Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

Vol 4 సంచిక 3
May/June 2013
ముద్రింప తగిన వార్తాలేఖ


పూర్తి వార్తాలేఖ యొక్క కాగితం ప్రతి కావలెనన్నఈ పుటను ముద్రించండి

డా.జిత్ కే అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి

ప్రియమైన చికిత్సా నిపుణులకు,

ఇటీవల కాలంలో మన చికిత్సా నిపుణుల వద్ద నుండి చాలా ప్రోత్సాహకరమైన ఫీడ్ బాక్ అందుకున్నాము – అందువల్ల అందరికీ ధన్యవాదాలు.108సిసి బాక్సు ఉపయోగిస్తూ పొందుతున్నఫలితాలు ఆశించిన దాని కన్నా అద్భుతమైన విధంగా ఉన్నాయి. దీని కంతటికీ కారణమయిన మన స్వామి అనుక్షణం మనతో ఉంటూ మనల్ని ముందుకు తీసుకువెళుతున్న స్వామి దివ్య అనుగ్రహ హస్తమునకు కృతజ్ఞతలు. ముందుగానే  కోంబోలను తయారు చేసి ఉపయోగించే ఆలోచన ఎలా వచ్చిందనేది మీతో పంచుకోవాలనుకుంటున్నాను. 2000 సంవత్సరంలో, నా శ్రీమతి హేమ మరియు మరో ఇద్దరు చికిత్సా నిపుణులు పుట్టపర్తిలో ఉన్న బాలికల పాఠశాలను సందర్శిస్తూ అవసరమైన వారికి చికిత్స నందించేవారు. వీరిలో చాలా మంది పిల్లలు ఒకే రకమైన రుగ్మతలతో బాధపడుతున్న సందర్భంలో, ఒకేరకమైన రెమిడీని పదేపదే సాయిరాం హీలింగ్ పోటెంటైజర్ నుండి తయారు చేసి ఇవ్వవలసి వచ్చేది. ఇలా చేయడానికి చాలా సమయం వృధా అయ్యేది. కనుక వారికి పని తేలికగా అవ్వడంకోసం, వారు తరుచుగా ఉపయోగించే వాటిని పెద్ద బాటిల్సులో తయారు చేసి పెట్టుకుని ఉపయోగించడం ప్రారంభించారు. ఇదే ఆ తర్వాత మెడికల్ క్యాంపు లలోనూ పైన పేర్కొన్న స్థితి వంటి సందర్భాల్లో ఉపయోగించడానికి వీలుగా ఉండే 108 సిసి బాక్సు రూపకల్పనకు నాంది అయ్యింది. 2000 జూన్ 14వ తేదీన హేమ స్వామి కి ఇవ్వాలని ఉత్తరం వ్రాసి ఉదయం దర్శనం లైనులో కూర్చుని ఉండగా, స్వామి తమ నివాసానికి తిరిగి వెళుతూ ఆగి, ఉత్తరం తీసుకుని విభూతి సృష్టించి ఇచ్చారు. ఆ సమయంలో మాకు స్వామి 108సిసి బాక్సు రూపొందించడం కోసం మమ్మల్ని తయారు చేస్తున్నారు అన్న అవగాహన లేదు. ఆ విధంగా స్వామి దయతో 2007 లో 108 సిసి బాక్సు రూపొందింపబడడం దానిని స్వామి ఆశీర్వదించడం, 2008 లో దీని తుది రూపమూ ఏర్పడ్డాయి (108CC పుస్తకం లో ఉన్న ఫోటో ను మీరు చూడవచ్చు).

గతనెలలో, మహారాష్ట్ర  సత్యసాయి బుక్స్అండ్ పబ్లికేషన్స్ వారి ద్వారా సాయివైబ్రియోనిక్స్ పై ఒక పుస్తకము ప్రచురింప బడింది. దీనిని మన ప్రాక్టీషనర్  02640 మరియు అలోపతీ డాక్టర్ (ప్రస్తుతం అలోపతి మానివేసి అవసరమైతేనే సేవ రూపంలో ఉపయోగిస్తున్నారు) చే రచింపబడింది. ఈ పుస్తకం సాయి వైబ్రియోనిక్స్ ద్వారా పరిష్కరించబడిన  అనేక విజయవంతమైన కేసుల గురించి సమాచారం అందించడమే కాక ఎందరో కొత్త వారిని కూడా ఈవిధానము పట్ల ఆకర్షితులయ్యే విధంగా ఉంది. ఐతే దీనిలో చికిత్స నిమిత్తం వినియోగించిన కోంబోల  వివరాలు లేనప్పటికీ  చికిత్సా నిపుణులు క్లిష్టమైన ఎన్నో కేసులు చికిత్స చేసేందుకు ప్రోత్సహించేదిగానూ వాటిని అందరితో పంచుకొనేందుకు కూడా ప్రోత్సాహకరంగానూ ఉంది. ఈ పుస్తకం ధర్మక్ఞేత్రం మరియు ప్రశాంతినిలయం పుస్తక విక్రయశాలలో లభ్యమవుతుంది.

భారత దేశంలో  ప్రస్తుతం మనం వేసవి సెలవుల మధ్యలో ఉండగా పశ్చిమ దేశాల వారు వీటి కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సెలవులు లో మీరు ఏదైనా ఊరు వెళ్ళే ప్రణాలికలలో ఉంటే ఒక విషయం మీకు గుర్తు చేద్దామనుకుంటున్నాను. మీరు ఎక్కడికి వెళ్ళినా మీ వెంట చిన్న సంచిలో వెల్నెస్ కిట్టును కూడా వెంటతీసుకు వెళ్ళండి.108 కోంబో పుస్తకం 2వ పేజీ లో దీని వివరణ ఉంది. ఇది వెంట ఉంటే కడుపు నొప్పి. మడముల నొప్పి, ఫ్లూతో మీ సెలవులు వ్రృధా చేసుకోవలసిన అవసరమే ఉండదు. అంతేకాదు, మీరు మలేరియా లేదా మరేదైనా ఉష్ణమండల వ్యాధులకు లోనయ్యే ప్రాంతానికి వెళుతున్న పక్షంలో, వెళ్ళే ముందుగా ప్రివెంటివ్ డోస్ తీసుకోవడం మరిచిపోవద్దు అంతేకాక మీరు తిరిగి మీ స్వస్థలాలకు వచ్చే వరకు వీటిని మానవద్దు. భారత దేశంలో ఋతుపవనాలు రానున్న నేపధ్యంలో వ్యాధులు వచ్చాక బాధపడేదానికన్నా- అవి ప్రబలకుండా ముందే జాగ్రత్తలు తీసుకునుట మేలు. ఒకవేళ మీరు గ్రామాల్లో మెడికల్  క్యాంపులు నిర్వహించతలపెడితే మీరు తీసుకోవడంతో పాటు పేషంటు లందరికీ ప్రివెంటివ్ డోస్ ఇవ్వండి.

ప్రతీ వార్తాలేఖలోనూ, మీస్పందన తెలియచేయవలసిందిగానూ అది మా కెంతో ఆనందం కలిగిస్తుందని విజ్ఞప్తి చేస్తున్నాను. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే చికిత్సా నిపుణులు బాగున్నవాటిని ఆనంద ప్రదము లైన వాటిని పంపిస్తున్నారు తప్ప, తాము ఇబ్బందులు పడుతున్న అంశాలను పంపడానికి ముందుకు రావడం లేదు. ఇటువంటి వాటిని కూడా నిజాయితీగా మీరు పంపినట్లైతే మనమంతా కలసి.నడుస్తున్న ఈ” వైబ్రో ప్రయాణం“ ప్రోత్సాహ జనకంగా ఉంటుంది. అలాగే మీ వద్ద ఆరోగ్యానికి సంబంధించిన ఏవైనా వ్యాసాలు ఉంటేవాటిని తప్పక మాకు పంపండి. మీరు చికిత్స చేసిన ఉత్తమమైన రోగ చరిత్రలు ఎప్పటిలాగే పంపిస్తూ ఉండండి. ప్రతీ ఒక్కదాని నుండి కూడా మనం లబ్ధి ని పొందగలము.

