ఉబ్బసం 03569...USA
46 ఏళ్ల మహిళ చిన్నప్పటినుంచి ఉబ్బసం వ్యాధితో బాధపడుతున్నారు. సంవత్సరానికి రెండు మూడు సార్లు ఆమెకు ఉబ్బసం, రాత్రిపూట దగ్గు, ఊపిరి ఆడకపోవడం వంటివి ఏర్పడుతుంటాయి. ఈ స్థితి వాతావరణములో మార్పు, కాలుష్యం మరియు మానసిక ఒత్తిడి వలన ప్రేరేపింప బడుతోంది. వైద్యులు సూచించిన సల్బుటామల్ ఇన్హేలర్ ఉపయోగించడం వలన ఒక నెలలో ఈ లక్షణాలు తగ్గుతూ ఉండేవి. ఈమె 2018 జూన్ 24 న ప్రాక్టీషనరుగా అర్హత సాధించిన ఒక వారం తరువాత ఇండియాకి ప్రయాణం చేసారు. చేరుకున్న వెంటనే ఆమెకు నాసికా అవరోధము, ఆయాసము ప్రారంభ మయ్యాయి. తన గత అనుభవం ప్రకారం ఇన్హేలర్ ఉపయోగించి నప్పటికీ ఈ లక్షణాలు ఒక గంటలో తీవ్రమయ్యి ఉబ్బసానికి దారితీస్తాయి. వెంటనే ఇన్హేలర్ తీసుకోవడమే కాకుండా తన వెల్నెస్ కిట్ నుండి గెట్ వెల్ అనే క్రింది రెమిడీ 2018 జులై 2 న తీసుకోవడం ప్రారంభించారు.
CC9.2 Infections acute…ప్రతీ 10 నిమిషాలకు నీటితో ఒక మోతాదు రెండు గంటల వరకు అనంతరం 6TD
ఆమెను ఆశ్చర్యానికి గురిచేస్తూ రెండు గంటల తర్వాత కూడా వ్యాధి లక్షణాలు తీవ్రం కాలేదు. అందుచేత ఆమె తిరిగి ఇన్హేలర్ ఉపయోగించలేదు. మూడు రోజుల్లో ఆమెకు ఆయాసము మరియు ముక్కు నిరోధము పూర్తిగా తగ్గింది. జూలై 5న మోతాదు TDS కు, జూలై 8 నాటికి OD కి తగ్గింపబడి జూలై 12న నిలిపివేయ బడింది. ఇప్పటికీ రెండున్నర సంవత్సరాలకు పైగా కనీసం తేలికపాటి శ్వాస కోశ ఇబ్బంది కూడా లేకుండా ఆమె హాయిగా ఉన్నారు.
సంపాదకుని వ్యాఖ్య: వెల్నెస్ కిట్ నుండి బ్రీత్ వెల్ అనేది ఈ వ్యాధికి సరియైనది. అయినప్పటికీ CC9.2 Infections acute అనేది దీర్ఘకాలిక శ్వాసకోశ అనారోగ్యానికి సంబంధించిన కంపనాలను కలిగి ఉంటుంది కనుక అద్భుతాలు సృష్టిస్తుంది!