Vol 4 సంచిక 1
January/February 2013
ముద్రింప తగిన వార్తాలేఖ
పూర్తి వార్తాలేఖ యొక్క కాగితం ప్రతి కావలెనన్నఈ పుటను ముద్రించండి
డా.జిత్. కే అగ్గర్వాల్ యొక్క మాటల్లో
ప్రియమైన ప్రాక్టీషనర్లకు,
ఈ 2013 నూతన మరియు పవిత్రమైన సంవత్సరం మీ అందరికీ ఎంతో ఆనందాన్ని అందించాలని అభిలషిస్తూ ప్రారంభిస్తున్నాను! స్వామి యొక్క అపారమైన దయ ద్వారా వైబ్రియానిక్స్ గత సంవత్సరం గొప్ప పురోగతి సాధించింది. మన భోధనా కార్యక్రమం యొక్క సంపూర్ణ పునర్నిర్మాణం విజయవంతంగా నిర్వహించాము. శిక్షణా కార్యక్రమాల నాణ్యతను మెరుగుపరచడానికి అన్ని స్థాయిలలో 6-10 వారాల వ్యవధి గల కరెస్పాండెన్స్ కోర్సును అన్నీ స్థాయిలలో ఏర్పాటు చేసాము. ప్రాక్టీషనర్ గా అర్హత సాధించడానికి తదుపరి 2-5 రోజుల ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా నిర్వహించాలని తలపెట్టాము. గత సంవత్సరం ఎంతోమంది నూతన అభ్యాసకులు శిక్షణ పొందారు, ఇప్పటికే ఉన్న చాలా మంది ఉన్నత స్థాయిని పొందారు మరియు అనేక మంది అభ్యాసకులు సర్టిఫైడ్ ఉపాధ్యాయులుగా కూడా మారారు. ఇది మన వైబ్రియానిక్స్ ఉద్యమం వేగంగా అభివృద్ధి చెందడానికి దోహదం చేసింది. దీనికి నేతృత్వం వహించిన ఉపాధ్యాయులు మరియు సలహాదారులు అంకితభావంతో మరియు అవిరామంగా చేసిన కృషికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మన వైబ్రియానిక్స్ కుటుంబంలో కొత్తగా చేరిన సభ్యులందరికీ ఆత్మీయ స్వాగతం!
మన వైబ్రియానిక్స్ లో నిర్వర్తించవలసిన కార్యక్రమాల స్థాయి పెరుగుతున్నందున పరిపాలన మరియు నిర్వహణలో సమన్వయ కర్తలుగా స్వచ్ఛంద సేవ అందించానికి చురుకైన అభ్యాసకులు అవసరం. మీరు ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా వైబ్రియానిక్స్ సేవలో ఏ స్థాయిలో నైనా ముందంజలో ఉండాలి అంటే దయచేసి మీ పేరు, అర్హత, మరియు అనుభవం తెలియజేస్తూ మాకు ఈ మెయిల్ పంపండి. ఈ విధంగా తగినంతమంది సమన్వయకర్తలు సమకూరినట్లయితే ఈ సంవత్సరం చివరిలో ప్రశాంతి నిలయంలో ఒక సమావేశము నిర్వహించాలని భావిస్తున్నాము.
కొంతమంది అభ్యాసకులు వారికి సంబంధించిన విజయవంతముగా స్వస్థత పొందిన కొన్ని అద్భుతమైన కేసుల గురించి కథలను నిరంతరం ఫోన్ ద్వారా మౌఖికంగా నివేదిస్తున్నారు, కానీ వాటిని వ్రాసి పంపడానికి తమ అశక్తతను వ్యక్తం చేస్తున్నారు. అటువంటి సందర్భంలో కేసుల రిపోర్టింగ్ సులభతరం చేయడానికి ఫోనులో పూర్తి కేసు వివరాలను తీసుకోవడానికి ముందుకు వచ్చిన అనేకమంది వాలంటీర్లను మేము నియమించాంచాము. ఇవి ఈమెయిల్ ద్వారా ప్రచురణకోసం మాకు సమర్పింప బడతాయి. మీరు ఈ సేవలు పొందాలనుకుంటే [email protected] కు ఈమెయిల్ పంపండి. మీరు సంప్రదించడానికి అందుబాటులో ఉన్న వాలంటీర్ యొక్క వివరాలను మేము మీకు అందిస్తాము. అలాగే మీలో ఎవరికైనా చాలా అసాధారణమైన కేసులు ఉండి ఇతరుల ప్రయోజనం కోసం అవి ప్రచురింపబడాలని మీరు కోరుకుంటే మా వార్తలేఖ యొక్క భవిష్యత్ సంచికలో సంబంధిత అభ్యాసకుని ప్రత్యేక విషయంగా చోటు చేసుకుంటుంది. కాబట్టి మీ అత్యుత్తమ కేసులను ఇప్పుడే ప్రోగు చేయడం ప్రారంభించండి!
డిసెంబర్లో మేము రెండు ప్రత్యేక పునశ్చరణ సదస్సులు - ఒకటి ముంబైలో మరొకటి భారతదేశంలోని కేరళలో నిర్వహించాము (వీటికి సంబంధించిన ఫోటోలు త్వరలో మా వెబ్ సైట్ లో పోస్ట్ చేయ బడతాయి). ముంబైలో జరిగిన ఈ వర్క్ షాప్ లో భారత రాష్ట్రములైన మహారాష్ట్ర మరియు గోవాకు చెందిన 108 మంది అభ్యాసకులు పాల్గొన్నారు. సత్యసాయి సంస్థకు చెందిన రాష్ట్ర అధ్యక్షుడు మరియు అఖిల భారత ఉపాధ్యక్షునితో సహా సీనియర్ ఆఫీస్ కార్యకర్తలందరూ పాల్గొని వైబ్రియానిక్స్ కు తమ ధృఢమైన నిరంతర మరియు బేషరతు మద్దతు అందించడానికి హామీ ఇచ్చినందులకు మా కృతజ్ఞతలు. కేరళలోని కాసర్గోడ్ జిల్లాలో జరిగిన ఈ వర్క్ షాప్ లో 51 మంది అభ్యాసకులు పాల్గొన్నారు. వ్యక్తిగతంగా హాజరు కాలేక పోవడంతో రాష్ట్ర అధ్యక్షుడు పాల్గొన్న వారిని ఉద్దేశించి టెలిఫోన్లో ఉత్తేజకరమైన సందేశం అందించారు. ప్రపంచంలోని అత్యంత ఘోరమైన పురుగుమందుల విషాదములలో ఒకటైన ఎండోసల్ఫాన్ విషాద బాధితులకు చికిత్స చేయడానికి ఈ జిల్లా అభ్యాసకులు ఒక ప్రత్యేకమైన ప్రాజెక్టును చేపట్టారు. మేము కూడా ఈ ప్రభావిత ప్రాంతాన్ని సందర్శించాము. మా అభ్యాసకులు చేసిన కృషి ప్రశంసించతగినది.