మీ అందరికీ ఈ సెలవులు ప్రేమ ప్రదంగా ఆనందదాయకంగా ఉండాలనీ - స్వామి ప్రేమ అనే ఉషస్సులో మనమంతా మునకలిడి మరింతగా అంకితభావంతో వైబ్రియో సేవలు చేయాలని ఆకాంక్షిస్తున్నాను.

ప్రేమతో సాయి సేవలో మీ

జిత్ కె అగ్గర్వాల్

గర్భాశయ క్యాన్సరు 11993...India

45 సంవత్సరముల వయస్సు గల మహిళ గత నాలుగు సంవత్సరాలుగా గర్భాశయ కేన్సరుతో బాధపడుతున్నారు. వీరు ఖిమోథెరపీతో సహా అలోపతీ చికిత్స తీసుకున్నారు కానీ ఫలితం ఏమీ లేకపోవడంతో మధ్యలో మానేసారు. అంతేకాక దీని దుష్ఫలితాలు వలన వీరు మంచం పట్టారు. 2012 అక్టోబరు 15 వ తేదీన చికిత్స ప్రారంబించి వీరికి క్రింది రెమిడీ ఇవ్వబడింది: 

CC2.1 Cancers + CC2.2 Cancer pain + CC3.1 Heart tonic + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic…6TD

రెండు నెలల లోనే, వీరు కోలుకొని తన గృహ కృత్యాలు స్వయంగా చేసుకోవడమే కాక మరలా చర్చికి కూడా వెళ్ళగలగారు. నాలుగు నెలల తర్వాత ఆవిడ చేయించుకున్న పరీక్షలో, కేన్సర్ పూర్తిగా నివారింపబడి ఆవిడ సాధారణ స్థితికి చేరినట్లు తెలిసింది. మోతాదును TDS కు తగ్గించడం జరిగింది.

పైన పేర్కొన్న ప్రాంతంలో క్యాన్సర్ విషయంలో సాధారణంగా CC8.4 Ovaries & Uterus కూడా కలపాలి. ఏమైనప్పటికీ CC15.1 Mental & Emotional tonic కలపడం మంచి నిర్ణయం వ్యాధి నివారణలో ఇది కూడా తోడ్పడి ఉండవచ్చు.

 

గుండె కు సంబంధించిన అత్యవసర స్థితి 11220...India

గుండెజబ్బు మరియు మధుమేహ వ్యాధి పీడితుడైన, 61 సంవత్సరాల చికిత్సానిపుణుడి మామగారు, 2013 మార్చి31న అర్ధరాత్రి అకస్మాత్తుగా మూర్ఛ వచ్చి స్పృహ తప్పి పడిపోయారు. అతనికి వెంటనే CC3.4 Heart emergencies నీటిలో కలిపి ఇవ్వబడింది. ఇది తీసుకున్న రెండు నిమిషాల్లో, అతను లేచి మంచం మీద కూర్చోగలిగారు. వీరిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకువెళుతూ ఐదు నిమిషాలకు ఒకసారి చొప్పున మోతాదు ఇస్తూ కారులో కూడా రెమిడీ కొనసాగించారు. ఆ తరువాత కూడా మరికొన్నిమోతాదులు తీసుకున్నారు. వీరు ఆస్పత్రికి చేరేసరికి అతనికి ఏ ఇబ్బంది లేకుండా మామూలుగా ఉన్నారు. అతనిని గుండె జబ్బు, రక్తపోటు, మరియు  అనుమానాస్పద స్ట్రోక్ నిమిత్తం హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అధిక రక్తపోటు మరియు రక్తంలో అధిక చక్కెర నిల్వలు కారణంగా మూర్చ వచ్చిందని వైద్యుడు కుటుంబ సభ్యులకు తెలిపారు. రోగి ఈ రెమిడీ ద్వారా ప్రయోజనం పొందిన ఇతర సందర్భాలు కూడా ఉన్నాయని అభ్యాసకుడు తెలియజేశారు.  

ఈ కోంబో, గుండె జబ్బు మరియు ముఖ్యంగా మధుమేహం కూడా ఉన్నటువంటి రోగి కుటుంబ సభ్యులు గుండెకి సంబందించిన అత్యవసర స్తితిని ఎదురుకొనుటకు ఎల్లప్పుడూ దగ్గర ఉంచాలి అనడానికి ఒక నిదర్శనం. అటువంటి అత్యవసర పరిస్థితిలో ఇది మనకు ఎంతో ఉపయోగపడుతుంది.

 

కీళ్ల నొప్పులు 02853...India

50 ఏళ్ల మహిళ గత రెండు సంవత్సరాలుగా కాళ్లలో నొప్పులతో బాధపడుతూ ఉన్నారు. ప్రధానంగా ఆమె మోకాళ్ళ లో ప్రత్యేకించి వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఈ నొప్పులు ఎక్కువగా ఉన్నాయి. ఆమె తన మోకాళ్లను వంచి నేల మీద గాని కుర్చీలో గాని  కూర్చోలేరు. ఎక్కువ దూరం నడవలేరు. అల్లోపతీ వైద్యుడు ఆమెకు ఔషధం ఇచ్చి, మోకాళ్ళకు రాసుకోవడానికి లేపనం కూడా ఇచ్చారు. కానీ అవేమీ ఉపయోగపడలేదు. చల్లని వాతావరణం, ఒత్తిడి మరియు వయోభారం దీనికి కారణమని ఆమె తెలిపారు.  2012 నవంబర్లో, ప్రాక్టీషనర్ క్రింది రెమిడి ఇచ్చారు:

CC15.1 Mental & Emotional tonic + CC20.1 SMJ tonic + CC20.3 Arthritis…TDS

రెమిడీ తీసుకున్న మూడు వారాల్లోనే తనకు పూర్తిగా నొప్పి లేకుండా పోయిందని రెండు నెలల తర్వాత ఆమె అభ్యాసకునకు తెలిపారు. ఆమె ప్రస్తుతం ఎక్కువ దూరం నడవ గలగడం, నేలపై సులభంగా కూర్చోవడం, అదేవిధంగా కుర్చీలో కూడా సౌకర్యవంతంగా కూర్చో గలుగుతున్నానని  ఆనందం వ్యక్తపరిచారు.   

 

దీర్ఘకాలిక తామర 10364...India

55 సంవత్సరాల వయస్సు గల ఈ అభ్యాసకుడు గత ఎనిమిది సంవత్సరాలుగా తాను అనుభవిస్తున్న దీర్ఘకాలిక తామర కోసం తనకు తానే చికిత్స చేసుకున్నారు. ఇది ఉదరం క్రింద మరియు కాళ్ళ మీద అంతటా ఉంది. అతను అల్లోపతి మందులు తీసుకున్నారు కానీ తాత్కాలిక ఉపశమనం మాత్రమే కలిగింది. కాబట్టి క్రింది రెమిడీ  తీసుకున్నారు:   

CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC21.6 Eczema…TDS

అతని వ్యాధి లక్షణాలు పూర్తిగా అదృశ్యమయ్యాయి. నాలుగేళ్ల క్రితం వైబ్రియానిక్స్ ప్రాక్టీషనర్ గా శిక్షణ తీసుకున్న తర్వాత వారి కుటుంబం మొత్తానికి వైద్య ఖర్చులు సున్నాకి పడిపోయాయని మనకు తెలపాలని వీరు ఆకాంక్షిస్తున్నారు! అదే సమయంలో వీరు SSSVIP మెడికేర్ అంబులెన్స్ ద్వారా కూడా సేవ చేస్తున్నారు.  

