నడుము & కీళ్ల నొప్పులు, గ్యాస్ సమస్య 02814...India
32 ఏళ్ల మహిళ సిజేరియన్ డెలివరీ తర్వాత రెండేళ్లుగా తన వీపు, మోకాళ్ళు, చీలమండ కీళ్ళనొప్పి మరియు అజీర్ణం కారణంగా ప్రేగులలో గ్యాస్ నిలుపుదల సమస్యతో బాధపడుతున్నారు. ఒక సంవత్సరం అలోపతి మందులు తీసుకున్నా ఎటువంటి ప్రయోజనం కలగలేదు. ఇవి తాత్కాలిక ఉపశమనం మాత్రమే కలిగించి లక్షణాలు తిరిగి పునరావృతం అయ్యేవి. 2017 ఏప్రిల్ 9న ఆమెకు క్రింది రెమిడీ ఇవ్వబడింది:
CC4.1 Digestion tonic + CC9.1 Recuperation + CC20.4 Muscles & Supportive tissue + CC20.5 Spine + CC20.6 Osteoporosis…6TD
ఒక నెలలోనే ఆమె నొప్పుల్లో 40% ఉపశమనం కలిగింది. జీర్ణక్రియలో 70% మెరుగుదల ఉంది. జూన్ 18న వెన్నునొప్పి విషయంలో 70% మెరుగుదల ఏర్పడగా కీళ్ల నొప్పులు దాదాపుగా అదృశ్యమై పోయినట్లు ఆమె తెలిపారు. గ్యాస్ నిలుపుదల సమస్య తిరిగి తలెత్తలేదు. అందుచేత మోతాదు TDS కి తగ్గించబడింది. జులై 16 నాటికి ఆమె వ్యాధి లక్షణాల నుండి పూర్తిగా ఉపశమనం పొందారు కనుక మోతాదు క్రమంగా తగ్గించి మరుసటి నెల నాటికి ఆపివేయబడింది. 2021 ఏప్రిల్ నాటికి లక్షణాలు ఏవీ పునరావృతం కాలేదు.