దీర్ఘకాలిక వెన్నునొప్పి 11595...India
72 ఏళ్ల మహిళ గత ఐదేళ్లుగా వెన్ను క్రింది భాగంలో నొప్పితో బాధపడుతున్నారు. ఆమె రోజువారీ నడక నిమిత్తం చురుకుగానే ఉంటున్నారు కానీ ఎక్కడికైనా ప్రయాణించడానికి, నేలపై కూర్చోవడానికి, లేదా ఎక్కువ సేపు నిలబడడానికి బ్యాక్ సపోర్ట్ ధరించాల్సి వచ్చింది. ఆమె హైబిపి కోసం 20 సంవత్సరాలు గానూ మరియు హైపో థైరాయిడ్ కోసం ఒక సంవత్సరం నుండి అలోపతి మందులు తీసుకుంటున్నారు. ఈ రెండు ఔషధాలు కొనసాగించాలని నిర్ణయించుకున్నారు కానీ వెన్ను నొప్పికి ఎటువంటి ఔషధం తీసుకోవట్లేదు. 2019 ఏప్రిల్ 18 న ప్రాక్టీషనర్ క్రింది రెమిడీ ఇచ్చారు:
CC3.7 Circulation + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue + CC20.6 Osteoporosis…6TD నీటిలో
మూడు వారాల్లోనే రోగికి నొప్పి విషయంలో 30% మెరుగుదల కనిపించింది. ఎనిమిది వారాల చివరి నాటికి ఆమె 80% మెరుగ్గా ఉన్నారు. మరో వారం తరువాత అనగా జూన్ 21న 100% ఉపశమనం కనిపించింది. ఆమె వెనుక భాగములో సపోర్టు కోసం బెల్ట్ వాడడం మానేసారు, అంతేకాక ఎక్కువ సేపు క్రింద కూర్ఛోవడానికి లేదా నిలబడటానికి సమస్య లేదు కాబట్టి రెమిడీ మోతాదు TDS గానూ, రెండు వారాల తరువాత OD గానూ కొనసాగించి 2020 ఆగస్టు 1న ఆపివేసారు. 2021 జనవరి 15 నాటికి లక్షణాలు ఏవీ పునరావృతం కాలేదు.
సంపాదకుని వ్యాఖ్య: CC20.5 Spine అనే కోంబోను రికవరీని వేగవంతం చేయడానికి చేర్చవచ్చు.