బృహద్ధమని కవాటం(ఆరోటిక్ వాల్వ్) గట్టిపడిపోవుట (స్కెలోరోసిస్) 02128...Argentina

67 సంవత్సరాల వయస్సు గల మహిళ బృహద్ధమని కవాటం బిగుసుకు పోయినందువలన తీవ్రమైన రక్తప్రసరణ లోపం (అరిత్మియా) కారణముగా గుండెకు శస్త్రచికిత్స ప్రణాళిక సిద్ధం చేయగా తనకు వైబ్రియానిక్స్ ఏమైనా సహాయం చేయగలదా అనే భావనతో చికిత్స నిపుణుడిని సందర్శించారు. లోలకం సూచించిన విధంగా ఆమెకు క్రింద ఇవ్వబడింది:

#1. BR5 Heart + BR18 Circulation + SR265 Aconite + SR271 Arnica + SR278 Cactus + SR286   Crataegus + SR455 Artery + SR477 Capillary + SR539 Vein + SR541 Adonis Ver 

#2. OM7 Heart + SR287 Digitalis

#3. SR221 Heart Chakra + SR223 Solar Plexus…OW

2012 అక్టోబర్ 20న ఆమె దీనిని తీసుకోవడం ప్రారంభించారు. అరిత్మియా లో విషయంలో మెరుగుదల అలాగే బృహద్ధమని కవాటం పనితీరు కూడా చక్కబడడంతో ఆమెకు ఆపరేషన్ రద్దు చేయబడింది. ఆమె పై రెమిడీ తీసుకోవడం కొనసాగిస్తున్నారు.

 

మెదడులో కణితి 02128...Argentina

ఏళ్ల మహిళ మెదడులో 9 మిల్లీ మీటర్ల సెల్లార్ కణితి(సెల్లా టర్సికా లేదా కపాలములో పిట్యుటరీ గ్రంధికి నెలవైన పల్లమ) ఉన్నందున అభ్యాసకుని వద్దకు వచ్చారు. ఈ సెల్లా టర్సికా ( అక్షరాల టర్కిష్ చైర్ ఆకారంలో ) కపాలంలో పిట్యూటరీ గ్రంథి ఉన్న ప్రాంతంలో స్పినాయిడ్ ఎముక లో గుర్రపు జీను ఆకారంలో ఉన్న లోతైన ప్రాంతం. కణితి పెరుగుదల గురించి తెలుసుకొనడానికి ఆమె ప్రతీ సంవత్సరం మాగ్నెటిక్ రెజొనెన్స్(MRI) పరీక్ష చేయించుకుంటూ వుంటారు. దీనిని తొలగించుకోవడానికి ఆపరేషన్ చేయవలసిన అవసరం ఏర్పడి ఉండేది. ఆమెకు క్రింది రెమిడీ ఇవ్వబడింది: 

SR253 Calc Fluor + SR254 Calc Phos + SR280 Calc Carb (200C) + SR295 Hypericum (200C) + SR318 Thuja (200C) 10ml  డ్రాపర్ బాటిల్ లో నీటితో తయారు చేసి రెండు చుక్కలు ఇవ్వబడింది...TDS  .

56 రోజుల వైబ్రియో చికిత్స తర్వాత, రోగి మరొక ఎంఆర్ఐ పరీక్ష కోసం ఆస్పత్రికి వెళ్లారు. కణితి పూర్తిగా కనుమరుగైంది. వైద్యులు ఆశ్చర్యపోయారు. ఈ అద్భుతాన్ని నమ్మలేకపోతున్నామని వ్యాఖ్యానించారు!  

 

జలుబు మరియు ఇన్ఫ్లూయెంజా 02119...USA

ఈ ప్రాక్టీషనర్ 02119…యు.ఎస్.ఎ. క్రింది కాంబో ద్వారా జలుబు మరియు ఇన్ఫ్లూఎంజా (ఊర్ధ్వ శ్వాసనాళంలో వైరస్ వలన కలిగే విష పడిశము) విషయంలో చాలా అద్భుత ఫలితాలను పొందారు:

NM18 General Fever Mix + NM36 War.

రోగ లక్షణాల మొదటి సంకేతం కలిగిన వెంటనే ఈ కాంబో తరచుగా తీసుకుంటే వైరల్ మరియు బ్యాక్టీరియా అనారోగ్యాలను వెంటనే తొలగిస్తుంది. ఇన్ఫెక్షన్ ఏర్పడిన తర్వాత దీనిని తీసుకున్నట్లయితే, ఇది అనారోగ్యాన్ని క్రమంగా బలహీనపరుస్తూ దాని కాల వ్వవధిని తగ్గిస్తుంది. అభ్యాసకుడు మరియు అతని అనేకమంది పేషెంట్లు కూడా ఈ కాంబో చాలా ప్రభావంతంగా ఉన్నట్లు కనుగొన్నారు.

ఇన్ఫ్లూయెంజా 01361...USA

ఈ ప్రాక్టీషనర్ 01361…యు.ఎస్.ఎ. NM79 Flu Pack అనే రెమిడీ ఇన్ఫ్లూయెంజా పురోగతిని సమర్థవంతంగా నిలుపుతుందని తెలుపుతున్నారు. అతను మరియు వీరి శ్రీమతి తో సహా అనేక కేసులను ఈ రెమిడీతో విజయవంతముగా చికిత్స చేశారు.   

ప్రశ్నలు జవాబులు

 

1. ప్రశ్న:  పేషెంట్ యొక్క మొదటి సందర్శనకు ముందు నేను ఏదైనా ఫారం వారికి ఇవ్వాలా?

జవాబు: రోగితో మాట్లాడటం చాలా ముఖ్యం కాబట్టి ఇది అవసరం లేదు. అయినప్పటికీ రోగి మరియు వైద్యుడికి రోగి యొక్క దీర్ఘకాలిక సమస్యల గురించి వ్రాతపూర్వక వివరాలను మరియు అతను తీసుకున్న ఇతర చికిత్సలను తెలుసుకోవాలంటే ఇది సహాయపడుతుంది.  

_____________________________________

2. ప్రశ్న: వైబ్రియానిక్స్ మాన్యువల్ లో రోగి యొక్క దీర్ఘకాలిక వ్యాధికి మూల కారణాన్ని తెలుసుకోవడానికి అనేక ప్రశ్నలు అడగాలని తెలుపుతుంది. అయినప్పటికీ ప్రారంభంలో ఇటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే నేను చేయగలిగింది ఏదైనా ఉందా?

 జవాబు: అవును, చాలా సందర్భాలలో సిసి 15.1 జోడించడానికి ఇది సహాయ పడుతుంది. ఎందుకంటే రోగానికి మూలకారణం విచారము, మానసిక గాయము వంటి మానసిక అవాంతరాలు తరచుగా ఉంటాయి. అయితే రోగితో మాట్లాడేటప్పుడు మీ స్వంత కుటుంబ సభ్యునిగా భావించినట్లయితే మీ ప్రశ్నలకు అతను జవాబు చెప్పడానికి అవకాశం ఉంటుంది.

_____________________________________

3. ప్రశ్న: ఒక అభ్యాసకునిగా నేను పోస్టు ద్వారా నా రెమిడి అందుకున్నప్పుడు, ఆ సీసా నిండుగా ఉంది. కానీ మన మాన్యువల్   సీసాలో 2/3 వంతు మాత్రమే నింపాలని చెబుతుంది దీనికి ఏం చేయాలి?

 జవాబు : సీసాలో 2/3 భాగం నింపి ఆపై సాధారణ పద్ధతిలో కదిలించడం సరియయిన పద్దతి. అయితే మీరు మరి కొన్ని మాత్రలు వేసి మరలా  షేక్ చెయ్యవచ్చు.

_____________________________________

4. ప్రశ్న: దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న రోగి OW నిర్వహణ మోతాదు ప్రారంభించాలంటే రోగి ఎంత కాలం వ్యాధి లక్షణాలు లేకుండా ఉండాలి?

జవాబు: రోగి యొక్క వ్యాధి లక్షణాలు పూర్తిగా పోయినప్పుడు అతని మోతాదును ఎక్కువ కాలం (చికిత్సా సమయంలో 1/3 నుండి 2/3 భాగం) వరకూ నెమ్మదిగా OW కి తగ్గించండి. ఈ మోతాదును జీవితాంతం కొనసాగించవచ్చు.   

