నెత్తిమీద దురద 03576...UK
సైకాలజీలో డాక్టరేట్ చదువుతున్న 26 ఏళ్ల మహిళ రెండు నెలలుగా నెత్తిమీద దురదతో బాధపడుతున్నారు. దురద ఎంత తీవ్రంగా ఉందంటే ఆమె నిస్సహాయంగా తన రెండు చేతులతో నెత్తిని తీవ్రంగా గోకుతూ ఉండవలసిన పరిస్థితి ఉంది. ఈ వ్యాధికి స్పష్టమైన కారణం ఏదీ లేదని అనిపించింది. ఇటువంటి పరిస్థితిలో ఎంతో వత్తిడికి లోనవుతూ ఒక సంవత్సరములోనే రెండు నగరాలకు వెళ్ళవలసి వచ్చింది. అంతేకాక తన మొదటి సందర్శన తరువాత తిరిగి వచ్చిన వెంటనే Ph.D ప్రోగ్రాం ప్రారంభించడం వలన అధ్యయనము కోసం విశ్వవిద్యాలయానికి ప్రతిరోజూ గంట సేపు ప్రయాణం చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఉపశమనం కోసం ఆమె ప్రతీరోజూ తల స్నానం చేసేవారు. వివిధ రకాల ఔషధ పూరిత షాంపూలను ప్రయత్నించినప్పటికీ ఉపయోగం లేకపోయింది. 2019 ఫిబ్రవరి 24న ప్రాక్టీషనరు ఆమెకు క్రింది రెమిడీ ఇచ్చారు:
CC11.2 Hair problems + CC15.1 Mental & Emotional tonic + CC17.3 Brain & Memory tonic + CC21.6 Eczema…TDS
మార్చి1 న ఆమెకు చాలా బాధగా ఉన్నట్లు గట్టిగా ఏడవాలని ఉన్నట్లు తెలిపారు. ఇది పుల్లౌట్ గా భావించి ఆ దుష్ప్రభావాన్ని తగ్గించడానికి శరీరంలో ఉన్న విషపదార్థాలను బయటికి పంపడానికి నీరు పుష్కలంగా త్రాగమని ప్రాక్టీషనరు సూచించారు. మోతాదు కూడా తగ్గించమని చెప్పినప్పటికి రోగి TDS గా కొనసాగించడానికే ఇష్టపడ్డారు. రెండు రోజుల తర్వాత శరీరంలోని కొన్ని భాగాలలో తేలికపాటి దద్దుర్లు ఏర్పడ్డాయి కానీ వాటివలన అసౌకర్యం ఏమీ కలగలేదు. నెత్తి మీద దురద విషయంలో 30% ఉపశమనం పొందారు. వారం తర్వాత దురద విషయంలో 60% మెరుగుదల కలుగగా దద్దుర్లు పూర్తిగా అదృశ్యం అయ్యాయి. మార్చి 17న ఆమె వ్యాధి లక్షణాల నుండి పూర్తిగా కోలుకొని ప్రశాంతంగా ఆత్మ విశ్వాసంతో ఉన్నారు. మోతాదును ఒకవారం BD కి తర్వాత రెండు వారాల పాటు OD కి ఏప్రిల్ 7న OW కి తగ్గించి పూర్తిగా ఆపివేయడానికి ముందు ఒక నెలవరకూ కొనసాగించారు. ఆమె విశ్వవిద్యాలయ పరీక్షలలో చక్కటి ఫలితంతో ఉత్తీర్ణత సాధించారు. ఒకటిన్నర సంవత్సరాల తర్వాత కూడా వ్యాధి పునరావృతం కాలేదు.