అవకాడో పండుకు అలెర్జీ 03599...USA
11 ఏళ్ల అమ్మాయికి అవకాడో తిన్నప్పుడల్లా ముఖం మినహా శరీరమంతా దురద పొడిగా ఉండే పొక్కులు ఏర్పడుతున్నాయి. ఈ తీవ్రమైన అలర్జీ ప్రతిచర్య ఒక సంవత్సరానికి పైగా కలుగుతోంది. అల్లోపతి మందులతో ఆమె సాధారణ స్థితికి రావడానికి ఒక వారం పడుతోంది. వైబ్రియానిక్స్ పట్ల పరిచయము నమ్మకం ఉన్నందున అమ్మాయి తల్లి శాశ్వత పరిష్కారం కోసం ప్రాక్టీషనరును సంప్రదించారు. 2020 నవంబర్ 27న సంప్రదింపుల సమయంలో ఇటీవలే తిరిగి లక్షణాలు ఏర్పడిన కారణంగా అమ్మాయికి దద్దుర్లు ఏర్పడిఉన్నాయి. అలాగే ఈ అమ్మాయికి కడుపులో నట్టలు (టేప్ వార్మ్స్) కూడా ఉన్నాయని అమ్మాయి తల్లి భావించింది కానీ దానికి ఔషధం ఏదీ ఇవ్వలేదు. ప్రాక్టీషనరు ద్వారా రోగికి క్రింది రెమిడీ ఇవ్వబడింది:
CC4.6 Diarrhoea + CC4.10 Indigestion…నీటిలో ప్రతి పది నిమిషాలకు ఒక మోతాదు చొప్పున గంట వరకు ప్రతి స్పందన లేకపోతే మరొక గంట మరుసటి రోజు నుండి 6TD.
ఆమె వేరే ఔషధం ఏదీ తీసుకోలేదు. డిసెంబర్ 5 నాటికి ఒక వారంలో దద్దుర్లు పూర్తిగా మాయమయ్యాయి. కాబట్టి ఆమె చర్మం సాధారణ స్థితికి చేరుకుంది. ఐతే స్వల్పంగా దురద ఉంది, కానీ అది కూడా కొంత కాలం తరువాత తగ్గిపోయింది. మోతాదును TDS కు తగ్గించారు. రెండు వారాల తర్వాత ఆమె ఎటువంటి అలర్జీ ప్రతిచర్య లేకుండా ఒక వారం వ్యవధిలో రెండుసార్లు అవకాడో తిన్నది. 2021 జనవరి 2న పాలు మరియు పెరుగు లకు పాపకు దీర్ఘకాలంగా ఉన్న అలర్జీ కూడా మాయమైందని పాప తల్లి సంతోషంగా తెలిపారు. మోతాదు BD కి తగ్గించి ఆరు వారాల తర్వాత ఆపివేశారు. 2021 ఏప్రిల్ నాటికి పాలు, పాల ఉత్పత్తులు మరియు అవకాడో విషయంలో ఎటువంటి అలెర్జీ పునరావృతం లేకుండా పాప ఆనందంగా స్వీకరిస్తున్నది.
సంపాదకుని వ్యాఖ్య: CC4.6 Diarrhoea పై కోంబోలో కడుపులో నట్టల (టేప్ వార్మ్స్) కోసం చేర్చబడింది.