_____________________________________

5. ప్రశ్న: రోగి సమక్షంలో రెమిడీ తయారుచేయడం సముచితమైన చర్యేనా? 8 ఆకారంలో రెమిడీ బాటిల్ ని త్రిప్పడం అభ్యంతరకరం  గానో లేక ఆచారం గానో రోగీకి అనిపిస్తుందా?

 జవాబు: ఇది సమస్యగా మేము భావించడం లేదు. ఐతే అవసరం మేరకు కోంబో బాటిల్ నుండి ఒక చుక్క గొళీల బాటిల్లోనికి వేసి దీనిని షేక్ చెయ్యడం ద్వారా వైబ్రేషన్ గోళీలు అన్నింటికీ వెళ్తుంది అని మీరు రోగికి వివరించవచ్చు.  

_____________________________________

6. ప్రశ్న:  రోగి నాలుగు వేర్వేరు నివారణలు తీసుకుంటూ ఉన్నప్పుడు ప్రతి రెండిటి మధ్య 20 నిమిషాలు వేచి ఉండవలసిన అవసరం ఉందా?  

జవాబు: లేదు, వాస్తవానికి మాత్రల మధ్య ఐదు నిమిషాల వ్యవధి మాత్రమే అవసరం. రోగికి ఏ సమయంలోనైనా మూడు కంటే ఎక్కువ వేరు వేరు సీసాలు ఇవ్వకూడదు. ఎందుకంటే మీరు అతన్ని ఎక్కువ కోంబోలతో ముంచి వేస్తే నిమగ్నం కాలేక చికిత్సను మానివేయవచ్చు.   

_____________________________________

7. ప్రశ్న: నేను నా రోగులకు లేదా మన సాయి పేషెంట్లకు అవగాహన కల్పించడానికి వైబ్రియానిక్స్ సైట్ లింక్ తో ఇమెయిల్ పంపడానికి అనుమతి ఉందా? స్కైప్ మొదలైన వాటితో వైబ్రియానిక్స్ గురించి నేను వారితో మాట్లాడవచ్చా?  

 జవాబు: తప్పకుండా, మీరు స్కైప్, ఇమెయిల్,  లేదా ఫోన్ ద్వారా సాయి వైబ్రియానిక్స్ గురించి వారికి చెప్పవచ్చు. మరియు వార్తాలేఖలు చదవమని వారిని ప్రోత్సహించవచ్చు. మన వెబ్సైట్ అందరికీ చదవటానికి ఉచితంగా లభిస్తుంది. మీరు మీ రోగులకు మరియు సాయి భక్తులకు మరింత సమాచారం పంపాలనుకుంటే మా వద్ద ఫ్లైయర్ కూడా అందుబాటులో ఉంది.   

             

_____________________________________

దివ్య వైద్యుని దివ్యవాణి

“సేవ అనే ఆధ్యాత్మిక సాధన ప్రత్యేకమైనది. సేవలో మీరు మీ శక్తిని మరియు శ్రద్ధను చేస్తున్న పనిమీద లగ్నం చేస్తారు.  ఎందుకంటే ఇది భగవద్దత్తమైన పని. మీరు మీ శరీరాన్ని మరిచిపోయే దాని కోరికలను విస్మరిస్తారు. మీరు మీ వ్యక్తిత్వాన్ని మరియు ప్రతిష్టను అవసరాలను పక్కన పెడతారు. మీరు మీ అహాన్ని దాని మూలము నుండి త్రుంచివేసి దూరంగా పారద్రోలుతారు. మీరు మీ హోదాను, దర్పాన్ని, మీ పేరు మరియు రూపాన్ని, ఇలా ఇతరుల అవి కోరుకొనే అన్నింటినీ వదులుకుంటారు. ఈ ప్రక్రియ మనసును స్వచ్ఛంగా చేస్తుంది .”
-సత్యసాయి వాణి . 1977.06.03 

 

సేవ అనేది జీవితకాల కార్యక్రమం; దీనికి అలసట లేదా విశ్రాంతి తెలియదు. శరీరం మీకు ఇవ్వబడినందుకు మీరు మీ శక్తిని, మీ నైపుణ్యాలను సోదర - మానవుల సేవకే అంకితం చేయలి. మీరు మనుషులందరిలో భగవంతుని చూసే వరకు మనిషికి సేవ చేయండి; అప్పుడు, మీరు చేసింది ఆరాధన గా మారుతుంది .”            
-Sathya Sai Speaks. 1975.01.06 

 

“ మీరు ఒకరికి సహాయం చేయగలిగినప్పుడు, మీరు గర్వ పడటానికి ఆస్కారమే లేదు. ఎందుకంటే మీ నైపుణ్యం లేదా మీ సంపద లేదా మీ బలం లేదా ధైర్యం లేదా అధికారము లేదా మీకు సేవ చేయడానికి అవకాశం మీరు గుర్తించినా గుర్తించక పోయినా భగవంతుని నుండి బహుమతిగా వచ్చింది. మీరు భగవంతుడిచ్చిన ఈ బహుమతిని భగవంతుడే ప్రసాదించిన సహాయం కోరే పేదలు, నిరక్షరాస్యులు, బలహీనులు, రోగులు, దుఃఖంతో ఉన్నవారు, నిరాశా హృదయులు, వీరికి సేవ రూపంలో ఆ బహుమతి అందిస్తున్నారు. మానవత్వం యొక్క పురోగతి సాధించడానికి, వంటరిగా పని చేస్తే సరిపోదు, ప్రేమ, కరుణ, సరైన ప్రవర్తన, నిజాయితీ, సానుభూతితో మీ పని ముడిపడి ఉండాలి. పై లక్షణాలు లేకుండా నిస్వార్థ సేవ చేయలేము.
-సత్యసాయి దివ్యవాణి

ప్రకటనలు

భవిష్యత్తులో నిర్వహింపబోయే సదస్సులు​

ఇండియా  న్యూఢిల్లీ : AVP వర్క్ షాప్  29-30 జూన్ 2013, సంప్రదించ వలసిన వారు సంగీత వెబ్సైట్  [email protected]

ఇండియా పుట్టపర్తి : SVP వర్క్ షాప్ 15-20 జులై 2013, సంప్రదించ వలసిన వారు హేమ వెబ్సైట్ [email protected]

 ఇండియా పుట్టపర్తి : AVP వర్క్ షాప్  23-27 జులై  2013, సంప్రదించ వలసిన వారు హేమ వెబ్సైట్ [email protected]

ఇండియా ముంబాయి : AVP వర్క్ షాప్  3-4 ఆగష్టు 2013, సంప్రదించ వలసిన వారు సందీప్ కులకర్ణి 9869-998 069 లేదా వెబ్సైట్ : [email protected] లేదా నంద్ అగ్గర్వాల్  వెబ్సైట్ [email protected].

ఇటలీ వెనిస్ : జాతీయ పునశ్చరణ సదస్సు 31 ఆగష్టు  2013, సంప్రదించ వలసిన వారు మోనాలిస్ వెబ్సైట్  [email protected] లేదా ఫోన్ నంబరు +39-41-541 3763.

పోలండ్  రోక్లా : సీనియర్  VP వర్క్ షాప్ 13-15 సెప్టెంబర్  2013, సంప్రదించ వలసిన వారు డేరియజ్ హెబిజ్ వెబ్సైట్ [email protected] లేదా టెలిఫోన్ నంబరు  +48-606 879 339.

గ్రీస్  ఏథెన్స్ : JVP మరియు అభ్యాసకుల పునశ్చరణ  వర్క్ షాప్ 21-23 సెప్టెంబర్ 2013, సంప్రదించ వలసిన వారు వాసిలిస్ వెబ్సైట్ [email protected] లేదా టెలిఫోన్ నంబరు  +30-697-2084 999.

ట్రైనర్స్ అందరికీ సూచన : మీరు వర్క్ షాప్ కోసం ప్రణాళిక సిద్ధం చేసుకుంటే  వివరాలు ఈ వెబ్సైట్ కు తెలియ చేయండి [email protected] 

అదనంగా

సాయి వైబ్రియానిక్స్ ఆరోగ్య సమాచారము మరియు వ్యాసాలు విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే అందిస్తున్నది: ఇది వైద్య సలహాగా భావించరాదు. మీ పేషెంట్లను వారి నిర్దిష్ట వైద్య చికిత్స నిమిత్తం తమ వైద్యుడిని సంప్రదించాలని సలహా ఇవ్వండి.