నెలవారీ పురోగతి నివేదికలను పంపడం యొక్క ప్రాముఖ్యత గురించి మరోసారి మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. మీరు చురుకైన అభ్యాసకులని మేము తెలుసుకోవాలనుకునే సందర్భంలో మీ ప్రాంతంలో భవిష్యత్తులో రాబోయే రోగులకు మేము మీ సంప్రదింపుల సమాచారం ఇవ్వగలము. ఇది మా వార్షిక నివేదిక కోసం సమగ్ర గణాంకాలను సమకూర్చడానికి కూడా సహాయపడుతుంది. మీ అనుభవాలపై మీ అభిప్రాయం మరియు మీ కేస్ హిస్టరీలు మా పుస్తకాలను అప్ టు డేట్ గా ఉంచడానికి మాకు సహాయపడుతుంది. కనుక ప్రతీ నెల మీ నివేదికలను సకాలంలో మాకు పంపడం కొనసాగించమని మేము మిమ్మల్ని కోరుకొంటున్నాము. భారతదేశంలోని ఢిల్లీ- ఎన్ సి ఆర్ లోని మా అభ్యాసకులు కొందరు ప్లాంట్ టానిక్ ఉపయోగించి మొక్కల పై ప్రయోగాలు చేసారు. ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి! తదుపరి సంచికలో వారు కనుగొన్న విషయాల పూర్తి సమాచారం అందించబడుతుంది.
చివరిగా మీ అందరికీ ఈ నూతన సంవత్సరం ఒక అద్భుతమైన సంవత్సరం కావాలని కోరుకుంటున్నాను. స్వామి మన హృదయాలను ప్రేమతో మరియు శరీరాలను శక్తితో నింపాలని మనం ఎంచుకున్న సేవను ఉత్సాహంతో మరియు రెట్టింపు ప్రయత్నముతో కొనసాగించాలని కోరుకుంటున్నాను.
ప్రేమతో సాయి సేవలో మీ
జిత్ కె అగర్వాల్.
భయము & మలబద్ధకం 02854...UK
గత రెండు సంవత్సరాలుగా మలబద్ధకంతో బాధపడుతున్న తన మూడు సంవత్సరాల వయస్సు గల కుమారుడిని ఒక తల్లి అభ్యాసకుని వద్దకు తీసుకొని వచ్చింది. అతను భయం వల్ల తన తండ్రితో సహా ప్రజలందరినుండీ దూరంగా ఉంటున్నాడు. ప్రత్యేకించి అతను టాయిలెట్ మరియు మల విసర్జనకు వెళ్లడానికి చాలా భయపడుతున్నాడు. అభ్యాసకుడు బాబుతో మాట్లాడినప్పుడు అతను చాలా భయపడుతూ తల్లికి అతుక్కుపోయి ఉన్నాడు. అతనికి ఆకలి కూడా చాలా తక్కువగా ఉంది. అతనికి క్రింది రెమిడీ ఇవ్వబడింది.
CC4.4 Constipation + CC15.1 Mental & Emotional tonic + CC12.2 Child tonic…TDS
బాబుకు మొదటి మోతాదు ఇచ్చిన తర్వాత ఒక అద్భుతమైన విషయం జరిగిందని తల్లిదండ్రులు అభ్యాసకుడికి చెప్పారు. గతంలో తల్లితో మాత్రమే ఉండాలని కోరుకునే వాడు బాలుడు తన తండ్రితో నిద్రపోవాలని కోరుకున్నాడు. చికిత్స పొందిన కొద్దిరోజుల్లోనే పిల్లవాడు మలవిసర్జనకు మూత్ర విసర్జన కూడా భయపడకుండా వెళ్లగలుగుతున్నాడు, మలవిసర్జన రోజు చేస్తున్నాడు. ఇప్పుడు ఎంతో సన్నిహితంగా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాడు. బాలుడు గతంలో మాదిరిగా తల్లితో అతుక్కు పోవాలని అనుకోవడం లేదని అభ్యాసకుడు గమనించారు. అతను తన వయసులో ఉన్న ఇతర ఆరోగ్యకరమైన పిల్లల్లాగే తిరుగుతున్నాడు. అతను మరో రెండు వారాల పాటు ఔషధం BD గానూ తర్వాత నిలిపి వేసే వరకు OD గా కొనసాగించాడు.
సాయిరాం పోటెన్టైజర్ ఉపయోగిస్తూ ఉంటే క్రింది రెమిడీ ఇవ్వండి: NM6 Calming + NM13 Constipation + NM69 CB8 + NM75 Debility + NM90 Nutrition + BR2 Blood Sugar + BR4 Fear + BR8 Constipation + SM5 Peace & Love Alignment + SM9 Lack of Confidence.
సక్రమంగా రాని ఋతుస్రావం 02799...UK
33 సంవత్సరాల డాక్టరు తనకు యుక్తవయస్సు వచ్చినప్పటి నుండి ఋతుస్రావం సక్రమంగా రావడంలేదని తెలుపుతూ అభ్యాసకుని కలిసారు. ఆమె ఋతుస్రావం సాధారణంగా రావలసిన 28 రోజులకు బదులుగా 35 మరియు 45 రోజుల మధ్య ఆలస్యముగా వస్తోంది. పరిమాణం కూడా చాలా తక్కువగా ఉంటోంది. ఆమె ఉపయోగించిన అల్లోపతి మందులు ఏమాత్రం ఫలితం ఇవ్వలేదు. ఆమెకు క్రింద రెమిడీఇవ్వబడింది:
CC8.1 Female tonic + CC8.8 Menses irregular + CC15.1 Mental & Emotional tonic + CC17.3 Brain & Memory tonic…TDS రెండు నెలలకు
రెండు నెలల కాలంలో ఆమె రుతుస్రావం సాధారణమైంది. ఆమె మూడు నెలలపాటు TDS గా కొనసాగించి తర్వాత మోతాదు BD కి తగ్గించవలసిందిగా సూచించబడింది. ఆమె ఋతుస్రావ కాలాలు ఇప్పుడు క్రమం తప్పకుండా 28 రోజులకు రావడమే కాక ఐదు రోజుల పాటు పూర్తిగా సాధారణంగా కొనసాగుతున్నాయి. కానీ ఆమె ఈ సమస్య గురించి చాలాకాలం బాధపడుతూ ఉన్నందున అంతా త్వరగా ODకి తగ్గించడానికి ఇష్టపడలేదు.
సాయిరాం పోటెన్టైజర్ ఉపయోగిస్తూ ఉంటే క్రింది రెమిడీ ఇవ్వండి: NM23 Menses Irregular + OM24 Female Genital + BR16 Female + SR309 Pulsatilla 30C + SR515 Ovary + SR537 Uterus.
మానసిక రుగ్మత 02799...UK
23 సంవత్సరాల వయస్సు గల మహిళా రోగి గురించి ఇక్కడ వివరింపబడింది. ఈమె మానసిక శాస్త్రంలో పట్టభద్రురాలు. మూడు సంవత్సరాలుగా తీవ్రమైన మానసిక రుగ్మతతో బాధపడుతూ ఉంది. అభ్యాసకుని చూడడానికి ఆమె తల్లిదండ్రులు ఆమెను తీసుకుని వచ్చినప్పుడు ఆమె ఆందోళనతో, అరుస్తూ, ఆత్మహత్య తలంపులతో ఉంది. ఆమె తల్లిదండ్రులు ఆమెకు అల్లోపతి మందులు ఇచ్చినా కూడా ఏ మాత్రం ఉపయోగపడలేదని అంతేకాక వాటి దుష్ప్రభావాలు కూడా అనుభవిస్తూ ఉన్నట్టు చెప్పారు. ఆమెకు క్రింది రెమిడీ ఇవ్వబడింది:
#1. CC15.1 Mental & Emotional tonic + CC15.2 Psychiatric disorders + CC17.3 Brain & Memory tonic…QDS గా రెండు వారాలు అనంతరం TDS కి తగ్గించడం
నెల రోజుల తర్వాత ఆమె 50 శాతం మెరుగ్గా ఉంది. రోగి ఇప్పుడు నిద్రలేమి గురించి ఫిర్యాదు చేయడంతో ఆమెకు క్రింద ఇవ్వబడింది:
#2. CC15.6 Sleep disorders… సాధారణ నిద్ర వేళకు ఒకఅర గంట ముందు ఒక మాత్ర, నిద్ర రాకపోతే నిద్రకు ముందు మరొక మాత్ర. ఇంకా నిద్ర రాకపోతే అరగంట తర్వాత ఒక మాత్ర అవసరమైతే అర్ధరాత్రి మరో మాత్ర తీసుకోవచ్చు.
