ఉబ్బసం 03591...Indonesia
40 ఏళ్ల మహిళ 11 సంవత్సరాలుగా ప్రతీరోజు తీవ్రమైన శ్వాశ అవరోధం, పొడి దగ్గుతో బాధపడుతున్నారు. ఆమె ఇంటి పనులు సులువుగా చేసుకోలేరు, బహిరంగ స్థలాలలో నడకను ఆస్వాదించనూలేరు. ఆమె ఇంటి వద్ద మెట్లు ఎక్కక తప్పని పరిస్థితి ఆమె లక్షణాలను మరింత తీవ్రతరం చేసింది. వైద్యుడు ఆమె పరిస్థితిని ఉబ్బసం వ్యాధిగా నిర్ధారించి ఇన్హేలర్ ను దగ్గుమందును సూచించారు. ఇది ఆమెకు తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఇచ్చినప్పటికీ ఇన్ని సంవత్సరాలు రోజుకు నాలుగు సార్లు ఉపయోగిస్తూనే ఉన్నారు. ఆమె గత రెండు సంవత్సరాలుగా చేతి వణుకుడు ఎదుర్కొంటూ ఉండడంతో డాక్టర్ దీనికి కారణం ఇన్హేలర్ ను ఎక్కువ సంవత్సరాలుగా ఉపయోగించడం వలన కావచ్చునని తెలిపారు. 2020 మార్చి 22న ఆమెకు క్రింది రెమిడీ ఇవ్వబడింది:
CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC19.3 Chest infections chronic + CC19.4 Asthma attack…6TD
మూడు రోజుల్లో దగ్గు 75% తగ్గింది, ఈ సమయంలో ఆమెకు ఒక్కసారి కూడా దగ్గు సిరప్ తీసుకోవాల్సిన అవసరం రాలేదు. మరో నాలుగు రోజులలలో దగ్గు పూర్తిగా తగ్గిపోయింది, మరియు శ్వాసతీసుకోవడంలో 50% మెరుగుదల ఉంది కాబట్టి ఆమె ఇన్హేలర్ ను రోజుకు రెండుసార్లు మాత్రమే ఉపయోగించసాగారు. అందువలన మోతాదు TDS కు తగ్గించబడింది. ఏప్రిల్ 20 నాటికి ఆమెకు శ్వాశ అవరోధంలో 90% ఉపశమనం కలిగింది. వైబ్రియానిక్స్ రెమిడీ బాగా పనిచేస్తోందని నమ్మకంతో ఇన్హేలర్ తీసుకోవడం ఆపివేశారు. మే 20న అనగా ఒక నెల తర్వాత శ్వాశ అవరోధం, అలాగే చేతి వణుకుడు పూర్తిగా తగ్గిపోయి తన ఇంటి పనులను హాయిగా చేసుకోగలగడం, మెట్లు ఎక్కడం, బయటకు వెళ్ళి నడవడం కూడా చేయగలుగుతున్నారు. మోతాదు BD కి తగ్గించబడింది అలా అక్టోబర్ వరకు తరువాత OD గా కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. 2021 జనవరి నాటికి లక్షణాలు పునరావృతం కాలేదు కానీ నిర్వహణ మోతాదుగా OD లో కొనసాగడానికి ఆమె ఇష్టపడుతున్నారు.