ఊపిరితిత్తుల క్యాన్సర్ మెదడులో క్యాన్సర్ వ్యాప్తి 11595...India
61 ఏళ్ల ఆరోగ్యకరమైన మహిళకు ఒకరోజు అకస్మాత్తుగా స్వల్పమైన మూర్చ వచ్చింది. ఒక వారంలోనే మళ్లీ ఇలా జరగడంతో ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ వరుస పరీక్షల అనంతరము ఆమె ఊపిరితిత్తుల క్యాన్సర్ 4వ దశతో బాధ పడుతున్నట్లు అలాగే మెదడులో కూడా వ్యాప్తి చెందినట్లు తెలిసింది. ఈ విధంగా వ్యాధి విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులంతా షాక్ కు గరియయ్యారు. భగవాన్ సత్యసాయిబాబా వారి భక్తులు కావడంతో కుటుంబం యావత్తూ వారి మార్గదర్శకత్వం కోసం స్వామిని ప్రార్ధిస్తూ ఉన్నారు. ఈ సమయంలో ఒక బంధువు వారికి వైబ్రియానిక్స్ గురించి చెప్పి 300 కిలోమీటర్ల దూరంలో నివశిస్తున్న ప్రాక్టీషనరును సూచించారు. రోగి యొక్క కుమార్తె వెంటనే ప్రయాణమై 2019 జనవరి 3న ప్రాక్టీషనరును కలుసుకున్నారు. ఆమెకు క్రింది రెమిడీలు ఇవ్వబడ్డాయి:
#1. CC2.1 Cancers-all + CC2.3 Tumours & Growths + CC18.3 Epilepsy + CC19.3 Chest infections chronic ...6TD నీటితో
#2. CC10.1 Emergencies + CC15.1 Mental & Emotional tonic...TDS (వీరి కుటుంబ సభ్యులకు కూడా)
#3. CC15.6 Sleep disorders...OD రాత్రి నిద్రించే ముందు
అదనంగా రోగిని తన భర్తతో పాటు ప్రతీ రోజూ ధ్యానం చేయమని కూడా ప్రాక్టీషనరు సూచించారు. అలా చేస్తున్నప్పుడు రోగికి కుడి ఊపిరి తిత్తిలో క్యాన్సర్ కణితి ఉన్న ప్రదేశంలో దివ్య ప్రకంపనలను అనేకసార్లు అనుభవించారు. ఒక వారంలోనే ఆమెకు వైబ్రియానిక్స్ ద్వారా తను పూర్తిగా స్వస్థత పొందినట్లు ఆ విషయం అందరికీ చెపుతున్నట్లు కల వచ్చింది. అంతేకాక ఆమె కుటుంబ సభ్యులకు కూడా స్వామి కలలో కనిపించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. తర్వాత మూడు నెలలలో #2 ను తీసుకుంటున్న కుటుంబ సభ్యులు మానసికంగా ఆరోగ్యంగా ఉన్న అనుభూతి పొందడమేకాక రోగి కూడా ఈ చికిత్సతో మంచి సౌకర్యవంతంగా సానుకూలంగా ఉన్నట్లు భావించారు.
మూడు నెలల తర్వాత ఆమె తిరిగి పరీక్ష కోసం ఆస్పత్రికి వెళ్లారు. ఆశ్చర్యకరంగా ఊపిరితిత్తులలో ఉన్న క్యాన్సర్ కణితి లో పెరుగుదల ఆగిపోయింది. నివారణను వేగవంతం చేయడానికి వైబ్రియానిక్స్ తో పాటు అలోపతి చికిత్స ప్రారంభించాలని సూచించారు. ఆమె ఆరు నెలల్లో ఆరుసార్లు ఖీమో థెరపీ నరాల ద్వారా తీసుకున్నారు. దీని నిమిత్తం ఆమె ప్రతీ ఒక్కసారి మూడు రోజులు ఆసుపత్రిలో చేరేవారు. అదనంగా ఆమెకు 25 రోజులకు పైగా రేడియేషన్ చికిత్స మెదడుకు ఇవ్వబడింది. రోగి ఆసుపత్రిలో ఉన్నాకూడా ఒక్కసారి కూడా వైబ్రియానిక్స్ రెమిడీ మిస్ కాలేదని ఆమె భర్త నిర్ధారించారు. ఐతే నొప్పిని నివారించ డానికి #1 క్రింది విధంగా మెరుగుపరచబడినది:
#4. CC2.2 Cancer pain + CC12.4 Autoimmune diseases + CC15.1 Mental & Emotional tonic + #1…6TD