పదిహేను రోజుల తర్వాత తల్లిదండ్రులు తమ కుమార్తె ఇప్పుడు సాధారణ స్థాయిలో హాయిగా నిద్ర పోతోందని అల్లోపతి మందులను క్రమంగా తగ్గిస్తున్నామని పేర్కొన్నారు. రెండు రెమిడీలను ఐదు నెలలు కొనసాగించి తర్వాత ఆమె అన్ని మందులను ఆపేసింది. రోగి ఇప్పుడు 100% సాధారణ స్థాయికి చేరి కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించింది. #1 కాంబో BD కి తగ్గించబడింది కానీ నిద్ర లేమికి సంబంధించిన రెమిడీ అదే మోతాదులో తీసుకొంటోంది.
సాయిరాం పోటెన్టైజర్ ఉపయోగిస్తూ ఉంటే క్రింది రెమిడీ ఇవ్వండి: NM6 Calming + NM64 Bad Temper + NM69 CB8 + SM1 Removal of Entities + SM2 Divine Protection + SM4 Stabilising + SM5 Peace & Love Alignment + SR268 Anacardium 50M + SR273 Aurum Met CM + SR410 Stramonium 1M + SR458 Brain Whole.
నిద్రకు: NM28 Sleep + SM5 Peace & Love Alignment + SM8 Insomnia.
హాస్పిటల్ వైరస్, దీర్ఘకాలిక ఆహారము మరియు రబ్బరు అలర్జీలు 02802...UK
25 సంవత్సరాల వయస్సు గల దంత వైద్యుడు తను పనిచేస్తున్న ఆసుపత్రిలో వైరస్ దాడికి గురై దానిని నయం చేసుకోనందువలన అభ్యాసకుని సంప్రదించాడు. దీనివలన భారీగా విరోచనాలు మరియు అలసట తలలో భారము ఏర్ర్పడ్డాయి. అతనికి గింజలు మరియు శనగలు తింటే అలెర్జీ వస్తుంది. దీనికి అదనంగా తను పనిలో భాగంగా చేతికి వేసుకొనే రబ్బరు తొడుగులు అతని చేతుల దురదకు కారణం అయ్యాయి. అభ్యాసకుడు క్రింది రెమిడీ అతనికి పోస్ట్ చేసారు:
#1. CC9.2 Infections acute + CC4.6 Diarrhoea + CC19.2 Respiratory allergies + CC19.5 Sinusitis….6TD for the virus.
#2. CC21.3 Skin allergies + CC4.10 Indigestion + CC4.2 Liver & Gallbladder tonic + CC15.1 Mental & Emotional tonic…TDS for the chronic allergies.
రెండు రెమిడీ లను అతను పగటిపూట విడిగా తీసుకోవాలి. రెండు నెలల తర్వాత అతను మాత్రలు అద్భుతంగా పనిచేస్తున్నాయని నివేదించాడు. అతనికి విరేచనాలు మూడు రోజుల్లో పూర్తిగా తగ్గిపోయాయి. జీర్ణక్రియ చాలా చక్కగా అవ్వడంతో పాటు అతను ఇప్పుడు శనగలు కూడా బాగా తినగలుగుతున్నారు. అతని చేతులకు దురద అంతగా రావడం లేదు. #2ను మూడు బాటిళ్ళు పోస్టులో పంపడం జరిగింది మరియు అతని పరిస్థితి స్థిరంగా ఉన్నప్పుడు రెమిడీని తగ్గించమని అతనికి సూచించడం జరిగింది. అతను ఇప్పుడు బాగానే చక్కగా ఆరోగ్యంగా ఉన్నట్లు అభ్యాసకుడు నివేదించారు.
సాయిరాం పోటెన్టైజర్ ఉపయోగిస్తూ ఉంటే క్రింది రెమిడీ ఇవ్వండి:
#1. NM36 War + NM62 Allergy-B + NM80 Gastro + BR13 Allergy + BR14 Lung + BR15 Sinus.
#2. NM27 Skin-D + NM29 SUFI + NM102 Skin Itch + BR9 Digestion + SR528 Skin
వంధ్యత్వము 11476...India
33 సంవత్సరాల వయస్సు గల ఒక తల్లి గత ఎనిమిది సంవత్సరాల నుండి గర్భ ధారణకోసం ఆలోపతి మందులు వాడినా గర్భం ధరించి లేకపోయింది. అక్టోబర్ 2011 లో ఆమె అభ్యాసకుడు వద్దకు వచ్చినప్పుడు ఆమె ఉద్రిక్తంగా మరియు ఆందోళనగా ఉంది. గత ఆరు సంవత్సరాలుగా ఆమె మధుమేహానికి, మూడు సంవత్సరాలుగా హైపోథైరాయిడ్ కి మందులు తీసుకుంటున్నారు. ఆమెకు క్రింది రెమిడీ ఇవ్వబడింది:
#1. CC6.2 Hypothyroid + CC6.3 Diabetes + CC8.1 Female tonic + CC8.4 Ovaries & Uterus...TDS
ఆమె పదిరోజుల్లోనే గర్భం దాల్చింది. ఆమె ఆరోగ్య సమస్యల కారణంగా తన పిల్లల బాధ్యత గురించి భయపడుతున్నందున ఆమెకు మద్దతు ఇవ్వడానికి అభ్యాసకుడు ఆమెతో ఫోన్ లో క్రమం తప్పకుండా సంప్రదిస్తూ ఉండేవారు. ఆమెకు రెమిడీ క్రింది విధముగ మార్చబడింది :
#2. CC6.2 Hypothyroid + CC6.3 Diabetes + CC8.2 Pregnancy tonic + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic…TDS
ఆమె గర్భధారణ సమయంలో మరియు తర్వాత ఒక నెలవరకు ఈ కాంబోలు తీసుకుంది. రక్తంలో చక్కెర మరియు థైరాయిడ్ స్థాయిలను జాగ్రత్తగా పర్యవేక్షిస్తూ ఆమె అల్లోపతి మందులు తీసుకోవడం కొనసాగించారు. ఐదవ నెలలో ఆమె మధుమేహం కోసం ఇన్సులిన్ పంపు నుండి ఇంజక్షన్లు తీసుకొనడం కొనసాగించింది. ఆగస్టు 10వ తేదీన డెలివరీ కావాల్సి ఉన్నప్పటికీ ఆమె C సెక్షన్ ద్వారా 2012 జూలై 17న బేబీని ప్రసవించింది. ఆ బేబీ 2.7 కేజీలు బరువు ఉంది. ప్రస్తుతం బేబీ వయసు ఐదు నెలలు. ఆమె తల్లికి మధుమేహం లేదు. థైరాయిడ్ సమస్య స్థిరంగా ఉంది. ఆమె థైరాయిడ్ మందు 50 ఎంజి నుండి 25 ఎం.జి కి తగ్గించారు. ఆమె శిశువు పూర్తిగా తల్లిపాలమీదే ఆధారపడి ఉంది.
