Respiratory allergy, loss of hearing & smell 11624...India
2020 ఏప్రిల్ 22న 56 ఏళ్ల మహిళ గత ఏడు సంవత్సరాలుగా శ్వాసకోశ ఎలర్జీతో బాధపడుతూ గొంతులో చికాకు, కఫంతో కూడిన దగ్గు, మరియు తలనొప్పి వంటి కారణాలతో ప్రాక్టీషనరును సంప్రదించారు. వాతావరణం మారినప్పుడు సంవత్సరానికి 6-7 సార్లు (ముఖ్యంగా వర్షాలు పడుతున్నప్పుడు మరియు శీతాకాలంలో) ఆమె ఏదైనా చల్లని పదార్ధము తిన్నప్పుడు లేదా తాగినప్పుడు ఇలా ఏర్పడుతుంది. ఇలా ఏర్పడిన ప్రతీసారి అల్లోపతీ మందులు తీసుకోకుండా ఐదు రోజుల పాటు ఉంటుంది. వ్యాధి లక్షణాలు మరీ భరింపరానివిగా ఉంటే మాత్రమే అల్లోపతీ మందులు తీసుకుంటారు. వ్యాధి కొనసాగుతున్న ఈ కాలంలో ఆమె వాసన గ్రహించే శక్తి కోల్పోయారు. ఒక నెల క్రితం నుండి ఆమెకు ముక్కు కారడం మరియుఎడమ చెవిలో వినికిడి శక్తి కూడా కోల్పోయి చెవిలో నీరు చిక్కుకున్న అనుభూతి పొందసాగారు. పాఠశాల ఉపాధ్యాయురాలు కావడంతో ఆమె వినికిడి లోపం గురించి ఆందోళన చెంది ఒక ENT వైద్యుడిని సంప్రదించారు. ఒక వారం రోజులు యాంటీ బయోటిక్స్ తీసుకున్న తర్వాత ఆమెకు ముక్కు కారడం తగ్గిపోయింది కానీ వినబడడం విషయంలో ఎటువంటి మార్పు లేదు. ఈ సమస్యలతోపాటు ఆమెకు గృహ సంబంధమైన వత్తిడితో సరిగా నిద్ర పట్టడం లేదని తెలిపారు. ప్రాక్టీషనరు ఈ క్రింది రెమిడిఇచ్చారు:
#1. CC5.1 Ear infections + CC9.2 Infections acute + CC10.1 Emergencies + CC15.1 Mental & Emotional tonic + CC19.2 Respiratory allergies + CC19.5 Sinusitis…TDS
#2. CC15.6 Sleep disorders…OD, నిద్రించడానికి అరగంట ముందు
మేనెల 8న ఆమె వినికిడిలో 40% మెరుగుదల మరియు చెవిలో నీరు చేరినట్లు ఉండే ఇబ్బంది నుండి 100% ఉపశమనం కలిగింది. మరో మూడు వారాల తర్వాత ఆమె వినికిడి శక్తి పూర్తిగా పొందడమే కాక ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నారు మరియు గదిలో ఉంచిన అగర బత్తి వాసన, ఆహార పదార్ధాల రుచిని కూడా ఆస్వాదించగలుగు తున్నారు. జూన్ 14 నాటికి ఆమెవాసన గ్రహించే శక్తి పూర్తిగా పొందినట్లు గమనించారు. ఈ కాలంలో వాతావరణం యొక్క మార్పుచేతను మరియు చల్లని ఆహారం తీసుకున్నప్పటికీ అలర్జీ లక్షణాలు ఏవీ ప్రేరేపించబడలేదు. #1 యొక్క మోతాదు BD కి మరో రెండు వారాల తరువాత OD కి తగ్గించబడింది. 2020 జులై చివరి నాటికి ఆమె #1 & #2 తీసుకోవడం ఆపివేశారు. 2020 ఫిబ్రవరి నాటికి వ్యాధి లక్షణాల స్థితిలో ఎటువంటి పునరావృతం లేదు. అంతేకాక శీతాకాలం మరియు వర్షాకాలంలో కూడా అనారోగ్యానికి గురి అవుతాననే భయం కూడా లేకుండా ఆమె బయటి వాతావరణాన్ని ఆస్వాదించ గలుగుతున్నారు.
సంపాదకుని వ్యాఖ్య: నిర్వహణ మోతాదు OW గా ఇచ్చి ఉంటే బాగుండేది.