Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

Vol 16 సంచిక 1
జనవరి / ఫిబ్రవరి 2025
అవలోకనం

డాక్టర్ జిత్ కె. అగర్వాల్ కార్యాలయం నుండి

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ, దైవిక ప్రేమను నింపే అవతార్ అడుగుజాడలను అనుసరించాలని గుర్తుచేస్తూ, రోగి సేవ పరంగా 2024 సంవత్సరంలో సాధించిన పురోగతిని డాక్టర్ అగర్వాల్ గారు వివరిస్తారు మరియు ప్రాక్టీషనర్లు అందరూ వైబ్రియానిక్స్ యొక్క తాజా సమాచరం తెలుసుకొని ఉండాలని మరియు తమ స్వంత వ్యక్తిగత ఆరోగ్యం మెరుగుపరచడానికి సంకల్పించుకోవాలని కోరారు.

పూర్తి వ్యాసం చదవండి

దృష్టాంత చరిత్రలు

12 ఆసక్తికరమైన కేసులు పంచుకో బడ్డాయి. అవి ఆహార అలెర్జీ, మలబద్ధకం; కార్న్స్ , కాళ్ళలో నొప్పి; నిద్రలేమి; సర్వైకల్ స్పాండిలోసిస్, మోకాలి నొప్పి; నిరాశ, ఆందోళన, నిద్రలేమి; మైగ్రేన్, కాలు నొప్పి & అలసట; ఫంగల్ ఇన్ఫెక్షన్; నోటిలో మంట; గొంతులో మంట, వికారం; ఫంగల్ ఇన్ఫెక్షన్ (ఒనికోమైకోసిస్), క్రానిక్ సైనసిటిస్, ట్రిజెమినల్ న్యూరల్జియా & పోస్ట్-కోవిడ్ సిండ్రోమ్; మైగ్రేన్; మరియు చెవి నుంచి చీము కారడం (క్రానిక్ సప్పురేటివ్ ఓటిటిస్ మీడియా).

దృష్టాంతములు చదవండి

సాధకుని వివరములు

చిన్నప్పటి నుంచి స్వామివారి భక్తులుగా ఉంటూ సాయి సేవలో చురుగ్గా పాల్గొంటున్న ఇద్దరు అంకితభావం గల ప్రాక్టీషనర్లను మీకు పరిచయం చేస్తున్నాం. ఇద్దరూ కూడా వ్యక్తిగతంగా వారు చూసిన వైబ్రియానిక్స్ యొక్క అద్భుతమైన ప్రభావంతో ప్రేరణ పొంది ప్రాక్టీషనర్లగా మారారు మరియు వారి వైబ్రియానిక్స్‌ సేవలో పొందిన అద్భుత ఫలితాల యొక్క అనుభవాలను పంచుకున్నారు.

సాధకుని వివరములు చదవండి

సమాధానాల వేదిక

వీటిని గురించి తెలుసుకోవడానికి చదవండి: మా SRHVP మెషీన్ నుండి వెలువడే వైబ్రేషన్లు మరియు ప్రసారం చేయడానికి ఉపయోగించె హీలింగ్ వైబ్రేషన్‌న్లు; రోగికి రెమెడీలు తీసుకోవడానికి సంబంధించిన సూచనలను పాటించడం కష్టంగా అనిపించినప్పుడు ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి; ఒక కార్డ్ కోసం నిర్దిష్ట పోటెంసీని ఎంచుకోవడం వెనుక సూత్రం మరియు మార్గదర్శక కారకాలు; మాస్టర్ బాక్స్‌లోని వైబ్రేషన్‌లు ఎలా పూర్తిగా ఛార్జ్ అవుతాయి; మరియు 108CC బాక్స్ యొక్క అనేక కాంబోలను ఉపయోగించి రెమెడీలు చేసేటప్పుడు మాత్రలు అత్తుక్కోకుండా ఎలా తయారు చెయ్యాలో చెప్పే చిట్కాలు.

పూర్తి వ్యాసం చదవండి

మాస్టర్ హీలర్ దైవిక వాక్కులు

ఆరోగ్యం కోసం సహజ స్థితిలో ఉన్న ఆహారాన్ని ఎలా తీసుకోవాలో మరియు మనం చేసే సేవ ఎవరికి చేరుతుందో స్వామి ప్రేమతో మార్గనిర్దేశం చేసారు!

పూర్తి వ్యాసం చదవండి

ప్రకటనలు

ఇండియాలో భవిష్యత్తులో జరగబోయే వర్క్ షాప్ ల గురించి సమాచారం ఇవ్వబడింది

పూర్తి వ్యాసం చదవండి

అదనంగా

• ఆరోగ్య కథనంలో “మీ వెన్నెముకను జాగ్రత్తగా చూసుకోండి; అది దివ్య శక్తికి మార్గం" మన వెన్నెముక, ప్రకృతి ఏ విధముగా అద్భుతంగా వెన్నెముకను నిర్మించిందో, వివిధ వెన్నెముక రుగ్మతలు మరియు మీ వెన్నెముకను ఎలా రక్షించుకోవాలి, భంగిమ, ఆహారం మరియు వ్యాయామాలతో వెన్నెముక సమస్యలను ఎలా నివారించాలి మరియు ఎదుర్కోవాలి వంటి విషయాలను , చిట్కాలతో పాటు వివరిస్తుంది. • SVIRT ఆఫీస్, పుట్టపర్తిలో జరిగిన మూడు వర్క్‌షాప్‌ల సంగ్రహావలోకనాలు మరియు విజయవాడలో ఒక రోజు జరిగిన ఆంధ్రా & తెలంగాణ ప్రాక్టీషనర్ల సమావేశం, నవంబర్ 2024లో దేశవ్యాప్తంగా నిర్వహించబడిన క్యాంపులు మరియు 2024 నవంబర్-డిసెంబర్‌లో ఆంధ్రా & తెలంగాణలో ప్రారంభించబడిన వివిధ క్యాంపులు మరియు క్లినిక్‌లు. • సంఘటనలు: డాక్టర్ జిత్ కె అగర్వాల్ యొక్క డైరీ నుండి అతను తీవ్రమైన కాలిన గాయం తర్వాత పొందిన అద్భుతమైన స్వస్థత, లోతైన విశ్వాసం మరియు భక్తితో తీసుకున్నప్పుడు వైబ్రియానిక్స్ యొక్క అద్భుతమైన శక్తి మరియు అత్యవసర రెమెడీని ఎందుకు ఎల్లప్పుడూ దగ్గర ఉంచుకోవాలో వివరణ. • మెమోరియంలో: అంకితభావంతో 13 సంవత్సరాల పాటు రోగులకు అవిశ్రాంతంగా సేవలందించి కోవిడ్ అనంతర సమస్యల వలన పరమపదించిన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన ప్రాక్టీషనర్కి మేము నివాళులర్పిస్తున్నాము.

పూర్తి వ్యాసం చదవండి