సాయిరాం పోటెన్టైజర్ ఉపయోగిస్తూ ఉంటే క్రింది రెమిడీ ఇవ్వండి: వంధత్వము కోసం : OM24 Female Genital + BR8 Stress + BR16 Female + SM1 Removal of Entities + SM2 Divine Protection + SM4 Stabilising + SM5 Peace & Love Alignment + SM6 Stress + SR261 Nat Mur 200C + SR313 Sepia 200C + SR398 Nat Carb + SR515 Ovary + SR537 Uterus.
మధుమేహం కోసం: NM74 Diabetes + BR2 Blood Sugar + SM17 Diabetes + SR516 Pancreas.
థైరాయిడ్ కోసం: SR225 Throat Chakra + SR230 Moonstone + SR261 Nat Mur + SR280 Calc Carb 30C + SR308 Pituitary Gland + SR319 Thyroid Gland + SR320 Thyroidinum + SR568 Hypothyroidism
బాధాకరమైన వెన్ను నొప్పి 01176...Bosnia
76 సంవత్సరాల వయసుగల వృద్ధుడు వెన్నునొప్పితో బాధపడుతూ సహాయం కోసం అధ్యాసకునికి ఫోన్ చేశారు. నొప్పి వెన్ను దిగువ ప్రాంతం నుండి అతని కుడి మోకాలు వరకు విస్త రించింది. ఇది చాలా తీవ్రంగా ఉండడంతో అతను మంచం నుండి దిగడం కూడా కష్టమయ్యేది. 20 సంవత్సరాల క్రితం మొదటిసారిగా ఈ సమస్య ప్రారంభమై అప్పుడప్పుడూ తిరిగి వస్తూ ఉండేది. చాలా బలమైన బాధా నివారణలు తీసుకున్నప్పటికీ ఏ మాత్రం ఉపశమనం కలగలేదు. అతనికి క్రింది రెమిడీ ఇవ్వబడింది:
NM113 Inflammation + SR267 Alumina 30C + SR404 Picric Acid 1M నొప్పి ప్రారంభం కాగానే వెంటనే ఒక మోతాదు తీసుకోవడం, తర్వాత ప్రతి 30 నిమిషాలకు ఒకసారి వేసుకోవడం.
రోగి వెంటనే ఉపశమనం పొందారు. నొప్పి తిరిగి ఏర్పడినప్పుడు పైన సూచించిన విధంగా పాటించారు. రెండు రోజుల్లో చాలా తక్కువ కష్టంతో మెట్లు పైకి కిందకి వెళ్లగలిగారు. రెండు వారాల్లో, అతని నొప్పి తగ్గిపోయి ప్రస్తుతం పది నెలలకు పైగా నొప్పి లేకుండా ఉన్నారు. ఇదే రెమిడిలతో కనీసం 10 మంది ఇతర రోగులకు నొప్పినుండి దూరం చేయగలిగినట్లు అభ్యాసకుడు తెలిపారు.
పైన పేర్కొన్నరెమిడీ ఇటువంటి పరిస్థితిలో NM97 కు ఒక ఆసక్తికరమైన ప్రత్యామ్నాయము. 108 CC బాక్సు ఉపయోగిస్తున్నట్లయితే క్రింది రెమిడీ ఇవ్వండి: CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue
కూరగాయల మొక్కల రక్షణ కొరకు 10002...India
అభ్యాసకుడు తోటలో పండించిన కోర్జెట్స్ (గుమ్మడికాయ - బేబీ మజ్జలు), టమాటోలు మరియు ఫ్రెంచ్ బీన్స్ వంటి కొన్ని కూరగాయ మొక్కలు మొట్టమొదటసారి పంటకొచ్చిన నాటినుండి బూజు తెగులుతో బాధ పడుతూ ఉంటాయి. వీటికి ఆవు పేడకు సంబంధించిన ఎరువు, వర్మికంపోస్టు వేయడం మరియు వేపనూనె, మిరప మరియు సబ్బు కలిపిన ద్రావణంతో చికిత్స చేసినప్పటికీ అవి చనిపోతున్నాయి.
ఆమె ఒక చుక్క SR264 Silicea 6X ను ఒక నీళ్లుపోసే క్యానులో వేసి నాటిన వెంటనే పోయడం మరియు తరువాత వారానికి ఒకసారి చొప్పున మొక్కలు పెరుగుతున్న కాలమంతా కొనసాగించమని ఆమెకు సూచించబడింది. ఈ సాధారణ చికిత్స అద్భుతాలు చేసింది! వాడిపోతున్న మొక్కలు తిరిగి కోలుకోవడం ప్రారంభించి అత్యధిక ఉత్పత్తులను ఇచ్చాయి. కొత్తగా వేసిన మొక్కలు ధృఢంగా, ఆరోగ్యంగా ఎదిగి అధిక ఉత్పత్తులు ఇచ్చాయి.
ఈ సమాచారం వైకాంతనాథ్ కవిరాజ్ రాసిన హోమియోపతి ఫర్ ఫార్మ్ అండ్ గార్డెన్ (వ్యవసాయము మరియు ఉద్యానవన సంరక్షణకు హోమియోపతి) పుస్తకం ద్వారా సేకరించబడింది. విత్తనాలు మొలకెత్తడానికి ముందు విత్తనాలను సిలిసియా 6X ద్రావణంలో నానబెట్టాలని కూడా సిఫార్సు చేయబడింది.
మరొక అభ్యాసకుడు పెంపకందారుడు ఆరోవిల్లే లో మొక్కలపై సిలిసియా 30C ప్రయత్నించగా ఇతర సేంద్రియ పురుగుమందులను ఉపయోగించడంతో పోలిస్తే దీని నుండి మంచి ఫలితాలు కనిపించాయని రాశారు.
ప్రశ్నలు జవాబులు
1. ప్రశ్న: బాహ్య అనువర్తనం కోసం ఆయుర్వేద ఔషధములు గల నూనెలో వైబ్రేషన్ ను వేయవచ్చా?
జవాబు: ప్రస్తుతం దీనిని మేము సిఫార్సు చేయడంలేదు. ఎందుకంటే ఆయుర్వేద ఔషధం యొక్క కంపనం వైబ్రేషన్ నివారణకు ఆటంకం కలిగిస్తుంది అని మేము నమ్ముతున్నాము. బాదం నూనె, చల్లదనానికి గట్టిపరచ బడ్డ ఆలివ్ నూనె లేదా కొబ్బరి నూనె వంటి నూనెలను మనము ఉపయోగిస్తున్నాము, ఎందుకంటే ఇవి తటస్థంగా ఉంటాయి. అయినప్పటికీ ఆయుర్వేద ఔషధాలు జోడించడం లో ప్రయోగాలు చేయడానికి సిద్ధంగా ఉన్న వారి అభిప్రాయాన్ని పొందడానికి మేము ఆసక్తి కలిగి ఉన్నాము.
_____________________________________
2. ప్రశ్న: అలోపతి మందులు మరియు వైబ్రేషన్ కంపనాలు ఒకదానికొకటి మద్దతు ఇస్తూ నివారణ ఎలా వేగిర పరుస్తాయి?
జవాబు: అల్లోపతి మందులు శారీరక లేదా స్థూల స్థాయిలో పని చేస్తూ ఉండగా వైబ్రియానిక్స్ సూక్ష్మ స్థాయిలో పని చేస్తుంది. కనుక ఇది వేగంగా నివారణ సాధిస్తుంది.
