేను తోటి అభ్యాసకులకు తోడ్పడాలనుకున్నాను. మా తొలి బృందం అక్టోబరులో ఏ.వి.పి తరగతిలో పట్టభద్రులమై వైద్యం మొదలెట్టగానే, వారిసందేహాలను తీర్చువారులేక యిబ్బందిపడరాదని, సమయాన్నిఆదాచేయటానికి సమూహసమావేశాల్ని ఏర్పాటుచేసేము. నేను 1999లో అభ్యాసకుడిగా వైద్యం మొదలెట్టిన కొత్తలో, నాకు సందేహంవస్తే, ఫోన్లో అడిగేందుకు అమెరికాలో అప్పట్లో ఎవరూలేరు. నావలె యితరులు బాధపడకుండా, నేను కొత్త వైద్యులకు సాయి వైబ్రియోనిక్స్ నివారణలు అందించడంలో, వారికవసరమైన సలహాలు యిచ్చేందుకు నిర్ణయించుకున్నాను.

మేము వారి ప్రారంభశిక్షణ అయేక, 2వారాల తర్వాత ఈకాల్స్ ప్రారంభించి, 2నెలలపాటు 2వారాలకొకసారి కాన్ఫరెన్స్  కాల్స్ ద్వారా సలహాలిచ్చేము. ఆగష్టు2013 వరకు నెలకొకసారి చొప్పున ఒక సం. పాటు కాల్స్ చేసాము. అభ్యాసకుల కోరికపై, నేను తిరిగి సెప్టెంబర్ 2014లో కాన్ఫరెన్స్ కాల్స్ ప్రారంభించి, అభ్యాసకులు తమ ప్రశ్నలను పంపుతున్నంతకాలం కొనసాగించాలని అనుకుంటున్నాను.

నేను ఈకాల్స్ నిర్వహించే విధానం:

నేను ఉచిత కాన్ఫరెన్స్ కాల్ సేవను ఉపయోగిస్తాను: http://freeconferencecall.com లేక స్కైప్ లేదా ఇతర ప్రత్యామ్నాయాలు అలాగే పనిచేస్తాయి. అమెరికా, కెనడాలోని క్రియాశీల అభ్యాసకులకు వారిని ప్రశ్నలతో ముందుకు రమ్మని ఆహ్వానిస్తూ ఇమెయిల్ చేస్తాను. ముందుగా ప్రశ్నలను సేకరిస్తే, నేను సమాధానాలు సిద్ధంచేసి, అవసరమైన పరిశోధనలు చేస్తాను. నేను అభ్యాసకుల పేర్లను వారి ప్రశ్నలకు సమాధానమిచ్చేటప్పుడు సమావేశపు కాల్స్ లో చెప్పను. నిర్దేశిత సమయాన అభ్యాసకులందరూ కాన్ఫరెన్స్ కాల్ లో పాల్గొంటారు. దీని వలన అందరూ వుమ్మడిగా వినవచ్చు మాట్లాడవచ్చు. నేను పాల్గొంటున్నవారిని తమ పేర్లు చెప్పమని అడుగుతాను. ఈ కాల్స్ ఒక గంటకి పరిమితం.

నేను ప్రశ్న- జవాబు పంధా అనుసరిస్తాను. సాధారణంగా విబ్రియో సాధనకి సంబంధించిన ప్రశ్నలకు జవాబిస్తాను, ఉదాహరణకి, రోగులడిగే మందు వివరణ, మోతాదు, పధ్యం వంటివాటికి ఏవిధంగా స్పందించాలి మొదలుగునవి. మొత్తం గుంపుకు ప్రయోజనంలేని ప్రత్యేకసూత్రాల గురించి, నిర్దిష్ట కేసులకు సంబంధించిన ప్రశ్నలకు నేను సమాధానమివ్వను. అటువంటి ప్రశ్నలకు వేరుగా ప్రశ్న అడిగిన అభ్యాసకునికే నేను ప్రతిస్పందిస్తున్నాను. సమావేశం కాల్స్ తొందరలేని ప్రశ్నలకు ఉద్దేశించబడ్డాయి. ప్రశ్న-జవాబులయ్యాక సమయం ఉంటే, ముఖ్యసూత్రాలు లేదా పరిస్థితులగురించి, రికార్డ్స్ జాగ్రత్త చేయుటవంటివి గూర్చి చర్చిస్తాము. ముఖ్యంగా నిస్వార్ధమైన ప్రేమతో అన్నీ కేసుల్లో సేవ చేయటంగురించి వ్యాఖ్యలు చేస్తాను.

సామూహిక కాల్ లో పాల్గొనేవారికి ఈ విలువైన సమయం, ఆసక్తితో, స్పూర్తిదాయకంగా వున్నదంటున్నారు. కాల్ తరువాత ఈ ప్రశ్నలు - జవాబులు సాయి విబ్రియోనిక్స్ వార్తాలేఖకు పంపుతాము. మొత్తంమీద, నెలసరి సమావేశం కాల్స్ అభ్యాసకులకు ఉపయోగపడడమేకాక కాలాన్ని ఆదాచేస్తున్నాయి మరియు ఇవి అవసరమైనవారికి నిస్వార్థసేవలందిస్తున్న మనందరి కొరకు సత్సంగం లాంటివి.

జై సాయి రామ్!