కటి వెన్నుముక నాడీ సంకోచము (స్టెనోసిస్) 12051...India
2019 జనవరిలో 80 ఏళ్ళ వ్యక్తికి కటి దిగువ భాగం నుండి కుడి పాదం వరకు సలుపుతూ నొప్పి ఏర్పడింది. డాక్టర్ దీనిని వెన్నుముక కటి ప్రాంతంలో నరాల సంకోచంగా నిర్ధారించారు. అతనికి అంతకు ముందునుండి మోకాలిలో ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్న కారణంగా దానికి 2014 డిసెంబర్ నుండి #1 CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC18.5 Neuralgia + CC20.3 Arthritis + CC20.4 Muscles and Supportive tissue + CC20.5 Spine తీసుకుంటున్నారు (వార్తాలేఖ సంచిక 6 సంపుటి 3 చూడండి). 2019 నవంబర్లో ఇతనికి కాలిలో ఏర్పడిన నొప్పి ఎంత తీవ్రంగా ఉందంటే అతను పది నిమిషాలకు మించి నిలబడ లేక పోయేవారు. కొంచెం దూరం నడవడానికి చాలా ఇబ్బంది పడేవారు. వైద్యుడు నేర్విజన్-పి మాత్రలు ఒక నెలపాటు సూచించాడు కానీ అది కొంత ఉపశమనం మాత్రమే ఇచ్చింది. 2019 డిసెంబర్ 12న ప్రాక్టీషనర్ పై రెమిడీ ఆపివేసి క్రింది రెమిడీ ఇచ్చారు.
#2 NM3 Bone + NM38 Back Pain + NM40 Knees + NM97 Sciatica + OM18 Sacral & Lumbar…TDS
రెండు వారాల తర్వాత నొప్పిలో 90% తగ్గింపు ఏర్పడడమే కాకుండా అతను ఆగకుండా ఒక కిలోమీటర్ దూరం నడవగలగడం చూసి ఎంతో సంతోషించారు. మరో రెండు వారాల్లో అతను నొప్పిలో 100% ఉపశమనం పొందారు. అతని వయస్సు మరియు అస్థిపంజర ఆరోగ్య చరిత్ర కారణంగా ప్రాక్టీషనరు అదే రెమిడీ చాలా నెలలు కొనసాగించమని సలహా ఇచ్చారు. 2020 ఏప్రిల్ 29 న అతని ఆసన ప్రాంతంలో అడపాదడపా ఏర్పడే ఇబ్బంది గురించి ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా మల విసర్జన చేస్తున్న సమయంలో ఇది మరీ ఎక్కువగా ఉంటోంది. కనుక మోతాదు 6TD కి పెంచబడింది. మే 15 నాటికి ఈ ఇబ్బంది తొలగిపోవడంతో మోతాదు TDS కి మార్చబడింది. మూడు వారాల తర్వాత నిర్వహణ మోతాదు OD కి తగ్గించబడింది. 2021 ఏప్రిల్ నాటికి ఎటువంటి పునరావృతం లేకుండా అతను ఆరోగ్యంగా ఉన్నారు.
108 CC బాక్స్ ఉపయోగిస్తుంటే : CC20.1 SMJ tonic + CC20.5 Spine ఇవ్వండి
పేషెంటు వ్యాఖ్యానము :
2019 నవంబర్ లో నేను నా విధులకు తిరిగి హాజరు అవుతానో లేదో అని చాలా భయపడ్డాను. నేను ఎలివేటర్ నుండి కొంచం దూరం ఉన్న నా అపార్ట్ మెంటు వరకూ కూడా నడవలేక పోయాను. నేను స్వామిని మాత్రమే ప్రార్థిస్తూ ఉన్నాను. నాకు సాయి వైబ్రియానిక్స్ మీద పూర్తి నమ్మకం ఉంది. మరియు నా గత అనుభవం కూడా నాకు ఎంతో నమ్మకాన్ని కలిగించింది. వైబ్రియానిక్స్ తీసుకోవడం ద్వారా స్వామి నా బాధను పూర్తిగా తొలగించారు. ఇప్పుడు నేను నడవగలగడమే కాక నా కార్యకలాపాలు అన్నింటిని ఎవరిపైనా ఆధారపడకుండా చేసుకోగలుగుతున్నాను. ప్రస్తుతం నేను వైబ్రియానిక్స్ రెమిడిలు తప్ప వేరే ఏ మందులు వాడడం లేదు. ఈ వయసులో నన్ను ఆరోగ్యంగా ఉంచినందుకు నా ప్రియమైన స్వామికి నేనెప్పుడూ కృతజ్ఞతలు కలిగివుంటాను.