_____________________________________
3. ప్రశ్న: 108 సిసి పుస్తకంలో సాధారణ కొంబోల మూలంలో కొన్ని హోమియోపతి నివారణలు ప్రస్తావించబడ్డాయి. అనగా ఈ కొంబోలలో హోమియో నివారణలు ఉన్నాయని అర్థమా?
జవాబు: లేదు, సాధారణ కొంబోలలో కొన్ని సంబంధిత హోమియో కంపనాలు మాత్రమే ఉంటాయి.
_____________________________________
4. ప్రశ్న: రోగి మరొక తీవ్రమైన లేదా దీర్ఘకాలిక వ్యాధికి కంపనాలు తీసుకోవడం ప్రారంభించినప్పుడు అప్పటికే తీసుకుంటున్న దీర్ఘకాలిక అనారోగ్యానికి నిర్వహణ మోతాదును కొనసాగించాలా?
జవాబు : దీర్ఘకాలిక వ్యాధికి అయితే నిర్వహణా మోతాదు తీసుకోవచ్చు. కానీ నిర్వహణ మోతాదు మరియు కొత్త రెమిడీ మధ్య కనీసం ఒక గంట వ్యవధి ఉండేలా చూసుకోవాలి. ఐతే రోగికి తీవ్రమైన అనారోగ్యం ఉన్నప్పుడు చికిత్స నిమిత్తం నిర్వహణా మోతాదు కొంతకాలం నిలిపివేయబడుతుంది.
_____________________________________
5. ప్రశ్న: సత్యసాయి సేవా సంస్థ వైబ్రియానిక్స్ నుండి దూరం అయిందని నేను అర్థం చేసుకున్నాను. ఈ వార్తలు నిరుత్సాహ జనకంగా ఉన్నాయి. ముఖ్యంగా సమాధి తర్వాత వెలువడే వార్తలు ఈవిషయానికి బలం చేకూరుస్తున్నాయి. దయచేసి మీ మార్గదర్శకత్వం ఇవ్వండి.
జవాబు:: వాస్తవానికి SSS సేవా సంస్థ మన బ్యానర్ లలో గానీ మరే రకంగా వారి పేరును ఉపయోగించకుండా ఉన్నట్లయితే మన వర్క్ షాప్ లను మరియు ఇతర కార్యకలాపాలను సులభతరం చేస్తోంది. 1994 నుండి 2011 వరకు అనేక సందర్భాల్లో స్వామి వైబ్రియానిక్స్ పరిణామం యొక్క అన్ని దశల్లో భౌతికంగా ఆశీర్వదించారని గుర్తుంచుకోండి.
_____________________________________
6. ప్రశ్న: వ్యవసాయంలో తెగుళ్ల బారినుండి రక్షణగా వైబ్రియానిక్స్ ఉపయోగించవచ్చా?
జవాబు: 108 CC బాక్స్ లో CC1.2 Plant tonic మంచు మరియు తుఫాన్ల వంటి వైపరీత్యాలనుండి ఫంగస్, క్రిమికీటకాలు బారినుండి మొక్కలను రక్షిస్తుంది. ప్రారంభ నివారణి తయారీకి 5చుక్కల రెమిడీని ఒక లీటరు నీటిలో వెయ్యాలి. తరువాత ఈ ద్రావణాన్ని1:10 నిష్పత్తిలో నీటిలో కలిపి ఉపయోగించవచ్చు. దీనిని క్రమం తప్పకుండా మొక్కలపై చల్లడానికి మరియు నీరు పెట్టడానికి ఉపయోగించవచ్చు.
సాయిరాం పోటెన్టైజర్ ఉపయోగిస్తూ ఉంటే క్రింది రెమిడీ ఇవ్వండి: NM12 Combination-12 + NM20 Injury + NM25 Shock + NM91 Paramedic Rescue + SM2 Divine Protection + SM4 Stabilising + SM5 Peace & Love Alignment + SM6 Stress + SM14 Chemical Poison + SM26 Immunity + SM41 Uplift + SR315 Staphysagria + SR325 Rescue + SR327 Walnut + SR329 Crab Apple + SR360 VIBGYOR + SR428 Gorse + SR432 Hornbeam + SR437 Oak + SR438 Olive + SR566 Fungi-pathogenic
అభ్యాసకులకు సూచన : మీకు డాక్టర్ అగ్గర్వాల్ గారిని అడగవలసిన ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? ఐతే [email protected]కు పంపండి.
సాయిరాం పోటెన్టైజర్ ఉపయోగిస్తూ ఉంటే క్రింది రెమిడీ ఇవ్వండి: NM12 Combination-12 + NM20 Injury + NM25 Shock + NM91 Paramedic Rescue + SM2 Divine Protection + SM4 Stabilising + SM5 Peace & Love Alignment + SM6 Stress + SM14 Chemical Poison + SM26 Immunity + SM41 Uplift + SR315 Staphysagria + SR325 Rescue + SR327 Walnut + SR329 Crab Apple + SR360 VIBGYOR + SR428 Gorse + SR432 Hornbeam + SR437 Oak + SR438 Olive + SR566 Fungi-pathogenic
అభ్యాసకులకు సూచన : మీకు డాక్టర్ అగ్గర్వాల్ గారిని అడగవలసిన ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? ఐతే [email protected]కు పంపండి.
దివ్య వైద్యుని దివ్యవాణి
“ఆధ్యాత్మిక సాధన అంటే నిరంతరం మంచి ఆలోచనలను పెంపొందించుకుంటూ మంచి పనులను చేస్తూ ఉండుట.”
-శ్రీ సత్య సాయి బాబా - రేడియో సాయి Nov 30, 2012.
“జీవితం యొక్క ఒడిదుడుకులను సహజంగా తీసుకోండి. అవి ఈ సమ్మేళన, సంకలిత ప్రపంచములో యాదృచ్చికం. ఖాళీగా ఉన్న అరిటాకు గాలికి పైకి ఎగిరి ఎగిరిపోతుంది. కానీ దానిపై పదార్ధాలు వడ్డించినప్పుడు ఆహారము, మరియు ఆకు కదలకుండా ఉంటాయి. కాబట్టి మీ మనస్సు మరియు హృదయాన్ని విశ్వాసము, స్థిరమైన క్రమశిక్షణ, భక్తి, నిర్లిప్తత మరియు సమభావము వంటి లక్షణాలతో నింపండి. ఇవే ఆధ్యాత్మిక ఆహారపు మెనూ లోని అంశాలు. అప్పుడు మీరు మీకు అనుభవమయ్యే ఎదురు దెబ్బలకు క్రుంగిపోరు. నిజమైన జ్ఞానాన్ని పొందినప్పుడు, అదృష్టం వలన ఆనందం పడటం, దురదృష్టం వల్ల కుంగిపోవడం లేకుండా ఉండగలుగుతారు. సుఖదుఃఖాలను సమానంగా చూసేవాడు నిజమైన హీరో. సుఖ దుఃఖాలు గానీ లేదా మలయ మారుతము లేదా మహా తుఫానులు భక్తుని హృదయములోని ఆనందం సముద్రపు అఖండ లోతులను ప్రభావితం చేయలేవు.”
-శ్రీ సత్యసాయిబాబా – దివ్యవాణి 1966 అక్టోబర్ 19
“ కర్తృత్వము వలన ధోరణి, ధోరణి ద్వారా అలవాటు, అలవాటు ద్వారా సంస్కారం, సంస్కారం ద్వారా విధి ఏర్పడతాయి. కనుక మీ విధిని మీరే తయారు చేసుకుంటున్నారు. మీరు దీనిని తయారు చేసుకోవచ్చు. లేదా ఈ చర్యను రద్దు కూడా చేయవచ్చు."