#2 యొక్క అవసరం లేదు. #3 ను అవసరం మేరకు తీసుకోవడం, పునర్బలనానికి:
#5. CC9.1 Recuperation + CC12.1 Adult tonic…6TD
ఆమె పరిస్థితి క్రమంగా మెరుగుపడి తనకు తేలికగా ఉన్నట్లు భావించారు. 2019 ఆగస్టు 25న #5 యొక్క మోతాదు TDS కు తగ్గించబడింది మరియు ఖీమో మరియు రేడియేషన్ యొక్క దుష్ప్రభావాలు తొలగించడానికి అదనపు కాంబో ఇవ్వబడింది: #6CC10.1 Emergencies + CC17.2 Cleansing…TDS
2019 నవంబర్ నాటికి కణితి పరిమాణంలో తగ్గుదల ఉండడంతో ఆమెను నోటి ఖీమోథెరపీ మందులపై ఉంచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఖీమో యొక్క దుష్ప్రభావం ఎదుర్కోవడానికి నిర్దిష్ట నివారణ చేయవలసినదిగా ఈ ప్రాక్టీషనరు SVP ని సంప్రదించారు. దాని నిమిత్తం #6 ను క్రింది విధంగా మార్చడం జరిగింది:
#7. SR559 Anti Chemotherapy…TDS
2020 మార్చిలో లాక్ డౌన్ కారణంగా ఆమె చికిత్సకు సుమారు రెండు నెలలు అంతరాయం కలిగింది, 2020 జూన్ 14న తిరిగి ప్రారంభించబడింది. అకస్మాత్తుగా ఆమెకు మధుమేహం ఏర్పడడంతో ఇది ఖీమో యొక్క దుష్ప్రభావాల వల్ల జరిగింది అని వైద్యులు తెలిపారు. అందుచేత #5 ను మార్చి #4, #5 చేర్చి క్రింది రెమిడీ తయారుచేయడం జరిగింది:
#8. CC6.3 Diabetes + #4 + #5…6TD
సెప్టెంబర్ 15న ఆమె రక్తంలో చక్కెర సాధారణ స్థాయికి చేరుకుంది. PET-CT స్కాన్ తీయగా మెదడులోని గడ్డ చాలావరకు తగ్గిపోగా ఊపిరి తిత్తులలో గడ్డ అతి స్వల్పంగా నిరపాయ కరంగా మారడం వైద్యులను ఆశ్చర్య పరిచింది. 4వ దశలో ఉన్న క్యాన్సర్ రోగి 16నెలలలో పూర్తిగా కోలుకోవడం ఎలా సంభవం అని వారు ఆశ్చర్యపోయారు. వారు నోటికి ఇచ్చే ఖీమో మందును నిర్వహణ మోతాదుగా తగ్గిస్తూ 24 నెలలు వేసుకొనేలా సూచించారు. 2020 అక్టోబర్ 16న వారి తదుపరి సందర్శనలో మునుపటి రెమిడీలు అన్నింటినీ ఈ క్రింది మిశ్రమము ద్వారా భర్తీ చేశారు.
#9. CC12.4 Autoimmune diseases + #1 +# 5…TDS
2021 ఫిబ్రవరి నాటికి ఆమె ఆరోగ్యంగా ఉంటూ రెమిడీ కొనసాగిస్తూ ఉన్నారు. ఆమె కుటుంబ సభ్యులలో ఒకరికి స్వామి స్వప్నంలో కనబడి రోగిని పూర్తి ఆరోగ్యవంతురాలిని చేసానని ఆమె జుట్టు కూడా త్వరలో తిరిగి పెరుగుతుందని చెప్పారట.
సంపాదకుని వ్యాఖ్య: వైబ్రియానిక్స్ మరియు అలోపతి రెండూ కలిసి ఒక కష్టమైన వ్యాధిని నయం చేసాయని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ.
రోగి భర్త వ్యాఖ్య:
“వైద్య అత్యద్భుతం: నేను మరియు నా కుటుంబ సభ్యులు భగవాన్ శ్రీ సత్య సాయి బాబా యొక్క భక్తులము. 61 సంవత్సరాల వయసు గల నా భార్య అప్పటి వరకు ఆరోగ్యంగా ఉండి కూడా అకస్మాత్తుగా మూర్చతో అపస్మారక స్థితిలో పడిపోవడంతో ఆస్పత్రిలో ఐసీయూలో చేర్చారు. వైద్యులు అనేక పరీక్షలు చేసి చివరకు ఇది మెదడు, ఊపిరితిత్తుల క్యాన్సర్ అని నివేదించారు. క్యాన్సర్ నాలుగో దశలో ఉండడంతో కుటుంబం మొత్తం ఆందోళనకు గురై స్వామి అనుగ్రహం కోసం ప్రార్థిస్తున్నాము.