 

మైక్రోవేవ్ వంట ద్వారా దాగిఉన్న ప్రమాదాలు 

ఇప్పటికే, మీరు తినేదే మీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని మీరు గ్రహించే ఉంటారు. “మీరు తినేది మీరు” అనే మంత్రం నిజంగా అక్షర సత్యం. అయితే మీరు తినే ఆహారం మాత్రమే కాకుండా అది ఎలా పచనము చేయబడిందో కూడా గ్రహించాలి.

మీ ఆహారంలో ఎక్కువ భాగం పచ్చిది తినడం మన ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ మనలో చాలామంది పూర్తిగా ఈ ముడి ఆహారాన్ని తినలేరు, వంట ద్వారా ఆహారంలో కొంత శాతం పోషక విలువలు నశిస్తాయి. ఆహారం వండటానికి మనకు ఎన్నో సాధనలు ఉన్నాయి: సంప్రదాయ పొయ్యిలు, గ్రిల్స్, ఇండక్షన్ ఓవెన్లు, మైక్రోవేవ్ మొదలగునవి.                                                సూటిగా చెప్పాలంటే, మైక్రోవేవ్ ఓపెన్ సౌకర్యవంతంగా ఉంటుంది మరియు మన ఆహారాన్ని చాలా వేగంగా వండటానికి తోడ్పడుతుంది. అయితే ఇది ఎలా పని చేస్తుంది?

 మైక్రోవేవ్ ఓవెన్లు ఎలా పనిచేస్తాయి?

మైక్రోవేవ్స్ (లేదా సూక్ష్మ తరంగాలు) అనేవి కాంతి తరంగాలు లేదా రేడియో తరంగాల వంటి విద్యుదయస్కాంత తరంగాల రూపం. మైక్రోవేవ్స్ అనేవి కాంతివేగంతో ప్రయాణించే విద్యుదయస్కాంత శక్తి యొక్క తక్కువ స్థాయి తరంగాలు. మన ఆధునిక సాంకేతిక యుగంలో ఈ సూక్ష్మ తరంగాలు సుదూర టెలిఫోన్ సిగ్నల్స్, టెలివిజన్ కార్యక్రమాలు, మరియు కంప్యూటర్ సమాచారాన్నిభూమి అంతటా ప్రసరింప చేయడానికి లేదా అంతరిక్షంలోని ఉపగ్రహానికి ప్రసారం చేయడానికి ఉపయోగిస్తారు. అయితే మైక్రోవేవ్ మనకు ఆహారాన్ని వండడానికి కూడా ఒక శక్తి వనరుగా పనిచేస్తుందని మనందరికీ తెలుసు.   

ప్రతీ మైక్రోవేవ్ ఓవెన్ లో మ్యాగ్నెట్రాన్ అని ట్యూబ్ లేదా నాళములో ఎలక్ట్రాన్లు 2450 మెగాహెర్ట్జ్(MHz) లేదా 2.45 గిగా హెర్ట్జ్(GHz) సూక్ష్మ తరంగ ధైర్ఘ్యం గల రేడియేషన్ ను ఉత్పత్తి చేసే విధంగా అయస్కాంత మరియు విద్యుత్ క్షేత్రము ద్వారా ప్రభావితం అవుతాయి. ఈ మైక్రోవేవ్ రేడియేషన్ ఆహారంలోని అణువులతో సంకర్షణ చెందుతుంది. ప్రతీ తరంగం యొక్క భ్రమణంలో ధృవాభిముఖత లేదా పొలారిటీ పోజిటివ్ నుండి నెగిటివ్ కు మారుతుంది. మైక్రోవేవ్లో ఈ పొలారిటీ మార్పులు ప్రతీ సెకనుకు మిలియన్ల సార్లు జరుగుతాయి. ఒక అయస్కాంతానికి ఉత్తర మరియు దక్షిణ దృవం ఉన్న విధంగానే ఆహార అణువులు - ముఖ్యంగా నీటి అణువులకు కూడా ధన లేదా పాజిటివ్ మరియు ఋణ లేదా నెగిటివ్ అంత్యాలు ఉంటాయి.

వాణిజ్యపరంగా బయట దొరికే మైక్రోవేవ్ నమూనాలలో ఒక ఓవెన్లో వెయ్యి వాట్ల ఆల్టర్నేటివ్ కరెంట్ AC యొక్క ఇన్పుట్ ఉంటుంది. మ్యాగ్నెట్రాన్ ద్వారా ఉత్పత్తి చేయబడిన ఈ సూక్ష్మ తరంగాలు ఆహారాన్నిఢీకొని  ధ్రువకేంద్ర అణువులు ఏర్పడి సెకనుకు మిలియన్ల సార్ల పౌనః పుణ్యంలో తిప్పటానికి కారణమవుతాయి. ఇదంతా కూడా అణువుల మధ్య ఘర్షణ సృష్టిస్తుంది. ఇదే ఆహారాన్నివేడి చేస్తుంది.

   ఈ పద్ధతి వంటకు సురక్షితమైనదేనా ?

మైక్రోవేవింగ్ మన ఆహారాన్నిఎలా ప్రభావితం చేస్తుందనే విషయం పై ఎక్కువ అధ్యయనాలు లేవు. అంతేకాక, ఇప్పటికే ఉన్న అధ్యయన ఫలితాలు కూడా స్థిరంగా లేవు. సాధారణంగా మైక్రోవేవ్ ఓవెన్ తయారీదారులు లేదా ప్రభుత్వాల మద్దతు మేరకు  కొంతమంది శాస్త్రవేత్తలు మైక్రోవేవ్ ఓవెన్లు సురక్షితమైనవి అని చెబుతున్నారు. మరికొంతమంది, ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రోత్సాహకులు, మైక్రో ఓవెన్ అనేది వంటకు సంబంధించినంత వరకూ ఇప్పటివరకూ తయారుచేయబడిన వాటిలో అత్యంత చెత్త రకమైన ఉపకరణం అనీ ఇది ఏ జీవికైనా అత్యంత ప్రమాదకారి అనీ ఖండించారు. ఖచ్చితంగా, ఇది నిరూపించడానికి లేదా నిరాకరించడానికి మరింత స్వతంత్ర అధ్యయనాలు అవసరం, అయితే ఇప్పటికే ఆహారాన్ని వండటానికి మైక్రోవేవ్ ఉత్తమ మైనటువంటి మార్గం కాదని ఋజువైంది.

మైక్రో ఓవెన్ ఆహారంలోని పోషకాలను నాశనం చేస్తుంది.

  1. ‘జర్నల్ ఆఫ్ ద సైన్స్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్’ యొక్క 2003 నవంబర్ సంచికలో ప్రచురింపబడిన ఒక అధ్యయనం ప్రకారం మైక్రోవేవ్ ఓవెన్లో కొద్దిగా నీటితో ఉడికించిన బ్రోకలీ (క్యాబేజీ వంటిది) 97% ఉపయోగకరమైన యాంటీఆక్సిడెంట్లను కోల్పోయిందని తెలిపింది. దీనిని బేరీజు వేసుకోవడానికి మామూలుగా ఉడికించిన బ్రోకలీ దాని ఉపయోగకరమైన యాంటీఆక్సిడెంట్లను 11% లేదా అంతకంటే తక్కువ కోల్పోయింది. అలాగే ఫినోలిక్ సమ్మేళనాలు మరియు గ్లూకోసినోలేట్స్ లలో కూడా తగ్గింపులు ఏర్పడ్డాయి కానీ ఖనిజ లవణాలు స్థాయి చెక్కు చెదరకుండా ఉంది.  
  1.  1999లో స్కాండినేవియన్ అధ్యయనం ప్రకారం తోటకూరను మైక్రో వేవ్ ఓవెన్లో  ఉడికించినప్పుడు దాని ‘సి’ విటమిన్లో తగ్గుదల ఏర్పడిందని కనుగొన్నారు.
  2. ఒక అధ్యయనం ప్రకారం వెల్లుల్లిని, 60 సెకన్ల పాటు మైక్రోవేవ్ ద్వారా వేడిచేసినప్పుడు వెల్లుల్లిలో ఉండే ప్రధానమైన క్యాన్సర్ నిరోధక పదార్థం అల్లినేస్ అనేది నిష్క్రియాత్మకమవుతుందని తెలిపింది.
  1. డాక్టర్ వాటనబే చేసిన జపనీస్ అధ్యయనం కేవలం ఆరు నిమిషాల్లోనే మైక్రోవేవ్ ద్వారా వేడి చేసిన పాలలోని B12 విటమిన్ 30-40 శాతము నిష్క్రియాత్మకముగా మారిందని తెలిపింది.  
  2. ఇటీవల జరిగిన ఒక ఆస్ట్రేలియన్ అధ్యయనం మైక్రోవేవ్ ద్వారా వేడిచేయబడినప్పుడు సాంప్రదాయకముగా వేడిచేసిన వాటికంటే ఎక్కువ “ప్రోటీన్లను  నిష్క్రియం చేస్తున్నదని” పేర్కొంది.  