-శ్రీ సత్య సాయి బాబా-10 వ కాన్వొకేషన్ దివ్య వాణి 26 అక్టోబర్,1991
ప్రకటనలు
భవిష్యత్తులో నిర్వహింపబోయే శిబిరాలు
-
ఇండియా బెంగుళూరు: AVP మరియు JVP వర్క్ షాప్ 23-24 ఫిబ్రవరి 2013, సంప్రదించ వలసినవారు శేఖర్ వెబ్సైట్ [email protected] లేదా ఫోన్ నంబరు +91-9741 498 008.
-
ఇండియా న్యూ ఢిల్లీ: JVP వర్క్ షాప్ 24 ఫిబ్రవరి 2013, సంప్రదించవలసిన వారు సంగీత వెబ్సైట్ [email protected]
-
ఇండియా పుట్టపర్తి: SVP వర్క్ షాప్ 1-5 మార్చి 2013, సంప్రదించ వలసినవారు హేమ వెబ్సైట్ [email protected]
-
ఇండియా పుట్టపర్తి: AVP వర్క్ షాప్ 9-10 మార్చి 2013, సంప్రదించ వలసినవారు హేమ వెబ్సైట్ [email protected]
-
పోలండ్ రోక్లా: JVP వర్క్ షాప్ & ప్రస్తుతం ఉన్న AVP లకు పునశ్చరణ సదస్సు 27-28 ఏప్రిల్ 2013.
-
పోలండ్ (వేదిక ఇంకా నిర్ణయింపబడలేదు): సీనియర్ VP వర్క్ షాప్ 27-29 సెప్టెంబర్ 2013. సంప్రదించ వలసినవారు డేరియజ్ హెబిజ్ +48 606 879 339 వెబ్సైట్ [email protected]
-
గ్రీస్ ఏథెన్స్: JVP మరియు అభ్యాసకుల పునశ్చరణ సదస్సు 11-13 October 2013, సంప్రదించ వలసినవారు వాసిలిస్ వెబ్సైట్ [email protected] లేదా ఫోన్ నంబరు +30-697-2084 999.
అదనంగా
ఆరోగ్య చిట్కాలు
సాయి వైబ్రియానిక్స్ వార్తాలేఖల ద్వారా ప్రచురించే ఈ సమాచారము విద్యా సంబంధ మైన సమాచారమునకే తప్ప దీనిని వైద్య సలహాగా భావించరాదు. ప్రాక్టీషనర్లు పేషంట్లను సరియైన వైద్య సమాచారము కోసము మరియు ప్రత్యేక వైద్య సలహాల నిమిత్తము వారి డాక్టర్లను సంప్రదించమని చెప్పవలసిందిగా సూచన.
గుండె పోటు యొక్క ఎనిమిది హెచ్చరిక సంకేతాలు
గుండె నొప్పికి హెచ్చరికగా తీసుకోగల 8 సంకేతాలు ఇక్కడ ఉన్నాయి. విపత్కర పరిస్థితిని నివారించడంలో సహాయపడతాయి:
1. చాతిలో అసౌకర్యం
గుండెపోటు యొక్క అత్యంత సాధారణ హెచ్చరిక సంకేతం ఛాతీలో అసౌకర్యంగా లేదా ఎప్పుడు లేనివిధముగా కొత్తగా భారంగా అనిపించడం, తీవ్రమైనది, ఊహించలేనిది, మరియు ఊపిరి కష్టంగా ఉండేది, చమట, వికారం, లేదా బలహీనత వంటి లక్షణాలు సంభవిస్తాయి. ఇది ఒక్కొక్కసారి గుండెలో మండుతున్న భావన కూడా కలిగించవచ్చు. మన కార్యకలాపాల సమయంలో ఛాతీ నొప్పి లేదా అసౌకర్యం విశ్రాంతితో ఉపశమనం పొందుతుంది. పైన పేర్కొన్న లక్షణాలలో దేనిని తేలికగా తీసుకోకూడదు ముఖ్యంగా మీకు గుండె జబ్బు ఉంటే ఈలక్షణాలలో ఏది సంభవించినా వెంటనే మీరు మీ వైద్యుడి దగ్గరికి లేదా సమీప ఆసుపత్రికి వెళ్లాలి. మరెవరైనా ఈ లక్షణాలతో బాధపడుతూ ఉంటే వేచిచూచే ధోరణి లేకుండా వెంటనే వారిని సమీప వైద్యుడు లేదా ఆస్పత్రికి తరలించండి.
2. శ్వాస యొక్క కొరత లేదా ఊపిరి భారంగా తీసుకోవడం
కొంచం దూరం నడక వలన గానీ, పైకి ఎక్కడం లేదా ఇతర కదలికలు లేదా వ్యాయామం తర్వాత శ్వాస భారంగా ఉంటే లేదా సాఫీగా ఊపిరి పీల్చలేకపోతే ఊపిరితిత్తులను నొక్కివేసినట్లు మరియు శ్వాస తగ్గిపోతే అది ఆందోళనకు గొప్ప కారణం కావచ్చు. శ్వాస అందకపోవడం అనేది విశ్రాంతి ద్వారా ఉపశమనం పొందలేకపోవచ్చు. ఈ పరిస్థితి ఛాతీలో అసౌకర్యంతో కలిసి ఉండకపోయినా దానిని హెచ్చరిక గానే తీసుకోవాలి. ముఖ్యంగా ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా ఉన్నట్లయితే - వేగవంతమైన హృదయ స్పందన రేటు (నిమిషానికి 150 కంటే ఎక్కువ) ఉంటుంది.
3. చెమట
వేసవి కాలపు వేడికి చెమట అనివార్యం, అయితే చల్లని పరిస్థితులలో కూడా అధిక చెమటలు పట్టడం అభిలషణీయం కాదు. అటువంటి పరిస్థితి మీరు గమనించినట్లయితే, వెంటనే వైద్య నిపుణులను సంప్రదించండి.
4. వికారము
రోజూ వికారము లేదా మైకంగా అనిపించడం గుండెపోటు ప్రారంభాన్ని సూచిస్తుంది. దీనిని అలసటకు చిహ్నంగా భావించవద్దు. ధమని నిరోధింప పడటం వల్ల ఇది కలగవచ్చు. ఇది అధిక ఒత్తిడి, స్వల్ప కాలం చేయబడ్డ శారీరక కదలికలు లేదా సరళంగా చేయబడ్డ వ్యాయామం వలన కూడా అలసట, సమృద్ధిగా తింటున్నా తగినంతగా నిద్రపోతున్నా కూడా బలహీనంగా లేదా నీరసంగా అనిపించడం ఇవి గమనింప దగిన లక్షణాలు.
5. భుజాల లో తిమ్మిర్లు
చేతులు లేదా కాళ్ళలో ఆకస్మిక బలహీనత లేదా పక్షవాతం (కదలించలేక పోవడం) ఏర్పడడం. చేతులు మొద్దుబారినట్లు అనిపించడం లేదా ప్రక్కకి వాలినట్లు అనిపిస్తే ఇది గుండె సమస్యకు కారణం కావచ్చు.
6. తలనొప్పి మరియు మూర్ఛ
ఆకస్మిక, తీవ్రమైన తలనొప్పి లేదా స్థిరముగా ఉండే మైకము లేదా తేలిపోతున్నట్లు ఉండడం, అవిశ్రాంతంగా ఉండడం, (మరియు/లేదా) ఆకస్మిక గందరగోళం మరియు ఇతర సంభావ్య సంకేతాలు ఈ కోవలోనికి వస్తాయి. గుండెజబ్బుతో ఉన్న వ్యక్తి మీ సంరక్షణలో ఉంటే అతనికి మూర్ఛ గానీ, సృహ కోల్పోవడం కలిగితే వెంటనే వైద్య సహాయం చేయండి.
