ఆహార అసహనం 03566...USA
70 ఏళ్ల మహిళా శిశువైద్యురాలు 30 ఏళ్లకు పైగా కొన్ని ఆహారపదార్ధాలపై అలర్జీ కలిగి ఉన్నారు. క్యాబేజీ, కాలీఫ్లవర్, బంగాళాదుంపలు, గోధుమలు తిన్న మూడు నాలుగు గంటల లోపు ఆమెకు కడుపునొప్పి వికారం మరియు విరోచనాలు కలుగుతాయి. ముందు జాగ్రత్త కోసం పెప్టో బిస్మాల్ తీసుకుంటున్నా ఇది సాధారణంగా వారం రోజుల పాటు కొనసాగుతుంది. ఇట్టి నిస్సహాయ స్థితిలో ఈ ఆహారాలు తినడం మానేసి ఇది తన విధి అని సరిపెట్టుకొన్నారు. ఒక రాత్రి స్వామి కలలో కనిపించి ఈ సమస్యకు ప్రాక్టీషనర్ వద్దనుండి “బాబా” ఔషధం తీసుకోమని చెప్పారు. కాబట్టి ఆమె 2019 మార్చి 9న ప్రాక్టీషనరును సంప్రదించగా క్రింది రెమిడీ ఇవ్వబడింది:
CC4.1 Digestion tonic + CC4.8 Gastroenteritis + CC4.10 Indigestion + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic...TDS
ఆమె ఆరునెలల పాటు తనకు ఇబ్బంది కలిగించే ఆహార పదార్ధాలను తీసుకోకుండా ఈ రెమిడీని భక్తి శ్రద్ధలతో తీసుకున్నారు. 2019 సెప్టెంబరులో ఆమె ఒక వివాహ వేడుకకు హాజరై తను కోరుకున్న ఆహార పదార్ధాలను తిన్నారు. వాటిలో కొన్ని వంటకాలలో బంగాళదుంప, కాలిఫ్లవర్, మరియు గోధుమలు కూడా ఉన్నాయి. ఆమెకు ఎటువంటి ప్రతికూల ప్రభావం లేకుండా సాధారణ స్థితిలోనే ఉండడం గమనించి ఆశ్చర్యానికి గురి అయ్యారు. తనకు నయమయిందని భావించి ఆమె క్యాబేజీని కూడా తన ఆహారంలో చేర్చి వారానికి రెండు మూడు సార్లు తినడం ప్రారంభించినా తనకు ఏ ఇబ్బంది లేకుండా చక్కగా ఉన్నారు. కనుక మోతాదు సెప్టెంబర్ 28న BD మరియు 2020 జనవరి 10న OD కి తగ్గించారు. 2021 మార్చిలో చేసిన రివ్యూ మేరకు ఆమె ఏ ఇబ్బంది లేకుండా ప్రతీ ఆహార పదార్ధాన్ని తింటూనే ఉన్నారు అయితే మోతాదు OD గా కొనసాగించడానికి ఇష్టపడ్డారు ఎందుకంటే తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇది ఎంతో సహాయపడుతుందని భావిస్తున్నారు.
సంపాదకుని వ్యాఖ్య: సాధారణంగా ఆహార అసహనం ఒకటి రెండు నెలల్లో వైబ్రో చికిత్సతో తగ్గిపోతుంది.