మడమ ఎముక అదనపు పెరుగుదల 00123...India
40ఏళ్ల మహిళ గత ఆరు నెలలుగా తన కుడి చీలమండ మరియు పాదాలలో నొప్పి మరియు వాపు తో బాధపడుతూ ఉన్నారు. ఆమె వైద్యుడు దీనిని ఎముక అదనపు పెరుగుదలగా గుర్తించారు. ఈ పెరుగుదలను తొలగించడానికి శస్త్రచికిత్స చేయించుకోవలసినదిగా సూచించారు. రోగి అందుకు సుముఖంగా లేనందువలన 2018 ఫిబ్రవరి 18న ప్రాక్టీషనరు సహాయం కోరగా క్రింది రెమిడీ ఇవ్వబడింది:
NM59 Pain + NM113 Inflammation + OM3 Bone irregularity + CC3.1 Heart tonic + CC3.7 Circulation + CC13.1 Kidney & Bladder tonic + CC20.1 SMJ tonic + CC20.2 SMJ pain + CC20.3 Arthritis…6TD రెండు వారాల్లో ఆమె 100% నొప్పి మరియు వాపు నుండి ఉపశమనం పొందారు. తర్వాత చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్ళినప్పుడు అల్లోపతి మందులేమీ తీసుకోకుండా ఎముక పెరుగుదలలో 75శాతం తగ్గింపును గమనించిన వైద్యుడు ఆశ్చర్యపోయారు. మే నెలలో సగ భాగం రోజులు గడిచే నాటికి ఎముక పెరుగుదల పూర్తిగా కనుమరుగు అయ్యింది. కాబట్టి మోతాదు TDS కు తగ్గించి ఒక నెల తర్వాత ఆపివేశారు. జనవరి 21 నాటికి వ్యాధి లక్షణాలు ఏవీ పునరావృతం కాలేదు.
సంపాదకుని వ్యాఖ్య: SRHVP లేదా 108 cc బాక్స్ ఏదో ఒకదానినుండి రెమిడీలు ఇస్తే సరిపోయేవి. CC3.1 Heart tonic మరియు CC13.1 Kidney & Bladder tonic అవసరం లేదు, ఎందుకంటే ఈ కోంబోలకు సంబంధించిన లక్షణాలు ప్రస్తావించ బడలేదు. అంతేకాక CC20.1 SMJ tonic & CC20.2 SMJ pain అనేవి CC20.3 Arthritis లో చేర్చబడినందువలన వీటి అవసరం కూడా లేదు.