7. స్పందించకపోవడం
మీ శరీరంలోని కొన్ని భాగాలు స్పందించడం మానేస్తే పరిస్థితిని తేలికగా తీసుకోవద్దు. ప్రభావిత భాగాలు భుజాలు, చేతులు లేదా మెడ వెనుక భాగం కావచ్చు.
8. మాట్లాడేటప్పుడు మందగించడం
సహజంగా సన్నిహితులతో మద్యపానం చేసిన తర్వాత మాట్లాడేటప్పుడు తడబడుతూ ఇబ్బంది పడడం అన్నిసార్లు జరగక పోవచ్చు. కానీ గుండె జబ్బుల విషయంలో ఈ పరిస్థితి దానికన్నా తీవ్రమైనది కావచ్చు! పొందికగా మాట్లాడలేకపోవడం తీవ్ర గుండె పోటుకు సంకేతం. మీకు ఈ సమస్య ఏర్పడినట్లు అనిపిస్తే మీరు చెప్పేది అర్థం చేసుకొనే ప్రయత్నం చేయమని మీ స్నేహితుడిని లేదా బంధువుని సహాయం కోరవచ్చు. హెచ్చరిక సంకేతాలు సరిగ్గా సమయానికి అందుకో గలిగితే గుండె పోటును నివారించవచ్చు. పైన పేర్కొన్న ఒకటి లేదా అంతకంటే ఎక్కువ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోండి. అవి ధమని మూసివేయబడడం వలన ఏర్పడి ఉండవచ్చు. గుండెపోటు కోసమే కాకపోయినా చెకప్ చేయించుకొనడంలో మాత్రం అశ్రద్ధ చేయవద్దు! జాగ్రత్తగా ఉండడం ఎప్పటికీ ఉత్తమం!
గుండె నొప్పి లేదా పోటు యొక్క ఏడు ప్రమాద సూచికలు
అధికంగా టీవీ చూడడం, గురక, చిగుళ్ల వ్యాధి, సొరియాసిస్, మైగ్రేన్, విటమిన్ డి లోపం, గర్భధారణ సమస్యలు. ఈ నష్టాల గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి దిగువ వెబ్ సైట్ ను చూడండి:
http://health.yahoo.net/experts/dayinhealth/7-hidden-heart-attack-stroke-risks
గుండె జబ్బుల గురించి సమాచారం కోసం యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ వారి యొక్క ఈ క్రింది వెబ్ సైట్ చూడండి: http://www.cdc.gov/heartdisease/faqs.htm
ఆధారములు :
WebMD.com మరియు CDC.gov, స్వాన్సన్ రీసెర్చ్ అప్డేట్
పసుపు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు
పసుపు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
పసుపు (కుర్కుమా లోంగా) ఆగ్నేయ ఆసియాలో విస్తృతంగా ఉపయోగించే ప్రధాన మసాలా దినుసులలో ఒకటి. భారతదేశం నుండి ఉద్భవించిన ఈ పసుపును అనేక శతాబ్దాలుగా ఔషధం మరియు ఆహారంగా కూడా ఉపయోగిస్తున్నారు. అల్లమునకు బంధువుగా పిలువబడే ఈ పసుపు పిండిని కూరల్లో ప్రధాన వనరుగా ఉపయోగిస్తారు. పసుపులో ఉండే ప్రధాన క్రియాశీల ఔషధ పదార్ధం కుర్కుమిన్ అంటారు ఇదే పసుపు రంగును ఇచ్చే సహజ వర్ణ ద్రవ్యము.
కుర్కుమిన్ ఇటీవల సంవత్సరాలలో శాస్త్రీయ అధ్యయన కర్తల దృష్టిలో పడింది. ప్రపంచంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో జరిపిన అధ్యయనాలు దాని ఆరోగ్య ప్రయోజనాలను పరిశీలించాయి. ఈ పరిశోధనల నేపధ్యంలో కూర్చుకున్న సాక్ష్యాల ఆధారంగా కుర్కుమిన్ అనేక రకాల వ్యాధులకు మంచి నివారణా ఏజెంటుగా పనిచేస్తుందని కనుగొనబడింది. ఈ ఫలితాల్లో కొన్ని క్రింద ఇవ్వబడ్డాయి:
పసుపు మరియు క్యాన్సర్
పసుపు మరియు క్యాన్సర్ మధ్య ఉన్న సంబంధంపై అధ్యయనాలు జరిగాయి. పసుపు క్యాన్సర్ మరియు దెబ్బతిన్న శరీర కణాల నాశనాన్ని ప్రేరేపించే ప్రక్రియను కనబరచినట్లు వారు వెల్లడించారు. యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు బట్టి పసుపు అనేక రకాల క్యాన్సర్లకు చికిత్స చేయడంలో ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్, పెద్దపేగు క్యాన్సర్ మరియు లుకేమియా విషయంలో ప్రయోజనకారిగా ఉంటుంది.
టెక్సాస్ విశ్వవిద్యాలయంలో ఎలుకలపై నిర్వహించిన అధ్యయనాలు పసుపు చర్మ క్యాన్సర్, మెలనోమా పెరుగుదలను అడ్డుకుంటుందని మరియు రొమ్ము క్యాన్సర్ ఊపిరితిత్తుల్లోకి వ్యాపించడాన్ని తగ్గిస్తుందని సూచిస్తున్నాయి. కుర్కుమిన్ చేత ముందస్తు చికిత్స చేయడం వల్ల ఖీమో మరియు రేడియోథెరపీ కి ఎక్కువ హాని కలిగకుండా చేస్తుందని సౌత్ డకోటా విశ్వవిద్యాలయ పరిశోధకులు కనుగొన్నారు.
పసుపు మరియు కాలేయ పనితీరు
ఎంజైముల ఉత్పత్తి ద్వారా రక్తాన్ని నిర్విషీకరణ చేయడంలో కాలేయం సహాయపడుతుంది. ఈ ఎంజైములు విచ్ఛిన్నమయ్యి శరీరములో కనిపించే విషపదార్ధాలను తొలగిస్తాయి. పసుపు సప్లిమెంట్ తీసుకోవడం లేదా పసుపు వంటకాలను ఉపయోగించడం వల్ల ఈ ముఖ్యమైన ఉత్పత్తి పెరుగుతుంది. తద్వారా కాలేయం పనితీరు పెరుగుతుంది. ఆస్ట్రేలియా లోని గ్రాజ్ మెడికల్ యూనివర్సిటీ వారు చేసిన ప్రాథమిక ప్రయోగాత్మక పరిశోధనల ప్రకారం కుర్కుమిన్ లివర్ పాడవకుండా చూడడం ద్వారా లివర్ నాశనాన్ని ఆలస్యం చేస్తుందని కనుగొనబడింది.
కీళ్ల నొప్పికి మందుగా పసుపు
పసుపు యొక్క యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల కారణంగా పసుపు ఆరోగ్య ప్రయోజనాలు, మితమైన మరియు తేలికపాటి కీళ్ల నొప్పులతో బాధపడే వారికి ఉపశమనం ఇస్తాయి. ఆర్థరైటిస్ కోసం పసుపు ఉపయోగించే రోగులు ఉదయం మరియు సాయంత్రం కీళ్ళనొప్పుల నుండి ఉపశమనం పొందుతారు. ఇది ఇప్పుడు ఆర్థరైటిస్ బాధితులకు సహజ నివారణ గా మారడమే కాక ఇట్టి రోగులకు గణనీయమైన నొప్పి నివారణ మరియు వారి నడక వేగాన్ని పెంచేదిగా కూడా ఉపయోగపడుతోంది.