క్రిస్మస్ మరియు నూతన సంవత్సర వేడుకలు ప్రారంభం కావడంతో చాలామంది వైద్యులు సెలవులో ఉన్నారు. ఎక్కడికి వెళ్లాలో ఎవరిని సంప్రదించాలో తెలియలేదు. ఆ క్షణంలో మా బంధువులు ఒకరినుండి మాకు ఫోన్ కాల్ వచ్చింది. సాయి వైబ్రియానిక్స్ గురించి తెలుపుతూ బెంగళూరులో ఉన్న ఒక ప్రాక్టీషనరును కలవమని సూచించారు. ఇది ఆపత్సమయంలో అందిన స్వామి దివ్య సూచనగా భావించి ప్రాక్టీషనరు సూచించిన రీతిగా వైబ్రియానిక్స్ రెమిడీ మరియు స్వామి విభూతి తీసుకోవడం ప్రారంభించాము. మనస్సుకు విశ్రాంతి నివడానికి మరియు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి “మేపోల్” ధ్యానం కూడా చేయసాగాము. ధ్యానం చేసేటప్పుడు చాలాసార్లు నా భార్య తన ఊపిరి తిత్తులలో క్యాన్సర్ కణితి ఉన్నచోట దివ్య ప్రకంపన అనుభవించింది. ఒక వారం లోనే నా భార్యకు తన అనారోగ్యం నుండి పూర్తిగా కోలుకున్నట్లు మరియు వైబ్రియానిక్స్ గురించి అందరికీ చెబుతున్నట్లు కల వచ్చింది. ఈ విధంగా మాకు ఒక ఆశావహ ధృక్పధం ఏర్పడి రోజురోజుకీ అది పెరుగసాగింది. మా స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు అందరూ నా భార్య త్వరగా కోలుకోవాలని ప్రార్ధించడం ప్రారంభించారు.
ఇంతలో అల్లోపతి మందులు రేడియోథెరపీ మరియు ఖీమోథెరపీ చికిత్సలు కూడా ప్రారంభించబడ్డాయి. ప్రాక్టీషనర్ సూచించినట్టు మేము ఇతర ఔషధాలతోపాటు వైబ్రియానిక్స్ కూడా కొనసాగిస్తున్నాము. అంతే గాక మన ప్రియమైన స్వామి తన అపారకృపతో ఎవరినైనా తెలియని వ్యక్తి ద్వారా లేదా కొరియర్ ద్వారా విభూతి ప్రసాదాన్ని పంపించ సాగారు. 25 రోజులు రేడియేషన్ మరియు 6 సార్లు తీసుకున్న ఖీమో తర్వాత ఫాలో అప్ కోసం PET CT స్కాన్ వైద్యులు తీసుకున్నారు. కణితి పరిమాణం తగ్గిందని వైద్యులు చెపుతూ నోటిద్వారా ఖీమో తీసుకోవలసిందిగా వైద్యులు సూచించారు. మేము కొంచెం ఉపశమనం పొందాము కానీ ఔషధముల యొక్క దుష్ప్రభావాలను తట్టుకోవడం నా భార్యకు చాలా కష్టంగా ఉంది. ఈ దుష్ప్రభావాల నుండి తట్టుకోవడం కోసం ప్రాక్టీషనరు సలహా మరియు మార్గదర్శకత్వం మేరకు వైబ్రియానిక్స్ తిరిగి మాకు ఇమ్యూనిటీ బూస్టర్ రూపంలో ఉపయోగపడింది.
లాక్డౌన్ సడలింపు తరువాత ఇటీవలే క్యాన్సర్ వైద్యుల సలహా మేరకు మరొక PET CT స్కాన్ చేయించగా వైద్యులు ఈ నివేదికను చూసినపుడు మెదడులోని కణితులు చాలావరకు నయం కావడం మరియు ఊపిరితిత్తుల కణితి దాని పరిమాణం లో తగ్గిపోయి నిరపాయ కరముగా మారడం గమనించారు. 4వ దశలో ఉన్న క్యాన్సర్ 16 నెలలలో ఎలా తగ్గిపోయిందని ఆశ్చర్య పడసాగారు. ఇదంతా వైబ్రియానిక్స్ ఔషధం మరియు ప్రియమైన స్వామి వారి విభూతి మహిమ మరియు నా భార్యకు స్వామి ప్రేమతో అందించిన ప్రత్యక్ష ఆశీర్వాదం ఫలితమే.”