కోవిడ్-19 03566...USA
ఆసుపత్రిలో పనిచేస్తున్న 24 ఏళ్ళ మహిళా వైద్య విద్యార్థికి 2020 డిసెంబర్ 19 నుండి వళ్ళంతా నొప్పులు, 101F (38.3C)జ్వరం, విపరీతమైన అలసట మరియు వాసన రుచి ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు ఏర్పడ్డాయి. డిసెంబర్ 22న కోవిడ్ పాజిటివ్గా నిర్ధారించబడింది. ఆమె తనకు తాను కుటుంబ సభ్యులనుండి వేరుచేసుకొని ప్రతీ ఆరు గంటలకు జ్వరం కోసం టైలినాల్ తీసుకోవడం ప్రారంభించింది. లక్షణాలు తీవ్రమవుతూ డిసెంబర్ 24 నాటికి ఆమెకు దగ్గు, గొంతు మంట, ముక్కు కారడం, ఛాతీలో రద్దీ, మరియు టైలినాల్ తీసుకోని రోజు జ్వరం 103F (39.4C) కు పెరుగుతూ ఉండేది. ఆమె తల్లి ఆందోళనతో ప్రాక్టీషనరును సంప్రదించగా డిసెంబర్ 25 న IB ని ఇంటి వద్దకు అందించారు.
CC9.2 Infections acute + CC9.3 Tropical diseases + CC9.4 Children’s diseases + CC10.1 Emergencies + CC13.1 Kidney & Bladder tonic + CC19.1 Chest tonic + CC19.2 Respiratory allergies + CC19.3 Chest infections chronic + CC19.6 Cough chronic + CC19.7 Throat chronic…6TD అలాగే ఇతర కుటుంబ సభ్యులకు ముందస్తు నివారణ నిమిత్తం ...TDS
మరునాటికి రోగి జ్వరం 100F(37C) కి తగ్గడంతో టైలినాల్ తీసుకోవడం మాని వేసారు. ఆమె వ్యాధిలక్షణాలలో 40% మెరుగుదల ఉంది కానీ ఆకలి, రుచి, మరియు వాసన విషయంలో ఏమీ మార్పులేదు. మూడు రోజుల తర్వాత డిసెంబర్ 29న శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థితికి రాగా రుచి మరియు వాసనలో 20% మెరుగుదల ఆకలి విషయంలో 30% మరియు ఇతర లక్షణాల విషయంలో 80% మెరుగుదల కలిగింది. ఇప్పుడు ఆమె పండ్ల రసాల రుచి ఆస్వాదించ గలుగుతున్నారు. మరో రెండురోజులు తరువాత రుచి మరియు వాసన విషయంలో 50% మెరుగుదల మినహా అన్ని లక్షణాల నుండి పూర్తిగా కోలుకోవడం జరిగింది. తను ఇప్పుడు అన్నీ పదార్ధాలను తినగలుగుతున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ఐసోలేషన్ లోనే కొనసాగుతున్నారు. 2021 జనవరి 1నాటికి మోతాదు TDS కు జనవరి 6 నాటికి OD కి తగ్గించారు. జనవరి 10న రుచి మరియు వాసన 80% అభివృద్ధి అయ్యాయి. జనవరి 11న ఐసోలేషన్ నుండి బయటకు వచ్చారు మరియు ఆమె మూడు నెలల నుండి రోగనిరోధక శక్తిని అభివృద్ధి చేసుకున్నట్లు భావించి రెమిడీ తీసుకోవడం మానివేశారు. ఆమె కుటుంబ సభ్యులు మాత్రం తగ్గించిన మోతాదు OD గా కొనసాగించారు. 2021 ఫిబ్రవరి 17నాటికి ఆమె బాగానే ఉన్నారు.
సంపాదకుని వ్యాఖ్య: బహుళ కోవిడ్-19 ఉత్పరివర్తనాల ఆవిర్భావం కారణంగా ముందస్తు మోతాదును టీకాలు వేసిన తరువాత అలాగే రోగి కోవిడ్ నుండి పూర్తిగా కోలుకున్న తరువాత కూడా కొనసాగించాలని సిఫార్సు చేయబడినది.