పసుపు మరియు గాయాలు
పసుపు యాంటీబ్యాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంటులుగా గాయాలకు, కోసుకుపోవడం, ఇంకా ఇతర చర్మపు గాయాలను నయం చేయడానికి ఉపయోగపడుతుంది. పిడి గల ఒక కాడ గరిటను ఉపయోగించి కొబ్బరినూనెను మరిగించి దానిలో చిటికెడు పసుపు వేసి రెండింటినీ బాగా కలపండి. స్టవ్వును ఆఫ్ చేసి చల్లార్చిన ఈ మిశ్రమాన్ని ఎక్కువ వేడి లేకుండా జాగ్రత్త వహిస్తూ శుభ్రమైన నూలు గుడ్డ ఉపయోగించి మిశ్రమములో కొంతభాగము గాయానికి పూయండి. మిగిలిన అదనపు నూనెను గాలి చొరబడని సీసాలో భద్రపరచడం వల్ల భవిష్యత్తులో తిరిగి తయారుచేసే అవసరం లేకుండా దీనిని ఉపయోగించుకోవచ్చు.
పసుపు మరియు అల్జీమీర్స్ (జ్ఞాపకశక్తి క్షీణత)
మెదడు యొక్క వ్యాకోచం లేదా ఉబ్బడం అల్జీమర్స్ వ్యాధికి ప్రధాన కారణాలలో ఒకటిగా అనుమానిస్తున్నారు. పసుపుతో చేసిన అధ్యయనాలు పసుపు ఆరోగ్య ప్రయోజనాల్లో ఒకటి అల్జీమర్స్ వ్యాధిని నివారించడానికి సహాయపడుతుందని తేలింది. పసుపు యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఈ వ్యాధి రాకుండా నిరోధించడానికి లేదా ఆలస్యం చేయడానికి సహాయపడతాయి. పసుపు నరాల చుట్టూ కనిపించే రక్షణ పొరను నాశనం చేసే IL-2 ప్రోటీన్ ఉత్పత్తిని అడ్డుకుంటుందని విశ్వసిస్తారు.
సంక్రమణ రోగ విజ్ఞాన శాస్త్రవేత్తలు (ఎపిడెర్మోలాజిస్ట్స్) భారతదేశంలో పసుపును కూరలలో విరివిగా ఉపయోగించడం వలన ఆ దేశంలో అల్జీమీర్స్ వ్యాధి యొక్క తక్కువ రేటులో ఉండడం గురించి వివరించడానికి సహాయపడుతోందని ఊహించారు. 70 నుండి 79 సంవత్సరాల వయస్సు గల వారిలో ఈ రేటు యునైటెడ్ స్టేట్స్ కంటే నాలుగింట ఒక వంతు కంటే కూడా తక్కువ.
పసుపు మరియు హృదయ వ్యాధి
చాలావరకూ హృదయ సంబంధ వ్యాధులకు అనారోగ్య కొలెస్ట్రాల్ స్థాయిలు ప్రధాన కారణం. కొలెస్ట్రాల్ ఆక్సీకరణ చెందుతున్నప్పుడు ఇది శరీర జీవకణాల గోడలపై కొంత అవశేషంగా ఉండిపోతుంది. పసుపులో విటమిన్ B6 ఉంటుంది. ఇది హోమో సిస్టిన్ స్థాయిలను నియంత్రిస్తుంది. ఈ హోమోసిస్టిన్ శరీర కణాలను దెబ్బతీసేందుకు నేరుగా బాధ్యత వహిస్తుంది. కాలేయంతో పరస్పర చర్య ద్వారా పసుపు శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. తద్వారా ఇది చాలా హృదయ సంబంధ వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది.
జపాన్ లో నిర్వహించిన క్లినికల్ ట్రయల్ సమాచారం ప్రకారం రుతుక్రమం ఆగిపోయిన మహిళలకు వ్యాయామం చేసినందువలన ఏదైతే హృదయ సంబంధమైన ప్రయోజనం చేకూరుతుందో అదే ఆరోగ్య ప్రయోజనాన్ని ప్రతీరోజూ తీసుకునే కుర్కుమిన్ సప్లిమెంట్ ఇస్తుందని పేర్కొంది. న్యూట్రిషన్ రీసెర్చ్ జర్నల్ ప్రచురించిన అధ్యయనం ప్రకారం ఫ్లో మీడియేటెడ్ డైలేషన్ (FMD) అంచనా ప్రకారం కుర్కుమిన్ సప్లిమెంట్ తీసుకున్న మహిళల బృందంలోనూ శ్వాస సంబంధమైన వ్యాయామం చేసే మహిళల బృందంలోనూ ఒకే విధమైన హృదయ సంబంధ ఆరోగ్యం చేకూరినట్లు పేర్కొంటున్నాయి.
జాతీయ ఆరోగ్య సంస్థ యుఎస్ఏ ప్రకారం పసుపు మరియు దాని ముఖ్య క్రియాశీలక భాగం కుర్కుమిన్ యొక్క ప్రభావాలపై 24 ప్రస్తుత అధ్యయనాల జాబితా విడుదల చేసింది. ఇటువంటి అధ్యయనాలు కొన్ని ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి: ఆహారంలో ఉపయోగించే పిండి రూపంలో ఉండే సంపూర్ణ పసుపు మరియు సప్లిమెంట్ గా తీసుకునే కుర్కుమిన్ రెండింటిలో ఏది తీసుకోవడం మంచిది? ఆండ్రూ వెయిల్ ప్రకారం “ పసుపు మరియు కుర్కుమిన్ ప్రతీ ఒక్కదానికీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం వాస్తవమే. అయితే మీకు ప్రేగు వ్యాధి(IBD) వంటి నిర్దిష్ట అనారోగ్య పరిస్థితి లేకపోతే కుర్కుమిన్ మాత్రలు తీసుకోవడం కంటే పసుపునే (ముఖ్యంగా వంటల్లో) వాడటం మంచిది. ఇది నా అసాధారణ నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది. దీనిపై పూర్తి అధ్యయనం జరిగే వరకూ సాధారణంగా మొక్క యొక్క ఉత్పత్తుల కంటే, పూర్తి మొక్కను తీసుకోవడమే మంచి ఎంపిక. ఇంకోరకంగా చూస్తే కుర్కుమిన్ మరింత వేగంగా పనిచేసేదిగానూ మరియు నాటకీయ ప్రభావాన్ని కలిగి ఉన్నట్లు, వ్యాధి నిర్మూలనకు (వ్యాధి రాకుండా నివారణ మిన్నా) మంచి ఎంపిక అనే నానుడి ఉంది.
ఆధారములు:
http://www.huffingtonpost.com/andrew-weil-md/turmeric-health-have-a-happy-new-year_b_798328.html
http://nccam.nih.gov
http://feelgoodtime.net/what-are-benefits-and-side-effects-of-curcumin-kurkumin-curcumin-for-cancer-and-dosage/
http://turmerichealthbenefits.org/
http://www.nutraingredients-usa.com/Research/Curcumin-may-match-exercise-for-heart-health-benefits-RCT-data http://neovitin.com/curcumin.aspx