తల్లి పాలను వేడి చేయటానికి మైక్రోవేవ్ మంచిది కాదు

మానవ సంబంధిత తల్లి పాలు లేదా బేబీ ఫార్ములా అనేది మైక్రో ఓవెన్ ద్వారా వేడిచేసినప్పుడు మారిపోతున్నాయి అని చెప్పడానికి ఇటీవల సాక్షాలు పెరుగుతున్నట్లు తెలుస్తోంది:

  1. మైక్రోవేవ్ ద్వారా వేడిచేయడం వల్ల తల్లిపాలలో బిడ్డకు రక్షణ కల్పించే అవసరమైన వ్యాధి నిరోధక ఏజెంట్లను నాశనం చేస్తుంది. 1992లో, డాక్టర్ రిచర్డ్ క్వాన్ మైక్రోఓవెన్లో వేడి చేసిన తల్లిపాలు లైసొజోమ్ చర్యను, వ్యాధి నిరోధక ప్రతి రోధకాలను కోల్పోవడమేకాక శక్తివంతమైన వ్యాధికారక బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహించాయని తెలిపారు.  
  2. 1989లో ‘లీ’ అనే శాస్త్రవేత్త చేసిన అధ్యయనంలో మైక్రోఓవెన్లో వేడిచేసిన తల్లిపాలు లేదా బేబీ ఫార్ములా విటమిన్లను కోల్పోయిందని మరియు కొన్ని అమైనో ఆమ్లాలు జీవసంబంధిత క్రియా రహితమైన ఇతర పదార్థాలుగా మార్చబడతాయనీ ఇవి నాడీ వ్యవస్థ మరియు మూత్రపిండాలకు విషంగా పరిణమిస్తాయని తెలిపారు.  

మైక్రోఓవెన్లో వండిన ఆహారం తినే వారిలో వచ్చే మార్పులు

మైక్రో ఓవెన్ ఉపయోగించి వండిన ఆహారం తీసుకునే వారిలో వచ్చే మార్పులపై తక్కువ పరిశోధనలే జరిగాయి. హెర్టల్ మరియు బ్లాంక్ వీరిద్దరి చేత చేయబడిన ఒక చిన్న అధ్యయనం విస్తృతంగా చలామణీ కావడమేకాక దానిని అనుసరించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గడం మరియు కొలెస్ట్రాల్ మరియు ల్యుకోసైట్ లు స్థాయిలు పెరగడం వంటి అనేక తీవ్రమైన మార్పులు వారు కనుగొన్నప్పటికీ వారి పరిశోధన కేవలం 18 మందిపై ఆధారపడింది. వీరంతా హెర్టల్ తో సహా మైక్రో బైయాటిక్ ఆహారం మాత్రమే తిన్నారు. వారి పరిశోధనలు సాధారణ ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండవచ్చు. కానీ మరిన్ని ఆధారాలు లేకుండా మేము దీన్ని ప్రస్తావించలేము.  టామ్ వాలెంటైన్ అనే యు.ఎస్. కి చెందిన స్వతంత్ర జర్నలిస్ట్, ఈ అధ్యయనం యొక్క ఫలితాలను  1992 వసంత ఋతువులో ‘సెర్చ్ ఫర్ హెల్త్’ పత్రిక లో ప్రచురించారు.  

మైక్రోవేవ్ వంటకు దూరం కావడం: కొన్ని ప్రాథమిక చిట్కాలు  

మీరు నమ్మినా నమ్మకపోయినా మైక్రో ఓవెన్ లేకుండా జీవించడం సులభమే. ఐతే మీరు కొన్ని చిన్నచిన్న జీవనశైలి సర్దుబాట్లు  చేసుకోవాలి, అవి ఏమిటంటే:

  1. ముందస్తు ప్రణాళిక: ఉదయం గానీ లేదా రాత్రి మీ డిన్నర్ కు రెండు గంటల ముందు ఫ్రీజర్ నుండి ఆహారాన్ని బయట పెట్టండి. అప్పుడు రాత్రి భోజన సమయానికి ఐదు పౌండ్ల భాగాన్ని డీ ఫ్రాస్ట్ చేయడానికి మీరు కుస్తీ పట్టవలసిన అవసరం ఉండదు.
  2.  పులుసులు మరియు కూరలను ఎక్కువ మొత్తంలో తయారుచేసి ; వాటిని చిన్న కవర్లలో లేదా ఇతర కంటెయినర్లలో ఫ్రిజ్ లో నిలవ చేయండి. భోజన సమయానికి గంట ముందు కావాల్సిన దాన్ని తీసి ఆ కవరు లేదా కంటెయినర్ నీటితో ఉన్న పాత్రలో మునగకుండా జాగ్రత్త వహిస్తూ కొంత సమయం ఉంచి పదార్ధం కరిగిన తర్వాత స్టవ్ పైన వేడి చేసుకొని సేవించవచ్చు.
  3.  టోస్టర్ (రొట్టెలు కాల్చే) ఓవెన్ లేదా కన్వెక్షన్ (ఉష్ణ సంవహన ప్రక్రియ తో పనిచేసే) ఓవెన్ మిగిలిపోయిన ఆహార పదార్ధాలను వేడి చేయడానికి ఎంతో అనువుగా ఉంటాయి. దీనిని తక్కువ ఉష్ణోగ్రత వద్ద అనగా 200-250F (95-120C) ఆహారం ఉన్న ప్లేట్ ను 20 నుంచి 30 నిమిషాలు దీనిపై ఉంచితే సరిపోతుంది.   
  4.  మీరు బిజీగా ఉన్నప్పుడో లేదా అలిసిపోయిన సందర్భంలో ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఆహారం ముందే తయారు చేసుకున్నట్లయితే మీకు అందుబాటులో ఉంటుంది.   
  5. ఉడికించని ఆర్గానిక్ ఆహారం తినడానికి ప్రయత్నించండి. ఇది మీ ఆరోగ్యాన్ని ఎక్కువ కాలం మంచి స్థితిలో ఉంచడానికి చక్కని మార్గం.  

ఆధారములు:

  • http://www.huffingtonpost.com/dr-mercola/microwave-cancer_b_684662.html http://www.powerwatch.org.uk/rf/microwaves.asp
    http://articles.mercola.com/sites/articles/archive/2010/05/18/microwave-hazards.aspx

    http://www.jrussellshealth.org/microwaves.html http://www.safespaceprotection.com/electrostress-from-microwave-ovens.aspx 

 

పీచు పదార్థం ఎక్కువగా గల ఆహార పదార్థాలు మిమ్మల్ని  కొలెస్ట్రాల్ లేకుండా ఎలా రక్షిస్తాయి

 

ఏ విధంగా అయితే కొన్ని ఆహారపదార్ధాలు ముఖ్యంగా - సంతృప్త(సాచురేటెడ్)  కొవ్వు పదార్థాలు - మీలో హానికరమైన కొలెస్ట్రాల్  పెంచుతాయో, అదేవిధంగా పీచు పదార్థాలు - ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు(హై ఫైబర్) కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఉపయోగపడతాయి. హై ఫైబర్ ఉన్న పదార్ధాలు కొలెస్ట్రాల్ ను ఎలా తగ్గిస్తాయి అనే విషయాన్ని శాస్త్రజ్ఞులు అధ్యయనం చేస్తున్నారని చికాగోలోని  నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీ వారి ఫీన్ బెర్గ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ రిజిస్టర్డ్ డైటీషియన్ మరియు ముందస్తు నివారణ ప్రొఫెసర్ లిండా వి. వాన్ హార్న్ PhD  తెలిపారు.

