పిసిఓడి సమస్య కారణంగా తక్కువ స్రావము మరియు క్రమరహిత బహిష్టు 02726...USA
38 ఏళ్ల మహిళ 20 సంవత్సరాలుగా తక్కువ స్రావము మరియు క్రమరహిత బహిష్టు కాలములతో బాధపడుతున్నారు. ఈమెకు తలమీద జుట్టు రాలిపోవడం మరియు ఊబకాయం సమస్యలు కూడా ఉన్నాయి. డాక్టర్ ఈ పరిస్థితిని PCOD గా నిర్ధారించారు. ఎండోక్రైనాలజిస్ట్ రెండు సంవత్సరాల హార్మోన్ చికిత్స చేసిన మీదట సంవత్సరానికి ఐదారుసార్లు బహిష్టు రావడం ప్రారంభించింది కానీ క్రమం తప్పకుండా రావడం లేదు. ఆరేళ్లపాటు ఆయుర్వేదం హోమియోపతి మరియు యోగా వంటి ఇతర ప్రత్యామ్నాయ చికిత్సలు ప్రయత్నించినప్పటికీ ఆమె బహిష్టు కాలాలు సక్రమంగా కాక సంవత్సరానికి 3-4సార్లు మాత్రమే కలుగుతున్నాయి. నెల క్రితం ఆమె బరువును తగ్గించు కొనడానికి చాలా తక్కువ కేలరీల డైట్ ప్లాన్ ప్రారంభించారు. 2020 ఏప్రిల్ 8న ఆమె ప్రాక్టీషనరును సంప్రదించగా క్రింది రెమిడి ఇచ్చారు:
#1. CC6.2 Hypothyroid + CC8.4 Ovaries & Uterus + CC8.8 Menses irregular + CC12.1 Adult tonic + CC17.2 Cleansing…TDS
ఆమె రోజుకు ఒక్కసారి మాత్రమే #1 ని తీసుకొనసాగింది, తన సమస్యల విషయంలో ఎక్కువ మెరుగుదల గమనించలేదు. 2020 సెప్టెంబరులో ఆమె బహిష్టు కాలాలు సక్రమం అయ్యాయని జుట్టురాలడంలో 20% మెరుగుదల ఉందని గ్రహించారు. అందుచేత #1 ని TDS గా తీసుకోవడానికి ప్రారంభించారు. 2020 అక్టోబర్ 2న ప్రాక్టీషనరు #1 ని క్రింది విధంగా సవరించారు.
#2. CC6.2 Hypothyroid + CC8.4 Ovaries & Uterus + CC10.1 Emergencies + CC11.2 Hair problems + CC12.1 Adult tonic+ CC12.4 Autoimmune diseases + CC15.1 Mental & Emotional tonic…TDS నీటిలో
తాను రజస్వల ఐన నాటినుండి ఎంతో కాలం తరువాత బహిష్టు కాలాలు క్రమం తప్పకుండా కొనసాగడం చూసి ఆమె ఎంతో ఆనందించారు. 2021 జనవరి 1 నాటికి ఆమె బరువు 9 కిలోలు (20 పౌండ్లు) కోల్పోయింది. జుట్టు రాలడంలో 50% మెరుగుదల ఉంది కానీ దానిపై ఆమె దృష్టి పెట్టడం లేదు. మోతాదు OD కి తగ్గించబడింది. 2021 ఏప్రిల్ నాటికి ఆమె #2 ను ముందస్తు కోసం OD గా కొనసాగిస్తూనే ఉన్నారు.
రోగి యొక్క వ్యాఖ్యానము (సంక్షిప్తం చేయబడింది) తేదీ 29 జనవరి 2021:
2020 సెప్టెంబర్ నుండి నా బహిష్టు కాలాలు సరైన సమయానికి రావడం ప్రారంభమయ్యాయి. నాకు యుక్తవయ్సు వచ్చిన నాటినుండి నేను ఎప్పుడూ ఇది అనుభవించలేదు. నా పీరియడ్స్ రెగ్యులర్ గా మారడం, క్రమంగా బరువు తగ్గడం మరియు సానుకూల వైఖరి ఇవన్నీ వైబ్రియానిక్స్ యొక్క ఫలితం మాత్రమే అని నేను నమ్ముతున్నాను. అలాగే రెమిడీలు గోళి రూపంలో కన్నా నీటిలోనే చాలా ప్రభావంతంగా ఉన్నాయని నేను ధృవీకరిస్తున్నాను.