దీర్ఘకాలిక బ్రాంఖైటిస్ 11626...India
36 ఏళ్ల వ్యక్తి ప్రాక్టీషనర్ సోదరుడు పొడిదగ్గు, చాతిలో వత్తిడి, మరియు చిన్ననాటి నుండి తేలికపాటి ఆయాసంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో బాధపడుతున్నారు. సాధారణంగా వాతావరణం యొక్క మార్పులు, లేదా ధూళికి గురికావడం కారణంగా ప్రతీ రెండు మూడు నెలలకు ఒకసారి ఇలా ఏర్పడుతున్నది. అల్లోపతీ చికిత్స తీసుకుంటున్నప్పటికీ ఇబ్బంది ఏర్పడిన ప్రతీసారీ సుమారు వారం రోజులు లక్షణాలు కొనసాగుతున్నాయి. వైద్యులు దీనిని శ్వాస నాళముల వాపు /బ్రాంఖైటీస్ గా గుర్తించి ఎనిమిది సంవత్సరాల క్రితం అతనికి ఆస్థాలిన్ ఇన్హేలర్ సూచించగా అది అతనికి వెంటనే ఉపశమనం ఇవ్వసాగింది. వ్యాధి లక్షణాలు తీవ్రంగా ఉన్నప్పుడు అతను అల్లోపతీ ఇంజక్షన్ కూడా తీసుకుంటూ ఉండేవాడు. అతను వీటిమీద పూర్తిగా ఆధారపడడంతో వాటి దుష్ప్రభావాల గురించి ఆందోళన చెందసాగారు. అతని సోదరి ప్రాక్టీషనరు అయిన వెంటనే రోగి ఆమె సహాయం కోరగా క్రింది రెమిడీ ఆమెకు పోస్ట్ చేశారు:
CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC19.2 Respiratory allergies + CC19.3 Chest infections chronic + CC19.6 Cough chronic…6TD
2020 మార్చి 7న రెమిడీ తీసుకోవడం ప్రారంభించినప్పుడు అతను పొడి దగ్గు మరియు తేలికపాటి ఆయాసంతో శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. గత మూడు రోజులుగా వ్యాధి లక్షణాలు అధ్వానంగా ఉన్నప్పటికీ అతను కేవలం వైబ్రియానిక్స్ తీసుకోవడానికి ఆసక్తి చూపినందున అల్లోపతీ ఔషధం తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు. నాలుగు రోజుల తర్వాత అతను తన వ్యాధి లక్షణాలు అన్నింటి నుండి 30% ఉపశమనం పొందాడు మరియు మరో రెండు రోజుల్లో 50% వరకు ఉపశమనం కలిగి దగ్గుతున్నప్పుడు తెల్లటి కఫం బయటకు రావడం ప్రారంభ మయ్యింది. మార్చి 26న అనగా రెండు వారాల తర్వాత అతను పూర్తిగా కోరుకున్నట్లు భావించారు, కనుక మోతాదు TDS కు తగ్గించబడింది. తన జీవితంలో మొదటి సారి అల్లోపతీ మందులు అవసరం లేకుండా ఉండడం పట్ల ఆశ్చర్యచకితుడయ్యారు. మోతాదు క్రమంగా OD కి మరియు అక్టోబర్ 25 నాటికి OW నిర్వహణ మోతాదుకు తగ్గించబడింది. 2021 జనవరి నాటికి వ్యాధి లక్షణాలు పునరావృతం కాలేదు. 2020 జూలై నుండి అతను కోవిడ్ నివారణ కోసం ఇమ్యూనిటీ బూస్టర్ IB, ని OD గా కూడా తీసుకొనసాగారు.