డైటరీ ఫైబర్, దీనికి మరొక పేరు రఫేజ్ లేదా బల్క్, మన శరీరము జీర్ణం చేసుకోలేని అన్నిరకాల మొక్కల ఆహార పదార్థాలన్నింటినీ కలిగి ఉంటుంది. క్రొవ్వులు, ప్రోటీన్లు, కార్బో హైడ్రేట్లు వంటివి - మన శరీరం కరిగించుకొని - వాటిలోని కరగని పీచు పదార్థాలను మన శరీరం జీర్ణించుకోలేదు కనుక ఇవి చిన్న ప్రేగు, పెద్దప్రేగు, బాహ్య ద్వారము ద్వారా బయటికి విసర్జింపబడతాయి.  

పీచు పదార్థం నీటిలో కరిగేది ఐతే ‘కరిగేది’ అని కరగక పోతే ‘కరగనిది’ అని రెండు రకాలుగా వర్గీకరించబడింది. చాలావరకూ మొక్కలకు సంబంధించిన పదార్థాలు ఉదాహరణకు ఓట్స్, బీన్స్ అనేవి కరగని మరియు కరిగే పీచు పదార్థాలు కలిగి ఉంటాయి. ఏదిఏమైనప్పటికీ, ఈ రెండు రకాల ఫైబర్ పరిమాణం వేర్వేరు మొక్కలలో వేర్వేరుగా ఉంటుంది. అధిక ఆరోగ్య ప్రయోజనం పొందటానికి అనేక రకాలైన ఎక్కువ - ఫైబర్ ఉన్న ఆహారాలను తినడం మంచిది.

స్పష్టమైన విషయం ఏమిటంటే కొలెస్ట్రాల్ నియంత్రణ ప్రయోజనము కరిగే ఫైబర్ వల్లనే సాధ్యం. బేరీ మరియు ఆపిల్ తొక్కల లోనూ బటాని వంటి కూరగాయలు మరియు ఓట్స్ మరియు బార్లీ వంటి తృణధాన్యాలలో ఇది ఎక్కువగా ఉంటుంది. కరగని ఫైబర్ జీర్ణం కాదు కానీ ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా ఇది చాలా అవసరం - కొలెస్ట్రాల్ నియంత్రణకు కాకపోయినా - జీర్ణక్రియ క్రమబద్ధతకు ఇది సహాయపడుతుంది.  

కరిగే ఫైబర్ కలిగిన హై-ఫైబర్(ఎక్కువ పీచు పదార్ధము) ఆహారపదార్ధాలు రక్తప్రవాహంలో చిన్న- గొలుసుకట్టు కొవ్వు ఆమ్లాలను ప్రభావితం చేస్తాయని వాన్ హార్న్ చెప్పారు. కొలెస్ట్రాల్ తగ్గించే ఔషధం (స్టాటిన్)  ఏ ప్రయోజనము మనకు కలిగిస్తుందో కరిగే ఫైబర్ కూడా అంతే సంభావ్య ప్రయోజనాన్ని కలిగి ఉంటుంది ; ఇది సంతృప్త కొవ్వు లేదా ఇతర హానికరమైన కొవ్వును తీసుకోవడాన్ని నిరోధిస్తుంది. కరిగే ఫైబర్ అనారోగ్య కొలెస్ట్రాల్ స్థాయిలపై ప్రభావితం చూపే ఇన్సులిన్ నిరోధకతను తగ్గించడంలో కూడా సహాయ పడుతుంది. “లిపిడ్ లేదా క్రొవ్వు మరియు గ్లూకోజ్ రెండింటి జీవక్రియలపై ఫైబర్ ప్రయోజనకరమైన ప్రభావములను కలిగి ఉంటుందని” వాన్ హార్న్ చెప్పారు. ఇది మొత్తం లిపిడ్  ప్రొఫైల్ను మెరుగుపరుస్తుంది. ఫలితంగా ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ స్థాయిలు మరియు మరొక క్రొవ్వు రూపమైన తక్కువ స్థాయి ట్రై గ్లిజరిడ్ స్థాయిలు మెరుగు పడతాయి.

కరిగే ఫైబర్ ఉన్న ఆహారపదార్ధాలు కొలెస్ట్రాల్ నిర్వహణకు సహాయపడటానికి ఒక ఆచరణాత్మక కారణం ఉంది. అది ఏమిటంటే ఈ ఆహారాల్లో కొవ్వు తక్కువగా ఉంటుంది, మరియు ఫైబర్ లేని ఆహారాలు కంటే ఎక్కువ పూరకాలు (ఫిల్లింగ్స్)ఉంటాయి. అంటే మీరు ఇట్టి ఆహారమునకు కట్టిబడి పోవడమే కాక అధిక ఫైబర్ కలిగిన ఆహారంతో ఆరోగ్యకరమైన బరువును పొందే అవకాశం ఉంది.

కొలెస్ట్రాల్ తగ్గింపు కోసం ఫైబర్: ఒక పరిశోధన

కొలెస్ట్రాల్ను తగ్గించడం కోసం మీరు తీసుకొనే రోజువారీ ఆహారంలో సాధారణ మార్పులు కొన్ని నెలల్లోనే ఫలితాలు ఇస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. న్యూట్రిషన్ జర్నల్ లో ప్రచురింపబడిన వ్యాసం ప్రకారం 300 మందికి పైగా పెద్ద వారిపై చేసిన నియంత్రిత అధ్యయనంలో నాలుగు వారాల పాటు ఓట్ ఫైబర్ కలిగిన మూడు నుండి నాలుగు గ్రాముల తృణధాన్యాలు తిన్న వ్యక్తులు తక్కువ సాంద్రత కలిగిన లిపో ప్రోటీన్ LDL లేదా చెడు కొలెస్ట్రాల్ ను ఐదు శాతం తగ్గించాయి. అలాగే అధిక కొలెస్ట్రాల్ నియంత్రణ కోసం ఆహారంలో ఫైబర్ చేర్చడం వివిధ జాతుల ప్రజలకు సహాయకరంగా ఉంటుందని చూపిన మొదట అధ్యయనం ఇదే.

మరింత శుభవార్త : ఉపయోగకరమైన ఫైబర్ విషయంలో ఓట్స్ ఒక్కటే ఏకైక మూలం కాదు. ఫ్రూట్ ఫైబర్, కొలెస్ట్రాల్ వంటి గుండె జబ్బు ప్రమాద కారకాలను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవడానికి ఋతుక్రమం ఆగిపోయిన 160 మంది మహిళలపై రేగి పండ్లు  మరియు ఎండిన ఆపిల్ వినియోగాన్ని పోల్చింది. అకాడమీ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ జర్నల్ లో ప్రచురించిన వ్యాసం ప్రకారం ఈ పరిశోధనా బృందం ప్రతీరోజు 2 యాపిల్ పండ్లతో సమానమైన ఆహారం తిన్న మహిళలు మూడు నెలల్లో వారి కొలెస్ట్రాల్ స్థాయిని 16% మేర మెరుగుపరుచుకున్నారని నివేదించారు. (రేగి పండ్లు కూడా కొలెస్ట్రాల్ ను పూర్తిగా తగ్గించడంలో ఉపయోగపడుతుంది)  

   ప్రతీరోజూ ఎంత ఫైబర్ అవసరం?

