ఎండోమెట్రియాసిస్ కాలినొప్పి అండాశయ తిత్తి 03518...Canada
41 ఏళ్ల మహిళ 2016 సెప్టెంబరులో తన కుమారునికి రొమ్ముపాలు ఇవ్వడం మానేసిన తర్వాత తీవ్రమైన తిమ్మిరి, నొప్పి (నొప్పి తీవ్రత 9-10) మరియు బహిష్టు సమయంలో అధిక రక్తస్రావం కలిగి ఉన్నారు. ఆమెకు కటి ప్రాంతంలో నిరంతరము నొప్పి (తీవ్రత 5-9) కూడా కలుగుతూ అది ఎడమ కాలు నుండి ఆమె చీలమండ వరకు ప్రసరిస్తూ ఉంటుంది. 2017 మధ్యలో వైద్యులు దీనిని ఎండోమెట్రియాసిస్ మరియు ఎడమ కాలులో బోలు ఎముకల వ్యాధి (ఆస్టియో పోరోసిస్) గా నిర్ధారణ చేసారు. ఆమెకు ఎప్పుడూ అలసటగా ఉంటూ తన రోజువారీ కార్యకలాపాలు కొనసాగించడానికి కూడా చాలా కష్టమవుతూ ఉండడంతో గత మూడేళ్లుగా నొప్పి నివారణ మందులతోనే కాలం గడపసాగారు. 2020 ఆమె బహిష్టు కాలాల మధ్య రక్తపు మరకలు కనిపించడం ఆమె గమనించారు. మూడు నెలల తర్వాత అల్ట్రా సౌండ్ పరీక్షలలో ఆమె గర్భాశయంలో 1.9 సెంటీమీటర్ల తిత్తి ఉన్నట్లు వెల్లడయ్యింది. 2020 ఆగస్టు 23న ఆమె ప్రాక్టీషనరును సంప్రదించగా క్రింది రెమిడీ ఇచ్చారు:
ఎండో మెట్రియాసీస్ మరియు గర్భాశయ తిత్తికి:
#1. CC8.4 Ovaries & Uterus + CC8.7 Menses frequent…TDS in water
కటి, మరియు కాలి నొప్పికి ఆస్టియో పోరోసిస్ కు:
#2. CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC18.5 Neuralgia + CC20.4 Muscles & Supportive tissue + CC20.6 Osteoporosis…TDS నీటితో
నెల తర్వాత ఆమెకు నొప్పుల విషయంలో 50% ఉపశమనం లభించింది. నెల తరువాత ఆమెకు రుతుస్రావం క్రమబద్ధం కావడం, మరియు అన్ని నొప్పుల నుండి 100% ఉపశమనం కలిగింది. ఇది ఆమెను స్థానిక సాయి సెంటర్లో గతంలో తన నిస్సహాయత వల్ల చేయలేకపోయిన స్వచ్ఛంద సేవ చేపట్టడానికి ప్రోత్సహించింది. #1 మరియు #2 యొక్క మోతాదు BD కి తగ్గించబడింది. రెండు వారాల తరువాత నవంబర్ 5 న తీసిన అల్ట్రా సౌండ్ పరీక్షలో తిత్తి యొక్క ఎలాంటి ఆధారాలు లేవు. నవంబర్ 30 న మోతాదు OD కి తగ్గించి 2020 డిసెంబర్ 11న రెమిడీ పూర్తిగా ఆపివేయబడింది. 2021 ఏప్రిల్ నాటికి ఏ లక్షణాలు పునరావృతం కాలేదు, ఆమె ఎటువంటి నొప్పులు లేని ఆరోగ్య కరమైన, శక్తివంతమైన ఉల్లాసవంతమైన జీవితం గడప సాగారు.