ఔషధము మరియు ఆరోగ్య విషయాలపై విజ్ఞానశాస్త్ర ఆధారిత సలహాలను అందించే ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్ పెద్దలకు ఈ క్రింది రోజువారి సిఫార్సులను అందించింది. పురుషులు రోజువారీ 30 నుండి 38 గ్రాముల ఫైబర్ ఆహారంగా కలిగి ఉండాలి. మహిళలు రోజువారి 21 నుండి 25 గ్రాములు ఫైబర్ కలిగి ఉండాలి. చాలా మందికి ఆశించిన లక్ష్యంలో 25 శాతం ఫైబర్ కూడా రోజు వారి ఆహారంలో లభించడం లేదని గుర్తించబడింది. ఓట్ గింజల పొట్టు, ధాన్యపు పొట్టు, ఆకుకూరలు, క్యారెట్, బీన్స్ బఠాణీలు, బేరి,  ఆరెంజ్ పండ్లు, బార్లీ, స్టీల్ కట్ ఓట్లు, బాదం ఇవి ఎక్కువ ఫైబర్ ఉన్నటువంటి పదార్ధాలు కనుక మీ ఆహారంలో చేర్చడానికి ప్రయత్నించండి.

ఫైబర్ ను అనునిత్యమూ మీ ఆహారంలోకి చేర్చుకోవడానికి కొన్నిఉపాయములు కావాలా?    

మీ ఆహారంలో ఈ క్రింది చేర్పులను ప్రయత్నించండి :

  1. డ్రై ఫ్రూట్స్ లేదా పండ్లు, కూరగాయలను స్నాక్స్ గా చేర్చుకోండి.  
  2. కూరగాయలు మరియు బీన్సును మీ భోజన పాత్రలో మరియు మీరు తీసుకునే పులుసులలో చేర్చండి.
  3. బేకింగ్ చేసేటప్పుడు మైదాపిండి స్థానంలో కొంత భాగాన్ని లేదా మొత్తాన్ని ధాన్యం పిండితో భర్తీ చేయండి.   
  4. కోకో యొక్క స్క్రాచ్(కోకో గింజల పొట్టు), పాలు మరియు కోకో పౌడర్ నుండి వేడి కోకో పానీయం తయారు చేయండి. దీనిలో ఎక్కువ  ఫైబర్ ఉంటుంది.  .
  5.  మీరు ఎంపిక చేసుకునే ఆహారంలో అధిక క్రొవ్వులు ఉన్న ఆహారం బదులు అధిక ఫైబర్ కలిగిన వాటిని ఎంచుకోండి. ఉదాహరణకు బుర్రిటొ (ఒక రకమైన మెక్సికన్ ఆహారం) తయారీకి  వెన్న మరియు సోర్ క్రీం బదులుగా బీన్స్ పౌడర్ జోడించండి.   

హై ఫైబర్ లేదా అధిక పీచుపదార్ధం కల ఆహారం వలన కలిగే ప్రయోజనాలు

ఎక్కువ ఫైబర్ కలిగిన ఆహారానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి, అవి ఏమిటంటే :  

  1. ప్రేగు కదలికలను సాధారణీకరించడం: డైటరీ ఫైబర్ మీయొక్క మలము బరువును పరిమాణాన్ని పెంచి మృదువుగా చేస్తుంది. అధిక మొత్తంలో ఉండడం వలన సులువుగా బయటికి విసర్జించబడుతుంది, తద్వారా మలబద్దకాన్ని నిరోధిస్తుంది. మీకు వదులుగా లేదా నీళ్ళ విరోచనం అవుతుంటే ఫైబర్ అట్టి మలమును గట్టి పరుస్తుంది. ఎందుకంటే ఇది నీటిని గ్రహిస్తుంది మరియు ఎక్కువ పదార్థాన్ని మలానికి జోడిస్తుంది.
  2. ప్రేగుల ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడుతుంది: అధిక ఫైబర్ ఉన్న ఆహారం పెద్ద ప్రేగులలో హెమరాయిడ్స్ లేదా మూల వ్యాధిని, డైవర్ట్ క్యులర్ డిసీస్(పెద్ద ప్రేగులో చిన్న సంచుల వంటి నిర్మాణాలు ఏర్పడటం) వంటి ప్రమాదాలను తగ్గిస్తుంది. కొంత భాగం ఫైబర్ పెద్ద ప్రేగులో పులి పెట్టబడుతుంది. పరిశోధకుల పెద్ద ప్రేగు వ్యాధులను నివారించడంలో ఫైబర్ పాత్ర ఏమిటో విశ్లేషిస్తున్నారు.  
  3.  కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది: బీన్స్, ఓట్స్, అవిసె గింజలు మరియు ఓట్స్ యొక్క  పొట్టు లభించే కరిగే ఫైబర్ రక్తంలోని LDL  స్థాయిలను తగ్గించడం ద్వారా మొత్తం రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం ఫైబర్ కు రక్తపోటును మరియు మంటను తగ్గించి గుండెకు ఆరోగ్యం చేకూర్చే అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది.
  4. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది: మధుమేహం ఉన్న రోగులలో ఫైబర్ ముఖ్యంగా నీటిలో కరిగే ఫైబర్ చక్కెర శోషణాన్ని నెమ్మదింప చేయడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిని సమస్థితిలో ఉంచడానికి సహాయపడుతుంది. కరగని ఫైబర్ ఉన్న ఆరోగ్యకరమైన ఆహారం, టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
  5.  ఆరోగ్యపరంగా శరీరానికి తగిన బరువు ఉండేలా చేస్తుంది: ఎక్కువ ఫైబర్ ఉండే పదార్థాలకు సాధారణంగా నమలడానికి ఎక్కువ సమయం అవసరమవుతుంది. ఇది మన శరీరం రిజిస్టర్ చేసుకొని ఆకలి లేనప్పుడు ఆహారం మీదకు మనసు మరలదు, కాబట్టి అతిగా తినడం అనేది తక్కువ అవుతుంది. అలాగే ఎక్కువ ఫైబర్ ఉన్న ఆహారం తిన్నప్పుడు ఎక్కువ తిన్న అనుభూతినిస్తుంది. కనుక ఎక్కువ సమయం కడుపు నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఎక్కువ ఫైబర్ ఉన్న ఆహారం తక్కువ శక్తి ఉపయోగించుకునే విధంగా ఉంటుంది. అనగా అంతే పరిమాణం ఉన్న ఇతర ఆహారం కన్నా తక్కువ కేలరీలు దీనిలో ఉంటాయి.

డైటరీ ఫైబర్ వల్ల కలిగే మరో ప్రయోజనం కొలోరెక్టల్ (పెద్ద ప్రేగుకు సంబంధించిన )క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది. అయితే ఫైబర్ కొలోరెక్టల్ క్యాన్సర్ ను తగ్గిస్తుందని చెప్పే ఆధారాలు మిశ్రమంగా ఉన్నాయి. ప్రతిరోజు సిఫార్సు చేసిన స్థాయిలో ఫైబర్ తీసుకోవడం వల్ల అంతా సవ్యంగా ఉండి ఆరోగ్యం మెరుగుపరచుకోవడానికి దోహదం చేస్తుంది.  

ఆధారములు :

  • Institute of Medicine, 2012 www.mayoclinic.com/health/fiber/ www.everydayhealth.com 

***అభ్యాసకులు దృష్టికి***

మా వెబ్‌సైట్ www.vibrionics.org. ప్రాక్టీషనర్ పోర్టల్‌కు లాగిన్ అవ్వడానికి మీకు మీ రిజిస్ట్రేషన్ నంబర్ అవసరం. మీ ఇమెయిల్ చిరునామా మారితే, దయచేసి వీలైనంత త్వరగా [email protected] లో మాకు తెలియజేయండి.

మీరు ఈ వార్తాలేఖను మీ రోగులతో పంచుకోవచ్చు. వారి ప్రశ్నలు సమాధానాల కోసం లేదా పరిశోధన మరియు ప్రతిస్పందన కోసం మీకు పంపబడాలి. మీ సహకారానికి ధన్యవాదాలు.

ఓం సాయి రామ్